Skip to main content

సబర్మతి ఆశ్రమం


నిర్వహణ
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం
శివునూరి లలితా కృష్ణ
అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం
మెరుగు మధు గారు
*****************
1.ఇంద్రవత్ రాహుల్ గారు
2.వురిమిళ్ళ సునంద గారు
3.డాక్టర్ రాముకు క్రిష్ణ మూర్తి గారు
4.కోరాడ నరసింహా రావు గారు
5.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
6.మర్రి జయశ్రీ గారు
7.వల్లాల విజయ లక్ష్మి గారు
8.దీపక్ న్యాతి గారు
9.వేంకట కృష్ణ ప్రగడ గారు
10.వీరా గుడిపల్లి
11.శివునూరి లలితా కృష్ణ గారు
12.విజయ దుర్గ గారు
13.స్వర్ణ సమత గారు
14.అయిత అనిత గారు
*******
1
*కవిత గానం*
అంశం : సబర్మతి ఆశ్రమం
శీర్షిక : సత్య ధర్మం
తేది : 03/06/2020
          సత్య ధర్మం
భారత దేశంలో
 సబర్మతి ఆశ్రమం
శాంతికి చిహ్నం
ప్రజల సేవకు నిదర్శనం
సత్యం ధర్మం అహింసతో
నిర్మించుకున్న అద్భుతమైన
ఆశ్రమం సబర్మతి ఆశ్రమం
సత్య ధర్మాన్ని బోధించి
స్వతంత్రపు పోరాటం చేసి
అందర్నీ సమానంగా చూసి
ఉప్పు సత్యాగ్రంలో పాల్గొని
శాంతి కోసం పోరాడి
దృఢ సంకల్పంతో
పోరాడి నా మహాత్ముడు
ఎందరో మానుభావులకు
చెరగని ముద్రవేసిన
ఆ క్షేత్రం శబర్మతి క్షేత్రం..



*హామీ పత్రం*: ఈ కవిత నేను స్వయంగా రాసాను...అని హామీ ఇస్తున్నాను..


     ధన్యవాదములు.. 🌷


*ఇంద్రవత్ రాహుల్*
   *నిజామాబాద్*
   *9848054079*
2
[03/06, 9:01 PM] సునంద ఉరిమిళ్ళ: కవితా గానం
తేదీ::03-06-2020
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
శీర్షిక:: సబర్మతి ఆశ్రమం
********************
సత్యాన్ని ధర్మాన్ని బోధించి
స్వాతంత్ర్యోద్యమ పోరాటానికి దిశానిర్దేశం చేసిన  దిక్సూచి!

అసమానతలను తొలగించి
అందరు ఒకటే నేనే హృదయ సంస్కారాన్ని నేర్పిన మహర్షి రూపం!

పవిత్ర జాతిపిత
గాంధీ మహాత్మునితో పాటు
సహధర్మచారిణి కస్తూరిబా పాదాల స్పర్శతో పులకించి
మహాత్ముని గుండెలో పొంగిన స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని నింపుకున్న పునీత!


ఉద్యమంలో ప్రారంభ వేదికై
కీలకమైన ఘట్టాలతో
చరిత్రలో  చెరగని ముద్ర వేసుకున్న
స్మారక రూపం!

ఉప్పు సత్యాగ్రహం--దండి యాత్రతో
బ్రిటిష్ ప్రభుత్వంపై
తిరుగు బాటు బావుటా ఎగురవేసిన
భారతీయుల ప్రార్థనా మందిరం!

అఖండ భారతావని స్మృతి చిహ్నం
గాంధీ ..హరిజన .. సత్యాగ్రహ ఆశ్రమాలుగా
ముచ్చటగా మూడు పేర్లతో
పిలువ బడుతున్న సబర్మతీ ఆశ్రమం!

