Skip to main content

Mother's day

నిర్వహణ ః వీరా గుడిపల్లి


సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ

సహకారం ః మెరుగు మధు
అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
***********************
1.వల్లాల విజయ లక్ష్మి గారు
2.దేశపతి మోహన్ శర్మ గారు
3.విజయ దుర్గ గారు
4.శ్రీకాంత్ కడార్ల గారు
5.బల్లూరి ఉమాదేవి గారు
6.కోరాడ నరసింహా రావు గారు
7.కొలచన విజయ భారతి గారు
8.మువ్వా ప్రసాద్ గారు
9..పాల్వంచ హరికిషన్ గారు
10..వల్లాల విజయ లక్ష్మి గారు
11.పోలా కిషోర్ కుమార్ గారు
12.పాండాల మహేశ్వర్ గారు
13.అనుముల తేజస్విని గారు
14.అమరగాని మధు గారు
15.సర్ఫరాజ్ అన్వర్ గారు
16.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
17.తులసి వెంకట రమణాచార్యులు గారు
18.మహేందర్ జవ్వాజి గారు
19.సంజీవ రెడ్డి గారు
20..వకుళ వాసు గారు
21.కాల్వ రాజయ్య గారు
22.గుండ్ల రాజు గారు డఖ
23.మర్రి జయశ్రీ గారు
24.మహేందర్ జవ్వాజి గారు
25.గాజుల భారతి శ్రీ నివాస్ గారు
26.తగిరంచ నరసింహా రెడ్డి గారు
27.సునంద వురమిళ్ళ గారు
28.రమా కులకర్ణి గారు
29.స్వర్ణ సమత గారు
30.శివలక్ష్మి రాజశేఖరుని గారు
31.దీపక్ న్యాతి గారు
32.పార్నంది లలితా కృష్ణ గారు
****"""*********""""""*******
1
[09/05, 8:03 PM] +91 92473 97209: శీర్షిక:****అధినేత్రి*
--------------*******-------
అక్షరాలకు అందని అద్భుతం
పదాల్లో ఒదగని దివ్యత్వం
మాటలచోరులకు చిక్కని మణుల మూట
కోవెల ఎరుగని కోటిదేవతాస్వరూపం *అమ్మ*

కావ్యాల్లో కుదించలేని కారుణ్యసంద్రం
తోటల్లో పూయుంచలేని మమతాపుష్పం
కష్టాలద్రావణాల్లో కరగని ప్రేమగని
ఇజాల ఇరుకుల్లో ఇమడని నిజం *అమ్మ*

ప్రేమకు ప్రియమైన ప్రతిరూపం
త్యాగానికి తగిన నిర్వచనం
ఓరిమికి శాశ్వత నివాసం
కూరిమికి సరైన చిరునామా *అమ్మ*

తల్లి కాగానే మారిపోయే వింతజీవి
పిల్లలవృద్ధికి అస్తిత్వం కోల్పోయే అమీబా
పిల్లలప్రేమ కోసమే బ్రతికే పిచ్చితల్లి
పిల్లలసంతోషానికై సదా తపించే మనస్విని *అమ్మ*.

సంతానంకై స్వాభిమానకవచాన్ని
విడిచి బిక్షమైనా ఎత్తే ధర్మదాత
సంసారంకై సకల విధాల యోచించే
హోదా అడగని ఆర్థికవేత్త *అమ్మ*.

ఏ గజ ఈతగాడు ఈదలేని
అగాధ జలనిధి *అమ్మ మది*.
ఏ పర్వతారోహకుడు చేరలేని
సమున్నత శిఖరం *అమ్మ హృది*.

ఎవరూ పూర్తి చేయలేని
సశేష *కావ్యఖండమే* "అమ్మ"
ఎవరూ ఓడించలేని అనంత
ప్రేమసామ్రాజ్య *అధినేత్రి* అమ్మ.

:*వల్లాల విజయలక్ష్మి*,,ఆలేరు

2
[09/05, 8:23 PM] +91 90005 12526: 2711/111
దేశపతిమోహన్ శర్మ
మెదక్
ప్రక్రియ:మణిపూసలు
అంశం: అమ్మ
****************  అమ్మ  ***************
1.కనిపించు దైవం అమ్మ
   కనిపెంచు.. త్యాగం అమ్మ
  కడవరకు నీడనిచ్చే ...
  వంశవృక్షమౌను.. అమ్మ

2. అమ్మకు సాటేది లేదు
     ఆమెకు పోటేది రాదు
     ఆలనలో పాలనలో...
     ఆమెకు మిన్నేది కాదు 

3. ఆమె అనురాగపు మూర్తి
     ఆమెనే వంశపు కీర్తి
     అవనిలా తన ఓర్పుతో
     సేవచేయుటలో.. స్ఫూర్తి

★★★★మాతృదేవోభవ ★★★★
[09/05, 8:26 PM] వినీల అక్క: కవితాగానం
3
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : అమ్మకోసం
కవితా సంఖ్య: 23
తేదీ: 09/05/20

అమ్మ అన్న పిలుపే
నిండైన ప్రేమకు తొలిద్వారం
ప్రాణమే ఫణంగ పెట్టి
పురిటి నొప్పులను ఓర్చి
జన్మనిచ్చు బిడ్డకు ....!!

మమతల వీణియపై
తానెప్పుడూ
అనురాగ సరిగమలను పలికిస్తూ
ఆ చూపుల తడిలో తడుపుతూ
కొండంత అండగ నిలుచు....!!

త్యాగానికి మారుపేరుగా
తను సర్వం కోల్పోయినా
కన్నపేగులను కడుపారా కాపాడు....!!

అమ్మకోసం ఎంత చేసినా తక్కువే
లాలించిన అమ్మను వదలక
పండినప్పుడు లాలించి కడుపున పెట్టు
నీ నీడలో నీ చెంతనే నీ సేవతో
కొంతయినా తీర్చుకో ఋణం.....!!


                                  వినీల:
4
 శీర్షిక.. అమ్మ ప్రేమ

పేరు: శ్రీకాంత్ కడార్ల


 ఎవరో తెలియదు కాని యదలో సంబరం

ఎందుకో తెలియదు గాని ఆమె మదిలో  మురిపెం

నవమాసాలు మోయలసింది ముందుందని తెలిసినా

అటుపై అంకురాన్ని అచ్చెలంచెలుగా పెంచి పెద్దచేయాల్సింది ఎరిగినా

గోరు ముద్దలను గావురంగా పెడుతూ
వెన్నెల వెలుగులను  చూపెడుతూ
సందమామ రావే జాబిల్లిరావే అని గొంతెత్తి పాడుతూ

తనరూపానికి ప్రతిరూపమైన నిన్ను చూసి మురుస్తూ అన్నీ మరుస్తూ

క్యావు అన్నా కంగారు పడుతూ
కదలికలో తేడాకే కన్నీరు కారుస్తూ

కనురెప్పాలా రక్షణ అందిస్తూ

తెంచుకొని వచ్చిన పేగును విదిలించుకొని వచ్చిన నలుసును
నలుగురిలో ఒకడిగా నవ చైతన్య శక్తిగా మార్చగలిగే దేవత అమ్మ...


