నిర్వహణ ః వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ
అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం ః మెరుగు మధు
******************
1.అనుముల తేజస్విని గారు
2.పాల్వంచ హరి కిషన్ గారు
3.వేంకట కృష్ణ ప్రగడ గారు
4.తులసి వెంకట రమణాచార్యులు గారు
5.వై యల్ ఎన్ రెడ్డి గారు
6.కొలచన విజయ భారతి గారు
7.పోలా కిషోర్ కుమార్ గారు
8.బల్లూరి ఉమాదేవి గారు
9. సంధ్యా శర్మ గారు
10.మర్రి జయశ్రీ గారు
11.కోరాడ గారు
12.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
13.ఇంద్రవత్ రాహుల్ గారు
14.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
15.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
16.సునంద వురిమిళ్ళ గారు
17.వల్లాల విజయ లక్ష్మి గారు
18.
19.స్వర్ణ సమత గారు
20.వకుళ వాసు గారు
21.డా.బండారు సుజాతా శేఖర్ గారు
22.గంజాం భ్రమరాంబ గారు
23.వల్లభాపురం జనార్ధన్ గారు
24.చకిలం సురేందర్ గారు
25.విజయ దుర్గ గారు
26.కాల్వ రాజయ్య గారు
**************************
1
అంశం:స్వేచ్ఛ
శీర్షిక:ఏది స్వేచ్ఛ
ఏది స్వేచ్ఛ
విహరించే విహంగానికి ఉంది
పారే సెలయేటికి ఉంది
ఊగే చిగురాకుకి ఉంది
వీచే చిరుగాలికి ఉంది
కాంతిని పంచే సూర్యుడుకి ఉంది
రేయిని కాచే చంద్రునికి ఉంది
అన్నిటికి స్వేచ్ఛే
బాగా బతికే సంపన్నుడికి ఉంది
ఏదంటే అదే ఎదురించే నిరుపేదకి ఉంది
కానీ మధ్యతరగతి జీవితానికి ఏది?
మనసులో బాధలు
ఇంట్లో కష్టాలు
ఇపుడు కరోనా వేసిన కాటులు
నాడు మహానుభావులు తెచ్చింది ఏది
నేడు ఇచ్చింది ఏది
తెగించి తీసుకుంటే బలుపు
అని
తెగబడక పోతే చేతకానివాళ్ళు అనే బిరుదు
ఏది స్వేచ్ఛ
అనుకోవడమే తరువు
విచ్చలవిడి స్వేచ్ఛతో
విర్రవీగుతూ రాలిపోయే జీవితాలుగా మారే
అందుకే ఏది స్వేచ్ఛ
ఇది అందరికీ తెలియని ప్రశ్న
అనుముల తేజస్విని
నర్సంపేట
2
అంశం: స్వేఛ్ఛ
శీర్షిక: పుణ్యం..!
తండ్రివి నువ్వే..
కొడుకువు నువ్వే..
అన్నవు నువ్వే..
తమ్ముడు నువ్వే..
భర్తవు నువ్వే..
భరించేది నువ్వే..
ఇంటికి వెలుగువు నువ్వే..
కంటికి రెప్పవు నువ్వే..
ధైర్యం నువ్వే..
అనురాగం నువ్వే..
ఆప్యాయత నువ్వే..
సగం నువ్వే..
సారం నువ్వే..
సకలం నువ్వే..
శకలం నువ్వే..
అభయం నువ్వే..
విభయం నువ్వే..
భారం నువ్వే..
బాధ్యత నువ్వే..
ఆత్మవు నువ్వే..
అంతరాత్మవు నువ్వే..
దృష్టివి నువ్వే..
వృష్టివి నువ్వే..
ఆగం నువ్వే..
ఆగమాగం నువ్వే..
ఇఛ్ఛవు నువ్వే..
స్వేఛ్ఛవూ నువ్వే..
పురుషోత్తమా..
పుణ్యం పురుషార్థమా..
-- పాల్వంచ హరికిషన్
రామన్నపేట, యాదాద్రి
9502451780
3
కలం : "కృష్ణ" కలం: కవితా గానం
వేంకట కృష్ణ ప్రగడ
విశాఖపట్నం
05.05.2020
అంశం :స్వేచ్ఛ
శీర్షిక : స్వేచ్ఛకు ప్రతిరూపం
గతం జ్ఞాపకాలు
మనసులో మెదలాయి
ఆ కదలికలలో
పదిలంగా పడకేసిన
ఓక్కో జ్ఞాపకం మేలుకొని
నాటి ఏలికను
నేటి మాలికగా మార్చాయి
అలా విస్తరించిన
నా మనసు
ఆకాశమయ్యింది ...
జ్ఞాపకాలన్నీ
తనలోనే నింపుకొని
గుప్తంగా గుంపులుగా
తనలోనే ఉంచుకొని
ఓ మెరుపును తన
వలపున పెనవేస్తూ
జల జలమని వర్షించే
మేఘంలా మస్తిష్కం సిద్ధంగా ...
గతాన్ని వర్తమానంగా
మార్చగల స్వేచ్ఛ
మనసులో ఉన్న
ఆలోచనకే సాధ్యం
మనసు గగనంలో
మస్తిష్క మేఘం
సంతాన అక్షర వర్షం
స్వేచ్ఛకు ప్రతిరూపం ...
