నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
****************
అంశం:దీపారాధన
********************
కవి వరుల జాబితా
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
****************
సమీక్ష లు
డా.తంగిరాల నాగలక్ష్మి గారూ.
దీపానికి మీ కవితలో పెద్దపీట వేశారు
దీపానికి ఉన్న బహుళ ప్రయోజనాలను సహస్ర ముఖాలుగా
షోడషకళా వర్ష ప్రాయ దేవతా దీపం
మనలో వెలిగెది ప్రాణ దీపం
ఇలా
దీపాన్ని ఎన్నెన్ని రకాలుగా వర్ఢించాలో అన్నన్ని విధాలుగా
గణాంకాలతో సహా వర్ణించారు
💐
కవిత వెంకటేశ్వర్లు గారూ
స్కాంద పురాణాంతర్గతమైన
కార్తీకమాసంపేరు కృత్తికా నక్షత్రం వల్ల ఏర్పడిన వృత్తాంతాన్ని కార్తీకమాసం అగ్ని నక్షత్రం గారు పిలువబడే
ఉదంతాన్ని సోదాహరణంగా
కవిత్వీకరించారు
💐
దేవికారాణి రత్నాకర్ గారూ
విశ్వమంతా వ్యాపించి న అనంత చైతన్య మే ఈ దీపిక అంటూ .్
ప్రపంచాన అలముకున్న పాపపు దౌష్ట్యపు కాఠిన్యపు
చీకట్లు పోగొట్టే చైతన్య దీపికా అంటూ
సంకేతాత్మకంగా ఉంది
మీకవిత
💐
ఏడెల్లి రాములు గారూ
సూర్యదేవుడే అగ్నిహోత్రుడు ....
వాయుదేవుడే ఆశీస్సులు అందించగా అంటూ
గుడులూ కోవెలలూ దీపోత్సవంగా ప్రజ్జ్వరిల్లిన వైనం,
ముత్తైదువుల సంరంభం
కళ్ళెదురుగా కనబడుతోంది
మీ కవితలో
💐
దోసపాటి వేంకట రామచంద్రారావు గారు
దీపారాధన ప్రయోజనాలతో ఒక నిఘంటువు నే మీరు కవితాత్మకంగా రచించారు
పౌరాణిక ఆధునిక స్తితి గతులను సమన్వయం చేస్తూ
ఆధ్యాత్మిక తకు పుణ్యం పురుషార్థం రెంటినీ
పొందుపర్చారు
💐
ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారూ .
కార్తీకమాసం లో వివిధ తిథులలో ఆయా ప్రత్యేక దినాల్లో చేయు పండుగల గూర్చి విపులంగా కూలంకషంగా కవితాత్మకంగా
సాగిన రచన మీది
💐
ఈచ్ఛ్వాస నిశ్శ్వాసాను నియంత్రిస్తూ నిష్టగా చేసిన
......అహము ఇహమూ వదిలి కోవెలలో ...
ఇలా కవితలో తాదాత్మ్యం చెందారు
కేశరాజు వేంకట ప్రభాకర రావు గారూ
💐
జోషి పద్మావతి గారూ.
మీకవిత పౌరాణిక పరిమళాలను వెదజల్లే
హైందవ ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే విధంగా సముచితమైన పద ప్రయోగం తో
నూతన పదబంధాలతో
సొంపైన కవిత
💐
నాగమోహన్ ఎలిశాల గారూ
ఆధ్యాత్మికత ఆధునికత రెంటినీ సమన్వయం చేస్తూ వ్రాసిన మీ కవిత
వినూత్నమైన భావ కవితా పోకడలను అభ్యుదయ కవితా లక్షణాలను సమపాళ్లలో చూపిస్తుంది
💐
పివి దుర్గాప్రసాద్ గారూ
ఆద్యంతం మీ కవిత దీపారాధన ప్రాముఖ్యత ను విభిన్న కోణాల్లో
వర్ణిస్తూ దీపారాధన కు చిన్నపాటి నిర్వచనం ఇచ్చినట్లు కవితనల్లారు
💐
పరబ్రహ్మకు ప్రతిబింబంగా పరిఢవల్లిన దీపారాధన ప్రాముఖ్యాన్ని
బొప్పెన వేంకటేశ్ గారూ.
