నిర్వహణ ఃవీరా గుడిపల్లి
సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ
సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ
అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం ః మెరుగు మధు గారు
**********************
1.కోరాడ గారు
2.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
3.సునంద వురిమళ్ళ గారు
4.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
5.కోరాడ గారు
6.అంబటి భాను ప్రకాష్ గారు
7.శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని గారు
8.విజయ దుర్గ గారు
9. కాల్వ రాజయ్య గారు
10. వల్లాల విజయ లక్ష్మి గారు
11. వై.కె.సంధ్యా శర్మ గారు
12.. మర్రి జయశ్రీ గారు
13.సర్ఫరాజ్ అన్వర్ గారు
14.పోలా కిషోర్ కుమార్ గారు
15.శివునూరి లలితా కృష్ణ గారు
16.సాగర్ల సత్తయ్య గారు
17.వేంకట కృష్ణ ప్రగడ గారు
18.పాల్వంచ హరికిషన్ గారు
19.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
**********
1
[19/05, 8:06 PM] Korada: కవితాగానం
తేదీ:19-05-2020.
అంశం:- భూతదయ
కోరాడ నరసింహా
రావు ;
* జీవ కారుణ్యం *
************
"ఆత్మవత్సర్వ
భూతాని.. !"
ప్రాణులకు పర్యాయ
వాచియైన భూతము
లే...జీవులన్నీ...!
అన్నీ పాంచ భౌతిక ములే...!
అన్ని భూతముల లో నూ,తనను...,తనలోనే అన్ని భూతము లనూ...చూడగల ఙ్ఞా ను లందరు !?
ఏ ఒక్కరి కైనా దయ నీయ పరిస్థితియే...
దురదృష్టకరం...!
అలాంటి వారిపై...
దయ,జాలి,కరుణ...
లాంటివి చూప లేక పోవటం ...దౌర్భాగ్యమే కదా...!
మనుషులమని చెప్పుకొనుటకు సిగ్గు వెయ్యదా....?!
మన భారతీయసనా
తనధర్మం పశువులు,
పక్షులేకాదు...చీమలు,పాముల పట్ల కూడా దయ జూప మని చెప్ప లేదా...!
అవీ...మనతోనే కలి సి సహజీవనం చేస్తు న్న ప్రాణులే...!
ప్రధానంగా మిగతా ప్రాణు లన్నిటి కన్నా
మనకువిశిష్ట స్థానం
వచ్చినది ఈ విచక్ష ణావివేకముల...
మూలముననే...!
సాటి మనిషి పట్లే...
దయజూపని మూర్ఖ మనుజులున్న రోజు లు...!
"నీ వలెనే నీ పొరుగు
వానినిప్రేమించుము"
క్రీస్తుచెప్పినదీ..యిదే!
దయగలహృదయమే...దేవాలయము!
మానవసేవే మాధవ సేవ కదా...!సాటి ప్రాణిని నిర్లక్ష్యం చేసి
గుడ్లు,గోపురాలు
తిరుగుతాం...!
భూతదయ వున్న వారు సకల దేవతల పూజలూ చేసి నట్టే!
****************
.......కోరాడ.
2
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:19-5-2020
అంశం:భూతదయ
ప్రక్రియ:వచనకవిత్వం
శీర్షిక:భూతప్రేమ
**************************
"ఆత్మవత్ సర్వభూతాని" అని
సర్వజీవులను సంభావించాలి
అహింసను ఆచరిస్తేనే అది
అనుభూతిలోకి వస్తుంది
రక్తమాంసాలతో వృద్ధిచెందిన
ప్రాణులు పరమాత్మ స్వరూపులు
సర్వభూతాల మనుగడకు
మానవత్వమే ఆధారం
సృష్డిలో జీవించేహక్కు సర్వప్రాణుల స్వంతం
స్వార్థం,ఆధిపత్యాల నడుమ
జీవవైవిధ్యం అతలాకుతలం
ఆలోచన గల మెదడు అమరిన
మానవజీవనం విశాలం కావాలి
సర్వభూతాల యందు సదయులై మెలగాలి
జనన,మరణాలు ఆ సర్వేశ్వరుని ఆధీనాలు
జననం,జీవనం,సంసారం,
సంతానం,పాలనం,మరణాలు
అందరికీ ఒక్కటైనప్పుడు ఇతర
ప్రాణులను చంపే హక్కు ఎక్కడిది?
