నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
**********************
1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
2.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
3.మద్ది పుల్లారావు గారు
4.ఆళ్ళ నాగేశ్వరరావు గారు.హ
5.జోషి పద్మావతి గారు
6.గజవెళ్ళి శ్రీ నివాసా చారి గారు
7.అపరాజిత్ గారు
8.కవిత వెంకటేశ్వర్లు గారు
9.కోరాడ నరసింహారావు గారు
10.వదాంతం సురేష్ బాబు గారు
11.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు
12.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
13.తరణికౌటి సూర్య లక్ష్మి గారు
14.సింగీతం సంతోష్ కుమార్ గారు
***************
కవితాగానం సీజన్ 3
అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా
మన కవితా గానం ప్రత్యేక కవితలకు ఆహ్వానం
పలుకుతున్నది.
సమయం ఎప్పటిలాగే
రాత్రి ఎనిమిది నుండి
తొమ్మిదిన్నర లోపు
కవితలు పంపగలరు.
ఆ సమయంలో ఎలాంటి
ఇతర స్పందనలు తెల్పకుండా
సహకరించగలరు.
❇️❇️❇️❇️❇️❇️
1
[22/04, 8:13 pm]
కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు Poet: ధాత్రి దినోత్సవం సందర్భంగా
కవితా గానం
శీర్షిక....విశ్వ మేఖల.... 21042022
*************************
విశ్వ మేఖల ఖగోళ రాసుల రసాల పల్లవ కావ్య నాయిక
విశ్న మండలమే విస్తుపోయెడి నయగారాల
సాలభంజిక
వశము తప్పెడి వయ్యారంతొ వలపులు చెరిగే
మేనక
జిలుగుల జిగిలో తళుకుల మెరిసే తారల మధ్యన మేధిని *నిన్న*
విధి విలాసం వికృత క్రీడలొ పరాభవాల పరాకాష్టలొ కాష్టం మీద ద్రౌపది *నేడు*
గనుల పేరుతో గహన సీమల గుండెలు పేల్చిన
తోపులు
పరుపు బండలకు ప్రాణంతోడి గిరుల మొరలను
సిరులుగ మార్చె మాయగాళ్ళు
వనాల కొట్టి గుట్టలు తవ్వి నదులను కట్టి
విపులను చెరపట్టే కొందరు
మరి కొందరు అహంకారులై హిరోషిమా నాగసాకీలను అణు బాంబులకు ఆహుతి చేయగ
లక్షల మంది మృత్యువు ఒడిలో ఒక్క క్షణంలో
నశించి పోయె
అయినా చరిత్ర పునరావృతం అవుతోంది
ఆగని అగ్ని వర్షం అదేపనిగా కురుస్తూనే ఉంది
అవని అల్లాడుతున్నా
ఆయుధాలు అందిస్తు మానవ మారణహోమం లో ఆజ్యం పోస్తున్న బేహారుల బేరసారాలు
శవాల గుట్టలపై పైసలు పేలాలు ఎరుకుంటున్న
పిశాచులు
భూగోళం నశించి పోయే అణు యుద్ధానికి
అంకురార్పణ జరిగింది
అది తెలిసిన ధాత్రి
దగా పడ్డానని దిగాలపడిన ధరిత్రి
దిగులు తుడిచి సురక్షితంగా రక్షించుకొని
దక్కించుకునే ప్రయత్నం ప్రపంచ మంతా
ఒకటై చేయాలి
స్వీయ రచన:::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
21042022
2
[22/04, 8:16 pm]
అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: అంశం:- ధరిత్రి దినోత్సవం
( ఏప్రియల్ 22)
శీర్షిక:-
శరణాగతి ధరత్రీమాత
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:- విశాఖపట్నం
.............................
కన్నతల్లి నవమాసాలు మోస్తుంది
పుడమితల్లి జీవితాంతం భరిస్తుంది.
జన్మనిచ్చిన తల్లి లాగే
ధరణి తల్లి కూడా త్యాగమయి.
