నిర్వహణ
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం
శివునూరి లలితా కృష్ణ
సహకారం
మెరుగు మధు
అవధాని
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
**************************
చేనేత వస్త్రాలు
కవివరుల జాబితా
******************
1.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
2.కోరాడ నరసింహా రావు గారు
3.వల్లాల విజయ లక్ష్మి గారు
4.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
5.వకుళ వాసు గారు
6.మహేందర్ జవ్వాజి గారు
7.తులసి వెంకట రమణాచార్యులు గారు
8.కొలచన విజయ భారతి గారు
9.కోరాడ గారు
10.దీపక్ న్యాతి గారు
11.పోలా కిషోర్ కుమార్ గారు
12.మువ్వా ప్రసాద్ గారు
13.బల్లూరి ఉమాదేవి గారు
14.మర్రి జయశ్రీ గారు
15.సర్ఫరాజ్ అన్వర్ గారు
****************
1
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:26-5-2020
అంశం:చేనేత వస్త్రాలు
ప్రక్రియ:వచనకవిత్వం
శీర్షిక: పర్యావరణ హితాలు
ఆ అమృతహస్తాల వేళ్ళ కొసల నుండి
ఆవిర్భవించిన దేవతావస్త్రాలు
మరమగ్గాల నుండి అమృతం అద్దుకొని
ఉద్భవించిన నూలువస్త్రాలు
దారపుపోగులలో వల్మీకంలా అల్లుకొని
జనించిన సుందర వలువలు
స్వాతంత్ర్య సమరానికి ఊతమిచ్చి
ఉర్రూతలూగించిన నేతన్నల నేస్తాలు
కుటీరపరిశ్రమై కూడుపెట్టే ఉపాధులు
రాట్నంపై పురుడుపోసుకొని
నిర్మాణం పొందే శరీరధారణులు
పత్తిలో గల గింజలను తొలగించి
మలినాలను చేపదంతాల ద్వారా శుభ్రమొనరించి,ఏకి,
స్థూపాకారంగా చుట్టి,
రాట్నసహాయంతో ప్రత్తినుండి
దారం తీసి,
దారాలను గంజి నుపయోగించి
గట్టిదనం తెచ్చి,సరిచేసి
మగ్గంతో వస్త్రం నేసి,
చేనేతవస్త్రాలు తయారుచేసే
ఉపయోగకరమైన చేతివృత్తి.
భారతావని ఆత్మకు ప్రతీక
అగ్గిపెట్టెలో ఆరుగజాల చీరను
ప్రపంచానికి అందించిన అద్భుతమది.
విదేశీవస్త్రాలు,మిల్లువస్త్రాల పోటీకీ తట్టుకోలేక,
ఆదరించే దిక్కులేక కళావిహీనమై
చేనేతదృక్పథం లేని పాలకుల
నిర్లక్ష్యానికి గురైన గృహపరిశ్రమ.
చేనేత సహకారసంఘాలు
చేదోడు వాదోడు లేక,
అస్తిత్వపోరాటం చేస్తున్నాయి
పోచంపల్లి,గద్వాల,నారాయణపేట,వరంగల్,సిరిసిల్లా,కరీంనగరుల్లో విస్త్రత కుటీరపరిశ్రమలై
అలరారుతున్నాయి
పర్యావరణహితమైన సద్వస్త్రాలై
పోచంపల్లి,ఇక్కత్,గద్వాల్ చీరలు,పట్టుచీరలై పరిఢవిల్లుతున్నాయి.
శ్వేతసౌధానికి సైతం చేరుకున్న
వస్త్రరాజములవి.
చేనేతవస్త్రాలకు చేయూతనివ్వాలి
అందరూ ఆదరించాలి,ధరించాలి.
2
2మమనందరిబాధ్యత
****************
ఆకులుకప్ిన...అనాగరిక మాన వుడు...పట్టుపీతాం బనం
నుండి...టేర్లిన్,పోలీష్టర్...వంటివస్త్ర.ప్రయాణంలో...
మొట్టమొదటి మన దేశీయ శోధనా... మహత్తర సాధన చేనేతవస్త్రాలే గా !
ప్రత్తితెచ్చి...శుద్ధిచేసి
నూలువడికి దారం తీసి...మగ్గాలపై నేసి
ఆరోగ్యకర,స్వచ్ఛమైన వస్త్రాలను మన కందించిన ఆ కళా కారులశ్రమ,నైపుణ్యాలను...ఎంతపొగిడినా తక్కువే కదూ !