చిరు దీపాన్ని శ్రీ కరంగా మలచినా
లక్ష దీపోత్సవంగా విరాజిల్లుతున్న ది అనే ఉదాత్తమైన భావవ్యక్తీకరణ మీకవితలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది
💐
సోదరి సింహాద్రి వాణిగారూ.
దీపారాధన చేయును విఘ్న నాశనం
కలిగించును భక్తునికి భగవంతుని కి అను సంధానం
అంటూ దీపారాధన వైశిష్ట్యాన్ని అరటిపండు ఒలిచినట్లుగా తేటతెల్లం చేశారు
💐
ఆళ్ళ నాగేశ్వరరావు గారూ
హృదయమనే ప్రమిదలో భక్తి యనే తైలం పోసిన మీ కవిత
ప్రగతికి మార్గమైన చైతన్య శీలమైనది
దీపాన్ని ,ప్రగతిశీలతత్త్వ మును
రమ్యంగా జతగూర్చారు
ఆధ్యాత్మిక తలో ప్రగతిశీలాన్ని
చక్కగా చొప్పించారు
💐
తాతపూడి
సోమశఖర శర్మ గారూ.
కార్తీక మాసంలోని ఉపవాసాది దీక్షలు, ఉషిరిక చెట్టు ప్రదక్షిణలు వనభోజనాది వివిధ ధార్మిక విషయాలను
సోదాహరణంగా మీ కవితలో వర్ణించారు
💐
గంగాపురం శ్రీ నివాస్ గారూ
మహిళను ఆలంబనగా చేసి
స్త్రీమూర్తి
దివ్వెలను వెలిగిస్తే
కలిగే ఫలితాలను
భావాత్మక పద్ధతిలో వ్రాశారు.
💐
మద్ది పుల్లారావు గారూ.
దీపారాధనకు
ఐహిక పారమార్థిక ప్రయోజనం
అలతి అలతి పదాలలో
చిరు దీపాలను వెలిగించినట్లుగా
అక్షర దీపాలను వాహనాలు వెలిగించారు
💐
దారల విజయకుమారి గారూ
సాంత్వన నదులేవో ప్రవహించనీ....
ఉసిరి చెట్టు నీడలో
కాలే కడుపుల మంట చల్లారనీ .....
ఆకాశపు లోగిలి..
సామరస్య పు కోటి కాంతులు
పరచుకోనీ ....
భావకవిత్వానికి చక్కటి ప్రతీక
అభ్యుదయ కవిత్వానికి సంకేతం
ఆధ్యాత్మికతకు నిలువుటద్దం
మీ కవిత.
💐
డా.భమిడిమర్రి కమలాదేవి గారూ.
పాంచభౌతిక విశ్వంలో గ్రహగతులను దీపజ్జ్వలన ప్రక్రియలో సంకేతాత్మకంగా
సశాస్త్రీయంగా
లాక్షణికంగా ఆలంకారికంగా
సాగిన మీ రచన
నిక్కంగా మీరన్నట్లే అఘనాశకం
మీ కవితను చదివి
పారవశ్యం కలిగింది
💐
అపరాజిత్ గారూ.
బాధాతప్త హృదయాల విషాదాలను మటుమాయం చేసే దీపాల దొంతరలను
ఒక్క దీపంతో
శతకోటి దీపాలను వెలిగించి
కాంతులీను కవితను వెలయించారు
💐
తరణికంటి సిఫార్సు సూర్య లక్ష్మీ గారు
కోటిజన్మ ఫలాలు గోపుర దీపాలు.
ఉసిరికాయ కాయ మీద బెట్టు దీపాలు
సిరులనిచ్చు చింతలేక
మాసమంత బెట్టు మంగళ దీపాలు
సుపరిచితమైన పదాలతో
ఊహాతీతమైన అంతరాంతరాలలోని తమస్సు ఛేదింఛే కాంతి పుంజాల్లాంటి
కవితా సుమాన్ని వికసింప జేశారు
💐
పిన్నక నాగేశ్వరరావు గారూ
సంప్రదాయాలను ప్రయోగాత్మక కవితాశైలి తో వాస్తవిక దృక్కోణం లో దీపారాధన ప్రాధాన్యత ను జ్వలింపజేశారు.
