నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*********"*******
కవితాగానం సీజన్ 2
బాలల దినోత్సవం సందర్భంగా....
ప్రత్యేక కవితలకు ఆహ్వానం
పలుకుతున్నది
మన కవితాగానం.
ఈ సందర్భంగా వచ్చిన
కవితలతో కవితా సమాహారం
ఉంటుంది.
రాత్రి ఎనిమిది నుండి
తొమ్మిదిన్నర వరకు
కవితలు పంపగలరు.
ఆ సమయంలో ఎలాంటి
ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.
❇️❇️❇️❇️❇️❇️
1.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
2.మేకల రామస్వామి గారు
3.సింహాద్రి వాణి గారు
4.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
5.తరణికంటి సూర్య లక్ష్మి గారు
6.మద్ది పుల్లారావు గారు
7.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
8.కొంపెల్లి రామయ్య గారు
9.డా.బల్లూరి ఉమాదేవి గారు
10.కోరాడ నరసింహా రావు గారు
11.కవిత వెంకటేశ్వర్లు గారు
12.జోషి పద్మావతి గారు
13.వనపర్తి గంగాధర్ గారు
14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
15.వాణి సరోజని లక్కరాజు గారు
16.గొర్రెపాటి శ్రీను గారు
17.రుద్ర మంగతాయారు గారు
18.పిన్నక నాగేశ్వరరావు గారు
19.దారల విజయ కుమారి గారు
20.ఏడెల్లి రాములు గారు
*************
1
[14/11, 8:01 pm] +91 6281 697 982: నెహ్రూ త్యాగ నిరతి...14112021
*****************************
స్వాతంత్ర్య సమరాంగణ సార్వభౌముడు
ఐహిక బంధాల నొదిలి స్వేచ్చా భారతి కొరకు
పగలు రేయనక పరిశ్రమించిన శ్రామికుడు
సమస్త సంపదలు దేశ హితముకై సమర్పించిన
పరిత్యాగి, సుగుణశీలి మన పండిత నెహ్రూ.
మకుటం లేని మహారాజే, తన ప్రజల మనోఫలకంపైన
భారత దేశపు తొలి ప్రధానిగా బాలల ఆత్మీయ
చాచా నెహ్రూగా వినుతి కెక్కిన అమృత మూర్తి పండిత నెహ్రూ
నవభారత నిర్మాణానికి స్వీకారం చుట్టి.... చేపట్టి
జలాశయాల నిర్మాణాలు నిరాఘాటంగా సాగించి, సస్యశ్యామలంగా మార్చి....
ఆకలితో అలమటించి అన్నమో రామచంద్రా అనే ఆర్తనాదాలను దారిద్ర్యాన్ని తరిమి గొట్టి అన్నపూర్ణను అందించిన , అజరామరుడు
నిధుల లేమితో చిక్కిపోయిన బొక్కసం అయినా వెరపేలేని ఫరంగి గుండులా
పురోభివృద్ధికి పురోగమించిన పురుషోత్తముడు
ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచ నెంచి
కర్మాగారాలు స్థాపించిన కార్యోన్ముఖుడు
సమస్త రంగాలను సమాయత్తం చేసి
కుంటుతున్న ఆర్ధిక వ్యవస్థకు జవసత్వాలందించి రాకెట్ స్పీడుతో ఉరికించిన
స్ఫురద్రూపి
విద్య వైద్యం శాస్త్రసాంకేతిక రంగాలకు ఆధునిక
హంగులు కల్పించి దేశమౌలికావసరాలను తీర్చే
అనేకానేక వ్యవస్థలలో ఉత్పాదక సామర్థ్యం పెంచిన దార్శనికుడు
అలుపెరగక పోరాడిన స్వతంత్ర సేనాని...