ప్రేమే దయకు మూలం
ఆహార,వ్యవహార, అధికార,ఆధిపత్య ధోరణులతోనే అసమతుల్యం
బ్రహ్మ సృష్టి స్థిత ప్రాణికోటి
అనంతమైన ఆనందదాయకం
మానవాళి భూతదయనే దానికి
ఆధారం.
3
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
శీర్షిక::భూత దయ
::::::::::::::::::::::::::::::::::::
ఎంత గొప్పదో ఈ సృష్టి కర్త వైచిత్రి
అనంత కోటి జీవజాలాన్ని సృజించి
అడవులూ ఆహ్లాద అందాలను
అవనమ్మకు బహుమతిగా ఇచ్చాడు!
కంటికి కనిపించని సూక్ష్మ జీవిని
కళ్ళముందు కదలాడే ప్రాణికోటినిచ్చి
అన్నింటిలో తననే చూసుకొమ్మని
మహనీయ సందేశం ఇచ్చిన దేవదేవుడు!
సర్వకాల సర్వావస్థలో
తననే ధ్యానిస్తూ తననే వీక్షిస్తూ భూతదయను కలిగి ఉండమని చెప్పిన సర్వాంతర్యామి!
మనసు కఠినమై బాధించే వేళలో
మనో వీక్షణంతో సహానుభూతి
పొంది చూడమని మందలించిన స్వామి!
పశువు పక్షుల రూపంలో అవతరించి
సర్వజీవులూ సమానమేనని
బోధించిన సత్య స్వరూపుడు!
సర్వభూతాలను సమన్వయం చేస్తూ
సృష్టి స్థితులను నిర్దేశించిన మార్గదర్శి!
భూతదయ చూపిస్తేనే
పంచభూతాల ప్రకృతి పరవశించి దీవెనలిస్తుందని తెలిపిన దివ్య మూర్తి!
భూత దయను చూపుదాం
వాటి మూగ ప్రేమను పొందుదాం!
అంతా అవనమ్మ బిడ్డలమేనీ
వాటిని క్షేమంగా బతకనిద్దాం!
4
కవితా గానం
డా. బల్లూరి. ఉమాదేవి
అంశం : భూతదయ
ప్రక్రియ: వచన కవిత్వం
భూత దయను చూప పరమాత్మ హర్షించు
సకల ప్రాణుల యందు జాలి చూప కలుగునట్టి శాంతి అమూల్యం
"ఆత్మవత్ సర్వభూతాని" అంటూ
తనలాగే అన్ని అన్న భావన
కలిగిస్తోంది భూతదయను అపారంగా
మానవత్వమే మనిషి తత్వం గా
చూపాలి భూతదయ సకల ప్రాణుల పైన
'అహింసో పరమో ధర్మ 'అను సూక్తి
కావాలి మానవాళికి ఆదర్శం
తనకు లేకున్నా మానవత్వంతో బీదలకు సాయం చేసిన రంతిదేవుడు శరీర భాగం కోసి పావురాన్ని బ్రతికించిన శిబికి
వారసులుగా సాగాలి మనం నిరంతరం
పేరు కోసం కాక భూతదయను చూపాలి
మానవత్వం పరిమళించేలా చేయాలి
5
అంశం:- భూతదయ
కోరాడ నరసింహా
రావు ;
* జీవ కారుణ్యం *
************
"ఆత్మవత్సర్వ
భూతాని.. !"
ప్రాణులకు పర్యాయ
వాచియైన భూతము
లే...జీవులన్నీ...!
అన్నీ పాంచ భౌతిక ములే...!
అన్ని భూతముల లో నూ,తనను...,తనలోనే అన్ని భూతము లనూ...చూడగల ఙ్ఞా ను లందరు !?
ఏ ఒక్కరి కైనా దయ నీయ పరిస్థితియే...
దురదృష్టకరం...!
అలాంటి వారిపై...
దయ,జాలి,కరుణ...
లాంటివి చూప లేక పోవటం ...దౌర్భాగ్యమే కదా...!
