Skip to main content

సీౙన్ 3 జలియన్ వాలా బాగ్ 1

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
 వీరా గుడిపల్లి
**********************
కవి వరుల జాబితా
0.కోరాడ నరసింహారావు గారు
1.ఏడెల్లి రాములు గారు
2.నాగేశ్వర రావు గారు
3.పొర్ల వేణు గోపాల్ రావు గారు
4.మొహమ్మద్. అప్సర వలీషా గారు
5.వేదాంతం సురేష్ బాబు గారు
6.గజవెళ్ళి శ్రీ నివాసచారి గారు
7.విజయ లలిత టేకు మళ్ళ గారు
8.తరణికంటి సూర్య లక్ష్మి గారు
9.డా.భమిడి మఱ్ఱి కమలాదేవి గారు
10.దారల విజయ కుమారి గారు
11.కొమురవెల్లి అంజయ్య గారు
12.కవిత వెంకటేశ్వర్లు గారు
13.సింహాద్రివాణి గారు
14.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
15.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
16. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
17.డా.బల్లూరి ఉమాదేవి గారు
18.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
19.మద్ది పుల్లారావు గారు
20.జోజోషిపద్మావతి 
21.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
22.గొర్రెపాటి శ్రీ ను గారు
23.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు
24.ముడుంబ తిరు వేంకటాచార్యులు గారు
25.గంగాపురం శ్రీనివాస్ గారు
26.బొప్పెన వెంకటేశ్ గారు
*****************
0.
కవితాగానం, సీజన్ - 3
పౌర్ణమి నగదుబహుమతుల పోటీకి...... !       అంశం:-       @జలియనువాలాబాగు@
శీర్షిక :-" చరిత్రలో నరమేధం "
    కోరాడ నరసింహా రావు 
     ******************
స్వాతంత్ర్య సంగ్రామచరిత్ర లోనే కాదు... భారత దేశ చరిత్ర లోనే అత్యంత దురదృష్టకర... దుర్మార్గ సంఘటన !
      వెయ్యి మంది ప్రాణాలను హరించి, రెండువేల మందిని  
 తీవ్రoగా గాయపరచిన దు రా గతం... !!
     డయ్యర్ పైసాచి కత్వాని కి 
పరాకాష్ట...!
    స్వర్ణ దేవాలయం సాక్షిగా... 
జలియనువాలాబాగుతోటలో 
జరిగిన నరమేధం !
   భారతదేశానికి స్వాతంత్య్రం రావాలనే ఆశ, సంబంధం లేని యుద్దానికి ... నలుబదిఏడువే ల మంది భారతీయ సైనికుల  
బలి దానం !
   సహకరించక వ్యతిరేకించిన   
బెoగాల్,పంజాబ్ లపై...కన్నెర్ర జేసిన తెల్ల దొరతనం!
     ప్రాధమిక హక్కులను కాల రాచి, తిరుగు బాట్లను ఉక్కు పాదాలతో అణచివేసేఆలోచనే
హడల గొట్టే ప్రయత్న మే... ఈ మారణ కాండ !
    కుట్రపూరిత రౌలట్ చట్ట వ్యతిరేకతను సహించలేని 
దురహంకార మదానికి దర్పణ
మిది !
  స్వాతంత్ర్య సంగ్రామముతీవ్ర రూపముదాల్చి, దాస్య సృoఖ   లాలను త్రెంచి,తెల్లవారిని తరిమి కొట్టుటకు నాంది యైనది !   ఐనా...., 
   చరిత్రపుటలలో ఈ  పేజీలు రక్తసిక్తమై...  ఆవేదనను కలిగి  స్తునే యున్నవి !!
     *******************
1.
కవితా గానం (సీజన్-3 పోటీకి)
అంశం*జలియన్ వాలాబాగ్
శీర్షిక*ఈ దరిత్రిపై నెత్తుటి ధారలు

దుర్మార్గ రౌలెట్ చట్టం
సత్యపాల్ సైఫూద్దీన్ కచ్లూల నిర్భంధం

ప్రముఖుల ఉపన్యాసాలకై
గుమిగూడిన జనం స్వాతంత్ర్య
సమరోత్సాహం
జలియన్ వాలాబాగ్ ప్రభవించిన విప్లవోజ్వలనం
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య
దుర్నీతిని ఎదిరించేను ప్రజాశక్తి

నలువైపులా ఇరుకైన దారులు
మోహరించిన డయ్యర్ సైన్యం
స్వేచ్ఛా స్వాతంత్ర్య శాంతిపావురాలపై
నిప్పులు కక్కిన బ్రిటిష్ కుక్కలు

 అయ్యయ్యో ఏమిటీ ఈ నరమేధం
లెక్కించనలవిగాని శవాల గుట్టలు
లేగదూడలపై పులిపంజా దాడి

దగ్గర్లోని బావికూడా మనుషులను
కాపాడలేదు
పసికూనలపై పేలిన తూటాలు
వినబడలేదా వేలమంది ఆర్తనాదాలు

దావానలంలా వ్యాపించే దుర్వార్త
ఒక్కొక్కరు అగ్ని గోళమై మండిరి
విప్లవ సింహం భగత్ సింగ్ గర్జించే
రవీంద్రుడు సర్ బిరుదును నిర్జించే
తల్లి భారతి ఒడిలో స్వేచ్ఛా సిపాయిలు పోరు సల్పగా
విప్లవం వర్దిల్లే స్వాతంత్ర్యం సిద్ధించే

అమరుల బలిదానం
మరువదు నా దేశం  
 నింగినంటిన అశోక చక్రం సాక్షిగా

ఏడెల్లి రాములు ✍️
ది*16*04*2022(21*10)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
2.
అంశము :-- జలియన్ వాలాబాగ్(46).
కవితా గానం(సీజన్3). 16--4--2022.
పిన్నక నాగేశ్వరరావు.
చైత్రమాసం పౌర్ణమి కవితల పోటీకి...
అంశము :-- జలియన్ వాలాబాగ్. 
శీర్షిక :-- జలియన్ వాలాబాగ్ దురంతం. 

1. తే.గీ.
నూటమూడు వత్సరముల నాటి ఘటన
యాంగ్ల పాలకు లేలికలైన వేళ 
నుత్తరమ్మున యమృతసర్ పత్తనమున
రాష్ట్రమైనట్టి పంజాబు ప్రాంతమందు
జరిగె జలియను వాలబాగ్ స్థలమునందు...

2. తే.గీ.
...నీ దురంతము నొక్క యాంగ్లేయుడైన
డయ్యరను వాని యాజ్ఞతోడ నట కాల్పు 
లన్ జరుప స్త్రీ, పురుషులు పిల్లలును కూడ
వందలాదిగ ప్రాణముల్ వదలినారు.