విరామ మెరుగక ప్రగతి రథంపై పరుగెత్తిన
పాండవ పక్షపాతి యుగ పురుషుడు నెహ్రూ
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
14112021
2
[14/11, 8:05 pm] Mekala Ramaswamy Poet: జాతీయ బాలల దినోత్సవమున
"మంజిర పలుకులు " ప్రక్రియ
*************************
అంశము:-బాల నేస్తాలు
********************
ఎత్తుకో హత్తుకు పోతారు
పలకరించు పరవశిస్తారు
ముద్దు చేయు మురిసిపోతరు
హద్దుగీయు బెదిరిపోతరు
స్వేచ్ఛా విహంగాలు పిల్లలు
తెల్లని అందమైన మల్లెలు,,1
ఎగురుట వారి హక్కు
దుముకుట వారి లెక్క
ఆటలాడుట ఇష్టం
పాటపాడుట ఇష్టం
అడ్డుచెప్పగ మనము
బుంగమూతి కనెదము,,2
బాల్యము బంగారు గని
ఏడాదంతా పూచే ఆమని
ఎదగనీయాలి మనమంతా
ఏలనీయాలి జగమంతా
బాలలు దేశ సంపద గనులు
బాలలు భావి భారత పౌరులు,,3
************************
**మేకల రామస్వామి **
ప్రధానోపాధ్యాయులు
MPUPS KANNEPALLY
**చెన్నూర్**
***************************
3
[14/11, 8:07 pm] Siimhadri Vani Poetess: కవితా గానం (సీజన్--2)
బాల సాహిత్యం
శీర్షిక:-- శాంతి కపోతం
రచన:--సింహాద్రి వాణి
ఊరు:--విజయవాడ
చరవాణి:--7569820872
ప్రక్రియ:--గేయం
చదువుకోండీ పాపల్లారా
చదువుకోండి బాగుగా
చదువుకొంటే ముందు మీకూ
సౌఖ్యమున్నది మెండుగా
అక్షరమే విజ్ఞానం
అక్షరమే సౌందర్యం
అక్షరమే మీనేస్తం
అక్షరమే మీ ధనం
గాంధీ తాతకు వారసులు
నెహౄచాచకు స్నేహితులు
భరతమాతకు భాగ్యవిధాతలు
భావి తరానికి మీరే నేతలు
మంచితనం మానవతా
మీ మనసులలో పెంచుకొనీ
నీతీ న్యాయం ధర్మం మీరు
అణువూ అణువున నింపుకొనీ
పెద్దల యెడలా గౌరవమూ
పిల్లల యెడలా అనురాగం
దండిగ మీకు వుండాలి
మెండుగా గుండెల నిండాలి
శౌర్యం ధైర్యం సాహసమూ
మీ ఊపిరిగా మలచుకొనీ
బ్రతుకు బాటనూ పయనించండి
భావితరం మీదే నండీ
కత్తులు కక్షలు కార్పణ్యాలు
బాంబు మోతలు బడబాగ్నులలో
నెత్తురులోడే నేటి జగతికి
శాంతి లేపనం పూయండి
శాంతి కపోతం మీరవ్వండి
4
[14/11, 8:09 pm] +91 99373 80136: కవితాగానం(సీజన్2)
బాలలదినోత్సవసందర్భంగా ప్రత్యేక కవిత.
తేది14112021,ఆదివారం.
అంశం:బాలలదినోత్సవం
శీర్షిక:రేపటిపౌరులు.
బాలలదినోత్సవము నేడు
బాలలందరు బాగుగావుండాలని చూడు
పసిబాలలు పనిబానిసలుకారాదు
వెట్టిచాకిరికి బలికారాదు
వీధినపడిన అనాధలు కారాదు
బంగరుభవితకు వారసులు
భావిభారతపౌరులు వారు
రేపటిపౌరులు వారే
పసిమొగ్గలుగా చిదిమివేయబడుతున్నారు
మూఢనమ్మకాలకు బలైపోతున్నారు
చీకటివ్యాపారానికి గురవుతున్నారు
ముష్టివారిగ మార్చివేయబడుతున్నారు
కుటుంబానికి అదనపువనరుగ చేస్తున్నారు
బాలకార్మికులుగా బ్రతుకీడ్చుతున్నారు
మారాలి మారాలి వారిబ్రతుకులు
రావాలి రావాలి వారికి మంచిరోజులు!
ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995.
5
[14/11, 8:09 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్2) 14/11/2021/ ఆదివారము
శీర్షిక " పండిత జవహర్లు"
ఆ! (1)
పండితజవహర్లు పాలన చూడగ
భరతదేశజనుల భాగ్యమనగ
భరతసీమనంత భాగ్యసీమగమార్చె
దేశనేతగాను దేశమేలె!
