నిర్వహణ
శివునూరిలితాకృష్ణణ ( వెన్నెల శిల్పం సృష్టి కర్త)
వీరా గుడిపల్లి (the mathematics teacher and poet)
******
1.బాలు కత్తుల గారు
2.పిట్ల కావ్య గారు
3.జంపని శ్రీనివాస మూర్తి గారు
4.జక్కిడి వెంకట రెడ్డి గారు
5.సింహాద్రి వాణి గారు
6.చేబియ్యం శ్రీనివాసరావు గారు
7.శ్రీభారతి ఉల్లెంగ ముత్యం గారు
8.నాశబోయిన నరసింహ గారు
9.అన్నాప్రగడ వేంకట నరసింహారావు గారు
10.గంగాపురం శ్రీ నివాస్ గారు
11.మొహమ్మద్ .అఫ్సర వలీషా గారు
12.మన్నె పిన్నక లలిత గారు
13.హారిక గారు
14.మేకల రామస్వామి గారు
15.నారుమంచి వాణి ప్రభాకరి గారు
16.ఉప్పరి తిరుమలేష్ గారు
17.కొంపెల్లి రామయ్య గారు
18.ఆళ్ళ నాగేశ్వరావు గారు
19.ధనాశి ఉషారాణి గారు
20.తాతపూడి సోమ శేఖర శర్మ
21.మద్ది పుల్లారావు గారు
22.హారిక గారు
23.జోషి పద్మావతి గారు
24.ముద్దు వెంకట లక్ష్మి గారు
25.దారాల విజయ కుమారి గారు
26.అయ్యలసోమయాజుల ప్రసాద్
27,డా.నాయకంటి నరసింహ శర్మ గారు
28. గుండ్ల సౌజన్య గారు
***"*******
కవితాగానం సీజన్ 2
*చైత్ర మాసం పౌర్ణమి* *కవితలపోటీలో విజేతలు*
*వీరే*
ప్రథమ స్థానం లో
*అఫ్సర వలీషా*
ద్వితీయ స్థానంలో
*ఆళ్ళ నాగేశ్వర్ రావు గారు*
ద్వితీయ స్థానంలో
*ధనాశి ఉషారాణి గారు*
ద్వితీయస్థానంలో
*జక్కిడి వెంకట్ రెడ్డి గారు*
ద్వితీయ స్థానంలో
*ముద్దు వెంకటలక్ష్మి గారు*
ద్వితీయ స్థానం లో
*కొంపెల్లి రామయ్య గారు*
ద్వితీయ స్థానం లో
*జంపని శ్రీనివాసమూర్తి గారు*
ద్వితీయ స్థానంలో
*అన్నా ప్రగడవేంకట నరసింహారావు గారు*
ద్వితీయ స్థానం లో
*దారలవిజయకుమారి గారు*
ద్వితీయ స్థానంలో
*మేకల రామ స్వామి గారు*
1.
అంశం: బౌద్ధం ధర్మం
బౌద్ధం.. మనిషిలో ఉన్న బుద్ధిని మారుస్తుంది మనిషిని కాదు
మనసులో ఆలోచనలను ప్రభావితం చేస్తుంది మనిషిని కాదు
మనసు మీద లగ్నం చేయిస్తుంది మనిషిని కాదు
మనసులో చెడు అలవాట్లు ను కల్చి వేస్తుంది మనిషిని కాదు
మనసులో దుష్టత్వతం చేరుపుతుంది
దుష్టుని కాదు
ఆలోచనలు, పనులు, నాగరికత మనం చేసే ప్రతి పని మనసు నిర్దేశంతోనే చేస్తాము
దైవం, మనుషుల చుట్టూ తిప్పటం కాదు
మనసు చుట్టూ తిప్పటమే బౌద్ధం
మనిషిలో మనసుకే ప్రాధాన్యం, అగ్రగామి
భయాని జయించడం
చిత్త బలాని చేకూర్చడం
సడలి సంకల్పం వల్ల ఎంతటి అవంతరానైనా
దాట వచ్చునని చెప్పును
మనల్ని మనం నిరంతరం
పర్యవెక్షించడమే బౌద్ధం
కర్మేంద్రియాలతో కాదు జ్ఞానేంద్రియాలు ముఖ్యం అని చెప్పుతుంది
అందుకే బౌద్ధం ఎల్లలు దాటి హద్దులు లేకుండా ప్రఖ్యాతి గాంచింది..
బాలు కత్తుల
లింగ వారి గూడెం
సంస్థాన్ నారాయణపురం
యాదాద్రి జిల్లా
9676219655
2.
కవితా గానం చైత్రమాసం పౌర్ణమి పోటీల కొరకు💐💐
పేరు: పిట్ల కావ్య
*అంశం*: బౌద్ధ ధర్మం
*శీర్షిక*: ధర్మ మార్గం
సీసపద్యము,
బౌద్ధమతమ్మును భరత దేశమునందు
స్థాపించె బుద్ధుడు శాంతి కొరకు
మూలకారకుడిగ ముందుండి నడిపించె
బౌద్ధధర్మంబును ప్రజ్వలముగ
నారంభ దశనుండి నాంధ్రప్రదేశాన
నాదరణను పొందె నధికముగను
ఆచరణీయమౌ నష్టాంగ మార్గము
నాదరించమనుచు నతడుతెల్పె
ఆట వెలది,
గ్రామ గ్రామమునను ఘనముగా బోధించ
శిష్యులంత తిరిగి చేవ తోడ
ధర్మ సూత్రములను దక్షతతో నేర్ప
ప్రాకటముగ నిల్చెబౌద్ధ మతము!!
సీసపద్యము,
అద్వి తీయముగ మహాయాణమొకటియు
తేరవాదమొకటి స్థిరము నిల్చె
శాఖోప శాఖలై సంధానమును గూర్చి
ఖండాంతరములందుఖ్యాతి గాంచె
కల్యాణి చాళుక్య కాశ్మీర యిక్ష్వాకు
చేర చోళులంత చేర దీయ
త్రీపీఠికమ్మనే దివ్య కావ్యమొకటి
నాదారమైనిల్చె నతిశయముగ
ఆట వెలది,
నిగ్రహముతొ ఎంతొ నీతి బోధనజేసి
ప్రజకు స్ఫూర్తి నింపె నిజముగాను
మంచి మనసు తోడ మహినందు బుద్ధుడు
కీర్తి పొందె గొప్ప మూర్తి భవుడు!!
పేరు: పిట్లకావ్య
చరవాణి:8978656976
3.
*కవితా గానం ( సీజన్ 2)*
పౌర్ణమి కవితల పోటీ.
*జంపని శ్రీనివాసమూర్తి* ( *జలజ* )🦜
గుంటూరు
1 - 5 - 2021
80742 97465
*అంశము*: బౌద్ధ ధర్మం
శీర్షిక: *శాంతి కలహంస*
శ్రీరామాయణ పవిత్ర చ్ఛాయలతో భాసిల్లే
*బౌద్ధం*, హిందూ ధర్మంలో అంతర్భాగ *తేజస్విగా*, త్రి *మూర్తి* దేవతా పూజలతో, అహింసా సిద్ధాంతమును ఔపోషన చేసిన సత్యమార్గగామి బౌద్ధధర్మము.
