నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ
************""**
1.డా.ఆంజనేయులు గారు
2.వినీలమ్
3.కె.ఇ.నిలమంగై గారు
4.సునంద వురిమళ్ళ గారు
5.భరద్వాజ గారు
6.డా.బల్లూరి ఉమాదేవి గారు
*************
1
[10/11, 9:02 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఆయుర్వేదం చిట్కా
భారతీయ వైద్యం కోసం
చరకుడు సుశ్రుతుడు మొదలైన
ప్రాచీన వైద్యులు ఎందరో
యజుర్వేదంలో
తెలిపారు మన గృహంలోని ఆయుర్వేదానికి సంబంధించిన ఆకుకూరలు చుట్టుపక్కల ఉన్న ఆకులు అలములు
ఈ ఆయుర్వేద మొక్కలు
ఆయుర్వేదం భారతీయ సంప్రదాయ వైద్యం వేప కషాయం
బిల్వపత్రాల కషాయం
పారిజాత ఆకుల కషాయం
తిప్పతీగ కషాయం అన్ని భారతీయ వైద్యానికి సంకేతాలు
తల వెంట్రుకలు చిక్కగా చక్కగా నల్లగా ఉండాలంటే గుంటగలగర ఆకు
తయారు చేసిన నూనెను వాడండి
నువ్వుల నూనె రుద్దుకుంటే
నొప్పులను తీసుకోవడమే కాదు
ఉపశమనం కలిగిస్తుంది
ఎందరో భారతీయ ధన్వంతరి లు
భారతీయ సంప్రదాయ వైద్యానికి ప్రతీక
జిలుకర ఓ మా మెంతులు
ఆవాలు గసగసాలు అన్ని మన వంటల్లో వాడేవి
పసుపు యాంటీబయటిక్ గా పనిచేస్తుంది
రోగనిరోధక శక్తిని పెంచే ఇలాంటి ఎన్నో కషాయాలు భారతీయ సంప్రదాయ వైద్యానికి నిలయాలు
నేటి కరుణ వేల ఇవన్నీ నేటికీ తట్టుకోవడానికి ఈ కరోనా వేల
తోడ్పడుతున్న విషయాన్ని మరువలేం
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
2
[10/11, 9:11 PM] Vineelamma: కవితాగానం
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : ఆయుర్వేదం
కవితా సంఖ్య: 34
తేదీ: 10/10/20
భారతీయ వరం
ప్రకృతి లో దొరికే అమృతం
అనాదిగా ఆదుకొనే అద్భుతం
మన ఆయుర్వేదం....!!
దేశదేశాలకు ఊహకందని
విచిత్రమై
సైన్స్ లేని రోజుల్లోనే
ఆరోగ్యరక్షణిగా నిలచి
మన దేశ చరిత్రను ఎగురవేసిన
పరిమళం....!!
భరతగడ్డపై పిచ్చిమొలకలోనూ
సంతరించుకున్న ఔషధగుణాలు
అరచేతిలో రక్షణావలయం....!!
మన చుట్టూ, మన ఇంటిలో
ఏదైనా ఒక సైన్యమై
రోగాన్ని తరిమే యోధులై
మన గౌరవాన్ని,కీర్తిని తరతరాలు
ఎగురవేసే మంచిగంధం ఆయుర్వేదం....!!
🌹వినీల🌹
3
[10/11, 9:19 PM] Komandoori Neela Poet: కవితా గానం
అంశం: *ఆయుర్వేదం*
తేది:10/11/2020
వచన కవిత్వం
ప్రకృతమ్మ పచ్చని కోకలో దాగున్న రహస్యాలెన్నో..!
చెట్టు చెట్టులో చెప్పలేని చిట్కాలెన్నో..!
చిగురు చిగురులో చింత తీర్చే ఓదార్పులెన్నో..!
ఆకు ఆకులో ఆనంద గనులెన్నో..!
పూవు పూవులో పురుడోసుకున్న పుణ్య సంపదలెన్నో..!
పిందె పిందెలో గొప్ప లక్షణాలెన్నో..!
కాయ కాయలోను కనిపించని కామితార్థాలెన్నో..!
బెరడు బెరడులోను పరోపకారం చేసే ఫలితాలెన్నో..!
ఆయుర్వేదం అమూల్య మందసమై అపకార లక్షణాలు లేని అద్భుత భాండాగారమై..,
అపకారులకైనా ఉపకారియై సద్భుద్ధిని పెంచే అమృత భాండపు అమృతవర్షిణి..!
అనంత నిధులనెన్నిటినో దాచిన బంగారు పేటికయై,స్వదేశీ వైద్య ప్రక్రియయై కన్నతల్లై కాచే సుధామృతం.!!!
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
చరవాణి సంఖ్య:8897155600.
*ఈ పై కవిత ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*
4
[10/11, 9:29 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ:10-11-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: ఆయుర్వేదం
*********************
ఆరోగ్య జీవన విధానానికి
మార్గదర్శిని!