... ✍ "కృష్ణ" కలం
4
పేరు: తులసి వెంకట రమణా చార్యులు.
అంశం: స్వేచ్ఛ
శీర్షిక: స్వేచ్ఛ కు పునాది మనస్సు.
స్వేచ్ఛ అంటే అంగడి సరుకుకాదు సుమా!
మనో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ.
చరాచర సృష్టిలో స్వేచ్ఛ ప్రతి జీవికి ఉన్నది.
మనం వేసే అడుగు...తలిచే మనస్సు పరిశుద్ధమై ఉంటే ...
ఈ లోకనా అంతకన్నా ఇంకా ఏమి కావాలి?
పక్షి రెక్క ఆడిస్తేనే కదిలేది
పై పైకి ఎగిరిది ఆ స్వేచ్చకు హద్దు ఉంది.
హద్దులు దాటాని మానవ ధర్మం కి స్వేచ్ఛ మనస్సే సుమా!!
పరిమళాలు వెదజల్లే మల్లెకు ఆ సువాసనే స్వేచ్ఛ.
మనిషి చేసే ప్రతి పనికి ఆలోచన తరంగ శక్తినే స్వేచ్ఛ!
స్వేచ్చకు రూపం లేదు ...
ఆచరణ శక్తినే స్వేచ్ఛ కుప్రేరణ..
స్వేద జల కర్మ ఫలమే స్వేచ్ఛ...
స్వేచ్ఛ కల్పించే సుఖం ఎంత హాయిగా ఉంటుందో..!
స్వేచ్ఛ వికటిస్తే దాని ప్రతి ఫలం అంత కఠినంగా ఉంటుంది ..
స్వేచ్చకు పునాది మనస్సు..
మది కోవెల్లో వెలిగే మానవత్వపు మధుర ఫలమే స్వేచ్ఛ సుమా!
ఇది నిత్యము....సత్యము సుమా!!
5
స్వేచ్ఛ🔸🔸
పరాయి పాలన నుండి
కావాలి పీడీతులకు స్వేచ్ఛ
శ్రమ దోపిడీ నుండి
కావాలి కష్టజీవులకు స్వేచ్ఛ
నరజాతి అత్యాశ నుండి
కావాలి ప్రకృతికి స్వేచ్ఛ
ధనవంతుల పీడన నుండి
కావాలి పేదవారికి స్వేచ్ఛ
నిషేధ నిర్బంధాల నుండి
కావాలి ప్రశ్నించేవారికి స్వేచ్ఛ
దళారిమార్కెట్ నుండి
కావాలి అన్నదాతకు స్వేచ్ఛ
సర్వ కాలుష్యాల నుండి
కావాలి జీవరాశికి స్వేచ్ఛ
అనారోగ్య పీడ నుండి
కావాలి రోగులకు స్వేచ్ఛ
అవినీతిపరుల దురాశ నుండి
కావాలి నీతిపరులకు స్వేచ్ఛ
అజ్ఞానాంధకారం నుండి
కావాలి నిరక్షరాస్యులకు స్వేచ్ఛ
నేడు కరోనా నుండి
కావాలి మానవాళికి స్వేచ్ఛ
.....NLNReddy
6
పేరు: కొలచన విజయ భారతి
హైదరాబాద్
అంశం: స్వేచ్ఛ
శీర్షిక:పొదుపు చేయి
తేదీ:5-5-2020
*******************
ఓ మనిషీ!
స్వేచ్ఛని ఎగిరే పక్షిని చేయకు
హద్దుమీరి విహరిస్తే
రెక్కలు తెగి గూటిలోనే
చిక్కుకు పోతుంది
స్వేచ్ఛనే మత్తులో మునగకు
ప్రరవశంలో మునిగి తేలాలంటే
వశంతప్పి తూలుతావు
స్వేచ్ఛని నీ బానిసగా చేయకు
అధికారం చెలాయించావంటే
నిన్నే అధీనం చేసుకుని
సంకెళ్లు వేస్తుంది
స్వేచ్ఛని కళ్ళెం లేని గుర్రంలా
దౌడుతీయంచకు
నిన్ను పడదోసి నీపైనే స్వారీ చేస్తుంది
స్వేచ్ఛని పొదుపుగా వాడుకో
నిన్ను అందలం ఎక్కిస్తుంది
7
అంశం : స్వేచ్ఛ
పేరు : పోలా కిషోర్ కుమార్
శీర్షిక : బ్రతకడానికి స్వేచ్ఛ
లాక్డౌన్ లో మానవాళి స్వేచ్ఛ ను కట్టడి చేయడం వల్ల
ప్రకృతి కి స్వేచ్చ
జంతువులకు స్వేచ్ఛ
పశుపక్ష్యాదులకు స్వేచ్ఛ
స్వచ్ఛమైన గాలికి స్వేచ్ఛ
గళ గళ పారే సెలయేటికి స్వేచ్ఛ
కాలుష్యం లేని ఆకాశానికి స్వేచ్ఛ
నిత్యం కాలుష్యపు రణగొణధ్వనుల్తో నిండే రహదారులకు స్వేచ్ఛ
కాలుష్యపు మబ్బుల చాటున చిక్కుకొన్న సూర్య చంద్రుల వెలుగులకు స్వేచ్ఛ
