Skip to main content

చౌరీ చౌరా 2020

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ

వీరా గుడిపల్లి

***********

1.ధనాశి ఉషారాణి గారు

2.మర్రి జయశ్రీ గారు

****************"

1

శీర్షిక.చౌరీ చౌరా

పేరు.ధనాశి ఉషారాణి

జిల్లా. చిత్తూరు

......

తెల్లదొరల బానిసల సంకెళ్ళ కింద నలిగిన ప్రజలు

స్వేచ్ఛవాయువులు కోరుకుంటున్న వేళ

ఎన్నో సంగ్రామాలు ఉద్యమాలు జరిగినట్టి చరిత్రలో

భారత్ స్వాతంత్య్ర సంగ్రామంలో ఓ ఘట్టం  చౌరీ చౌరా


సహాయనిరాకరణ యుద్ధము తీవ్రముగా ఉన్నపుడు ఇది జరిగింది

వినూత్నమైన ఘట్టము

చౌరా గ్రామములో జరిగిన సంఘటన

కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగిన దాడికి ఫలితముగా

పోలీసులపై ఆగ్రహించి ప్రజలు

పోలీస్ స్టేషన్ పై దాడి చేయడముతో

పోలీస్ లు చనిపోయారని చరిత్ర చెబుతున్నది


అప్పుడు ప్రజలనుజీవిత ఖైదీలుగా శిక్ష విధించారట

దీనిని బట్టి ప్రజల్లో స్వాతంత్ర్య  ఉద్యమం సంగ్రామo తీవ్రమైన స్థాయిలో జరిగిందని తెలుస్తున్నది

2

కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..చౌరీ చౌరా

శీర్షిక...భారత చరిత్రలో ముఖ్య ఘట్టం

రౌలట్ చట్టం

జలియన్ వాలాబాగ్ దురంతం

బ్రిటిష్ అణచివేత విధానాలపై

నిరసించిన భారత జాతి

గాంధీజీ నాయకత్వంలో చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం ఉధృతమై సాగుతున్న వేళ

అహింసా ఉద్యమము

ఒక్కసారిగా హింసాత్మకంగా మారే

గోరక్ పూర్ జిల్లా చౌరీ చౌరా లో

ఊరేగింపుగా వెళ్ళే కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతూ

పోలీసుల చేసిన లాఠీ ఛార్జ్

ప్రజలను కోపోద్రిక్తులను చేసే

చౌకి పోలీస్ స్టేషన్ ముట్టడించిన జనం

పోలీస్ లను సజీవదహనం గావించే

హింసాత్మక ఘటనకునిర్ఘాంతపోయిన బాపూజీ

సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపి వేసే

బ్రిటిష్ ప్రభుత్వం కఠిన చర్యలతో అరెస్టులు గావించే

సంఘటనలో పాల్గొన్న భారతీయులకు

ఉరిశిక్షలు విధించి తన ప్రతీకారం తీర్చుకుంది

ఇది భారత చరిత్రలో ముఖ్య ఘట్టం

ఉరికొయ్యలకొరిగిన వీరులకు,గౌరవ సూచకంగా

 భారత రైల్వే ప్రారంభించే.

చౌరీ చౌరా ఎక్స్ ప్రెస్ రైలు.



Comments

Popular posts from this blog

లతాజీ 08022022

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ ************************* కవివరుల జాబితా వీరా గుడిపల్లి 1.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు 2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 3.సింహాద్రి వాణి గారు 4.అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు 5. కవిత వెంకటేశ్వర్లు గారు 6.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 7.తరణికంటి సూర్య లక్ష్మి గారు 8.గజవెల్లి శ్రీ నివాసాచారి గారు 9.వేదాంతం సురేష్ బాబు గారు 10. జోషి పద్మావతి గారు 11.తిప్నావఝల నరసింహ మూర్తి గారు  12.ముత్యం వెంకటేశ్వరరావు గారు 13.బి.నాగేశ్వర రావు గారు 14.సునంద వురిమళ్ళ గారు 15.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు 16.శివునూరి లలితా కృష్ణ ******** గాన కోకిల ..................వీరా గుడిపల్లి యే  పర్వత సానువుల నడుమనో దట్టమైన వనాంతరాలలోనో నిర్జన ప్రదేశాలలో ఏకాంతంగా ఉన్నప్పుడు నీకు మాత్రమే వినిపించే లయను జలపాతాల హోరును వన్య ప్రాణుల జోరును మేఘాల తేరు పలికే రాగాల ప్రకృతి భాషను పరిమళ భరితంగా మార్చగల స్వయం సిద్ధ నాదాలు సహజసిద్ధ స్వరాలు స్వచ్ఛమైన స్వనాలు జనాలకు పంచి సెలవంటూ వెళ్లిన దైవ దూత ...... వీరా గుడిపల్లి 1 [08/02, 8:10 pm] +91 90594 38068: గజవెళ్ళి శ్రీనివాసాచారి  అంశం: స్...

