Skip to main content

Babasaheb bhartha rathna 2022

నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
**********
కవి వరుల జాబితా
1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
2.కోరాడ గారు
3.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
4.మద్ది పుల్లారావు గారు
5.దోసపాటి వేంకట రాంచంద్రారావు గారు
6.తరణికంటి సూర్య లక్ష్మి గారు
7.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
8.గజవెల్లి శ్రీ నివాసాచార్యులు గార
9.సింహాద్రి వాణి గారు
10.బొప్పెన వెంకటేశ్ గారు
11కవిత వెంకటేశ్వర్లు గారు
12. పిన్నక నాగేశ్వరరావు గారు
13.సింగీతం సంతోష్ కుమార్ గారు
14.సునంద వురిమళ్ళ గారు
15.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
16.ఆఫ్సర వలీషా గారు
17.పొర్ల వేణు గోపాల్ గారు
18.నాయకుటి నరసింహ గారు
19.శివునూరి లలితా కృష్ణ గారు
20.వేదాంతం సురేష్ బాబు గారు
*********
1
సందర్భం : ఏప్రియల్ 14- డా. బి ఆర్. అంభేడ్కర్ జయంతి.
శీర్షిక :
    ""  సంస్కరణల సూరీడు ""

మీకు పేరు చివర ఆ తోకలెందుకు?!
ఊరు చివర మా పాకలెందుకు?!
ఆ తోకల్ని కత్తిరించి
మా పాకల్ని ఊరిలోకి తరలించి
మనువాదాన్ని త్యజించి
మానవతావాదంతో  అణగారిన జనాల్ని అక్కున చేర్చుకుని
ఆప్యాయతానురాగాలను అందించాలని
చూపుడు వేలితో చూపిస్తూ
హెచ్చరిస్తున్న ధీశాలి  అంబెడ్కర్!
స్వాతంత్య్రం సిద్ధించాక
ఆర్ధిక అసమానతలను అధిగమించేందుకు
రాజ్యాంగ రచనకు ఉపక్రమించిన మేధావి అంబెడ్కర్!
అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా
పరిపాలనా పగ్గాలు అన్ని వర్గాలకు చేరేలా
విద్య, వైద్యం లాంటి నిత్యావాసరాలను ప్రాధమిక హక్కులుగా చేర్చి
మానవహక్కుల సంరక్షణను జోడిస్తూ రాజ్యాంగ రచన గావించి
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించిన
సంస్కరణల సూరీడు డా. బి. ఆర్. అంబెడ్కర్!
అంబెడ్కర్ ఆలోచనలతో
ఆవిష్కరించబడిన రాజ్యాంగం
దేశ పురోభివృద్ధికి వేసింది బాటలు
ఆర్ధిక పురోగతికి మార్గాలు. సర్వజన సంక్షేమానికి శ్రీకారం చుట్టింది
ప్రపంచ దేశాలచే మేటి యని కీర్తించబడినది!
...........................................
రచన :
ఆళ్ల నాగేశ్వరరావు
ఆర్టీసీ కండక్టర్
నాజారుపేట
తెనాలి...522201
గుంటూరు... జిల్లా
ఆంధ్రప్రదేశ్... రాష్ట్రము
చరవాణి సంఖ్య :7416638823.
...........................................
పై వచనకవిత నా స్వీయరచనే నని. హామీ ఇస్తున్నాను.
2.

* చిరస్మరణీయుడు *
     కోరాడ నరసింహా రావు
            *************
ఊరుదూరంగా నెట్టేసిన వాడలో పుట్టి, అడుగడుగు అవమానాలతో రాటుదేలిన దళిత దివ్య వజ్ర మితడు !
   రెట్టించిన పట్టుదలతో.... అత్యున్నత శిఖరాల నధిరోహిం చిన ఆత్మనిర్బర మతనిది !!
    ఛీత్కరించిన వారిచేతే... 
సన్మానాలందుకున్న సామర్ధ్య మది !
       పోరాడి సాధించుకున్న... 
పట్టుదల తనది !
      అత్యున్నత చదువులతో, 
అత్యుత్తమ పదవులతో... 
నవచరితను సృష్టించిన నాయకుడైనాడు !రాజ్యాంగ రచనలో కీలకమైనాడు !!
        కులమతాలేవైనా విద్వత్తుకుఅవరోధాలుకాలేవని నిరూపించినమహోన్నతవ్యక్తిత్వ జీవితమతనిది !
 దళితజన బాంధవుడై...వారి న్యాయమైన హక్కులకుఅండగ నిలిచాడు....,అన్యాయం, అక్రమాలను ఓడించి గెలిచాడు 
అంబేద్కరుడీతడు... చిరస్మరణీయుడు !!
     ****************
3.
[14/04, 8:00 pm]
 కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు Poet: అంశం... ఐచ్ఛికం ....
కవితా గానం
 14042022
శీర్షిక...... ఎక్కడ...
*****************************
ఆధునిక భారతంలో అంబేద్కర్ ఎక్కడ
నవనిర్మాణ సారథ్యంలో అంబేద్కర్ ఎక్కడ
ఆ భావాల ప్రసూనాల పరిమళాలు ఎక్కడ
ఆయన లక్ష్యించిన లక్ష్యాలు ఎక్కడ

