నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వెన్నెల శిల్పం కవయిత్రి
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
*""*******""""
కవి వరుల జాబితా
1.కొలచన విజయ భారతి గారు
2.కందూరి సుజాతా రాణి గారు
3.కెసి నరసయ్య గారు
4.దీపక్ న్యాతి గారు
5.డా.సి.హెచ్. ఆంజనేయులు గారు
6.మన్నె పిన్నక లలిత గారు
7.సుధారాణి కృష్ణం రాజు గారు
8.గాజుల భారతీ శ్రీనివాస్ గారు
9.మర్రి జయశ్రీ గారు
10.సునంద వురిమళ్ళ గారు
11.బండి భాను చందర్ గారు
12.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
13.అయితా అనిత గారు
14.సంధ్యా శర్మ గారు
15.కె.ఇ.నిలమంగై గారు
16.వినీలమ్మ
17.సత్య నీలిమ గారు
18.శ్రీలక్ష్మి గారు
19. సునంద వురిమళ్ళ గారు
20.వల్లాల విజయ లక్ష్మి గారు
21.ఉదయశ్రీ ప్రభాకర్ గారు
22.రమా కులకర్ణి గారు
***""****"""*****
1
[13/11, 8:07 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం
పేరు: కొలచన విజయ భారతి
ఊరు:హైదరాబాద్
అంశం: వెలుగు పువ్వులు
తేదీ:13-11-2020
*********************
శ్రీకృష్ణ పరమాత్మ
భామా సమేతుడై
అసుర నరకుని అంతమొందించిన చతుర్థశి
నరకుని చెర వీడిన పదహారు వేల పడతులు మోమున
విరిసిన చిరునవ్వులే వెలుగు పవ్వులై విరిసిన అమవస నిశి
మింట తారకలు
ఇంటి ముంగిట దివ్వెలై
వెలుగులు చిందించిన వేళ
కన్నవారి కంటి దీపాలైన
చిన్నారుల మోమున
మమతల మతాబులు
చిరునవ్వుల చిచ్చుబుడ్లు
వారి ఆనందాల సందడుల
సంబరాలు,మారుమ్రోగుతున్న
టపాసుల మోతలు
దేశమంతా దీపావళి వేడుకలై అలరించాయి
🪔🪔🪔🪔🪔
2
[13/11, 8:08 PM] కందూరి సుజాత Poetess: 🌷వెలుగు పువ్వులు 🌷
........... ........... .........
మినుకు మినుకు తారలు
మీనా కళ్ళచూపులు.
తలుకు లోలుకు నయనాలు
తారాజువ్వ కాంతులు.
కొలనులోని కమలాలు
సర్వేంద్రియ ప్రథమ నయనాలు
వెలుగు పువ్వులు.
దిమిదిమి గీతం టపాసుల వాయిద్యం.
పువ్వత్తుల వలయం
ధనలక్ష్మీ పూజ నిలయం
ప్రమిదల ప్రకాశవంతం
వెలుగు పువ్వులు .
కుహు కుహు గానం చెలిమీ నాదం.
స్నేహం కోరిన క్షేమం
మనస్సు వీడని సౌఖ్యం .
సుమలతలా అల్లుకుపోవు
సంధ్యావందన నందన చెలిమి
వెలుగు పువ్వులు.
శ్వాసాలాపన గీతం
మదురానుభూతుల వరఫలం
నాలుగు గదుల నాణెపు పెట్టే
స్పందన ఊగిసల హృదయం
వెలుగు పువ్వు.
కందూరి సుజాతారాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్
3.