ఇలా ప్రకృతి మెుత్తం స్వేచ్ఛ తో పులకరిస్తుంటే మానవాళి ఆశగా చూస్తుంది తనకూ స్వేచ్ఛగా జీవించే అవకాశం
కోసం
అలా జీవించాలంటే మానవాళి జీవజాలం ప్రకృతి రక్షణ మన ధ్యేయం స్వార్థం మరచి మంచిని పెంచి పరోపకారం చేసినపుడే భూలోకం స్వర్గధామం అని మానవుడు కంకణం కట్టుకోవాల్సిందే ప్రతిన బూనాల్సిందే
8
డా.బల్లూరి ఉమాదేవి
అంశము: స్వేచ్ఛ
మదిలోని భావాలను భయం లేక వివరించగలిగేది స్వేచ్ఛ
స్వేచ్ఛ అంటే పరులను దోచుకోవడం కాదు స్వేచ్ఛఅంటే పర పీడలను అణచడం గలగలపారే సెలలరుకైనా
పంజరం లో బంధించిన పక్షి కైనా
అంక్షల్లో బ్రతుకీడ్చే వారికైనా
కావాలి హాయిగా తిరిగే స్వేచ్ఛ
హద్దుల్లో ఉన్న స్వేచ్ఛ ముద్దు
స్వేచ్ఛ అంటే బలాదూర్గా తిరగడం కాదు స్వేచ్ఛ అంటే లోక విరుద్ధంగా వర్తించడం కాదు ఏది ఎక్కువైనా తక్కువైనా తప్పదు పతనం అందుకే అన్నారు అతి సర్వత్ర వర్జయేత్
రంగూ రూపం లేనిదిది కళ్లెం అసలే లేనిది నిరంతర స్రవంతి లా సాగేది
కావాలి అందరికీ స్వేచ్ఛ
కాకూడదు పరులకు అది శిక్ష
స్వయం నియంత్రణ స్వేచ్ఛకు హద్దు
దాన్ని పాటించడమే మానవాళికి ముద్ద
9
వై.కె.సంధ్యశర్మ
తేది:5/5/20
*అంశం: స్వేచ్ఛ*
***************
నేల నాలుగు చెఱగులా
వేళ్ళూనుకుపోతూ
విశృంఖల విచ్చలవిడితనం
స్వేచ్ఛగా శ్వేదాన్ని హరిస్తూ
నాలుగు వేళ్ళలో
ఐదువేళ్ళను దూర్చే ప్రయత్నంలో
అపహాస్యమై చిందులేస్తుంది
నవీన నాగరికతలో
మనసుని హరించే మనిషి స్వేచ్ఛ
అంతర్నేత్రంలో విలోమానుపాతంలో
విరోధ భావంతో బంధాలు
చులకన నీళ్ళతో తడిసిపోతోంది
రెక్కలు విప్పుకుని...
స్వతంత్రుని స్వేచ్ఛ రంగుల రాట్నంలా
తిరుగుతూ పురోగమించే
వృద్ధికి చేతులు కలపాలి కానీ
తిరోగమనమై తిరస్కార హీనం
కాకూడదు...
నాడు బాపూజీ మార్గంలో
భారతీయుని స్వేచ్ఛ
బానిస సంకెళ్ళు తెంచడానికే
నేడూ అవసరం ఆ స్వేచ్ఛా గమనం
అంతరంగ సంకెళ్ళను త్యజించుటకు
కులపు నీళ్ళను రంగరించుటకు
కుతంత్రాలను మట్టుబెట్టుటకు
ఆకలి పేగులకు రక్షణ నిచ్చుటకు
జాతి విద్వేషాలకు సందేశమిచ్చుటకు
సమైక్యతా వాదాన్ని నినదించుటకు
హక్కుల అత్యవసరతను గుర్తించుటకు
సార్వభౌమాధికారాన్ని ఏకీకృతం చేయుటకు
నేడూ అవసరం స్వేచ్ఛా తరంగాలు
ఇంటింట మరు మొగ్గలు విరబూయుటకు
ఆడపిల్లల ఆలంబనకు ఆత్మ సంరక్షణకు!
భిన్నత్వంలో ఏకత్వ సస్యరక్షణకు!!
10
మర్రి జయశ్రీ
అంశం..స్వేచ్ఛ
సృష్టిలో ప్రతి ప్రాణి స్వేచ్చగా విహరించాలనే తపన
ఎవరి నిర్బంధలో ఉండక
ఎలాంటి ఆంక్షలు విధించక
బల ప్రయోగం లేకుండా
భావవ్యక్తీకరణ చేయాలని
వికాసానికి కావాల్సిన పరిస్థితి కల్పించుకొని
తనకు తానుగా అభివ్రుది చెందాలని
రెక్కలు కట్టుకుని
ఆకాశంలో విహంగమై విహరించాలనే
గాలిలో పతంగమై తెలిపోవాలని
మనిషి మనసు ఆశపడడం సహజమే
నేడది భిన్నమై
ఎన్నో పోరాటాల ఫలితంగా లభించిన స్వేచ్ఛ
కొందరికే హస్తగతమై
స్వార్థంతో వక్రబుద్దితో
హరించుకు పోతుంది
విపరీత పరిణామాలకు దారితీస్తోంది.
