సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ
సహకారం ః మెరుగు మధు
అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు
***************
1.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
2.దిడ్డి మారుతి గారు
3.కోరాడ నరసింహా రావు గారు.
4.ఐతగోని వెంకటేశ్వర్లు గారు
5.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
6.వురిమళ్ళ సునంద గారు
7.వల్లాల విజయ లక్ష్మి గారు
8.మర్రి జయశ్రీ గారు
9.వరయూరు జానకి రాం గారు
10.దీపక్ న్యాతి గారు
11.పాల్వంచ హరి కిషన్ గారు
12.మర్రి జయశ్రీ గారు
13.కోరాడ నరసింహా రావు గారు
14.కాల్వ రాజయ్య గారు
***********
1
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:13-5-2020
అంశం:హే రామ్
ప్రక్రియ: వచనకవిత్వం
శీర్షిక:రామం భజే
**************************
అతివాదుల ఆలింగనంలో
మహాత్ముని ఓంకార బీజం
మితవాదుల నిర్లిప్తతలో
మిన్నంటిన ఆర్తనాదం
జాతినంతటిని జన్మరాహిత్యానికి
గురిచేసిన శోకనాదం
శాంతి,అహింసలకు బహుమానం
సత్యం, నిజాయితీలకు నమస్కారం
నిలువెత్తు నిరాడంబరతకు అతికిన బాణం
స్వేచ్ఛావాయువులకు అంటిన రుధిరం
గుండెను చీల్చిన అసహనం
వేదభూమిపై చిందిన స్వచ్ఛ సాకేతం
దుఃఖాశ్రువులు తుడిచిన హృదయ నినాదం
కొల్లాయిగట్టిన కీర్తిశేషి జపం
ఆంగ్లేయులను తరిమిన సాధుజీవి మంత్రం
రామనామ శ్వాస వినిర్గమం
ప్రజాస్వామ్య తంత్ర సాకేతనామం
రఘుపతి రాఘవ రాజారామ్
పతీతపావన సీతారామ్
ఈశ్వర్ అల్లా తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్.
2
[📓 *చదువు* 📓📚
******************
మనిషిని మనిషిగ
గుర్తిస్తుంది చదువు,
బతుకునకు బాట
చూపు తుంది చదువు,
తన, పర భేదాలు
నేర్పుతుంది చదువు,
సంస్కృతి నెల్లను
తెల్పుతుంది చదువు,
సాంప్ర దాయాన్ని
విప్పుతుంది చదువు,
ధర్మా ధర్మాలను
సూచిస్తుంది చదువు,
తల్లి దండ్రుల ఋణము తీర్చు
మార్గము సూపునీ చదువు,
గురువు గొప్పదనము
విప్పి జెప్పునీ చదువు,
లోక జ్ఞానము సంపదగా
సమకూర్చి పెట్టునీ చదువు,
పేగు బంధముల బలిమిని
గుర్తు చేయునీ చదువు,
బండబారిన మనసులను
కరిగింప జేయునీ చదువు,
కండబలపు దోపిడిని
కరిగించునీ చదువు,
మనిషిని మనీషిగ మార్చు
శక్తి సమూహమే చదువు,
*చదువు విలువ తెలుసుకో
చైత్యుడవై మసలుకో.*
•••••••••••••••••••••••••
దిడ్డి మారుతి,
కంగ్టి.
°°°°°°°°°°°°°°°°°°°°°°°
3
అంశం:- హే రామ్...!
కోరాడ నరసింహా రావు ;"దివ్యమంత్రం"
************
పలుకగనే...పరమపదమును ప్రసాదించే
పవిత్ర మంత్రం ....,
హే రామ్...!
గాంధీజీ ఆధ్యాత్మిక జీవనమునకు సాక్ష్యం చెప్పిన మంత్రమిది !
హే రామ్! అంటూ దేహత్యాగం ...!
అనితర సాధ్యం...!!
యోగులు.. హృదిలో నిత్యంజపించుదివ్యమంత్రం హే రామ్ !
మనసున దలచి...