పాలుగారెడి పసి తనమ్మున అహమే అణగిపోగా, *త్రి పీఠిక* రత్నా భరణాలు ధరించి, మనస్సుకు దారి చూపే చుక్కానిగా, సంఘంలో కలసి నడిచే ధర్మభోధలతో
సామాజిక సహజీవనంలో సుఖ-దుఃఖాలను
ఓకే తీరుగా స్పందిస్తూ, సేవా దృష్టిలో అందరూ సమానమే అని, క్షమతా కేతనమై, సమతా శంఖం పూరిస్తూ, కలుషిత భావాలు కడుగుచు నిదుర మత్తుల మదిలను మేల్కొల్పుతూ ఆర్తజనుల సేవలో ఆత్మార్పణే సుగుణమనుచు *బౌద్ధ మతమును స్థాపించె సిద్ధార్థుడు శాంతి కలహంస యై*.
ఈనాటికి *శ్రీరామ రక్ష* యై, శమ దమ యమ నియమాదులచే కీర్తింపబడుచున్నది *హైందవ ధర్మంలో బౌద్ధమతము*.🦜
4
* కవితాగానం *
అంశం ::బౌద్ధం /బౌద్ధధర్మం .
పేరు :: జక్కిడి వెంకటరెడ్డి ,
ఉపాధ్యాయుడు (ఫిసికల్ సైన్స్),
భువనగిరి .
..... ...... ...... ........
శీర్షిక :: స్వేచ్ఛా - సౌభాతృత్వం ...
సమాజంలోని అంతరాలు మానవజాతి అంతానికి కారణమవుతాయని
అసమానతల పదునైన అంచులపై
నియంతృత్వ పోకడలతో ముక్కలైన మానవతా
కుల మత వర్గ వైషమ్యాలతో
ఒకరిని ఇంకొకడు దోచుకోవడం
బానిసత్వంలోకి నెట్టి స్వేచ్చని హరించడం
జాతిని బూచిగాచూపి హీనంగా చూడటం
అలవాటైన సమాజానికి
స్వేచ్ఛ బుద్దులు నేర్పడమే లక్ష్యంగా
ఎగిసిపడిన శాంతిబావుటే " బౌద్ధం ".....
భౌతిక బానిసత్వానికి బాటలువేసిన రాజరికం
ఇంకొందరిని ఆధ్యాత్మిక బానిసత్వంలొకి నెట్టి
అరాచకం రాజ్యమేలుతుంటే జనాల బుద్ధికి దారిచూపే చుక్కానిగా
అభ్యాసం జ్ఞాన తృష్ణతో కలిసినడవాలని
కాలం కడలిలో కవ్వమేసి స్వేచ్ఛని వెలికితీసి
బుద్దికి పట్టం కట్టిననాడు నవ సమాజనిర్మాణం సాధ్యమని
వ్యక్తి పూజకన్నా వ్యక్తిత్వ పూజకు పూనుకున్ననాడు
నియమాలే ఆధారమైతే సమసమాజం నిర్మించవచ్చని
స్వార్థం ద్వేషం విడిచి హింస దోపిడీ మరచి
జాతి యావత్తు సౌభాతృత్వంతో మెలిగిననాడు
ప్రకృతిలోని ప్రతి జీవి బ్రతుకు పండునని
స్వేచ్ఛ పాడెపైపడ్డప్పుడు పుట్టిన బౌద్ధ వాదమే
నాడైనా..... నేడైనా ....
మానవజాతి మనుగడకి మార్గం .
-----ఇది నా స్వంత రచన .
---------------------------------------------------
*హామీ పత్రము*
ఇది నా స్వీయ రచనగా తెలియచేస్తూ.
5.
పౌర్ణమి నగదు బహుమతుల పోటీకై
అంశం:--బౌద్ధధర్మం
శీర్షిక:--బౌద్ధధర్మం
రచన:--సింహాద్రి వాణి
ప్రక్రియ:--వచన కవిత్వం
చరవాణి:--7569820872
ప్రపంచమందలి మతములన్నిటిలోన బౌద్ధ మతము కూడా ప్రముఖమ్మె
చూడ
బుద్ధబోధనల నాచరించుటే బౌద్ధమతం
బౌద్ధమతం ధర్మాలనాచరించెడివారు కోట్ల సంఖ్యలో గలరు నేడు కూడా
బుద్ధబోధనలలోన కలువు నాల్గు ఆర్య సత్యాలు దుఃఖలక్షణం,దానికి కారణం,దుఃఖనివారణ,నివారణ మార్గం
బోధియనగా నిద్రలేచుట
రాగ ,ద్వేష,మోహాలు అంతరించుటే ఈప్రక్రియలోముఖ్య లక్షణం
బోధి,నిర్వాణం పదాలు వేరైనా అర్థమొక్కటే
ఈ సాధన ద్వారా బుద్ధుడు మార్గాన్ని మొదటి కన్గొని యితరులకు బోధజేసెను
దేవాది,మహాయాన సంప్రదాయాల నమ్మకం ప్రకారం బుద్ధుడు పొందిన నిర్వాణమే సామాన్యులూ సంఘపరివారం లోని వాళ్ళూ
సాధనద్వారా పొందవచ్చును
బుద్ధుడు బోధించిన సూక్తులు తొమ్మిది వాటిలో కొన్ని
1)ధ్యానాన్ని పనిగా చెయ్యకు,పనిని ధ్యానం గా చెయ్యి
2)వెయ్యి యుద్ధాలలో విజయం సాధించడం కంటే
తమపై తాము విజయం సాధించినవారే నిజమైన విజేతలు
3)ద్వేషాన్ని దూరం చేసేది ప్రేమే కానీ, ద్వేషం కాదు.
బుద్ధుని జీవిత సంఘటనలు,బోధలు,భిక్షువుల నడవడికలు ఆయన మరణానంతరం నాల్గువందల వత్సరాల పిదప" త్రిపీఠిక" అనే నామంతో మూడు పీఠికలుగా విభజించబడి భద్రపరచబడెను
అహింసా పరమో ధర్మః
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
ఓం శాంతి శాంతి శాంతిః
హామీ:--ఇది నా స్వీయ రచన
సింహాద్రి వాణి
ఉపాధ్యాయురాలు
తెలుగు ఎం.ఏ
హిందీ ప్రవీణ్ ప్రచారక్
విజయవాడ.
6.
వీరాస్ సీజన్ -- 2 కోసం
గౌతమ బుద్ధుడు
**************
రాజ్యకాంక్షలేని మహిమాన్విత మానవీయం
బోధి చెట్టు ఆశ్రయం
జీవికి చావుంటుందని తెలియని అమాయకత్వం
తత్వాన్ని ధ్యానం ద్వారా గ్రహించిన మహర్షి
ఈర్ష , కామ , క్రోధాలను విడిచిన కైవల్యం
మాట తూలనాడరాదని మూతికి గుడ్డ కట్టిన నియమం
బుద్ధం శరణం గచ్ఛామి నినాదం
కాషాయం వస్రధారణం
కన్నీరు రాని త్యాగం
అహింస తత్వ ప్రచారం
జీవహింస మహా పాపంగా గుర్తించడం
ధ్యానం సర్వ సమస్యల ముక్తి మార్గం
సన్యాసత్వం మూల నియమం
శాంతిని ప్రపంచానికి అలవర్చిన మహనీయం
బుద్దం శరణం గచ్చామి అందాం
రచన : చేబియ్యం శ్రీనివాసరావు
ఊరు : గుజరాతిపేట
మండలం : శ్రీకాకుళం
జిల్లా : శ్రీకాకుళం
చరవాణి : 7674055482
7
*శరణం శరణం శరణం*
మేడ మిద్దె లోన పట్టు మంచంపై పడుకుంటూ
పంచభక్ష పరమాన్నం పుష్టి గాను భుజియిస్తూ
వేలమంది సేవకుల సేవలను గైకొంటు
రాచ మర్యాదలతో సుఖజీవన మనుభవిస్తు
సిద్ధార్థ గౌతముడు రాజయ్యే శుభ ఘడియలో
ఇవి ఏవి వద్దంటూ సౌదమొదిలే ఒక రాతిరి
దీన జనుల బాధలను కనులారా వీక్షించెను
ప్రతి జీవిలో ఉన్న ఆ పరమాత్మను కాంక్షించెను
శరణు శరణు శరనంటు బౌద్ధమతం ప్రవచించెను
శాంతి సత్యా హింస లె మార్గమును బోధించును
బుద్ధం శరణం గచ్ఛామి
దమ్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్చామి
మానవాళికి అహింసను బోధిస్తూ
భువి లోనా బౌద్ధ ధర్మ మెగసి పడి లేచింది ...
