Skip to main content

మే డే 2021

 నిర్వహణ 

శివునూరి లలితాకృష్ణ

వీరా గుడిపల్లి

*******************

1.తాతపూడి సోమ శేఖర శర్మ గారు

2.చేబియ్యం శ్రీనివాసరావు గారు

3. కొంపెల్లి రామయ్య గారు

3.యామిని తేజశ్రీ గారు

4. మర్రి జయశ్రీ గారు

5.అభిరాం గారు

6.మద్ది పుల్లారావు గారు

7.వురిమళ్ళ సునంద గారు

8.అపరాజిత్ గారు

9. కెసి నరసయ్య గారు

10.సర్ఫరాజ్ అన్వర్ గారు

11.డా.సి.హెచ్.ఆంజనేయులు గారు

12.వల్లాల విజయ లక్ష్మి గారు

13. జక్కిడి వెంకట్ రెడ్డి గారు

14. ఇంద్ర వత్ రాహుల్ గారు

15.గుండ్ల రాజు గారు

16. మన్నె పిన్నక లలిత గారు

17.బండి సూర్యారావు గారు

18.శివునూరి లలితా కృష్ణ గారు

19.వీరా గుడిపల్లి గారు

20.మహేందర్ జవ్వాజి గారు

21.మొహమ్మద్. అఫ్సర వలీషా గారు

************

1

శీర్షిక.. శ్రమజీవి 


జీవితమంతా శ్రమయే 

కష్టపడడమే ఆతని సొత్తు 

చేతికొచ్చేది తక్కువ సొమ్ము 

చెమట ఊడ్చడమే జీవితం 


అంతులేని కష్టం నీ శరీరం 

ఎంత కైనా ఓర్చే నీ క్షమాగుణం 

కాయకష్టమే నీ ప్రగతిపధం 

కాయానికి ఎప్పుడు శ్రమవరం 


సూర్యోదయం చూడవు ఇంటివద్ద 

సూర్యాస్తమయం చూడవు ఇల్లాలిదగ్గర 

వేకువనే వెళ్తావు 

చీకట్లో వస్తావు 

పగలంతా శ్రమిస్తావు 

కుటుంబాన్ని నెట్టుతావు 

కష్టపడితేనే సొమ్ములొచ్చు 

ఒక్కరోజైనా సెలవు లేదు 

మానేస్తే తిండి లేదు 

కార్మికుడా !నీ జీవనం బహు దుర్లభము 


ఎండలేదు  వానలేదు 

చలిలేదు చమటలేదు 

ఎంత కష్టమైన పనినైనా 

పూర్తి చేయడమే నీ ధ్యేయం 

పని పూర్తి చేస్తేనే నీవు సొమ్ము 

పొందగలవు ఆనందించగలవు 


రెక్కాడితే నీకు డొక్కాడును 

కష్టపడితేగాని ఫలితం నీకే దక్కదు 

ఎంత బండ చాకిరైనా 

ఎంత బరువు పనినైనా 

చేయడమే నీ వంతు 

యజమానిని సంతోషపెట్టడమే 

నీ జీవన గమ్యానికి మెట్టు 

🌹🌹🌹🙏🌹🌹🌹


ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,మొబైల్. 8328079336

2

 కవితా గానం 1 & 2

కార్మిక దినోత్సవం సందర్బంగా 

ప్రత్యేక కవిత 


కష్టం నమ్ముకుని 

గనుల్లో గుల్లలవుతూ 

పనుల్లో పిండి అవుతూ 

రక్తాని కరిగించుకుంటూ 

ఎముకలగూడును వంచుకుంటూ 

బరువులను ఎత్తుకుంటూ 

నింగిలో , నేలలో 

కర్మాగారాల మరలలో 

మసి ముద్దలుగా 

మురికి గుడ్డలా 

కళ్లు మసక బారగా 

కాళ్ళు కొంకరలవగా 

కార్మిక చట్టాలని 

కష్టాలు తీరుతాయని 

సమిష్టి పోరాటాలతో బ్రతుకులు మారతాయని 

యూనియన్ల వంక చేరగా 

బడాబాబుల కనుసన్నలలో 

రాజకీయపు చదరంగములలో 

కీలుబొమ్మలుగా మారుతున్న నాయకుల 

కల్లిబొల్లి మాటలతో 

మోసపోతున్న కార్మికుని 

మే డే ఒక మామూలు డే అయిందిరా 

ఒళ్లు గుళ్ళగా , కళ్లు మసకగా మారగా 

ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు చూసి 

నిట్టూర్చడం తప్పా ! ఏమి సాధించామని 


రచన     : చేబియ్యం శ్రీనివాసరావు 

ఊరు     : గుజరాతిపేట 

             శ్రీకాకుళం ( మండలం & జిల్లా )

చరవాణి : 7674055482

3

శీర్షిక: విజయ కేతనం...!