కొంత మంది కుహానా వాదుల సమైక్య విరోధల
విభజన వాదం వర్గ పోరాట దృక్పథం
పరిమితం చేసింది ఎన్నికల ప్రసంగాలకు శుష్క వాగ్దానాల ఓట్ల వేటకు
ఒక జాతీయ ప్రభ ఒక అంతర్జాతీయ కేతనం
విషవలయంలో విషణ్ణ వదనంతో అచేతనం

ఆయన ఒక ఘనాపాటి సచేతనామూర్తి 
స్వయం ప్రకాశ తేజోమూర్తి 
అయుతేనేం దళితవాడలకు పరిమితం చేసి
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు
మసిపూసి మసకబార్చె మాయల ఫకీరు గాళ్ళ
సాంబ్రాణి ధూపంలో కళ్ళు మూసుకుని
నోళ్లు తెరిచిన వారికి కనువిప్పు కావాలి
అంబేద్కర్ అందరివాడని అందరికి ఆదర్శమని
నేటి భారతం సగర్వంగా ఎలుగెత్తి నినదించాలి

స్వీయ రచన:::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
14042022
4
[14/04, 8:11 pm] Maddi Pullarao Poet: కవితాగానం
పేరు:మద్ది.పుల్లారావు
ఊరు:నందిగామ
తేదీ:14-4-22
శీర్షిక:అంభేద్కర్
....
అంభేవాడ లోన..యంభేద్కర్ గ పుట్టి
అంటరానతనాన్ని..యస్పృశ్యతలనన్ని

రూపుమాప గల్గిన..లోకైక నాయకుడు
చిన్న తనం లోననె..ఎన్నలేని బాధలు

అనుభవించిన గొప్ప..యమృతమూర్తియతండు
నిమ్నజాతిన బుట్టి..నిర్లక్ష్యం కాబడి

పెద్ద కులాల వారు. బద్ధ శత్రువులు గా
రాయుదును యిష్టపది..రామచంద్రుని దలచి

2)

చూచుటవలన యతడు..శోకతప్తుడాయెను
ఆర్థిక లేమినతడు..యధిగమించెనెట్టులొ

మేధోశక్తితోన..మెరుగగు డిగ్రీలను
సాధించిజూపాడు..స్వయంకృషీవలుండు

విదేశాల చదివిన.. విధ్యావంతుడతడు
న్యాయవాదవృత్తికి..నాణ్యత పెంచాడు
 
రాజ్యాంగ రచనలో..రాళ్ళబాటన నడిచి
రాయుదును యిష్టపది..రామచంద్రుని దలచి

3)