వివక్షత నెదుర్కొంటూ
వీర విహారం చేస్తుంది
మానవత్వం పరిఢవిల్లి
ఎవరి హక్కులు వారే అనుభవిస్తూ
స్వేచ్చా పరిమళాలు వేదజల్లితేనే
దేశం సుసంపన్నం
భారతావనికి స్వేచ్చా వాయువులు ప్రసాదించిన బాపూజీ కల సాకార మగును.
[05/05, 9:23 PM] మర్రి జయశ్రీ: కవితా గానం
మర్రి జయశ్రీ
అంశం..స్వేచ్ఛ
సృష్టిలో ప్రతి ప్రాణి స్వేచ్చగా విహరించాలనే తపన
ఎవరి నిర్బంధలో ఉండక
ఎలాంటి ఆంక్షలు విధించక
బల ప్రయోగం లేకుండా
భావవ్యక్తీకరణ చేయాలని
వికాసానికి కావాల్సిన పరిస్థితి కల్పించుకొని
తనకు తానుగా అభివ్రుది చెందాలని
రెక్కలు కట్టుకుని
ఆకాశంలో విహంగమై విహరించాలనే
గాలిలో పతంగమై తెలిపోవాలని
మనిషి మనసు ఆశపడడం సహజమే
నేడది భిన్నమై
ఎన్నో పోరాటాల ఫలితంగా లభించిన స్వేచ్ఛ
కొందరికే హస్తగతమై
స్వార్థంతో వక్రబుద్దితో
హరించుకు పోతుంది
విపరీత పరిణామాలకు దారితీస్తోంది.
వివక్షత నెదుర్కొంటూ
వీర విహారం చేస్తుంది
మానవత్వం పరిఢవిల్లి
ఎవరి హక్కులు వారే అనుభవిస్తూ
స్వేచ్చా పరిమళాలు వేదజల్లితేనే
దేశం సుసంపన్నం
భారతావనికి స్వేచ్చా వాయువులు ప్రసాదించిన బాపూజీ కల సాకార మగును.
11
కోరాడ నరసింహా రావు., * హక్కు*
**********
స్వేచ్ఛ ప్రతి ప్రాణికీ ప్రాధమికహక్కే ఐనా
ఈ స్వేచ్ఛ కోసం ...
మనిషి యెంత ఆరా ట పడ్డాడు...ఎన్నెన్ని పోరాటాలు చేసాడు
మనిషి...సాటిమనిషినే...శారీరకంగా,మానసికంగా,తనఅహం కారపు అధికార...
నియంతృత్వ,నిరంకుశసంకెళ్లతో...బంధించి...స్వేచ్ఛను
హరిస్తే...ఆ నిర్బంధ దాస్య శృంఖలాలను త్రెంచు కునేందుకు ఎన్నిశతాబ్దాలుపోరా టాన్ని సాగించిందీ
ప్రపంచం...!!
ఓ మనిషీ!నీ శక్తి,యు
క్తులు సాటి ప్రాణుల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను హరించటానికా !
నీనిరంకుశ ,నియంతృత్వాలుఎన్నివిప్లవాలకుదారితీసాయి! యెంత రక్తపాతాన్ని సృష్టించాయి!?
దురదృష్టం...! సహనం చచ్చిన
స్వేచ్ఛ ,విశృంఖలత్వానికి దారి తీస్తోంది చూడు ! ఈ విపరీత పరిణామాలన్నీ నీ మూలంగానే కదూ !
ఎవరి స్వేచ్ఛను వారు...ఎటువంటి నిర్బంధాలకూ గురి కాక హాయిగాఅనుభ
వించినపుడే కదా ఈ
ప్రపంచానికి శాంతీ సౌఖ్యం !
స్వేచ్ఛ...స్వేచ్ఛగా ...
వర్ధిల్లును గాక !
శాంతి,సౌఖ్యాలు విల సిల్లును గాక !!
*****************
........కోరాడ.
12
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:3-5-2020
అంశం:స్వేచ్ఛ
శీర్షిక:విముక్తి
*************************
అందరూ కోరుకొనేది
కొందరికే దక్కేది
పీడిత,తాడితుల స్వప్నం
అణచబడ్డ జాతి ఎదురుచూసే నవోదయం
బానిస సంకెళ్ళు తెంపుకొని
సువిశాల లోకంలో సంచరించాలనే కాంక్ష
ఆంక్షల ముళ్ళకంచెలను తెంచుకొని
ముందుకెళ్ళాలనే లక్ష్యం
బాధల వలయాలను దాటుకొని
బ్రతుకు మార్గంలో పయనించాలనే ఆశ
వనరులను,సౌకర్యాలను దొంగిలించే
దుర్మార్గుల కబంధ హస్తాల నుండి
బయటకు రావాలనే తపన
దౌర్జన్యాల నుండి,మోసాల నుండి
తప్పించుకోవాలనే ఆర్తి
దోపిడి,ఆశ్రితపక్షపాతాల నుండి
విడివడాలనే ప్రయత్నం
విముక్తి కోసం చేసే యజ్ఞం
తనువు,మనసు ఉల్లాసంగా,ఉత్సాహంగా
ఎక్కడ ఉంటుందో అదే స్వేచ్ఛ
నిర్భయంగా,నిశ్చయంగా, నిమ్మళంగా
ఎక్కడ మనము ఉంటామో అదే స్వేచ్ఛ
ఎవరో వస్తారనే భ్రాంతి వదిలి
నీవు చేసే కృషే స్వేచ్ఛ.