ఆ! (2)
బాలభవితనేత బాలలనేస్తమై
చెంతచేరివారి చెలిమి కో రె
చాచనీతడనుచు చప్పట్లుచరవంగ
మామగానునెహ్రు మమతచూపె!
ఆ! (3)
భరతరత్న మనగ భరతదేశ వెలుగు
జాతిరత్నమనగ జగతి వెలుగు
నవ్యభరతజాతి నాగరికతపెంచె
దేశసేవ జేస్తు దేశమేలె!
ఆ! (4)
భావితరములకును భవితనుచూపించె
కులమతముల జోలి కూడదంటు
సమతమమత పెంచె సహ్రుదయముతోడ
శాంతి తోడ నడిపె శాంతిదూత!
ఆ! (5)
ఘనుడితడనిజనులు ఘనముగ పొగడగ
ప్రగతిసాధనమున పాటుపడుచు
జగతి మేలుకోరి జనరంజకముగాను
దేశమేలినట్టి దేశనేత!
తరణికంటి సూర్యలక్ష్మి.
-----------
6
[14/11, 8:11 pm] Maddi Pullarao Poet: కవితాగానం సీజన్ 2
తేదీ:14-11-2021
శీర్షిక:బాలలు పరమాత్మ స్వరూపులు
ప్రక్రియ:గేయం
కవిపేరు: మద్ది. పుల్లారావు
ఊరు:నందిగామ
.................
బాలలు..బాలలు..బాలలు
పండిత నెహ్రూ నీడలు
పాపం,పుణ్యం తెలియని వాళ్ళు
లోకం పోకడ ఎరుగని వాళ్లు
పరిశుద్ద మనసులే గలిగిన వాళ్ళు
పరమాత్మ స్వరూపులు వాళ్ళు
మాయా,మర్మం తెలియని వాళ్లు
మానవతకు పునాదులు వాళ్ళు
అన్నీ మావేనంటారు..
కలిసికట్టుగా ఉంటారు.......... ౹౹బాలలు౹౹
అల్లరి పిడుగులూ....
చిరునవ్వు ల జల్లులూ.....
ఆటల్లో ఆనందాన్నీ...
పాటల్లో. మకరందాన్నీ..
తల్లి లాలనలొ ఆనుబందాన్నీ...
తండ్రి పాలనలో అనురాగాన్నీ...
గురువు భోదనలో విజ్ఞానాన్నీ..
పొందుచు ముందుకు నడిచెదరు..
అందరి మన్నన పొందెదరూ..............౹౹బాలలు౹౹
దుష్ట భావనల దూరము పెట్టి
విశ్వ ప్రేమను వారికి నేర్పి
సమసమాజమును స్థాపిద్దాం
చాచా కోరిక నెరవేరుద్దాం
బాలల హక్కులు హరియించొద్దు
వారిని బాధల గురి చేయొద్దు............౹౹బాలలు౹౹
..........
ఇది నా స్వీయరచన.
7
[14/11, 8:15 pm] Aalla Nageshwar Rao Poet: కవితా గానం ..సీజన్...2
అంశం; బాలల దినోత్సవం
శీర్షిక:
"" సకల కళా ప్రపూర్ణులు ""
జగతిని మేల్కొల్పే ప్రభాతభానుని కిరణాల్లా
హరితవర్ణాన్ని పంచే వృక్షానికి వేరుల్లా
నవ భారత నిర్మాణానికి పునాదుల్లా
సంస్కృతీ సంప్రదాయాల
పరిరక్షకుల్లా
శాంతి సామరస్యాల వాహకుల్లా
సమైక్యతా వ్యాప్తికి వారధుల్లా
నేటి పౌరులైన రేపటి భావిభారత పౌరులు అలా!
