Skip to main content

సానుభూతి చైత్రమాసం 2022

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
******"*********
కవివరుల జాబితా
1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
2.కోరాడ నరసింహారావు గారు
3.గజవెల్లి శ్రీనివాసాచారి గారు
4.టేకుమళ్ళ విజయ లలిత గారు
5. శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని గారు
6.ముడుంబ తిరు వేంకటాచార్యులు గారు
7.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
8.నరేశ్ చారి గారు
9సునంద వురిమళ్ళ గారుాజిత్
10.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు
11.కవిత వెంకటేశ్వర్లు గారు
12.దారల విజయ కుమారి గారు
13.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
14.వేదాంతం సురేష్ బాబు గారు
15.తిప్పా వఝల నరసింహ మూర్తి గారు
16.ఆఫ్సర వలీషా గారు
17.తరణికంటి సూర్య లక్ష్మి గారు
18.ఆపరజిత్ గారు
19.శివునూరి లలితా కృష్ణ గారు
19.సింహాద్రి వాణి గారు
20.డా.బల్లూరి ఉమాదేవి గారు
*****************
1.
అంశం.... సానుభూతి....05042022
శీర్షిక.... ఓదార్పు
********************************
పెను తుఫాను తాకిడికి తల్లడిల్లిన తరువుల
విరిగిన కొమ్మల చిరిగిన ఆకులు
స్వార్థంతో ఏరు కొనే వారే కాని ఓదార్చువారెవరు

చెదిరిన 🐦 పక్షుల గూళ్ళు పగిలిన గుడ్లు...
పడిపోయిన... రెక్కలు రాని పక్షి పిల్లలు 
సులువుగా దొరికాయని సుష్టుగా భోంచేస్తారే కాని
జాలితో చేయూత నిచ్చి జావ పోసేదెవరు

వరద ధాటికి పడిపోయిన ఇళ్లు... గుడిసెలు
ఊళ్లకు ఊళ్లు నీట మునిగి తేలుతున్న
ఆవాసాలు..... అశేష జనం అవస్థ పాలౌతున్న ఆపత్కాలం... ఆయుష్షు తీరిన అభాగ్యుల శవాలు
ఓదార్చి ఆపన్నహస్తం అందించేదెవరు...కన్నీరు కార్చే.... కావలసిన వారెక్కడ?

కానీ ఉంటారక్కడ.....
ఉబ్బి గబ్బు గొట్టే శవాల మీద ముక్కు పుడకల
వేటకై వాలిన రాబందులు

సూపర్ సోనిక్ మిసైళ్ళ మొసళ్ళు మానవ హననం చేస్తుంటే
శతఘ్నుల పిడుగులు పిండి చేసి  పీనుగ కుప్పలు తెప్పలుగా పోస్తుంటే

జనహితం కోరాల్సిన జననేత జగమొండియై
జాతిని జాతి భవితను యుధ్ధంలో బలి ఇస్తున్న
బేవకూఫ్ బేతాళుడు

ఆధిపత్య అహంకారం యుధ్ధోన్మాదం తలకెక్కిన
త్రాష్టుడి దాష్టీకం దావానలమై పరాయి దేశాన్నే దహించి వేస్తుంటే....

శాంతి పావురాల రెక్కలు నరికి రుధిరం తాగే
డేగలు వాలి మందు గుండు అమ్ముకుంటు
మారణహోమం సృష్టిస్తుంటే

ఓదార్చే ఔదార్యం ఎక్కడ... సానుభూతి పవనాల జాడేది....
ఉంటుంది ఎక్కడో ఆలస్యంగా నైనా ఆదుకుంటుందని నా ఆశ ఆశ ఆశ

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
2.
 @సానుభూతి@
    కోరాడ నరసింహా రావు 
         **************
తోటి వారి... సాటివారి  సాను భూతిని పొంద డమంటే...., 
   మనలో  మంచితనం, స్నేహ శీలతలు పుష్కలంగా ఉన్నట్టే!
మనచుట్టూ ఉన్నవారి అభిమా 
నాన్ని  చూరగొన్నట్టే... !!
