Skip to main content

వైశాఖ పూర్ణిమ కవితలు

సమూహ నిర్వహణః వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
 సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ గారు


సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ
అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం ః మెరుగు మధు
********************
1.పాల్వంచ హరికిషన్ గారు
2.కోరాడ నరసింహా రావు గారు
3.అనుముల తేజస్విని గారు
4.యం.రాంచందర్ గారు
5.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
6.బండారు సుజాతా శేఖర్ గారు
7.వల్లాల విజయ లక్ష్మి గారు
8.దిడ్డి మారుతి గారు
9.వకుళ వాసు గారు
10.అంబటి భాను ప్రకాష్ గారు
11.నోముల సంజీవరెడ్డి గారు
12.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
13.పోలా కిషోర్ కుమార్ గారు
14.బల్లూరి ఉమాదేవి గారు
15.గంజాం భ్రమరాంబ గారు
16.శ్రీకాంత్ కడార్ల గారు
17.సునంద వురిమిళ్ళ గారు
18.ఇంద్రవత్ రాహుల్ గారు
19. సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
20.తులసి వెంకట రమణాచార్యులు గారు
21.గుండ్ల రాజు గారు
22.ఉప్పల పద్మ గారు
23.గుండ్ల రాజు గారు
24.మర్రి జయశ్రీ గారు
25.విజయ దుర్గ గారు
26.సర్ఫరాజ్ అన్వర్ గారు
27.సంధ్యా శర్మ గారు
28.కాల్వ రాజయ్య గారు
29స్వర్ణ లత గారు
30.వై.యల్.ఎన్. రెడ్డి
*****************
1
[07/05, 8:01 PM] పాల్వంచ హరికిషన్: కవితాగానం
అంశం: గ్రామ స్వరాజ్యం
శీర్షిక: మెతుకు..🌱

ఆగమంటే ఆగనిది
కాలం
మనుషుల్లో తీరనిది
దాహం
కష్ట పడితే కాని
దొరకనిది అన్నం
భావి జీవితాలకు
వేస్తున్నారు కన్నం
రెతన్నకు లేదు
దర్పం
కష్టానికి ప్రతిఫలం
అత్యల్పం
మెతుకుకు లేదు అభయం
గిదే రైతన్న జీవనం
గిట్లయితే ఎట్లుంటది..
పల్లె జీవనం
మెతుకు వెతలతో
ఎలా సాధ్యం..
గ్రామ స్వరాజ్యం..!!

 --✍️( అర్జున..కలం )
    పాల్వంచ హరికిషన్
    రామన్నపేట, యాదాద్రి
    9502451780
2
[07/05, 8:02 PM] Korada: కవితాగానం
నేటి అంశం :-
 * గ్రామ స్వరాజ్యం *
కోరాడ నరసింహా రావు.,పూర్వవైభవం
          ***********
దేశానికి పల్లెలు పట్టు కొమ్మలు...దేశ ప్రగతి పల్లెలతోనే...గ్రామాలుస్వయంసమృద్ధితో గ్రామ స్వరాజ్యం రావాలి .,అని కలలు గన్న గాంధీజీ ఆశలు
అడియాశలేనా !?

స్వచ్ఛతకు,నిర్మలత్వానికి,ప్రేమాభి మానవులకు,త్యాగ నిరతికి,పచ్చదనానికి
ప్రక్రుతిదరహాసానికీ
ప్రతిరూపాలైనపల్లెలు
కళావిహీనమై వెల వెల బోవటంలేదూ?!

ధన వంతుల స్వార్ధ కుతంత్రాలకు పల్లెలు మాయమై పోయి ...
కార్ఖానాలు,అపార్టుమెంట్లయ్ దర్శన మివ్వటంలేదూ  !?
అన్నదాతలు బ్రతకలేక ఉసురులు  తీసుకున్న వాళ్ళు పోగా ...వలసకూలీలై పొట్టచేతబట్టుకుని
తల్లివంటి పల్లెలొదిలి
విటుల వంటి పట్నా లకు పరుగులు తీయటం   లేదూ ...!
గ్రామాలేఛిద్రమైపోతేయింక సంస్కృతీ, సాం ప్రదాయాలకు...
మనుగడెక్కడ...?!
మన మూలాలైన  గ్రామాలకు  వేరుపు రుగులు ,చీడపురుగులు పట్టి ...పూర్తిగా
సారాన్ని పీల్చి పిప్పి చెసేసాయి...!
చేతి వృత్తులు బతికి బట్టగట్టే మన గ్రామా లను,సనాతన సం
స్కృతీ,సాంప్రదాయాలు విలసిల్లే మన గ్రామాలను...ఆరోగ్యానికి,ఆనందానికి
నెలవైన ఈ మన గ్రా మాలను మనం పరి రక్షించు కోవలసిందే!

మన గ్రామాలు స్వ యం సమృద్ధితో ...
పరిపుష్టిగావింపబడి
గాంధీజజి కలలుగన్న గ్రామస్వరాజ్యస్థాపన
జరిగి తీరాల్సిందే ...
అప్పుడే గాంధీజీ ఆత్మకుశాంతి ...,దేశానికి పురోగతి !!
గ్రామ స్వరాజ్యం ...
జయం... జయం!
భారత భూమికి...
శుభం....శుభం !!
***************
.........కోరాడ.
3
[07/05, 8:05 PM] అనుముల తేజస్విని Poetess: వైశాఖ పౌర్ణమి కవన పోటీ
కవితాగానం
అంశం:గ్రామస్వరాజ్యం
శీర్షిక:ఏది గ్రామస్వరాజ్యం

ఏది గ్రామస్వరాజ్యం
గాంధీ నోట ఈ మాట
కలలు సఫలమైన వేళ
స్వరాజ్యహేళ
ఏది స్వరాజ్యం
పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు
అందుకే గ్రామాలు నేడు దేశభవితకు ఆదర్శాలు
ఎన్నో వేలు
లెక్కలేనన్ని విధాలు
ఆదర్శవంతమైన గ్రామంగా
గాంధీ సూక్తుని పాటిస్తూ
గ్రామస్వరాజ్యం నేలేకోనేలా
కనిపిస్తున్న వైనం
గ్రామ స్వరాజ్య లక్ష్యం
స్వేచ్ఛ జీవన విధానం
శ్రమయే జీవిత ఫలం
స్వచ్ఛభారత్ స్వచ్ఛ గ్రామ్
ఇలా అన్ని కట్టుబాట్లు
నియమాలతో స్వరాజ్యం ఏర్పడే
గంగదేవిపల్లి వంటి పల్లెలే
నేటి గ్రామాలకు ఉదాహరణలు
ఎందరో నాయకులు వచ్చి చెప్పిన
ప్రజలే నాయకులై గ్రామస్వరాజ్యాన్ని తీర్చిదిద్దాలి
కానీ ఆ నియమాలు ఏవి
మద్యపానబానిసలు
దోపిడీలు
రైతన్న చావులు
దుర్మార్గాలు
భూకబ్జాలు
వలసభాదితులు
ఇదియే గ్రామస్వరాజ్యమా
స్వపరిపాలన లక్ష్యమా....

అనుముల తేజస్విని
నర్సంపేట
తేదీ:7/5/2020.
4
[07/05, 8:11 PM] రాం చందర్ (P Friend Of Ambati Bhanu Prakash hd): కవితా గానం
నేటి అంశం:-గ్రామ స్వరాజ్యం
శీర్షిక:-రైతు
రచన--------యం.రాంచందర్ జీ
--------------------------------------------------------------------------------
అన్నదాత మనకు యన్నంబు పెట్టగా
ఇలను మనకు నితడు దేవుడయ్యె
దేవదేవుడుమన దేహమందుండును
వందనంబు నీకు భారతాంబ
--------------------------------------------------------------------------------
పాడి పంట సిరుల పల్లె లోగిళ్ళలో
నిండుకుండ యేరు నీరు పారె
చెలిమి నిలుపు ప్రేమ చెరువులో కలువలు
వందనంబు నీకు భారతాంబ
--------------------------------------------------------------------------------

గడ్డి గుడిసె పెంక గోడ గూనే మాయె
ఊట మోట బావి ఊసె లేదు
మొక్క జొన్న చేను మంచలన్నీ పోయె
వందనంబు నీకు భారతాంబ
--------------------------------------------------------------------------------
వర్ష మిలను కురియ హర్షించు రైతన్న
భరత మాత ముద్దు పెద్ద బిడ్డ
తనకు లేకయున్న తండ్రి గా పోషించు
వందనంబు నీకు భారతాంబ
--------------------------------------------------------------------------------
చేత హలము బట్టి జగతి భుక్తి యొసగు
బీడు భూమియంత  పంట చేయు
తనకు లేక రైతు దానమిలనుచేయు
వందనంబు నీకు భారతాంబ
[07/05, 8:12 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: ***గ్రామరాజ్య సౌభాగ్యం***
                             ✍️డా.పాండాల
5
భరతమాత  ఆధునికపు
అధినేతై రాజకీయ
నీతి నియమ జాతి ఖ్యాతి
ప్రపంచాననిలిపినట్టి..!

ఆజాది విలువలు గల
మనసంతా హైందవమే
ప్రగతంతా ఇతిహాసమే
నిబద్ధతకు నిదర్శనం..!

అరవిరసిన మందారపు
అస్త్రశస్త్ర విధులెరిగిన
మూర్తిమత్త్వ వికాసం
నిజాయితికి నిలువద్దం..!

చతురతలో తా యోధుడు
చాణక్య నీతి సంస్కారి
పేదరికం దేశమైన
పెద్దరికం యుక్తి నేర్చే.!