3. తే.గీ.
భరత దేశమందాంగ్లేయ పాలనమును
సమ్మతించని నేతలు జనుల కవ
*****************
1.
కవితా గానం (సీజన్-3 పోటీకి)
అంశం*జలియన్ వాలాబాగ్
శీర్షిక*ఈ దరిత్రిపై నెత్తుటి ధారలు

దుర్మార్గ రౌలెట్ చట్టం
సత్యపాల్ సైఫూద్దీన్ కచ్లూల నిర్భంధం

ప్రముఖుల ఉపన్యాసాలకై
గుమిగూడిన జనం స్వాతంత్ర్య
సమరోత్సాహం
జలియన్ వాలాబాగ్ ప్రభవించిన విప్లవోజ్వలనం
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య
దుర్నీతిని ఎదిరించేను ప్రజాశక్తి

నలువైపులా ఇరుకైన దారులు
మోహరించిన డయ్యర్ సైన్యం
స్వేచ్ఛా స్వాతంత్ర్య శాంతిపావురాలపై
నిప్పులు కక్కిన బ్రిటిష్ కుక్కలు

 అయ్యయ్యో ఏమిటీ ఈ నరమేధం
లెక్కించనలవిగాని శవాల గుట్టలు
లేగదూడలపై పులిపంజా దాడి

దగ్గర్లోని బావికూడా మనుషులను
కాపాడలేదు
పసికూనలపై  పేలిన తూటాలు
వినబడలేదా వేలమంది ఆర్తనాదాలు

దావానలంలా వ్యాపించే దుర్వార్త
ఒక్కొక్కరు అగ్ని గోళమై మండిరి
విప్లవ సింహం భగత్ సింగ్ గర్జించే
రవీంద్రుడు సర్ బిరుదును నిర్జించే
తల్లి భారతి ఒడిలో స్వేచ్ఛా సిపాయిలు పోరు సల్పగా
విప్లవం వర్దిల్లే స్వాతంత్ర్యం సిద్ధించే

అమరుల బలిదానం
మరువదు నా దేశం  
 నింగినంటిన అశోక చక్రం సాక్షిగా

ఏడెల్లి రాములు ✍️
ది*16*04*2022(21*10)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
2.
అంశము :-- జలియన్ వాలాబాగ్(46).
కవితా గానం(సీజన్3).        16--4--2022.
పిన్నక నాగేశ్వరరావు.
చైత్రమాసం పౌర్ణమి కవితల పోటీకి...
అంశము :-- జలియన్ వాలాబాగ్. 
శీర్షిక :-- జలియన్ వాలాబాగ్ దురంతం. 

1. తే.గీ.
నూటమూడు వత్సరముల నాటి ఘటన
యాంగ్ల పాలకు లేలికలైన వేళ 
నుత్తరమ్మున యమృతసర్ పత్తనమున
రాష్ట్రమైనట్టి పంజాబు ప్రాంతమందు
జరిగె జలియను వాలబాగ్ స్థలమునందు...

2. తే.గీ.
...నీ దురంతము నొక్క యాంగ్లేయుడైన
డయ్యరను వాని యాజ్ఞతోడ నట కాల్పు 
లన్ జరుప స్త్రీ, పురుషులు పిల్లలును కూడ
వందలాదిగ ప్రాణముల్ వదలినారు.

3. తే.గీ.
భరత దేశమందాంగ్లేయ పాలనమును
సమ్మతించని నేతలు జనుల కవ
గాహన కలిగించగ కూడగట్ట పార్కు
నందు జలియను వాలబాగ్ యనెడు చోట 
వారి మాటలు, వ్యతిరేక భావనలను
వినుట కున్నట చేరిరి వేలమంది.

4. తే.గీ.
పార్కు చుట్టు గలవు పెద్ద భవనములును
కలదు మార్గము రాకపోకలకు నొకటె
సైనికుల్ లోనికేగి విచక్షణా ర
హితముగ జరుప కాల్పు లమితముగాను
వీలు లేకను బయటకు వెడలుటకును
ప్రాణమిచ్చిరి, గాయాల పాలబడిరి.
***************************************
3.
కవితా గానం సీజన్-3
చైత్ర మాస పౌర్ణమి కవితల పోటీలు..
అంశము: *జలియను వాలాబాగ్*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా* 
 శీర్షిక: *నరమేధం*
ప్రక్రియ: *పద్యము*
*********************

1) *ఉత్పలమాల*

*దారుణ కాండయే కదర! ధర్మము తప్పిరి తెల్లవారలే!*
*కారణమేమి లేదుగద! కాల్పులు జేసిరి దుష్ట సైనికుల్!*
*మారణ కాండ కారకుడు! మంతన కర్త బ్రిటీషు డయ్యరే!*
*భారత మాత బిడ్డలను వంచన జేసి హతంబు జేయగన్!*

2) *చంపకమాల*

*కలిసిరి పౌరులచ్చట సకాలములో సభ నిర్వహించగన్!*
*పలుకుల ముఖ్య పాఠమిది! భావి తరాలకు స్వేచ్ఛ నిచ్చుటే!*
*నులికిపడంగ తెల్లదొర లుద్యమ వీరుల జంపనెంచిరే!*
*జలియను తోటలోన జన సంద్రము నంతయు కాల్చివేసిరే!*

3) *ఉత్పలమాల*

*పిల్లలు పాపలుండిరట! పెద్దల తోడన చంకనెక్కియున్!*
*మెల్లగ నుప్పు నందుకుని మ్లేచ్చులతీరున జేరె సైనికుల్!*
*జల్లెడలయ్యె దేహములు! సాగె తుపాకుల గుండ్ల వర్షముల్!*
*కల్లలు గావు లెక్కలవి! కాల్పులలో మరణించె వేలలన్!*

4) *చంపకమాల!*

*యిరుకగు దారులేగ యవి! యిండ్లు భవంతులు నిండియుండగన్!*
*చురుకుగ నాంగ్లసైనికులు చొచ్చుకు వచ్చిరి వాహనంబులన్!*
*దొరికిన వారినందరిని దుష్ట స్వభావముతోడ జంపిరే!*
*పరుగులు పెట్టిరే జనులు! బావులలో పడి యంతమొందిరే!*

5) *చంపకమాల*

*కనబడు వారినెల్లరిని కాల్పులతో యమలోకమంపగన్!*
*జనులట భీతిజెంది తమ చావుల జూచిరి రక్తధారలన్!*
*దినకరుడయ్యె సాక్షి!నలు దిక్కుల జూడ శవాల గుట్టలే!*
*జనరలు డయ్యరే యముడు! చావును జూపెను దారుణంబుగన్!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*
4.
కవితా గానం (సీజన్ 3) 
అంశం... జలియన్ వాలా బాగ్
శీర్షిక.... చెరగని సంతకాలు

ఎవరికి తెలుసు... 
ఆ ఆకుపచ్చని శాంతి కపోతాలతో
నిండిన ఆ తోట
ఎరుపు వర్ణాతో వేడెక్కి పోతుందని...

ఎవరికి తెలుసు.... 
కుళ్లు కుతంత్రాల మేఘం ఒకటి
మిన్ను విరిగి మీద డయ్యర్ రూపంలో విరుచుకు పడుతుందని... 

ఎవరికి తెలుసు... 
అన్యాయపు కోట్లు ధరించి
న్యాయ దేవత కళ్ళకు గంతలు కట్టి
బూటకపు నిశ్శబ్దపు బూట్లతో వస్తారని.... 

ఎవరికి తెలుసు.... 
గాలిలో కలిసినవి లెక్కలేనన్ని
విలువైన ప్రాణాలని
గుండెను కుదిపే గోడలు చెబుతున్నాయి
స్మారక స్థూపం మాటున దాగిన
నిర్జీవ సాక్ష్యాలు గొంతెత్తూ ఉన్నాయి
మేము ఎన్నో వేలని..... 

భరత మాత ఎదపై
చిందించిన ఆ స్వేచ్ఛా రుధిర ధారలు
ఈనాడు ప్రతి భారతీయుని 
ఉచ్ఛాస్వ నిచ్ఛాస్వ లో
ఎన్నడూ చెరగని మరువని  సంతకాలు...!! 