నీ శరీరపోషణకు అవసరమైన
పదార్ధాలను ఇచ్చి
నీవు విసర్జించిన మలినాలను తనలో కలుపుకుని
బదులుగా నీవు బ్రతకడానికి పచ్చని చెట్లను
పరిశుద్ధమైన గాలిని,
స్వచ్ఛమైన నీటిని ఇస్తే
స్వార్థంతో, సంకుచిత భావంతో,అన్నీ నేనే, అంతా నావే అని పుడమితల్లి పొరలను
చివరి వరకు చీల్చి బహుళ
అంతస్థుల భవనాలను
హానికర వాయువులను వదిలే పరిశ్రమలను,
భయానక వ్యాధి ని కలిగించే ప్లాస్టిక్ పదార్థాలను నిర్మించి తయారు చేసి
నేటి భూతాపానికి, సునామీలకు,ఉప్పెనలకు
కారణం నీవే అని తెలుసుకుని ధరత్రిని కాపాడుకుని ,పర్యావరణ
పరిరక్షణ చేసి" వృక్షో రక్షతి రక్షితః' అన్న బహుగుణ, మేధా పాట్కర్ ల జాడల్లో నడుద్దాం. ఆరోగ్య ముగా జీవిద్దాం.......!!
.................................
లోకా సమస్తా సుఖినో భవంతు.
...............................
ఇది నా స్వీయరచన
ఆచార్య అయ్యాలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
...............................
3
[22/04, 8:21
కవితా గానం
దరిత్రీ దినోత్సవ సందర్భంగా
మద్ది. పుల్లారావు
నందిగామ
తేది: *22-04-2022
అంశము: *ధరిత్రిని కాపాడుదాం
ప్రక్రియ :ఇష్టపది
-------------------------------
1)
ఎంతో పవిత్రమూ..యీశ్వరుని సృష్టి యిల
పురాతన కాలంలొ..భూతాపమే లేదు
ప్రకృతి నియమాలన్ని...పాటింపబడేవీ
చెట్టు చేమల పెంచి..జీవకారుణ్యమూ
అనుసరింపబడుతూ.. యాహ్లాద పరచేవి
ఆదునికత పెరుగుతూ..అవకాశవాదముతొ
విచ్చలవిడితనముతొ..విర్రవీగిన మనిషి
రాయుదును ఇష్టపది.. రామచంద్రుని తలచి
2)
ప్రకృతి నాశనమునకు.. బాటలు వేసినాడు
వాతావరణాన్నీ..పతనము చేసినాడు
చెట్లను నరికాడూ..చేటును పెంచాడూ
కొండలు పేల్చినాడు.. అండలు కూల్చినాడు
పారిశ్రామికీకరణ..పాడు చేసె స్వచ్చతను
కాలుష్యం పెంచగా..కనుమరుగయె జీవులు
సాంకేతికత తోటి...సమతౌల్యం నశించె
రాయుదును ఇష్టపది.. రామచంద్రుని తలచి
3)
కర్బనోద్గారాలతొ.. కళ తప్పేను పృధ్వి
సముద్రమట్టాలతొ...జనమతలాకుతలం
అనూహ్యమంచు కురియుచుఆరోగ్యాలుచెడును
శృతి మించిన స్వార్ధం.. గతి తప్పిన కాలం
ఉష్ణోగ్రతలు పెరిగి..ఉస్సురంటూ జనం
ఇందన వినియోగం..విపత్తులకు ద్వారం
రసాయన వినియోగం..రచ్చ జేయు ప్రకృతిని
రాయుదును ఇష్టపది.. రామచంద్రుని తలచి
4)
ప్లాస్టిక్ వినియోగం..పతనానికి హేతువు
మనమంత మారుతూ..మన జగతి మార్చుతూ
విశాల దృక్పథంతో.. విశ్వాన్ని మారుద్దాం
సహజ వనరులనెపుడు..సమముగా వాడుదాం
సౌర విధ్యుత్ వాడి..సంస్కరణలు చేయాలి
హరిత గృహాలతోటి యానందం కురియాలి
దరిత్రిని కాపాడి...చరిత్రను మార్చాలి
రాయుదును ఇష్టపది.. రామచంద్రుని తలచి
......