[13/11, 8:42 PM] KC Narsaiah KS 26: కవితా గానం
పేరు: కట్టెకోల చిన నరసయ్య
చరవాణి: 7981814784
అంశం: వెలుగు పువ్వులు
శీర్షిక: ఆరావళి
ప్రకృతి నిండా
సిరిసంపదల సందడి
అందాలను
సంతరించుకున్న అవని
చీకట్లను చీల్చే వెలుగులు
చెడును పారద్రోలే పువ్వులు
కనులవిందుగా ఆరావళి
ఉట్టిపడుతున్న
దేశ సంస్కృతీ సాంప్రదాయాలు
బంధువుల సందడితో
కళకళలాడుతున్న వాకిళ్లు
అమావాస్య
చిచ్చర పిడుగుల చిచ్చుబుడ్లు
చీకట్లను చీల్చుకుంటూ
నింగికి ఎగిసి పోతున్న
తారాజువ్వల వెలుగులు
దేదీప్యమానంగా కాకరపువ్వొత్తులు
గిరగిరా తిరుగుతూ
వెలుగులు విరజిమ్ముతున్న
భూచక్రం విష్ణు చక్రాల చక్కర్లు
టపాసులును పేలుస్తూ
పిల్లల పిడుగుపాటు ఉరకలు
ఆనందోత్సాహాలలో
చిన్నారుల దీపావళి వెలుగు పువ్వులు
4.
[13/11, 8:46 PM] దీపక్ న్యాతి: * *కవితా గానం*
పేరు : డా.దీపక్ న్యాతి
తేది : 13-11-2020
అంశం : వెలుగు పువ్వులు
శీర్షిక : రెండు పౌర్ణమిల మాసం
ప్రకృతి ఒడిలో పువ్వు
మహోన్నత విశిష్టత జీవి
అందం అనుకూలత అందిన జీవి
పరోపకారంలో స్వీయ కళ్యాణకారి
ఆకర్షణ సువాసన వెదజల్లి
తన్మయత్వం పంచు సొగసరి
పువ్వుకు వెలుగు తోడైతే వెండి వెన్నెల
కార్తీక మాసాన రెండు పున్నముల
అందించే ఏకైక వెన్నెల పండుగ
అజ్ఞాన అంధకారంలో విజ్ఞాన వెలుగుల
చెలియ అని చులకన చేసే
పురుషోత్తములకో పాఠమే
సీత సత్యభామౌను ఆడది ఆదిశక్తౌనన్న
వనిత వెంటుంటే విజయం వరించునని
నిదర్శనమై వెలుగులు వెదజల్లే
అనుభవపూర్వక దివిటీల పండుగ
నరక చతుర్దశి వెలుగు పువ్వులు
జ్యోతులైన దీపావళి పండగ
ఊరంతా వెలుగు పువ్వుల
అమావాస్య పున్నమి దీపావళి
పెద్దలు పిల్లలై అల్లరి చేసే
కేరింతల శుభ లాభాల పండగ
వెలుగుపువ్వుల అందమైన వెల్గులలో
చిచ్చరబుడ్లు చిందులేసే పండగ
ఇంటిల్లిపాది వాకిట్లో జేరి
ఇరుగుపొరుగుతో సందడి చేసే
వెలుగు పువ్వుల దివ్వెల పండగ
డా.దీపక్ న్యాతి
నంది పురస్కార గ్రహీత
హైదరాబాద్
5
[13/11, 8:48 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: వెలుగుపూలు శీర్షిక
ఆకాశం అవని ఏకమై నట్లుగా
నవ్య కాంతుల దీపావళి
రంగు రంగుల హరివిల్లును విరుస్తాయి
చీకటిని పారదోలేందుకు
నవ్వుల పువ్వులను రువ్వుతూ
చెడు పై దండయాత్ర చేసిన
సత్యభామ నరకుని పై
అతని దుర్మార్గపు ఆలోచన
ఆ రోజే జరుపుకుంటున్నాం దివ్య దీపావళి నవ్య దీపావళి కో pavali అగ్గి చేసి
మానవాళికి నవ్య పదాన్ని అందించి నవ్వులు పువ్వులుగా వెదజల్లే ఆనంద సంవత్సరం ఇది కావాలని కోరుకుందాం దుఃఖాలు లేని విషాదాలు లేని దీపావళి ఆనందిద్దాం
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453 చీల్చి చెండాడింది
[13/11, 8:56 PM] +91 74168 632
6
కవితాగానం
పేరు :మన్నె పిన్నక లలిత
ఊరు: హైదరాబాద్
అంశం :వెలుగు పువ్వులు
తేదీ:13 /11 /2020
పిల్లలం మేం పిల్లలం
దీపావళి దివ్యంగా జరుపుకుంటాం
కరోనా కష్టకాలంలో
పెద్దలు చెప్పిన మాటలు పాటిస్తాం
కానీ .....
