నిర్వహణ
శివునూరి లలితా కష్ణ
వీరా గుడిపల్లి
*************
ధనాశి ఉషారాణి గారు
1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
2.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
3.కొంపెల్లి రామయ్య గారు
4.చేబియ్యం శ్రీనివాసరావు
5.సింహాద్రి వాణి గారు
6.నాన
7.సునంద వురిమళ్ళ గారు:
8.మన్నె పిన్నక లలిత గారు
9.సర్ఫరాజ్ అన్వర్ గారు
10.డా.బల్లూరి ఉమాదేవి గారు
11.వల్లాల విజయ లక్ష్మి
12.మద్ది పుల్లారావు గారు
13.భరద్వాజ గారు
14. ఇంద్రవత్ రాహుల్ గారు
15.డా.పాండాల మహేశ్వర్ గారు
16.కందూరి సుజాతా రాణి గారు
17.చేబియ్యం శ్రీ నివాస్ గారు
18.మేకల రామస్వామి గారు
*************
] సునంద వురిమళ్ళ గారు:
కవితా గానం ( సీజన్ 2)*
తేదీ:07-05-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: రవీంద్ర నాథ్ ఠాగూర్
శీర్షిక:
*********************
మొట్టమొదటి నోబెల్ బహుమతితో
భారతజాతి గౌరవ పతాకను
విశ్వ సాహిత్య వినీలాకాశంలో
ఎగరేసిన మహనీయుడు!
విద్యా విధానం చిలుక చదువు కాకూడదని
శాంతి నికేతన్ స్థాపించిన బాలల హక్కుల పరిరక్షకుడు!
ఎక్కడైతే మనిషి నిర్భయంగా భావోద్వేగాలను వ్యక్త పరుస్తాడో
అక్కడే స్వేచ్ఛ ఉంటుందని తెలియజెప్పిన విశ్వ కవి!
సమస్త సంవేదనలను
అనేక ప్రక్రియల్లో అక్షరీకరించి
ప్రపంచ సాహిత్యంలో
తనదైన ముద్ర వేసుకున్న మహా కవి!
నేర్చుకోవాలనే తపనుంటే వయసు సమస్యే కాదని నిరూపించి
అద్భుతమైన చిత్రకారుడిగా పేరొందిన మహనీయుడు!
సంగీత సాహిత్య లలిత కళల్లో పేరొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి!
ప్రకృతిని, పనితనాన్ని ప్రేమించిన సున్నిత మనస్కుడు!
జనగణమన గీతంతో దేశ భక్తిని చాటుకుని
భారతీయ సంస్కృతీ వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసి
గీతాంజలిని అందించిన రవీంద్రనాథ్ ఠాగూర్
మాతృభూమి ఒడిలో ప్రభవించిన బెంగాలీ ముద్దు బిడ్డడు!
*వురిమళ్ల సునంద,ఖమ్మం*
[07/05, 9:30 PM] +91 70755 17538: శీర్షిక.రవీంద్రుడు
.......
కవనపు కిరణము భువిలోన
అవని లోన నిలిచి
యువతకు ఆదర్శ మయ్యావు
కవల లోక మందు
పుడమిలో దారిన నీవును
కడలి దారి నీది
కవన సోయగముగా భువిలోన
భువిలోన కవిగాను నిలిచావు
కవివి నీవు అయ్యి
పరవశించేటికథలునందు
పరిణతినినె పొంది
ప్రతియిమనిషినందు దేవుణ్ణి
కాంతి వలెను చూసి
కవితనే సోయగమనినమ్మి
ప్రతియినిమిషమoదు తపించి
ప్రతియి మదిని తట్టి
ప్రకృతియి నందున నిలిచావు
ప్రక్రియ లెన్నొ మలిచి
మాసిన మతముల బేధము
మూసినట్టి మదిని
చెరిపిన సోయగమయ్యావు
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
భాకరాపేట
1
రవీంద్రుని జీవితం....సాహిత్యం
శీర్షిక:
విశ్వ కవీంద్రుడు""
విశ్వ సాహితీ వినిలాకాశంలో
విరబూసిన సాహితీ కుసుమం రవీంద్రుడు!
వంగదేశమున దేవేంద్రనాధ్, శారదాదేవిలకు
జన్మించిన జాతిరత్నం రవీంద్రనాధుడు!
గెఅమాభ్యుదయమే దేశాభ్యుదయంగా భావించి
శ్రీ నికేతాన్ని నెలకొల్పి
గ్రామ పునర్నిర్మాణంకు విశేష కృషి సల్పిన
సంఘ సేవకుడు రవీంద్రుడు!
బాలల హృదయ వికసానికై
శాంతి నికేతాన్ని స్థాపించి
ప్రాచీన గురుకుల అందింప చేసిన
సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షకుడు రవీంద్రుడు!
మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలసిమెలసి ఉండాలనే
ఉత్తమ సందేశంతో రాసిన గోరా
నవలా రచయిత రవీంద్రుడు!
రవీంద్ర సంగీతం అనే శాఖను ఏర్పర్చిన
భారతీయ సంగీతాభిలాషి విశ్వకవీంద్రుడు రవీంద్రుడు!
దెబ్బదియేండ్ల ప్రాయంలో చిత్రకళను ఆరంభించి
పలు చిత్రాలను విదేశాల్లో ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రవీంద్రుడు!
