Skip to main content

Physically challenged

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ 

author of vennela shilpam

వీరా గుడిపల్లి

***************

1.భరద్వాజ రావి నూతల గారు

2.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు

3.పరాంకుశం రఘు నారాయణ గారు

4.సంధ్యా శర్మ గారు

5.వినీలమ్మ

6.కోరాడ నరసింహారావు గారు

7.అయిత అనిత గారు

8.ధనాశి ఉషారాణి గారు

9.సుధారాణి కృష్ణం రాజు గారు

10.మర్రి జయశ్రీ గారు

11.వల్లాల విజయ లక్ష్మి గారు


********************

1

అంశం-వైకల్యం 

శీర్షిక-మానవత్వం కావాలి -

భరతమాత వస్త్రం పైబడ్డమరకలు  -

జానాకాసాన స్థిరనివాసమంద లేనిఉల్కలు --

స్వేచ్చాజీవితాలనందలేని బ్రతుకులు -

ఒకరిఫై ఆధారపడనిదే బ్రతకలేని జీవితాలు -

భగవంతుని సృష్టిలో లోపం -

అయింది వారిబ్రతుకులకు శాపం -

ఇది ఏపాపపుణ్యఫలమో దివ్యంగత్వం అనుభవించేజీవితం 

వైకల్యం ఉన్నంతమాత్రాన బ్రతుకుండాలేరుఎవ్వరు -

ఆత్మసైర్యంతో సాగుతున్నారుముందుకు -

మామూలువారిలాగే చదువుకుంటున్నవీళ్ళు -

గుండెనిబ్బరానా బ్రతికేదైర్యవంతులు -

వారిపట్లమనకు ఉండకూడదు ఉదాసీనత 

వారిని ప్రేమించడం మనబాథ్యత -

శరీరలోపం ఉన్న వారినిచూడకూడదు చిన్నచూపు -

వారికి శరీరాలకే గాని మనసుకుండు వికలాంగాత -

మనమనసులకు అంటించుకోకూడదు -

ఆవికలాంగత్వం -

మానమనసులను విశాలంచేసుకుని చూపాలి ప్రేమ -

కలిగించాలి మేమూ మనుషులమే నన్న స్పృహ 

అప్పుడే బ్రతుకుపట్ల వారికి కలుగుతుంది నమ్మకం -

ఇదినాస్వీయరచన అనువాదం అనుబంధం కాదు 

భరద్వాజరావినూతల (RB)✒️

9866203795

2

[03/12, 8:20 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: అంగవైకల్యం

వారిపట్ల ప్రేమను మమకారాన్ని

అందించాలి

తర్వాత దయ దృక్పథం చూపించాలి

మానవతా కరుణ ప్రవాహం


ప్రవహింప చేయాలి


వాళ్లు వికలాంగులు కాదు దివ్యాంగులు


వాళ్లు నిజమైన మానవతా చూపించాలి

వారికి దయ వర్షం కురిపించాయి


వాళ్లను మనసారా ప్రేమించాలి


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453

3

[03/12, 8:43 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితా గానం*

 (ప్రపంచ దివ్యాoగుల దినోత్సవం పురస్కరించుకొని )

+++++++++++++++++++++++++++

*కవితా శీర్షిక :దివ్యాంగులకు కొండంత భరోసా నిద్దాం !!*

++++++++++++++++++++++++++

కంటి చూపు లేని వాళ్ళనడిగితే తెలుస్తుంది? 


కండ్లయొక్క గొప్పతనమెoతో? 


కాళ్ళులేని వాళ్ళనడిగితే తెలుస్తుంది? 


కాళ్ళ ప్రాధాన్యత ఎంతో?   


 మనమెంత అదృష్టవంతులమో! కదా? 


 ఆరోగ్యకర అవయవాలతో జన్మించాo!


 ఎన్ని జన్మల పుణ్యం ఫలమో?  కదా!


 మానవత్వం పరిమళించే రీతిలో.., 


 ఆప్యాయతానురాగాలను కురిపిస్తూ.., 

 దేవుడులాంటి ఓరిమిని ప్రదర్శిస్తూ..., 

 అడుగడుగునా వారికి ప్రోత్సాహకాలనoదిస్తూ.., 

 ఉత్తమ భారతీయ పౌరునిగా మన కర్తవ్యాన్ని నెరవేరుద్దాం !

