Skip to main content

వైశాఖ పూర్ణిమ ప్లవ 2021

 


నిర్వహణ

శివునూరి లలితాకృష్ణ

వీరా గుడిపల్లి

*********************

1.బాలు కత్తుల గారు

2.కొంపెల్లి రామయ్య గారు

3.తిప్పావఝల నరసింహ మూర్తి గారు

4.తాతపూడి సోమశేఖర శర్మ గారు

5.వాకిటి రాంరెడ్డి గారుు

6. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు

7.నారుమంచి వాణి ప్రభాకరి గారు

8.ఆళ్ళ నాగేశ్వరరావు గారు

9.గంగపురం శ్రీనివాస్ గారు

10.ధనాశి ఉషారాణి గారుు

11.మేకల రామస్వామి గారు

12.దంతోజు సత్యం గారు

13.బి.నాగేశ్వర్ రావు గారు

14.తాతపూడి సోమ శేఖర శర్మ గారు repeated

15.జోషి పద్మావతి గారు

16.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు

17.బి శంకరయ్య గారు

18.సింహాద్రి వాణి గారు

19.రావికోటి శ్రీధర శర్మ గారు

20. పిట్ల కావ్య గారు

21.పిన్నక నాగేశ్వరరావు గారు

22.మొహమ్మద్. అఫ్సర వలీషా

 ద్వారపూడి (తూ గో జి )

23.తరణికంటి సూర్య లక్ష్మి గారు

24.దారల విజయ కుమారి గారు

25.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు

26. బొడ్డు హారిక గారు

27

28.వనపర్తి గంగాధర్ గారు

29.ఇంద్రవత్ రాహుల్ గారు

30.అన్నా ప్రగడవేంకట నరసింహారావు గారు

31.చేబియ్యం శ్రీ నివాస్ రావు గారుు

32.పిల్లి.హజరత్తయ్య గారు

33.మన్నె పిన్నక లలిత గారు

34.జక్కిడి వెంకట్ రెడ్డి గారు

35.మద్ది పుల్లారావు గారు

36.నాశబోయిన నరసింహా గారు

************************

సమీక్షలు

‌సమీక్షకులు శ్రీ కొమురవెల్లి అంజయ్య గారు

ప్రముఖ కవి, విమర్శకులు, పాత్రికేయులు

**************************

కవితాగానం పౌర్ణమి సమూహంలో నాకు ఈ అవకాశం కల్పించిన గుడిపల్లి వీర, లలిత కృష్ణ గార్లకు ధన్యవాదాలు.


కొత్తగా సాహితీ సేద్యం మొదలుపెట్టిన వారు కొందరైతే , ఇప్పటికే కవిత్వంలో మెళకువలు ఔపోసన పడుతున్న వారు మరికొందరు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఆయుర్వేదం శీర్షికకు న్యాయం చేయడానికి అందరూ ప్రయత్నించారు . పోటీకి పంపించిన కవితలలో అక్షర దోషాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది . లేకపోతే అవి అర్థాలను మార్చి కవితను దెబ్బతీయవచ్చు . పద్యాలు రాసిన వారు చందస్సు పట్టు తప్పకుండా చూసుకోవాలి . పోటీలో విజేతలుగా నిలిచిన సాహితీ మిత్రులకు, పాల్గొన్న వారందరికీ అభినందనలు . ఆయుర్వేదం గురించి కొందరు యువకవులు వ్యాసం లాగా రాశారు . వచన కవిత్వానికి వ్యాసానికి మధ్య గల తేడాను గుర్తించాల్సిన అవసరం ఉంది .పోటీదారులైనా , విజేతలైనా వచనకవిత్వం తీరుతెన్నుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి . మంచి సాహిత్యం చదివి అది మనను ఎందుకు ఆకట్టుకుందో ఆకళింపు చేసుకోవాలి .కవిత్వం పట్ల ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అవగాహన పెంపొందించుకోవాలి . పోటీదారులు కొందరి కవితల్లో వివరాలున్నా కవిత్వం పాలు కొరవడింది .మరికొందరు నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారీతిగా వరుసలు ఇష్టానుసారంగా రాశారు. వ్యక్తిగతంగా కవితలో లోపాలను ఎత్తి చూపితే మనసు నొచ్చుకుంటారు .అందుకే ఈ సామూహిక వివరణ .



1)బాలు కత్తుల గారు 

--------------

ఆయుర్ వృద్ధి చేసే వైద్యవిజ్ఞాన వేదం ఆయుర్వేదం అంటూ ఆయుర్వేదం చరిత్ర చక్కగా వివరించారు .ఆధునిక జీవన అలవాట్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న తీరుపట్ల ఆవేదన వ్యక్తం చేశారు . అడవి సంపదనే ఆరోగ్యానికి ఆయుష్షు. ప్రజల, పాలకుల ముందుచూపు కరువై అడవులు పలుచబడ్డాయి. మీ ఆలోచనలు అభినందనీయం.


2)కొంపెల్లి రామయ్య గారు 

------------

విశ్వ మానవాళి విశ్వసించిన అతి పురాతన వైద్య సంరక్షణ వ్యవస్థల సమాహారం ఆయుర్వేదం .పురాతన వంటకాలను చాదస్తంగా భావించవద్దన్న సూచన బాగుంది . ఆధునిక ఆహారపు అలవాట్లతో వ్యాధినిరోధక శక్తి క్షీణిస్తోందన్నది వాస్తవం .నాడు పుట్టుక ,చావు ఇంట్లోనే . నేడు రెండు ఆసుపత్రుల్లోనే కావడం బాధాకరం .పోపుల పెట్టెలో నీ ప్రతి దినుసు ఆయుర్వేద ఔషధమే . మీ అభిప్రాయాలు అభినందనీయం .


3)తిప్పావఝల నరసింహ మూర్తి గారు 

-----------

ప్రకృతి మనకు ప్రసాదించిన అవసరమే ఆయుర్వేదం అంటూ వివరించారు .తల్లిపాలు ఆయుర్వేదం పోతపాలు అల్లోపతి అంటూ చక్కని భావం వ్యక్తపరిచారు .ఇంటి ఫుడ్ జంక్ ఫుడ్ లాంటి పోలికలు బాగున్నాయి .ఆయుర్వేదం జీవన విధానం కావాలన్న కోరిక మంచిదే . ఉరుకులు పరుగుల జీవితంలో ఏమేం కోల్పోయామో వివరించారు .అభినందనలు .


4)తాతపూడి సోమశేఖర శర్మ గారు 

-----------

వృక్షజాలం నుంచి ఆయుర్వేదం పుట్టింది .మనిషి కంటే పురాతనమైనదన్న భావన మార్చుకోవాలి .కవితలో విరుద్ధ భావాలు పొడచూపకుండా చూసుకోవాలి .ఆయుర్వేదాన్ని అక్షరబద్ధం చేసింది అగ్నివేషుడని తెలిపారు .అద్భుత వైద్యం ఆయుర్వేదం అంటూ తెలిపిన వివరణ బాగుంది . అల్లోపతి వైద్యం అడుగుపెట్టేంత వరకు ప్రధాన వైద్య మీ ప్రాణాలు కాపాడింది .దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు వేటికీ ఆశాజనకమైన  వైద్యం అన్న వివరణ బాగుంది. ధన్యవాదాలు 


5)వాకిటి రాంరెడ్డి గారు 

-------------

అమ్మ మనసై బ్రహ్మ చూపిన వేదం ఎత్తుగడ బాగుంది .ఆయుర్వేదం ప్రకృతి వైద్యంలో కొన్ని తేడాలున్నాయి, గమనించగలరని మనవి .ప్రతి ఇంటా ఆయుర్వేదం అమృతం కావాలన్న సూచన అమలు కావాలని కోరుకుందాం . మొండి రోగం సైతం మట్టుబెట్టు.ధన్వంతరి దూతగా దశదిశలా వెలిగిన వైద్యం కరోనా కాలంలో మరోమారు జ్ఞాపకం చేసింది . అభినందనలు.


6)మేకల రామస్వామి గారు 

-------------

ఆయమ్మెరిగిన చికిత్స ఆయుర్వేదం అంటూ పద్యాలలో మీ ఆలోచనలను బాగా పొందుపరిచారు .నానాటికి బెరిగేటి కరోనాను జయించు రోగులకెల్లన్ నానందమ్మున వచ్చెనని తెలిపారు .దీర్ఘకాలిక రోగాల దిటవు దెగడి ,ఇతర వ్యాధులు రాకుండా ఇమిడిపోవు. నేటి వైద్యం నీతి తప్పుతున్న దశలో ఆయుర్వేదం ప్రాభవం తేవాల్సిన మందన్నది వాస్తవం.  పద్యరచనలో ఇంకా రాటుదేలాలని ఆశిస్తున్నా.


7)దంతోజు సత్యం గారు 

----------------

మేక పాలు తాగ మే వాతముండదు అంటూ పద్యాలలో ఆయుర్వేదం గురించి అవగాహనతో వివరణ ఇచ్చారు.ఈ రోజు పొద్దున రాగిజావ తాగి , వాము తిన్న వాతరోగం రాదని సూచించారు. వంట ఇల్లు మనకు వరహాల వైద్యం. పెద్దవారి మాట పెరుగన్నం మూటరా అన్నది ఆచరించదగినది . అభినందనలు.


8)బి .నాగేశ్వరరావు గారు 

---------------

ప్రకృతిమాత ప్రాణిని రక్షిస్తుంది .అనుభవం నుంచి నాటు రాదు, శాస్త్రం ఉద్భవిస్తుంది .ఏ వైద్యానికైనా లక్ష్యం జీవ సంరక్షణ. పంచభూతాల శక్తులు వినియోగించుకుని మొక్కలు ,వృక్షాలు వైద్యానికి ఆయుధాలైనాయి. అది గమనించి అందరూ విజ్ఞతతో మెలగాలని కోరుకుందాము. అభినందనలు.


9)జోషి పద్మావతి గారు 

---------------

ఆయుర్వేద క్షీరసాగరమధనం చేశారు బాగుంది .సృష్టి సంరక్షణ పూరణ శంఖం పూరించిన విధానం వివరించారు. వేకువన ప్రసరించు ప్రభాత కిరణాలు శ్రేష్ఠతములు. వృక్షరాజములందున్నదెంతో విశిష్టత.  ఆయుర్వేద ఆనంద నందనారామం కావాలని కోరుకుందాం . అభినందనలు .


10)సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 

---------------

అక్షరాల ఆయుర్వృద్ధి పరిచే వేదం . అధర్వణ వేదానికి ఉప వేదం .వైద్య విధానాలలోకెల్లా అతి ప్రాచీనం.సమగ్ర గ్రంథంమ ఆయుర్వేదం అని పేర్కొన్నారు .ఏదైనా మోతాదు మించితే దుష్ఫలితమే .వనమూలికలు, ఆకు పసరు మొదలైనవి దేహంలోని దీర్ఘ మొండి రోగాలకు రామబాణం. అలోపతికి లొంగని జబ్బు ఆయుర్వేదంతో అదృశ్యం  .మంచి భావనలు కురిపించారు .ధన్యవాదాలు


11)బి శంకరయ్యగారు 

--------------

ప్రపంచమంతా పరుగుల మయమై,భూగోళం గందరగోళం అయోమయం అయిన తరుణమిది. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటీకరణ ,ఆధునీకరణ పరిణామాలు వివరించారు . అందమైన ప్రపంచమే అంగడి సరుకైనప్పుడు అభిమానించే పుష్పాలకు కూడా ప్రచారం అవసరమే .నేటి కాలం పరిస్థితి అది .ఆయుర్వేదం జీవన నాదం కావాలని కోరుకుందాం . అలోపతి వికటిస్తే గాని కనువిప్పదు లోకం అంటూ వివరించారు. అభినందనలు.


12)సింహాద్రి వాణి గారు 

----------------

మూలికా వైద్యం ఆయుర్వేదం . అన్ని విభాగాలతో కూడిన వైద్యం. వేల సంవత్సరాల ప్రాచీనం. వ్రేళ్లు ,బెరడు, ఆకులు, పూలు ,కాయలు, పండ్లు, గింజలు, పుల్లలు తదితర చెట్ల విభాగాలతో అతి చవకైన మూలికా వైద్యం ఆయుర్వేదం.  అష్ట విభాగాలతో కూడిన వైద్యం అంటూ చేసిన వివరణ బాగుంది.  కవిత్వీకరణ మెలకువలు పాటించాలని విజ్ఞప్తి.