దీపావళి దివ్యంగా జరుపుకుంటాం
రంగురంగుల దివ్యమైన ముగ్గులు వేస్తాం
ధనలక్ష్మి పూజలు ఘనంగా జరుపుకుంటాం
ఆవు నేతి దీపాలు వెలిగిస్తాం
కరోనాను తరిమితరిమి కొడతాం
"ఆ ఆ" లతో కూడా అక్షర దీపాలు వెలిగిస్తాం
"క, ఖ "లతో కరోనాను ఖంగు తినిపిస్తాం
కాగితపు మతాబులు ,రాకెట్లు తయారు చేస్తాం
కర్రి(నల్లని) నింగిలోకి వదులుతాం
అమ్మ చేసిన మిఠాయిలు అందరికీ తినిపిస్తాం
నింగినంటే సంబరాలు చేసుకుంటాం
కళ్ళల్లో వెలుగు పూలు పుాయిస్తాం
అమ్మా నాన్నకు సంతోషం కలిగిస్తాం
పర్యావరణాన్ని కాపాడుతాం
పదుగురికి సంతోషాన్ని పంచుతాం
పిల్లలం మేం పిల్లలం
దీపావళి దివ్యంగా జరుపుకుంటాం
వెలుగు పువ్వులు పూయిస్తాం .
9382162822🌷
7.
[13/11, 8:58 PM] +91 74165 92715: 🙏🙏కవితా గానం🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*అంశం*వెలుగు పువ్వులు*
దివ్వెల పండుగ దీపావళి
దీపాలు వరుస క్రమంలో
వెలిగిస్తే వాటి వెలుగులు
పూవుల వలె ప్రకాశవంతంగా
మెరుస్తూ కనులపండుగ
కలిగి చేస్తాయి
నరకాసుర సంహారం తరువాత
భయమనే చీకటి తొలగి పోయి
వెలుతురు వచ్చిన రోజు సత్యభామ నరకాసురుని సంహరించి ప్రజలకు బాధలనుండి విముక్తి
కలిగించిన రోజు అదే అదే
దీపావళి రోజు
సంతోషానికి చిహ్నంగా బాణా సంచా పేల్చి అందరూ ఆవెలుగులు ఎల్లప్పుడూ
తమ ఇంట వెలుగొందాలని
లక్ష్మీ కటాక్షం కలగాలని లక్ష్మీ దేవిని పూజిస్తారు
బాణ సంచా పేల్చి ఆనందంగా
ప్రతి ఒక్కరూ పండుగ రోజున
ఉత్సాహంగా గడిపి
తమ జీవితంలో చీకటి వెలుగులు అనేవి వచ్చిపోయే
అతిథులుగా అనుకుని
సుఖాలకు పొంగకు
కష్టాలకు క్రుంగకు
అనే సందేశాన్ని దీపావళి
నుండి గ్రహించి
తారా జువ్వలు,కాకర పువ్వొత్తులు , చిచ్చు బుడ్లు
మొదలైన వాటిని పేల్చి
మేము అన్నింటికి సిద్దం
అన్నట్టుగా
దీపావళి పండుగ సందేశాన్ని
ప్రతి మనిషి జీవితంలో ఉదాహరణగా చెప్పవచ్చు🙏🙏👍
8
[13/11, 8:59 PM] Gajula Bharati KS 20: కవితగానం
అంశం:వెలుగు పువ్వులు
పేరు:గాజుల భారతి శ్రీనివాస్
ఊరు:ఖమ్మం
తేదీ:13/11/2020
శీర్షిక: వెలుగు-దివ్వెలు
చెడుపై మంచి గెలుపు
అధర్మంపై ధర్మం సాధించిన
విజయ పరంపర సంకేతమే
దీపావళి ఉత్సవం
సకల జగానికి ఆనందోత్సహాం
నవజ్యోతుల వెలుగులు
నవ లక్ష్మీల సమహారాలు
చీకటిలో గోరంత దీపాలు
నవ్వుల దివ్వెలతో వెలిగే కిరణాలే
దీపమే రూపమై
దీపమే జ్ఞానమై
వెలిగే వెలుగుల దీపావళి
పిల్లలు పెద్దలంతా పిండివంట రుచులతో
ఇల్లంతా సందడితో
ఇంతుల ముచ్చట్లతో
వేడుకకే వేడుక
వెలుగులద్దే మహా వేడుక
ఆనంద దీపావళి
ఆకాశ దీపావళి
దివ్య జ్యోతుల వెలుగులు
దేదీప్య హారతులు
9.
