Skip to main content

యక్ష ప్రశ్నలు డిసెంబర్ 1

 నిర్వహణ ః శివునూరి లలితాకృష్ణ

వీరా గుడిపల్లి

********************

1.కోరాడ నరసింహారావు గారు

2.సుధారాణి కృష్ణం రాజు గారు

3.సునంద వురిమళ్ళ గారఉ

4.మన్నె పిన్నక లలిత గారు

5.చెన్నా విజయ లక్ష్మి బీర్కూరు గారు

6.వై.కె.సంధ్యా శర్మ గారు

7.భరద్వాజ రావినూతల గారు

8.విజయదుర్గ గారు వినీలమ్మ

9.కెసి నరసయ్య గారు

10.అపరాజిత్ గారు

11.కె.ఇ.నిలమంగై గారు

12.మర్రి జయశ్రీ గారు

13.ధనాశి ఉషారాణి గారు 

14.దీపక్ న్యాతి గారు



*******"**********

1

[01/12, 8:42 PM] Korada: కవితాగానం

     అంశం :-  యక్షప్రశ్నలు

   కోరాడ నరసింహా రావు....!

   * విక్రమార్క జవాబులు *

      ******************

మెడ కి తీస్తే.... కాలికి....!

కాలి కి తీస్తే.....మెడకి....!!

విప్పుకోలేక...చచ్చిపోవాలి!

ప్రశ్న వేస్తే సమాధానందొరక్క

తన్నుకోవాలి...!!తలపండిన

రాజకీయ నాయకుడులా...!

సీనియర్ క్రిమినల్ లాయెర్లా!!

ఎంత విప్పలేని చిక్కుయక్ష

ప్రశ్నలైనా...ఎక్కడో ఓ విక్రమార్కుడుంటాడుగ...!

సమాధానంలేనిప్రశ్న...,ఈతరాని చేప...వుండవుగా....!!

అందుకేవిషయపరిజ్ఞానం...

లోక వ్యవహార జ్ఞానం ...లౌక్యం

తెలుసు కోవోయ్ అనేవాడె ప్పుడూ....మా అప్పారావు గాడు....!

కేవలం వంటి0టి ఇల్లాలివైపోతే

ఎంక్సుకూ పనికిరాకుండా.... పొగలవు అని.... ఎకసెక్కాలాడేవాడు...!!

కుక్క కాటుకు చెప్పుదెబ్బలా...

సమాధానం చెప్పామంటే...

కత్తి వాటుకు నెత్తురుచుక్క

పడినట్టు దెబ్బకి ముఖం పా లిపొయి...వాడి పోవాలి...!

ప్రశ్నలడిగిన బేతాలుడే....

ఓడిపోయినట్టు....విక్రమార్కుడే...విజయుడైనట్టు....!

మనల్ని ఇరుకున పెట్టాలనుకు న్న వాళ్లే...ఓటమితో ముఖం

చాటేసుకు పోవాలి....!!

***********************

.........కోరాడ.

2

[01/12, 9:13 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

*నేటి అంశం*యక్ష ప్రశ్నలు*

సమాజంలో రక రకాల మనుషులు తారస పడుతుంటారు కొందరు మాట్లాడే విధానం చూస్తుంటే

మనం చెప్పాలన్న విషయం

మరిచి పోయే సందర్భాలు ఉంటాయి

కొందరు వాగుతూనే ఉంటారు

ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా చెప్పాలను కున్న

విషయం ఒక టైతే చెప్పేది మరొకటి ఇలాంటి వారితో

మాట్లాడుతుంటే మనం కూడా

గందరగోళానికి గురి అవుతూ

ఉంటాం ఏమనాలో తెలియక

రాని నవ్వును పులుముకుని వారు వెళ్ళిన తరువాత వీరెవరండీ బాబు యక్ష ప్రశ్నలు

వేసి ప్రాణం తీసేస్తున్నాడు అని

అంటుంటారు

యక్ష ప్రశ్నలు ఒక సమాధానం

ఇవ్వకుండా నే మరొక ప్రశ్న

ఈవిధంగా అడుగుతూనే ఉంటారు

ఎదుటివారు విసుగు ప్రదర్శించిన పట్టించుకోని మహా

మేధావులు అనవసరమైనవి అధిక పాళ్ళలో ఉంటే అవసరమైనవి ఉండవు

ఒక్కొక్క సారి వీరి మాటలు వినలేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక పొద్దున్నే ఎవరి ముఖం చూశానో వీడి బారిన