13)రావికోటి శ్రీధర శర్మ గారు 

------------

ఎవరన్నారు ఆయుర్వేదం వ్యాధి నిర్మూలనం కాదని , శాస్త్రీయత లేదని అంటూ ప్రశ్నించారు .శాస్త్రీయ వైద్యం 

ఆయుర్వేదం పేదల జీవన వేదంగా మిగిలింది .సశాస్త్రీయ వైద్య మైన అలోపతి వైద్యం పెత్తనంతో నిరాదరణకు గురైంది .కలల ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం అన్న మీ కోరిక ఫలించాలని ఆశిద్దాం .పంచకర్మ చికిత్సలు పట్టించుకోని కేటుగాళ్లు నాటువైద్యమని చేసే గోలకు మీడియా భూతాలు బాకా ఊదుతున్నాయని విమర్శించారు .అభినందనీయం 


14)పిట్ల కావ్యగారు 

-----------

వేదాల వల్ల బ్రహ్మచే స్వయంగా తెలుసుకోబడిన వైద్యం .

వైద్య విధానాలలో పురాతనమైనది, ప్రాచుర్యమైనది .

మొండి వ్యాధులను సైతం అంతం చేసేది .

నూరేళ్ళ నిండు జీవితానికి ఉపయోగపడే మార్గం భావన బాగుంది . సైడ్ ఎఫెక్ట్ లు లేని చక్కనైన వైద్యమన్న అభిప్రాయం వెలిబుచ్చారు.పంచకర్మ తదితర రీతులు వివరించారు.  అభినందనలు.


15)పిన్నక నాగేశ్వరరావు గారు 

----------------

తేటగీతులలో ఆయుర్వేదం గురించి చక్కగా వివరించారు.వైద్యానికి పనికి రాని వస్తువంటూ లేదు.ఔషధాలు ఉపయోగ మౌను మొక్కలన్నీఅంటూ వివరించారు.  పాత కాలం నుంచి భారతాల విలసిల్లిన వైద్యం కనుమరుగవుతోందన్నది అందరికీ బాధాకరమే.అభినందనలు.


16)మొహమ్మద్ అప్సర వలీషా గారు 

----------

అనాదిగా వస్తున్న ఆదరణ కోల్పోయిన వైద్యం ఆయుర్వేదం.దీర్ఘకాలిక మొండి వ్యాధులకు దీటైన జవాబు. ఆధునికత ఆయుర్వేదాన్ని మరుగున పడేసిందన్నది నిజం .ప్రకృతిలోని ప్రతీ అణువు పరమౌషధం .కంటికి కనబడని క్రిమి కాటుకు తానేంటో తిరిగి నిరూపించింది ఆయుర్వేదం .వైద్యం ఏదైనా ప్రజలకు రక్షా సురక్ష కావాలన్న మీ కోరిక ఫలించాలని ఆశిద్దాం .ధన్యవాదాలు.


17)తరణికంటి సూర్యలక్ష్మి గారు 

---------

ఇతర దేశాలు కన్ను తెరవకముందే ఆయుర్వేదం భారతదేశంలో పుట్టింది .మన విజ్ఞానవేత్తలు శాస్త్రజ్ఞులు ఆయుర్వేదానికి ఆయువుపట్టు .మానవ శరీర నిర్మాణం, ఏ వ్యాధికి ఏ మందు వాడాలి మొదలైనవి ఆయుర్వేద గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్నాయి .మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ చేసింది శుశ్రుతుడే అంటూ ఆయుర్వేద వైద్యం తీరుతెన్నుల గురించి మీరిచ్చిన వివరణ బాగుంది .కవిత్వీకరించే దిశగా మరింత కృషి ఎదుగుదలకు అవసరం. అభినందనలు


18)దారల విజయకుమారి గారు 

---------

ధన్వంతరి, శుశ్రుతసంహితలు అవనికిచ్చిన వరం ఆయుర్వేదం .పశువులను కాపు కాసే అస్త్రాలు ఎన్నో ఆయుర్వేదంలో ఉన్నాయి .దెబ్బతిన్న మనుషులకు, కలుపుతున్న గాయాలను పరామర్శించేందుకు ఏ చెయ్యి అయితేనేం మనిషిని బ్రతికించడం కావాలన్న భావన మేలైంది. మనిషిని అడుగడుగున ఆదుకున్నది ఆయుర్వేదమే అన్న ధీమా బాగుంది .


19)డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు గారు 

----------

అనాదిగా మన ఇంటి వైద్యం .పరిసరాలలో దొరికే ప్రతి మొక్క పనికివచ్చేదే .మనం తినే కూర లో దినుసులన్నీ ఆయుర్వేదమే కదా మిత్రమా అని చాటారు . అస్వస్థత నుంచి స్వచ్ఛత చేకూర్చేది భారతీయ వైద్యంగా ఆయుర్వేదాన్ని పేర్కొనడం బాగుంది .ఆయుర్వేదం జీవన రహస్యం అని చాటిన ఆనందయ్య నేడు కరోనా విసిరిన సవాలుకు జవాబు అన్నట్లు వివరించారు. అభినందనలు.


20)బొడ్డు హారిక గారు 

-----------

ఆరోగ్య రహస్యం అందించిన వేదం ఆయుర్వేదం నిజమే కానీ ఇంకా ఆభరణాలుగా మారలేదు .ప్రాచీనమైనది ప్రాణాలను కాపాడే వేదం .వృక్షజాతులచే వైద్యం అందించేది.  ఆయుర్వేద వైద్యం గురించి మీరు అందించిన వివరణ బాగుంది .అభినందనలు 


21)వనపర్తి గంగాధర్ గారు 

----------

మానవ శరీరానికి హాని చేయని వైద్యం .ఎన్నో రోగాలకు ఉపశమనం .వనమూలికల అద్భుత ప్రసాదం .

ప్రకృతి మూళికలే పరమౌషధాలు. వేదకాలం నుంచి ఆచరిస్తున్న వైద్యం .భారత దేశమే ప్రపంచానికి ఔషధ మార్గదర్శి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అభినందనలు


22)చేబియ్యం శ్రీనివాసరావు గారు 

----------

సంజీవిని తెచ్చి సౌమిత్రిని రక్షించింది .అమ్మ, బామ్మ చేతి వంటలలో కలిసింది .ఉగాది పచ్చడిగా వచ్చింది .భగవంతుని దర్శన తీర్థంగా అందుతున్నది .పచ్చని ఆకుల్లో , పట్టుతేనెలో, బంకమట్టిలో నిలిచింది ఈ వైద్యం అని పేర్కొన్నారు .

అందు గలడు ఇందు లేదని అన్నింటా తానై నిలిచిన ఆయుర్వేదం గురించి మీరిచ్చిన వివరణ బాగుంది .ధన్యవాదాలు.


23)ఇంద్రావత్ రాహుల్ గారు 

------------

రోగం ముదిరితే గాని పైత్యం అర్థం కాదు .ప్రకృతిలో లేనిది అంటూ లేదు .ఆయుర్వేదం వాడుదాం ఆరోగ్యంగా ఉందాం నినాదం ఆచరణ రూపం దాల్చాలని కోరుకుందాం .కరోనా మహమ్మారి కి ఆయుర్వేదమే శరణ్యం .పాశ్చాత్య వాసన లో నిద్రా ముద్రితమైన సమస్త మానవాళిని జాగ్రృతం చేయాల్సి ఉంది .అభినందనలు .


24)అన్నాప్రగడ వెంకట నరసింహారావు గారు 

--------------

పంచప్రాణాల శ్వాస అమరత్వంపై ఆశ ఆయుర్వేదం .జీవితానికి ఒక సూచికగా, నిష్కామ కర్మగా , సిద్ధాంతాల అఛేదంగా నిలిచింది .నియమాలకు నియమం .సదా ఆచరణ సాధ్యం ఆయుర్వేదం .

జీవితానికి ఒక సూచికగా నిష్కామకర్మ గా ఆయుర్వేదం గురించి వివరించారు .అలోపతి వైద్యానికి సవాలుగా మారాలని కోరుకుందాం .అభినందనలు .


25)పిల్లి హజరతయ్య గారు 

------------

సమస్త వ్యాధుల సంహారిణి. రోగుల పాలిట సంజీవని.దీర్ఘకాలిక వ్యాధుల నిరోధిని.ప్రజలకు ఆరోగ్యప్రదాయిని .దోషం, ధాతువు ,మలం, అగ్ని ఆయుర్వేదానికి ప్రధానాంశాలు .వ్యాధి నిర్ధారణ చికిత్సలు.  ప్రతి మొక్క ఔషధం.స్వస్థత చేకూర్చే సాంత్వన ఇచ్చే వైద్యం అంటూ పేర్కొన్న విధానం బాగుంది .అభినందనలు .


26)మన్నె లలితగారు 

---------

వన మూలికలతో చేసిన కాయకల్ప, శల్య చికిత్స ఆయుర్వేదాన్ని అక్షరబద్ధం చేసింది శస్త్రచికిత్సలు చేసింది ఎవరెవరో వివరించారు .మృతసంజీవని, పాద లేపనం ఆయుర్వేదమేనని తెలియపరిచారు .

ఆయుర్వేద వైద్యం గురించి రాస్తూ వస్తు వివరణ చేశారు.ఆయుర్వేద అంతర రహస్యం తెలియపరిచారు .అభినందనలు.


27)జక్కిడి వెంకట రెడ్డి గారు 

----------

పరబ్రహ్మ ఆశీర్వదించి అందించిన బ్రహ్మాస్త్రం .ఎందరో మహనీయుల సాధన ఫలం .సర్వ రోగాలకు చక్కని పరిష్కారం .నాడి పట్టి రుగ్మత తెలిపే శాస్త్రం .

ఆయుర్వేదం అవసరం అనివార్యంగా మారాలని ఆశిద్దాం .దేహం లోని రోగాలను ఆదిలోనే అంతం చేయొచ్చు గుర్తిస్తే . మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యం ఇస్తాయి .అభినందనలు .


28)అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 

-----------

వైద్య విధానంలో ఆయుర్వేదం అతి ప్రాచీనం. నలంద తక్షశిల విశ్వవిద్యాలయంలో బోధింపబడినది  .ప్రకృతి వనరులు వాడటంతో అల్లోపతిలా దుష్ప్రభావం ఉండదు .నేటి కరోనా పరిస్థితులలో ఆనందయ్య ఆయుర్వేద విధానం మహమ్మారిని నిర్మూలిస్తుంది .వసుదైక కుటుంబం రక్షింపబడాలని ఆశిద్దాం అంటూ తెలిపిన అభిప్రాయాలు అభినందనీయం .


29)నారు మంచి వాణి ప్రభాకరి గారు 

---------

ఆయుర్వేదం ఆరవ వేదం .ఆధునిక వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఆయుర్వేదం ద్వారా నిరోధం .మహా జ్ఞానులు ప్రకృతినుంచి అందించిన ఔషధం .అన్ని వైద్యాలకు మూలం. ఎన్నో గృహ చిట్కాలు ఆయుర్వేదం .ఎన్ని మందులు వచ్చినా, వైద్యాలు వచ్చినా ఆయుర్వేదం నిధి భావనలు బాగున్నాయి .అభినందనలు.


30)ఆళ్ల నాగేశ్వరరావు గారు 

----------

ప్రకృతి వరప్రసాదిత సంపత్తి .ఆరోగ్యాలను అధిగమించేది .విరిగిన అవయవాల అతుకుటకు కట్టే పొత్తూరు కట్టు లాంటిది. ఆయుర్వేదాన్ని నమ్మకంతో సేవిస్తూ దేహంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచుకుంటూ అనారోగ్యాలను అధిగమిస్తూమనోధైర్యంతో ముందుకు సాగాలన్న సూచన మేలుగా ఉంది .ఆనందయ్య లాంటి నిస్వార్ధ వైద్యులు విశ్వాసంతో అందిస్తున్న కరోనా నివారణ మందు అంటూ తెలియపర్చారు.