పరస్పర సహకార పనివిభజన...కులాలను అంట గడితే ...
నేతకార్మిక కళా కారు
లంతాసాలెవారై,అదే
జీవనోపాధివృత్తిగా...
మన మానవులకు గోప్యతను ప్రసాదిం చిన పుణ్యాత్ములు .
వారు...!
ఆ పరిశ్రమలను,శ్రామిక
కళాకారులజీవితాలనూ ఈ యాంత్రిక యుగం...ఉక్కు పా దాలతోత్రొక్కి...ముందుకు...మునుముందుకు దూసుకు వచ్చేసింది ...!
కొత్త మోజులో పాత ను పట్టించుకోని...
జనం !
అంతంత మాత్రమే ఐన ప్రభుత్వాల...
సహకారం...!!
చేనేతకు మొదల య్యింది దుర్గతి !
స్వాతంత్య్రంవస్తే...
బాగు పడతాయను కున్న జాతీయ లఘు పరిశ్రమలు...మరింతచితికిపోవటం...గాంధీజీ కన్న కల లను
కల్లలుచేయటమే...
కదూ !
అగ్గిపెట్టె లో పట్టేపట్టు వస్త్రాలను నేయగల మన వారి నైపుణ్యం
అడుగంటిపోదా...!?
మనలో...పెరగాలి
జాతీయలఘుపరిశ్రమలపై...అభిమానం!
ప్రతిఒక్కరూఆదరించాలి చేనేతను !
ఇవి మన జాతీయ
వారసత్వ కళలు !
వీటిని అంతరించి పో నీక...ఆదరించి...బ్రతి కించి...పెంచి ,పో షించు కో వలసిన బాధ్యత మన అంద రిదీ....!!,జయహో
భారత్! జయ జయ హో...*చేనేత*!!
*****************.....కోరాడ.
3
[26/05, 8:11 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:**చేనేత***
----------******–----
పడుగు పేకల కల*నేత* వస్త్రం
పరవశింపజేసే చేనేత మన వారసత్వం
నేతన్నల గుండెకోత గమనిద్దాం
వారికష్టం కొంత తీర్చగ యత్నిద్దాం
చేనేత వస్త్రాలను కొని ధరిద్దాం.
చే'నేతన్న'ల నైపుణ్యాన్ని ఆదరిద్దాం.
దేశభక్తిని చేతల్లోనే చూపిద్దాం.
స్వదేశీవస్త్రాలను ధరించి సంతోషిద్దాం.
చేనేతలు శరీరానికి సదా ఆరోగ్యకరం సహజపోగులనేతలు చర్మానికి సౌకర్యవంతం.
కోట్లకుటుంబాలకు ఉపాధినిచ్చే రెండో పెద్దరంగం.
రైతురామన్నకు సాయపడే లక్ష్మన్న వస్త్రరంగం.
దేశగౌరవం పెంచిన ఉత్పత్తులు.
విదేశీ మారకద్రవ్య సాధనమ్ములు.
ప్రాచీన పారిశ్రామిక వారసత్వములు.
ప్రపంచ ప్రఖ్యాత కళాచిత్రములు..
స్వాతంత్ర్యపోరాటానికి సాక్ష్యాలు.
స్వదేశీ ఉద్యమానికి సాధనాలు.
సబర్మతిఆశ్రమాన వoదల చరఖాలు
దేశభక్తులు ధరించిరి ఖద్దరువస్త్రాలు
ఆ స్పూర్తితో సగర్వంగ ధరిద్దాం నేతవస్త్రాలు
తెలుగుప్రాంతాలెన్నో చేనేతలకు ప్రసిద్దాలు
స్త్రీల హుందాతనానికి భూషణాలు చేనేతలు
ఎల్లరి హోదాగౌరవాలకు ఆభరణాలు చేనేతలు
::వల్లాల *విజయలక్ష్మి*,,ఆలేరు
4
[26/05, 8:19 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: ***చేనేత కుతకుతలు***
✍️డా.పాండాల .
చేనేత రంగమప్పుడు
మానమ్మును పెంచె కళయె మణిమకుటముగన్!
