నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
********
1. దీపక్ న్యాతి గారు
2.అంబటి నారాయణ గారు
3.కోరాడ గారు
4.డా.సి.హెచ్. ఆంజనేయులు గారు
5.కోరాడ గారు రిపీటెడ్
6. కొమురవెల్లి అంజయ్య గారు
7.కొమురవెల్లి అంజయ్య గారు repeated
8.కొంపెల్లి రామయ్య గారు
9.దారల విజయ కుమారి గారు
10. కే వి రమణ చారి గారు
11. మన్నె పిన్నక లలిత గారు
12.అఫ్సర్ వలీషా గారు
13. ధనాశి ఉషారాణి గారు
14.వనపర్తి గంగాధర్ గారు
15.సునంద వురి మళ్ళ గారు
16.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
17.సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
18.డా.బల్లూరి ఉమాదేవి గారు
19.అపరాజిత రెడ్డి గారు
20.మర్రి జయశ్రీ గారు
21.డా.నాయకంటి నరసింహ శర్మ గారు
22.కత్తుల బాలు గారు
****************
[18/05, 7:43 PM] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️
కవితాగానం
నేటి అంశం
సెకండ్ వేవ్
ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో
స్పందించగలరు.
ఆ సమయంలో ఎలాంటి
ఇతర స్పందనలు తెల్పకుండా
సహకరించగలరు.
❇️❇️❇️❇️❇️❇️
[18/05, 7:59 PM] Lalita Sister: కవితా గానం
అంశం
:సెకండ్ వేవ్
మొదటి అల....
వస్తూవస్తూనే ఎన్ని అలజడుల జడుల్ని మోసుకొచ్చింది....!!!
సుదూరతీరానఉన్న మనవళ్ళని మనవాళ్ళని
చూస్తామో లేదో నన్న
మానసికసంఘర్షణ లతో
మనిషికి మనిషికి మధ్య దడి కట్టి
ఒంటరి తనాన్ని కట్టబెట్టి
క్వారంటైన్ల మొట్టికాయలనెన్నో
తినిపించింది
మానవత్వానికే మడి కట్టించిన మహమ్మారి
విగత జీవులగతాన్ని తీరం పైకి విదిల్చి
వికటాట్టహాసం చేసి గాని విశ్రమించ లేదు
సానిటైజర్ల సంజీవనులు
మాస్క్ లమందలింపులు
రక్షకకవచాలసాక్షిగా
ఎన్ని కసరత్తులు..!!
ఎన్నెన్ని కవాతులు..!!
ఎట్టకేలకు శోధించి
సాధించామనుకున్నంతలోనే
సాథింపులు మళ్ళీ మొదలయ్యాయి
.......
రెండవ అలగా రెచ్చి పోయింది
అల కాదు సుమీ...!!..
సునామి.....!!!
ఈసారి
బేఖాతరుకు ప్రతిఫలంగా తలరాతలనే మార్చేసింది
దృతరాష్ట్ర కౌగిలిని రుచి చూపించింది
బంధాలనెన్నింటినో త్రెంచి
కబంధ హస్తాలతో కబళించింది
పది తలలరావణాసురుడి లా
విరుచుకు పడుతున్నది
ఏమరుపాటుకు కానుకగా
మరుభూమిని ఇవ్వాలనుకున్నది కాబోలు
మిత్రమా!!!
మనలో మనమాట
కడిగి కడిగి విసిగి వేసారిన మనం
కరోనాను కడిగేయలేమా....????
సంకల్పానికి కొత్త ఊపిరి పోద్దాం
ప్రాణవాయువుతో ఆయువు నిద్దాం
విడివిడిగా ఉంటూనే...
కలివిడిగా పోరాడుదాం
ఆత్మ స్టైర్యం తో అడుగులు వేద్దాం
సెల్ఫ్ డిసిప్లిన్....
సెల్ఫ్ లాక్ డౌన్ లతో
పద్మవ్యూహాన్ని ఛేదిద్దాం
***** లలితాకృష్ణ
1
[18/05, 8:03 PM] దీపక్ న్యాతి: *కవితా గానం*(సీజన్ 1)
పేరు : డా.దీపక్ న్యాతి
తేది : 18-05-2021
అంశం : సెకండ్ వేవ్
శీర్షిక : బలం పెంచుకున్నా భరతం పడతాం
సెకండ్ వేవ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది
కరోనా కోవిడ్ నైన్ టీన్ వేరియంట్
స్వాభావికమో మనిషి సృజనో
చైనాలో వెలుగులోకొచ్చిందీ రోగం
ఏడాది కాలం ఏడిపించింది
మన పొరపాటు లేకనే మన కర్మ కాలింది
కాచుకుని కాపాడుకునేందుకు
తెగించి పోరాడి అలసి సొలసి
బలైన త్యాగమూర్తులు కొందరైతే
ప్రాణాలకు తెగించి మెజారిటీ రోగుల
కాపాడింది కర్తవ్యం మూర్తులు
వ్యాక్సిన్ని ఆవిష్కరించామని ఆనందించేలోపు
గుణం మార్చుకొని బలం పెంచుకున్నానని
సెకండ్ వేవ్ భారత్ చుట్టుముట్టింది
మనిషి ఊపిరితిత్తులు ఉరేసుకుంది
శ్వాస ఆడనీయక గొంతు పిసికేస్తోంది
చేతులుడిగిన రోగి కుటుంబీకుల
నిస్సహాయ కేకలు కరోనా చెవికెక్కలేదు
ఘోరకలిని గుట్టుచప్పుడు కాకుండా
కరాళ నృత్యంతో మారణహోమం
సృష్టిస్తోంది స్మశానల పెంచేస్తోంది
తన నీడల బ్లాక్ ఫంగస్ ని వలేసి
బంధిస్తోంది బలి తీసుకుంటోంది
అదృష్టం చాటున పదిలంగా ఉండడం తప్ప
డాలు లాంటి మందులు ముందుండే వరకు
కవచంలా ఔషధం రక్షణ కల్పించే వరకు
నిరీక్షణ నీరు కారనీయకుండా నిల్చోవాలి
ఆశలను సజీవంగా ఉంచుకోవాలి
డా.దీపక్ న్యాతి
నంది అవార్డి
హైదరాబాద్
2
[18/05, 8:35 PM] Ambati Narayana Nirmal: ఇదో కొత్త నడక"
ఓ వినూత్న చూపుతో చూస్తున్నా!!...