విరిసి విరియని పువ్వులు
స్వచ్ఛమైన మనస్కులు
భావి భారతావని రూపశిల్పులు
భరతమాత కనుపాపలు
కన్నవారి కన్నకలలకు ప్రతిరూపాలు
నీతి నిజాయితీలకు ఆనవాళ్లు
పెద్దలను గౌరవించు వాళ్ళు
చదువుల తల్లికి దత్తపుత్రులు
భవితతో కాబోయే జవాన్లు
ప్రాజెక్టులను నిర్మించే ఇంజనీర్లు
అన్న ప్రసాదాన్ని అందించే అన్నదాతలు
సకల కళా ప్రపూర్ణులు రేపటి రవి కిరణాలు!
............................................
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
చరవాని సంఖ్య;7416638823
...........................................
పై వచనకవిత నా స్వీయారచనేనని హామీ ఇస్తున్నాను.
8
[14/11, 8:29 pm] Kompelli Ramaiah Poet Kmm: శీర్షిక: పిల్లలం పసిపిల్లలం...!
పేరు: కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం
పిల్లలం పసిపిల్లలం
భావిభారత పౌరులం
అమ్మ ఒడిలో వికసించిన పువ్వులం
నాన్న ఎద పై ఎదిగిన గువ్వలం
తొలకరి చినుకుల చిరు జల్లులం
ఆకాశంలో హరివిల్లులం
ఆనందాల పొదరిల్లులం
గలగల పారే సెలయేరులం
విరబూసిన గులాబి పువ్వులం
వాడని పువ్వుల నవ్వులం
మేఘాలతో ఆడే బాల చంద్రులం
చిరు కాలువల్లో పరుగెత్తే చిట్టి పడవలం
ఆట పాటలతో అలరించే అల్లరి పిడుగులం
ఊహల పల్లకిలో ఊరేగే బుడుగులం
కల్లాకపటం లేని అమాయకులం
కన్న వాళ్లకు ఆశల దీపాలం
బరువు పుస్తకం మోయలేని లేత వెన్నెముకలం
అక్షరాలు నేర్వని తెల్లని మల్లెలం
ముద్దు మురిపాలు పంచే ముల్లెలం
రేపటి విజ్ఞాన భాండాగారానికి వారసులం...!
9
[14/11, 8:37 pm] Balloori Umadevi Poetess: కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
బాల దినోత్సవం
బాలలం మేం బాలలం
భావిభారత పౌరులం//
బడినే గుడిగా భావిస్తాం
గురువులనే దైవాలని నమస్కరిస్తాం
కట్టుబాట్లను గౌరవిస్తాం
క్రమశిక్షణను పాటిస్తాం
త్రోసు కొంటూ ముందుకు వెళ్లం
సమాన దూరం పాటిస్తాం
మా వంతు వచ్చే వరకు
వరుస క్రమంలో వేచి వుంటాం//
గాంధీ తాత కు వారసులం
మేం వారి బాటలో నడుస్తాం //
కరోనా నేర్పిన పాఠాలు
మరువక మేము పాటిస్తాం
చేతులు జోడించి దండం పెడతాం
కరచాలనాలకు వీడ్కోలిస్తాం
దేశ ప్రగతికి సారథులౌతాం
పరిసరాలను శుభ్రం చేస్తాం//
చెత్తను వేయక పాఠశాలను శుభ్రపరుస్తాం
ఆరోగ్యమే మహాభాగ్యమనే
పెద్దల మాటను గౌరవిస్తాం
మంచి ఆహారం తీసుకొంటాం
చక్కగా పాఠాలు నేర్చుకుంటాం
పాఠశాలకు మంచి పేరు తెస్తాం.
10.
నేటి వచన కవిత:- * బాల్యం *
జీవితానికే * గోప్ప వరం *
@@@@@@@@@@@
కల్లా - కపటం ఎరుగని బాల
బాలికలు వీరండీ... !
వీరిని... తల్లిదండ్రులూ మీరే
చక్కగాతీర్చి దిద్దాలండీ... !!
బరువు - బాధ్యతలు...కుట్రలూ
కుతంత్రాలుతెలియనిబాల్యం...నిజంగా ఈ మానవజీవితానికే
గోప్ప వరమ0డీ ....!
