నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ (author of vennela shilpam)
వీరా గుడిపల్లి
*************""""""
1.అపరాజిత్ గారు
2.ధనాశి ఉషారాణి గారు
3.కోరాడ నరసింహారావు గారు
4.ప్రమోద మునిమడుగు గారు
5.డా.బల్లూరి ఉమాదేవి గారు
6.సునంద వురిమళ్ళ గారు
**************
1
[12/12, 8:08 PM] Aparajith: మమతల పందిరి!
అమ్మా నాన్నలు పూజ్యులు దేవతలు
భార్య భర్తలు ఆలంబన ఆలింగనాల్లో
సర్వసమస్యలు మటుమాయం!
అన్నా చెల్లీ--అక్కా తమ్ముడు
మమతల కోవెలలో హృదయ రాగం!
అత్త మామలు--కూతుర్లు అల్లుండ్లు
ప్రేమ ఆప్యాయతల కురిసే పున్నమి వెన్నెలలు!
బావ-బావమరుదులు లౌకిక ఆనంద హేల!
ఆనందాలు తాండవించే వేళ
పసిపిల్లలు ఇలలో దేవతా ముఖులు!
ఈ బంధుత్వాలు కలల తీరాలు చేరాలంటే
ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొవడాలు,రాకపోకలు
మనసు మందిరంలో వెలిగే దీపాలవ్వాలి!
కష్ట సుఖాలు కావడి కుండలు!
కష్టమైనా సుఖమైనా ఒకరికొకరు తోడై నిలవాలి!
ఇక స్నేహ మాధుర్యం కలివిడిగా
మమతలు ఆప్యాయతల ఆలవాలం!
ఈ వెల్లివిరిసే ప్రేమల ఆనంద తరంగాలలో
సుఖ జీవితం సౌశీల్యంగా
సంధ్యాకాంతుల్లో కలువ పూలలా తొణికిసలాడు!!
ముక్కోటి దేవతల దయ అనుగ్రహంతో
ముల్లోకాల వెలుగులు మనిషి జీవితంలో!
మమతల మకరందాల పూదోటలవును!!
కళ్లల్లో వెలుగుల జ్యొతులు
దయ ప్రేమ జాలి కరుణ అనురాగం నిండిన హృదయాలలో
మనిషి జీవనం అమృత తుల్యము!!
ఆపరాజిత్
2
[12/12, 8:28 PM] Dhanasi Usha Rani Poetess: శీర్షిక.ఆత్మానoదo
పేరు. ధనాశి ఉషారాణి
జిల్లా. చిత్తూరు
.......
అందని ఆశల తీరాలు
మనిషి సాధనలో చెక్కబడి
శత్రువులు విసిరిన హాస్య హస్త్రాలను
ఛేదించే అసలైన హస్త్రo ఐతే
గుండెల్లో ఆత్మానందము నిండుగాను వెల్లివిరిసేను
ఎన్నో నోములు ఫలితముగా
మరెన్నో ఎదురుచూపులు ఫలితముగా
తల్లి గర్భమునుండి భూమిపైకి
వచ్చిన చిన్నారి రూపము
గుండెలు నిండుగా ఆత్మానoదము నింపును
కష్టించి ప్రతి పైసా పోగుజేసి
జీవితాన్ని దిద్దుకునే
సగటు మనిషి గుండెల్లో
ఉప్పొంగే మధురానుభూతి మరుపురాని తియ్యని ఆత్మానందపు పరిమళము మధురం
సేవాగుణము కలిగి నిలిచి
సమాజ సేవకోసము
నిత్యము పరితపించే మనిషి బ్రతుకు నిండు పరిమళభరితము
జీవితము నిండు ఆత్మానంద భరితముగా భువిలో నిలుచు
కవిత నా సొంతము అని హామీ ఇస్తున్నాను
ధనాశి ఉషారాణి
3
[12/12, 8:35 PM] Korada: కవితాగానం
అంశం :- * ఆత్మానందం *
కోరాడ నరసింహా రావు .....!
** వాస్తవానందం **
(సార్ధకత)
***********
మనసుది.... స్వార్ధం...!
ఆత్మది....పరమార్ధం...!!
భౌతిక సుఖాలతో మనసు పొందేఆనందంలో.... ఉండేది
స్వార్ధమే .....!
ప్రేమతో తల్లి బిడ్డకు చేసే సేవ లోనో...ఎదుటి మనిషిపై....
...జాలిపుట్టి దయతో...ప్రేమగా
చేసే ఉపకారం లోనో....ఆత్మ
అమితానందాన్నిపొందుతుంది!
ఇది...యిదేనిజమైన ఆనందం!
ఆత్మానందమంటే ...యిదే...!!
స్వార్ధానిది పైశాచికానందం!
ఎదుటి మనిషిని(ప్రాణిని)...
నష్టబెట్టయినా...కష్టబెట్టయినా
తన ఆనందమే ప్రధానంగా ఆనందించే...ఆనందం...!
ఎదుటి మనిషి సుఖం కోసం,
ఆనందం కోసం ...తాను నష్ట
పో యినా...కష్టాల పాలైనా...
బాధ కలగక....వాళ్ళ తృప్తిని,
ఆనందాన్నీ చూసి సంతోషించ
గలగటమే.... నిజమైన ఆనం దం...!అదే....ఆత్మానందం..!!