ఆకలి తీర్చే వ్యవసాయం
విజ్ఞత నేర్పే విద్యా జ్ఞాన సముపార్జన పాఠశాలను స్థాపించి
స్వయం అభివృద్ధి సాధించించేందుకు
రూపు దిద్దుకున్న ఆశయ శిఖరం!
3
[03/06, 9:09 PM] Ramaka: 🌷కవితా గానం🌷

పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:3-6-2020
అంశం: సబర్మతీ ఆశ్రమం
ప్రక్రియ:వచనకవిత్వం
శీర్షిక: సత్యాగ్రహాశ్రమం
**************************

సబర్మతీనది ఒడ్డున వెలసిన
సత్యాగ్రహాశ్రమం
జైలుకు,శ్మశానానికి మధ్య ఉండి
సత్యాగ్రహి తెలుసుకున్న సత్యం
దేశ స్వయంసమృద్ధికి శిక్షణనిచ్చిన దేవాలయం
చార్లెస్ కొరియా రూపొందించిన
గాంధీజీ మ్యూజియం
వినోబా-మీరా కుటీరంతో
ప్రార్థనాభూమి పవిత్రతతో
కుటీరపరిశ్రమల కేంద్రంగా
గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యానికి
ప్రతిబింబమై నిలిచింది
వ్యవసాయం,పర్యావరణం
బోధించిన పాఠశాల
విద్యను,సంస్కారాన్ని
బోధించిన ఆశ్రయం
ఉద్యమాల రూపకల్పనలో
పాలుపంచుకున్న మందిరం
నూలువడికిన అమృతహస్తాల
సుందర ధామం
జాతీత స్మారకమై
ఔఅరతస్ఫూర్తి కిరీటమై
ప్రపంచానికే మార్గదర్శకమయింది.
4
[04/06, 8:03 PM] Korada: కవితాగానం
నేటిపోటీఅంశం:-
 *సబర్మతీ ఆశ్రమం *
కోరాడ నరసింహా రావు ;నాటి మేటి
      స్మృతి చిహ్నం
*****************
ప్రపంచమానవజాతికే మార్గదర్శి...పౌర హక్కుల స్ఫూర్తి ప్ర దాత...మనజాతిపిత
మహాత్మా గాంధీని అక్కున జేర్చు కుని...ఆధ్యాత్మికఊపిరులూదినపవిత్ర ప్రదేశం పావన సబర్మతీ పరీవాహక ప్రాంతం,స్వాతంత్ర్యోద్యమ ఋషి వాటిక  సబర్మతీ ఆశ్రమ పుణ్య స్థలి...!
ఆశ్రమముగరూపుదాల్చిన సాక్షాత్స్వర్గ ధా మమే అది !
శాంతి,సౌభ్రాత్త్రుత్వాలకు ఆవాసము !
ప్రేమ,సేవలపుట్టినిల్లు
గాంధీజీ ఉదాత్త ఆశ లు...ఆల్చనలు...ఆశయాల కొలువు !
ఈ సబర్మతి  నేటికి...
ప్రపంచపర్యాటకులకు ...గాంధీజీ జీవిత సహచర  అవశేషాల
వస్తుసముదాయముతో....పవిత్ర స్మ్రుతి చిహ్నమై...అలరారు చుండె....!
*****************
.........కోరాడ.
5
[04/06, 8:10 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** సబర్మతి ఆశ్రమం ***
                          ✍️డా.పాండాల.

సత్య ధర్మ బోధనలు
స్వాతంత్ర్యపు పోరాటం
నిర్దేశపు  దిక్సూచి
నిఖార్సయిన వాగ్ధాటి..!

అసమానతలేలని
అందరి హృదయాలలోన
సహనమెంచె త్యాగధనుడు
సంస్కరణ మహాత్ముడు...!

మోహన్ దాస్ కరంచందు జాతిపిత గాంధీజీ
సహచర ఆచారిణి కస్తూర్బా
చరణాల స్పృశించిన
సబర్మతి
తిరగాడిన పుణ్యస్మృతి స్వేచ్ఛాపోరాటానికి స్పూర్తినిచ్చె పునీతంగ...!

