Skip to main content

శ్రీ రామ నవమి2022

నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
 వీరా గుడిపల్లి
******************
కవి వరుల జాబితా
1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
2.మేకల రామస్వామి గారు
3.అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు
4.జోషి పద్మావతి గారు
5.డా.వేమూరి సత్యవతి గారు
6.గజవెళ్ళి శ్రీ నివాస చారి గారు
7.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
8.మద్ది పుల్లారావు గారు
9.పిన్నక నాగేశ్వరరావు గారు
10.తరణికంటి సూర్య లక్ష్మి గారు
11.ఏడెల్లి రాములు గారు
12.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు
13.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
14.డా.నాగ లక్ష్మి తంగిరాల
************
1.
[09/04, 8:36 pm] Lalita Sister: కవితాగానం సీజన్ 2

శ్రీ రామనవమి సందర్భంగా...

ఈరోజు &రేపు
ప్రత్యేక కవితలకు ఆహ్వానం పలుకుతున్నది..

సమయం ఎప్పటిలాగే రాత్రి ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు...


ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.
[09/04, 8:56 pm] Aalla Nageshwar Rao Poet: అంశం :రామనామం
శీర్షిక :
  ""  ముక్తికి మార్గం  ""

బోయవాడైన వాల్మీకిని మహర్షిగా తీర్చిదిద్ది
రామాయణ కావ్యాన్ని రచింప చేసినది.....
రాతిగా మారిన అహల్యను నాతి గా చేసి మోక్షమోసంగినది....
శబరి పెట్టిన ఎంగిలి పండ్లను
రామునిచే తినిపించినది....
త్యాగరాజు చే సంకీర్తనలు పాడించినది....
రామదాసు చే గుడి కట్టించినది.....
వానరులచే సముద్రం పై వారధి కట్టించినది.....
హనుమంతుడ్ని సప్త సముద్రాలు దాటలా చేసినది....
లంకలోని సీతమ్మకు చూడామాణిని ఇచ్చేలా చేసినది....
దుష్టడైన రావణుడ్ని  సంహారం గావించినది....
మహిమాన్విత మైన రామనామం
ఆ నామమే మధురాతి మధురం!
ఓ రామా నీ నామమెంతో మధురమంటూ
పవిత్ర మనస్కులమై రామ నామాన్ని జపిద్దాం
శ్రీరామ భక్తులమై తరిద్దాం!
...........................................
రచన :
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు... జిల్లా
ఆంధ్రప్రదేశ్... రాష్ట్రము
చరవాణి  సంఖ్య :7416638823
...........................................
పై కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.
2.
శ్రీరామ తత్వం
        ************
రామో విగ్రహవాన్ ధర్మః అన్న నానుడిని
ముమ్మాటికి నిజమని చాటిన ఆదర్శమూర్తిని
ఒకేమాట, ఒకే పత్ని, ఒకే బాణమని
ఒకటిచేసే బంధాలె విలువకు కారణమని
నడత ,నడవడిక నిండు ఆదర్శమ్మైన
సత్ప్రవర్తన ,సశ్ఛీలత సదాశయమైన
మానవుడే మహనీయుండని తెలిపిన
దానవత్వం ఆనవాలు సమూలంగా ద్రుంచిన
తండ్రిమాట  జవదాటని వినమ్రత
సోదరప్రేమను పరిపుష్టమొనర్చిన నమ్రత
గయుడు, జటాయువు ,శబరిల అభిమానాన్ని
సుగ్రీవ,విభీషణ మిత్రుల స్వాభిమానాన్ని
లక్ష్మణ,భరత సహోదరుల సాంగత్యాన్ని
సతీ సీత అందించిన అనురాగాన్ని
వినయ గుణధనుడు హనుమ భక్తి భావాన్ని
సమ్యక్ దృష్టితో స్వీకరించిన సత్సంపదలను
సమజీవన మమకారమెరిగిన  సౌఖ్యములను
ప్రతిబింబించిన శ్రీరాముడు
ప్రతినిత్యం ప్రస్తుతించే దేవుడు
జై శ్రీరామ్  !!! జై శ్రీరామ్ !!!!
********************
మేకల రామస్వామి
3.
శీర్షిక:-
జీవన్ముక్తి కి సోపానం
..............................
రామనామం రమణీయం
సర్వపాప వినాశనం.
శ్రీరామ తారకమంత్రం సకలజన శుభప్రదం.
'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం 
రామనామ వరాననే'
అని ముమ్మారు పఠిస్తే
సృష్టి, స్థితి, లయ కర్తలయిన త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుంది.
మోక్షదాయ ప్రదాయకం....!!

