అంశం ః వందే మాతరం
నిర్వహణవీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం ః
శివునూరి లలితాకృష్ణ
అవధాని
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం
మెరుగు మధు గారు
********************
వందేమాతరం కవివరుల జాబితా
1.ఇంద్రవత్ రాహుల్ గారు
2.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
3.అనుముల తేజస్విని గారు
4.గుమ్మనగారి బాలసరస్వతి గారు
5.కొలచన విజయ భారతి గారు
6.డాక్టర్ షరీఫ్ గారు
7.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
8.దీపక్ న్యాతి గారు
9.కోరాడ నరసింహారావు గారు
10.అయితఅనిత గారు
.11వల్లాల విజయలక్ష్మి గారు
12.సంధ్యా శర్మ గారు
13.పాల్వంచ హరికిషన్ గారు
14.కాల్వ రాజయ్యగారు
15. శివలక్ష్మి రాజశేఖరుని
16 గుండ్ల. రాజు గారు
17.వురిమళ్ళ. సునంద గారు
18.కిషోర్ కుమార్ గారు
19.గంజాం భ్రమరాంబగారు
20..డాక్టర్. బల్లూరి ఉమాదేవి గారు
21.నీలా రంగనాథo గారు
22.డాక్టర్ సుజాతా శేఖర్ గారు
23.పోలా కిషోర్ కుమార్ గారు
24.అంబటి భాను ప్రకాష్ గారు
25.వేంకట కృష్ణ ప్రగడ గారు
26.శ్రీకాంత్ కడార్ల గారు
27.మారుతి దిడ్డి గారు
28.మర్రి జయశ్రీ గారు
29.నాగజ్యోతి శేఖర్ గారు
30.సర్ఫరాజ్ అన్వర్ గారు
31.జ్ఞాన ప్రసూనా శర్మ గారు
***************
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*జ్యేష్ట మాసము పౌర్ణమి పురస్కారాల పోటీ ఫలితాలలో విజేతలు*
ప్రథమ స్థానములో
*డాక్టర్. మహమ్మద్ షరీఫ్ గారు*
ద్వితీయ స్థానంలో
*శ్రీమతి నాగజ్యోతి శేఖర్ గారు*
తృతీయ స్థానములో
*శ్రీమతి వై కె సంధ్య శర్మ గారు*
చతుర్థస్థానంలో
*శ్రీమతి వురిమళ్ళ సునంద గారు*
పంచమ స్థానంలో
*శ్రీమతి గుమ్మన్నగారి*
**బాల సరస్వతి గారు*
ఆరవ స్థానంలో
*శ్రీ దీపక్ న్యాతి గారు*
ఏడవస్థానంలో
*శ్రీ గుండ్ల రాజు గారు*
ఎనిమిదవ స్థానంలో
*శ్రీమతి మర్రి జయశ్రీ గారు*
తొమ్మిదవస్థానంలో
*శ్రీ దిడ్డి మారుతి గారు*
పదవస్థానం లో
*శ్రీ డాక్టర్. రామకకృష్ణ మూర్తి గారు*
విజేతలందరికి హృదయపూర్వక అభినందనలు*
💐💐💐💐💐💐💐
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
1
[05/06, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *అందరికి నమస్కారం*
➖➖➖➖➖➖➖
*కవిత గానం పౌర్ణమి పోటీలు*
★★★★★★★★★★★★★★
అంశం : వందేమాతరం
రచన తేది : 05/06/2020
వారం : శుక్రవారం
మాసం : జ్యేష్ట మాసం
🌕 *పౌర్ణమి*
🇮🇳 *వందేమాతరం*🇮🇳
వీర భారత జాతి!
సత్య ధర్మనిరతి!
ప్రజాస్వామ్య రీతి!
మహనీయ నీతి!
ఇత్యాది మహోన్నత
లక్షణ సమన్వితే..
వందేళ్లు దాటిన వందేమాతరం
మార్చలేదు నీ అవతారం
తరంతరం మారుతున్నా నిరంతరం
నీవు మాత్రం ప్రగతికి
ఆమడ దూరం
ఇకనైనా గుర్తించు
ఈ ఘోరం
లేదంటే బ్రతుకవుతుంది భారం
తీరం కాక ముందే
అగమ్య గోచరం
ధీరవై సాగించు
నీవు సమరం
కావాలి నీవో జ్ఞాన భ్రమరం
తరమాలి అజ్ఞాన తిమిరం
పవిత్రతయే ఎప్పటికీ అమరం
సత్యత స్వచ్ఛతలే అందుకు ఆధారం
సమ సమాజ నిర్మాణ సేవలో సఫలం కావాలి నీ నరనరం
ఈ మార్గంలోనే సాగు నిరంతరం
మోహమొక కారాగారం
అహంకారం అంధకారం
మారాలంటే నీ గ్రహచారం
ఎదురించాలి ఈ అనాచారం
కాకుమరీ సుకుమారం
అపు మనసు చంచల సంచారం
నిన్ను పిలుస్తుంది మా
ఈశ్వరీయ పరివారం
ఇదొక సుందర మానస సరోవరం...
మ
*హామీ పత్రం*: ఈ కవిత నేను స్వయంగా రాసాను... అని హామీ ఇస్తున్నాను..
🎯 *కవి పరిచయం*🎯
★★★★★★★★★★★★★
కవి పేరు : ఇంద్రవత్ రాహుల్
ఊరు : మల్కాపూర్
జిల్లా : ఇందూర్ /నిజామాబాద్
మండలం : ఇందూర్ /నిజామాబాద్
చరవాణి : *9848054079*
2
[05/06, 8:01 PM] Ramaka: 🎯కవితా గానం🎯
*జ్యేష్ఠమాస పౌర్ణమి నగదు*
*బహుమతుల పోటీ*
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:5-6-2020
అంశం: *వందేమాతరం*
ప్రక్రియ:వచనకవిత్వం
శీర్షిక: *స్వదేశీ ఉద్యమం*
**************************
అఖండ భారతాన్ని విభజించి
పాలించాలనుకున్న ఆంగ్లేయుల
పీచమణిచిన ప్రజాఉద్యమం
పాలనాసౌలభ్య ముసుగులో
బ్రిటిష్ రాజకీయ కుతంత్రాన్ని
ఎదిరించిన తొలి ప్రజాఉద్యమం
అతివాదుల,మితవాదుల
అభిప్రాయభేదాల మధ్య అవతరించిన మహోద్యమం
స్వదేశీ, స్వరాజ్యాలే ఉద్యమ ప్రేరణై
జాతిని నడిపించిన ఐక్యతారాగం
శాంతినికేతన్ స్థాపనకు కారణమై
లాల్-బాల్-పాల్ ల అసమాన కార్యదీక్షతతో
సంపూర్ణ బహిష్కరణే నినాదమై సాగి
జాతీయభావాలను మేల్కొలిపిన మంత్రం
వలసవాదాన్ని సవాలు చేసిన సింహనాదం
రాజ్యాంగ సంస్కరణలను తెచ్చుకున్నా
జాతీయ ప్రయోజనాలను చేకూర్చుకున్న విఫలప్రయత్నం
ముస్లింలీగ్ పార్టీ ఆవిర్భావానికి కారణమై
జాతివిభజన దుష్ఫలితాన్ని మూటగట్టుకొన్న ఫలితం
దాయాది దేశ ఏర్పాటుకు దారితీసిన చారిత్రక నేపథ్యం
దేశభక్తి,ఆత్మత్యాగానికి మారుపేరై
బెంగాల్ విభజన ఉద్యమమే వందేమాతర ఉద్యమమై
ఒక నినాదమై,ఒక గీతమై
ఒక వాదమై,ఒక చరిత్రై
ఒక ఉద్యమమై వందేమాతరం
సంపూర్ణ స్వాతంత్ర్య సాధనకు మార్గమైంది.