సంక్షేమ ఫలాలను..సర్వులకందించిన
నిమ్నజాతుల వారి..నిఖార్సగు నాయకుడు

రిజర్వేషన్ల తో..నిజ న్యాయము జేసె
సంస్కరణలనెన్నో..సాధించిన ధీశాలి

భౌద్దాన్ని జేబట్టె..బహుముఖ ప్రజ్ఞాశాలి
భారతదేశానికి..ప్రపంచ కీర్తి దెచ్చి

భారతరత్న బొందె..పావన చరితుండై
రాయుదును యిష్టపది..రామచంద్రుని దలచి
...
ఇది నా స్వీయరచన
5
[14/04, 8:12 pm] +91 99373 80136: కవితాగానం సీజన్-2
తేది14042022,గురువారం
అంశం:అంబేద్కర్ జయంతిసందర్భంగా.....
శీర్షిక:భారతరత్న బాబాసాహెబ్.
అంబెద్కర్ అంటే అభ్యుదయం
అంబెద్కర్ అంటే ఆశయం
అంబెద్కర్ అంటే ఆచరణ
ఆంబెద్కర్ అంటే అనురాగం
అణగారినబ్రతుకులకు ఆశాదీపం
అట్టడుగువర్గాలకు ఆలంబనం
అంబెద్కర్ అంటే మార్గదర్శనం
ఉన్నతవిద్యలనభ్యసించి ఉత్తమవిద్యావేత్తయ్యాడు
భారతరాజ్యాంగనిర్మాతగా వినుతికెక్కాడు
బడుగు బలహీనవర్గాలకు ఎన్నో హక్కులను కల్పించాడు
జనబాహుళ్యహృదయాలలో చిరస్మరణీయుడైనాడు!

ఇది నాస్వీయరచన.
దోసపాటి వేంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా
చరవాణి7780594995.
6
[14/04, 8:15 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్‌ 2 )14/4/2022/ గురువారము
అంశం : - " డా. బి. ఆర్‌. అంబేడ్కర్‌ జయంతి " సందర్భంగా ప్రత్యేక కవిత

శీర్షిక:-  భారతరాజ్యాంగ నిర్మాత భావితరాలకు భవితను చూపుచు పౌరహక్కులతోపాటు పౌరబాధ్యతలవసరమనుచు గణతంత్రరాజ్యమునకు అర్థము నిరూపించిన ఘనుడు మన 
డా. బి. ఆర్‌. అంబేడ్కర్‌
          రాంజీమ రోజీ సాక్పాల్‌ భీమాబాయ్ల పుత్రుడు బాబాసాహెబు అంబేడ్కర్‌
      బాల్యమంత అవమానాలను తట్టుకున్న స్థితప్రజ్ఞుడు ఆత్మ నిబ్బరముతో రెట్టించిన పట్టుదలతో ఊరవతల ధళిత వాడల పెరిగినట్టి అంబేడ్కరు అత్యున్నత పదవులలో రాణించె అణగారిపోయిన బడుగుబలహీనవర్గాల ఆప్యాయతానురాగాల అండగ నిలచిన మానవతామూర్తి మహానుభావుడు
       మేధావిగా, నిరాడంబరుడుగా, నిజాయితీపరుడుగ, పలుగ్రంధ రచయితగా, పత్రికానిర్మాతగా, రాజ్యాంగపరిషత్సభ్యుడుగ, ప్రజాస్వామ్య పరిరక్షకుడుగా అసమాన ప్రజ్ఞాశాలి అంబేడ్కర్‌
       భారత రామాయణములు కూలంకషముగ నెరిగినవాడు సంఘసంస్కరణకు నడుముగట్టిన గాంథీ అనుయాయుడు ఈ అంబేడ్కరుడు భారతదేశకీర్తిపతాక
     అంబేడ్కరు ఆలోచనాసరళిలో ఆవిష్కరించబడింది మనరాజ్యాంగం భారత రాజ్యాంగ కర్తగా ఆయనకు ఆయనేసాటి సర్వమానవ సంక్షేమానికి శ్రీకారం చుట్టింది ప్రపంచదేశాలలో మేటియని కీర్తించబడింది అట్టి మహానుభావుడు డా. బి. ఆర్‌. అంబేడ్నర్‌జయంతి దేశమంతా ఘనముగా జరుపుకొందాం ఆమహనీయుని మనసార స్మరించుకుందాం ఆయన అడుగుజాడల పయనిద్దాం
భారతీయ ఘనతనుచాటుదాం !
       తరణికంటి సూర్యలక్ష్మి.
                      ----------
7
[14/04, 8:17 pm] Thathapudi Somashekara Sharma: కవితాగానం( సీజన్ 2) పోటికొరకు 
అంశం.. డా. బి.ఆర్. అంబేద్కర్ 
శీర్షిక..భరతమాత ముద్దుబిడ్డ 
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336
 
మానవహక్కుల పరిరక్షకుండ
మానవ స్వేచ్ఛ రక్షకుండ
నిమ్నజాతి ఉన్నతికి
నిరంతరం పోరాడినోడా!

