Skip to main content

ఆకాశ దీపం 11/2020

 నిర్వహణ

శివునూరి లలితాకృష్ణ (author of వెన్నెల శిల్పం)

వీరా గుడిపల్లి

The mathematics teacher and poet

**************

కవి వరుల జాబితా

1.సుధారాణి కృష్ణంరాజు

2.కె.ఇ.నిలమంగై గారు

3.భరద్వాజ గారు

4.మన్నె పిన్నక లలిత గారు

5.రమా కుల కర్ణి గారు

6.డా.ఆంజనేయులు గారు

7.కొలచన విజయ భారతి గారు

8.కెసి నరసయ్య గారు

9.సునంద వురిమళ్ళ గారు

10.విజయ దుర్గ గారు


*****"****************"""""

1

కవితా గానం

సుధారాణి కృష్ణంరాజు🙏

*నేటి అంశం*ఆకాశ దీపం*

*అన్ని మాసాలలో కన్నా కార్తీక మాసానికి అధిక ప్రాధాన్యత ఉంది*

*కార్తీక మాసాన్ని దీపం మాసంగా చెప్పవచ్చు ఈ మాసంలో వెలిగించే దీపాలు

సంవత్సరం కాలంలో వెలిగించకున్నను ఈ మాసంలో వెలిగించి నట్లయితే

పుణ్యానికి సోపానాలు ఈ దీపాలు

చిరు దివ్వెలు గుమ్మాల ముందు , తులసి కోట ముందు

వెలిగించి న ఎత్తు పైన వెలిగించే దీపాలు ఆకాశంలోని దీపాలు

ఈ మాసంలో దీపాలను వెలిగించిన వారికి వాటిని చూసి నా వారికి కూడా ఎంతో

పుణ్యం

దివ్వెల కాంతిలో అందరూ ఎల్లప్పుడూ తమ జీవితాలలో

వెలుగులు ప్రసరించాలని జ్ఞాన కాంతులతో జగమంతా జ్ఞాన జ్యోతులు వెలగాలని భక్తితో వెలిగిస్తారు

చిరు దీపాలు ఇంటికి వెలుగు

ఆకాశ దీపాలు జగతికి వెలుగు

చాలా దూరం వరకు ఈ వెలుగు కనిపించి అందరికీ ఈ దీపం దర్శనంతో పుణ్యం కలగాలని ఇంటిపైన వెలిగిస్తారు ఈ ఆకాశ దీపాలు🙏🙏👍

2

[20/11, 8:15 PM] Komandoori Neela Poet: కవితా గానం

అంశం: *ఆకాశ దీపం*

తేది:20/11/2020


వేకువ కిరణాల నందిస్తూ ఉత్సాహపు ఉరకలేయిస్తున్న దివాకర బింబం..,

తామర పూలపై ప్రసరించి పరిమళాల మత్తును జల్లుతోంది..!


తొలిప్రొద్దు పొడవంగా అశనానికి పయనమయ్యే పక్షుల కువకువలు పరవశాల మత్తులో ముంచెత్తుతుంటే..,


పశువుల మెడలో గంటల గణగణలు ఉషోదయపు ప్రకాశాన్ని తెలుపుతుంటే మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతి కన్నె ఒళ్ళు విదుల్చుకొని చూస్తోంది..!


పున్నమి మలి సంధ్యలో వెన్నెల కాంతులు విరజిమ్ముతూ రేరాజు తారా కన్నెలతో మెరుపుల ఊయలలూగుతూ.,


కలువ కన్నెలతో గుసగుసలాడుతుంటే..,

మది పులకలు రేపుతుంది..!


ఆకాశ దీపం అందాలు చిందే అపురూప పాలరాతి శిల్పమై

వెలుగులీనుతుంది..! సూర్య,చంద్రులతో వెలుగులతో పోటీ పడుతూ తారలు పంచే మిలమిలలు కన్న మనుషుల హృదయ మందసం..!!!!

     

పేరు: కె.ఇ.నిలమంగై

కలం పేరు:నీలా రంగనాధం

ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.