ఆమని కి అతిసుందర స్థాయి అమ్మతనం
అమ్మంటేనే మంచితనం అటుపైనే ఇంకేదైనా గొప్పదనం
5
డా.బల్లూరి ఉమాదేవి
అంశం:అమ్మ

శీర్షిక:   అమ్మ.
1.ఆ.వె:తల్లి ప్రేమ విలువ ధరణిలో నెంచంగ
      తరమె యేరి కైన దలచి చూడ
       ముద్దు మోము గాంచి మురియుచు నాతల్లి
         భాగ్యశాలి నంచు పరవశించు..

2.ఆ.వె:ఆకలెరగి తాను నడగక పోయినా
           కడుపు చూసి నింపు కరుణ తోడ
           సుంత బాధ పడిన సొమ్మసిల్లును తాను
          అమ్మ ప్రేమ కిలను నంత మేది.

3.ఆ.వె:తల్లి ప్రేమ కెవడు ధరను గట్టగలడు
             సాటిలేని యట్టి మేటి మమత
               నంద చేయు శక్తి నమ్మదే మహిలోన
             తల్లికన్న నెవరు దైవ మిలను.

4.ఆ.వె:విశ్వమందు తాను వేదన భరియించి
             జన్మ మొసగు నట్టి జనని యెపుడు
              దైవ మేగ నెంచ ధరణిలో సర్వదా
             దైవతములకెల్ల దైవమామె.

5.కం:అమ్మను మించిన దైవ
          మ్మిమ్మహిలో నెందు గనిన నెచ్చట లేదే
           కమ్మగ బిడ్డలు తల్లిని
          నమ్మా యని పిలిచినంత హాయిని బొందున్.
6
అంశం :-* అమ్మ *
కోరాడ నరసింహా రావు;  రుణము
          దీర్చు కొందు!
*****************
యెంతని  పొగడను
యేమని  పొగడును
అమ్మా...నిన్ను...!
వట్టిపొ  పొగడ్తలే...
మిగిలె నమ్మ...,
నీ కాద రనేదమ్మా!?

సేవలు జేసీ  చిక్కి
శల్యమై వడలి నావు
తల్లీ !  ని న్నాదు కొన గ లేకున్నా నమ్మా ...
అ శ క్తు డ నైతినే !
.
నా సుఖమున కాన న్దించితి వమ్మా...నా
బాధలకు తల్లడిల్లి
తివే...!యెల్లవేళలూ
నా సుఖమునెదలచి
పరి తపించి నావే...!

రుణపడినాకుతల్లి
వైనావో...,నే నీ జన్మ న రుణపడినాను ,
మరు జన్మ లోన నీకు తల్లి నై...కంటికి రెప్ప లా పెంచి ,పోషింతు
నీరుణమును దీర్చర్  కుందును తల్లీ..!!
*****************
......కోరాడ.
7
[09/05, 9:24 PM] +91 97031 30342: నేటి కవిత
పేరు:కొలచన విజయ భారతి
హైదరాబాద్
శీర్షిక:అమ్మా !వందనం
తేదీ:9-5-2020
*********************
నేను పిండంగా రూపు దిద్దుకున్నప్పటినుంచీ
నీ గర్భమనే రక్షణ వలయంలో
పదిలంగా భద్రంచేసి
నవమాసాల మోసి
నరాలు మెలిపెట్టే బాధను స్వరంలోనే దాచి
వరంగా నన్ను కన్నావు

నా నవ్వులను నువ్వుండలు చేసావు
నా పలుకులను చిలుకలు గా చేసి పంచావు
నా అడుగులకు అరిసెలతో మడుగులొత్తావు

నీ చేతుల ఊతంతో
నా బుడిబుడి అడుగులకు
దారి పరచావు

నీ రెక్కలు ముక్కలు చేసుకుని
నాకు  రెక్కలు తొడిగావు

ఈ  ఎనుబది పదుల వయసులో అలసిన  నీదేహానికి
నా రెక్కలు   నీకు వీవనలుగా చేసి సేవించుకుంటానమ్మా

వడలిన నీ చేతులకు ఊతకర్ర నేనౌతానమ్మా
తడబడు నీ అడుగులను
వీడక నే తోడుంటానమ్మా

వేయి పున్నమల నీ జీవన పయనానికి   వెలుగు నిచ్చే
జాబిలి నేనౌతానమ్మా

ఈ దేహానికి నీ ఊపిరి పోసి అమ్మా నను కన్నందుకు
నీ ఋణం తీర్చు కుంటానమ్మా
    🙏🙏🙏🙏🙏
8
 జగతి లోకి రావడనికీ జన్మనిచ్చి 

ఆత్మీయతతో ఆదరించి

 మంచితనంతో మైమెరిపించి

 ప్రేమానురాగలతో పరవసింపజేసి

తొలియసులో తప్పుటడుగులనుంచి తప్పించి

 మద్యయస్సులో మనకొక లక్ష్యాన్ని ఏర్పరిచి

 తనాలిసిన మనకలుపురానీయక

 మమ్ము సమాజములో నిలిపిన మాతృమూర్తికీ

 శతసహస్రకోటి  వందనాలు

  మువ్వా ప్రసాద్
   ఖమ్మం

9

అంశం: మదర్స్ డే
శీర్షిక:  నువ్వే మా శాశ్వతం..!

పల్లవి: అమ్మా నువ్వే లేకపోతే నాకు.. జననం ఎక్కడిదీ..
అమ్మా నువ్వే కనకుంటే నన్నూ.. గమనం ఎక్కడిదీ..
చరణం: అమ్మా ఈ సృష్టికి మూలం నువ్వే..
అమ్మా ఈ సృష్టికి జీవం నువ్వే..
అమ్మా ఈ జగతికి మోదం నువ్వే..
అమ్మా ఈ జగతికి ఖేదం నువ్వే..
అమ్మా మా ఉనికికి కారణం నువ్వే..
అమ్మా మా ప్రగతికి ప్రాణం నువ్వే..
పల్లవి: అమ్మా నువ్వే లేకపోతే ............
చరణం: కనిపించే తొలి దైవం.. ఓహో..
అనురాగానికి అర్థం.. ఆహా..
ఆప్యాయత పరమార్థం.. ఓహో..
మమకారపు మాధుర్యం.. ఆహా..
మంచితనమనే ఉగ్గును పెట్టి గొప్పగ మము మలిచినవమ్మా..
పల్లవి: అమ్మా నువ్వే లేకపోతే.........
చరణం: నా కలలో కలవరింతల్లో..
నాతోడూ నీడవు నువ్వే..
నడకనూ నడతనూ నేర్పి..
నను గెలిపించేదీ నువ్వే..
నా ఇష్టాయిష్టాలను తీర్చి..
నా కడుపు నింప జూసినవూ..
కష్టాలూ కన్నీళ్ళను దాచి..
చిరునవ్వుతో నను పెంచినవూ..
చరణం: అమ్మా నువ్వే లేకపోతే.........
పల్లవి: నా బంగారు భవిష్యత్తు కోసం..
ఎన్నో కలలను కన్నవు అమ్మా..
నా జీవితమే బాగుండాలని..
నువు మనసార కోరుకున్నవమ్మా..
నేను తప్పులు చేసి నిన్ను బాధపెట్టినా..
నీ గుండెలోనే దాచుకున్నవమ్మా..
నీ కంట నీరు పెట్టించి బాధ పెట్టినా..
నా వెన్ను తట్టి ఓదార్చినవమ్మా..
చరణం: అమ్మా నువ్వే లేకపోతే..........
పల్లవి: నీ ప్రేమకు వెల లేదమ్మా.. ఓహో..
నా జీవితం కల కాదమ్మా.. ఆహా..
నీ ఆయవు పోసినవమ్మా.. ఓహో..
నా ఆత్మ బలం నువ్వమ్మా.. ఆహా..
నా ఉదయమే నువ్వమ్మా.. ఓహో..
నా హృదయమే నీదమ్మా.. ఆహా..
నువ్విచ్చిందే మా బతుకమ్మా.. 2
నువ్వే మా శాశ్వతమమ్మా...
( మాతృ దినోత్సవ శుభ సందర్భంగా మాతృ మూర్తులకు ప్రణమిల్లుతూ.. )