కీలక ఘట్టాలకు చెరగని
ముద్రలు వేసిన స్మారక
పుణ్యక్షేత్రం...!

ఉప్పుదండి యాత్రతో తెల్లదొరల ప్రభుతపైన
తిరుగుబాటు పతాకాన్ని ఎగురేసిన ప్రార్థన స్థలి..!

అఖండ భారతావనిలో సబర్మతి స్మృతి చిహ్నం
చెడువినకు చెడుకనకు
చెడు మాట్లాడకు  సూత్రపు
శాంతి అహింసల జ్ఞాన
బోధ పాఠశాల...!
స్వయం వృద్ధి రూపమిచ్చె
ఆశయాల ఆలయం..!
సబర్మతి సమున్నత  సంప్రదాయ
భావాలకు తరగని ఘనీ...!

✍️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
6
[04/06, 8:44 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..సబర్మతి ఆశ్రమం

గుజరాత్ నందలి సబర్మతి తీరాన గాంధీజీ ఆశయాలకు నెలవైన సత్యాగ్రహ ఆశ్రమం
సతీ సమేతంగా మహాత్ముడు నివాసమున్న పుణ్య స్థలం
దేశం స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా నిర్మించుకొని
వ్యవసాయ పశుపోషణ తో ఆకలి దప్పులు తీర్చి
అక్షరాస్యత సాధించేందుకు శిక్షణ నిచ్చే పాఠశాల నెలకొన్న ధర్మప్రదేశం
భారత స్వాత్యంత్ర సంగ్రామంలో కీలక భూమిక
ఉప్పు సత్యాగ్రహం,దండి యాత్రలకు ఊపిరి పోసి ధైర్యంగా నడిచేందుకు స్ఫూర్తి నిచ్చిన శాంతి ఆశ్రమం
అఖండ భారతావని స్మృతి చిహన్నమై
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన జాతీయ స్మారకం సబర్మతి ఆశ్రమం.
7
[04/06, 8:49 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:;*సబర్మతి* *ఆశ్రమం*

గాంధీజీ కలలుగన్న
గ్రామస్వరాజ్యానికి ప్రతీక
గాంధీజీ ఉద్యమాలకు స్ఫూర్తిగ                                    నిలిచిన ధరణీపునీత

అహ్మదాబాద్ కు నాలుగుమైళ్ళ దూరాన
సబర్మతినది ఒడ్డున వెలసిన శాంతిధామం
గాంధీజీ కస్తూరిభాతో కలిసి పుష్కరకాలం
నివాసముండి నడయాడిన స్వర్గధామo

ఉప్పుసత్యాగ్రహ ఉద్యమారంభ కేంద్రం
*దండి* యాత్రలో పాల్గొన్న దేశభక్తులనిలయం
జైలు స్మశానాల మధ్యనుండి చెప్పకనే
సమరయోధుల గమ్యాన్ని చాటే సువిశాలస్థలం

ఏ ప్రముఖవిదేశీయుడి ఆగమనమైనా           
తప్పక దర్శించే గాంధీఆశయాల ఆశ్రమం
గాంధీఒడికిన'చరఖా'గల సత్యాగ్రహఆశ్రమం
'బావూజీ'పరివారంచే నడుపబడిన బాపూఆశ్రమం

పశుపోషణ అక్షరాస్యత వ్యవ'సాయం'-
పై శిక్షణనిచ్చే పాఠశాల ప్రాంగణం
*స్వయంసమృద్ధి సాధన* ఆశ్రమ లక్ష్యం
గాంధీజీకి స్ఫూర్తినిచ్చిన పవిత్రప్రాంతం

కస్తూరిభా గాంధీజీలను స్మరణకు                                           తెచ్చే *జాతీయ స్మారక స్థలం*
కల్మషమెరుగక అహింసా సత్యాగ్రహాలను
ఆచరించేవారికి అదో భూతల స్వర్గం