పడ్డాను అని తలబాదుకుంటారు

వారి యక్ష ప్రశ్నలకు బిపి లేని వారికి రావడం ఖాయం

వారు వస్తున్నారంటే ఏమాత్రం

సంకేతం కనబడినా ఇంటికి

తాళం వేసి మరీ వెళ్ళి వారి బారి నుండి తప్పించుకోవాలనుకుంటారు

అందుకే మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడే అలవాటు

ఉంటే ఇలాంటి బాధలు రావు🙏🙏👍😃

3

[01/12, 9:18 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*

తేదీ:01-12-2020

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం:యక్ష ప్రశ్నలు

*******************

మెదడుకు పదును పెట్టి

జ్ఞాన సంపదను పెంచేందుకు

వ్యక్తి దక్షతను పరీక్షించే చిక్కు ప్రశ్నలు..


ఓకే ఒక్క వాక్యంతో మొదలవుతూ

అనంతమైన సమాధానాన్ని కలిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు!


వనవాస సమయంలో

తన అంశతో జన్మించిన ధర్మజుని విజ్ఞతను పరీక్షించేందుకు 

యక్షుని రూపంలో  యమ ధర్మరాజు అడిగిన 

సత్యం ధర్మం శాంతి సహనము

నైతిక విలువల సమాచార ప్రశ్నలు..

4

[01/12, 9:19 PM] +91 74168 63289: కవితా గానం

  తేద:ి1 /12 /20

పేరు  :మన్నె పిన్నక లలిత

అంశం :యక్ష ప్రశ్నలు 

శీర్షిక :పోసుకోలు ప్రశ్నలు

 యక్ష ప్రశ్నలకు యముడు సమాధానం చెప్పాడా?

  సంతకు వెళ్లి కూరలు తెస్తుంటే ,సంతకు వెళ్లారా?

 కూరలు తెస్తున్నారా అని అడిగినట్లు,

 తల తిక్క ప్రశ్నలు  అడిగి 

యక్షుడుని గుర్తు చేసే వారు కొందరు

 చిక్కు ప్రశ్నలు వేసి చికాకు పరిచే వారు కొందరు

 తలా తోక లేని ప్రశ్నలతో

ఉక్కిరిబిక్కిరి చేసే వారు కొందరు

  మాటలబాణాలు వేస్తూ  ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించే        వారు కొందరు

 అటువంటి  వారిని తప్పుకు తిరగటమే ధన్యము సుమతీ!

5

కవితా గానం 

అంశం :యక్ష ప్రశ్నలు 

చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్ 

శీర్షిక :విజ్ఞాన వీచికలు 

*****************************

చిత్ర విచిత్ర ప్రశ్నలు 

చిరుమొగ్గలేయు చిందులు 

ఉరకలెత్తించు ఆలోచనలు 

ఊహించని మలుపులు 

ఊహకందని సమాధానాలు 


సూక్ష్మ గ్రాహ్యతకు నిదర్శనాలు 

విజ్ఞానానికి ప్రతీకలు 

సమయస్ఫూర్తికి బంధువులు 

విశ్లేషణకు వేయు పెద్ద పీటలు 


ఆవిష్కరణలకు మూలాలు 

ప్రయోగాలకు పట్టుకొమ్మలు 

కొత్తదనానికి అలదు సొబగులు 

చరిత్రలో మిగులు విశేషాలు 


ధర్మ సందేహాల మందార  మాలలు 

పట్టు విడుపు పులకరింతలు 

సామెతల సరాగాలపలకరింపులు 

విశిష్ట విజ్ఞాన మేరువులు 


ప్రశ్నలతోనే జరుగుతుంది ప్రగతి 

లేకుంటే పడుతుంది అధోగతి 

ప్రశ్న లేకుంటే లేదు జగతి 


ప్రశ్నించి ఇవ్వాలి పోటీ 

తెలివితో పోరాడి గెలవాలి 


ప్రశ్నలు యక్షప్రశ్నలై ఎదురొస్తే 

విజ్ఞాన పు తివాచీతో స్వాగతించి 

జ్ఞానపు కిటికీలు తెరచి 

నిజాయితీ నిచ్చెన నెక్కి 

విజయ బావుటా నెగురవేసి 

ఆనందాల అంబరాన్ని తాకి 

విక్రమార్కుడవై వెలగాలి 


హామీ :ఇది నా స్వీయ రచన. ఎట్టి అనువాదం, అనుకరణ కాదు...... చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్

6

[02/12, 8:16 PM] Sandya Sharma Poetess: కవితాగానం


వై.కె.సంధ్యశర్మ


అంశం :యక్షప్రశ్నలు



చిట్టి బుర్రలో మెదిలిన యక్ష ప్రశ్నల పర్వం


చిగురాకు తొడిగి


చిత్రవిచిత్రాలను పరిచయం చేస్తూ


చిద్విలాసంగా అనంత వృక్షమై....


