నిర్వహణ: శివునూరి లలితాకృష్ణ (వెన్నెల శిల్పం సృష్టి కర్త)
వీరా గుడిపల్లి the mathematics teacher and poet
న్యాయ నిర్ణేత
సునంద వురిమళ్ళ గారు
****"*****"""*********
[05/11, 11:08 AM] Lalita Sister: 1.కవిత
కవితాగానం
రచన-19
పేరు-భరద్వాజరావినూతల
అంశం-పౌరహక్కులు
శీర్షిక- మనిషి కి అదే ఆధారం
మానవ మానప్రాణాలకు భరోసాకలిపించేటిహక్కులు -
వాటికిభంగం కలిగితే పోతాయి ప్రాణాలు -
జాతికుల మాత వర్గ రహిత విచక్షణకు గురికాకుండాకాపాడతాయి -
చిత్రహింసలబారినుండి రక్షిస్తాయి -
మనిషిగా బ్రతికేహక్కు -
ఇష్టప్రాకారం బ్రతికే హక్కు -జీవించేహక్కు
చదువుకోవటానికి -
ఆస్తిని అనుభవించటానికి -
జీవనప్రమాణాలు పెంపొందించుకోవటానికి -
ఈహక్కులు ఉన్నాయి -
ప్రజాస్వామిదేశానబ్రతికే హక్కును కాడ్నేహక్కుఎవరికిలేదు -
ఓటుహక్కు వినియోగించుకోకుండా ఎవరోడ్డుపడటానికి వీలులేదు -
రాజ్యాంగం ఇచ్చినవాటిని కాదనటానికి వీలులేదు -
తనహక్కులకుభంగం కలిగినప్పుడు కోర్టు శరణ్యం
అవుతుంది -
మనిషిమనుగడనుకాపాడే హక్కు -
తెలిసికోవడం అవసరం -
ఇదినాస్వీయరచన
భరద్వాజరావినూతల
[05/11, 11:08 AM] Lalita Sister: 3
కవిత
శీర్షిక: *సద్వినియోగం చేసుకుందాం*
విజ్ఞాన సముపార్జనే
ధ్యేయంగా సాగుదాం..!
విశ్వ మానవ సౌభ్రాతృత్వమే
ఆశయంగా నడుద్దాం..!!
పరమత సహసనమే
మనమతమై జీవిద్దాం ..!
అంతరాల అడ్డుగోడలను
సమూలంగా పెకిలిద్దాం ..!!
మానవత్వపు మధురిమలను
నిరంతరం పరిమళిద్దాం..!
సమసమాజ నిర్మాణమే
క్షణంక్షణం కాంక్షిద్దాం..!!
అన్యాయపు రాకాసిని
ఆమడదూరం తరిమేద్దాం..!
ఆనందపు బావుటాను
దిగంతాలకు ఎగిరేద్దాం..!!
ప్రాథమిక హక్కులను
సద్వినియోగం చేసుకుందాం..!
పౌరహక్కులతో
ప్రగతిని సాధిద్దాం..!!
చెడునడతలు చెరిపేద్దాం..!
పెడదారిని వదిలేద్దాం..!!
వ్యక్తిత్వపు కాగితాన
మంచితనం లిఖిద్దాం..!
దేశాభివృద్దికై సతతం కృషిచేద్దాం.!!
భరతజాతి వారసులమై
భవ్యచరితను ముద్రిద్దాం..!
సదాచార సంగమమై
జగతిన దివ్వెలు వెలిగిద్దాం..!!
రాజ్యంగం విరచించిన
నియమాలను పాటిద్దాం..!
సత్పౌరుల స్వరూపమై
సమాజాన బతుకుదాం..!!
రచన
అయిత అనిత
8985348424
జగిత్యాల
[05/11, 11:08 AM] Lalita Sister: 2
కవిత
అంశం..పౌరహక్కులు
పౌరహక్కుకు వ్యక్తిత్వానికి బాధ్యతనుకలిగిస్తుంది
స్వేచ్చాయుత వాతావరణములో స్వేఛ్చగా జీవించటానికి పౌరులకు విధులు నిర్వర్తించడం జరిగింది
స్వేచ్చాయుత హక్కులో జీవించుటకు స్వేచ్ఛా ఉంటుంది
సమానత్వం హక్కులో చట్టము ముందు అందరూ
సమానమే
కులముమతము వర్గము భేదము లేకుండా
అందరికి సమానమైన న్యాయము కలిగిస్తుంది
ఎలాంటి విచక్షణకు గురికాకుండా సమానత్వం
హక్కులను కలిగిస్తుంది
పౌరులు స్వేచ్చగా భావవ్యక్తీకరణ చేయుటను
వాక్ స్వతంత్ర హక్కును ఇస్తుంది
కట్టుబానిసత్వము,బాలకార్మికుల విధానము,
దోపిడీని నివారించే హక్కు కల్పిస్తుంది
మత స్వాతంత్ర్య హక్కులో అన్ని మాతాలు సమానమే
ఆర్థిక, రాజకీయ, సామాజిక రాజకీయాలలో
ధార్మిక సంస్థలు ఉండరాదు
ప్రాధమిక హక్కులకు భంగం కలిగిస్తే
రాజ్యాంగపరిహారహక్కునుకోరుతూ
న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు
ఆస్తి హక్కు పౌరుల పాధమిక హక్కు
హామీపత్రము
ఈకవిత నాస్వీయకవిత. దేనికి అనువాదముగాని, అనుసరణగాని కాదని హామీఇస్తున్నాను
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
చరవాణి9494162571
thirupathirao894@gmail.com
[05/11, 11:08 AM] Lalita Sister: 5.
కవిత
కవితా గానం పౌర్ణమి సంబరాలు
కవితల పోటీ
పేరు: కెసి నరసయ్య
చరవాణి: 7981814784
అంశం: పౌరహక్కులు
శీర్షిక: సరుకైన ఓటు
హక్కులపై ఉక్కుపాదం
చట్టాల ఇరుసులో
నలుగుతున్న దిక్కులేని జనం
గొంతెత్తితే కుత్తుకలపై కత్తులు
నియంతృత్వఫు పోకడలు
అపహాస్యవుతున్న ప్రజాస్వామ్యం
కాల్పులపై కాల్పులు
ఎదురులేని కాల్పులు
తిరుగులేని కట్టు కథలు
ఏ లాకప్ డెత్ ఎందుకు జరిగిందో
లాకుల్లో మ్రగ్గుతున్న అనామకులు
జీవం కోల్పోతున్న జీవించే హక్కులు
భూకబ్జాలు భూదందాలు
ప్రశ్నిస్తే పగ ప్రతీకారం
జైలు గోడల నడుమ
నలుగుతున్న పౌరుల హక్కులు
ఏలికలకు చుట్టాలవుతున్న చట్టాలు
హక్కులను కోల్పోతున్న ఓటర్లు
ఎన్నికల దుకాణాలలో సరుకైన ఓటు
వికృత అవినీతిి పరాకాష్టలో రాజ్యం
[05/11, 11:08 AM] Lalita Sister: 4.
సంధ్యా శర్మ గారు
కవిత
కవితా గానం ఆశ్వయుజ పౌర్ణమి కవితల పోటీ
శీర్షిక : ఏమడిగాం....
స్వేచ్ఛా స్వతంత్రలో...