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..వెలుగు పువ్వులు
శీర్షిక..ఆనంద క్షణం
చెడుపై మంచి సాధించిన విజయం
సత్యా శ్రీకృష్ణుల చేతిలో అంతమొందిన నరకుని పీడ వదిలిన ఆనంద క్షణం
మగువల మోమున వికసించిన
వెలుగు పువ్వులు
కమ్మిన కారు చీకట్లను బాపిన దీప కాంతులు
ఇంటిల్లిపాది సంబరంతో జరుపుకునే పండుగ
బొమ్మల కొలువులతో
సంపదలిచ్చే శ్రీమహాలక్ష్మి పూజలతో కళ కళ లాడే లోగిళ్ళు
మమతల హరివిల్లులు
జ్ఞానానికి ప్రతీకగా
సౌశీల్యానికి, సౌభాగ్యానికి చిహ్నం గా
ప్రతి మదిలో సంతోషాన్ని నింపే వేడుక
భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబం
దీపావళి అనాదిగా వస్తున్న ఆచారం
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.దేనికి అనుకరణ,అనువాదం కాదని హామీ ఇస్తున్నాను
10
*కవితా గానం*
తేదీ:13-11-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: వెలుగు పువ్వులు
********************
అవనమ్మను వేధించిన
చీకటి నరకాసురున్ని అంతమొందించిన శుభ వేళ
మోములో చిరునవ్వులు చిందేందుకు
చిన్నా పెద్దా కానుకగా ఇచ్చిన వెలుగు పువ్వులు!
నింగిలోని తారకలను దూసి
ఇంటింటా వెలిగించే దీపాల ఆవళులు!
మానవ జీవితానికి ఇచ్చే సందేశాలు
నిశీధి భయాలను వీడేందుకు
పెదవులపై వెలుగుల పువ్వులు పూయించేందుకు....
మది ప్రమిదలో ధైర్యం చమురు నింపుకుని
ఆత్మ స్థైర్య వత్తిని వెలిగిస్తే
ఆనందాలు మన వెంటేనని
బోధించే దివ్య మంగళ దీపావళి!
********************
11.
అంశం : వెలుగుదివ్వెలు
శీర్షిక : బాలకులే రేపటిపౌరులు
చిరుచిరు నడకల చిన్నారులు
చిరునవ్వుల వెలుగుదివ్వెలు
అంబరాన్నంటే సంబరంవారిది
కల్మశాన్ని ఎరుగనిది వారిమది
ముద్దు ముద్దు మాటల బాలలు
హద్దులేని ఆటలాడే లేడిపిల్లలు
చెంగున ఎగిరే లేగిదూడలు
చిరుబుర్రులాడే కప్పపిల్లలు
పాటలు పాడే కోయిలలు
పోటిపడే చిన్నిగుర్రాలు
పిల్లలు కాదు పిడుగులు
తారాలోకంలో తారజువ్వలు
నలుదిక్కుల వ్యాపించే వెలుగుదివ్వెలు
బాలకులు రేపటిపౌరులు !..
