నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
**********************##
కవి వరుల జాబితా
1.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
2.గొర్రెపాటి శ్రీను గారు
3.ఆపరాజిత్
4.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
5.సింహాద్రి వాణి గారు
6.డా.బల్లూరి ఉమాదేవి గారు
7.తరణికంటి సూర్య లక్ష్మి గారు
8.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు
9.గజవెళ్ళి శ్రీ నివాసాచారి గారు
10.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
11. సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు గారు
12.మోహన మణికంఠ గారు
13.కవిత వెంకటేశ్వర్లు గారు
**********************
[30/11, 8:18 pm] +91 6281 697 982: సిరివెన్నెల
*********
ఆయన పాట
పంచదార చిలక
సన్నజాజి మొలక
మోట బావి గిలక
నవ్వుల చెలువ
స్నేహాల నెలతి
రాగాల పొలతి
వయ్యారి లలన
ముద్దైన ముదిత
సుధల సుదతి
మురిపించే మగువ
మోహించె మహిళ
అందాల అతివ
అలకల అబల
అల్లరి అంగన
అలరించే ఆడది
ఊగించె కొమ్మ
ఊరించే ఇంతి
ఊహల్లో కాంత
ఉడికించే కలికి
శృంగార రమణి
బంగారు భామిని
చెలరేగిన భామ
హొయల లలామ
ఆయన పాట
ఒక జలపాతం
ఆయన కలము
సిరులు కురిపించిన
ఝంఝా మారుతం
ఆయనే సిరివెన్నెల
సీతారామ శాస్త్రి
నింగి కేగిన దండి మనిషి కి
అశ్రు నయనాలతో
నివాళులు
స్వీయ రచన:::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
(సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం ఎంతో విషాదం మిగిల్చింది.ఎవరూ దీనిని పూడ్చలేరు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్ధిస్తూ)
2
[30/11, 9:22 pm] Gorrepati Srinu Garu Poet: "సిరివెన్నెల" స్మృతిలో..
"సిరివెన్నెల" సినిమాలో పాటలకి జీవంపోసి
విశ్వనాధుడితో కలిసి అసంఖ్యాక చిత్రాలలో
సుమధుర గీతాలెన్నింటికో అక్షరరూపమిచ్చి
తెలుగు సినీ జగత్తులో తనదైన శైలిలో
మనసుకు హాయినిచ్చే అర్థవంతమైన పాటలకి
సృష్టికర్త తానై
పద మంజీరాల పరవశాలని తెలుగు శ్రోతలకిచ్చి
"పద్మశ్రీ" విశిష్ట పురస్కారాన్ని భారత ప్రభుత్వం నుండి పొంది
పసిడి వర్ణాల మెరుపు హంగులతో అలరారే తెలుగు అక్షరాల రారాజు తానై
పాటల పూదోటకి వనమాలి తానై
నేలపైనే సప్తవర్ణ శోభితమైన హరివిల్లుల సొగసులని మా నయనాల ముందు నిలిపి
గగనసీమలకు తరలిన తెలుగు సుకవి నీకివే మా అక్షర నీరాజనాలు ..!
మమ్మల్ని శోకసంద్రాన మిగిల్చి దివికేగిన దివ్యపురుషుడా సదా నీ స్మృతిలో..
అర్పిస్తున్నాం ..అశ్రునివాళులు !
_ రచన : గొర్రెపాటి శ్రీను
3
[30/11, 9:26 pm] Aparajith: సిరివెన్నెల శోభ!
సిరివెన్నెలలో గుభాలించిన
మల్లెల మకరందాల సోయగాలు
ఏ దివినుండి దిగివచ్చిన
తీయని తేనెలూరే కోయిల వయ్యా!
ఈ జగమంతా నీ కుటుంబమే
పాల మీగడ తరగల పాటలు రాసి
ఏ అమ్మ చనుపాల బలమో
అమ్మ అను మాట కన్నా కమ్మనైన
మాటలతో చందమామను చూపిస్తూ
గోరుముద్దలు తినిపింఛావు!
నీ పాట వీనులవిందుగా సాగుతుంటే
కళ్ళల్లో ఊహా చిత్రాలు కదులుతుంటాయ్
విధాత తలపున ప్రభవించిన
సుందర స్వప్నానివి!
తెల్లారింది లెగండోయ్ అంటూ మేల్కొలిపి
ఏ అనంత లోకాల్లోకి వెళ్ళావయ్యా?
సిరివెన్నెలలో రేరాజువు
వెండి తెరపై వెన్నెల సంతకం చేశావు
నీవు ఒక్క పాట రాస్తే చాలు
సినిమాలు రజతోత్సవాలు స్వర్ణోత్సవాల్లో పరుగులు తీయడానికి!