3
[05/06, 8:01 PM] అనుముల తేజస్విని Poetess: జ్యేష్ఠ మాస పౌర్ణమి కవిత పురస్కారాలు
అంశం:వందేమాతరం
శీర్షిక:మాతృభూమికి వందనం
వందేమాతరం
దేశభక్తికి చిహ్నం
చైతన్యానికి సంకేతం
మాతృభూమికి వందనం
ఆ నినాదమే జనజాగృతి ఉద్యమం
మహోత్తర త్యాగాల నిలయం
పoతోమ్మిదివందల ఐదులో పునాది పడి
బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా
దేశమంతా పోరాడిన క్షణం
యమహాపురి కలకత్తా నందు
మొలకపడి
అంచెలంచెలుగా ఎదిగిన మహా వృక్షం వందేమాతరం
అతివాదులుగా, మితవాదులుగా విడినారు
అయిన మన భారతప్రజలు
ఆత్మగౌరవమే ఒక ఆయువుగా
ఆత్మవిశ్వాసమే ఆదేరువై
స్వయం పోషకత్వంకై
నిస్వార్థ త్యాగంతో స్వాతంత్ర్య ఉద్యమ బాటలు వేశారు
బ్రిటిష్ వారి గుండెల్లో ఫిరంగుల్ని పేల్చారు
జైలుశిక్షలు అనుభవించారు
స్వదేశివస్తువుల వినియోగం
విదేశివస్తువుల బహిష్కరణే
ఉద్యమ లక్ష్యమైంది
అహ్మదాబాద్లో దేశీయ వస్తు రక్షణ సమితి ఏర్పాటు
పరిశ్రమలు, విద్యాలయాల స్థాపన ఇలా మొదలై
బకీంచంద్ర గారు రాసిన వందేమాతరం గేయమే
మన జాతీయ గేయంగా
రూపొందింది
స్వదేశిఉద్యమంలో కవితావేశం వెల్లివిరిసింది
పల్లిసేవ ద్వారా స్వదేశీ ఉద్యమానికి జీవం పోయడమైంది
చివరగా వందేమాతరం అనే నినాదం ఒక గేయమై మారి కౌతా శ్రీరామమూర్తి గానాలాపనతో సాగింది....
అభినందనమంత్రంగా మారింది
మనలో ఉద్యమస్ఫూర్తిని నింపింది......
అనుముల తేజస్విని
తేదీ:5/6/2020
నర్సంపేట
ఇది నా స్వీయరచన. దేనికి అనువాదం కాదు.
4
[05/06, 8:02 PM] Gummannagari Balsaraswati: *వేదిక :కవితా గానం,
నిర్వహణ :శ్రీ వీరా గుడిపల్లి గారు,
అంశం :వందే మాతరం...
శీర్షిక :
*వందే మాతరం...*
*************
విభజించి పాలించు మన్న
విదేశీ వికృత రాజనీతి ని
విదిలించి కొట్టాలన్న కసిని
విశాల భారతం నలు మూలలా
నింప గలిగిన ఒకే ఒక్క నినాదం...
*వందే మాతరం... !*
మన దేశం... మనవేషం... మన వస్త్రం.. ఆత్మగౌరవపు భావనే శస్త్రం..అంటూ
పరాయి వస్తువులను మసి చేసి
పర పాలన అంతపు అవసరాన్ని
ప్రతి గుండెలో
ప్రజ్వలింప జేసిన
ఒకే ఒక్క వాదం...
*వందే మాతరం.. !!*
మితవాద నాయకుల దార్శనికంలో
మిణుకుమంటున్న దీపంలా వెలిగి,
అతివాద దేశభక్తుల ఆవేశాగ్రహం లో
అగ్ని జ్వాలగా ఎగసిపడి..
తెల్ల దొరల పాలనను
భస్మీపటలం చేయడానికి
మూ లమైన అగ్నికణం....
*వందే మాతరం...*
పసివయసు నుండి...
పండు ముసలి దాకా..
నర నరంలోనూ..
ఆణువణువు నా
చైతన్యం సృష్టించి..
ఆసేతు హిమ భారతం,
కోట్ల గొంతుకలొక్క గొంతై...
పదాలన్నీ ఒక్క పథమై,
కదం తొక్కిన
ఉద్విగ్నో త్తేజ భావనం...
*వందే మాతరం.. !!*
అనైక్యత ను ఆసరా చేసుకుని,
పబ్బం గడుపుకుందామన్న పరాయి పాలక కుత్సితాలకు
భారత ఐక్యతా శృంఖలాల వేటును చవిచూపి,
బానిస సంకెళ్లు తెంపడానికి
సత్తువ నిచ్చిన ప్రాణ మరుత్తు...
*వందే మాతరం... !!*
కన్నతల్లికంటె మిన్నగా...
కర్మభూమిపై గౌరవాన్ని చాటుతూ
అమ్మను రక్షించుకునే మార్గమై...
ఉద్గమమై..
ఉద్యమమైన
ప్రణవ నాదం...
*వందే మాతరం.. !!*
-----గుమ్మన్నగారి బాలసరస్వతి..
5
[05/06, 8:04 PM] కొలచన విజయ భారతి Poetess: జ్యేష్ఠ పౌర్ణమి కవితల పోటీ
అంశం: వందేమాతరం
పేరు: కొలచన విజయ భారతి
ఊరు:హైదరాబాద్
తేదీ:3-6-2020
**********************
తెల్ల దొరల దాష్టీకానికి
కొల్లగొట్టబడుతున్న స్వాతంత్ర్యానికి
వెల్లువెత్తిన నిరసనలతో
నినదించిన ఉద్యమం
ఏకమై ఉన్న సమాజాన్ని
విభజించి,పాలించు
అన్న అక్రమాలకి
ఉక్కు పిడికిలి బిగించి
తిప్పికొట్టిన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం
అణచివేతకు బలౌతున్న
జాతీయవాదుల గుండెల్లో రగిలిన విప్లవ గీతం
బెంగాల్ పౌరుషం
బంకించంద్ర ఛటర్జీ
కలం గళం గర్జించిన ప్రబోధ గీతం
వందేమాతరం వందేమాతరం అంటూ భారతీయుల హృదయాల్లో అజరామరమై నిలిచిన గీతం
🌹🌹🌹🌹🌹
ఈ కవిత నా స్వీయరచన
దేనికీ అనువాదం,అనుసరణ అనుకరణ కాదు
ధన్యవాదములు🙏🙏
6
[05/06, 8:10 PM] Sharief Sir: కవితా గానం-పౌర్ణమి నగదు బహుమతుల పోటీ కై
అంశము: వందేమాతరం
1కం:
వందేమాతర మంటూ
చిందించిరి రక్తమెంతొ
చిరునవ్వులతో!
యందినదీ స్వాతంత్ర్యము
పొందెను సంతోష మపుడు
పుడమిన భారత్!
2కం:
బెంగాలును విభజించగ
కంగారెత్తంగ జనులు కలుపుట
కొరకై!
నింగిని తాకగ కోపము
సింగములై యెదురు నిల్చి
జేసిరి పోరున్!
3ఉ:
భారత జాతి నంతనొక బాటన
నిల్పిన మంత్రమయ్యె తాఁ
వీరుల నోట పల్కగనె విప్లవ
భావము కల్గెనంచు, నా
భీరులు తెల్లవారు తమ భీకర
సైన్యము చేతచంపుచున్
మారణకాండ సల్పుచును మానని గాయము జేసిరక్కటా!
4ఉ:
జాతిని నేతలందరిని జాగృత
పర్చెను మానసంబునన్
భీతిని పారద్రోలి పరపీడన దూరము జేయబూనగన్
రాతనుమార్చ వచ్చెనట రక్కసి
పాలన నంతమొందగా
ఖ్యాతిని పెంపుజేసి హృది క్రాంతిని నింపెను వందెమాతరమ్!
5చ:
కొలిచిరి దేశమాతనిట కూర్మిని,
భక్తిని సంబరమ్మునన్
నిలిచిరి ప్రాణమీయుటకు నిశ్చల దీక్షను మానసంబునన్
కలిసిరి వందెమాతరము క్రాంతిని జల్లెడి మాటవల్లనే
పలుమరు వీరయోధులకు
పాదములంటి నమస్కరించెదన్!
6శా:
వందేమాతరమంచు బల్క ప్రజలున్ వాత్సల్యమున్ జూపుచున్
సింధూదేశము శాంతిబొందు ననుచున్ శ్రేయస్సు కాంక్షించుచున్
బందూకుల్ తమచేత బూని వడిగన్ భారమ్ముకాదంచు నా
నందంబాయెను జాతిముక్తి కొరకై యాత్పార్మనంసేయగా!
"ప్రతిభారత్న"
డా.మహ్మద్ షరీఫ్
సంగారెడ్డి
7
[05/06, 8:10 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: ***వందేమాతరం***
✍️డా.పాండాల.
లార్డుకర్జనుదొర లక్షణంబనిదల్చి
బెంగాలు విభజనే బిరుదుగాంచి!
మేధావి మీటింగు మెలకల్నిగుర్తెర్గ
విభజించి పాలించె విప్లవాల్ని!
బెంగాలు విభజనే కంగారు బెట్టంగ
దేశీయ ఉద్యమం తీవ్రమాయె!
వందెమాతరదీప్తి వాస్తుగానినదిస్తు
వ్యతిరేక స్లోగన్సు వ్యాప్తికెగెసె!
అతివాద మితవాద జాతీయ కాంగ్రెసు విడిపోయె నేతలు విస్మయముగ!