మనుషులమని చెప్పుకొనుటకు సిగ్గు వెయ్యదా....?!
మన భారతీయసనా
తనధర్మం పశువులు,
పక్షులేకాదు...చీమలు,పాముల పట్ల కూడా దయ జూప మని చెప్ప లేదా...!
అవీ...మనతోనే కలి సి సహజీవనం చేస్తు న్న ప్రాణులే...!
ప్రధానంగా మిగతా ప్రాణు లన్నిటి కన్నా
మనకువిశిష్ట స్థానం
వచ్చినది ఈ విచక్ష ణావివేకముల...
మూలముననే...!
సాటి మనిషి పట్లే...
దయజూపని మూర్ఖ మనుజులున్న రోజు లు...!
"నీ వలెనే నీ పొరుగు
వానినిప్రేమించుము"
క్రీస్తుచెప్పినదీ..యిదే!
దయగలహృదయమే...దేవాలయము!
మానవసేవే మాధవ సేవ కదా...!సాటి ప్రాణిని నిర్లక్ష్యం చేసి
గుడ్లు,గోపురాలు
తిరుగుతాం...!
భూతదయ వున్న వారు సకల దేవతల పూజలూ చేసి నట్టే!
****************
.......కోరాడ.
6
కవితా గానం
అంబటి భాను ప్రకాశ్
శీర్షిక- భూతదయ
20/05/2020.
విశ్వమందు ప్రాణి శాశ్వతం బదిగాదు
తప్పదెప్పుడైన తరలి వెళ్ళ
మననజేయవలెను మహిపైనజీవుల
మాననీయుడగును మనిషి యెపుడు!!
అన్నిజీవు లున్న అవనిది ఘనతన్న
హానిచేయ వెపుడు మనిషికెపుడు
హానిమానడెపుడు హీనుడై,మనుజుండు
దయనుమానినాడు ధర్మమనక !!
సకలజీవులన్ని శంకరు నానతి
ఆనచేత నడుచు నక్షరాల
భూతదయను గల్గు చేతమె గొప్పని
పొగడుచుంద్రు జనులు తగవు లేక!!
7
శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని
అంశం: భూతదయ
20/05/2020
కార్చిచ్చు రగులు కుంటోంది కారడవి నడుమ
ఏ అసురుల మోహమొ
మరో ఖాండవ దహనమై
మూగజీవాల ఉసురు తీస్తోంది
గర్భశోకపు నట్టడవి
ఏడ్చినా నిప్పులే రాలుతున్నాయి
క్షమాపణ లేని పాపాన్ని పోసుకున్న శాపాలు
ముందు తరాల కోసం నెత్తుటి ముద్దల్ని సిద్ధం చేస్తున్నాయి
సిద్ధమైన అణుబాంబుల యుద్ధాలు
మిగిలిన కాస్త ప్రశాంతతని దూరం చేసే
సిద్ధాంతాలకు ప్రణాళికా రచన చేస్తున్నాయి
అహింస చేతగానితనం అవుతున్న సమాజంలో
శాంతి అనే ఎండమావుల వెంట పరుగు
వెనక్కో ముందుకో అర్థంకాని సందిగ్ధం
అడవుల నుంచి మళ్లీ అడవుల్లోకి
ఆయుధాలే మారాయి ఆటవికత కాదు
8
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : భూతదయ
కవితా సంఖ్య: 25
తేదీ: 20/05/20
సర్వప్రాణి జీవం
ఆ సర్వేశ్వరుని ప్రసాదం
ఆత్మపరమాత్మల సమ్మేళనం
ప్రతి జీవిలోను నివాసమే....!!
ఒక జీవి ఆకలి నింపక
పూజపునఃస్కారాలే జీవన
పరమార్ధం మైతే
దైవాన్ని చేరక నిష్పలమే....!!
సర్వ ప్రాణిఆకలి ఆ భగవంతుని
ఆకలి
నిత్య నైవేద్యాలకన్న
ప్రాణుల ఆకలి తీర్చడమే
భగవంతునికి నివేదన....!!
నీలోని భూతదయ
ఆ సర్వేశ్వరునిపై కురిసే
కుసుమాల వాన
దేవుని కటాక్ష వీక్షణలు సదా నీపై
ప్రసరించు జన్మ సంచితాలలో....!!