:;వల్లాల *విజయలక్ష్మి*
*ఆలేరు*
8
[04/06, 9:04 PM] దీపక్ న్యాతి: కవితా గానం
పేరు తిరుపతి
అంశం : సబర్మతి ఆశ్రమం తేదీ : 04-06-2020

భారతానికి పశ్చిమాన
గుజరాత్ రాష్ట్రాన
సబర్మతీ నదీ తీరాన
అహ్మదాబాదు నగరాన
మహాత్మా గాంధీ చొరవన
ప్రజల సేవ చేయు కోరికన
పంతొమ్మిదొందల పదిహేనవ యేడున
లండన్ తిరిగొచ్చిన తరుణాన
గాంధీ ఆశ్రమం పేరున
హరిజన ఆశ్రమమని పిలిచిన
సత్యాగ్రహ ఆశ్రమమని ఎరిగిన
ఉప్పు తో ఊపు ఇచ్చిన
అదే సబర్మతి ఆశ్రమం
గాంధీజీ నిర్మించుకున్న ఆశయం
విద్యావంతుల చేయాలనే సదుద్దేశం
ఉప్పుకు పన్ను కట్టొద్దనచన సదుద్దేశం
ఉప్పు సత్యాగ్రహానికి మార్గదర్శకం
దండియాత్రకు మూలం
శాంతి పోరాట అంకుకురం
దృఢసంకల్ప స్వతంత్ర సమరం
భారతీయులు ఒకటైన సందర్భం
తెల్లదొరల కదిలించిన వైనం
సబర్మతి ఆశ్రమం గొప్పదనం

              డా.దీపక్ న్యాతితి
స్టేజి టీవీ సినీ రచయిత దర్శకుడు
          నంది అవార్డు గ్రహీత
9

కవితా గానం
వేంకట కృష్ణ ప్రగడ
విశాఖపట్నం
07.06.2020
అంశం : సబర్మతి ఆశ్రమం

వందేళ్ళ చరితున్న ఆశ్రమం
పన్నేండేళ్ళు గాంధీజీ నడయాడిన ఆశ్రమం

అందరికీ తెలిసిన గాంధీజీ ఆశ్రమం
ఆయనకు నచ్చిన పేరు హరిజన ఆశ్రమం
సబర్మతి ఒడ్డున ఉండి సబర్మతి ఆశ్రమం

ఉద్యమాల పురిటి గడ్డ ఈ ఆశ్రమం
దండి సత్యాగ్రహాన్ని కన్నది ఈ ఆశ్రమం
ఉప్పు సత్యాగ్రహానికి ఊపిరి ఈ ఆశ్రమం

ముప్పై ఆరు ఎకరాల సువిశాల స్థలం
ఒక వైపు చెరశాల మరోవైపు పితృవనం
సత్యాగ్రాహి ఎపుడైనా చేరుకొనే దిక్కుల తీరం

వినోబా మీరా ఇక్కడే నివాసం
ఇదే ఇక్కడే వినోబా మీరా కుటీరం
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య ప్రతి రూపం

గుప్పెట్లో ఉప్పును గాంధీజీ పట్టిన స్థలం
ముందుగా శ్రమ ఆశ్రమ వాసులదే ఆ దినం
ఆ గుర్తుగా ఓ స్మృతి చిహ్నంగా ఈ స్థలం
జాతీయ స్మారక స్థలంగా గుర్తింపు దాని ఫలం  ...

                            ... ✍ "కృష్ణ"  కలం

హామీ :

ఇది నా స్వీయ కవిత
అనువాదం అనుకరణ కాపీ కాదు
కవితా రాగం కోసం రాసిన నా కవిత
10

ఇది వీరా గుడిపల్లి కవిత
10/06/2020
సబర్మతీ ఆశ్రమం
******"*************
పుష్కర కాలం
పవిత్ర పాదాలు నడయాడిన నేల
ఉప్పు సత్యాగ్రహపు
ప్రణాళికలు ప్రాణం పోసుకున్న చోటు
దండి యాత్ర
మొదలైన ప్రాంతం
సబర్మతీ తీరంలో
 జాతి పిత సేదదీరిన మట్టి ..