నోట భక్తితో ఉచ్ఛ
రించిన చాలును
కైవల్యముప్రాప్తినుంచి తీరును !
హనుమ తనువు లోని అణు వణువూ
ప్రతిధ్వనించు...
పావన మంత్రం ,
హే రామ్...!
భక్తులకు శక్తి ,ముక్తి ప్రదాయిని ఆ శ్రీరాముని*హే రామ్*
దివ్య మంత్రం...!
భవసాగరమును
తరింప జేయు
నావకదా శ్రీ రామ మంత్రం...!
హే రామ్! అనిపిలిచి నంతనే ...చేయందించి చింతలు దీర్చును
ఈ రామ మంత్రము!
*****************
.........కోరాడ.
4
[13/05, 9:03 PM] I వెంకటేశ్వర్లు: మంజరీద్విపద
మకుటాలు లేనట్టి మాధవుల్ గురులు
పరిమలంబును చల్లు వారు విద్యార్థి
గణములు దీపమౌ జ్ఞానంబు చమురు
లేనట్టిది బడియె ప్రేమలగుడియె
ఊరు చివర వెల్గు నుద్యానవనమది
జ్ఞానరత్నాలిడు జ్ఞానవారాశి
బలమైన పిల్లర్లు బాగుగా గల్గి
సున్నంబు ఠీవిలో చూడనైరావత
మదియోచు దోచు మహాద్భుతంబౌచు
ఆకాశము గొడుగు నౌవానకాల
మదిరాగ వర్షానుబంధంబు చాల
గల్గి కార్చునెపుడు కన్నీరు కాని
తనహృదయంబున తనరి మేకులను
దింపినన్ బాధలతెంపరలోర్చి
బయటకు చెప్పక బయటకు మమ్ము
తరమలేదదికాదె తల్లిదౌ ప్రేమ
తల్లి యొడికినన్న తనయొడిలోనె
మాజ్ఞాపకాలన్ని మనుచుండె ఘనము
దెబ్బలాడుకొనిన దెబ్బలన్ తిన్న
గురువులబెత్తాల కొంటె చేష్టలను
చేదు జ్ఞాపకములు చెప్పగానపుడు
మధురమౌ జ్ఞాపకాల్ మరియిప్పుడవియె
మరల మరలరుచి మంతమౌనట్టి
మధురంపు గుళికలౌ మాకెప్పుడవియె
తనవిశాలపు నొడి తాచేర్చుకొనుచు
బంగారు వేదికన్ బాల్యాన యిచ్చె
మాయల్లరి భరించి మాహృదయంబు
నవ్యమౌ క్షేత్రాన జ్ఞాన బీజాలు
నాటి నాటి యలసి నాటంగలేక
భూమాత యొడియందు మూర్ఛిల్లి నేడు
శాశ్వత నిద్రకున్ జారిపోయెనుగ
ఒకసారి తనయొడినొదిగి పోవలెను
అనియున్న మనసులో నరయంగనదియె
నిజము కానిదియైన నిద్రగానదిమాకు
మిగిలిపోయెను నేడు మేలిమిన్ బంచి
5
డా. బల్లూరి ఉమాదేవి
అంశం :హే రామ్
భక్తిని పెంచే పావన నామం తాపము లణచే దివ్య నామం
అహల్యాదులను కాచిన నామం
శబరికి ముక్తిని ఇచ్చిన నామం
సతికి శివుడు ఉపదేశించిన నామం
యుగాలు మారినా మహిమలు తగ్గని పవిత్ర నామం
బాపూజీ నోట నానిన నామం
బాధలోనూ ఆశ్చర్యం తోనూ అనాలోచితంగా అందరి నోట వచ్చే నామం కలిమిని బలిమి ని పెంచే నామం
హనుమలో అణువణువునా నిండి న నామం
సుగ్రీవుని కాపాడిన నామం విభీషణుని బ్రోచిన నామం
త్యాగరాజు నాలుక పై నడయాడిన నామం
రామదాసును కరుణించిన నామం
హే రామా-- నీ నామ స్మరణం మధురాతి మధురం జపిద్దాం నిరంతరం
6
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
శీర్షిక::హే రామ్..!
