Skip to main content

Bharath bandh /రోలత్ చట్టం 2020

ADMIN

 shivunoori Lalitha krishna

veera gudipally

***********************************

1.కోరాడ నరసింహారావు గారు

2.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు

3.కెసి నరసయ్య గారు

4.ధనాశి ఉషారాణి గారు

5.సుధారాణి కృష్ణం రాజు గారు

6.నారాయణ భాగ్యలక్ష్మి గారు

7.దీపక్ న్యాతి గారు

8.సర్ఫరాజ్ అన్వర్ గారు

9.పరాంకుశం రఘు నారాయణ గారు

10.శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని గారు

11.మర్రి జయశ్రీ గారు

12.మన్నె పిన్నక లలిత గారు

13.సునంద వురిమళ్ళ గారు

14.వల్లాల విజయ లక్ష్మి గారు

15.భరద్వాజ రావినూతల గారు

16.కెసి నరసయ్య గారు

17.సుధారాణి కృష్ణం రాజు గారు

18.మన్నె పిన్నక లలిత గారు

19.మన్నె పిన్నక లలిత గారు

20.ధనాశి ఉషారాణి గారు

21. మర్రి జయశ్రీ గారు

22.కోరాడ నరసింహారావు గారు

23.సునంద వురిమళ్ళ గారు

24.కొలచన విజయ భారతి గారు


*****************************************

1

[08/12, 8:08 PM] Korada: కవితాగానం.,వచనకవిత

నేటి అంశం :-@భారతిబంద్@

  కోరాడ నరసింహా రావు...!

గోరుచిట్టు పై రొకటి పోటా...!?

 **********************

ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో....

ప్రజాభీష్ట ప్రతికూలత పొడ సూ

పితే...,నిరసనల నినాదాలు...,

ఉద్యమాలు-ఊరేగింపులు...

రాజ్యాంగం కల్పించిన హక్కే...

కావచ్చు...!

పాలకుల విచక్షణా రహిత... హటా త్ నిర్ణయాలతో...

ప్రజలకు తప్పటం లేదు అగ చాట్లు....!

 పరిస్థితి విషమించక ముందే

పరిష్కరించాల్సింది పోయి...

 హాస్య చిత్రాన్ని చూస్తూ వినోదించే...ఈ విధానమేంటో!

మంకు పట్టు...పాలక పక్షం !

అవకాశం చిక్కిందనుమునే...

ప్రతి పక్షం...!!

సందు దొరికితే...అరాచక శక్తుల ఆగడాలు...!

హింసాదౌర్జన్యాలు...,ప్రభుత్వ

ఆస్తులకే కాదు...వాటిల్లుతున్న

తీరని నష్టాలు...!!

 ఎవడి ఒడుపు వాడిది...!

ఎవడిది మాత్రం ఏం పోతుంది

పోయేది...ప్రజాధనమే కదా..!

ప్రతి దానికీ...భారత్ బంద్..!

ఇదో...ఫేషనై పోయిందిరా...

రామా....!!

మూలిగే నక్కపై తాటిపండు

పడ్డట్టు...నేటి కరోనా గోరుచుట్టు పై భారత్ బంద్..

రొకటి పోటా....!?

**********************

........కోరాడ.

2

[08/12, 8:15 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: భారత్ బంద్

రైతు కష్టాలు ఎన్నో ఉన్నాయని

కొత్త చట్టాలు తెచ్చి కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ రైతు బ్రతుకును


ఏమి బ్రతుకు ఏమి బ్రతుకు అన్నా

రైతన్న నీది అప్పులపాలై

నిలువదే చేద్దామనుకుంటే

ఆరుగాలం ఫలసాయం

వీలు కాదు నీ కన్నా కష్టాల జీవితం అన్నా అన్న రైతన్న ఏమి బ్రతుకు


బ్రతుకుదెరువు అడ్డగోలు వ్యవసాయం వదిలిపెట్టి


అష్టకష్టాలు పడి నీవు బిడ్డ పెళ్లి చేస్తే నువ్వు అప్పులపాలై తీర్చలేక గొడ్ల చావడిలో ఉరితాడు చేసుకుంటూ