మీరందరు కొత్తగా కనబడుతున్నారు...
కొత్తనడకతో కదులుతున్నారు...
నమ్మకాల్ని తలకు చుట్టుకొని...
విశ్వాసాల్ని భుజాలకు తగిలించుకుని..
లోకసంచారులై...
రోడ్లపై తిరుగుతున్నారు!!...
అవినీతి జాడ్యం అంతమయ్యేవరకు...
ఈ వింత తప్పదు!!...
ఈ నడకా తప్పదు!!...
అర్థం కాని సిద్ధాంతాలమధ్య
వర్తమానాన్ని వదలి...
వ్యర్థమైపోతున్నారు!!...
చూపులు ఎక్కడా మరల్చకుండా...
మీకు మీరే ఏదో విశ్లేషించుకుంటూ...
మీకు మీరే ప్రశ్నించుకుంటూ...
మీకు మీరే సమాధానాలు చెప్పుకుంటూ....
కొత్త వెతుకులాటతో...
నడక సాగిస్తున్నారు!!...
ఏదో సమైక్యతా రాగాన్ని ఆలపిస్తూ...
అందరి నుంచి దూరమవుతున్నారు!!...
ఇప్పుడు సమాజం అగాధాలలో ఉంది..
తరతరాలనుంచి వస్తున్న
నమ్మకాలను వదలకుండా...
సంప్రదాయాల్ని విడవకుండా...
నాటి అనుభవాల సారాన్ని...
అనుభూతుల దారుల్ని...
జీవితాంతం భుజాలమీదనే... మోస్తున్నారు!!...
బంధాలను గుండెలో బంధించుకొని...
అందరి ప్రేమల్నీ చుట్టేసుకొని...
గాఢాంధకారంలో కదులుతున్నారు!!...
బతుకు మీ అధీనంలో లేనప్పుడు...
బాధలు మీచుట్టూ తిరుగుతుంటే...
ఈతిప్పలు తప్పవు!!...
చుట్టూ అంతస్తులు ఉన్నా...
మీ చూపులకు అందినవి...
కడుపు కాలినప్పుడు...
పదాలను కలిపి పాటపాడుతారు!!...
పరిపూర్ణబతుకుకోసం పరితపించేమీరు
ఎంతో గొప్పవారు!!...
వేదననిండిన మనసుకు వేకువఎక్కడ?
బరువెక్కిన బతుకులకు దారెక్కడ?
మానవతకు కట్టుబడి...
మానవీయతకు లోబడి ఉండే...
మీకు ఈ కొత్తనడక ఓ లెక్కనా!!??
కొందరు భయపడుతూ...
మరికొందరు భయపెడుతూ...
నిజాన్ని మింగేసి...
అబద్దాని కక్కేస్తుంటారు!!...
జాగ్రత్తగా నడక సాగించండి!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
3
[18/05, 8:46 PM] Korada: కవితాగాన0
నేటి అంశం :- secend vave
* ఇది చరిత్రచేప్పిన సత్యం *
కోరాడ నరసింహా రావు...! *************************
@ఉప్పేన @....ఓకసారి వచ్చినఅనుభవంలా...కరోనా!
భయ భ్రాంతులను చేసేస్తే...
కకావికల మై పోయిన జనం
ఇప్పుడిప్పుడే కాస్తంత ఊపిరి
పీల్చుకోబోతుంటే.....!!
ఈ పుణర్విజ్రుమ్భణ వార్త సృష్టించిన అయోమయం నుండి తేరూకోక ముందే....
మళ్ళీ విరుచుకు పడిపోయిందీ
మహమ్మారి కరోనా...!
హోస్పిట ల్లలో మంచాలు చాలక....విద్యాలయాలే కాదు
అవకాశమున్న ప్రతి చోటూ...
కరోనా చికిత్సా కేంద్ర మై పోతున్నా.....ఖాళీలు లేక....
అర్ఢరాత్రీ లేదు... అపరాత్రీ లేదు.... పేశేన్ట్లను పట్టుకు తిరిగే ప్రజల అగచాట్లు...!
వాక్సిన్లన్నీ... ప్రైవేటుల పరం
చేతులేత్తేసిన ప్రభుత్వాలు...!
ఊపిరులాడక... ఉసురులు బాస్తున్న వ్రుద్దులను మించి పోతున్న రేపటి భవిత యైన
యువత....!
ఆరోగ్యశ్రీ పేరుతో అంతకు పది వంతుల దోపిడీ....!
అకస్మాత్తుగా... కోటీశ్వరుల
జాబితాలోకి కార్పోరేటు ఆశుపత్రులు...!!
భద్రతకు నోచు కోలేని పౌరుల
బ్రతుకులు....!
ఇంత జరుగుతున్నా...
కక్ష సాధింపులు.... అధికార తాపత్రయాల నాయకులు!!
ఆహా.... కరోనా.....
మాకేన్నేన్ని....కోంగ్రోత్త జీవీతానుభవాలను చవిచూపిస్తున్నావు కరోనా!
ఇంకా...నీ మృత్యు కేళికి....
త్రుప్తి కలగ లేదా...!?
నువ్వేంతగా రేచ్చి పోయినా...
తుది గేలుపు మాదే...!
ఇది చరిత్ర చేప్పిన సత్యం...!!
*********************
4
[18/05, 8:47 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: మొదటి అల
అనుభవం తెలుసు
ఇప్పుడు కరి మకుటం లాటిన్ భాషలో కిరీటం పెట్టి ఊపిరితిత్తులలో చేరి యమ బాధపడుతూ ఎన్నో ప్రాణాలను హరించింది
సెకండ్ వేవ్ లో
క్షణకాలంలో ప్రాణాలను హరిస్తుంది
ఎందరో జీవితాలు ఆక్సిజన్ అందక బలిపశువులు అయ్యారు
ఇంకా ఎంతోమంది ది మొబైల్
ఆస్పటల్ అంబులెన్స్ లో
పరలోక గతులు అయ్యారు
వేల క్రిమికీటకాలు మనిషిని అంతం చేస్తున్నా
ఇక ఇచ్చి ఇవ్వకుండా
కష్టాల పాలు చేస్తున్నాయి
ఈ విషాదాల కు ఈ మరణాల బోగట్టా కు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు
ఇంకా చరమగీతం పాడింది
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఈ ఈ సెకండ్ వేవ్ క్రూరత్వాన్ని కళ్ళముందు చూస్తూనే ఉన్నాం
దయచేసి సెకండ్ వేవ్ విజృంభణ నుండి రక్షణ చెయ్యండి
ఈ విష క్రిమిని టీకాతో తన్ని తరిమి వేయండి
ప్రాణాలను రక్షించుకుందాం కరోనా బారినుండి
సెకండ్ వేవ్ నుండి
రక్షణ పొందుదాం
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453
5
[18/05, 8:48 PM] Korada: కవితాగాన0
నేటి అంశం :- secend vave
* ఇది చరిత్రచేప్పిన సత్యం *
కోరాడ నరసింహా రావు...! *************************
@ఉప్పేన @....ఓకసారి వచ్చినఅనుభవంలా...కరోనా!