----
శ్రీ భారతి
ఉల్లెంగ ముత్యం
నిర్మల్ ...
ఈ కవిత నా స్వీయ కవిత్వం ..
దేనికీ అనుకరణ కాదు
ఎక్కడ ప్రచురణ కాలేదు అని హామీ ఇస్తున్నాను...
8
*కవితా గానం సీజన్2*
ప్లవనామ సంవత్సర చైత్ర మాసం పౌర్ణమి కవితల పోటీ కోసం
అంశం: బౌద్ధ ధర్మం
కవి పేరు: నాశబోయిన నరసింహ(నాన)
ఊరు:చిట్యాల, నల్గొండ జిల్లా
చరవాణి:9542236764
⚜️⚜️⚜️⚜️⚜️⚜️♦️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*అష్టాంగ మార్గ సోపానం*
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ప్రపంచాన పరిచయమైన శాంతి సహనాల
పరమ పవిత్ర అచంచల అభిమతం బౌద్ధం
బుద్దుని ధర్మ సూత్రాల బోధనే మూలాధారం
మహాయాన థేరవాద సంప్రదాయాల సమూహం
శుద్దోధన మాయాదేవిల పుత్రరత్నం సిద్ధార్థుడు
నాలుగు దృశ్యాలు సిద్ధార్ధుని మది తొలచి
సత్యాన్వేషణకై తాత్విక చింతనతో ధ్యానదీక్ష చేపట్టి
జ్ఞానోదయమై గౌతమబుద్దుడిగా మారిన వైనం
నాలుగు పరమసత్య అమూల్య రత్నాల విశిష్ట సారం
నిర్వాణం పరమోన్నత మనే థేరవాదుల విశ్వాసం
బోధిసత్వ భావానికి ప్రాముఖ్యత నిచ్చే మహాయానం
సాధనతో జ్ఞానం నిర్వాణం సాధించ వచ్చనీ
ధ్యానం ఆత్మజ్ఞాన మూలమని జెన్ బౌద్ధుల నమ్మకం
తాంత్రిక ఆచారాల పరంపర వజ్రమాన బౌద్ధం
నాగార్జునుని బోధనా మార్గం మాధ్యమిక వాదం
యోగాచార బౌద్దంగా పరిణమించిన సర్వస్తి వాదం
అశోకుడు పలు స్థూపాలతో దశదిశలా వ్యాపించే బౌద్ధం
అష్టాంగ మార్గమంటే మంచి మాట మంచి పనులు
మంచి జీవితం మంచి ప్రయత్నం మంచి దృక్పథం...
మంచి ధ్యానం మంచి సంకల్పం సత్యం గ్రహించటం...
అష్టాంగ మార్గమే కాంక్షని జయించే మార్గ సత్యం
కాంక్షని త్యజిస్తే దుఃఖం దూరమవుననే నిరోధ సత్యం
సుఖ కాంక్ష దుఃఖానికి మూలమనే సముదాయ సత్యం
జన్మ జీవన మరణాలు దుఃఖమయమనే నగ్న సత్యం
🌀🌀🌀🌀🌀🌀♦️🌀🌀🌀🌀🌀🌀
హామీ పత్రం: ఈ కవిత నా స్వీయ రచన. దేనికీ అనువాదం,అనుసరణ కాదనీ హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు.
🙏 *నాన*
9.
పేరు.. అన్నాప్రగడ వేంకట నరసింహారావు
ప్రాంతం..గుంటూరు.
చరవాణి..9390099056
అంశం..బౌద్ధ ధర్మం..
శీర్షిక..నిర్వాణం....
ఆ రూపం చూస్తే తనువు ఝిల్లుమంటుంది...
ఆరూపం చూస్తే మనసు పులకరిస్తుంది...
ఆ నిర్వాణ ముద్ర జీవుని మేల్కొలుపుతుంది...
మనిషి మహాత్ముడుగా మారు క్రమంలో ఆచరించక తప్పదు అష్ట మంచిలక్షణాలు..
మంచిమాట..
మంచిపని..
మంచి జీవితం..
మంచి ప్రయత్నం..
మంచి దృక్పధం..
సత్యాన్ని పలకటం..
మంచిసంకల్పం...
మంచి ధ్యానం..
ధ్యానంతో అప్రదాన ఆలోచన
శూన్యం.
మానసిక చింతన శూన్యం..
ఉద్వేగం శూన్యం..
దుఃఖం శూన్యం.
కొరికలు శూన్యం..
రాగద్వేషాలు శూన్యం..
సాధన(ధ్యానం) తో
ఏకాగ్రత సాధ్యం..
సహనం సాధ్యం...
విశ్రాంతి సాధ్యం..
సుగుణం సాధ్యం..
జ్ఞానం సాధ్యం.
స్వీయ వీక్షణ సాధ్యం..
అన్వేషణ సాధ్యం...
ఆ నిర్వాణ ముద్ర బౌద్ధిగా మార్చి బుద్దులు నేర్పుతుంది....
సాధనసిద్ధత్వమును త్రిపిటకము బోధిస్తుంది..
మనిషి ని మహాత్మునిగా మారుస్తుంది...
✒అన్నాప్రగడ వేంకట నరసింహారావు...
హామీ..ఈ కవిత నా స్వీయ రచన. ఎటువంటి అనువాదం,అనుకరణ లేదు..
10.
కవితా గానం సీజన్ 2
పేరు: గంగాపురం శ్రీనివాస్
కలం: గంగశ్రీ
సిద్ధిపేట
9676305949
అంశం: బుద్ధుడు
*శరణాగతుడు*
°°°°°°°°°°°°°°°°°
అస్తవ్యస్త సమాజానికి దిక్సూచిలా
లుంబినీ వనంలో మొలకెత్తిన జ్ఞాన మొక్క!
గృహస్థాశ్రమం ధర్మంలో యశోధరుడు
పెంచిన తల్లి పేరుతో పేరొందిన గౌతముడు!
ముసలి, రోగి, శవ, సన్యాసులను చూసి చలించి;
మహాభియోగ నిష్క్రమణ చేసిన మహాయోగి
కౌండిన్య రాజగృహలో సన్యాస దీక్షితుడు
బోధి వృక్షం కింద జ్ఞానోదయమైన బుద్ధుడు
దేవదత్తుడి కోపాన్ని మరల్చిన శాంతమూర్తి
బుద్ధం, ధర్మం, సంఘాలను సమన్వయపర్చిన సచ్ఛీలుడు
త్రిపీఠిక బోధనలను త్రిలోకాలకు వ్యాప్తిచేసిన త్రివిక్రముడు
అష్టాంగ మార్గాలను సూచించిన ఆదియోగి
ఆమ్రపాళి మనసు మార్చిన ఆనందుడు
బౌద్ధాన్ని దేశదేశాల్లో ప్రజ్వలించిన ఆసియా జ్యోతి!
జాతక కథలతో జాతి గతి మార్చిన జాతిరత్నం!