అంబరమంటే నా ప్రజాస్వామ్యం లో
పోరాటం నేర్పిన పాఠాలలో.....
మెలిపడిన ప్రేవులు సరిచేసుకోవడానికి
పిడికెడు మెతుకులు అడిగాం...
పిడచ గట్టిన గొంతును తడుపుకోడానికి
గుక్కెడు నీళ్ళడిగాం...
చీకటైన బతుకులు దిద్దుకోడానికి
చిటికెడు సారమడిగాం....
వ్యక్తిత్వం వైపు కన్నెర్రజేస్తున్న
కత్తుల ముసుగు
తొలచే మూలాలనడిగాం...
చిదిగిన జీవితాలలో...
ఊపిరి కొయ్యకు చిగురుతొడగమనడిగాం...
ఛిద్రమైన బ్రతుకులకు...
రాయితీల రాబడినడిగాం...
నియంత వారసత్వాలకు
ఉగ్రవాద ఆపరేషన్లను
సుదూరంగా... వెలివేయమనడిగాం
వేర్పాటువాదుల..
సామంత సామ్రాజ్యవాదుల
పీఠమణచే...
ప్రజా శక్తినడిగాం...
మాయా మాఫియాలతో
దశదిశలా విద్వంసాలకు
ఆజ్యం పోస్తున్న అణ్వాయుధాలకు
ఆఖరి ఘడియనడిగాం...
నిర్భయలకు...
నిరాధారులకు...
నీడనిచ్చే ఆశ్రయమడిగాం...
అత్యాచార నరమేధాలకు
రుచి మరిగిన
మానవ మృగాలను
మట్టు పెట్టే చట్టాలనడిగాం...
సహజత్వాన్ని విచ్ఛిన్నం చేసే
విష సంస్కృతి వలయాన్ని
ఛేదించమనడిగాం...
జాతుల మధ్య అంతరాన్ని చూపే
నయా నాయకుల విముక్తినడిగాం...
గ్లోబళీకరణలో కుంచించే
మానవతా విలువలకు
పచ్చల వలువల దారాలనడిగాం...
స్వేచ్ఛా స్వతంత్రలో...
అంబరమంటే నా ప్రజాస్వామ్యం లో
ఆఖరిగా....
దేశ వెన్నముకలు విరువని
సరిహద్దు పహారా ఒరగని
మేథోమధనం విస్మరించని
మాటల తూటాలకు బలవ్వని
ఓ సరికొత్త పౌరహక్కుల
పరదాని అరువుడుగుతున్నాం...
నా దేశం శాంతి ధూతగా వెలిగిపోవాలని...
ఇస్తారా మరి....!
***********
[05/11, 11:08 AM] Lalita Sister: 7
శ్రీ కాంత్ కడార్ల
*********
కవిత
సమసమాజ స్థాపనకు నవసమాజ నిర్మాణమునకు ఆయువులే పౌరహక్కులు
ఏ స్వేచ్ఛావాయువుల కోసం ఎంతో మంది త్యాగధనులు తమ ఆయువులనొదిలారో
ఏ సమానత్వము కోసం సామాన్యులు సైతం సమిధలయ్యారో
ఏ నిర్భందనాలను తుంచడానికి ఏ పీడిత పాలకులను ఎదురించడానికి ఎంతో మంది ఆహుతయ్యారో
ఏ నవనిర్మిత భారతావనికి ఎన్ని గుండెలు నిదురలేని రాత్రులు గడిపాయో
వాటన్నింటిని అందిస్తూ...
అందరికి శాశ్వతంగా దరిచేరుస్తూ
అండయై అన్నివిధాలా పాశుపతస్త్రాలై దూసుకొచ్చిన పోగుచేయబడిన బాణాలే
పౌరహక్కులు.............
ఏదైతే మనం పొందాలో అది మన ప్రయత్నం లేకుండా మనకు అందాలో
అలా కల్పించబడినదే హక్కు....
విశాల భారతదేశంలో అందరి ప్రయోజనాలను కాపాడుతూ రూపుదిద్దుకున్న రాజ్యాంగంలో
సువర్ణాక్షర మాలతో రాయబడ్డ అస్త్రాలే పౌరహక్కులు.......
రాజులపాలనలో లేని రాజరిక వ్యవస్థలో కల్పించబడని పౌరహక్కులు రాజ్యాంగం ద్వారానే మనకు కల్పించబడ్డాయి....
స్వేచ్చాలో, సమానత్వంలో
పీడన నిరోధనలో, మత స్వాతంత్య్రంలో
జీవించే విధానంలో, రాజ్యాంగ పరిహరంలో
విద్యావిషయంలో సాంస్కృతిక అంశాల్లో
లిఖించబడిన రాజ్యాంగంలో కల్పించబడిన అద్భుత ఆయుధాలే పౌరహక్కులు........
పౌరహక్కులు పౌరుని అన్నీవిధాల సముతుల అభివృద్ధి కోసమే..
సమసమాజ నిర్మాణమునకే నవసమాజ రూపకల్పన కోసమే......
[05/11, 11:08 AM] Lalita Sister: 6
రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి గారు
కవిత
పాశుపతాస్త్రలుగా..
నిషిద్ధ వెలుగుల్ని ప్రసరించే
దోవోక్కటి వేయాలని కలగని ఉంటారు
శ్వేతాస్తమయపు
తొలి అడుగుల సమాజంలో
మనిషి మూలాన్ని వెలికితీసే ప్రయత్నంచేసి ఉంటారు
బతుకు రెక్కల రంగుల పిట్టకు
స్వేచ్ఛ పరిమళాలు అద్దడానికి
కంకణబద్ధులై ఉంటారు
విప్పిన గొంతు ప్రశ్నించేలా
అస్తిత్వ పునాదులు నిర్మించే ఉంటారు
వికసించే మానవ సంబంధాలకు
సంకల్పాలు చేసి ఉంటారు
నీ కొరకో, నా కొరకో, సమిష్టిశ్రేయస్సుకో
నియంతృత్వం పెచ్చు మీరితే పీడనాన్ని నిరోధించుటకో
అస్త్రాన్ని సృష్టించి ఉంటారు
రాజైనా, కడుపేదైనా
సమానమై, మమేకమై జీవించేందుకు
సమానత్వ శాసనాలు రాసి ఉంటారు
ఎదగాలంటే ఎదిగేందుకు
చదివేందుకు నుడివేందుకు
పౌర హక్కుల పాశుపతాస్త్రాన్ని సిద్ధం చేసి ఉంటారు
Submitted 10/31/20
[05/11, 11:08 AM] Lalita Sister: 8.