భయ భ్రాంతులను చేసేస్తే...
కకావికల మై పోయిన జనం
ఇప్పుడిప్పుడే కాస్తంత ఊపిరి
పీల్చుకోబోతుంటే.....!!
ఈ పుణర్విజ్రుమ్భణ వార్త సృష్టించిన అయోమయం నుండి తేరూకోక ముందే....
మళ్ళీ విరుచుకు పడిపోయిందీ
మహమ్మారి కరోనా...!
హోస్పిట ల్లలో మంచాలు చాలక....విద్యాలయాలే కాదు
అవకాశమున్న ప్రతి చోటూ...
కరోనా చికిత్సా కేంద్ర మై పోతున్నా.....ఖాళీలు లేక....
అర్ఢరాత్రీ లేదు... అపరాత్రీ లేదు.... పేశేన్ట్లను పట్టుకు తిరిగే ప్రజల అగచాట్లు...!
వాక్సిన్లన్నీ... ప్రైవేటుల పరం
చేతులేత్తేసిన ప్రభుత్వాలు...!
ఊపిరులాడక... ఉసురులు బాస్తున్న వ్రుద్దులను మించి పోతున్న రేపటి భవిత యైన
యువత....!
ఆరోగ్యశ్రీ పేరుతో అంతకు పది వంతుల దోపిడీ....!
అకస్మాత్తుగా... కోటీశ్వరుల
జాబితాలోకి కార్పోరేటు ఆశుపత్రులు...!!
భద్రతకు నోచు కోలేని పౌరుల
బ్రతుకులు....!
ఇంత జరుగుతున్నా...
కక్ష సాధింపులు.... అధికార తాపత్రయాల నాయకులు!!
ఆహా.... కరోనా.....
మాకేన్నేన్ని....కోంగ్రోత్త జీవీతానుభవాలను చవిచూపిస్తున్నావు కరోనా!
ఇంకా...నీ మృత్యు కేళికి....
త్రుప్తి కలగ లేదా...!?
నువ్వేంతగా రేచ్చి పోయినా...
తుది గేలుపు మాదే...!
ఇది చరిత్ర చేప్పిన సత్యం...!!
*********************
6
[18/05, 9:02 PM] +91 98480 05676:
కట్టడి మరుస్తే
......................
భయం లేని బాతు గుడ్లు పెడ్తది బజార్ల
పాలు తాగే పిల్లి కళ్ళు మూసుకొని
ఎవరూ చూస్తలేరనుకుంటుంది
చీమలను చొరబడనిస్తే
పాములు ఫర్వాలేదనొస్తాయి
మనమేం తక్కువా
మనీషా మజాకా
సందు దొరికితే నియమాలు సూర్లె చెక్కుతాం
నిఘా నిద్రపోతుంటే, గుర్రుకొడ్తుంటే
నడి బజార్ల కట్టడి కట్లు తెంపుతాం
పెయిల భయం గుడ్లు పెట్టడం మానేస్తే
బరితెగింపు బాజాప్తాగా ఊరేగుతది
మనమేం తక్కువా
మనిషా మజాకా
కరోనా కల్లు తాగిన కోతిలా కరుస్తుందని
లాక్ డౌన్ కు చప్పట్లు కొట్టాం,దీపాలు వెలిగించాం
జాగ్రత్తలకే జ్వరం వచ్చేంత పాటించాం
వైరస్ ను ఏరేరి మందులతో మసి చేసినం
కదలికలపై కన్నేసి కాటేసినం
మనమేం తక్కువా
మనిషా మజాకా
తగ్గినట్లే తగ్గి వైరస్ రోగం తిరగబెడ్తే
కట్టడి పాలన నటించింది నిద్ర
సభలు, సరదాలు, విజయోత్సవాలు, కుంభమేళాలు
సందట్లో సడేమియాలా విచ్చలవిడితనాలు
మనమేం తక్కువా
మనిషా మజాకా
మాస్కులు గదువలకు వేలాడితే
కోవిద్ నోట్లో నోరు పెట్టింది
భౌతిక దూరం భంగం చేసిన సరదాకు
తన్నుకు చచ్చేంత తగులుకుంది
శుభ్రతను అప్పడంలా నమిలేస్తే
దివాలా తీయించి దిక్కున్న చోట చెప్పుకోమంది
మనిషెంత ..నలిపేస్తే చీమంత అంది
నియమాలను గంగలో వదిలిన స్వేచ్ఛ
శవాల వాసన సందు సందుల్ల
పిచికారీ చేసినట్లు వైరస్ విజృంభన
ఆస్పత్రులు నిండు డబ్బు గర్భిణులు
కాలిన చేతులతో లాక్ డౌన్
మనిషే మజాకైపోతుంటే
జీవజాలంలో మనమే అన్నింటికంటే తక్కువ
............... ..................... .............
కొమురవెల్లి అంజయ్య
సిద్దిపేట
తేదీ ..12-05-2021
7
[18/05, 8:01 PM] Kompelli Ramaiah Poet Kmm: అంశం: సెకండ్ వేవ్
శీర్షిక:కరోనా ...నీ వెంత కఠినం...!
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం
చరవాణి:7032504646
కరోనా...!
అచేతన స్థితిలో ఉన్న ఒక నివురు గప్పిన
విశ్వ నాశన రక్కసి ప్రోటీన్ కణం
అవనంతా సునామీలా
ఆక్రమించిన మహమ్మారి మరణం
చీమిడితో చిందేస్తూ చెలిమి చేస్తూ
అతి వేగంగా విభజన చెందే మరణ శాసన గణం...!