ధర్మచక్ర పరివర్తనతో చక్రవర్తుల మనసు మార్చిన దయామయి
ఆరామాలతో విరామమెరుగని ఆరాధ్యుడు
సుజాత నైవేధ్యం స్వీకరించిన సంజాత
కుశీనగరంలో మహానిర్యాణం పొందిన కృషీవళి
మహాయాన హీనయాన శాఖలేవైనా,
నలంద, తక్షశిల, విక్రమశిలలతో
మానవ చరిత్ర గతిని మార్చిన విద్యావేత్త
నాటికి నేటికి ఆచరణీయం బౌద్ధ ధర్మం!
*...గంగాపురం శ్రీనివాస్*
హామీీ
పత్రం: పై శరణాగతుడు కవిత నా స్వీయరచన.
11.
కవితా గానం సీజన్ ...2
పౌర్ణమి కవితల పోటీ
అంశం....బౌధ్ధ ధర్మం
శీర్షిక....సదా ఆచరణీయం
సమ సమాజం లో మూఢ
నమ్మకాలకు తావు లేకుండా
మానవీయతా విలువల వైపు
నడిపించేది బౌధ్ధ ధర్మం....
దుఃఖం నిరోధం గురించి
దాస్య విమోచన గురించి
దిశా నిర్దేశించింది బౌధ్ధ ధర్మం....
అందరిలో ప్రావీణ్యతను పొందే విద్య
సంస్కారం పొందే శుద్ధి
సమయస్ఫూర్తిని పొందే బుద్ధి
ఇదే
సజ్జనుల సాంగత్యమని నిరూపించిన బౌధ్ధ ధర్మం....
ప్రేమ,కరుణ, సహనం, మైత్రి
భావాలు, నిరాడంబరతాల
సముదాయం బౌధ్ధ ధర్మం ....
కోపం ఆందోళన,విచారం
అభద్రతా భావం, వృద్ధాప్య ,
మరణ భయాలకు తావులేనిది బౌధ్ధ ధర్మం ...
ఒక గొప్ప వ్యక్తి కంటే సంఘమే గొప్పదని
వ్యక్తి సేవ కంటే సంఘం సేవ ఉన్నతమైనదని
నిరూపించింది బౌధ్ధ ధర్మం....
దయ, కృతజ్ఞతల పరిచయ కర్త
అహంసను వదిలి జ్ఞానం, ధర్మాల
వెలుగుల దీపం బౌధ్ధ ధర్మం....
మానవులంతా ఒకటేనని
స్త్రీ పురుషలు సమానమేనని
ఎలుగెత్తి చాటింది బౌధ్ధ ధర్మం ....
మధ్యం , మత్తులకు
కుల అసమానతలను
ఆవల పెట్టింది బౌధ్ధ ధర్మం...
సమాజాన్ని ఒక అవగాహనతో
జీవించే సహజీవనాన్ని, సూత్రాలను, ఆచరణలను
ద్వేషం తో కాదు ప్రేమ తో
సాధ్యమన్న బౌధ్ధ ధర్మం...
చిరకాలం చిరస్మరణీయం
భిక్షువుగా మారి బౌధ్ధ ధర్మాన్ని
ప్రభోదించి పౌర్ణమిన
వెలసిన గౌతమ బుద్ధుని
సదా ఆచరణీయ బౌధ్ధ ధర్మం....!!
హామీ....ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను 🙏
మొహమ్మద్ .అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి )
12.
కవితా గానం .
తేదీ :2/5 /21- ఆదివారం.
ప్లవ నామ సంవత్సరం
చైత్ర మాస పౌర్ణమి నగదు పురస్కారాలు
అంశం :బౌద్ధ ధర్మం
పేరు: మన్నె పిన్నక లలిత.
హైదరాబాద్ .
చరవాణి సంఖ్య :741 686 32 89.
***********************************
శాక్య వంశ శుద్ధోదన మహారాజు ఏకైక కుమారుడు అసూర్యంపశ్య యువరాజు
జరామరణ, వ్యాధిగ్రస్తుల, దివ్యాంగుల వేదనగాంచి కలచివేసిన హృదయాంతరంగంలో జన్మించిన ఆలోచనా వీచిక
సర్వసౌఖ్యాలు, భార్య, కుమారుని వీడి
విశ్వాన్వేషణ మొదలై , బోధివృక్షం క్రింద పూర్వ సిద్ధార్థ అనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించే వాడు
పేరుకే ప్రఖ్యాతి తెచ్చి ,శాక్య ముని , గౌతముడు గా పిలువబడి
బుద్ధగయలో పంచ శిష్యగణంకు చేసిన బోధతో బుద్ధుడై
అష్టాంగ మార్గాల సూచనతో
"బుద్ధం శరణం గచ్ఛామి ....
సంఘం శరణం గచ్చామి "అంటూ
అష్టాంగ మార్గాలు మొదలైన ధర్మాలు గౌతముడు బుద్ధుడై చెప్పిన సూత్రాలు
ప్రపంచవ్యాప్త బౌద్ధ వ్యాప్తి నిలయాలు ,బౌద్ధ ధర్మ మూలాలు తొలిసారి పాళీ భాషలో వ్రాయబడిన బుద్ధుని బోధనలు ప్రపంచ భాషలన్నిటిలో అనువాదాలు ,ఆనందుని "సుత్త పిటకం" బుద్ధుని సూక్తులను ,
ఉపాలి "వినయ పిటకం" లో బౌద్ధ సంఘలక్ష్యాలకు వివరణనివ్వగా
బౌద్ధధర్మాలు మహాయాన, హీనయానాలుగా ప్రసిద్ధాలు
అశోకుడు స్థాపించిన ధర్మ చక్రం, సారనాథ్ స్తూపం
దేశ దేశాంతరాలలో వ్యాపింపజేసిన బౌద్ధ ధర్మం
టిబెట్, చైనా , జపాన్ మొదలైన ప్రపంచ దేశాలలో
ఏబది కోట్ల పైన బౌద్ధులున్నారంటే
బుద్ధుని బోధనలు నిత్య ఆవశ్యకాలు.
13
పేరు : హారిక
చరవాణి : 9848041210
జిల్లా : సిద్దిపేట
కవిత :బౌద్ధ ధర్మం
అంతఃపురమందు జన్మించవలసిన బాలుడు
లుంబినీవన సాలవృక్ష నీడలో జన్మించి
ఇంతింతై తానంతై అన్నట్టుగా ఎదిగి
పట్టాభిషిక్తుడయ్యాడు
గౌతముడిగా
తండ్రి కోర్కెపై
పురవైభవ వీక్షణలో
చలించిన మనస్సు
జనన, మరణ, దుఃఖాన్ని దాటే మార్గాన్వేషణలో
చరిస్తూ
మనోరాజ్యానికి తానే మహిత చక్రవర్తియయ్యాడు
అంతఃపుర బంధాలను తెంచుకుని
పవిత్రమతం,
పవిత్రభావం, పవిత్రకార్యం, పవిత్రవాక్యం
పవిత్ర చేష్ట,
పవిత్ర చింతనతో
బోధివృక్షం కింద ధ్యానముద్ర తో
ఆగుపించాడు
రాగద్వేషాలను జయించిన
బుద్ధుడయ్యాడు
14.