జాతిపిత నివసించిన ప్రాంతం
హృదయ కుంజ్....
జాతి హృదయ మతనే కదా
గోచీ కట్టి
 అహింసా ఆయుధం ధరించి

భరతమాత దాస్య శృంఖలాలు తొలగించి బోసినవ్వులలదుకొన్న యోగి
చెప్పాలంటే...
ప్రజాస్వామ్య రాజర్షి
ఆశ్రమం
మీరాబెన్ మనసుపడిన నేల
కిసాన్ ఆశ్రమానికి
ఆలోచనలు మొలకెత్తిన చోటు
మహాత్ముడి మనసింకా తచ్చాడుతున్న నేల
సబర్మతీ ఆశ్రమం
....... వీరా గుడిపల్లి
11
లలితాకృష్ణ
సబర్మతీ ఆశ్రమం

సత్యం ధర్మం
సాకారమొందిన
రూపం
సంకల్పదీపాన్ని
 వెలిగించడానికి
సతీమణి తో
సాగించిన
*పోరుబాట*

పరాయిపాలన
 పలాయనం
చిత్తగించడానికి
పన్నెండేళ్లమజిలీగా
చరిత్రలో నిల్చిన
 *పవిత్రపుట*

గాంధీ
 హరిజన
సత్యాగ్రహమను
మువ్వన్నెలతో
మురిసి
మెరిసిన
స్వేచ్ఛాగీతపు
 *బావుటా*


కాలి నడకకు
శ్రీకారం చుట్టి
గుప్పెడు ఉప్పు
ఉప్పెనై ఎగసిన
దండయాత్రల
దండి యాత్రకు
*బాసట*

మహాత్ముని
 మనోరథబీజపు
అంకురమై
జాతి జనుల
బానిసత్వపు
బతుకు పాటకు
స్వస్తి పలకడానికి
వేసిన
*కొత్త బాట*

12
కవితాగానం
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : శబర్మతీ ఆశ్రమం
కవితా సంఖ్య: 28
తేదీ: 10/06/20

తరతరాల చరితను
మోస్తున్న చారిత్రాత్మక
ఉద్యమ ఊపిరుల స్థలం....!!

జన చైతన్యానికి
నిరక్షరాస్యతా నిర్మూలనకు
వ్యవసాయ మూలానికి
స్థానమయిన స్థలం....!!

గాంధీజీ జీవన అడుగుల
ముద్రలు వేసుకొని
ఉప్పు సత్యాగ్రహ జీరలను
పులుముకొని
గంభీరంగా నిలచిన చోటు....!!

తరతరాలకు ఆదర్శమై
బాపూ చరిత్రకు ఆధారమై
చల్లని సాయం సమీరం లా
శబర్మతీ ఆశ్రమం
ఏనాటికీ భరతదేశ అలంకారం....!!


                                 🌹వినీల🌹
13
*సబర్మతి ఆశ్రమం*

అహింసా యోధుడు తిరుగాడిన నే ల
ధర్మము ధరిత్రి పై మెరిసిన పుడమి
దేశం కోసం అహర్నిశలు శ్రమించిన
శాంతి సౌధం సుమధుర గంధము
ప్రశాంతత కు ఆవాసము
నిర్మల ,నిష్చల నిలయము
భువి పై వెలిసిన ధామం
మహనీయుడు నడయాడిన
నే ల
మహత్త ర ,మహిమాన్విత స్థానం
భారత మాత అలజడి లేకుండా
అద్వితీయం గా గడిపిన స్థావరం
మహి లో వెలసిన పుణ్యక్షేత్రం
మదిలో మధుర జ్ఞాపకాల
ప్రాంతం
అమూల్య ,ఆద్యంత ,ఆనంద
నందనము
విలువైన విలక్షణ ప్రేమ కుటీరం
భారత జాతి జేజే లు పలికే
పావన నిలయము.