హామీ... నమస్తే ఈ కవిత నా స్వీయ రచన  అని హామీ ఇస్తున్నాను

మొహమ్మద్. అప్సర వలీషా
ద్వారపూడి (తూ. గో. జి).
5.
[16/04, 8:18 pm] Lalita Sister: కవితా గానం సీజన్ 3
అంశం:- జలియన్ వాలా బాగ్
****************************
వైశాఖీ పర్వదినం నూతన సంవత్సరాది
పంజాబీ ప్రజలకది పర్వదినం గర్వదినం
మన భారత స్వాతంత్ర్య
సంగ్రామ సమయంలో
జరిగిన అతి దురదృష్ట
కరమగు సంఘటనమది
అమృతసర్ నగరంలో జలియన్ వాలా బాగున
జరిగిన మారణహోమం పారిన మానవ రుధిరం
దయహీనుండగు జనరల్
డయ్యర్ సారథ్యంలో
నిరాయుధులపై జరిపిన
దారుణ మారణ కాండ
స్త్రీ బాలలు వృద్ధులపై
విచక్షణా రహితంగా
తూటాలను పేల్చినట్టి
దుష్కరమగు దమనకాండ
రౌలత్ చట్టం వద్దని దేశ వ్యాప్త ఆందోళన
బ్రిటీషర్ల గుండెల్లో చెలరేగిన భయ వాసన
కుటిల నీతి దర్పణమై
ఎరుపెక్కిన గగన సీమ
భారత్ ఛోడో అంటూ
అగ్ని కీలలై ఎగసిన
విప్లవ రణ నాదంతో ఎలుగెత్తిన జన ఘోషణ
పీనుగు పెంటై నిలిచిన జలియన్ వాలా బాగు.
🖋️ వేదాంతం సురేశ్ బాబు
6
[16/04, 9:40 pm] Lalita Sister: కవితాగానం సీజన్ 3
కవితల పోటీ కోసం
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
అంశం: జలియన్ వాలా బాగ్ 
శీర్షిక: ఎర్రపూలు 
...
ఎవరు కలగనలేదు 
బైసాఖీ పండగవేళ 
తుపాకులు గర్జిస్తాయని 
జలియన్ వాలా బాగ్ లో 
రుధిరం ప్రవహిస్తుందని
పిశాచాలు నాట్యం చేస్తాయని 

ఎవరు ఊహించలేదు 
జనరల్ డయ్యర్ రూపంలో 
మృత్యువు బాగ్ లో ప్రవేశిస్తుందని 
జాత్యహంకార గర్వంతో
సామాన్యుల ప్రాణాలు హరిస్తాడని 

బాగ్ లో ఎర్రపూలు పూసేచోట 
రక్తం ప్రవహించింది 
గగనంలో ఇనుడు 
క్రోధంతో ఎరుపెక్కాడు 
నేలతల్లి మనసు ఆక్రోశించింది 

బాగ్ అమరుల త్యాగాలతో 
రగిలింది స్వాతంత్ర్య కాంక్ష 
సంపూర్ణ స్వరాజ్యం దిశగా 
కదంతొక్కారు జనం 

జలియన్ వాలా బాగ్ స్మారక స్థూపం
బ్రిటిష్ వారి దుర్మార్గానికి 
తిరుగులేని సాక్ష్యం

హామీ పత్రం 

ఈ కవిత నా స్వంత రచన. ఇది అనుసరణ, అనుకరణ కాదు. 

గజవెళ్ళి శ్రీనివాసాచారి
7
[16/04, 9:43 pm] Lalita Sister: ఉధమ్ సింగ్ 
~~~~~~~~
దాహార్తి తీర్చ వచ్చిన ఆ బాలుడు 
డయ్యర్ దుశ్చర్యలతో భీతిల్లిపోయాడు
వసంతోత్సవ శుభవేళ జరిగిన
మృత్యుహేలతో మ్రాన్పడిపోయాడు 
వేలాది మృతదేహాలను రక్తపుమడుగులో 
చూస్తూ ఆక్రోశంతో ఊగిపోయాడు
తక్కెడతో అడుగు పెట్టి
తుపాకులను ఎక్కుపెట్టి
ప్రాణాలను తృణ పాయం చేసి
కాయాలను ఛిద్రం చేసి 
ఆ నీచుడు చేసిన కరాళ నృత్యానికి నెత్తురుడిగి
పంజా విసిరే సింహం వలె
ఈ పంజాబీ సింగ్
ఆగ్రహంతో రగిలిపోతూ
మట్టికి మాటిచ్చాడు
భారతావనికి బాస చేస్తూ 
ఆ నరహంతకుడి అంతానికి
ప్రతిన బూనాడు 
ఆ మానవాధముడు చేసిన 
దుశ్చర్యకు ప్రతీకారంగా
తన జీవితాన్నే పణంగా పెట్టి
రోజులు ,నెలలు కాదు
సంవత్సరాలు వేచి చూసి
పేరు మార్చి, రూపు మార్చి
దేశం కాని దేశం చేరి
మస్తకంతో ఆలోచన చేసి,
పుస్తకములో ఆయుధముంచి
ఆ దుర్మార్గుడి గుండెల్లో
తూటాలు దింపి,
జలియన్ వాలా భాగ్
అమాయకుల ఆత్మలకు
శాంతి కలిగించి
సగర్వంగా, సంతృప్తిగా
ఉరికొయ్యను ముద్దాడిన 
ఉధమ్ సింగ్
విశ్వయవనికపై
విజేతగా నిలచిన
సిసలైన దేశభక్తుడు
~~~~~~~~~~~~~~
విజయలలిత టేకుమళ్ళ
ఉపాధ్యాయురాలు
8.
[[కవితాగానం ( సీజన్‌ 3 )16/4/2022/ శనివారము
శుభకృతు నామసంవత్సరం చైత్రమాసపౌర్ణమి కవితలపోటీ/
అంశము:- " జలియన్‌వాలాబాగ్ "