తథాగతుని బాటలో
*****************
కష్టాల జీవనములు
కడగండ్ల బ్రతుకులు
ఉన్న మూడునాళ్ళు
పగ విద్వేషాల కుళ్ళు
ఏది కావాలో తేలీని
ఏదైతే అదేనని
గుడ్డెద్దు చేలో పడ్డట్టు
ఎటువడితే అటే మెక్కి
లేనిదాని కోసము
అర్రులు చాచిన వైనం
ఉన్నదాని విలువెరుగని
ఉన్మత్తమౌ లోచనం
కకావికలమైనట్టి
గందరగోళ పరచేట్టి
గమ్యమేదో యెరుగని
గమనమేదో తేలీని
కునారిల్లు జీవులకు
కుతంత్రాల వ్యసనులకు
సద్గతిని చూపుటకు
సన్మార్గము తెలుపుటకు
బుద్దుడైన సిద్దార్థుడు
నిబద్దుడైన హితకారుడు
కాయాన్ని మధించి
యోగాన్ని ఆచరించి
అవసరాన్ని శోషించి
అనవసరాన్ని త్యజించి
నిలువెత్తు జీవనముకు
తలయెత్తుకు నిలబడుటకు
ఆనందమొందు మనుగడకు
అనుభూతినొందు నిలకడకు
పంచశీల భోదించి
మంచినడత చూయించి
కోరికలనదుపు జేయ
మారు నీ విధమని
అవసరమే యోచించ
నూరు యేండ్ల వయసని
వ్రాక్కుచ్చిన బుద్ధుడు
వరమిడిన రససిద్ధుడు
తథాగతుని బాటలో
నడువ సుఖము మనకు
తథాగతుని భోదనలో
బ్రతుక జయము మనకు
**************************
**మేకల రామస్వామి**
కవి,రచయిత,ఉపాధ్యాయుడు,
చెన్నూర్- మంచిర్యాల
9912847214
***************************
15
నారుమంచి వాణి ప్రభాకరి
కవిత *
బుద్ధుని ఆదేశము
++++!++++++++++
శ్రీ మహా విష్ణువు దశ అవతారము లలో ఒకటి
రాజకుమారుని గా జన్మ ఎత్తిన శాంతి. దేవత
రాజ భోగాలు వదిలి ప్రపంచ శాంతి కలగాలని
సహనం శాంతం సౌశీల్యం ప్రజా క్షేమం కోరుతూ
బౌద్ధ ప్రచారం ద్వారా అహింస తో పాటు అనేక
విషయాలు బౌద్ద మతం గురించి బిక్షువులకు
బోధించిన మహిమాన్విత శాంతి అవతారము
స్త్రీ పురుష సమానత్వ,రాజకీయ సాంఘిక
స్వతంత్ర విషయ పరిజ్ఞానము,జీవితంలో
కష్ట సుఖాలు నుంచి విముక్తి పొందటం మోక్షం
బౌద్ద బిక్షువు సంబంధం అంతా ప్రపంచం తోనే
పవిత్ర భావాలు శరీరం మనస్సు నియంత్రించి
శరీర భాధల నుండి విముక్తి వల్ల ఆనందము
మంచి భావాలతో ఉన్నతిగా ఉష్టహంతో మనస్సు
ఆనందం ఆరోగ్యంతో నింపుకుని కులమత వివక్షత
లేకుండా సమానత్వ.ము తో కలసి మెలసి ఒకే
సంఘ సభ్యులుగా మసలుకో వలని బుద్ధుని ఆదేశము
ఎన్ని తరాలు మారినా ఆ ఆదేశము శాశ్వతం గా
మన దేశంలో ఆచరిస్తున్న వారు ఉన్నారు
మహనీయుని శాంతి తత్వం అందరికీ.ఆదేశము
కొన్ని దేశాలు ప్రత్యేకం బౌద్ద మత ప్రచారంలో2
శాంతికి ఆచరణను బోధిస్తున్న స్ఫూర్తి కీర్తి ,
16
: ఉప్పరి తిరుమలేష్
కవిత *
మహత్ముడుగౌతముడు
జ్ఞానానికి పునాది తాను అవుతూ
విశ్వంలో విజ్ఞానజ్యోతై వెలుగొందాడు
మానవతా మణిదీపం గౌతమబుద్ధుడు
బుద్ధుడు సిద్ధార్థుడై అవతరిస్తూనే
ఆదర్శమూర్తిగా చిరస్మరణీయుడయ్యాడు
జ్ఞానజ్యోతి మహాత్ముని సిద్దాంతస్ఫూర్తి
బుద్ధుడు బోగభాగ్యాలను విడనాడుతూనే
బోలశంకరుడై దేశమంతటా సంచరించాడు
సత్యాహింసాల సద్గుణరాశి గౌతముడు
సమాజం కోసం ధర్మచక్ర పరివర్తకుడై
ధ్యాన మార్గాన్ని ప్రచారం చేశాడు
శ్వాసపై ధ్యాసలేని శాసనకర్త బుద్ధుడు
సంసారబంధాలను విడనాడుతూనే
సాధు సత్పురుషుడిగా కీర్తి గాంచాడు
మనస్సును జయించిన మహర్షి బుద్ధుడు
అహింసో పరమో ధర్మ: అన్నప్పుడల్లా
శాంతి మంత్రంగానే దర్శనమిస్తాడు
శాంతికి నిలువెత్తు నిదర్శనం గౌతముడు
నిత్యం శ్వాసపైన దృష్టి నిలిపితేనే కదా
మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యేది
యోగ ఎప్పటికీ సర్వరోగ నివారిణి
ధ్యానముద్రలో నిమగ్నయితేనే కదా
సంపూర్ణ జ్ఞానంతో మనిషి వెలుగేది
ఏకాగ్రతకు రాజమార్గం యోగక్రియ
ఉప్పరితిరుమలేష్
9618961384
17
కొంపెల్లి రామయ్య గారు
కవిత *
అంశం:బౌద్ధ ధర్మం
శీర్షిక: గౌతమ బుద్ధుడతను...!
కరుణతో బహుజన హిత ధర్మాన్ని బోధిస్తూ
ద్వేషాగ్నితో ,రాగాగ్నితో ,మోహాగ్నితో, దుఃఖాగ్నితో
దహించుకు పోతున్న మానవ జన్మను మేల్కొలుపు తూ
సుఖాలన్నీ ఎండమావులు ముసుకు వేసుకున్న దుఃఖాలంటూ
అంతం కానే కాదు దుఃఖం మరణానంతరం
అది మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది పునర్భవనంలో నైనా
నిర్వాణం పొందడం ద్వార జన్మరాహిత్య స్థితి పొందాలన్న కాలజ్ఞానీ...!
పంచశీల బోధనలతో పాపాత్ముల మనసులను శుద్ది చేస్తూ
ప్రతిమోక్ష సూత్రాలతో బుద్ధి పవిత్రత వైపు మళ్ళిస్తూ
భువన మోహన వ్యక్తిత్వం ఆవర్తనీ మాయతో
క్రూర హంతకుడు అంగుళీమాలున్నీ భిక్షువుగా మార్చిన మహర్షి అతను...!
ఆత్మదీపోభవ అంటూ ఉపదేశిస్తూ
స్వచ్ఛమైన జీవితమే బౌద్ధ ధర్మ పరమార్థ మంటూ
చతురస్య సత్యాలు, అష్టాంగ మార్గాలు,దశపారమితలు చతురతతో బోధిస్తూ
మనిషికి మనిషికి మధ్య సంబంధం గురించి చెప్పేదే బౌద్ధమన్న బోధకుడతను...!
ఏది ప్రతి వ్యక్తికి మంచి చేస్తుందో
ఏది సమాజానికి సన్మార్గం వేస్తుందో
అదే నిజమైన ధర్మ మార్గం అంటూ
శీలం,సమాధి,ప్రజ్ఞ లకు ప్రాధాన్యమిస్తూ
త్రికరణ శుద్ధితో త్రిశరణాలు
బుద్ధం శరణం గచ్ఛామి...!