భారతీయుల్లో దేశభక్తిని పెంపొందించేలా
జనగణమన జాతీయగితాన్ని రచించిన జాతీయకవి రవీంద్రుడు!.
ప్రపంచ భాషల్లోకి అనువాదించబడి న భక్తిగీతాల సంకలనం
గీతాంజలి కి నోబుల్ బహుమతిని సాధించిన విశ్వకవీంద్రుడు రవీంద్రుడు!
విశ్వ శాంతికై సాహితీ రచనలు గావించి
జాతీయస్థాయిలో భారతీయ సాహిత్యాన్ని
విశ్వ వ్యాపితం గావించిన మేధావి మన విశ్వకవీంద్రుడు రవీంద్రుడు!
...........................................
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
సెల్ నెంబర్.7416638823
2
: కవితాగానం (సీజన్ 1&2) కవితలపోటీకొరకు
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం, పాండిచ్చేరి
8328079336
అంశం.. రవీంద్రుని జయంతి సందర్భంగా
శీర్షిక.. విశ్వకవి మహాయోగి
🌹🌹🌹🙏🌹🌹🌹
విశ్వకవివైన ఓ మహాయోగీ !
నువ్వు భారతదేశానికి ముద్దుబిడ్డవి
నోబెల్ బహుమతీ గ్రహీతవైన నీకు
సాటి ఎవరయ్యా మహానుభావా !
విశ్వవిఖ్యాతమైన జాతీయగీతం
జనగణమన అధినాయక జయహే !
ప్రతిఒక్కరి గుండెల్లో చోటుచేసుకుంది
ప్రతిపిల్లల మనసులనాటుకుపోయింది
సాక్షాత్తుచదువులతల్లి పేరైనశారదాదేవి
నీ మాతృమూర్తిగాఁ పరమపావనుడైన దేవేంద్రనాథ్ నీ పితృదేవులుగాఁ...... మహాసాధ్విమృణాళిని నీఅర్ధాంగిగా
పొందిననీవు గొప్పమహానుభావుడవు
గీతాంజలికి నోబెల్ పురస్కారంపొందిన
ఘనతనీకేదక్కిన మాహనీయచక్రవర్తివి
ప్రజల మనసును దోచుకున్న ప్రజాకవివి
భరతమాతముద్దుబిడ్డడు మనఠాగూర్
బాల్యంలోనే అనేకవ్యాసాలు, పద్యాలు
కవితలు వ్రాసి అధ్యాపకులచే మన్నన
పొంది పదునారు ఏండ్లకే భానుసింహ
పుస్తకంరచించి గోరానవలను అందించి
ఎన్నో రచనలుచేసి విశ్వకవి ఐనాడు
శాంతస్వరూపుడు పేదల ప్రేమికుడు
ధనవంతుడైన నిగర్వి తాత్వికుడు
అభ్యుదయకవి సాహితీ కిరణము
శాంతినికేతన్ లో చివరిదశలో కాలం
గడిపినఅసలైనజ్ఞానముని మహాయోగి
🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం, 8328079336
3
కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం
చరవాణి:7032504646
క్రమ సంఖ్య:379
అంశం: రవీంద్రనాథ్ ఠాగూర్
శీర్షిక:విశ్వకవి రవీంద్రుడతను...!
వంగ దేశంలో శారదాదేవి దేవేంద్రనాద్ ఠాగూర్ ల పుణ్య ఫలమతను
ఆముదం దీపం ముందు కళ్లోత్తు కుంటూ కునికిపాట్లు పడుతూ చదివిన జ్ఞాన దీపామతను
తెల్లవారగానే ప్రకృతిని పలకరించే సౌందర్య బింబమతను
ఇల్లే విద్యాలయంగ నెంచి క్రమ శిక్షణతో విద్య నేర్చిన విశ్వ గురువతను...!
అంబరమంత నిడారంబరంగ ఎదిగిన భారత కీర్తి కిరీటమతను
ప్రపంచ మొక రహస్యమనీ శోధించి సాధించిన అన్వేషతను
కాళిదాసు షేక్స్పియర్ ల రచనలను ఒంట బట్టించుకున్న విక్రమార్కుడతను
మాతృ భాష పట్ల ప్రేమ చాటిన అభిమానదనుడతను ...!
బాల్యంలోనే పద్య గద్య విమర్శలను ప్రచురించిన కవీంద్రుడతను
బంకించంద్ర చటర్జి చే ప్రశంశలు పొందిన ప్రభాకరుడతను
భక్తి గీతాలను ఆంగ్లం లోకి అనువదించిన గీతాంజలి కృతి కర్త అతను
విగ్నే రేర్ స్వప్న భంగ ,సంగీత ప్రభాత కావ్యాల గ్రంథ నిధియతను...!
బాలల హృదయాలు వికసింప చేసిన శాంతినీకేతన కలువరేడతను
గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని శ్రీకేతనాన్ని స్థాపించిన సామాజిక శాస్త్రవేత్త అతను
మతాలు వేరైనా కలిసి ఉండాలనే సందేశమిచ్చిన మానవతావాది అతను
స్వాతంత్ర్య సమరంలో వెనుదిరగని మేరు నగదీరుడతను ...!
ప్రేమ భావాన్ని , మార్మికత ను నింపుకున్న కవన శిఖరమతను
కవిత్వమనే ఎల్లలు లేని హృదయ భాషకు దార్శనికుడతను
భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన జయ కేతనమతను
గీతాంజలికి నోబెల్ గంధ మద్ది జగానికందించిన విశ్వ కవి రవీంద్రుడతను...!
(రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా)
4
కవితాగానం సీజన్ - 02 కవితల కోసం
శీర్శిక : రవీంద్రుడు
అంశం : విశ్వ కవి
రచన : చేబియ్యం శ్రీనివాసరావు
ఊరు : గుజరాతిపేట , శ్రీకాకుళం
చరవాణి : 7674055482
శారదా , దేవేంద్రనాథుల ముద్దుబిడ్డగా జననం
గంపెడు సంతానాలా కాలంలో పదనాల్గవ బిడ్డగా ప్రత్యేకం
వంగదేశాన వెలుగు దివ్వెగా ప్రకాశం
కలం ఆయన జీవం
కుంచె ఇంకొక వరం
గీతాంజలి తో విశ్వవ్యాప్తం
జన గణ మనతో జాతి గౌరవం
ఆంగ్లమున గీతాంజలి
తెచ్చిపెట్టెను నోబుల్ పురస్కారం
విశ్వకవిగా గుర్తింపు పొందెను
వీనుల విందుగా సాహిత్యం రాసెను
రవీంద్రుడు భరతావని కవీంద్రుడు
భరత కవితాకీర్తిని దిగ దిగంతాలకు చూపిన భవ్య కాంతి
శ్రమతో విజయమని చెప్పిన ధాతృత్వం
విశ్వవిద్యాలయ స్థాపకుడు
స్వతంత్ర పోరాట నాయకుడు
జోహారు విశ్వకవి
వందనం భరత మాత ముద్దుబిడ్డా
5
కవితా గానం సీజన్-- 2
శీర్షిక:--రవీంద్ర కవీంద్రుడు
రచన:--సింహాద్రి వాణి
ఊరు:--విజయవాడ
చరవాణి:--7569820872
వంగదేశాన పుట్టిన రవీంద్రుడతడు
విశ్వవిఖ్యాతి చెందిన కవీంద్రు డతడు
సాహిత్య సాగరాన్ని మథించి
సంధ్యాగీత్, విర్గరేర్ స్వప్న భంగ
సంగీత ప్రభాస్ మున్నగు విలువైన సాహిత్య శమంతక మణులను వెలికి తీసిన ఘనుడు అతడు
గీతాంజలిని రచించి
ప్రపంచ ప్రఖ్యాతినీ,
నోబెల్ బహుమతినీ,
విశ్వకవి బిరుదునూ పొందిన
గొప్ప సాహితీవేత్త అతడు
జనగణమన--జాతీయగీత రచయిత అతడు
విద్య కొరకు విశ్వభారతినీ,
కళల కొరకు కళాభవనాన్నీ
గ్రామాభ్యుదయానికి శ్రీనికేతన్ నూ స్థాపించిన వ్యవస్థాపకు డతడు
ఎన్నో నాటకాలూ,భక్తి గీతాలనూ రచించడమే కాక,
డబ్భై యేళ్ళ వయసులో చిత్రలేఖనం నేర్చుకొని
కొన్ని వేల చిత్రాలు గీసిన చిత్రలేఖకుడతడు
గొప్ప దేశభక్తుడూ, రచయిత, గాయకుడు, చిత్రకారుడూ,సామాజికవేత్త,
విద్యావేత్త అయిన బహుముఖ ప్రజ్ఞాశాలి మన రవీంద్ర కవీంద్రుడు
హామీ:-- ఇది నా స్వీయరచన
సింహాద్రి వాణి
విజయవాడ
6
కవితా గానం సీజన్-2*
రవీంద్రనాధ్ ఠాగూర్ జయంతి సందర్భంగా...
పేరు: నాశబోయిన నరసింహ(నాన),
ఊరు:చిట్యాల, నల్గొండ,
చరవాణి:9542236764
⚜️⚜️⚜️⚜️⚜️♦️⚜️⚜️⚜️⚜️⚜️
*విశ్వ విఖ్యాత సాహిత్య తేజం*
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
శారదాదేవి దేవేంద్రనాధ్ ల పుత్రరత్నం
జన్మభూమిపై ఎనలేని ప్రేమాభిమానం
మానవ సంబంధాలపై అచంచల విశ్వాసం
సర్వమతాల సారమొకటని చాటిన ఘనుడు
సంగీతం చిత్రకళా రంగాల్లో విశేష ప్రావీణ్యం
బాల్యంలో మాతృభాషపై పెంచుకున్న మమకారం
చిరు ప్రాయంలోనే సాహితీ సేద్యంతో
అక్షరాలను ఆణిముత్యాలుగా మార్చిన కవిరత్నం
ప్రకృతి ఆరాధకుడై తన కవన కిరణాలతో
అనంత జగత్తు జాగృత పరిచే ప్రభాత సూర్యుడు
దేశానికి జాతీయ గీతం ప్రసాదించిన కవీశ్వరుడు
బాలమేధోవికాసానికి శాంతినికేతన్ స్థాపించే గురుదేవుడు
గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని
శ్రీనికేతన్ నెలకొల్పిన మహా మౌనముని
సామాజిక చైతన్యం ఉత్తమ సందేశంతో
విశేషమైన గుర్తింపు నిచ్చిన గోరా నవల
సకల సృష్టి పట్ల కలిగించే ప్రేమభావం
శ్రమశక్తి మహాత్యం చాటిన గీతాంజలి సందేశం
ప్రపంచ సాహిత్యంలో గీతాంజలి మహా కావ్యం
నోబెల్ పురస్కార మందుకున్న మణిమకుటం
ఓ రచయిత ఓ చిత్రకారుడు సంగీత వేత్తగా...