కరోనా...!
నిశ్శబ్దంగా ముసుగు దొంగలా
ముఠాగా శ్వాస కోశాలు చేరి
ఊపిరతిత్తులను చిత్తుగా చేసి
జలగల్లా రక్తనాళాలను దోపిడి ముఠా దొంగల్లా
ప్రాణవాయువును అడ్డుకొని
మానవాళిని పిట్టల్లా రాల్చుతుంది...!
కరోనా...!
పడిశం తో పలువురిని ఉరిలా పాకుతూ
తుమ్మిన వాడు తమ్మునిగా
దగ్గిన వాడు తాతగా
పరిశుభ్రత పరమావధిగా పాటించే వాడు శత్రువుగా
అహర్నిశలు రాబందువుగా
అవకాశం కోసం ఎదురుచూస్తున్న రక్కసి...!
కరోనా...!
నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన ఉపద్రవం
కట్టడి చేసినా కనికరించని రాకాసి విష సంద్ర కెరటం
బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు
దూరం చేసిన మరణ మృదంగనాదం
స్వీయ నియంత్రణలో వారెంట్లేని క్వారంటైన్...!
కరోనా...!
మానవుణ్ణి అతిదేయిగా చేసుకున్న పరాన్న జీవి
గబ్బిలంలా విశ్వ విహారం చేస్తూ
పొడగరి మకుటంలా లాటిన్ భాషలో కిరీటం
అని అర్థం ఉన్నదని ప్రపంచానికి విషం చిమ్మే
ముళ్ల కిరీటం పెడతావా
సెకండ్ వెవ్ లో నైనా సెలవు తీసుకో కరోనా
కరోనా... నీ వెంత కఠినం...!
8
[18/05, 8:22 PM] +91 94904 14273:
*గాలిగత్త రోచ్చెంది*
ప్రకృతి లోని గాలి కి గత్త రొచ్చింది
వికృతి చేసిన మనకు వికట్టట్టాహసం చేస్తుంది
పంచభూతాలను పిడికిట్లో పట్టూకుంటానంటీవి
పంచప్రాణాలు గాలి గ త్తా రాలో కలవబట్టే
వర్ణర హీత ఎదను రంగుల తో అద్ది
శ్వేత వర్ణపు దుప్పటి కప్పుకుని బతుకు తెళ్ళారవట్లే
ఎదగడానికి పోటీపడుతూ
వల్లకాడుకు వరుసలో వుండవడటివి
గాలినిచ్చే చెట్టును నరకి గాలి ట్యాంకుల కే ధర కట్టవడిటివి
నవ్వ డని కి సమయం లేక
నడమంత్రపు సిరి కి వేళ్ళడుతివి
ధైర్య పూ సుద్దులుచెప్పే గుడునుచేరిపి
ఆనాలో చన వారితో ఆత్మీయత లాయే
నీ ఆశ లో చెరువులు,కుంటలు,గుట్టలు ఆవిరై
నీడ గాలి నీరుకి ఆపసోపాలు పడుతుంటే
గాలికి గ త్త రోచ్చింది
మనో స్టైర్యాం వీడక మనసు కుదుట పడనివ్వు
బజారుకెళ్లి బతుకు బండిని కూల్చకండి
కూరగాయలతో గాయాలు చేయకండి
మందు విందులతో మత్తెక్కి తిరగకండి
ఇకనైనా మానుకో
మార్పు దారి వెతుక్కో
మూతికి బట్ట
చేతికి శానిటైజర్
ఆరడుగుల దూరం
ఇల్లే సురక్షితం
ఇల్లే ఆనందం
ఇల్లు ఆహ్లాదం
ఇంట్లోనే ఉండండి
ఆరోగ్యంగా ఉండండి
రచన కే వి రమణ చారి
తెలుగు పండితులు
నిజామాబాద్
9
[18/05, 8:25 PM] +91 91771 92275: కవితా గానం సీజన్ 2
అంశం : సెకండ్ వేవ్
18-5-2021
*****************
సరికొత్త వ్యూహాలు..ఆయుధాలతో
నిర్ధాక్షిణ్యంగా దాడి చేస్తూ..
దేహ రాజ్యాలపై దురాక్రమణకు
పాల్పడుతుంటే
అచేతనంగా నిలబడిపోతేనో
ఆవేదనలో మునిగిపోతుంటేనో
అక్కున చేర్చుకుందుకది మనిషి కాదు
నిర్లిప్తత నీకు నప్పని లక్షణం
ఎన్నో కలలింకా మిగిలే ఉన్నాయి
ఆవిష్కరించుకోవాల్సిన
నైపుణ్యాలింకా అదను చూస్తున్నాయి
ఆలోచనలను అనగారనీకు
ఆవేశాన్ని చేజార్చుకోకు
విసిగి..విసిరేసుకుందుకు నీకున్న
జీవితం ఒకటే కదా..!
మిత్రమా..
నువ్వు శతృవుకంటే మేలైనోడివి కాదా..
పోరాటమింకా మిగిలే ఉంది..
కనిపించని క్రమేదో..దారికాసే ఉంది..
కలబడేందుకిది సమయం కాదు
కోల్పోతున్న అసువులు కొత్త పాఠాలు
చెబుతున్నాయి
ఎడతెగని విషాదాలు..తెరిపిన పడేదుంది
ఈ దుఃఖ సునామీలన్నీ సమసిపోయేదుంది
తొడుగులలోనే కన్నీళ్ళను కట్టడి చేసుకో
ఇల్లే దుర్భేద్యమైన కోట
ముఖానికి ముసుగే మన్నికైన అస్త్రం
ఎద గాదుల నిండుగా..స్థైర్యాన్ని నింపుకుంటే
కబళిస్తున్న క్రిమిని కాలరాయచ్చు
సంయమనంతో..ఎదుర్కో విజయం నీదే !
