Skip to main content

ఆశ్వయుజ మాసం పౌర్ణమి


నిర్వహణ 
శివునూరి లలితాకృష్ణ
 వీరా గుడిపల్లి
****************
1.డా.నాయకంటి నరసింహ శర్మ గారు
2.దేవికారాణి రత్నాకర్ గారు
3.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
4.తరణికంటి సూర్య లక్ష్మి గారు
5. తంగిరాల నాగలక్ష్మి గారు
6.సింహాద్రి వాణి గారు
7. బొప్పెన వెంకటేశ్ గారు
8.వాణి సరోజిని లక్కరాజు గారు
9. పిన్నక నాగేశ్వరరావు గారు
10.తిప్పావఝల నరసింహమూర్తి గారు
11.కవిత వెంకటేశ్వర్లు గారు
12.అఫ్సర వలీషా గారు
13.ఆపరాజిత రెడ్డి గారు
14.దారల విజయ కుమారి గారు
15.నాశబోయిన నరసింహా గారు
16.ఏడెల్లి రాములు గారు
17.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
18.హారిక గారు
19.డా.భమిడిమఱ్ఱి కమలాదేవి గారు
20. మద్ది పుల్లారావు గారుగారు
21.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
22.వనపర్తి గంగాధర్ గారు
23.తాతపూడి సోమశేఖర శర్మ, యానాం గారు
24.జోజోషిపద్మావతి గారు
25.శ్రీనివాస్ గంగా పురం గారు
26.బొడ్డు హారిక గారు
27.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
28.గొర్రెపాటి శ్రీనివాస్ గారు
29.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
30.సింగీతం సంతోష్ కుమార్ గారు
31.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
************
1
[19/10, 8:47 pm] Lalita Sister: కనక జ్యోతి ఆధ్వర్యంలో కవితాగానం.సీజన్ .
అంశం.సబర్మతీ ఆశ్రమం.
రచన.డా.నాయకంటి నరసింహ శర్మ.
వనపర్తి.
తేదీ.19-10-2021-

కోటి కోయిలల కుహుకుహూ రావం 
శాంతినికేతన గీతాలాపన సంకేతం
సత్యాగ్రహ మంత్రయజ్ఞ పరమార్థం
సబర్మతీ సలిల సమీర  సమాహ్లాదం
గాంధీ మానస శోభిత కుసుమిత తీరం
చరఖా (రాట్నపు)చలిత లలితం
స్వరాజ్య స్వేచ్ఛా విహంగ దృశ్యం
ఆంగ్లేయ పీడన నియంత్రిత శంఖారావం
జాతి సమైక్యత రణన్నినాదం
పోరుబందరు పోరును కదిలించీ
అహింసా అస్త్రాన్ని సంధించిన
సబర్మతీ సుందర సురుచిర తీరం
సమతా మమతల కాసారం
మంజుల మనోజ్ఞ శృతిలయ గీతం
సాగరతీర సంగీత సమీరం
సబర్మతీ సమరసతా సారం


ఈకవిత స్వీయరచన అనువాదం అనుకరణా అనుసరణా కాదని హామీ ఇస్తున్నాను.
2
[19/10, 8:48 pm] Lalita Sister: ఆశ్వయుజ మాసం పౌర్ణమి నగదు బహుమతుల పోటీ కోసం.
తేదీ 19. 10 .2021.
అంశం: సబర్మతీ ఆశ్రమం.

కవిత శీర్షిక: గాంధీజీ హృదయ నికుంజం.
+++++++++++++++++++++++++++++++++++

దక్షిణాఫ్రికా నుండి పునరాగమనం...
జీవన్ లాల్ దేశాయ్ కోచార బ్   బంగాళా...
దీపించిన హరిజనాశ్రమం--అది గాంధీజీ ఆశ్రమం
అదే సత్యాగ్రహ ఆశ్రమం...