.......
-------------------------------
🙏🙏🙏
4
[22/04, 8:22 pm] Aalla Nageshwar Rao Poet: సందర్భం :ఏప్రియల్..22... ధరిత్రి దినోత్సవం
శీర్షిక :
"" పృథ్వి విలాపం ""
పంచభూతాలైన నీరు, నిప్పు, నింగి, గాలి, మట్టిలను
తన స్వార్ధపు పెనుభూతానికి తాకట్టుపెట్టి
పంచభూతాలనూ కలుషితం చేస్తున్నాడు
ప్రకృతిని వికృతిగా మార్చి
పుడమితల్లికి గర్భశోకాన్ని మిగుల్చుతున్నాడీ మానవుడు!
కన్నతల్లి కడ వరకే మోసేది
పుడమితల్లి కట్టే కాలే వరకూ మోస్తుంది
కట్టెను కాల్చేందుకు ఉపకరిస్తుంది!
అధిక ఆహరోత్పత్తి కై.
రసాయనిక ఎరువులను అధికంగా వాడుతూ
కన్పించే ప్రతి జాగా లో అపార్టుమెంట్లను నిర్మిస్తూ
పృథ్విమాత గుండెల్లో గునపాల్ని గుచ్చుతూ
హరితవర్ణాన్ని అదృశ్యపరుస్తూ
జీవరాసుల మనుగడను ప్రశ్నర్ధకం చేస్తూ
కూర్చున్న కొమ్మను నరుక్కుంటూ
తన వేలితో తన కంటినే పొడుచుకుంటూ
ఉన్న చూపును కోల్పోతున్నాడు
ముందుచూపు అసలే లేక
దూరాలోచన చేయక
దురాలోచనలతో వడి వడి గా
అడుగులేస్తూ
నడిచే దారిని ముళ్లమయం చేస్కుంటున్నాడు
కన్నీటి వరదను ప్రవహింప చేస్తున్నాడు!
జీవితాంతం కాపు కాసే పుడమితల్లిని
కన్నతల్లి కన్నా మిన్నగా కాపాడుకుందాం
అడగకున్నా అన్నీ ఇచ్చే ఆమనిని. అక్కున చేర్చుకుందాం!
............................................రచన :
ఆళ్ల నాగేశ్వరరావు
నాజారుపేట
తెనాలి...522201
గుంటూరు... జిల్లా
ఆంధ్రప్రదేశ్.... రాష్ట్రము
చరవాణి. 7416638823
............................................పై వచన కవిత నా స్వీయరచనే నని. హామీ ఇస్తున్నాను.
5
[22/04, 8:44 pm] +91 95420 10502: ధరిత్రీదినోత్సవ సందర్భంగా......
జోతలివే జననీ!
**************
పరమ పునీత ఆ సీతామాత
నీ ముద్దులతనయగా జనియించి
మహితాత్మురాలిగా నిలచిన భూజాత
స్త్రీ మూర్తులెందరికో ఐనది ఆదర్శవనిత
సమస్త జీవరాసికీ నిలువనీడనిచ్చి భారమెంతైనా ఓర్పుతో సహించే నీ సహనశీలత
హరితవర్ణ వలువ వంటి పంట పొలాలను ధరించి
ముత్తైదుశోభతో అలరారే ముగ్ముధమనోహర ముదిత
నాగరికతానయగారముల నడుమ
చిక్కినా
చలించక చిరుప్రాణులనెన్నిటికో జీవంపోస్తూ
మృతకళేబరాలెన్నిటినో తనలోన పొదివిపట్టి
మట్టిని సారవంతమొనర్చి
అంకురాలకు ఆసరానందిచ్చి
పంకిలమునకూ,పద్మాలకూ తావిచ్చి
లోపభూయిస్టపు రసాయనాల, కాలుష్యపు కోరలజిక్కినా,
కళ్ళ నిండా ప్రేమాశృవులను దాచి
కుళ్ళు, కుతంత్రాలను కడిగేస్తూ కాపాడే
కన్నతల్లీ, కల్పవల్లీ అర్పించెదనిదిగో జోత🙏
____________
జోషిపద్మావతి మహబూబ్ నగర్
6
[22/04, 8:59 pm] +91 90594 38068: ధరిత్రీ దినోత్సవం సందర్భంగా
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి
కాజీపేట
...