అసాధారణ అప్రమేయ
హిమాలయపు అతని కీర్తి
భూగోళపు యవనికపై
అచిరకాలమతని రక్తి..!

సౌరాష్ట్రపు సోమనాథ
దీవెనయే స్థితప్రజ్ఞత
త్రికరణా‌ల త్రిమూర్తత్వ
వందకోట్ల ప్రతీకుడిగా..!

భారతాంబ ముద్దుబిడ్డ
చాకచక్య ప్రసంగాల
ప్రతిరూపమే నరేంద్రుడు
చతుర్విధపు చమత్కారి...!

గ్రామరాజ్య సౌభాగ్యం
గాందీజీ కలలు నిజం
సార్థకతే సమర్దతగ
నడిపించెటి నాగరికం..!

ప్రత్యర్థుల చిత్తుజేసె
ప్రణాళికల బాటసారి
మృదుమధురపు హావభావ
ప్రగతి పథం దార్శనికుడు..!

జాతీయత జగజ్జేత
రాజ్యాంగపు జ్ఞాననిధి
వికాసాల విజ్ఞాని
సుఖశాంతుల సుజ్ఞాని..!

సిద్దాంతపు రాద్దాంతం
లక్ష్మణ రేఖల లక్ష్య
చాయవాల చౌకిదారు
నమోజీ యే శాశ్వతం..!

భారతీయ చరిత్రలో
ఆదర్శం ఔదార్యం
మరువ దెపుడు భరతావని
నభూతో న భవిష్యతుగా...!

విజయీ విశ్వ తిరంగా ప్యారా!
నరేంద్రమోది నవనేత హమారా!!2

✍️డా.పాండాలమహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
6

[07/05, 8:17 PM] బండారు సుజాతా శేఖర్: శీర్షిక :గ్రామస్వరాజ్యం
Dt :07/05/2020
రచన :డాక్టర్ బండారు సుజాతశేఖర్
కవితాశీర్షిక :ఊహలకు రెక్కలొచ్చే

ఊహలకు రెక్కలొచ్చాయి -
ఆకాశం మేఘాలని సిద్దం చేసింది
ప్రకృతి ఆకుపచ్చ చీర దాల్చి
విరబూసే పుఫలాల పంటలతో సీతాకోకచిలుకగా పులకించింది
గలగలపారే ఏర్లు ,కిలకిలరావాల ఖగాలు ,తీరొక్క శబ్దాల వన్య ప్రాణులు
హలాల ఎద్దుల డిక్కలు ,సృజన యంత్రాలు ,నాట్ల పాటల్లో ఇంద్రధనుస్సులు
కొలిమి క్రాంతి చక్రమైనది
ఊరు ఇప్పుడు సృజనాత్మకజాగృతి
;నిలువునా కృంగదీసిన -పేదరికం
అనుబంధం ,వృత్తి బంధం
కూలిన పెంకుటిల్లు ,వృద్దులు చిరునామాగా -కరువు కాటకంతో
అల్లాడిన -పల్లె -గ్రామం -(దేశం )
నేడు -నాటి గాంధీ కలల్ని నిజం చేసింది
పొట్టచేతబట్టి వలసెల్లిన పక్షులకు
ఆహ్వానమిచ్చి ,స్వశక్తితో ఊరికి ఊపిరై యువతీయువకుల్ని తమ కాళ్లపై
నిలబడమంది -పెద్దల అనుభవాలు
పిల్లల కోర్కెలు స్వరాజ్యసాధనకు
ఆయుధం చేసింది
ఇది గ్రామస్వరాజ్యం -ఇక్కడ స్వరాజ్యమంటే -తమ ఉనికిని తాము
కాపాడుకోవడం -బంధాల ముంగిట్లో
వనరుల్ని ప్రయోజనం చేయడమే
చదువుసంధ్యలు,విజ్ఞాననిధులు
పెట్టుబడిదారులకు ధార పోయక
జీవితాల్ని తామే నిరూపించుకోవడం
తపన నిజమవ్వడమే -
ఊహలకు రెక్కలొచ్చాయి
ఇప్పుడు మనం పునాదులకు వెళ్ళాలిసిందే -
మరో గ్రామ స్వరాజ్యానికి
రెక్కలు తొడగాల్సిందే .
/////:::::;;/////;;;;;;/////:::::;//:::::::
7
:***గ్రామస్వరాజ్యం******
----------**************--------

గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం*
అదెoతదూరమో!ఆకాశహర్మ్యమో!
వందేళ్లకైనను అయ్యేనా సాధ్యము?
ఇన్నాళ్ల విజయమెంత శాతమో?!

గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి
సాధిస్తేనే నెరవేరు స్వరాజ్యలక్ష్యసిద్ధి
లక్షల గ్రామాలను నిర్లక్ష్యం చేసి
ఇప్పటికే మూల్యం చెల్లిస్తున్నాం

ఒక *నాడు* స్వయంసమృద్ధితో
వెలిగిన పల్లెలు నిరాదరణతో నేడు
వెలవెలబోతు నగరాలపై ఆధారపడి
ముసలితల్లిలాగా బలహీనమాయే

గ్రామీణ జనాభాశాతం బాగా తగ్గి
పట్టణాలసంఖ్య విపరీతoగ పెరిగి                 పల్లెలు అక్కడే వేసిన గొంగళ్లలా ఉండే
పట్టణాలు కొత్తప్రేయసిలై ఆకర్షిస్తుండే

అతి వలసలతో పట్టణాలు శివార్లలో
కొత్త సమస్యలు అధికమై మురికివాడల
జనాభా చీమలపుట్టలకన్న అధ్వాన్నమాయే
*ఈ దుర్గతి మారితేనే దేశప్రగతి*

గ్రామాలలో ఉచితవిద్య మెరుగైన వైద్యం
సాగుకు త్రాగుకు *నీరు* పారిశుధ్యం
రహదారులు వృత్తిపనులకు ఉపాధి
వీధిదీపాలు.. అన్నీ ఉంటే లోటేది?

ఒకనాడు పచ్చని పల్లెలెంత కనువిందులు!
ఈనాడు పట్టణవాసమంటేనే జనం చిందులు
కూలినగోడలతో నిర్మానుష్య ఊళ్ళ సంధులు
స్థల'లేమి'తో పట్నాల్లో మనుషులతోనే పందులు

పంచాయితీరాజ్ చట్టం నిరుపయోగమాయెనో !?
పంచాయతీనిధులు దుర్వినియోగమాయెనో!
గాంధీజీఆశయాలు మార్గదర్శకసూత్రాలై రాజ్యాంగ న్యాయరక్షణ లేక అలంకారప్రాయమాయెనే!?

ఇపుడిపుడే పల్లెల్లో ప్రగతివెల్గులు కననాయె
తండాలెన్నో గ్రామపంచాయితీలాయె
గ్రామాల బాగుకే కసరత్తు మొదలాయె
గ్రామీణ జనాభాకే పథకాలు అమలాయె

సమగ్రతనెఱిగిన ప్రణాళికల కార్యాచరణ
చిత్తశుద్ధి కలిగిన నిరంతర పర్యవేక్షణ 
అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయం
ప్రభుత్వాల సరైనకృషి తప్పకతెచ్చు *గ్రామస్వరాజ్యం*


