Skip to main content

స్వదేశీ make in India


అంశం
స్వదేశీ
***""""
నిర్వహణ
వీరా గుడిపల్లి
శివునూరి లలితాకృష్ణ
మెరుగు మధు
ఐతగోని వెంకటేశ్వర్లు
*****"****""******""
కవివరుల జాబితా
1.ఇంద్రవత్ రాహుల్ గారు
2.కోరాడ నరసింహా రావు గారు
3.అయిత అనిత గారు
4.దీపక్ న్యాతి గారు
5.స్వర్ణ సమత గారు
6.గుండ్ల రాజు గారు
7.ధనాశి ఉషా రాణి గారు
8.కంచి రవికుమార్ గారు
9.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
10.వల్లాల విజయ లక్ష్మి గారు
11.పాల్వంచ హరికిషన్ గారు
12.సంధ్యా శర్మ గారు
13.ఉరిమిళ్ళ సునంద గారు
14.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
15.డాక్టర్ రాముకు క్రిష్ణ మూర్తి గారు
16.దీపక్ న్యాతి గారు
17.చామల శ్రీ ధర్ గారు
18.పోలా కిషోర్ కుమార్ గారు
19.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
20.మర్రి జయశ్రీ గారు
21.ఛత్రపతి గారు
****************
1
[30/06, 8:05 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
 ★★★★★★★★★

అంశం : స్వదేశీ
తేది : 30/06/2020
 శీర్షిక : అహింసనే ఆయుధం



     *అహింసనే ఆయుధం*



అహింసనే ఆయుధం
అహింస ఆయుధంతో
భారతావని బానిస సంకెళ్ళను
తొలగించిన శాంతి దూత
 సత్యమేవ జయతే నినాదాన్ని
 సర్వ జగతిలో చాటిచెప్పిన నేత
 శ్రమ విలువను పెంచుతూ
 స్వదేశీ వస్త్రాలను
 రూపొందించిన జాతిపిత
 సహనానికి హద్దులు లేవని
 సాధించు లేదా మరణించు
 అనే  సందేశంతో
 జన జాగృత పరిచిన
 స్ఫూర్తి ప్రదాత
 మతం కంటే మానవత్వమే
 ప్రధానమని చెప్పిన
 తనువును దానం
 చేసిన త్యాగం దాత
 నీకు ఇవే మా జోహార్లు..



*హామీ పత్రం*: ఈ కవిత నేను స్వయంగా రాసాను... అని హామీ ఇస్తున్నాను..

    ధన్యవాదములు.. 🌹


*ఇంద్రవత్ రాహుల్*
   *నిజామాబాద్*
  *9848054079*
2
[30/06, 8:07 PM] Korada: కవితా గానం
పోటీఅంశం:- స్వదేసీ
కోరాడనరసింహారావు ;  వద్దు-వద్దు
            విదేశీ...!
          *********
సహజప్రేమమయమైనకన్నతల్లిని  వీడి ...
స్వార్ధంతో ...స్వప్రయోజనంకోసం... ప్రేమను నటించే సవతితల్లినిప్రేమించటం,అవివేకమేకదూ!
పరాయిమోజులో ...
మనని మనం చుల  కన చేసుకోవటం గొప్పా....!?

స్వదేశీ నూలుగుడ్డ
కాస్తముతకైనా....దీనిచల్లదనం...ఆరోగ్యం ఆ సిల్కు  గుడ్డ కెక్కడుంది  !?

కురూపియైనా...కన్నతల్లినే మిన్నగా ప్రేమించి పూజించే  సంస్కృతి మనది!

మనదేశీయ ఉత్పత్తు ల్ని ప్రేమించి ప్రోత్సహించటం కన్నా ఉపకార మింకేముంటుంది?!

స్వదేశీతో ...సమృద్ధినిసాధించటం కన్నా
మనం చేసే మహోప కారం,మరొకటుండదుకదా....!

ప్రపంచమంతా...ఏకబజారుగా మారిపో  వచ్చును గాక...!
మన వేలుతో మన కన్నునే పొడుచుకో
వచ్చునా....!!

మనదేశంతో చేసిన వ్యాపారంతో  అత్యధిక లాభాలను  గడించి ఆ సొమ్మునే  మారణాయుధాలుగా మార్చిమనవినాశ
నానికే కుట్రలు పన్నే వారిని ప్రోత్సహించ వచ్చా ...!

మనల్నిగౌరవించి...
అభిమానించేవారితో
సరేసరి...!
కుట్రలు,కుతంత్రాలతో వెన్నుపోట్లు పొడిచే  వారితో కూడదు కదా...!

గాంధీజీ ఏనాడో ప్రతి పాడించిన విదేశీ వాస్తు బహిష్కరణ  స్వదేశీ ని ప్రత్సహించటం....,
మనం ఖచ్చితంగా అమలు జరుప వలసిన సమయం ఆసన్నమైనది !
వద్దు-వద్దు  విదేశీ !
ప్రోత్సహించుస్వదేశీ
జయ-జయ.... జయహో భారత్ !
*****************
.......కోరాడ.
3
[30/06, 8:14 PM] Anitha Aitha Poetess: *కవితాగానం*

అయిత అనిత
అంశం : స్వదేశీ
శీర్షిక: *ఏనాడో చెప్పెను ఆ మహానుభావుడు*


స్వాతంత్ర్యానికి పూర్వమే
వందేమాతరమంటూ గర్జించాం!

విదేశీ వస్తు బహిష్కరణకు
నడుం కట్టాం!

ఖద్దరు దుస్తులే ధరించి
జాతి ఖ్యాతిని పెంచాం!!

మరి ఇప్పుడేంటి!
చైనా యాప్ ల వెంట దండు తీస్తున్నాం!

టిక్ ట్యాక్ అంటూ సోకులు పడుతున్నాం!
అగ్గువకు దొరుకుతున్నాయని
చైనా సెల్లులే కొంటున్నాం!!

ఏమైందో చూసారా
కరోనాను పంపి దేశాన్ని వల్లకాడు చేస్తుంది!
పిట్టల లెక్క ప్రాణాలను టపీ మనిపిస్తుంది!!

ఇకనైనా!
జాగ్రత్త పడుదాం
స్వదేశీ యాప్లు...స్వదేశీ వస్తుల వాడకంతో
మన దేశ పురోభివృద్ధి కి పాటుపడదాం!!
చైనాకు ఎదురొడ్డి పొరాడుదాం!