వే నూతన పోగుడిజను
నానా కళరంగులద్ది నాగరికముగన్!
నెయ్యి బువ్వతినెడి నేతన్నలీనాడు
కడ్పు మాడ్చు టాయె కాంతి తగ్గె!
మాలుషావుకారు మాటలే బందాయె
చీర కొనెడి సేటు చీత్కరించె!
చేతుల పని లేక చేయూత కరువాయె
నొసరు వెక్కిరించె కసురుగాను!
మంచిదికనుచాలు మాటలో గేలాయె
వెగటుపోటులాయె వగపు మిగిలె!
ముందుచూపులేక ముప్పన్నదియులేక
ఉడుత వోలె గపుడు ఉరుకులాడి!
మందుమాంసమందు మర్యాదతెగజూపి!
కండె ఆడదాయె కర్మమేమొ!
చప్పుడులేదునిప్పుడును సాగని మగ్గము పూట కూటికై
అప్పుల ఊబిలోదిగియు అమ్ము డువోతిని ఆత్మ శుద్దిగా
తప్పని పూటపస్తు కను దమ్ముల కార్చగ నీరులేదుగా
ఎప్పుడు తీరునో వెతలు ఏమని
చెప్పుదు ఎందుబోదునో ?
మగ్గము గుంటలొ జొరబడి
దగ్గును దిగమింగుకుంటు దండిగ నేయన్!
అగ్గువనడిగిరి చీరెలు
సిగ్గుగ చీత్కారమాయె చేనేతలకున్!
✍️డా.పాండాలమహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి
5
[26/05, 8:27 PM] Vakula Vasu: కవితా గానం
వకుళ వాసు
హన్మకొండ
అంశం- చేనేత వస్త్రాలు
శీర్షిక-🍃బతుకుబాటకు చలువనేస్తం🍃
ఎన్కట తాతముత్తాతలందరి భుజాన తెల్లపంచె రంగు రంగుల అంచులతో ఎంత హుందాగ హోయలు బోయేదో...
ఊళ్ళె శాలోళ్ళు చక్కని పంచెలు నేశెటోళ్ళు చేనేత మగ్గంపైన...
ఎటువంటోళ్ళకైనా బయటికెల్తె కండువా భుజానుండాల్సిందే
దొరల పంచె ఠీవితో ఉట్టిపడేది రచ్చబండ కాడ పంచాయితి చెప్పడానికెళ్ళేటప్పుడు వాళ్ళ పటాటోపమే వేరు...
దొరలు కర్ణాలు పట్వారులందరు తెల్లదోతి కట్టి మల్లెపూలసోంటి సల్వ లాల్చి తొడిగి భుజాన కండువేసుకొని...
కిర్రుచెప్పులేసుకొని చేతిల వెండితొడుగు కర్ర పట్టుకొని ఊళ్ళె నడ్సుకుంట పోతాంటె ఆ డాబూ దర్పమే వేరు...
ఇగ రైతన్న భుజాన ఎర్రపంచె ఎల్లవేళలా వీడని నేస్తమై అరక భుజాన చేరినప్పుడు భుజంపైన ఒత్తుకపోకుండ వుంటది...
పొలం దున్నేటప్పుడు నెత్తికి చుట్టుకొనే చలవబట్టైతది సద్ది మూటిప్పుకొని తినేటప్పుడు కాళ్ళుచేతులుకడుక్కున్నంక తుడుసుకునే పంచైతది...
కాసేపు పొలం గట్టుకాడ ఒరిగినప్పుడు తలకింద దిండైతది
పొలంల పనిచేసేటప్పుడు చెమటపడితే తుడిచే తుండైతది...
ఊళ్ళె నడ్సుకుంట పోయేటప్పుడు పెద్దోళ్ళెదురైతే భుజంపైనుంచి సంకల జేరి మర్యాదిస్తది...
తెల్షినోళ్ళు సచ్చిపోతె కండ్లనీళ్ళు తుడిచే తుండైతది తుమ్మినా దగ్గినా మొకంమీద చేరి దాపునిస్తది...
బాగ మాషిపోయినంక మష్షిబట్టైతది ఇంకా చీకిపోయినంక అల్కుపిడిసైతది
మనిషి ప్రాణం బోయినంక ఒంటిమీద చేరి తనతోనే తనకుతోడుగా కాలి బూడిదైతది....