13.
*అంశం*: స్వేచ్ఛ
ఈ అవనిలో ప్రతి మనిషికి కావాలి స్వేచ్ఛ..
ఎగిరే పక్షికి కావాలి స్వేచ్చ
తల్లి ఒడిలో ఉన్న చిన్నారికి కావాలి స్వేచ్చ..
మూగ జీవులకు కావాలి స్వేచ్చ
ఈ నాటి కరోనా మహామ్మరి నుండి కావాలి స్వేచ్చ
ఆనాటి తెల్ల దొరల నుండి కావాలి స్వేచ్ఛ
స్వేచ్ఛ ఉంటే మనిషికి ఆనందం
పక్షిలా వాలుతాడు.
ఎవరి స్వేచ్ఛ వాళ్లకు ఉంటే
శక్తి యుక్తి లను కూడబెట్టి ప్రయత్నం చేస్తాడు..
స్వేచ్ఛ ఉండాలి మనిషి ఆనందముతో బతకాలి...
*ఇంద్రవత్ రాహుల్*
*ఇందూర్*
14
91 94941 62571: అంశం...స్వేచ్ఛ
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
స్వేచ్ఛగా తిరిగే పక్షులు లాగ
ఎగరిపోతూ లోకమంత
తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది
బంధనాలనుండి విముక్తి పొంది
హాయిగా కొత్త ప్రపంచం వైపు
సాగుతూ వినీల గగనంలో
ప్రకృతి వింతలు చూస్తూ
లోకాన్ని చుట్టు స్వేచ్చగా తిరగాలని
ఉంది
నిత్యం యాతనతో పరుగెడుతూ
ఊపిరిసలుపని పనులతో
ఉక్కిరిబిక్కిరి అవుతూ సతమవుతూ కట్లుబాట్లులకులొంగి
స్వేచ్చగా తిరిగే హక్కును కోల్పోయి
మనసులోనున్న కోరికలు
చంపుకుంటూ ఎక్కడికైనా
ఎగిరిపోవాలని స్వేచ్చగా ఉండాలని
మనసు ఉవ్వళ్ళూరుతుంది
స్వేచ్చా స్వాతంత్ర్యం వచ్చిననాడే
నిజమైన స్వాతంత్ర్యం
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
15 ✍️డా.పాండాల
భరతమాత ఆధునికపు
అధినేతై రాజకీయ
నీతి నియమ జాతి ఖ్యాతి
ప్రపంచాననిలిపినట్టి..!
ఆజాది విలువలు గల
మనసంతా హైందవమే
ప్రగతంతా ఇతిహాసమే
నిబద్ధతకు నిదర్శనం..!
అరవిరసిన మందారపు
అస్త్రశస్త్ర విధులెరిగిన
మూర్తిమత్త్వ వికాసం
నిజాయితికి నిలువద్దం..!
చతురతలో తా యోధుడు
చాణక్య నీతి సంస్కారి
పేదరికం దేశమైన
పెద్దరికం యుక్తి నేర్చే.!
అసాధారణ అప్రమేయ
హిమాలయపు అతని కీర్తి
భూగోళపు యవనికపై
అచిరకాలమతని రక్తి..!
సౌరాష్ట్రపు సోమనాథ
దీవెనయే స్థితప్రజ్ఞత
త్రికరణాల త్రిమూర్తత్వ
వందకోట్ల ప్రతీకుడిగా..!
భారతాంబ ముద్దుబిడ్డ
చాకచక్య ప్రసంగాల
ప్రతిరూపమే నరేంద్రుడు
చతుర్విధపు చమత్కారి...!
గ్రామరాజ్య సౌభాగ్యం
గాందీజీ కలలు నిజం
సార్థకతే సమర్దతగ
నడిపించెటి నాగరికం..!
ప్రత్యర్థుల చిత్తుజేసె
ప్రణాళికల బాటసారి
మృదుమధురపు హావభావ
ప్రగతి పథం దార్శనికుడు..!
జాతీయత జగజ్జేత
రాజ్యాంగపు జ్ఞాననిధి
వికాసాల విజ్ఞాని
సుఖశాంతుల సుజ్ఞాని..!
సిద్దాంతపు రాద్దాంతం
లక్ష్మణ రేఖల లక్ష్య
చాయవాల చౌకిదారు
నమోజీ యే శాశ్వతం..!
భారతీయ చరిత్రలో
ఆదర్శం ఔదార్యం
మరువ దెపుడు భరతావని
నభూతో న భవిష్యతుగా...!
విజయీ విశ్వ తిరంగా ప్యారా!
నరేంద్రమోది నవనేత హమారా!!2
✍️డా.పాండాలమహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
16
సునంద ఉరిమిళ్ళ: కవితా గానం
తేదీ::03-05-2020
పేరు వురిమళ్ల సునంద,ఖమ్మం
శీర్షిక:: స్వేచ్ఛ..
స్వేచ్ఛ అంటే..