*******************
పేరు : బండి భానుచందర్
చరవాణి :7893359460
12
అంశం..వెలుగు దివ్వెలు
అసూయ,విద్వేషాలు అనే చీకటిని
తొలగించి
ప్రేమ బంధాలనే వెలుగుల దివ్వెలను ఇస్తుంది
సత్యభామ నరకాసురున్ని వధించి
లోకానికి రక్షణ కవచముగా నిలిచిన లోకపావని
దీపావళి సంతోషాల కుసుమాల
చిరునవ్వుల వెలుగుల కాంతి పుంజాలు
మనిషిలో ఉన్న దుఃఖాన్ని తొలగించి
వెలుగులు వలె మానవత్వపు పరిమళాలపూస్తుంది
కల్మషము లేని వెలుగులు నీజీవితానికి ఆనందము కలిగిస్తుంది
అహంకారమే చీకటిని తొలగించి
అనురాగము అనుబందాల ఆప్యాయతలతో వెలుగుతుంది
మంచిని పెంచుకొని మమతాలరాగాలను వెలిగించాలి
కోటి దీపాల కాంతులతో అందరి గృహాలు సుభిక్షముగా వర్ధిల్లాలి
నీలోని పాపాలను తొలగించి లోపాలను తెలియజేసి మమతల దివ్వెలనువెలిగిస్తుంది
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
చిరునామ : కాదరబాదర (గ్రామం), శిరివెళ్ల (మం), కర్నూలు జిల్లా
13
[15/11, 8:14 PM] Anitha Aitha Poetess: *కవితాగానం*
15.11.20
అంశం : వెలుగు పువ్వులు
శీర్షిక: *జీవితమే ఒక దీపావళి..!*
ఆ.. బ్రహ్మసృజించిన బహుముఖ నటీనటులమే కదా మనం!
ఆ..విధి ఆడే వింతనాటకంలో విచిత్రమైన పావులమే సదా మనం!!
ఒక్కో మలుపులో ఒక్కొక్క అనుభూతి
ఒక్కో మజిలీలో ఒక్కొక్క పరిస్థితి
పలకరించిన ప్రతి అనావాస్య నిశిని శక్తియుక్తుకతో చీల్చి పున్నమివెన్నెల పూయించాల్సిందేగా!
ఆపదలన్నీ నరకాసుర రాక్షసులై అలుముకోగా
ఆత్మవిశ్వాసపు సత్యభామలమై మట్టుపెట్టాల్సిందేగా!
అవరోధపు చెడులన్నీ అభివృద్ధిని సుడులు తిప్పగా
ధృఢసంకల్పపు ప్రగతిమడుల్లో విజయపువిత్తులు నాటాల్సిందేగా!
నైరాశ్యపు చీకట్లు కమ్మిన వేళలో
ఆశాదీపాలు మదివాకిట వెలిగించాల్సిందేగా!
సమాజపు చీడల దుష్టశిక్షణకై
అమాయక జీవుల శిష్టరక్షణకై
ప్రతియుగంలో...
మానవత్వపు దైవాలమై అవతరించాల్సిందేగా!
అసూయల ఇరులు ముసిరిన మనసుల్లో
అనురాగపు కాకరవత్తులతో ప్రక్షాళన చేయాల్సిందేగా
మంచితనపు దివ్వెలు ప్రతిఎదలో ముట్టిచ్చాల్సిందేగా!
అడుగడుగునా...
ఆనందాల టపాసులు కాలుస్తూ
జీవన దీపావళిని సంబరాల జాతరగా నిర్వహించుకోవాల్సిందేగా!
రచన
అయిత అనిత
8985348424
జగిత్యాల
14
[15/11, 8:26 PM] Sandya Sharma Poetess: కవితాగానం
వై.కె.సంధ్యశర్మ
****************
అంశం: వెలుగు పువ్వులు
🎆🎆🎆🎆🎆🎆🎆🎆
చిరు చీకట్లు
పారద్రోలి చిద్విలాసంగా
మిణుకు మిణుకు మంటూ
చిచ్చుబుడ్డీలోంచి రాలిన
వెలుగు పువ్వులన్నీ
చూసి ముంగిట్లోని
ముగ్గులన్నీ ఫక్కున నవ్వాయి...