*వల్లాల విజయలక్ష్మి*  *ఆలేరు*
యాదాద్రి భువనగిరి(జిల్లా)
8
అంశం : గ్రామ స్వరాజ్యం
~~~~~~~~~~~~~

నాటి పల్లెవు
నీకెందుకీ పొగరు
యేమి చూసుకొని వీగుడు

కలుషితమైతే కనులు
కనబడవా యేమిటి?
ఎవరు కానరారా యేమిటి?

ఒక్కసారి
వెనుకకు తిరిగి చూసుకో
నీ గతమంతా తెలుస్తది
గతమైతే తిరిగి రాదు గాని

అప్పుడు నువ్వు
ఇప్పటి నాకంటే హీనంగుంటివి
గతం మరిసి నోడు
బాగు పడ్డట్లెక్కడ లేదు
జర గుర్తు పెట్టుకో

నేను బాగుంటేనె కద
నీకు మనుగడ
నేను లేక నువ్వు లేవు

నాకు నీకు
న్యాలకు మొగులుకు
ఉన్నంత తేడ

నేను పచ్చగుంటేనే కదా
నీకు కడుపు నిండేది
నేను తల్లి లాంటి దాన్ని
నాకందరు కన్న బిడ్డలే

నేనెప్పుడు కడుపును చూస్త
నేను భుజం మీద సంచి
బరువును సూడను
ఇది నీ అలవాటు

నా దెగ్గరికి వచ్చినోల్లకు
పలకరిస్త
అవసరం అడిగి తెలుసు కుంట

నేను మంచిగుంటెనె కద
నువ్వు మంచిగుంటవ్
అన్ని సౌలత్లు కల్పించి
మంచిగ చూస్కుంటె
నేనందర్కి చూస్కుంట

దేశం బాగు పడాలంటే
ముందుగాల గ్రామాలు
బాగు పడాలంటరు
జర మరిచి పోకుంట ఉండున్రి

దేశాభివృద్ధికి గ్రామాలే
పట్టుగొమ్మలు.


ఇగ ఉంటమరి....
~~~~~~~~~~~~~~~
దిడ్డి మారుతి,
కంగ్టి
చరవాణి :  9502561595
~~~~~~~~~~~~~~~
9

వకుళ వాసు
హన్మకొండ
అంశం- గ్రామ స్వరాజ్యం

శీర్షిక-🍃శాంతమ్మ 🍃

పల్లె పందిరి కింద పచ్చని వాకిలిలో ...

ముత్యాల ముగ్గు పరిచి పసుపు కుంకాల గడపలల్ల...

కోయిల కూతలకు పరవశించి వేప పూలజల్లు కురిపిస్తుంటె...

ఎర్రమన్నుతో అలికిన అరుగులు పావురంగ పిలిచి...

అలిసిన బాటసారిని సేదతీరమనేవి...

నారచీరలో తూరుపు ముఖాన సూరీడు బొట్టుపెట్టి...

చేతినిండ పూలగాజులతో కాళ్ళకు ఎండికడియాలతో...

ఎన్నెల నవ్వులు కురిపిస్తూ నట్టింట్లో నడయాడేది నా శాంతమ్మ....

ఏడబోయిందో మచ్చుకు కూడ కనిపిస్తలేదిప్పుడు...

పల్లె వాకిళ్ళు పొక్కిలై దర్వాజలగ్గట్టిన మావిడాకులు...

 ఎండి రొదబెట్టి ఎదురుజూస్తానయి....

అరుగులు పగుళ్ళువడి ఏపచెట్టు ఎండినాకుల...

 సప్పుడుతో ఏడుపు గాలి వీస్తోంది....

ఎప్పుడనంగనో వలసబోయిన శాంతమ్మకై...

పడమటోళ్ళ అలవాట్లన్నీ ఒంట బట్టిచ్చుకొని....

దారం తెగిన పతంగోలె గాలిగాబరైతాందో ఏందోనని...

పల్లెల నడిబొడ్డునున్న గాంధీబొమ్మ...

బోసిపోయిన నవ్వులతో ఊసుపోక....

ఎదురుజూడబట్టె కనుమరుగైన శాంతమ్మకై....

కనీసం పండగపబ్బానికైన పల్లెమొకం సూడకపోతదా అని....

🍀🌹వకుళవాసు 🌹🍀
10

నేటి అంశం:-


   *గ్రామ స్వరాజ్యం*
🌷🌼🌿🌿🌿🌼🌷

సీ.
పూల పరిమళముల్ మేలైన ఫలములు
       ‌ ‌పిల్లగాలులు వీచి ప్రియము గూర్చు
కంటికందమయిన పంట పొలములవే
      సెలయేటి జలములే సేద దీర్చు
ఊరువాడంతయు కారుమబ్బులు దాటు
       నీలి మేఘమువో లె నిధుల గూర్చు
చిన్న పెద్దల నెడు మన్నన చూపించు
         అనురాగములుగల్గి నవనినిల్చు.

ఆ.
కూలినాలి చేసి కూర్మిని బెంచుక
సాగి పోదు రకట చక్కగాను
సుఖము సౌఖ్యమనుచు  సుందరంబనుచునా
పల్లె మేలుకొలుపు చల్లగాను

కం.
గ్రామం బే కద జనులకు
కామిత వరములను తీర్చి కలిమిని బెంచన్
ప్రేమను పెంచును తిరముగ
నీ మము దప్పని నడతయు నిండుగబెంచున్

కం.
కలిమిని పెంచును గ్రామమె
కలకాలమునిల్చియుండు కష్టము లనకన్
తలపున ప్రేమలు నిండుగ
తలపించుస్వర్గసీమ ధారుణిపైనన్

సీ.
పసిడిపంటల చేత అలరారు పల్లెలే
      భువిని స్వర్గము జేసి ముదము గూర్చు
నిండు మనసు వారు మెండైన బ్రతుకు తో
      గండమనక సాగు దండు వలెను
మూగజీవాలను పూజించి ప్రేమించు
      జీవకారుణ్యం బె చిత్తమందు
రక్త బంధము లేక ప్రేమలే కలిగిన
       నిజ బంధువుల గుచు నిండుగాను
ఆ.
పల్లె బాగుపడిన పదిలమౌ దేశంబు
పట్టుగొమ్మగా దె పాలన మున
పల్లె బ్రతుకు చెడిన పాపమందరిదగు
పల్లె గొప్పతనము పావనంబు.

తే.
తల్లి ప్రేమను చూపుట కల్లగాదు
నెల్ల జనులను కాపాడు మల్లె మనసు
కల్లలెరుగని వారులే కాపాడు దురు
పల్లె జీవనంబు మనకు పదిల మెపుడు

✒️
 అంబటి భాను ప్రకాశ్
జోగులాంబ గద్వాల జిల్లా
9948948787.
11
అంశం : గ్రామ స్వరాజ్యం .

ప్రతి గ్రామం రాజకీయంగా ఆర్ధికంగా
స్వేచ్ఛా సమర్ధతలతో స్వయం సమృద్ధి
సాధించడమే గ్రామ స్వరాజ్యం
ఇది జాతి పిత మహాత్మా గాంధీ భావన
అది నిజమైతే గ్రామాల పాలిటి దీవెన
భారత దేశానికి ప్రాణం గ్రామం
దేశానికి వెన్నెముక గ్రామాలే
అందుకే గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి
గ్రామాల పెంపుడు పిల్లలే పట్టణాలు నగరాలు
అయినా దేశ జనాభాలో డెబ్బై శాతం
నేటికీ గ్రామీణ భారతమే
చేసేది పట్టణ వాసం మేసేది పల్లెల గ్రాసం
గ్రామ స్వరాజ్యం తోనే బలమైన రాజ్జ్యం
  గ్రామవికాసమే దేశాభివృద్దికి ఆజ్జ్యం
దేశం పందిరైతే గ్రామాలు దాన్ని
పటిష్టంగా నిలబెట్టే గుంజలు
దేశ పారిశ్రామికాభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలు
పరిశ్రమల ఉత్పత్తులకు గ్రామాలే గిరాకీ
గిరాకీ ఉండాలంటే కొనుగోలు శక్తి ఉండాలి
అందుకే గ్రామాలు స్వయం సమృద్ధి పొందాలి
గ్రామాల అవసరాలు గ్రామాల్లోనే తీరాలి
అప్పుడే గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్జ్యం
సాకారమై భారతదేశం ప్రగతి పథాన సాగేది .
గ్రామాలు భరతమాత శిగలో
సిరిమల్లెలై సిరుల పరిమళాలు కురిసేది .
[07/05, 8:32 PM] Ramaka: 🎯కవితాగానం🎯

*వైశాఖపౌర్ణమి నగదుబహుమతుల పోటీ*
12
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:7-5-2020
అంశం:గ్రామ స్వరాజ్యం
ప్రక్రియ: వచనకవిత్వం
శీర్షిక: దేశపునాదులు
**************************

దేశ ఆర్థికవ్యవస్థ మూలాలు గ్రామాలే
సాంఘిక,ఆర్థిక బలోపేతమే లక్ష్యం
స్వయం సమృద్ధి,స్వయంపాలనలే మూలస్తంభాలు
గ్రామాలే అభివృద్ధే దేశాభివృద్ధి
ఆహారోత్పత్తి జరిగే అన్నపూర్ణ గ్రామమే
చేనేతవస్త్రాలు నేసే కేంద్రం
పశుసంపదతో విరాజిల్లు ఆశ్రమం
ఆడుకోవడానికి ఆటస్థలాలు
అక్షరాస్యత కోసం గ్రంథాలయాలు
ఆరోగ్యం కోసం వ్యాయామశాలలు
నిర్భంధ ప్రాథమిక విద్య అమలు కోసం విద్యాలయాలు
అవసరమని గుర్తించిన గాంధీమార్గం
కావలిసినపంటలు పండించుకుంటూ
మిగిలిన భూమిని దేశసౌభాగ్యం కోసం వినియోగించాలి
మంచినీటి వసతులు,మురుగునీటి పారద్రోలు మార్గాలు
విద్యుత్ సౌకర్యాల ఏర్పాటు
బావులు,చెరువుల ఆలనా-పాలనా
పంచాయతీ వ్యవస్థకు జవసత్వాలతో స్వయంపాలన
జాతీయసమైక్యతతో గ్రామంలో ఐకమత్యత
మద్యనిషేధంతో గ్రామాభివృద్ధి