31)గంగపురం శ్రీనివాస్ గారు 

------

ఆకుపసరని అలుసెందుకు ఉచిత మీద కదా అంటూ ఊకదంపుడు ముచ్చట్లెందుకు అంటూ ఎత్తుగడ బాగుంది .శాస్త్రీయత లేదని సన్నాయి  నొక్కులెందుకు . శాస్త్రీయత వైద్య బుట్టలో సైడ్ ఎఫెక్టులు పుట్టెడు కదా అని నిలదీశారు .కాసుపత్రులు కన్నా మానవత్వాన్ని నూరిపోసే మందే మిన్న అని తెలిపారు .ఆయుర్వేదమే ఆదిపిత .మాటకు సత్యం మందుకు పత్యం పోయి మనిషికి పైత్యం మాటకు భత్యమైందని వివరించారు. అభినందనలు.


32)ధనాశి ఉషా రాణి గారు 

---------

కాసుల కోసం మానవత్వం నిలువునా చితికిపోయి కరోనాతో విలవిలలాడుతుంటే తెల్లకోటు మాయ మోసాలు చేస్తోంది .పేదరికాన్ని అపహాస్యం చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల తీరు నిలదీశారు బాగుంది. రసాయన మందులకు నిండు బానిసగా మారిన మనిషి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన ఆయుర్వేదం ఆరోగ్యానికి బాసటే. ధన్యవాదాలు


33)మద్ది పుల్లారావు గారు 

-------

హితాహిత సుఖం దుఃఖం అంటూ ప్రారంభించి ఆయుర్వేదం తీరును వివరించారు .ఏనాడో మన పూర్వీకులు ఆయుర్వేదం అమృతం అన్నారు .వైద్య విధానాలకే మకుటాయమానం .వేలసంవత్సరాల ఆయుర్వేదం ఎన్నాళ్లైనా సజీవం .నేడు ఆనందయ్య సైతం పారదోలే కరోనాను అంటూనే , ప్రపంచాన్ని విస్మయపరిచెనని వెల్లడించారు. అభినందనలు.


34)నాశబోయిన నరసింహ గారు 

------

విభిన్న వైద్య ప్రక్రియ పరంపరలో విశిష్టస్థానం ,మొండిజబ్బుల తరిమే బలమైన శక్తి పుంజంగా ఆయుర్వేదాన్ని వివరించడం బాగుంది .సంగీతం, క్షవరం ఆయుర్వేదంలో భాగం.తరతరాల తరగని స్వదేశీయ మూలికా సంపద. భారతీయుల వరప్రసాదం  . అనర్థాలు లేని ఔషధ విశిష్టత అందరూ గుర్తించాలన్న కోరిక ఫలించాలి.

.........................................


ఫలితాలు

: వైశాఖమాసం

 పౌర్ణమి కవితలపోటీలో

ప్రథమస్థానం పొందినకవివరులు

గంగాపురం శ్రీనివాస్ గారు

సిద్ధిపేట జిల్లా

***************

రావి కోటి శ్రీధరశర్మ గారు

టేక్మాల్

మెదక్ జిల్లా

పిల్లి హాజరత్తయ్య గారు

శింగరాయకొండ,

ప్రకాశం జిల్లా

 జక్కిడి వెంకట్ రెడ్డి గారు

యాదాద్రిభువనగిరి జిల్లా

నాశబోయిన నరసింహ గారు

చిట్యాల

నల్గొండ జిల్లా

దారల విజయకుమారి గారు

తిరుపతి

వనపర్తి గంగాధర్ గారు

హన్మకొండ

అఫ్సరవలీషాగారు 

ద్వారపూడి

తూర్పు గోదావరిజిల్లా

. పిన్నకనాగేశ్వరావు

తెనాలి

గుంటూరుజిల్లా

సయ్యద్ జహీర్ అహ్మద్ గారు

కర్నూలు

మేకల రామస్వామి గారు*

  *చెన్నూర్



1.

అంశం: ఆయుర్వేదం

ఆయుర్వేదం

మన పూర్వీకులు ఇచ్చిన అమృత మథనం

ఆయుర్వేదం అలనాటి ఆనవాలు ఎనకటి రోగాల చిట్టా విప్పే అమృత ఔషదం

ఆనవాయితీ గా వస్తున్న ఆచారం 

సంప్రదాయం గా కొనసాగుతున్న ఆరోగ్య సూత్రపు రహస్యం

తరాలు మారిన తార స్థాయిలో తాండవిస్తుంది

యుగాలు గడిచినా దాని స్థానం చెక్ చెదరలేదు

ఆకుపసరు తోనే అన్నింటికీ  చెక్ పెడుతుంది

అన్ని రోగాల పుట్టను నయం చేస్తుంది

వంటింట్లో ఉండే దినుసులే ఆయుర్వేదం

పెరట్లో పెరిగే మొక్కలే ఆయుర్వేదం

గుట్టల పుట్టల పొంటి దొరికే  అల్లుకున్న తిప్పతీగ చెట్లల ఆకులు అలములు కొమ్మలు రెమ్మలు కాయలు పండ్లు బెరడులే ఆయుర్వేదం

అడవి సంపదనే ఆరోగ్యానికి ఆయుష్షు

పైర గాలులే అత్యవసరం ఆక్సిజన్ ఊపిరి

ప్రకృతి ఒడిలో అణువణువునా నింపుకున్న ఆయుర్వేదం

మానవాళి మనుగడకు ఆధారం ఆయుర్వేదం

మహమ్మారి మాయదారి జబ్బులకు అమృత వర్షిణి ఆయుర్వేదం

పిల్లని సక్కలో పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు

ఆయుర్వేదం మరిచిపోయే

మెడికల్ మాఫియా ముసుగులో అల్లోపతి కి అలవాటై ఆగమాగం అయితిమి ఆయుర్వేదాన్ని మరిచితిమి. 

నేటి పరిస్థతుల్లో ఆయుర్వేదం ఆయుష్షు అని నమ్మితిమి.


బాలు కత్తుల

లింగ వారి గూడెం

సంస్థాన్ నారాయణపురం 

యాదాద్రి జిల్లా

9676219655

2

పౌర్ణమి నగదు బహుమతుల పోటికై

అంశం: ఆయుర్వేదం

శీర్షిక: పోపుల పెట్టె...!

పేరు: కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం

చరవాణి:7032504646

ఆయు విందతి వేత్తివా ఆయుర్వేదః నానుడి నాదం

ఆయువును వృధ్ధి చేసే వైద్య విజ్ఞాన వేదం

దీర్ఘకాలిక జగమొండి వ్యాధుల పై ఎక్కు పెట్టిన బ్రహ్మాస్త్రం 

చరకుడు  అగ్నివేశ తంత్రమును చరక సంహిత గా శాస్త్రీకరించిన   వైద్యం ఆయుర్వేదం...!


విశ్వ మానవాళి విశ్వసించిన అతి పురాతన వైద్య సంరక్షణ వ్యవస్థల సమాహారం

ధర్మార్థకామ మోక్షాల అవరోధాలకు వైద్య తాత్విక చింతనల సమ్మేళన సారం

ధన్వంతరి సుశ్రుతాది  మహర్షులు నేర్చినట్టి ప్రాచీన  వైద్య విజ్ఞాన భాండాగారం

సంగీతం క్షవరం భాగమై  వెలుగొందిన ఆయుర్వేదం...!


ఆధునిక జీవనశైలి ఆహారపు అలవాట్ల విపరీత  పరిణామ ధోరణిలో 

పురాతన వంటకాలను చాదస్తంగా  భావించే  సరళిలో

మనిషి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి క్షీణించే క్రమంలో

ప్రతి క్షణం లక్షల సంఖ్య లో రోగ కారక సూక్ష్మక్రిములు దేహం పై దాడి చేసే వేళలో 

వసంత కాలపు ఉషోదయమై  తలుపు తట్టే  రక్షక దళం ఆయుర్వేదం...!


తాత ముత్తాతల కాలంలో  

పుట్టుక ఇంట్లోనే... చావు ఇంట్లోనే...

ఆధునిక జీవనశైలి కాలంలో

జననం ఆసుపత్రిలోనే...మరణం ఆసుపత్రిలోనే...

ఈ నేపథ్యంలో వెనకటి వంటకాలే 

ఆరోగ్యమే మహాభాగ్యంగా...

ఇంటిల్లి పాది అమృత అక్షయ పాత్ర జీవామృత వేదం ఆయుర్వేదం...!


జీల కర్ర నిమోనియాను మాయం చేసే వ్యాధి నిరోధక శక్తి మంత్ర దండమై

పసుపు అల్లం యాలకులు శ్వాస కోశాలకు  ఆయువు పట్టే సహజ రోగ నిరోధక ఆయుధాలై

లవంగం జీర్ణ రసాల స్రవంతి, మెంతులు రక్త శుద్ధి పారిశుధ్య మిత్ర బృందమై

ధనియాలు శొంఠి మరిగించిన మిశ్రమం చల్లదనం మధుమేహ రహిత అస్త్రాలై

వెల్లుల్లి పాక హర్షంగా  ఘనకీర్తి గాంచిన సూక్ష్మ క్రిమి నాశిని కొవ్వుకరిగించే  హాసినై ఆయుర్వేద వైద్యుల హస్తాల్లో  దివ్యౌషధం  కరోనా రోగులకు  ప్రాణాలు పోసిన సంజీవినై

ఒక్కొక్క దినుసుల్లో ఒక్కొక్క ఆయుర్వేద ఔషధం కేరాఫ్ అడ్రస్ పోపుల పెట్టె...!


హామీ పత్రం

ఈ కవిత నా స్వీయ రచన

3

ఆయుర్వేదం అతి పురాతన వైద్యవిధానం. అధర్వణవేదానికి ఉపవేదం.ఆయువును గూర్చిన విజ్ఞానం.ఇదొక శాస్త్రం.

ప్రకృతి మనకు ఔషధాలనుప్రసాదించింది.ఈఔషధాలవరమే ఆయుర్వేదం.

ఆయుర్వేదం తల్లిపాలు.అల్లోపతి పోతపాలు.ఆయుర్వేదంఇంటి ఫుడ్.అల్లోపతి జంక్ ఫుడ్.వ్యాధిని సమూలంగా అరికట్టే గలిగేది ఆయుర్వేదం.దీర్ఘకాలిక మొండి వ్యాధులను సైతం వదిలించేది ఆయుర్వేదం.ఇది సురక్షితం.దుష్ ప్రభావాలు లేని 

వైద్యవిధానం.పంచకర్మలచికిత్సకిస్తుంది ప్రాధాన్యం.ఆయుర్వేదం మన జీవనశైలి.ఉరుకులపరుగుల జీవితం లో దీన్ని చేస్తున్నాం నిర్లక్ష్యం.ఇంటింటా ఆయుర్వేదం-అదేకావాలి మననినాదం.

కవితా గానం సమూహం.

ప్లవనామసంవత్సరవైశాఖమాసం

పౌర్ణమి కవితలు పోటీకి.

అంశం.ఆయుర్వేదం.

శీర్షిక.మనవైద్యం.

పేరు.తిప్పావఝల నరసింహమూర్తి.

బుచ్చి రెడ్డి పాలెం

నెల్లూరు జిల్లా.

4.

 కవితాగానం 

ప్లవ నామ సంవత్సరo

వైశాఖ మాస పౌర్ణమి పోటీకి 

తాతపూడి సోమశేఖర శర్మ 

యానాం, 8328079346

అంశం: ఆయుర్వేదం

శీర్షిక: "న్యాయ మైన వైద్యం"


వృక్షాలు ,మొక్కలు ,పొదలు భాగాలు

వ్యాధి నివారణకు వినయోగించే

విధానమే ఆయుర్వేదం

ఆరోగ్యం బాగుచేసి.ఆయుష్షును 

పెంచును గనుక ఆయుర్వేదమంటున్నారు


మనిషి పుట్టక ముందే పుట్టింది వృక్ష జాలం

మనిషి కంటే పురాతన మైనది ఆయుర్వేదం

 రోగాలు దూరం చేసి ఆయువు పెంచే 

సంజీవినిగా తర తరాలుగా భారతీయులు

వినియోగించే వైద్యం ఆయుర్వేదం!