పౌర్ణమి పోటీ అంశం:శివరాత్రి 2023

నిర్వహణ శివునూరి లలితా కృష్ణ వీరా గుడిపల్లి  ****************** 1.దోసపాటి గారు 2.గంగాపురం శ్రీనివాస్ గారు 3.వేమూరి సత్యవతి గారు 4.మోహన మణికంఠ ఉరిటి గారు 5.రాజశేఖరుని శివ లక్ష్మి గారు 6..డాక్టర్ బల్లూరి ఉమాదేవి గరు 7.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 8.గంటి మీనా కుమారి గారు 9.డాక్టర్ కమలా దేవి 10.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 11.సింహాద్రి వాణి గారు 12.కోరాడ నరసింహారావు గారు 13.తిప్పావఝల నరసింహమూర్తి గారు 14.మద్ది పుల్లారావు గారు 15. పిన్నక నాగేశ్వర రావు గారు  16.కవిత వెంకటేశ్వర్లు గారు 17.లలితా చండి గారు 18.బొప్పెన వెంకటేష్ గారు  19.దేవికా రాణి రత్నాకర్ రావు గారు  20.పొర్ల వేణు గోపాల్ రావు గారు  21.కొంజేటి రాధిక గారు  22.గుండ్ల రాజు గారు  23.గొర్రెపాటి శ్రీను గారు  *********************************  1 దోసపాటి వేంకటరామచంద్రరావు * కవనజ్యోతి పౌర్ణమ కవితలపోటీ మాఘమాసం అంశం:శివరాత్రి శీర్షిక:శివోహం! శివం!శివోహం!శివశంకరం మాఘమాసంలోనీ సంబరం శివనామస్మరణం ఉపవాసం జాగరణం జగమంతా నీకీర్తనం అదెంతో పర్వదినం పామరుడినుండి పండితులవరకు నీధ్యానమే నిరంతర అభ...

స్వాతంత్ర్య దినోత్సవం 15/08/2020

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు ఐతగోని వెంకటేశ్వర్లు ****************** ** Singer మన కవితా గానం సమన్వయకర్త శివునూరి లలితాకృష్ణ గారు. కవి వరుల జాబితా 1.ఇంద్రావత్ రాహుల్ గారు 2.శ్రీహరి ఏలె గారు 3.పురుషోత్తం రెడ్డి గారు 4.స్వర్ణ సమత గారు 5.సునీల్ యాదవ్ గారు 6.వల్లాల విజయ లక్ష్మి గారు 7.సర్ఫరాజ్ అన్వర్ గారు 8.డాక్టర్ ఆంజనేయులు గారు 9.మర్రి జయశ్రీ గారు **************** 1.ఇంద్రావత్ రాహుల్ గారు 2. [14/08, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️✳️✳️✳️ *అంశం* :  స్వాతంత్ర దినోత్సవం  *శీర్షిక* : మన స్వాతంత్రం   *తేది*:  14/08/2020   *మన స్వాతంత్రం* స్వాతంత్రం వచ్చింది సంబరాలు తెచ్చింది పసిడి వెలుగు నింపింది దేశం ఎంతో మెరిసింది మన జెండా ఎగిరింది దేశభక్తి ఎగిసింది నవశక్తి కదిలింది అది మనకు ఎంతో నచ్చింది జాతిపిత గాంధీజీ మన నేత నెహ్రూజీ వీర శక్తి అల్లూరి వీర నేత నేతాజీ ఆగస్టు 15 అందరికీ నవోదయం దేశానికి శుభోదయం భరతవని  పర్వదినం చరిత్ర చూస్తే వీరగ...