వ్యవసాయం పశుపోషణ విద్యా బోధనా లక్ష్యం
ద్వి వత్సరాల లో 36 ఎకరాల విస్తరించిన సువిశాల ప్రాంగణం...

అదే సబర్మతీ ఆశ్రమం

సబర్మతీ నదీ గలగలా లహరీ నిశ్శబ్ద సంగీతనిలయం.
"వైష్ణవ జనతో" ప్రశాంత గంభీరగానోచ్ఛాటనా పరీవృతం..

స్వయంశ్రమ... నిరాడంబరత... సత్యం అహింస
స్వాతంత్య్ర కాంక్షాసమన్వితం...
ఆత్మబలం... స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితాంతరంగితం...

డెబ్బది ఎనమండుగురు అనుచరులతో 241 మైళ్ల దూరం దండియాత్ర--ఉప్పు సత్యాగ్రహం-అహింసయే మార్గం ...
ఆంగ్లేయుల గుండెలదర గొట్టిన మహోద్యమం...

దేశీయ సంస్కృతి ఆచారాలకు దైవారాధన విద్యాభ్యాసానికి వ్యవసాయ పశు పోషణాది స్వయం సమృద్ధి ఆపేక్ష కు

ఆత్మీయ ప్రతీకయే  ఈ ఆశ్రమం...

ఉద్యమాలకు ఊపిరి పోసుకున్న తొలి నిలయం

ప్రస్తుతం "హృదయకుంజ్"గాంధీజీ స్మారక కేంద్రం
ఛార్లెస్ కొరియా రూపిత మ్యూజియం. . ఇక్కడి ప్రత్యేక సౌందర్యం...

మహాత్ముని లేఖా సందేశ సాహితీ సమాహారం
వినోబా  మీరా కుటీరం... కుటీర పరిశ్రమ శిక్షణా కేంద్రం
ప్రార్ధన భూమి ఇక్కడి దర్శనీయ స్థలాల కలకూజితం...
3
[19/10, 8:48 pm] Lalita Sister: అంశం... సబర్మతి ఆశ్రమం...18102021
కవనజ్యోతి ఆశ్వయుజమాసం పౌర్ణమి కవితల నగదు పోటీ కవితాగానం సీౙన్ 2 
కవితలు పంపించవలసిన చివరి తేదీ 21/10/2021
*********"*****************************

సబర్మతి నది ప్రవహిస్తోంది ప్రశాంతంగా
నిర్మలమైన నీటి ప్రవాహంలో దొర్లుతున్న
గులక రాళ్ళు ఒక్కోక్క రేణువుల విడుస్తూ
నునుపు దేలి నిలిచాయి కళంకం లేని త్యాగానికి  ప్రతీకలై

తటిన తపోవనమొకటి తారసపెట్టగ తటాలున తపస్వుల బోలు తరులు విరులను విరివిగా విరయ  అహింస సత్యాగ్రహం శాంతి సౌరభాలు
సమీరమై యావత్ భారత హృదయం పై వీచగా

 ఆ హృదయాలపై పూచాయి ప్రేమ గులాబీలు
*పలికాయి శాంతి వచనాలు ఆ అధరాలు*
పట్టా కత్తుల నొదిలి,, పట్టాయి చేతుల నిండా అహింస సత్యాగ్రహ సాధనాలను

దిక్కులే దిమ్మతిరగగ నలుచెరగులూ పిక్కటిల్లగ
తెల్లవాడి చెవులు చిల్లులు పడేలా ఉరుముతు
భారత ప్రజానీకం ఆ అహింసా మూర్తితో తోడై వేస్తున్న ఒక్కో అడుగు  *దండి* వైపు........ అణు బాంబు వేస్తున్నట్టు తెల్ల వాడి గుండెల్లో...
ఆ సంకల్పం, ఆ బలం  , సబర్మతి ఆశ్రమం

ఆ సత్యాగ్రహుడు ఆశయసాధనకై పూనిన 
భారత యాత్ర,అదే అంతరాత్మ పరిష్వంగనంలో
క్విట్ ఇండియా ఉద్యమ నినాదాలతో
మురిసిన ఆసేతు హిమాచలం కురిసిన హిమ శీకరము

గులక రాయి ముందు తల దించుకుని మెడ వంచుకొని ఆత్మను చంపుకొని నిలిచింది
సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం.