 -- ✍️అర్జున ( కలం )
    పాల్వంచ హరికిషన్
    రామన్నపేట
    9502451780
10
[10/05, 8:07 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:**నువ్వూ నేను***
-----------**********------

మన బంధం గురించి రాయాలని ఉందమ్మా!
నీ వల్లనే నా జననం జీవనం కదమ్మా!
నా జీవితమే నీవు లిఖించిన కవనం
నీ తలపులతోనే నా జీవితం పావనం

నా ఉనికి ఉన్నతిలకు కారణం నువ్వు!
నీ ప్రేమాభిమానాలకు ప్రతిరూపం నేను
నా ప్రగతికి ప్రాణాధారం నువ్వు!
నీ ఆప్యాయతకు నిలువుటద్దం నేను

నన్ను చూడంగానే నీ కళ్ళల్లో వెలుగు
నిను చేరంగా నా కాళ్ళల్లో పరుగు
నా రాక ఆలస్యమైతే నీ కళ్ళల్లో బెరుకు
నీ సాంగత్యంలో నా ఆలోచనల్లో చురుకు

చిన్నా పెద్దా కొత్తా పాతా తేడా లేనే లేదు.
నిన్నా నేడు రేపు ఎపుడు మార్పు రానే రాదు
నీ ప్రతి విషయం నాకు చెప్పందే నీకు తోచదు
నా ప్రతివిజయం నీతో పంచుకోనిదే సార్ధకం కాదు

నా రాకతోనే నీ జీవితాన సూర్యోదయమన్నావు
నీ రూపుతోనే నా మనసున చంద్రోదయమంటాను
నా పెంపకంలో నీది కమనీయ చిత్రం అయింది
నీ అనురాగాలాపనతో నాది మమతల గాత్రమైంది

కడుపున నాకు ప్రాణం పోశావు నీవు
అక్షరాలతో నీ అద్భుతచిత్రానికై యత్నిస్తున్న నేను
*నీ జీవితానికి ఉదయం నేనన్నావమ్మా!
*జీవితాంతం నా హృదయంలో నీవుoటావమ్మా* !


:**వల్లాల విజయలక్ష్మి**,ఆలేరు
11
[10/05, 8:09 PM] +91 99633 77273: అమ్మకు ప్రేమతో

08 April 2020
17:52

అమ్మా అమ్మా నా దైవం నువ్వే
అమ్మా నువ్వే నా తొలి గురువమ్మా

అమ్మా అమ్మా అని పిలిచానే
నిత్యం నిన్నే నేను తలిచానే
విన్నావా నన్ను కన్నావా
వొడినే ఊయల చేసి ఊపావా
జోల పాడావా
ఆ దైవం అమ్మ రూపంలో
ప్రేమను పంచేనా ప్రాణం పోసేనా
.                                  ||అమ్మా||

నీ రక్తం పంచుకొని నేను
నీ ఊపిరి అందుకొని నేను
నీ రూపం పోసుకొని నేను
నీ ప్రేగు తెంచుకొని నేను
నిన్ను పిలిచానే ప్రేమతొ తలిచానే
                                      ||అమ్మా||

ఆకలితో ఉంగపట్టి నేను
నీ చనుపాలు త్రాగేసి నేను
నిద్దురలో ఉలికిపడి నేను
గుక్కపట్టి ఏడుస్తూ నేను
నిన్ను పిలిచానే ప్రేమతో తలిచానే
                                      ||అమ్మా||

నీ వ్రేలు పట్టుకొని నేను
నీ అడుగులో అడుగులేస్తు నేను
నీ ఒడిలో నుడి నేర్చి నేను
నీ చాటున ఎదిగేసి నేను
నిన్ను పిలిచానే ప్రేమతో తలిచానే
                                       ||అమ్మా||

నిన్ను వదిలి ఉండలేను నేను
నిన్ను చూడకుండ ఉండలేను నేను
నీ కంటి కనుపాపై నేను
నీ గుండెల్లో నిండిపోయి నేను
నిన్ను పిలిచానే ప్రేమతో తలిచానే
                                     ||అమ్మా||


రచన :  పోలా కిషోర్ కుమార్
             బోయినపల్లి
12

అమ్మంటే ఆకాశమంత
ఆత్మీయతతో మహితకే ఉగాదంత
ఆరు ఋతువుల ఉగాది పండుగలా ఓంకారం శ్రీకారం అమ్మే
షట్కర్మల సేవ పరాయణిల వినోది--!
తరతరాలకు తరగని తపస్విని ..
యుగయుగాలకు చెరగని పెన్నిధి అమ్మ...!

ఆలనా పాలనలో ఉగ్గుపాల
మురిపాల యుక్తిని
ఊయలలో ఓలలాడిస్తూ
లాలిసుధల రక్తిని నింపి .!
చదవు సంస్కారాల సుద్దుల్ని సుకుమారంగా వల్లె వేయిస్తూ
ఓర్మిగా
కూర్మినిపంచే కులధర్మపత్నిఅమ్మ...!

ఏమిటో?నేటికాలం నేర్పిన శాపం
అయ్యయ్యో!
ఆడపిల్లనగానే కడపులో కరిగిస్తుండ్రు..
కళ్ళు తెరవకముందే కడతేరుస్తుండ్రు
ఆడజాతి లేకుంటే
మానవజాతి మనుగడెట్ల?

అరవైలైనా ఇరవైలైనా
ప్రకృతిలో పరిమళాల సహజాత
అమ్మే  కదా...!
అమ్మతనాన్ని ఆపెశక్తి ఎవరికిలేదు? అమ్మగుణం నిండు జాబిల్లిలా
పండువెన్నెల పరవశత్వాన్ని పంచుతుంది...ఎపుడైనా?

కల్మష బుద్దిని  చెవులు పిండి చెంపదెబ్బతో సరిచేసే కల్పవల్లి అమ్మ
విజయానికి మెలుకువల్ని
ముందడుగుకు మూలాల్ని దిద్దే
ఆది అంతం అమ్మే కదా ..!
అమ్మ ప్రేమ లేకపోతే అంగట్లో అనాథలే..
అడుగు జాడలు తెల్వని జీవితం
కుక్కలు చింపిన విస్తరే కదా...!