            శతాబ్ది క్రిందటదారుణ మారుణ ఖాండ అమృత్‌సర్‌పట్టణానగల జలియన్‌ వాలాబాగ్ దుర్ఘటన అది పంజాబీలకొత్త సంవత్సరము . సిక్కులకుటుంబాలు చిగురంట మట్టు పెట్ట నెంచిన రాక్షసత్వం స్వాతంత్రోద్యమ చరిత్రలో ఓమరువరాని దుర్ఘటన
             రౌలతుచట్టం రద్దుచేయనెంచి శాంతిసమావేసాలు జరిపేవేళలో నిర్లయాలు లేకుండగానే ఆకస్మికదాడి బాంబులు కత్తులతో పదినిమిషాలు వూపిరాడకుండాజేసింది .
         జూలియన్ వాలాబాగ్ న జరిగిన ఘోరము
జలదరించు గుండెలజల్లుమనగ
తలచుకున్న నేటికి తుళ్ళు పాటుకలుగు
              ఏమిటీ దారుణం
చరిత్రలో కనీవినీ యెరుగని ఘట్టం . ఏరులైపారెరుధిరమంత బ్రిటిషు నేతల రాక్షసత్వమున జరిపిన భీకరమైన కాల్పుల
        నాటిదుష్ట పాలకుడు నరకుని కన్నను నాలుగురెట్లు నరకము జూపిరి నేతలు . హిరణ్యాక్ష, హిరణ్యకసిపుల నిబంధనలకన్న తీసిపోవీ బ్రిటిషు చట్టాలు .
        మానవత్వమెరుగని రాక్షసులు చీకట్లు ముసిరిన రోజుగాచూపించారు .1650 గుండ్ల కాల్పులు జరిపారు.1200 మంది మరణాలు . పరుగెత్తువారి తలలను కత్తులతో నరికారు. 
       ఆదారుణ కాండయే అసలైన స్వాతంత్ర్య ఉద్యమాలకి దారితీసింది. బాంబుల పేలుళ్ళు కత్తులథాటికి లెక్కచేయకుండా ఉద్యమాలు వూపందుకున్నాయి . 
భగత్‌సింగు వంటి వీరుల నినాదాలతో హడలెత్తిన ప్రభుత్వం వారిని విప్లవకారులుగ అనేక నెపములు చూపి ఉరికంభమెక్కించింది .
    రవీంద్రనాధ్ ఠాగూర్‌ బ్రిటిషువారిచ్చిన బిరుదును తిరస్కరించాడు . మోతీలాల్ తనబిరుదులు, పదవులు వొదులు కున్నాడు . రాణి ఎలిజిబెత్2 ఇది బ్రిటిషు చరిత్రలోనే సిగ్గుపడే రోజని పత్రికాముఖముగా వెల్లడిపరచింది.
      జూలియన్ వాలాబాగ్ సంఘటన మరపురాని ఓ దుర్ఘటన
          ఓం శాంతి ఓం శాంతి ఓంశాంతి !
      తరణికంటి సూర్యలక్ష్మి.
                     ----------
9.
[16/04, 8:11 pm] Lalita Sister: కవితాగానం (సీజన్ 2)
శుభకృత్ నామ సం. చైత్రమాస పౌర్ణమి నగదు కవితా పోటీలకు నాకవిత
అంశం : జలియన్ వాలాబాగ్
శీర్షిక : చారిత్రిక సంఘటన
అది ఒక అందమైన ఉద్యానవనం
పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ లో ని ఒక మనోహరమైన ఓ పబ్లిక్ గార్డెన్ జలియన్ వాలా బాగ్
ఆంగ్లేయుల  ధర్మమా అంటూ
ఒక శ్మశానవాటికగా మారిపోయిన 'బాగ్' అది
1919సం. ఏప్రిర్ 13 న
బ్రిటిసువారి  దౌర్జన్యానికి
వేలకొలది  భారతీయులను
శవాలుగ మార్చిన 'బాగ్ '
జలియన్ వాలాబాగ్
శిలాక్షరాలుగ భారతీయచరిత్రలో
నిలిచిపోయిన బాగ్ జలియన్ వాలా బాగ్
స్వాతంత్రోద్యామలకు నాంది
పలికిన బాగ్  జలియన్ వాలా
బాగ్
ఆత్మరక్షణకై ఎందరో అమాయకులైన భారతీయులను తన కడుపులో దాచిన బావి ప్రత్యక్షసాక్షిగ నిలిచిన బాగ్ 
జలియన్ వాలా బాగ్
ఒక దురంతం, ఒక దుర్ఘటన
ఒకవిషాదసంఘటన ఇది
కానవస్తాయి నేటికీ తుపాకీ గుండ్ల చిహ్నాలు 
ఇరుగుపొరుగు భవనాలపై
గాంధీమహాత్ముని సహాయ నిరాకరణోద్యమ స్ఫూర్తి
భగత్ సింగ్ ని విప్లవకారునిగ
మార్చిన ఉదంతం
విశ్వకవి రవీంద్రుని సర్ బిరుదు త్యాగం  'జలియన్ వాలా బాగ్' 
నిలిచి పోయింది ఒక స్మారక
చిహ్నంగ అఖండ జ్వాలతో.

పేరు : డా.భమిడిమఱ్ఱి కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
చరవాణి : 9871096566

హామీ : పైకవిత నాస్వంతం.
10
[[17/04, 8:16 pm] Lalita Sister: కవితా గానం సీసన్ 3
శుభకృత్ నామ సంవత్సరం
చైత్రమాసం పౌర్ణమి కవితల పోటీ కోసం
*****************
అంశం : జలియన్ వాలా బాగ్
శీర్షిక : తోట గుండెలో 1650 తూటాలు
*******************************

భారతీయుల అడుగులను లెక్కపెడుతూ
జీవన దారులన్నీ పహారాలో పెడుతున్నపుడు
దేశం పాడిన స్వాతంత్ర్య గీతానికి ఆ తోట గొంతు కలిపినపుడు

తోట ఎదలో బూట్ల చప్పుడు..పోజిషన్ తీసుకున్న మృత్యువు

ముందస్తు హెచ్చరికలైనా లేని..ఒక శంఖమైనా పూరించని..అ ఏక పక్షమైన అధర్మ యుద్ధం

విచక్షణా రహితంగా గురిపెట్టబడిన ఆ దయలేని తూటాలు..కళ్ళల్లోకి కడుపుల్లోకి దూసుకుపోతూ..
తలలను..గుండెలను ఛిద్రం చేస్తూంటే..
నేల కూల్చబడిన చిన్నా..పెద్దలు

వలస పాలన తుపాకీ గొట్టాలకు 
సామాన్యులే లక్ష్యాలు
అరుపులు..ఆక్రందనలు హాహాకారాలే దేశ ద్రోహాలు ఆ తోట గుండెలో 1650 రౌండ్లను దించాకే.. నిమ్మళించిన తుపాకీలు 

అలమటిస్తూ..సాయం కోసం అర్రులు చాచిన
క్షతగాత్రులతో ఆ సూర్యాస్తమయం..

మరింతగా ఎర్రబడి మౌనంగా దీనంగా
సూర్యుడు నిష్క్రమించడం చరిత్ర చూసింది 

భయం గుప్పిట్లోకి జనాన్ని..జాగారంలోకి పట్టణాన్ని నెట్టేసిన ఆరాత్రి

ఆ రేగిన దుమ్ము..చిప్పిల్లిన నెత్తురులో
రవి అస్తమించని సామ్రాజ్యాన్ని మసకబార్చిన 
డయ్యరు కర్కశత్వం

విరిగిపడిన దేహపు చరియలు..ఆగిపోయిన మూలుగులు..విషాద మరణాలకు వందేళ్ళైనా..
 
ఇంకా కుతకుతలాడుతూనే..కుదుట పడని
భారతీయుల సలుపుతున్న గాయాలనుంచీ నుంచీ..ఆ వీరులకు వినమ్ర వందనాలు

డా.దారల విజయ కుమారి

హామీ పత్రం
*************
నమస్తె సర్/ మేడం
ఈ కవిత నా స్వంత రచన.అనువాదం కాదు.
ఎక్కడా ప్రచురితం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
డా.దారల విజయ కుమారి
11
[17/04, 8:17 pm] Lalita Sister: లాల్ బనా బాగ్
...........................
పిడికిళ్ళెత్తారు, నినాదాలు చేశారు
ఏకమైన గొంతుల శబ్దం దద్ధరిల్లింది
స్వేచ్ఛ కోసం పావురాలు గుమికూడాయి
'బాగ్' లో కుప్ప పోసిన పూలలా జనం
ఒకే తోవలో వచ్చారు స్వాతంత్రాన్ని నమ్ముకున్నారు
తిరిగి వెళ్లాలన్నా అదే మార్గం

కరవడం నేర్చిన తెల్ల నక్క ఆదేశాలు
దారిని తుపాకులు ఆక్రమించాయి
తూటాలకు తొందరెక్కువ, వేగమెక్కువ
పచ్చి నెత్తురు రుచి చూసే దుర్గుణం ఎక్కువే

రెక్కలు తెగిపడ్డ దేహాలు, చావు ఆర్తనాదాలు
కట్టడితో కదుల లేకపోయిన గాయాల మూల్గులు
దుఃఖ నదుల సంగమం ఆ ప్రాంతం
పసిప్రాయం చిరునవ్వులు రాలిన పూలు
గాంధేయవాదం యవ్వనం, వృద్ధాప్యం
కలగలిసి పారిన నెత్తురు
అలసిపోయి నల్లదుస్తులు ధరించింది ఆ ప్రాంతం

కర్ఫ్యూ నీడలో అమృత్ సర్  జనజాగారం
రెప్పలు మూయడం మరిచారు
కనురెప్పల్లాంటివాళ్లు జలియన్ వాలాబాగ్ లో
తెల్లారితే కదా శవాలనో క్షతగాత్రులనో చూసుకునేది

డయ్యర్ రక్త దాహం మెచ్చుకున్న పాలన
స్వాతంత్రోద్యమానికి దేశాన్ని కదిలించిన ఘటన
చలించిన హృదయాలు, జ్వలించిన నడకలు
...............................................................