దళిత కుటుంబంలో జన్మించి
ఒడిదుడుకులు ఎదుర్కొని
అవమానాలను తట్టుకుని
దళితులఉన్నతికై కృషిసల్పినోడా!

వీధిలైట్ క్రింద నువ్వు
విద్య నెంతో అభ్యసించి
అంటరానితనాన్ని రూపుమాప
కంకణంకట్టుకున్న స్ఫూర్తిప్రదాత!

దళితులకు హక్కులను
సమానంగా కల్పించి
రాబోయే తరంలోన
మంచి జీవితాన్ని ఇచ్చిన మహానీయా!

రాజ్యాంగాన్నే నిర్మించిన
అఖండ తేజోవిరాజితుడవు
భారతరత్న బిరుదాంకిత
భరతమాత ముద్దుబిడ్డ దళితచైతన్యమూర్తి!

హామీ పత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
8
[14/04, 8:34 pm] +91 90594 38068: గజవెళ్ళి శ్రీనివాసాచారి 
అంశం: అంబేద్కర్
శీర్షిక: ఉదయించిన భానుడు 
...
భరత ఖండంలో 
ఉదయించిన భానుడు
స్వేచ్ఛా స్వాతంత్ర్యం 
సౌభాతృత్వం లక్ష్యసాధనకు 
బాటలు వేసిన అంబేద్కరుడు 

మానవతావాది 
రాజ్యాంగ శిల్పి 
స్త్రీ అభ్యుదయానికి 
వెట్టిచాకిరీ నిర్మూలన కోసం 
శ్రామికుల హక్కుల కోసం 
పోరాడిన అంబేద్కర్ 

వ్యవస్థ మారాలని 
కలలు కన్న ఆశావాది 
పుస్తక పఠనం ఒకవైపు 
న్యాయవాద వృత్తి మరోవైపు 
కొనసాగించిన భారతరత్న
9
[14/04, 8:35 pm] Siimhadri Vani Poetess: కవితాగానం(సీజన్--2)
అంశం:-- అంబేద్కర్
ప్రక్రియ:--గజల్
రచన:--సింహాద్రి వాణి
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872

అవమానము లెన్నిటినో అనుభవించె అంబేద్కర్
నీతి న్యాయ ధర్మాలను అనుసరించె అంబేద్కర్

పెద్ద కుటుంబంలో పుట్టి పేదతనంలో పెరిగె
లెక్కలేని కష్టాలను అధిగమించె అంబేద్కర్

చిన్నతనం నుండె చాల తెలివితేట లున్నవాడు
కులంచిచ్చు మంటల్లో అలమటించె అంబేద్కర్

ఏమాత్రం లెక్కలేక ఎదురుతిరిగి సంఘానికి
బుర్రలోన విజ్ఞానం పొందుపరచె అంబేద్కర్

నిమ్నజాతి ప్రజలకొరకు వెన్నుదన్ను గానిలచీ
ఉన్నతంగ తీర్చిదిద్ద పరితపించె అంబేద్కర్

సమాజాన్ని వుద్ధరింప సంకల్పం పూనుకొనీ
పున్నమి వెలుగులు నింపా అభిలషించె అంబేద్కర్

ఉన్నత విద్యను చదువా విదేశాల కేగినాడు
పట్టాలను యెన్నొపొంది పరిమళించె అంబేద్కర్

అనుకున్నది సాధించీ అందలాల నెక్కినాడు
రాజ్యాంగం రచియించీ పరవశించె అంబేద్కర్

భరతమాత కిరీటంలొ రత్నమతడు సింహాద్రీ
బలహీనపు వర్గాలను బాగుపరచె అంబేద్కర్
10
[14/04, 8:37 pm] Venkatesh Boppena Poet: శీర్షిక: అగ్రగణ్యుడు అంబేద్కర్
_________________________