అస్పృశ్యత నిర్మూలనతో సమభావం
గ్రామస్వరాజ్య స్థాపనా లక్ష్యాలు
గ్రామస్వరాజ్యం దేశసౌభాగ్యం
దేశ అస్తిత్వానికి గ్రామాలు చిరునామాలు.
13

అంశం : గ్రామ స్వరాజ్యం
పేరు : పోలా కిషోర్ కుమార్
శీర్షిక : రైతన్న రాజ్యం

గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు
గ్రామ ప్రగతి దేశానికి వెన్నుముక
గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ది చెంది  గ్రామ స్వరాజ్యం సిద్దించినపుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు
కాని నేడు ఆధునిక పేరుతో అంతర్జాతీయ మాయాజాలంలో చిక్కుకొన్న ప్రభుత్వాలు
దేశ రాజకీయాలు గ్రామాలను కార్పోరేట్ కబంధహస్తాల నుండి రక్షించలేక పోతున్నాయి

గ్రామాలు అంటే మనకు గుర్తుకువచ్చేవి
వ్వవసాయం పాడిపంటలు కులవృత్తులు
ప్రేమానురాగాలు
నేడు రియల్ ఎస్టేట్ దెబ్బకు పంట పండే పొలాలు పండ్ల తోటలు కనుమరుగై వ్వసాయం కుంటుబడింది
అరకొర వ్వసాయం చేసేవారు నకిలీ ఎరువుల బారిన పడి పంటలు పండక
పండిన పంటలకు మద్దతు ధరలు లేక
మెాసపోయి దిక్కులేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
జీవననోపాది కష్టమై పాడి పరిశ్రమ కుంటుబడి పోయింది

కార్పోరేట్ వ్యాపారాలు కులవృత్తుల బతుకుల మీద విషం చిమ్ముతున్నాయి
ఆపదలు వచ్చినపుడు సరైన సహాయ సహకారాలు లేక గ్రామాలు కన్నీరు కారుస్తున్నాయి నేటికి గ్రామాలకు సరైన సదుపాయాలు లేక తల్లడిల్లుతున్నాయి
బ్రతుకు దెరువు లేక పల్లె జీవితాలు
వలస బాట పోతున్నాయి

రాజకీయాల మాయాజాలాలు స్వార్థం అసూయ ద్వేషాలలో చిక్కుకున్న మానవ సంబంధాలు విలువలు మరచి పల్లెజీవితాలను నశింపచేస్తున్నాయి దేశానికి వెన్నుముకగా నిలవాల్సిన
గ్రామాలు పల్లెలు ఆశించినంత అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి తగిన ఫలితాన్ని పొందలేకపోతున్నాయి

గ్రామాలు సుభిక్షంగా ఉండాలంటే      కలుషితం లేని పరిపాలన కావాలి
వ్యవసాయం ఊపిరి నిలవాలి
గోహత్య నిషేద చట్టం అమలు కావాలి
మధ్యపాన నిషేదం అమలు కావాలి
శ్రమకు తగ్గ ఫలితం లభించాలి
రైతన్న రాజ్యం రావాలి
అప్పుడే గ్రామ స్వరాజ్యం సిద్దిస్తుంది
14

అంశము: గ్రామ స్వరాజ్యం

ఆ.వె:వలస వెళ్ల నీక వసతులు సమకూర్చ
    గ్రామసీమలెల్ల ఘనముగాను
     పాడిపంటతోడ పచ్చగా వెలుగుచు
     దేశమునకు ఖ్యాతి తెచ్చు నెపుడు.

ఆ.వె:పాడి పంటలున్న పల్లెటూళ్ళెల్లను
    పలకరించు జనుల పరవశాన
     వారి బాగు కోరి ప్రభుత సహకరింప
       భరత జాతి కీర్తి పరిఢవిల్లు.

 ఆ.వె:పల్లెటూళ్ళె  దేశ భవితకు బాటలు
       పల్లె జనుల శ్రమయె భావి ప్రజకు
      పంటలిలను రైతు పండించు చుండగా
      జనుల కడుపు నిండు జగతి యందు


ఆ.వె:విద్య వైద్యములను విధిగ గ్రామము లందు
      జనుల  కెల్ల వేగ సక్రమముగ
    నందచేయ దేశ నపుడె బాగుండున
     టంచు తెలుపచుందు రార్యు లెపుడు
 


ఆ.వె:బావు లందు నూట  బాగుగా తీయించి
     నీటి వసతు లెల్ల  నెమ్మి తోడ
      కలుగ జేసి నంత గ్రామముల ప్రజలు
       గడుపు చుందు రెల్ల కాల ముచట



ఆ.వె:భరత జాతి యొక్క బలమె పల్లెలనుచు
      పట్టు కొమ్మ లవియు వసుధ కెప్పు
      డనెడి బాపు మాట లాచరించి పనులు
      చిత్తశుద్ధి తోడ చేయవలయు
15
కవితా గానం
7-5-2020
పౌర్ణమి కవితల పోటీ
అంశం:- గ్రామ స్వరాజ్యం

"పల్లె మళ్ళీ చిగురించినపుడే..."
గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932918

ఎండిపోయిన చెరువు గుంటలు
నిండునీటితో కళకళలాడాలి

పైరుపంటలతో.. పాడిఆవులతో
పల్లెలన్నీ పులకరించిపోవాలి

బక్కచిక్కిన బడుగురైతులు
చిరునవ్వులు కురిపించాలి

కోడెదూడల లోతుడొక్కలు
కండపట్టి కదలాడితీరాలి.

పిచ్చుకల కిలకిలారావాలు
చెట్టు చెట్టుకూ వినిపించితీరాలి

నాగరికత పేరుతో మోసుకొస్తున్న
కల్మషాలన్నింటినీ కూలదోయాలి

కొండచిలువలా ప్రవేశిస్తున్న
కాలుష్య కారణాలన్నింటినీ
పల్లె పొలిమేరల్లోనే పాతరేయాలి

వలసపక్షుల్లా పట్టణాలకు
ప్రయాణమవుతున్నపల్లెవాసులకు
 తమ ఊరిలోనే తగినంత
ఉపాది మార్గాలు ఏర్పరచి చూపాలి

మా పల్లెలు ప్రగతిసీమలూ..
పర్యావరణానికి పట్టుగొమ్మలూ
అని ప్రజలు పరుగెత్తుకు రావాలి.

నిజమైన గ్రామ స్వరాజ్యం ఎప్పుడంటే...
పల్లె మళ్ళీ రమ్యంగా చిగురించినపుడే...
సరికొత్త రూపుతో ఉదయించినపుడే..

గంజాం భ్రమరాంబ
తిరుపతి
16
9949932918
[07/05, 8:47 PM] శ్రీకాంత్ కడార్ల Poet: *💐💐💐కవితాగానం💐💐💐*

అంశం: *గ్రామ స్వరాజ్యం*
శీర్షిక :  *గ్రామాలే దేశ సౌభాగ్యం*
పేరు: శ్రీకాంత్ కడార్ల
ఊరు:హన్మకొండ

వేదవేదాలకు నిలయమైన దేశం
వేలవేల గ్రామాలతో నిండియున్న దేశం
సంస్కృతి సంప్రదాయాల దేశం మన భారతదేశం

నాగరికత మొదలైంది పల్లెల్లోనుండే
కాలగతులను మార్చిన ఎందరో గొప్పవ్యక్తుల
 ప్రస్థానం మొదలైంది గ్రామాలనుండే
పల్లె సంస్కృతే మన దేశ సౌభాగ్యం

పచ్చనిచెట్లతో, పైరు దుప్పట్లతో
పక్షుల రావాలతో, ఆప్యాయత పలకరింపులతో
పుడమి పులకించు పంటలతో మనుషులను మురిపించు అనుబంధనాలతో ఉయ్యాలులూగే పల్లెలు
ఎన్నాళ్లైనా అభివృద్ధి నోచుకోక
దినదినము  ప్రభని కోల్పోయి కళావిహీనమవుతున్నాయి....

చేతివృత్తులకు చేయూత లేదు
దుక్కిదున్నే రైతుకు ఆదరణ లేదు
విద్యావైద్య సదుపాయం అందడంలేదు
మెరుగైన సౌకర్యాల కల్పన లేదు
ఉపాధికి మార్గమనే జాడ లేనే లేదు
ఓట్లపండుగప్పుడే ఊర్లలలో ఎగిరే జెండాల సాక్షిగా పల్లె కన్నీరు బెడుతుంది...

స్వతంత్యాన్ని కలగని సాధించిన గాంధీ
నిజమైన స్వప్నమైన గ్రామస్వరాజ్యం
ఇంకా కలగానే మిగిలిఉంది

ఏనాడైతే భారతదేశ ఆత్మ పల్లెల్లో ఉందని గ్రహిస్తారో
ఏనాడైతే విద్యా, వైద్య సౌకర్యాలు కలిపిస్తారో
ఏనాడైతే గ్రామీణవికాసమే దేశప్రగతని భావిస్తారో
ఏనాడైతే పొలాన్ని నమ్మి హలాన్ని పట్టే
రైతుకు పట్టాభిషేకం చేస్తారో
ఏనాడైతే అధికార బదలాయింపు జరుగుతుందో
ఏనాడైతే గ్రామాల్లో పురుష, స్త్రీల మధ్య వైషమ్యం కనుమరుగవుతుందో
ఏనాడైతే మహిళా సాధికారతకు నడుం బిగిస్తారో
ఏనాడైతే స్వయం సమృద్దికి బాటలు పరుస్తారో

ఆనాడు

గ్రామాలు చీకట్లను తొలచిన దివ్వెల్లా
గ్రహాణాలను వీడిన సూర్య చంద్రుల్లా
పూర్తిగా వికసించిన పుష్పసౌరభాల్లా
గ్రామస్వరాజ్య కాంతులతో ప్రభవిస్తాయి
17
[07/05, 8:50 PM] సునంద ఉరిమిళ్ళ: కవితా గానం
తేదీ::07-05-2020
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం:: గ్రామ స్వరాజ్యం