వినీల
9
కవి పేరు: కాల్వ రాజయ్య
శీర్షిక :భూత దయ
1ఆటవెలది
చావు బతుకు నున్న జంతువు లేవైన
చేర దీసి దాన్ని చేత బట్టి
నీరు నోట్లొ బోసి నెనరుగలిగి యుండు
పుణ్యమొచ్చు నీకు పురుష జీవి
2ఆ వె
హింస చేయ లేక హితులుగా నుండుము
కన్న బిడ్డ లవలె కరుణ జూపు
చిన్న జీవులైన చీమల కెపుడన్న
పంచ ధార పోసి పంచు కరుణ
3ఆ వె
మూగ జీవు లంటె మురిసిపోయి మనిషి
దయను గలిగి వుండు ధాత లాగ
అడవి జంతువులకు నాహారమిచ్చియు
తొట్టి గట్టి నీరు పెట్ట వలెను
4ఆ వె
కోన్ని సాదు కొనియు కోసుకుందువు నీవు
ధైర్య మెట్లు వచ్చు దయను లేద
కన్న బిడ్డ నట్లు కఠినంగ జేతువా
జీవ హింస మాను జీవి తమున
10
[20/05, 9:24 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:**భూతదయ***
----------**********---------------
ఎంతో దయామయుడు దేవుడు
ఎన్నో రకముల జీవులనిచ్చాడు
అన్నిటిలో తననే చూడమన్నాడు
ప్రాణులన్నింటిలో ఆత్మ వుందన్నాడు
స్వయంగ అవతారాలే ధరించి
సకల జీవుల ప్రాధాన్యతను చాటాడు
చిన్న పెద్ద జీవులన్నిటితో పాటు
మనిషిని సృష్టించే వాటి చుట్టు
ఏకకణ జీవినుండి తిమింగలం దాకా
జీవుల మధ్య ఆహారగొలుసును సృష్టించె
అన్నిజీవులకు బలహీనతలతో పాటు
కొన్ని ప్రత్యేకతలను కేటాయించె
జీవులన్నీ తమ జీవితాలను
ధర్మపథాన సాగించుచుండగ
మానవుడొక్కడే *భూతదయ* ను మరచి
భువిపై జీవులన్నింటిని శాసించె
స్వార్థాన్ని పెంచుకుంటూనే వస్తూ
క్రౌర్యంతో మూగజీవుల మట్టుబెట్టే
తన తెలివిని విశ్వవినాశనానికి వాడి
భువిపై అన్ని దారుణాలకు కారణమాయె
ప్రాణవాయువులనిచ్చే మొక్కల సైతం
ధరణిపై దారుణంగ తగ్గించె
అన్నిజీవులను అనుక్షణం హింసించె
అవనిపైకి అడ్డుకోలేని ఆపదలెన్నో తెచ్చె
:;*వల్లాల *విజయలక్ష్మి***
ఆలేరు
11
అంశం: భూత దయ
వై.కె.సంధ్యశర్మ
తేది:20-5-20
శీర్షిక : జీవం పోద్దాం!
అంతులేని కాలుష్యం ఒడిలో
కార్చిచ్చు విలయ తాండవం చేస్తూ
నిస్సహాయతగా నేల కూలుతున్న
వట వృక్షాలకు కాస్త ఆసరానిచ్చి
నిలబెడదాం...
హరిత రేణువులన్నీ
నిశ్శబ్ద రోదనలో మగ్గిపోతూ
పిచుక గూళ్ళను నిలువరించలేక
నేల రాలుతున్న పక్షుల వేదనలు
విలపించలేని మూగ బాసలు
తరలిపోతున్న కళేభరాలు...
అంతమైపోతున్న అనాది
జంతు జీవాలకు కాస్త జవసత్వాలనిద్దాం...
వికృతిని ఆహ్వానించి
అంటు రోగాల జాడ్యాలకు
ఆజ్యం పోస్తున్న మానవాళి...