వల్లాల విజయ లక్ష్మి
కవిత
శీర్షిక *పౌరహక్కులు*
*******************
మానవులందరి ప్రగతిరథచక్రాలు
"మనీ లేనివారికి రక్షణనిస్తున్న ఛత్రాలు
మానవ మేధోసుమ వికసిత కిరణాలు
దగాపడిన తరతరాల వారసుల ప్రాణాధారాలు
దోపిడీలు దగాల నుండి
అమాయకుల రక్షించే అస్త్రాలు
దుర్మార్గులను కట్టడి చేసే
బలహీనుల బలమైన శస్త్రాలు
జంతువులు పశువుల నుండి
మానవులను ఉన్నతులని నిరూపించే
ఉన్నత ఉత్తమాoశాలు *పౌరహక్కులు*
పుట్టక ముoదు నుండి ఉన్న కవచాలు
అవి తెలియని అభాగ్యులే చిక్కేరు
జిత్తులమారి మానవమృగాల వలలో
ఆ వలల చేధించగలిగిన ఖడ్గాలు-
చదువు చైతన్యాలిచ్చే పౌరహక్కుల స్పృహలు
తెలుసుకుందాం మన హక్కులను
తలచుకుందాం సాధించినవాళ్ళను
హక్కులూ విధులూ దేశ"గాడికి చక్ర ధ్వయం
రెండు బాగుంటేనే దేశ ప్ర"గతి శ్రేష్టం
హక్కులతో పాటు పౌరవిధులనూ
గుర్తించి ప్రవర్తిద్దాం సత్పౌరులుగా.
పరులహక్కుల భంగపరచకుండా
జాగ్రత్త వహిద్దాం సదాలోచనతో.
:వల్లాల విజయలక్ష్మి
ఆలేరు
[05/11, 11:08 AM] Lalita Sister: 9.
కవిత
కవితాగానం ...పౌర్ణమి కవితా పోటి.
అంశం.. పౌర హక్కులు
శీర్షిక.. 🌷 హక్కులు వాడుకో
అపరాధం వీడుకో🌷
........... ............ ........
శిశువు గర్భస్త బంది తొమ్మిది నెలలే
ఆపై భగవంతుడు ఒసిగిన జన్మ ప్రథమ హక్కు.
కడవలోని కాస్త గంగకు గులకరాళ్లు జతపేర్చి ఉబికిన జలముతో దాహార్తి తీర్చుకున్న కాకిలా
జన అవసర నిమిత్తం పురుడు పోసుకుంటూ చట్టంలో పేర్చబడి
సామాన్యునికి సంఘానికి సహాయపడు
నిండు కుండలు పౌర హక్కులు.
తరతరాల రాచరికం రూపుమాప
తలపెట్టిన బ్రిటన్ ఇంగ్లాండ్
పౌరహక్కుల రూపకల్పనను సంధానిస్తూ
సర్వదేశాలు ఆశించి శాసించిన
పౌర హక్కులు నవ సమాజ నిర్మాణ పురోగతి మెరుపులు.
శాంతి సమానత్వం కుల మత వర్గభేదం స్వేచ్ఛ వాక్కు. పౌర హక్కులను అనుభవించు
నింగి నీకు హద్దుగా.
నిష్కారణంగా ఇతరుల హక్కులను భంగపరచ చూసిన
చట్టం సంకెళ్ళపాలు నీవూ మరువకు.
కనీస వసతులు కూడు గూడు గుడ్డ కలుగుండుట హక్కు .
శ్రమిస్తూనే సాయంకై సర్కారును అడుగుట ఒప్పు .
సర్కారు ఆస్తులు సమాజపు హక్కులు దుర్వినియోగం దుర్ఘటనలుచేయ మానుకో..
సానుకూల హక్కులతో సహకరించు.
చట్టం వలను ఛేదిస్తూ మఅత్యాచారం
బాలలపై అఘాయిత్యం తలపెడుతూ ..
మహిళా బాలల హక్కులను చిదిమి
ఎగిరే కపోతం రెక్కలిరుచే హక్కు నీకు లేదు.
జీవహింస కూడదు అవణిలోన
ప్రతిప్రాణికి జీవించే హక్కున్నది గ్రహించు.
నిన్ను నీవు రక్షించుకొనగ సర్వ హక్కులున్నవి.
సంఘమై సహనముతో సమస్యలు పరిష్కరించుకొనగా పౌర హక్కులు ఉన్నాయి .
నియమిత హక్కులతో జీవించు ..
న్యాయార్జిత పౌరుడిగా పరిమళించు.
శృతిమించిన హక్కు పిచ్చోడి చేతిలోని రాయగును ..
శాంతియుత పౌర హక్కులను ప్రతిఘటించగా సాహసించదు ఏ చట్టం.
🌷హక్కులు వాడుకో.. అపరాధం వీడుకో.🌷
కందూరి సుజాత రాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్
9392162822🌷
హామీ..ఈ కవిత నా యొక్క స్వీయరచన
[05/11, 11:08 AM] Lalita Sister: 11
దిడ్డి మారుతి గారు
*********
కవిత
పౌరుడా హక్కులివిగో!
*******************
హక్కు లివిగో! హక్కు లివిగో!
హక్కు లివిగో! హక్కు లివిగో!
భారతావనిన బతుకు నీడ్చె
బహుజనంబుల ఆయుధాలివి
దాచుకొండివి ధనికులారా!
వాడుకొండివి విజ్ఞులారా!
విద్య నేర్పి విలువ పెంచి
విశ్వ మంతా తిరుగ నేర్పి
మాటలందలి మర్మ మెల్ల
తేట తెల్లము చేయుమంచు
ఓటు తోటి మేటి గాడిని
నిలుపు శక్తిని చేతి కిచ్చి
కులమతంబుల కూలదోచి
జాతియొకటిని నిలువరించి
అంత యొకటని చాటి చెప్పి
మానవాళికి దేశమిచ్చిన
హక్కు లివిగో! హక్కు లివిగో!
హక్కు లివిగో! హక్కు లివిగో!
[05/11, 11:08 AM] Lalita Sister: 12.
కవిత
శీర్షిక. హక్కులు.
పసిడి మొగ్గలు స్వేచ్ఛగా
అలా అలా విహరించాలి
ప్రకృతి లోగిలిలో హాయిగాను
సమాజ లోగిలిలో ఎన్నో
అనుభవాలు నేర్చుకోవాలి
బంగారు బాల్యాన్ని బలిచేయక
నాలుగు గోడల మధ్యలోన
అంతర్జాలములో మునగకు
సహజ క్రీడలను మరిచేటి
బాల్యానికి భరోసాను ఇద్దాము
మనసులో ఆత్మనూన్యతతో
పెద్దరికాన్ని లెక్కచేయని
బాల్యమును బంగారు బాటలో నిలిపి
నైతిక విలువులను నేర్పి
సృజనాత్మకను నింపుదాము
మానవత్వంను నింపి బాల్యాన్ని నిలుపుదాము
డి.ఉషారాణి
ఆంద్రప్రదేశ్
[05/11, 11:08 AM] Lalita Sister: 10
కవిత
కవితా గానం
పౌర్ణమి కొరకు రాసిన కవిత
డా.బల్లూరి ఉమాదేవి
అంశము:పౌరహక్కులు
రాజ్యాంగమొసగెను హక్కులెన్నెన్నో
దేశమందు వసించు పౌరులకిలలోన
ప్రాథమిక హక్కుల పేరిట పలు విధాల
సమానత్వపు హక్కు స్వేచ్ఛ స్వాతంత్ర్యాది
చట్టబద్ధమైన హక్కులపారముగా నొసగె
చట్టము దృష్టిలో అందరూ సమానమే
హెచ్చు తగ్గులన్నవి ఉండవెపుడు
వివక్షలను చూపక అన్ని రంగములందు
అర్హతున్న వారి నాదరించవలయుననెడి
లక్ష్యము తోసాగు భారత రాజ్యాంగము వాక్స్వాతంత్రమున్న పౌరులెల్లరకును
భావవ్యక్తీకరణమతి ముఖ్యమై యొప్పు
దేశపౌరులెవరైన నెపుడైన నెక్కడైన
వర్తక వ్యాపారాలైన కొలువులైన
న్యాయబద్ధంగా చేయవచ్చను హక్కు
మత సామరస్యం విద్యా హక్కుల తోడ
ఆస్తి హక్కు విద్యాది హక్కు లొసగె
హక్కులున్న వనుచు విర్రవీగుచు జనులు
పరిధుల నరయుచు సతతము పాటించ
దేశమెపుడు సాగు ప్రగతిపథము నందు.