ధమ్మం శరణం గచ్ఛామి...!
సంఘం శరణం గచ్ఛామి...ఆన్న గౌతమ బుద్ధుడతను...!
18
ఆళ్ళ నాగేశ్వరావు
కవిత *
మతాల సారం మానవత్వమని
మనిషికి ముఖ్యం సోదరతత్వమని
విడనాడితే సౌఖ్యం రక్షసత్వమని
తెల్పించే బౌద్ధమతం!
అహింస పరమొత్తమ మైనదని
జీవహింస మహాపాపమని
అంటరానితనం అంధత్వానికి ప్రతిరూపమని
సర్వజను లూ సమనమనే
సారాంశాన్ని బోధించిన
మహోన్నత మానవత్వం భౌద్ధమతం!
నాటి గౌతమబుద్ధుని మొదలు
నేటి అంభేడ్కర్ మహాశయులు
ఆదరించి, ఆచరించిన అభ్యుదయ పదం భౌద్దమతం!
అందరుంబాగుండాలి.....అందులో నేనుండాలని
ఆకాంక్షించే సర్వేజన సంక్షేమాన్ని
ఆశించే అత్యున్నత సంఘసంస్కర్త భౌద్ధమతం!
ఆళ్ళ నాగేశ్వరరావు గారు
19
ధనాశి ఉషారాణి గారు
కవిత *
శీర్షిక.బౌద్ధధర్మం
..
రాగ ద్వేషాలకు అతీతముగాను
సృష్టిలో జనుల శ్రేయస్సుకు ఆవిర్భవించింది బౌద్ధధర్మం
సత్యానికి అసత్యానికి మద్యవున్న ధర్మాన్ని
చక్కగా వివరించిన ధర్మం బౌద్ధo
బుద్ధుడు ఎవ్వరికీ వారు ఇష్టాను సారముగా
జనుల ఆచరించాలని ఉపదేశించిన మతము
దుఃఖము నుండివిముక్తి పొందేమార్గము జనులకు చూపిన ధర్మం
ముక్తిమార్గము అందరికీ చెప్పినట్టి ధర్మం
జనులకు కీడు కలుగక జీవించాలని చెప్పినమతము
సత్య అన్వేషణ మార్గమును ఆచరిoచాలని
జనులకు సూచించిన ధర్మం
హింస పగలతోను రగిలిపోతున్నటి నేటి జనులకు
అవసరము అయిన ధర్మం
అష్టాoగ మార్గము ద్వారా జనులకు జ్ఞానోదయo చూపిన
ధర్మము
తనను తానుపై విజయము సాధించిన వారు విజేతని
మన సంతోషము ఇతరుల సంతోషానికి కారణముకావాలని చెప్పిన ధర్మము
ఒక్క దీపము వేయి దీపాలను వెలిగించును
ద్వేషాన్ని దూరము చేసేది ప్రేమ ఒక్కటని బౌద్దధర్మం ప్రపంచానికి తెలియజేసింది
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
20
: తాతపూడి సోమ శేఖర శర్మ
*
అతులిత దీక్షాదక్షుడు
******************
ప్రపంచ శాంతిగీతం బౌద్ధమతస్థాపకుడు
శాక్యతెగ అధిపతి శుద్ధోదనుడి కుమారుడు
సిద్ధార్ధ నామధేయుడు అతడే గౌతమ బుద్ధుడు
భోగభాగ్యాలతో తులతూగుచూ స్వర్గసుఖాలు అనుభవిస్తూ
అవన్నీ భవబంధాలని అ శ్వాశ్వతమని కళావిహీనమని
భావించి వాటన్నిటిని పరిత్యజియించి సత్యాన్వేషణకై
అడవులకేగిన మహాత్యాగశీలి మహానుభావుడు బుద్ధుడు
కఠోర దీక్షతో బోధివృక్షం క్రింద మహాధ్యానంచేసి జ్ఞానం
పొందిన మహాఘనుడు మహనీయుడు గౌతమబుద్ధుడు
దుఃఖంలోవున్నమనిషికి మార్గనిర్దేశంచేసినమహనీయుడితడు నన్ను ఆరాధించవద్దు నేను భగవంతుడను మాత్రం కాను
నేను కేవలం సత్యమార్గం చెప్పిన సత్యాన్వేషిణిమాత్రమే
విశ్వాసం కంటే అవగాహనకు ప్రాధాన్యం ఇవ్వాలి మనం
అనారోగ్యం వృద్ధాప్యం ఒంటరితనం వలన మానవుడు
మానసిక వేదనతో బాధపడతాడు ఆవేదన క్రోధానికి దారితీస్తుంది మనలో పుట్టే దుఃఖాన్ని మనమే పారద్రోలాలి
నిత్యం సంతోషమయంగా జీవించాలి దుఃఖాన్ని పారద్రోలాలి
చేసేపనులలో పూర్తి లగ్నమవ్వాలి ఊహలతో కాలం గడపకూడదు అసహాయులకు సాయం చేయాలి
మాటలతో గాని చేతలతోగాని ఇతరులనుబాధించకూడదు
ప్రశాంతజీవనాన్ని గడపాలి గతాన్ని వదలిపెట్టాలి
వర్తమానాన్ని ఆహ్వానించాలి మత్తుపదార్దాలు సేవించొద్దు
విశ్వాశం కంటే అవగాహనకే ప్రాధాన్యమెక్కువ
కోరుకోవడం అనేది దుఃఖానికి దారితీస్తుంది
నేనుచెప్పానని నమ్మవద్దు మేరుపరిశోదించండి
జీవిత సత్యంతెలుసుకోండి అనే జీవనప్రక్రియలో
ప్రజలందరికి సరియైన మార్గాన్ని చూపిన తథాగతుడు
21
మద్ది పుల్లారావు గారు
కవిత *
శీర్షిక:భౌద్దమతం
...వచన కవిత............
..
బుద్దం శరణం గచ్చామి
దర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
మహారాజు గా లుంబిని లో జన్మించి
మానవుల బాధలనెరిగి
సున్నితమైన మనసు కరిగి
సర్వస్వాన్ని త్యజించి
గయ లో తపస్సు తో జ్ఞానోదయం కలిగి
కోరికలు దుఃఃఖహేతువులను సత్యాన్ని
విశ్వానికెరింగించిన మహాజ్ఞాని
లైట్ ఆప్ ఆసియా గా కీర్తించబడినవాడు
భౌద్దమతస్థొపకుడు మన గౌతముడు
త్రిపీఠకాలతో జగతిని వెలిగించాడు
అష్టాంగమార్గం గమ్యం చేర్చునన్నాడు
విశ్వమానవాళి శ్రేయస్సును కాంక్షించాడు
అహింసయే పరమదర్మమని నినదించాడు..
గాంధీజీ వంటి వారికి ప్రేరణగా నిలిచాడు
వేల వత్సరాలు గడిచినా
పసివాడని మొగ్గ మన భౌద్దం
ఎన్నటికీ ఇరిగిపోని గంధం
ఎత్తుపల్లాలు చూసినా
నిరంతర ఝరి మన భౌద్దం
బుద్దుని భోదనలు సర్వజనీనం
గౌతముని వచనాలు సర్వకాలికం
సత్కర్మలను ఆచరించుట
ధ్యానపద్దతిని అనుసరించుట
మేలు,కీడులయందు ఒకేవిదంగాయుండుట
పంచశీల సూత్రాలను పాటించుట
భౌద్దమతం ముఖ్య బావనలై
అన్నిమతాలకు ఆదర్శాలై
అశోకుని వంటి వారికీ మార్గదర్శకాలై
శాశ్వతమై నిలిచిపోయాయి
భౌద్దంలో శాఖలెన్ని ఉన్నా
భోదనలన్నీ అపూర్వాలే
మానవజాతికి ప్రభోదాలే
భౌద్దమతం విలసిల్లాలి
మానవజాతి ఫరిడవిల్లాలి
.............................