ఆ క్రమంలో.., అందుకే!?....,, 

 దివ్యాంగుల ఎడ మనం 

చూపించాల్సింది జాలి కాదు? 

వారికి కొండంత ధైర్యాన్ని భరోసానిద్దాం !!

 -పరాంకుశం రఘు నారాయణ 

          మహబూబాబాద్ 

చరవాణి సంఖ్య:9949749987

4

[03/12, 8:57 PM] Sandya Sharma Poetess: కవితాగానం


వై.కె.సంధ్యశర్మ


******************


అంశం: దివ్యాంగులు


శీర్షిక  : *మార్గదర్శం*


*****************


ఓ వికసించే పుష్పమా

పొత్తిళ్ళలోనే సన్నగిల్లి

ఒడిచేరిన నలుసుగా

నలుగురిలో నగుబాటు

పడలేక కలత చెందకు!


నీ చెదిరిన గుండెకు

నిస్సత్తువ నీరు పోయక

ప్రభాత కిరణ జ్వాలలను

నింపుకుని

దిగులు పడిన మబ్బులను

చెరిపేయ్


దరి చేరని దిశలను కలిపేయ్!

లోపం ఒక నెపం మాత్రమే

లోలోని ఆశలకు 

కన్నీటి బిందువులు 

కానీయకు ఆటంకం!


నీ కళ్ళలో కనిపించే శూన్యాలన్నీ

ఇంద్రధనుస్సుల రెక్కల

తీరంగా శోధించు!


నీ మాటరాని మౌనాన్ని వీడి

దిక్కుదిక్కులా దివ్యగీతాలాపనై

స్వచ్ఛ కౌముదిలా సాగిపో!


నీ వినిపించని 

విశ్వరహస్యాలన్నీ

మంత్ర కవాటంలా

సెలయేళ్ళ గలగలల

చిహ్నపు చిరుగాలులను

హత్తుకో!


నలుదిక్కులా

నీ జాడే

అడుగు జాడై

జనులందరికీ

మార్గదర్శమై 

నిలిచిపో!!

**********************

5

🌞🌞🌞🌞🌞🌞🌞

[03/12, 9:00 PM] Vineelamma: కవితాగానం

పేరు: విజయదుర్గ

కవితా శీర్షిక : దివ్యాంగులు

కవితా సంఖ్య: 39

తేదీ: 03/12/20 


ఏ జన్మ ప్రారబ్దమో

బగవంతుని శాపమో

అంగవైకల్యం వారిజీవతాన

చీకటి దారుల తెరలే...!!


పొరపాటు గ్రహపాటు కానీక

ఆత్మస్థైర్య మే ఆయుధమై

పట్టుదలే ఆయువుపట్టు గ

మెరైకల్ చేసేను అద్భుతంగా....!!


అన్నీ ఉన్నా కుంచితమనసున

వైకల్యాల నదిలో మునుగేను

లోపాలేమైనా విశాలధృక్పథంతో

నింగినే వంచేరు....!!


అంగవైకల్యం విధిగీత

ఆదరించే మనసుంటే

అదే ఉత్సాహగీతిక

తోడుండు చేతనైతే 

విరచకు ఎగతాళితో జీవితం లో.....!!



                              🌹వినీల🌹

6

[03/12, 9:01 PM] Korada: కవితాగానం

అంశం :- * దివ్యా0గులు *

కోరాడ నరసింహా రావు ...!

       * అసాధారణ శక్తి *

          *************

పూర్వ జన్మ పాపమో....,

ఏ బాధాతప్తహృదయశాపమో

ఏదైతేనేం....ఈ శారీరక వైకల్యం...అవరోధం కాదు...

మనోధైర్యమూర్తులకు...!

ఆ దైవం కూడా...ప్రేమతో...

ఏదో ఒక అసాధారణ ప్రజ్ఞను

ప్రసాదించే తీరుతాడు!!