ఒక విద్యా వేత్త గొప్ప మానవతా వాదిగా...
విశ్వవిఖ్యాత సాహిత్య తేజమా! విశ్వ కవీశ్వర ఠాగూర్ !
నీ కీర్తి ఆచంద్రతారార్కం!నీ అమోఘసేవ అజరామరం!
❇️❇️❇️❇️❇️🟣❇️❇️❇️❇️❇️
*హామీ పత్రం:* ఈ కవిత నా స్వీయ రచన.దేనికీ అనువాదం, అనుసరణ కాదనీ హామీ ఇస్తున్నాను.
✍️ *నాన*
7
తేదీ:07-05-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: రవీంద్ర నాథ్ ఠాగూర్
శీర్షిక:
*********************
మొట్టమొదటి నోబెల్ బహుమతితో
భారతజాతి గౌరవ పతాకను
విశ్వ సాహిత్య వినీలాకాశంలో
ఎగరేసిన మహనీయుడు!
విద్యా విధానం చిలుక చదువు కాకూడదని
శాంతి నికేతన్ స్థాపించిన బాలల హక్కుల పరిరక్షకుడు!
ఎక్కడైతే మనిషి నిర్భయంగా భావోద్వేగాలను వ్యక్త పరుస్తాడో
అక్కడే స్వేచ్ఛ ఉంటుందని తెలియజెప్పిన విశ్వ కవి!
సమస్త సంవేదనలను
అనేక ప్రక్రియల్లో అక్షరీకరించి
ప్రపంచ సాహిత్యంలో
తనదైన ముద్ర వేసుకున్న మహా కవి!
నేర్చుకోవాలనే తపనుంటే వయసు సమస్యే కాదని నిరూపించి
అద్భుతమైన చిత్రకారుడిగా పేరొందిన మహనీయుడు!
సంగీత సాహిత్య లలిత కళల్లో పేరొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి!
ప్రకృతిని, పనితనాన్ని ప్రేమించిన సున్నిత మనస్కుడు!
జనగణమన గీతంతో దేశ భక్తిని చాటుకుని
భారతీయ సంస్కృతీ వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసి
గీతాంజలిని అందించిన రవీంద్రనాథ్ ఠాగూర్
మాతృభూమి ఒడిలో ప్రభవించిన బెంగాలీ ముద్దు బిడ్డడు!
*వురిమళ్ల సునంద,ఖమ్మం*
8
కవితాగానం- సీజన్ -1
తేదీ :7/5/ 21-- శుక్రవారం
అంశం: రవీంద్రనాథ్ ఠాగూర్
శీర్షిక: విశ్వకవి
పేరు :మన్నెలలిత
ఊరు :హైదరాబాద్
చరవాణి సంఖ్య :741 686 32 89
అధిక సంతానంలో ఆఖరి వాడై
సేవకులచే పెంచబడ్డా
సోదరుల పిల్లల్ని కూడగట్టి
తెల్లటి తెర గట్టి ఆడిన నాటకాలు
చదివిన, వ్రాసిన నవలలు
చూచిన ప్రకృతి సౌందర్యాలు
తండ్రి ఇచ్చిన రంగులతో
చిత్రించిన ప్రకృతి చిత్రాలు
పిల్లలను ప్రకృతిలో మమేకం చేయుటకై
స్థాపించిన శాంతినికేతన్ విద్యాలయం
హిమాలయాలంటే ఇష్టుడై
పలుసార్లు సందర్శించి సంతోషించిన రవీంద్రుడు
పెద్ద వయస్సులో వీణ నేర్చుకున్న వైణికుడు
ఎవరెస్టులా ప్రపంచ ప్రసిద్ధమైన గీతాంజలితో
విశ్వకవియై ,నోబెల్ బహుమతి గ్రహీతయై,
దేశ పతాకకు దీటుగా జనగణమన రచించిన
విశ్వకవి రవీంద్ర నీకు ఇదే వందనం.
9
కవితాగానం సమూహం..