తొలి అక్షర బద్దం చేసింది అగ్నివేశుడు

అనుసరించెను చరకడు, శుశ్రుతుడు

విశేష సేవలందించెను ధన్వంతరి 

అభివృద్ధి చేసిరి మహర్షులెందరో


అల్లోపతి అడుగు పెట్టేంతవరకు

ప్రధాన వైద్యమై ప్రాణాలు కాపాడింది

 ధీర్ఘవ్యాధుల నివారణకు నేటికీ

ఆశాజనకంగా నిలుస్తుంది నిలువరిస్తుంది!

పేషెoట్ల మాయసోకని న్యాయమైన వైద్యం

అందరికీ అందుబాటులో ఉండే

అద్భుత వైద్యం ఆయుర్వేదం!!


హామీ పత్రం.. 

  ఈ కవిత నా స్వీయ రచన అని హామీ 

ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం, 8328079336

5

కవితా గానం పౌర్ణమి నగదు బహుమతుల పోటి కోరకు 

అంశం       :ఆయుర్వేదం 

కవిపేరు     : వాకిటి రామ్ రెడ్డి 

ఊరు         : పులిగిల్ల ,వలిగొండ ,యాదాద్రిభువనగిరి .

చరవాణి    : 9000702093 

శీర్శిక         : ఆరోగ్యానికి ఆయువు 


అమ్మమనసై బ్రహ్మచూపిన వేదం  

అతిపురాతన అందుబాటు వైద్యం 

అడవిలోదొరికే  అరుదైన ఔషాధం 

ఆయుష్షువృద్దికి శుద్ది ఆయుర్వేదం 


మొండిరోగంను సైతం పిండిగొట్టు    

మూర్ఛవ్యాధుని కూడ మట్టుబెట్టు 

మృష్టమై భారతలో కలిగింది పట్టు 

మృత్తికలోపుట్టి విప్పింది వ్యాదిరట్టు 


ధన్వంతరిదూతగా దశదిశల వెలిగె  

ఆయుర్వేధ దేవుడై సుశ్రుతు నిలిపే  

ఆనందమై చరకుడు ప్రాణమైకొలిచే 

ఆధునికయుగం ఆనందయ్య నిలిచే 


పంచకర్మసేవతో ప్రజల మన్ననపోంది 

పల్లెపల్లెనప్రాచీన వైద్యమై వెలుగొందే 

అల్లోపతి హోమియోపతి ఆధిగమించి 

కరోనాకాలంలో ప్రజల కారుణ్యంచెందే 


ప్రకృతి వైద్యమై ప్రతిప్రాణిలో భాగమై 

ఫలవృక్ష మిలితమై త్రిఫల చూర్ణమై

ప్రతిఇంట ఆయుర్వేదం అమృతమని 

కరోనాతరమా ఙనం ఆయుర్వేదులయిరి  


హమీపత్రం : ఇది నా స్వంత రచన .ఎవరిని అనుసరించ వ్రాసినది కాదు .స్వీకరించగలరు .

6.

అంశం: ఆయుర్వేదం

శీర్షిక: ఆరోగ్య ప్రదాయని- ఆయుర్వేదం

అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు

విశాఖపట్నం

..................................................

ఆయుర్వేదం ఆదర్వణ వేదానికి ఉపవేదం

ఆయువుని గూర్చి  చెప్పే విజ్ఞానశాస్త్రం

అగ్నివేశుడు వ్రాసిన అగ్నివేశతంత్రం ద్వారా అవతరణ జరిగింది.

చరకుడు వ్రాసిన చరకసంహిత ఆయుర్వేదానికి మూలం. మహావిష్ణుఅవతార స్వరూపుడు కాశీరాజు ధన్వంతరి ఆయుర్వేదానికి బహుళ ప్రాచుర్యం కల్పించనాడు సుశ్రుతసంహిత లో ఆయుర్వేద విశిష్టత వివరింపబడెను.

వైద్యవిధానంలో ఆయుర్వేదం ప్రాచీనమైనది

నలంద, తక్షశిల విశ్వవిద్యాలయములలో

ఆయుర్వేదం భోధింపబడెను...!!


పంచకర్మ విధానం కండరాల, నరములకు సంబంధించిన వ్యాధులకు అత్యున్నత నివారణ విధానం.

వృక్షసంబంధ మూలికలు   ఉపయోగించి

రక్తపరిశుద్ధి,శ్వాసకోశ, వాత, పిత్త  రోగాలను

తులసి, వేప, కలబంద, అశ్వగంధ, ఉసిరి వంటి

ప్రకృతిలో లభించే వనరులు వాడుటచే 

అల్లోపతి లా దుష్ప్రభావం ఉండదు

నేటి"కరోనా"పరిస్థితులలో 

నెల్లూరు జిల్లా వాసి ఆనందయ్య ఆయుర్వేద విధానం ద్వారా  మహమ్మరిని నిర్మూలిస్తున్నది

అక్షర సత్యమవ్వాలని

వసుదైవకుటుంబం రక్షింపబడాలని ఆశిద్దాం...!!

7.

 నారుమంచి వాణి ప్రభాకరి గారు


కవిత *

   ఆయుర్వేదము


దేవతలు రాక్షసులు క్షీర సాగర 

మధనంలో ఈ ఆయుర్వేదం పుట్టింది

దీని అధిదేవత శ్రీ ధన్వంతరీ వేంకటేశ్వర స్వామి

ఆయుర్వేద మా ఆరవ వేదం మా

వైద్యానికి అందని ఎన్నో అంశాలు

ఆయుర్వేదం ద్వారా నిరోధించడానికి సహాయపడుతుంది అందుకే చరకుడు

వంటి మహా జ్ఞాని అయిన వైద్యులు

ఎన్నో వస్తువులను ప్రకృతి నుంచి

వచ్చిన మూలికలు ఆకు పస ర్లు వాడి

ఎన్నో మందులు కుప్పెలుగా పొడులు

లేహ్యాలు గా తయారు చేసి రోగ నిరోధక

శక్తి కల్గిన మందులు చేసి పొందు పరచై

వంటింటి చిట్కాలు పోపు సమాను మనిషి

నిత్యం అందించే ఆరోగ్య ఓష థాలు

అందుకే ఎన్నో గృహ చిట్కాలు  ఆయుర్వేదం

మూలము  నాటికి నేటికి కూడా ఎన్నో

ఇంగ్లీష్ మందులు  కు ఇది మాతృక

ఆహారం నుంచే ఆరోగ్యం అని తెలిసిన వారు

ఆయుర్వేద మనకు  శ్రీ ధ్నవంతరి.వేంకటేశ్వర స్వామి

హస్లము లో ఉన్న పాత్రలో ఈ ఆయుర్వేద అమృతం

ఉంటుందని ,నమ్మకము అందుకే ఎన్ని మందులు వైద్యలు వచ్చినా ఆయుర్వేద ము నిధి


మనసు కరిగి జీవిత సత్యాలు

గ్రహించి  రాజ భోగం వదలి

ఆధ్యాత్మిక భావాలు తో మనస్సు

నియంత్రించి ఉంచుట లోనే శాంతి


ఉత్తమ జీవిత మార్గానికి కొత్త అర్థం

చెప్పి మానవాళిని  అమృత కలశం

లాంటి బోధనలతో  శాంతి కి  శ్రీ కారం

చుట్టినన భగవాన్ బుద్ద పూర్ణిమ శాంతి

8

 ఆళ్ళ నాగేశ్వరరావు గారు


కవిత *

    అంశం:  ఆయుర్వేదం

కవితా శీర్షిక:

      "" ఆరోగ్యానికి బలం""

ప్రకృతి వర ప్రసాదిత సంపత్తితో

వనదేవత అందించే వనమూలికలతో

జనింప చేసే దివ్యౌషధం ఆయుర్వేదం!

నమ్మకంతో సేవిస్తూ

దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటూ

ఆరోగ్యానికి బలాన్ని  చేకూర్చుకుం టూ

అనారోగ్యాలను అధిగమిస్తూ

మనోధైర్యంతో ముందుకు సాగుతున్నారు జనాలు!

పచ్చకామెర్లకు వాలజా మందులా

విరుపాక్షిపురంలోఇచ్చే పక్షవాతపు మందులా

విరిగిన అవయవాలను అతుకుటకు కట్టే  పొత్తూరు కట్టులా

ఆయుర్వేద మందును విశ్వాసంతో ఆదరిస్తున్నారు జనాలు

అదే విశ్వాసంతో కరోనా నివారణ మందును అందిస్తున్నారు ఆనందయ్యలాంటి  నిస్వార్థ వైద్యులు!

9

కవిత *

కవితా గానం

వైశాఖ పౌర్ణమి పోటీలు


అంశం: ఆయుర్వేదం


*సంజీవని*

°°°°°°°°°°°°

ఆకు పసరని అలుసెందుకు? 

పరికించి చూస్తే

ప్రతి చెట్టు ఔషధ పుట్టనే!


ఉచితమే కదాని

ఊకదంపుడు ముచ్చట్లెందుకు? 

అన్ని రకాల వైద్యోపతులకు 

ఆయుర్వేదమే ఆది పిత!


శాస్త్రీయత లేదని

సన్నాయి నొక్కులెందుకు?

శాస్త్రీయత వైద్య బుట్టలో

సైడ్ ఎఫెక్ట్స్ పుట్టెడు కదా!


కాసు'ల పేరాశించే కాసు'పత్రుల కన్నా,

మానవత్వాన్ని నూరిపోసే మందే మిన్న!

మాటకు సత్యం, మందుకు పత్యం పోయి

మనిషికి పైత్యం, మాటకు భత్యమైంది!


ఆకుపసరే అంటవో,

ఆయుర్వేదమే అంటవో,

నాటు మందేనంటవో,

గొర్రెదాటుడే అంటవో నీ ఇష్టం!


నీ నుంచి కాదని చేతులెత్తేస్తే,

చావు వాకిట్లకు వెళ్లొచ్చిన రోగి 

ఆఖరి ప్రయత్నంగా ఆయు'వు పసరేసుకొని

సంజీవిని మింగినట్టు సజీవుడై,

'ఆనందం' పంచినోళ్ళకు హారతి పట్టే!



                   *...గంగ శ్రీ*

                9676305949



హామీ పత్రం:

పై కవిత "సంజీవని"

నా యొక్క స్వీయ రచన.

ఎలాంటి అనువాదం కానీ 

అనుకరణ కానీ చేయలేదని, 

ఎక్కడా ప్రచురితం కాలేదని, 

కేవలం పోటీల నిమిత్తమే వ్రాశానని 

హామీ ఇస్తున్నాను. 



                  గంగాపురం శ్రీనివాస్ 

                            సిద్దిపేట

10

 కవిత *

శీర్షిక. ఆయుర్వేదం


........

కాసుల కోసము జరిగే వేటలో

మానవత్వం నిలువునా చితికిపోయి

కరోనాతోను విలవిలలాడుతూ

తెల్లకోటు మాయలో మోసపోయి

గుండెలు బాదుకుంటూ చితికిపోయి


ఆస్థులు ఐశ్వర్యము నిలువునా  సమాధి చేసి

వేలకు వేలు బిల్లులు మోస్తూ గుండెలు బాదుకోకు

పేదరికాన్ని అపహాస్యం చేస్తున్న 

కార్పోరేట్ ఆస్పత్రికి దీటుగా

మన చుట్టూ ఎన్నో ఔషధ మూలికపై

అలసత్వం చూపుతూ కనీస శాస్త్రీయతలేక

ఆధునిక ప్రపంచములోన నిలిచి

 రసాయన మందులకు నిండు

బానిసగా మారిన ఓ మనిషి

 

స్వచ్ఛమైన ఆయుర్వేద మందులను వాడి

బంగారుభవితను తులసి వేప స్వచ్ఛమైనమూలికలు పండ్లు ఆకులను శరీరానికి అందిస్తూ

అనారోగ్యరహిత కాలుష్యరహిత సమాజాన్ని నిర్మిస్తూనే


వెన్నుపోటు పొడుస్తున్న నేటి పరిస్థితులఎదుర్కోని

ప్రతి ఇల్లును సంపూర్ణ ఆరోగ్య నిలయంగా మారద్దాము ప్రతి మనిషి ఆరోగ్య నిఘంటువుగా నిలుద్దాము

వ్యాధినిరోధక కవచముతో రోగాలను తరిమి కొడుదాము


ధనాశి ఉషారాణి

చిత్తూరు జిల్లా

భాకరాపేట

11.