ఏమి బ్రతుకు ఏమి బ్రతుకు అన్నా రైతన్న నీది బ్రతుకు బ్రతుకు కన్నీళ్లు

కన్నీళ్ల బ్రతుకు కన్నా


నిన్ను మట్టిపాలు చేస్తున్నారన్న

చివరకు నీకు ధర రాలేదని

చేనంతా చీడపురుగు చేరి తే


పంటంతా కాల పెడితే

నువ్వు ఆదుకునే బ్రతుకు ఏదన్నా


పన్ను కట్టలేక పైసలు కట్టాలి లేక


తాకట్టు పెడితే రైతు నీవు


ఆ దేవుడే లేకపాయే పై అధికార పార్టీ అందుకునే శక్తి లేకపాయె

రైతు భారత్ బంధు పెట్టి

లాఠీఛార్జి చేసిరి కంచె వేసి రాకుండా అరెస్టు చేసిన చప్పుడు చేయక పోతే


రైతన్న నీది ఏమి బ్రతుకు ఏమి బ్రతుకు అన్నా నా బ్రతుకు ఎట్టి బ్రతుకు

భారత్ బంద్ పెట్టక తప్పదు లేదయ్యా రైతు నువ్వు అందరూ నీకు సపోర్ట్ చేసి

రైతన్న నీది బ్రతుకు జూదం


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

3

[08/12, 8:51 PM] KC Narsaiah KS 26: కవితా గానం

 అంశం: భారత్ బంద్

 పేరు: కేసి నరసయ్య

 చరవాణి: 7981814784

 శీర్షిక: నిరసన అస్త్రాలు



 అత్యున్నత ప్రజాస్వామ్య దేశం

 పాలకులకు చుట్టాలవుతున్న చట్టాలు

 పాలకవర్గాల నియంతృత్వ పోకడలపై

 రగులుతున్న నిరసన జ్వాలలు

 అప్రజాస్వామిక పాలనలపై ఆందోళనలు

 ప్రజల హక్కుల ఉల్లంఘనలపై గళమెత్తున్న జనం

 స్వాతంత్రోద్యమంలో ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఆగ్రహజ్వాలలు

 ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు

 పాలకులు ప్రజలపై మోపుతున్న ఉక్కు పాదాలను

 తిప్పికొడుతున్న ప్రజల మహా ఉద్యమాలు

 ప్రభుత్వచట్టాల ఉరిలో అన్నదాతలు

 పాలకవర్గాలపై ప్రజల పోరాటాల అస్త్రాలు 

 దీక్షలు బందులు రాస్తారోకోలు ధర్నాలు ఆందోళనలు

 కుప్పలు తెప్పలుగా సమస్యల సుడిగుండాలు

 నిరాదరణకు గురవుతున్న ఉద్యోగులు

 ఆదరణ కోల్పోతున్న విద్యార్థులు

 గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కుతున్న  రైతులు

 ఉద్యోగాలు దొరకక నిరుద్యోగుల నిరాహారదీక్షలు

 సమస్యల పరిష్కారానికై ఏకైక మార్గం

 ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన బాట

4

[08/12, 8:58 PM] Dhanasi Usha Rani Poetess: అంశం.భారత్ బంద్

........

అలుపెరగని నిత్య శ్రమజీవి

భూమాతను నమ్ముకోని

నిత్యం తపిస్తూ అలా శ్రమిస్తూ

ప్రకృతి చూపే వైవిధ్యాలకు అతలాకుతలం అవుతూవుంటే

మూలిగే నక్కపైవతాటికాయ పడ్డట్టుగా

ఏ సి గదుల్లో కూర్చోని కొత్త చట్టాలు తెచ్చే పాలకులకు

తెలియదులే రైతన్న కష్టాలు 


ప్రతి బంద్ వెనుక ప్రజల వీపుపై కష్టాలే అని తెలియని వైనం

హక్కులు సాధించు కోవడము అందరి బాధ్యత అంటూ

రాజకీయాల ఎత్తుగడలో

చిద్ర మవుతున్నాయి సగటు బతుకులు అంతే మరి

దేశానికి వెన్నుముక రైతన్న 

అందరూ బాగుండాలి అంటే

రైతు బిడ్డ న్యాయమైన హక్కులుపై హామీ పొందాలి

దేశం నిత్యం అభివృద్ధిలో నిలవాలి గెలవాలి


డి.ఉషారాణి

5

[08/12, 8:59 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏 సుధారాణి కృష్ణంరాజు🙏

*కవితాంశం*భారత్ బంద్*

08-12-2020(మంగళవారం)

భారత దేశం విభిన్న భాషలు

విభిన్న సంస్కృతులు ఆచారాలు సంప్రదాయాలు

ఎన్ని ఉన్నా భాష ఏదైనా

భావం ఒకటే అన్న విధంగా

వసుదైక కుటుంబంలా కలిసి

జీవనం సాగిస్తున్నారు

వివిధ పార్టీల అవతరణ

దేనికి అదే గొప్పగా ప్రచారాలు

వనరులు ఉన్న వినియోగించు లేని పరిస్థితి

ద్రవ్యోల్బణంతో సామాన్యుల జీవితాలు కనీస అవసరాలు

తీరక కటిక దరిద్రం అనుభవిస్తుంటే నిరుద్యోగంతో

యువకులకు ఉపాధి లేక అల్లాడుతుంటే

ఏటికేతం బట్టి వెయి పుట్లు పండిస్తే ఎన్నడు మెతుకెరుగ మన్నా అని ఒక మహానుభావుడు అప్పుడే

రైతుల కష్టాలను చెప్పారు

ఇవన్నీ కాకుండా ఏ సమస్య

వచ్చిన బంద్ లు నిరసనలు

రైలు రోకోలు ఇవన్నీ చేయడం

వలన సమస్య పరిష్కారం అవుతుందా ఒక రోజు బంద్ తో ఎన్ని కోట్ల నష్టం

ప్రజాధనం కోల్పోతే పన్నులు

భారం ప్రజలమీద ప్రాంతంలా

వారిగా ప్రాంతీయ పార్టీల అవతరణ భారత్ బంద్ ముఖ్య ఉద్దేశ్యం రైతుల సమస్యలే అయితే పరస్పర