ఇపుడు మూల్యం చెల్లిస్తూ
ప్రకృతి దరహాసానికి వేచి చూస్తోంది
భూత దయతో
మనసు రేగడిపై
పచ్చదనాన్ని పరచి
పక్షుల కిలకిల రావాలకు
కాస్త నీళ్ళు చిలకరించి
గుప్పెడు గింజలను
వసారాలో చల్లితే
ఓ గోరింక గోముగా నోటికెత్తుకుని
నింగికెగిరేను
కాకమ్మ కడుపు నింపుకుని
గూడు చేరేను
సాధు దూత గోమాత పశుగ్రాసంతో
పాలిచ్చి చల్లని దీవెనిస్తుంది...
ధరణి పులకించి చిరుజల్లులతో
ఆశీసులందించేను...
జంతు సంరక్షణలో జనులుంటే
జగమంతా జాగృతి లో విలసిల్లేను!
12
[
అంశం..భూతదయ
ఏమిటో ఈ విచిత్రం
కంటికి కనిపించని సూక్ష్మజీవి ని
కనిపించే జీవులను సృష్టించి
లక్షల కోట్ల జీవరాసులలో
తానే ఉన్నానని తెలిపిన పరమాత్మ లీల
సర్వ భూతాలను సమదృష్టితో చూడమనే సర్వాంతర్యామి తత్వం
స్వార్థం విడనాడి
జాలి దయ కరుణ కలిగి
అన్నీ జీవులను ఆదరించు మని
జీవించే హక్కు ప్రతి జీవికి ఉందని బోధించిన సత్య స్వరూపుడి ఘనత
జీవులకు మేలు చేయడమే ధర్మం
ప్రాణులను బాధింపకుండుటయే భగవంతుడికి ఆనందం
భూత దయ తోనే
కుష్టు రోగుల సేవ చేసి
గాంధీజీ మహాత్ముడయ్యాడు
తుపాకీ తూటాలు దేహంలో దూరినా హే రామ్ అనగలిగాడు
భూత దయ స్వతఃసిద్దంగా మదిలో జనించి
విశ్వ కుటుంబమనే భావన అందరిలో కలిగినప్పుడే
జగతిలో శాంతి వెలుగొందును
నందన వనమై విలసిల్లును.
13
[22/05, 7:59 PM] Sarphraj Anwer Poet: 🌸 *జీవ వైవిధ్యం..*🌸
భూమిపై ఉన్న వివిధ జీవుల మధ్యభేదం,
భిన్న వైరుధ్యాలు, సామీప్యాలు కల్గిన
వేర్వేరు జీవుల సమాహారం జీవ వైవిధ్యం
వైవిధ్యమే ప్రత్యేకత, అదియే సృష్టి లక్షణం
సృష్టిలో గల జీవరాశులలో ఏది ఎక్కువ,
తక్కువ కాదు అన్ని సమానమే
జీవులన్నియు పర్సపరాధారితాలు
*జీవ వైవిధ్యచక్రం ఓ వసంత ఋతువు*
ఆధిపత్యపు పోరే వినాశనానికి హేతువు..
మనజీవనశైలితో పర్యావరణ కాలుష్యంతో పాటు భూగోళం వేడెక్కి
ప్రకృతి సమతుల్యత దెబ్బ తిని అనర్థాలకు దారితీసి జీవవైవిధ్యం దెబ్బతింటుంది
ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి
ఆదివాసులు, వనజీవులు ఉన్నచోట జీవవైవిధ్యం వర్ధిల్లుతుంటే
నాగరికత పరిఢవిల్లిన ప్రాంతాల్లో దాని
ఉనికి ప్రశ్నార్థకమౌతుంది..