[05/11, 11:08 AM] Lalita Sister: 13.
అంశం : పౌరహక్కులు
శీర్షిక : హక్కులు మొక్కులా
నీవు సృష్టిలోని పరమాత్మవి
జీవాత్మగా రూపందుకొని అవతరించావు
జన్మతా సృష్టి హక్కు నందుకొన్వునావు
భారతదేశ మానవుడిగా పౌరుడివయ్యావు
పౌర హక్కులు నీ పద్దు లో పడిపోయాయి
స్వాతంత్ర్య హక్కు నీ స్వతంత్రం
సమానత్వ హక్కు నీ సొంతం
విద్య సాంస్కృతిక హక్కు నీ విధి
మతస్వాతంత్రపు హక్కు నీ విధానం
రాజ్యాంగ హక్కు నీ ఆలోచన కోసం
ఆస్తి హక్కు నీ సంపాదన నైపుణ్యం
దోపిడిని నివారించే హక్కు నీ విచక్షణ...
నలుగురిలో మానవత్వం స్నేహంగా
మనగలిగినప్పుడే పౌర హక్కులు..!
కొరవడితే పుర పాలకుల హక్కులు...?
స్వార్ధపు నిచ్చెనెక్క హక్కులను తొక్కేరు
ఎవడో హక్కుల గుర్తు చేస్తే నిద్ర మేల్కొన్నా
హక్కులను చట్టపు పుటలలో వెతుక్కోవాలి..
ఆ పుటలలో పెరిగిన పళ్ళని తెంప లేక
నిస్సత్తువతో నిస్సహాయుడివై నిలవలేక
తొక్కల హక్కులని విరక్తితో ఆశల వదులుకొని
బతుకు భారమై ఆత్మహత్య శరణ్యమని జీవాత్మ నుండి పరమాత్మగా మారేవు
ఏ మూలము నుండొచ్చావో ఆ మూలాన ఓ మూల చేరేవు
డా.దీపక్ న్యాతి
హైదరాబాద్
[05/11, 11:08 AM] Lalita Sister: కవితాగానం
పౌర్ణమి...నగదుబహుమతులపోటీ:పౌరహక్కులు
కోరాడ నరసింహా రావు!
# కాదంటారా....!#
########
పురమో,నగరమో....
పట్టణమో., ఏదైతేనేం !
పరస్పర పరోక్షసహకారం
తో...ఆనందమయ వ్యక్తి గత జీవనం కొనసాగించే
వారేకదా...పౌరులు...!!
ఇందులో...అందరూ...సుఖించాల్సిందే...!
ఏ ఒక్కరైనా ...ఇంకొకరి వలన...స్వేచ్ఛనుకోల్పోయి,ఇబ్బందులు పడి తే
ఎలా....!?
అందుకే.....!
యే ఒక్కరి స్వేచ్ఛకూ...
భంగం కలుగక...అందరి స్వేచ్ఛా,స్వాతంత్ర్యాల...
పరిరక్షణకై...ఏర్పరచుకున్నవే...,నియమ,నిబంధనల కట్టుబాట్లు...!
ఈ పౌర హక్కుల పరి రక్షణకే....ఈచట్టాలు,న్యాయ స్థానాలు...!!
హక్కులు...బాధ్యతల మీదేగా ఆధార పడేది!
ఎవరి బాధ్యతల్లో వారు సక్రమంగా ఉంటే .....
హక్కులువాటికవే వలచి వస్తాయిగా ....!
అప్పు డెవరూ...హక్కుల కోసం ఆరాట పడాల్సిన పనే ఉండదు గా...!
ఈ పోరాటాలేవీ జరిగి ఉండేవే కావు !!
ఎదుటి వారి హక్కులను గౌరవించి నంత వరకే ...
నీ హక్కులు భద్రం...!
పౌరహక్కులకు...స్వీయనియంత్రణను మించిన మార్గం లేదు....! పౌర హక్కుల పరిరక్షణ కేవలం కొందరిదేనా !అది అందరి బాధ్యత...!!
అందరూ...పాటిస్తేనే ...
అందరూ సుఖించేది !
అందరం బాధ్యతగా బ్రతుకుదాం మన హక్కుల్ని మనం.... కాపాడు కుందాం....!!
*******************
.......కోరాడ.
[05/11, 11:08 AM] Lalita Sister: 14
కవితా గానం పౌర్ణమి సంబరం
17 responses
Accepting responses
17
of
17
Responses cannot be edited
కవితా గానం పౌర్ణమి సంబరం
ఆశ్వయుజ మాసం పౌర్ణమి నగదు పురస్కారాల బహుమతుల పోటీ ....కవితా గానం నిర్వహిస్తుంది.
ప్రథమ బహుమతి 500 రూపాయి
ద్వితీయ బహుమతి 400 రూపాయి
తృతీయ బహుమతి 300 రూపాయలు
చతుర్థ బహుమతి 200 రూపాయలు
ఐదవ,ఆరవ,ఏడవ, ఎనిమిదవ,తొమ్మిదవ,పదవ,బహూమతులు ఒక్కొక్కటి వంద రూపాయల చొప్పున ఇవ్వ బడును.
ఈ పురస్కారాల కు ఆర్థిక సహాయం బతుకమ్మ ఫౌండేషన్ పక్షాన డాక్టర్ సుజాతా శేఖర్ గారు అందజేస్తున్నారు.
కవితాంశం:: పౌర హక్కులు
కవితలు చేరాల్సిన చివరి తేదీ: 31/10/2020
నిర్వహణ: శివునూరి లలితాకృష్ణ, వీరా గుడిపల్లి
కవి/కవయిత్రి పేరు
వురిమళ్ల సునంద
ఊరు
ఖమ్మం
జిల్లా:
ఖమ్మం
కవిత
*కవన జ్యోతి*
తేదీ:01-11-2020
అంశం:పౌర హక్కులు
*********************
ఉమ్మ నీటి కొలనులో
ఊపిరి పోసుకున్న క్షణమే
ఉనికిని చాటుకునేందుకు
భ్రూణ హత్యా నిరోధ చట్టం నుండి
భూమి మీద కళ్ళు తెరిచి నప్పటి నుండి
సంక్రమించిన హక్కులు..
ఎవరికి వారే అస్తిత్వ పతాకలై
సమాజంలో సగౌరవంగా బతికేందుకు..
కుల మత జాతి,వర్గ,
వర్ణ లింగ వివక్షత లేకుండా
చట్టం ముందు సమానమేనని
రాజ్యాంగం ఇచ్చిన హక్కులు!