అంటరాని అస్పృశ్యలకు లోనై భగ్గుమన్నది హృదయం 
సమసమాజ నిర్మాణానికి సంకల్పించిన ధీరత్వం 
దేశ పరిపాలన వ్యవస్థకు ప్రాణం పోసిన ఊపిరి  అలమటిస్తున్న అనగారిన వర్గాల ను అందరూ సమానం అని ఏకీకృతం చేసావు సిద్ధించిన స్వాతంత్రపు అసలైన ఫలాలను ప్రతీ వ్యక్తికి ప్రసాదించావు 
ప్పెత్తనాల ఆక్రందన లపై ఎక్కుపెట్టిన విల్లు దిక్కరించిన శౌర్యం 
పుస్తకాల పట్టుకొమ్మ విజ్ఞానపు మాగాణి
హక్కుల సాధనకై అహర్నిశలు శ్రమించి సమానత్వపు సౌభ్రాతృత్వ సారాన్ని చూపావు కులం అనే మఖిలి పట్టిన మనుషుల మనసులను 
విద్య వస్త్రంతో ప్రక్షాళన చేశావు
కులం కన్నా కలం గొప్పదని నీ రాతతో దుర్గతి చెరిపేశావు  మాతృ ధాత్రి కీర్తిని
 ప్రపంచపు నలుదిశలా మార్మోగించావు 
అవిరళ మైన కృషితోడ అందించావు రాజ్యాంగం దేశానికే సుభిక్షం



నా కవిత దేనికి అనువాదం కాదు, అనుకరణ కాదు . ఇది సొంత రచన అని హామీ ఇస్తున్నాను.



పేరు : బొప్పెన వెంకటేష్ 
ఊరు : సిద్దిపేట 
చరవాణి: 9866584062
11
[14/04, 8:40 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం (సీజన్ - 2)
అంశం::ఐచ్ఛికం
రచన::కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
తేదీ::14.4.22...గురువారం
సెల్:: 8309920625
శీర్షిక:: నవయుగ వైతాళికుడు

జయంతులో వర్ధంతులో 
చేసుకోవడము కాదు
శిలా విగ్రహాలు పెట్టుకొని
పూలదండలు గజమాలలు వేసి
ఒకరోజు జరుపుకొని సభలు
నిర్వహించి ఆయన గురుంచి
చెప్పుకొని స్వీట్లు పంచుకొని
గడపడం గొప్పకాదు
ఆయన రచనలు చదివి
ఆయన ఉపన్యాసాలు విని
రాజ్యాంగములోని విషయాలు
గ్రహించి
నిమ్న జాతుల నీడకూడ తాకరాదని
కలిసి నీళ్లు కూడ తాగరాదని
వారితో కలిసి భుజించరాదని
బడుగు వర్గాల పిల్లని ప్రేమిస్తే
అగ్ర కులస్థుల అబ్బాయిని
పెళ్లి చేసుకోరాదని
అలా చేసుకుంటే కులం పేరుతో
తెగనరికే సంప్రదాయం మారిందా 
దళిత అబ్బాయి ఎక్కువ కులం
అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకుంటే హర్షించేనా సమాజము
బ్రతకనిచ్చేనా సంప్రదాయం
ఇవన్ని మారినప్పుడు
అందరూ సమానమయినప్పుడు
ఆయన కన్న కలలు నెరవేరిన ప్పుడు
ఆయన కష్టం కృషి ఫలించినప్పుడు
అప్పుడు నిజంగా భారతము
శాంతి సౌఖ్యాలకు దర్పణము
అంబేద్కర్ పేరుకు ఆనందము
భారతరత్నకు సంతోషము
భరత మాత కిరీటమతడు
భరత జాతి రత్నమతడు
నవజీవనయాత్రలో వైతాళికుడు!!
        ఈ కవిత నా స్వంత రచన అని హామీq
12
[14/04, 8:47 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం(సీజన్2).        14--4--2022.                  
పిన్నక నాగేశ్వరరావు.         
అంశము :-- డా// అంబేద్కర్ జయంతి.

1. తేటగీతి.
చిన్నతనమందు కష్టము లెన్నొ పడియు
నంటరాని తనమ్ము తా ననుభవించి
స్వయముగా తానె దాని నివారణమ్ము
చేయ నడుము బిగించిన శ్రేష్ఠుడతడు.

2. తేటగీతి.
దళిత జాతుల సేవకై తాను నిలిచి
వారి హక్కుల కోసమై పోరుసలిపి
బాధ్యతల గుర్తు చేయుచు,వారి కొఱకు
నుద్యమించిన యంబేద్కరుండు ఘనుడు.

3. తేటగీతి.
పట్టుదల తోడ పొత్తముల్ పఠన చేసి
సకల శాస్త్రములందున జ్ఞానమంది
గ్రంథ రాజములెన్నియో రచనచేసి
రాజ నీతిజ్ఞుడుగ తాను ప్రజ్ఞనొంది
వెలుగునొందె"భారత రత్న" బిరుదు తోడ.