శీర్షిక:: గాంధీజీ కలలు కన్న..
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
సువిశాల భారతదేశం
పల్లెటూర్లతో విలసిల్లే ఆకుపచ్చని ఆనంద నిలయం!

శ్రమైక జీవన సౌందర్యానికి చిరునామా
పట్టణాల కడుపులు నింపే అన్నపూర్ణ
ప్రభుత్వానికి ఆహార నిధులు సమకూర్చే ధాన్య భాండాగారం!

ప్రతి పల్లె  భారత మాత కిరీటంలో
స్వయం ప్రకాశంతో మెరవడానికి
గాంధీజీ కలలు కన్న రూపమే గ్రామ స్వరాజ్యం!

 పల్లెటూర్లు పట్టుగొమ్మలై
దేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు
రైతులే రాజులై తమను తాము పాలించుకునే అద్భుతమైన అవకాశం!

ఊర్లన్నీ సస్యశ్యామలం కావాలంటే
జలం జీవమై క్షీర ధారలై ప్రవహించేలా
మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో
గ్రామాలు స్వరాజ్యాలై కళకళలాడేందుకు
పదం పదం కలిసి పలుగూ పారా పట్టి
సమైక్యతా రాగం ఆలపించాలి అందరూ..
18
[07/05, 8:57 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం పౌర్ణమి పోటీలు*
 ★★★★★★★★★★★★

✍️ ఇంద్రవత్ రాహుల్....


*అంశం*: గ్రామ స్వరాజ్యం  *రచన తేది*: 07/05/2020 *న్యాయ నిర్ణేత*: శ్రీ పంతుల విట్టుబాబు గారు..

 
        *గ్రామ స్వరాజ్యం*


పల్లెలు పట్టణాలుగా
మారిపోతున్నాయి.
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఎక్కడికి పోతుందో మరి
పచ్చని గ్రామాలు వెలిసి
పాడి పంటలు సమృద్దిగా ఉండి
వచ్చిన భాగ్యముల్ గలిగి
వర్దిల రైతు కుటుంబం సంతోషంతో
దేశం లోపల అన్ని రాష్ట్రాలు
విచ్ఛిన్న పూల లాగ మారి
పించుత కీర్తి పరీమళమ్ముతో
నగరం దీటుగా పల్లె నవ్య రీతి
విద్య, వాణిజ్య వెద్యల వెలుగును
ఆధునిక పరిశ్రమ వాడలన్ని
మళ్లీ వెలిసి
గ్రామమే దేశంలో స్వర్గదామ మగుత
స్వామియు, సేవక భేదము మాత్రము లేని యట్లు మురియన్
గ్రామ స్వరాజ్యము వెలిసి
భూమిలో సకల వృత్తి పోషణ లభించి
ఏ గ్రామంలో ఎల్ల విద్యార్థులు
ఉన్నత విద్యలు చదివి
ఏ గ్రామంలో ఎల్ల యువత తగు ఉద్యోగ ప్రాప్తితో ఉరాడిలున్
ఏ గ్రామంలో వృద్ధులు, బాలలున్ ఆరోగ్య రక్షణ కలిగి ఉండగలరో
ఏ గ్రామంలో ఎల్ల నారీ మణులు పురుషులతో సమానులై వరలగలరో
అప్పుడు ఈ గ్రామ స్వరాజ్యము
పట్టణంలో సాగే వలస లాగి
పల్లెలు సుభిక్షమై శక్తివంత మగును
గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం వెలుగును గాక...


*హామీ పత్రం*: ఈ కవిత నేను స్వయంగా రాసాను..  అని హామీ ఇస్తున్నాను...

       ధన్యవాదములు.. 🌹🌹

*ఇంద్రవత్ రాహుల్*
    *నిజామాబాద్*
    *9848054079*
19
[07/05, 9:09 PM] +91 94941 62571: కవతాగానం
శీర్షిక.. పల్లెలే పట్టుకొమ్మలు
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి

పల్లె లే దేశానికి పట్టుకొమ్మలు
సనాతన సంప్రదాయ సంస్కతులకు
నిలయాలు
పాడిపంటలతో శుభిక్షంగా విలసిల్లిన భాగ్యసిరులు
పచ్చని పొలాలతో కళకళలడుతూ
స్వచ్చతకు బాట పడుతూ
కల్మషం లేని మనుషుల మమతల
మనసుల పాలనురుగులు
సెలయేరులతో శోభాయమానంగా
అందాలతో వరజిల్లే వరాలు
దేశం ఆర్ధికంగా పురోభివృద్ధి చెందాలంటే వ్యవసాయంగా అభివృద్ధి బాటలో నడిచే గ్రామాలు
బంగారు భవితకు మూలాలు
మహిళా సంఘాలు,యువజన కమిటీలతో పురోభివృద్ధి సాధిస్తున్నారు
నిరంతర కృషితో అహర్నిషలు రైతులు పొలం పనులలో మునుగుతూ పండించే దేవుళ్ళు
20
[07/05, 9:12 PM] Tulasi Venkata Ramana: కవితా గానం.
పౌర్ణమి పోటీ కవిత.
పేరు:తులసి వెంకట రమణా చార్యులు.

అంశం: గ్రామ స్వరాజ్యం.

శీర్షిక:పల్లె దేశ ప్రగతికి పట్టుకొమ్మ.

పల్లె తల్లి వంటిది...పట్నం ప్రియురాలు వంటిదని భావకవి చెప్పనే చెప్పాడు కదా!
అమ్మ ను ,ఉన్న  ఊరును నమ్ముకొంటే  జీవనం సాఫీగా సాగుతుంది.
గ్రామ స్వరాజ్యం అంటే గ్రామ వికాసమే సుమా!
చూడ చక్కని పైరు పంటలు పాడి పశుఅభివృధియే దేశ ప్రగతికి సోపానం!
పల్లె గాలి ప్రాణవాయువు ఆయుష్షు పెంచుతుంది.
మెతుకు బతుకును బలపరుస్తుంది.
గ్రామ సరిహద్దులో హరిత విప్లవ నాంధియే..
దేశ ఆర్థిక వ్యవస్థ కు పునాది
అందుకే మహాత్ముడు బాపు గ్రామ స్వరాజ్యం గురించి కలలు కన్నాడు..
నడక, నడత నేర్పేది తొలి అడుగే ...
ఆడగులను సరిదిద్దే గురువు అమ్మనే కదా!!
రైతు స్వేచ్ఛ గా బతకాలంటే వ్యవసాయమే కదా ఆయుధం
పుడమి తల్లి ఎదను పెక్కిలిస్తూ..
రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి  సేద్యం చేస్తూ అలుపెరగని పోరాట యోధుడు రైతన్నే!!
రైతు రాజు కావాలంటే గ్రామాభ్యుదయం చెందాలి
పాలనలో సంస్కరణలు రైతు సేద్యంకు సహకారం అందిస్తే
బీడుభూములు రత్నరాశులుగామల్చే సైనికులు రైతులే సుమా!..
సంపూర్ణ అవగాహనతో గ్రామ పెద్దలు చక్కటి ఆలోచన చేస్తే
గ్రామంను ఆదర్శ వంతంగా తీర్చిదిద్దే విధాతలు పల్లెవాసులే సుమా!
మౌలిక సదుపాయాలు కల్పిస్తూ.
అక్షరాస్యత కల్పిస్తూ..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరిస్తూ..
ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఉంటే  ...
నవీన పోకడలతో ప్రపంచాన్ని జయించే సత్తా చాటే నిస్వార్థ సేవ తత్పరులు గ్రామీణ ప్రజానికమే సుమా!
దశాబ్దాలుగా పాలకులు గ్రామ స్వరాజ్యం పై  సరైన దృష్టి సారించక పోవడమే నేటి వెనకబాటుతనానికి కారణం సుమా!!
దేశ,ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునాది గ్రామీణాభివృద్ధి యే..
ఆ అభివృద్ధి ఫలమే దేశ ఔన్నత్యాన్ని పెంచుతుంది.
సర్వతో ముఖాభివృద్ధికి పల్లె ఆయుపట్టు...
ఇకనైనా పాలకులారా...ఏనాడో కలలు కన్న గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేద్దాం...!!
గ్రామీణ అభ్యుదయంతో గ్రామ స్వరాజ్య లక్ష్మిని పొందుతాం
అందరం కలిసి కట్టుగా నడుద్దాం..
గ్రామ స్వరాజ్యం ను సాధిద్దాం!!.
21
[07/05, 9:24 PM] Gundla Raju Sir: గుండ్లరాజు
కవితా గానం వైశాఖ మాసం పౌర్ణమి పోటీలకు...
అంశం : గ్రామ స్వరాజ్యం
కవితా శీర్షిక : *ముందడుగు*

కొండల సందుల్లో ఉద్భవించిన
నీటి చెలిమ సన్నని పోగులా
బయలుదేరి అనేకానేక
పాయలుగా విడిపోయి
భూమాతకు జవాసత్వాలిస్తూ
తనకు తానుగా కడలికి
ప్రస్థాన మవుతున్నతీరు
నాదేశపు జనపదాలకు జీవనాడి కాదా!!

పూర్ణ స్వచ్ఛతకు ఆలవాలమైన
ఆత్మీయతానుబంధాలకు నెలవైన
దూది పింజల వంటి సహృదయాలు
నాదేశపు ఆకలిని తీర్చడానికి
నాగలిని చేపట్టిన అభాగ్యులు
నాపల్లెలకు జీవగర్రలు కాదా!!