రచన: కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

మేడే...!

కరోనా బూచి మాయాజాలం ముసుగులో 

మాఫియా మార్కెట్లు మానవతను మంటగలిపే వేళ

జీవన్మరణ నరకయాతన దీనావస్థలో 

ఆసుపత్రిలో రోగికి ఆక్సిజన్ అందని ద్రాక్షైన  వేళ

కనికరించని మహమ్మారి కబలించే మృత్యు కౌగిలి లో

కన్నవారి కడచూపుకి నోచుకొనక చితి మంటలలో మనిషి దగ్ధమౌతున్న వేళ

మనిషి మనిషిగా బ్రతికించమని సందేశమిస్తూ మానవత్వమై వచ్చింది...!

మేడే...!

శ్రమజీవి సమరాగ్ని సరస్సులో వికసించిన ఎర్ర కలువ లా 

ఎత్తుపల్లాల నెత్తుటి రహదారి లో పడి లేచే కెరటం లా

శ్రమదోపిడి  నిరసించే ఉద్యమ పిడికిలి లా 

నీలాకాశం ఎరుపెక్కేలా  అరుణ పతాకమై రెపరెపలాడింది...!

మేడే...!

కనీస సౌకర్యాలు లేని అమానవీయ పరిశ్రమలో కార్మికుల గొడ్డు చాకిరి సంఘర్షణ చైతన్య ఎర్రమందారలై

చికాగో నగరాన తిరుగుబాటు గళం ఎత్తిన సమయంలో

చిందిన రుధిరం సాక్షిగా ప్రపంచమంతా సూర్య బింబం డప్పై మ్రోగుతుంది...!

మేడే...!

కార్మికుల చెమట కష్టం వెలకట్టలేని విలువైనదై 

కరోనా నీడలా వెంటాడుతున్నా ఏ రోజు విధులకు వెనకాడని విధి ధర్మ మై 

వైరస్ భయపెడుతున్నా ఏనాడూ నిర్లక్ష్యం వహించని లక్ష్యమై 

ప్రాణాలు పణంగా పెట్టి ఘణంగా పని చేస్తున్న యోధులై 

పారిశుధ్య కార్మిక కర్షకుల విజయ కేతనమై నింగి లోన ధృవ తారై వెలుగుతుంది..!

కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..మేడే

శీర్షిక...నిజమైన దేశభక్తులు


తమ రుధిరాన్ని స్వేదంగా మార్చి

తమ కండలతో కొండలనే పిండి చేస్తూ

మానవ జాతి పురోగతికి మూలమయ్యే శ్రమజీవులు

అలుపెరుగని పోరాట యోధులు

ఉషోదయంతో మేలుకొని

ఊపిరి సలపని ఒత్తిడికి లోనవుతూ

కాలంతో పాటు తిరిగే

ప్రగతి రథ చక్రాలు

జీవన గమనంలో

పడిలేచే కెరటాలై

పెట్టుబడి దారి వ్యవస్థపై తిరగబడే శూరులు

సంఘటిత శక్తులుగా ఏకమయ్యి సాగే విప్లవ వీరులు 

విజయానికి సంకేతాలు

త్యాగానికి గుర్తులు

తాము పస్తులున్నా

జగతిని సస్యశ్యామలం చేస్తూ

కంటి నిండా కునుకులేకుండా

సరిహద్దులు కాచే సైనికులు

దయనీయ స్థితిలో 

రోగులకు సేవలు చేస్తూ

ప్రాణాలనే పనంగా పెట్టి సేవచేసే ధన్వంతరి వారసులు

వర్ణ వ్యత్యాసాలు చూపని సేవ చేస్తూ

పరిశుభ్రతకు కారణమయ్యే పారిశుధ్య కార్మికులు

చట్టాల్ని అమలు పరుస్తూ

కరోనా కట్టడికోసం

నిరంతరం శ్రమించే రక్షక భటులు

వారందరు నిజమైన దేశభక్తులు

శ్రమ జీవుల స్వేద వేద గానంతోనే

పరిభ్రమిస్తుంది ధరణి చక్రం

5

[02/05, 9:32 PM] Lalita Sister: *ప్రగతిశీల ధార్మికులు*


మణిపూసలు



కష్టపడే కార్మికులు

చెమటోడ్చే శ్రామికులు

అనునిత్యం పనిచేసే

ప్రగతిశీల ధార్మికులు.1


భగభగమండె ఎండలో

తడిసిముద్దయ్యే వానలో

బెదురుకోరు పనికి

గజగజ వణికే చలిలో.2


శక్తిని ధారపోస్తారు

శ్రమను ఆస్వాదిస్తారు

రక్తాన్ని చిందిస్తూ...