జీవవైవిధ్యంతోనే ఈ పుడమికి
ప్రత్యేకత, మానవజీవితానికి సార్థకత
వైవిధ్యవైభవం *గతకాలపు*
*స్మృతిచిహ్నంగా* మిగలరాదు
అది కేవలం అక్షరాలలో, పుస్తకాల్లో
నిక్షిప్తమై ఉండరాదు
*వైవిధ్యబాంధవ్యంలేని బతుకు దైన్యమే*
దాని మహిత గుర్తించకపోతే మిగిలేది *జీవ వైధవ్యమే..*
*సర్ఫరాజ్ అన్వర్..*✍🏻
[22/05, 9:06 PM] +91 99633 77273: 20 May 2020
17:38
14
కవితా గానం
అంశం : భూతదయ
పేరు : పోలా కిషోర్ కుమార్
మనిషి తన స్వార్థంతో
ఒళ్ళు హునం చేస్తున్నా సహనంతో
ఓర్చుకుంటున్న తల్లి లాంటి భూమాత
చూపేది భూతదయ
మనిషి తన ఎదుగుదలకు
గుండెల్లో రంధ్రాలు చేస్తున్నా కంటికిరెప్పలా కాపాడే సంరక్షకుడు
ఆకాశం చూపేది భూతదయ
మనిషి తన అంతు లేని ఆకలికి
సాటి జీవాల హింస చేస్తూన్నా
తోబుట్టువుల్లా సహజీవనం చేస్తున్న
మూగజీవాలు చూపేది భూతదయ
మనిషి చేసే కాలుష్యం వల్ల
ప్రాణాలు హరించేస్తున్నా
తమ పంచప్రాణాలు పంచుతూ
పంచభూతాలు చూపేది భూతదయ
ప్రకృతి నేర్పే పాఠాలు మనిషి మనుగడకు మార్గదర్శకాలు
ఇది ప్రకృతిలో జీవించే మనిషి తెల్సుకోవాల్సిన సత్యం
దేవుడి సృష్టి లో సకలజీవుల సహజీవి మనిషి
భువి పై జీవించే ప్రతి ప్రాణి దేవుడి భూతదయకు హక్కుదారే
మనిషి అహాన్ని వీడి తనలో నిద్రాణమై ఉన్న ప్రేమ కరుణ జాలి దయ సేవా గుణాలను మెల్కొల్పి మానవత్వాన్ని గుండెనిండా నింపుకొని మనీషి గా మారాలి
భూతదయ మనిషి లోని మానవత్వానికి మరో రూపం
అది మనిషిని మహాత్మున్ని చేస్తుంది
-------- పో లా
15
[22/05, 9:11 PM] Lalita Sister: కవితాగానం
నిర్వహణ :వీరాగుడిపల్లి గారు
అంశం :భూతదయ
ఆధునికత పోకడలో
నేలవిడిచి సాము చేస్తూ...
కొత్త పాట పాడుతోంది
నేటి మానవాళి
నాగరికత.......
సాంకేతికత
పల్లవిగా...
ప్రకృతి గుండెకు గాయాన్ని చేస్తూ...
జీవజాలపు విషాదాంతపు గేయాలను రాస్తూ....
తిరుగుతున్న కాలచక్రంలో
పెరుగుతున్న చరిత్ర పుటల్లో..
పరుగులు పెడుతున్న మానవాళి
ప్రకృతి ప్రకోపంలో లయం కాకముందే మేలుకోవాలి
తక్కెడలో తూగిన త్యాగాల తనువును తలపుల్లో ఆలాపనగా నిలుపుకుని
బుద్ధుని భూతదయను శృతులుగా ఎంచుకుని
అహింసా వ్రతము చేపట్టిన గాంధీమార్గo గమకాలుగా చేసుకుని
హింసకుదూరమన్న పరమహంసల పలుకులనే పల్లవిగా మలచుకొని
సరికొత్త రాగాలు పలికించాలి
కణకణము జీవకారుణ్యం తొణికిసలాడిన కరుణామయుల బోధలను ఆచరించే చరణాలతో...
పాతపాటకు కొత్తజీవం పోస్తూ ...
****లలితాకృష్ణ
16
[22/05, 9:28 PM] Sagarla సత్తయ్య Poet: *జీవుల మనుగడ*
జీవుల వైవిధ్యమ్మును
గావగ వలయును మనుజులు కర్తవ్యముతో
నీవిట స్వార్థము వీడుము
జీవులు లేకున్న నీకు చేటగు నరుడా
జగతిన జీవుల మనుగడ
సుగమముగా సాగవలెను శుభములు కలుగన్
పగ బూనిన రీతినిటుల
తెగ నరుకుట తగదు నీకు తెలియుము నరుడా
వానర జాతికి వాసము
కానల కనిపించకుండ కఠినాత్ములునై
ఈ నరజాతి కుటిలత
హానిని తెచ్చెను జగతికి అచ్చెరువేలా?