***********************
అరమరికలు లేకుండా
అంతరంగంలోని సంవేదనలను
వ్యక్తీకరించేందుకు కల్పించిన
ఆత్మీయ సన్నివేశం!
మనసును గాలి పటాన్ని చేసి ఎగరేసినా
మాంజా మన గుప్పెట్లో భద్రంగా ఉన్నంత సేపే..
వదిలేశామా..
చివరికి చింతల కొమ్మకు చిక్కుకోవడమే...
సమరస భావం సామాజిక న్యాయంతో
పక్షుల్లా ఆనంద విహాసయానం చేయగలగడమే....
నార్లవారన్నట్టు..
స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదు
నీతి నియమాలకు కట్టుబడి. ఉండటమే..
తానొవ్వక నొప్పించకుండా శాంతియుతంగా
వ్యక్తిత్వ పరిమళాలతో గుబాళించడమే అసలైన స్వేచ్ఛ..
17
03 May 2020
20:55
లాక్డౌన్ లో మానవాళి స్వేచ్ఛ ను కట్టడి చేయడం వల్ల
ప్రకృతి కి స్వేచ్చ
జంతువులకు స్వేచ్ఛ
పశుపక్ష్యాదులకు స్వేచ్ఛ
స్వచ్ఛమైన గాలికి స్వేచ్ఛ
గళ గళ పారే సెలయేటికి స్వేచ్ఛ
కాలుష్యం లేని ఆకాశానికి స్వేచ్ఛ
నిత్యం కాలుష్యపు రణగొణధ్వనుల్తో నిండే రహదారులకు స్వేచ్ఛ
కాలుష్యపు మబ్బుల చాటున చిక్కుకొన్నసూర్య చంద్ర వెలుగులకు స్వేచ్ఛ
ఇలా ప్రకృతి మెుత్తం స్వేచ్ఛ తో పులకరిస్తుంటే మానవాళి ఆశగా చూస్తుంది తనకూ స్వేచ్ఛగా జీవించే అవకాశం
కోసం
అలా జీవించాలంటే మానవాళి జీవజాలం ప్రకృతి రక్షణ మన ధ్యేయం స్వార్థం మరచి మంచిని పెంచి పరోపకారం చేసినపుడే భూలోకం స్వర్గధామం అని మానవుడు కంకణం కట్టుకోవాల్సిందే ప్రతిన బూనాల్సిందే
18
[03/05, 9:29 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:***స్వేచ్ఛ***
--------*****-------
ప్రతిజీవి కోరుకుంటుంది స్వేచ్ఛ
ప్రతిప్రాణికి తన ఇష్టప్రకారముం డాలనే ఇచ్చ
మనం బంధించిన పక్షుజంతువుల కష్టాన్ని
గుర్తించి ఇకనైనా మన్నిద్దాం వాటి ఇష్టాన్ని
తన స్వేచ్ఛకు భంగం కలిగితే
చిన్నిపాప సైతం తన అయిష్టాన్ని ఏడుపుగా వ్యక్తపరుచు
మనిషిస్వార్థం అన్నిజీవుల స్వేచ్ఛను హరించగా
మూగజీవులు ఆశక్తులై ఎంతో వగచు
బ్రిటీష్ వారి తర్వాత భారతీయులందరి స్వేచ్ఛను హరిస్తున్న కరోనా మనకెంత స్వేచ్ఛ ఉండిoదో తెలుపుతుంది
ఉత్తిత్తుగనే మా స్వేచ్ఛను హరిస్తున్నారంటూ మామూలు సమయాల్లో వాపోయే పిల్లలో పిల్లల్లాంటి మనస్తత్వమున్న వారో
జాగ్రత్తగా గమనించాలి ఈ సమయాన్ని జాగ్రత్తగా
మన్నించాలి మూగజీవాల స్వేచ్ఛను మన్నించాలి
కరోనా కాలం తర్వాతనైనా
ప్రవర్తించాలి మనసున్న మనుషులుగా
:;వల్లాల విజయలక్ష్మి,,ఆలేరు
19
[06/05, 8:02 PM] Swarna Samatha Poetess: **కవితా గానం **
**06/05/2020**
**స్వేచ్ఛ **
జీవికి స్వేచ్ఛ అవసరమే కానీ అన్ని సందర్భాల్లో కాదు
వివాహవిషయం లో
ఆరోగ్య ,ఆలోచన ,ఆనంద ఇలాంటి
కొన్నివిషయాలకే పరిమితం స్వేచ్ఛ కొన్ని సార్లు సప్త వ్యసనాలకు గురి చేస్తుంది కౌరవ సంతానం విషయంలో జరిగింది అదే
స్వేచ్ఛగాఉంటూ ,స్వచ్ఛంగా బ్రతకడము నేర్చుకోవాలి
అధిక స్వేచ్ఛ వలన సమాజానికి హాని జరగవచ్చు కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి
విపరీతధోరణి అలవడుతుంది ఇతరుల పట్ల గౌరవ మర్యాదలు నశిస్తాయి
వ్యక్తిత్వం దెబ్బతింటుంది
దుర్వ్యసనాలు ధరి చేరుతాయి .