అందుకే పంచె మనిషి నాగరికతకు అల్లుకుపోయిన దారపుకండై బతుకుబాటలో నేస్తమైంది చేనేతవస్త్రమై...
🍀🌹వకుళ వాసు🌹🍀
6
[26/05, 9:05 PM] Mahender Javvaji: కవితాగానం
అంశం .చేనేత వస్తా)లు
పేరు మహేందర్ జవ్వాజి
$$$$$$$$$$$$$$$$$$$$$$
విదేశీ వస్తు బహిస్కరణ
స్వదేశీ వస్తూ వాడకం అని
అనాడె అనెను గాంధీజీ
కళారూపాలు ఎన్నున్నా వస్తా)
నేతన్నల అదే బతుకు దెరువాయె నూలు పోగు దారముగా ఒడికి...
గీతన్న రైతన్న నేతన్నలకు తరాలు మారిన వారి వృత్తిని మరువక అందరికీ ఆదర్శమాయె...
సంసృతి సాంప్రదాయం నిలువెత్తు నిదర్శనం మన నేతన్నల వస్త)నేత..
స్త్రీ పురుష కట్టు బొట్టు లో వారి కళలను జీవనోపాధి కై సాగుతోంది తమ పయనం,.
7
[26/05, 9:23 PM] Tulasi Venkata Ramana: కవితా గానం:
పేరు: తులసి వెంకట రమణా చార్యులు.
అంశం: చేనేత వస్త్రాలు
శీర్షిక: నేతన్నకు అక్షర నీరాజనాలు
చే"నేతన్నల" కాయకష్టం సహకారభావమే నూలు పోగు ల వస్త్రం..
ముడిపత్తిని శుద్ధి చేసి ...నూలు వడుకుతూ...
మరమగ్గం పై సాలే వారు ఆడించు కళా నైపుణ్యమే మేలు చాట్ వస్త్రం..
ప్రతి గ్రామంలో...పట్నంలో నాడు వన్నెతెచ్చిన కట్టు చేనేత వస్త్రమే సుమా!!
మనిషి రంగు ఏదైనా ..దేహానికి అలంకారం తెచ్చిన వస్త్రం చేనేత వస్త్రమే నేస్తం అయింది.
సాలే వారు వృత్తిగా స్వీకరింకరించి...
రక్తాన్ని మరిగించి ...ఆకలి దప్పికల్ని మాని నూలు వడుకుతూ....
పని మీదే జాస పెడుతూ జానెడు పొట్టకోసం.. నరక యాతనలు పడే అభాగ్యులు వారు..
వస్త్రం నేసే నేతన్న ఎప్పుడు అర్ధనగ్న ప్రదర్శనే...
వస్త్రం నేసి ఇవ్వడమే తెలుసు..
వేసుకునే తీరిక లేని ఆకలి రాజు ఆరాటం పనే తప్ప వేరే జాసే లేదు...
తెలంగాణ రాష్ట్రం లో చేనేతకు పెట్టింది పేరు..గద్వాల సిరిసిల్ల... మరెన్నో కేంద్రాల్లో
నేతన్నల లఘు కుటీర పరిశ్రమలతో..శ్రమిస్తూ.. జీవన విధానాన్ని సాగిస్తున్నారు...
అరుదైన గౌరవాన్ని గడించిన మన చేనేత కార్మికుల కష్టాలు తొలగాలని..
చేతి వృత్తులల్లో పూర్వ వైభవం రావాలని ఆకాంక్షిస్తూ..