22
బొడ్డు హారిక
కవిత *
సిద్ధార్ధుడే బుద్ధుడై
రాజ్యభోగములున్
సంసారిక జీవితంబున్
పుత్ర ప్రీతినిన్
విడిచిపెట్టిన వాడు
చక్షువులు చూచిన చిత్రములకు చింతుడై
సత్యాన్వేషణకై నడిరేయిలో నడక ప్రారంభించాడు
భిక్షువై కఠోర దీక్ష పూని
వృక్షము యందు ధ్యానమారంభించినవాడు
అష్టాంగములలోనే ఆనందముందన్నవాడు
అష్టాంగములనగ
సమ్యగ్వచనము (మంచిమాట),
సమ్యగ్‌కర్మ (మంచి పనులు),
సమ్యగ్‌జీవనము (మంచి జీవితం),
సమ్యగ్‌వ్యాయామము (మంచి ప్రయత్నం),
సమ్యగ్‌స్మృతి (మంచి దృక్పధము),
సమ్యగ్‌సమాధి (మంచి ధ్యానము),
సమ్యగ్‌దృష్టి (సత్యాన్ని చూడడం),
సమ్యగ్‌సంకల్పము (మంచి సంకల్పము)
మంచిని తెలిపిన బుద్ధుని బౌద్ధ మతం గొప్పదనెనుగా అందరూ
అన్నిటిని విడిచి ధర్మంబునాచరించినదే బౌద్ధ ధర్మంబవగా
అన్నియు ఉన్న సన్యాసి వలే సతీ ధర్మంబునాచరించిన
సిద్ధుని సతీమణి ధర్మంబును ఎవ్వరూ గమనింపరు కదా.
23
జోషి పద్మావతి
కవిత *
కవితాగానం సీజన్2
*ప్లవనామసంవత్సర చైత్రం పౌర్ణమి కవితల పోటీ కొరకై వ్రాసిన నా కవిత:-*
*నా కవితా శీర్షిక:-*
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
*బౌద్ధధర్మం-సుబుద్ధి సాధనం*
•••••••••••••••••••••••••••••••••••••
నాటినుండి నేటిదాక తప్పలేదు
అంటు వ్యాధిముప్పు
ప్రకృతి విరుద్ధ నడతతో
తప్పలేదు ఉత్పాతం
అంటురోగంకాదు అధైర్యమే
ప్రమాదమన్నది బౌద్ధధర్మం
ఇప్పుడే ప్రజకందించాలి రాజాసరా!
వీధులకుశుభ్రతచేకూర్చి కాయాలిపహారా!
ప్రజలకు ధైర్యబలమునందించేవి బౌద్ధ ప్రబోధలు
చిరస్థాయినున్నవి బౌద్ధ రత్నసూత్ర,మైత్రీసూత్రాలు
శోకాన్నితప్పించు ఉపాయాలే వ్యవసాయాలు
శ్రద్ధయే వ్యవసాయానికి విత్తనము
తపస్సే సేద్యానికవసరమైన వర్షము
ప్రజ్ఞయే పొలాన్ని దున్నే కాడియైతే....
బంగారంలా పండేనపుడే బ్రతుకుపంట!
సంఘం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
బుద్ధం శరణం గచ్ఛామి
దుఃఖపు చీకటిలో వెలుగిచ్చే
జ్ఞానదీపమే మన బౌద్ధధర్మం
24
ముద్దు వెంకటలక్ష్మి
పౌర్ణమి కవితల పోటీకి కవిత
02-05-2021
*హేతువుకి తావిచ్చిన ధర్మం*
ఐదో శతాబ్దిలో ప్రభవించి
మానవుని మేధస్సుకు పట్టం కట్టి,
కార్య కారణ సంబంధ విచారణకు
బాటలు వేసి మానవత్వానికి విలువనిచ్చిన ధర్మం బౌద్ధం ;
రాజకుమారుడు నిరాడంబరుడై
సామాన్యుల సుఖదుఃఖాలతో మమేకమై తదేక ధ్యానంతో సంఘపు శ్రేయస్సుకై
చక్కని రహదారినేర్పరచిన శ్రేయోదాయక విధానం ;
వాస్తవాల వెలుగులో ఆశయాల
ప్రాకారాలను నిర్మించిన ఆదర్శ
జీవన శైలి బౌద్ధ ధర్మ యానం
తరతరాల మానవజాతి ప్రగతికి
దారి చూపిన ధర్మ పథం ;
మంచి సంకల్పాన్నీ, ఆశయాలనూ
మంచి కార్యాలనూ ప్రేరేపించే
'అష్టాంగ మార్గాన్ని' ప్రబోధించిన
సత్య శీల జీవన పరమార్థం ;
"సదాలోచనలను నలుదిక్కులనుండీ స్వాగతించు " అన్న వేదోక్తికి ప్రతిరూపంగా భూతదయనూ, సోదర ప్రేమనూ
బోధించిన భారతీయ సనాతన
ధర్మానికి ప్రతిబింబమై వాడవాడలా
దేశ విదేశాలలో కాలూనుకొని
కాలపు ఒత్తిళ్ళకు నిలదొక్కుకున్న
ఉత్తమ ధర్మం బౌద్ధ ధర్మం.
---------ముద్దు వెంకటలక్ష్మి, పిఠాపురం.
హామీ పత్రం
పై కవిత నా సొంతమే, ప్రత్యేకంగా ఈ పోటీ కోసం వ్రాసినదే. ధన్యవాదాలతో.....
ముద్దు వెంకటలక్ష్మి
25
దారాలవిజయ కుమారి
ప్లవనామ సంవత్సరం
చైత్రమాసం
పౌర్ణమి కవితల పోటీ
అంశం: బౌద్ధ ధర్మం
శీర్షిక : మోక్షం సాధనం
******************
భయపెట్టే బాధల్లో కొట్టుమిట్టాడుతున్నపుడు
మనిషి మనసు జోలెలోకి ఒంపబడి...
వ్యక్తిని..వొడిసి పట్టుకున్న వేదాలను విసిరికొట్టి
మనిషితనపు సాళ్ళలో ప్రవహించి..
బ్రాహ్మణత్వాన్ని బద్దలుకొట్టి
సమాజ తీరం వెంబడి మేటవేసిన బౌద్ధ ధర్మం
బుద్దుడు వ్యక్తికాదు..బౌద్దం మతం కాదు
అదో అనంతమైన ధర్మ రూపం..అవినాభావ శాశ్వతత్వం
పునర్జన్మ బూచీని చూసి భయపడకు..?
నీ పురోగమనానికి అడ్డొచ్చే..మానసిక సంకెళ్లను
తెంచుకుని సమాధి దిశగా అడుగులేయాలి
సమాధంటే..దుర్గుణాలనుంచీ విముక్తుడవడమే కదా
బాధలకు నివారణ..నిర్మూలనలపై..మిధ్యా దృష్టి పరదా కప్పబడ్డాకే..మనసు శరీరం దుఃఖాన్ని పొందింది
రాగ ద్వేషాల విముక్తే..నిర్వాణం
మోహాన్ని జయించే జ్ఞానోదయమే.. బోధి
సాధనతో నువ్వూ బుద్దుడు కాగలవు
బుద్దం ధర్మం సంఘం..త్రిరత్నాల శరణు జొచ్చి చూడు..నీకు తెలియని నువ్వు..నీ పక్కగా నడవడం చూస్తావు
చెవియొగ్గి విను..బౌద్ధం అనుభవ వాదం !
