నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
**************************
[26/11, 12:10 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️
కవితాగానం
26.11.2021
నేడు
భారత రాజ్యాంగ దినోత్సవం
ఈరోజునే
జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము
ఈ సందర్భాన్ని
పురస్కరించుకొని...
ప్రత్యేక కవితలకు ఆహ్వానం పలుకుతున్నది
మన కవితాగానం
ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో
స్పందించగలరు.
ఆ సమయంలో ఎలాంటి
ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.
❇️❇️❇️❇️❇️❇️
కవి వరుల జాబితా
1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
2.కోరాడ గారు
3.కవిత వెంకటేశ్వర్లు గారు
4.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
5.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
6.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
7.సునంద వురిమళ్ళ గారు
8.వనపర్తి గంగాధర్ గారు
9.అపరాజిత్ గారు
*******************
1
[26/11, 8:02 pm] +91 6281 697 982: అంశం... రాజ్యాంగ... న్యాయ దినోత్సవం
**********************************
నవంబర్ ...26
*************
పుట్టిన పాపాయికి నామకరణం చేశారు
అరవై ఐదు సంవత్సరాల తరువాత.....
ఎందుకో ఎవరికి అనిపించ లేదు
అంతకు ముందున్న తరానికి
అటువంటి ఆలోచనలు సైతం రాలేదు
కానీ
అవసరాలకు మించిన సవరణలు దిద్దుబాట్లు
అయితే చేసుకుని పబ్బం గడుపు కున్నారు
తమకనుగుణంగా మారీచుల్లా వేషం మార్చి
దారి తప్పించి నడ్డి కూడా విరిచేశారు.
అప్పుడప్పుడు అనుకోని విధంగా హఠాత్తుగా
చరిత్ర పుటల్లో కొన్ని చోటుచేసుకుంటాయి
అద్భుతమైన ఆవిష్కరణ కార్యక్రమాలు
మహానేతలు యుగ పురుషుల ఆవిర్భావం.
రాజ్యాంగం పుట్టినరోజె న్యాయం నిలదొక్కుకుని
గడ్డపారగా నిటారుగా నిలబడింది నిష్పక్షపాతై.
గుండెల్లో గునపం గూండా గిరి లోన
అక్రమార్కుల ఆగడాల నరికట్టె ఆగ్నేయాస్త్రం
ప్రాధమిక హక్కులు కాపాడే రాజ్యాంగం
న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టే న్యాయ వ్యవస్థ
బండికి రెండు రొదలు( చక్రాలు) ఈ సమాజానికి
దేశం శాంతిగా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే
మన రాజ్యాంగ ఔన్నత్యం...అది మన ఆత్మ గౌరవం
స్వీయ రచన... కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
26112021
2.
కవితాగానం :- అంశం :-
@ రాజ్యాంగ దినోత్సవం @
కోరాడ నరసింహా రావు.. !
*సంక్షేమ రాజ్య స్థాపనేధ్యేయం
*******************
శతాబ్దాల పోరాటం తో....
స్వాతంత్య్రం సాధించాం !
సర్వజనామోద పాలన కోసం...
సంక్షేమరాజ్యస్థాపనేధ్యేయంగా
పరిపాలనావిధానాలనుపొందు పరుస్తూ,రాజ్యాంగాన్నిరూపొం దించటమే లక్ష్యం.... !
ప్రపంచ దేశాల రాజ్యాంగాలను పరిశోధించి.... అనుకూల విధానాలను స్వీకరించి,క్రమ
పద్దతిలోక్రోడీకరించిన..సమగ్ర
సుస్థిర పాలనావిధాన శాసన గ్రంథ రాజమిది.... !
మేధావుల మేధో మధనంతో
ఉద్భవించిన పాలనవికాస విధానామృతమిది... !
రచించిన అంబేద్కరునితో సహా
శ్రమించిన ప్రతిఒక్కరికీ....
అభినందన చందనసుమగంధా భి వందనములు.... సరే... !
అమలులో అవకతవకలో... !!
అవకాశవాదుల ఆగడాలో...!!!
ఉదాత్తమైన రాజ్యాంగాన్ని
రూపొందించుకుంటే సరిపోతుం
దా... సక్రమంగా అమలు జరగాలిగా.... !
అప్పుడేకదా... వాళ్ళు పడిన శ్రమకు ఫలితం దక్కినట్టు !
మనది ఓ గొప్ప రాజ్యాంగమే...
అన్నదాతలఆత్మహత్యలు...