      కష్టంలో ఉన్న మనిషికి... 
ఒక సానుభూతి ఓదార్పు... దివ్యమైనఔషధమైపనిచేస్తుంది 
      మనం చూపించే ఆ చిన్న 
సానుభూతే... వాడిపోతున్న మొక్కకు నీరందించినంత మేలు చేస్తుంది !
          నిరాశా నిస్ప్రుహలతో క్రుంగి పోయే మనిషికి యీ చిన్న సానుభూతే కొండంత అండయి,తనమీద తనకో నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని, 
కలివించి నూతన చైతన్యంతో ముందుకు నడిపిస్తుంది !!
    కష్టాలలోఉన్న సాటిమనిషిపై
సాను భూతి చూపకపోతే... 
వాళ్ళసలు మనుషులే కారు !
3
 గజవెళ్ళి శ్రీనివాసాచారి 
అంశం:సానుభూతి 
...
ఏమిటో సానుభూతి 
ఆత్మీయులకు 
సన్నహితులకు 
జరగరాని కష్టం ఎదురైనా 
కుటుంబ సభ్యులు మరణించినా 
సానుభూతి వచనాలతో 
అనునయించే పద్ధతి 
తరతరాలుగా వస్తున్నదే 
మన సభ్య సమాజంలో ఆచరిస్తున్నదే

మరికొందరు శాడిస్టులు 
పైకి మాత్రం సానుభూతి
లోపల మాత్రం వికృత బుద్ధి 
తమ అసలు రూపం ప్రదర్శించే దుర్బుద్ధి 

అసలైన సానుభూతి 
హృదయాలకు శాంతి కలిగించు 
ఓదార్పు లేపనమై బాధను తగ్గించు 
...
హామీ పత్రం 
...
ఈ కవిత నా స్వంత రచన
4.


*సాగిపోతూనే*
 (నేటి అంశం సానుభూతి)
~~~~~~~~~~~
ఆగమన్నాను......
సాగిపోతానంది  తను,
అర్ధించాను,
చేతులు  జోడించి ప్రార్ధించాను,  బెదిరించాను,
కన్నెర్ర చేసి  భయపెట్టాను,
తొణకలేదు, సరికదా బెణకలేదు.
వెనుదిరిగి చూడకుండా,
చిరునవ్వుతో  ముందుకు సాగింది....

ఉక్రోషంతో  ఊగిపోయా!
కసితీరేలా కర్రతో కొట్టా,
   నా మూర్ఖత్వానికి  నిదర్శనంగా , 
"గడియారం"భళ్ళున పగిలింది...

మరికాలం? నా వైపు సానుభూతి గా చూస్తూ
యధావిధి గా  ముందుకు
సాగిపోయింది.
*******************
టేకుమళ్ళ విజయ లలిత 
5.
*కవితా గానం*
 *పేరు: శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని*
 *అంశం: సానుభూతి*
 *తేదీ:05/04/2022*
 *శీర్షిక: మౌనం కన్నా…..*


 నీలో నమ్మకాన్ని నిలిపేందుకు
 చెప్పలేక నే చెప్పిన మాట
 నీ పెదవుల పైన నవ్వై  పూస్తే
 తప్పేముంది 

 నిరాశలో కుంగి పోతుంటే
 ఆశని వెలిగించేందుకు
 అవసరార్థం పలికిన
 సానుభూతి మాట 
సంకల్పాలకు ఊపిరి పోస్తే
 తప్పేముంది 
 నీ సందిగ్ధాన్ని తొలగిస్తూ
 సడలిన ఆశయాన్ని రగిలిస్తూ
 తప్పక నే చెప్పిన మాట
 సరైన దిశలో నడిపిస్తే 
 తప్పేముంది 

 మౌనంగా ఉండే కన్నా
 ముఖస్తుతి మంచిదే
 మాయో,  మంత్రమో
 కొంతైనా నిన్ను నీకు చూపిస్తే
ఓదార్పునిస్తే 
 తప్పేముంది..
6.

కవితాగానం 05-04-2022.
ముడుంబ తిరువేంకటాచార్యులు, 
మానుకోట.