💐
బి.నాగేశ్వరరావు గారూ.దీపారాధన ప్రాముఖ్యత మనో విశ్లేషణాత్మకంగా సాంస్కృతిక పరంగా
పరిపుష్టం గా ఉంది.
💐
మహమ్మద్ అప్సర్ వలీషాగారూ.
దీపారాధన ను ప్రాపంచిక ప్రయోజనాల తో కవిత్వీకరించారు
పదార్థాలను యథాతథంగా ఉటంకిస్తూ వ్రాసిన కవిత శుభదాయకం.
💐
ముద్దు వెంకట లక్ష్మీ గారూ.పుటం పెట్టిన బంగారం లా
పశ్చాత్తప్త హృదయాలు ప్రమిదలై అంటూ వినూత్నమైన పదబంధాలతో అలరించిన కవిత మీది
💐
వేదాంతం సురేష్ బాబు గారు
దీపశిఖలను సహస్ర ముఖాలుగా ఆద్యంతం ప్రకాశమానంగా వర్ణించారు
సంక్షిప్త త మీ కవితలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది
💐
తిప్పావఝ్ఝుల నరసింహ మూర్తి గారూ
దీపారాధనకు మానవ జీవితంలో అవిభాజ్యమైన హైందవ సంస్కృతి తో విడదీయరాని సంబంధం ఉందన్న విషయాన్ని
నిదర్శనాలతో
రమ్యంగా వర్ణించారు మీ కవితలో
💐
సయ్యద్ జహీర్ అహమ్మద్ గారూ.
మన సంస్కృతి లో అంతర్లీనంగా ఉన్న ఆచార వ్యవహారాలను ఉటంకిస్తూ
అందులో దీపారాధన కు ఉన్న ప్రత్యేకతను మీదైన శైలిలో
వర్ణించారు
💐
కవితాగానం
నానృషిః కురుతే కావ్యం అన్నట్లు కవిత్వానికి రసనిర్దేశం
కవితావేశం వెల్లువెత్తునట్లు
కవులను యథాశక్తిగా ప్రోత్సహిస్తూ వారిలో అంతర్నిగూఢంగా దాగియున్న
కవితా రసనిర్ఝరులను,అంతస్రోతస్సులను పెల్లుబికేలా నిరంతరం నిరంతరాయంగా పరిశ్రమిస్తున్న
కవితాగానం నిర్వాహకులు
వీరాగుడిపల్లి గారు
శివునూరి లలితాకృష్ణ గారు
సదా శతథా సహస్రథా ప్రశంసనీయులు
ప్రోత్సాహకంగా పురస్కారాలు అందజేస్తూ వెన్నుతట్టి సానునయంగా సోల్లాసంగా
సుహృద్భావ వాతావరణం లో
కవితా నిష్యందన అమృత వాహినీ తరగలతో
సమూహాన్ని పరిఫుల్లం చేస్తున్నారు
1.
దోసపాటి వెంకటరామచంద్రరావు
జిల్లా *
శ్రీకాకుళంజిల్లా
ఫోన్ నెంబర్ *
7780594995
కవిత *
కవనజ్యోతి వారి కవితలపోటి
అంశం:దీపారాధన
శీర్షిక:దీపం పరబ్రహ్మస్వరూపం.
దీపం పరబ్రహ్మస్వరూపం
దీపం జ్ఞానప్రదాయిని
దీపం దీపాన్ని ప్రజ్వలింపజేస్తుంది
దీపం చీకటినుండి వెలుగులోనికి ప్రసరిస్తుంది
దీపారాధన జ్ఞానజ్యోతులను వెదజల్లడమే
కార్తీకపౌర్ణమి దీపారాధనకు ప్రసిద్దం
జ్వాలాతోరణము దైవప్రాంగణమునకు ప్రాశస్త్యం
కార్తీకదామోదరునికి దీపోజ్వలం
శివకేశవులకు ప్రీతికరమైనది కార్తీకం
దీపేన సర్వంసాధ్యం ఉషనిషత్వాక్యం
దీపప్రజ్వలనం దివ్యసందేశం
దీపోజ్వలనం దివ్యకార్యం
దీపారాధనం పరమపవిత్రం
దీపారాధనం పరమపుణ్యప్రదం
దీపారాధనం ప్రగతిశీలనం
దీపారాధనం చైతన్యశీలం
దీపారాధనం అనురాగమయం
దీపారాధనం అధ్యాత్మికసాధనం
దీపారాధనం జ్ఞానమార్గం
అద్వీతీయం అఖండం అమరం అజరామరం!
ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995.
[
2.
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
జిల్లా *
విశాఖపట్నం
ఫోన్ నెంబర్ *
9963265762
కవిత *
శీర్షిక:-దీపం జ్యోతి పరబ్రహ్మ
సనాతన సంప్రదాయం నుంచి
భరతావనిలో దీపారాధన చేసి ,గణపతిని పూజించి
ప్రతి క్రతువు ను చేయుట ఆచారం
దీపావళి నాడు దీపాలతో ఇంటిని అలంకరించి
దివ్వెలను చిన్నపిల్లల ద్వారా వెలిగించి బాణసంచా వెలిగించడం అంటే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి జ్ఞానం అనే ప్రకాశానికి స్వాగతం పలకడమే
కార్తీకమాసమున దేముని గుడిలో ఆకాశదీప దర్శనం మోక్ష ప్రదాయం.
క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికోట లో ఉసిరి కొమ్మను ఉంచి పూజించి దీపాలను ప్రజ్వలన చేయుట
అత్యంత పుణ్యదాయకం.
నాగులచవితి నాడు పుట్ట దగ్గర నాగదేవతను పూజించి దీపారాధన అపమృత్యుభయం తొలగిపోతుందన్నది భక్తుల విశ్వాసం.
కార్తీక సోమవారం ఉపవాస దీక్ష చేసి నక్షత్ర దర్శనం
దీపారాధన తో దామోదరుని పూజ సంపత్కారాకం
కార్తీకపౌర్ణమి నాటి జ్వాలాతోరణం ముముక్షత్వానికి సోపానం. ఏకాదశి, పొర్ణమి రోజులలో దీపదానం జన్మరాహిత్యం అని కార్తీక పురాణం చెపుతుంది
కేరళ రాష్ట్రంలో దీపమే పరాశక్తి గా పూజిస్తారు
కావున "దీపం జ్యోతి పరబ్రహ్మ"అన్నది అక్షర సత్యం
3
మద్ది. పుల్లారావు
జిల్లా *
కృష్ణా
ఫోన్ నెంబర్ *
9951287113
కవిత *
దీపారాధన
............
దీపం జ్యోతి స్వరూపం
విద్యా ,జ్ఞానము,ఆయువు,మోక్షములను
ప్రసాదించు దివ్యమైనది దీపారాధన
దీపారాధన పుణ్యప్రదమని వేద ఉవాచ
కార్తీక మాసాన శివ,కేశవ ఆలయాలు
దీపారాధనలతో శోభిల్లుచునుండు
సోమవార,ఏకాదశ,పౌర్ణమి దినములు
ఘన ఫలితమిచ్చు విశేష దినములు
అప్రయత్న దీపారాధన సైతము
అనంత ఫలములిచ్చునట
అష్టైశ్వర్యాలు కలిగించునట
వత్తి ముట్టించిన వైకుంఠ ప్రాప్తి
వత్తిని నలిచిన నాగలోకమనిరి
చమురు వేసిన స్వర్గలోకమేనట
అరటి దొన్నెల్లో,ఉసిరికాయలపై
బియ్యప్పిండితో చేసిన ప్రమిధలు
దీపారాధన కు శ్రేష్టములనిరి బుధులు
కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోర వీక్షణం
అనంత శుభ ఫలితాలకు ఆలవాలం
దీపారాధనలతో సూక్ష్మక్రిముల,కీటక నాశనం జరుగు
శీతలగాలుల నుండి జీవులకు ఉపశమనం కలుగు
దీపారాధన లో అంతర్లీనమైనది విజ్ఞానమే
హైందవ సాంప్రదాయాలన్నీ విజ్ఞాన సంపదలే
ఆధ్యాత్మిక భావనలు అభివృద్ధి కి చిహ్నాలే
సమత,మమతలకు నిలయాలే
.....
4.