శ్రీ వాణి గిరిజలేకమైన
ప్రతి ఇంటి ఇలవేల్పులు అమ్మలే..
ప్రతి ఎదకు ప్రణవంగా..
ఆధునిక చేతనత్వ యుగాన
చిరునవ్వులు పంచే పాలవెల్లి అమ్మ

మల్లె పరిమళాల
తల్లి ప్రేమ పొందని జన్మవృధా ఏమున్నా?ఎంతున్నా?
అమ్మంటే ఆరోగ్యం సౌభాగ్యం...!

నవరసమయ నాగరికతకు
నాట్య మయూరి  తానై
నయ గారాల వారథి
జగతికి జయభేరి అమ్మ...!
జయ వినోద జయ విలాస
సుమనోహర సుకుమార
సంసారపు జాగృతం అమ్మ
సంస్కారం కర్తవ్యం
అమ్మ సేవే జయం శుభం
జయమంగళ జగన్మాత
జయ కులాస చిద్విలాసపు అమ్మ
ముగురమ్మల మూలపుటమ్మ...!

💐మాతృదినోత్సవం శుభాకాంక్షలతో💐

✍️డా.పాండాలమహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి

13
[10/05, 8:19 PM] అనుముల తేజస్విని Poetess: కవితగానం
అంశం:మాతృ దినోత్సవం శీర్షిక:అమ్మ విలువ

అమ్మ ప్రేమ అమృతం
అమ్మ ఒక అద్భుతం
అమ్మేగా ఈ జన్మకు కారణం
అమ్మేగా ప్రతిజన్మకు మూలం

అమ్మ లేని లోకం
ఎంతో వ్యర్థం
అమ్మ లేని జీవితం
ఎంతో శూన్యం
అమ్మ తోడు ఉంటే అందలమే ఎక్కుతాం
అమ్మ వెంట ఉంటే అద్భుతమే సృష్టిస్తాం

ఒకరోజు అమ్మకేలా
ప్రతిరోజు అమ్మదేరా
నిను లేపే సుప్రభాతం
దారి చూపే పారిజాతo
అమ్మ ఉన్న జన్మే
ఆనందపు సీమే
అమ్మ విలువ తెలుసుకో
జన్మాంతా కాపాడుకో......


అనుముల తేజస్విని
నర్సంపేట.
14
[10/05, 8:19 PM] అమరగాని మధు Poet SDPT: శీర్షిక: *మా అమ్మ పిసినారి*
మా అమ్మ పిసినారి
పైసలన్ని పోపుల డబ్బాలో పెట్టుకుంటది
నాన్న ఏది చెప్పినా పైసలు లేవంటది
తమ్ముడు, నేను ఏదడిగిన ఆ డబ్బా ఖాళీ సేత్తది.

మా అమ్మ పిసినారి
ప్రతి పండుగకు పాత చీరె కట్టుకుంటది
అట్లేందుకే అని అక్క అంటే పైసలు లెవ్వంటది
మాకు మాత్రం కొత్త బట్టలు కొనిత్తది.

మా అమ్మ పిసినారి
రోజు పచ్చడి  మెతుకులు తింటది
అవసరం అయితే పస్తులు ఉంటది
మాకు మాత్రం పప్పన్నం అండిపెడుతది

మా అమ్మ పిసినారి
కాళ్ళకు కంచు మట్టెలు పెట్టుకుంటది
మా అక్క కాళ్ళకు వెండి పట్టీలు సేపిత్తది
నాకు, తమ్మునికి వెండి మొలతాడు సేపిత్తది.

మా అమ్మ స్వార్థ పరురాలు
అమ్మ ఒంటినిండా గాయాలున్న ఓర్చుకుంటది
మాకు చిన్న గాయం అయితే బోరుమంటది.

మా అమ్మ నాకు ఎప్పటికీ అర్థం కాదు
అందరు నన్ను వీడు మొండోడు అంటే
అమ్మ నన్ను మా పెద్దోడు (నేను) దండోడు అంటది.

అక్షరాలు అవసరం లేని అమృత కలశం మా అమ్మ
నన్ను నవమాసాలు మోసిన నా కన్న తల్లి
ఇప్పుడు నా  చిన్న కవితకు వస్తువుగా మారి
కొత్త కవితకు జన్మనిచ్చింది….@✍️ Madhu amaragani.
9177860792
15
[10/05, 8:21 PM] Sarphraj Anwer Poet: 🌸 *అనుబంధాల రెమ్మ..*🌸

నేనో ఇసుకరేణువుని
నువ్వో ఆత్మీయతల హిమగిరిశిఖరం
నేనో నీటిబిందువుని
నువ్వో అనుబంధాల సింధువు
నేనో చిలిపి చీకటి గీతని
నువ్వో అనంతాభిమాన వెలుగు రేఖ
నేను వడలిపోయిన వర్తమానాన్ని
నువ్వు గడిచిపోనీ, మర్చిపోని
ఘనమైన గతం
నేను నీకు పనికిరాని స్వార్థభవిష్యత్తుని
నువ్వు సదా నా శరీరంలో ప్రవహించే మమతల నెత్తురు విద్యుత్తు..

నీ కళ్ళల్లో చల్లని తడి ఉంటే
మాటల్లో సౌగంధాల పుప్పొడి ఉంది
చేతల్లో ప్రేమాభిమానాల జడి ఉంటే
*గుండెల్లో ఆప్యాయతల అలజడి* ఉంది

*మాతృత్వం మైమరిచి* నవమాసాలు
నాకు శ్వాసగా అందితే
*మమకారం ద్రవీభవించి* నా పాలిట
*కమ్మని ముర్రు పాలైతే*
అనుబంధం చిగురించి
*మల్లెతీగలా నా ఇంట్లో పర్చుకుంటే..*

ప్రేమ ప్రణమిల్లి నీ చరణదాసియైతే
*స్వాభిమానం నీ ఇంటి మారుపేరైతే*
పుట్టింటి ఆత్మగౌరవం మెట్టింటి
భవిష్యత్తుకు మొగ్గలుతోడిగితే..

తన ఆకలి సహజధర్మాన్ని కోల్పోయి
నా నోట్లో గోరుముద్దైతే
ఆశ తన శ్వాసను కోల్పోయి నా
జీవితాశయంగా మారితే
ఆ కమ్మని పదం అమ్మ
ఆ *అనుబంధాల రెమ్మ అమ్మ..*

అక్షరాలు తమ హృదయాల్ని
తడుముకుంటున్నాయి
నీ త్యాగాన్ని వర్ణించలేక
పదాలు పొరబడ్తున్నాయి
నిను పొగడలేక
వాక్యాలు వాలిపోతున్నాయి
నీ గురించి వ్రాయలేక
ఎందుకంటే వాటికి
*నిను వర్ణించేటంత శక్తిలేదు గనక*  ..