      "సానుభూతి".  
కాలికైనా, కీలుకైనా, 
కేలికైనా (చేయి), 
వొంటిని కప్పివుంచే తోలుకైనా, 
ఎక్కడ దెబ్బతగిలినా, 
ఏ అవయవం రుజాగ్రస్తమైనా, ... 
నీరు కారేది కంటినుంచే, 
నొప్పి తెలిసేది మనసుకే. 

సాటి మనిషి వెతలకు 
మనసుకరిగితే "సానుభూతి", 
వ్యవస్థలోని వ్యక్తుల దీనావస్థకు స్పందిస్తే "మానవత". 
నేటి సమాజం కోరుకుంటున్నదీ, 
మృగ్యమై కలతపెడుతున్నదీ యిదే. 
***** @@@ ***** 
ఈ రచన నా స్వంతం. ఇతర రచనలకు అనువాదం గానీ, అనుకరణ గానీ, అనుసరణగానీ కాదు.🙏
7.
కవితాగానం సీజన్...2
తేది :5/04/2022
అంశం : సానుభూతి
శీర్షిక : 
      "  ముందడుగు "

అవయవాలోపమున్న దివ్యంగులను గాంచి
సవ్యాంగులు చూపాల్సినది  సానుభూతి కాదు
 చేతనైన చేయుత  నిచ్చి
ఆ లోపాల్ని అధిగమించేలా
కృత్రిమ అవయవాల  కల్పనకు కృషి చేయాలి
మానవసేవే మాధవసేవగా తలచి
ఉడుతాభక్తితో సామాజిక సేవలో  ముందడుగు వేయాలి!
తన కన్నా దిగువనున్న వారి యెడల సానుభూతి చూపక
అభిమానంతో అక్కున చేర్చుకొని
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వచ్చేలా
మన సాక్షిగా కృషి చేయాలి
సామాజిక  న్యాయసాధన కై ఉద్యమించాలి!
కార్మికుల యెడల అధికారులు
పనివారి యెడల యజమానులు
కూలీల  పట్ల భూస్వాములు
లేనిపోని జాలి చూపక
సానుభూతితో స్థితిగతులను అర్ధం చేసుకుని
సమస్యల పరిష్కారం కై చిత్తశుద్ధితో శ్రమించాలి!
మానసిక వికలాంగుల కన్నా దివ్యాంగులే మిన్న అనేలా
సవ్యాంగులందరు  దివ్యాంగుల శ్రేయస్సు కై
మొక్కవోని దీక్షతో ముందడుగు  వేయాలి
నవ సమాజ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి!
...........................................
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
ఆర్టీసీ కండక్టర్
నాజారుపేట
తెనాలి...522201
గుంటూరు... జిల్లా
ఆంధ్రప్రదేశ్... రాష్ట్రము
సెల్ నెంబర్.7416638823
.........................................
పై వచన కవిత ణా స్వీయరచనే నని హామీ ఇస్తున్నాను.
8.
అంశం: సానుభూతి
తేది: 05-04-2022

అయ్యయ్యో వద్దమ్మా...
***************************
అయ్యయ్యో వద్దమ్మా...
చిలుకలా వల్లించే 
తెల్లపావురాల మాటలు అస్సలు నమ్మొద్దు

అవి మాటలు నేర్చిన పావురాలు
కనికట్టునేర్చిన పావురాలు
వర్ణం తెలుపే కానీ
సందర్భాన్నిబట్టి రంగులు మార్చే
గడుగ్గాయి పావురాలు
ఓట్లపండగొస్తేగానీ
ఏ ఇంటిముఖం చూడని 
అవకాశవాద పావురాలు

ఆ పావురాలకు
తాయిలాల ఎరలువేయడం తెలుసు
నమ్మించి గొంతుకోయడం తెలుసు
ఊహాప్రపంచంలో ఊగిసలాడించడం తెలుసు
కపటప్రేమను ఒలకబోయడం తెలుసు
గూటికి చేరుకున్నాక
గుండెలపై తన్నడమూ తెలుసు

నదిలా ప్రవహిస్తున్న నీ ఆశలకు
అడ్డుకట్టవేసే పావురాలపై
నీవిచ్చిన చేయూతను మరచి
నిన్ను దుఃఖనదిలో 
ఒంటరిగా వదిలేసిన పావురాలపై
ఆత్మాభిమానంతో తొణికిసలాడుతున్న నిన్ను
అవసరానికి వాడుకునే
ఆటవస్తువులా చూసే పావురాలపై
సానుభూతి వర్షాన్ని
కురిపించొద్దుగాక  కురిపించొద్దు

                        - Naresh Chary@369.