అనునిత్యం శ్రమిస్తారు.3


దుక్కి దున్నె రైతన్నా

కోత కోసే కూలన్నా

మీ శ్రమయే ఆగిపోతె

మాకుండదు కూడన్నా. 4


పని గంటలు తగ్గినా

వేత నాలు మారినా

పనిభారము యెక్కువైన

నీదు వెతలు తీరెనా?5


కాలాలు మారినా

పాలకులు మారినా

మారలేదు నీ బ్రతుకు 

చట్టాలు మారినా.6


మేలుకొలుపూ మే డే

శుభదినంబూ నే డే

చికాగోల కార్మికుల

రుధిర స్థలము నేడే.7


కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో..... 👍👍👍🤝🤝🤝

*అభీరాం*

(అనుపటి రాంచంద్రయ్య)

6

[02/05, 9:32 PM] Lalita Sister: 〰️〰️〰️〰️〰️〰️〰️〰️

అంశం:  *అంతర్జాతీయ* 

 *కార్మిక దినోత్సవం

ప్రక్రియ:ఇష్టపది

✊✊✊✊✊✊✊✊


1)

శ్రమను నమ్ముకొంటూ..శరీరం కృశించిన

ఉస్సురంటూ గూడ..ఉత్పత్తి పెంచెదరు


రెక్కాడితే గాని..డొక్కాడని జీవులు

పట్టణాలలొ వారె..పల్లెల్లో ను వారె


పరిశ్రమలలోను..పంట పొలాల్లోను

తాపీపనులలోను..దైనందిన పనులలొ


ఎచట చూచిన వారె..విశ్వ నిర్మాతలూ

రాయుదును ఇష్టపది.. రామచంద్రుని తలచి


2)


పని చేయడానికే..వారు జన్మించారు

కష్టం చేయడమే..కార్మికులు నమ్మేది


స్వేదాన్ని చిందిస్తు..సౌధాలు నిర్మిస్తు

ప్రగతి సారదులైన..భవిత లేనివారు


పనిగంటలెక్కువై..ప్రతిపలం తక్కువై

నిత్య ఘర్షణలతో.. నీరసించి పోతారు


మారాలి బ్రతుకులూ..మార్చాలి విదానాలు

రాయుదును ఇష్టపది.. రామచంద్రుని తలచి


3)


వెట్టిచాకిరి నుండి...విముక్తి కల్పించాలి

విశ్వవేదిక పైన..వేతన చర్చ జేసి


ఆలవెన్సులిస్తూ..హాయిగొల్పించాలి

భద్రతను కల్పించి..భరోసానివ్వాలి


చట్టాలుసవరించుతు..సమత నెలకొల్పాలి

మెరుగైన రీతిలో..మేడే ను జరుపుదాం


కార్మికులు ఐక్యతగ..కలకాలముండాలి

రాయుదును ఇష్టపది.. రామచంద్రుని తలచి

............................


కవి: *మద్ది. పుల్లారావు

వృత్తి: *ఉపాధ్యాయుడు


ఊరు : *నందిగామ

జిల్లా :కృష్ణా

చరవాణి : *9951287113

〰️〰️〰️〰️〰️〰️〰️〰️

7

[02/05, 9:32 PM] Lalita Sister: *కవితా గానం సీజన్-2*

తేదీ:02-05-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: మేడే

********†*******†****

దేశానికి దేహం వారు

దేహానికి ఊపిరి వారు

సమాజానికి సుఖాల పంటలు పండించే శ్రమ నదులు...


కష్టాల అలలను భరించే ఉప్పు నీటి సంద్రాలు

ఇందుగలడు అందు లేడను

పోతన పద్య ప్రతీకలు వారు!


మట్టిలో మాణిక్యాలు పండించినా

గుప్పెడు గింజలకు అల్లాడే నిరు పేదలు!


వెలుగులు చూడని

వేదనా భరిత చిత్రాలు

కండల కొండల్లోంచి ప్రవహించే

జీవనదులు వారు...


 పనిలో గనిలో కార్ఖానాల్లో

రాతి పనుల నుండి రాకెట్ పనుల్లో

ఎండా వానా నేస్తాలుగా

కటిక నేలనే కన్నతల్లిగా

పనియే దైవంగా భావించే భక్తులు...