రచన
అయిత అనిత
8985348424
జగిత్యాల

హామిపత్రం
ఇది నా స్వీయరచన
4
[30/06, 8:28 PM] దీపక్ న్యాతి: *కవితా గానం*
తేదీ : 30-6-2020
పేరు : డా.దీపక్ న్యాతి
అంశం : స్వదేశీ
శీర్షిక : తపనెప్పటికీ ఉండాలి

దేశీయ అభిమానమే స్వదేశీ
ఐక్యత చాటే నినాదమే స్వదేశీ
విదేశీ ప్రాబల్యం పెరిగినప్పుడు
గుర్తుకు వచ్చే పదమే స్వదేశీ
మొఘలులు మహమ్మదీయులు దండయాత్ర చేసినపుడు
స్వదేశీ పద జోలికెళ్లలేదెవరు
బ్రిటిష్ వారు కఠిన నిర్ణయాలతో స్వేచ్ఛను హరించినప్పుడు
స్వతంత్ర ఉద్యమంలో ముఖ్య భూమిక స్వదేశీదే
స్వాతంత్రం వచ్చిన తరువాత స్వదేశీ వస్తువుల నిర్మాణాలకై
ప్రభుత్వమే చాలా పరిశ్రమల స్థాపించింది
స్వదేశీ సర్వసాధారణమై ప్రత్యేకత కోల్పోయింది
ప్రపంచీకరణతో స్వదేశీ కొట్టుకుపోయింది
అతిపెద్ద బజార్లలో ఇండియా ఒకటైంది
ప్రపంచ దేశాల ఉత్పత్తుల వర్తకం
మన భారతదేశంలోని ముఖ్య భూమికనొందింది
పొరుగు దేశాల పొగరనచడానికి
స్వదేశి మళ్లీ నినాదమయింది
స్వదేశీ తపన ఎప్పటికీ ఉండాలి
విదేశీ మోజు తగ్గాలి
వనరుల సంపద మన వద్దే ఉండాలి
నిరుద్యోగం దూరమవ్వాలి

డా.దీపక్ న్యాతి
హైదరాబాది
5
[30/06, 8:32 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*30/06/2020*

*స్వదేశీ*

*జననీ జన్మభూమి శ్చ స్వర్గ
దపి గరీయసి*
కన్నతల్లి _జన్మ భూమి
స్వర్గము కన్నా మిన్న
మన వస్తువులు మనకు
సాంప్రదాయాన్ని_సంస్కృతిని
నేర్పుతూ,
ఆరోగ్యాన్ని _ఆనందాన్ని
ఇస్తాయి
మన దేశ ఔన్న త్యం
మనం కాపాడుకోవాలి
మన ఉత్పత్తులను
మనం వాడాలి
మన జాతిని గౌరవించాలి
మనమే ఇతరులకు
ఆదర్శంగా ఉండాలి
మన వ్యవస్థను పరిరక్షించి
మన దేశ ప్రగతికి పాటు పడాలి
మన పరిశ్రమలను
అభివృద్ధి చేసుకోవాలి
మన పద్దతులను పాటించాలి
మన దేశ ము పవిత్ర భూమి
ఆర్య వర్థనం_కార్య నిర్వహణ
ము
మన దేశము నుండే ప్రారంభ
మైంది
మనల్ని మనం కాపాడుకుంటూ
దేశ పురోగతికి చేయుతనిద్ధాం
చేయి చేయి కలిపి అయిక్యతాభావాన్ని చాటుదాం
అందరం హాయిగా ఉందాం.

*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
6
[30/06, 9:13 PM] Gundla Raju Sir: కవితా గానం
కవితా అంశము : *స్వదేశి*

*స్వదేశి*  పదం నా వీనులకు సోకగానే నా నరనరాల్లో దేశభక్తితో రక్తం ఉరకలు వేస్తోంది..

పశ్చిమ దేశపు సంస్కృతులను
విడనాడుదాం...
మనదేశపు సంస్కృతులను ఆచరిద్దాం...

భయము గొల్పునది పరధర్మము
బతుకునిచ్చునది స్వధర్మము....

మన వ్యవసాయము మనం చేసుకుందాం
మన ఆహారమును మనం పండించుకుందాం...

మన పరిశ్రమలను మనం స్థాపించుకుందాం
మన వస్తువులను మనం తయారు చేసుకుందాం...

మనం
*భూమాత, గోమాత, ప్రకృతిమాత* అని
మట్టిని పూజిస్తాం...
పుట్టను కొలుస్తాం...
చెట్టుకు మొక్కుతాం...
మనిషిని ప్రేమిస్తాం...
మానవతను చాటుతాం...
ఇది మన సంస్కృతి!
ఇది మన నాగరికత!

*స్వదేశి* ఒక పదం కాదు
మనదేశ సమగ్రత, సార్వభౌమాధికారమునకు *రక్షా కవచం* శాంతిని నెలకొల్పే *సమ్మోహన అస్త్రం*

*గుండ్లరాజు*
*సిద్దిపేట*
9885257050.
7
[30/06, 9:29 PM] ధనాసి ఉషారాణి తలకోన: *కవితా గానo*
అంశము.స్వదేశీ
.....
విదేశీ అలవాట్లకు మొగ్గు చూపకు
మన పూర్వీకుల ఆచారాలు మరిచిపోక
అణువణువు సoస్కృతిన దాగిన మన నాగరికతను
మరువవద్దు కలలోనైనా
లక్షలు ఖర్చుపెట్టి విదేశీ చదువులు అనుచూ ప్రాకులాడకు
కట్టుబొట్టు దేశదేశాలకు ఆదర్శం మన భారతదేశం
విదేశీ వస్తువులు వాడి ప్రాణాలు కోల్పోయి
మనిషి ఆయువుప్రమాణము  తగ్గిపోయి
తిరోగమనము లోకి వెళుతున్నా మేలుకోవు ఎందుకని?
మన ఆచారాలు మనకు శ్రీరామరక్ష
బతుకు విలువ తెలుసుకోని స్వదేశీ వస్తువులు వాడుమా
భావితరాలకు ఆదర్శముగా నిలువుమా
దేశభక్తి చాటి భరతమాతకు ముద్దుబిడ్డగా నిలువుమా
భారతీయ వీరత్వమును చాటుమా జై భారత్ జై జై భారత్

ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
భాకరాపేట





8
[30/06, 8:05 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
 ★★★★★★★★★

అంశం : స్వదేశీ
తేది : 30/06/2020
 శీర్షిక : అహింసనే ఆయుధం



     *అహింసనే ఆయుధం*



అహింసనే ఆయుధం
అహింస ఆయుధంతో
భారతావని బానిస సంకెళ్ళను
తొలగించిన శాంతి దూత
 సత్యమేవ జయతే నినాదాన్ని
 సర్వ జగతిలో చాటిచెప్పిన నేత
 శ్రమ విలువను పెంచుతూ
 స్వదేశీ వస్త్రాలను
 రూపొందించిన జాతిపిత
 సహనానికి హద్దులు లేవని
 సాధించు లేదా మరణించు
 అనే  సందేశంతో
 జన జాగృత పరిచిన
 స్ఫూర్తి ప్రదాత
 మతం కంటే మానవత్వమే
 ప్రధానమని చెప్పిన
 తనువును దానం
 చేసిన త్యాగం దాత
 నీకు ఇవే మా జోహార్లు..



*హామీ పత్రం*: ఈ కవిత నేను స్వయంగా రాసాను... అని హామీ ఇస్తున్నాను..

    ధన్యవాదములు.. 🌹


*ఇంద్రవత్ రాహుల్*
   *నిజామాబాద్*
  *9848054079*
9
[30/06, 8:07 PM] Korada: కవితా గానం
పోటీఅంశం:- స్వదేసీ
కోరాడనరసింహారావు ;  వద్దు-వద్దు
            విదేశీ...!
          *********
సహజప్రేమమయమైనకన్నతల్లిని  వీడి ...
స్వార్ధంతో ...స్వప్రయోజనంకోసం... ప్రేమను నటించే సవతితల్లినిప్రేమించటం,అవివేకమేకదూ!
పరాయిమోజులో ...
మనని మనం చుల  కన చేసుకోవటం గొప్పా....!?

స్వదేశీ నూలుగుడ్డ
కాస్తముతకైనా....దీనిచల్లదనం...ఆరోగ్యం ఆ సిల్కు  గుడ్డ కెక్కడుంది  !?

కురూపియైనా...కన్నతల్లినే మిన్నగా ప్రేమించి పూజించే  సంస్కృతి మనది!

మనదేశీయ ఉత్పత్తు ల్ని ప్రేమించి ప్రోత్సహించటం కన్నా ఉపకార మింకేముంటుంది?!

స్వదేశీతో ...సమృద్ధినిసాధించటం కన్నా
మనం చేసే మహోప కారం,మరొకటుండదుకదా....!

ప్రపంచమంతా...ఏకబజారుగా మారిపో  వచ్చును గాక...!
మన వేలుతో మన కన్నునే పొడుచుకో
వచ్చునా....!!

మనదేశంతో చేసిన వ్యాపారంతో  అత్యధిక లాభాలను  గడించి ఆ సొమ్మునే  మారణాయుధాలుగా మార్చిమనవినాశ
నానికే కుట్రలు పన్నే వారిని ప్రోత్సహించ వచ్చా ...!

మనల్నిగౌరవించి...
అభిమానించేవారితో
సరేసరి...!
కుట్రలు,కుతంత్రాలతో వెన్నుపోట్లు పొడిచే  వారితో కూడదు కదా...!

గాంధీజీ ఏనాడో ప్రతి పాడించిన విదేశీ వాస్తు బహిష్కరణ  స్వదేశీ ని ప్రత్సహించటం....,
మనం ఖచ్చితంగా అమలు జరుప వలసిన సమయం ఆసన్నమైనది !
వద్దు-వద్దు  విదేశీ !
ప్రోత్సహించుస్వదేశీ
జయ-జయ.... జయహో భారత్ !
*****************
.......కోరాడ.
10
[30/06, 8:14 PM] Anitha Aitha Poetess: *కవితాగానం*

అయిత అనిత
అంశం : స్వదేశీ
శీర్షిక: *ఏనాడో చెప్పెను ఆ మహానుభావుడు*


స్వాతంత్ర్యానికి పూర్వమే
వందేమాతరమంటూ గర్జించాం!

విదేశీ వస్తు బహిష్కరణకు
నడుం కట్టాం!

ఖద్దరు దుస్తులే ధరించి
జాతి ఖ్యాతిని పెంచాం!!

మరి ఇప్పుడేంటి!
చైనా యాప్ ల వెంట దండు తీస్తున్నాం!

టిక్ ట్యాక్ అంటూ సోకులు పడుతున్నాం!
అగ్గువకు దొరుకుతున్నాయని
చైనా సెల్లులే కొంటున్నాం!!

ఏమైందో చూసారా
కరోనాను పంపి దేశాన్ని వల్లకాడు చేస్తుంది!
పిట్టల లెక్క ప్రాణాలను టపీ మనిపిస్తుంది!!

ఇకనైనా!
జాగ్రత్త పడుదాం
స్వదేశీ యాప్లు...స్వదేశీ వస్తుల వాడకంతో
మన దేశ పురోభివృద్ధి కి పాటుపడదాం!!
చైనాకు ఎదురొడ్డి పొరాడుదాం!


రచన
అయిత అనిత
8985348424
జగిత్యాల

హామిపత్రం
ఇది నా స్వీయరచన

[30/06, 8:28 PM] దీపక్ న్యాతి: *కవితా గానం*
తేదీ : 30-6-2020
పేరు : డా.దీపక్ న్యాతి
అంశం : స్వదేశీ
శీర్షిక : తపనెప్పటికీ ఉండాలి