నీవు దూరమైనా నీ పాట పదిలంగా
వంద ఏళ్ళకు సరిపడా నిలుస్తుంది
బాలు గొంతులో ఊయలలూగుతూ
సంగీత సాహిత్య ప్రియుల నాలుకల్లో కదులుతూనే ఉంటుంది!
అపరాజిత్
సూర్యాపేట
4.
[01/12, 1:10 pm] Aalla Nageshwar Rao Poet: అంశం: నింగికేగిన సిరివెన్నెల
శీర్షిక;
"" సినీ సాహితీ వెన్నెల ""
తరలిరాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం అంటూ
వనాలను పెంచితే వసంతం తనంతట తానే వస్తుందని
వనాలను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించమని
అలతి పదాలతో అనంతార్ధాన్ని ఇచ్చే పద ప్రయోగంతో
గేయ రచన గావించిన
ప్రకృతి ప్రేమికుడు మన సిరివెన్నెల!
తన పాటల ప్రభావంతో
ప్రఖ్యాతి గాంచిన
సిరివెన్నెల సినిమా పేరును
ఇంటి పేరుగా మార్చుకుని
తెలుగు సాహిత్యపు పూదోటలో
వివిధ గేయాల సుమాలను వికసింప చేసిన
సాహిత్యపు వనమాలి మన సిరివెన్నెల!
సన్నివేశమేదైనా
సందర్భమేదైనా
తన అక్షర పద విన్యాసంతో
ప్రతి పాటలోనూ సామాజిక చైతన్యాన్ని జోడిస్తూ
అక్షరాలను చెక్కిన అక్షరశిల్పి
మన సిరివెన్నెల!
నిగ్గదీసి అడుగు
ఈ సిగ్గు లేని సమాజాన్ని అంటూ
తన అక్షర శరాలను సంధించిన
సాహితీ కలియుగ అభిమన్యుడు మన సిరివెన్నెల!
తన సాహిత్య సౌరభాలను
ఇంద్రలోకంలోను ప్రజ్వలింప చేసేందుకు
దేవేంద్రుని ఆహ్వానం మేరకు
నింగికేగిన సినీ సాహితీ వెన్నెల
సిరివెన్నెల!
సరిలేరు, సరిరారు నీ కెవ్వరు
అందుకో మా అక్షర సుమాలమాల!
...........................................
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
ఆర్టీసీ కండక్టర్
నాజరుపేట
తెనాలి
గుంటూరు....జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
చరవాని సంఖ్య;7416638823
పై వచనకవిత నా స్వీయారచన.
5
[01/12, 2:25 pm] Siimhadri Vani Poetess: సిరివెన్నెలకు అక్షరాంజలి
ఉ.మా
వెన్నెల వెళ్ళిపోయె,భువి వీడియు కాలము తీరగా,దివిన్
వెన్నెల నింపగన్ వెలుగ వేలుగ పాటలు తోరణమ్ములై
కన్నుల నీరు నిండి కడు కారుచు నుండెను ధారలై యహో
యెన్నియొ పాటలన్ యొసగె వేడుక పంచుచు జాతికంతకున్.
సింహాద్రి వాణి
విజయవాడ
6
[01/12, 4:52 pm] Balloori Umadevi Poetess: డా బల్లూరి ఉమాదేవి
అంశం:సిరివెన్నెల సీతారామశాస్త్రి
శీర్షిక:దివికేగిన దివ్యతేజం
ఓటమిని ఒప్పుకోవద్దు అని సూచిస్తూ
చక్రవర్తి కైనా వీధి బిచ్చగత్తెకైనా
ధనార్జనే ధ్యేయమని తెలియచేస్తూ
కో అంటే కోటి అని అది ఉంటే
కొండ మీది కోతైనా దిగివస్తుందని
జాబిలమ్మనే జోలపాడమని పిలిచి
హరి పాదాల పుట్టిన గంధమును స్మరిస్తూ
అపురూపమైనదమ్మ ఆడజన్మ అంటూ
ఆడ పుట్టుక ను అభినందిస్తూ
సంతోషం సగం బలం అని
అభిమానులను క్షణక్షణం ఉత్తేజపరుస్తూ
చుట్టుపక్కల చూడమని హెచ్చరిస్తూ సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని ప్రశ్నిస్తూ
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే
ఉన్నట్టు ఉంటుందని అభిమానులతో
ఆప్యాయంగా చెబుతూ
అనగనగా ఆకాశం ఉంది
ఆకాశంలో మేఘం ఉందంటూ
ఆ మేఘాల మాటుకే సాగిపోయిన
సాహితీ కెరటమా అందుకోవయ్య
ఈ అక్షర నీరాజనం.