దారల విజయ కుమారి
10
[18/05, 8:27 PM] +91 94904 14273: *గాలిగత్త రోచ్చెంది*
ప్రకృతి లోని గాలి కి గత్త రొచ్చింది
వికృతి చేసిన మనకు వికట్టట్టాహసం చేస్తుంది
పంచభూతాలను పిడికిట్లో పట్టూకుంటానంటీవి
పంచప్రాణాలు గాలి గ త్తా రాలో కలవబట్టే
వర్ణర హీత ఎదను రంగుల తో అద్ది
శ్వేత వర్ణపు దుప్పటి కప్పుకుని బతుకు తెళ్ళారవట్లే
ఎదగడానికి పోటీపడుతూ
వల్లకాడుకు వరుసలో వుండవడటివి
గాలినిచ్చే చెట్టును నరకి గాలి ట్యాంకుల కే ధర కట్టవడిటివి
నవ్వ డని కి సమయం లేక
నడమంత్రపు సిరి కి వేళ్ళడుతివి
ధైర్య పూ సుద్దులుచెప్పే గుడునుచేరిపి
ఆనాలో చన వారితో ఆత్మీయత లాయే
నీ ఆశ లో చెరువులు,కుంటలు,గుట్టలు ఆవిరై
నీడ గాలి నీరుకి ఆపసోపాలు పడుతుంటే
గాలికి గ త్త రోచ్చింది
మనో స్టైర్యాం వీడక మనసు కుదుట పడనివ్వు
బజారుకెళ్లి బతుకు బండిని కూల్చకండి
కూరగాయలతో గాయాలు చేయకండి
మందు విందులతో మత్తెక్కి తిరగకండి
ఇకనైనా మానుకో
మార్పు దారి వెతుక్కో
మూతికి బట్ట
చేతికి శానిటైజర్
ఆరడుగుల దూరం
ఇల్లే సురక్షితం
ఇల్లే ఆనందం
ఇల్లు ఆహ్లాదం
ఇంట్లోనే ఉండండి
ఆరోగ్యంగా ఉండండి
రచన కే వి రమణ చారి
తెలుగు పండితులు
నిజామాబాద్
హామీ పత్రం ": ధీనిని నేను స్వయంగా రాసిన కవిత ఇది ఎవ్వరీ అనుకరణకా దు అని హామీ ఇస్తున్నాను.
11
[18/05, 8:32 PM] మన్నె లలిత గారు కవయిత్రి: కవితాగానం
తేదీ :18/ 5 /21
అంశం : సెకండ్ వేవ్
శీర్షిక :అంతంలేని ఆవేదన
పేరు : మన్నె లలిత
హైదరాబాద్
చరవాణి సంఖ్య: 761 686 32 89.
**************************************************
సంవత్సరం పాటు కాలాన్ని
తన సుడిగుండంలో తిప్పి
ఊబి లోనికి నెట్టి
కుటుంబాలకు కుటుంబాలను
చప్పరించి ఆకలి తీరక
మొదటి సూదితో గుచ్చినా
భయం లేని కరోనా
రెండో వేవ్ గా వచ్చి
రెండో సూదితో గుచ్చినా
రోదించని కరోనా
మరింత బలం పుంజుకుని
రాక్షస మాయలా మరింత విజృంభిస్తూ
ఇంటిల్లిపాదినీ హరిస్తున్న
నిన్ను భరిస్తున్న మేము
నిరంతర పరిశోధనలతో నీ అంతం చూచి
మా భావితరాలకు భవిష్యత్తు నిస్తాం
థర్డ్ వేవ్ గా నువ్వు వచ్చినా
తట్టుకొని నిలబడలేక పారిపోతావ్
ప్రభుత్వం అంటే ప్రజలు
ప్రజలంటే ప్రభుత్వం
అని ఒకరికొకరు సహకరించి తే
చెప్పిన జాగ్రత్తలు పాటించితే
ఎవరికి వారు ఒక సైనికుడిలా పాటుపడితే
శత్రువు పారిపోతుంది
ఇకనైనా చెట్లు కొట్టక
నీటి సమృద్ధి జాగ్రత్తలు తీసుకొని
వ్యాక్సినేషన్ అందరికీ అందించి
ప్రాణవాయువు సరఫరా ఇచ్చి
ప్రాణాలు నిలబెట్టి
తగు జాగ్రత్తలతో కరోనాను నశింపజేసి
ప్రభుత్వానికి సహకరించి
ప్రాణాలు నిలబెట్టుకోవాలి
12
[18/05, 8:49 PM]
అఫ్సర్ వలీషా గారు: కవితా గానం (సీజన్..2)
అంశం...సెకండ్ వేవ్
శీర్షిక....అంతిమ ఘడియ
ఆప్యాయతల అల్లికలు
విడదీసుకుని పరిగెడుతున్నాం.....
ఆత్మీయ ఆలింగనాలు
అల్లంత దూరాన విసిరేసి
చేతులెత్తి దండం పెడుతున్నాం.. ....
హృదయ విదారక
ఏరోజు కారోజు కూలీల
అవస్థలు చూస్తూ భరిస్తున్నాం. ....
చిరు వ్యాపారుల
ఛింధ్రమైన దీనావస్థలు
చూడలేక చూస్తున్నాం....
తెల్లకోటు ఖాకీ సఫాయీల
నిస్వార్థ సేవలు నిరంతరం
పొందుతున్నాం....
దయ జాలి లేకుండా
మరణ మృదంగాన్ని
మరలా మరలా మ్రోగిస్తూ
కంటికి కనబడక కాటేస్తున్న
ఓ క్రిమీ ఆగని నీ పయనం
ఎందాకా....
ఆప్యాయతల చిగుర్లకు
మొగ్గలు తొడిగేది ఏనాడో...
దిగులు మేఘాల పరదాలు
పెకిలించి ఆనంద తీరాలు
చేరేది ఏనాడో....
బంధనాల ముడులు
విప్పుకుని
ఆత్మీయ కలయిక ఎప్పుడో....
అడుగడుగున భయభ్రాంతుల
తోడు నీడల శత్రువుతో
ఆగని పయనానికి అంతిమ
ఘడియ ఏనాడో.....!!
మొహమ్మద్ .అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి )
13
[18/05, 8:53 PM] +91 70755 17538:
పేరు.ధనాశి ఉషారాణి
అంశము.సెకండ్ వేవ్
.........