ఎన్నో ప్రాణులకు
ఎన్నో జంతువులకు
జన్మనిచ్చిన తల్లి పుడమి
ధరణి దేహం నిండా
పచ్చని అడవులు
పర్వతాలు
నీలి సముద్రాలు
మనిషి చేస్తున్న వికృత చర్యలకు
భూదేవి దుఃఖిస్తున్నది
పర్యావరణవాదుల ఒత్తిడికి
ప్రపంచ దేశాధినేతలు సమావేశమై
భూతాపం తగ్గించాలని
నిర్ణయం తీసుకున్నా
నత్తనడక నడుస్తున్న చర్యలు
పర్యావరణ పరిరక్షణకు
వన్యప్రాణుల సంరక్షణకు
జీవ వైవిధ్య విస్తృతికి
సుస్థిర అభివృద్ధికి
ధరణీ దినోత్సవ సందర్భంగా
కలిసికట్టుగా ముందుకు సాగుదాం
...
హామీ పత్రం
ఇది నా స్వంత రచన
7
[22/04, 9:10 pm] Aparajith: అవనిపై ప్రకృతి!
వెలుగుల జ్యోతి
దివ్యమైన వెలుగుల పరంజ్యోతి!
ఆ జ్యోతిలో రేగిన వెలుగుల మంటలు
ఆ అగ్ని ఫటిల్లుమని విచ్చుకుని
చెల్లాచెదురయ్యాయ్ అదే విశ్వాంతరాళం!
ఆ నిప్పుల వెలుగుల్లోంచి వేరయిన
మంటల ధగధగల గ్రాహం భూమి
అనంత కాల గమనంలో చల్లబడి
అపురూప కళాఖండంగా భూమి అవతరించింది!
నీళ్ళు చేపలు,వృక్షాలు,జంతువులతో ప్రకృతి అతి సుందర రూపం
ప్రకృతితో సల్పిన నిరంతర పోరాటంలో
మానవుడు ఈ భూమిపై మనుగడ సాగిస్తున్నాడు
సమస్త వృక్ష జంతుజాలాన్ని చెండాడుతూ
తన ఉనికికి తానే దహించుకు పోయే
ప్రచండ అగ్నిని రేపుకుంటున్నాడు!
ఇప్పుడు అవని రూపురేఖలు మారిపోయాయి
ఎప్పుడు జలరాశులన్నీ భూతలాన్ని
కప్పేసుకుంటూ ప్రళయం వస్తుందో తెలీదు!
అది మృగప్రాయుడైన మానవుని చేతుల్లోనే వుంది,,,,,,,,!
మనిషి మేధస్సు మానవ కళ్యాణానికి ఉపయోగించాలి
ప్రకృతి విధ్వంసం సులభం కాని కాపాడుకోవడం మానవ ధర్మం!