విమర్శ లకన్నా ప్రజా క్షేమం

మిన్నా అనుకుంటే

సామరస్యం గా ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి చర్చలద్వారా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు

అతీతంగా సమైక్యంగా ‌పోరాడి

సాధించాలి

భారత దేశం ప్రజాస్వామిక దేశం ప్రజాసంక్షేమం దేశ సంక్షేమం

ఆ విలువ లకు కట్టుబడి ఉంటే

భారత మాత బంధనాల నుండి

విముక్తి అవుతుంది భారత్ బంద్ ల వలన పార్టీ ల అవతరణ వలన ఫలితం శూన్యం🙏🙏👍

6

[08/12, 8:59 PM] Bhagya Laxmi Kanipakam Poetess KS 42: కవితా గానం


భారత్ బంద్ 

***********

నేటి భారత్ బంద్ తో 

నేడు రైతన్న బందీ

కాకుండా తమ భవితవ్యాన్ని 

కాపాడుకును సాధన సూత్రం

సమకాలీన సమస్యల 

సమైక్యత రాగమే భారత్ బంద్

నీతి గతి తప్పినప్పుడు 

న్యాయానికి అన్యాయపు 

పొరను పులిమినప్పుడు 

సమతా మమతల స్నేహ గీతిలో 

సమరస రాగం శృతితప్పినపుడు 

తప్పదు చైతన్య శాంతి పథం

తల్లి పాలును తాగినంత తాగి 

రొమ్మును కర్కశంగా గుద్దినట్లు 

ఏరు దాటి తెప్ప తగలేసినట్లు 

అందరి ఆకలితీర్చే అన్నపూర్ణకు

ఆకలిమంటలు కల్గించినప్పుడు

తప్పదు తప్పదు భారత్ బంద్

అన్నంపెట్టే చేయ్యే అణిచివేతకు  గురైనప్పుడు అధికార మధంతో

అన్నదాత విలువ మరచినప్పుడు

దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు పల్లెటూర్లు దేశానికి వెన్నెముక రైతన్న అను

నినాదాలు ఉత్తుత్తి వాదాలైనప్పుడు అమృతహాస్తంపై విషం చిమ్మునప్పుడు

అధికారపీఠాల చలనం మలినమైనప్పుడు

సంభవామి యుగేయుగే యను రీతిగ

మతిలేని అతిపై నియంత్రణ మార్గమై

జన ప్రభంజన విస్తృత విప్లవంమై

ఉద్భవించి విజృంభించే తిరుగులేని 

రామ అస్త్రమే ఈ భారత్ బంద్. 

రచన:నారాయణ భాగ్యలక్ష్మి,

7.

*కవితా గానం*

తేది : 08-12-2020

పేరు : డా.దీపక్ న్యాతి

అంశం : భారత్ బంద్

శీర్షిక : భ్రమ తోలగాలి


స్వతంత్రాన్ని తిరిగి పుచ్చుకున్న

భరతావని స్వపరిపాలనతో

ఏడు పదుల ఏళ్ళు దాటిపోయింది

సుపరిపాలన అందిస్తున్నామని

ప్రపంచంతో పోటీ పడుతున్నామని

ప్రగతిపథాన పయనిస్తున్నామని

అందరూ చెబుతూనే ఉన్నా

దాగుడుమూతల దోబూచులాటలా వుంది.