కొన్ని   నవ్వులకు నజరానాలైతే


కొన్ని  పువ్వుల్లా పరిమళిస్తాయి


కొన్ని  విజ్ఞాన విపంచిని  విస్తృతం చేస్తాయి


కొన్ని  జ్ఞాన పెన్నిధికి దగ్గర చేస్తాయి...


కొన్ని అధ్వైతానికి  అంది వస్తాయి


కొన్ని  మనుగడలోని  మానవత్వానికి


కొన్ని  కల్పనకు  ప్రాణం పోస్తే


కొన్ని  ఆది కావ్యాలకు ఆయువవుతాయి


కొన్ని  సకల శాస్త్రాలకు నిలయమైతే


కొన్ని  చంద్రకళలకు ఆవాసమవుతాయి


కొన్ని  ఆత్మస్థైర్యపు కరవాలమై


కొన్ని   కౌటిల్యాన్ని  బోధిస్తాయి


కొన్ని దురాగతాలకు  వినాశినైతే

కొన్ని  విపుల తత్వాన్ని విస్తరిస్తాయి

కొన్ని  ప్రేమ తరంగాలు నింపి సేద తీర్చితే

కొన్ని  క్షాత్ర ధర్మాన్ని ఒంపి శంఖారావమవుతాయి

కొన్ని  పచ్చల హారంలా హరిత వనాలై

కొన్ని దేశ చరితము నిలిపే ఖ్యాతి గా

కొన్ని ధీర కథలుగా వెలిసి పాటలవుతాయి..

కొన్ని  జీవిత సారానికి పాఠమై

కొన్ని గమ్యంలేని నావకు సా‌రధై  చీకటి చీల్చే

వెలుగు రెమ్మలవుతాయి...

కొన్ని సౌగంధిక కవితా జల్లులతో తడిసి ముద్దవుతాయి

..........

7

[02/12, 8:21 PM] భరద్వాజ గారు: 🎊🎻కవితాగానం 🎊🌱

అంశం- యక్షప్రశ్నలు   --!

శీర్షిక-  .పెరిగే ఆలోచనకు ఆనవాళ్లు  !

పేరు-భరద్వాజరావినూతల 

కొత్తపట్నం 

రచన-30

ప్రతిదీ తెలుసుకోవాలన్న ఆలోచన కలిగినవారుపిల్లలు -

వారిప్రశ్నలన్నింటికీ మనం ఇవ్వలేము జవాబులు -

పెరిగేవారివయసుతోపాటే వచ్చేఆలోచనలు -

వేధిస్తాయి మనల్ని జవాబులేనిప్రశ్నలై -

ఓపికగామానం చెప్పేసమాధానం వాడిని తృప్తి[పరచకపోయిన -

వేస్తాడుమరలా మరల-

ఆవయసు వారినితెలుసుకోమంటుంది -

చెప్పింది నిజమని నమ్ముతుంది -

అదిబాల్యం లో సహజం -

మనకూ అనుమానం వచ్చే ప్రశ్నలుఎన్నోఉన్నా -

ఎగతాళినే భయానికి  అదిరిఅడగము ఎవరిని -

వయసుఅడ్డంవస్తుంది -

ఎప్పుడో యక్షుడు జాబివ్వలేని ప్రశ్నలు అడిగాడని పురాణగాథ--

ఇప్పుడు ఏయక్షుడు వచ్చిన -

సెల్ లోని గూగుల్ చాలు అన్నిప్రశ్నలకు చెబుతుంది సమాధానం -

దానికి ఎలాతెలుసుఅన్నదే యక్షప్రశ్న ---!

ఇదినాస్వీయరచన 

భరద్వాజ రావినూతల ((RB)🖍️

కొత్తపట్నం 

9866203795

8

[02/12, 8:27 PM] Vineelamma: కవితాగానం

పేరు: విజయదుర్గ

కవితా శీర్షిక : యక్ష ప్రశ్నలు

కవితా సంఖ్య: 38

తేదీ: 02/12/20 

జీవితమే ఎన్నో సంశయాల

మాలాహారం

అడుగడుగునా సందేహాల

విహారమే.....!!

వింత వింతల నటనలతో

విధి ఆడే ఆటలో

మానవుడి మస్తిష్కానికి ఎన్ని

అనుమాలో....!!