కవి/ కవయిత్రి పేరు *
కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
జిల్లా *
ఖమ్మం
ఫోన్ నెంబర్ *
8497924605
కవిత *
పౌర్ణమి నగదు* *పురస్కారాల కవితల పోటీ కోసం.... కార్తీక పౌర్ణమి
*అంశం ః దీపారాధన*
శీర్షిక.....* ఆరాధన*
***********************
ఆలయాలలో దీపారాధన సేవలలో మునిగిన
అనంత జనవాహిని ఉరుకుల పరుగుల సందోహం,
ఉచ్ఛ్వాస నిశ్వాసాల నియంత్రిస్తు నిష్ఠగా చేసిన
అతివల అభివాదాలతో ఆరంగేట్రం చేసిన
నటరాజ నాట్య విన్యాసాల ఆనందహేల
అహము ఇహమును వదిలి కోవెలలో వెలిగించిన దీపాల కోటి కాంతులు
గడప గడపన వెలిగించిన దీపాలు....
వాడ వాడల దీపాల కాంతి తోరణాలు
అజ్ఞాన తిమిరాల అంతమొందించుటకు.... అంకురార్పణ జరిపి *అని* జేయదలిచి ఆరాధనా విధాన పరులై , పరము నెరంగక
పరంధామునిగొలువ
కడు ప్రీతిపాత్రులై కమనీయమైన రాగాల రమణులై ప్రేమానుబంధాలు ప్రోది చేసి
ఆత్మ జ్యోతుల వెలిగించి త్రిలోక చీకటిని
చీల్చి వేసి జ్ఞాన వెలుగులు దించిన వధాన్యులు
మాయోపాయాల మారీచ మంత్రాలు కుచ్చిత కుతంత్రాలు దోపిడి దౌర్జన్యం పీడనాల తాడనం
హింసోన్మాదం అంతమే..... అవిచ్ఛిన్నంగా విచ్చుకున్న వెలుగు పూవుల పుప్పొడి రేణువుల లక్ష్యం
దివ్య దీపాల కాంతిని దివినుండి భువికి దింపి
మానవత్వపు కుసుమాల పరిమళాలను
పంచి పెట్టగ,... విశ్వ సౌభ్రాతృత్వం పరిఢవిల్లిన
నేల... మమతా సమరతలతో సస్యశ్యామలం.
స్వీయ రచన::::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
19112021
5
కవి/ కవయిత్రి పేరు *
ఆళ్ల నాగేశ్వరరావు
జిల్లా *
గుంటూరు
ఫోన్ నెంబర్ *
7416638823
కవిత *
శీర్షిక: "" కార్తీక దీపం ""
ఒక వెలిగే దీపం
ఇస్తుంది మరెన్నో దీపాలకు జన్మను
తొలగిస్తుంది అజ్ఞానపు దోంతెరలను
అందిస్తుంది జ్ఞానపు సుగంధములను !
దీపం చైతన్య స్వరూపం
చైతన్యమే ప్రగతికి మార్గం
సుప్రగతే నేటి ఆవశ్యకం!
హృదయమనే ప్రమీదలో
భక్తి యనే తైలం పోసి
దివ్య జ్యోతిని వెలిగించి
పవిత్ర కార్తీకమాసంలో
ఉసిరి చెట్టునీడలో
శ్రీహరిని స్మరిస్తూ
దీపారాధనతో దైవారాధన గావిస్తే
తొలగును సకల పాపాలు
నెరవేరును కోరిన కోర్కెలు!
కార్యం ఏదైనా
నిశ్చల మనస్సుతో
దీపాలతో ఆరాధిస్తే
ఆ కార్యం అవుతుంది శుభప్రదం
జగత్ కళ్యాణానికి సోపానం!
దీప ప్రజ్వలనం తో
అవుతుంది అంధకారం అదృశ్యం
అవిష్కృతమౌతుంది సుజ్ఞాన లోకం!