                                9701334516
9.
*కవితా గానం సీజన్ 2*
తేదీ:05/04/2022
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: సానుభూతి 
*****************
కష్టాలు కన్నీళ్ళు జమిలీగా
మనసును అతలాకుతలం చేసినప్పుడు
ఓ చల్లని ఓదార్పే
మనసు గాయానికి లేపనం అవుతుంది..

నొసలుతో వెక్కిరింపు
నోటితో పలికే చిలుక పలుకుల సానుభూతి 
ఛిద్రమైన మనసుపై రాయి విసిరినట్లనిపిస్తుంది...

చిరిగిన మనసు వస్త్రాన్ని
చిరు ఆశల దారంతో కుట్టి నట్లుండాలి..
 పగిలిన హృదయాన్ని 
ఓర్పుగా అరల్డయిట్ తో
అతికించినట్లుండాలి..

నష్టాన్ని పూడ్చుకునేలా 
మనశ్శరీరాలకు 
జీవం నింపే సానుభూతి
అసలు సిసలైన సహానుభూతై 
జీవితానికి కొత్త రెక్కలు తొడిగినట్లవుతుంది..

 *వురిమళ్ల సునంద ఖమ్మం*
10
[06/04, 8:18 pm] +64 21 233 1334: అంశం : సానుభూతి
డా.తంగిరాల నాగలక్ష్మి

సానుభూతి అదొక స్వ అనుభూతి
ఎదుట వారు కష్టం లో ఉన్నప్పుడు కలిగే  స్పందన 
పైపైకి కాదు లోనుండి రావాలి
అయ్యో పాపం అంటాం 
అదే స్వానుభూతి
బాధ లలో ఉన్నవాళ్ళకి బాధలు తీర్చలేక పోయినా
 ఓదార్పు అవసరం  అదే సగం బలం
దయా గుణమున్న వారిలోనే ఉంటుంది సానుభూతి
రజోగుణు లకు  తెలియదు  సానుభూతి
అంటే ఏమిటో

సేవా దృక్పథంతో సాయం చేయటమే చేతలలో చూపే సానుభూతి
ఉదార స్వభావం ఉన్నవాళ్లు చూపిస్తారు 
సానుభూతి
కొందరికి సానుభూతి చూపించటం ఇష్టం ఉండదు
ఆత్మస్థైర్యం, మనో నిబ్బరం   ఉన్న వాళ్ళు
 సానుభూతి కి వ్యతిరేకం
దీనులు కోరు కుంటారు సానుభూతి
సర్వ భూతములందు దయకల్గి ఉండటమే సానుభూతి
కష్టాలు నిలదొక్కు కోటానికి 
 స్నేహ పూర్వక  ఓదార్పు  కావాలి
నా అన్న వారు ఈ లోకాన్ని
విడచి వెళ్ళిపోతే  కలిగే దుఃఖానికి
సానుభూతి  కోరుతుంది మనసు
సాటి మనిషి కి సహాయ పడటం
సానుభూతి ఉంటేనే చేయగలం
 మమత నిండిన మనసు తో పలికే
మధుర భావమే సానుభూతి
సానుభూతి చూపక్కర్లేని వారు
కూడా ఉన్నారు సమాజంలో
చీడ పురుగులు
అమయకులపై అత్యాచారాలు చేసేవాళ్ళకి శిక్ష పడితే చూపనక్కర్లేదు సానుభూతి
లాంచగొండులకు ఆపద వస్తే
అవసరం లేదు సానుభూతి  
అధికార దాహం తో
అహంకారం తో 
యుద్ధాలలో జరిగే
 జన.ప్రాణ నష్టానికి
కావాలి సానుభూతి
ఆకలిదప్పులకు అల్లాడే అభాగ్యకులకు
చూపాలి సానుభూతి
ప్రకృతి వైపరీత్యాలలో బాధితులకు
చూపాలి సానుభూతి

 సత్య  సంగ మమున సజ్జనత్వముకూడు
సత్వ గుణము కోరు సర్వ జనుల
సౌఖ్య సంప దలను  శాంతి భద్రతలను 