పసిపాప సైతం చిన్న బుర్రకు

ఆగక వేసే ప్రశ్నలు

జవాబు చెప్పలేని మన అజ్ఞానికి

చిహ్నం....!!

యక్షప్రశ్నల వర్షంలో తనమునకలై

గందరగోళంగ నిలబడక


నీలో నీవే విజ్ఞతను వెలిగించి

నిమిత్తం గా సాగే నీపయనంలో

అంతా ప్రశాంతమే.....!!

7

[02/12, 9:01 PM] KC Narsaiah KS 26: కవితా గానం

తేది: 2-12-2020

పేరు: కెసి నరసయ్య 

అంశం: యక్షప్రశ్నలు 

శీర్షిక: సమర్థ పాలనాధ్యక్షుడు


ఆలోచనల చుట్టూ ప్రశ్నల పర్వం

నివృత్తి కానీ సమస్యలపై ప్రశ్నల వలయం

ప్రశ్నకు సమాధానమే ఉత్తీర్ణతకు మార్గం

చిన్నారుల ప్రశ్నలన్నీ యక్ష ప్రశ్నలే 

ఆకాశంలో నక్షత్రాల కోసం

అందని చంద్రుడి కోసం సమాధానాల వేట

పాలనాదక్షతకు ప్రశ్న ఓ అగ్ని పరీక్ష

భగవంతుడున్నాడా లేడా సందేహంపై

హేతువాదుల సహేతుక ప్రశ్నలు

నాస్తిక వాదం ఆస్తిక వాదం వాగ్వాదంలో

దొరికిన అమూల్యమైన జ్ఞాన భాండాగారం

చట్టసభల్లో

సమాధానాలు దొరకని యక్ష ప్రశ్నలెన్నో

ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే చట్టసభలు

ప్రగతిని సాధించలేని పాలక పక్షాలు 

ప్రశ్నల అస్త్రాన్ని ఛేదించగల వివేకం

యక్షప్రశ్నల ముడి విప్పిన వాడే సమర్థపాలనాదక్షుడు

8

[02/12, 9:11 PM] Aparajith: యక్ష ప్రశ్నలు!

సార్ పాలు తెల్లగానే ఎందుకుంటాయి?

ఆడిగాడో విద్యార్ధి బడిలో,,,,,,,!

నాకు ఏం చెప్పాలో తోయలేదు 

తెల్లగా వుండడం ఇష్టం లేకపోతే ఇష్టమైన రంగు కలుపుకొ!

నీ మెదడు మోకాల్లలొ ఉందిరా అంటా రెంది సార్ 

మెదడు తలలో కదా వుండేది!

నాకు చిర్రెతుకొచ్చింది 

అయితే నీ తల గోడ కేసి బాదుకో తెలుస్తుంది!

అన్నాను కాని ఇలాంటి యక్ష ప్రశ్నలకు సమాధానాలు కష్టం!!

ఆపరాజిత్

   9

              కవితా గానం

అంశం: *యక్ష ప్రశ్నలు*

తేది:02/12/2020

        వచన కవిత్వం


చిట్టి బుర్రలో మెదిలే సందేహాల సమాహారం..!

అడుగడుగునా అనంతానంత సంశయాలే..!


మస్తిష్కపు మేధపై కురిపించే వడగళ్ళ వానయై..,

ధనువునుండీ వెలువడిన శరపరం పరలా ప్రశ్నల వర్షమై..!


సుజ్ఞానంకై తపించే వారికదొక వరమై..!

అజ్ఞానాంధ కారానికదొక సమాధానం దొరకని ప్రశ్నయై..,


చిందరవందర గందరగోళంలా..,

అల్లీబిల్లీ తిరిగే విజ్ఞానపు వరదలా..,


మనలోని జ్ఞానజ్యోతిని వెలిగించే దీపపు కాంతిలా..!

ప్రభాత కాలపు సూర్యుని బింబంలా..!


బ్రతుకు గమనంలో తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతతలా చిన్నారుల బోసినవ్వుల చిట్టి మాటల నుండీ వెలువడే యక్ష ప్రశ్నలు పెద్దలకు కఠినమైనా ఆనందాన్నందించే వీవెనలు..!!!!  

     

పేరు: కె.ఇ.నిలమంగై

కలం పేరు:నీలా రంగనాధం

ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.

చరవాణి సంఖ్య:8897155600.