అంశం : *రవీంద్రుని జయంతి..*
🌸 *ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో..*🌸
మాతృభూమి పట్ల మమకారం
మానవ సంబంధాలపై విశ్వాసం,
అనుబంధాలపై అచంచలనమ్మకం,
సహజప్రకృతిపై ప్రేమాభిమానాలు కలిగి
ఆముదపు దీపం ముందు పుస్తకం
పట్టుకుని
ప్రకృతి సౌందర్యాన్ని, కథలను ఆస్వాదిస్తూ నాలుగ్గోడల మధ్యే గడిపిన తనకు బాహ్యా ప్రపంచం ఒక రహస్యమనీ, అద్భుతమనీ భావించిన చిన్ని బాలుడు
గురుకులమూలాలున్న *శాంతినికేతన్* ను
ప్రారంభించి సహజసిద్ధమైన ప్రకృతిఒడిలో,
స్వేచ్చా వాతావరణాన్ని సృష్టించి చిన్నారులకు విద్యాబుద్దుల్ని నేర్పించి
నిరాశనిస్పృహల్ని, సకలసృష్టిపై ప్రేమభావం,
శ్రమ యొక్క మహితను సూచించే గొప్ప గ్రంథమైన *గీతాంజలితో* నోబెల్ ను అలంకరించి విశ్వకవి కవీంద్రుడుయై ఖ్యాతిగాంచి
దేశకీర్తిపతాకను విశ్వవిపణిలో రెపరెపలాడించి
*జనగణమనను* అశేష జనవాహిని హృదయస్పందనగా మలిచి
అధ్యయానికి వయసు అడ్డంకి కాదనీ
డెబ్భై ఏళ్ల వయస్సులో చిత్రలేఖనం నేర్చుకొని ప్రావీణ్యం సంపాదించి
*ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో*
ఎక్కడ విద్యా స్వేచ్ఛగా అభ్యసించబడ్తుందో
బాల్యం తన మధురిమల్ని ఆస్వాదిస్తుందో
విద్య ప్రకృతి ఒడిలో నేర్పించబడుతుందో
అక్కడ బహుముఖప్రజ్ఞాశాలియైన రవీంద్రుడి జ్ఞాపకాలు, మూలాలు దర్శనమిస్తాయి
*సర్ఫరాజ్ అన్వర్..*✍🏻
10
డా.బల్లూరి ఉమాదేవి
అంశం:విశ్వకవి
విశ్వకవిగ జేజేలు అందు కున్న ధీశాలి
జనగణమన అనుచు జాతీయగీతమును
జాతికి అందించి ఖ్యాతుడైన విశ్వకవి
ఖండమందే తొలిసారిగా విశ్వవిఖ్యాత మైన
నోబుల్ బహుమతిని పొందిన భారతీయుడీకవి
విదేశాలలో ఎంత విద్యనభ్యసించిన గాని
స్వదేశ భాషలో కవితలెన్నో రచియించె
మాతృభాష లోనే గాక ఆంగ్ల భాషలోకి
అనువదించినట్టి కవివరేణ్యుడీమనీషి
శాంతినికేతనమే సదనమై విరాగిగా మారె
దేశ దేశముల పర్యటించి తాను
మనుషులంతా ఒక్కటే అని చాటె జగతి
నడయాడు విజ్ఞాన కోశమే ఈ సుకవీంద్రుడు
వ్యక్తి గాడు మేరువంతటి గొప్ప శక్తి ఇతడు
మదిని నిర్మలముగా నుంచుకొన బోధించె
జీవితపు ఆఖరిమజలి మృత్యువనుచు
నూసు లాడ పిలిచే మృత్యుదేవతనే
మదిని నిర్మలముగా నుంచుకొనమని బోధించె
గీతాంజలి వ్రాసి జగద్విఖ్యాతిడయ్యె
జనులు మెచ్చినట్టి గురుదేవుడయ్యె.
డా.బల్లూరి ఉమాదేవి
కామవరం/ఆదోని
11
రవీంద్ర కవీంద్రుడు
వెలసిన నేల ఇది
ఎక్కడ భావం విశాలంగా ఉంటుందో
ఎక్కడ ప్రజలు జీవన భావనతో రవీంద్రుడు కవీంద్రుడు గా
ఎక్కడైతే తే
వెలుగు వెన్నెలగా
శాంతి నికేతన్ సకల
మనసుతో మనసు నిరంతరం
ఎక్కడ శాంతినికేతన్ గానమై
ఎక్కడో నాటకాలను ప్రదర్శించారు శాంతి సామరస్యం ప్రకటించి
ఎక్కడ ప్రజలు జీవన భావనతో రవీంద్రుడు కవీంద్రుడు గా
కుటీర పరిశ్రమలకు
నెలకు అది
ప్రజలందరికీ అనేక కుటీర పరిశ్రమలకు నెలవైంది
రవీంద్రుడు గీతాంజలి కాంతులను వెదజల్లుతూ లోకానికి వెలుగును జ్ఞానాన్ని ప్రసాదించి
మానవ వికాసానికి నిలిచిపోయే నోబెల్ ప్రైజ్
భారతానికి వెలుగు వెన్నెల కిరీటాన్ని అందించిన
గీతాంజలి అంజలి 🙏🏾🎉
11
[07/05, 9:32 PM] Lalita Sister: *గురుదేవ్*
*********
విశాల ప్రేమతత్వఝల్లులు
కురిపించిన కవీoద్రుడే మన రవీంద్రుడు
తొలి ఐరోపేతరుడైన నోబెల్ విజేత
ప్రథమ ఆసియావాసియైన భారతీయుడు
గ్రామీణ సంస్కృతే భారత అభ్యుదయానికి
పునాది అని భావించిన మేధావి
శాంతినికేతన్ విశ్వభారతి
విశ్వవిద్యాలయ స్థాపకుడైన సంగీతజ్ఞాని
చిత్రలేఖకుడైన నాటకకర్త పాటల ముని
భారత్ బంగ్లా దేశాల జాతీయ గీతాల
అరుదైన రచయిత
భక్తిప్రేమ "గీతాలతో సృష్టికర్తకు
అంజలి"ని ఘటించిన సాహితీశ్రష్ఠ
బెంగాల్ విభజనను వ్యతిరేకించిన
దేశభక్తుడు
బ్రహ్మ సమాజ అభిమాన కుటుంబ వారసుడు
జలియన్ వాలాబాగ్ మారణకాండ కు చలించి
'సర్" బిరుదును త్యజించిన గురుదేవుడు
ప్రపంచ వ్యాప్తంగా అభిమాన దనరాశులను సంపాదించుకున్న ఘనుడు
తండ్రీ!నా దేశాన్ని స్వేచ్చాస్వర్గానికి మేల్కొలుపు"మన్న మార్మిక శబ్ద మాధుర్యాల తత్వవేత్త
తన భగ్నహృదయ'గని నుండి బయల్పడే సాహితీవజ్రాలు
చిన్ననాడు ఇంటికే పరిమితమైన బాలుడు
కాబూలీవాలా పోస్ట్ ఆఫీస్.. మానవీయ కోణాల లేఖకుడు
మనసి నుండి గోరా వరకు ప్రతి రచన విలువైనదే!