4. తేటగీతి.
భరత దేశపు స్వాతంత్ర్య ఫలము పిదప
"ప్రజల కొఱకు,ప్రజల యొక్క,ప్రజల చేత"
యను నిబంధనల్ దృష్టి యందు నిలిపి
మనదు రాజ్యాంగ రచనను ఘనముగాను
చేసె; నంబేద్కరునకు జేజేల నిడుదు.
**************************************
13.
[14/04, 9:02 pm] సింగీతం సంతోష్ కుమార్: కవితా గానం(సీజన్ 2)
పోటీ కొరకు.....
అంశం:- డా.బీ.ఆర్.అంబేడ్కర్
శీర్షిక:- దళిత సూరుడు
కవి పేరు:- సింగీతం సంతోష్ కుమార్
ఊరు:- కామారెడ్డి
చరవాణి:-8897152205
_______________________________

మధ్యప్రదేశ్ రాష్ట్రం,అంబవాడే  గ్రామవాసి
రామ్ జీ,భీమా బాయిl తల్లిదండ్రుల పుత్రుడు
అణ‌చివేత‌కు గుర‌వుతున్న వ‌ర్గాల‌కు ఆశాజ్యోతి
పాఠశాల తరగతి దూరంగా ఉండి పాఠాలను విని
అంటరాని తనాని,ఎన్నో అవమానాలను భరించి
అంచెలంచెలుగా ఎదుగుతూ అమెరికా వరకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించి విద్యావేత్త
రాజ్యనీతజ్ఞుడు, నిజాయితీపరుడు
బహు ముఖశాలి
సామాజిక ఉద్య‌మ‌కారుడు
న్యాయ కోవిదుడిగా
స్వ‌తంత్ర భార‌త‌దేశ తొలి న్యాయ‌శాఖ మంత్రి
వివ‌క్ష‌కు గుర‌వుతున్న వ‌ర్గాల‌కు ఆద‌ర‌వుగా నిలిచిన
చైతన్యమూర్తి
చీకటి బ్రతుకులో వెలుగు నింపిన  వెలుగుజ్యోతి
దేశ ప్ర‌జ‌ల‌కు ఎన‌లేని సేవ‌లందించిన  దిక్చూచి
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  ఐడవ మహా మేధావి
భారత రాజ్యంగా రూపకర్త
భారత రత్న పురస్కార గ్రహీత....

______________________________
హామి పత్రం:- ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
14
[14/04, 9:08 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:14/04/2022
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: డా.బి.ఆర్.అంబేద్కర్
శీర్షిక:
****************
విద్యకు దూరం చేసేందుకు ప్రయత్నించిన అంటరానితనంపై
దాహార్తిని తీర్చుకునేందుకు అడ్డొచ్చిన  అస్పృశ్యతను తొలగించడానికి
పిడికిలి ఎత్తిన సాహసం
వివక్షతకు గురియైన పసితనంలో 
వినిపించిన ధిక్కార స్వరమే భీమారావు రాంజీ అంబేద్కర్...

బాల్యంలోనే సామాజిక పరిస్థితులను ఔపాసన పట్టిన చైతన్యం
అక్షరమే ఆయుధంగా చేసుకుని
బరోడా మహారాజు సహకారంతో
ముప్పై రెండేళ్ళ వయసులోనే అత్యంత ప్రతిభావంతునిగా పేరు తెచ్చుకున్న విద్యావేత్త..

భారతీయ సమాజంలో లొసుగులను సవరించేందుకు కంకణం కట్టుకుని
నిమ్న వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతూ
రిజర్వేషన్ సౌకర్యం కలిగేలా  పోరాడిన ఉద్యమకారుడు..

రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా నిర్మాతగా 
కీలకమైన పాత్ర పోషించిన 
రాజ్యాంగ శిల్పి..

ఉద్యమాలకు ఊపిరినూది
సమాజాన్ని మార్చడానికి కృషి చేసిన  సంఘసంస్కర్త...