ఉన్నవాళ్ళ సకల విలాసాలకు

సౌకర్యవంతమైన సాధనాలు.

 శ్రమకు చిరునామాలై

ఇలా తలమున వెలుగులు పంచే సూర్యులు

నిత్యం చావు బతుకులతో 

సయ్యాటలాడుతూ

జీవితాల్ని కాలం తీగలపై ఆరేసుకున్న కార్మికులు కర్షకులు...


దుర్భర పనిగంటలను నిరసిస్తూ

జీవన్మరణ సమస్యలపై

ఎనిమిది గంటల పని దినాలపై పోరాడి గెలిచిన శ్రమ జీవులు!


అమరులైన ఆత్మల సాక్షిగా

సాధించిన రోజే మేడే..

ప్రపంచ కార్మికులంతా ఏకమై

 వినువీధిలో విజయ పతాకను

ఎగరేసినది నేడే...

8

[02/05, 9:33 PM] Lalita Sister: నేడే మే డే!!


అలుపెరుగక పనిచేసే 

కార్మికుని స్వేదబిందువులతో 

నడిచే కర్మాగారాలు 

మండుతున్న ఇంధనంలో 

తన హృదయ లయల చప్పుడు 

ప్రతిద్వనిస్తూ జీవనం అస్తవ్యస్తంగా!!

కానీ ఏనాడైనా తను 

చాలీ చాలని జీతంతో సరిపెట్టుకున్నాడు తప్ప 

లాభాల్లో ఎప్పుడైనా వాటా అడిగాడా!?

తిరుగుబాటు బావుటా 

ఎప్పుడైనా ఎగరేశాడా?

పెట్టుబడీదారీ మూలస్థంబాలు 

కార్మికుని ఎదపై నిర్మితమైన రక్తస్పర్శ!

దశ దిశలా ఎగరేసిన ఎర్ర జెండా!!

పనికి తగిన వేతనం ఇవ్వకుండా 

కార్మికుల రక్తం పీల్చే జలగలు పెట్టుబడీదారులు!

కోట్లకు కోట్లు లాభాలు ఆర్జిస్తూ 

కార్మికుల పొట్టకొట్టే రాబందులు!

ప్రపంచ కార్మికులారా ఏకం కండి 

అంటూ నినదిస్తే,,,,,,,,,,,

కటకటాలపాలు జెసే కిరాతకులు!

ఏనాటికైనా కర్మాగారాల ఉత్పత్తిలో 

కార్మికుని శ్రమకు వాటా ఇచ్చిన రోజే 

అసలు సిసలు మే డే!!


ఆపరాజిత్

9

[02/05, 9:33 PM] Lalita Sister: బాటలు వేయండి 



శ్రమలో పరిశ్రమలు

పరిశ్రమలలో

నలుగుతున్న శ్రమ

ఆకలిలో

తీరికలేని డ్యూటీలు

యంత్రాల మంత్రాలలో

మర్మమెరుగని కష్టాలలోకం

పెట్టుబడి సుడిగుండంలో

కట్టు బానిసలైన కార్మికులు

మండుటెండల్లో కష్ట జీవులు

యంత్రాలతో

పరుగులు పెడుతున్న

బక్కచిక్కిన బతుకులు 

ఏసీ గదుల్లో పీడకులు 

పీడనలో రోదనలు

చెమట చుక్కల్లో 

లాభాల పరిమళాలు

లాభనష్టాల బేరీజులో

కార్మికుల పస్తులు

నానాటికీ పెరుగుతున్న

యాజమాన్యాల

ఆస్తుల కుప్పల తెప్పలు

ప్రపంచాధిపత్యంలో

ప్రపంచ మార్కెట్ ను

శాసిస్తున్న కార్పొరేట్ రంగాలు

ప్రపంచ కార్మికులారా!

దోపిడీ లేని రాజ్యం కోసం కదం తొక్కండి

కార్మిక కర్షక రాజ్యం కోసం కదలండి

సమసమాజ నిర్మాణానికి బాటలు వేయండి


                  ------కట్టెకోల చిన నరసయ్య 

                                   7981814784

10

[02/05, 9:33 PM] Lalita Sister: 🌸 *మండే గుండెల చప్పుడు..*🌸


వట్టిపోతున్న కొలిమి తిత్తులకు ఊపిరిపోసి 

పనిముట్ల గుత్తులకు ఆకారమిచ్చి

బాడిస, రంపాలతో ఆకలిబడబాగ్నిని

చల్లార్చుతూ కర్రలకు ఆకారశ్రీకారం చుట్టి..