"రామో విగ్రహవాన్ ధర్మః"
ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు.
కులమత భేదాలు లేవని
గుహుని,శబరిని, జటాయువుని, ఆంజనేయుని,అహల్యని,అల్పప్రాణి ఉడుతని ఉద్ధరించిన శ్రీరాముని గాధ
శ్రీమద్రామాయణం 
మతసామరస్యానికే  ప్రతీక.......!!


"ధర్మో రక్షతి రక్షితః"అన్నది
జీవితాన ఆచరించిన శ్రీరాముడు ప్రపంచానికే ఆదర్శం. 
రాముని పాలన సుపరిపాలన
రామరాజ్యం ధర్మరాజ్యం
అందుకే రామాయణ మహాకావ్యం ప్రపంచానికే ఆదర్శం.త్యాగయ్య,అన్నమయ్య,మొల్ల ,భక్తజయదేవ్,సక్కుబాయ్ రామదాసు వంటి ఎందరో మహానుభావులు శ్రీరాముని అనుగ్రహముతో ముముక్షత్వంనొందారు
కావున రామనామం
జీవన్ముక్తి కి సోపానం......!!
................................
లోకా సమస్తా సుఖినో భవంతు.
...............................
పేరు:-
కవిమిత్ర, సాహిత్యరత్న
అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
చరవాణి:-9963265762
...............................
హామీపత్రం:-
ఇది నా స్వీయకవిత అనువాదం కాదు.
అయ్యలసోమయాజుల ప్రసాద్
................................
4.
[09/04, 9:28 pm] +91 95420 10502: *రామో విగ్రహవాన్ ధర్మః*  
************************
జనులకు ఆదర్శం,
యుగయుగాలకు ఆదర్శ పురుషుడు రాముడొక్కడే...
కుటుంబసంబంధాల విలువను చాటిన మార్గదర్శకుడు
మాతాపితరుల పట్ల మన్నన కలిగి పద్నాలుగు వత్సరాల అరణ్యవాసాన్ని స్వాగతించి తృణంలో సర్వం త్యాగం 
చేసిన మహాయోగి
ప్రజలే రాజ్యమని భావించి
నిండుజీవితం పణంగా పెట్టి
ధర్మాన్ని నిలబెట్టిన పరిపాలనాదక్షుడు

నిగ్రహానికి నిలువెత్తు రూపమతడే...
భావోద్వేగాలకు మోహావేశాలకు చలించక
నిజమైన దాంపత్య బంధానికి
అర్థంచెప్పిన ఏకైక అనుంగుప

దీనులపాలిట
కరుణాసముద్రుడు
పదితలలై పెరిగిన అరిషడ్వర్గాలను
తెగనరికిన అవతారపురుషుడు

ఆ జగత్పాలకుడు నడయాడిన ఈ నేలపై ప్రతిప్రాణి జన్మధన్యం

ధర్మపరిపాలకుడైన శ్రీ రామచంద్రుని పేరు నిలచిపోయింది ఆచంద్రతారార్కం 

   *జై శ్రీ రామ్🚩*

జోషిపద్మావతి మహబూబ్ నగర్
5
[09/04, 9:29 pm] +91 98851 36308: శీర్షిక--.సానుభూతి-బరువు.