అన్ని అవయవాలూ సక్రమంగా

ఉన్నవాళ్లు సైతం చెయ్యలేని

అద్భుతాలు చేసి చూపి... మే

మేవరికీ తీసిపోమని నిరూపి0 చు కున్న సంఘటనలెన్నో...!ఏలోపమూ లేకపోయినా...

ఆత్మ న్యూనతా భావమున్న వాడు ఎందుకూ కొరగాడు!

లోపమున్నా...కార్యదీక్ష,పట్టుదలలుంటే...దేనినైనా సాధించగలడు...!

అటువంటి వాళ్లకు కావలసింది

నీ దయ,సానుభూతి కాదు...!

మానవతతో...ప్రోత్సాహక,సహకారాల నందించు....!!

************************

........కోరాడ.

7

[03/12, 9:04 PM] Anitha Aitha Poetess: *కవితాగానం*


శీర్షిక: *మనో వికారాన్ని మాన్పుకుందాం..!*


కుళ్లుబుద్దుల కుటిలవర్ణాలను హృదయకాన్వాసుపై అద్ది..

ఈర్ష్యాశ్వాసలను ఊపిరితిత్తులనిండా నింపుకొని..

మంచితనపు ముసుగును ముఖానికి తొడిగిన మానవమృగాలెందరో...!


పాపపుకాంక్షలను కంటిరెటీనాలో నిలుపుకొని..

చూపుల కత్తెర్లకొసల్లో నీచపుకామాన్ని స్రవిస్తూ...

మనగడసాగిస్తున్న మేకవన్నెపులులెందరో...!


దగాకోరలను చాచి దౌర్జన్యపు విషం చిమ్ముతూ..

ఆధిపత్యపు  ఇనుపపాదాలకింద అమాయకులను తొక్కే

ఊసరవెల్లుల వారసులెందరో..!


మదిలో రగులుతున్న ఆవేదనజ్వాలల్లో దహించుకుపోతున్న మార్థవమనసులకు ఓదార్పెక్కడిది..?


ఆనందపువెన్నెల్లను తాగి దుఃఖపు అమాసచీకట్లను మిగిల్చే స్వార్థపు పురుగుల పుట్టుక కన్నా...

ఊపిరి గొట్టాలను తెగ్గోసే అసూయపరుల మనోవైకల్యపు పదునైన గొడ్డళ్లకన్నా..

అంగ వైకల్యపు ఆత్మస్థైర్యపు దివ్యాంగులే మిన్న!


అంతఃవికారులైన పశుత్వపు బతుకుపాటలకు చరమగీతం పాడుతూ..

మానవత్వపు పచ్చటివిత్తుల్ని ఎదమన్నులో విత్తుదాం!

సద్భావపు సుందరసుమాలను వికసింపజేద్దాం!

మనోవికారాన్ని మాన్పివేస్తూ....

ఆత్మసౌందర్యానికి అంకురార్పణ చేద్దాం!!


రచన

అయిత అనిత

8985348424

జగిత్యాల

8

[03/12, 9:15 PM] Dhanasi Usha Rani Poetess: కవితా గానo

అంశం.దివ్యాoగులు


......

ప్రపంచములో  ఎన్నో అద్భుతాలు

ప్రకృతిలో ఎన్నో వినోదాలు

చూస్తూ మురిసేటి మనుషులు కొందరూ

శాపములా వెంటాడే కుంటే గుడ్డీ మూగ మనుషులు ఎందులో భువిలో


మానవత్వం మరిచి అలుసుగా

చూస్తూ

మదిని చిన్న బుచ్చే మనుషులుకు కనువిప్పు కలిగేది ఎన్నడూ


జాలి కరుణతో సానుభూతి కలిగి వుండటం

మనిషిగా బ్రతుకనివ్వడము 

అందరీ బాధ్యతగా గుర్తుంచుకోవాలి

ఆత్మ సౌంధర్యమే నిజమైన అందమని యెరిగి

పశువులా ప్రవర్తన చేయడము మానివేయాలి


ధనాశి ఉషారాణి

చిత్తూరు జిల్లా

9

[03/12, 9:20 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏 సుధారాణి కృష్ణంరాజు🙏