[29/05, 3:34 PM] Lalita Sister: పౌర్ణమి నగదు పోటీలకై


అంశం :- ఆయుర్వేదం

*******************

శీర్షిక :-ఆయుర్వేదమే శరణ్యం

*******

1)కందము

*******

ఆయువునుగూర్చి దెలిపిన

ఆయుర్వేదము ఘనమ్మునౌన్నత్యమునన్

కాయ,గ్రహ,శల్యమాదిగ

ఆయమ్మెరిగిన చికిత్సనాయుర్వేదమ్

2)కందము

********

ప్రాచీనకాలముదనీ

యోచించుజనాలు దీని యోగ్యత మరిచీ

పేచీ బెడుదురు రోగులు

నాచారమ్మని దెలియకనాయుర్వేదమ్

3)కందము

********

నానాటికి బెరిగేటి క

రోనాను జయించు నేటి రోగులకెల్లన్

నానందమ్ముగవచ్చెను

నానందమ్మయ్యమందు నాయుర్వేదమ్

4)తేటగీతి

*******

దీర్ఘకాలిక రోగాల దిటవు దెగడి

ఇతరమౌవ్యాదిరాకుండనిమిడిపోవు

వాత కఫ,పిత్తదోశాల పాతరేసి

సుఖము సౌఖ్యమ్ముగల్గించు శుద్దపరచు

5)ఆటవెలది

*********

సుశ్రుత చరకాది శోధనాఫలముతొ

జరిగె  నాడు ఘనత శస్త్రక్రియలు

నేటి వైద్యమంత నీతి దప్పినడువ

ప్రాభవమ్ముదెచ్చె పాత మందు

**************"**""*"""****

మేకల రామస్వామి- చెన్నూర్

9912747214

12

: అంశం :-   ఆయుర్వేదం,

పద్యాలు:- ఆట వెలది.


1) తిప్ప తీగ తినిన తిప్పును రోగాలు

అశ్వ గంధ నరుల కాయు వెచ్చు

రోజు యోగ చేయ రోగాలు రావోయి

సత్యమన్న మాట‌‌‌ సద్ది మూట.


2) నిమ్మ కాయ తేనె నీటితో తాగిన

శుద్ధి యగును కడుపు చక్క గాను

రోజు కొకటి నిమ్మ రగతమె రియునమ్మ

సత్యమన్న మాట‌‌‌ సద్ది మూట.


3) యెల్లి పాయ దంచి యందు వాముకలిపి 

కాలు చేయి రాయ కలుగు వేడి

వుల్లి చేయి మేలు తల్లి చేయదు కద

సత్యమన్న మాట‌‌‌ సద్ది మూట.


4) అల్ల మెపుడు జనుల కారోగ్య మిచ్చును

కల్ల కాదు యిదియు కఠిన నిజము

వంట యిల్లె మనకు వరహాల వైద్యము

సత్యమన్న మాట‌‌‌ సద్ది మూట.


5) మేక పాలు తాగ మేవాత ముండదు

ఆవు పాలు తాగ యధిక బలము

పాలు యెపుడు మనకు పరమాన్న మందురు

సత్యమన్న మాట‌‌‌ సద్ది మూట


6) రోజు పొద్దు లేచి రాగి జావ నుతాగి

వాము తినిన కాడు వాత రోగి

పెద్ద వారి మాట పెరుగన్నమూటర

సత్యమన్న మాట‌‌‌ సద్ది మూట.


           దంతోజు సత్యం, టీచరు

           హైదరాబాద్

         9849781164

13

కవితా గానం ప్లవ నామ సంవత్సరం

 వైశాఖ మాస పౌర్ణమి పోటీకి

అంశం: ఆయుర్వేదం

శీర్షిక:"ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః"


కడుపు లో ఉన్నప్పుడు తల్లి,

భూమ్మీద కొచ్చాక ప్రకృతి మాత

ప్రాణికి రక్షణ నందిస్తున్నారు!


గాలి ,నీరు ,నిప్పు ,మొక్కలు

వేయి చేతులు చాచి సంరక్షిస్తున్నాయి

ఆయుష్షు పెంచేందుకు సహకరిస్తున్నాయి

ఈ విధానానికి భారతీయ సంస్కృతి

పెట్టుకున్న పేరే ఆయుర్వేదం!


పంచభూతాల శక్తులు వినియోగించుకుని

మొక్కలు వృక్షాలు వాటి భాగాలు 

ఆయుధాలుగా మలచి ఆయుష్షు

పెంచుకోవడమే దీని లక్ష్యం!

తయారీ,వినియోగం విధి విధానాలే

ఆయుర్వేద శాస్త్రం, సిద్దాంతం!


అనారోగ్య నివారణలో

అనుభవం ,వినియోగిస్తే నాటు.

శాస్త్రం ,ఉపయోగిస్తే ఆయుర్వేదం

రెండింటి లో, తేడా అమ్మ పాలకి

అమ్మ చేతి గోరు ముద్దకి ఉన్నంత.!


లక్ష్యం మాత్రం జీవ సంరక్షణే 

ఆయుఃవృద్దియే.అందుకే వెలసింది  నానుడి

"ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః" అని.

ప్రతి జీవీ ఆ ఇద్దరు తల్లుల ప్రేమకు

కృతజ్ఞులై ఉండాలి.విజ్ఞతతో మెలగాలి!!

 ఈ కవిత స్వీయరచన దేనికి అనువాదం,

అనుకరణ కాదని తెలియజేయుచున్నాను

బి నాగేశ్వరరావు కాకినాడ8801526321

14.

తాత పూడి సోమ శేఖర శర్మ గారు

న్యాయమైన వైద్యం 

=============


వృక్షాలు, మొక్కలు, పొదలు, భాగాలు 

వ్యాధి నివారణకు వినియోగించే 

విధివిధానమే ఆయుర్వేదం 


ఆరోగ్యం బాగుచేసి ఆయుష్షును 

పెంచును గనుకే అది ఆయుర్వేదం 


మనిషి పుట్టక ముందే పుట్టింది వృక్షజాలం 

మనిషికంటే పురాతనమైనది ఆయుర్వేదం 

రోగాలు దూరం చేసి ఆయువును పెంచే 

సంజీవినిగా తరతరాలుగా భారతీయులు 

వినియోగించే వైద్యమే ఆయుర్వేదం 


తొలి అక్షరం బద్ధం చేసింది అగ్నివేశుడు 

అనుసరించెను చరకుడు, శుశ్రుతుడు 

విశేష సేవలందించెను ధన్వంతరి 

అభివృద్ధి చేసిరి మహర్షులెందరో 


అల్లోపతి అడుగు పెట్టేంతవరకు 

ప్రధానవైద్యమై ప్రాణాలు కాపాడింది 

ధీర్ఘవ్యాధుల నివారణకు నేటికీ 

ఆశాజనకంగా నిలువరిస్తుంది 

పేటెంట్లు మాయసోకని న్యాయమైన వైద్యం 

అందరికీ అందుబాటులో వుండే 

అద్భుతవైద్యం ఆయుర్వేదం 


ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. 

Submitted 5/29/21, 11:

15

జోషి పద్మావతి గారు


కవిత *


*శీర్షిక:వైద్యో నారాయణో హరీ*

************************************* 

క్షీరసాగరమథనానప్రభవించిన ప్రఖ్యాతములెన్నో!

ఉద్భవించిన దేవ దేవోత్తములెందరో!


ఓషధీవిలువల వ్రేళ్ళూనిని పల్లవములనొకచేత !

అమరత్వమునిచ్చే అమృతభాండమునొకచేత!


సృష్టి సంరక్షణా సంకేత పూరణశంఖమునొకచేత !

సమస్తలౌక్య సారాంశాధారము నొక చేత!


కనినంతనే కన్నులకు దివ్యత్వమునుప్రసాదిస్తూ,

శంఖనాదముననే వినికిడినినుమడింపజేస్తూ


ధన్వంతరియావైద్యనారాయణుడవతరించెనట!

తేజో యశశ్చంద్రికాకౌముదిలో తరింపజేసెనట!


ఆయుర్వృద్ధిమంత్ర తంత్రప్రసాదమొసంగ

ఆయుర్వేద శాస్త్ర పరిజ్ఞానము వివరించగ


వేకువనప్రసరించు ప్రభాత కిరణ శ్రేష్ఠతములు

వృక్షరాజముల యందున్న వైశిష్ఠ్యములు


ఆయాసమునణచునదీ ఆయుర్వృద్ధినిపెంచునదీ,

ఆయుర్వేద ఆనంద నందనారామము 


వైద్యనారాయణుడే అవతారము మార్చి

సూర్యశిష్యగణానొకడై ఆయుర్వేదవిద్యార్థియై


శుశృతునికే శస్త్రచికిత్స నేర్పెనట

మనోకాయశల్యనివారణ చేసెనట


అహో!ధన్వంతరీ శ్రేష్ఠకరీ!

నమో! నమామి రక్షాకరీ!!

16

 సయ్యద్ జహీర్ అహ్మద్ గారు


కవిత *

ఆయుష్మాన్ భవ:

""""'''''"""'''""""''''"""""

అక్షరాల ఆయుర్వృద్ధి పరిచే వేదం

అధర్వణ వేదానికి ది ఉపవేదం

ఆద్యుడు వైద్యనారాయణ ధన్వంతరి

బ్రహ్మ-దక్షప్రజాపతుల మేధోమధనం

అశ్వినీ దేవతల ద్వారా ఇంద్ర గ్రహించగ

ఉపదేశమందిన ఉత్తమ శిష్యుడు అగ్నివేశుని

అగ్నివేశ తంత్ర మూలం 

చరకుని 'చరకసంహిత'

శ్రీహరి రూపం ధన్వంతరి శిష్యుడు సుశ్రుతుడు

తన పేరున సృజించె 'సుశ్రుతసంహిత'


వైద్య విధానాలలో కెల్లా అతి ప్రాచీనం

కాయ బాల గ్రహ శాల్తక శల్య దంష్ట్ర జరా వృష అష్ట విభాగాలు సమగ్ర గ్రంథం ఆయుర్వేదం


వనమూలికలు ఆకు పసరు కాయా కాష్టం

సఃగ్రహించు దేహం రోగి నిరోధం

దీర్ఘ మొండి రుగ్మతలకు రామబాణం

వాత పిత్త కఫ రాసి రక్తం దోషం హరణం

ధూపం దీప సంగీతం క్షవరం లంఖణం పథ్యం

అనుసరించు విధానం తథ్యం!

అలోపతికి లొంగని జబ్బు ఆయుర్వేదంతో అదృశ్యం!

మోతాదు మించితే దుష్ఫలితం!!!

           ***

నా స్వీయ కవిత అని నేను హామీ ఇస్తున్నాను. 

Submitted 5/29/21, 4

17.

కవితా గానం (సీజన్-2)

_________________________


పేరు:- *బి.శంకరయ్య*

                      SA Telugu.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల

శంకరం పేట A మెదక్.

స్వస్థలం :- *సంగారెడ్డి*

చరవాణి :- *9490243319*

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆


శీర్షిక :- *ఆయుర్వేదం*


🎊🎊🎊🎊🎊🎊🎊🎊


ప్రపంచమంతా పరుగులమయమై.....

ప్రాపంచిక పంజరంలో.....

మానవాళి బందీయై....

భూగోళమే అయ్యింది గందరగోళం.....

అంతా అయోమయం. !!


గ్లోబలైజేషన్...లిబరలైజేషన్...

ప్రైవేటీకరణ ,ఆధునికీకరణ...

ఫ్యాషనైపోయింది.....

వేషమే మారింది. !!


గొఱ్ఱెల మందలోని

గొఱ్ఱెల మాదిరిగా....

మనిషి నైజం మారిపోయె....

గొఱ్ఱెదుంకుడు చందమాయె....


అలోపతి శాస్త్రీయ దృక్పథం...

వికటిస్తే గాని 

కనువిప్పదు ఈ లోకం.....

ఆరోగ్యం క్షీణించి....ధనమంతా ధారవోసి.....