జన జీవన స్రవంతిలో
హుందాగా జీవించేందుకు
సాటి మనిషి స్వేచ్చా
స్వాతంత్ర్యాలను భంగ పరచకుండా
మనుగడ కొనసాగించేవే పౌర హక్కులు
ప్రపంచంలో భారత దేశ పౌరులకు ఇచ్చిన
స్వేచ్ఛా సమానత్వం,ఆస్తి,,
విద్యా నిర్బంధం ప్రాధమిక హక్కులు!
వివక్షతా నీలి నీడలు సోకనీయక
భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపి
మహోన్నత సంస్కృతికి రూపమైన
మన భారతీయులకు కల్పించిన హక్కులను
భంగ పరచకుండా బతుకుతూ
రాజ్యాంగ విలువలను కాపాడేందుకు....
ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరిస్తూ
ప్రజాస్వామ్య వ్యవస్థలో
శాంతి సహనం సామరస్యంతో
జీవించడం ప్రతి ఒక్కరి విధి!
Submitted 11/1/20, 10:02 PM
.
[05/11, 11:08 AM] Lalita Sister: కవితాగానం పౌర్ణమి పురస్కారాల పోటీకి కవిత.
అంశం..పౌరహక్కులు
శీర్షిక..శాంతికి పునాది
భూమిపై జన్మించిన ప్రతిజీవికి
లభించిన వరం
స్వేచ్చా విహంగాలై విహరిస్తూ
గౌరవంతో జీవించే హక్కులు వారి సొంతం
మానవాళి అంతా ఒకే పరివారం
వర్ణ భేదాల మబ్బుపొరలు
లింగ వివక్షత సంకెళ్ళు లేని
పౌరహక్కులు రాజ్యాంగం అదనంగా అందించిన అపురూపమైన కానుకలు
వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకొంటూ
హుందాగా బ్రతుకుతూ
అన్ని రంగాలలో అభివృద్ధి నొందెలా
అందిన అవకాశాలు
చక్కని నడవడికతో
ఎవరి హక్కులకు భంగం వాటిల్లకుండా ప్రవర్తిస్తేనే
స్వేచ్ఛ,న్యాయం,శాంతికి పునాది
పౌరహక్కులు ఉమ్మడి సంపాదన
నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే
కలుగునెంతో వేదన
సంరక్షించుకొనడమే మన లక్ష్యం
ఆ హక్కులే సమాజ సంస్కృతికి దీప స్తంభాలు.
మర్రి జయశ్రీ
మోత్కూర్
యాదాద్రి జిల్లా
9948945567
[05/11, 11:08 AM] Lalita Sister: కవితాగానం
----------------
శీర్షిక:పౌరహక్కులు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼
బాధ్యతల పొలంగట్లమధ్య మొలచిన ప్రగతిమొక్కలు హక్కులు
పదిమంది ఆకలితీర్చే మొక్కకు స్వేచ్ఛగా పెరిగే హక్కుంది అందుకే ఆకాశం అక్కున చేర్చుకుంది
విధులు మూగబోయి హక్కులు అందలం ఎక్కకూడదు౹
అలలు రావడం సముద్రానికి జన్మతః లభించిన హక్కు
చెలియలకట్టదాటకుండా నిలవడం దాని బాధ్యత
సునామీలు హద్దులు దాటినపుడే ౹అకాలవర్షాలు పుడమిని ముంచేందుకే
ప్రవాహంలో దోసెడు నీళ్లు తాగడం నాహక్కే కావచ్చు
రెండు పిడికిళ్ల మట్టిని తీసి నీరు ఊరేటట్లు చేయడం నా బాధ్యత
నింగీ నేల మధ్యనిలిచిన నిలువెత్తు మనిషికి ఆత్మాభిమానంతో బ్రతికే హక్కుంది
మనిషికీ మనిషికిమధ్య హక్కులు అందమైన బంధాలు అనుబంధాలు
హక్కులు ఆవిరై పోయినపుడే ధర్మం చట్టమై నీచుట్టూ నిలుస్తుంది
కోకిల కూస్తేనే వసంతం ౹కాకులు ఎప్పుడైనా అరవవచ్చు
న్యాయం పద్దతులు తప్పదు కదా
హక్కులు అణిచివేసినపుడే పోరాటాలు పుట్టు కొచ్చాయి
తిరుగుబాటుతో
తిరుగులేని బాటలను సృష్టించాయి
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
జల్లిపల్లి బ్రహ్మం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
[05/11, 11:08 AM] Lalita Sister: అంశం ;- పౌర హక్కు
తిన్నాం తిరిగాం అన్నది కాదురా మనిషి
నీ హక్కులు నువ్వు తెలుసుకుని
ఆకాతాయి ఆగడాలను తుక్కు చేయాలి మనిషి
అపుడే నువ్వు అవుతావు ఋషి....
నీ మాటలనే తూటాలను చేసి
తుంటరి పనులను పాతరేయ్
వాక్ స్వాతంత్ర్య హక్కూతో
ఆరోపణలకు కత్తెరేయ్...
నీ నడవడితో
లింగ వివక్షను విరిచి
సమైఖ్య సంఘ పుట్టుకకు ప్రాణంపోయ్
నీ చదువుతో...నీ కొలువుతో...
బాల కార్మిక సంకెళ్ళను బ్రద్దలుచేయ్
దోపిడి రాశులను భస్మం చేయ్
నువ్వే స్వేచ్ఛా కపోతమై
విశ్వాసాలకు హృదయ పరిమళమై
ఆధ్యాత్మిక ఆభరణంగా ప్రకాశించేయ్
నీ మనసు ఉప్పొంగులో చైతన్య ఊటై
జాతికి ఆదర్శ బాటై
రాజ్యంగ పుష్పమై పరిమళించు
స్త్రీ పురుష భేద భావాలకు కళ్ళెమేసి
సాంస్కృతిక సంపదదైన ఊపిరిపోయ్
ఆడ మగ అనే
అక్కుపక్షులనూ అడకత్తెర వేసి
ఆస్తి హక్కుకు అందరికీ సమానం చేయ్
*అభిరామ్ 9704154642*
ఇది నా స్వంతం కాపీ కాదు
😊😊😊😊😊😊😊🙏🙏🙏
[05/11, 11:08 AM] Lalita Sister: కవితాగానం.
పౌర్ణమి పోటీ.
తేదీ :1 /11 /2020 .
పేరు :మన్నె పిన్నక లలిత.
అంశం: పౌరహక్కులు .
శీర్షిక :కాలరాసేయ్.
ఆది మానవుడు ఆహారం కోసం భూమిని ,
నివాసం కోసం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నా
అడిగే నాథుడే లేని రోజులు
నాగరికత నేర్చిన మానవుడు ,'ఇది నాది' అనే అధికారంతో హక్కులు సాధిస్తే
హక్కును చట్టం చేసిన మానవుడు, సమాజానికి భరోసా ఇచ్చి నిలదొక్కుకున్న మానవుడు
మనదేశం మత, భాషా ,సంస్కృతులకు నిలయం
ఆస్తిహక్కు పౌరుల ప్రాథమిక హక్కు
పత్రికా స్వేచ్ఛ ,భావప్రకటన స్వేచ్ఛ, విద్యాహక్కు ,జాతి ,కుల మత ,రాజకీయ, వివక్షతకు గురి కాని హక్కు ,
చిత్రహింసల నుండి రక్షణ పొందే హక్కు, వెట్టిచాకిరి ,బానిసత్వం నుండి తరతరాల విముక్తి హక్కు దేశవిదేశాల్లో స్వేచ్ఛగా తిరిగే హక్కు
హక్కులు....హక్కులు.. హక్కులు.......
