Skip to main content

శాకాహారం జ్యేష్ట మాసం

నిర్వహణ
వీరా గుడిపల్లి ః the mathematics teacher and poet
సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ
అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం ః మెరుగు మధు గారు
********************
1.వీరా గుడిపల్లి గారు
2.స్వర్ణ సమత గారు
3.కోరాడ గారు
4. దీపక్ న్యాతి గారు
5.వల్లాల విజయ లక్ష్మి గారు
6.వీరా గుడిపల్లి గారు
7.కోరాడ నరసింహా రావు గారు
8.రామక క్రిష్ణ మూర్తి గారు
***************
1
[11/06, 8:09 PM] Veera Gudipally: ( *శాకాహారము* ) పై వీరా గుడిపల్లి  (వీరన్న ) తొలినాళ్ళలో  రాసిన పద్యములు .
-------------------------------------------
22.02.2016

ఉదర పోషణ కైనీవు యుర్వి మీద
ప్రాణు లను జంపి తినగాను ప్రాజ్ఞ తేన
జరుగు ఘోరము జనమంత జయమనంటె
జరగ నీయట్లు *"వీరన్న"* జరగనిమ్ము


ఆకులలములు తిని నీవు ఆగలేవ
తోటి జీవాల జీవమ్ము తోడి నీవు
బ్రతుక తలచిన నీకేన బ్రతుకు హక్కు!
చెబితె వినకున్న *"వీరన్న"* చేయనిమ్ము


మాంస హారము తినగాను మనిషి కేల
న్యాయ మనిపించె తెలియదే న్యాయ మేల?
ప్రాణి ప్రాణిని హింసించ ప్రాజ్ఞు లంత
సబబెయని చెప్ప *"వీరన్న"* సాగనిమ్ము


పప్పు బెల్లము రుచినేమొ పండి తులును
పనికిరాదని చెప్పిరా పరగ నీకు
జీవ రాశిని చంపగా జీవ మెట్లు
ఒప్పు కున్నదో *"వీరన్న"* యొప్ప నిమ్ము


ఆకు కూరలు శ్రేష్ఠము అందరికిని
తేలి కగు జీర్ణ కోశాన్ని తేట పరచు
తెలివి పెరుగును అదిగాక తెలియ జెప్ప
మనసు వికసించు *"వీరన్న"* మనిషి కెపుడు
2
[11/06, 8:26 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*

*11/06/2020*

🥗 *శాకాహారం*🥗

శాకాహారమే ఆరోగ్యం,
ఆనందం,ఆహ్ల దం
సాత్విక త కు సానుకూలం
శాకములార గించి శారీరక
ధృడత్వం సముపార్జించుట
సత్ప్ర వర్తన ,సచ్చీ ల త,
సమతుల్య త
సమ తా_మమతా భావనలకు
మూలం
జ్ఞానానికి _శక్తికి_యుక్తి కి
ఆధారం
జీవన సాఫల్య మున కు
సాధుత్వానికి _సానుకూల థకు
సో పానము
పవిత్ర త కు_పరమ పద
సో పానానికి నాంది
భక్తికి __ముక్తికి పునాది.

*స్వర్ణ సమ త*
*నిజామాబాద్*
3
[11/06, 8:39 PM] Korada: కవితా గానం
నేటిఅంశం:-
       శాఖాహారం
కోరాడనరసింహా రావు ;
"తెలుసుకొను మన్న"
*****************
"తిండియెట్టిదో...త్రేపుఅట్టిది" సత్య సాయి ఉవాచ !
"హితమునుగూర్చేఆహారమునుమితముగా తినవలెను "
ఆర్యుల నానుడి !
రాజసాహారం...
అహంకార,క్రోధ ప్రేరే
పితం కదూ...!
తామసాహారం....
అత్యంత హేయం
మూర్ఖత్వ జనితం!
సాత్వికాహారమే....
సర్వదాశ్రేయస్కరం!!
సత్వ గుణ పూరితం
శాంతస్వాభావితం
ఆరోగ్యదాయకం
జ్ఞాన,ఐస్వర్య,ఆనంద ప్రదాయకం !
ఆహారము లన్నింట
నీ శాకాహారమేమిన్న
సుఖియింప వలె నన్న...తెలుసు కొను మన్నా....!!
*****************
.......కోరాడ.
4
[11/06, 9:22 PM] దీపక్ న్యాతి: కవితా గానం
పేరు : డా.దీపక్ ప్రాతి
తేదీ : 11-6-2020
అంశం : శాకాహారం
శీర్షిక ; జ్ఞానాన్ని సవరించి