నేతన్నల నా అక్షర నీరాజనాలు ఇవ్వే🙏
8
[26/05, 9:29 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం
పేరు:కొలచన విజయ భారతి
ఊరు: హైదరాబాద్
అంశం: చేనేత వస్త్రాలు
కవిత సంఖ్య:2020
*************************
చేనేత కార్మికుల చేతినుంచి
జాలువారిన వలువలు
నేతలలో ఎన్నెన్నో పడుగు పేక
కలబోతల అందాలు
విరబూయించిన హస్త కౌశలానికి సాక్ష్యాలు
వారి హస్తాలు నేసిన
నేతలు మాత్రం వారి తలరాతలు మార్చటంలేదు
సరైన ఆదరణ లేక వెతలపాల్చేస్తున్నాయి
అందరికీ చీరలు నేసే వారి
ఆడవారి ఒంటికి కరువైన
కట్టు గుడ్డలు
నోటికి నాలుగు మెతుకులు
దక్కని కూటి కష్టాలు
చేనేత పరిశ్రమకు సరైన ఆదరణ లేక , ఆటుపోట్లు
భరించలేక ప్రాణాలు కోల్పోతున్న బడుగు
కార్మికులు
నేత వస్త్రాలకు విలువ కాపాడుదాం
నేత కార్మికుల బతుకులను
చేయూతనిద్దాం
☘️☘️☘️☘️☘️
9
[27/05, 8:05 PM] Korada: ానం
నేటి అంశం:-
* చే నే త వస్త్రాలు *
కోరాడ నరసింహా రావు;
"మనందరిబాధ్యత"

10
[27/05, 8:42 PM] దీపక్ న్యాతి: *ఓ చిరు కవిత*
పేరు:డా.దీపక్ న్యాతి
శీర్షిక : అనుకుంటే కానిది ఏమున్నది?
మానవుని మస్తిష్కం లో నిక్షిప్తమైందే
మనిషికి స్ఫురిస్తుంది సహజంగా
ఏదైనా అనుకున్నాడంటే
అది మస్తిష్కానున్న ఆలోచననేగా
ఉన్నదాన్నే వెలికి తీసి ఆలోచిస్తున్నాడు
తెలిసిందే కనుక జరగందంటూ ఏదీ లేదనేగా
అసాధ్యమైందేది తన తలపుకు రాదనేగా
సృజన ఆంటీ కొత్తగా వెతికిందే కానీ
కొత్తగా సృష్టించింది ఏదీ లేదు
ఉన్నదే తిరిగి ఉత్పన్నం అవుతుంది గనుక
అనుకుంటే కానిదేది లేదు..!
డా.దీపక్ న్యాతి
సినీ రచయిత దర్శకుడు
నంది అవార్డు గ్రహీత
9849488837
11
[27/05, 9:09 PM] +91 99633 77273: కవితా గానం
అంశం : చేనేత వస్త్రాలు
పేరు : పోలా కిషోర్ కుమార్
శీర్షిక : చిరిగిన చేనేత
కాలం పరుగులతో మార్పులు తెస్తుంది
ఙ్ఞాపకాలను మరుగున పెడుతుంది
లోకం పోకడ ఎప్పటికప్పుడు అధునికతను అందిపుచ్చుకొని సాంప్రదాయల మీద దాడి చేస్తూనే ఉంటుంది.
ఈ క్రమంలో ఆటుపోట్లకు గురైన రంగాల్లో
చేనేత కూడా ఒకటి.
గ్రామీణ భారతంలో జీవనోపాధికి వ్యవసాయం తరువాత చేనేత రంగమే ముఖ్యమైనది.
విపరీతమైన ప్రపంచరీకరణ పోటీని తట్టుకొని చేనేతను నమ్ముకున్న ఎన్నో కుంటుంబాలు నేటికీ తమ కులవృత్తిని కంటికిరెప్పలా కాపాడుకుంటున్నాయి.
ప్రపంచంలో మన దేశ చేనేత కళ చాలా ప్రసిద్ధమైనది అగ్గిపెట్టలో పట్టేంత చీరను నేసిన కళ మన సొంతం కుట్టు లేకుండా వస్త్రాలను నేయడం చేనేత గొప్పదనం.
ప్రపంచానికి నాగరికత తెలియని సమయంలోనే పట్టు పీతాంబరాల దేవతా వస్త్రాలు నేసిన యుగయుగాల చరిత్ర ఉన్న మన చేనేతదన్న మాట ఎవరూ కాదనలేని నిజం.