మొన్నటి వరకు భ్రమలలా కొన్ని

ఎప్పటికీ అతిథిగా రాష్ట్రం మేంటి

సమాజాన వ్యక్తిగత చట్టమేంటి

పలుకులతో విడిపోవడమేంటి

ఇరుగు పొరుగు శత్రువులు

మాటిమాటికీ భయపెట్టడమేంటి

చక్కదిద్దే ప్రయత్నము

అంకురార్పణం జరుగు తరుణం

రైతన్నకు కావాలి స్వతంత్రం

తను పండించిన పంట ధర

తనే నిర్ణయించాలి ధర్మం

గిట్టు బాటు వస్తేనే గట్టు నుండగలడు

యంత్రాలనెదిరించాము

అంతర్జాలాన్నెదిరించాము

భ్రమతో ఎన్నెన్నో ఎదిరించాము

నేడు భారత్ బంద్ అనేదిరిస్తున్నాము

డా.దీపక్ న్యాతి

హైదరాబాద్

8

నేటి అంశం: భారత్ బంద్ 

🌸 *మట్టితల్లి ముద్దుబిడ్డ..*🌸


ఋతువుల్ని లెక్కించక

రేయింబవళ్లని కనిపెట్టక

పొద్దుపొద్దున్నే పొలానికెళ్ళి

సద్దన్నం తిని పొద్దస్తమానం శ్రమించి 

పంటలకై నానా తంటాలు పడతాడు


నిరంతరం నేలతల్లిని నమ్ముకుని

విత్తుతో పొత్తు నెరిపి

దొరికితే ఎండు రొట్టెముక్కలతో 

లేదంటే నీళ్లతో ప్రేవుల్ని తడిపి

చెమట చుక్కల్లో తడిసి మొలకెత్తిన పైరును చూసి పుత్రవాత్సల్యంతో మురిసిపోతాడు


తట్టాబుట్టలలో ఆహారోత్పత్తిని ముడేసిగట్టి

కనుసన్నల్లో సన్నాల్ని పండించి

ఆకలిని తీర్చేమంత్రమేసి శతాబ్దాలుగా 

ఈ లోకం యొక్క ఆకలిని తీర్చుతూ యుగయుగాలుగా మట్టితల్లినే నమ్ముకుంటాడు


అమాయక రైతన్ననందరు

ప్రతి జాగాలో దగా చేసే దగాకోరులే

*కొత్త చట్టాలెన్ని తెచ్చిన అవన్నీ*

*కార్పోరేట్ సంస్థలకు ఆత్మీయచుట్టాలే*

కొలతల్లేని నిస్వార్థంతో శ్రమించే

అన్నదాతలకు తుదకు మిగిలేది *కేవలం కాలం పెట్టె వాతలే*


నేడు *కొడవలి* కపటాన్ని తెంచడానికి

*నాగలి* నమ్మకద్రోహుల డొక్కల్ని 

చీల్చడానికి ఎత్తబడింది

పొలంలో ఒడుపుగా కలుపుతీసే చేతులు నేడు *సమాజంలో పేరుకున్న కలుపును* వేర్లతో సహా పెకిలించి తమ జీవితాల్ని మలుపు తిప్పే ప్రయత్నాలు చేస్తున్నాయి

*సర్ఫరాజ్ అన్వర్..✍🏻

9

*కవితా గానం* 

.  తేది :8/12/2020

 . అంశం :భారత్ బంద్ 

*****************************

    *శీర్షిక :రైతు జీవన వైచిత్య్రం* 

*****************************

నేటి రైతు ఆరుగాలం కష్టపడుతున్నాడు!

మొస తిరుగని కష్టం ఆయనది !

రెక్కాడినంత కాలమే ఆయన పొట్టనిoడేది !

విశ్రాంతి ఎరుగని నిరంతర శ్రమజీవి ఆయన !

ఒళ్ళు గుల్ల చేసుకుని కాలానికి ఎదురీదుతూ..., 

 ఎన్నో? ఎన్నో?? ఆటంకాలు అధిగమిస్తూ.., 

 బతికినంతకాలం కష్టాలను భరిస్తూ.., 

గ్యారెంటీ లేని జీవనo లోనే చితికి పోతున్నాడు!

రైతే రాజన్న పొగడ్త ఆయనకింకా చేరనే లేదు!

 గోడమీది రాతలుగా  

వెలసిపోతున్నాయి !

గోడమీది పిల్లులోలే వల్లించిన   నాయకుల మాటల బాకాలు? 

 ఈ నాటికి వెల వెల బోతున్నాయి !

 ఎక్కడైనా? కనీసం కలలో నైనా..., 

 బలిసిన రైతుల జాడేది? 

ఆ పూసేది? 

ఆయనపై జాలి కాదు కదా కొరడా ఝళిపిస్తున్నారు !

రైతు జీవితం నేడు నడి బజారు లో వింత సరుకైంది !

ఆయన బతుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్టుoది? 

అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉoది ఆయన బతుకు చిత్రం? 

 ఆయన జీవనం అగమ్యగోచరం!

 ముమ్మాటికీ..., ఆగమాగం రైతు జీవనవైచిత్య్రం !!

************************

-పరాంకుశం రఘు నారాయణ జిల్లా :మహబూబాబాద్ చరవాణి సంఖ్య:9949749987

10

కవితాగానం 

తేదీ :08/12/2020

అంశం :భారత్ బంద్ 

నేను సైతం 

 పేరు:శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని 

 శీర్షిక: తీర్చలేని రుణం


 గుచ్చుకున్న చినుకు నుండి విత్తనాన్ని వెలికితీసి

 నారవుతుంది పైరవుతుంది 

 ఆకలి కడుపును నింపుతూ

 కంచంలో మెతుకవుతుంది


 పొలాన్నీ,   హలన్నీ, నమ్ముకుని కాలాన్ని, 

 ఎదురీతలగమనాన్ని,  ఎదకోతల  వైనాన్ని

 తనువులోన అణువులోన మట్టి కణములోన

 మట్టి పూసుకున్న మనిషి లోన

 కదిలే మేఘం కురిసే కన్నీటిలోన


 ఆశగా ఎదురు చూసినఆ  కోడి కూత యంత్రం

 ఎరిగింది ఒకటే ఆకలి తరిమే సూత్రం

 లాభాలకు శలభాల్లా దళారులువస్తే

 దేశానికి వెన్నెముకకు వెన్నువిరిస్తే 


 విప్పారిన గుండెల్లో వెతికావా  చినుకు కోసం

 రాలిన స్వేదబిందువు లో చూసావా మెతుకు కోసం

 ఆ ధాన్యం అతని ధైన్యం  సాయం శూన్యం

 తీర్చలేని ఆ రుణం 

 తీర్చలేరు ఈ జనం

11.

కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..భారత్ బంద్


మట్టినే నమ్ముకున్న మట్టిమనిషి

ఎండకు ఎండుతూ

వాన,చలిని లెక్కచేయని సైనికుడు

శ్రమనే నమ్ముకొని

స్వేదం చిందిస్తూ

చీడ పీడలు ఆశించినా లెక్క చేయక

లోకానికి అన్నం పెట్టాలన్న లక్ష్యంతో

ఆత్మస్థైర్యం ఆయుధంతో

సమస్యలను అధిగమిస్తూ సాగిపోయే అన్నదాత

ప్రభుత్వం తెచ్చిన కొత్త రైతు చట్టాలతో

పాలకుల నిర్లక్ష్యపు నిర్ణయాలతో సతమైపోతూ

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించ నోచుకోలేని స్థితి

దేశానికి వెన్నెముక రైతున్న వెన్ను విరుస్తున్న వేళ

దళారుల చేతిలో

 దగా పడుతున్న రైతన్న పిడిలి బిగించి 

దిగాడు పోరాటానికి

హాలమెత్తి,గళమెత్తి 

ఆవేదనతో అడుగుతన్నాడు

ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కుతోనే

న్యాయం కోసం పోరు బాట పట్టాడు.

నిలిచింది అండగా సమస్త ప్రజానీకం

12

కవితాగానం 

తేదీ :8/ 12 /20 

పేరు :మన్నె పిన్నక లలిత 

అంశం :భారత్ బంద్ 

శీర్షిక :అన్నం పెట్టే చెయ్యి

 ఏ దేశం ప్రగతి పథాన పయనించాలన్నా

 ఆ దేశ ప్రగతికి జీవగర్ర రైతే

 అతివృష్టి అనావృష్టి లతో సగం చచ్చిపోయిన రైతు

 మంచి విత్తనం దొరక్క పంట పాడైన రైతు

 దళారుల చేతుల్లో మోసపోయిన రైతులు 

ఆరుగాలం శ్రమిి స్తూ ఆదరణ లేక

అనాధలా రోడ్డున పడి 

అన్నంపెట్టే రైతే అన్నమో రామచంద్ర 

అనుకుంటూ  రోడ్డు   ఎక్కే  పరిస్థితి దాపురించింది నేడు

  తన భూమి తను పండించుకోవడానికి కొత్త చట్టాలు

 కొత్త మార్పులు తీసుకొచ్చే ప్రభుత్వాలు తనకెందుకు

 తన మానాన తను బ్రతకనివ్వరా

 కడుపు కాలిన రైతు భారత్ బంద్ చేయటం  సబబే

 రైతే రాజు ఆ నాడు... రైతే రోడ్డు నెక్కాడు ఈనాడు 

అన్నదాతకే సంకెళ్ళు

  అన్నదాతకె ఆదరణ కరువు 

ఆత్మహత్య అపరాధమని   న్యాయం అడిగితే 

ఈ శిక్షలా

 రైతు లేనిదే అన్నం లేదు

 అన్నం లేనిదే రాజ్యం లేదు

 ఆదరణ లేని రైతులను ఆదరించి ఆదుకోవడమే ప్రభుత్వాల లక్ష్యం

  నాగళ్ళకు కొడవళ్ళకు సంకెళ్ళు వేయకండి

 అలా అయితే పుట్టగతులు లేని ప్రభుత్వాలు అవుతాయి

13

*కవితా గానం*

తేదీ:08-12-2020

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: భారత్ బంద్

**********************

ధర్యాగ్రహం పిడికిలెత్తింది!

అన్నం పెట్టే ఛెయ్యి హక్కులకై ధ్వజమెత్తింది!

మట్టితల్లి స్పర్శతో పునీతమయ్యే పాదాలిప్పుడు

చట్టాల ఉపసంహరణకు

ఢిల్లీ రోడ్ల మీద వరదల్లా ప్రవహిస్తున్నాయి!

ఎండిన డొక్కలను డప్పుగా చేసి

దగా చేస్తున్న ప్రభుత్వానికి ధిక్కార స్వరాన్ని వినిపించాయి!

చట్టాల తడిగుడ్డతో బతుకు తెరువుకు

ఉరితాళ్ళు పేనుతున్న ప్రభుత్వాన్ని నిలదీస్తూ 

చట్టాల ఉపసంహరణ కోసం

ఇచ్చిన భారత్ బంద్

ఎవరి కోసమో కాదు

మనల్ని మనం గెలిచేందుకు!

 రైతు బాగుంటేనే మనం

బాగుంటామని తెలిపేందుకు

ఆకలి తీర్చే అన్నదాతలకు

మనం భరోసాగా నిలిచేందుకు..