నాదేశానికి ఆత్మలైన పల్లెలోగిళ్ళు
సంస్కృతీ సంప్రదాయాలకు
నాగరికతకు మూలాలు,
ఆప్యాయతానురాగాలకు గాలాలు,
కల్లాకపటమెరుగని ప్రశాంతి నిలయాలు,
పురాణేతిహాసాలజ్ఞానానికి అవాసాలు
గాంధీజీ గ్రామ స్వరాజ్యానికి ఆలంబనాలు
వీటిని కుటుంబ బంధాలతో పరిమళించేట్టుగా
పచ్చని ప్రకృతి సాక్షిగా
గ్రామాలు సర్వతోముఖాభి వృద్ధి సాధించాలని
కాంక్షించిన మహాత్ముని ఆశయ సిద్ధికి
నేటి వారసత్త్వము
కంకణబద్ధులై, కార్యదక్షులై
గ్రామ సీమలను
భూలోకస్వర్గసీమలుగా గాంచి...
గ్రామ స్వరాజ్యమే నాదేశ సౌభాగ్యమని భావించి
ముందడుగేయాలి...


*🌹🌹🌹గుండ్లరాజు🌹🌹🌹*
22
[07/05, 9:24 PM] ఉప్పల పద్మ Poetess: తేది :07-05-2020
వైశాఖ పౌర్ణమి పోటీ  నిర్వహణ : కవితా గానం
అంశం :గ్రామ స్వరాజ్యం
శీర్షిక : *గ్రామ స్వరాజ్యం*
***********************

పాడి పంటలు పచ్చగుండి
భూమిపుత్రుల కంటిలో సిరుల కాంతులు వెలిగినపుడు
గ్రామాలన్నీ స్వయం సమృద్ధి కేంద్రాలై
ఉత్పత్తి కర్మాగారాలైనపుడు
గాంధీజీ  కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం నెరవేరినట్లే

బీద బిక్కి మాటల జాడలు
జన వ్యవహారంలోనుండి
కనుమరుగై
ఆకలికేకల ఆర్త నాదాలు
అప్పుల ఆత్మహత్యల బలిదానాలకు స్వస్తి వాచకం పలికినప్పుడు  నిజమే
గ్రామ స్వరాజ్యానికి రూపం దక్కినట్లే

సమయానికి వైద్య మందక
అసువులు బాసే స్థితిని జయించి
ఊరూర ఆసుపత్రులు వెలిసి
ప్రజల ఆరోగ్యమే పాలక వర్గాల ధ్యేయం అయినప్పుడు
నిజమే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య వృక్షం విరగ పూసినట్టే

పట్టణాలకు ధీటుగా
విద్యాసుగంధాలు పల్లెల్లోనూ పరివ్యాపితమై
యువత అంతా ఉద్యోగఫలాలు అందుకున్నప్పుడు
నిజమే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి  అర్థం చేకూరినట్లే

పల్లె గడపలు పారిశ్రామిక వాడలై
పరిపాలనకు  గ్రామ సౌభాగ్యమే పరమావధి అయి
సంక్షేమమే గమ్యమైనప్పుడు
నిజమే గాంధీజీ కలలు కన్న నిజమైన గ్రామ స్వరాజ్య ఆశయం సాకారమయినట్లే
గ్రామము ఇలలో స్వర్గధామమయినట్లే

   *ఉప్పల పద్మ*
చరవాణి :8340933244
23
[07/05, 9:25 PM] Gundla Raju Sir: గుండ్లరాజు
కవితా గానం వైశాఖ మాసం పౌర్ణమి పోటీలకు...
అంశం : గ్రామ స్వరాజ్యం
కవితా శీర్షిక : *ముందడుగు*

కొండల సందుల్లో ఉద్భవించిన
నీటి చెలిమ సన్నని పోగులా
బయలుదేరి అనేకానేక
పాయలుగా విడిపోయి
భూమాతకు జవాసత్వాలిస్తూ
తనకు తానుగా కడలికి
ప్రస్థాన మవుతున్నతీరు
నాదేశపు జనపదాలకు జీవనాడి కాదా!!

పూర్ణ స్వచ్ఛతకు ఆలవాలమైన
ఆత్మీయతానుబంధాలకు నెలవైన
దూది పింజల వంటి సహృదయాలు
నాదేశపు ఆకలిని తీర్చడానికి
నాగలిని చేపట్టిన అభాగ్యులు
నాపల్లెలకు జీవగర్రలు కాదా!!

నాదేశానికి ఆత్మలైన పల్లెలోగిళ్ళు
సంస్కృతీ సంప్రదాయాలకు
నాగరికతకు మూలాలు,
ఆప్యాయతానురాగాలకు గాలాలు,
కల్లాకపటమెరుగని ప్రశాంతి నిలయాలు,
పురాణేతిహాసాలజ్ఞానానికి అవాసాలు
గాంధీజీ గ్రామ స్వరాజ్యానికి ఆలంబనాలు
వీటిని కుటుంబ బంధాలతో పరిమళించేట్టుగా
పచ్చని ప్రకృతి సాక్షిగా
గ్రామాలు సర్వతోముఖాభి వృద్ధి సాధించాలని
కాంక్షించిన మహాత్ముని ఆశయ సిద్ధికి
నేటి వారసత్త్వము
కంకణబద్ధులై, కార్యదక్షులై
గ్రామ సీమలను
భూలోకస్వర్గసీమలుగా గాంచి...
గ్రామ స్వరాజ్యమే నాదేశ సౌభాగ్యమని భావించి
ముందడుగేయాలి...


*🌹🌹🌹గుండ్లరాజు🌹🌹🌹*
24
[07/05, 9:26 PM] మర్రి జయశ్రీ: కవితా గానం
మర్రి జయశ్రీ
అంశం..గ్రామస్వరాజ్యం

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు
గ్రామస్వరాజ్యమే దేశ సౌభాగ్యమన్న
మహాత్ముడి కలల భారతం మనది.
పాడి పంటల సమృద్ధిగా
జలరాసులు మెండుగా
సకల సౌకర్యాలతో తులతూగే పల్లెలు
నేడు వెల వెల బోయి
వలసబాట పట్టిన స్థితి
తినడానికి తిందిలేక
అరకొర సౌకర్యాలతో
అనునిత్యం గడిపే నిర్జీవంగా దర్శనమిచ్చే దౌర్భాగ్యం పల్లెలది.
స్వార్ధ ప్రయోజనాలతో
కాసుల వేటలో
పర్యావరణ కలుషితమై
బీడు భూములై
బిక్కు బిక్కుబిక్కుమనే పల్లెలు కోకొల్లలు
స్వార్థం వీడి
సరైన పాలనతో
గ్రామాల అభివృద్ధికి కంకణం కట్టుకొని
ప్రకృతి సంపదలు కాపాడుకొని
జలరాసులతో కలకలలాడుతూ
అన్నదాత సమృద్ధిగా పంటలు పండించి
రాజుగా నిలిచిననాడే
నిజమైన గ్రామస్వరాజ్యం.
25
[07/05, 9:27 PM] Vineelamma: కవితాగానం
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : గ్రామస్వరాజ్యం
కవితా సంఖ్య: 22
తేదీ: 07/05/20

అమాయక పల్లె వాసులకు
క్షేమతివాచీలను పరచి
పచ్చని వాకిళ్ళను వేదిక చేసి
అనురాగ పందిళ్ళకై
నాడు గాంధీజీ మస్తిష్కం లో
వెన్నెల వెలుగు వెలిగెను...!!

రాజకీయ దందాలు లేక
ఆత్మీయతా స్వేచ్చావాయువుల
గ్రామ వృద్దికై కవాతు....!!

గతం గతమై కాలం పరుగులో
గ్రామస్వరాజ్యాలకు తిలోదకాలొదిలి
కక్షలు కార్పణ్యాల కవాతులో
పల్లె రూపు రేఖలే బోసిపోయినవి...!!

పంచాయితీ లుగా విరబూసినా
ప్రగతి స్వార్ధపరుల ఖజానాలో
నగ్నంగా నిలిచింది
నాయకులకై మన తన మరచి
ప్రాణాలతో చలగాటం
ఇది గాంధీ కోరిన గ్రామస్వరాజ్యమా...?


                              🌹వినీల🌹
26
[07/05, 9:27 PM] Sarphraj Anwer Poet: 🌸 *కవితాగానం సమూహం..*🌸

*వైశాఖ మాసం పౌర్ణమి కవితాపోటీ..*

అంశం.    :  గ్రామ స్వరాజ్యం
శీర్షిక.       :  మహాత్ముడి స్వప్నం
కవి పేరు  : *సర్ఫరాజ్ అన్వర్*

🌸 *మహాత్ముడి స్వప్నం..*🌸

అక్కడ స్వేదబిందువులు రెక్కలకష్టం
నుండి జారి పుడమిని ముద్దాడగానే శ్రమమొక్కకు చెమటపూలు వికసిస్తాయి
కాలం నింగిపై కడగండ్లరంగులతో కలల ఇంద్రధనుస్సును ఆవిష్కరింపజేస్తే శ్రమసౌగంధం జీవన సౌందర్యమై వర్ధిల్లుతుంది.

కర్షకులు నిరంతర శ్రామికులై
బీడువారిన పొలాల్లో కష్టాల కాయలుగట్టిన చేతుల్తో జీవననాగేటిసాళ్ళల్లో ఆశయాల విత్తులు జల్లి ఆశలపంటల పొత్తిళ్ళల్లో
ఆకాంక్షల సేద్యంచేసి తమ శ్రమసౌందర్యాన్ని భారతావనికి నైవేద్యంగా అందిస్తే..

పల్లె చెక్కిళ్ళపై అధికారులు అంకితభావం ఒప్పందంపై అభివృద్ధి పథకాల్ని ఇంటింటి గడపకు ముగ్గువలే అలంకరించి పరిపాలన కల్పతరువుద్వారా పారదర్శకతతో సౌభాగ్యఫలాల్ని అందిస్తే..

గ్రామీణులు సేద్యంతోపాటే శ్రమదానం తీర్మానంపై గ్రామాభిమాన సంతకం చేసి చెత్తాచెదారాన్ని తొలగించి పల్లె ముఖచిత్రం కేన్వాసుపై పలుగు పారలు, తట్టాబుట్టల కుంచెతో సుందరచిత్రాన్ని గీయగల్గితే..