అపరాజిత్
సూర్యాపేట
8
[22/04, 9:10 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం ( సీజన్ 3)
అంశం::పృథ్వి దినోత్సవం
తేదీ:: 22.4.22...శుక్రవారం
శీర్షిక:: నన్ను కాపాడండి
అమ్మలా ఆదుకు0టుంది
అలకతీర్చి ఆకలి తీరుస్తుంది
అసహనము లేక సహనముతో
వుండమంటుంది
ఓర్పుతో జీవించమంటుంది
స్వార్థం పెంచుకొని
స్వప్రయోజనము నింపుకొని
గుట్టలు మిట్టలు తోడేస్తూ
కొండలను తొలుస్తు
మట్టిని కబలిస్తూ
సొమ్ము చేసుకుంటున్న సొంబేరులు
బేరాలు చేసుకొని ఆస్తులు
అంతస్తులు పెంచుకుంటు
ప్రభుత్వాల కళ్ళు గప్పి
కుభేరులవుతున్నారు
మీరు చేసిన పనుల వల్ల
నేను కుంచించుకొని పోతున్నాను
ప్లాస్టిక్ వాడకం ఎక్కువ జేసి
నా కడుపులో మంటను లేపినారు
నోరు లేని జీవాల కడుపులు
కోతలు కొస్తున్నారు
కాలుష్యాన్ని పెంచి పంచభూతాలను కలుషితము చేస్తున్నారు
ముందుతరాలకు దుర్గంధాలను
పంచుతున్నారు
పంటలకు కల్తీ రసాయనాలు వాడి భూసారం తగ్గిస్తున్నారు
నదులలో మురికిని నింపి
కార్మాగారాల ఉద్గారాలను పంపి
పంట భూములను పాడుచేస్తున్నారు
అపార్టుమెంట్ల కోసం జేసిబిలతో తల్లి గుండెను చీల్చి
కడుతున్నారు ఆకాశ హార్మ్యాలు
పొలాలన్ని ఇండ్లుగా మారుతున్నాయి
ఎన్నని చెప్పేది నా బాధలు
ఎన్నని వినిపించేది వ్యథలు
మనసున్న మనుషుల్లారా
మారండి నన్ను కాపాడుకోండి
లేకుంటే వినాశనము
సర్వ నాశనము కాకుండ చూడండి
ఇది నా విన్నపము
చేయకండి భువిని కూపము!!
కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు. 8309920625
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ
9
[22/04, 9:11 pm] Korada: ధరిత్రీ దినోత్సవ ప్రత్యేక కవిత
* ఆకాశ వారసురాలు *
కోరాడ నరసింహా రావు
****************
ముత్తాత,తాత,తండ్రుల వార సత్వంతో...జలకన్యకు పుట్టిన ముద్దుల ముని మనుమరాలీ మన ధరిత్రీమాత!
సంపూర్ణ సమగ్ర శక్తుల పూర్ణ రూపి ఈ నేల తల్లి !
క్రిమి, కీటక, పశు, పక్ష్యాది...
సకల ప్రాణికోటినీ కని, పెంచి, పోషించి...చివరకు తనను వీడి పోనీక తనలోనే దాచుకునే
మాతృమూర్తి మనజనని !
అందాలతొ అలరిస్తూ..
రంగులతో కనువిందులుచేస్తూ
రుచులతో నోళ్ళూరిస్తూ.,ఆకలి
దప్పులను వాత్సల్యమున దీర్చు తు...హాయిని గొలిపేబ్రతుకుల నిచ్చి... సుఖముగా బ్రతకండ ని అంటే...,
గుండెలవంటి కొండలన్నిటిని గుండ,పిండిగజేసేస్తూ ,చెట్టూచేమలతుదముట్టిస్తూ...ఎక్కినకొమ్మనెనరుకుచందమున...నేలను,నీటిని,గాలితోసహా...అమ్మనుకాలుష్యరక్కసికిఅప్పగిస్తిమి !
పాలు తాగి, రొమ్ముగుద్దు బిడ్డ లజూసి,ఆగ్రహించిననేలతల్లి
అణువణువూ మండగా...
అలమటించు చుంటిమి కద...
నేటికి మనమందరం !
తప్పుతెలిసి,కళ్లుతెరచి,పస్చా త్తాపముచెంది...,తప్పులు సరి దిద్దుకొనగ... కదలుదాము అం దరం ! అమ్మను ఆనంద పరచి
మనము సుఖ, సంతోషాలతొ
బ్రతుకుదాం కలకాలం !