దేశీయ అభిమానమే స్వదేశీ
ఐక్యత చాటే నినాదమే స్వదేశీ
విదేశీ ప్రాబల్యం పెరిగినప్పుడు
గుర్తుకు వచ్చే పదమే స్వదేశీ
మొఘలులు మహమ్మదీయులు దండయాత్ర చేసినపుడు
స్వదేశీ పద జోలికెళ్లలేదెవరు
బ్రిటిష్ వారు కఠిన నిర్ణయాలతో స్వేచ్ఛను హరించినప్పుడు
స్వతంత్ర ఉద్యమంలో ముఖ్య భూమిక స్వదేశీదే
స్వాతంత్రం వచ్చిన తరువాత స్వదేశీ వస్తువుల నిర్మాణాలకై
ప్రభుత్వమే చాలా పరిశ్రమల స్థాపించింది
స్వదేశీ సర్వసాధారణమై ప్రత్యేకత కోల్పోయింది
ప్రపంచీకరణతో స్వదేశీ కొట్టుకుపోయింది
అతిపెద్ద బజార్లలో ఇండియా ఒకటైంది
ప్రపంచ దేశాల ఉత్పత్తుల వర్తకం
మన భారతదేశంలోని ముఖ్య భూమికనొందింది
పొరుగు దేశాల పొగరనచడానికి
స్వదేశి మళ్లీ నినాదమయింది
స్వదేశీ తపన ఎప్పటికీ ఉండాలి
విదేశీ మోజు తగ్గాలి
వనరుల సంపద మన వద్దే ఉండాలి
నిరుద్యోగం దూరమవ్వాలి

డా.దీపక్ న్యాతి
హైదరాబాది
5
[30/06, 8:32 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*30/06/2020*

*స్వదేశీ*

*జననీ జన్మభూమి శ్చ స్వర్గ
దపి గరీయసి*
కన్నతల్లి _జన్మ భూమి
స్వర్గము కన్నా మిన్న
మన వస్తువులు మనకు
సాంప్రదాయాన్ని_సంస్కృతిని
నేర్పుతూ,
ఆరోగ్యాన్ని _ఆనందాన్ని
ఇస్తాయి
మన దేశ ఔన్న త్యం
మనం కాపాడుకోవాలి
మన ఉత్పత్తులను
మనం వాడాలి
మన జాతిని గౌరవించాలి
మనమే ఇతరులకు
ఆదర్శంగా ఉండాలి
మన వ్యవస్థను పరిరక్షించి
మన దేశ ప్రగతికి పాటు పడాలి
మన పరిశ్రమలను
అభివృద్ధి చేసుకోవాలి
మన పద్దతులను పాటించాలి
మన దేశ ము పవిత్ర భూమి
ఆర్య వర్థనం_కార్య నిర్వహణ
ము
మన దేశము నుండే ప్రారంభ
మైంది
మనల్ని మనం కాపాడుకుంటూ
దేశ పురోగతికి చేయుతనిద్ధాం
చేయి చేయి కలిపి అయిక్యతాభావాన్ని చాటుదాం
అందరం హాయిగా ఉందాం.

*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
6
[30/06, 9:13 PM] Gundla Raju Sir: కవితా గానం
కవితా అంశము : *స్వదేశి*

*స్వదేశి*  పదం నా వీనులకు సోకగానే నా నరనరాల్లో దేశభక్తితో రక్తం ఉరకలు వేస్తోంది..

పశ్చిమ దేశపు సంస్కృతులను
విడనాడుదాం...
మనదేశపు సంస్కృతులను ఆచరిద్దాం...

భయము గొల్పునది పరధర్మము
బతుకునిచ్చునది స్వధర్మము....

మన వ్యవసాయము మనం చేసుకుందాం
మన ఆహారమును మనం పండించుకుందాం...

మన పరిశ్రమలను మనం స్థాపించుకుందాం
మన వస్తువులను మనం తయారు చేసుకుందాం...

మనం
*భూమాత, గోమాత, ప్రకృతిమాత* అని
మట్టిని పూజిస్తాం...
పుట్టను కొలుస్తాం...
చెట్టుకు మొక్కుతాం...
మనిషిని ప్రేమిస్తాం...
మానవతను చాటుతాం...
ఇది మన సంస్కృతి!
ఇది మన నాగరికత!

*స్వదేశి* ఒక పదం కాదు
మనదేశ సమగ్రత, సార్వభౌమాధికారమునకు *రక్షా కవచం* శాంతిని నెలకొల్పే *సమ్మోహన అస్త్రం*

*గుండ్లరాజు*
*సిద్దిపేట*
9885257050.
7
[30/06, 9:29 PM] ధనాసి ఉషారాణి తలకోన: *కవితా గానo*
అంశము.స్వదేశీ
.....
విదేశీ అలవాట్లకు మొగ్గు చూపకు
మన పూర్వీకుల ఆచారాలు మరిచిపోక
అణువణువు సoస్కృతిన దాగిన మన నాగరికతను
మరువవద్దు కలలోనైనా
లక్షలు ఖర్చుపెట్టి విదేశీ చదువులు అనుచూ ప్రాకులాడకు
కట్టుబొట్టు దేశదేశాలకు ఆదర్శం మన భారతదేశం
విదేశీ వస్తువులు వాడి ప్రాణాలు కోల్పోయి
మనిషి ఆయువుప్రమాణము  తగ్గిపోయి
తిరోగమనము లోకి వెళుతున్నా మేలుకోవు ఎందుకని?
మన ఆచారాలు మనకు శ్రీరామరక్ష
బతుకు విలువ తెలుసుకోని స్వదేశీ వస్తువులు వాడుమా
భావితరాలకు ఆదర్శముగా నిలువుమా
దేశభక్తి చాటి భరతమాతకు ముద్దుబిడ్డగా నిలువుమా
భారతీయ వీరత్వమును చాటుమా జై భారత్ జై జై భారత్

ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
భాకరాపేట
8
[01/07, 8:07 PM] Kanchi Ravi Kumar Poet: 01.7.2020.

_'కవితా గానం'_.
అంశం:
*స్వదేశీ.*

శీర్షిక:
*మహాత్ముని మార్గం.*

నా కవిత్వం-178,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.

 🔆..🔅     🔅..🔆

మహాత్ముడి స్వదేశీ  ఆచరణ
 విదేశీ వస్తు బహిష్కరణ
 మరొక్క మారు ఊపందుకున్నది

రెక్కలు ముడిచిన
 ఉత్పాదన ఆపిన
 స్వయం శక్తులు కోల్పోయిన
 తుప్పుపట్టిన ఇరుసులు
 మూలకు ముడిచిన
  పరికరాలు

 సాంకేతిక నైపుణ్యం 
 విడిచిన భారతీయుల
  స్వాభిమాన శ్వాసలు
 స్వావలంబన తేజోకాంతులు 
 వెదజల్లే
 తరుణం రానే వచ్చింది

స్వయం ఛరకలై దేశీయ ఉత్పత్తులు  వడికే శుభతరుణం ఉరకలై
  రానే వచ్చింది

 యేండ్ల తర్వాత కూడా
 మహాత్ముడి మార్గమే
  శరణ్యమని

   స్వయం ఉత్పత్తుల
  పరిశ్రమల ప్రోద్భలమే
    సదా ఆచరణీయ     
   ప్రత్యామ్నాయ   
     సన్మార్గమనే
  జ్ఞానోదయం
     కలిగింది.

