Skip to main content

జూన్ రెండు

నిర్వహణః
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం ః
శివునూరి లలితాకృష్ణ
సహకారం ః
మెరుగు మధు
అవధాని ః
ఐతగోని వెంకటేశ్వర్లు గారు
***************
కవివరుల జాబితా
1. అనుముల ప్రభాకరాచారి గారు
2.ఇంద్రవత్ రాహుల్ గారు
3.వకుళ వాసు గారు
4.జ్ఞాన ప్రసూనా శర్మ గారు
5.
6.
7.
8.
9.
10.మర్రి జయశ్రీ గారు
****************
[02/06, 7:44 PM] Anumula Prabhakarachari: తెలంగాణ-జగతి.
                           కవిత.
రచన: అనుముల ప్రభాకరాచారి.
2.6.20.
              ******
ఎన్ని బాధలు పడ్డదీతల్లి...!
నీరులేక తాగ..మాట వినక తనది.
ఎన్నెన్ని హేళనల గుండెల దాచుకుందీనేల.!

వెక్కిరింపు మాటలన..,తన మాటలను ఎకసెక్కంచేయ.

ప్రేమగల ధీరులు., మన్నెర్ర చేయగ...
కన్నెర్ర చేసిన యువకులు
కదంతొక్కగ..
పిల్లజెల్ల బహుజనులెల్ల
బహుబాగ పోరాడ..గీరాడ...
స్వతంత్రమాయె కద...స్వంతమాయె మనకు తెలంగాణ.

రూక విదల్చనన్న., భరించి..రూపుదిద్దుకుంది
నవనవోన్మేతంగ.
ఎడారిచేసినభూముల ..
నీటముంచి..
అన్నంపెడుతుంది..అందరికీ.
వెల్గులుండవని నవ్వగ..
నిత్యదివ్వెయై కాంతులీనుతుంది.

సంకల్పబలమున్న నాయకుల మనమె నడిపించి
భారతి పదమువ్వై ...
ఆనందనర్తనం చేయాలె.
జగతి కనులుపెద్దవి చూసి చూడాలె.
                *****
2
[02/06, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
అంశం : తెలంగాణ ఆవిర్భావము
తేది : 02/06/2020


ఎందరో అమర
వీరుల త్యాగ ఫలం
ఎందరో యువతల
కష్ట ఫలం
నీరు కోసం
నిధుల కోసం
పోరాడిన మా
తెలంగాణ
ఈ తెలంగాణలో
గడ్డి పోచ కూడా
కత్తి బట్టి ఎదురించింది
ఎందరో కృషి
వలన మన
తెలంగాణ
మనకు దక్కేను
నేడు...


*ఇంద్రవత్ రాహుల్*
  *నిజామాబాద్*
3
[02/06, 8:18 PM] Vakula Vasu: వకుళ వాసు
హన్మకొండ
అంశం-తెలంగాణ ఆవిర్భావము

శీర్షిక-🍃కొత్తబాట🍃

కొత్తబాటలో పయనం కడుపునిండినట్లున్నది కాని దానికై ఊపిరొదిలిన అమరుల అయ్యవ్వలకు కడుపుకోతే మిగిలింది...

గుంతలువడ్డరోడ్లు మట్టిబాటలపొంటి పోతాంటె
 ఇంకెప్పుడు బాగుపడ్తదో మన తెలంగాణ అని కడుపుల పేగులు మెలికలువడేవి...

సదువ సీట్లులేక కొలువులన్నీ కొంగలెత్తుకపోతాంటె
సగం కాలిన తనువోలె తల్లడిల్లి పోయేది నా తల్లి తెలంగాణ....

తలాపున గంగున్న గొంతుతడవక పొలాలన్నీ
రొదబెట్టి మింటదేవునికి దండాలుబెట్టెవి....

నా తెలంగాణ నాక్కాల్నని ఒక్క అడుగు ముందుకువడి కోట్ల అడుగులను కలుపుకొనె

తల్లికై తండ్లాడిన కొందరు కొడుకులు ఆవేశంతో అగ్గిపాలై అమరులై ఆకాశాన సుక్కలై మెరిసె...

ప్రాణాలు లెక్కజేయక సాగిన  పోరాటంలో తరగల నురగల తెలంగాణ తల్లి అవతరించె ...