చరవాణి సంఖ్య:8897155600.

*ఈ పై  కవిత ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*

3

[20/11, 8:16 PM] భరద్వాజ గారు: 🎊☘️కవితాగానం🎊☘️

పేరు-భరద్వాజరావినూతల 

ఊరు -కొత్తపట్నం 

9866203795

అంశం- ఆకాశదీపం

శీర్షిక - *ఆకాశదీపదర్శనం* - *సకలపాపహరం*   --!

తెలుగునెలలో ఎనిమిదవది కార్తీకం 

చంద్రుడు కృత్తికా నక్షత్రంతో సమాగమనం చెందే పుణ్యదినం -

హరి హర బేధం లేనిది -

పుణ్యస్నానాలకు పవిత్రమైనది - కార్తీకం ..!

"న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,

న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.-

విష్ణువుకు సమానమైనదేవుడు -

వేదాలకు పోలగల శాస్త్రములు -

గంగ కంటే పుణ్య తీర్థములు -

లేవన్నది ఆర్యోక్తి -

బిల్వపత్రాల ప్రీతిపాత్రంగా -

ఓంనమశివాయః అన్న బీజాక్షరాలు మారుమోగంగా -

జరుగుతుంది ఈమాసం -

స్నానంతరం వెలిగించే దీపపు‌ వెలుగులు మన ఆశల ప్రమిదలు-

ఆదీపాలు ఆశివుడికిచ్చే హారతులు-

సర్వపాహారంగా అలరారుతుంది -

తొలిసంధ్యవేళలో సముద్రస్నానాలుచేసి -

సైకత లింగాలు చేసి  సముద్రతీరాన 

భక్తి తో‌వెలిగించే దీప హారతి -

కార్తీక‌మాసాన వాకిట‌వెలిగించేటి ఆకాశదీపం-

సర్వపీడలనుండి‌ఇంటిని కాపాడే ఓ బలం-

తులసి కోటదగ్గర పెట్టేది‌ సంధ్యా దీపం పౌర్ణమి నాడు‌ వదిలే‌ పోలి‌ దీపాలు‌ ముత్తయుదువులకు‌ మంగళ ప్రదాలు-

ఆ గరళకంఠుడికి భక్తి ‌నివేదనం-

తులసి కోటల దగ్గర వెలిగించే దీపం వేయి జన్మల పాపహరణం

దీపదానం శ్రేయోదాయకం-

భక్తితో అభిషేకిస్తే ముక్తిదాయకం -

ఏమంత్రం ముక్తిదాయకమో 

ఏ నా మస్మరణ భవతాపహరణమో -

ఏమాసం సర్వదేవతా పూజనీయమో -

ఆకాశం లో ఉండే‌నక్షత్రాలు ఆదేవతలు పెట్టే దీపాలై తే-

ఆదేవతలప్రీత్యర్ధం మనం పెట్టే దీపం పూజనీయము-

ఆకాశ దీపం మోక్చప్రదాయకం

అలాంటి కార్తీకం -కార్తీక దీపం

భక్తజన ఆమోదం -

పుణ్య సంప్రాప్తి దాయకం  

ఇదినాస్వీయరచన 

భరద్వాజ రావినూతల (RB)🖍️

4

[20/11, 8:37 PM] +91 74168 63289: కవితాగానం 

తేదీ :20/ 11/ 2020

పేరు  :మన్నె పిన్నక లలిత

అంశము :ఆకాశ దీపం


 అంబరాన అధి దేవతలకు 

దారిచూపే దీపాలు నక్షత్ర దీపాలు

  అవనిలో  గుడి ధ్వజస్తంభం మీది దీపం

 అంతటా వెలుగునిచ్చే కార్తీక  ఆకాశదీపం

 ఆకాశదీపం ఆశల దీపం

 అనంత కోర్కెల నివారణకు

  ఆశల నూనె పోసి వెలిగించిన దీపం ఆకాశ దీపం

 తిమిరంలో వెలిగించిన ఆశాజ్యోతి ఆకాశదీపం

  దేవళం ముందు దీప ధ్వజ మై నిలిచిన ఆకాశదీపం 

దీపికతో దీప్తి నిస్తూ

 బాటసారులకు దారి చూపే దివ్య జ్యోతివై

 చూచిన వారి మనసులో ఆత్మ  దీపానివై

 జ్ఞాన జ్యోతివై, పరమ శివ స్వరూపానివై

 లోకాన్ని దీప్తి వంతం చేసే దీపమా !నీ కిదే వందనం.