14

*భారత్ బంద్*

**************

ప్రాణాధార ఆహారధాన్యాల

ఉత్పాదకులు రైతన్నలు

వ్యవసాయాధార ఈ దేశాన

అన్నదాతకెపుడూ ఆధ్వాన్నస్థితేనా?


మూడు కొత్త వ్యవసాయ చట్టాలు

బక్కప్రాణులపై బరువైన బస్తాలు

కనీస మద్ధతుధర ఊ స్ త్తని చట్టాలు

మంచి చేస్తాయంటె కలిగేనా నమ్మకాలు?


కార్పొరేటుశక్తులకు కొమ్ము కాస్తాయేమో

దళారులు కృత్రిమ ఆహారకొరత సృష్టిస్తారేమో

దేశఆహారభద్రతకే భంగం కలుగుతుందేమోనని

భయపడే ప్రజలకు భరోసానివ్వాలి ప్రభుత్వమే


రైతన్నను రాజును చేయకున్నా గానీ 

బొమ్మని చేసి ఆడుకోకుంటే చాలు

ధ్వజమెత్తిన ప్రజాభావుటాను గమనించి 

*భారత్ బంద్* విజయాన్ని గుర్తిస్తే మేలు

బంద్ ప్రగతి ప్రతిబంధకమే కాద


ప్రభుతవాహనాన్ని సరైనమార్గాన

నడిపే సాధనమౌను అపుడపుడు

మనసున్నవారు ఆ దారిన సాగేరు 


వల్లాల విజయలక్ష్మి

ఆలేరు

15


క🎊♈వితాగానం28🎊🌱

నేటిఅంశం *భారత్ బంద్ *

శీర్షిక -బ్రతుకుసమస్య  

నిత్యపనులకు ఆటంకం 

బ్రతుకుతెరువుకు కష్టం -

కుంటుపడుతుంది జీవనము -

అర్ధాకలితో అల్లాడతారుజనం -

ప్రాధమికహక్కులకు భంగం కలిగినప్పుడు -

స్వేచ్ఛాజీవితాన్ని అడ్డుకున్నప్పుడు -

జనాలకు బ్రతుకు భారమైనప్పుడు -

స్వార్థశక్తుల ఆగడాలు మితిమీరినప్పుడు -

ప్రజాస్వామ్యానికి విఘాతంకలిగినప్పుడు గుర్తొస్తుంది బందు -

స్వార్ధం అక్రమాలు చేసినప్పుడు -

ధరలు భరించలేనప్పుడు -

అత్యాచారాలు జరిగినప్పుడు -

చేసే ఈబందు -

రెక్కాడితేగాని డొక్కాడని బడుగుజీవులకు శాపం -

కారణం ఉన్నబందులకు అందఱూతెలుపుతారు హర్షం -

అనవసరబందులకు  జనం చెయ్యరూఆమోదం -

అమెరికాలోవానపడితే  ఇండియా లో గొడుగుపెట్టినట్లు -

ఒక్కోసారి నాయకులు ఎందుకుచేస్తారో తెలియదు -

పనిచేస్తేగాని బ్రతకలేనివారికి -

ఆపదలోఉన్నవాళ్లకు ఇబ్బందికలిగినప్పుడు -

ఎందుకుచేస్తారో తెలియనిబంధులు -

ఛిద్రం చేస్తాయి జీవితాలు  


ఇదినాస్వీయరచన 

భరద్వాజ రావినూతల ((RB)🖍️

కొత్తపట్నం 

9866203795

16

కవితా గానం

 9-12-2020

 అంశం: రౌలత్ చట్టం

 పేరు: కేసి నరసయ్య

 చరవాణి: 7981814784

  శీర్షిక:

 చట్టాలు పాలకులకు చుట్టాలు

 పాలకుడు తెల్లలోడైనా నల్లోడైనా

నల్ల చట్టాల రక్షణలో సాగుతున్న రాక్షసపాలన  అత్యవసర పట్టాల పై సమీక్షలు

17

[09/12, 9:29 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏🙏 సుధారాణి కృష్ణంరాజు🙏*నేటిఅంశం*రౌలత్ చట్టం*

09-12-2020(బుధవారం)

బ్రిటిష్ వారు సామ్రాజ్య వాద కాంక్షతో అనేక అరాచకాలకు పాల్పడి వ్యతిరేకంగా ఎన్నో సంస్కరణలు చేపట్టారు

1919లో ఈ రౌలత్ చట్టం చేశారు బ్రిటిష్ న్యాయ వాది

అధ్యక్ష తన ఏర్పడింది కనుక దీనికి రౌలత్ చట్టం అనిపేరు

దీనికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ అధ్యక్షతన సత్యాగ్రహ సభను ఏర్పాటు చేశారు

దీనిలో న్యాయ వ్యవస్థ కు అధికారాలు తగ్గించడం

ప్రభుత్వాలకు అధికారాలను పెంచడం

పత్రికా స్వేచ్ఛ ను హరించి వారిపై ఆంక్షలు విధించడం

దీనికి వ్యతిరేకంగా జలియన్ వాలా బాగ్ లో సమావేశం నిర్వహించారు డయ్యర్ కాల్పులు జరిపారు 

