నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*****************
కవి వరుల జాబితా
1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
2.వేదాంతం సురేష్ బాబు గారు
**************
1.
[24/11, 9:13 pm] Aalla Nageshwar Rao Poet: అంశం: అనుభవాలు
శీర్షిక; భావితారానికి.మార్గదర్శకాలు
కాలం గడిచెకొద్దీ
జరిగిన సంఘటనలు
వాటి పర్యవసానా లే అనుభవాలు!
పెద్దల అనుభవాలు
యువకుల ఉజ్వల భవితకు.మార్గదర్శకాలు!
తరాల అంతరాలకు సజీవ నిదర్శనాలు!
పెద్దల ఒక్కో అనుభవం
ఒక్కో సంఘటనల సమాహారం
ఒక్కో.సమస్యకు పరిష్కారం!
వారి అనుభవాలను ప్రోది చేసుకుని
నేటి వాస్తవ ఘటనలతో బేరీజు.వేసుకుని
ఆచరణీయమైన వాటిని ఆచరిస్తూ
సన్మార్గంలో పయనిద్దాం
సుఖశాంతులతో.జీవిద్దాం!
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు....జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
చరవాని. 7416638823
పై కవిత నా స్వీయారచన అని హామీఇస్తున్నాను.
2
[24/11, 9:20 pm] +91 94236 90615: కవితా గానం (సీజన్ 2)
తేదీ:- 23-11-2021
అంశం:- అనుభవాలు
**************************
ఏ పనియైనా సాధ్యం కాదు
అనుకుంటే ఎన్నటికీ పూర్తి కాదు
చిన్న ప్రయత్నం చేసి చూస్తే
ఫలితం అదే వస్తుంది
విజయం కలిగితే ఆనందం
అపజయం ఎదురైతే అనుభవం
నిన్న నేటికి ఒక అనుభవమైతే
నేడు రేపటికి అనుభవం
మార్పు మానవ సహజం
ఎప్పుడు ఎలా మారాలన్నది
అనుభవం చెబుతుంది
మనిషి ప్రవర్తనలో మార్పు
అనుభవ పాఠాలు నేర్చుకున్నప్పుడు వస్తుంది
బాల్యం యవ్వనానికి
యవ్వనం ముదిమికి అనుభవం
ముసలితనం మళ్ళీ బాల్యానికి భరోసా
ఎదురైన ప్రతీ సంఘటన
పాఠాలు నేర్పుతుంది
గుణపాఠాలు నేర్పుతుంది
ప్రతీదీ జ్ఞాపకం కావచ్చు
ప్రతీ జ్ఞాపకం ఒక అనుభవం
కావచ్చు కాకపోవచ్చు
కానీ ప్రతి అనుభవం మాత్రం ఒక జ్ఞాపకమే
అనుభవాన్ని మించిన గురువు
ఆచరణను మించిన దైవం
అమ్మ ప్రేమను మించిన అమృతం
నాన్నను మించిన మార్గదర్శి
లోకంలో లేనేలేరు
🖋️ వేదాంతం సురేశ్ బాబు
చంద్రపూర్
మహారాష్ట్ర
Comments
Post a Comment