6
కవి/ కవయిత్రి పేరు *
తాతపూడి సోమశేఖర శర్మ
జిల్లా *
Pandichery state
ఫోన్ నెంబర్ *
8328079336
కవిత *
కవితా గానం సీజన్ 2
అంశం..కార్తీక దీపారాధన
శీర్షిక..ఆధ్యాత్మిక పరంపర
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336
శశికృత్తికల కలయిక ప్రాత:కాలనదీస్నానం
దీపజ్యోతులకళకళలు ఆధ్యాత్మికపరంపర
ఆరాధనలతో ఆత్మసంతృప్తి పుణ్యఫలప్రదం
భగినీహస్తభోజనం నాగఆరాధనం కార్తీకనర్తనం
ప్రతిరోజుకార్తీకదీపారాధనం మోక్షకటాక్షమార్గం
కార్తీకదీపాలు నదీప్రవాహగమనమానందపుణ్యప్రదం
కార్తీకపౌర్ణమిఉపవాసం మూడువందలఒత్తులతో దీపప్రదర్శనం
ప్రతిఇంటా ప్రతినదిచెంత దీపాలకాంతులసందోహం వెలుగులుమనసోల్లాసఆనందకరంభగవంతునిప్రీతికరం
కార్తీకశోభ శశికాంతులవెన్నెల
హృదయానంద ఆరోగ్యప్రదం
ముత్తయిదువులకు పున్నమిఉపవాసం
పిల్లలచలువకు మార్గం
దీపాలఅలంకరణ కార్తీకచంద్రదర్శనం ముక్తికి సోపానం
ఉసిరిచెట్టుప్రదక్షిణం చెట్టుచుట్టూ దీపారాధనం
వనభోజనభక్తులకిచ్చు ముక్తి మోక్షప్రదాయకం
క్షీరాబ్ది ద్వాదశి దీపాలు ప్రతివత్తికీ కటాక్షమే
కార్తీకమాసమే హరిహర భక్తులసందోహమే
నిత్యం గుడిలోపెట్టే ఆకాశదీపసందర్శనమే
కార్తీకమాసభక్తులకు అఖంఢ పుణ్యప్రదమే
హామీపత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
7.
కవి/ కవయిత్రి పేరు *
గంగాపురం శ్రీనివాస్
జిల్లా *
సిద్దిపేట
ఫోన్ నెంబర్ *
9676305949
కవిత *
కవితా గానం
అంశం: కార్తీక దీపం
*అఖండ జ్యోతి*
°°°°°°°°°°°°°°°°°°
ఆమె తన శరీరాన్ని వత్తిగా చేసి
చమటను చమురుగా పోసి
శ్రమైక్య జ్యోతులు వెలిగించగలదు!
తన పుస్తక మస్తకం తెరిచి
పిల్లల మెదడు దీపికలలో
జ్ఞాన జ్యోతులు పూయించగలదు!
తన కలం బూజు కర్రతో
సమాజ గోడలకు పట్టిన చెదలును చెరిపి,
చైతన్య కాంతులు రగిలించగలదు!
కార్యేషు దాసి, కరణేషు మంత్రేనా,
సమరేషు సైనికయై
అసురుల పడగొట్టగలదు!
కాకరపువ్వొత్తుల్లా వెలుగుల్ని పంచగలదు,
లక్ష్మీబాంబులా గర్జించ గలదు!
చిచ్చుబుడ్డిలా విచ్చుకోగలదు
తారాజువ్వలా దూసుకెళ్లగలదు!
ఆమెకు
అణువంత ఆసరానిస్తే,
అవని నిండా
అఖండ జ్యోతులు వెలిగించగలదు!!
8.
కవి/ కవయిత్రి పేరు *
జోషిపద్మావతి
జిల్లా *
మహబూబ్ నగర్
ఫోన్ నెంబర్ *
9542010502
కవిత *
*హరిహరారాధన*
******************
హర్షదాయకమైన మాసమిది హరిహరులకు
అత్యంత ఫలప్రదాయకమిది దేవతారాధనలకు
కార్తీక మాసాన కమనీయ దేవతారాధన
వెలుగులతో వేలుపులవరమొందు దీపారాధన
దేదీప్యమాన భరిత దేవాలయ ప్రాంగణాలు
దీపప్రజ్వలనలతో ప్రభాసమాన గృహప్రహరీలు
వాపీకూపతటాకములందు కనువిందైన దివ్వెలు
పుణ్యఫలములనొందు పవిత్ర గంగాస్నానాలు
బ్రాహ్మీముహూర్తకాల దేవతారాధనాది నక్షత్రదరిశనాలు