*ఈ పై  కవిత ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*      

10

        [02/12, 9:18 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..యాక్షప్రశ్నలు

శీర్షిక..మానసిక వికాసం



ఎన్నో చిక్కుముడులతో సాగే పయనం

మనిషి జీవితం

నిరంతరం వేదిస్థాయి

సమాధానం దొరకని ప్రశ్నలేన్నో

అమాయకమైన చిన్నారులు

అడుగుతారు అర్థం లేని ప్రశ్నలు

ఓర్పు వహించని పెద్దలు

విసుగు చెండుతూ

 యక్ష ప్రశ్నలేమిటని

తోచిన జవాబిస్తే 

లేత మనసులో స్థిరంగా నిలిచే ప్రమాదం

మేధస్సు కు పదును పెట్టే

విజ్ఞానం పెంపొందించే 

జవాబులేని ప్రశ్నలకు చాకచక్యంతో సమాధాన మిస్తే 

చిన్నారులు పొందు తృప్తి

కలుగును మానసిక వికాసం

చిన్న ప్రశ్నేకదా అనుకొని చులకన చేస్తే

జరుగును ఉపద్రవం

వనవాసం వేళ 

ధర్మరాజుకు యక్షుడు వేసిన ప్రశ్నలు

మానవతా విలువలున్న మంచి ముత్యాలు

ఒక వాక్యంలో అడిగిన యక్షుని ప్రశ్నలకు

సమర్ధవంతమైన సమాధానం ఇచ్చిన ధర్మరాజు విజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు

11

[02/12, 9:19 PM] Dhanasi Usha Rani Poetess: కవితా గానo

పేరు. ధనాశి ఉషారాణి

శీర్షిక.యక్షప్రశ్నలు

.......

తెలిసి తెలియని వయస్సులో

పసి హృదయాల్లో ఉదయించే 

ఎన్నో యక్షప్రశ్నలకుఎవ్వరూను

సందేహము తీర్చగలరు సుమీ!!



కళ్ళముందు కదలాడుతూ

గుండె లోతుల్లోన

అలా అలా ఊరేగేటి

ఎన్నో ఊహలకు ఎవ్వరూ సమాధానం ఇవ్వగలరూ ఇలలోన


అనిర్వచనీయమైన భక్తి భావములోని

మధురిమను ఎవ్వరూను

చూడలేరు

 అనుభూతిలోన హాయిగా తేలియాడటము తప్పా

మనస్సు లోతుల్లో చేరి

మధుర భావాలు చిలికి

చప్పుడు లేకుండా  అనంత దూరాలకు కదలిపోయే ప్రేమ తెమ్మెరలుఎవ్వరికి అంతు చిక్కదే

బతుకంతా వింత అనుభూతిలో నిలిచి

సాగిపోయే ఎన్నో ప్రశ్నలకు బదులు ఎవ్వరూ ఎవ్వగలరూ

12

కవితా గానం

తేది : 02-12-2020

పేరు : డా.దీపక్ న్యాతి

అంశం : యక్షప్రశ్నలు

శీర్షిక : స్తంభన


యక్షప్రశ్నలని చిన్న చూపు వలదు

తెలివితక్కువ తనం కాదు తెలియనిది

వివరణ వరించక వేటాడే విషయం

సమాధానం అందక అవి యక్షప్రశ్నలు

తెలిసినా తెలుపలేనివి యక్షప్రశ్నలు

లోతుగా లాగాలనే ఆశ యక్షప్రశ్నలు

మస్తిష్కాన్ని నింపగోరు ప్రశ్నలు యక్షప్రశ్నలు

పసి హృదయాలకు నచ్చజెప్పలేని ప్రశ్నలు

అనుభవజ్ఞులకు తోస్తాయి యక్షప్రశ్నలు

సామాన్య మేధావుల మధ్య దాగుడుమూతల

ఆటలాడే అలిసిపోని యక్షప్రశ్నలు

విసుగు చెందక అన్వేషిస్తే సృజనను

సూచించి వెలుగొందవచ్చు యక్షప్రశ్నలు 

యక్షప్రశ్నలు స్పృశిస్తే ప్రతికూలం అనుకూలించొచ్చు

యక్షప్రశ్నలు విశ్లేషణకు దారిచూపే దివిటీలవ్వొచ్చు

విసిగించే యక్షప్రశ్నలు విజయాలను వరించొచ్చు

విశ్వాన్నెరగ కోరె ప్రశ్నలు యక్షప్రశ్నలే

యక్షప్రశ్నలు లేకుంటే జగము స్తంభనే


డా.దీపక్ న్యాతి

నంది అవార్డు గ్రహీత

హైదరాబాద్

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...