ఉనికిలో లేని దాని గూర్చి ఆందోళనెందుకు ?
ప్రపంచాన్ని..వస్తువు పదార్ధాల పరంగానేనా..
విధానాల పరంగా చూడగలవు
బాధలను తిప్పికొట్టి..తృష్ణ ను విడిచిపెట్టి..
ప్రపంచమే.. బ్రాహ్మణమని తెలుసు కో
ధర్మ చక్రపు ఎనిమిది ఆకుల అష్టాంగ మార్గమే
దుఃఖ విమోచనం..నీ మనస్సుకు ధ్యానం తోనే శిక్షణ నిస్తూ..
ప్రపంచాన్ని కాదు..మొదట నిన్నే నియంత్రించుకో
తెలుసా..
ధర్మం..మోక్షం సాధించడానికి ఒక సాధనం
దారాలవిజయ కుమారి
9177192275
ఆర్యా నమస్తె
ఈ కవిత నా స్వంత రచన.అనువాదం కాదు.. ఎక్కడా ప్రచురితం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
దారల విజయ కుమారి
9177192275
26
అయ్యలసోమయాజుల ప్రసాద్
కవిత *
అంశం:- బౌద్ధమతం
శీర్షిక:- శాంతి అహింసలే జీవనముక్తి కి సోపానం
శుద్ధోదనుడు మాయాదేవి ల నోములపంటగా
సిద్ధార్డుడు రాజవంశంలో పుట్టినా
జనులకష్టాలను చూసి రాజప్రాసామును
భార్య పిల్లడిని వదలి తాత్త్వికచింతనతో
బుద్ధ గయలో బోధి వృక్షము క్రింద
జ్ఞాన ప్రాప్తినొంది బుద్ధునిగా మారెను....!!
శాంతి, అహింసలే జీవన్ముక్తి కి సోపాలని
జీవితం అనిత్యము,దుఃఖమయమని
అష్టాంగ మార్గం ద్వారా మానవుని జన్మసార్ధకత
చెందునని చెప్పిన మహనీయుదు
మంచిమాట, మంచి పనులు, మంచిజీవితం,
మంచిప్రయత్నం, మంచి దృక్పథం, మంచి ధ్యానం,
సత్యాన్ని చూడటం, మంచి సంకల్పం
మానవుని ముముక్షత్వమునికి సోపాలని
చెప్పిన తథాగతుడు జన్మించిన భారత దేశంలో
జన్మించిన మనం బుద్ధ పూర్ణిమనాడు
ప్రతిన పూని సత్యం, శాంతి, అహింసలకు
ప్రాధాన్యత నిచ్చి "బుద్ధం శరణం గచ్ఛామి,
సంఘం శరణం గచ్ఛామి" అంటూ
సమాజాభివృద్ధికి తోడ్పడదాం
శాంతి, అహింసలే జీవనముక్తి కి
సోపానాలని నిరూపిద్దాం......!!
లోకా సమస్తా సుఖినో భవంతు
27
కవితాగానం సీజన్ 2
ప్లవనామ సంవత్సర పౌర్ణమి కవితల పోటీ
రచన.డా.నాయకంటి నరసింహశర్మ.
వనపర్తి.
అంశం.బౌద్ధం.
ఫోన్.9441357400
శాంత్యహింసల సమాకీర్ణం
సమ్యక్ దర్శనం సమ్యగ్వర్తనం సమ్యగ్భావన బౌద్ధం
అంతరింద్రియ బహిరింద్రియనిగ్రహం జీవన్ముక్తి రహస్యం
తథాగతుని తత్త్వం బౌద్ధంచైత్యాలు , ఆరామాలుస్తూపాలూత్రిపిటకాలూ ,వాదాలూ ,సారనాథ్ స్తూపమూ,లుంబినీ ప్రదేశమూబౌద్ధానికి ఆనవాళ్లు, పునాదులు
అనంతమైనఅనిర్వచనీయమైన
బౌద్ధ సిద్ధాంతానికి నేటికీ చెరగని చిహ్నాలు
అష్టాంగ యోగం మనోనిశ్చల నిగ్రహ స్థితిని పొందడమే
బౌద్ధ బోధనలకు మూలం
మహాయాన హీనయానాలమార్గమే బౌద్ధం
మనోగత పవిత్ర తత్త్వం బౌద్ధం
మానవుని దుఃఖకారణాల అన్వేషణ , విమోచనే బౌద్ధసూత్రాల ఆవిష్కరణ.
కోరికల విశృంఖల విహారత్యాగం
మనోనిగ్రహంఅలౌకికానందం
బౌద్ధ సిద్ధాంతం
ఇంద్రియాలూ ,జననమరణాలే శోకానికి కారణభూతమన్నది బౌద్ధమతానికి ప్రాతిపదిక
కర్మలే మానవుని పరిపూర్ణ జీవితానికి పునాదులనేది బౌద్ధం
28
*కవితా గానం చైత్రమాస పౌర్ణమి పోటీలకు వ్రాసిన కవిత*
అంశము: *బౌద్ధ తత్వము*
శీర్షిక: *బుద్ధుడు*
మహారాజుగా అనుభవించాల్సిన
భోగ భాగ్యాలను త్యజించి
మానవుల దైన్య స్థితికి చలించి
ఆలోచనా తత్పరుడై
బోధివృక్షపు ఛాయలో అయ్యాడు
*సిద్ధార్థుడు - బుద్ధుడు*
సారనాథ్ లో సత్సంగాలను ఆరంభించి
బౌద్ధమతమే మానవతా తత్వమని ప్రబోధించాడు...
ధనిక, పేద, స్ర్రీ, పురుష వర్ణ భేదాలు ఖండించాడు...
సర్వ మానవతా సౌభ్రా తృత్వాన్ని సమర్థించాడు...
ప్రపంచం దుఃఖమయమని, కోరికలు దుఃఖానికి మూలమని నిర్వణమే పరిష్కారమార్గమని నినదించాడు...
*బౌద్ధాన్ని పరి వ్యాప్తం చేశాడు బుద్ధుడు*
అష్టాంగ మార్గాన్ని అన్వేషించి ప్రవర్తనా నియమాలనేర్పరచి
పరమ పవిత్ర ప్రవర్తనను పరిచయం చేసి
అహింసా ధర్మాన్ని
పశుసంపద పరిరక్షణను
గోమాత పవిత్రతను
మానవ ధర్మంగా ప్రకటించి
మతమంటే మౌఢ్యమో మత్తు మందో కాదని
మానవ ప్రవర్తనా నియమావళిని రూపొందించి
తాను ఆచరించిన
*మహోన్నతుడు - గౌతముడు*
నాటికి ........ ఈ నాటికీ
కపటమో - కారుణ్యమో..
అలజడో - అహింసనో..
మతమో - మానవధర్మమో..
అసూయనో - అనురాగమో..
స్వార్థమో - సమర్పణమో..
అహంకారమో - ఆప్యాయతనో..
విలాసమో - వికాసమో..
పతనమో - పరివర్తనమో..
సంధించిన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం..
*బౌద్ధ తత్వాన్ని* అవలోకిద్దాం..
*బుద్ధ మార్గాన్ని* అనుసరిద్దాం...
*గుండ్ల సౌజన్య*
చరవాణి : *7386871200.*
హామీ పత్రం
ఈ కవిత స్వీయరచన అనువాదమూ అనుకరణా అనుసరణమూ కాదు
డా.నాయకంటి నరసింహ శర్మ

Comments
Post a Comment