ఇనుప కొలిమిసెగల్లో శనగల్లా మాడిపోతూ

అనారోగ్యంతో చెలిమి చేస్తూ

అభివృద్ధికి నిలువెత్తు గీటురాళ్లయిన 

ఫ్యాక్టరీ గొట్టాలకు ప్రాణవాయువుని అరువిచ్చి..


ప్రాణచర్ఖాలు గిరగిరా తిరుగుతూ కర్కశ 

కార్ఖానాల బందీఖానాల్లో అరిగిపోయి

కర్మాగారాల స్వార్థకాలుష్యానికి ఆర్థిక

ఊపిరి తీగలు వాడిపోయి జీవనజ్యోతి కరిగిపోతున్న..


దశాబ్దాలుగా స్వేదధారల చమురును పోసి నాగరికత దీపాల్ని వెలిగించి

రుధిర ధారల్ని అభివృద్ధి ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాలుగా మార్చి విరబూయించి..


పట్టుదలను, అంకితభావంతో సమైక్యపర్చి

శ్రమసౌందర్య పూలను పూయించి

నైపుణ్యాన్ని పనితో సంపర్కం చేయించి

ఉత్పత్తిని విధేయతత్పరతతో పెంపొందించి..


యాజమాన్యానికి యంత్రాల నడుమ క్షంతల వంతెనయై జీవితాన్ని గంతలబొంతగా చేసుకుని

యంత్రాల్లోని చక్రాల నడుమ కందెనయై

నలిగిపోతూ అభివృద్ధి అభిలాషను బ్రతికించే..


కాలే కడుపుల రోదన

కార్మిక హక్కుల సాధన 

వేకువ పొద్దుల నృపుడు

మండే గుండెల చప్పుడు..

*......మే....డే......*

*శుభాకాంక్షలతో..* 🌸🌸💐💐


*సర్ఫరాజ్ అన్వర్..*✍🏻

11

[02/05, 9:33 PM] Lalita Sister: మనుషులంతా శ్రమజీవుల కొందరు శ్రమను దోచుకునే వారు కొందరు శ్రమను పంచుకునేవారు


శ్రమించడం కొందరి సొత్తు మరికొందరు శ్రమను సౌఖ్యం కోసం వినియోగించుకుంటారు


కొందరు స్వార్ధపరులు కొందరు 

మరికొందరు నిస్వార్ధ పరులు


ప్రపంచం లో ఉన్నవి రెండే వర్గాలు ఉన్న వాడు లేనివాడు


ఆత్మగౌరవం అన్నింటికంటే ముఖ్యం అదే మనిషికి ఆభరణం


ఆత్మగౌరవాన్ని గాలికొదిలి మానవతను మంటగలిపే వాళ్లు కొద్దిమంది స్వార్ధపు సులోచనాలు పెట్టుకొని


తమ పబ్బం గడుపుకుంటున్నారు


నిస్వార్థంగా కృషి చేసిన మహనీయులను మాత్రం ఆకాశమంత పందిరి వేసి

వారిని చిరకాలం కొలు లు


ఆదర్శాల పాఠశాలలో ఒక సుందరయ్య ఒక నాగిరెడ్డి

ఒక ధర్మభిక్షం ఎప్పటికీ వర్ధిల్లుతారు


ఆ నాయకుల బాట స్ఫూర్తి మంత్రం అది ఏ కాలమైనా నిలబడుతుంది అందుకే వారి మార్గాన్ని గానం చేయాలి

జీవన విలువలను ఆవిష్కరణ ఈ


వ్యవస్థలో అవినీతిని అంధకారాన్ని వెలుగు కాగడా పెట్టి వెతికి పారదోలాలి


సమాజం మా గానం

ఉత్తమ సస్య ఫలాలను అందిస్తుంది

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453

12

[02/05, 9:33 PM] Lalita Sister: *మే డే* 

******


ఆకాశంలో మేడలు కట్టేది మీరే

నేలమీద పక్కా ఇళ్లయినా లేనిది మీకే! 

అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు మీరే

అప్పులబాధతో పురుగులమందు తినేది మీరే!


పట్టుబట్టలు తయారు చేసేది మీరే!      కట్టుబట్టలకు కటకటలాడేది మీరే!                      గాజువస్తువులెన్నో తయారు చేసేది మీరే 

గాజు కన్న సున్నిత ఆయుష్షులు మీవే!


చిత్రవిచిత్ర వస్తుతయారీ పనితనం మీదే!

చెత్తకాగితాల్లా చిత్తయ్యే బతుకులు మీవే! 

చక్రాల దగ్గర స్వేదం చిందించేది మీరే 

స్వార్థపుచక్రాల కింద నలిగిపోయేది మీరే!