తడబడుతూ వేసే బుడి - బుడి
అడుగులు... ముద్దోచ్చే పలుకులు....కల్మషం లేని ఆ
బోసినవ్వులు...తేనెలొలుకు ఆ
మాటలు... తోటి పిల్లలతో
ఆటలతో...బడి బాటలో
పాటలు వింటూ.... అక్షరాలు దిద్దుతూ...చీకూ - చింతాలేక
హాయిగా సెలయేటి గల గల లా
సాగి పోయే బాల్యం... ఈ మానవ జీవితానికి నిజంగా...
వరమే నండీ !
అర్ధం కాని లోకం తీరును....!
వింతగా పరికిస్తూ.... ఎదిగే
పచ్చని మొక్కే కదా బాల్యం!!
ఆనందమైనా... దుఖమైనా...
అది బాల్యానికి తాత్కాలికమే
అవి మనసును పట్టి పీడి0చవు
వేదించి... బాధించవు..!
బాల్యం...గతానికి వగచదు!
భవిష్యత్తు ఊహలతో సతమత మవదు...!
కేవలం వర్తమానం లోనే...
నిజ కాల తత్వమ్తో ప్రవర్తిస్తుంది....!!
అమ్మ లాలన...నాన్న పాలనలో... నిశ్చింతగా... హాయిగా నిదుర పోగలిగేది...
జీవితంలో బాల్యమొక్కటే!!
ఈర్ష్యాసూయలు... కల్లా కపటాలకు దూరంగా... నిర్మలంగా...కలిమైనా... లేమైనా హాయిగా బ్రతక గలిగే
బాల్యాన్ని ...బాల్యంగానే బ్రతకనిద్దాం...,బరువులు బాధ్యతలతో...బాధించకండి!
వరం లాంటి బాల్యాన్ని... శాపంగా మార్చకండి... !!
********************
...కోరాడనరసింహా రావు!
11.
కవితా గానం సీజన్ - 2
అంశం:: బాలల దినోత్సవం
తేదీ::14.11.21..ఆదివారం
శీర్షిక :: దైవ స్వరూపాలు
పిల్లలు దైవ స్వరూపాలు
శాంతికి వారసులు
ప్రేమ మూర్తులు
సకల కళా వల్లభులు
తేనె లొలుకు మాటలు
పాల నురుగు మనసులు
వెన్నెల మించిన అందాలు
కలవర మెరుగని కన్నుల కాంతులు
తల్లిదండ్రుల ఆశలం
వారి కోరికల దీపాలం
వారి వేడుకల వేదికలం
వారి ఊహల ఊతలం
బుద్దిలో బృహస్పతులం
చదువులో సరస్వతులం
ఆటలో అర్జునులం
పాటలో ప్రావీన్యూలం
దేశ గౌరవాన్ని నిలుపుతాం
జవానులమై దేశం కొరకు పోరాడుతాం
కర్షకులమై కరువును పారద్రోలుతాం
హర్షకులమై అందరికి ఆనందం పంచుతాం!!
కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు. 8309920625
పై కవిత నా స్వంత రచన అని హామీ
12.
కవితాగానం సీజన్ 2
అంశం:బాలల దినోత్సవం
తేది:14/11/2021 ఆదివారం
శీర్షిక: చిరంజీవివయ్యా చాచా!
*********************
జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం
జాతీయ బాలల దినోత్సవ పర్వదినం
తారాజువ్వలవలె నింగికెగసే చిన్నారుల చిలిపి నవ్వులు
నింగినున్న నెహ్రూజీకి పట్టే నీరాజనాలు
చరితార్థుడవయ్యావయ్యా చాచాజీ!
చిరంజీవి వయ్యావయ్యా చిన్నారుల మనసులు దోచి!!
మొట్టమొదటి ప్రధానిగా పేరొందీ
స్ఫూర్తి కిరణముగ వెలుగొందీ
ఘనకీర్తిగడించిన దేశనాయకా!
భరతమాత ముద్దులతనయుడవై
చిరస్మరణీయుడవైనావు సూర్యచంద్రులున్నంతదాకా!
దినదిన ప్రవర్ధమానుడవై కీర్తి శిఖరమధిరోహించిన నేతా!
అందుకోవయా మా హృదయపూర్వక జోత!
______________
జోషిపద్మావతి
మహబూబ్ నగర్
13.