బీడుబారిన చెర్లన్నీ పూడికతీతతో సంద్రాలై మురిషి మెరిసె...

దసరనాడొచ్చిన కొత్త అల్లునోలె రోడ్లన్నీ సోకులువడి పాలపిట్టకు సైటుగొట్టె....

అమరులైన కొడుకుల మొకాల నవ్వులన్నీ పచ్చగపూసిన తంగేడులై పల్లెపల్లె మురవబట్టె ....

కొత్తకుంపటి పథకాల వంటకాలు కొన్ని కమ్మని రుచులతో కొన్ని ఎచ్చిపచ్చి వాసనలతో
ఇంకొన్ని మాడిమషిబొగ్గైన తీరుగ వడ్డించి వాతలుబెట్టవట్టె...

ఏది ఏవైనా తప్పొప్పులను కడుపుల బెట్టుకొని గద్రాయించె కన్నతల్లోలే పులుముకుంట
 దారితప్పితే వాతలుబెట్టే కన్నతండ్రోలె గురాయించుకుంట ముందుకుపోవాలె....

గప్పుడే ప్రాణాలొదిలిన నేలమ్మ బిడ్డల గుండెల్ల నవ్వులపంటలు పండుతయ్
కండ్లల్ల కాంతులు ఏరులై పారుతయ్....

🍀🌹వకుళవాసు 🌹
4
[02/06, 8:31 PM] Prasoona Sharma Madam: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా

అంశం;;;   *తెలంగాణ*

సీసమాలిక.
**********

భాసజూడనుయాస భావములో ప్రాస
        కట్టుబొట్టునడతఘనముగుండు
తెల్లార గట్లనే మెల్లంగనేలేషి
   బాయి కాడికివోయి బరువులెత్తి
అన్నిపనులుజేశి ఆలోచనాతోని
    అంబటేలకువొచ్చి అల్సిపోయి
తానంబుపూజను  దడదడాకానిచ్చి
      రొట్టెయంబలితిని రొష్టుదీర  మందితోనిగలిసి మాటలువెట్టుతూ
    జరసేపు నిద్రకు జారుకుంద్రు
పండుగలప్పుడు పరెషాను వడకుండ
     కల్లకప్టములేక  సల్లగుండు
 
కాయకష్టము జేయంగ కడుపునిండు
కల్సి మెలుసుకో నుండంగ కాదు బాధ
ఉన్న దాంతోనే తృప్తిగ తిన్నగుండు
ఫికరు జేయక ఎప్పుడు సుఖముగుండు

జ్ఞానప్రసూనా శర్మ ఎల్లికంటి
కడ్తాల--రంగారెడ్డి జిల్లా
5
[02/06, 8:34 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: ***తెలంగాణ పౌరుషం***
                              ✍️డా.పాండాల.

భారతీ సతివయ్యి బ్రహ్మకిల్లాలివై
పార్వతీ దేవివై పరమేశు రాణివై
పరగ శ్రీ లక్ష్మీ వయ్యి ..గౌరమ్మ.
భార్యవతివి హరికిని ...గౌరమ్మ!1

భారతదేశాన భాగ్యమే తెలగాణ
పదిజిల్లలా పరిది ప్రగతి కోరే దీప్తి
నలుకోట్ల జనుల ఆత్మ ..గౌరమ్మ
నవ్యభావాల వీణా...గౌరమ్మ!2

తెలుగుభాషయంటుతెలివిగాముంచేసి
తొండినిధులతొ బల్సికుట్రలెన్నోజేసి
ముప్పుతిప్పలు బెట్టిరీ..... గౌరమ్మ
ముఖ్యమంత్రై ఆంధ్రులూ..గౌరమ్మ!3!

ఊపిర్లు బిగబట్టి ఉద్యమాన్నిలేపి
ఉత్సాహముద్రేక హృద్ఘోస వినిపించే
ఉద్యమ అధినేతగా ......గౌరమ్మ
శేఖరుడు ముందుండెనూ గౌరమ్మ!!4!!

కార్మికా కర్షకా లాయర్లు టీచర్లు
వైద్యులు భాషితులు ఉద్యోగులెల్లరూ
JAC గ గుమి గూడియూ....గౌరమ్మ
ధూముధాములు జరిపిరీ గౌరమ్మ!5!