-----------------------------------
చివరి నిముషంలోనూ
మోములో వెలుగులీనుతూ అదే ప్రశాంతత!
గుండెల్లో తూటా దిగినా
పెదవులు చలించకుండా పలికే .రామ నామ స్మరణ!
హృదయంలోంచి అదే క్షమా ప్రార్థన
హే రామ్! శత్రువునుక్షమించమంటూ
నేల కొరిగిన జాతి పిత కంఠ స్వరం
ప్రపంచమంతా ప్రతిధ్వనించింది!
ఉన్మాది చేసిన ఘాతుకంతో
తల్లడిల్లిన భారత మాత హృదయం దుఃఖాశ్రువులతో అంజలి ఘటించింది!
విశ్వమానవ లోకం అంతా
అఖండ భారతావనిపై ఉదయించిన
మహాత్ముని తలుస్తూ
మానవ రూపంలో అవతరించిన
దైవ స్వరూపాన్ని
రేపటి తరం నమ్ముతుందో లేదోనని సందేహం వ్యక్తం చేసింది!
సత్యం,అహింసల శాంతి కపోతం
సహనం ఓర్పు ల నిలువెత్తు రూపం
సత్యాగ్రహంతో సాధించిన స్వాతంత్ర్య ఫలితాలతో..
గాంధీజీ ఔన్నత్యాన్ని
లోకానికి చాటిన హే రామ్! మంత్రం
మన వేదభూమి పై విలసిల్లిన రామాయణ గ్రంథ పారాయణమై
నిత్యం మన మనసులను
ప్రక్షాళితం చేస్తూ.
మానవీయ విలువల పాదులను
వాడి పోకుండా సాదుతోంది!
**
7
[14/05, 8:07 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:*****హే రామ్***
--------------*********-------
అజేయ రామబాణంతో సమానాయుధం
ఏకైక అహింసాయుత రామనామం
కష్టసుఖాల్లో సగటు మానవుల
పెదాలు పలికేమంత్రం*రామరామ
సదాచార సంపన్న చక్రవర్తి
మోహందాస్ కరంచంద్ గాంధీ
అద్భుత దేశభక్తుడే కాదు
అర్థవంత భక్తిపరుడు కూడా
గాంధీజీ చేత భగవద్గీత గ్రంధం
బాపూజీనోట రామనామ కీర్తనo
సబర్మతి ఆశ్రమంలో రామభజనం
సత్యాగ్రహి హృదయంలో రామస్మరణం
మతదురహంకారి చేతుల హతమౌతు
అసంకల్పితoగ మహాత్ముడి హృదయం
పలికినపదం పెదాల వెంట అస్పష్టమయ్యే
*హే రామ్* ఆధ్యాత్మిక పద సంపదై
జాతిపిత చివరివిడిది రాజ్ ఘాట్
స్మారక ఫలకంపై లిఖించబడిన పరమ పవిత్రపదం *హే రామ్* ధ్వని-
గాంధీజీ హృదయనాథానికి ప్రతిధ్వని
*వల్లాల విజయలక్ష్మి*,,ఆలేరు
8
[14/05, 8:30 PM] మర్రి జయశ్రీ: కవితా గానం
మర్రి జయశ్రీ
అంశం..హే రామ్
భక్తిని పెంచి
భయమును పోగొట్టు భవ్యనామం
కోపతాపాలను నిగ్రహించి
మనసును శాంత పరిచే దివ్యనామం
ధర్మ మార్గమున నడిపించే
పరమ పవిత్ర నామం
కష్టాలను కన్నీళ్ళను దూరం చేసి
శాంతి సౌఖ్యాలను ప్రసాదించే
సుమధుర నామం
సామాన్యుడిని అసమాన్యుడిగా చేసిన నామం
శ్వేత ముఖుల తరిమికొట్టి
భారత మాత సంకెళ్ళు తెంచి
స్వాతంత్ర్య ఫలాలు అందించిన శక్తి వంతమైన నామం
గాడ్స్ తాటాకు నేల కోరుగుతూ
మహాత్ముడు హే రామ్అని
ప్రాణాలు విడుస్తూ పలికిన నామం
రాజ్ ఘాట్ లో చెక్కబడి
చేదిరిపోని నామం
మనసులోని మాలిన్యాన్ని తొలగిస్తూ
మానవతా విలువలను అందిస్తూ
మానవాళికి ఆదర్శంగా నిలిచిన మహాత్ముడు కడదాకా పలికిన తరకమంత్రం
ఎల్లప్పుడూ స్మరించే మంత్రం
జీవితాలను సుసంపన్నం చేస్తుంది.