ఆడపడుచుల మానభంగాలు
పేద, ధనికతేడాలు....హత్యలు
దోపిడీలు ! అసమానతలు,
మతకలహాలు.... ఆందోళనలు అల్లకల్లోలాలు... అన్నీ పెరిగి పోయాయే గానీ... పోయాయా
కనీసం తగ్గాయా !?
చదువు - సంస్కారం లేనివారి సంగతి... సరే... మేధావులైనా రాజ్యాంగాన్నిగౌరవించాలిగా?!
లేనప్పుడు రాజ్యాంగమెంత గొప్పదైతేమాత్రం ఏం ప్రయోజనం... !రాజ్యాంగాన్ని
అపహాస్యం పాలు జెయ్యటం
తప్ప.... !
*****************
..... కోరాడ.
3.
కవితా గానం సీజన్
భారత రాజ్యాంగ దినోత్సవం
మరియు
జాతీయ న్యాయ దినోత్సవం
సందర్భంగా::
తేదీ::26.11.21..శుక్రవారం
శీర్షిక::రాజ్యాంగం
డాక్టరు బి.ఆర్.అంబేద్కర్
జ్ఞాన మథన0 మదించగా
వచ్చిన అమృత రసమే రాజ్యాంగం
అది వివక్ష లేకుండా అందరికీ
పంచినది
రాజు పేద అనే తేడా లేకుండ
అందించింది
సమాన హక్కులను కల్పించింది
అధికారం ఇచ్చింది
ఓటు హక్కు నిచ్చింది
మంచి నాయకుల ఎన్నుకోమన్నది
ప్రజలే పాలకులన్నది
ప్రజల కోసమే రాజ్యమన్నది
ప్రజాక్షేమమే చూడమన్నది
ప్రజా సంక్షేమమే కోరమన్నది
అంగములు లేనిదే మనిషి కాలేడు
అంగము లాంటి అంశాలు లేనిదే రాజ్యాంగము కాలేదు
రాజ్యాంగము నడిపించు సువిశాల భారతదేశాన్ని
భిన్నత్వంలోని ఏకత్వాన్ని
ఏకత్వములోని భిన్నత్వాన్ని!!
న్యాయ దినోత్సవం
-------------------------
న్యాయం అన్యాయం కారాదు
అన్యాయానికి అధికారమివ్వరాదు
అన్యాయము రాజ్యమేలరాదు
నేతలు అన్యాయానికి తలోగ్గరాదు
అన్యాయాన్ని అందలమెక్కించ రాదు
న్యాయదేవతకు కళ్లుగప్పిన
న్యాయం ఓడిపోరాదు
న్యాయవాదులు ధనానికి ఆశ
పడి న్యాయాన్ని చంపరాదు
న్యాయమూర్తులు న్యాయానికి
అండగా నిలబడాలి
సాక్ష్యాల నిజనిజాలు కూలం
కుశంగా పరీశీలించాలి
లాయర్ల గుణగణాలను పరికించాలి
న్యాయానికి న్యాయం చేయాలి
ధర్మాన్ని ధర్మంగా నిలపాలి
అప్పుడే న్యాయం తలెత్తుక తిరుగుతుంది
జనానికి కోర్టులపై నమ్మకం కుదురుతుంది!!
కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు. 8309920625
పై కవిత నా స్వీయ రచన అని
హామీ
4.
కవితాగానం(సీజన్2)
తేది26112021,శుక్రవారం
అంశం:భారతరాజ్యంగదినోత్సవం మరియు
జాతీయన్యాయదినోత్సవం .
శీర్షిక:జాతీయజీవనవాహనం.
ద్విశతాబ్ధాలపోరాటఫలితం స్వాతంత్ర్యభారతం
స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఒక్కటే చాలవుగదా
మనకంటూ ఒక వివధానాలు కావాలిగ
పరిపాలనానియమాలంటు వుండాలిగా
చట్టం శాసనాలు పొందుపరచుకొవాలిగా
ఎందరో మహనుభావులమేధోమధనం
దానిఫలితమే రాజ్యాంగ ధస్త్రం
డా.అంబేద్కర్ అవిశ్రాంతశ్రమఫలితం
అందించారు మనకంటూ రాజ్యంగం
రాజ్యాంగ మంటే కేవలంన్యాయదస్త్రంకాదు
భారతజాతీయజీవనవాహనం
అదొక యుగాత్మగా భావించాల్సిందే
సర్వమానవసమానత్వం
సమైక్యాతావాదం
సర్వమతసహనం
కులమతబేధాలవిస్మరణం
సకలజనసంక్షేమం
సకలసౌకర్యాలసాధనం
భారతజన అకాంక్షల ఆశయాల దర్పణం
వసుధైకకుటుంబమేధ్యేయానికి సోపానం
నవంబరు ఇరవదిఆరవతేది పందొమ్మిదివందలయాభై
అమలుకు ఆమోదం లభించినదినం
చిరస్మరణీయం నిరంతరం
నిత్యసత్యం నిత్యాచరణీయం!
ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995.
5
కవితా గానం(సీసన్2)
సందర్భం;
నవంబరు, 26...భారత రాజ్యాంగం ఆవిర్భావ దినోత్సవం
శీర్షిక;
"" సకల జనుల సంక్షేమ వారధి ""
అమరవీరుల ప్రాణత్యాగఫలంతో
మువ్వన్నెల జెండా రెపరెపలాడింది
భారతీయుల స్వేచ్ఛఆకాంక్ష నెరవేరింది
ప్రజా ప్రభుత్వమేర్పడింది!
ప్రజల కొరకు , ప్రజలచే, ప్రజలే ప్రభువుల్లా ఏర్పడేలా
రాజ్యాంగ ప్రణాళికా రచన చేయాల్సిన తరుణంలో
రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్ గా డా. బి. ఆర్. అంబేడ్కర్ గారూ
కానిస్ట్యూషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ డా. రాజేంద్రప్రసాద్ గార్ల సంయుక్త పర్యవేక్షణలో
నవంబర్ 26 న రచించబడిన రాజ్యాంగం
ప్రజాస్వామ్య దేశానికి దిశా...నిర్దేశం.చేసింది!
వెనుకబడిన బలహీన వర్గ జనులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించబడి
సమ సమాజ స్థాపనే లక్ష్యంగా
సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా
ప్రపంచ దేశాల్లోనే ప్రముఖమైన రాజ్యాంగంగా
ఆవిర్భవించిన మహోన్నత శుభదినం
నేటి భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం!
...........................................
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు....జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
చరవాని సంఖ్య: 7416638823
...........................................
పై వచనకవిత.నా స్వీయారచన అని హామీఇస్తున్నాను.
6.
[26/11, 9:16 pm] Thathapudi Somashekara Sharma: కవితా గానం
అంశం.. భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం
శీర్షిక..వారి కృషి..మనందరి అదృష్టఆశయం
భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం
మనము అనందించవలసిన శుభదినం
డాక్టర్అంబేద్కర్ని కొనియాడాలి మనం
వారి అపారమేధాసంపత్తియే మనవరం
ఎన్నో సంవత్సరాలు శ్రమపడ్డారు
ఎన్నో ప్రయాసలు కష్టాల కోర్చారు
ఎందరో పోరాటంలో సమిధలయారు
ఎందరో మహానుభావులు జైలుకెళ్లారు
వీరుల త్యాగఫలంతో సాధించాము
నాయకులకష్టంతో స్వాతంత్ర్యo సాధించాం
అమరవీరులెందరో అసువులు బాసారు
మనసుఖమేవారి సుఖమనుకునిపోరాడారు
అందరికీశతసహస్రవందనాలు సమర్పిద్దాం
ఆగష్టుపదిహేనవతేదీన వచ్చినస్వాతంత్య్రం
నవంబరు ఇరువదిఆరవతేదివరకు
రచిoపబడలేదు
వెనుకబడినవారికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి
ప్రపంచదేశాలన్నిటిలో ప్రముఖరాజ్యాంగంగా రూపొందించబడింది
డాక్టర్ అంబేత్కర్ చలువవల్లనే ఏర్పడింది రాజ్యాంగం
అదే ఈనాటి మన భారత రాజ్యంగఆవిర్భావ దినోత్సవం
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328069336
హామీపత్రం
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
7
[26/11, 9:16 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:26-11-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం:*భారత రాజ్యాంగ దినోత్సవం మరియు జాతీయ న్యాయ దినోత్సవం*
******************
ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగంగా
ప్రశంసలు అందుకున్న మన భారత రాజ్యాంగం
ఎందరో మహనీయుల మేథో మదన రూపం..
బానిస బంధనముల నుంచి విముక్తి పొందిన
భారతీయుల ఆకాంక్షలకు
నిలువెత్తు నిదర్శనం ఈ భారత రాజ్యాంగం..