సానుభూతి పంచటంలో..
సహానుభూతిని ప్రదర్శించటంలో..
ఓదార్పు మాటలు పలకటంలో..
అశ్రుధారలని తుడిచేసే యత్నంలో..
మనోభారాన్ని తగ్గించామనే తృప్తి..
మనసుని పండిస్తుంది!!
ఆత్మతృప్తిని పల్లవిస్తుంది!!
కానీ...
సానుభూతి మనపైనే అయితే..
వాళ్ళమాటలు వినటం,
వాళ్ళు తెచ్చె పళ్ళూ-ఫలాలు,
వాళ్ళు చూసే జాలి చూపులు..
స్వీకరించటం మాత్రం...
భారమేకదా!!
...డా.వేమూరి సత్యవతి గారు
6.

[10/04, 7:57 pm] +91 90594 38068: అంశం:శ్రీరామనవమి 
...
శ్రీరామనవమి
శ్రీరాముడు అవనిపై 
అవతరించిన శుభదినము

అన్యోన్య దాంపత్యానికి 
సీతారాములే ఆదర్శం

సీతారాముల కళ్యాణం 
విశ్వశాంతికి శుభకరం 
శుభప్రదం మంగళకరం 

భద్రాచలంలో 
సీతారాముల కళ్యాణం 
శ్రీరామనవమి రోజు జరపడం 
ఆచారమే 

అత్యంత వైభవంగా 
భక్తుల నేత్రపర్వంగా 
కడు రమణీయంగా 
కమనీయంగా 
జరిగేది కళ్యాణం 

కళ్యాణానికి 
ఊరంతా పందిరిగా 
ఎల్లెడలా రామయ్య 
కళ్యాణ శోభతో 
వెల్లివిరియగ 
తెలుగువారి అయోధ్యపురి
భద్రగిరిపై 
ఏటేటా జరిపే కళ్యాణము 
భక్తులు ఎన్నిసార్లు వీక్షించినా 
తనివితీరని దృశ్యమే
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి
7
[10/04, 8:00 pm] కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు Poet: అంశం...‌శ్రీరామనవమి.... 10042022
శీర్షిక.....‌ సీతమ్మ పెండ్లి
కవితా గానం 
కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
*******************************

సీతారాముల కళ్యాణం వేడుక చూడగా
రారండి
వేదిక ఎంతో సుందరము భద్ర గిరీషుని
మందిరము
యాగ రక్షణకు విల్లును ఎత్తిన రామ
ఘోర తాటకిని కూల్చితివంట
లక్ష్మణ తోడై అండగ నిలువ
ముని వన రక్షణ చేసిన రామా

ముని గణ సేవిత పావన రామ
కళ్యాణ ఘడియలు ముసిరిన వేళ
మిథిలా నగరం చేరిన  రామా
వసుధ పుత్రిక వరమాలతో ఎదురు చూడగ

స్వయంవరాన విల్లును విరచగ
వరమాలను.... తడబడె చేతుల 
మెడన వేసెను మిథిల జానకి 
విరుల జల్లులు విరివిగ సురులు జల్లగ 

ప్రపంచమంతా పరవశించగ
కోమలాంగులు కోలాటాలతొ
కోకిల రసమయ రాగం తీయగ
విపుల వేడుక విశ్వ వ్యాపితం

స్వీయ రచన:::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.

శ్రీ రామ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు
8
[10/04, 8:05 pm] Maddi Pullarao Poet: కవితాగానం
................
మద్ది. పుల్లారావు
నందిగామ
శీర్షిక :రామచరితం
ప్రక్రియ:ముత్యాలసరాలు

1)  

దశరధుని గారాల పుత్రుడు
కోసల రాణి ముద్దు బిడ్డడు
అందరు మెచ్చిన యందగాడు
రాముడంటే త్యాగనిరతుడు

2)
ఎల్లవేళల శాంత చిత్తుడు
కౌశిక యజ్ఞము గాచినాడు
శివ ధనస్సు ను విరిచె సులువుగ
జానకి హృదయము గెలిచినాడుగ

3)

కరుణ గలిగిన మహా పురుషుడు
తండ్రి మాటను నిలిపె తనయుడు
కానలకేగిన దర్మమూర్తియె
రాజ్యము వీడిన చక్రవర్తియె