ఎంతో మంది భారతీయులను పొట్టన పెట్టుకున్నాడు

ఈవిధంగా జరిగిన దానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ తమ బిరుదు లను త్యజించారు 

విదేశీ వస్తువులను బహిష్కరించారు

1919 నుండి 1947వరకు గాంధీ యుగంగా పిలుస్తారు🙏🙏👍

19

[09/12, 9:29 PM] +91 74168 63289: కవితాగానం 

తేదీ :9/ 12/ 20 

అంశం :రౌలత్ చట్టం

 పేరు : మన్నె  పిన్నక లలిత


 ఆనాడు బ్రిటిష్ వారికి 


భారతీయులు చేసేవన్నీ నేరాలే ...విప్లవ నేరాలే


 అరాచక విప్లవ నేరాలు అరికట్టే చట్టం  

రౌలత్  చట్టం

  

వంద సంవత్సరాల నాటి చట్టం


 నేడు చర్వితచర్వణం


 బ్రిటిష్ ఇండియా చరిత్ర లో ప్రసిద్ధమైన

 కఠోర క్రిమినల్ చట్టం రౌలత్ చట్టం

19

[10/12, 8:03 PM] Korada: కవితా గానం

అంశం:-@ రౌలట్ చట్టం @

  కోరాడ నరసింహా రావు ...!

             * ప్రేరణ *

          ************

నిరంకుశ పరి పాలన తో

హద్దులుమీరెనుతెల్లదొరతనం

భారతీయుల ఆక్రోసం.....

పూరించెను విప్లవ శంఖం!


సహించలేని ఆంగ్లేయులు

నియంతృత్వ పరాకాష్ట తో...

ఉద్యమాల తలెత్తనీక....

తెచ్చిరహో రౌలట్చట్టం...!!


భారతీయులెవరి నైనా....

ఎక్కడైన... ఎప్పుడైనా....

విచారణకుతావీయక....

నిర్బంధించే నీచ శాసనం..!!


ఈ అణచివేత విధానమును

ఖండించిరి నల్లచట్టమని...

జాతికె అవమాన దినముగా

ప్రకటించి,నిరసనలుతెలిపిరి!


ఈ ఉద్యమ నాయకులైన...

సత్యపాల్...సైఫుధీను ల

అరెష్టులకు నిరసనగా...

జలియను వాలా బాగున....

ఏకమైరి జనులంతా....!!

సహించలేని ఆంగ్లేయులు...

అతి క్రూరుడైన డయ్యరుచే

మారణకాండనుజరిపించిరయో...!ఈ హఠాత్పరిణామా  నికి...పిన్నలు,పెద్దలు,వృద్ధులు

స్త్రీలు...హా హా కారములతోడ

ఆహుతి అయి పోయి రహో.!!


వొకేమారు...వేయి మందిని

బలి గొన్న ఈ దురంత మే...,

సంపూర్ణ స్వతంత్రో ద్యమ...

పోరాటానికి తెగువ దెచ్చెను!!

తరిమికొట్టి తెల్ల దొరలను...

సంపూర్ణ స్వ రాజ్యముదెచ్చెను!

*************************

.........కోరాడ.

20

[10/12, 8:46 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: బ్రిటిష్ వాడు సామ్రాజ్య దాహంతో ఈ దేశాన్ని అనేక రకాలుగా హింసించాడు

భారతీయులంతా కలిసి విభజించు పాలించు అనే అంశాన్ని తిప్పికొట్టారు

చేసిన చట్టాలలో రోజుల్లో చట్టం 1



తెల్లవాడి పాలనను అంతం చేయడానికి ప్రజలంతా మూకుమ్మడిగా

గాంధీజీ నెహ్రూ ఎందరో త్యాగధనులు రౌలట్ చట్టాన్ని తిప్పికొట్టారు


నిరసనలు తెలియజేశారు

అందుకే నా దేశం పుణ్యభూమి ధన్యభూమి స్వాతంత్రం రెండు వందల సంవత్సరాలు పోరాడి తెచ్చిన భరతావని కి జేజేలు


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453

[10/12, 9:05 PM]

21

 Dhanasi Usha Rani Poetess: కవితా గానo

శీర్షిక.రౌరట్ చట్టం

పేరు. ధనాశి ఉషారాణి

....