చిత్రంగా వెన్నముద్దల
తళుకులు....
కాకరపువత్తుల బెళుకులు...
కాసిన్ని దరహాసాలు ఒంపుకుని
నిండు ప్రమిదల మా దీపాల
లోగిలికి మరింత శోభను
మోసుకువచ్చాయి...
తారా జువ్వలన్నీ
నింగినున్న తారల మధ్య
విహారపు వినోదాలనే పంచింది...
తెరలు తెరలుగా తిరిగే భూచక్రపు
విన్యాసాలు
తుస్సుమనే టపాకాయల
సరదాలు..... నిశీధిని
కేరింతల కౌమారంలో
కట్టిపడేసింది....
ఝంఝా మారుతంలా
దూసుకుపోయే రంగుల
రాకెట్లు
.. .. మనసు దోచే
మతాబులు...
ఆఖరున... ఆధిపత్యపు
చిత్తూరు ఔటుతో...
ఆనందాల అల్లరి
కులకులతో...
దుష్ట శిక్షణకై
అవతరించిన
ఆదిలక్ష్మీని ఆరాధిస్తూ
స్వచ్ఛ దీపావళి కాంతులన్నీ
సస్యశ్యామలమై
మదినిండా నింపుకున్న
మరెన్నో వెలుగు పువ్వులు
విరబూసే.... విశ్వశాంతికై
మా లోగిలిలో...!
[15/11, 8:38 PM]
15
Komandoori Neela Poet: కవితా గానం
అంశం: *వెలుగు పువ్వులు*
తేది:15/11/2020
{పాట రూపంలో }
పల్లవి:చీకటి ముసిరిన అమాస రేయిని అంతము చేసిరి సత్యాకృష్ణులు..!
తనయుడే ఐనా కరుణ చూపక ఖతమే చేసెను కన్నతల్లియే..||చీకటి||
చరణం1:శాంతి నెలకొన్న సంతోషముతో దీపపు వరుసలు పేర్చిరి జనులు..!
సంబరంబులే అంబర మంటగ వెలుగు పూవులై వెలిగె మతాబులు. ||చీకటి||
చరణం2:దుష్టుల శిక్షించి శిష్టుల రక్షింప సమరము చేసిరి
దుష్కృత్యముపై..!
దనుజుని దునిమి ధర్మము నిలిపిన దయార్ధ్ర హృదయులే కృష్ణా సత్యలు. ||చీకటి||
చరణం3:అధర్మ వర్తనము పెరిగిన వేళల ఆకారమునే మార్చుకునొచ్చీ అంతము చేయును ఆ పరమాత్ముడు..!
ధర్మ స్థాపనను చక్కగ చేయును దంభమునే తా నంతము చేయు..||చీకటి||
చరణం4:చింతలు తీర్చగ
దివ్వెల వెలుగులు అంబరంబుకే నెగయు మెరుపులా.
తారలతోను పోటీపడగ
టపాసులన్నీ పంచు కాంతులను..||చీకటి||
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
చరవాణి సంఖ్య:8897155600.
*ఈ పై పాట ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*
16.
కవితాగానం
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : వెలుగుపువ్వులు
కవితా సంఖ్య: 35
తేదీ: 15/10/20
బతుకు చిత్తరువులో గీసిన
అడ్డగీతల కోలాహలం
నిశి కౌగిట తనకలాడే ఊపిరి ఊయల....!!
రాలే కన్నీటి చుక్కల సేద్యంలో
మొలకలెత్తని విత్తులు
హృదిభూమిలో నిస్సత్తువుల క్లేశాలు....!!
ఉదయతంత్రులన్నీ మీటని
సూర్యోదయం
అస్తమరేఖలలో సాంతం ఒదిగిన
చీకటి సన్నిహితం
కలవరపడే కనుల నిలవని మెరుపుల యానం....!!