ప్రాణాలే బలియైపోయిన...

పట్టదు మనిషికి

*ఆయువు పోసే ఆయుర్వేదం.*


అందమైన ప్రపంచమే.....

అంగడిలో సరుకయ్యే.....

పరిమళించు పుష్పాలకు

ప్రచారం అవసరమా. !!!


*ఆయుర్వేదం-జీవననాదం,*

*ప్రకృతియే తరగని దివ్యౌషదం..*

18.

కవితా గానం

ప్లవ నామ సంవత్సర వైశాఖమాసం పౌర్ణమి కవితల పోటీకి

అంశం:--ఆయుర్వేదం

శీర్షిక:--ఆయుర్వేదం

రచన:--సింహాద్రి వాణి

ఊరు:--విజయవాడ

చరవాణి:--7569820872


అధర్వణ వేదానికి ఉప వేదం ఆయుర్వేదం

ఆయుషును ‌ కాపాడి వృద్ధి చేసే వేల సంవత్సరాల ప్రాచీన వైద్య విధానం


బ్రహ్మ నుండి దక్షప్రజాపతికి, అతడినుండి అంచెలంచెలుగా భరద్వాజ మున్నగు ఋషులకు ఇంద్రుడు ఉపదేశించెనని పురాణగాథ


అష్ట విభాగాలతో కూడిన వైద్యం ఆయుర్వేదం.దీనిలో మొదటి గ్రంథం అగ్నివేశుడు రచించిన" అగ్నివేశతంత్రం"

ఆయుర్వేదం వైద్యానికి గుండె శుశ్రుతుడు, వెన్నెముక చరకుడు


వ్రేళ్ళు,బెరడు,ఆకులు,పూలు,కాయలు,పండ్లు, గింజలు, పుల్లలు మొదలైన చెట్లయొక్క అన్ని భాగాలతో చేసే అతి చౌకైన మూలికావైద్యం ఆయుర్వేదం.

1)అడవి కంద దుంపకూర:-- మూలశంకకు

2)అడవి తంగేడి పూలకూర:--నులిపురుగులకు

3)అంబోటి లేత ఆకులు పచ్చడి:-- రక్తంతో విరేచనాలకు

4)ఉవ్వచెట్టు పచ్చికాయల రక్షకపత్రాల కూర:- జిగట,నీళ్ళ విరేచనాలు

5)కదంబ పండు:--పైత్యానికి

6)ఉచ్చింత తీగ లేత చిగుళ్ళ కూర:--శశరీరానికి వున్న నొప్పు లను పోగొట్టడానికి.

ఇలా ఎన్నోరకాల రోగాలకు చేసే మూలికావైద్యమే ఆయుర్వేదం.

19.

వైశాఖ పౌర్ణమి కవితల పోటీ

******************

పేరు:-రావికోటి శ్రీధర శర్మ

తేదీ:-29-05-2021

అంశం:-ఆయుర్వేదం

శీర్షిక:-జీవనవేదం

హామీ:-స్వీయరచన

******************


ఎవరన్నారు ఆయుర్వేదం

వ్యాది నిర్మూలనం కాదనీ,

శాస్త్రీయత లేదని...


ఎన్నో మొండి రోగాలను

మూలంతో సహా పెకిలించివేయగల

పేదల జీవన వేదమది...


వేల సంవత్సరాల క్రితమే

పంచ ద్రవ్యాలతో, పంచేంద్రియాలకు

స్వాస్థ్యము చేకూర్చిన

సశాస్త్రీయమైన వైద్యమిది...


పంచకర్మ చికిత్సలు పట్టించుకోని

ఆధునిక కేటుగాళ్లు

ఆకులూ, అలముల నాటు వైద్యమని 

గోల చేస్తుంటే

మీడియా భూతాలు

నిజమేనని బాకా ఊదుతున్నాయి...


అఖండ భారతంలో

ఆయుర్వేదాచార్యుడు

సుశ్రుతుడు చేసిన శస్త్ర చికిత్స

అవని లోనే ప్రథమం కాదా!


అలనాడు, అన్య ప్రాంతాల్లో

అంటురోగాలతో అలమటిస్తున్నవారిని

అమానవీయంగా,అవతలికి నెట్టేస్తుంటే,

"కుటిప్రావేశికం"పేరుతో

హాస్పిటాలిటీ ని ప్రోత్సాహించింది

భారతీయ వైద్యమే కదా!


విదేశీయుల రాకతో

స్వదేశీయుల నిరాదరణ తో

కళ తప్పిన మన వైద్య వైభవాన్ని

మరోసారి కళకళలాడే లా చేద్దాం..

కలల ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం...

******************

రావికోటి శ్రీధర శర్మ

  9550041588

******************

20.

కవితాగానం వైశాఖ మాసం పౌర్ణమి నగదు బహుమతుల పోటీ కొరకు🌹.....


*అంశం* : ఆయుర్వేదం

 *శీర్షిక* : ఆరోగ్యానికి మార్గం


 *వచన కవిత* 


ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వైద్యం

అధర్వణ వేదానికి ఉపవేదం

ఎన్నో కాలాల నుండి వాడుకలో ఉన్న వైద్యం

మొండి వ్యాధుల్ని సైతం అంతం చేసే ఆయుర్వేదం

వేదముల వల్ల బ్రహ్మచే స్వయంగా తెలుసుకొనబడిన వైద్యం

వైద్య విధానాలలో ప్రాచుర్యమైనది ఈ ఆయుర్వేదం

ప్రస్తుత ఆయుర్వేద వైద్యమందు

అధిక ప్రసిద్ధి చెందెను పంచకర్మ

సంగీతము,క్షవరము

ఆయుర్వేదమందు ఒక భాగము

ఓషధులు,మూలికలతో

ఒంటి రోగములన్ని నయము చేసె

సైడ్ ఎఫెక్ట్స్ లేని చక్కనైన మందు

నూరేళ్ళ జీవితానికి ఉపయోగపడే మార్గం

అశ్వగంధ ఆయుర్వేదం

ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం

ఆయువును గూర్చిన విజ్ఞానం

అద్బుతమైనది ఈ ఆయుర్వేదం....


 *పేరు* :పిట్ల కావ్య

 *చరవాణి* :8978656976

21

  29--5--2021.

పిన్నక నాగేశ్వరరావు.           తెనాలి.


పౌర్ణమి పోటీ కవిత.


శీర్షిక :-- ఆయుర్వేదం.


1. తే.గీ.

"ఆయువిందతి వేత్తివా ఆయుర్వేద"

ఆయువును గూర్చినట్టి విజ్ఞాన సూక్తి

యాయువును వృద్ధి చేయు వేదమిది యనిరి

వేదమగు నధర్వణ కుపవేద మనిరి

పాత కాలము నుండియు భారతాన

వాడుచుండె నాయుర్వేద వైద్యమిలను.


2. తే.గీ.

ఆధునిక వైద్య మడుగిడినంత, కొంత

వెనుక బడిన గాని తిరిగి పేరు వచ్చె

ప్రస్తుతమున, శస్త్ర చికిత్సలను జరిపెడు

వాటి యందు నాయుర్వేద వైద్యమొకటి.


3. తే.గీ.

బ్రహ్మ మొదట నీ వైద్యమున్ స్వయముగాను

తెలుసుకొని తాను ఇంద్రాది దేవతలకు

నేర్ప, కొంతమంది ఋషులు నింద్రునడుగ

నాత డుపదేశ మొనరించ అష్ట భాగ

ములను, మునులంత భూలోకమునకు 

                                                 వచ్చి.....

4. తే.గీ.

...శిష్యులకు నేర్పె జనులకు సేవ చేయ

మనుచు, నుత్తమ శిష్యుడున్ అగ్నివేశు

డు మొదటగ "అగ్నివేశ తంత్ర" మను గ్రంథ

మును రచించ ఆయుర్వేదమున్ లభించె.


5. తే.గీ.

చరకుడు తిరిగి దానిని "చరక సంహి

త" గ రచించె, పిదప సుశ్రుతాది శిష్యు

లంత "సుశ్రుత సంహిత" వ్రాసినారు

ఇదియె ప్రాచుర్యమున్ బొందె నింతవరకు.


6. తే.గీ.

"పంచకర్మ" విధానము ప్రస్తుతము ప్ర

సిద్ధి బొందె నాయుర్వేద పద్ధతులలొ

కండరమ్ములు, నరముల కైన వచ్చు

వ్యాధులకు నీ విధానము వరమె యగును.


7. తే.గీ.

వైద్యమునకు పనికిరాని వస్తువనుచు

నేది లేదను చుందురీ నేలమీద

ఔషధాలుగ నుపయోగ మౌను మొక్క

లన్ని యేవైద్య ప్రక్రియ యైనగాని.


8. కం.

మొక్కల కాండము, బెరడును

మొక్కల యాకులు,చిగుళ్ళు మొక్కల వ్రేళ్ళున్

మొక్కల పూవులు, కాయలు

చక్కగ నుపయోగ పడును సరి మందులలోన్.

**************************************

22

అంశం....ఆయుర్వేదం 

శీర్షిక.....రక్ష సురక్ష 


అనాదిగా వస్తున్నా

ఆదరణ లేని వైద్యం..


 ఆయుష్షును కాపాడి

వృద్ధి చేసే వేదం ఆయుర్వేదం...


దీర్ఘకాలిక మొండి వ్యాధులకు

దీటైన జవాబు చెప్పే వైద్యం....


సంపూర్ణ జీవనానికి సకాలంలో

సురక్షితంగా కోలుకునే ప్రక్రియ ఆయుర్వేదం...


ప్రకృతి ప్రసాదించిన వన మూలికలతో

ప్రతి అణువణువుకు పరమావుషధం ఆయుర్వేదం...


వాతమైనా ,కఫమైనా 

దోషమైనా , ధాతువైనా

వాయువేగ నివారిణి ఆయుర్వేదం...


మారిన కాలానికి  ఆధునికత  తోడై 

కొత్త నీరు వచ్చి పాత నీరును మరుగున పడేసింది....


నవ్యతకు అలవడిన జనానికి 

ఆయుర్వేదం అనే మాట మరుగున పడింది...


కంటికి కనపడని క్రిమి కాటుకు 

తానేంటో తిరిగి నిరూపించుకుంది ఆయుర్వేదం...


వైద్యం ఏదైనా ప్రజల ప్రాణాలకు రక్ష సురక్ష కావాలి...!!


హామీ....నమస్తే 🙏ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను 🙏

మొహమ్మద్. అఫ్సర వలీషా

 ద్వారపూడి (తూ గో జి )

23

: కవితాగానం( సీజన్‌2 )

అంశం:- " ఆయుర్వేదం "29/5/2021 శనివారము

ఆయుర్వేదానికి పుట్టినిల్లు భరత దేశము

ఇతరదేశాలు కళ్ళు తెరవకముందే

ఆయుర్వేదం మనదేశంలోపుట్టింది

  ఆయుర్వేదానికి ఆయువుపట్టు

మనవైజ్ఞాన శాస్త్రజ్ఞులు

మహనీయులు శుశృతుడు, చరకుడు

శుశృతుడు ఆయుర్వేదానికి గుండెకాయ

చరకుడు వెన్నెముక

ధన్వంతరి ఆయుర్వేద విజ్ఞానాన్ని

సర్పరాజైన ఆదిశేషునికి వుపదేశించాడట

మహావిష్ణువు అవతారమైన ధన్వంతరిని ఆయుర్వేద పితామహుడంటారు

శుశృతుడు ఆయుర్వేద అధ్యాపకుడు

ఆయుర్వేదగ్రందమందించినాడు

శుశృతసంహిత అనే ఈగ్రంధం ఆయుర్వేద వైద్యులకు లభించిన మొదటి ప్రామాణిక గ్రంధము

మనిషి సాధారణముగా గురికాబడే వ్యాధులు మానవ శరీర నిర్మాణము అవయవాలతీరుఏవ్యాధికి ఏ మందు వాడాలి మందులతయారి మొక్కలలోని ఔషదగుణాలు జంతు అవయవ విశేషాలు గుణాలు మొదలగునవి శుశృత సంహిత గ్రంధాన వివరించబడినాయి

ప్లాష్టిక్‌ సర్జరీని పరిచయం చేసింది శుశృతుడే

ఎన్నో శస్త్ర చికిత్సలను జరిపే ప్రపంచ వైద్యులకు మార్గదర్శిగానిలచిన క్రాంతిదర్శి శుశృతమహర్షి

        ఆయుర్వేదానికి నమస్సులు!