దేశమంతటతిర్గి దేదీప్య మానంగ అతివాదు మీటింగ్ల ఖ్యాతి బెరిగె!
వైరుద్ధ్య భావాల అతివాద మితవాద
విడితేమి పోరాడె విస్తృతముగ!
ఆత్మగౌరవమెంచి, అఖిలభారతమంత నిస్వార్థ త్యాగాల నియమమెంచె!
ఆంగ్లేయ చర్యలే స్వాతంత్య్ర కాంక్షెచ్చ
జాతినేతలనేమొ జైలులేసె!
యువకుల విప్లవం యుక్తిగా పోరంత
సంస్థలే మనదేశి స్థాపనెంచె!
పరదేశి వస్తుల్ని పలుబహిష్కరణెంచి
ఆత్మగౌరవశక్తి అందమంటు!
అరవిందుఘోషుడే జాతీయ కాలేజి
బెంగాలులోబెట్టె ప్రీతి నెంచి!
జాతీయ విద్యకై మండలిస్థాపించి
దేశియోత్పత్తుల దీప్తి బెంచె!
పారిశ్రామికవేత్త ప్రాఫుల్ల చంద్రరాయ్
సంస్కార సంపన్న సంస్కృతెంచె!
రవీంద్ర నాథుడే జాతిగీతనురాసె !
బంకిము చంద్రుడై భవితదిద్దె!!
సురేంద్రుహరిదేశు లోక్‌హితవాదులై ఖ్యాతిపొందినమేటి నీతినడవ!
లాలు లజపతి రౌద్రుడై రంకెలేసె
తిలకు గణపతి పండుగా తీపి పెంచె
పాలు దేశాన భాషణం భవ్యమాయె
భరతదేశాన పుట్టడం భాగ్యమనగ!
✍️డా పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి
8
[05/06, 8:18 PM] దీపక్ న్యాతి: కవితా గానం
పౌర్ణమి కవితల పోటీ
పేరు డాక్టర్ దీపక్ న్యాతి
అంశం వందేమాతరం
నూటాయాబై ఏళ్లుగా దేదీప్యమానంగా వెలుగుతున్నా విరాజిల్లుతున్నా
శోభిల్లుతున్న నినాదం వందేమాతరం
భారతదేశాన ఐక్యతకు సమాంతరంగా మారుపేరుగా
పర్యాయపదంగా మొలకెత్తి వికసించిన పదం
అన్ని భాషలలో ఇమిడిపోయిన ఏకైక పదం వందేమాతరం
శ్రీమాన్ చంద్ర చటోపాధ్యాయచే
లిఖింపబడిన
భారతీయుల మదిలలో శాశ్వతంగా
అచ్చయిన పదం వందేమాతరం
వందేమాతరం ఒక ఐక్యత ఒక ప్రభంజనం
ఒక సంఘటిత శక్తి ఒక ఉద్యమం
స్వతంత్ర సంగ్రామ నినాదం
స్వతంత్ర యోధుల శంఖారావం
శత్రువుల గుండెల్లో డమరుక నాదం
అణగ జూచే వారికి అగ్నిపర్వతం
జాతీయతకు ఉత్తేజానికి ఉత్ప్రేరకం
బ్రిటిష్ వారి గుండెల్లో అగ్ని వర్షం
అహింస తోడైన సింహనాదం
పరాయి పాలకుల పరిగెత్తించిన రామబాణం
సంకెళ్ళ తెంచిన స్వాతంత్ర్యం రాజ్యం
స్వేచ్ఛనిచ్చిన విజయోత్సవ గర్వం
భారతీయుడి నోట్లో నానుడి పదం
భారతీయుల గుండెల్లో గోపురం
స్వతంత్రాన్ని కాపాడుకునే మురళీ గానం
వందేమాతరం వందేమాతరం
డా.దీపక్ న్యాతి
స్టేజి టీవీ సినీ రచయిత దర్శకుడు
నంది అవార్డు గ్రహీత
9
[05/06, 8:19 PM] Korada: కవితాగానం
పౌర్ణమినగదుబహు మతుల పోటీ.....!
అంశం:-
* వందేమాతరం *
************
కోరాడ నరసింహా రావు ;"అక్షరార్చన"
***********
తెల్లదొరలను ముప్పు
తిప్పలుపెట్టిన.... మహత్తరమంత్రమిది
ఒక్కోఅక్షరం ఒక్కో అణు శక్తిగా...మొత్తం నినాద మొక అణు విశ్పోటనంగా...ఆంగ్లేయులనుహడలెత్తించినమహామంత్రమిది
సమరయోధులకు ...
సాహా సో పి రు లూ దినచైతన్యమంత్రమిది ....!
ప్రతిభారతీయుని
అణువణువు లోనూ
దేశ భక్తిని నింపిన స్ఫూర్తి మంత్రమిది!
దేశంకోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగాసమర్పింప
జేసినదివ్యమంత్రమిది......!
మన జాతీయ జెండా రెప రెప లకు ఆలంబన ఈ మహామంత్రం !!వంద నములమ్మ భరత మాత....నీ బంధన ములత్రెంచగా...బలమునిమ్మమ్మా యని
వేడుకున్నవేదమంత్రం ఈవందేమాతరం
అమ్మసహజసౌందర్యాన్ని ...సౌశీల్యాన్నీ సిరి,సంపదలనూ ఔ న్నత్యాన్నీ వేనోళ్ళ పొగడ్తలకు సమ మైన ఏక మంత్ర మీ
వందేమాతరం !
బంకించంద్రపవిత్ర హృదయాకాశాన
పల్లవించిన సుస్వర సుమధుర దివ్య భవ్య నాదం ఈ వందే మాతరం...!
ఈ నినాదానికి జయం జయం...!
మనభరతమాతకూ
శుభం శుభం...!!
🙏🌷🙏🌷🙏🌷🙏కోరాడ.
10
[05/06, 8:25 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:**వందేమాతరం***
----------************--------
భారత జాతీయఉద్యమ చరితనందు
*వందేమాతరం* ఓ పదమో..ఘట్టమో కాదు
స్వతంత్రపోరాటంలో అద్వితీయ మలుపు
ప్రజలందరినీ చైతన్యపరచిన మేలుకొలుపు
'మైక్రోస్కోపిక్ మైనారిటీ సంఘo'గ బ్రిటీష్ వారిచే ఎద్దేవా చేయబడిన
మితవాదుల జాతీయ కాంగ్రెసును
దేశప్రజలందరి పార్టీగ మార్చిన ఘటన.
తమ తొలిఆక్రమితప్రాంతం 'బెంగాల్'ఉద్యమాల
పురిటిగడ్డ'ని గుర్తించి ఐక్యతను దెబ్బతీసేకుట్రతో
కర్జన్ ప్రకటించిన బెంగాల్ ప్రావిన్సు విభజనకు
వ్యతిరేకంగ మొదలైన అసలు దేశభక్తిఘట్టం
ప్రజలు వీధుల్లోకొచ్చి *భరతమాతకు*జై
కొడుతూ విదేశీవస్తుబహిష్కరణకు పిలుపునిచ్చి
స్వదేశీ వస్తుత్పత్తి కొనుగోలుకు ఊతమిచ్చి
మన పరిశ్రమలకు ప్రాణంపోసెను *వందేమాతరం*
నాటి పరిస్థితుల ఎడల ప్రజలందరిలోన
అవగాహనకల్పించి స్వతంత్ర పోరాటపథాన
కదంతొక్కించిన మహత్తర దేశభక్తి ఉద్యమం
బంకించంద్రుడి తిరుగులేని రామబాణ పదరూపం
లాల్ బాల్ పాల్ లచే అతివాద ఉద్యమమై
దేశమంత ప్రతిధ్వనించిన *వందేమాతరం*'
బ్రిటీషోళ్లకు నచ్చక ధమననీతికి పాల్పడినా
స్వతంత్రసిద్ధివరకె కాదు వందేమాతరం ఎప్పటికీ
*ఒంటిని మనసును పులకింపజేసే మంత్రం*
హామీపత్రం:ఇది నా సొంత రచన అని,,ఏ ఇతర రచనకు అనువాదమో!అనుసరణో!కాదని మీకు హామీ ఇస్తున్నాను
:;*వల్లాల *విజయలక్ష్మి*
ఆలేరు
11
[05/06, 8:25 PM] Anitha Aitha Poetess: *జ్యేష్ఠ మాస పౌర్ణమి కవితపురస్కారాల పోటీ*
05.06.2020
అంశం : వందేమాతరం
శీర్షిక: *ఉద్యమ స్ఫూర్తి*
వింత విభజన రేఖలేవో భరతమాతతనువు నిర్దాక్షిణ్యంగా చీల్చగా...