వెతకాలి బతుకును పండించే
దారుల బాటలను
ఆ నడకలో పూసే వెలుగు పువ్వులను కోసి
మనోలోగిలిలో దీపావళి సంబరాలను జరపాలి
ఆనందపు తరగలను తడుముతూ....!!
17.
*కవితా గానం*
*అంశం:వెలుగు పువ్వులు*
*శీర్షిక:లోకకల్యాణ వేడుక*
మునులను దేవతలను అసురులనుంచి రక్షిస్తూనే
నరకాసురుడిని హతమార్చిన లోకకళ్యాణం వేడుక
రాక్షసగుణాన్ని సంహరించే పండుగ దీపావళి
టపాసులు కాల్చి సంతోషంగా జరుపుకుంటూనే
సూక్ష్మజీవులను నశింపజేసి ఆరోగ్యాన్నిస్తుంది
మానవతా వెలుగులు పంచాలనేది దీపావళి పండుగ
దీపాల వెలుగుతో లోకాన్ని ప్రకాశింపజేస్తూనే
అంధకారాన్ని రూపుమాపి ఆనందాన్ని అందిస్తుంది
చీకటిని తొలగించే రవికిరణం దీపావళి
అందరిలో చైతన్యాన్ని నింపుతుంటూనే
అనునిత్యం ప్రేమానురాగాలతో ఓలలాడిస్తుంది
ఆవేదనలను అంతం చేసే పండుగ దీపావళి
చెడు ఆలోచనలను మంచితో జయిస్తూనే
విజయాలను కలిగించి విలువలను పెంచుతుంది
చిరునవ్వుల వరాలనిచ్చే పండుగ దీపావళి
*సత్యనీలిమ*
18
[15/11, 9:04 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవితా గానం
తేదీ: 15-11- 2020
అంశము: వెలుగు పువ్వులు
పేరు: చివుకుల శ్రీ లక్ష్మి
దీపావళి రోజు నరకాసురునిపై గెలిచిన
సత్య భామ మోమున వెలుగు పువ్వులు
నాటి నుండి ఏటేటా ఇంటింటా
విరబూసేను మతాబుల వెలుగు పువ్వులు
చీకటిని తిట్టుకుంటూ కూర్చోకు
చిరు దీపమైనా వెలిగించు
తిమిరాన్ని తొలగించి పూచేను
చైతన్యపు వెలుగు పువ్వులు
అన్నార్తుల దాహార్తుల
ఆర్తిని తీర్చిన నాడు
వారి మోములలో కదలాడును
కృతజ్ఞతాభావపు వెలుగు పువ్వులు
మనుషుల్లోని అజ్ఞానాన్ని తొలగించి
విజ్ఞాన రోచిస్సులు అందించిననాడు
మానవత్వపు వెలుగు పువ్వులు
విశ్వమంతా విస్తరించేను
19
[15/11, 9:12 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ:15-11-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: వెలుగు పువ్వులు
*******************
చీకట్లను కవ్వించే వెలుగు పువ్వులు
ఇంటింటా పంచుతున్న ఆనందాల పరిమళాలు!
బతుకు పోరాటంలో
సాధించిన విజయాలకు ప్రతీకలై
గుండెల్లో విరబూసిన
సునందన వనాలు!
చెలియలి కట్ట దాటిన సహనం
వేదనలను అధిగమించి
జీవిత రహదారిలో
కర్కశ కంటకాలను ఏరిపారేస్తూ
పరుచుకున్న పచ్చదనపు మొక్కలకు పూచిన వెలుగు పూలు
చూపించే దారి దీప కాంతులు!
విశ్వమానవ కళ్యాణానికి
ఇస్తున్న చైతన్య సందేశాలు
ఇదే కదా దీపావళి పండుగ
అమావాస్య లో పూయించిన వెన్నెల పూలు!
20
*వెలుగు పువ్వులు*
*****************
బొమ్మాబొరుసుల నాణె0 చందం
చీకటి వెలుగుల మనిషి జీవితం
ఆటుపోట్ల మధ్యన
సముద్రయానమే జీవన0
జీవితాన సంతోషసంతాపాలు సగపాళ్లు
*హరితజ్యోతుల*కే తప్పవు
ఆకురాల్చు కాలాల గాలివిసుర్లు !