బ్రిటీషు సామ్రాజ్యాన్ని గడగడలాడించన స్వాతంత్రోద్యమంలో చేనేత రంగానిది మరువలేని పాత్ర ఉవ్వెత్తున లేచిన స్వదేశీ ఉద్యమంలో విదేశి వస్త్రాలను తగులబెట్టిన రోజు 1905 అగస్టు 7 నేడు అంతర్జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణించబడుతుంది
మన చేనేత రంగం దేశానికి గర్వకారణం
చేనేత వస్త్రధారణ మనకు ఆరోగ్యకరం
మదికి ఉల్లాసం చూపులకు హుందాతనం
ప్రత్యక్ష పరోక్షంగా ఎన్నో కుటుంబాలకు జీవనాధారం
అలాంటి పరిశ్రమ నేడు తిరోగమనంలో ఉంది
మరమగ్గాల ధాటికి చేనేత మగ్గాలు అటకెక్కి మూలుగుతున్నాయి చేనేతరంగాన్ని నమ్ముకొని దేశ ప్రగతికి వెన్నుముకై గొప్పగా బతికిన బ్రతుకులు నేడు నిరాధరణకు గురై చిరిగిన చేనేత బ్రతుకులతో కూలి పనులు చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నారు
ఇకనైనా మనమందరం కళ్ళు తెరిచి చిరిగిన చేనేతకు పూర్వవైభవాన్ని తేవాలి చేనేత బ్రతుకుల్లో చిరునవ్వుల పూవులు పూయించాలి
12
[28/05, 8:37 PM] Muvva Prasad: ప్రత్తి తెచ్చి మీరు పడి పడి శుభ్రపరిచి
నూలు దారమెంతో నైపుణ్యముతో తీసి
మగ్గములతో నేసి మైమరిపించెదరు
నేతకార్మికులారా నమస్సుమాంజలి మీకు
హస్త కళలయందు అంతర్భాగమది
మగువలందరి మనసు మరిదోచునది
విశ్వమందు నది విరాజిల్లుచున్నది
చిద్విలాసము చేయు చేనతవస్త్రమై .
మువ్వా ప్రసాద్ఉ
తుకువారి వెతలు వెరవవెవ్వరికి
ఇస్త్రీ చేయువానికి ఇబ్బందులెన్ని ఐన
వంటిపై నున్నచో వన్నె తెచ్చును నీకు
చెప్పలేము దానిసోకు చేనేతవస్త్రంబది .
[28/05, 8:37 PM] Muvva Prasad: కడలి దాటి వత్తురు కంచి పట్టుకొరకు
పోయి వచ్చిరంటే పోచంపల్లికి
ఇక్కతు చీర లేని ఇల్లైనా ఉండదు
చెలియ మనసునైనా దోచు చేనేత వస్త్రంబు .
[28/05, 8:37 PM] Muvva Prasad: కులవృత్తులోదుకోలేక కృంగిపోతున్నారు
మగ్గమేయువారు మసకబారుతున్నారు
పోటీ ప్రపంచములో పొట్టెట్ల నిండునో
బేరమాడి కొనుట మీకు భావ్యమ్ము కాదు
[28/05, 8:37 PM] Muvva Prasad: ఉపవాస దీక్ష బూని వడుకుతారు వారు
దివ్యమైనటువంటి దేవతా వస్త్రంబులు
అగ్గిపెట్టలో దాచే అద్భుత వస్త్రమ్మును నేచిన
నేతన్న నైపుణ్య మేరీతి వర్ణించగలను
13
[28/05, 8:58 PM] Balloori Umadevi Poetess: కవితా గానం
డా. బల్లూరి. ఉమాదేవి
అంశం ,: చేనేత వస్త్రాలు
ప్రక్రియ వచన కవిత్వం
భారతీయుల ప్రతిభను చాటే వస్త్రాలు తణుకు హితమును కోరి చేయవే మరమగ్గాలపై వేసినవి పలు రకాలుగా సాయపడే అపురూపమైన వలువలివి
పంచైనా కోకైనా పల్లె వాటైనా
ఒంటి చెమ్భను పీల్చి హాయిని కూర్చే దేవతా వస్త్రాలంటే ఇవే సుమా
గాంధీ తాత మెచ్చిస్వయముగ
వడికిన చేనేత ఇది
పత్తి లోని గింజలు తీసి
నూలు వడికి దారం తీసి
రంగు రంగుల మేళవింపుతో
కళాకారుల ప్రతిభను చాటే వలులివే
అగ్గిపెట్టెలో ఆరు గజాల చీర లేని