ఆదిమానవుడు జంతువులు పోలి ఉండే
తోటి జంతువుల వెంటాడి వేటాడి
ఆకలిదప్పులు తీర్చుకొనె
చురుకైన మానవుడు నైపుణ్యాలను నెగ్గె
జంతు జీవాలపై ఆధిపత్యాన్ని
పొందగలిగే
ఆ అధికారముతో ఆ అహంకారముతో
జ్ఞానాన్ని విస్తరించ సవరించే
పండ్లు ఫలాలపై మక్కువ నెక్కువ చూపె
విత్తనాలు నేల నుండి మొలకెత్త గ్రహించే
నాగరికత నడవడి నేర్చుకున్న నరుడు
పాడి పంటలు పండించ వ్యవసాయానికి దగ్గరయ్యే
సులభ భోజనానికి సులభ జీర్ణానికి
ఔషధ గుణ తత్వాలున్న శాకాల నెరిగే
రుగ్మతల నిలువరించి ఆరోగ్యాన్నిచ్చి
ఆయుష్షును పెంచే శాఖాహారమే
పరిచయమాయే ప్రియ మాయే
సాత్వికతను అలవర్చుకునె
రక్తపు మరకల మాపు కోవడం మానుకునె
సాదు సంతు జీవనాలు నమ్ముకొనే
శాకాహారమే గుణమని తెలుసుకునే
మనిషి మానవత్వంతో మనగలిగే

డా.దీపక్ న్యాతి
నంది అవార్డు గ్రహీత
హైదరాబాద్
5
[12/06, 8:04 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:**శాఖాహారం***
----------**********------

సాత్విక ఆహారం *శాఖాహారం*
సదా సంపూర్ణ పోషకాహారం
జీవహింసరహిత ఉత్పాధనం
చక్కని సదాలోచనలకు ఇంధనం

ఆహారఉత్పత్తి జీవకర్మాగారాలు
పచ్చని వృక్షజాతుల పత్ర పుష్ఫాలు
వేర్లు ఫలాలు కందాలు విత్తనాలు                              పాలు పాలఉత్ఫత్తులు సైతo శాఖాహారాలు

పిండిపదార్ధాలు విటమినులు కొవ్వులు
మాంసకృత్తులు ఖనిజలవణాలoటి                 సూక్ష్మ స్థూల పోషకాలభరితం
సులభంగ జీర్ణమయె శాఖాహారం

మాంసాహారం తినకముందు ఆరాటం-
తిన్నాక ఆయాసం-అనారోగ్య కారకం
'శాఖాహారం" భుజించక పూర్వం
భుజించాక ఓ మధురజ్ఞాపకం

ఓ గోంగూరపచ్చడి ఓ పప్పుచారు
నేతితో వేడిఅన్నంలో మాగాయ పచ్చడి
వంకాయపూర్ణమంటి నోరూరించే రుచులెన్నో
ఊరిళ్ళు కలిగించు-నెమరువేయు జిహ్వలెన్నో

ప్రపంచాన శాఖాహారులెక్కువున్న దేశం
తరాలుగా జగానికిస్తుంది శాంతి సందేశం
పొట్టను ఇబ్బందిపెట్టని 'శాoతా'హారం
సాత్విక ఆలోచనలకు అగు ప్రేరణం

:*వల్లాల *విజయలక్ష్మి*
*ఆలేరు*
6
[12/06, 8:04 PM] Veera Gudipally: *శాకాహారం*
*వీరా గుడిపల్లి*
12/06/2020
*****************

మాంస మన్నది చెడుగాదు మాన వత్వ
విలువ లనుదెల్పు మర్యాద విలువ జెప్పు
సాటి ప్రాణిని చంపొద్దు సత్కరించ
మానవత్వమ్ము *"వీరన్న"* మరచి పోకు