**స్వర్ణసమత**
20
[06/05, 8:30 PM] Vakula Vasu: కవితా గానం
వకుళ వాసు
హన్మకొండ
అంశం-స్వేచ్ఛ
శీర్షిక-🍃వంకర నడక🍃
పెళ్ళాంమొగలం మ్యాట్ని సినిమాకి పోవాల్నంటేనే రోతపుట్టవట్టె....
ఎందుకొచ్చిన మిత్రవింద యేషాలో యేందో కొందరాడపిల్లలది....
సర్కారుబడిల ఫ్రీ గా ఇచ్చిన బడి డ్రెస్సులనుండి బయటపడి...
గప్పుడు గప్పుడే రంగుల బట్టలల్లకు దిగిన సీతాకోక చిలకలా...
బల్లె బెదరగొట్టి సదువుజెప్పే ఒజ్జల భయపు బంధాలు తెంచుకొని...
ఎట్లతిరిగినా అడిగెటోడుండడని హాయిగా ఎగిరే పక్షిలా...
జీవితమంటే ఏందో తెలియని ప్రాయంలో వంకర నడకే సోకని...
మాకూ స్వేచ్చగా తిరిగే హక్కున్నదని బరితెగించకే
ఓ బిడ్డా...
నీ స్వేచ్చని నీ చదువుల చూపరాదె...
నీ సాధికారతని నీ అభివృద్ధిల చూపరాదె....
నిన్ను జూసి నీఅసోంటి ఆడపోరగాండ్లు కూడా ....
మంచిగ సదవాలనుకునేటట్లు తయారుగారాదె...
జతగాడు లేకుంటే కాలేజిల ఇజ్జత్ పోతదనుకోకే...
రత్నంలాంటి దానివి ఎందుకు పనికిరాని రాయిగా మారకు...
నీకు స్వేచ్ఛ అవసరమే కాని
నీ తల్లిదండ్రుల పరువుతీషి...
సాటి ఆడది కూడా తూ అనేటట్లు ఉండొద్దు కదా బిడ్డా నీ బతుకు...
🍀🌹వకుళవాసు 🌹🍀
21
[06/05, 8:33 PM] బండారు సుజాతా శేఖర్: కవితాశీర్షిక :
"స్వేచ్చాజీవి "
రచన :డాక్టర్ బండారు సుజాతశేఖర్
Dt 06-05-2020
విహంగమా !ఓ విహంగమా !
ఎచ్చటికే నీ పయనం --
భూమ్యాకాశాలలో ఎటు చూసినా
నీ స్వేచ్చా విహారమే
కొమ్మ కొమ్మ లో ,రెమ్మ రెమ్మ లో
ఎటు చూసినా నీ రాగాలాపమే ;
రెక్కలున్న నీవు ,చూస్తే బహు చిన్న వే
అందుకే నేమే నీవంటే కుళ్ళు
విజ్ఞానికి నిగంటువును నేను
విధాత సృష్టికి మరో సృష్టి కర్తను నేను
ఖగోళంలో కాలు పెట్టి
భూలోకంలోకి తొంగి చూస్తా
కాని -
బాధ్యతల బంధాలలో బంధీని నేను
కుళ్లిపోయిన సమాజంలో పరమాణువును నేను
అందుకే నేనంటాను విహంగమా
ఓ విహంగమా
ఈ లోకంలో "స్వేచ్చాజీవి "వి నీవేనని .
/////----/////----///----///-----
(నాలో కవితపుష్పాలు వికసించిన తొలి రోజుల్లో రాసిన కవిత ఇది .
1992 లో నా "కవితాపుష్పం "లో
ప్రింట్ అయ్యింది )
////----////:::::::::://///----/////
22
[06/05, 8:34 PM] Ganjam Bhramaramba: స్వేచ్ఛ
గంజాం భ్రమరాంబ
తిరుపతి
అబ్బా...
కరోనా లాక్ డౌన్ లో
గుహల్లో దాగున్నట్లు
ఇన్నాళ్ళు ఇరుకున్న
మనుషులంతా
ఒక్కసారిగా
స్వేచ్ఛగా విహరిద్దామని
కాస్త తలలు భయటకు పెట్టారు.
అనకొండల కన్నా
పొడవైన.. బలమైన...
మందుబాబుల
క్యూలైన్ ల పొడవులు చూడలేక
నిన్నటిదాకా
అయ్యోపాపం అని
దయతలచేల
కనిపించిన జనజీవనం
కాస్త స్వేచ్ఛకే
ఇలా మద్యం ముందు
సాగిలబడుతుంటే
నిన్నటి దాకా
నీతులు చెప్పడానికి
ఉపయోగించిన
గురువుల సహనాన్ని
మందుబాబుల కోసం
కేటాయించిన దుస్థితిని
చూసి తట్టుకుని...
తమాయించుకునే
ధైర్యం లేని గుండెలన్నీ
లాక్ డౌన్ నుంచి
ఎందుకు బయటపడ్డామా
అని బేలగా స్పందిస్తున్నాయి.
కరోనా వైరస్ కన్నా...
భయంకరమైన మనుషులను చూసి
దూరంగా పారిపోతున్నాయి.
ఇన్నిరోజుల శ్రమ...
బూడిద పాలైయ్యిందన్న
"సారా"౦శం గ్రహించి
మాస్కుల వెనుక మౌనాన్ని
దాచుకొని పారిపోయాయి.
గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932918
23
[06/05, 8:43 PM] జనార్ధన్ వల్లభాపురం: స్వేచ్ఛ అంటే!
స్వేచ్ఛ అంటే
ముకుళించుకున్న సమాజాన్ని
పుచ్చ పువ్వులా
విచ్చుకునేలా చేయడం
తను బతుకుతూ
తన తోటివారిని తనలా బతికించే ప్రాణవాయువు స్వేచ్ఛ
ఆధిపత్యాన్ని మార్చురీలో ఉంచి
ప్రజల భావాలకు
మెరిట్ సర్టిఫికెట్ గా ఉండడమే స్వేచ్ఛ
స్వేచ్ఛ అంటే ప్రశ్నించడం
సమాజానికి చేయూతగా ఉండడం
ప్రశ్నించడం
జవాబులేని ప్రశ్నల కోసం నిలదీయడం
పక్షులకు ఎగరడానికి ఆకాశమే హద్దు
జంతువులకు అడవులు విహార యాత్రా కేంద్రాలు
జలపాతానికి దూకడమే స్వేచ్చ
ఏరుకు పారడమే స్వేచ్ఛ
కాలుష్యం కాటు లేక పోవడమే గాలికి స్వేచ్ఛ
ఆధిపత్య దోపిడిని
ప్రశ్నిస్తేనే మనిషికి స్వేచ్ఛ
స్వేచ్ఛ బతుకు సహజాతం
స్వేచ్ఛ సమాజ చరిత్రకు పత్రహరితం
బతుకు కోసం ప్రశ్న
బతికించడం కోసం ప్రశ్న
ఈతి బాధలనుండి విముక్తికోసం ప్రశ్న
ఉపాధి కోసం ప్రశ్న
ఉన్మాదాన్ని ఎదిరించడం కోసం ప్రశ్న
ఈ ప్రశ్నలకు జవాబులు వెతకడమే స్వేచ్ఛ
స్వేచ్చలేని బతుకు బందిఖాన
స్వేచ్ఛ ఉన్న మనిషి శాంతి పావురం
స్వేచ్ఛ ఉన్న సమాజం హరిత సౌందర్యలోకం
స్వేచ్ఛ లేకపోతే మనిషి మనిషిగా ఉండడు
మానవుడుగా ఉండడు
సమాజం సమాజంగా ఉండదు
వల్లభాపురం జనార్దన
9440163687
24
[06/05, 8:58 PM] Chakilam: కవితా గానం
చకిలం సురేందర్ రావు, భువనగిరి
అంశం:స్వేచ్ఛ
శీర్షిక: స్వేచ్ఛాజీవి.. ఆశాజీవి
-------------------------------
సమస్త జీవకోటికి హద్దూ.. సరిహద్దు స్వేచ్ఛ ..
గగనతలంలో విహరించినా.. సముద్రగర్భంలో విశ్రమించినా.. అణువు, పరమాణువులను గుర్తించినా..
కాలమానాన్ని లెక్కించినా..
విపత్తు, ఉపధ్రవాలను పరిశోధించినా..
జీవణాహారాన్ని శోధించినా..
ఈ మనిషే కదా స్వేచ్ఛా జీవి..
ఈ మనిషే కదా ఆశాజీవి
25
[06/05, 9:29 PM] Vineelamma: కవితాగానం
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : స్వేచ్చ
కవితా సంఖ్య: 21
తేదీ: 05/05/20
ఊపిరాడని రక్కసులెవరో
నొక్కేస్తుంటే
మాటరాని భయం గొంతులో
అడ్డుపడె....!!
కనుబొమ్మలు ఏవో రహస్యాలను
విప్పుతున్నా
కనులోగిలిలు దాపరికపు
అలజడిలో రెపరెపలాడె....!!
బంధీగా బతుకంతా ఒట్టి పోతూ
బీడునేలను ఈనుతూ
చల్లగ వీచే స్వేచ్చావాయువులకై
ఎగిసిపట్తున్నవి....!!
స్వేచ్చ మనిషి జీవితాన
అద్భుత వాహకం
అదిలేని నాడు బంగారు బాతుకూడా
కన్నీట మునుగు....!!
వినీల
[06/05, 9:30 PM] Kalva Rajaiah: కవితా గానం
26
అంశం : స్వేచ్ఛ
కవి పేరు : కాల్వ రాజయ్య
మనషిలోని మనసును వికసింప చేయునది స్వేచ్ఛ.
స్వేచ్ఛలేని జీవితం ఇచ్ఛను చంపుకున్నదౌతుంది.
స్వేచ్ఛలేని జీవితం బందిఖానాలో ఉన్న ఖైదీ
లాంటిది.
స్వేచ్ఛ మనిషిని ఎంతో ఎత్తుకు ఎక్కిస్తుంది.
ఎక్కువైతే ఎత్తేస్తుంది.
మనిషికి స్వేచ్ఛ వున్నప్పుడే తనకు తగిన అంశాన్ని ఎంచుకుంటాడు.
విద్యార్థికి స్వేచ్ఛ వున్నప్పుడే తన సొంత అభిప్రాయాన్ని చెప్పగలుగుతాడు
ఏదైనా అవసరం మేరకు వాడుకోవాలి ఎక్కువైతే తిక్క కుదుర్చుతుంది


Comments
Post a Comment