కొమురవెల్లి అంజయ్య
సిద్దిపేట


పోటీకి పంపిస్తున్న ఈ కవిత నా సొంతం. 
కొమురవెల్లి అంజయ్య
ఇం.నెం.6-2-56
బొర్ర హనుమాన్ దేవాలయం పక్కన
సిద్దిపేట
సెల్..9848005676
12.
[16/04, 7:56 pm] Lalita Sister: కవితా గానం 2
అంశం:: జలియన్ వాలా బాగ్
రచన:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
సెల్:: 8309920625
శీర్షిక:: విషాదము

జలియన్ వాలా బాగ్
జరిగిన దురంతము
అయిందది రక్తపు మడుగు
ఎవ్వరు వూహించని ఉదంతము

ఉదృతంగా నడుస్తున్న
స్వాతంత్ర్యపు రోజులు
ప్రజలు వీరులై ధీరులై
పాటుపడుతున్న రోజులు
వ్యూహాలు ప్రతివ్యూహాలతో
సాగుతున్న కాలం
ఎవరికివారు పై చేయి సాధించాలని వేస్తున్న పథకం!!

జలియన్ వాలా బాగ్ అనునది
ఉత్తరప్రదేశ్ లోని అమృతసర్
పట్టణములోని ఒక తోట
బ్రిటిష్ సైనికులు పేల్చినారు తూట

ఏప్రిల్ 13,1919లో బ్రిటిష్
సైనికులు
జనరల్ డయ్యర్ సారథ్యంలో వాళ్లు 
కార్యచరణ రూపొందించుకోవాలని
సమావేశమవ్వాలని
నిర్ణయించుకొని
నిరాయుధులై
వచ్చారక్కడికి స్త్రీలు పురుషులు పిల్లలు
వారందరిపై విక్షణ రహితంగా
జరిపిరి కాల్పులు
పదినిమిషాలు వ్యవధిలో
పారే రక్తము ఏరులు
జరిపినారు కాల్పులు 1650
రౌ0డ్లు
మరణించిరి 1000 మంది
అయ్యారు 2000 మంది క్షతగాత్రులు
చనిపోయిరి ఎందరో పిల్లలు
పారిపోయేందుకు దారి లేక
అక్కడున్న బావిలో దూకిరి
సందులు గొందులు ఉన్నకారణ0గా
రాక పోకలు లేని కారణంగా
ఆసుపత్రికి పోలేక
మరణించిరి చాలా మంది
బావిలో దూకి
ఆ బావే నేడు స్మారక చిహ్నము
తలుస్తారు అక్కడి జనం అహర్నిశము
బ్రిటిష్ వారు చేసిన విషాదము
స్వాతంత్ర్య కోరిక పునాదులు
పటిష్టము!!
            ఈ కవిత నా స్వీయ రచనని హామీ
13
[16/04, 8:11 pm] Lalita Sister: కవితా గానం (సీజన్--3)
శుభకృతు నామసంవత్సరం చైత్రమాసం పౌర్ణమి నగదు బహుమతుల కవితల పోటీకి
అంశం:--జలియన్ వాలా బాగ్
శీర్షిక:--జలియన్ వాలాబాగ్‌
రచన:--సింహాద్రి వాణి
ఊరు:--విజయవాడ
చరవాణి:--7569820872

ప్రథమ ప్రపంచయుద్ధం పరిసమాప్తి పిదప
సంభవించిన కడు సంఘటనలకు కలతచెంది
సమావేశాలపై బ్రిటిష్ అధికారులు విధించిన నిషేధాన్ని వుల్లంఘించి
భారత జాతీయవాదులు సమావేశమైన స్థలం అమృతసర్లో జలియన్ వాలా బాగ్ ఏప్రిల్ 13, 1929 నాడు
ఆరోజు శిఖ్కుల సంవత్సరాది వైశాఖీ పండుగ
స్వర్ణ దేవాలయంలో ప్రార్థనలు‌ 
ముగియగా
వారూ వీరూ కలిసి వేలసంఖ్యలో అటూఇటూ ఎత్తైన గోడలున్న ఒకేవొక్క దారినుంచి తోటలోకి చేరుకొనిరి నిరాయుధులుగా
విషయం తెలుసుకున్న డయ్యర్ సారధ్యంలోని బ్రిటిష్ సైనికులు తుపాకులతో విరుచుకు పడ్డారు జనాలపై
స్త్రీ పురుష పిల్లా పెద్దా భేదం లేకుండా
మానవత్వాన్ని మరచి పైశాచికంగా
మిన్ను ముట్టిన హాహాకారాలు
పొంగి ప్రవహించే రక్తపుటేరులు
తప్పించుకునేందుకు దారిలేక‌ నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయి నేలకొరిగే శరీరాలు
అత్యంత భయానకమైన దారుణ మారణకాండ
ఈసంఘటన ఎంతోమంది భారతీయులను స్వాతంత్ర్య సమరయోధులుగా మార్చివేసింది
14.
కవితాగానం సీజన3 పౌర్ణమి కవితలపోటి అంశం:జలియన్ వాలా బాగ్.
 శీర్షిక:మారణహోమం. భారతదేశచరిత్రలో రక్తాక్షారాలతో నిండినపుటలెన్నో ఆంగ్లేయుల అరాచకకృత్యాలకు పరాకాష్టగా నిలిచిన స్థలం మారణహోమాలతో దద్దరిల్లిన సంఘటానాస్తానం మరణమృదంగాలతో మారుమ్రోగిన స్తావరం రుధిరధారలతో నిండిన రణరంగం స్వాతంత్ర్రసమరానికి అసువులుబాసిన ఎందరో సమరయోధుల త్యాగరంగం ఊచకోతలతో ఉరికంబాలలెక్కించిన వధ్యస్థలం సామూహిక హత్యాకాండలతో హెచ్చిపోయిన గుండం పరాయిపాలనలో ప్రజలంతా పాట్లుపడిన పుణ్యభూమి విదేశీయల అహంకారంతో విర్రవీగిన రుద్రభూమి బ్రిటీష్ దురాగతాలకు మౌనసాక్ష్యం అమాయకప్రజలెందరో బలిపశువులుగా మారిన ముగ్ధక్షేత్రం భారతీయుల గుండెల్లో మాయనిమచ్చలా నిలచిపోయిన కర్కశకృత్యం మరువలేని మరువరాని మాననిగాయం స్వాత్రంత్ర్యానంతరము ఎన్నటికీ మరవలేని దుష్టకార్యం తరాలుగడిచినా అదోక నిత్యసంస్మరణీయం దుశ్చర్యలకు కిరాతకకార్యకలపాలకు స్మారకచిహ్నం విచక్షణారహితంగా కాల్పులు జరిపి దరదృష్ట సంఘటన స్త్రీలు బాలురన్న తేడా లేకుండా జరిపిన హత్యాకాండ అనాలోచిత అహంకారపూరిత హింసాకాండ ప్రపంచదేశాలన్నింటికి ఒక గుణపాఠం అంతర్జాతీయంగా ఉలిక్కిపడిన దుస్వప్నం అమృతసర్ లో జలియన్ వాలాభాగ్ అన్నదొక తోట రక్తసిక్తమై చరిత్రలోనే ఎప్పటికి నిలచిపోయే చీకటిచర్య. ఇది నాస్వీయరచన.
15.
శీర్షిక : "" మానని గాయం "" 
 కాయానికైన గాయం మానడం తధ్యం మనసుకి తగిలిన గాయం మానడం కష్టం! భారత స్వాతంత్ర్య పోరాటంలో గుండెలవిసే ఘటన.... జనరల్ డయ్యర్ జరిపిన మారణహోమం భారత ప్రజల గుండె ల్లో రగిలిన ఆరని అగ్నిగుండం కాలం గడచినా మానని గాయం జలియన్ వాలా బాగ్ దురంతం! బైశాఖీ పండుగ రోజున పొంగి పొరలిన నెత్తుటి సంద్రం విచక్షణా రహితంగా పేలిన వందల తుపాకులు నింగి కెగసిన వందలాది ప్రాణాలు నేల రాలిన శరీరాలు మిన్నంటిన ఆక్రందనలు శాంతి పావురాలను చంపి నాట్యమాడిన ఆశాంతి గ్రద్దలు మృత్యు పిశాచి విలయ తాండవం భారతీయులు మరచి పోని చేదు జ్ఞాపకం!
జిల్లా *
గుంటూరు 
16.
శీర్షిక:- నరమేధానికి ప్రతీక జలియన్ వాలాబాగ్ ............................................................. ఎందరో మహానుభావుల త్యాగఫలితమే మన స్వాతంత్ర్య భారత దేశం నాటి బ్రిటిష్ పాలకుల జాత్యాహంకారనికి ప్రతీక జలియన్ వాలా బాగ్ నరమేధం పంజాబ్ లోని అమృతసర్ స్వర్ణదేవాలయసమీపాన నూతన సంవత్సర దినోత్సవం నాడు అనేక మంది పంజాబీలు సంబరాలు జరుపుకుంటున్న సమయాన జనరల్ డయ్యర్ ఆదేశం పై సైనికులు విచక్షణారహిత కాల్పులు జరిపి అనేక వందలమంది ప్రాణాలను బలిగొన్న చరిత్రపుటల కెక్కిన దారుణ హింసా కాండ.....!! విప్లవజ్యోతి భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ కు మహాత్ముని సహాయనిరాకరణోద్యమానికి నాంది జలియన్ వాలాబాగ్ ఊచకోత విశ్వకవి రవీంద్రుడు తనకిచ్చిన సర్ బిరుదును బ్రిటిష్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేసిన సంఘటన దేశవిదేశాలలలో కూడా బ్రిటిష్ ప్రభుత్వం పై ప్రతిఘటన కారణంగా డయ్యర్ పదవీత్యుడై అల్లూరి, ఆజాద్, సుఖ్ దేవ్ వంటి దేశభక్తులకు ప్రేరణ కలిగించిన నరమేధ సంఘటన కు స్మృతిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1961 ఏప్రియల్ 13 న రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ తో కలసి అమరవీరుల చిహ్నం గా చక్కటి స్మృతి స్థూపాన్ని నిర్మించి నివాళులు అర్పించారు వారందరికి శతకోటి వందనములు.!!
17.
17.
ఘోరదురంతం