మాతృమూర్తులందరికి మాతృదినోత్సవం శుభాభినందనలతో..🌸💐🎉🎉🙏🏻🙏🏻

*సర్ఫరాజ్ అన్వర్..*✍🏻
9440981198
16
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:10-5-2020
శీర్షిక: అమ్మ
**************************

అమృతమయం‌ ఆ హస్తం
ఆనందధామం ఆ ఆదరం
ఆప్యాయతా ఆలయం
అదే అమ్మ హృదయం

ఇలలో వెలసిన ఇలవేల్పు
ఎన్నో జన్మల తపస్సు
చిరునవ్వుల ఉషస్సు
చిందించే అమ్మ మనస్సు

ఒక ఉదయం
ఒక హృదయం
ఒక విజయం
అమ్మ ఆశీర్వచనం

ఆదిరూపం అమ్మ
అహర్నిశం అమ్మ
ఆలోచన,ఆవేశం అమ్మ
ఆహా! ఎంత మధురం అమ్మ

పాపాల పాపులకు
అభయం అమ్మ
విషయాల విజ్ఞానానికి
అపరబ్రహ్మ‌ అమ్మ

అడగకుండానే అన్నం పెట్టి
ఆగడాలను కడుపులో దాచి
మనను రక్షించే దేవత
మహామహిమాన్విత అమ్మ

అమ్మంటే అమ్మే సుమా!
అహర్నిశం అలసటే సుమా!
ఆ అమ్మను మరవకుమా!
ఆ అమ్మను కాపాడుమా!

అమ్మంటే అనంతం
అమ్మప్రేమ వసంతం
అమ్మచూపు హేమంతం
నిజం! అమ్మ శాశ్వతం!

బుజ్జి-బుజ్జి నడకల నాటి చేయూత
బుల్లి-బుల్లి మాటల నాటి సరస్వతీమాత
అందుకే అమ్మ సర్వదా పూజిత
వయస్సు మళ్ళిన నాడు ఇవ్వాలి చేయూత

అమ్మ,మా,మాయి,మమ్మీ
ఏ భాషలోనైతేనేమి అమ్మ
మమత ఒక్కటే,భాషలు వేరైనా
మతాలు వేరైనా అమ్మ అమ్మే


ఇంటికి కప్పు  పంటకు నీరు
విద్యార్థికి ఉపాధ్యాయుడు
ఎంత అత్యంత అవసరమో
అంత అవసరం మనకు అమ్మ

అలిగితే బుజ్జగించి
అన్నంతో అమృతం పెట్టి
ఆదమరిచి నిద్రిస్తే
జోకొట్టే కల్పతరువు అమ్మ

అంధకారంలో వెలుగు
అమృతాల పొదుగు
స్వచ్ఛమైన తెల్లటి పెరుగు
ఆ అమ్మను నీవెరుగు

ఆదిశక్తి అమ్మ
ఆదిగురువు అమ్మ
ఆదిరూపం అమ్మ
మన మొదటి మాట అమ్మ

తినేవారు నలుగురైనప్పుడు
తినడానికి మూడే రొట్టెలున్నప్పుడు
"నాకు ఆకలి లేదు" అని మన
ఆకలితీర్చే మనుష్యులలోని దేవతే అమ్మ

బాధలో  అమ్మ
సంతోషంలో అమ్మ
మరణంలో అమ్మ
ఆఖరికి స్వర్గంలో అమ్మ

అమ్మ మాట చద్దిమూట
అమ్మ పాట గాఢనిద్ర
అమ్మదెబ్బ ఆనందడోల
అమ్మదీవెన స్వర్గానికి నిచ్చెన

అమ్మ ఒక వరం
కాకూడదు భారం
విలువ అనంతం
తెలుసుకోవాలి మనమందరం

చెరిపేస్తే చెరగని సత్యం
క్షరం కాని అక్షరం
నిలకడగల సూర్యతేజం
అదే అమ్మ రూపం

నిరంతర ప్రవాహం అమ్మ
జీవనది అమ్మ
నిర్మలమైన ఆకాశం అమ్మ
మన‌ మూలస్తంభం అమ్మ

అఖండజ్యోతి అమ్మ
ఆనందాలభవంతి అమ్మ
ఆధ్యాత్మిక విభూతి అమ్మ
శాంతి-క్రాంతి అమ్మ

పురిటినొప్పులను పుక్కిట అదిమి
మనకు మరో జన్మను ప్రసాదించినది మాతృమూర్తి
ఆశలను,ఆనందాలను ప్రక్కకు నెట్టి
ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని మహాదాత మాత

ఆదిశంకరుడే వరమిస్తానంటే
మళ్ళీ పునర్జన్మంటూ ఉంటే
మా అమ్మే కావాలని కోరుకుంటా
మళ్ళీ మళ్ళీ ఆ అమ్మకే కొడుకునై పుడ్తా
17
 మాతృ ప్రేమ.
శీర్షిక: అనురాగ దేవత అమ్మ.

అమ్మ అనురాగ దేవత..
అవని నందు నడియాడు దేవత అమ్మ..
అమ్మ ప్రేమకు ....ఎది సాటిరాదు...
అమ్మ ప్రేమను పొందని బ్రహ్మ
ఆడ జన్మ కు అన్ని రంగులూ అద్ది ముగ్ధ మనోహర సృష్టి  చేశాడు...
లాలించే గుణం పాలిచ్చే తనం అమ్మకే సాధ్యం...
ఎన్ని నిందలు బాధలు ఉన్న దిగమింగుకొని ...
అన్ని తానై నడక ..నడత నెర్పే నేస్తం అమ్మేకదా..! ఇంకెవరికీ సాధ్య పడును.?
తల్లిగా ...చెల్లిగా అనురాగ వల్లిగా ..ఆలిగా ...ఆయాగా అబ్బ అబ్బ అన్ని  రూపాల్లో కనపడే కాంతి కిరణం అమ్మ.
ముక్కోటి దేవతలు ఎవరో తెలియదు...గాని..
అమ్మలోనే ఆదేవతల తత్వం దాగి ఉంది..
అమ్మ కంటే మించిన "దైవం " ఉంటుందా?
తల్లిగా తరువై జోల పాడి ..నులివెచ్చని  ప్రేమ కొంగు కప్పే కల్పవల్లి అమ్మేకదా!
బాధలు ఎన్ని ఉన్న దాచుకొని ..
కన్నీళ్ళను లోలోనే కాచుకొని
చిరు నవ్వులు కురిపించే శ్రీ మహాలక్ష్మి అమ్మేకదా.
పతి అడుగు జాడల్లో  నడిచే మందాకినీ  అమ్మేకదా!
వంశాభివృద్ధి చేయూత అవని దూత అమ్మేకదా...!
ఆకలి తీర్చు అన్నపూర్ణ అమ్మ
పిల్లల చదువుల తల్లి బండెడు పుస్తకాలు మోసే యంత్రము అమ్మేకదా..!
ఇంటి పని భారం ఎంతైనా చేసి పిల్లలను సవరించు గృహ లక్ష్మి అమ్మేకదా..!
అమ్మ నిజంగా దేవతలకే దేవతా..
సంసార సాగర మథనం లో అమ్మ  సదా ...నీలకంఠుడు.
బిడ్డ ఎదుగుతున్న కొద్దీ తరవులా పులకించి మురిసిపోయే ప్రేమామృతా మూర్తి
సమత మమత ను శోభిల్లే శ్రీ చరణి..శ్రీవాణి శ్రీ వల్లీ మాతృమూర్తి ...మా అమ్మే కదా..
మాతృ ప్రేమకు సృష్టిలో ఎది సాటిరాదు..ఇది సత్యం.. అమ్మ అనురాగం అనునిత్యం సత్యం.