మోక్షప్రదాయకాలు కార్తీకాదిపురాణ శ్రవణాలు
దివ్యజ్ఞాన ప్రదాయకాలు హరిహరసుత కీర్తనలు
దివ్య వరాలనొందు దీప దానాది పుణ్య క్రతువులు
నోచిన నోముకు ఫలమూ,చేసినపూజకు వరము
పూర్వజన్మ కృత పాప భస్మీపటలమగు మహాత్యము
మాసమంతా మహత్వ పూర్ణ భరితము
కార్తీకం నమోశివోహమంటూ చేద్దాం శివారాధనలు
హరినామస్మరణతో ఆచరిద్దాం దామోదరుని సేవలు
లక్ష్మీ కళతో భాసిల్లే కార్తీకమాస లక్ష దీపారాధనలు
ఆధ్యాత్మిక భావనల పరంపరాభరితాలు
ఆస్తిక మహాశయుల హృదయ కుహరాలు
ముక్తి మార్గమునకివి భక్తి సోపానాలు
_____________
9
కవి/ కవయిత్రి పేరు *
నాగమోహన్ యెలిశాల
జిల్లా *
ఖమ్మం
ఫోన్ నెంబర్ *
9949970398
కవిత *
దీపం వెలిగించటమంటే
పాపం తొలిగించుకోవటమే
వెలుగుతున్న దీపం
రగులుతున్న అహాన్ని మాడ్చే
పవిత్ర స్థిర చిత్త పరబ్రహ్మ స్వరూపం
ప్రతికూలతల నిరోధి....ఈ దీపం
చీడపీడల విరోధి....ఈ దీపం
అజ్ఞాన తిమిర సంహారిణి
మూఢత్వ హృదయకుడ్య భగ్గకారిణి
పాప పంకిలాన్ని ప్రక్షాళన చేసే
సర్వమంగళ శుభకారిణి....ఈ దీపం
ముడుచుకున్న హృదయ కమలాన్ని
సునిశిత వికశిత పద్మాన్ని చేసే
ఉదయభాను కిరణం....ఈ దీపం
దీపేన సాధ్యతే సర్వం
అణచివేస్తూ అంతర్గత గర్వం
సుబోధకం చేస్తుంది మనిషిలోని నిగూఢ మార్మికతల మర్మం
ఒత్తి(డి) ని కాల్చి
వెలుగును పంచే ఈ దీపం
నిస్వార్థ త్యాగమయ
జీవితతత్వ సాఫల్యానికి చిహ్నం
ఆత్మ పరమాత్మలో శాశ్వతత్వానికి నిండైన నిదర్శనం
హామీ :
ఈ కవిత నా స్వీయ రచన. దేనికీ అనుకరణగానీ,అనుసరణ గానీ కాదు. ఎక్కడా ప్రచురితం కాలేదు
10
కవి/ కవయిత్రి పేరు *
సయ్యద్ జహీర్ అహ్మద్
జిల్లా *
కర్నూలు
ఫోన్ నెంబర్ *
9505152560
కవిత *
దీపోత్సవం:
దీపావళికి మాత్రం కాదు పరిమితం
ప్రతి నిత్యం వెలిగించు దీపం జ్యోతి
కాంతి కిరణాల ప్రభావం జాగృతి
పన్నెండు నెలల చీకటి తరుమ కార్తీకం
పవిత్రమైన మాసమని ఆధ్యాత్మిక విశ్వాసం
త్రిమూర్తుల సంధ్యా దీపం నమోస్తుభ్యం
వత్తి వెలిగిందా హరించును పాపపంకిలం
కార్తీక పురాణం లలితా సహస్రనామం
పారాయణం చేయమని కోవిదుల ప్రవచనం
గృహ ద్వారం తులసీకోట కోవెలధ్వజస్తంభం
దీపారాధన అనువైన కొలువైన స్థలం
ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తం
దీపం దేదీప్యమానం లక్ష్మీదేవి నిలయం
నీటిపై తేలియాడు దీపాలు నేత్రపర్వము
కనువిందు చేయు వికసిత ఎర్రని పద్మాలు!
నువ్వుల నూనెతో మట్టి కుందుల శ్రేయస్కరం
రాగి ప్రమిదలో ఆవునెయ్యితో సర్వరోగనివారణ
ప్రమిద వత్తి అగ్గిపుల్లతో వెలిగించకు అనర్థం
ఏకహారతి కర్పూరం ప్రయోజనకరం
ఒకే వత్తి శెనగ నూనె స్టీలు కుందు నిరర్ధకం
దీపారాధనతో దరికి రావు దుష్ట శక్తులు
సంతోషం సౌభాగ్యంతో వర్ధిల్లును కలకాలం!!
Comments
Post a Comment