9
[14/05, 8:42 PM] వరయూరు జానకిరామ్ తెలుగు పండిట్ స్థానికత :యాదాద్రి పనిచేయు పాఠశాల: జి ప: కవితాగానం🌹
అంశం: హే రామ్
శీర్షిక: వర్తమాన పరిస్థితి...
పిల్లాపాపలను
సంకనేసుకొని
కిలోమీటర్లకొద్దీ
నడకదారుల సొంతూళ్లకెళ్తున్న
వలసకూలీల
బ్రతుకు చూస్తే
ఎవ్వరికైనా అనిపిస్తుంది
'హే రామ్' అని...
మిద్దెలు మేడలు
కార్లు షికార్లు
మందీ మార్బలం
హంగూ ఆర్భాటం
అధికారం దర్పం
అన్నీ ఉండి
కరోనాతో చనిపోతే
ఎవ్వరికైనా అనిపిస్తుంది
'హే రామ్' అని...
ప్రేమ అనురాగం
ఆప్యాయత అనుబంధం
మమత కరుణ
అన్నిటినీ ఎడబాపిన
కరోనాను చూస్తే
ఎవ్వరికైనా అనిపిస్తుంది
'హే రామ్' అని...
ఒక చిన్న వైరస్
ప్రపంచాన్ని అతలాకుతలం
చేసి లక్షల్లో ప్రాణాలు
హరిస్తుంటే
లోకం చేష్టలుడిగిన
వైనం చూస్తుంటే
ఎవరికైనా అనిపిస్తుంది
'హే రామ్' అని...
ప్రపంచ శాంతిసౌభాగ్యాలు
సదా పరిఢవిల్లునట్లు
లోకాన్ని అమృతతుల్యం
చేయుటకు రావాని
ఎవ్వరికైనా అనాలనిపిస్తుంది
'ఓ రామా' అని...
🌹🌹🌹🌹🌹
నమస్సులతో,
✍️వరయూరు జానకిరామ్
10
[14/05, 9:08 PM] దీపక్ న్యాతి: కవితా గానం
అంశం : హే రామ్
తేది : 14-05-2020
పేరు : డా.దీపక్ న్యాతి
శీర్షిక : బంధాతీత బంధము
రామ రామ రామ రామ
రామ నామము జపించ రమ్మంటే రామా
ఆనందమెచ్చిన ఆపదొచ్చినా తలచేము
రామ రామ హే రామ అని
రామా అనీ ఎదురుగున్న వారిని పిలిచేము
హే రామ అని కనబడని సర్వాంతర్యామిని
తలచేము వలచేము నువ్వే దిక్కని కొలిచేము
సాయం కోరిన హే రమే
సాయి మందిన సంతోషాన హే రామే
ఉన్నాడన్న నమ్మకంతోనే హే రామే
హే రామ్ అంటే బంధాతీత బంధము
హే రామ్ అంటే అనురాగం ఆత్మీయత
హే రామ్ అంటే స్నేహ భావము
భవబంధాలు మోయాలన్నా హే రామే
భవబంధాలు వీడాలన్నా హే రామే
విరక్తికీ విరహానికీ విరామానికీ హే రామే
ఆయుష్ఫు అంతిమాన హే రామే
చివరి ఆశ శ్వాస వదిలినా హే రామే
ఈ జగన్ని త్యాగం చేయాలన్నా హే రామే
మోక్షం కోరుకున్నా హే రామే