అరువదేండ్ల ఘోస వేలయువత చావు
వేసారేవిధిచూసి వేదనను తొలగించె
సోనియా మన్మోహనే .......గౌరమ్మ
తెలగాణ రాష్ట్ర మనెను.... గౌరమ్మ!6!

ఉభయ సభలెల్లను దద్దరిల్లెను చర్చ
సుష్మాస్వరాజమాట మీరకుమారి నోట
కురియప్పనే తేటగా. .... గౌరమ్మ
బిల్లు పాసై మురిసెను.. గౌరమ్మ!!7

జంకేల భయమేలజయమెపుడు నీతికే
బాపు పుట్టినరోజు బాగుంది మనరాత
పెత్తరామస ముందూ..... గౌరమ్మ
కలలు సాకారమాయె.. గౌరమ్మ!8!
[02/06, 8:34 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: నలుకోట్లఎదలోననవ్యకాంతులుజిమ్మె
సంబరం మిన్నంటె సకలజన సంతసం
చిరునవ్వు మల్లెలాయె..... గౌరమ్మ
కనుగ్రుడ్డ్లు కాంతులీనే.. గౌరమ్మ!9!

స్వేచ్ఛ స్వాతంత్ర్యాల స్వీయశాసనాల పాడిపంటల వృద్ది ప్రగతి మార్గపుబుద్ది
ఎదిగేటి యువతకేమో..... గౌరమ్మ
ప్రజ్ఞ పాటవమివ్వుమా.. గౌరమ్మ!10!

బతుకమ్మయని పేర్చిపరగనాశ్వజశుద్ద
పాడ్యమి మొదలుకొనిభక్తిగానినునిల్పి
చారుసుందరమైన.....    గౌరమ్మ
సంపదను మాకొసగుమా గౌరమ్మ!11!

శ్రీ వాణి గిరిజవని చిత్తమందున నిల్పి
పెక్కునోముల నోచిచిక్కు దీర్చెటితల్లి
ఇష్టకార్యం దీర్చుమా.   . గౌరమ్మ
ఇహలోకమున యందునా గౌరమ్మ!12

అమ్మలక్కలుగూడి ఆనందముప్పొంగ
మదిలోననేనమ్మి సొమ్ములేధరియించి
మమ్మల్ని దీవించుమా..... గౌరమ్మ
అమ్మలకు అమ్మవనిరి గౌరమ్మ!13!

సంక్షేమ పథకాల్తొ సాగుచున్నదిప్రభుత
సహకారమందించ సమిథలై కదలాలె
బంగారు తెలగాణమే...... గౌరమ్మ
బాధ్యతగ చేకూర్చుమా గౌరమ్మ!14!

విద్యబుద్దులుపెంచ వినయ సంపన్నత
విజ్ఞాన వృద్దియే విఫణిలో విలువంటు
దీవేనలు మాకివ్వుమా.... గౌరమ్మ
దీక్షతో దలతుమెపుడూ గౌరమ్మ!15!

తెలగాణ రాష్ట్రాన్ని పైరుపంటలతో ను  సర్వశుభములునిచ్చి చల్లగాదీవించు
బతుకమ్మ నీఘనతయే ...గౌరమ్మ!భాగ్యమై నిలచునమ్మా... గౌరమ్మ!!16

✍️డా.పాండాలమహేశ్వర్
గోసుకొండ పోచంపల్లి యాదాద్రి
6
[02/06, 8:47 PM] +91 99633 77273: అంశం: తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం
పేరు : పోలా కిషోర్ కుమార్

ఏ అడ్డుగోడలైనా తొలగించే
ఏ పర్వతాన్నైనా పెకిలించే
ఏ సాగరాన్నైనా మధించే
ఏ ఆకాశాన్నైనా అధిగమించే
ఏ లక్ష్యాన్నైనా ఛేదించే శక్తి
మనలోనే దాగి ఉంటుంది
మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే
లక్షలమందికి స్ఫూర్తి నిచ్చిన వారవుతారు
గెలిస్తే కోట్లాదిమందికి దారిచూపిన వారవుతారు
అనుకున్నది సాధిస్తే చరిత్రలో నిలిచిపోతారు
అలాంటి వజ్ర సంకల్పమే
నిజాం నిరంకుశత్వ పాలనకు
ఎదురునిలిచేటట్టు చేసింది
రాక్షస రజాకార్ల దురాగతాలకు
చరమ గీతం పాడేటట్లు చేసింది
స్వాతంత్ర్యం వచ్చాక కూడా స్వపరిపాలనలో
తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి
పోరాడేటట్లు చేసింది
తమ యాస బాష భూమి నీరు ఉద్యోగాల
హక్కుల కొరకు పోరాటం చేయించింది
ప్రత్యేక తెలంగణా రాష్ట్ర సాధనకై ఉద్యమం
చేయించింది
ఎందరో అమరవీరుల త్యాగఫలమే
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది
చరిత్రలో నిలిచేటట్టు చేసింది
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన
ఎందరో మహానుభావులు
అందరికీ వందనాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
7
[02/06, 8:52 PM] Ramaka: 🌷కవితా గానం🌷

పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:2-6-2020
అంశం:తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ప్రక్రియ:వచనకవిత్వం
శీర్షిక: విమోచనం
**************************

కరకుకత్తుల నెత్తుటి ప్రవాహం
దౌర్జన్యాల,అత్యాచారాల అమానవీయం
అధికపన్నుల అన్యాయార్జనం
స్వేచ్ఛ లేని పత్రికా జులుం
ఎదురేలేని మతోన్మాదం
పీడిత,తాడిత ప్రజలపై పెత్తనం
జుగుప్సాకరమైన నీచప్రబోధం
అక్షరాల చదువుకు సంకెళ్ళ బంధం
నియంతృత్వ పోకడల పాషాణం
రజాకార్ల దుర్మార్గపు పాలనను
విచ్చుకత్తుల వీరంగాన్ని ఎదిరించి
ధన,మాన,ప్రాణాలను త్యాగం చేసిన
నా తెలంగాణ అస్తిత్వం కోల్పోలేదు
ప్రపంచం నివ్వెరపోయేటట్లు ఉద్యమం
అన్నివర్గాల ప్రజల సాయుధ పోరాటం
వడిసెల్లో రాళ్ళు,గాజుల చేతుల్లో కారాలు
కొడవళ్ళు,బరిసెలు,బందూకులు
నింగికెగసిన ఆగ్రహజ్వాల
తరిమికొట్టి,తరిమికొట్డి,తట్టిలేపిన
చైతన్య వారసత్వ సంతకాలు
తెలంగాణ విమోచన నగారాలు.
కాలచక్రభ్రమణంలో మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు
కదిలిన చైతన్య ప్రవాహాలు
జయశంకర మంత్రాలై
కాళోజీ గొడవలై
దాశరథి మీటిన వీణా ధనుష్ఠంకారాలై
నీళ్ళు,నిధులు,నియామకాలై
సబ్బండవర్ణాల సామూహిక ‌రణనినాదాలై
సకలజనుల ఆగ్రహ జ్వాలలై
చంద్రశేఖర మడమతిప్పని ఉద్యమమై
అమరవీరుల నిరుపమాన త్యాగాలై
పార్లమెంటును కదిలించి
భరతమాత ముద్దుబిడ్డై
తెలంగాణ జన్మించె నేడు
జయహో తెలంగాణ
జయజయహో తెలంగాణ.
8
[02/06, 9:18 PM] Gaddam  Laxmaiah Garu Kataram: *తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో..*
💐💐💐💐
*lసీl*
నాతెలగాణ రత్నాలవీణనియన్న
దాశరథికవిని దైర్యమడుగు!
తెలగాణ త్యాగాల తెగువ యెందెందుకో
కాళోజి "గొడవ"నె కావ్యమడుగు!
ఉద్యమనాదమున్ ఊదిగంతేసిన
గద్దరన్న కాలగజ్జెనడుగు!
జాగృతహోరులో జయకేతనంబయ్యి
నిలిచిన అందెశ్రీ నిప్పునడుగు!
lతేగీl
కలము బలమయి కదిలినా కథనమడుగు!
పదునులెత్తిన పిడికిల్ల బలమునడుగు!
అమరవిద్యార్థి వీరుల ఆర్థినడుగు!
పదముకలిపిన కవులను భంధమడుగు!
💐📝✍️
             *-గడ్డం.లక్ష్మయ్య*
జయశంకర్ సారస్వత సమిత
9
[02/06, 9:19 PM] దీపక్ న్యాతి: *కవితా గానం*
పేరు : డా.దీపక్ న్యాతి
అంశం : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
తేదీ : 02-06-2020
శీర్షిక : రథసారధి