ఎన్నెన్నో హక్కులు సాధించిన మనిషి
కలియుగ కాముకుడై ,నీతి మరిచి ,తను తెచ్చిన చట్టాలు మరిచి
నీతిబాహ్యమైన పనులు చేసి, పౌర హక్కులు కాలరాస్తుంటే కఠిన హక్కులచట్టం మరొకటి రావాలి.
[05/11, 11:08 AM] Lalita Sister: ..... పాతాళంలో పౌరహక్కులు......
ప్రాణి కోటి లో మనిషి మహోన్నతం
పుర జీవితమే అందుకు నిదర్శనం
పౌరహక్కులు మనిషి ప్రగతికి సోపానం
పుట్టుకతోనే అవి మనిషికి దైవ ప్రసాదం
ఆధునిక పాలనలో పౌరహక్కులు ఆదర్శం
మనిషి అనాది నుండి ఆధునికం వరకు హక్కుల కోసం అలుపెరగని పోరాటం
సమానత్వ సాధనకై నిరంతర ఆరాటం
సామాజిక అసమానతలను రూపుమాపి
ఆర్థిక , రాజకీయ స్వేచ్ఛను సాధించి
పౌరహక్కుల కేతనం ఎగరేసిన మనిషి
వెనక్కి తిరిగి చూస్తే హక్కులు చేజారి
పాతాళంలోకి అనగ దొక్క బడ్డాయి
మానవత్వం మంటగలిసి పోయింది
సమానత్వం అందని ద్రాక్షగా మారింది
వ్యక్తిగత స్వేచ్ఛ నాశనానికి దారి తీసింది
మహిళా రక్షణ కనుమరుగైపోయింది
బరువు బాధ్యతలు భారమై పోయాయి
మనిషి ఆదర్శ జీవితానికి దారి చూపలేక
పాతాళంలో పౌరహక్కులు గా మిగిలాయి
ఎల్ . విజయ రెడ్డి
సిద్దిపేట
ph. no. 9393665222
[05/11, 11:09 AM] Lalita Sister: *పౌర హక్కులు*
ప్రతి పౌరుడు తమ హక్కును
వినియోగించు కుంటు ప్రగతి పథంలో ముందుకు సాగుతూ
దేశ ఉన్నతికి సహకరించాలి
రాజ్యాంగము రూ పొందించిన
హక్కులు ప్రతి వారికి వర్తిస్తాయి
జీవించే హక్కు,రక్షణ హక్కులు
మాట్లాడే హక్కు,ప్రశ్నించే హక్కు
విద్యాహక్కు,ఇలా హక్కులను
వినియోగించు కుంటు ముందు
విజయ పథంలో పయనించాలి
విలువైన ఓటు హక్కు మన
భద్రతకు పునాది కావాలి ,మన
సమాజానికి ఉపయోగపడేదిగా
ఉండాలి,హక్కు దిక్సూచిగా
మనల్ని ఉన్నత శిఖరాలకు
తీసుకెళ్ళి మనల్ని గొప్ప వారిగ
నిలబెడుతుంది,నిన్ను నీవు
తెలుసుకొని ,మార్గాన్నియెంచుకో
మహర్షి వై మహిలో వెలగాలి.
*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
[05/11, 11:09 AM] Lalita Sister: 🙏🙏🙏
*కవితా గానం పౌర్ణమి సంబరం*
*సుధారాణి కృష్ణంరాజు*
*అంశం: పౌర హక్కులు*
*30-10-2020*శుక్రవారం
భారత రాజ్యాంగం 1950 జనవరి 26 తరువాత సర్వసత్తాక, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర రాజ్యంగా అవతరించింది
*పౌర హక్కులు 7 రకాలు*:
1)సమానత్వ హక్కు: వ్యక్తుల పట్ల కుల,మత,వర్గ,వర్ణ,లింగ, ప్రదేశాల ఆధారంగా వివక్ష చూపరాదు ప్రతి వ్యక్తికి ఏవైనా దేవాలయాలు, స్నాన ఘట్టాలు, చారిత్రక కట్టడాలు సందర్శించే అధికారం ఈసమానత్వపు హక్కు సూచిస్తుంది
2) స్వేచ్ఛా స్వాతంత్ర్యపు హక్కు:వాక్ స్వాతంత్రం,భావ వ్యక్తీకరణ ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్రం భావ వ్యక్తీకరణ హక్కు సంస్థలు, సొసైటీ లు స్థాపించే హక్కు ఉంటుంది
3) పీడనాన్ని నిరోధించే హక్కు: పెత్తందారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ, మానవులను కట్టు బానిసలు గా చేసి,తర,తరాల స్వాతంత్ర్యాన్ని హరించి నట్లయితే ఈ హక్కు ద్వారా
తమను తాము రక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది
4)మత, స్వాతంత్ర్య హక్కు:ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది అయితే అది ఇతర మతాలను విమర్శించే హక్కు లేదు తమ మతాన్ని గౌరవించి నట్లే ఇతర మతాలను గౌరవించాలి
5) సాంస్కృతిక విద్యా హక్కులు:భారత దేశం అనేక భాష, సంస్కృతులకు నిలయం
ఎవరైనా తమ సంస్కృతిని, ఆచారాలను పాటించే హక్కు
తమకు ఇష్టమైన విద్యను అభ్యసించే హక్కు ప్రభుత్వం ద్వారా ఏర్పాటైన ఏ సంస్ధ లోనైనా విద్యను అభ్యసించే హక్కు తమ ప్రతి వర్గం వారు తమకు సంబంధించిన సంస్థలు స్థాపించే హక్కు ఉంటుంది
6) రాజ్యాంగ పరిహార హక్కు: పౌర హక్కులకు భంగం కలిగినప్పుడు అన్యాయంగా అవ్యక్తి నయినా శిక్షించే అధికారం లేదు అది చట్ట పరంగా ఉన్నదా?లేదా అని ప్రశ్నించే అధికారం ఉంది అన్యాయం గా శిక్ష పడింది అని ఋజువు అయితే శిక్ష తప్పించు కునేందుకు అవకాశం ఉంటుంది
7) ఆస్తి హక్కు:ఈ ఆస్తి హక్కు 1978లో44వ సవరణ ద్వారా ప్రాధమిక హక్కుల నుండి తొలగించి చట్ట బద్ద మైన హక్కుగా గుర్తించారు
ఆస్తి అనేది వ్యక్తి శక్తి సామర్థ్యాలను బట్టి ఎదగడానికి అతని నైపుణ్యతను బట్టి ఉంటుంది ఇది ప్రాథమిక అవసరం కాదు కాబట్టి దానిని తొలగించి చట్ట బద్ద హక్కు గా చేశారు
ఒక దేశం గొప్పతనం ఆదేశ ప్రజలకు కల్పించిన హక్కులపై ఆధారపడి ఉంటుంది
ప్రభుత్వాలు తమ అధికారాలను రాజ్యాంగానికి లోబడి మాత్రమే పని చేయ వలసి ఉంటుంది
ప్రాథమిక హక్కులు ఒక ప్రజాస్వామిక సమాజ ఏర్పాటుకు దోహద పడతాయి డాక్టర్
****""********
సమీక్షలు
కవితా గానం
*పౌర్ణమి కవితల సమీక్షలు*
1️⃣- *భరద్వాజ రావినూతల* *గారు*
"మనిషికి అదే ఆధారం "అనే శీర్షికతో రాసిన వీరి కవితలో
పౌర హక్కుల గురించి రాస్తూ
మనిషి మాన ప్రాణాలకు రక్షణ, భరోసా కలిపించే హక్కులు
ఏఏ హక్కు దేనికి సంబంధించిందో.. తెలుసుకోవడం అవసరమంటూ రాసిన కవిత బాగుంది సర్ . అభినందనలు.