సాధు గుణము చూపు సాను భూతి
11
[06/04, 9:00 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం - 2
అంశం - సానుభూతి
తేదీ::6.4.22 ... బుధవారం
శీర్షిక:: బ్రతుకు - బ్రతికించు

రెక్క తెగిన పక్షి
ఆకలితో కుక్షి
మంట పుట్టిస్తున్న
మండుటెండ
ఎక్కడ దొరకని నీడ
పెరిగిపోయిన అపార్టుమెంట్లు
తరిగిపోయిన రోడ్ల పక్కన చెట్లు
కూడు గూడు బట్ట లేక
అల్లాడుతున్న అనాథ
చూసి కూడా అయ్యో అనేక
రెండు సానుభూతి మాటలు
అనలేక
అంతో ఇంతో ఎంతో కొంత
సాయం మందివ్వక
కాళ్ళు లేని వారికి
కళ్ళు లేని వారికి
చేయి లేని వారికి
మాటలు రాని మూగ వారికి
పని చేయలేక అగచాట్లు పడే
వారికి చేతనైన సాయం చెయ్యి
వారిలోని అభద్రత భావాన్ని
దూరం చెయ్యి
ఆత్మ విశ్వాసాన్ని అందియ్యి
ఎదో ఒక పని చేసి జీవించే
దారి చూపియ్యి
అదే వారికి చూపే సానుభూతి
వారినందరిని ప్రేమించడమే ప్రీతి!!
                  కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.      8309920625
12
అంశం : సానుభూతి
శీర్షిక : నీకెందుకు
****************

ప్రతి రోజూ
నీకు నువ్వెప్పుడూ కొత్తగా..సరి కొత్తగానే పరిచయం చేసుకో

నిర్వేదం నీ దరికి రాదు

నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ
నీదైన ధ్వనిని వినిపిస్తూ
నిశ్చలాన్ని కదిలిస్తూ

ఎన్నో దిక్కులదాకా
వ్యాపించి..వెదజల్లబడాల్సిన చోట
జీవితాన్ని 
కుదించుకోవడమెందుకు 

ప్రసరించే గాలితో
ప్రవహించే నీళ్ళతో
రాయి కూడా 
తనని మలచుకుంటుంది..
నిన్ను నువ్వు
తొలుచుకోవడం ఏపాటిది

నైపుణ్యాలను
దారుల్లో నడిపించడం
వెలుతురును
ఆహ్వానించడం తెలియాలంతే

అంచుల మట్టుకు
ఆత్మవిశ్వాసం నింపుకుంటూ

సంఘర్షణల కొలిమిలో‌కి 
వేసుకుంటూ పోవాలి
నీ గమ్యాలు కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి

అవకాశాల కోసం పలవరిస్తూ
ఆశలను నిదురలేపుతూ..
అలవికాని
ఉత్తేజాన్నీ ఉత్సాహాన్నీ
సంపాదించుకుంటూ..

జీవితంతో ప్రేమలో పదే పదే పడుతుంటే
నువ్వు సేదదీరేందుకు
ఏ సానుభూతి పవనాలూ
నీకక్కర లేదు

డా.దారల విజయ కుమారి
13

[06/04, 9:21 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం సీజన్ 2
తేది: 05-04-2022
అంశం: సానుభూతి

పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు

    ఓదార్పు మంత్రం

ఏ దుఃఖసీమలో మునిగి తేలుతున్న సమయంలో ఆత్మీయులు అభిమానుల మనసులోంచి వెల్లువలా ఉబికి వచ్చిన పలుకులు....