విశ్వక(ర)వి కి నేను ఘటించే జ్యోత ఇదే!
: వల్లాల విజయలక్ష్మి
ఆలేరు
12
ప్రక్రియ:వ్యాసం
శీర్షిక: గీతాంజలి
పేరు:మద్ది.పుల్లారావు
ఊరు:నందిగామ
.........
మానవుడిహృదయానికివిశాలత్వాన్నిచ్చి,ఉన్నత పరివర్తన కలుగజేసేదే గీతాంజలి. మానవునికి ఈశ్వరుని ప్రేమ ఎంత అవసరమో,ఈశ్వరునికి మానవుని ప్రేమ అంత అవసరమని రవీంద్రనాద ఠాగూర్ అద్బుతంగా వివరించారు.
గీతాంజలి బెంగాలీ పాటలు పూర్తిగా తెలియకపోయినావాటిగానం,శబ్ధలాలిత్యం,పదాల ధ్వని విన్యాసం ఇవన్నీ ఆకర్షిస్తాయి.మానవుడు తనకు ఈశ్వరనితో గల సంబంధాన్ని గుర్తించి స్నేహ మాధుర్యాన్ని అనుభవించడం ఆధ్యాత్మికానుభవం.అదే గీతాంజలి లో విశేషం.
నువ్వే కానీ, నేనే కానీ ఉన్నది ఒకటే ఇదీ ఆధ్యాత్మిక ఆరోహణ సోపానం.నేను కోరకుండానే నాకిచ్చిన నిరాడంబరమైన గొప్ప వరాలు ఆకాశం, కాంతీ,యీ దేహం జీవితం అంటాడు కవీంద్రుడు.ఆధ్యాత్మికానుభూతి,ఈశ్వరానురాగం అమృతమయమని మానవుడు పూర్తిగా మర్చపోయాడు.ఐశ్వర్య మధంతో మత్తెక్కి మాయలోపడ్డ యీ అల్ప మేధస్సులకు యీ సత్యం బహిర్గతం కాదన్నారు కవీంద్రులు.
బలహీనులకీ,బద్దకస్తులకీ ఏమాత్రం అందరానిది ఆత్మసాక్షాత్కారం అంటుంది మాండుకోపనిషత్తు. వెలుగు ను చీకటి తరిమే చోట,గ్రీష్మం వెంట తగిలి వర్షం సమీపించే చోట,ఆ తోవ పక్క ఎదురు చూస్తూ కూచుని ఉండడం నా ఆనందం అంటారు ఠాగూర్. జీవిత పరమావధీ,హే మృతీ,నా మృతీ ,రావొచ్చి నా చెవిలో రహస్యం పలుకు అంటారు కవి. అద్వైతానికి సవతి తమ్ముడు సైన్సు అనీ,సైన్సు కందని రహస్యాలు సృష్టి లో ఎన్నో ఉన్నాయని చెబుతారు.నన్నల్లుకున్న బందాలు మొండివి.కాని వాటిని తెంపుకోవాలని ప్రయత్నిస్తే నా హృదయం బాదిస్తుందని రాగ,బందాల గూర్చి చెబుతారు.
గీతాంజలి రవీంద్ర నాధ ఠాగూర్ గారు రచించిన అద్భుత కావ్యం.దానికి చలం గారి అనువాదం గూడా అద్భుతమే.
.....🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఇది నా స్వీయరచన. హామీఇస్తున్నాను
...మద్ది. పుల్లారావు
నందిగామ
9951287113
13
[07/05, 9:32 PM] Lalita Sister: 🚹కవితాగానం🦚
అంశం-రవీంద్రుడు
శీర్షిక-అజరామర కీర్తిమంతుడు.