తెలంగాణ ప్రజలు సహృదయులు
మోసం ఎరుగని మితవాదులు
పగవాన్ని హక్కున చేర్చుకునే సౌమ్యులు
బాగున్నారా అంటే రండి భోంచేద్దాం అంటారు
పాడిపంటలు సస్యశ్యామల ప్రాంతంగా వెలిగి
తమకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న తెలంగాణ
ఈ సంత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నారు అతిథులు
ఉండ నీడనిస్తే ఇల్లు నాదన్నారు పరాయి దేశస్తులు
దాదాపు అయిదు వందల ఏళ్లు
పరాయి పాలనలో మగ్గింది
అంతా తన వారు అనుకునే తెలంగాణ ప్రజలు
పరాయి వాళ్ల పెత్తనాన్న ఓర్పుగా భరించారు
సాత్వికత్వాన్ని చేతగానితనంగా తీసుకున్న ప్రతిసారి తిరుగుబాటు చేశారు
రజాకార్ల ధన మాన దోపిడీలను ఎదిరించారు
సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో భారతాన కలిశారు
ఆంధ్ర తెలంగాణ తెలుగు భాషతో
కొత్త రాష్ట్రంగా తెలుగు సోదరుల కలుపుకున్నారు
సోదరులనుకున్నవారు పక్షపాత ధోరణి చూపించారు
తెలంగాణ వాళ్ళ కడుపుల తొక్కుతూ అడుగులు ముందుకేగారు
పన్నెండేళ్ల కి పసిగట్టిన తెలంగాణ నాయకులు
మాకు స్వరాష్ట్రం కావాలని
ఆందోళనలు చేశారు
కపట కన్నీటితో సవతి ప్రేమ జూపి కాలం దాటేశారు
అరవై ఏళ్లు గిరిగీసి ఆడుకున్నారు
బహుకాలంగా వారి మాయ మాటల మాయాజాలం
చవి చూసిన అనుభవంతో ఇక లాభం లేదని గొంత్తెత్తాడు
తెలంగాణకు స్వతంత్రం కావాలన్నాడు
తెలంగాణ నాయకుడు కేసీఆర్
తెలంగాణకు జరిగిన అన్యాయఫు
చరిత్రపుటల్ని ముందుంచి చదివించాడు
తెలంగాణ ప్రజలందరి ఒక్కతాటిపై చేర్చాడు
వెనకడుగు వేయక ఎదురెల్లాడు
ఆందోళన ఉదృతం చేసాడు
దీక్షలు చేసి మరణశయ్యకు దగ్గరయ్యాడు
మృత్యువును గెలిచాడు కేంద్రాన్ని కదిలించాడు
వందలకొలదీ స్వతంత్ర యోధుల ప్రాణ త్యాగాలకు ఫలాన్ని సాధించాడు
తెలంగాణకు స్వతంత్రాన్ని తెప్పించాడు
బంగారు తెలంగాణ గా తీర్చి దిద్ద నడుం కట్టాడు
కానీ వినీ ఎరుగని శ్రేయ పథకాల రచించాడు
జల ప్రాజెక్టుల నిర్మించాడు
భవిత తీర్చి దిద్ద రథసారథియై ముందుకు నడిపిస్తున్నాడు

డా.దీపక్ న్యాతి
సినీ రచయిత దర్శకుడు
నంది అవార్డు గ్రహీత
10
[02/06, 9:22 PM] మర్రి జయశ్రీ: కవితా గానం
మర్రి జయశ్రీ
అంశం..తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
శీర్షిక..సకల జనుల సమరోత్సవం

ఆరు దశాబ్దాల పోరాటం
అలుపెరుగక పడిన ఆరాటం
వలసపాలనలో జరిగే
అన్యాయాలను ధిక్కరిస్తూ
ఎదురొడ్డి నిలిచిన ధీరత్వం
విద్యార్థుల త్యాగాలు
అమరుల ఆత్మ బలిదానాలు
ఆత్మ గౌరవమే, అస్థిత్వమే ఆలంబనగా
ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలై
రణరంగం లోకి దూకిన సకల జనుల సమరోత్సాహాం
వలస పాలకుల కుట్రలను తిప్పికొట్టి
పోరాడిన పోరాట ఫలితమే
తెలంగాణ ఆవిర్భావం
అదే మనకు గర్వకారణం.

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...