పాలకులపై అలుపెరుగని నిరసన సెగలు ఉద్భవించే..!
సోదరప్రాంతాలను కర్కశంగా విడదీస్తున్న
కపటప్రభుత్వంపై వ్యతిరేకత జ్వాలలేవో ఎగిసే..!
గుండెగుండెలో దేశభక్తి ఉప్పెనై పొంగగా..
ప్రతిమనిషి సైనికుడై ధైర్యంగా కదలగా..
వందేమాతరం ఉద్యమం ప్రభంజనమై గర్జించే!
విదేశి వస్తు బహిష్కరణే ధ్యేయంగా..
స్వదేశీ సంస్థల స్థాపనే సంకల్పంగా..
జాతి ఏకమై ఒక్కతాటిపై సాగే!
అణచివేతల ముళ్లు అభివృద్ధి కన్నులకు కంటకాలై గుచ్చగా..
చిన్నచూపుల వాడివేడి శరాలు
పచ్చని ఆత్మీయతను పోట్లు పొడవగా..
కోటిగొంతుకలు ఒక్కటై
దిక్కులే పిక్కటిల్లగా.. వందేమాతర గేయమై ప్రభవించే జనుల హృదయఢమరుకాల్లో..!
ఉద్యమ స్ఫూర్తి
ఆత్మగౌరవం నింపగా..
ఆత్మవిశ్వాసమే ఆయుధమై
అహింసాదారుల్లో నాయకులపాదయాత్ర సాగే!
మితవాదుల అడుగుజాడల్లో దండై దండయాత్ర చేసే!!
రచన
అయిత అనిత
8985348424
జగిత్యాల
హామిపత్రం
ఇది నా స్వీయరచన
దేనికి అనువాదం కాది
12
[05/06, 8:53 PM] Sandya Sharma Poetess: *జ్యేష్ఠ మాస కవితా గాన పౌర్ణమి కవన వెన్నెల*
*అంశం: వందేమాతరం*
*పేరు: వై.కె.సంధ్యశర్మ*
*ఊరు: చిత్తూరు*
**********************
*శీర్షిక :వందేమాతరం*
*ఏనాటికీ*
*మారని చరిత్రగా లిఖిస్తూ.....*
*చరిత మారినా ఘనతగా*
*వినుతికెక్కిన ఉద్యమ గీతంతో*
స్వరాజ్య సాగర తీతువులో
గుచ్చుతున్న ముళ్ళపొదల్ని
గుండెను దాటించాలనే
*స్వప్నం కోసం ఎదురు చూసిన*
*మెలకువ విత్తు ఇది....*
*తరాల ఆంతర్యంలో పునాదులు పెకలించే*
నిలువు గీతల పురోగమనంలో...
*అడ్డుగీతల అహంకార గమనంలో..*
ఎప్పటికప్పుడు రేఖా ఖండనల్లో
స్వార్థపు అరలను పేర్చుకుంటూ...
విలువలేమీ లేని వలయావర్తి లో...
*వినుతికెక్కిన ఉద్యమ...స్ఫూర్తి ఇది*
*నిరంకుశత్వ నిశ్శబ్ద తెల్లటి కాంతి రేఖలో*
*నిర్దయుల చుర కత్తులకు*
*అధికార ఆయుధాలకు వెరవక*
అడుగు అడుగుకు జత చేస్తూ
నిరంతరం సాగే కాలనదిలో
వివక్షలో విస్మయులైనా
విలువల వలువలను ఆపాద మస్తకం
అనుసరించే అమరుల త్యాగధనువులోంచి
*ప్రజ్వరిల్లిన .....పుష్పగుచ్ఛము ఇది*
స్వదేశీ సంరక్షణ బాటలో
ఆత్మస్థైర్యపు ఊపిరి ఆపినా
ఆత్మాభిమానం నరనరాన
రుధిరాక్షర మాలలు కట్టి
దేశమంతా ఒక్కటైన వేకువలో
*నిస్వార్థ త్యాగాలకు ప్రతిఫలం*
*స్వతంత్ర భారతీయ రూపమిది!*
*నేటికీ మౌడ్యాలతో నీరశించే*
*వ్యవస్థలో సమాజపు తెగుళ్ళు*
*విస్తరించి నెత్తుటి కలల్ని పూస్తూ*
*అవినీతి రంగుల లోకంలో*
*పేగు పేగును కలపకమునుపే*
*మళ్ళీ గొంతులో జీవం పోద్దాం*
*జన జీవ నాడులను స్పృశించే*
*ఉద్యమ సుఫలాలను సృజిద్దాం...*
*సస్యశ్యామల తోరణ వనాలను*
*భావి తరాలకు అందిద్దాం!!*
*హామీపత్రం:*
నేను వ్రాసిన కవిత "వందేమాతరం"
ఇతర కవితలకు అనువాదము మరియు అనుసరణీయము కాదు.
కావున పోటీకి అర్హమైనదిగా భావించవలెనని కోరుతున్నాను.
*ధన్యవాదములు*
*వై.కె.సంధ్యశర్మ*
9490250989
13
[05/06, 9:01 PM] పాల్వంచ హరికిషన్: కవితాగానం
పౌర్ణమి కవితల పోటీ
అంశం: వందేమాతరం
శీర్షిక: చైతన్య దీపం
బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ
ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం
బెంగాలీల రణ నినాదం
స్వాతంత్ర్య సంగ్రామానికి ఆజ్యం
మొట్టమొదటి ప్రజా ఉద్యమం
ఒక నినాదం.. వందేమాతరం ..
భారతమాతా నీకు వందనం
సుజలాం సుఫలాం నిరంతరం
సస్యశ్యామలం మన భారతం అంటూ
కోట్లాది కంఠములు కరవాలాలై
స్వదేశీయతను నినదించిన స్వరం
మితవాదుల అతివాదుల
విభజించిన ఉద్యమ చిత్రం ..
భారతీయుల శక్తిని.. దేశ భక్తిని..
మేల్కొల్పిన జాతీయతోద్యమం
ఆత్మ త్యాగానికి మారు రూపం
జాతీయ వాదానికి చైతన్య దీపం
అతివాద ఉద్యమం ఉద్యమ స్ఫూర్తి లోపం
లాల్ బాల్ పాల్ త్రయం నిష్క్రమణం
నీరుగారి వీగిపోయిన ఉద్యమం
మహోజ్వల ఘట్టం వందేమాతరం.!!
-- అర్జున (కలం)
పాల్వంచ హరికిషన్
రామన్నపేట
9502451780
14
[05/06, 9:06 PM] Kalva Rajaiah: కవితా గానం
జ్యేష్ఠ పౌర్ణమి కవిత పోటి
అంశం :వందేమాతరం
పేరు :కాల్వ రాజయ్య
ఊరు :బస్వాపూర్
జిల్లా :సిద్ధిపేట
తేది :5/6/20
1ఆటవెలది
బతుకు దెరువు కొచ్చి బానిసలుగ జేసి
రాజ్య మేలినారు రాక్షసత్వము గాను
భారతీయులాను బాధించి రానాడు
దోచుకెళ్ళి నారు దొంగ లవలె
2ఆ వె
బెదర గొట్టి జనుల బెంగాలు విభజన
చేయ జూసి నారు చెడ్డ వారు
వందె మాతరమని వాక్కుబలుకు కుంటు
అడ్డు జెప్పినారు యాంగ్లె యులకు
3 ఆ వె
హిందు ముస్లిమంటు హేయభావము తోడ
మతము చిచ్చు బెట్టె మనలొ మనకె
బాగు గాను పాడి బంకింగు గీతాన్ని
ఎదురు దిరిగి నారు బదులు జెప్ప
4 ఆ వె
బయట నుంచి వచ్చె బట్టల నన్నియు
కాల బెట్టినారు కట్టగట్టి
రాట్నమందు వడికె రమ్యమౌ బట్టల
కట్టవలయు నంటు కట్టు జేసె
ఈ పద్యాలు నా స్వంత రచన
ఈ పోటి కోసమే వ్రాశానని హామీ ఇస్తున్నాను.