హింసతో కూడిన

పరిపాలనలో తెల్లదొరల అరాచక విధానాలు

భారతీయులను తల్లడింపచేయుటకు

వైస్రాయ్ కార్యానిర్వాహణలో ప్రవేశపెట్టబడి

ఇది ఓ శాసనముగా ఆమోదించబడింది

స్వరాజ్య కాంక్షపై కొరడాగా

రౌలట్ అధ్యక్షతన ఇది ప్రవేశపెట్టారు

గొడ్డలిపెట్టులాంటి బ్రిటీష్ దొరలు కుట్రవైఖరి

గాంధీజీ వ్యతిరేకించి ప్రజలను చైతన్య పరిచారు

నిర్బంధ వైఖరి ని ప్రజలకు తెలియజేసారు

శాంతియుతంగా పోరాటం చేసేలా జాతిపిత పిలుపు నిచ్చారు

సత్యాగ్రహం చేస్తామని పిలుపును ఇచ్చారు



ధనాశి ఉషారాణి

22


[10/12, 9:25 PM] Lalita Sister: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..రౌలట్ చట్టం

శీర్షిక..కఠిన వైఖరి



జలియన్ వాలాబాగ్ 

 మారణకాండ భారతీయులను కలిచి వేసింది

 ఫలితమే భారత ప్రజలలో తిరుగుబాటు తనం

స్వాతంత్ర్య కాంక్ష తీవ్ర రూపం దాల్చి

సంపూర్ణ స్వరాజ్యమే లక్ష్యంగా

తెగువతో పోరు కోసం సిద్ధపడిరి జనులంతా

విప్లవాత్మకమైన స్వరాజ్య కాంక్షను అణచుటకు

నిరంకుశ బ్రిటీష్ ప్రభుత్వం చే నియమించిన న్యాధిపతి రౌలట్ అధ్యక్షతన ఏర్పడిన సంఘం

భారతీయుల ఉద్యమాన్ని నిరుగార్చేందుటకై మోపెను ఉక్కుపాదం

సంపూర్ణ స్వరాజ్య కాంక్షను వీడకుంటే కఠినమైన జైలు శిక్ష

విధించే చట్టం

ఉద్యమాలను తావివ్వకుండా 

భయబ్రాంతులకు గురి చేస్తూ

బ్రిటీషర్ల కఠిన వైఖరి

బ్రిటీష్ ఇండియా చరిత్రలో ప్రసిద్ధమైనదిగా రౌలట్ చట్టం

గాంధీ మహాత్ముడు వ్యతిరేకించి సత్యాగ్రహాముతో నిలిపి వేస్తామని హెచ్చరించెను ఆ క్షణం.



 గాంధీజీ తీవ్ర నిరసన తెలిపిన చట్టం

 గాంధీజీ  రౌలత్ ఉపసంహరణకు చేసిన సంగ్రామ

 సత్యాగ్రహ మహోద్యమం

 నేటి వారు స్మరణ చేసుకోవాలి నిత్యం.

23


కవితా గానం*

తేదీ:11-12-2020

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం::రౌలత్ చట్టం

*******************

వెల్లువెత్తిన స్వరాజ్య కాంక్షపై

బ్రిటిష్ ప్రభుత్వం మోపిన 

నిరంకుశ చట్టాల పద ఘట్టనలు...


భారతీయుల స్వాభిమానాన్ని

రెచ్చగొట్టే రౌలత్ నిర్ణయం

బ్రిటిష్ ఇండియా నియంతృత్వ

 పాలనకు పరాకాష్టలు!


తెల్లజాతి వారి నల్ల మనసుల

నిరంకుశ నిర్భంధ విధానాలపై

గాంధీజీ ఎగరేసిన  శాంతి యుత సత్యాగ్రహ బావుటాలు!


చాపకింద నీరులా  దేశాన్ని

ఆక్రమించిన

బ్రిటిష్ సామ్రాజ్య దుర్మార్గులకు

చెంప పెట్టులా

భారతీయత అంటే ఏమిటో రుచి చూపిన 

మహాత్ముని శాంతియుత సారథ్యం!


సాధించుకోబోయే స్వాతంత్ర్యానికి  

సహన శక్తి నిరసన గళాల రణన్నినాదం!

అఖుడ భారతావని హృదయాల 

సమరోత్సాహానికి పడిన బలమైన అడుగులు!

24

కవితా గానం

పేరు:కొలచన విజయ భారతి

ఊరు: హైదరాబాద్

అంశం:రౌలత్ చట్టం

తేదీ:22-12-2020

**********************

రౌలత్ చట్టం

అరాచకాల, విప్లవ నేరాలకు

చుట్టం

భారతీయుల స్వరాజ్య కాంక్షను తన ఉక్కుపాదంతో

తొక్కిపెట్టిన ఆంగ్లేయుల

అధికార దర్పం

తన పడగ నీడను భారతావని అంతా విస్తరించిన కాలసర్పం


రౌలత్ చట్ట నిర్మూలనకై

గాంధీ మహాత్ముడు

సత్యాగ్రహ దీక్షతో

సాగించెను పోరాటం

శాంతియుత సంగ్రామమే

మహాత్ముని ఆశయం


భారతీయుల  రాజకీయ ఆందోళనలను కూడా

విప్లవాత్మక  రాజద్రోహముగ 

ముద్రవేసి కుటిలాత్మక

రాజకీయాలతో

కరుడు కాఠిన్యం తో

భరతజాతి స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని  అణగదొక్కిన

ఆంగ్లేయుల నిరంకుశ

పరిపాలనకి, దుర్మార్గ

దురహంకారానికి ఇదొక నిదర్శనం

        🌺🌺🌺🌺🌺

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...