ప్రపంచంలో అత్యంత మేధావిగా
ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా
ప్రజల మనసులను గెలుచుకున్న నాయకుడు
భారత రత్న బిరుదాంకితుడైన బి ఆర్ అంబేద్కరుడు...
15.
[14/04, 9:15 pm] అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: అంశం:-
రాజ్యాంగశిల్పి
శీర్షిక:- 
బహుముఖ ప్రజ్ఞాశీలి
............................
భారతరాజ్యాంగ రూపకర్త గా,
ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచి
చట్టానికి ఎవరు అతీతులు కారాని చెప్పి యావత్ ప్రపంచానికే రాజ్యాంగాన్ని తీర్చిదిద్దిన నిస్వార్థ దేశభక్తులు అంబేద్కర్....!!

నిమ్నకులంలో జన్మించి అవమానాలకు గురైన కారణంగా జీవితాంతం దళితుల కొరకై  కృషిచేసిన కృషీవలుడు.
ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా, రాజకీయనాయకునిగా, స్వాతంత్ర్య ప్రథమ న్యాయశాఖమంత్రిగా
ఉన్నతశిఖరాలకేగిన
భరతమాత ముద్దుబిడ్డ అంబేద్కర్..........!!

ప్రపంచాన నేటికి విద్యాప్రావీణ్యంలో అంబేద్కర్ కు సాటిలేరని
"విద్వాన్ సర్వత్ర పూజయేత్" అన్నది అక్షర సత్యమని సరస్వతీమాత మానసపుత్రుడు గా నిలిచి
"భారతరత్న" పురస్కాన్ని 
మరణానంతరం పొందిన
బహుముఖ ప్రజ్ఞాశీలి 
అంబేద్కర్ మీ కివే మా శత కోటి వందనములు......!!
 ...............................
పేరు:-
కవిమిత్ర, సాహిత్యరత్న
అయ్యలసోమయాజుల ప్రసాద్
రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి
విశాఖపట్నం
చరవాణి:-9963265762
.................................
16
[14/04, 9:18 pm] అఫ్సర్ వలీషా గారు: కవితా గానం (సీజన్ 2)
అంశం...బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కవితలు...

శీర్షిక....ధీరుడు 

పేదరికపు పరదాలను
పక్కకు నెట్టి విజ్ఞాన 
పీఠాన్ని అధిరోహించిన
పట్టాభి రాముడతడు.....

అంటరానితనం 
అస్పృశ్యత ల
అహాలను అణచివేసిన
అభినవ రాముడతడు.....

స్యయంకృషి
స్వీయప్రతిభల
స్వతంత్ర భారత దేశ
సమగ్ర రూపశిల్పి అతను....

అవమానాలు అసమానతల
అడుగు జాడలను చెరిపేస్తూ
భహిస్కృతి భారతి  మనుస్కృతి మరాఠీ 
పత్రికలను నడిపిన ధీరుడతడు....

భారతీయ రాజ్యాంగానికి
బహుచక్కని రూపమిచ్చిన
భారతీయులందరూ మెచ్చిన
బాబా సాహెబ్ అంబేద్కర్ అతను
భారత రత్న మతను....!!

మొహమ్మద్ . అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి
17
[14/04, 9:21 pm] Porla Venu Gopala Rao Poet: *కవితాగానం (సీజన్-2)*
*తేదీ: *14/04/2022-గురువారం*
*అంశము: *డా. అంబేద్కర్ జయంతి*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట-రాజన్న సిరిసిల్ల*
శీర్షిక: *కారణ జన్ముడు*
ప్రక్రియ: *పద్యము(కందము)*
*********************
1)
*భారతమాత సుపుత్రుడు*
*భారత రాజ్యాంగ రచన బాధ్యత మోసెన్!*
*కారణ జన్ముడు భీముడు*
*భారత రత్నము నిజముగ బాబా సాహెబ్!*

2)
*ఎన్నో చదువులు చదివెను!*
*యెన్నో విద్యలు బడయగ యెదిగెను తానే!*
*కన్నీరంతయు తుడిచెను!*
*పన్నీరును చిలకరించె ప్రజల మనసులన్!*


3)
*దళితుల బాధలు గాంచెను*
*కులముల గీతలు చెరుపగ కోరెను మదిలో!*
*కలమును పదునుగ వాడెను!*
*గళమెత్తెను!గెలిచెను!తుదకందెను ఫలముల్!*