మితిమీరిన మానవ
మేధస్సుకు
శాస్త్రీయ విజ్ఞానముకు పరాకాష్ట కరోనా
భయము లేక బతుకు విలువు తెలియక
ముందుకు వెల్లుతున్న మనిషికి
కాస్త బతుకు మీద భరోసా కలిగి
సామాజిక దూరము పాటిస్తూ
మూతికి మాస్క్ కట్టి మునుముందుకు
సాగాలి కరోనా టీకాను రక్షణ కవచముగా స్వీకరించి
బతుకు దారిలో భవిత బాగును కోరి
మునుముందుకు సాగిపోయాలి
చిన్న పిల్లల ప్రాణము కోసము
తగిన విచక్షణతో ముందుకు సాగాలి
సానిటైజర్ వాడుతూ ఆరోగ్య బద్రత పాటించాలి
మనిషి మనిషికి మధ్య దూరమే
మన భవితకు నిజమైన బాటని నమ్ముదాము
కరోనాను తరిమి కొడుదాము
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
14
[18/05, 8:59 PM] +91 94401 46435:
*కవితా గానం**(సీజన్2)*
*****************************
*పేరు:వనపర్తి గంగాధర్*
ఊరు:హన్మకొండ
చరవాని:9440146435
తేదీ:18.05.2021
*అంశం:సెకండ్ వేవ్*
*శీర్షిక:మరణ మృదంగం*
అవని స్వర్గాన్ని నరకంగా
మారుస్తున్న కనిపించని పిశాచి కరోనా
చైనా దుశ్చర్యకు ఆనవాలు
మానవ వినాశనానికి మూలకారణం
ఫస్ట్ వేవ్ లో ఎందరినో తన
గుప్పిట్లో బంధించి ప్రాణాలు తీసింది
ప్రపంచమంతా బతుకు భయాన్ని నింపింది
ప్రాణాలకు భరోసా లేకుండా చేసింది
కరోనా చేసిన విలయ తాండవ
విషాద ఛాయలు ఇంకా చెరిగిపోనే లేదు
వార్షికోత్సవం జరుపుకుని
సెకండ్ వేవ్ గా మళ్ళీ విరగబడి విజృంభిస్తున్నది
దానికి చిన్నా పెద్దా,ఆడ,మగా లేదు తేడా
ఊపిరి అందకుండా చేసి ఊపిరితీస్తుంది
పసివాడని పసివాళ్ళని కూడా వదలని
క్రూర మాయా వైరస్ కరోనా
మారణహోమమై మానవులపై విజృంభిస్తుంది
శవాల కుప్పలను చేసి విరగబడి నవ్వుతుంది
గాలిలో తిరిగే నిన్ను గాలిలోనే కలిపేస్తాం
నీ అంతుచూస్తాం నీ గొంతు నొక్కేస్తాం
ఓ మనిషీ ధైర్యాన్ని కోల్పోకు
నీ శక్తి అసమానం అద్వితీయం
జాగ్రత్తాగా ఉందాం మనం
కరోనాను ఖతం చేద్దాం
ఆనందంగా జీవిద్దాం
హామిపత్రం:
ఈ కవిత నా స్వీయ రచన అనువాదం, అనుసరణ కాదని హామీ ఇస్తున్నాను
15
[18/05, 9:00 PM]
సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*
తేదీ:18-05-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: సెకండ్ వేవ్ 🌊
*********************
గుబులు ఇంకా గుండె గూటిని వీడనే లేదు
మనసింకా ధైర్యాన్ని కూడగట్టు కోనేలేదు
కరోనా మొదటి అల
సృష్టించిన భయోత్పాతం
ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించిన జ్ఞాపకాలు
ప్రపంచ యవనికపై చెరిగిపోనేలేదు...
మూతికి,ముక్కుకు మాస్క్ చేతులకు శానిటైజర్
భౌతిక దూరంతో
గీసుకున్న లక్ష్మణరేఖలలో
నిన్ను జయించామనీ
దేశమంతా పండుగ చేసుకున్నాం..
దీపాలు వెలిగించాం
చప్పట్లతో బెదరగొట్టాం..
ఇక నీవు రావనే ధైర్యంతో
ఇదిగో నా దేశ ప్రజలు కొందరు
అప్రమత్తత విడిచి
క్రమశిక్షణ నియమాలు మరిచి
చేసుకున్న విందులు వినోదాలు
ఎన్నికల పేరుతో
వీధుల్లో చేసిన స్వైర విహారాలు
గీతలు దాటిన మనుషులు..
చూసింది కరోనా
చేసింది వికటాట్టహాసం
సెకండ్ వేవ్ గా వచ్చి
సునామీలా ముంచుకొచ్చి
బతుకుల్ని అతలాకుతలం చేస్తోంది!
మరణ మృదంగం మోగిస్తూ
మానవ బంధాలను హరిస్తూ
యమపాశంతో ఊపిర్లకు ఉచ్చులు బిగిస్తోంది...
విశాల ప్రపంచంలో ఉచితంగా
దొరికాల్సిన ప్రాణవాయువు
ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అందక
ఆసుపత్రులలో మృత్యువుతో
పోరాటం చేయిస్తోంది...
విషాద ఘటనలను చూసైనా
నేర్చుకోవాలి కరోనా పాఠాలు!
మనోధైర్యమే మనల్ని బతికించే జీవ గంజి
ఎస్ ఎమ్ ఎస్ నియమాలే
మన చుట్టూ రక్షక భటులు..
యోగ ప్రాణాయామాలే
మనసును శరీరాన్ని దృడ పరిచే సంజీవనీ రూపాలు!
ఎన్ని వేవ్ లు వచ్చి బెదిరించినా
కరోనాను ఎదుర్కొనే శక్తి వంతమైన ఆయుధాలివే!
*వురిమళ్ల సునంద, ఖమ్మం*
9441815722
16
[18/05, 7:59 PM] +91 74166 38823: అంశం: కరోనా మాలి దశ
కవితా శీర్షిక:
స్వీయ క్రమశిక్షణే పరిష్కారం""
మూతికి మాస్క్ లేకుండా
చేతులను శానిటైజ్ చేసుకోకుండా
దూరం పాటించక దగ్గరగా సంచరిస్తూ
విందులూ వినోదాలను ఆస్వాదిస్తూ
మానివేసిన కరచాలనాల సంస్కృతిని తిరిగి ఆరంభిస్తూ
కరోనా తొలిదశ టీకా రాకతో కనుమారుగైందన్న ఆనందంతో
జనజీవన స్రవంతిలో కలసిమెలసి నవ్య జీవితాన్ని
ఆరంభిద్దామనుకుంటున్న తరుణంలో.....