ఇమిడిన చేనేత ఇది పలు విధాలుగా ఉపకరిస్తూ నేతన్నలకు కీర్తిని పెంచే
అపురూప కళాఖండాలీ వస్త్రాలు
పాశ్చాత్య వ్యామోహంలో పడి
కాల గర్భంలో కలిసి పోకుండా
కాపాడాల్సిన తరుణమిదే
నేతలు నేతన్నల నాధరించే
సుదినం కోసం ఎదురు చూద్దాం
14
[28/05, 9:12 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..చేనేత వస్రాలు
శీర్షిక..ప్రధాన భూమిక
నేతన్నల కళా నైపుణ్యంతో
జాలువారిన చేనేత వస్రాలు
ఆకర్షణీయమైన రంగులలో కనువిందు చేస్తూ
హుందాతనాన్ని కలుగజేస్తూ
శరీరానికి చల్లదనాన్నిచ్చే
ఆరోగ్య రక్షణ కవచాలు
తరతరాల వారసత్వ సంపదలు
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రధాన భూమికగా
అహింసా ఉద్యమానికి నాందిగా
విదేశీ వస్త్ర బహిష్కరణ లక్ష్యంగా
గాంధీజీ స్వయంగా చారఖా తిప్పి
ఖద్దరు వస్రాలనే ధరించి
స్వాతంత్ర్య పోరాటం ఉధృతం చేసి
చేనేత వస్రాలు ఘనత కెక్కినా
నేడు ఆధునికీకరణ పేరుతో
ఆదరణకు నోచుకోకుండా
నేతన్నల బ్రతుకులు చిన్నాభిన్నమై
ఆకలి చావులతో
కుటుంబాలు రోడ్డున పడుతున్న దీన స్థితి
ఆదరిద్దాము చేనేతను
రక్షించుకుందాం నైపుణ్యం ఉన్న నేతన్నలను
చేనేత కీర్తిని ప్రపంచానికి చాటుదాం.
15
[28/05, 9:28 PM] Sarphraj Anwer Poet: 🌸 *కవితాగానం సమూహం..*🌸
అంశం : చేనేత వస్త్రాలు
శీర్షిక. : చేష్టలూడిన చేనేత..
🌸 *చేష్టలూడిన చేనేత ...*🌸
అలనాడు ప్రజాజీవితంలో వెలుగులీని
ఎన్నో కుటుంబాలకు ఆధారం కల్పించిన
కులవృత్తులు నేడు *కార్పోరేట్ కర్కశ రక్కసి* పాదాల క్రింద నిర్దాక్షిణ్యంగా నలిగి ప్రభుత్వాల నిర్లక్ష్యాలకు నిర్వీర్యం చెంది కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి..
ఎన్నికల సమయంలో *చేనేత* ముందు, వెనకాల అంటుకొని తిరిగే *నేతలు, అధినేతలు*
వారి వృత్తి భవిష్యత్తుకై గుప్పించే హామీలు, వాగ్దానాల మూటలు..
ఓట్ల వరకే వారి హామీల తూటాలు
కోటలు దాటే మాటల కోతలు
ఆ తర్వాత నేతన్నల దుర్భరజీవితాల్లో
మానసికంగా కుంగుబాటు, శారీరక వెతలే..
పురాతన *చేనేత మగ్గానికి* నూతన సొబగులద్ది, విరచిస్తే వినూత్న చేనేత వస్త్రాలు
*ఆధునాతన యంత్రాల్ని* జోడించి
ఆధునిక వస్త్రాల్ని ఉత్పత్తిచేస్తే
వారి నిశీధి జీవితాన కల్గు సంపాదన వెలుగులు..
చేనేత కార్మికుల జీవితంలో వెతలన్నీ
తీర్చి వారి *జీవితపు చిరుగుల్ని* అతికించి
మానసికంగా మ్రగ్గిన, ఆర్థికంగా
చితికిన వారిలో *చేతన* నింపి చేయూతనిచ్చేదెవరో..?
*వన్నెతగ్గిన* చేనేత కార్మికుల బతుకుల్లో
*సప్త వర్ణాలు* అద్ధి
బలహీనపడిన ఆ చేనేత దారానికి
బలాన్ని చేకూర్చేదెవరో...?
వారి యాతనలను తీర్చి, వారికై *చింతనలు* చేస్తూ *చేతలు* చేసే ప్రభుత్వమెటువైపు..?
దుర్భర జీవితంలో కటిక దారిద్య్రంలో మ్రగ్గే కార్మికులకు *ఆత్మహత్యలతో* మరో రేపు...?
*సర్ఫరాజ్ అన్వర్..✍🏻*

Comments
Post a Comment