******************
10
[22/04, 9:20 pm] +91 94236 90615: కవితా గానం సీజన్ 3
**********************
అంశం:- ధరిత్రి
***********************
మానవ మేధస్సు
మరణ మృదంగాలను మ్రోగిస్తూ
స్వార్థ ప్రయోజనాల కోసం
పుడమితల్లి గుండెల్లో
గునపాలను దించుతూ
ప్రకృతి సంపదను
ప్రకృతి సౌందర్యాన్ని
పంచభూతాలలో ఒకటైన
మనందరికీ నిలువ నీడ నిస్తున్న
ధరిత్రిని కొల్లగొట్టి
గుల్ల చేస్తూ మానవ మనుగడకు
ముప్పు తెస్తూ
తన గోతిని తానే తవ్వుకుంటూ
తోటి వారికి చేటు చేస్తున్నాడు
నీరు నిప్పు నింగి నేల
గాలిని దూషితం చేస్తూ
దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు
ప్రకృతి ప్రకోపిస్తే
ప్రళయం వస్తుందని మరిచిపోయి
హూంకరిస్తున్నాడు
పంచభూతాలు తమ
ప్రతాపం చూపకముందే
వాటిని కాపాడుకోవడం
మన ధర్మం అని తలచి
ముందుకు సాగాలని
ధరిత్రిని విధ్వంసం నుండి
కాపాడేందుకు కంకణం
కట్టు కోవాలి.
మానవ మనుగడ
భూమాత ఒడిలో
ధరిత్రి దినోత్సవం
మానవ జీవన దినోత్సవం
,🖋️ వేదాంతం సురేశ్ బాబు
11.
అంశం: ధరిత్రి
భారము పెరిగినా
భూభాగమంతా ధ్వంసం చేసినా
కాలుష్యం తో కల్మష పూరిత మైనా
యుద్దాలతో భయంకర ధ్వనులతో
వనాలు భవనాలు కూలిపోయినా
ఆకలి దప్పుల అక్రందనలు వినిపించినా
అమాయక ప్రాణులు జీవం కోల్పోయినా
మారణ హోమంతో మంటలు చెలరేగినా
కొండలు పిండి చేసినా
ప్రకృతి బీభత్స ఘటనలెదురైనా
పచ్చని పంట పొలాలు పాడైనా
మార్తాండ తేజుని మండే కిరణాలు ప్రసారించినా
గుండెలు పగిలేలా గుండాలు గున పాలు గుచ్చినా
ఆకర్షణ శక్తిని కోల్పోకుండా
సకల జీవులకు మూలా ధారమైన
ధరిత్రి
పవిత్ర సంధాత్రి సచ్చరిత్రి
జగన్నాథుని పత్ని జగద్దాత్రి
కుపుత్రులుంటారు కాని కుమాతను గనలేము
అన్నార్తులను ఆదుకొను అన్నపూర్ణ అవని
అందుకే భూమాత. సర్వ జీవుల మనుగడ నిచ్చు మహా సాధ్వి
నిరుపమ నిర్మలపుణ్య చరిత్ర కల భూమి ఈ పృధ్వి
ప్రత్యూష బిందువుల ఆహ్లాదిని మేదిని
ప్రత్యక్ష శక్తి స్వరూపిణి ధరిత్రి
విక్రాంతుల విక్రమాలకు వెరువని విశ్వ ధాత్రి
వేంకట రమణుని రాణి భూదేవి
చల్లని తల్లి చక్కని జనయిత్రి ధరిత్రి
ధర్మ రక్షణ కోరే ధరిత్రి
సత్య ధర్మ ఓర్పు లే కన్నులుగా గల త్రినేత్రి
సర్వ ప్రాణికోటి కి సంపద ప్రదాత్రి ధరిత్రి
క్షమ యా ధరిత్రి ఈ ధరణి
సృష్టి స్థితి లయ కారయిత్రి ధరిత్రి
అందుకే పరమ పావన పవిత్రి
ఈ ధరిత్రి
డా. తంగిరాల నాగలక్ష్మి
12.