*అంశం*దివ్యాంగులకు చేయూత నిద్దాం

*మనసు లేని మనుషులకన్నా

అంగం వైకల్యం ఉన్న వికలాంగులు చాలా మిన్న

తమ జీవితాలను చూసి జాలిపడి  కళ్ళు ఉండి కూడా

పట్టించుకోని వారు గ్రుడ్డివారు

మానసికంగా వారి స్థితి గతులను చూసి ఏమాత్రం

దయలేని సమాజం చూసి

వారు పడే వేదన చెప్పడానికి

భాష చాలదు

అక్కున చేర్చుకుని ఆదరించే వారు లేక కాళ్ళు లేకున్నా

కళ్ళు లేకున్నా ఏ అవయవం పని చేయకున్నా తోడు ఎవరు లేరు, మాకు మేమే అన్న ఒకే ఒక కారణం వారిలో ఆత్మవిశ్వాసం నింపి జీవితంలో

ఎదురయ్యే అన్నింటిని ఎదుర్కొనే శక్తి కలిగిన వారు

నేటి సమాజంలో ఆ లోపాలను

ప్రక్కన పెట్టి తమకు అభిరుచి గల రంగంలో వారు కూడా

రాణిస్తున్నారు

జాలి మాత్రమే చూపించడం

సరికాదు వారికి అవసరమైన

వాటిని సాధించడానికి అందరు

సహకరిస్తే దివ్యంగులు కారు

దేనికి అనర్హం అని వారు కూడా

ఉల్లాసంగా ఉండటానికి మనం

వారి పట్ల చూపించే అనురాగం

వారికి బలం చేకూరుస్తుంది

ఎన్నో ప్రత్యేక పాఠశాలలు ప్రభుత్వ పథకాలు వారికి

కొండంత అండగా ఉండి

దివ్యాంగులకు చేయూత నిస్తున్నాయి

దివ్యాంగులను మానవత్వం తో 

ఆదరిద్దాం దివ్యమైన వ్యక్తులుగా ఎదగుటకు ప్రోత్సాహం అందిద్దాం🙏🙏👍

10

కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..వైకల్యం

శీర్షిక...ఆదర్శ మూర్తులు



వైకల్యం వెక్కిరించినా

సమాజం చిత్రంగా చూసిన

మొక్కవోని ధైర్యంతో

ఆత్మ విశ్వాసంతో

అకుంఠిత దీక్షతో

ఆశయ సాధనలో

వెనుకడుగేయని సైనికులు

వికలాంగులనే తలంపే రానియక

విధిని ఎదిరించి నిలిచిన విజేతలు

వైకల్యం శరీరానికే కాని

మనసుకు కాదని ఋజువు చేస్తూ

అత్యున్నత శిఖరాలు అధిరోయిస్తున్న ఆదర్శమూర్తులు

అడుగడుగునా అవమానములు ఎదురైనా

అవహేళనకు గురియైనా

బాధలన్నీ మౌనంగా భరిస్తూ

దృఢ నిచ్చయంతో ముందుకు సాగుతూ

లక్ష్యాన్ని చేరుకొని

చీకటిలో చిరుదివ్వెలా వెలుగు నిస్తూ

మెల్లగానైనా ప్రగతి పథంలో పయనిస్తున్న వారి ప్రతిభా పాటవాలు ఎందరికోస్ఫూర్తి

ఆదరించుదాం దివ్యా0గులను

మానవత్వ మున్న మనుషులుగా 

సమతా మమతలు పంచుదాం

11.

*దివ్యాoగులు**

**************

పుట్టుకతోనో ప్రమాదవశాత్తో

దురదృష్టాన 

దేహాన చిరు లోపాలున్నా

సంకల్పం దివ్యంగా ఉన్నవారు

దివ్యాoగులేగా!


ఒక అవయవాన కొంత

అవకారమున్నా 

మిగిలిన విషయాల్లో

చురుగ్గా అబ్బురపరిచే

ప్రజ్ఞ చూపేవారు ఆదర్శులు


ఒక హె లె న్ కెల్లర్ 

ఒక సుధా చంద్రన్

ఒక అల్వా ఎడిసన్

ఒక మిల్టన్...