15
[05/06, 9:08 PM] Lakshmi Chamarthi Khammam: కవితా గానం
పేరు: శ్రీ శివలక్ష్మి రాజశేఖరుని
అంశం: వందేమాతరం
జ్యేష్ట పౌర్ణమి
శీర్షిక:గుండె గుండెల్లో ఢమరుక నాదమై
గుండె గుండెల్లో
ఊపిరి పోసుకున్న ఉద్యోమంలోంచి
దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఢమరుకనాదం
వందేమాతరం
నరనరాల్లో ఉవ్వెత్తున ఉరకలేసిన
ఉడుకు రక్తాక్షర సూత్రం వందేమాతరం
సుజల, సుఫల, సుమధుర భాషిణీ
సకల సంపత్సమేత భరతమాతనీ
విభజించి దోచుకున్న సామ్రాజ్యవాదాన్ని
తరిమి కొట్ట సంకల్పించిన
బీజాక్షర మంత్రం వందేమాతరం
దేశభక్తి ఆజ్యం పోసి రగిలిన జ్వాలలో
సత్యాహింసల ధర్మ సందేశాలే
శిరోధార్యంగా దద్దరిల్లిన
వేల గొంతుకల గాత్రం వందేమాతరం
నిర్బంధపు సంకెళ్ళని
నిర్ద్వందంగా ఎదిరించిన ధిక్కారస్వరం
జాతి మత ప్రాంత భేదాలు మరచి
భారత జాతిగా ఏకతాటిపై నిలిచి
ఎలుగెత్తి పూరించిన యుద్ధ శంఖారావం
వందేమాతరం………….
వందేమాతరం……………
విన్న ప్రతిసారి… మరిగే రక్తం
అన్న ప్రతిసారి… నూతనోత్తేజం
ఈ కవిత నా స్వీయ రచన. జ్యేష్ఠ పౌర్ణమి పోటీ కోసం రాయబడింది.
16
[05/06, 9:08 PM] Gundla Raju Sir: గుండ్లరాజు
కవితా గానం జ్యేష్ట మాసం పౌర్ణమి పోటీలకు
అంశం : వందేమాతరం
కవితా శీర్షిక : *వందేమాతరం*
నా భారతావనికి కాశ్మీరం కుంకుమలా సాక్షాత్కరించినా,
కన్యాకుమారి అగ్రాన్నిహిందు సాగరం స్పృశించినా,
తూర్పున బెంగాలు, పశ్చిమాన గుజరాతు వరకు భరతమాతపొత్తిళ్ళల్లో పాలుతాగే అదృష్టానికి చేస్తున్నాను
*నాభారతానికివందేమాతరం*
శస్త్ర చికిత్సలలో సుశ్రుతుడు, రాజనీతిని తెలిపిన చాణక్యుడు, భరద్వాజ మహాముని సృషించినవిమానం, ధన్వంతరి, చరకుడు, పరాశరునివైద్యము, గ్రహగమనం బోధించిన వరాహ మిహిరుడు, సున్నాను తెలిపిన ఆర్యభట్టు ప్రపంచానికి మార్గం చూపిన
పుణ్యమూర్తులు జనించిన *నాభారతానికి వందేమాతరం*
నలందా తక్షశిలా వెలుగులు, పంచమహాకావ్యాల దరువులు, సంగీతస్వరగతులు, సామవేదఘోషలు, త్రివేణిసంగమాలు, కలియుగ కైలాసాలు, అష్ట దిక్కులకు సహితం అడుగులు వేయించి, సంస్కారం నేర్పించి, వేదాలకు పురుడు పోసిన
*నాజ్ఞాన భారతానికి వందేమాతరం*
శుభ్రజ్యోత్స్నా వెలుగులలో ప్రకాశించే వజ్రాయుధమే బంకించంద్రుని *వందేమాతరం* సురుచిర సుందర స్వప్నాలను సాకారం చేసుకోవడానికి భారతీయులలో ఐక్యతను, బలాన్ని రక్తంలోకి ఎక్కించిన ఔషధం *వందేమాతరం* తెల్లవారి గుండెల్లో బల్లెమై రవిఅస్తమించని బ్రిటిష్ వైభవాన్ని తుత్తునియలు చేసిన మహాశక్తి *వందేమాతరం*
*వందేమాతరం* నినాదం కాదు భారతీయుల ఆత్మ, హిందుత్వశక్తి
*🌹🌹🌹గుండ్లరాజు🌹🌹🌹*
[05/06, 9:10 PM] సునంద ఉరిమిళ్ళ: జ్యేష్ట పౌర్ణమి కవితల పోటీ
కవితా గానం
తేదీమీద:05-06-2020
పేరు:; వురిమళ్లసునంద, ఖమ్మం
అంశం:: వందేమాతరం
శీర్షిక::తారక మంత్రం
:::::::::::::::::::::::::::::::::::::
స్వాతంత్ర్యోద్యమానికి
ఊపిరి పోసిన తారకమంత్రం
సమైక్యతను చాటుకున్న
స్వదేశీ ఉద్యమానికి నాందీ వాచకం!
జాతి మతం కులాలకు అతీతంగా
వికృత బ్రిటిష్ ప్రభుత్వపు
విభజించి పాలించే దుర్మార్గపు ఎత్తుగడను దునుమాడి
ఉవ్వెత్తున ఎగసిన భారతీయుల
జాతీయతా రాగం...
ఆసేతు హిమాలయం
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
వెల్లువెత్తిన ఉద్యమ జ్వలన గీతం!
అతివాద మితవాద అంతరంగాల
అంతిమ లక్ష్యానికి
అంకురమై మొలిచిన ఆత్మ గౌరవం!
బంకించంద్రుని అమూల్యమైన ఆనంద మఠ్ గ్రంథం లోని గేయం
దేశభక్తిని నినదించే గళమై
తెల్లవారి గుండెల్లో దడ పుట్టించి
స్వాతంత్ర్యేచ్ఛను రగిలించిన
వందేమాతరం!
భారత దేశ చరిత్ర పుటల్లో
ఆనాటి సంఘటనల సమాహారమై
సువర్ణాక్షరాలతో లిఖించ బడి
ఆచంద్ర తారార్కం నిలిచిపోయిన
స్వాతంత్ర్య సమరోత్సాహ రూపం!
సుజల నదుల ప్రవాహంతో
సస్యశ్యామల సౌందర్యాన్ని నింపుకుని
సహస్ర దళ పద్మమై వెలుగులీనుతూ
నిత్యం భారతీయుల
హృదయాల నుంచి జాలువారే అమృత గీతం!
లౌకిక రాజ్య భావనలనుమనసులోకి ఒంపిన
సమ సమాజ నిర్మాణ తోరణం!
మధుర మంజుల గేయం!
వందే మాతరం మనదే పవిత్ర భారతం!
[05/06, 9:11 PM] +91 99633 77273: జేష్ట మాస పౌర్ణమి కవితాగాన పురస్కారాలు
అంశం : వందేమాతరం
పేరు : పోలా కిషోర్ కుమార్
ఊరు : న్యూ బోయిన్పల్లి
శీర్షిక: వందేమాతరం స్ఫూర్తి
ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి
కలమతాల చిచ్చు రగిలించి
విభజించు పాలించు అన్న తెల్లవాడి
రాజ్యాధికారాన్ని ధిక్కరించగ
భారతావని బానిస సంకెళ్ళు తెంచగ అఖండ భారతావని స్వరాజ్య కాంక్షతో
నినధించిన గీతం వందేమాతరం
స్వాతంత్ర్య ఉద్యమంలో
దేశభక్తితో కూడిన మరణం కూడా
జననం లాంటిదేనని ప్రాణత్యాగం
చేసి అఖండ భారతావని గుండెల్లో
విప్లవాన్ని ఉవ్వెత్తున రగిలించిన
త్యాగమూర్తుల మహామంత్రం
వందేమాతర గీతం
స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసి
ప్రతి గుండె నిండా దేశభక్తిని నింపి
స్వరాజ్యకాంక్షను నరనరాన రగిలించి
కోట్ల గొంతుకలు ఒక్కటై నలుదిక్కులు పిక్కటిల్లేల చేసిన తారకమంత్రం బకించంద్రుని వందేమాతర గీతం
తరాలు మారినా స్వరాలు మారినా
తరగని కీర్తి వందేమాతరం దీప్తి
నేటి భారతావనికి నిత్యం కావాలి
ఆనాటి వందేమాతరం ఉద్యమ స్ఫూర్తి
ఈ కవిత నా స్వంతమని హామీ ఇస్తున్నాను
[05/06, 9:11 PM] Ganjam Bhramaramba: ఏరువాక పున్నమి
కవితా గానం
వందేమాతరం
గంజాం భ్రమరాంబ
తిరుపతి
కోట్ల భారతీయుల హృదయాలలో
ఏకత్వాన్ని మీటిన వీణానాదం వందేమాతరం
కర్జన్ చేసిన బెంగాల్ విభజనకు
తమదైన వ్యతిరేకతను ప్రకటించిన నినాదం
బంకించంద్ర చటర్జీ వ్రాసిన ఆనంద్ మఠ్
నుండి స్వీకరించినబడిన ప్రణవనాదం
భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుటకు
స్వదేశీఉద్యమం వైపుగా కదిలిన మొదటిపాదం
కులమతాలకు అతీతంగా కూర్చుకున్న
ఆత్మ విశ్వాసాలను పుంజుకున్న హృదయనాదం
ఆత్మగౌరవం, స్వయం పోషకత్వం
స్వదేశీ వస్తు వినియోగాలతో ఎగిసిపడిన ఉద్యమం
అనేక మంది త్యాగశీలులను సృష్టించి
భారత స్వాతంత్రోద్యమానికి ఊపిరిపోసిన
అపురూపమైన చారిత్రాత్మక ఘట్టం
ఎందరో త్యాగధనులను అందించిన
మొట్టమొదటి ఉద్యమతరంగం
వందేమాతరం... వందేమాతరం
గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932918
హామీ పత్రం
************
నేను వ్రాసిన "వందేమాతరం.."