జలియన్ వాలాబాగ్ దురంతం
 జాతిమరువలేని దుర్దినం
శాంతి అహింసల కు దక్కిన ప్రతిఫలం 
దమన నీతితో డయ్యర్ చేసిన దురాగతం
చిన్నా పెద్ద తేడా లేక జనాలంతా  
తెల్లదొరల కాల్పుల్లో శలభాల్లా మారడం
రక్తపుటేరులు ప్రవహించేలా నెత్తురు ముద్దలు తేలేలా మార్చిన బ్రిటీష్ నేతలు రాక్షసత్వం
రౌలట్ చట్టం  ప్రతిపాదించి భారతీయుల
గళం  నొక్కి నేతలను  నిర్బంధించి 
ప్రజాగ్రహంచని చూశారా తెల్లదొరలు
బంధిస్తే పిల్లి కూడా పులి అవుతోందన్న రీతి
నిరాయుధుల పైచేసిన తిరుగుబాటే
స్వాతంత్ర్యోద్యమానికి నాంది కాగా
విప్లవ జ్వాలలెగసి భగత్ లాంటి
 దేశభక్తులయ్యారెందరో విప్లవకారులు
విశ్వకవి రవీంద్రుడే తెల్లదొరలు ఇచ్చిన
సర్ అను బిరుదును తిరస్కరించె
చరిత్రలోనే నల్ల దినంగా మిగిలిపోయెను
  జలియన్ వాలాబాగ్ దురంతం.

డా బల్లూరి ఉమాదేవి
18.
కవితా గానం శుభకృత్తు చైత్రశుద్ధ పౌర్ణమి నగదు బహుమతుల కవితా పోటీకి అంశం.... జలియన్ వాలాబాగ్ శీర్షిక .... *జాలి లేని తూట* ******"***********"*""""************** స్వాతంత్రోద్యమ సమరాన శాంతి అహింసల మార్గాన ఎగిరిన ఉద్యమ బావుటా ముందుకు మునుముందుకే సాగిన బాట స్వేచ్ఛను కోరి పోరును సలిపిన పాట స్వరాజ్య కాంక్షను అణచుటకు విప్లవోద్యమాల అరికట్టుటకు ఉక్కు పాదముతొ తొక్కి వేయుటకు బ్రిటిష్ పాలకుల పాపపు చేతులతొ కఠిన శిక్ష లతొ కట్టడి చేసే రౌలత్ రక్కసి ఉక్కు పిడికిలిని తుక్కు చేయుటకు ఉద్యమించిన సత్యపాల్.... సైఫుద్దీన్ కిచ్లు నిర్భంధంతో.... నివ్వెర పోయి నిప్పైరగిలి నింగికి ఎగిసిన జనజ్వాల మూడు వైపులా గోడలతోటి మూసిన చోటు ఇరుకు దారిలో కట్టడి చేస్తు వెలసిన తోట వేలకువేలుగ వచ్చి చేరిన స్వేచ్ఛా పిపాసులు జలియన్ వాలాబాగ్ కాదు.... జనసంద్రమది గేటును మూసి గుండ్లను దూసి గుండెలు చీల్చి శవాల గుట్టలు పోసిన డయ్యర్ పసికందును పండు ముసలి ప్రాణం తీసిన తుపాకీ తూటా పేల్చిన కసాయి బ్రిటీష్ గుండె రగిలి ఎండిన కళ్ళలో మంటలు లేచి ఉరుకులు పెట్టిన ఉగ్రనరసింహుడు ఉద్దామ్ సింగ్ అనుమతి ఇచ్చి ఊచకోతకు కారకుడైన ఓ డ్వైర్...ను తుపాకీ పేల్చి నేల కూల్చిన ఉద్దామ్ సింగ్ ఉరి తాళ్ళకు ఉయ్యల ఊగి భారత మాత దాస్య శృంఖలాలు తెంచిన వీరుడు స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు. 15042022
19.
మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటీషర్లకు భారత్ సాయం స్వాతంత్య్రం ఇస్తారన్న భారతీయుల నమ్మకం నమ్మకాన్ని వమ్ముచేసె బ్రిటీష్ ప్రభుత్వం తిరిగి పుంజుకున్న జాతీయ వాద ఉద్యమం అతివాద,మితవాదుల ఐక్యతారాగం స్వరాజ్యోద్యమానికి నిధుల సమీకరణ అద్భుతం పోరాటయోధులకు ప్రజల మద్దతు మహాశ్చర్యం పరిపాలనలో మాట చెల్లుబాటు కై నాయకులు ఆంగ్ల పరిపాలకులకు విజ్ఞాపనలు మాంటెగ్ చేమ్సపర్డ్ సంస్కరణలంటూ ఆంగ్లేయుల కంటితుడుపు చర్యలు సరిపోని సంస్కరణలంటూ భికాజికామా వ్యాఖ్యలు పోరాటయోధుల రహస్యాల ఛేదనకు ,అణచివేత కు వైశ్రాయ్ లకునిరంకుశ అధికారాలు కట్టబెట్టిన రౌలట్ చట్టం జలియన్ వాలాభాగ్ లో ఉద్యమకారులపై జనరల్ డయ్యర్ ధారుణ కాల్పులు స్వతంత్ర సమరాన అత్యంత హేయం డయ్యర్ చేసిన ధారుణ ఘాతుకం విచక్షణా రహిత కాల్పులతో అమానవీయ దృశ్యాలు వేలాది మంది అశువులు బాసిన వైనం హంటర్ సమక్షంలో డయ్యర్ మృగాత్మక స్పందన రవీంద్రనాథ్ ఠాగూర్ సర్ బిరుదును వెనుకకిచ్చిన సందర్భం స్వాతంత్రోద్యమ స్పూర్తి ని సామాన్యులలోను రగిలించె చారిత్రాత్మక జలియన్ వాలాభాగ్ దుర్ఘటన స్మారకస్తూపం ఏర్పాటు చేసె నెహ్రూ ప్రభుత్వం
20.
జోషి పద్మావతి గారు