కవితా గానం
అంశం:ధరణి
బతుకు నిస్తుంది పుడమి
మెతుకు నిస్తుంది నేల
అవసరాలను తీరుస్తుంది వసుధ
తల్లిలా అక్కున చేర్చుకుంటుందిజగతి .
హలంతో దున్నితేపంటనిస్తుందిహల
ఘనిజాల గని భరణి.
అమ్మలా కడుపు నింపే ఉర్వికే
బిగిస్తున్నాం ఉరి.
ఉగ్రరూపం దాల్చి వసుధను కాపాడుకోవడం మన విధి.
స్వార్థంతో బరితెగించి అడవులకు పెడుతున్నారు కోత.
తెగ్గోస్తున్నారు తీరప్రాంతాలు రాక్షసుల్లా
బొక్కేస్తున్నారు సహజ నిక్షేపాలు
బకాసురుల్లా.
ఈ రాబందులు ఆట కట్టించడమే
మన తక్షణ కర్తవ్యం
.అదే మనం కల్యాణి కిచ్చే అతి పెద్ద కానుక.
తిప్పావఝల నరసింహమూర్తి
బుచ్చిరెడ్డి పాళెం
13.
24/4/2022/ ఆదివారము
అంశం:- " థరిత్రిదినోత్సవం "
సీ! పుడమితల్లియెపుడు పురిటాలు చూడగ
సంతతినెప్పుడు సాకుచుండు
గిరులైనమోయును తరులైనమోయును
బరువుభారమనుచు బాధపడదు
పుణ్యనదులుపార పులకించు థారణి
సంద్రాలచూసియు సంతసించు
పరిసరాలనెపుడు పరిరక్షణనుచేయు
తన బిడ్డలభవిత తనకుతెలుసు
ఆ! అవసరములుదీర్చు అవనిమనకు నండ
జన్మనిచ్చుతల్లి జగతిగాచు
థరణిలేకయున్న థరణిజీవములేదు
ధర్మమెరిగి మసలు థరణిలోన!
తరణికంటి సూర్యలక్ష్మి.
14
శీర్షిక:- *ధరిత్రి*
సమస్త జీవకోటి భారాన్ని మోసేది ధరణి
విశ్వంలో మానవజాతిలాంటి జీవులు కలిగి వున్న ఒకే ఒక గ్రహం ధరిత్రి
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దానికి ఆధారం భూమి
మానవుని అవసరాలకు వృక్షాలను నరికి
అతి వృష్టి,అనాష్టి, భూకంపనాలు,
ఓవైపు కాలుష్యం భూతం వెంటాడుతుంటే.....
మరోప్రక్క తరిగిపోతున్న వనరులు
మానవాళికి ఆవాసంగా నిలిచిన భూమి కడుపు
నేడు కోతను మిగుల్చుతున్న పరిస్థితులు
మానవుని అభివృద్ధి కోసం
కర్మాగారాలు ఎర్పాటు చేసి రసాయానికి పదార్థాల తయారీ
పోరుబావులను త్రోవటం
వృక్షాలను నరికి,
అతి వృష్టి,అనాష్టి, భూకంపనాలు
కర్మాగారాలు
ప్లాస్టిక్ భూతం తో భూ మాత కాలుష్యం
విపరీత చర్యలు భూమాతను నిలువునా దహించి వేస్తూ
నేడు తాగే నీరు....
పీల్చే గాలి.....
నివసించే నేల..... పంచభూతాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకొని
పచ్చదనంతో కలకలలాడాల్సిన భూతల్లి
ప్రకృతి అందాలను కోల్పోయి మౌన రోదనతో కన్నీరు కార్చుతోంది
భూమాతను కాపాడుతూ
ప్లాస్టిక్ భూతన్ని తరిమేద్దాం.....
కవి పేరు:-
సింగీతం సంతోష్ కుమార్
జిల్లా:-కామారెడ్డి
Comments
Post a Comment