పొగగొట్టాల కదలికలకు కారణం మీరే 

సమస్యల పొగచూరిన జీవితాలు మీవే! 

ఇవన్నీ ఒకప్పుడు ఎద రగిలించే నిజాలు 

రాకుండా చూసుకుందాం మళ్లీ ఆ చీకటి రోజులు


సంఘటితరంగ కార్మికులకున్నవి హక్కులు చట్టాలు

పడిపోకుండా నిలుద్ధాo కొత్త చట్టాల గోతుల్లో

అసంఘటిత కార్మికులకూ కావాలి చైతన్యాలు 

ఏ లబ్దినెలా పొందాలనే సమాచార గ్రాహకశక్తులు! 


అవగాహన ఆలోచన వివేకం పెంచేది అక్షరాలే!

అక్షరాస్యులై కార్మికకర్షకులుంటే నిత్యం "మే డే" 

వృద్ధి అయితే జాతీయ నికర పదార్థ వస్తుత్పత్తి 

కార్మిక కర్షకులది ఓటమెరుగని అజేయశక్తి


వల్లాల విజయలక్ష్మి

ఆలేరు

13


[02/05, 9:33 PM] Lalita Sister: ** కవితా గానం**

     అంశం : కార్మికులు. 

      శీర్శిక :  శ్రమజీవి పోరాడు .

  

    రగిలేది కొలిమిలేకాదు 

    శ్రమజీవులగుండెలు కూడా 

    ఎగిసిపడేవి అలలొక్కటే కాదు 

    దోపిడీకి గురియైనా వారి నెత్తురు గూడా 

    అవమానాలకు అలవాటుపడి 

    అణిచివేతకుగురయ్యి ఇంకా 

    కాలుజాపి కూకున్నావెందుకు ?

    కాలం కలిసివచ్చుడు కాదు 

    పరిస్థితిని మార్చగలిగే చేవ నీలో లేదా 

    ఎదురుచూడటం ఆపి

    అన్యాయంపై   ఎగవడుడు నేర్చుకో 

    నీకన్నా గొప్పోడు నీకన్న పనిమంతుడు 

    ఏడికెల్లోరాడు  ....పలుగు పాన  సుత్తి తాపీ 

    దొరికింది ఎత్తి  దోపిడీపై ఎగవడు 

    ఎవడడ్డమోస్తాడో ఎదురొడ్డినిలబడు

    గుంపుగట్టుడు  ఆపకు  సాటుపనులు చెయ్యకు 

    సొంత లాభం కోసం నీ గుంపును ముంచకు 

    పండించే పంటకు తయారు చేసే వస్తువుకు 

    గిట్టుబాటు దొరికే వరకు ....

    బతుకుపోరులో తలఎత్తి నిలిచేవరకు 

    అలిసిపోకు కార్మికా సొలిసిపోకు కర్షకా ....

     పోరాడు గెలిచేవరకు. 

    --- జక్కిడి వెంకటరెడ్డి .

14

[02/05, 9:33 PM] Lalita Sister: *🌕"కవిత గానం🌕*

   🌸➖🌸➖🌸


*అంశం :* కార్మికులు 

*శీర్షిక :* మేము కార్మికులం 



*✊మేము కార్మికులం✊*


మేము కార్మికులం 

ప్రజల ఆకలి తీర్చే దీపాలం 

యంత్రలలో నిరంతరం

మగ్గిపోతున్న మా బతుకులు 

మనుగడకు మేము నిర్మాతలం 

ప్రాణమిచ్చు సైనికులం 

మండే ఎండలో కష్టాన్ని

నమ్ముకున్న కార్మికులం 

కార్మికుల హక్కుల సాధనకై

శ్రమతో పోరాటం చేస్తున్న యోధులం 

రేపటి మనుగడను 

కాపాడే ఆయుధ నేస్తాలాం  శ్రమ కొరకే పుట్టిన హాలికులం 

ప్రజల ఆకలే మా ఆకలి 

కష్టాన్ని నమ్ముకున్న కార్మికులం 

రుధిరమే వచ్చిన 

ప్రాణాలే పోయిన 

నమ్ముకున్న వారి బాధలు 

తీర్చే దేవుళ్ళం 

కొత్త కొత్త కోరిక లేవు 

ఒక రోజు అయినా విశ్రాంతి కొరకు కావాలి మాకు మేడే..


*హామీపత్రం :* స్వీయరచన 


*ఇంద్రావత్ రాహుల్*

       కొత్తపేట్ 

    నిజామాబాద్ 

   9848054079

15

[02/05, 9:33 PM] Lalita Sister: *కవితా గానము*

మేడే సందర్బంగా....