*********************
2️⃣
*సానుబిల్లి తిరుమల తిరుపతి* *రావు గారు*
'పౌర హక్కులు' శీర్షికతో రాసిన వారి కవితలో ఏఏ హక్కు దేనికి సంబంధించిందో..
హక్కులకు సంబంధించిన చక్కగా సమాచారం ఇచ్చారు.బాగుంది సర్.
అభినందనలు
******************
3️⃣ *అభిరామ్ గారు*
వీరి కవితలో అసలు మనమేంటి ?మనం ఏం చేయాలి?ఏం చేస్తే మనిషి ఋషిగా మారుతారో చెబుతూ చక్కని పదునైన శరాల్లాంటి పదాలను సంధిస్తూ దోపిడీ రాశులను భస్మం చేయాలని, ఆధ్మాత్మిక ఆభరణంగా ప్రకాశించేయ్
చైతన్య ఊటై,ఆదర్శ బాటై రాజ్యాంగ పుష్పమై పరిమళించాలని రాసిన కవిత చాలా చాలా బాగుంది సర్.
అభినందనలు.
********************
4️⃣
*వల్లాల విజయలక్ష్మి గారు*
వీరి కవితలో పౌర హక్కులను ప్రగతి రథ చక్రాలతో,రక్షణనిస్తున్న ఛత్రాలు,వికసిత కిరణాలు, ప్రాణాధారాలు, బలమైన శాస్త్రాలు అంటూ చక్కని పదబంధాలతో కవిత్వ మయం చేశారు కవితను.
హక్కుల గురించి తెలుసుకుని వాటిని పరులకు యిబ్బంది కలగకుండా జాగ్రత్త వహిద్దాం అంటూ రాసిన
కవిత బాగుంది మేడం అభినందనలు .
*******************
5️⃣
*అయిత అనిత గారు*
వీరి కవితలో
సద్వినియోగం చేసుకుందాం అనే శీర్షికతో రాసిన కవితలో మనం ఏం చేద్దాం అంటూ విజ్ఞాన సముపార్జనే ధ్యేయంగా
సౌభ్రాతృత్వమే ఆశయంగా పరమత సహనం తో.. ప్రాథమిక హక్కులను సద్వినియోగం చేసుకుందాం .వ్యక్తిత్వ .కాగితాన మంచితనం లిఖిద్దాం అంటూ రాసిన కవిత బాగుంది మేడం.అభినందనలు.
*********†**********
*6️⃣కందూరి సుజాత గారు*
హక్కులు వాడుకో-అపరాధం వీడుకో శీర్షిక తో వీరు రాసిన కవితలో భగవంతుడు ఇచ్చిన జన్మ ప్రథమ హక్కు అని చెబుతూ హక్కుల రూపకల్పన, ఏఏ హక్కులు దేని కోసమో వివరణ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించేందుకు పౌర హక్కులు .. శృతి మించిన హక్కు పిచ్చోడి చేతిలో రాయి అవుతుందని రాసిన కవిత బాగుంది మేడం.అభినందనలు.
**********************
7️⃣
*శ్రీకాంత్ కడార్ల గారు*
వీరు తాను రాసిన కవితలో సమ సమాజ నిర్మాణానికి ఆయువులే పౌరహక్కులు.. ఈ హక్కుల సాధనలో ఎంత మంది సమిధలు అయ్యారో, మరెందరు ఆహుతి అయ్యారో, నిద్రలేని రాత్రులు గడిపారో.. ఈ హక్కులు రాజ్యాంగం కల్పించిన అద్భుతమైన ఆయుధాలు అని రాసిన కవిత బాగుంది సర్.అభినందనలు.
********************
8️⃣
*బల్లూరి ఉమాదేవి గారు*
రాజ్యాంగం ఇచ్చిన హక్కులు దేశ పౌరులకు చట్టబద్ధమైన పౌర హక్కులు.. అందరూ సమానమే అని.. ఆ హక్కుల వివరణ ఇస్తూ
హక్కులను పాటిస్తూ సాగితేనే దేశ ప్రగతి అంటూ రాసిన కవిత బాగుంది మేడం.
అభినందనలు.
*********************
9️⃣ *స్వర్ణ సమత గారు*
వీరి కవితలో
దేశంలో ప్రతి పౌరుడు తన హక్కులను
వినియోగించుకుంటూ ప్రగతి పథంలో ముందుకు సాగాలని, ఓటు హక్కు మన భద్రతకు పునాది కావాలి. మహర్షివై మహిలో వెలగాలి అంటూ రాసిన కవిత బాగుంది మేడం. అభినందనలు.
*********************
1️⃣0️⃣
*మన్నె పిన్నక లలిత గారు*
కాల రాసేయ్ ఆదిమానవుడు ఆహారంగా భూమిని అది నాది ఇది అనే అధికారంతో హక్కులు సాధిస్తే నీతి బాహ్యమైన పనులతో పౌర హక్కులు కాల రాస్తున్నారనీ, కఠినమైన హక్కుల చట్టం మరొకటి రావాలని కోరుకుంటూ రాసిన కవిత బాగుంది మేడం.
అభినందనలు.
*********************
1️⃣1️⃣
*ఎల్. విజయ రెడ్డి గారు*
పాతాళంలో పౌర హక్కులు అనే శీర్షికతో రాసిన వీరి కవితలో ప్రాణి కోటి లో మనిషి మహోన్నతం. పుర జీవితం అందుకు నిదర్శనం.. పౌర హక్కులు .. అలాంటి హక్కులు నేడు పాతాళంలోకి అణగదొక్క బడ్డాయి.మానవత్వం మంటగలసి పోయిందని వాపోతూ రాసిన కవిత బాగుంది మేడం.అభినందనలు.
**********************
1️⃣2️⃣
*రాజ శేఖరుని శ్రీ శివ లక్ష్మి గారు*
పాశుపతాస్త్రాలుగా అనే శీర్షికతో రాసిన వీరి కవితలో
నిషిద్ధ వెలుగుల్ని ప్రసరించే దోవొక్కటి వేయాలని కలగని ఉంటారనీ, బతుకు రెక్కల రంగుల పిట్టకు స్వేచ్ఛా పరిమళాలు అద్దడానికి,.. విప్పిన గొంతు ప్రశ్నించేలా.. అస్తిత్వ పునాదులు,.. వికసించే మానవ సంబంధాలకు సంకల్పాలు చేసే ఉంటారంటూ, ఎదిగేందుకు, చదివేందుకు,నుడివేందుకు పౌర హక్కుల పాశుపతాస్త్రం సిద్దం చేసే ఉంటారని.. ఎందరో ఉద్యమించి సాధించిన ఈ హక్కులను..ఈ రోజున మనం ఎంతో ఆనందంగా అనుభవిస్తున్నాం.. అలాంటి పౌర హక్కుల గురించి రాసిన కవిత బాగుంది మేడం.