డాక్టర్ బి ఆర్ అంబేద్కరుని సారధ్యంలో పాలనా విధానం కోసం రూపొందించబడిన సర్వోత్కృష్ట చట్టం...
మూడు సంవత్సరాల సుదీర్ఘ అధ్యయనం
దేశాన్ని ఒకే తాటిపై నడిపించిన రాజ్యాంగం
పుట్టిన రోజే భారత రాజ్యాంగ దినోత్సవం.. హామీఇస్తున్నాను.
8.
[26*కవితా గానం (సీజన్ 2)*
*****************************
*శీర్షిక: సమ సమాజం ఎక్కడ..*
72 ఏళ్లుగా ఏం మారింది
పేదవారి జీవన వైవిధ్య చిత్రం
ఎక్కడొచ్చింది సమానత్వ భావము
కాలే కడుపులకు అందనే లేదు ఆహారము
భారతదేశం రాజ్యాంగం ఓ అద్భుత సృష్టి
హక్కులు,విధులు,ఆదేశ సూత్రాలు
సమాజగతిని మార్చలేక పోయాయి
నావ సమాజ నిర్మాణానికి పునాదులు వేయలేక పోయాయి
రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న
ప్రజారాజ్యము సాకారం కాలేదు
సమానత్వ,సౌబ్రాతృత్వ సమాజ నిర్మాణం కాలేదు
అసమానతల మంటలు ఆరనేలేదు
పేదల బతుకుకు రక్షణ ఛత్రమై
ప్రగతిశీల భావాల చారిత్రక పత్రమై
సంవిధాన శాసనం నిలుస్తుందనుకున్నాం నిర్మలమై
కానీ,నేడు ప్రజాస్వామ్యం నిలిచింది అగమ్య గోచరమై
అంబేడ్కర్ ఆశయాలు,గాంధీజీ కలలు
కానరాక నిలువెత్తు దోపిడీ రాజ్యమైంది
ఎప్పుడొస్తాయో సమాజంలో వెలుగుల వెన్నెలలు
ప్రతి వధనంలో చిరునవ్వుల సుమాలు
*పేరు:వనపర్తి గంగాధర్*
ఊరు:హన్మకొండ
హామిపత్రం:ఈ కవిత నా స్వీయ రచన దినోత్సవం..
9.
*న్యాయమా! రాజ్యాంగమా!
న్యాయమా!రాజ్యాంగమా!
మీ చిరునామా ఎక్కడ!?!
మతాల,కులాల మత్తులో మూల్గుతున్నాయి
జనంతో పార్టీల ఝండాలను మోయించి
విచ్చలవిడిగా డబ్బు,మందు మత్తులో ముంచి
అందల మెక్కినాక ఆమడ దూరంలో జనం!
కూలీవాడు కూలీగనే బ్రతుకు చాలిస్తున్నాడు
పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్లకే ఉద్యోగాల్లేవ్
గత పదేళ్ళ నుంచి యువత ఉద్యోగ ప్రకటనల కోసం
ఎదురు చూసీ చూసీ గుండెలు పగిలి రోదిస్తున్నారు!
పాఠశాలల్లో చదివే పిల్లలు ఎందుకీ చదువులని
దిక్కులేక మధ్యలోనే చదువులు మాని వేస్తుంటే,,,,,,,!
రాష్ట్ర ఖజానాను విచ్చలవిడిగా వాడుకుంటూ
ఇష్టారాజ్యంగా డబ్బులు పంచుతూ
ప్రజలను సోమరులను చేస్తున్న ప్రభుత్వాలు!
నిరుపేదలు,నిర్భాగ్యులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు
రాజ్యాంగం ఉద్దేశం తారుమారు చేసి
విద్య అనే ప్రాధమిక హక్కు కూడా అందని ద్రాక్షయింది!
ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కి దిగడమే న్యాయం
ప్రగతి కోరల్లో లక్షల కోట్ల అప్పులు ప్రభుత్వాలు మనడానికి
విగత జీవులైన కర్షకులు,కార్మికులు !
రాజ్యాంగాన్ని నిఖార్సుగా అమలు చేయక పోతే
మీ మేడలు,మిద్దెలు కూలగొట్టి తరిమి తరిమి కొడతాం
న్యాయం అందరికి తెలిసి రావాలి కొందరికి కాదు!
అపరాజిత్
సూర్యాపేట
Comments
Post a Comment