 స్వయంఛోదిత 
  నవభారత నిర్మాణం
 ఆరంభమైనది
  శాంతమూర్తి కలల 
   సౌభాగ్యం
 విరియనుంది.

_-రవికుమార్ కంచి_
🙏💐.

▪️▪️☘️🌹▪️▪️
9
[01/07, 8:12 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** స్వదేశీ ***
                         ✍️డా.పాండాల.

త్రేతాయుగంలో లక్ష్మణుడు అన్నతో "అయోధ్య పురికన్న మిన్నగా
సుందరసుకుమార శిల్పనాట్యకళా భంగిమలతో కూడిన కుబేర సౌధాలను చూసి "మనం ఇక్కడే ఉంటే బాగుంటదికదా!అన్నంతలోనే రాముడు"జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ" యంటూ
వింతలు విశేషాలు సర్వసాధారణం ఎవరికైనా?సోదరా!
సంతృప్తిలేని సంస్కారం లాంటివవి మనసుకు కావాలి స్వదేశీయమనే
స్వేచ్ఛ ప్రతిజీవికి ముఖ్యమని
అయోధ్యకుపయనం అవనిజతో
పుష్పక విమానంలో... !

యుగాలు మారినా స్వదేశీ సంస్కృతి అడుగులే ఆంగ్లేయుల్ని
వెళ్ళేట్టు చేసింది
ఖద్దరు దుస్తులు భారత ఖ్యాతిని పెంచింది!!
నేడు...
అగ్గువనీ చైనా ఫోన్లు  బాగుంటయని ఎగపడికొంటిమి ఏమైందిపుడు?
చైనా యాప్ ల మోజులో మునిగితిమి మురిసి తేలిపోతిమి
చాటుమాటు టిక్ ట్యాక్ చిందులు చైనా మోసం కాదా..!
గబ్బిలాల్ని తిని సృష్టించిన కరోనా వైరస్ ను కనపడకుండా పంపిణి జేసి, వల్లకాడును చేస్తుంది,సరిహద్దుల్ని చెరిపేసి తొండిగ యుద్దం చేస్తుంది....!

అలర్టుగుండి అవలోకనతో జాగరూకులై,
స్వదేశీ సంస్కృతి సంపన్నులమై,
విద్యుక్త ధర్మమే ప్రథమ బాధ్యతగ
పవిత్ర హృదయం భారత జననం
ఆదర్శులమై స్వదేశమంటూచాటాలి..!

సిద్దాంత రాద్దాంతాలెందుకు?
దండుగ చికాకు పెంచెటి
చిల్లరవేశాలు కాక పోతే మరేమి?
దేశస్థితిని గ్రహించి కదంతొక్కాల్సినవేళ
కుల మతాలు కూటములేల?
స్వదేశివాదమే మనకిక ముద్దు
త్రికరణశుద్ధుల సంస్కరణం..
స్వదేశి భావమే సమాయత్తం
జై భారత్ జై జగతంటూ...!
రేపటి కోసం తప్పని ఈ విధి...!

✍️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి

హామిపత్రం:
ఇది నాస్వంత రచన9912180054
10
[01/07, 8:47 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక;**స్వదేశీ***
---------******------------

పరోపకారమే పరమావధిగా మన
ప్రఖ్యాత ప్రాచీన విశ్వవిద్యాలయాలు
నలంద తక్షశిలలు వేలమంది విద్యార్థులకు
విద్యాభిక్ష పెట్టి పంచెను విజ్ఞానాన్ని

అనాది నుండి వారి *పట్టు* కు
మనదే అతి గట్టి గిరాకి
తన కొ(చె)త్త వస్తువులన్నిటికీ
మనదే అతి పెద్ద మార్కెట్

అవన్నీ మరచి పక్కదేశం
మనను భావిoచే శత్రువల్లే
రాక్షసతిoడితో జగానికి తను తెచ్చిన
కరోనా వల్ల తనకొచ్చే చెరగని మచ్చ

నమ్మకం పెట్టుబడులను కోల్పోయి
మన *భారత్* మీద అసూయతో
సరిహద్దులో శాంతిని భగ్నపరిచే
సైనికుల ఉసురుతీయ సాహసించే

మన డబ్బుతో మననే వేధించసాగే
మనకిoకా కావాలా శత్రు ఉత్పత్తులు?!
మనకున్నాయిగా దేశభక్తి ఆత్మాభిమానాలు!
మానేద్దాం శత్రుసాంకేతికపరికరాల వాడకాలు

నమ్మకదోహం చైనాకు కొత్తేమీ కాదు
పంచశీలమ0టూ యాభై ఏళ్లకు ముందే
వెన్నుపోటుతో యుద్ధానికి పాల్పడే
'మెక్ మోహన్'ను కాదంటూ చొరబడే

దేశభక్తిని చూపించే సమయమిది
మన వినియోగశక్తియుక్తులు ప్రదర్శిద్దాం
అందరం సంయమనoతో ప్రవర్తిద్దాం
ఇండియా సత్తాను చూపి తీరుదాం

ఇది *మరో జాతీయ ఉద్యమం*
*స్వదేశీ ఉత్పత్తులనే వాడుదాం*
*మన శ్రామికశక్తిని గౌరవిద్దాం*
*మన సోదరులకు జీవికనిద్దాం*

:వల్లాల*విజయలక్ష్మి*
*ఆలేరు*
11
[01/07, 8:54 PM] పాల్వంచ హరికిషన్: కవితాగానం
తేది: 01-07-2020
అంశం: స్వదేశీ..
శీర్షిక:  సతతం.!