*మరపురాని ఘటన*
********************
అది వైశాఖమాసం.
సిక్కుల ఆధ్యాత్మిక నూతనవత్సరం
పంజాబ్ రాష్రం,అమృత్సర్ పట్టణం.
స్వర్ణదేవాలయ సమీపం 
జలియన్ వాలాబాగ్ ఉద్యానవనం
జరిగినదచట ద్విసహస్ర జన సమావేశం
సమావేశాన ప్రముఖనేతలఆంగ్లేయపాలనా వ్యతిరేకోపన్యాసం.
రౌలట్ చట్టంపేరున విమర్శకుల నిర్బంధమును వ్యతిరేకించడం
హేతువుగానెంచబడి
జనరల్ డయ్యర్ సారథ్యాన
జరిపించిన దురాగతం
నిరాయుధ స్తీ పురుష,
అమాయక బాలబాలికలపైన ఆంగ్లసైనికులు కురిపించిన కాల్పులవర్షం.
యాత్రికులహింసాయుత
నిరసనకారులను సైతం 
వదలక జరిపిన నరమేధం
నాటి జలియన్ వాలాబాగ్ దురంతం
వేలల్లో క్షతగాత్రులు,వందల్లో హతులు.
అంతా అభంశుభంతెలియని అమాయక జనులు
జలియన్ వాలాబాగ్ ఉదంతం వింటే.....
చెమ్మగిలక మానవులే మానవత్వపు 
21.
జలియన్ వాలా బాగ్: 
భారత స్వాతంత్ర్య సంగ్రామం సమయం అమృత్ సర్ స్వర్ణ దేవాలయం ప్రక్కన తోట సిక్కుల ఆధ్యాత్మిక నూతన సంవత్సర వేడుక దాదాపు ఇరవై వేల మంది ప్రజలు సమావేశమవ్వడానికి ముఖ్య కారణం ప్రముఖ నేతలు ఆంగ్లేయుల పాలనను వ్యతిరేక ఉపన్యాసాలను విని అనేక విమర్శలకు గురైన రౌలట్ చట్టం కింద సత్యపాల్, ‌‌‌సైఫుద్దీన్ కిచ్లూలను నిర్బంధ వ్యతీరేకతపై విరుచుకుపడ్డ సైనిక బృందం పూలు పరిమళం విరజిమ్మున్న తోట కాల్పులతో దద్దరిల్లిన స్మశాన వాటిక వేయి మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల మంది క్షతగాత్రుల రక్తసిక్తం! తిరుగుబాటు విప్లవకారుల సేనదురైనందువల్ల కాల్పులు జరిపామని డయ్యర్ కు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓడయ్యర్ ఇచ్చిన టెలిగ్రాం ఫలితం జలియన్ వాలా బాగ్ చుట్టూగృహసముదాయాలు, పెద్ద భవంతులు ఉన్నందున ఇరుకైన సందుల ద్వారా ఆసుపత్రులకు తరలించడం కష్టసాధ్యం అక్కడి బావిలో 120 శవాలు బయటకు తీశామని అధికారిక గణాంకాల భోగొట్టా! తోట కుళ్ళిన శవాలతో పరిమళించిన ది!
22.
అంశం : జలియన్ వాలాబాగ్ శీర్షిక :
 అమరులారా వందనం
 " రచన : గొర్రెపాటి శ్రీను
                                     "అమరులారా..వందనం !" జనరల్ డయ్యర్ అను నరరూప రాక్షసుడు.. జలియన్ వాలాబాగ్ అను ఉద్యానవనంలో సమావేశమైన నిరాయుధులైన అమాయక భారతీయులపై కిరాతకంగా దాడి చేసి మారణహోమాన్ని సృష్టించిన దుశ్చర్య.. బ్రిటిష్ వాడి చేతిలో యావత్ భారత జాతి అవమానించ బడిన పాశవిక చర్య .. రక్తం ధారలుగా ప్రవహించి భారతీయుల హృదయాలని గాయపరచిన సంఘటన ! ఏప్రిల్ 13, 1919 న జరిగిన కాల్పులలో విగతజీవులై నేలకొరిగిన భారతీయుల శవాల గుట్టలపై సైతం కర్కశంగా కాల్పులు జరుపుతూ నాడు డయ్యర్ చేసిన దురాగతం ప్రతి భారతీయుడి లో స్వాతంత్ర్య కాంక్షను జ్వలింపజేసింది ! తెల్లవాడిని దేశ సరిహద్దుల ఆవలకి తరిమికొట్టేలా పౌరుషాగ్ని ని రగిలింపజేసింది ! జలియన్ వాలాబాగ్ ఉద్యానవనం రక్తసిక్త మవ్వగా.. తిరగబడ్డ భారతీయుల ఉద్యమాలకి .. సింహనాదం తో.. ఎగసిన కెరటాలల్లే.. ఎదురు తిరుగుతున్న భరతమాత ముద్దుబిడ్డ ల పౌరుషప్రతాపాల ముందు.. తలవంచిన బ్రిటిష్ వాడు దేశానికి స్వాతంత్రాన్నిచ్చి ..శరణన్నాడు ! తోక ముడిచి మాతృదేశానికి పయనమయ్యాడు ! _ గొర్రెపాటి శ్రీను    