5

[20/11, 8:45 PM] Rama Kulakarni Hyderabad Poet: కవితా గానం

రమాదేవి కులకర్ణి


         ఆకాశ దీపం 



ఎవరు ఎలిగించారు

 ఆకాశంలో ఇన్నేసిదీపాలను 

ఎన్నేసి  చేతులతో... 

ఎవరు ఉంచారు 

సల్లని సంద్రమున 

భగ్గుమనే మంటను 

ఎవరు నింపారు

గుండెల్లో ఎప్పటికప్పుడు

అన్నేసి ఆశల ఊటలను

ఎవరు ఒంపారు

తూరుపు ముక్కను

ఎరుపుగా మార్చి

పటమట సిందూరమై

ఆకాశ దీపమై

ఎలగమని

ఎలిగీ ఎలగని

మసిబారిన మడిసి

మదిలోన ఆశల నూనెలేసి

నమ్మకాల జోతలను

ముట్టించమని...

కానీ... కానీ..

ఏదేమైనా కానీ

రేపటికోసం ఇదిగో

ఇట్లా ఒత్తులు

సరిచేస్తుంటాము

మసిబారకుండా

ఆకాశంలోని

అంతరంగం లోను....!!!

6

[20/11, 8:57 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఉల్లిగడ్డ

ఉల్లిగడ్డలు నేటి అధిక

పెరిగినప్పటికీ


 రేటు పెరిగిన

అందరికీ అవసరం

ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అంటారు

వేసవిలో వడదెబ్బ తగలకుండా పులి గడ్డను వాడడం సహజమే


ప్రతి కూరలో ఉల్లిపాయలు వేస్తూనే ఉంటాం బిర్యానీలో ఉల్లిపాయలు వాడుతూనే ఉంటాం

మద్యం సేవించిన వారికి

ఉల్లిపాయలు వేసుకుంటే 

మధు సేవనం చేసినవారికి

ఉల్లితో విరుగుడు


ఉల్లిపాయలు పచ్చి పులుసు లో

ప్రతి కూరగాయలు వాడుతున్న

ఈ విషయం అందరికీ తెలిసిందే

పప్పు చారు లో ఉల్లిపాయలు వేస్తూనే ఉంటాం

కొద్దిమంది తింటూ ఉంటారు కొద్దిమంది తినరు ఏదేమైనా ఉల్లిపాయ నిత్యజీవితంలో అందరికీ వినియోగ దారి అందుకే ఇటీవలి వరదల్లో

ఉల్లి ధర గట్టెక్కింది

సామాన్యునికి అందకుండా పోయింది

ఉల్లి పంట వరదల్లో కొట్టుకుపోయి

ఎగుమతి దిగుమతి కి

గడ్డు కాలం వచ్చింది


7702537453


ఉల్లి తల్లి దిగి రావమ్మా

7

[20/11, 9:01 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం

పేరు:కొలచన విజయ భారతి

ఊరు: హైదరాబాద్

అంశం:ఆకాశదీపం

తేదీ:20-11-2020

************************

కార్తీక మాసాన 

ఆకాశ దీపం

కన్నులు పండువ చేసే 

అఖండ జ్యోతి రూపం

దేవాలయ ప్రాంగణంలో

ధ్వజ స్తంభాన అలరించిన

ఈ దీపం

ఆకాశ మార్గాన పయనించే

పితృ దేవతలకు చీకటి ప్రయాణంలో వెలుగులతోవ చూపే దీపం

ఆకాశ దీప దర్శన భాగ్యం

జన్మ జన్మల సౌభాగ్యం

తెలిసీ తెలియక చేసిన పాపాలు చిన్న చమురు చుక్కపోసి వెలిగించిన వత్తితో

ప్రక్షాళన చేసే ఆకాశదీపం

శివ కేశవుల కరుణకు

ప్రతిరూపం

     8

[20/11, 9:10 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*

తేదీ:20-11-2020

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం:ఆకాశ దీపం

*********************

కార్తీక మాసమంతా

శోభ చేకూర్చే దీపాల సందడిదే!