పేరు- భరద్వాజ రావినూతల
ఊరు-కొత్తపట్నం
చరవాణి-9866203795
***************************
రవీంద్రుడు
విశ్వకవీంద్రుడు-
సాహిత్యాకాశాన ఉదయించిన భాస్కరుండు-
కలకత్తా నగరాన బుట్టి-
చిత్రాంగదతో చిరకాల కీర్తి నంది
గీతాంజలితో నోబెల్ బహుమతిపొంది-
గోరా నవల చరిత్ర ప్రసిధ్దుడైనాడు-
క్రమశిక్షణలో మేటిగా-
మృణాలిని ధర్మచారిణిగా కీర్తి కిరీటాలు అందాడు-
జాతీయ భావాలు జీర్ణించుకుని
వ్రాశాడు జనగణమణ-
భారతావని అంతా చేస్తుంది ఆపాట స్మరణ---
అంటరాని తనాన్ని ప్రారద్రోలేందుకు కృషి చేసి-
విశ్వభారతిని స్థాపించిన విశ్వకవి-
విశ్వసాహిత్యంలో తనస్థానం నిలుపుకున్నధన్యజీవి-
పాటలు నాటకాలు కవితలతో
తరింపచేసుకున్నాడు జన్మ-
అందుకున్నాడు బెంగాల్ కీర్తి కిరీటపు కొమ్మ-
""""""""""""""""""""""""""""""""""""""""
ఇది నాస్వీయరచన
భరద్వాజ రావినూతల
14
*అంశం :* రవీంద్రనాథ్ ఠాగూర్
*తేది :* 07/05/2021
*శీర్షిక :* రవికిరణం గీతాంజలి
*🇮🇳"రవికిరణం గీతాంజలి"🇮🇳*
మహా కవి గీతాంజలి
విశ్వకవి గీతాంజలి
మానవ జీవన భవ్య
భావనకు అద్దం గీతాంజలి
మానవ జీవిత భావుకతకు
కుసుమాంజలి గీతాంజలి
103 కవిత కుసుమాల
గుబాళింపు గీతాంజలి
పరమాత్మ గీతాంజలి
పరమాత్మను స్పర్శించిన
హృదయ స్పందన గీతాంజలి
భారతీయ సనాతన ధర్మ
పరాయణుడు గీతాంజలి
భక్తి భావనల సమాహారం గీతాంజలి
కమనీయ కావ్యలా గుబాళింపు
విశ్వకవి గీతాంజలి
కవిత్వంతో ఎదను తాకే
ఆనంద మంజులా
కవిత మంజరి గీతాంజలి
నిలు వెత్తు ప్రేమకు ప్రతిరూపం
జాతీయ గీతం రచించి
జన జాగృతం పరిచిన పునీతుడు
అలాంటి రవి కిరాణా కవికి అక్షర నీరాజనాలు...
*హామీ పత్రం :* ఈ కవిత నా స్వీయరచన..✍️
*ఇంద్రావత్ రాహుల్*
కొత్తపేట్
నిజామాబాద్
9848054079...
15
[07/05, 9:32 PM] Lalita Sister: ***విశ్వకవి రవీంద్రుడు***
✍️డా.పాండాల.
రవీంద్రుడొక్కడే కవీంద్రుడు
విశాలభావపు ప్రేమతత్వపు
గుళికలు చల్లిన సుగుణోపేతుడు..!
పల్లెసంస్కృతే వెన్నెల కీర్తని
దేశ ప్రగతికి దివ్యౌషధమని
మైత్రీభావమే మానవత్వమని
సంఘ సంస్కరణ శాంతి సఖ్యం
శాంతినికేతన్ మూలస్తంభం...!
వెలుగుబాటకై చిత్రలేఖనతో
సంగీత ఝరుల పరిజ్ఞానిగా
జనగణమన గీతాలాపన
ప్రతిభా తత్వపు తార్కాణం...!
గీతాంజలిలో విశేషతత్త్వం
సగర్వంగా తలెత్తి తిరుగుతూ,
స్వేచ్చాజీవిగ విహరించాలనీ
ఆకాశమంత ఆ హృది చింతన
సాగరతీరపు సయ్యాటలుగా అలలవీచికలు దాటాలంటూ
నిగూఢ యోచన నియమితలోకపు
సత్యాన్వేషణ సాధననెంచిన
పరిపూర్ణ తత్వ పరిజ్ఞానుడు
సుందరభావపు వ్యక్తీకరణకే
నోబెల్ బహుమతి అలంకృతంగా
ఆసియ ఖండపు దివ్యతేజుడు
అదేఅదే నేటికి అపురూపం...!
మానవీయతను మహిలోపంచిన
మహోన్నతం మార్గదర్శనం
తరగని సిరుల మూర్తిమత్వం
సాహిత్య శ్రీలు సంఘశ్రేయమేలు
భారత తత్వపు రవీంద్రుడే సత్యరూపమౌ కవీంద్రుడు..!
✍️డా.పాండాలమహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి
16
[07/05, 9:32 PM] Lalita Sister: అంశం... రవీంద్రనాథ్ ఠాగూర్
శీర్షిక...🌷విజ్ఞత భాండం 🌷
........... .............. ........
శ్రీనికేతన్ స్థాపన చలువ చంద్రుడు రవీంద్రుడు.
శాంతి సహనం రథచక్రాముల
సంగీత సాహిత్య అశ్వాముల
అక్షర కుసుమ హారముల
సేవోభవ రథమున సాగిన రవికిరణం .
జాలువారు భహుప్రజ్ఞ జలతారు జమిందార్ రవీంద్రుడు.
పలు లిపి గ్రంథ ఆకలింపు తో సాహిత్య ప్రక్రియల్లో పరుగులు తీసిన చాణిక్యుడు .
బాహుసింహా సంపుటి లిఖియించిన చిన్నతనం.
నిరాశా నిస్పృహలను చేదించు
మానవ శ్రమతత్వమే దివ్యత్వముగా
వెలుగులు చిందిన గీతాంజలి కావ్యం.
నోబుల్ బహుమతి విశ్వకవి బిరుదులతో ఉదయించిన ప్రథమ ఆసియా నెలవంక
భారత సాహితీవన మొలక .