దేశమనే దేహానికి గ్రామాలే పచ్చని నరాలైతే
అభివృద్ధి అచట ప్రవహించే రుధిర ధారలైతే
అట్టి పల్లెలు దేశానికి పట్టుగొమ్మలై నిలిచి
అపుడే గ్రామం స్వశక్తితో స్వరాజ్యం పొంది
ఒక రామరాజ్యమై మిగితా గ్రామాలన్నింటికి ఆదర్శమైతేనే మహాత్ముడు కలలుగన్న
సుందర అభినవ భారతసామ్రాజ్య దృశ్యం ఆవిష్కృతమౌతుంది..

*సర్ఫరాజ్ అన్వర్..*✍🏻
హైదరాబాద్
27
[07/05, 9:32 PM] Sandya Sharma Poetess: *కవితా గానం*
*పౌర్ణమి పోటీలు*
*అంశం:గ్రామ స్వరాజ్యం*

*వై.కె.సంధ్యశర్మ*
*శీర్షిక: పునాది*


*మనుగడకు మట్టికి పునాది*
నా దేశాన్ని సుసంపన్న *వెన్నముకలా*
నిలబెట్టేది
 *శ్రమైక జీవన సౌందర్యంతో
అలరారేది*
*శ్వేద బిందువులన్నీ అక్షితలుగా
తన్మయమై పరిమళించేది*

*జాతిని ఖ్యాతిని* ఐక్యతా రాగంలో
సవరించేది
*కులం మతం* కలిసికట్టుగా
ఎదురొడ్డి నిలబడేది

*భుజం చరిచి*
హలం పట్టి పొలం దున్ని
పంట పండినా
ఫలం వచ్చినా
పదుగురి మేలుకోరే
అన్నదాతలు కొలువుండేది
*కన్నతల్లి గ్రామాల ఒడిలోనే*
*ఓనమాలు దిద్దిన బడిలోనే!*

పట్టు కొమ్మలు రాలి ఒంటరి తీగలైనా
*ఆధునిక విప్లవంలో అడుగడుగునా*
అప్పుల ఊబిలో ఒరిగినా
ఆత్మాభిమానం ఆకలి పేగులకు
అడ్డుతగిలినా అనాథలుగా
అలమటించినా...
*రేపటి వసంతం లో చిగుళ్ళేస్తుందని*
ఆశగా ఆకాశంకై ఎదురు చూసే
నిరంతర ఆశావాదులు.. నెలవున్న
గ్రామాలు... వలస పక్షుల తీరాలైనా

*అంటరానితనాన్ని వెలివేసి*
అక్షర జ్ఞానం విరబూయించుకుని
*అనాగరికతను పారద్రోలి*
విద్వేషాలను వీధి మూకలను
నిరంకుశత్వ పాలనను త్యజిస్తూ
విద్యా వికాసాలై ఆరోగ్య ధాతలై
*పరిశుభ్రతా పాఠాలు వల్లె వేయిస్తూ*
రాజకీయ రభసలకు తలోగ్గక
అసలైన *గ్రామ స్వరాజ్య సంపదను
నిలబెట్టుకుందాం!*
*పట్టుకొమ్మలను పట్టుదలతో సంరక్షించుకుందాం!!*
*దేశ వెన్నెముకగా నిలబడదాం*
28
[07/05, 9:49 PM] Kalva Rajaiah: కవితా గానం
వైశాఖ పౌర్ణిమ పోటీ కవిత
అంశం : గ్రామ స్వరాజ్యం
కవి పేరు : కాల్వ రాజయ్య

అధికారి గ్రామమందున్న గ్రామాలు అభివృద్ధి చెందు నని
నాడు మూడంచెల చట్టము జేసి ముందుగ నప్పజెప్పిరి పాలన గ్రామాధికారి
అదే గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య కాంక్ష

********************---

గ్రామాలే దేశానికి వెన్నుముక
అవి అభివృద్ధి చెందితేనే  దేశం
ప్రపంచములో  ముందంజగా ఉంటుందని
గ్రామ ప్రజలు కూడు,  గూడు, గుడ్డ వీటికి లోటు లేకుండా బ్రతికిననాడు
గ్రామ ప్రజలు అన్నిట గౌరవంగ బ్రతికిననాడు
దేశం తలెత్తుకొని నిలబడుతుందని
ఇదే గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం

************************
-గ్రామం పాడి పంటలతో విలసిల్లి
గమ్యం చేరాలని
శుచి శుభ్రతగఉండాలని సూచించెను గాంధీజీ
మరుగు దొడ్లు నిర్మించి మనుషులు విలువగా బ్రతకాలని
వ్యక్తాభివృద్ధేయే  దేశాభి వృద్ధని  ప్రకటించిన వ్యక్తి కోరే
ఇదే గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం  గ్రామ స్వరాజ్యం

************************

గ్రామాలు అన్నిట ముందుండాలని
ఆధునికీకరణలోనా అభివృద్ధి చెందాలని
మారుతున్న సమాజానికి మనుగడగా ఉండాలని
డిజిటలైషన్ లో దిన దిన మభివృద్ధి చెందాలని
ఇదే ఇదే గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం  గ్రామ స్వరాజ్యం
29
[07/05, 9:55 PM] Swarna Latha Poetess: వైశాఖ పౌర్ణమి కవితల పోటీకి
అంశం....గ్రామ స్వరాజ్యం
పేరు....స్వర్ణలత
ఊరు....మంచిర్యాల
శీర్షిక.....పల్లెటూర్లు పట్టణాలకు పట్టుగొమ్మలు

వందలు వేలుగా వలస కూలీలు
శ్రమను నమ్మకుని కష్టాన్ని ఆమ్ముకుని
కన్నతల్లి వంటి ఉన్నఊరు వదిలి
జానెడు పొట్టకోసం పట్టెడన్నం కోసం
పట్టణాల వెంట పరుగు పెడుతున్నారు

ఎక్కడుంది గాంధీజీ కలలగన్న...
గ్రామ స్వరాజ్యం
పల్లెటూర్లు పట్టణాలకు పట్టుగొమ్మలు
గ్రామ స్థాయి నాయకులు గ్రామ ప్రజలు
క్రియాశీలమైతేనే ప్రభుత్వపథకాలు
ప్రజలకు చేరువయ్యేది
గ్రామాల స్వయం సమృద్ధి
దేశానికి సుస్థిరాభివృద్ధి

కొత్త ప్రభుత్వాలతో...
 బూజుదులిపిన చట్టాలు
పంచాయతీ రాజ్ చట్టాలు
గ్రామ స్వరాజ్యానికి చుట్టాలు
ఉంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి
జరుగుతుంది గ్రామాల అభివృద్ధి

ఇప్పుడిప్పుడే నా పల్లెల్లో...
కాలువల్లో నీరు కదం తొక్కుతున్న
పంట పొలాలన్నీ పచ్చబడుతున్నాయి
ఇది ముందు ముందు ఏర్పడే
గ్రామ స్వరాజ్యానికి పలకాలి నాంది
30
[07/05, 9:56 PM] YLN Reddy: 🔹శీర్షిక:గ్రామ స్వరాజ్యం🔹
పల్లె ప్రగతి వెలుగులు
దేశ ప్రగతి పరుగులు
పల్లెలు గూడేలు
నాగలికతల
తొలి ఆనవాల్లు
వ్యవసాయాధిరితం
గ్రామీణభారతం
వ్యవసాయ అనుబంధం
పాడి పౌల్ట్రీ రంగాలు
కుమ్మరి కమ్మరి వడ్రంగం
నేతగీతచాకలిమంగలి
సమస్త వృత్తుల సహజీవనం
కుటీర పరిశ్రమల స్థాపన
ఉపాధి ఉద్యోగాల కల్పన
నిరుద్యోగం నిర్మూలన
పర్యావరణ పరిరక్షణ
మతసామరస్యం పరమతసహనం
పల్లె తల్లికి పెట్టని ఆభరణం
కలిసి జరుపుకునే పండగలు
భిన్నత్వంలో ఏకత్వం
శాంతికి సహజ సంకేతం
ఈశ్వర్ అల్లాతేరినాం
సబ్కోసమ్మతిదే భగవాన్
శ్రమయే గౌరవం
పరిశుభ్రతే దైవం
ప్రవృత్తి ఆధారిత
వృత్తి విద్యల మేళవింపుతో
విద్య ఆరోగ్యం ఉచితంగా
అందరికి అందించి
ధుమమద్యపానాలు నిషేధిస్తే
అదే పల్లెకు సౌభాగ్యం
 నేలల విభజన నేర్పుగా చేసి
సారంతీరున పంటలు వేసి
ప్రకృతి సేంద్రీయ సాగుజేసిన
కల్తీ లేని ఆహారం మంది
కలుగును అందరికి ఆరోగ్యం

భవన నిర్మాణ కార్మికులు
ఉపాధి హామీ కూలీలను
మిళితం చేసిన
ఇంకుడు గుంతలు
చెట్ల పెంపకం చెక్ డ్యాంలు
నిర్మించి వర్షపు నీరు వడీసిపట్టిన
చెరువులు నిండి హర్షంకల్లుగున్
వలసలు తగ్గును
పట్టణీకరణం పైత్యం తగ్గును
దేశం స్వయం సమృదమగును
గ్రామ స్వరాజ్యం సాకారమగునుఫ
....యన్. లక్ష్మీనరసింహరెడ్డి



**""""*"*"*"*"""""""""""*"""*"*****


న్యాయ నిర్ణేత శ్రీ పంతుల విట్టుబాబు గారి మాట
*️⃣*️⃣*️⃣*️⃣*️⃣


: *మెతుకు* శీర్షికన  పాల్వంచ హరికిషన్ గారు వ్రాసిన కవిత చిన్న చిన్న వాక్యాలతో అంత్యప్రాసలతో బాగుంది.
అయితే.. పూర్తిగా ఒకే యాసలో ఉంటే మరింత అందంగా ఉంటుంది
:


 పూర్వవైభవం పేరుతో కోరాడ నరసింహారావుగారు వ్రాసిన కవితలో భావాన్వయాలు బాగున్నాయి. అయితే పాదవిభజనలో కొంత జాగ్రత్త కావాలనిపించింది..
[


అనుముల తేజస్విని గారి కవిత 'ఏదీ గ్రామస్వరాజ్యం' లో మంచి ప్రయత్నం చేసారు. పదప్రయోగాలూ, వాటి అన్వయం విషయంలో కొంత జాగరూకత పాటించాలనిపించింది