అను కవిత కేవలం నా స్వీయ రచన మాత్రమే. దేనికి అనువాదం కానీ, అనుసరణ
కానీ కాదు అని హామీ ఇస్తూ
ఉన్నాను.
.. ఇట్లు
గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932918
[05/06, 9:20 PM] Balloori Umadevi Poetess: జ్యేష్ట పౌర్ణమి కొరకు రాసిన పద్యములు
డా.బల్లూరి ఉమాదేవి
అంశము:వందేమాతరం
1కం:వందే మాతర మనుచును
సందేహించక జవమున సాగిరి ప్రజలున్
చిందించ గరుధిరమ్మనె
పొందగ స్వాతంత్ర్య మరియు ముందుగ నడిచెన్.
2ఆ.వె: వంగదేశ మునిటు వ్రక్కలు చేయంగ
నెంచు తెల్లదొరల నెల్ల తరిమి
కొట్ట నెంచి ప్రజలు కూడబల్కిన యంత
నాగి రాంగ్ల దొరలు హడలు తోడ
3.ఆ.వె: బాలు లాలు తోడ పాలు కలసి సాగ
వందె మాతరమను వాక్కు వినుచు
చెరను పెట్టి రపుడు శీఘ్రగతిన వారి
నాగ్రహమ్ము తోడ నాంగ్ల దొరలు
4.ఆ.వె: ఉద్యమ ఫలితమ్ము నొసగె సత్ఫలముల
విభజనమ్మదియును వేగ మాగ
కలిసికట్టుగ ప్రజ కదము త్రొక్కుచు సాగి
రైకమత్యమూను చవని యందు
5ఆ.వె:వంగదేశమందు వాసిగా జన్మించి
దేశభక్తి చూపి తెల్లదొరల
పాలనకుముగింపు పలుక,రవీంద్రుండు
నాయుధముగ వాడె నవని యందు.
6.ఆ.వె:శాంతినిలయమునిల స్థాపించె ఠాగూరు
కళలనాదరించి కవిత లల్లి
జనగణమన యనుచు జాతీయగీతమున్
వ్రాసి ఖ్యాతిగాంచె వసుధ యందు.
జ్యేష్ట పౌర్ణమి కవితా గానం కొరకు వ్రాసిన ఈ పద్యములు నా స్వీయ రచనలు
21
[05/06, 9:28 PM] Komandoori Neela Poet: జ్యేష్ట మాసం పౌర్ణమి పురస్కారాల పోటీ
అంశం: వందేమాతరం
భరత మాత దాస్య శృంఖలాలను తెంచ ఒక్కుమ్మడిగ కదిలిరి భారత సేన..!
వందే మాతరం అని నినదించి సాగిరి దేశ ప్రజలు యేక కంఠముతోడ. !
ధర్మభూమి పైన మెండైన ప్రేమతో ధ్వజమునే చేపట్టి దండుగా కదిలారు. !
మిన్ను మన్నును ఏకమే చేయగా వందనం మాతయని దిక్కులన్నీ పిక్కటిల్లేలా జన సంద్రమై కదిలారు..!
ఆంగిలేయుల గుండెలే అదిరేలా సింహ నాదములాగ గర్జించి ఉరికారు..!
అదియే మన నినాదం..!
ఏక కంఠంగా వినిపించె..!!!!
*వందే మాతరం*!!!
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు: నీలా రంగనాధం
ఊరు: నాదర్గుల్,హైదరాబాదు.
చరవాణి సంఖ్య:8897155600.
*ఈ కవిత నా స్వీయ రచన,ఈ సమూహం కొరకు రాసినదేనని హామీ ఇస్తున్నాను.*
22
[05/06, 9:28 PM] బండారు సుజాతా శేఖర్: కవితా గానం శీర్షిక :వందేమాతరం
(పౌర్ణమి పురస్కారం పోటీ )
రచన :డాక్టర్ బండారు సుజాతశేఖర్
"మరో వేదం "
తరాలు మారినా -దేశభక్తుల చిరునామా నీవే -
స్వతంత్ర రాజ్యంలో స్వేచ్ఛలుడిగిన ఖగాలై ,
ఇజాల కత్తుల ఒరలో,ఊపిరాడని
నిర్జీవ శరీరాల్లో సత్తువ గీతం నీవే -
నిలువునా కాలుతున్న దేహాలు
హిమాన్ని మింగిన రీతి -
గరళాన్ని దాచిన గొంతు -కోయిల స్వరాన్ని కూస్తుంది .
మనసుని వెతుక్కుంటున్న ఆత్మ
పత్రహరితాన్ని వీడిన పత్రమౌతుంది ;
నీ చిరునామా ఆనవాళ్లు మరుగై
సాంకేతిక ఒరవడిలో ,
ఆహ్లాదాల ఝరిలో ,చిగుర్లను మొలకలో ఒత్తి చేస్తుంది -
నీ నాదం -నాడు వేదం -
వందేళ్ల దాస్యశృంఖలాల ప్రశ్నించిన నాదం
అందరిని దరిచేర్చి నరనరాన ఉత్తేజ
గీతాల ఆలపించిన స్వరం -
కూలిపోయిన ఆశలకు,రెక్కలు తొడిగి
నేటి అస్తమయాన్ని రేపటి ఉష కిరణంగా
ఉరికంభాల ముద్దాడి ,
మట్టిమనుష్యులను,మరబానిసల్ని
పిడికిలెత్తిన -వందేమాతరం
నాదేశం మహోన్నత మన్న నినాదం
నీనాదం - మరో మారు ఉద్యమమై
మంత్రాక్షరి కావాలి
అంతరాల మధించి ,హిమవన్నె
సోయగాల్ని నిల్పే ప్రాణవాయువై ,
నా స్వేచ్చా గీతానివై వందేమాతరమా
మా ఎజెండా వవ్వాలి -అదే మావేదం
మా దేశభక్తి పల్లవం .
/////:::::://///::::;/::::::::/::///::://:/::
23
[05/06, 9:33 PM] +91 99633 77273: జేష్ట మాస పౌర్ణమి కవితాగాన పురస్కారాలు
అంశం : వందేమాతరం
పేరు : పోలా కిషోర్ కుమార్
ఊరు : న్యూ బోయిన్పల్లి
శీర్షిక: వందేమాతరం స్ఫూర్తి
ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి
కలమతాల చిచ్చు రగిలించి
విభజించు పాలించు అన్న తెల్లవాడి
రాజ్యాధికారాన్ని ధిక్కరించగ
భారతావని బానిస సంకెళ్ళు తెంచగ అఖండ భారతావని స్వరాజ్య కాంక్షతో
నినధించిన గీతం వందేమాతరం
స్వాతంత్ర్య ఉద్యమంలో
దేశభక్తితో కూడిన మరణం కూడా
జననం లాంటిదేనని ప్రాణత్యాగం
చేసి అఖండ భారతావని గుండెల్లో
విప్లవాన్ని ఉవ్వెత్తున రగిలించిన
త్యాగమూర్తుల మహామంత్రం
వందేమాతర గీతం
స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసి
ప్రతి గుండె నిండా దేశభక్తిని నింపి
స్వరాజ్యకాంక్షను నరనరాన రగిలించి
కోట్ల గొంతుకలు ఒక్కటై నలుదిక్కులు పిక్కటిల్లేల చేసిన తారకమంత్రం బకించంద్రుని వందేమాతర గీతం
తరాలు మారినా స్వరాలు మారినా
తరగని కీర్తి వందేమాతరం దీప్తి
నేటి భారతావనికి నిత్యం స్మరణ కావాలి
ఆనాటి వందేమాతరం ఉద్యమ స్ఫూర్తి
ఈ కవిత నా స్వంతమని హామీ ఇస్తున్నాను
24
[05/06, 9:34 PM] అంబటి Bhanu Prakash: 🌿🌼🌿🌼🌿🌼🌿
(పౌర్ణమి పురస్కారాలు పోటీ)
కవితా గానం
*అంబటి భాను ప్రకాశ్*
05.06.2020.