ఆనందంహ క్షణాలను తలచుకొని 
ఆప్యాయతలను పంచుకొనే రీతిలోనే
ఎదుటి వారి శోకమును హతమార్చి
పూర్వవైభవం తీసుకువచ్చిన ఆర్ద్రత వాక్యాలు
మనసును ఊరట కలిగిస్తాయి.‌‌..
మనిషికి మనిషే ఓదార్చి శీతల స్పర్శతో అక్కున చేర్చుకుని
గాయపడిన దేహానికి
మాయా మలాము పట్టించే ఔషధం!

కొందరు అనవసరంగా మీ ఆమె పలు ఈటెలతో బాధించి సాధించినా
మరుక్షణమే నవనీతం చిలికే వచనాలతో ఉపశమనం కలిగిస్తుంది!
పిగిలి పోతున్న హృదయ వలువకు డాగు మాసికలా పరచుకొంటుంది!
    ***
      హామీ పత్రం
14
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.
[06/04, 9:25 pm] +91 94236 90615: కవితా గానం
అంశం:- సానుభూతి
తేదీ:- 6-4-2022
"""'''''"'""""""""'''''''''''''''''''""""""""""'''"
కష్టాల కడలిలో యీదుతూ
కన్నీళ్ళను దిగమింగుకుంటూ
మనసులో రేగిన మంటలు
గుండెను కార్చిచ్చులా కాలుస్తుంటే
లోకం సూటి పోటి మాటలతో
కాకుల్లా పొడుస్తూ ఉంటే
ఒంటరితనాన్ని భరించలేక
కుంటెద్దులా నడుస్తూ ఉంటే
అవసరానికి అందరూ వాడుకొని
అడ్డంగా ముంచేస్తుంటే
సమస్యల సుడిగుండంలో చిక్కుకుని
సతమతం అవుతుంటే
నేనున్నానని నిండుగ
భరోసా ఇచ్చేందుకు ముందుకు వచ్చి
వెన్ను తట్టిన మంచి మనిషి
చల్లని మాటలు సానుభూతి
అవి చూపిస్తాయి ఆ మనిషికి
మంచి మార్గాన్ని ధైర్యాన్ని

🖋️ వేదాంతం సురేశ్ బాబు
15.

[07/04, 8:29 pm] Thippavajjala నరసింహ మూర్తి Poet Nellore: కవితా గానం సీజన్ 2
అంశం: సానుభూతి

తిప్పావఝల నరసింహమూర్తి

సానుభూతి వ్యక్తం చేస్తామందరం బాధితులకు ఉదారంగా
అండగా నిలబడేది కొందరమే.
కుటుంబ పెద్దను కోల్పోయి నడిసంద్రంలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబానికి సానుభూతి 
వ్యక్తం చేస్తే సరిపోతుందా?
ఒడ్డున పడేయడమే మానవత్వమనిపించుకొంటుందా?
సహోద్యోగి హఠాత్తుగా మరణిస్తే ఆదుకొనేదెందరు?
మేమున్నామని భరోసా ఇచ్చేదెందరు?
కుటుంబ సభ్యుని కారుణ్యనియమాకానికి కరుణచూపే దెందరు?
సానుభూతి చూపడం మానవత్వం
అండగా నిలబడి ఆదుకోవడం దైవత్వం
మానవత్వాన్ని మేల్కొపుదాం
బాధితులకు సానుభూతి చూపడం తోపాటు అండగా నిలుద్దాం

అపుడే మనమనిపించుకొంటాం మానవులం.
16
[07/04, 8:40 pm] Lalita Sister: కవితా గానం సీజన్ (2)
అంశం...సానుభూతి 
శీర్షిక.....సహానుభూతి

కష్టాల ఉప్పెన అతలాకుతలం చేసినప్పుడు 
ఓ సానుభూతి అల  అలా అలా  వచ్చి  తాకినప్పుడు
మనసు సంతోషాల తీరం చేరదా....

ఎడతెగని పనులతో విశ్రాంతి
ఎరుగని ఆ దేహానికి 
ఎదురు చూడని అమృత
పలుకుల సానుభూతి దొరికితే
తనువు స్వాంతన పూ దోటలో తేలియాడదా....