ప్రశాంత ప్రేరణ సంగీత ప్రియుడు .
ప్రేమ భక్తి అభ్యుదయ గీతాల జనకుడు .
ఆ సేతు హిమవన్నగమున నృత్యించి
కన్యాకుమారి పాదాల పారాణి ముద్దాడు జాతి ఏకమౌ జాతీయగీతము
జనగణమన రూపకర్త. శాంతిదూత.
జలియన్వాలా బాగ్ మారణకాండకు జలించిన రవీంద్రుని హృది.
ఆంగ్ల అనువాద రచనలకు పొందిన
నైట్ హుడ్ బిరుదును తిరస్కరించి..
విదేశీ నిష్క్రమణ కుల మత నిర్మూలన ఆత్మీయ స్వేచ్ఛా ఆలింగన వాంఛతో
కలం కదిపిన నిష్కల దేశభక్తుడు.
ప్రమోద పాళిణీ ఆయుధం స్వాతంత్ర సమరయోధుల మదిని గుచ్చి ఉత్తేజపరచు కవిబాణం.
విషయ పరిజ్ఞాన విదూషకుడు విశ్వకవి.
ప్రజల సుభిక్షా తీరాన పాలించు జమిందారు పదవి నొదిలి.
ప్రపంచ యాత్రికుడై ప్రకృతి ప్రేమికుడైన
కవి గాయక రచన చిత్రలేఖ విజ్ఞాన పిపాసి .
ఆధునిక బావాముల ప్రజాసమస్యలు ప్రతిఘటించు...
హితోక్తులు కోకొల్లలుగా
కథల గీతాల చిత్రాల నాటకాల
ప్రక్రియ ప్రజాచైతన్య శంఖారావం పూరించిన ...
సకల కళా కోవిదుడు గురుదేవ్ బిరుదాంకితుడు.
జాలి దయా కరుణా పల్లవించిన అక్షర కుసుమం .
విజ్ఞత భాండం విస్మయ భరితం
విశ్వకవి రవీంద్రుని చరితం..
కందూరి సుజాతారాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్
9392162822🌷.
17.
కవితాగానం సీజన్ - 02 కవితల కోసం
శీర్శిక : రవీంద్రుడు
అంశం : విశ్వ కవి
రచన : చేబియ్యం శ్రీనివాసరావు
ఊరు : గుజరాతిపేట , శ్రీకాకుళం
చరవాణి : 7674055482
శారదా , దేవేంద్రనాథుల ముద్దుబిడ్డగా జననం
గంపెడు సంతానాలా కాలంలో పదనాల్గవ బిడ్డగా ప్రత్యేకం
వంగదేశాన వెలుగు దివ్వెగా ప్రకాశం
కలం ఆయన జీవం
కుంచె ఇంకొక వరం
గీతాంజలి తో విశ్వవ్యాప్తం
జన గణ మనతో జాతి గౌరవం
ఆంగ్లమున గీతాంజలి
తెచ్చిపెట్టెను నోబుల్ పురస్కారం
విశ్వకవిగా గుర్తింపు పొందెను
వీనుల విందుగా సాహిత్యం రాసెను
రవీంద్రుడు భరతావని కవీంద్రుడు
భరత కవితాకీర్తిని దిగ దిగంతాలకు చూపిన భవ్య కాంతి
శ్రమతో విజయమని చెప్పిన ధాతృత్వం
విశ్వవిద్యాలయ స్థాపకుడు
18
అంశం
*******
రవీంద్రనాథ్ ఠాగూర్
శీర్షిక
*****
విశ్వకవికి అక్షరాంజలి
******************
కూర్చిన అక్షర సొబగులు
రసవితీర్ణ పదరమ్యత
నుడివిన జీవన చరితలు
సజీవమొలుకు సౌహార్థత
గీచిన పిచ్చిగీతలు
సమజీవన సౌష్టవరేఖలు
పసితనమునే ప్రభవించిన
మిసిమిఛాయ రవీంద్రుడు
వెలయించిన సాహిత్యం
సర్వాకాల సమాజహితం
నవలయైనా నాటకమైనా
నడిపించిన తీరు ఘనం
కవితయైనా చిత్రమైనా
చిత్రణమది బహుసుందరం
విశ్వకవిగా గీతాంజలి
విశ్వశ్రేయ హృదయాంజలి
మానవతపు పరిమళాలు
పూయించిన అక్షరాంజలి
జాతీయతా భావనా గీతం
జనగణయయ్యె మనజాతి మతం
ప్రథమ నోబుల్ గ్రహీతగా
ప్రజ్ఞత్వభారతీయుడిగా
నల్దిశల వెల్గిన కవితాపుంజము
సాహితీమ సేదదీరిన నికుంజము
విశ్వకవీ రవీంద్ర నమో నమో
విశ్వజ్ఞాత ఠాగూర్ నమో నమో
**************************
*మేకల రామస్వామి*
చెన్నూర్ జి"మంచిర్యాల
9912747214
***************************
హామీ పత్రం
**********
ఈ రచన నా స్వంతం కేవలం ఈ పోటీ
నిమిత్తం రాసినదని,దేనికి అనువాదము కాదని
హామీనిస్తున్నాను.
**********************
మేకల రామస్వామి
స్వతంత్ర పోరాట నాయకుడు
జోహారు విశ్వకవి
వందనం భరత మాత ముద్దుబిడ్డా
Comments
Post a Comment