4)
ఇంద్రతనయుని సంహరించెను
సూర్యనందను రాజు జేసెను
సీత జాడను తెలుసుకొనుటకు
పంపె హనుమను లంక లోనికి

5)
శబరి ఎంగిలి ఫలములివ్వగ
ప్రేమమీరగయారగించెను
ధనుజులందరి ఫీచమణిచెను
ధరణిబారము తీసివేసెను

6)

రావణుని మర్ధించె పోరున
జానకిని విడిపించె ముదమున
దర్మనిరతికి మారుపేరై
ప్రజల పాలించె తండ్రివలెను

7)

రామరాజ్యము రమ్యమైనది
రామనామము తిరుగులేనిది
రామబాణము ఎదురులేనిది
రామకావ్యము మధుర మైనది
........
ఇది నా స్వీయరచన
9
[10/04, 8:24 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: పిన్నక నాగేశ్వరరావు.          10--4--2022.
అంశము :-- సీతారామ కల్యాణం.

1. గీతమాలిక. 
విల్లు నెక్కుపెట్టిన వాన్కి పిల్లనిత్తు
ననుచు జనకుడు ప్రకటించ నన్యదేశ
రాజు లెందరో వచ్చిరి రాజసభకు 
శివ ధనుస్సును తెప్పించ చేవ చూప
ప్రభువులెల్ల యత్నించి విఫలము నొంది
రపుడు మౌని యానతినీయ రామచంద్రు
డరుగు దెంచి విల్లును గొనినంత, నెక్కు
పెట్టగ పెళపెళ విరిగినట్టి ధనువుఁ 
గాంచిన సభికులున్ సంతసించి రపుడు 
సీత రాముని మెడలోన సిగ్గుపడుచు 
హారమున్ వేయ దేవతలంత కూడ
నందజేసి రాశీస్సులు హర్షమొదవ.
**************************************
శ్రీరామనవమి శుభాకాంక్షలతో....
**************************************
10
[10/04, 8:40 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్‌ 2 ) 10/4/2022/ ఆదివారము
అంశము: -  " రామనవమి సందర్భం "
                " శ్రీ రాముడు "

వ్రాసెరామకధను వాల్మీకిమహరుషి
రమణీయముగనుండె  రామకధయు

రఘుకులతిలకుడు  రాముడవతరించె
రామనవమినాడు  రమ్యముగను

శ్రీరాముసుగుణాలు  చిగురంటవినగాను
ఆదర్శపురుషుడ  నంగదెలియు

నొకపత్ని నొకమాట  నొకబాణమనుచు
అతనికతడెసాటి  యవనిలోన

తండ్రియానతిలోనె  తనయుడు నడుచుట
ధర్మమనుచుదెల్పె  ధరణికతడు

ఆదర్శమూర్తిగ  నవనిపాలించెను
జనరంజకముగాను  జగతినేలె

అసురబాధలులేక నందరుసుఖముండె
ఆనందముదయించె  నవనిలోన

జగదభిరాముడు  జగతినేలంగాను
ఈతిబాధలనగ  యిలనులేవు

జనులమనసునెరిగి  జానకీరాముడు
ధర్మమంతనిలిపె  ధరణినందు

రామరాజ్యమనగ  రాజిల్లెశోభతో
రాముడేలినట్టి  రాజ్యమనగ !
        తరణికంటి సూర్యలక్ష్మి.
                       ----------
11.[10/04, 9:03 pm] +91 94948 00454: కవితా గానం
శ్రీ రామ నవమి సందర్భంగా
*రామయ్య తండ్రీ*.....