*కవితా గానం*
******************************
*పేరు:వనపర్తి గంగాధర్*
ఊరు:హన్మకొండ
చరవాని:9440146434
*అంశం:బాలల దినోత్సవం*
*శీర్షిక:క్రాంతదర్శులు*
మీరే రేపటి తరానికి వారసులు
భవిష్యత్ కాలానికి భాగ్యవిధాతలు
తరతరాల వారసత్వ సంపదలు
మన సంస్కృతి,సంప్రదాయ వారసులు
బాలలు భావితరానికి జ్ఞాన వీచికలు
ఆధునిక సాంకేతిక అభివృద్ధి శాస్త్రవేత్తలు
నవతరానికి విజ్ఞాన వారధులు
ఓటమి ఎరుగని భారతమ్మ పుత్రులు
కల్మషం, లేని స్వచ్ఛ హృదయులు
ఆత్మస్థైర్యమే ఆయుధమై సాగే వీరులు
గుండెనిండా ధైర్యపు అస్త్రాల ధీరులు
మీరే మీరే సమస్త లోకపు విజయులు
మీ ముఖారవిందాలు శరత్చంద్రా వీచికలు
మీ మానసం దయా సరోవరాలు
మీ చూపులు వెన్నెల కిరణాలు
సమ సమాజపు క్రాంతదర్శులు
మీ చేతలే సమాజ ఆవిష్కరణ లు
మీ మేధస్సే అభివృద్ధికి దారులు
నావ సమాజ శ్రమ నిర్మాతలు
వేయండి ముందు తరాలకు బంగరు బాటలు
హామిపత్రం:ఈ కవిత నా స్వీయ రచన
14
కవితా గానం సీజన్ 2 నిర్వహించు కవితల సమాహారం
తేది: 14-11-2921
అంశం: బాలల దినోత్సవం
సయ్యద్ జహీర్ అహ్మద్
కర్నూలు
*పసిడితనం* *పసిడివరం*
పడి లేచే కెరటంలా ఏడ్చేసి అప్పటికప్పుడు
మర్చిపోయి నవ్వేసి
హాయిగా ఆడుకునే సున్నితమైన బాల్యం!
గుడు గుడు అడుగులు వేసి
నడక నేర్చిన ఆనందం
బాలారిష్టాలు తప్పించుకున్నబాల్యం
బడికెళ్ళాలనే ఆత్రం
పుస్తకాల బరువేమోగాని
హోం వర్క్ శిరోభారం
అయ్యవారు కొడతారనే భయం లేదుగాని
మైదానంలో ఆటలాడాలనే సంబరం!
సహవిద్యార్థి ఇచ్చే కాకిముద్దంటే మహాప్రాణము
బదులు పంచాలనే
యమ ఆత్రము...
ఆదివారం ఆటవిడుపు దినం
అన్నం అవసరం అనిపించదు
అమ్మా నాన్నల గారాబం మీద ఆధారం..
కష్టాలు ఎరుగక దుఃఖం కలుగని
అమితానందము
శభాష్ అని పొగిడి భుజం తట్టితే ఉరకలేసే ఉత్సాహం
బద్మాష్ అని తిడితే చచ్చు బిక్కముఖం!
మొక్కలోనే మెదడుకెక్కు
ముదిరితే అబ్బదు
ఏ విద్యైనా...
బడి ప్రాంగణం చూడగానే
భవితవ్యం గుర్తుకు వస్తుంది నిజం!
జీవితపు నాలుగు దశలలో పసితనం
తిరిగిరాదుగాని నెమరేసుకోవాలి జ్ఞాపకం!!
* * *
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను
***
సయ్యద్ జహీర్ అహ్మద్,
కర్నూలు
చరవాణి:9505152560
15.
కవితా గానం సీజన్ 2
14-11-21
అంశం. బాల లో దినోత్సవం
శీర్షిక లేతలేత చిగురులం
రచన వాణి సరోజిని లక్కరాజు
విజయవాడ
లేత లేత చిగురులం
చిన్ని చిన్ని మొగ్గలం.
రేపో మాపో వికసించే
చూడ చక్కని పూవులం
చిరునవ్వుల సొగసులం.
చిందులేయు చినుకులం
అమ్మకొంగు చాటున
దాగుడు మూత లాడుతాం.