నరుడే పాపాత్ముడయెను
నరుడే ఈ జీవకోటి నాశమొనర్చెన్
నరుడే ఈ జంతుతతికి
నరి యై వేటాడుచుండె ననిశము నరుడా
కాపాడుము ఈ జగతిని
కాపాడుము జంతుజాతి కాపాడనిచో
పాపాలై చుట్టుకొనును
శాపమ్మై వెంటఁ పడును చావే గతియౌ
( *నేడు జీవ వైవిధ్య దినోత్సవం* )
*- సాగర్ల సత్తయ్య, నల్గొండ*
17
[24/05, 8:36 PM] వేంకట కృష్ణ ప్రగడ,విశాఖపట్నం
కలం : "కృష్ణ" కలం: కవితా గానం
వేంకట కృష్ణ ప్రగడ
విశాఖపట్నం
24.05.2020
అంశం : భూతదయ
బుద్ధిలో ఉండాలి
భూతదయ
హద్దులో ఉండాలి
ఆశలయ
దిద్దుకో బుద్ధిని
సుద్దులే నేర్చుకో
ఎందరు చెప్పారు
ఎందరో నేర్పారు
సర్వ జనులలో
ప్రాణమొకటే అని
సాటి మనిషిగా
సహకరించమని
ప్రాణానికి ప్రాణం వద్దు
ప్రాణాలు కాపాడమని
బుద్ధులు చెప్పి చెప్పి
"నా గొడవ" అంటూ
మన తప్పులు
తన తప్పులుగా రాస్తూ
కవి కాళోజీ కలం
ఎంత అలసిపోయిందో
భూతదయ చూపమని
చాటి చెప్పిన గాంధీజీ స్వరం
ఎంత నీరసించిందో
నిన్నటి నాది
నేడు నీది
రేపు అది మరి ఎవరిదో
ఉన్నవాడినని గర్వపడకు
ఉన్నదాన్లో కొంత పంచి
ఉన్నాను నేనూ అని తెలుపుకో
నువు పంచిన రంగులే
ప్రకృతి రేపు మళ్ళీ నీకు
తిరిగిస్తుందని తెలుసుకో ...
... ✍ "కృష్ణ" కలం
18
[24/05, 8:38 PM] పాల్వంచ హరికిషన్: కవితాగానం
తేది: 24-05-2020
అంశంః భూతదయ
శీర్షిక: ధరిత్రాలయం !!!
విద్యను అందించే
నిలయం..
మానసిక ఉల్లాసమిచ్చే
బాలాలయం !
పూజలు జరిపించే
నిలయం..
మనసుకు స్వాంతననిచ్చే
ఆత్మాలయం !
అమ్మా నాన్నల ప్రేమ
నిలయం..
జీవన గమ్యాన్ని చూపే
దైవాలయం !
జీవకోటికి అవని
జీవన నిలయం..
జీవవైవిధ్యం నిండిన
బంధాలయం!
ప్రకృతి పచ్చదనాల
నిలయం..
భూతదయ నిండిన
ధరిత్రాలయం!
-- పాల్వంచ హరికిషన్
రామన్నపేట
9502451780
19
అంశం...భూతదయ
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
మనిషికష్టసుఖాల్లో ఉన్నప్పుడు
వారిని ఆదరించి ఆ సమస్యకు
పరిష్కారం చూపే మానతాదృక్పథకోణమే భూతదయ
మానవుని మదిలో మెదిలాడే కరుణ
ఆప్యాయతల కలయిక మయమే భూతదయ
జంతువులను వధించ వద్దని అదికూడా మనలాంటి ప్రాణులని,వాటిని జాలితో చూడాలని బుద్దుడుబోధించాడు
తోటి వారిని అనాధలను ముసలవాళ్ళను ద్వేషించక వారిపట్ల సానుకూలంగా వ్యవహరించడం,తగినంత సహాయసహకారాలు చేయడం మానవత్వంతో ప్రవర్తించడం భూతదయ
అహంకారంతో ప్రవర్తించక సహృదయంతో దయామయుడుగా కరుణామయుడుగానుఆదరించి మానవత్వసుగంధపరిమళాలు
వెదజల్లాలి


Comments
Post a Comment