తులసి వెంకట రమణా చార్యులు...✍
18
 అమ్మ...
అమ్మంటె రెండక్షరాలు కాదు...
అమ్మంటె మట్టి బొమ్మ అసలేకాదు..నవ మాసాలు మోసీ ఒళ్ళు నొప్పులు బరిస్తు..
పలకబలపంచేతికిచ్చి బతుకు దారిచూపిన ఆదిగురువు అమ్మ...అరవయేళ్ళ వారైనా తల్లికి అడ్డబాలుడే సుమా..మరి  తరాలు మారినా కన్నతల్లి ప్రేమ కనిపించని ప్రపంచమాయె..ఏమని వర్ణింతునమ్మ...గొప్ప తనం

మహేందర్ జవ్వాజి✍✍✍
19
 సంజీవ రెడ్డి ఐలేని: .....   అమ్మ         ......
💐💐💐💐💐💐💐
తల్లి త్యాగము లేక
తనయులెవరు లేరు
భువి పైన ప్రతి జీవి
తల్లి వరమే
త్రిమూర్తులకైన
స్త్రీమూర్తే జీవము
మాతృమూర్తే
ఈ ప్రకృతికి ఆధారము
అమ్మ అనే పదం
అవనికి అందము
మనిషైనా మానైనా
పశువైనా పక్షియైనా
తల్లి ప్రేమకు సాటిలేదు
అమ్మంటే మమకారమే
అమ్మంటే అనురాగమే
ఆకాశంలో నక్షత్రాలను
లెక్కించలేము
కమ్మనైన అమ్మ ప్రేమని
ఏం భాషలో వర్ణించలేము
దేవుడు అంతట తానుండలేక
అమ్మను సృష్టించాడంటారు
కానీ! అమ్మ లేని లోటును
ఆ దేవుడు కూడా పూరించలేడు

.... సంజీవరెడ్డి ఐలేని...
20
కార్ఖానా🍃

అమ్మ పొద్దున లేచిన దగ్గరినుండి ఇంటిలో ఓ కార్ఖానా...

వరండా నుండి వాష్ బేషన్ల వరకు
 నిన్నమేము చేసిన అంగడినంత

కడిగి మల్లేపూవులా చేసేవేళ అమ్మ ఓ పారిశుద్ధ్య కార్మికురాలు....

శుచి శుభ్రతతో అడిగినప్పుడల్లా రుచికరమైన ఆరోగ్యకరమైన

 వంటలు వండుతూ నోటికందించే వేళ అమ్మ ఓ వైద్యురాలు....

ఇంటిని ఇంట్లోని మనుషులను క్రమశిక్షణతో కార్యోన్ముఖులను చేస్తూ

 కరోనా భరతం పట్టేవేళ అమ్మ ఓ రక్షకభటురాలు...

ఒక్క అమ్మ లాక్ డౌన్ లో వున్నా తనకుతానే ఐసులేషన్ లో వున్నా...

 అప్పుడు తెలిసేది కరోనా ను ఎదుర్కునేందుకు ఇల్లు కూడా పనికిరాదని
వకుళ వాసు
21

శీర్షిక:అమ్మ

కవిత పాఠం:
.1 ఆటవెలది

పట్టి పుట్ట గానె పడతి సంబరపడి
వంశముద్దరించ వారసుడని
గొప్ప జెప్పు కునును కొమరుని గూర్చియు
జనని జనకులిట్లు జగతిలోన

2 ఆ  వె
ముచ్చటాడు తుంటె మురిసి పోవును తల్లి
ఏలు వట్టి తల్లి కెదురు నడచి
అడుగు లేస్తు వుంటె యానంద పడుకుంట
బిడ్డ మీద తల్లి ప్రీతి వొందు

3 ఆ వె
చంక నెత్తు కోని వంక నెలను జూపి
గోరు ముద్ద లెట్టు గొసరి  తల్లి
మిగిలి నన్నమున్న మీది కెల్లి యు దింపి
జిట్టి దీసు తల్లి గట్టిగాను

కాల్వ రాజయ్య ✍
22
అంశం : *అమ్మ*
ప్రక్రియ *మణిపూసలు*

*తల్లి దండ్రుల చేవ్రాలు*
*ఈ తనువున కానవాలు*
*వారికెపుడు పంచుదాము*
*అభినందన చందనాలు*

*నడయాడే దేవతలు*
*మనజన్మ విధాతలు*
*గుండెలోన గుడికట్టి*
*అర్పించుము జోతలు*

*అమ్మంటే అపురూపము*
*సహనానికి ప్రతి రూపము*
*తనబిడ్డకు జన్మ నిచ్చు*
*ఆది శక్తి మరు రూపము*

*అమ్మ యనెడి అక్షరములు*
*కదలించును యెద తంత్రులు*
*బింబోష్ఠ్యములను కలిపి*
*తెరిపించును మది తలుపులు*

*కనిపించే దేవత అమ్మ*
*కనిపెంచే దేవత అమ్మ*
*కలకాలం ప్రేమను పంచి*
*నడిపించే దేవత అమ్మ*

*అమ్మ ప్రేమ అమరము*
*అమ్మ ప్రేమ మధురము*
*కొలిచే కొలబద్ధ లేని*
*కరుణామృత సంద్రము*

*🌹🌹🌹గుండ్లరాజు🌹🌹🌹*
23
[10/05, 9:27 PM] మర్రి జయశ్రీ: కవితా గానం
మర్రి జయశ్రీ
అంశం..అమ్మ
శీర్షిక..మణిహారం