     తరణికంటి సూర్యలక్ష్మి.

24

కవితా గానం 

ప్లవ నామ సంవత్సరం

వైశాఖ మాస పౌర్ణమి నగదు బహుమతుల పోటీకై

అంశం : ఆయుర్వేదం

శీర్షిక : మేలైన జీవన విధానం

29-5-2021

************************


మనఃశరీరాల అవిభాజ్యం..పరస్పర ఆధారిత మని ఎంచి..ధన్వంతరి శుశ్రుత సంహితలు అవనికిచ్చిన వరం ఆయుర్వేదం


వేదకాలం నాటి వైద్యం మన్యం..గూడెం ప్రజల ప్రాణాలను గట్టెక్కించేలా

అడవులు ఆశీర్వదించి ఇచ్చిన ఆయుర్వేదం


అసువులను కాపుకాసేలా ఆయుర్వేద వస్తుగుణ దీపికలో ఎన్నెన్నో ఔషధ అస్త్రాలు


మారేడు దళమో బృహతీ పత్రమో..

నేల రాలిపోతున్న జీవులకోసం పువ్వులు పూసే వృక్షాలు


అంతర్లీనంగా బాహ్యంగా సమతుల్యతను కాపాడి

మనిషిని అడుగడుగునా ఆదుకున్న ఆయుర్వేదం


విచక్షణా రహిత..అనుచిత..అవాంచిత ఆహార అలవాట్లను కట్టడి చేసి మనిషి జీవన సరళిని తీర్చిదిద్దిన ఆయుర్వేదం


పొంతనలేని చేష్టలతో విఘాతానికి గురైన

శరీరాకృతిని మెదడును యథాస్థితికి తీసుకువచ్చే ఆహార నిబంధనల సమాహారమే ఆయుర్వేదం


శరీరంలోని ధాతువులను..పంచభూతాలతో అనుసంధానించి జీవన విధానాన్ని.. ప్రవర్తనను

తీర్చిదిద్దిన ఆయుర్వేదం


ఆయుః అంటే జీవితమని వేదం అంటే శాస్త్రమని 

ఆయుర్వేదమంటే అక్షరాలా..జీవితం యొక్క శాస్త్రమంటూ


జీవన వేగం తో పాటూ వత్తిడి పెరిగి..మనసు అతలాకుతల మైనపుడు అక్కున చేర్చుకున్నది ఆయుర్వేదమే


నివారణోపాయాల గూర్చి నినదించడమే..

నేరాలుగా ఎంచడం..ఆనాటినుంచీ..అవనికి కొత్తేం కాదు


దెబ్బతిన్న మనసులకు సలుపు తున్న గాయాలను పరామర్శించేందుకు ఏ చేయి అయితేనేం..ఏ చెట్టు కొమ్మయితేనేం..మనిషిని మన్నించడమే కావాలి !


దారల విజయ కుమారి


సర్/ మేడం

ఈ కవిత నా స్వంత రచన.అనువాదం కాదు.ఎక్కడా ప్రచురితం కాదు.

దారల విజయ కుమారి

                ------------

25

[29/05, 10:10 PM] Lalita Sister: ఆయుర్వేదం

అనాదిగా మన ఇంటి వైద్యం

పరిసరాలలో దొరికే ప్రతి మొక్క పనికి వచ్చేది

చరకుడు సుశ్రుతుడు జీవకుడు ఆయుర్వేద శాస్త్రాన్ని ప్రపంచానికి పంచిపెట్టారు

మనం తినే కూరలో దినుసులన్నీ ఆయుర్వేదమే కదా మిత్రమా మా ఆయుర్వేదం ఈ జీవన రహస్యం మన ఆయుష్షు ను పోసేది అది ఆనందయ్య తయారుచేసిన నేటి వైద్యానికి సంకేతం


ఆకుపసరు లే కదా ఆదివాసీల వైద్యం అందుకే ఆయుర్వేదం చిరకాలం వర్ధిల్లాలి భారతీయ జీవన వైద్యం


ఆయుర్వేదం వర్ధిల్లాలి ప్రజల ప్రాణాలను కాపాడాలి

అధర్వణ వేదంలో చెప్పబడింది

ఆయుర్వేద శాస్త్ర రహస్యాలు ఎన్నో


ఆయుర్వేదం కరోనా ఏదైనా వ్యాధులు అస్వస్థత నుంచి స్వచ్ఛత చేకూర్చే భారతీయ వైద్యం ఇది ఆయుర్వేదం


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537426

26.

 కవిత *

ఆయుష్షుని వృద్ధి చేసే

వేదం మన ఆయుర్వేదం

ప్రాచీనమైనదే అయిన

ప్రాణాలను కాపాడే వేదం

అధర్వణ వేదానికి ఉప వేదం

ధన్వంతరి వైద్యుడైన వేదం

అగ్నివేశ తంత్రమనే గ్రంథము

ద్వారా విశ్వవ్యాప్తినొందినది

పంచకర్మ లో ప్రసిద్ధి పొందిన వేదం

చరకుని చేత వ్రాయబడి

చరక సంహిత నామకరణంబైన వేదం

వృక్ష జాతులచే వైద్యమందించే వేదం

ఆభరణ అలంకరణ యందు

కూడా ఆరోగ్య రహస్యాన్నందించిన వేదం

27


28

 కవిత 

శీర్షిక:ఆయుర్వేదం అద్భుతం


భారతీయ సంప్రదాయ వైద్యం

ధన్వంతరి ఆయుర్వేదానికి మూలం

వనమూలికల అద్భుత ప్రసాదం

మానవ జీవితానికి ఆరోగ్యం ఆయుర్వేదం


ఎన్నో రోగాలకు అద్భుత చికిత్స

మానసిక,శారీరక శుశ్రూతకు ప్రతీక

శుశ్రుతుడు,చరకుడు విస్తరించిన వైద్యం

దీర్ఘకాల వ్యాధి నివారణకు అద్భుతం ఆయుర్వేదం


వేధకాలం నుండి ఆచరిస్తున్న వైద్యవిధానం

పృకృతి మూలికలే దీనికి ఔషధం

ఆకులు,తీగలు,దుంపలు,కాండాలే

ఆయుర్వేదానికి మందులు


మానవ శరీరానికి హాని చేయవు

ఎన్నో రోగాలకు ఉపశమనం

ఎందరో ఋషులు,యోగులు

ఆయుర్వేద విధానాన్ని గ్రంధాలుగా

రాసి మన తరాలకు అందించారు

భారతదేశమే ప్రపంచానికి ఔషధ మార్గదర్శి


హామీపత్రం:ఈ కవిత నా స్వీయ రచన అనువాదం అనుసరణ కాదని హామీ ఇస్తున్నాను

వనపర్తి గంగా ధర్

29.

కవిత గానం పౌర్ణమి పోటీలు 

➖➖➖➖➖➖➖➖

*అంశం :* ఆయుర్వేదం 

*🌿ఆయుర్వేదం🌿*

 రోగం ముదిరితేగాని 

 పైత్యం అర్థం కాదు ఎవరికి

అందమైన ఈ ప్రపంచంలో 

ప్రకృతిలోనే దివ్య ఔషదాలు 

ప్రకృతిలో లేనిది అంటూ లేదు 

కొత్త అనుభూతినీ కలిగిస్తూ 

అడవి అవని పుత్రికా 

వన మౌలిక ఔషదాలు 

భద్రమైన జీవితంకు 

శారీరకంగా ఆరోగ్యం అవసరం 

ఆరోగ్యంమే మహా భాగ్యం 

ఆయుర్వేదం అద్భుత మూలికా 

రోగ నిరోధక శక్తి పెంచుతూ 

నేడు కరోనా మహమ్మారినీ 

ఆయుర్వేదంమే దానికి శరణం 

పాశ్చాత్య వాసనలతో

నిద్రాముద్రితమైన సమస్తమానవాళిని

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలతో జాగృతంచేసి

భవిష్యత్తుపై బంగారు 

ఆయుర్వేదంతో జీవితంను 

సిద్దా పురుషులు, మహానుభావులు అద్భుతమైన అడవి 

మూలికలతో రోగంను వదిలి 

ఆయుర్వేదం 

వేదం నుండి జాలువారిన 

అద్భుత భావం ఆయుర్వేదం 

భారతీయ సనాతన మందు 

రోగంను మాయం చేసే సంజీవ మణి 

ఆయుర్వేదం వాడుదాం 

ఆరోగ్యంగా ఉందాం !!..



*హామీపత్రం :*  ఈ కవిత నా స్వీయరచనా... ✍️🙏🌹


        ధన్యవాదములు... 


*ఇంద్రావత్ రాహుల్*

      *కొత్తపేట్* 

    నిజామాబాద్ 

  9848054079

30

అన్నాప్రగడ వేంకట నరసింహారావు

ప్రాంతం..నరసరావుపేట,

గుంటూరు జిల్లా.

చరవాణి..9390099056


అంశం..ఆయుర్వేదం.

శీర్షిక..వేదాల సంప్రాప్తి.


ధన్వంతరి నివాసం, ఆరోగ్యానికి వ్యాసం నా ఆయుర్వేదం..

పంచప్రాణాల శ్వాస, అమరత్వంపై ఆశ నా ఆయుర్వేదం..


ఋషిపుంగవుల ఉపదేశం, దేవభూమిసారం నా ఆయుర్వేదం..

సంహితములతో సంబంధము,సంహితుల ఒక సంఘం నా ఆయుర్వేదం..


జీవితానికి ఒక సూచిగా,నిష్కామకర్మగా నా ఆయుర్వేదం..

చికిత్సకు ఒక మర్మముగా, వైద్యునకు ఒక ధర్మంగా నా ఆయుర్వేదం..


సిద్ధాంతాల అఛేదంగా,నియమాలకు నియమంగా నా ఆయుర్వేదం..

కృత్రిమవైద్యానికి ఒక సవాలుగా,విశ్వాసానికి ఒక ప్రతీకగా నా ఆయుర్వేదం..


వేదాలసారం,వేదాలనుండి సంప్రాప్తి నా ఆయుర్వేదం..

ప్రాచీనం ఒక పుత్తడిగా, వేదాలలో సదా ఆచరణ సాధ్యంగా నా ఆయుర్వేదం..


వేదాలను మించిన వేదంగా నా ఆయుర్వేదం..

నా భరతమాత ఆరవప్రాణంగా నా ఆయుర్వేదం..


✍️అన్నాప్రగడ

31

చేబియ్యం శ్రీనివాసరావు 

గుజరాతిపేట , శ్రీకాకుళం 

ఆయుర్వేదం కవిత 

అవాకాశం ఉన్నా పరిగణ న లోనికి తీసుకోగలరని మనవి


సంజీవిని తెచ్చి సౌమిత్రుని రక్షించింది 

పసరు ముందుగా ప్రఖ్యాతి గాంచింది 

అమ్మ చేత వంటలలో కలిసింది 

బామ్మ పిండి వంటలలో నిలిచింది 

ఉగాది పచ్చడిగా వచ్చింది 

భవంతుని దర్శన తీర్థంగా అందుతుంది 

పట్టు తేని గ ప్రకృతిలో ఉంది 

బంక మట్టిగా చెరువులో ఉంది 

సెలయేటి స్నానాన ఉంది 

మునిగేటి మునుగులో ఉంది 

పచ్చని ఆకులో 

తీగలో 

కాండంలో 

బెరడులో 

పువ్వులో 

మొగ్గలో 

అన్నిటిలో అంతర్లరీనంగా 

భారతీయ సనాతన ధర్మంగా 

చెరకుడు , బోధిసత్వుడి గాధలలో 

వాకిట తులసమ్మలో 

అన్నింటా తానై నిలచిన ఆయుర్వేదం 

మన ప్రాణ సంజీవిని దాని నాదం

32.