*స్వర్ణ సమ త*
*నిజామాబాద్*
14

*కవితాగానం*
అంశం : సబర్మతీ ఆశ్రమమం
శీర్షిక: *పవిత్రధామం*

మహాత్ముడు నడయాడిన
నేల!
స్వదేశీ వస్త్రాల తయారీలో
స్వాతంత్ర్య సముపార్జన ప్రణాళికలతో
పునీతమైన స్థలం!

అనుబంధాల పొదరిల్లు
ఆప్యాయతల విరిజల్లు
కీలక నిర్ణయాలకు హరివిల్లు

ఎన్నో చైతన్య వీచికలకు మేటి కొమ్మయై
ఉద్యమాలకు ఊతమై
భరతమాత నుదుటన వీరతిలకమైన పవిత్రధామం

రచన
అయిత అనిత
8985348424

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

పౌర్ణమి 052022 జాతీయ పతాకం

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ********************** కవివరుల జాబితా 1.కోరాడ నరసింహారావు గారు 2.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 3.జోషి పద్మావతి గారు 4.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 5.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 6.శివ చరణ్ నాయుడు తరాల 7.గొర్రెపాటి శ్రీ ను గారు 8.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు 9.డా.కమలా దేవి గారు 10.అపరాజిత్ గారు 11.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 12.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు 13.కవిత వెంకటేశ్వర్లు గారు 14.డా.బల్లూరి ఉమాదేవి గారు 15.డా.వేమూరి సత్యవతి గారు 16.బొప్పెన వెంకటేశ్ గారు 17.తిప్పా వఝల నరసింహ మూర్తి గారు 18.మద్ది పుల్లారావు గారు 19.టేకుమళ్ళ విజయ లలిత గారు 20.పిన్నక నాగేశ్వరరావు గారు 21.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 22.దారల విజయ కుమారి గారు 23.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు 24.పొర్ల వేణు గోపాల్ రావు గారు 25.సింహాద్రి వాణి గారు 26.వురిమళ్ళ సునంద గారు 27.తరణికంటి సూర్య లక్ష్మి గారు 28.తోట సులోచన గారు 29. వేదాంతం సురేష్ బాబు గారు 30.మన్నె లలిత గారు 31.గజవెళ్ళి శ్రీనివాసా చారి గారు ************************ 1 వైశాఖమాసం పౌర్ణమి కవితల పోటీకి :-  అంశం :- భ...

పర్ణశాల 27052022

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ***************** కవితా గానం సీజన్ 3 నేటి అంశం 27.05.2022 *పర్ణశాల* రాత్రి ఎనిమిది నుండి  తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆసమయంలో ఎలాంటి ఇతర స్పందనలు  తెల్పకుండా సహకరించగలరు. కవి వరుల జాబితా 1.ఆపరాజిత్ గారు 2.కవిత వెంకటేశ్వర్లు గారు 3.కోరాడ నరసింహారావు గారు 4.ఏడెల్లి రాములు గారు 5.వురిమళ్ళ సునంద గారు 6.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 7. కందూరి సుజాతా రాణి గారు 8.వేమూరి సత్యవతి గారు 9.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 10.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 11.తంగిరాల నాగ లక్ష్మి గారు 12.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 13.వీరా గుడిపల్లి 14..శివునూరి లలితా కృష్ణ గారు ************** 1 పర్ణశాల కఠోర దీక్షా సంపన్నులు రామ లక్ష్మణ సీతా తపోదనులు సత్పురుషులతో సీతామాత సాంగత్యం కడు రమణీయం రామలక్ష్మణులు అరణ్యవాసంలో తగు జాగరూకతతో నిర్మించుకొనిరి పర్ణశాల దుష్ట దుర్మార్గ పన్నాగంలో భాగంగా బంగారు మాయలేడితో రామలక్ష్మణులను దారిమళ్లించి రావణాసురుడను రాక్షసుడు సీతమ్మపై కన్ను మిన్ను కానని కండకావారంతో కామం ఎంత బలీయమైనదో అంతటి విధ్వంసానికి దారితీస్తుంది ఆ ద...