దాశరథీ కరుణా సాగరా
నీవు నడయాడిన చోటు
అఖండ భారతావని పుణ్యభూమి
సకల సుగుణ సంపదల వేదభూమి

తండ్రీ
శ్రీ సీతారామ చంద్ర స్వామీ
లక్మణ సేవిత సహృదయ కీర్తిచంద్రికా
నీ భక్తులను సదా సంరక్షించు

నీ నామం నిత్యం జపిస్తుంటే
ఎంతో రుచి తండ్రీ
భక్త వత్సలా సీతావల్లభా
చిలుకదెంత భాగ్యమో నీ నామం పలుకే రామచిలుక నామంబొందె

నీలిమేఘాల వన్నెల శ్యామసుందరా
రవితేజమై వెలిగి ఆదిత్య హృదయం
ఈ లోకానికి అందించావు

ఓ పరమాత్మా వేదాత్మా
ఇంకా కలిమాయలో పాపులు చెలరేగుతున్నారు
నీ చిరుకోపంతో దుష్టశిక్షణ గావించి
శిష్టరక్షణ చేయుము తండ్రీ

ప్రభూ
శ్రీ సత్యవాచా శ్రీ సత్యవ్రతాయా
సత్య వ్రతులకు జయం కల్గించు 
సదా
 నీ నామామృత రక్షా స్తోత్రము
పఠించే వరమివ్వూ
నీ అభయ హస్తం నీడలో
నీ పాదారవిందాలను  దర్శించే
సౌభాగ్యం నొసంగుమయ్యా
మా రామయ్య తండ్రీ
నమో నమః నమో నమః

ఏడెల్లి రాములు ✍️
ది*10*04*2022(20*58)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
12
[10/04, 9:06 pm] అఫ్సర్ వలీషా గారు: .కవితా గానం (సీజన్ 2)

*అంశం*....శ్రీరామ నవమి సందర్భంగా 
*శీర్షిక*.....*అందరి బంధువు* 

ఇక్ష్వాకుల తిలకుడు
సూర్యవంశ శోభకుడు
దశరధ కౌసల్య తనయుడు 
ధర్మ సత్య పరాయణుడు
నీల మేఘ శ్యాముడు....

మనోహర రూపుడు
శివుని విల్లు విరిచి సీతను వరించిన
అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు 
కోదండ రాముడు....

తండ్రి మాట జవదీయని
 మేలిముత్యమతడు
సహోదర ప్రియుడు
సతితో వనవాసానికి
సునాయాసంగా పయనించిన సహన శీలుడు
ధర్మ నిబధ్ధుడు ఏక పత్నీ వ్రతుడు 
మాట తప్పని వీరుడు 
మడమ తిప్పని శౌర్యుడు
దేవ దేవుడు శ్రీరామ చంద్రుడు....

నీతి నియమాల చిరంజీవుడు 
ఆంజనేయునికి వక్షస్థల నిలయుడు
రావణ సంహారకుడు
రఘుకుల తిలకుడు...

చైత్ర శుధ్ధ నవమి నాడు 
జనన వివాహ పండుగ
మహోత్సవాలకు నిలయుడు
ఆదర్శ పూరిత జీవన నాయకుడు
అందరి బంధువు భద్రాచల రాముడు....!!