[31/05, 9:07 AM] Lalita Sister: కవితా గానం

పౌర్ణమి నగదు బహుమతులు పోటీకి


అంశం: ఆయుర్వేదం


శీర్షిక: మన ఇంటి వైద్యం


రచన:పిల్లి.హజరత్తయ్య

శింగరాయకొండ

ప్రకాశం జిల్లా

9848606573

********************

ప్రాచీన వైద్య విధానం

అధర్వణ వేదానికి ఉపవేదం

ఆయుష్షును వృద్ధిచేసే వేదం 

వ్యక్తిగత ఉపశమన విధానం

అందరికీ అనువైన సంవిధానం


సకల రోగ నివారిణి

సమస్త వ్యాధులు సంహారిణి

రోగుల పాలిట సంజీవని

దీర్ఘకాలిక వ్యాధుల నిరోధిని

ప్రజల ఆరోగ్య ప్రదాయిని


ఆధునిక వైద్యానికి ఆధారం

ప్రతి మొక్క ఓ ఔషధం

ప్రతి చికిత్స ఓ ప్రత్యేకం

పంచకర్మ ఓ వైశిష్ట్యం 

శాశ్వత పరిష్కారం ఈ వైద్యం


దోషం,ధాతువు,మలం,అగ్ని

ఆయుర్వేదానికి ప్రధాన అంశాలు

వ్యాధి నిర్ధారిత చికిత్సలు

వ్యాధి నివారణ మందులు

ఆయుర్వేద ప్రత్యేకతలు


భారతీయ జీవన వైద్యం

మన ఇంటి వైద్యం

ప్రకృతి మూలిక వైద్యం

స్వస్థత చేకూర్చే వైద్యం

స్వాంతన ఇచ్చే వైద్యం


హామీపత్రం:

పై వచనకవిత నా స్వంత రచన.దేనికీ అనువాదం,అనుకరణ గానీ కాదు

33

కవితా గానం ప్లవ నామ సంవత్సరం వైశాఖ మాస పౌర్ణమి నగదు పురస్కారాలు🌷

 పౌర్ణమి నగదు బహుమతులు🌷

 అంశం: ఆయుర్వేదం ,

శీర్షిక :అంతర రహస్యం,

 పేరు :మన్నె లలిత ,

 హైదరాబాద్ ,

చరవాణి సంఖ్య :741 686 32 89.

*****************************************

 ఆయుర్వేదం -------అంతర రహస్యం.

*****************************************


 సనాతన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదం 

ఆయుర్వేదం తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం

  అధర్వణ వేదానికి ఉప వేదం ఆయుర్వేదం 

 ఆయుర్వేదానికి మూలపురుషుడు ధన్వంతరి 

తదుపరి చరకుడు ,సుశ్రుతుడు ఆయుర్వేద రహస్యాలు, వనమూలికలతో చేసిన కాయకల్ప  ,శల్య చికిత్స  

ఆయుర్వేదాన్ని తొలి అక్షరబద్ధం చేసినది అగ్నివేశుడు

 తొలి శస్త్ర చికిత్సకుడు శుశ్రుతుడు

మృతసంజీవనీ ,పాదలేపనం ఆయుర్వేదమే!

నేత్ర రోగాలకు కాటుక, పసికర్లకు రెండు చుక్కల పసరు పాముకాటుకు, తేలుకాటుకు ప్రకృతి వైద్యం పరమౌషధం 

చలికాలంలో వచ్చే  క్రిమి కీటకాలకు 

 ఆవు పేడతో కళ్లాపి చల్లి ,ముగ్గులు పెట్టడం  

వాకిళ్ళకు మామిడాకు తోరణాలు, గడపలకు  అలంకరణలు

 పసుపు  పాదాలకు రాసుకోవటం క్రిమిసంహారకమే 

 

ఆడవారి పోపుల పెట్టే ఆయుర్వేదం

అల్లంవెల్లుల్లి ,జీలకర్ర ,ధనియాలు ,మెంతులు,  

 మొదలైన మసాలాలు ,ఆయుర్వేద చిట్కాలు 

 దంతధావనానికి వేప, ఉత్తరేణి ,ఒంటికి గంధం, 

విభూతి రాసుకోవటం,ఇస్తోంది వేడి నిరోధకశక్తి

కర్పూరం ,గుగ్గిలం ,తులసి, వేప, రావిిపూజలు 

అతి తక్కువ ఖర్చుతో ,అమూల్యమైన ఆరోగ్యం 

 ఆయుర్వేదం అంతర రహస్యం తెలుసుకుందాం 

ఆయుష్షును పెంచుకుందాం.

34

**కవితా గానం (సీజన్ 2 )**

      అంశం :ఆయుర్వేదం  

      శీర్శిక  : నేడు ఆయుర్వేదం అనివార్యం .

       పేరు  : జక్కిడి వెంకటరెడ్డి .

                     భువనగిరి .

          ......    .....    ........

   ఆయుష్షును  నిలబెట్టి  అందరిని కాపాడేందుకు 

   ప్రకృతి ప్రసాదం సకల జీవకోటికి అందేందుకు 

   ఆయువుని గూర్చి విజ్ఞానమందించేందుకు 

   పరబ్రహ్మ ఆశీర్వదించి అందించిన బ్రహ్మాస్త్రం 

   ఎందరో మహానీయుల సాధనాఫలంగా 

   ధర్మార్ధ కామ మోక్షాలకు అడ్డంకిగానున్న 

   సర్వరోగాలకు  చక్కని పరిష్కారం చూపే 

   పురాతన భారతీయ వైధ్యమే ఆయుర్వేదం ..

  ఎనిమిది అంగాలతో నాలుగు కాలాలపాటు 

   జనుల ఆయువు పెంచే ఉద్దేశ్యంతో  ..

   పుట్టిన నేలనుండి తినే తిండి దాకా అన్నీ 

   శారీరక అవసరాలను విశ్లేషించే ఆయుర్వేదం 

   నాడి పట్టి రుగ్మత రూపును చెప్పే శాస్త్రం 

 నేడు పంచకర్మ రూపంలో శరీరాన్ని రీఛార్జ్ చేస్తుంది

 సుశ్రుతుడు గుండెకాయగా చారకుడే వెన్నెముకగా 

  వాగ్భాఠుని నుంచి రాజీవ్ దీక్షిత్ వరకు 

  ఆయుర్వేదాన్ని జనులకు అందించినవారే 

 మనిషి సత్ప్రవర్తన శారీరక మానసిక దృఢత్వంతో 

 దేహంలోని రోగాలను ఆదిలోనే అంతంచేయొచ్చని

  ప్రకృతీ మాత్రమే దానికి పరిష్కారమని చెప్పి 

  మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యాన్నిస్తాయని 

  ఆహార విహారాదులలో శుభ్రత పాటించాలని 

  అప్పుడే మనిషి శరీరక ఆరోగ్యం సాధ్యమని 

    ఇచ్చే సందేశమే ఆయుర్వేదం ...

  నేడు జనసామ్యాన్ని మహమ్మారులు కమ్ముకున్న 

  వేళ ...

    ఆయుర్వేదం అవసరమే కాదు అనివార్యం ....

  -- ఇది నేను స్వంతగా రాసిన రచన .

35.

[31/05, 8:21 PM] Veera Gudipally: మద్ది పుల్లారావు


కవిత *

ఆయుర్వేదం అమృతం

.......,.................

హితాహితం సుఖం దుఃఃఖం

ఆయుఃతస్య హితాహితం

మానంచతచ్చయత్రోక్తం

ఆయుర్వేదం ఉచ్యతే

ఆయువిందతి వేత్తివా ఆయుర్వేదః

ఏనాడో మన పూర్వీకులు

ఆయుర్వేదం అమృతమనెగదా


శాఖోపశాఖలుగా యున్న ఆయుర్వేదం

శస్త్రచికిత్స లలో తిరుగులేని దై

మొండివ్యాదులనెన్నింటినో పారద్రోలినదై

వైద్య విదానాలకే మకుటాయమానంగా నిలిచె


అశ్వనీ దేవతలచే వృద్ది చేయబడినది

చరక,ధన్వంతరిలచే పురోగమించినది

ప్రకృతిసిద్ద పదార్థాలచే తయారుకాబడి

గుణమును చూపే మహత్తర గుళికలు

ఆయుర్వేదానికి ఆయువుపట్లు


కండరాల, నరాల చికిత్స కు

పంచకర్మవిదానాలు

అగ్నివేశ గ్రంథము,చరకసంహితల వంటి

అద్బుతమైన గ్రంధాలు

సర్వరోగాలకు నివారణ చూపే మంత్రాలు


సంగీత, క్షవరాలు సైతం

ఆయుర్వేద విదానాలే గదా


ఆకులు ,మూలికలు

ఫలాలు,ఓషదులు

ఆయుర్వేద మందుల మూలాలై

సైడ్ ఎఫెక్ట్స్ లేని సంపూర్ణారోగ్య కారకాలగుట

ఆయుర్వేదం దేవతావైద్యమై బాసిల్లె గదా


నేడు సైతం ఆనందయ్య పారద్రోలె కరోనాను 

విస్మయపరచె సకల విశ్వాన్ని

ఉదర,వాయు,పిత్త, కప సంబంద వ్యాదులేవైనా

చేయగలదు సర్వరోగనివారణం

 

వేలవత్సరాల ఆయుర్వేదం

ఎన్ళాళ్ళైనా అది సజీవం


రావాలి ఆయుర్వేదానికి మంచిరోజులు

రోగరహితులై విలసిల్లాలి విశ్వజనులు

.36

కవితా గానం సీజన్2

ప్లవనామ సంవత్సర వైశాఖమాసం పౌర్ణమి కవితల పోటీ కోసం

అంశం: ఆయుర్వేదం

కవి పేరు: నాశబోయిన నరసింహ(నాన)

ఊరు:చిట్యాల, నల్గొండ జిల్లా

చరవాణి:9542236764


⚜️⚜️⚜️⚜️⚜️⚜️♦️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

ఆరోగ్య ప్రదాయిని

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

విభిన్న వైద్యప్రక్రియల పరంపరలో విశిష్టస్థానం 

అస్వస్థత నుంచి స్వస్థత వైపు శాశ్వత ప్రస్థానం

అష్ట విభాగాల సంయోగమే ఆయుర్వేదం 

మొండి జబ్బుల తరిమే బలమైన శక్తి పుంజం


సంగీతము క్షవరము ఆయుర్వేదంలో భాగం

వనమూలికలని మందులుగా వాడే ఆచారం 

చతుర్వేదాలలో నిక్షిప్తమైన ప్రకృతి వైద్యం

ఆయుర్వేద ఆదివైద్యుడు అపర ధన్వంతరి 

అఖండ భారత మూలికా వైద్య వజ్రాయుధం 


ఆయుష్షు పెంచే ప్రాచీన వైద్య విధానం  

భారతీయ సంస్కృతీ వైభవం చాటే వైద్యం 

తరతరాల తరగని స్వదేశీయ మూలికా సంపద 

ఆయుర్వేదం భారతీయుల వరప్రసాదం 


నిలువ ఉంచే సాధనమని ఉప్పును 

సర్వరోగ నివారిణి వేపను పరిచయం చేసింది 

ప్రకృతి సిద్ధంగా గాయం కుళ్లకుండా ఆపే సాధనంగా 

పసుపును మనిషికి ప్రసాదించింది ఆయుర్వేదం 

ధన్వంతరి చరక సుశ్రుత వాగ్బటులు వైద్యరత్నాలు 


వాత పిత్త కఫ శ్లేష్మ దోషాలే రోగ మూలాలనీ 

మంచి ఆలోచనలే మంచి ఆరోగ్యానిస్తాయని 

ఆహార విహారాదులలో పరిశుభ్రత పాటించాలన్నది 

 

అనర్థాలులేని ఔషధ ఆవశ్యకత గుర్తించాలి

ఆయుర్వేదంపై పలు పరిశోధనలు జరిగిన నాడే 

సర్వమానవాళికి ఆయుర్వేదం ఆరోగ్యప్రదాయిని


🌀🌀🌀🌀🌀🌀♦️🌀🌀🌀🌀🌀🌀


హామీ పత్రం: ఈ కవిత నా స్వీయ రచన. దేనికీ అనువాదం,అనుసరణ కాదనీ హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు.

🙏 *నాన*

      జక్కిడి వెంకటరెడ్డి .


Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...