ఎటు చూసినా  ఇంటింటా

దేదీప్యమానంగా వెలిగే దివ్వెల

శోభాయమానమే! 


నిత్యం జగతికి వెలుగు నిచ్చే 

అఖండ దీపం సూర్య భగవానుడిని

చల్లని వెన్నెల కాంతుల దీపం చందమామతో పాటు

చుక్కల దీపాలను అంబరాన

వెలిగించిన దేవదేవుడు ఈశ్వరుడే!


ఆకాశాన పయనించే

తరతరాల పితృ దేవతలకు

పుణ్యలోకాల మార్గం చూపేందుకు

దేవాలయాల ధ్వజ స్తంభాలకు

వేలాడ దీసే ఆకాశ దీపాలు! 


సాయం సంధ్యా సమయంలో 

సాగిలపడి మ్రొక్కుతూ

 భక్తి శ్రద్ధలతో  వెలిగించే హృదయ అర్పితాలు!


మనసు లోని మాలిన్యాలను తొలిగించే  శివకేశవుల 

కరుణా కటాక్ష ప్రాప్తి రూపాలు!

9

[20/11, 9:17 PM] KC Narsaiah KS 26: కవితా గానం

 పేరు: కెసి నరసయ్య

 జిల్లా ఖమ్మం20-11-2020

 చరవాణి: 7981814784

 అంశం: ఆకాశదీపం

 శీర్షిక: ఆనందమయం


 దీపం పాపంకు శాపం

 పుణ్యకాంతుల దీపం

 చీకటికి వెలుగంటే భయం

 వెలుగుకు చీకటంటే ఆగ్రహం

 చీకటి వెలుగులపోరాటం

 విజయపరంపరలో వెలుగులు

 అవని ఆవరణలో

 ఆనందాలను పంచే  వెలుగులు 

 నక్షత్రాలకూటమి

 నవ్యకాంతుల దీపాలు

 వెన్నెలవిందులో పండువెన్నెల

 మబ్బుచాటున దోబూచులాట

 ఆకాశంలో దీపం

 ధ్వజస్తంభంపై దేదీప్యమానం

 అమావాస్య చీకటిలో

 కన్నుల విందుగా కార్తీకదీపం

 అందరిలోనూ ఆనందం

 అందరికీ కావలసింది లోకకళ్యాణం!

10

[20/11, 9:46 PM] Lalita Sister: కవితాగానం

పేరు: విజయదుర్గ

కవితా శీర్షిక : ఆకాశదీపం

కవితా సంఖ్య: 37

తేదీ: 20/10/20 


భారతీయ హిందుత్వానికి

సంధానమైన ప్రక్రియ

ఉత్తమోత్తమైన దీపజ్వాల

గుడిలో ద్వజస్థంభానికి వ్రేలాడదీసే దీపం....!!


మానవజన్మ సంచితాల

సంచిలో ఊపిరాడక

గతజన్మ నీడలలో మునిగిపోతూ

రేపటి శ్వాసకు దారిని వెతకలేని

మూర్కత్వం లో కొట్టుమిట్టాడేను....!!


మన సద్గతులకు ,మన ముముక్షువుల సాధనకు

ఒక్కోమాసం ఒక్కో ప్రత్యేక పూజల

సారాన్ని పంచేను....!!


కార్తీక మాసం దీపతోరణాలకు

మూలమైన మహిమాన్వితం

ఆకాశదీపం స్వచ్ఛమైన వెలుగునిస్తూ గాలిలో

మన పుట్టుక అర్ధాన్ని కిరణాలలో

వెలిగిస్తూ తిమిరాన్ని తరిమేను....!!



                                 వినీల

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...