23.
కవిత *
అంశం: జలియన్ వాలా బాగ్
 డా.తంగిరాల నాగ లక్ష్మి అదొక అందమైన తోట ఆహ్లాద భరిత వాతావరణం వికృతం చేశారు భయాందోళనలకు గురి చేశారు చరిత్ర లో జరిగిన మరపురాని దుర్ఘటన బ్రిటిష్ సైనికులు కాల్పుల ఘటన అకృత్యం జరిగింది అమృతసర్లో బ్రిటిష్ సైనికుల విషపూరిత అమానుష చర్య. అమాయకుల పై దారుణంగా కాల్పులు ఉత్సాహం గా పండుగ జరుపుకోకవటానికి వచ్చిన పౌరులపై అకస్మాత్తు దాడి నిరంకుశ బ్రిటిష్ పాలన అదేమని ప్రశ్నిస్తే ప్రాణాలు తీయటం భారతీయ సంపదను కొల్లగొట్టింది నేడు అగ్ర రాజ్య మయింది పరుల సొమ్ముతో అధికార దాహంతో పశుత్వ ప్రకోపం మనిషిని మనిషే చంపే మారణ హోమం దూరా క్రమణలకు అంతం పలకాలి స్వచ్ఛంద స్వేచ్ఛా జీవితం కావాలి శాంతి పుష్పాలు వికసించాలి ప్రపంచ వ్యాప్తంగా "యుద్ధానికి విరుద్ధం" నినాదం రావాలి శుభకృత్ శోభాయమానంగా ప్రజల సౌఖ్యానికి మంచి బాట వేయాలి అధికారులు ప్రజలను కష్టాల పాలు చేయటం అన్యాయం అక్రమం కాల్పుల నివారణకు వేల్పులను వేడుకుందాం సమరాలికి స్వస్తి పలుకుదాం రామ రాజ్యం రావాలి ఎంతో మంది ప్రాణత్యాగ ఫలితం ఈ నాడు మనం అనుభవించే స్వాతంత్ర్యం స్వాతంత్ర సమరయోధుల స్మరణ ఆవశ్యకం బానిసత్వం నుండి విముక్తి ప్రసాదించారు వారికి నివాళు లివ్వాలి కృతజ్ఞతలు తెలపాలి ఈనా టిస్వతంత్ర భారత పౌరులు చైత్రంలో నవ చైతన్యాన్ని చిగురింప చేద్దాం 
ది!
24.
కవితాగానం సీజన్-3 
ముడుంబ తిరువెంకటాచార్యులు, మానుకోట. 
పౌర్ణమి కవితల పోటీ. 
అంశం: జలియన్ వాలాబాగ్. 
శీర్షిక: 13-4-1919. 

భారతజాతికి 
మరపురాని విషాదదినం, శతాబ్దం నాటి దురంతం, కళ్ళకు కట్టే సజీవసాక్ష్యాలు, 
కన్నీరు తెప్పించే విషాదస్మృతులు, తెల్లవాడి దాష్టీకానికి,  దౌర్జన్యానికి, దురహంకారానికి, జాత్యహంకారానికి తేటతెల్లమైన ప్రస్ఫుట దర్పణం. 
చెరిగిపోని, చెరిపివేయలేని 
రక్తపిపాసి చరిత్ర. 
రౌలత్ చట్టం రగిల్చిన విషాదం. 
నిరాయుధుల, నిస్సహాయుల నురికించి కాల్చిన దౌష్ట్యం, అమాయకుల రక్తంతో రాక్షసంగా క్రీడించిన పైశాచికత్వం, పారతంత్రతపై పోరుకు ఆసేతుసీతాచలం ఆవేశం రగిలించిన అగ్నిపాతం, 
"పంజాబు కేసరి" ప్రాణత్యాగం, కదలివచ్చిన 
కాంగ్రెస్ గణం, నిండుసభలో  కర్కశ దైత్యుని (డయ్యర్) 
సమయించిన ఉధంసింగ్ ప్రతీకారం. 
      ... ... ... ... ... 
చరిత్ర కెక్కని తెల్లవారి దాష్టీకాలెన్నో! దౌర్జన్యాలెన్నో!! 
జాతిగుండెల్లో దాచుకొని సహించిన, సహిస్తున్న చారిత్రక దురా'గతా'లెన్నో!!! 

జాతి గుండెల్లో సదా నిలిపి ఉంచుదాం,
 జాతిని సర్వదా జాగృతం చేద్దాం. 
       **** **** **** 
ఈ రచన నా స్వంతం. ఏ ఇతర రచనలకు అనువాదంగానీ, అనుసరణగానీ, అనుకరణ గానీ కాదు.
25.
కవితా గానం సీజన్ 3

చైత్ర పౌర్ణమి పోటీలు

అంశం: జలియన్ వాలాబాగ్
తేదీ: 15.04.2022

*మాయని మచ్చ*
******************

చరిత్రకు సాక్ష్యంగా
అమరుల త్యాగాలకు గుర్తుగా
ఎర్ర రంగు చొక్కా తొడుక్కుని
జాతికి విప్లవ పాఠాలు నేర్పే పాఠశాల

తన స్మరణ మదిలో మెదిలినా
రోమాలు నిక్కబొడుచుకుంటాయి
కోట గోడల బుల్లెట్ గాయాలను
ఆర్ద్రంగా నిమిరినప్పుడు
పొయ్యి మీద ఉడుకుతున్న అన్నంలా
రుధిరం కుతకుతలాడుతుంది!

స్వాతంత్ర్య సంగ్రామ సమరంలో
జలియన్ వాలాబాగ్ తోటలో
జనరల్ డయ్యర్ వికృత చర్యకు
అమృత్ సర్ అమృత వనంలో
తుపాకులు విషం గుండ్లను చిమ్మడంతో
స్వర్ణదేవాలయం వివర్ణమైంది!

వేయి గొంతుకలు మృత్యుగీతాన్ని
రెట్టింపు స్వరాలు వికలగీతాన్ని
రవీంద్రుడు తిరస్కరణ గీతాన్ని
హంటర్ కమీషన్ తూ.తూ. విచారణతో
భగత్ సింగ్ ప్రతీకార గీతాలాలపించారు

జలియన్ వాలాబాగ్ ఓ ప్రే'రణ
స్వాతంత్ర్యోద్యమ ఉత్ప్రేరణ
దేశభక్తుల త్యాగాల సంస్మరణ
భరతమాత గుండెల్లో ఓ సంఘర్షణ..!



        *గంగాపురం శ్రీనివాస్*
                 *సిద్ధిపేట*
             9676305949

హామీ పత్రము:
పై కవిత "మాయని మచ్చ" నాయొక్క స్వీయ రచన ఎలాంటి అనువాదం కాని అనుకరణ కానీ చేయలేదని ఎక్కడా ప్రచురితం కాలేదని కేవలం కవన జ్యోతి కవితాగానం సీజన్-3 పోటీల కొరకు మాత్రమే అని హామీ ఇస్తున్నాను.
26.
 పూసిన తోట
బొప్పెన వెంకటేశ్ గారు
**********************

తెల్లవాడి నలుపు తలపు నుంచి/
ఓ చీకటి రోజు కళ్ళు తెరిచింది/
స్వేచ్ఛా రాగం కోసం
తోట లో చేరిన పక్షులన్నీ/
నిర్బంధ ఉదంతపు ఉచ్చులకి,
వెన్నుపోటు బాణాలకి చిక్కుకున్నాయి/
రెక్కల చప్పుడు మూగపోయింది/
పచ్చని ఎలమావిలన్ని పరాయి వాడే కోసుకెళ్ళాడు/

వసంత కుసుమాలు గుళ్ళ వర్షానికి కాలి రాలిపోయాయి/
వేలవేన రాలిన ప్రాణాలతో/
తోటంతా ఎర్రని శిశిరం పూసింది/
తావంతా చావు వాసన వ్యాపించింది/

చరిత్రలో కొన్ని పుటలు పూట పూటకు గుర్తొస్తాయి/
ఎండిన ఆశ గుండెను తడుపుతాయి/
సముద్రాలు దాటి వచ్చిన ఈదురు గాలులకు/
ఎదురు నిలబడటం నేర్పాయి/

రక్తం రాతలు నిద్రరాని రాత్రు ల్లోంచి /
సర్రుమని ప్రసరించి పగవాని దురాగతాన్ని కూల్చాలని కదిలించింది/
ఆ రక్తమే స్వతంత్ర కాంక్షను దేశమంతా రవాణా చేసింది /

దురాశకు రోజులు చెల్లాయి/
తోట గాలి హద్దులు మీరిన ఆంగ్లేయుని ఈడ్చి కొట్టింది/

త్యాగం నాటి
ప్రాణాలను పారించిన
జన్మ భూమిలో/
మూడు రంగుల పరువు పతాక మొలిచింది/

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...