జగతికి మూలం
నవమాసాలు తన గర్భగుడిలో
పదిలంగా దాచి
పురిటి నొప్పుల అగ్నిగుండాన్ని
అవలీలగా దాటి
మనకు జన్మనిచ్చి
తాను పునర్జన్మ పొంది
ఈ లోకాన్ని చూపిస్తుంది
తన రూధిరాన్నే చనుబాలగా
బిడ్డ ఆకలి తీర్చి
జీవం పొసే త్యాగమూర్తి
మంచి చెడులను బోధించే ఆది గురువు
మానవతా విలువలు రంగరించి నూరిపోసే
అమ్మ ఒడి తొలి బడి
మన ఉన్నతికై అలుపెరుగని శ్రమ చేసే నిరంతర శ్రామికురాలు
ఓర్పులో ఉర్వి
ఆప్యాయతానురాగాల మణిహారం
సుగుణాల సుమహారం
ఆపదలలో ఆదుకొని అక్కున చేర్చుకొని
కొండంత అండ
ఆత్మస్థైర్యం అందించే ఔషధం
అమ్మ ఆకాశం
ఆమె కురిపించే ప్రేమ వెన్నెలకన్నా చల్లదనం
అమ్మ అక్షయపాత్ర
జ్ఞాపకాల అంబుది
అమ్మ ఒక మహాకావ్యం
అమ్మ ఇలలో వెలసిన దేవుడి ప్రతిరూపం
అందుకే ప్రతిరోజు చేయాలి వందనం
ఆమె ఆశీర్వాదమే మనకు రక్షణ కవచం.
24.
చరవాణీ.8978503203
~శీర్షిక. అమ్మా..!
~~~~~|~~~~~~~|~~~~~~|~~~~~~~
ఊపిరి పోసీ...కొత్త లోకాన్ని నాకు కానుకగా ఇచ్చి,.ఊయల లేసిజోలలుపాడి... నన్ను నిద్దుర పుచ్చితివి.చందమామ నుసూపుతూ..గోరు ముద్దులుపెట్టి.పశువుల దూళిపిచ్చుకల అరుపులు
ప్రకృతమ్మ ఒడిలో తొలి పలుకులు నేర్పుతూ..నమ్మబలికే మనుషులలో...నమ్మకం కలిగిన స్నేహితుల తోడు చేసి
తొలి పలుకులనడుమ... ప్రకృతి కావ్యాలు నేర్పీ.
పలికే పాటలు కదలికలకు మార్పుగాజీవితాన్ని నేర్పీ.
ఎదురైన కర్రను  పిల్లనద్రోవిగా మార్చి. కమ్మని కావ్యాలు పలికేలా  తీర్చి దిద్దీ
గమ్యానికి దారి చూపిన అమ్మకు ఒందనం  యాభయారు తెలుగు అక్షరాల అబినందనం .,..
25
గాజుల.భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
జిల్లా:-ఖమ్మం
చరవాణి:-9849788108
శీర్షిక:-అమ్మా.. నీకు వందనం.
******************
పట్టుపరుపులెందుకు
హంసతూలికతల్పా లెందుకు
నీకై నెనున్నాననే నిశ్చింతను చేకూర్చే
అమ్మ ఒడి ఉంటే చాలు!
ఊరంతా వెలుగులు నింపే పున్నమి చంద్రుడేందుకు
చల్లని వెన్నెల కిరణాలేందుకు
నాకై ఎంతో సహనంతో ఎదురుచూసే..
ప్రేమతో పిలిచే అమ్మ పిలుపుంటే చాలు!
వజ్రవైడూర్యాలెందుకు
ధనదాన్యాలేందుకు
విలువైనది..వేలకట్టలేనిది
కోల్పోతే తిరిగి పొందలేనిది
అమ్మా తోడుంటే చాలు!!!
26
రచన : తగిరంచ నర్సింహారెడ్డి


ఊపిరినిచ్చి ప్రాణంపోసె..  అసలు దైవము అమ్మేరా
మట్టిముద్దను మనిషినిచేసె... త్యాగబంధము అమ్మేరా

కషాయమెంతొ మింగుతూనే కమ్మనిపాల అమృతమిచ్చు
శక్తిని నింపి.. జేతగనిలిపె .. దివ్యమంత్రము అమ్మేరా

పిల్లలనవ్వు వెన్నెలకొరకు జాబిలమ్మను పిలుస్తూనె
గోరుముద్దల ఉగ్గుబువ్వకు..   ప్రేమరూపము అమ్మేరా

బంగరుసిరుల వెండికొండల ఆస్తివి నీవె ఎప్పటికీ
ఆత్మీయతల రాగవర్షపు.. తేనెహృదయము అమ్మేరా

కునుకు పట్టని రాత్రులెన్నో  గడపుతున్నది ఇప్పటికీ
కలతలేని నీ నిదురకు ' జో ' లాలి గీతము అమ్మేరా!

బ్రతుకుపోరులొ నలగని క్షణమంటూ లేదు తనకెపుడూ
పిల్లలభవిత చక్కదిద్దగ..  అమృతతత్వము అమ్మేరా !

జీవి పుటుకకు జగతినడకకు మూలమెవ్వరు రా "తగిరంచ"
కన్నతల్లే యిలలొదైవం.. సృష్టి జీవము అమ్మేరా!

మాతృమూర్తిని వదిలివేసే విషపుసంస్కృతి వీడవలెను
తల్లినెప్పుడు బాధపెట్టకు.. బ్రతుకుదీపము  అమ్మేరా..!

తగిరంచ నర్సింహారెడ్డి
10-05-2020
27
పేరు::వురిమళ్ల సునంద, ఖమ్మం
అంశం::అమ్మ
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
ఊపిరి పోసుకున్న మరుక్షణం నుంచే
కడుపులోని రూపం చుట్టూ
మమతల పందిరి అల్లుకుంటుంది!
ఉమ్మనీటిలో నరస్సులో వికసించిన కలువకు
బొడ్డు కాడతో జీవామృతాన్ని పంచుతుంది!

మరణం అంచుల దాకా పయనించి
నవమాసాలు గర్భగుడిలో
ప్రాణంగా పెంచుకున్న బిడ్డకు
మరణం అంచుల దాకా పయనించి
విచ్చుకత్తుల పోట్లను ఆనందంగా భరిస్తూ
ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది!

నరనరాన ప్రవహించే ప్రేమానురాగాల
 రుధిరాన్ని
జీవితాంతం ఆరోగ్యంగా ఉండేందుకు
క్షీర ధారలను అందిస్తుంది!

కళ్ళను కంచెగా మార్చి
ప్రతిక్షణం కడుపారా కన్నమొక్కకు
కంటిరెప్పై కాపలా కాస్తుంది!
ఆత్మీయతను  గోరు ముద్దలు చేసి
అత్త తాత అనుబంధాలను ఉగ్గు పాలతో కలిపి నేర్పుతుంది!

పొత్తిళ్ళలో ఊయలూగు పాపాయికి
ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలో
సుద్దులు చెప్పి
సమాజం మెచ్చే పౌరులు కావాలని
కోరుకుంటుంది!
కష్టాలను కన్నీళ్ళను కంటి రెప్పల వెనుక దాచి
సుఖాల వెలుగులు నింపేందుకు
ప్రతి నిమిషం కొవ్వొత్తిలా కరిగి పోయే
వ్యక్తి ప్రపంచంలో ఇంకెవరుంటారు!?
ఒక్క అమ్మ తప్ప..

కన్న పేగు క్షేమం కోసం  ప్రపంచాన్ని త్యాగం చేసేందుకు సిద్ధ పడే
వారుంటారా.. ఒక్క అమ్మ తప్ప..!

 కడుపులో ఉన్నప్పుడు తన్నినా
కడుపు మీద తన్ని తరిమి కొట్టిన
కన్నబిడ్డ  క్షేమాన్ని కడశ్వాస వరకు
కలవరించే అమ్మతనాన్ని మించిన దైవం ఉందా ఈ లోకంలో...