వందే మాతరం
వందేమాతర గీతం
బందరనొకతీరునడిపె నవనీతటిపై
ముందుకునడిపెన్నందర
వందనమోభరతమాత భాగ్యవిధాతా!!
దుష్టులు నాంగ్లేయులె యీ
నష్టముసల్పిరినిజముగ నానావిధముల్
కష్టము గలిగించిరిచట
నిష్టులవిడదీసినారె నిందలునిలిపీ!!
ఇరువురి మధ్యన కలహము
సరసముగాబెట్టిజీల్చి చంపిరిజనులన్
కరుణయె జూపనిధూర్తులు
పరిపాలించిరి మనలను బానిస,లనుచున్!!
బానిసబ్రతుకులు వీడగ
పూనిరిప్రతినను ఘటించి పొందగస్వేచ్చన్
కానలదిరిగిరి నొంటిగ
మానక నెదిరించిసాగి మాపున్ రేపున్!!
హిందూ ముస్లిము సఖ్యత
పొందుగమనమున్నవిధము నొప్పక,వారున్!
బందీలనుజేసి విడక
నిందించిరినెంతగానొ నేరములనకన్!!
(పై పద్యములు నాస్వంతమే. కవితా గానం పౌర్ణమి పురస్కారాలు కోసం రాసినవి)
ధన్యవాదాలు
🌼🙏🌼🙏🌼
25
[05/06, 9:42 PM] వేంకట కృష్ణ ప్రగడ,విశాఖపట్నం
కలం : "కృష్ణ" కలం: శ్రీ శార్వరీ నామ సంవత్సరం
జ్యేష్ఠ మాసం పౌర్ణమి
నగదు బహుమతుల పోటీ కవిత
05.06.2020
అంశం : వందేమాతరం
శీర్షిక : వందేమాతరం
వందేమాతరం
ఇది గీతమా, కాదు కోటి గొంతుకల పోరాటం
స్వంత ఊపిరుల కోసం ఎందరిదో ఆ ఆరాటం
ఆ బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ్
అధ్యయనం చేసిన పాటగా రాసిన
రవీంద్రుడు స్వరాలను సమకూర్చిన
చెరబండరాజు మాటలతో చెరగిన
రాజేంద్రుడు జాతీయ హోదా ఇచ్చిన గీతం
నిస్వార్ధ త్యాగాలతో భరతమాత
దాస్య శృఖలాలు తెంచిన కోపం
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన దీపం
భరతావనికి ఓ నిండైన అపురూపం
వందేళ్ళు దాటినా మరువలేని రూపం
ఆ క్షణం భరత ఖండం అంతా
ఒక్కటిగా కదిలించిన అగ్ని కణం
అందరిలో ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం
అణువణువు నింపి నడిపించిన స్వరం
బెంగాల్లో పుట్టిన స్వదేశీ ఉద్యమం
తెల్లవారి ఆగడాలను తెల్లారక తెగనరికి
ఓ నడిరేయి బ్రిటిష్ దొరల దారుణాలకు
తెరదించి స్వతంత్ర ఊపిరులను
అందరి గుండెల నింపిన వందేమాతర ఉద్యమం ...
... ✍ "కృష్ణ" కలం
హామీ :
ఇది ఈ పోటీ కోసం
నే రాసిన నా స్వీయ కవిత
అనువాదం అనుకరణ కాపీ కాదు
26
*కవితాగానం*
అంశం:వందేమాతరం
శీర్షిక :ఐక్యతారాగం
భరతమాత దాస్య శృంఖలాలను
విధిలించ పోరుసలిపిన త్యాగమూర్తుల
గుండెల్లో ప్రేరణ నింపిన పదం వందేమాతరం
పుట్టింది బెంగాల్ విభజన సమయంలోనైనా
వందేమాతరం అన్న పదం స్వతంత్ర్య కాంక్షను అనువణువన నింపింది..
విభజించు పాలించు అన్న తెల్లొని కుట్రలను, కుతంత్రాలను కుల్లబొడుస్తూ
కుల మతాల మధ్య అంతరాలను పోగొడుతూ ఐక్యతాభావాలను అందరిలో నింపిన పదం వందేమాతరం
వందేమాతరం ఓ పదం కాదు ఓ నినాదం
బానిస బతుకుల జీవితాలను స్వేచ్ఛ పథం వైపు నడిపిస్తూ
భారతీయుల నరనరాల్లో మాతృభూమి పై మమకారాన్ని పెంచిన మహోన్నత పదం వందేమాతరం...
ఏ స్వాతంత్య్ర ఆకాంక్ష యేళ్ళుగా కొనసాగిందో
ఏ విముక్తి సంగ్రామం ఎందరిని వీరులుగా మలచిందో
ఏ పుట్టిన గడ్డ స్వేచ్ఛకోసం పురిటినొప్పుల బాధలను అనుభవించామో
అన్ని సందర్భాల్లో అందరినీ తట్టిలేపిన
నినాదం వందేమాతరం...
తెల్లొని ఆగడాలను అణగదొక్కుతూ
ఎగిసిన స్వాతంత్య్ర జ్వాల దివిటే వందేమాతరం....
వందేమాతరం అంటేనే సంఘటితం అవుతూ భరతమాత బిడ్డలు బ్రిటిష్ కోటలను బీటలు వార్చిన తీరు అద్వితీయం.....
భగభగ లాడే సూర్యుడు జాతికి వెలుగు
సలసల మసిలిన సంకల్పం వందేమాతరం భరతజాతికి వెలుగు
గుండెలనిండా శ్వాసను పీల్చుతూ బిగ్గరగా వందేమాతరం అంటే ప్రతీ
భారతీయుని యదలో దేశభక్తి తొణికసలాడుతుంది....
వందేమాతరం స్వతంత్ర భారతవనికి నిలిచిన దిక్సూచి
వందేమాతరం స్వతంత్యాన్ని తెచ్చిపెట్టడానికి మూలమంత్రం
కులాల మద్య, మతాల మద్య, రాజ్యాల మద్య ఐక్యత నింపిన
అజరామరమైన పదం వందేమాతరం
_-_-_--_-
ఇది నా స్వీయ రచన కేవలం ఈ సమూహం కోసమే వ్రాయడం జరిగింది
అని హామీ ఇస్తున్నాను.
కవి పేరు:
✍️ శ్రీకాంత్ కడార్ల
హన్మకొండ
9948076661
27
అంశం: వందేమాతరం.
ఏరువాక పూర్ణిమ కవితాగానం:
వర్త కంబుఁ జేయ వచ్చినారమటంచు
మాయ మాటలాడి మైదు జేసి
పాలనంబుఁ జేయ వలను బూనిరి వారు
వందె మాతరమని పాడ వోయి.
ఆంగ్ల విద్య చేత నవని నేలగ నెంచి
బానిసలను జేయ భరత భూమిఁ
జొచ్చి రాంగ్ల జాతి చోరు లెంత గడుసో
వందె మాతరమని పాడ వోయి.
మూడు రంగు లెన్నొ మురిపాలు చిందిస్తు
యెగురు చుండె నెంతొ యెత్తు వరకు
జాతి పతక మెంతొ శాంతి యుతముగాను
వందె మాతరమని పాడ వోయి.
తెల్ల వారమేము తెలివి పరుల మంచు
తెలివి తోటి మనలఁ తెల్ల వారు
బానిసలను జేయ పాలకులైనారు
వందె మాతరమని పాడ వోయి.
విస్త రించి యున్న వీరభూమి మనది
ఖండ మంత ఖ్యాతిఁ గల్గి యుంది
దుష్ట తెల్లవారి దృష్టి పడెను గదా
వందె మాతరమని పాడ వోయి.
దిడ్డి మారుతి,
కంగ్టి.
28.
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..వందే మాతర ఉద్యమం
శీర్షిక..తొలి ప్రజా ఉద్యమం
ఎగిసిపడుతున్న జాతియోద్యమాన్ని నీరు గార్చేందుకు యత్నించిన పాలకుల నిరసించిన గళం వందే మాతరం
బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఆరంభమైన వ్యతిరేకోద్యమం
విదేశీ వస్తు బహిష్కరణ
స్వదేశీ వస్తు వినియం లక్ష్యంగా
దేశమంతటా వ్యాపించిన స్వదేశీ ఉద్యమం
భారత స్వాతంత్ర పోరాటంలో తొలి ప్రజా ఉద్యమం
కుల మత లింగ భేదాలకు అతీతంగా
భారతీయుల నరనరాల్లో ఉప్పొంగిన భావ తరంగం
భారతీయుల్లో నిద్రాణమై యున్న జాతీయతను జాగృతి చేసి
స్వరాజ్యానికి ఊపిరి పోసిన ఆత్మ స్థైర్యం
దేశభక్తి ఉప్పొంగి వేల గొంతుకలు గానం చేసిన బీజాక్షర మంత్రం
సత్యహింసల మార్గంలో పయనిస్తూ
జాతి ఐక్యతను చాటిన వందే మాతరం
నేటికీ ప్రతి భారతీయుడు పలికే ప్రణవ నాదం వందే మాతరం.