7
[01/12, 7:03 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్2 ) 1/12/2021/ బుధవారము
శీర్షిక:- " సిరివెన్నెల "
చిరువెన్నెలందించె చిత్రసీమనుపాట
లన్నియు పారాడె అందమొలక
సినిమా పరిశ్రమ చిగురులు వేసెను
చిద్విలాసంబున చిందులేస్తు
చిత్రవిచిత్రమై చిత్రాలపాటలు
మధువులుచిలికెను మధురముగను
మూడువేలకుమించె ముచ్చటగేయాలు
నందరినోటను నాడుచుండె
పదిమందినోటను పారాడెగీతాలు
పరిమళంబులుచింద పరిసరాలు
అరుదుగదొరకు ప ద్మ శ్రీబిరుదమును
నందించె సిరివెన్నె లందుకొనియె
నందిపురస్కార మందెనుపదిమార్లు
నట్టింట నిలబడె నందియెపుడు
హిమగిరివాసుడు యింపుగగేయాలు
వినగపిలచెనేమొ వింతగనరిగెను
శివశివయనుచును సిరివెన్నెలంతట
శివుని స్మరణజేస్తు శివునిచేరె
పావనయేకాశి పరమాత్మసన్నిధి
పుణ్యమంతపుణికి పుచ్చుకొనగ
శివునిఆభరణమై శివుని శిరసునున్న
చంద్రవంకనుజేరె చక్కగాను
సీతారామశాస్త్రి శివునిచేరగ
సిరివెన్నెల మిగిలె భువిని!
తరణికంటి సూర్యలక్ష్మి.
----------
8
[01/12, 7:09 pm] +91 99373 80136: కవితాగానం(సీజన్2)
అంశం:సిరివెన్నెలకు నివాళి
శీర్షిక:అక్షరాంజలి
చిరునవ్వులు చిందిస్తాడు
సిరివెన్నెలలు కురిపిస్తాడు
విధాతనేప్రశ్నిస్తాడు
విరంచిగా విరచిస్తాడు
జామురాత్రిజాబిలమ్మను చూపిస్తాడు
నిగ్గదీసినిజాన్ని నిలదీయమంటాడు
అమ్మంటే ఏమిటో చెబుతాడు
విజయానికి మార్గాలను సూచిస్తాడు
విరహాన్ని అమలినంగా వర్ణిస్తాడు
డబ్బెంటే ఏమిటో తెలియజేస్తాడు
ప్రకృతిప్రశాంతతను కల్పిస్తాడు
నేలమీద నక్షత్రాలను దింపుతాడు
పాటకు ఆటకు తోడుగా పదాలను కూర్చుతాడు
పదవిపురస్కారాలు పాదాక్రాంతంచేసుకుంటాడు
అందరిని అలరించి అమరధామం చేరుకున్నాడు!
ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం,శ్రీకాకుళం జిల్లా
చరవాణి7780594995.
9
[01/12, 7:15 pm] +91 90594 38068: అంశం: సిరివెన్నెల
శీర్షిక: అక్షరయోధుడు
...
పాటంటే పదాల కూర్పు కాదు
అక్షరాలను ఆవాహన చేసుకుని
భావ సుగంధాలను అద్ది
అందమైన వర్ణాలతో అలంకరించి
రససిద్దిని కలిగించేవే
సిరివెన్నెల కలం నుంచి
జాలువారిన పాటలు
అవి నిశీథిలో కాంతి పుంజాలు
చైతన్య గేయాలు
ప్రేమామృత గీతాలు
విరించి పాటలు
దశాబ్దాలపాటుగా తెలుగు పాటలకు
చిరునామా సిరివెన్నెల
ఆది బిక్షువు వాడినేమి కోరేదని
పరమశివుని తత్వాన్ని
చాటిన అపర ఋషి
తెలుగు ప్రేక్షకులను
కన్నీటి సాగరంలో ముంచేసి
దివికేగిన విధాత సిరివెన్నెల
..
హామీ పత్రం
...
ఈ కవిత నా స్వీయ రచన.
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి
కాజీపేట హన్మకొండ
10
[01/12, 7:51 pm] Thippavajjala నరసింహ మూర్తి Poet Nellore: శీర్షిక:ప్రమద గణాలతో
తిప్పా వఝల నరసింహమూర్తి
సిరివెన్నెల మాయమైంది
నిందా స్తుతితో కవితా గానం
చేయడానికి కైలాసం చేరుకుంది
బోళాశంకరుని ప్రమధగణాలలో
చేరి పోయింది
నిత్యం కొంగ్రొత్త పాటలతో
శివ స్తోత్రం చేయటానికి.
కార్తీకమాసంలో శివైక్యం ఎంత అదృష్టం?
శివుడేకోరి రప్పించుకొన్నాడనేదానికి
ఇంతకంటే ఏముంటుంది
నిదర్శనం?