స్వదేశీ ఆచరణ
మహాత్ముడిదే..
అనుసరణ ఇప్పుడు
న"మో"డీ భారతందే..
వచ్చిందిపుడు  అవసరం..
పెంచాలిప్పుడు మన స్వరం..
ఉపాధి కల్పన మనదే
ఉపాధి పొందేది మనమే
విదేశీని విసిగించాలంటే..
స్వదేశీని ప్రోత్సహించాలి
చైనాను డరాయించాలంటే
నిద్రించే భారత యువాశను
ఉప్పొంగే ఉప్పెనలా ఉసిగొల్పి
వినీలాకాశమే హద్దుగా..
సూర్య కిరణాలోలె ప్రసరించగ..
భారత ఘనతను చాటాలి
భారత దివిటీ జగతిన..
వెలుగులు ప్రసరించాలి..
స్వదేశీ ఘనం మనది
ఎన్నడెరుగని ఆదర్శం కావాలది..
అలాగైతేనే మన దేశ చరితం
ఎవరికీ అందకుండేను సతతం.!

   -- అర్జున ( కలం పేరు )
       పాల్వంచ హరికిషన్
       రామన్నపేట
       9502451780
12
[01/07, 9:06 PM] Sandya Sharma Poetess: కవితాగానం
అంశం : స్వదేశీ
వై.కె.సంధ్యశర్మ
శీర్షిక: మొదలెడదాం!

మొదలెడదాం...
స్వయం జాగృతితో
స్వయం సంపత్తితో...
పెట్టుబడి దారీ ముసుగులో మూలన పడ్డ
చరఖాల చక్రాన్ని తిప్పి
మేథో మథనంతో
విజ్ఞాన సముపార్జనలో
అణగారిన వృత్తులకూ
చేయూత నిస్తూ...

సౌభ్రాతృత్వంతో ఒకే తాటిపై నిలబడే
నవీన భారతావనికి అండగా
మేక్ ఇన్ ఇండియాతో
మూలాలను తవ్వి చూద్దాం...

క్రొంగొత్త రూపాలకు జీవం పోసి
అసమానతలను రూపు మాపేలా
ప్రజాస్వామ్యపు పరదాలో
పంచతంత్ర కథలనూ వల్లె వేస్తూ
పరదేశీ సంస్కృతీ విడనాడే
సామాజిక విప్లవ కేతనం ఎగురవేద్దాం...

ఏనాటకీ చెదరని చరితగా మిగిలిన
మహాత్ముని స్వదేశీ ఉద్యమమే స్వతంత్ర్య
పోరాటానికి నాందిగా
నేటికీ మార్గదర్శమై తడబడే అడుగులను
సరిదిద్దుకుందాం...
మళ్ళీ
మొదలెడదాం...
స్వయం జాగృతితో
స్వయం సంపత్తితో...
సరికొత్తగా రూపొందిద్దాం *మేడ్ ఇన్ ఇండియా!*
13
[01/07, 9:19 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ::01-07-2020
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం:: స్వదేశీ ఉద్యమం...
::::::::::::::::::::::::::::::::::
ఇప్పుడిప్పుడే తెలుస్తోంది
మనమూ మనది అనుకోవడంలో గొప్ప తనం!
అందరిలా ఆధారపడ్డామనీ  పడిన చైనా భ్రమ!
తన కోడి కూయందే తెల్లారదనే అతి తెలివి
ఆత్మాభిమానాన్ని  అసహాయతగా
అంచనా వేసిన మూర్ఖత్వం ముట్టెపై
కుక్క కాటుకు చెప్పు దెబ్బలా
వాడి సాంకేతిక యాప్ ల నిషేధం!

మనమేంటో ఋజువు చేసుకునే అవకాశం మళ్ళీ ఒకసారి వచ్చింది!
ఆనాటి వీరోచిత ఉద్యమం  గుర్తుకొచ్చేలా..

వందేమాతర గీతం రగిలించిన జాతీయతా భావం
నిద్రాణమైన స్వరాజ్య కాంక్షను
ఉద్యమంగా మార్చింది!

స్వదేశీ స్వరాజ్  లక్ష్యంగా
సంపూర్ణ బహిష్కరణే ధ్యేయంగా
మన భారతీయులు పోరాడిన ఘట్టాలు..
స్వదేశీ పరిశ్రమలకు చేయూత నిచ్చి
వలసవాదులను సవాల్ చేసిన
ఆనాటి  రోజులను గుర్తు చేస్తూ...
 ప్రపంచీకరణలో ఆర్ధిక స్వేచ్చ హరణాన్ని ఆపేసి
విదేశాలపై ఆధారపడకుండా
స్వదేశీ ఉత్పత్తుల దిశగా  వేస్తున్న అడుగులు
మన భారతీయ భవిష్యత్తు వేసుకునే
బంగారు  బాటలు..

ప్రపంచానికి సంస్కృతి సంప్రదాయాలు నేర్పిన మన దేశం
ప్రస్తుతం స్వదేశీ వస్తువుల ఉత్పత్తిలో
మార్గం చూపుతుందనడంలో..
లేదిక ఎలాంటి సందేహం!
నేడూ రేపు మనదే ఇక..
14

[02/07, 8:36 PM] Balloori Umadevi Poetess: డా.బల్లూరి ఉమాదేవి
అంశం: స్వదేశీయత

 స్వధర్మే నిధనం శ్రేయః
 అన్నా డలనాడా గీతాచార్యుడు
 మన జాతి ధర్మమైన, వాడే వస్తువైనా
 స్వదేశీయమైతేనే  శ్రేష్టం
 అమ్మ పాలకు సాటి  అమ్మ పాలే
 గాని పోతపాలు పోతపాలేగా
 మానేద్దాం విదేశీ వస్తు వ్యామోహం
 ఆదరిద్దాం స్వదేశీ వస్తువులను నిరంతరం
  బాపూజీ చూపిన బాటను అనుసరిద్దాం
 రగలాలి నరనరాల్లో ఆనాటి స్ఫూర్తి
 అహింసయే ఆయుధంగా చేపట్టి
 నూలు వడికి స్వదేశీ వలువలు నేసి
 భారతీయుల సత్తా చాటాడు బాపూజీ
 ఆ స్ఫూర్తిని తలపోస్తూ సాంకేతిక జోడిస్తూ
  అడుగులు వేద్దాం రారండి
 నాలుకతో తేనెను పంచి గుండెల్లో విషం
 నింపుకున్న దుష్టశక్తుల నణచడానికై
 స్వదేశి ఉద్యమం అస్త్రంగా
విదేశీ   వస్తుబహిష్కరణమే ధ్యేయంగా
కలిసికట్టుగా ఐక్యత చాటగ రారండి.
15
[02/07, 8:49 PM] Ramaka: 🇮🇳కవితా గానం🇮🇳

పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:2-7-2020
అంశం:స్వదేశీ
ప్రక్రియ:వచనకవిత్వం
శీర్షిక: స్వావలంబన
**************************

దేశాన్ని సుసంపన్నం చేసే మార్గం
అస్తిత్వానికి లభించే అందలం
కుటీరపరిశ్రమలు,చేతివృత్తులకు సాయం
దేశసంపదను పెంచుకొనే మార్గం
గాంధీజీ సూచించిన మంత్రం
బ్రిటిషువారిని ఆఙదోళనకు గురిచేసిన వైనం
దేశీయ ఉత్పత్తులకు శ్రీకారం
గ్రామస్వరాజ్యానికి ఊతం
ఆత్మగౌరవానికి అందించిన నీరాజనం
అభివృద్ధికి,స్వావలంబనకు అవకాశం
స్వీయ సమృద్ధికి సింహాసనం
దేశభక్తికి,స్థూలజాతీయోత్పత్తికి
నాందీప్రస్తావనం
మన ధనం మన దగ్గర ఉండే తంత్రం
ఆదరణకు,ఆచరణకు ఉపదేశ సూత్రం
సహాయనిరాకరణం నాటి నినాదం
స్వాతంత్ర్యోద్యమంలో రగిలిన ఉద్యమం
నేటికీ ఆచరించదగ్గ వాణిజ్య రహస్యం
జాతిని ఏకం చేసే ప్రణవం
నిరుద్యోగాన్ని తొలగించే ఉపదేశం
చిన్న,మధ్యతరహా వ్యాపారాలకు ఆధారం
ప్రతిపౌరుడు తప్పక ఆదరించాల్సిన కర్తవ్యం
స్వదేశీ నినాదం కాదు
స్వదేశీ ఉద్యమం కాదు
స్వదేశీ దేశ అస్తిత్వ స్వాభిమానం.
16
[02/07, 9:06 PM] దీపక్ న్యాతి: *కవితా గానం*
తేదీ : 02-7-2020
పేరు : డా.దీపక్ న్యాతి
అంశం : స్వదేశీ
శీర్షిక : మోజు పెరగాలి

దేశీయ అభిమానమే స్వదేశీ
ఐక్యత చాటే నినాదమే స్వదేశీ
విదేశీ ప్రాబల్యం పెరిగినప్పుడు
గుర్తుకు వచ్చే పదమే స్వదేశీ
మొఘలులు మహమ్మదీయులు దండయాత్ర చేసినపుడు
స్వదేశీ పద జోలికెళ్లలేదెవరు
బ్రిటిష్ వారు కఠిన నిర్ణయాలతో స్వేచ్ఛను హరించినప్పుడు
స్వతంత్ర ఉద్యమంలో ముఖ్య భూమిక స్వదేశీదే
స్వాతంత్రం వచ్చిన తరువాత స్వదేశీ వస్తువుల నిర్మాణాలకై
ప్రభుత్వమే చాలా పరిశ్రమల స్థాపించింది
స్వదేశీ సర్వసాధారణమై ప్రత్యేకత కోల్పోయింది
ప్రపంచీకరణతో స్వదేశీ కొట్టుకుపోయింది
అతిపెద్ద బజార్లలో ఇండియా ఒకటైంది
ప్రపంచ దేశాల ఉత్పత్తుల వర్తకం
మన భారతదేశంలోని ముఖ్య భూమికనొందింది
పొరుగు దేశాల పొగరనచడానికి
స్వదేశి మళ్లీ నినాదమయింది
స్వదేశీ తపన ఎప్పటికీ ఉండాలి
విదేశీ మోజు తగ్గాలి
వనరుల సంపద మన వద్దే ఉండాలి
నిరుద్యోగం దూరమవ్వాలి

డా.దీపక్ న్యాతి
హైదరాబాది
17
[02/07, 9:16 PM] Sridar Chamala: స్వదేశి.
ఒక పదం మాత్రమే

ఇంతటి గ్లోబలైజేషన్ లో ఇది వడపోత వల్ల వేరు చేయబడ్డ పదార్థం మాత్రమే

రాజులు సందు చూసి ఆడే నాటకం మాత్రమే

అందుబాటులోకి సరుకులను తేకుండా బీదలను వంచించే మంత్రం మాత్రమే

ఏనాడో బీజాలు వేసి ప్రగతికి పునాది తీయలేదనేి నిజాన్ని సమాధి చేసే అద్భుత నాటకం మాత్రమే

స్వదేశీ కోసం తాపత్రయం కానీ అన్ని పరదేశి యాత్రలని చెప్పలేక చేసిన తప్పిదం మాత్రమే

తారక మంత్రం అభివృద్ధికి తంత్రం కావాలని

అందరికి ఉద్యోగాలు దొరికే యంత్రాలు రావాలని

అమ్మతనం పంచే ఈ భూమి అభివృద్ధికి రూపం ఇకనైనా దాల్చాలని కోరుతూ

మీ చామల శ్రీధర్
18

కవితాగానం
వారాంశం : స్వదేశీ
ప్రక్రియ : వచన కవిత
శీర్షిక : స్వదేశీ తపస్సు

స్వదేశీ అన్నది నరనరాన దేశభక్తితో నిండిన స్వాభిమానం కావాలి
విదేశి వస్తువులను బహిష్కరించడానికి మాత్రమే స్వదేశీ ఉద్యమం పరిమితమైతే
ఆమాటకు అర్థం లేదు

స్వదేశీ ఉద్యమ పునాదుల మీద మనం
విదేశి పాలనను తరిమి కొట్టి 73 సం|| లు
కావస్తున్నా మన దేశం అభివృద్ధి
చెందకపోవడానికి కారణం మనలో
స్వదేశీ అన్న తపన కొరవడడమే

నాడు ప్రపంచానికి ఙ్ఞానశిఖరమై వెలిగిన మనదేశం ఈ రోజు ఇలా వెనకబడడానికి కారణం
మన  భారతీయ విద్యావిధానం వదలి
విదేశి విద్యావిధానం మెాజులో పడి  మనల్ని మనం మరచి పోయాము