ఆత్మానందం మనసును తేలిక
పరచి...తనువును ఆనందడోలి
కలలో...వోల లాదిస్తుంది...!
స్వార్ధానందం...ఒకప్పుడు కాక
పోయిన....ఇంకొకప్పుడైనా...
చేసిన తప్పుకి...లోలోపల
సిగ్గుపడుతుంది...!ఆత్మానందాన్ని అనుభవిం చటమంటే....న్యాయసమ్మత
మై ధర్మ బద్ధమైన జీవితాన్ని
జీవించటమోయి...!
అంతకంటే ఈ మానవ జన్మకు
సార్ధకత...ఇంకేముంది!
4
[12/12, 8:46 PM] +91 90002 51604: శీర్షిక: ఆత్మానందం....
ఆ ముసలి తాత కళ్ళల్లో కోటి వెలుగుల కాంతులు
పసిపిల్లల నవ్వులా నిష్కల్మషమైన నవ్వు
చూడడానికి....సాధారణం గా నే ఉన్నాడే....
కానీ...చూస్తున్న కొద్దీ ఎదో ప్రత్యేకత
తెలుసుకోవాలనే.....ఆరాటంలో...నా కళ్ళు తెలిసిన వారి కోసం వెతుకుతున్నాయి...
ఆ పెద్దాయన మాత్రం ఏమీ పట్టనట్టు గా...ఓ పక్క గా కూర్చుని... ఎదో రాస్తున్నారు
ఇంతలో బిలబిలమంటూ....ఆడపిల్లలంతా.....ఆయన చుట్టూ మూగారు..తాతగారు...తాతగారు అంటూ....
ఈ పిల్లలంతా అనాధాశ్రమ పిల్లలు
ఆప్యాయంగా ఆయనతో మాట్లాడి....పక్కనే కూర్చుని అంతా కలిసి భోజనం చేశారు...
ఎంతో ఉత్సాహంగా..... పిల్లలతో కలసి..ఆయనా చిన్న పిల్లాడు అయ్యాడు గా....
అప్పుడే వచ్చిన నా నేస్తం అసలు విషయం చెప్పింది
ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం లో తన సర్వస్వాన్ని త్యాగం చేసిన మహానుభా వుడని
ఇంట్లో వాళ్ళు ఇష్టపడక పోతే.....
ఇంట్లోంచి బయటకు వచ్చి తన కోట్ల సంపదనంతా..అనాధ బాలికల కోసం ధార పోసిన మహనీయుడు అని
ఆ పిల్లల చెరగని నవ్వుకు ....
ఆ పిల్లల బంగారు భవిష్యత్తు కు ....
బాటలు వేసిన మహనీయుడు అతడిని
ఎదో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్న నాకు జవాబు దొరికింది
ఇవ్వటమే తెలిసిన ఆ పెద్దాయన.....
ఏ పాశానికి లొంగక....
కించిత్... గర్వానికీ.. లోనుకాక
ఆత్మానందాన్ని చక్కగా అనుభవిస్తున్నారని
అదే ఆయన కళ్ళల్లో....వెలుగుకి కారణమని
ప్రమోద మునిమడుగు
5.
12/12/20
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశము: ఆత్మానందం
మాటల్లోలో చెప్పలేనిది
మౌనంగా మదిలో దాగేది
డబ్బుతో కొనలేనిది
అనుకున్నది సాధించినప్పుడు
అంతరంగంలో కలిగేదీ ఆత్మానందం
కన్నబిడ్డ బోసి నవ్వు చూసినా
నడక నేర్చిన పలకకబట్టి అక్షరాలు
ముద్దుగా దిద్దినా కలిగేదీ ఆత్మానందం
కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు చిన్నదైనా
6
*కవితా గానం*
తేదీ:12-12-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: ఆత్మానందం
*******************
చేసిన చిన్ని ఉపకారం కృతజ్ఞతై
ఎద లోపల ఇంద్రధనుస్సు పూయిస్తున్నప్పుడు కలిగే ఆనందమే...
పిపీలకమై చరించే జీవితంలో
పావురాన్ని రక్షించినట్టు చేసిన సాయానికి
ఆ కన్నుల్లోంచి జాలువారే ఆనందబాష్పాలు
మదిని ప్రేమగా తట్టినపుడు పొందే సంతోషమే...
పరోపకారం ప్రసంశయై
మనసు నిండా విరిజల్లై కురిసినప్ఫుడు
అంతరంగం చేసే ఆనంద తాండవమే ఆత్మానందం!
తరువు లానో చెరువులానో
ఊపిరికి ఉత్సాహం నింపే
ప్రాణ వాయువు లానో
బతుకు పరమార్థమై ప్రవహించి నప్పుడు
చీకటిలోంచి వెలుగులోకి ప్రవహించిన అనుభూతిని మించిన ఆత్మానందం ఇంకేం కావాలి!
కలిగే ఆనందం గొప్పదే సుమా
నేను నా వాళ్లంటూ స్వార్థంతో కాక
ఉడతా సాయంగా పరోపకారం చేసినప్పుడు కలిగే ఆత్మానందం
వెలకట్టలేనిది జగతిలో
అందమైన కవితలల్లి చదువులమ్మ
గళసీమన అలంకరించినపుడు
కలిగేదీ అంతులేని అత్మానందం
Comments
Post a Comment