పాల కూరెంతొ రుచిగుండు !పాడుగాను!
కలిపియు టమాట తో వండ కఠిన విషము
మాంస మునకంటె ప్రమాద మదియు నిజము
ఏది తినమన్న *"వీరన్న"* ఎంత భయము


పొట్ల కాయను తినమన్న పోటి పడుదు
కలిపి గుడ్డుతో వండితే కాద విషము
కాంబినేషను తెలియక కలిపి తింటె
మాంస మేమేలు *"వీరన్న"* మనుజు లకును


తెలియ వంకాయ కూరన్న తెలివి పెరుగు
కాదు కాదన కెప్పుడు కాయ మెంత
చురుకు గా మారు తినిచూడు! చూడు చూడు
సాటి లేదింక *"వీరన్న"* సత్య మదియె


పాల కూరన్న పాపాయి పాలబుగ్గ
పాలు తాగిన ఫలమంత పరిఢవిల్లు
ఆకు కూరల రారాజు అవని మీద
కాదు కాదంటె *"వీరన్న"* కలుష పడకు
7
[12/06, 8:28 PM] Korada: కవితాగానం
అంశం:- శాఖాహారం
కోరాడ నరసింహా రావు ; "సుఖియింప
             వలె నన్న !"
     **************
"తిండి ఎట్టిదో...త్రేపు అట్టిదే"...సత్యసాయి
ఉవాచ....!
"హితమును గూర్చే
ఆహారముమితముగా తినవలెను"...
ఆర్యుల నానుడి !
రాజసాహారం...
అహంకార,క్రోధ ప్రేరి
త మోయ్....!
తామసాహారం...
అత్యంతహేయం ...!బుద్ధి హీనం,ఆరోగ్య క్షీణం !
సాత్వికాహారమే....
సర్వదా శ్రేయస్కరం!
సత్వగుణప్రేరితం !
శాంతస్వభావితం !
ఆరోగ్యదాయకం !
జ్ఞాన,ఐశ్వర్య ప్రదాయకం...!
ఆహారము లన్నింట
ఈ శాఖాహారమే ...
మిన్న!సుఖియింప
వలెనన్న...తెలుసు కో మన్నా....!!
*****************
........కోరాడ.
8
[12/06, 9:11 PM] Ramaka: 🔅కవితా గానం🔅

పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:12-6-2020
అంశం: శాకాహారం
ప్రక్రియ: వచనకవిత్వం
శీర్షిక: అమృతాహారం
**************************

సహజమైన పోషకాలతో
ప్రకృతిసిద్ధ సుగుణాలతో
భూమిలో పండి,నీటిని ఆధారం చేసుకొని జీవించి,
ప్రోటీన్లను‌ అందిస్తాయి.
మాంసకృత్తులను‌ కలిగి ఉంటాయి
*జీవహింస మహాపాపం* అనే గాంధేయవాదంలో ఉత్కృష్టమైనది.
ఆకుపచ్చని కూరగాయలు ఆరోగ్యకారకమై,
మలబద్ధకాన్ని వదిలిస్తాయి.
తెలివితేటలను పెంచుతాయి.
శాకాలే *సమతూకాలై* మేలుచేస్తాయి.
చిరుధాన్యాలు పీచుపదార్థాలతో నిండి బలాన్నిస్తాయి.
అరోగ్యసిరులనందిస్తాయి.
మసాలాదినుసులు మితంగా
తీసుకుంటేనే మేలుచేస్తాయి.
పప్పుదినుసులు పరమ బలవర్ధకాలై,ప్రోటీన్ల నందించి,
శక్తినిస్తాయి.
పండ్లరసాలు శక్తినిచ్చి,ఉత్సాహానిస్తాయి.
గోధుమ గడ్డిరసం,నానబెట్టిన గోధుమల నుండి తీసిన రససేవనం శ్రేయోదాయకం.
కాయలు,కూరలు ఆరోగ్యాన్నిచ్చి,క్రొవ్వు పెరగకుండా చూస్తాయి.
మితాహారం,ఉపవాసం
ఆయుష్షును పెంచుతాయి.
శాకాహారం సాత్వికాహారమై
మానవాళి జీవనగమనాన్ని పెంచి,మేలు చేస్తుంది.

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...