ప్రకృతికీ మనిషికి మధ్య అనుబంధాన్ని
ఆహార నియమాల ప్రాధాన్యత
తెలియ జేసే వేదం
అధర్వణ వేదానికి ఉప వేదం!
అడవులే అమ్మ ఒడిగా జీవిస్తూ
కొండా కోనలే నేస్తాలుగా భావిస్తూ
సూర్య చంద్రుల గమనాన్ని
పంచభూతాల నియమాలను ఫలం పత్రం పుష్పం మనిషికి
మేలు చేసే ఔషధ గుణాలు
ఏవో తెలుసుకునేందుకు త్యాగించిన ఆదివాసులు ఇచ్చిన వనమూలికా వైద్యమే
ఆయుర్వేదం!
అనారోగ్యం దరి చేరనీయక
సహజంగా లభించే
వంటింటి చిట్కాలే వైద్య సలహాలుగా
మనకు ఆరోగ్య దారి చూపిన ధన్వంతరి వారసత్వం ఆయుర్వేదం!
భువిపై ఉదయించిన ప్రతి మొక్కకు ఉన్న ప్రత్యేకత తెలిపేదే ఆయుర్వేదం!
5
[11/11, 8:04 PM] భరద్వాజ గారు: 🎻🎊కవితాగానం 🎊🌱
అంశం- ఆయుర్వేదం --!
శీర్షిక- ..పెరటివైద్యమే !
పేరు-భరద్వాజరావినూతల
కొత్తపట్నం
రచన-25
ఆయుర్వేదం----
ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం-
సనాతన సాంప్రదాయ భారతీయవైద్యం -
అధర్వణ వేదానికి ఉప వేదంగా సాగించింది మనుగడ
''. 'ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః' అన్నది నానుడి.కదా ..!
ఆయువును గూర్చితెలిపే విజ్ఞానం.
అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం.
మనగృహాలపేరిగేటికూరలు -
మనచుట్టూ పెరిగేటిమొక్కలు -
చేస్తారు పెద్దలు చిట్కావైద్యాలు -
ఈకరోనాకాలనా వాడుతున్నారువిరివిగా -
తులసీదళాలకషాయం -
వేపాకు పొడితో గాయాలకు ఉపశమనం -
శొంఠితోతలపట్టు -
పసుపుతో గాయం పారిపోకపొతే వోట్టు -
ప్రక్రుతి మనకు ఇచ్చిన వరాలు మొక్కలు -
ఆమొక్కలనే ఉపయోగించి చేసేవారువైద్యాలు -
చిక్కుడుఆకులస్నానం -
అమ్మపోసినప్పుడు వేపఉండాల సేవనం -
కపా నికి తేనె తీసుకోవడం ఆయుర్వేద మార్గాలు -
అందుకే దూరంగాఉండేవిరోగాలు -
ఆనాటి వాటిని వొదిలి పరిగెత్తుతున్నాము హాస్పిటల్సు వెంట -
తెచ్చుకుంటున్నాము లేనిపోని తంట---!
ఇదినాస్వీయరచన
భరద్వాజ రావినూతల ((RB)🖍️
కొత్తపట్నం
9866203795
6
[11/11, 8:25 PM] Balloori Umadevi Poetess: 11/11/20
కవితా గానం
పేరు: డా. బల్లూరి ఉమాదేవి
శీర్షిక: ఆయుర్వేదం
ఆయువు పెంచే దివ్యౌషధం ఆయుర్వేదం
అధర్వణ వేదానికి ఉప వేదం
తరతరాలుగా దేశంలో వెళ్ళిన వైద్యం
రోగా లేవైనా చికిత్సలు లభ్యం
ఆధునిక కాలంలోనూ అక్కర కొచ్చే వైద్యం
పురుషార్థాల కడ్డమైన వ్యాధులను
తొలగించాలన్న ఋషుల కోరిక
అయ్యింది సఫలీకృతం ఆవిర్భవించింది అగ్నివేశముని ద్వారా ఆయుర్వేదం
చరకుడు సుశ్రుతు లాదిగా ఎల్లరు
ఆదరించిన వైద్యరాజమిది
కంటి మంటలకు మజ్జిగ ఒత్తులు
చెవి పోటుకు ఇంగువ నూనె
ఆగని దగ్గుకు కరక్కాయ
.మిరియం,సొంటి అల్లంతో
సర్వ రోగ నివారిణి పసుపని
బామ్మలు చెప్పిన వైద్యం
నేటికీ ఆదర్శనీయం
భారతజాతికి వరమై నిలిచిన నిధి
యుగాలు మారినా తరగని సిరి
ప్రకృతి ఇచ్చిన వనమూలికలే
ఔషధాలు గా పని చేస్తూ కూరలు
కాయలు పళ్ళు వేళ్ళు అన్నీ
ధన్వంతరి ప్రతి రూపాలై
రూపు మాపేను రోగాలు.
Comments
Post a Comment