29
[05/06, 9:57 PM] +91 94921 64193: కవితా గానం
*జ్యేష్ఠ పౌర్ణమి కవితా పోటీ*
*డి.నాగజ్యోతిశేఖర్*
*అంశం:వందేమాతరం*
*శీర్షిక:జ్వలిత గేయం*
*************************
శ్వేత ధూమం మింగిన స్వేచ్చా సూర్యుడు
బానిస కృష్ణ బిళంలోకి జారిపోయి...
వెతల కిరణాల్ని ప్రసవిస్తున్న
సమయాలవి!
చర్మానికి పరాయితనాన్ని చుట్టుకొని
సంస్కృతి ఆత్మని బూటు కాళ్ళకింద నలగగొట్టుకుంటున్న
తనువుల ఆక్రోశ రాత్రులవి!
కన్నీళ్లు కమిలిన దేహ రంధ్రాల్లో
ఇంకి...
విరిగిన నెత్తుటి నదులు పోటెత్తున్న సుదీర్ఘ అమావాస నీడలవి!
అదిగో ఆ భారపు సంకెళ్లను కాళ్లకు చుట్టుకొని నడుస్తున్న వేదనా బతుకులపై
విభజన కొరడా
చెళ్లున మోగింది!
ఆ ఆధిపత్య చార్నకోల అంచుల్లో
చీలిన
ఐక్యతా గుండె గోడల్లో భగ్గుమందో నిరసన జ్వాల!
కట్టుతెగిన స్వతంత్రకాంక్ష
గుప్పున ఓ చైతన్య గీతమై
ఎగసింది!
పదం పదంలో ఆవేశాన్ని కూరుకుని తిరుగుబాటు ఆకసమై పరుచుకొంది!
మాతృభూమి ఒడిలో
*వందే మాతరమంటూ* పాటల నిప్పు జెండాను ఎగరేసింది!
ఉద్యమ సెగను తెల్ల తోళ్లకు అంటించింది!
ఎర్రటి కాగడాల్ని నోటి గడపలో ముట్టిస్తూ....
పచ్చటి నదుల్ని వేల ఎదల్లో
ప్రవహింప చేస్తూ...
హిమాలయ అంచుల్లో ఏకతా గేయమై ప్రతిధ్వనించింది!
పలికే ప్రతిపెదవికి భాషగా కాక
బాసటగా నిలిచిన తేజో అక్షర సమూహం!
భారతీయ నరనరాల్లో నగారాలు మోగించిన విప్లవ చైతన్యం!
రాదారులన్నీ పాటల పర్ణశాలలయ్యాయి!
రాష్ట్రాలన్నీ పోరు పర్జన్యాలయ్యాయి!
నాటి ఆంగ్లేయ అహాన్ని
పిడుగులై ప్రతిఘటించాయి!
ఆ గర్జన భారతీయ ఆత్మల్లో
నేటికీ ఉత్తేజ నెత్తుటిని నింపుతున్నది!
అక్షరమెంతటి బలమైనదో
వందేమాతర గీతాన్ని స్పృశిస్తే చాలదా!
ఉద్యమానికి ఊపిరి సాహిత్యమని
నీ స్ఫూర్తి గేయాన్ని నిత్యం స్మరిస్తే చాలదా
ఓ కవి వీరుడా!
అణువణువునా దేశభక్తి
పొంగి పొరలింప చేసిన...
చేస్తున్న నిజ భారతీయుడా!
వందేమాతర సృజామీ
నీకివే మా ప్రతీ తరం అర్పించే
వంద వేల వందనాలు!
✍️🌹 *డి.నాగజ్యోతిశేఖర్*
మురమళ్ల,
తూర్పుగోదావరి జిల్లా,
(పోటీ కొరకు రాయబడిన స్వీయ రచన)*
30
[05/06, 9:59 PM] Sarphraj Anwer Poet: *కవితా గానం సమూహం*
*పౌర్ణమి పోటీలు*
అంశం: వందేమాతరం
శీర్షిక : ప్రజ్వలిత హృదయ గేయం
కవి. : సర్ఫరాజ్ అన్వర్
🌺 *ప్రజ్వలిత హృదయ గేయం..*🌺
ఆ తరం, ఈ తరమే కాదు ఏ తరమైనప్పటికి
దానిని ఒక్కసారి వింటేనే మనసు వివశమై భావతరంగమై శరీరంపై రోమాలు *దేశభక్తితైలాన్ని పూసుకుని* నిక్క బొడుచుకుని లంబకోణంలో
ఠీవిగా నుంచుని సెల్యూట్ చేస్తాయి..
కులమతజాతిప్రాంతాల విద్వేషాన్ని మనసులో నింపుకొని విడిపోయిన భారతీయులందరిని
*దేశభక్తి మంత్రమేసి* మంత్రముగ్ధులుగా చేసి ఏకతాటిపై నిలిపిన *ముగ్ధమనోహరమంత్రదండం..*
పశ్చిమబెంగాల్లో ప్రారంభమై *ప్రజాహృదయ గీతమై*
అందరి నోళ్లల్లో నాని
పాశ్చాత్యుల గుండెల్లో గునపమై గుచ్చుకుని
వారి శ్వాసనడ్డుకుని,దురాశను దేశభక్తి చితిమంటల్లో కాల్చేసిన *పరవశిత ప్రజల ప్రమిద రాగం..*
యావద్భారతాన్ని దేశభక్తికెరటాలతో ఉర్రూతలూగించి
భారతీయ *ఆత్మగౌరవ సమ్మానాన్ని* పెంచి,
అఖండభారత సమైక్యరాగాన్ని విన్పించి
అందరినీ *సమ్మోహితం చేసిన ఆత్మస్థైర్యగీతం..*
స్వతంత్ర పోరాటం నడుస్తున్న ఆ రోజుల్లో
అదొక *విశిష్ట జపమంత్రం* దాన్నిజపించని నోరు, స్వాతంత్ర్యం కోసం పరితపించని హృదయమే లేదంటే అతిశయోక్తి కాదేమో..
వందేమాతరం కేవలం ఒక జాతీయగేయమే కాదు
ఆనాడు *గాయపడ్డ కోట్లాది భారతీయ హృదయాలకు పూసిన సాంత్వన లేపనం*
అదొక దేశభక్తి గేయం మాత్రమే కాదు
*ప్రజా హృదయాల ప్రచండ ప్రజ్వలితగేయం..*
*సర్ఫరాజ్ అన్వర్..*✍🏻
9440981198
రాజేంద్రనగర్, హైదరాబాద్..
31
[05/06, 9:59 PM] Prasoona Sharma Madam: *కవితాగానం*
అంశం**వందే మాతరం
నిర్వహణ**శ్రీ గుడిపల్లి వీరారెడ్డి గారు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
సీసమాలిక
**********
పాశ్చాత్యదేశాల పాలిటి మంత్రమై
గుండెలోనఫిరంగి గుళ్ళుగాను
దేశభక్తులకువం దేమాతరంబను
ఆయుధములభించె ఆసరాగ
బెంగాలు ముద్దని విభజన వద్దని
తిరుగుబాటునుచేయ సిద్ధపడిరి
పరదేశ సాయము పనికిరాదనిచెప్పి
విద్యాలయాలును వివిధసంస్థ
లెన్నియో స్థాపించి దన్నుజూపగ గాంధి
రాట్నంబుపట్టిరి రయముగాను
యెందరో ప్రముఖులానందముగానట్టి
ఉద్యమంబును జేయ నుత్సుకతను
ఆంగ్లేయపాలన నంతమొందించగా
నడుముకట్టియుపూని నడచినారు
తే. గీ.
******
భారతీయుల త్యాగాల ఫలితమేమొ
విడిచి పోయిరి దేశాన్ని తుడిచిపెట్టి
రక్త తర్పణ చేసిన భక్తులార!
అందుకొనుడయ్యయివిగొమా వందనాలు.🙏
జ్ఞానప్రసూనా శర్మ. ఎల్లికంటి
కడ్తాల**రంగారెడ్డి జిల్లా
**************************
ఈ పద్యం నా స్వీయరచన.ఎవరికీ కాపీ. కాదు




Comments
Post a Comment