చావుపుట్టుకల ఆది అంతము హే రామే
రామ రామ రామ రామ
హరే రామ హరే రామ హే రామ
డా.దీపక్ న్యాతి
సినీ దర్శకుడు,నంది అవార్డు గ్రహీత
*****
[15/05, 8:42 PM] దీపక్ న్యాతి: కవితా గానం
అంశం : హే రామ్
తేది : 14-05-2020
పేరు : డా.దీపక్ న్యాతి
శీర్షిక : బంధాతీత బంధము
రామ రామ రామ రామ
రామ నామము జపించ రమ్మంటే రామా
ఆనందమెచ్చిన ఆపదొచ్చినా తలచేము
రామ రామ హే రామ అని
రామా అనీ ఎదురుగున్న వారిని పిలిచేము
హే రామ అని కనబడని సర్వాంతర్యామిని
తలచేము వలచేము నువ్వే దిక్కని కొలిచేము
సాయం కోరిన హే రమే
సాయి మందిన సంతోషాన హే రామే
ఉన్నాడన్న నమ్మకంతోనే హే రామే
హే రామ్ అంటే బంధాతీత బంధము
హే రామ్ అంటే అనురాగం ఆత్మీయత
హే రామ్ అంటే స్నేహ భావము
భవబంధాలు మోయాలన్నా హే రామే
భవబంధాలు వీడాలన్నా హే రామే
విరక్తికీ విరహానికీ విరామానికీ హే రామే
ఆయుష్ఫు అంతిమాన హే రామే
చివరి ఆశ శ్వాస వదిలినా హే రామే
ఈ జగన్ని త్యాగం చేయాలన్నా హే రామే
మోక్షం కోరుకున్నా హే రామే
చావుపుట్టుకల ఆది అంతము హే రామే
రామ రామ రామ రామ
హరే రామ హరే రామ హే రామ
డా.దీపక్ న్యాతి
సినీ దర్శకుడు,నంది అవార్డు గ్రహీత
11.
[15/05, 8:48 PM] పాల్వంచ హరికిషన్: కవితాగానం
తేది: 15-05-2020
అంశం: హే రాం
శీర్షిక: గుణపాఠం
కాలం..
జరిగేదానికి
సాక్షీ భూతం
అయినా మౌనంగా
హెచ్చరిస్తుంటుంది
జరుగబోయే
పరిణామాలకు
బాధ్యుడవు నీవని
అయినా వింటే కదా..
ఆయినా ఓదార్పుగా
శానిటైజరిచ్చి
పాపం కడుక్కోమంది
మాస్కునందించి
చెడు మాట్లాడొద్దంది
డిస్టన్స్ పాటించమని
దుష్ట స్వభావులకు
దూరంగుండమంది
అయినా వినిపించుకోక
చేసేదే చేస్తామంటే
కాలకూటంలో
కరిగిపోతామంటే
కరోనాలాంటి
ఉత్పాతాలతో
జీవుల మనుగడ
ప్రశ్నార్థకం చేస్తామంటే
హే రాం.. ఇంకనూ
గుణపాఠం నేర్వకుంటే
ఏం చేయగలం..!
ఎదురయ్యేదాన్ని
ఆహ్వానించడం తప్ప..!!
-- అర్జున(కలం)
పాల్వంచ హరికిషన్
రామన్నపేట, యాదాద్రి
9502451780
12.