మనకు తప్పుతాయా కష్టనష్టాలు?
సుఖదుఃఖాలను సమానంగా
స్వీకరించగలిగిన వారే వివేకులు
జయాపజయాలను సమదృష్టితో
చూడగలిగిన వారే విజేతలు!
రవి అస్తమించని చీకటివేళల
ఆశల చిరుదివ్వెల వెలిగించమని
అమావాస్యరోజు అందరం కలిసి
చీకటిని పారద్రోలుదామనే ప్రభోదం
అజ్ఞాన చీకట్ల తొలిగించ
విజ్ఞాన వెలుగుపువ్వుల
కాంతిపరిమళాలు ఆస్వాదిoచు"మనే
దివ్యకాంతుల దీపావళి అసలు సందేశం
విధిని మాత్రమే నమ్ముకోకుండా
మన ప్రయత్నమూ ఉండాలనే కదా
సాగిస్తున్నాం దీపావళి సాంప్రదాయం
జాగ్రత్తలతో వేడుక ఇచ్చు సంతోషం
21
*వెలుగు పూలు*
సమస్యల పెనుగాలులకు దడిసి ..
అబల నని.. జంక లేదు
కన్నీళ్ళు కొంగున కట్టుకొని ఆపన్న హస్థానికై ఎదురు చూడక
సత్తా చాటుకున్న..ఆనాటి సబల సత్యభామ..
నేటికిని ఆదర్శమే
వివేకాన్ని మేలుకొల్పి
సమయస్ఫూర్తి రంగరిస్తే..
అసాద్యలన్నీ సుసాద్యలే ఎవరికైనా..
శారీరక బలహీనత విస్మరించి
మానసిక బలాన్ని ఒడిసి పట్టుకుని..
ఆత్మస్థైర్యం స్ఫూర్తి మంత్రమైతే
అందరూ హనుమంతుడిలా లంఘించగలరు..సమస్యలను అధిగమిస్తూ..
అప్పుడే..
మేకను వేటాడిన పులి కథే కాదు..
పులిని తరిమికొడుతున్న మేకను చూడగలరు..
ఆనాడు..
భారతావని అంతటా.. దీపాల ఆవాళులే
మనసు ముంగిళ్ళల్లో ఆనందపు వెలుగు పువ్వులే
ఉదయశ్రీ ప్రభాకర్
15.11.2020
22.
కవితా గానం
**************
రమాదేవి కులకర్ణి
హైదరాబాదు
**************
అంశం వెలుగు
శీర్షిక ---జాగ్రత్... జాగ్రత్
***********************
గతం తాలూకు
ఆనవాళ్ళు
చెదురు ముదురుగా
అల్లుకుని వుంటే ...
నైరాశ్యంలో కుగ్గిన
చైతన్యం
మబ్బుపట్టి
మసకబారి పోతే ...
చరిత్ర తాలూకు
తడుముతున్న
జ్ఞాపకం .......! !
జ్ఞాపకంగానే
దోంతరల్లో ...
దొర్లి దొర్లి ...
కనుమరుగయితే ....
పునర్నిర్మాణమేల
సాధ్యమని
కృంగి కృషిస్తే ఎలా నేస్తం
.
కాలమెంత దూషించినా
లోకమెంత శాసించినా.
నీ భావం అమ్మకు
నీ ఆవేశం చల్లార్చకు
నిశీధిని చీల్చు
వెలుగు రేకవై పల్లవించు
అజ్ఞానపు తమస్సును
తుడిచే కణికవై
ప్రజ్వరిల్లు
ఊర్ధ్వముల మదఃశాఖం జగత్
జాగ్రత్ .. జాగ్రత్
మేలుకో మెలకువగా మసలుకో
:వల్లాల విజయలక్ష్మి
ఆలేరు
🌹వినీల🌹
Comments
Post a Comment