కవితా శీర్షిక: *రాళ్లు కొట్టు వారు*


సీసపద్యము,


*పొద్దుపొద్దున లేచి పొదరిండ్ల లోనుండి*

   *బయలుదేరిరివారు బండి మీద*

*గట్టులెన్నో దాటి గుట్టలెన్నోయెక్కి*

   *పెట్టుకొనిరి రాళ్లు బండి మీద*

*విత్తమార్జన కొరకు సుత్తె కరమున బట్టి*

   *ప్రస్తారములు బేర్చి బండి మీద*

*రాళ్ళకుప్పలు బోసి రోళ్లనెన్నో జేసి*

   *పరగ వెళ్లిరి వారు బండి మీద*

*విసురు రాళ్లనువారు విస్తారముగచేసి*

   *బయలు వెడలిరెడ్ల బండి మీద*


తేట గీతి,


*బ్రతుకు భారమ్ము మోయుచు బండిమీద*

*వాడ వాడల తిరుగుచు వసుధమీద*

*పల్లె పట్నపు వాసులే ప్రభువులనుచు*

*అమ్ముచున్నారు నచ్చోట నందముగను*

*స్వేద ఫలమును పొందిరి స్థిరముగాను*


*🌹🌹🌹గుండ్లరాజు🌹🌹🌹*

16

[02/05, 9:33 PM] Lalita Sister: కవితా గానం

 తేదీ :2/5/ 21-  ఆదివారం

అంశము: మేడే( కార్మిక దినోత్సవం)

  శీర్షిక :శ్రామిక వీరా !

పేరు :మన్నె పిన్నక లలిత

హైదరాబాద్ 

 చరవాణి సంఖ్య :741 686 32 89.


 ఓ కార్మిక! నువ్వు సృజించని  వస్తువు లేదు ఈ సృష్టిలో 

జీవన బ్రతుకు చక్రం  తిప్పుతావు నా దృష్టిలో 

కార్మిక శక్తికి  ప్రతీక

 అనుభవాల కీర్తి పతాక 

నువ్వు అనుదినం కాలుతుండే కుమ్మరి ఆవం 

చేయి చేయి కలిపే కార్మిక  శక్తేగా మనం

 లేస్తావు  ఉషస్సుతో

 ఇంటా బయట చేస్తావు పనులు మేధస్సుతో

 ఎండా వాన అనక 

కూలి కోసం నిలబడతావుచౌరస్తాలో

 నీవు నమ్మిన వాడు నీకు శత్రువు

 కాంక్షించడు నీకు జయము

 తన  పేరుకైకోరు  నీ అపజయము

 శక్తి కోసం చేస్తావు రణం 

అదే నీకు ఆభరణం

 మేడేలో చూస్తావు అరుణపతాక శక్తి

 అన్యాయం చేయడం అధికారుల  యుక్తి

 మే డే కార్మికులకు లాల్ సలాం 

అన్యాయమైన కార్మిక కుటుంబాలకు 

ఎవ్వరు  ఇవ్వరుఆర్థిక మలాం

17

[02/05, 9:33 PM] Lalita Sister: కార్మికులారా 01/05/21

******************

ఎండనక వాననక

వేగు చుక్క మొదలు

పొద్దు పోయేదాక

నీ శరీరాన్ని తాకట్టు పెట్టె

కర్షకులారా, కార్మికులారా

శ్రామికులారా, శ్రమైక జీవుల్లారా

పొట్ట కూటి కోసం

కన్న కడుపు కోసం

పార, పలుగు ,గంప

రాయి, కంకర, ఇసుక అన్ని నీయే

మంత్రాలు తెలియని

యంత్రాలు మీరు, కాదంటారా

కర్మాగారంలో కార్మికులుగా

యంత్రాల కింద నలిగిన

జీవిత పొగ గొట్టాలెన్నో

నిప్పులగా, నిస్వార్థంగా

భార్య పిల్లలకోసం

బ్రతుకు పోరాటం అదే జీవన ఆరాటం

ఆత్మస్థైర్యం,  ధైర్యం

కోల్పోక బ్రతుకు గెలుపు కోసం

నీ పోరాటం మానవత్వం

మానవీయత కల్గిన మనిషివి

ఠీవిగా బ్రతుకుతున్న రారాజువు

జయహో జయహో కార్మికులారా,

కర్షకులారా ,శ్రామికులారా జయహో.