ఆత్మీయుల మధ్య 
అనురాగాలు ఆప్యాయతలు
కనిపించీ కనిపించని 
ఎండమావుల్లా ఊరిస్తూ బాధల ఊబీలోకి కూరుకు పోతుంటే 
ఆ బంధాలకు ప్రేమ అనే
సానుభూతి పల్లవించి పల్లకీ ఎక్కించదా....

సానుభూతి  
అన్ని సందర్భాలకు వర్తించని
సహానుభూతి....!!

మొహమ్మద్. అఫ్సర వలీషా
17

[07/04, 8:47 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్ 2)    7/4/2022/ గురువారము
అంశము: - ' సానుభూతి '
                 1
సీ ! స్వార్థమెరుగకుండ  సానుభూతిని చూపు
చేయూతనందించి  చెప్పకెపుడు

సానుభూతినిచూప  సాధుతత్వమనగ
అంకితభావాన  నాచరించు

సానుభూతినిచూపి  సలిపినసేవయే  
ప్రేమనుకురుపించి  పెంపుచేయు

మానవతగలిగి  మనుజులు మెలగిన
సానుభూతియొకటి  సహకరించు

ఆ ! సానుభూతిదెలిపి  చక్కనిపలుకులు
కలతలున్నకూడ  కరగిపోవు
బడుగువర్గమునకు  బాసటనిలబడి
సాయమింతచేయ  సానుభూతి !
                     2
సీ !  ఓషదమనగాను నోదార్పు మాటలు
సానుభూతినిదెల్పు  చల్లగాను

సానుకూలముగను  సానుభూతినిచూపి
సాయముజేసిన  సంతసించు

సానుభూతిగనీవు  సంఘసేవలుచేయ
సంఘానికి నిమేలు  చక్కగాను

ఆత్మవిశ్వాసము అణగారకుండగ
సాయపడునదియె  సానుభూతి

ఆ !  మనసునందురేగు  మరియెట్టి బాధయు
సానుకూలపరచ  సానుభూతి
భూతదయయుగలిగి  భువిని మెలిగినంత
సహజమనగదెల్పు  సానుభూతి !
      తరణికంటి సూర్యలక్ష్మి.
                    ----------
18.
సానుభూతి!

ఎవరికి కావాలోయ్ నీ సానుభూతి!?
నాలో చేవ చచ్చిపోలేదు 
బ్రతకాలనే కాంక్ష చచ్చిపోలేదు 
నీ శుష్క ప్రియాలు  శూన్య హస్తాలు!
నేను కష్టాల్లో కొట్టుమిట్టాడు తుంటే 
నీ కంటి తుడుపు మాటలు నాకక్కర లేదు!
ధుఖితుడనై రోదిస్తూ వుంటే 
ఎడారి ముళ్ళ పొదల్లో బావురుమంటుంటే 
నా సహాయం తీసుకున్న స్నేహితులు బందువులు దూరంగా,,,,,,,,
చోద్యం చూస్తూ వెకిలి నవ్వులతో,,,,,,,
లేని పోనీ దుష్ప్రచారాలతో ఇంకా ఇంకా  గాయం చేసింది చాలక 
రెండు నాలుకల తీపి తీపి సానుభూతి ప్రవచనాలు,,,,,,,
నాకు నేనే తన్నుకుని గుద్దుకుని కష్టకాలం నుండి బయటపడ్డా,,,,,,,!
నా అనేవాళ్ళు అంతా కాష్టకాలంలో మటు మాయం,,,,,,,,!
నీకై నీవే లోకాన్ని గెలవాలి 
కడుమోసం సానుభూతన్నది,,,,,,,
మిత్రమా నీ దారిలో ఉన్న ముళ్ళు నీకై నీవే ఏరుకుని 
నవజీవన యాత్ర సాగించు,,,,  ,
ఈ లోకం పలు కాకుల మూకలు పట్టించుకోకు 
నీపై బాకులు విసరకుంటే సరి,,,,,సానుభూతి సిగ్గు సిగ్గు!!

అపరాజిత్ 
సూర్యాపేట
19.