నిర్మల మగు మనసులం
నిష్కల్మష హృదయులం
కల్లాకపటం ఎరుగని
కమనీయ పూ తేనియలం.
తాటాకు బొమ్మలకు
తలంబ్రాలు పోయిస్తాం
బొమ్మల పెళ్ళిళ్ళు చేసి
ఉత్తుత్తి భోజనాలుపెట్టిస్తాం
గురువు గారి మాటలు
గౌరవం తో ఆచరిస్తాం
శ్రద్ధాభక్తులతో చెప్పిన
పాఠాలను చదువుతాం
నియమాలను పాటిస్తాం.
మాస్కలను ధరిస్తాం.
కోవిడ్ బాధ బాప.
చెప్పి నట్లు నడుస్తాం.
భావిభారత పౌరులం
భవితకు పునాదులం
భరతజాతి కీర్తి ని
చాటి చెప్పు ధీరులం.
బాలలం బాలలం
భావిభారతపౌరులం
భావితరాలకు ప్రతినిధులం.
16.
కవితా గానం (సీజన్ -2)
అంశం : బాలల నేస్తం నేహ్రూజీ పుట్టిన రోజు వేడుకలు
శీర్షిక : "రారండోయ్ పిల్లల్లారా.."
రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
ఆడే పాడే బాలల్లారా రారండోయ్!
బాలల నేస్తం నేహ్రూజీ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనగ రారండోయి !
ముద్దు ముద్దు మాటలలో ఏకపాత్రాభినయ లెన్నో చేసేద్దాం !
చిట్టి చిట్టి అడుగులతో ఆటల పోటీల్లో బహుమతులెన్నో సాధిద్దాం !
కమ్మ కమ్మని కబుర్లెన్నో చెప్పేస్తూ స్పీచ్చేస్ ఎన్నో ఇచ్చేద్దాం !
ముసి ముసి నవ్వులేన్నో రువ్వేస్తూ మిఠాయిలెన్నో ఆరగిద్దాం !
అల్లరి అల్లరి చేసేద్దాం ..
సంబురాలెన్నో మా సొంతమంటూ ..
గురువులని గౌరవిస్తూ "సెల్యూట్" అంటూ నమస్కరిద్దాం !
17.
😕భలేభలే పిల్లలు
***************
భలేభలే పిల్లలు
చదువుల్లో సాముల్లో
ఆటల్లో పాటల్లో
అక్షయ తేజంతోముద్దు ముద్దుమాటల్తో-పొద్దు
పొడుపువెలుగులు!
భలేభలే పిల్లలు
సెల్ఫోన్ గేమ్స్
ఐప్యాడ్ ఆపరేషన్స్
అబ్బా!అనిపించే
లిటిల్ చాంప్స్ మీరు!
భలేభలే పిల్లలు
భూదేవి అరుగుమీద
ఆకాశంపందిరికింద
అనురాగాలసందడిలో
వెల్లివిరిసె ఆనందం!
భలేభలే పిల్లలు
మా ఆశలతీరాలు
ఆనందపు కెరటాలు
నింగిమీదికెగరండి
విశ్వమంత తిరగండి!
భలేభలే పిల్లలు
విజ్ఞానం వినోదం
అనురాగం నింపుకొని
రాగద్వేషాలలో
రాగాన్నేమిగుల్చుకొని
మానవులంతా ఒకటై
కలిసి జీవించండి!
భలేభలే పిల్లలు
బాలురు బాలికలు
మీరు మాకు వారసులు
భువికి మీరు ఏలికలు!
********
రుద్రామంగతాయారు
హైదరాబాద్
14-11-2021
మొబైల్:8985130509
18.
కవితా గానం(సీజన్2). 14--11--2021.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- నెహ్రూ జన్మదినం -- బాలల
పర్వదినం.
1. తే.గీ.
సలిపి స్వాతంత్ర్య సమరమ్ము, జనుల నెల్ల
నొక్క త్రాటిపై నిలిపెను మొక్కవోని
ధైర్య సాహసాల ప్రదర్శితమ్ము చేసె
జాతి గర్వించ దగినట్టి నేత నెహ్రు.
2. తే.గీ.