ఎoదరెoదరో

తమ లోపాన్ని మరచి

అఖండ విజయాలను

సాధించిన శక్తివంతులు


కార్యసాధకులు ఎ వ్వరూ 

సరిగ్గా లేని అవయవం గురించే

ఆలోచిస్తూ కూర్చోరు.

అనుకున్న ఆశయాన్ని 

సాధించకుండా విశ్రమించరు


అన్ని అవయవాలు బాగుండి

ఆలోచనలు వక్రంగా ఉన్నవారు

సమస్యలను ఎదుర్కొలేనివారు

ఆశయాలు లేని ఆవారాగాళ్ళు 

అసలు వికలాంగులు


దివ్యాoగులకు కావాల్సింది

పెదవులు పలికే సానుభూతి కాదు

సహృదయ సహకారం

హృదయ పూర్వక మమకారం


వల్లాల విజయలక్ష్మి

ఆలేరు




Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

పౌర్ణమి 052022 జాతీయ పతాకం

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ********************** కవివరుల జాబితా 1.కోరాడ నరసింహారావు గారు 2.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 3.జోషి పద్మావతి గారు 4.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 5.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 6.శివ చరణ్ నాయుడు తరాల 7.గొర్రెపాటి శ్రీ ను గారు 8.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు 9.డా.కమలా దేవి గారు 10.అపరాజిత్ గారు 11.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 12.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు 13.కవిత వెంకటేశ్వర్లు గారు 14.డా.బల్లూరి ఉమాదేవి గారు 15.డా.వేమూరి సత్యవతి గారు 16.బొప్పెన వెంకటేశ్ గారు 17.తిప్పా వఝల నరసింహ మూర్తి గారు 18.మద్ది పుల్లారావు గారు 19.టేకుమళ్ళ విజయ లలిత గారు 20.పిన్నక నాగేశ్వరరావు గారు 21.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 22.దారల విజయ కుమారి గారు 23.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు 24.పొర్ల వేణు గోపాల్ రావు గారు 25.సింహాద్రి వాణి గారు 26.వురిమళ్ళ సునంద గారు 27.తరణికంటి సూర్య లక్ష్మి గారు 28.తోట సులోచన గారు 29. వేదాంతం సురేష్ బాబు గారు 30.మన్నె లలిత గారు 31.గజవెళ్ళి శ్రీనివాసా చారి గారు ************************ 1 వైశాఖమాసం పౌర్ణమి కవితల పోటీకి :-  అంశం :- భ...

పర్ణశాల 27052022

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ***************** కవితా గానం సీజన్ 3 నేటి అంశం 27.05.2022 *పర్ణశాల* రాత్రి ఎనిమిది నుండి  తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆసమయంలో ఎలాంటి ఇతర స్పందనలు  తెల్పకుండా సహకరించగలరు. కవి వరుల జాబితా 1.ఆపరాజిత్ గారు 2.కవిత వెంకటేశ్వర్లు గారు 3.కోరాడ నరసింహారావు గారు 4.ఏడెల్లి రాములు గారు 5.వురిమళ్ళ సునంద గారు 6.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 7. కందూరి సుజాతా రాణి గారు 8.వేమూరి సత్యవతి గారు 9.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 10.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 11.తంగిరాల నాగ లక్ష్మి గారు 12.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 13.వీరా గుడిపల్లి 14..శివునూరి లలితా కృష్ణ గారు ************** 1 పర్ణశాల కఠోర దీక్షా సంపన్నులు రామ లక్ష్మణ సీతా తపోదనులు సత్పురుషులతో సీతామాత సాంగత్యం కడు రమణీయం రామలక్ష్మణులు అరణ్యవాసంలో తగు జాగరూకతతో నిర్మించుకొనిరి పర్ణశాల దుష్ట దుర్మార్గ పన్నాగంలో భాగంగా బంగారు మాయలేడితో రామలక్ష్మణులను దారిమళ్లించి రావణాసురుడను రాక్షసుడు సీతమ్మపై కన్ను మిన్ను కానని కండకావారంతో కామం ఎంత బలీయమైనదో అంతటి విధ్వంసానికి దారితీస్తుంది ఆ ద...