11.
*గానం కాదది* *కవనం*
నిగ్గదీసి అడుగు ఈ సమాజాన్ని తిరుగుబాటు బావుటా
తెల్లారగ లేగండోయ్
సమాజాన్ని జాగృత పరచింది ఆయన గళం
కవనంతో మొదలైనది
విరించినై విపంచినై
విరచించిన కలం
గానం కాదది
కవనం అల్లిన పదబంధం
ఏ ఊరు ఏ వాడైన
గాలితో నేలతో సంబంధం
స్వాతి వానలో తడిసి
మద్దయిన దేహంలోని
ఆత్మ సైతం స్నానించిందని
అపురూప భావన!
వైవిధ్యమైన పాత్రోచిత పాటలలో
సరసమాడే గదిలోంచి
సరదాపడే యువతకోసం
బొటానీ క్లాసు నుండి
మేటనీ ఆట వరకు
ఇన్నోసెంట్ స్టూడెంట్ నుంచి ఇరిటేషన్ పర్సన్ వరకు
పరకాయ ప్రవేశం చేసిన
సీతారామశాస్త్రి
మహోన్నత సాహిత్యంతో
సినిమా పరిశ్రమను
సాహిత్య లోకాన్ని
దూరమైపోయిన కవి పండితుడు!
****
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం. సిరివెన్నెలకు నివాళిగా వ్రాసిన కవిత బ్లాగుకు స్వీకరించగలరు.
ఇట్లు మీ
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
12.
ఓ సీతారామా!!
పాటల 'సిరి' నీవు
మాటల 'వెన్నెల' నీవు..
జగమంత కుటుంబాన్ని సంపాదించుకుని
ఇంకొన్ని జన్మాలకు సరిపడే సాహిత్యాన్ని మాకిచ్చేసి
ఏకాంతపు అనంత శయనానికి
మాకు అందనంత దూరానికి
నీవు వెళ్ళిపోయినా...
జాబిలి వెన్నెలలా నీ పాటలు
మాకు రోజు జోలపాటలే
మా యదలను కుశల పరిచే
నీ పాటల సాహిత్యం
మా మది ఆలోచనలను రేకెత్తించే
నీ మాటల ప్రవాహం
గాలివాటం లాగా ఆగే అలవాటు లేని
నీ కలం భరణి నుండి
ఇకపై కొత్త పాటలు
ప్రశ్నించే మాటలు వినలేమన్న
ఆలోచనే మా నరాల్లోని
నెత్తురు సత్తువుని
నిర్వీర్యం చేస్తుంది
నీ కలం ఆగిపోయింది
నీ గొంతు మూగబోయింది
నీవు భౌతికంగా మా మధ్య లేవనే బాధ తప్ప
నీ పాటలు మా హృదయంలో పదిలం
నీ మాటలు మా మస్తిస్కంలో భద్రం
తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు
సంగీతప్రియులున్నంత వరకు
నీవు అమరుడువేనయ్య
సిరివెన్నెల సీతారామ శాస్త్రి..
---Mani ✍️✍️✍️
Mohana Manikanta Uriti(Mani)
13.
నీ పాట అమృత పానం
------------------------------
సిరివెన్నెల ... సిరివెన్నెల
కారే కన్నీరు కన్నుల
నీవు లేక పరిశ్రమ వెల వెల
నీ మృతికి రాలే పూలు జల జల!!
నీ పల్లవులు పన్నీరు చిలికించు
నీ చరణాలు సత్యాలు పలికించు
నీ పదాలు కచ్ఛపి వీణా రాగాలు
నీ అలంకారాలు వాగ్దేవి ఆభరణాలు!!
నీ గేయాలు మానసిక ఔషదాలు
నీ గీతాలు మనసుకు హాయి
నొసగే పూతలు
నీ అక్షరాలు కురుపించు అగ్నిదారలు
నీ వచనాలు సృష్టించు బృందావన సమీరాలు
నీ పాటలు నిర్మల మందాకిని
హొయల లయలు
నీ మాటలు యుద్ధరంగాన శత్రువు గుండెల్లో తూటాలు
నీ రచన వ్యాసంగాలు చిత్ర
సీమకు అభంగాలు
నీ వాగ్దాటి పటిమ నిర్భయానికి
నిదర్శనాలు
నీ జన్మ చరితార్థము
నీ పాట అమృతపానం
చిరస్మరణీయం
సిరిని వదలి వెన్నెల కీర్తి తీసుకెళ్లావు
అమరుడవై ఆది దంపతుల చేరావు
అశ్రు నివాళితో.........
కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు. 8309920625
పై కవిత నా స్వంత రచన అని
హామీ
Comments
Post a Comment