శాంతి సందేశమును ప్రపంచమున చాటి
పంచశీలను బోధించె పండితుండు
నాటి సూత్రాల నాచరణంబు చేసి
వినుతి కెక్కెను జవహరు విశ్వమంత.
3. ఉ.
బాలలె దేశ సంపదలు, బాలలె దేశ పురోభి
వృద్ధికిన్
మూలములంచు జహ్వరు సమున్నత స్థాన
ము నివ్వగా హృదిన్
బాలల యుత్సవంబలరె పండిత నెహ్రు
జయంతి రోజునన్
బాలలె భావి భారత సభాసదులంచు
నెఱుంగగా వలెన్.
**************************************
19.
[14/11, 9:36 pm] దారల విజయ కుమారి Poetess: కవితా గానం సీసన్ 2
అంశం;బాలల దినోత్సవం
శీర్షిక: మళ్ళీ ఒక సారి
****************
అపుడపుడు
అక్కడక్కడా
పువ్వులు ఆడుకుంటున్నపుడు
నవ్వుల్ని మూటగట్టిస్తూ
కేరింతల్ని విసిరేస్తున్నప్పుడు
మండే వెతల వేసవిలో
చలివేంద్రంలాంటి చిన్నతనం
గుర్తొస్తుంది
ఎప్పటిదో
శైశవ వాసన గుప్పుమంటుంది
భరింపలేని అశక్తతల్లో
మళ్ళీ..అమ్మ ఒడి కావాలనిపిస్తుంది
నడివయసు పై
ఎన్ని నగిషీలు చెక్కినా
పసితనం
జ్ఞప్తికి రాకుండా ..
కన్నీళ్ళ ను
కోల్పోతున్నపుడు
బాల్యం
జోలికి వెళ్ళనీకుండా ఎవ్వరాపగలరు..?
హంగులు..
హడావుడి హాయినివ్వనీక
ఆర్భాటమంతా అక్కడే మరచి వచ్చేసినట్టు
జీవితం అయిపోతున్నా
ఆ లాలిపాట వెంటాడుతూనే
బతుకు దెరువు కు
దూరాలకు
వలస వచ్చినట్టు గా
చిన్నతనాలకు మళ్ళీ చేరుకోవాలని
ముదిమి లో
మళ్ళీ కాస్త వెనక్కి మళ్ళాలనే ఉంటుంది
కాలం తీగలో
బాల్యాన్ని కాస్త తుంచుకొనొస్తే బాగుండనిపిస్తుంది
ఇకనైనా
ఆ పసి నవ్వులోని నైపుణ్యమేదో
సాధన చేస్తేనే మేలనిపిస్తుంది
దారల విజయ కుమారి
20
[14/11, 9:36 pm] +91 94948 00454: కవితా గానం
ఏడెల్లి రాములు
బాలల సాహిత్యం
ప్రత్యేక కవిత
శీర్షిక*బంగారు లోకం
పసిడి పూల మొక్కలు
బోసి నవ్వుల పువ్వులు
మనసు తీగలపై రాగాలు
ప్రేమతో పలకరించే మొలకలు
బాల్యమంటే గుండె గుడిలో దీపం
బాలలంటే ఆశల ఎన్నీల రూపం
ఎదగనిద్దాం కులమతాల
అడ్డుగోడలు తొలగించి
చదివిద్దాం బాలల ప్రాథమిక హక్కులను గౌరవించి
కారాదు బాల్యం శాపం
వాళ్ళేం చేశారు పాపం
ఆటపాటలు వాళ్ళకే సొంతం
సంగీత సాహిత్యాల సౌరభం
నాట్యం లో రామప్ప శిల్పాలు
చిత్రలేఖనం లో చిన్నారి శిల్పులు
ఆకలి అవిద్య అనారోగ్యం
దరిరానివ్వనీయని సంక్షేమం
బాల కార్మికులకు తులాభారం
రేపటి విజయాలకు బాలలే నిచ్చెనలు
జగతికి జ్యోతులు వెలిగించే
ఒలింపిక్ బంగారు పతాకాలు
ఏడెల్లి రాములు ✍️
ది*14*11*2021(21*28)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
Comments
Post a Comment