అభినందనలు.
***********************
1️⃣3️⃣
*కోరాడ నరసింహారావు గారు*
కాదంటారా అనే శీర్షికతో రాసిన వీరి కవితలో
మనిషి జీవితం ఆనందమయం కావాలంటే అది ఎక్కడైనా.. పరోక్షం సహకారం, ఆనందమయ జీవితం గడపాలి. ఇతరుల స్వేచ్ఛ కు భంగం కలగకుండా ఇచ్చిన ఈ హక్కులను గౌరవించడంతో మన హక్కులను పరిరక్షించు కోవడం అందరి బాధ్యత .. అందరం మన హక్కులను కాపాడుకుందాం అంటూ సందేశం ఇచ్చిన కవిత బాగుంది సర్. అభినందనలు
*********************
1️⃣4️⃣
.చ్చినరు*
హక్కుల మొక్కలా అనే శీర్షికతో రాసిన వీరి కవితలో
సృష్టి లోని పరమాత్మ జీవాత్మ గా మనిషి అవతరించాడనీ జన్మతః కొన్ని హక్కులు .. పౌర హక్కులు జీవిత ఖాతాలో జమ అయ్యాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. పౌర హక్కులు స్వార్థపు నిచ్చెన తొక్కినప్పుడు..ఇక హక్కులను చట్టపు పుటల్లో వెతుక్కోవాల్సి వస్తుందని.. వాటిని తెంపలేక నిలువలేక విరక్తి భావనలు పెంపొందుతాయి.. అప్పుడు బతుకు భారమై మరణమే శరణ్యమై జీవితాన్ని చాలించే పరిస్థితి వస్తుందనే అర్థంలో రాసిన కవిత బాగుంది సర్
అభినందనలు.
**********************
1️⃣5️⃣
*డి.ఉషారాణి గారు*
వీరి కవితలో పసిడి మొగ్గలను స్వేచ్చగా పెరిగేలా, బంగారు బాల్యం బలికాకుండ వాళ్ళను బంగారు బాటలో నిలిపి నైతిక విలువలు, సృజనాత్మకత , మానవత్వం నింపాలని రాసిన కవిత బాగుంది మేడం.కానీ అంశానికి రాస్తే బాగుండేది అనిపించింది.
అభినందనలు మేడం.
********************
1️⃣6️⃣
*సుధారాణి కృష్ణం రాజు గారు*
వీరి కవితలో భారత రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కుల గురించి రాసిన వివరాలు వ్యాస రూపంలో చాలా చక్కగా ఉన్నాయి. ఒక దేశ గొప్పతనం ఆ దేశ ప్రజలకు కల్పించిన హక్కులపైనే ఆధార పడి ఉంటుందంటూ రాసిన కవిత బాగుంది మేడం. అభినందనలు.
***********************
1️⃣7️⃣
*_కె సి.నరసయ్య గారు_*
సరుకైన ఓటు శీర్షిక తో రాసిన వీరి కవితలో
హక్కులపై ఉక్కు పాదం మోపడం తో చట్టాల ఇరుసులో నలుగుతున్న దిక్కులేని జనం..
ఎటు చూసినా నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యం.. పగలు ప్రతీ కారంతో హక్కులు ఏలిఖలకు చుట్టాలవుతన్న చట్టాలు.. , ఎన్నికల దుకాణం లో ఓటు సరుకైందని వాపోతూ మనం ఉన్న వికృత అవినీతి పరాకాష్ట లో రాజ్యం అయ్యిందని వాపోతూ రాసిన కవిత బాగుంది మేడం.అభినందనలు!
*********************
1️⃣8️⃣
*దిడ్డి మారుతి గారు*
పౌరుడా హక్కులివిగో హక్కులివిగో..అనే చక్కని
గేయం బాగుంది. ఇందులో దాచుకోండి ధనికులారా అనే బదులు కాపాడుకోండి ఓ ప్రజలారా అంటే బాగుంటుందేమో అనిపించింది. గేయం బాగుంది అభినందనలు.
************************1️⃣9️⃣
*సంధ్యా శర్మగారు*
ఏమడిగాం అనే శీర్షికతో రాసిన వీరి కవితలో అంబరమంటే నా ప్రజాస్వామ్యం లో, పోరాటం నేర్పిన పాఠాల్లో .. గుక్కెడు నీళ్లు, చిటికెడు సారం, కత్తుల ముసుగు తొలిచే మూలాలను , ఊపిరి కొయ్యకు చిగురు ఛిద్రమైన బ్రతుకులకు రాయితీ... పీడననణిచే ప్రజా శక్తి అడిగాం మానవ మృగాలను మట్టుపెట్ఠే చట్టాలను అడిగామనీ, దేశం శాంతి దూత గా వెలిగేందుకు, మాటల తూటాలకు బలవ్వని సరికొత్త పౌర హక్కుల ప్రధాని అరువు అడుగు తున్నామని రాసిన కవిత బాగుంది మేడం.
అభినందనలు.
********************
2️⃣0️⃣
*మర్రి జయశ్రీ గారు*
శాంతికి పునాది శీర్షిక తో వీరు రాసిన కవితలో
భూమి పైన జన్మించిన వారికి హక్కులు వరమనీ, ఇతరుల హక్కులకు భంగం కలగకుండా చూడాలని, హక్కులు ఉమ్మడి సంపాదన అని హక్కులు సంస్కృతి కి దీప స్తంభాలని రాసిన కవిత బాగుంది మేడం.
అభినందనలు.
*******************
2️⃣1️⃣
*జల్లిపల్లి బ్రహ్మం గారు*
వీరి కవితలో బాధ్యతల పొలం గట్ల మీద మొలిచిన ప్రగతి మొక్కలు అని చక్కని ఉపమానంతో రాశారు..అలలు సంద్రానికి హక్కు.. వాటిని చెలియల కట్ట దాటకుండా నిలవడం దాని బాధ్యత అని మనిషికి మనిషికి మధ్య హక్కులు అందమైన బంధాలు అనుబంధాలు.. హక్కులు అణిచి వేసినపుడే పోరాటాలు పుట్టు కొచ్చాయి.. అంటూ రాసిన కవిత బాగుంది సర్.
అభినందనలు.
అందరి కవితలు చాలా బాగున్నాయి...
కొన్ని కవితల్లో మాత్రం వచనం పాలు ఎక్కువగా అనిపించింది
మరికొన్ని ఇచ్చిన నియమానికి మించి కవితా పాదాలు ఎక్కువగా ఉన్నాయి..
అందరికీ అభినందనలతో
*వురిమళ్ల సునంద ఖమ్మం*
*******"""*******"
ఫలితాలు
**************
1అభిరామ్ గారు
2.సంధ్యాశర్మ గారు
3.శివలక్ష్మి రాజశేఖరుని గారు
4.దీపక్ న్యాతి గారు
5.జల్లిపల్లి బ్రహ్మం గారు
6.మర్రి జయశ్రీ గారు
7.యల్. విజయారెడ్డి గారు
8.కోరాడ నరసింహారావు గారు
9.శ్రీకాంత్ కడార్ల గారు
10.వల్లాల విజయలక్ష్మి గారు
Comments
Post a Comment