4)
*జాతికి రత్నము భీముడు!*
*నీతికి నిలబడి నిజమగు నేతగ మారెన్!*
*యాతని జన్మ దినంబిది!*
*జాతర చేయర! జనులిక సంతసమందన్!*
*********************
*హామీపత్రము: స్వీయరచన*
[14/04, 9:25 pm] నాయకంటి నరసింహ శర్మ గారు: కవితాగానం సీజన్2
పేరు. డా.నాయకంటి నరసింహ శర్మ
వనపర్తి
అంశం. అంబేద్కర్

భారతజాతి సంస్కరణోద్యమ సముద్ర శశాంకుడు
సమభావనా శీలసంపన్నుడు
వివేచనా తత్పరత ఆలోచనా గాంభీర్యం
పరిణామ ,పరివర్తనా దక్షుడు
సామాజిక సాంస్కృతిక వైభవోజ్వలసారథి
రాజ్యాంగ నిర్మాణ మహారథి
నవీన భారతజాతి సమున్నతోత్సవ సంసేవ్యమాన
మకుటాయమాన మనీషి 
తృణీకృత నిమ్నవర్గాళిపాలిట చేతనాభరిత మహర్షి
భరతఖండ మానవాళికి 
సహస్రకిరణోదయ భానుతేజసమానుడు
భావదాస్య తిమిర విచ్ఛేదనా ధురీణుడు
సంక్షుభిత సహస్రవృత్తుల జనసంద్రానికి కరుణాసుధాకరుడు


హామీ
ఈకవిత 
స్వీయరచన
అనువాదం, అనుసరణా అనుకరణ కానేకాదని 
హామీ ఇస్తున్నాను
19.
శీర్షిక :
ఆదర్శాలమణిహారం 

వెలివేతల కుండపోతల
వానల్లో నిలువెల్లా తడిసినా నీరసించక

సంయమనపు గొడుగుతో 
అడుగులు వేసావు 

 నిర్వేదంతో
వెరచింది లేదనడానికి నిదర్శనమయ్యావు

ఆధిపత్యపుతుఫాను లెన్ని చుట్టుముట్టినా 
ఎదిరించడానికి తలదించిన గడ్డి పరకవయ్యావు

బడికి దూరం చేస్తూ
పట్టింపులెంతగా నెట్టివేసినా..

చీత్కారపు చిక్కుముళ్లను విప్పుతూ.......

పట్టువదలక పట్టాతో ప్రత్యక్షమయ్యావు

గుడి గోడలను తాకనివ్వక 
అవమానాలహారతులెన్ని పట్టినా
అసమానతల గ్రహాలు వీడేదాకా పోరాడి నిగ్రహపు విగ్రహమయ్యావు

ఆత్మగౌరవ పతాకగా
రాజ్యాంగపు ప్రతీకవయ్యావు 

మాటలు చెప్పడం కాదు
చేతల్లో చూపితేనే చరిత్రను మార్చవచ్చన్న
సంకల్పబలానికి చిరునామాగా చిరంజీవివయ్యావు
ఆదర్శాలమణిహారమయ్యావు

***********శివునూరి లలితాకృష్ణ
20.
కవితా గానం సీజన్ 2
********************
అంశం:- అంబేద్కర్
*******************
అంటరాని తనమన్నది
సమాజమున కడ్డుగోడ
దాన్ని రూపుమాపుటకై
పిడికిలెత్తె పిడుగు వోలే
అందరికీ సమానమగు
హక్కులకై పోరాడి
బడుగు జనుల జీవనమున
వెలుగులు పంచుట కొరకై
ఒడిదుడుకుల నెదురుకొని
పోరాటం సాగించి
అడుగడుగున ఎదురైన
ఆటంకాలకు అదిరిపోక
సమ సమాజ స్థాపనకై
నడుం కట్టి నడిచాడు
దృఢ సంకల్పం తోడుత
ఆశయాలు సాధింపగ
అడుగు ముందుకు కేసినట్టి
క్రాంతి సూర్యుడతడేగా
చదువు జీవనాధారము
చదువే గమ్యం అనుచు
చదువు విలువ తెలిపినాడు
చదివినాడు‌ విద్యలెన్నో
ప్రతిభా పాటవములతో
పదవులు చేపట్టినాడు
రాజ్యాంగం రచన చేసి
రంజిల్లెను‌భరతావని
అంబేద్కర్ మహాశయుడు
అందరికీ ఆరాధ్యుడు
🖋️ వేదాంతం సురేశ్ బాబు

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...