మన దేశంలో తయారైన వస్తువులను మనమే కొనకపోవడం వలన మన పరిశ్రమలు మూతపడి
నిరుద్యోగం ప్రబలి దేశ ఆర్థిక అభివృద్ధికి ఆటంకం ఏర్పడి దేశ ఆర్థిక మూలాలు కదిలిపోతున్నాయి

కుటుంబ విలువలకు ఆదర్శ జీవనానికి ప్రపంచానికే మార్గదర్శనంగా నిలిచిన మనం
నేడు విదేశీ సంస్కృతికి అలవాటుపడిపోయి
ప్రేమానురాగాలు బంధాలు ఆప్యాయతలకు
దూరంగా బతుకుతున్నాము

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలలో మనం స్వదేశీ తపస్సును మరచి విదేశీ జపం చేస్తున్నాము

జాతిని మరచిన దేశం నాశనమవ్వును
స్వదేశీ భావన మరచిన ఉనికి ప్రశ్నార్థకమవును
విదేశి తత్వానికి మెాజుపడితే తిరిగి
దేశం పరాయిపాలవ్వును

మన నిత్య జీవితంలో స్వదేశీ అన్న తపన ఒక తపస్సు లాగా చేయాలి అప్పుడే మన జీవితానికి సార్దకత, మన దేశానికి బంగారు భవిత

స్వదేశీ తపస్సు దేశానికి శ్రేయస్సు

            భారత్ మాతాకి జై


---- పోలా కిషోర్ కుమార్
19
[03/07, 8:46 PM] +91 94941 62571: అంశం...స్వదేశీ
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి

విదేశీ వస్తువులను వాడి స్వదేశీ వస్తువులను తిరస్కరించి
దేశాన్ని ఆర్ధికంగా ఆర్ధికవ్యవస్థను
బలోపతంచేయాలి
గాంధీజీ‌ స్వాతంత్ర్య ఉద్యములో బ్రటిష్ వస్త్రాలను,వస్తువులను బహిష్కరించి నిరసనవ్యక్తము చేసారు
చేనేత వస్త్రాలను ,ఖద్ధరును అందరు ధరించి స్వదేశీయ వస్తువులను ప్రోత్సహించారు
నేడు చైనా వస్తువులను బహిష్కరించి ,స్వదేశీవస్తువులను కొనాలి
చైనా అరాచక కృత్యాలకు నిర్వీర్యము చేసి
చైనా ఆర్ధికవ్యవకు మూలస్తంభమైన చైనా వస్తువులపై
నిషేధన భారతప్రభుత్వము విధించడం హర్షదాయకమే
భారతదేశలో వస్ర్రపరిశ్రమలకు చేయూతనిచ్చి
మేధోసంపత్తుతో ముందుకుపోతూ
ఆర్ధిక స్వాలంబన దిశగా అడుగులువేయాలి
విదేశీయుల సంస్కృతిని విడనాడి
వారి వేషధారణని త్యజించి
సనాతసంప్రదాయాలకు ఆలవాలమైన చేనేతపరిశ్రమలకు చేయూతనివ్వాలి
స్వదేశ వస్తువులను ప్రోత్సహించి
పరిశ్రమలకు రాయితీఇవ్వాలి

హామీపత్రము
ఇదినాస్వీయరచన.దేనికిఅనువాదము,అనుకరణకాదు.అముద్రితం

సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
9494162571
20
[04/07, 8:55 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..స్వదేశీ
శీర్షిక.. అభివృద్ధి దిశగా


స్వదేశీ అన్న పదం
భారతదేశ అస్తిత్వం
భారతీయుల ఆత్మాభిమానం
సంపూర్ణ స్వరాజ్యమే లక్ష్యంగా
సాగిన స్వాత0త్ర్య ఉద్యమం
మహాత్ముడి చరఖా యంత్రమే
స్వదేశీ సూత్రం
భారతీయులనేకం చేసి
విదేశీ వస్తు బహిష్కరణ కు ప్రేరణ నిచ్చే
స్వదేశీ ఉత్పత్హుల గౌరవం పెంచే
ప్రగతికి మార్గము వేసే
కరోనా కాలంలో
చైనా విషపు ఆలోచనలను తిప్పికొట్టేందుకు
ఆనాటి బాపూజీ పోరాటాన్ని జ్ఞప్తికి తెస్తూ
మనమేమిటన్నది ఋజువు చేసుకునే మహదావకాశం నేడు లభించే
మహాత్ముడి అడుగుజాడలే మనకు స్ఫూర్తి
ఆ బాటలోనే పయనిద్దాం
మనల్ని మనం సరిదిద్దుకుంటూ
విదేశీ ఉత్పత్తులపై మోజు తగ్గించి
అడుగులు ముందుకు వేద్దాం అభివృద్ధి దిశగా
సరికొత్త భారతావనిని ఆవిష్కరించుకుందాం.
21
[04/07, 9:07 PM] కోమటి మత్స్యగిరి: *మేరా భారత్ మహాన్!*



పుట్టిన గడ్డ
జన్మనిచ్చిన తల్లి ఒడి
రెండూ ఒకటే...
తల్లి కోసం
జన్మభూమి కోసం
ఎప్పుడూ వెనకడుగు వేయొద్దు
"మాతృ"దేశ అభ్యున్నతికై
మరణాన్నైనా ముద్దాడుదాం!
మరో నవోదయానికి
"నాంది" పలుకుదాం!
దేశం కోసం
సైనికుడే కావాల్సిన అవసరం లేదు..
భాధ్యత గల పౌరుడిగా
దేశీయ ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తే
వీర సైనికుడిగా ఎదిగి
మువ్వన్నెల జెండాల్ని
గగనపు అంచులదాక ఎగరేసినట్లే..
తల్లి రుణం
భరత మాత రుణం తీర్చినట్లే..
జై భారత్!
నా కట్టు బొట్టు
కలకాలం వర్ధిల్లాలి
కాబోయే
ప్రపంచ  పెద్దన్న నా దేశం
శాంతి సౌభ్రాతృత్వాల
మేలు కలయిక
సత్యమేవ జయతే గీతిక
ప్రజా గొంతుక
నా భారత్ కి నమో:నమ:
మేరా భారత్ మహాన్
✊✊✊


✍ *ఛత్రపతి*

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...