  ( మేడే సందర్భంగా,బండి సూర్యారావు)

************************************

18

[02/05, 9:34 PM] Lalita Sister: కార్మికయంత్రం 


స్వేదం శక్తిగా మార్చి

ప్రపంచపు గడియారంలో

అభివృద్ధి గంట మోగించడానికి

పరుగులు తీస్తున్న

సెకన్లముల్లువు


జగతికి 

ప్రమోదపు వెలుగులు పంచడానికి

ప్రమాదపుటంచుల

పంచకు వెళ్తూ

ప్రాణాలను పణంగా పెట్టి

బొగ్గు కుప్పల్లో మసిబారుతున్న

కార్మికయంత్రానివి


గుండె తడిని దారపు కండెల కద్ది

సాంచెల సవ్వడి గా

మార్చుతూ...

దారం ఆధారమై

మగ్గాల్లో మగ్గిపోతున్న

అలుపెరుగని

శ్రామిక రాట్నానివి


కమ్మరి కొలిమి

కుమ్మరి ఆవం

తట్ట..పలుగు... పార లతో

రుధిరం స్వేదం గా మార్చుతూ 

శ్రమైక జీవన సౌందర్యం లో

సమాజగతినే తిప్పే చక్రానివి

ప్రపంచప్రగతి కి చుక్కానివి

********లలితా కృష్ణ

19

[02/05, 9:34 PM] Lalita Sister: ఇది వీరా గుడిపల్లి కవిత

1/5/2021

******"

I pity you


ఇలా

అలా

ఎలాగైనా

ప్రతీ మే డే రోజున కవిత రాసే అవకాశం ఇస్తున్నాడు

శ్రమజీవి



తానెప్పుడు

యెవరి కవితల్లో కూడా 

సానుభూతి, ఓదార్పు, లేకుండా


నీ శ్రమకు మించిన ఫలితం

పొందుతున్నావని

నిందించే కవితలు

చదువుకుంటాడో....కదా




ఎంతకాలం

కవుల కలాలకు ముందస్తు కవితలు రాసుకునే అవకాశం ఇస్తావు

పిడికిలి బిగించి

పోరాడు


కలాలకు సానుభూతి తెలిపే అవకాశం ఇవ్వకు


నాలుగక్షరాలు రాల్చేవారు కాదు

నీతో నాలుగడుగులు వేసే వారు కావాలి


Other wise

..... I pity you


..... *వీరా గుడిపల్లి*

20

[02/05, 9:36 PM] Lalita Sister: *బతుకు పోరు*

కుమ్మరికుండా

కమ్మరికొలిమీ

నేతనమరమగ్గం

గీతన్నల సురాపానకం

వడ్రంగి నాగలి కర్రూ

అన్ని ఈభూమిమీదనే కదా

సోషల్ మీడియాల సబరం

చరవాణీ సౌకర్యం వచ్చే

కరోనా కాలం చరవాణీ ఆహ్వానం.. అంతా అయోమయం..

ఆరుగాలం కష్టపడి పనిచేసే రైతన్నల వ్యవ"సాయం"

అంతా కనుమరుగాయో

భావితరాలకు భవిష్యత్ అందకారమాయో

కలంహలం తమదారి పట్టాయి

21

మేడే ( శ్రమయేవ జయతే). ..


దేహం శుష్కించినా

అహం మరచి సంసార దేవులాట 

మొదలెడుతావు .....


అవమానాల హారాలు వేస్తున్నా

ఆనంద వదనం చూపిస్తావు  ...


కష్టానికి ఫలితం రాకున్నా

కన్నీళ్ళకు రెప్పలడ్డు వేస్తావు....


క్షణం క్షణం నరకం చూపిస్తున్నా

మరుక్షణం నవ్వుల దుప్పటి కప్పేసుకుంటావు ....


అలసట కుదిపేస్తున్నా

అలవాటేనని అదిమేస్తావు .....


అసహనం హద్దుల పట్టాలు దాటుతున్నా

సహన పొద్దులు దాపెడతావు ....


నిన్ను నిన్ను గా గుర్తించే ఆ

ఆసరా  వెలుగు  నీడ నీపై

 పడకున్నా  సహన శీలి

 వవుతావు ....


శరీరం శ్రమల దారంతో అల్లుకు పోయినా 

శ్రమయేవ జయతే అంటూ

సాంత్వన జీతం కై ఎదురు చూస్తావు  

నిత్యం నిశ్శబ్దంగా ....!!


మొహమ్మద్. అఫ్సర వలీషా

ద్వారపూడి (తూ గో జి )


పాడైన మన బతుకుల పరిశుభ్రత కోసం

                 మహేందర్ జవ్వాజి✍️✍️✍️



Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...