కన్ను కుట్టిన కరోనా హైరానా చేస్తూ
మళ్ళీ తన మలిదశను ఆరంభించి
కనివిని ఎరుగని రీతిలో ప్రాణనష్టాల్ని కలిగిస్తూ
మృత్యు ఘంటికలను.మ్రోగిస్తూ
మన నిర్లక్ష్యపు ప్రవర్తనపై ప్రతీకారం తీర్చుకుంటూ
మన స్వయంకృతానికి అపరధాన్ని విధిస్తూ
వాయువేగంతో అందర్నీ కలియబెడుతూ
తన రాకనే తెలియనియకుండా శరీరంలో తిష్ఠవేస్తూ
వయసున్న వారిని, వయస్సుమీరిన వారిని
తన మృత్యు కౌగిలిలో బంధించి ఉక్కిరి బిక్కిరి గావిస్తూ
మానవ జీవన గతిని చిత్రాతి విచిత్రంగా మలుపులు తిప్పుచు
అనాథ శవాలుగా మార్చి అంత్యక్రియలకూ దూరం చేస్తుంది
పుడమితల్లి హృదిలో కరోనా శవాల గునపాలను గ్రుచ్చుతుంది!
ఏ స్వీయ క్రమశిక్షణతో కరోనా తొలిదశ ను ఎదుర్కొన్నామో
అదే స్వీయ క్రమశిక్షణను తూ.చ. తప్పక పాటిస్తూ
అపోహలను వీడి కరోనా నిరోధక టీ కాను వేయించుకుని
కరోనా మలిదశ వికట్టాట్టహాసాన్ని విరగడ గావించుకుందాం
మా 'నవ' విజయాన్ని మరోసారి ప్రపంచానికి చాటుదాం!
............................................రచన
ఆళ్ల నాగేశ్వరరావు
నాజారుపేట
తెనాలి....522201
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
సెల్ నెంబర్.7416638823
17
[18/05, 8:06 PM] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: అంశం: సెకండ్ వేవ్
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
తేది: 18-5-2021
కవిత సంఖ్య: *3*
*************************
*విరగబడుతున్న విరోధం*
ఈశాన్యంలో పుట్టి
ఏడాది పూర్తి చేసింది
జనజీవనాన్ని అతలాకుతలం చేసేసింది
కాలసర్పం కుబుసం విసర్జించి కొత్త రూపం దాల్చి
వార్షికోత్సవం జరుపుకొంటుంది.
మృత్యువు పరిష్వంగ చెఱలో కాలాన్ని మింగేసి
విశ్వమంతా విలయతాండవమాడుతుంది.
ఏమరుపాటుగా వున్న బతుకులో కాలకూటం ఎగజిమ్మి
హాహాకారాల మృత్యు ఘంటికలు కొడుతూ వుంది.
శ్వాసాడని వెంటిలేటర్ మీద ఆక్సిజన్ దుర్భిక్ష రోగం
అంటుకున్న ఆసుపత్రుల తీరు
రాబందు క్రీనీడల్లా కార్పొరేట్ ఆసుపత్రుల పీడనలు
శవాలను తాకితే తాము వశమై పోతామనుకున్న బంధు జనం
శవాల మోత అంబులెన్సులు చుక్కల్లో చార్జీలు!
చీడ పురుగు చేరి చెట్టు చెరచునట్టు ఒక్క పురుగు వేల పురుగులై దేశాన్ని కబళించినట్టు.
ప్రపంచానికి టీకా సరఫరా చేసిన గర్వం
స్వదేశానికి ప్రాణవాయువు అందివ్వని నిస్సహాయత!!
పోతే పోనీ ప్రాణాలు
తగ్గుతుంది జనాభా రేటు
పెరుగుతుంది జీడీపీ రేటు
ప్రాణాలరచేత పట్టి
గృహనిర్బంధంలో
మూతికి చిక్కం కట్టి
చేతులకు రసాయనం రుద్ది కరోనాని అడ్డుకుందాం.....
బతుకులు బట్ట కట్టాలంటే
చచ్చి బతకాలి
ప్రాణాల మీది తీపి వుంటే
కట్టుబడి వుండాలి!
******
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
ఇట్లు మీ
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
18.
[18/05, 9:20 PM] Balloori Umadevi Poetess: కవితా గానం
డా బల్లూరి ఉమాదేవి
అంశం:సెకండ్ వేవ్
శీర్షిక:హెచ్చరిక
సామ్యవాదిని నేనంటూ
అందరు నాకు సమానమంటూ
విర్రవీగే కీటకమా
ఏ వాదమైనా ప్రజాగ్రహంతో
కాలి బూడిద కాక తప్పదు సుమా
మేలు చేసే క్రిమివే అయితే
నెత్తిన పెట్టుకు తిరిగేవాళ్ళం
సన్మానాలు చేసేవాళ్ళం
చాప కింద నీరులా చేరి మమ్మల్ని
ముంచేయాలనుకొంటే ఇదిగో విను
అక్కడే నీకు సమాధి కట్టే స్తాం
మంచిని పెంచే సామ్యవాదంకావాలి
మాజాగ్రత్తలో మేమున్నాం
ముసుగు తీయక మసలుకొంటున్నాం
ఆరడుగుల దూరం పాటిస్తున్నాం
పెళ్ళిళ్ళూ పేరంటాలకు దూరంగా వుంటున్నాం
విరుగుడు టీకాలు వేయించుకొన్నాం
చెడు వ్యాపించే నీలాంటి విషప్పురుగు
మాకే కాదు ఈ విశ్వానికే అక్కర్లేదు
వచ్చిన దారినే తిరిగి చూడక పారిపో
జన్మలో మళ్ళీ తిరిగి రాకు
నీ చావును స్వహస్తాలతో కొన్ని తెచ్చుకోకు.
నమస్తే.హెచ్చరిక అనే ఈ కవిత నాస్వీయరచన.ఇది దేనికీ అనుకరణ కానీ అనుసరణ కానీ కాదను హామీ పత్రం జతపరచుచున్నాను.
డా.బల్లూరి ఉమాదేవి
కామవరం/ఆదోని
19
[18/05, 9:22 PM] Aparajith: కరోనా!
ఊపిర్లపై పంజా విసిరి
ఖల్,,,ఖల్,,,,మని దగ్గు
ముక్కు చీదుతూ ముహం ఉబ్బి
ఊపిరితిత్తుల రక్తనాళాలు ఆగి ఆగి రక్త ప్రసరణ
కరోనా పెద్దపులిలా విరుచుకుపడి
మనుషుల ప్రాణాలతో చెలగాటం!