అమ్మ కోరేది ఒక్కటే
ఆత్మీయ పలకరింపు
అవసాన దశలో చిటికెడు ఆదరణ!
గుడి గోపురాలకు వెళ్ళక్కర లేదు
కనిపించే అమ్మను
కష్టం పెట్టకుండా ఉంటే చాలు ‌.
28

కవితా గానం
రమాదేవి కులకర్ణి
హైదరాబాద్


శీర్షిక - *అవును ఆమె అమ్మ*
----------------------------

* గుడిసె బయట వాడు
గుక్కపెట్టి ఏడుస్తుంటే
గుడిసె లోపల ఆమె
పాలకోసం పాపం చేస్తుంది
బిడ్డకోసం ఏదైనా చేసేస్తది
అవును
ఆమె అమ్మ .....!

*  గడప లోపల
కనబడని హింసని
కొంగులో దోపుకుని
ఇల్లాలి సంతకం చేసేసి
పిల్లలకోసం భరించేస్తది
అవును
ఆమె అమ్మ ....!

*బాసు రంకెలేసి
బేజారు చేస్తుంటే
లంచ్ బాక్సు  బ్యాగులో
మూలుగుతుంటే
ఆరైందని ఉరికి  ఉరికి
ఇల్లుచేరి వంటింట్లో  దూరి
పిల్లలకు వండి  వార్చి
తానొక మెతుకైనా  గతకలేదని
యాదిమరిచి పోతది
అవును
ఆమె  అమ్మ ...!

*మాట వినని బిడ్డకు
బుద్దిచెప్పమని
నాన్నకు ఫిర్యాదు చేసి
తీరా అయ్య కొడితే
ఓర్వలేక వెక్కి  ఏడుస్తది
అవును
ఆమె అమ్మ ....!

*గిన్నె ఖాళీఅయి
చికెనంత అయిపోతే
కడుపు మంచిగలేదని
సల్ల పోసుకుని
సర్దుకు తింటది
అవును
ఆమె అమ్మ .....!

*తాగి తందనాలాడి
తల్లి దండ్రులను
తరిమి కొట్టినా
నానా బాధలు పెట్టినా
నా కొడుకు బంగారం
ఎవరో చెడగొట్టిన్రు  అని
మందిని ఆడిపోసుకుంటది
అవును
ఆమె అమ్మ ......


*కట్టుకున్నోడు  కనికరం మరిచినా
దేశాలు పట్టుకుపోయినా
వాడి దారి వాడు చూసుకున్నా
కూడుగుడ్డ లేక అల్లాడితే
సాకలేక దిగాలైపోతే
పిల్లలను బాయిలో  వేసి
తాను కూడా దూకుతది
పిల్లలను  ఆడకూడా ఇడవది
అవును
ఆమె అమ్మ .......!

తనబిడ్డలకై
ప్రాణాలే ఇస్తది
ప్రాణాలు కూడా
తీస్తది
అవును
ఆమె అమ్మ

కళాశ్రీ వేదిక
రమాదేవి కులకర్ణి
కవయిత్రి
మోటివేషనల్ స్పీకర్
హైదరాబాద్
8985613123
29

i*10/05/2020**

🤱 **మాతృమూర్తి **🤱

సృష్టికి మూలం అమ్మ
అమృత భాండం  అమ్మ
అనురాగాల పొదరిల్లు
ఆనందాల హరివిల్లు
వెచ్చదనంలో సూర్యుడు
చల్లదనానికి చంద్రుడు
ఓర్పులో ధరిత్రి
సాధనలోసావిత్రి
కళ్ళల్లో కనుపాపై
ఇలలో మణిదీపమై
మాంసపుముద్దను
మనిషిగా మలిచే శిల్పి
క్షణాల్లో అక్షయమై
జోలపాటతో జీవిత పాఠాన్ని
నేర్పుతుంది
అరుగుతూ --కరుగుతూ
అలుపెరుగని బాటసారి
ఓటమి చవిచూడని
నిత్యవిజేత
అమ్మే జగజ్జేత
దీనత్వంలో ధైర్యాన్ని
శూన్యం శౌర్యాన్ని
నేర్పే ఆదిగురువు
తరగని తరువు
అమ్మతనాన్ని అభివర్ణించాడు  అక్షర సంపద చాలదేమో!
మాతృ మూర్తి --కారుణ్యదీప్తి .

**స్వర్ణ సమత**

**సమూహకవన బాంధవులకు  అంతర్జాతీయ  మాతృదినోత్సవ  శుభాకాంక్షలు **
30
: పేరు: శ్రీ శివ లక్ష్మీ రాజశేఖరుని
 తేదీ:09/05/2020
 శీర్షిక: అమ్మగా నీ కొత్తజన్మ


 నీ రక్తమాంసాల ముద్దగా
 ఆ చీకటి గదిలో నేను ఉన్నప్పుడు
 కలలన్నీ కొంగున కట్టి
 ఎదురు చూస్తివే  నా రాక కోసం

 సడలుతున్న  ఆహార్యం
 సహకరించని ఆరోగ్యం
 లెక్కచేయని నీ మాతృత్వంలో
 అందమైన ఊహలు ఎన్నో నా కోసం

 పురిటి నొప్పుల పునర్జన్మ లో
 అమ్మగా నీ కొత్తజన్మ
 నిద్రలేని నీ రాత్రులకు
 విసుగురాని నీ సేవలకు
 ఏ రుణం కారణమో  అమ్మా !!

 నా తొలి అడుగుల్లో  అడుగైనావు
 నా చిరు పలుకుల్లో పలుకైనావు
 ఆటల్లో, అల్లరిలో,  చదువులో,
 ఎదిగే ప్రతి మలుపులో
 సాధించే ప్రతి గెలుపులో
 వెనకున్న హస్తానివి నీవు
 నా ప్రియనేస్తానివి  నీవు!!

 మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో ప్రతి అమ్మకు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
31.

అంశం : అమ్మ
శీర్షిక : జనానికి జగన్మాత

అమ్మ ఎవరికైనా అమ్మే
అమ్మ కటాక్షం రక్షణ కవచం
అమ్మ దీవెన శుభ ఫలం
అమ్మ సన్నిధి అందరికీ పెన్నిధి
అమ్మ తోడు వుండదు గోడు
అమ్మ కరుణ వెన్నెల చల్లదనం
అమ్మ అభయహస్తం విజయాస్త్రం
అమ్మ చిరునవ్వు అదృష్టాన్నివ్వు
అమ్మ చల్లని చూపు ధైర్యాన్ని నింపు
అమ్మ లాలనా ఆయువు పోషణ
అమ్మ ఓదార్పు సకల విద్యలు నేర్పు
అమ్మ ఒడి విజ్ఞానానికి బడి
అమ్మ ఉపవాసమో తపో వనము
అమ్మ చేయూత గమ్యము సులభము
అమ్మ ఆరాధన సకల శాంతి వితరణ
అమ్మ జగాన జనానికి జగన్మాత

             డా.దీపక్ న్యాతి
నంది అవార్డు గ్రహీత,హైదరాబాద్
32

[10/05, 9:29 PM] Lalitha Krishna: 🌺☘🌺☘🌺☘🌺☘

కవితాగానం
పార్నంది లలితాకృష్ణ
అంశం :అమ్మ

1.అనురాగపువెలుగులచే
అనుబంధము నలదుకున్న యమృతవల్లీ !
అనయము సహనము గలుగుచు
తనరారెడు  త్యాగధనపు తనువును  తల్లీ !

2.
అక్షయప్రేమాన్వితమున్
లక్షలపదములను కూర్చిరమణీయముగా
అక్షయ మాలల నల్లగ
నక్షరమాలయును చాలదా తల్లి కిడన్!

3.
అమ్మయెదకు హత్తుకొనుచు
కమ్మగజోలాలి పాడి కన్నా! యనుచున్
యిమ్మహి ప్రేమను పంచును
కమ్మని యాస్పర్శ సాటి కలదే? జగమున్ !

 🌺☘🌺☘🌺☘🌺☘
.

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...