మొహమ్మద్ .అఫ్సర వలీషా .
13
[10/04, 9:07 pm] Thathapudi Somashekara Sharma: కవితా గానం సీజన్ 2
శ్రీరామనవమి పండుగ సందర్భంగా 
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336
అంశం.. రామాయణం విశిష్టత 
శీర్షిక.. రామాయణం -ఆదికా వ్యం 
కవిత.. వచన ప్రక్రియ 
********************
మానవజీవితాలను సంస్కరించగల మహాకావ్యం 
మానవహృదయాలనుండి చెరగని 
మహాకావ్యం 
మానవజీవితపార్స్యాలనుకనబరచగల 
మహాకావ్యo
మానవజీవనముల్యాoకనo చూపించే  
మహాకావ్యం 
భూమి-ఆకాశం, నదులు-సముద్రాలూ 
ఉన్నంతవరకూవుండే మహాకావ్యం 
దేశవిదేశాల్లో అనేకప్రక్రియల్లో చదువు 
కునే మహాకావ్యం 
ప్రపంచసాహిత్యంలో ఆవిర్భవించిన 
ఆదికావ్యం 
వాల్మీకిమహర్షి సంస్కృతంలో ఇరువది 
నాల్గువేలశ్లోకాలతోవ్రాసినమహాకావ్యం 
అమ్మానాన్నలఅనురాగం పుత్రపౌత్రుల 
అభిమానం అన్నదమ్ముల అనుబంధం 
భార్యాభర్తలసంబంధం ఆచరణప్రధాన 
మహాగ్రంధం 
గురుభక్తి శిష్యానురక్తి ఆదరణ స్నేహ
ఫలం ధర్మబలం వినయంతో ఒదగడం 
ఆదర్శభావన  జీవకారుణ్యభావన 
ప్రకృతిలాలనవంటి అమూల్యసందే
శాలను అందించే మహాకావ్యం 
అదే.. అదే.. జీవితాన్నే చదివించగల 
మహాకావ్యం   " రామాయణం "
ఆచరణఅద్భుతగ్రంధం రామాయణం 
రాక్షసుడినోట "రామోవిగ్రహాన్ ధర్మః 
సత్యధర్మపరాక్రమః " అనే మహత్తర 
వాక్కును పలికించినగ్రంధం 
చిన్నపాత్రల ద్వారా గొప్పగొప్ప సందేశాన్ని అందించిన గ్రంధం 
ధర్మాలనుఆచరిస్తే మనిషి మనిషిలా 
ఎదగగలడని నిరూపించినగ్రంధం 
అదే... 
అదే... 
ఆదికావ్యం.. 
రమణీయమైన మహాగ్రంధం... 
శ్రీరామాయణ మహాగ్రంధం..... 

ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ  యానాం,  8328079336
14.

శ్రీరామ నవమికి సీతా లక్ష్మణ హనుమ సమేత రామచంద్రు నికి నవ్య నవ పుష్పాలు:
డా. నాగలక్ష్మి తంగిరాల

1 భక్తి శక్తి రక్తి ముక్తి లనొసఁగెడి
రామ నామ ముకడు రమ్య తరము
మహిమ జూపు మహిన మానస రాముడు
సకల నిగమ  ధామ సార సాక్ష

  
2 కార్య సాధకుండు  కారుణ్య ధాముడు
బుద్ధి బలము యశము వృద్ధి చేయు
హనుమ హనుమ ననుమ హరివీ రుడతడు
రామ కార్య మున దురంధ రుండు

3 తండ్రి యాజ్ఞను నిమ్ముగ తలధరించి
కాననములక రిగ సుర ఖండనంబు
జేసె  హనుమ  సుగ్రీవులు చెంత చేర
రావణ వధ గావింపగా రాఘ వుండు          
 
4 రాము డేతెంచగ తన స్వ  రాజ్యమునకు
సీత తోకూడి అయోధ్య సీమకు చనె
పుష్ప కమువిమా నంబున పూర్వ భాషి
ధర్మ మునపరి పాలించె ధర్మ ప్రభువు


 5 శ్రీకర ముగరండు జనులు
శ్రీకా రము చుట్టుడమ్మ  శ్రీపతి వచ్చెన్
శ్రీకరి తోడన్ నిమ్ముగ
శ్రీ కైవల్య ధామ.మొసగు.శ్రీరామ మూర్తీ

6 రఘుకులతిలక దశరథ  రామ చంద్ర
ప్రభువు జానకి చేతిని పట్టె ననఘ
 భవ్య  కళ్యాణ రాముడై పరిఢ విల్లె
పౌరు లందరు ఉత్సాహ భరితు లగుచు

7 అక్ష రార్చనలివి లక్షణ లక్ష్యముల్
మలయ మారు తములు మదిని తాకె
జగము నేలు రాజు జానకిన్ చేపట్టె
శ్రీరామ నవమితిధి శ్రీయుతంబు

8 రామ రామ యనుచు రమ్యముగ రమింప
భాగ్య మది జనులకు భక్తి  యున్న
రామ రాజ్య మందు రాజిల్లు నందరు
సుఖము  శాంతి సౌఖ్య    శోభ లలర

9 రాఘవేంద్రు కొలువ రక్షణ నిడునురా
రామ భక్తి మదిని రక్తి కట్టుర
రామ రామ యనుచు రామదాసులమన్న
ప్రేమ మీఱఁగాచు రామ బంటు
15.



Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...