:




'రైతు' అనే శీర్షికతో యం. రాంచందర్‌జీ గారు వ్రాసిన ఐదుపద్యాలు వారెంచుకున్న శీర్షికకు తగినట్లుగా బాగున్నాయి..
సవరణలు చూసుకోవాల్సినవి..

తొలిపద్యం
1. మనకు తరువాత అచ్చు వస్తే యడాగమం రాదు. *మనకు నన్నంబు* అనాలి.

మూడవపద్యం
1. తొలిపాదంలో గూనేమాయె... వ్యావహారికం..
2. మూడవపాదంలో యతిదోషం
3. అలాగే మంచలన్నీ అని చివర దీర్ఘం రాకూడదు

నాల్గవపద్యంలో రైతును భరతమాతకు పెద్దబిడ్డగా పేర్కొనడం చాలా బాగున్నది.

నాల్గవ పద్యం..
రెండవపాదంలో యతిదోషం
ఇల వంటి పదాలు రాకుండా చూసుకుంటే పద్యం మరింత చిక్కబడుతుంది
:



 డా. పాండాల మహేశ్వర్ గారి గ్రామరాజ్యసౌభాగ్యం కవితలో ప్రధాని గుణగణాల వర్ణన బాగుంది.. గ్రామస్వరాజ్యం గురించి మరింత వివరించగలిగితే మరింత అందగించేదని అనిపించింది



 డా. బండారు సుజాతశేఖర్ గారు 'ఊహలకు రెక్కలొచ్చే' కవితలో ఒక అందమైన ఆదర్శవంతమైన గ్రామంలో ఏమేం ఉండాలో చాల బాగా వర్ణించారు. ఊహ బాగుంది.



 ఇప్పుడిప్పుడే పల్లెలు బాగుపడుతున్నాయన్న వల్లాల విజయలక్ష్మి గారి 'గ్రామస్వరాజ్యం' కవిత బాగుంది.



 దిడ్డిమారుతి గారి కవితలో అచ్చమైన యాసలో సహజమైన పదాలతో దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని చెప్పడం బాగుంది



 'శాంతమ్మ'ను నాటి గ్రామంలోని స్వచ్ఛతకూ, ఆప్యాయతలకూ చిహ్నంగా తీసుకుని... నేటి గ్రామాల పరిస్థితిని హృద్యంగా వర్ణించారు వకుళవాసు గారు. 'శాంతమ్మ' కవిత బాగుంది. పేరులోనే నేటి జీవితాలలో కనుమరుగవుతున్న 'శాంతి' ని చూపటం బాగుంది.




నోముల సంజీవరెడ్డిగారి కవితలో.. గ్రామాలు స్వయంసమృద్ధి సాధించడంతోనే గ్రామస్వరాజ్యభావన సాకారమౌతుందని వివరించారు. బాగుంది..



అంబటి భానుప్రకాశ్ గారి పద్యకవితలో దేశం బాగుపడాలంటే తల్లివంటి పల్లెబాగుండాలని గ్రామసౌందర్యాన్ని శ్రమైకజీవన విధానాన్ని బాగా వర్ణించారు.

తొలి సీసం నాల్గవపాదంలో.. *గల్గి యవని నిల్చు*

'కలిమినిపెంచు' అనే కందంలో
రెండోపాదం చివర 'అనకన్' అన్నారు... 'అక" అని అంతమయ్యే అసమాపకక్రియాపదాలన్నీ కళలు. చివర ద్రుతం(న్) రాదు.
నాల్గవపాదంవ గణభంగం అయింది. టైపాటు(టైపులో పొరపాటు) అనుకుంటా... *తలపించుచు స్వర్గసీమ* అంటే సరిపోతుంది.

చివరి తేటగీతిలో
రెండవపాదం ద్రుతంతో ప్రారంభించారు. తొలిపాదాంతంలో ఉన్న గాదు తరువాత ద్రుతం రాదు.. అక్కడ సంధి చేయాలనుకుంటే ఉత్వసంధి చేయాలి. అప్పుడు గణభంగం... అందువలన *వాక్యావసానంబున సంధిలేమి దోషంబు కాదని ఆర్యులంద్రు* అన్న సూరి వ్యాఖ్యానాన్ని అనుసరించి విసంధిగా *ఎల్ల జనులను* అని ప్రారంభించడం మేలు.
మూడవపాదంలో గణభంగం అయింది.



 డా. రమక కృష్ణమూర్తి గారి 'దేశపునాదులు' కవితలో  గ్రామస్వరాజ్యసిద్ధికి ఏమేం ఉండాలో చక్కగా వివరించారు.
[


 బల్లూరి ఉమాదేవిగారి గ్రామస్వరాజ్య పద్యకవిత బాగుంది. గ్రామస్వరాజ్యస్థాపనకు కావాల్సినవి అందంగా పద్యాలలో ఇమిడ్చారు.

గణాలకోసం పాండిపంట అన్నా ద్వంద్వము కాబట్టి పాడిపంటలు అనడమే అందం.

నాలుగవ ఆటవెలదిలో
*దేశమపుడె*
*తెలుపుచుందు రార్యు....*
:



పోలా కిషోర్‌కుమార్‌ గారి 'రైతన్న రాజ్యం' కవితలో కార్పొరేట్ రాజకీయాలవలన గ్రామస్వరాజ్య భావన దెబ్బ తింటోదని బాగా వివరించారు. మరింత కవితాత్మకంగా ఉండవచ్చు. వ్యాసం చదివిన భావన కలిగింది. పాదవిభజనలో మరింత బాగుండవచ్చు
[



గంజాం భ్రమరాంభ గారి "పల్లె మళ్ళీ చిగురించినప్పుడే" కవితలో... పల్లెలు మరల చిగురించి కళకళలాడితేనే గ్రామస్వరాజ్యమని అవి ఏలాఉంటే బాగుంటుందో బాగా వర్ణించారు




ఏనాడైతే గ్రామాలు స్వయంసమృద్ధి సాధిస్తాయో...అప్పుడే గ్రామస్వరాజ్యకాంతులతో అలరారుతాయన్న శ్రీకాంత కడార్ల గారి 'గ్రామాలే దేశ సౌభాగ్యం కవిత చక్కగా ఉంది
[

 ఇంద్రవత్ రాహుల్ గారి 'గ్రామస్వరాజ్యం' కవితలో పల్లెలు సుభిక్షంగా ఉండాలంటే ఏం కావాలో... చక్కగా చెప్పారు... రెండుచోట్ల వాక్యాలు ద్రుతాంతాలయ్యాయ్...
[


అందరూ సమైక్యతారాగం ఆలపిస్తేనే "గాంధీజీ కలలు కన్న" గ్రామస్వరాజ్యగీతం కళకళలాడుతుందన్న వురిమళ్ళ సునంద గారి కవితాగానం బాగుంది



సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారి "పల్లెలే పట్టుగొమ్మలు" కవితలో పల్లెలను బాగా వర్ణించారు
[:


తులసి వేంకట రమణాచార్యులు గారు "పల్లె దేశప్రగతికి పట్టుకొమ్మ" కవితలో పల్లె తల్లివంటిదనీ, దేశ ప్రపంచ ఆర్థికవ్యవస్థకు పునాది గ్రామీణాభివృద్ధియే అని... అందుకు రైతు బాగుండడమే మూలమని బాగా చెప్పారు
[:



పట్టణాలకు దీటుగా విద్యాసుగంధాలు వ్యాపించి, యువత అంతా ఉద్యోగఫలాలందుకున్నప్పుడు  గ్రామస్వరాజ్య కల సాకారమౌతుందన్న ఉప్పల పద్మగారి కవిత బాగుంది
:



 గుండ్ల నాగరాజు గారు గ్రామస్వరాజ్యమే నాదేశ సౌభాగ్యమని భావించి "ముందడుగు" వేయాలని చెప్పిన కవిత అందంగా ఉంది




 స్వార్థం వీడిన సరైనపాలన సాగించినప్పుడే నిజమైన గ్రామస్వరాజ్యమన్న మర్రిజయశ్రీ గారి కవిత బాగుంది




 ఏమేం చేస్తే మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్యం స్థాపనతో సుందరభారత సామ్రాజ్యదృశ్యం ఆవిష్కృతమౌతుందో... "మహాత్ముడి స్వప్నం" కవితలో సర్ఫరాజ్ అన్వర్ గారు కవితాత్మకంగా చక్కగా వర్ణించారు



 గతం కాలగర్భం కలిసిపోయి పల్లె రూపురేఖలు బోసిపోవడమే గ్రామస్వరాజ్యమా? అని ప్రశ్నిస్తూ సాగిన విజయదుర్గ గారి కవిత బాగుంది



: రాజకీయ రభసలకు తలొగ్గకుండా అసలైన "గ్రామస్వరాజ్య సంపదను నిలబెట్టుకుందా"మంటూ "పునాది" శీర్షికతో వై.కె. సంధ్యాశర్మ గారి కవిత చాలా బాగుంది


 గ్రామాలన్నిట ముందుండాలని, డిజిటలైజేషన్‌తో అభివృద్ధి చెందాలన్న కాల్వ రాజయ్య గారి గ్రామస్వరాజ్య కవిత బాగుంది


 "పల్లెటూళ్ళు పట్టణాలకు పట్టుగొమ్మలని".....కాలువల్లో నీటితో ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న పంటపొలాలు గ్రొమస్వరాజ్యానికి నాందిపలకాలంటున్న స్వర్ణలతగారి కవిత బాగుంది


 యన్. లక్ష్మీనరసింహారెడ్డి గారి గ్రామస్వరాజ్యకవిత సకలవృత్తుల సమాగమంతో అలరారింది
******
వీరా గారూ
మొత్తం అందరి కవితలకూ సమీక్షలు పంపాను.
నాకీ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు
🙏🏻🙏🏻

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...