శీర్షిక :అప్డేట్ అవండి 

ఇంకా అక్కడే ఉన్నారా

ప్రపంచమంతా టైమ్ మిషన్ లో పరుగులు తీస్తుంటే.....
మీరేంటి....
ఇంకా అక్కడే ఉన్నారా...

ఎక్కడి పరామర్శలు...
ఎక్కడి మందలింపులు...
ఏ కాలం లో ఉన్నారండీ..

అసలు 
టైమ్ ఎక్కడండి..

ఒక రోజు సంతాపం
ఒక సెల్ఫీ
ఒక్కరోజు జ్ఞాపకం...

సంద్రమంత సానుభూతి
సమయాభావంతో...
చినుకులై చిలకరిస్తూ..
అప్డేట్ అయినా..

మీరింకా అక్కడే ఉంటే ఎలా..

 అందరి జీవితాలలో 
యాంత్రికత మంత్రమేసి...

బిజీ అన్న పదం ఈజీ గా
తగిలించుకుని
 కృత్రిమత్వంలో కూరుకు పోయిన 

 హైటెక్ యుగమండీ.....ఇదీ..


 నేను అన్న నెట్ వర్క్ పరిధిలోకి రండి...
అప్డేట్ అవండి.....

********శివునూరి లలితా కృష్ణ
19.
అంశం:-- సానుభూతి
గజల్
రచన:-- సింహాద్రి వాణి
ఊరు:--విజయవవాడ
చరవాణి:--7569820872

కష్టంలో ధైర్యాన్నీ‌ నింపాలీ సానుభూతి
ఆత్మీయత పరిమళాల నొంపాలీ సానుభూతి

హృదయం స్పందించేందుకు ధనమేమీ ఖర్చుకాదు
అలవికాని వేదననూ బాపాలీ సానుభూతి

దెబ్బమీద దెబ్బగొట్టి మనిషినింక చంపవద్దు
బాధబాపి పూలబాట వెయ్యాలీ సానుభూతి

చెమటతుడిచి సేదదీర్చు హస్తమెపుడు గొప్పదిగా
చెదిరిన మనసును మనిషికి చేర్చాలీ సానుభూతి

చీకటింట చిరుదీపం వెలుగునింపు జగతిలోన
బ్రతికేందుకు క్రొత్తఆశ తేవాలీ సానుభూతి

ప్రేమ జాలి దయాచెలిమి సమభావం జాతివేలె
వేసవిలో వసంతాన్ని పంపాలీ సానుభూతి

మానవతాధర్మాలూ మేలు గూర్చు సింహాద్రీ
మనిషి నుండి మనిషికెపుడు సాగాలీ సానుభూతి

20.
కవితా గానం
డా బల్లూరి ఉమాదేవి
అంశము: సానుభూతి
శీర్షిక: సాంత్వన

అతలాకుతలమైన మనసుకు 
సాంత్వన చేకూర్చే అమృత భాండం
అంతులేని ఆవేదనతో
ఆత్మీయుల విరహంతో
 అలమటించే బాధితులకు 
కొత్త ఊపిరి పోసే సంజీవిని ఓదార్పు
పంచుకుంటే తగ్గుతుంది అంటూ 
చెంతచేరి పలికే తీయని పలుకులే 
అందిస్తాయి వెయ్యేనుగుల బలం 
కష్టాలను పంచుకో లేకపోయినా 
కన్నీటిని తుడిచి నేనున్నానని 
 భరోసా నందిస్తే కలిగే తృప్తి 
అనిర్వచనీయం కాదా 
ఆపదలో నున్న మనిషికి సాటి మనిషి 
చూపే మానవత్వమీ సానుభూతి
 కాలిన గాయాలకు పూసే మందు లాగ
క్రుంగిన మనసుకు ఓదార్పు నిస్తూ
 బ్రతుకు పై ఆశలు పెంచేదీ సాంత్వనమే మాటల్లో కాక చేతల్లో చూపగలిగితే
 కలకాలం గుండెల్లో నిలిచిపోయే అనుభూతి.

21.

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...