[15/05, 8:55 PM] మర్రి జయశ్రీ: కవితా గానం
మర్రి జయశ్రీ
అంశం..హే రామ్
శీర్షిక..దివ్యనామం
భక్తిని పెంచుతూ
భయమును పోగొట్టు భవ్యనామం
కోపతాపాలకు తావులేక
నిగ్రహాంతో మనసును శాంత పరిచే దివ్యనామం
ధర్మ మార్గమున నడిపించే
పరమ పవిత్రమైన నామం
కష్టాలను కన్నీళ్ళను దూరం చేసి
శాంతి సౌఖ్యాలను ప్రసాదించే
సుమధుర నామం
సామాన్య మానవుని అసమాన శక్తి శాలిగా చేసి
శ్వేత ముఖుల తరిమికొట్టి
భారత మాత బానిస సంకెళ్ళు తెంచి
స్వాతంత్ర్య ఫలాలు అందించిన శక్తి వంతమైన నామం
మహాత్ముడు నిత్యం జపించిన
తారక మంత్రం
గాడ్సే తూటాకు నేల కూలుతూ
హే రామ్ అంటూ పలికిన చివరి నామం
బాపూజీ స్మారక స్థలం రాజ్ ఘాట్ శిలా ఫలకం పై చెక్కిన చెదిరిపోని నామం
నిత్యం జపిస్తే
మనసులోని మాలిన్యాన్ని తొలగించి
మానవతా విలువల్ని పెంచే అద్భుతమైన నామం
మహనీయులు గా తయారు చేసే రామ నామమే శాశ్వతం.
13
[15/05, 8:57 PM] Korada: కవితాగానం
అంశం:- హే రామ్ !
కోరాడ నరసింహా రావు;
పావననామ మంత్రం
*****************
నారాయణుడే....
నరుడై వచ్చి .....
పిలి పించు కున్న
పవిత్ర నామ మంత్రం
హే రామ్....!
పలికి నంతనే...
పాపముల నన్ని...
తొలగించుమంత్రము
హే రామ్...!
సాధనతో గాంధీజీ
ముక్తిని పొందిన
మహత్తరమoత్రము
హే రామ్...!
యోగులహృదిలో
నిరతము రమించు
తారక మంత్రము
హే రామ్...!
హనుమ తనువులో
అణువణువునా
ప్రతిధ్వనించును
హే రామ్...!
దశరధుండు తన
అసువులు బాసుచు
పలవరించిన నామము హే రామ్!
ఆ లంకాపతి నిద్దుర లోనూ కలవరిం చినది హే రామ్ !
భక్తులునిత్యము
కొలిచెడి నామం
ధరణిజ వదలక
తలచెడినామం
దోపిడీదొంగ...
రత్నాకరునివాల్మీకిగా
మార్చిన నామం
పవిత్ర గ్రంధము
శ్రీమద్రామాయణమును జగతి కొసగిన
దివ్యనామ మీ....
హే రామ్...!!
****************
........కోరాడ.
14
[15/05, 9:20 PM] Kalva Rajaiah: కవితా గానం
అంశం :హే రామ్
తేది :15/05/2020
పేరు :కాల్వ రాజయ్య
శీర్షిక : కరోన
హే రామ్ హే రామ్
నాడు త్రేతాయుగం లో
రావణుడును రాక్షస రాజు
అవని యందు మునులను దేవతలను పట్టి పీడిస్తున్నపుడు
చెడును చెండాడి మంచిని కాపాడడానికి
విష్ణుమూర్తి అంశతో రామావతారమెత్తి
మనిషికి విలువలు నేర్పి
ప్రజానురంజకంగా పరిపాలన సాగించి,
తల్లిదండ్రులకు తగిన గౌరవ మిచ్చి
అన్నదమ్ములకు అనుబంధం నేర్పి,
ఆలుమగలకు అనురాగము నేర్పి,
చెడును దునుమాడి క్షేమంగా రాజ్యాన్ని పరిపాలించావు.
హే రామ్ హే రామ్
మరి నేడు కలియుగంలో కరోన రక్కసి వచ్చి,
కలకలం సృష్టించి రాజ్యమంత పాకీ
మనుషుల పట్టి పీడిస్తున్న మహమ్మారి.
దేవుళ్ళ గుడులకు కూడా ద్వారబంధనము చేసి దేశమంత పాకింది.
అంతు లేని వ్యాధి ప్రసజలను అంత మొందిస్తున్నది.
ఈ జనాల బాధను బాపడానికి
కోదండ మెక్కువెట్టి
మరో అవతారంలో వస్తావని మొక్కుతున్నాము.
హే రామ్ హే రామ్
🙏🙏🙏🙏🙏🙏


Comments
Post a Comment