కరోనా గత్తర ప్రపంచం నిండా
మనుషుల మారనకాండ కొనసాగుతుంది
మనిషిని మనిషి కనీసం తాకకుండా
దూరమవుతున్న మనుష్యుల మధ్య బంధాలు!
మనుషుల అలికిడికే గుండె లబ్ డబ్
లాక్ డౌన్ లతో కరోనాని అదుపుచేద్దామని తపన
ధుఖిద్దామంటే ఆవిరయిన కన్నీళ్ళు
మనసున పూచిన పూలు నల్లరంగు గులాబీలు
కరోనాలో మునిగిన మనుషులు ఒంటిమీది బట్టలు చింపుకుని
ప్రభుత్వఆసుపత్రుల్లో దిన దిన గండంగా బ్రతుకులు
లక్షలకు లక్షలు మింగే ప్రయివేటు ఆసుపత్రులు
రోగులు దుఖం దిగమింగుతూ
చిన్నపాటి వైద్యానికి చిగురుటాకుల్లా వణికించి బయటపడేస్తూ
వైద్య వృత్తి ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారమయ్యింది
వైద్యులు చదివిన చదువులు ఎడారి మృగతృష్ణ !
పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే కళాశాలల్లో చదివిన డాక్టర్లు
వ్యాపారమయ వైద్యం చేసే నల్లనాగులయ్యారు!!
ఈ విచిత్ర వైద్యాల కంటె మనమే కట్టడితోపాటు వైద్యం చేసుకోవాలి!!
ఆపరాజిత్
20
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం...సెకండ్ వేవ్
శీర్షిక...మనోధైర్యం
ఏ క్షణాన ఉద్బవించిందో
ఆ కణం
మహా మొండిఘటంలా
మాటు వేసి కూర్చుంది
మొదటి వేవ్ లోనే
మన దాకా రాదులే అన్న నిర్లక్ష్యం
చాపకింద నీరులా ప్రాకి
నేడు సెకండ్ వేవ్ అంటూ
మారణహోమం సృష్టిస్తుంది
కనిపించని కరుణలేని క్రిమి
ప్రపంచాన్నే గుప్పిట్లో బందించింది
మనిషి దేహంలోకి దూరి
ప్రాణ వాయువు అందనివ్వకుండా నిలిపివేస్తూ
ఎన్నో కుటుంబాలను విషాదంలో ముంచుతుంది
ప్రకృతితో చెలగాటం
ప్రాణ సంకట0గా మారి
ప్రకోపంతో ప్రకృతిప్పుడు
పగతీర్చుకుంటుంది
భౌతిక దూరమని హెచ్చరిస్తున్నా
విచ్చలవిడిగా సంచరించే యువతే
నేడు కరోన చెరలో బందీలు
బంధాలు అనుబంధాల
ఆప్యాయతలు లేవిప్పుడు
గాలే విషతుల్యం
దేవుడైన రక్షించలేని స్థితి
సాంకేతికత ప్రగతిని సాధించానని
నాకెదురు లేదని విర్రవీగి
యంత్ర0లా తిరిగిన మనిషి
ఒంటరి యోధుడిప్పుడు
పూర్వ ఆచారాలు
మన ఆయుధాలు
మనో ధైర్యమే
మహా బలమిప్పుడు
మూతికి మాస్క్
చేతికి శానిటైజర్ల పూతలు
స్వీయ నియంత్రణ
యోగా సాధనాలే
ఆరోగ్యానికి దివ్య ఔషధాలు
కరోన మూలాల్ని పెకిలించే వజ్రాయుధాలు
గృహానిర్బంధమే హద్దుగా
కోవిడ్ టీకాలు రక్షణగా
కనిపించని శత్రువును ఎదుర్కొ0దా0
విజయం సాధించుదాం
ఈ కవిత నా స్వీయరచన.కేవలం సమూహం కోసం రాసినదని హామీ ఇస్తున్నాను
21
కవితా గానం
సెకండ్ వేవ్
ధూమకేతువై సెకండ్ వేవ్
ఎగలేచింది
గుడ్లురిమి చూసింది
ఎటుచూసినా హాహాకారాలే
ఆర్తనాదాలే
అనాథ ప్రేత సంస్కారాలే
ప్రాణేశ్వరుని కడచూపుకు
నోచుకోని ప్రాణేశ్వరి
కన్నకొడుకులబాధను
చూచే ప్రాప్తం లేని కన్నతండ్రి
తోబుట్టువుల శవసంస్కారాన్ని దగ్గరుండి చూచుకోలేని తమ్ముడు
అసలు భర్త మరణమే తెలియని భార్య మరణం
హయ్యో
సెకండ్ వేవ్
డా.నాయకంటి నరసింహ శర్మ
వనపర్తి
22.
అంశం :సెకండ్ వేవ్
బాలు కత్తుల
మొదటి మచ్చ మాసిపొలేను లేదు
సెకండ్ వేవ్ లో చుక్కలు చూపిస్తుంది
మరణ మృదంగం వాయిస్తూ ఇంటింటికి అంటుకుంటుంది
పరస్పరం సహకారం అందించ లేని పరిస్థితి
మానవ సంబంధాల మధ్య చిచ్చు రాజేసింది
మానవత్వం మరిచి పోయి ప్రాణ భయం తో వణుకుతుంది దునియా
ఆక్సిజన్ అందక బేడ్లు దొరక మృత్యువు కౌగిట్లో పోరాటం
తిండి తిప్పలు లేక ఆకలి పస్తులతో అల్లడిన జనం
తల్లి ని పిల్ల చూసే విలు లేక
తండ్రిని బిడ్డా చూసే వీలు లేక ..
కండ్ల ముందర కరోనా కబలిస్తుంటే...
ఊపిరి తీస్తుంటే...
ఎం చేయని నిస్సాయత లో సెకండ్ వేవ్ ఎంతో మంది ఉసురు తీస్తోంది.
ఎక్కడ నుంచి వచ్చానో..
ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి దిక్కు మొక్కు లేని భయంకరమైన చావు బతుకులు తలుచుకుంటే..
మనసు చలిస్తుంది కంట కన్నీరు సెలయేరులా పారుతుంది...

Comments
Post a Comment