సబర్మతి ఆశ్రమ సత్యాగ్రహి సత్యాగ్రహంతో సప్తసముద్రాల దాటి పారిపోయింది తెల్ల దొరతనం

స్వీయ రచన:::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
19102021
4
[19/10, 8:48 pm] Lalita Sister: కవితాగానం ( సీజన్‌2 ) 19/10/2021/ మంగళవారము
ఆశ్వయుజమాసం పౌర్ణమికవితలపోటీలు
అంశము: -- " సబర్‌మతి "

స్వాతంత్ర్య సమరాన సత్యాగ్రహశక్తితో
సబర్మతీ ఆశ్రమం చల్లగ సాగెను
ఆశ్రమనీతినియమాలతో నీరుపోసిపెంచిన
ఆశ్రమవాసుల శ్రమఫలితములన్ని
చేతిపనులలోన చేవచూపె
నూలువడికిరంత నూలుబట్టలునేయ
జీవనోపాదికి జీవనముచేకూరె

ఖాదియుద్యమాలు దండియుద్యమాలు
ఘనముగసాగె తెల్లవారిచేవచచ్చె
గాంధి మహాత్ముని ఆశయాలశక్తి నలుదిశల వ్యాపించె
అన్నిరాష్ట్రాలసేవాశ్రమాలువెలసె
గాంధిఆశ్రమం, హరిజనాశ్రమం, సత్యాగ్రహాశ్రమ మనంగపేరుగాంచిన ఆశ్రమం
' సబర్‌మతి ' ఆశ్రమం
గుజరాత్‌ నందు సబర్‌ మతీ నదీ తీరానగలది సబర్మతి ఆశ్రమం
మహాత్ముని, బారిష్టర్‌మిత్రుడు 
జీవన్‌లాల్‌దేశాయి 1930లో గాంధీజీ ఆశ్రమాన్ని మహరాష్ట్ర మందు వార్ధాలో నెలకొల్పిరి తదుపరి అన్నిరాష్ట్రాలలో అన్ని గ్రామాలలోనెలకొల్పబడ్డాయి

సబర్‌మతి ఆశ్రమం 1915 తరువాత 1930 వరకు గాంధీగారు అక్కడే తననివాస మేర్పరచుకొని దేశ సేవకై పాటు పడ్డారు
సబర్‌మతి ఆశ్రమ సందర్శమున ప్రశాంత వాతావరణం హృదయానందకరము ఆశ్రమాన జరుగు నిత్యం గీతాపారాయణ వీనుల విందు చేయు
సమస్తలోకాసుఖినోభవ !
             తరణికంటి సూర్యలక్ష్మి.
                        -----------
5
[19/10, 9:29 pm] Lalita Sister: శీర్షిక: పున్నమి వెన్నెల
చంద్రోదయం 
అంటేనే  అదొక ఆనందానుభూతి
అందునా  పూర్ణిమ నాటి చంద్ర బింబాన్ని చూస్తుంటే  ఏదో తెలియని తన్మయత్వం
మరి శరత్కాల చందమామ వెదజల్లే కాంతి కిరణాల ఆహ్లాదం వర్ణింప శక్యమే ?ఏ కవికైనా
సుస్వర మయమై పులకించె శుక్ల వర్ణ రూపిణి శుకప్రియ
జగతి పరవశించె స్వర జతులు
మేళవించిన మధుర నాదములో
శర త్కాల రాత్రి భావరసాను భవము
పొంద డెందమానందానుభూతి నొందె
వేణు గానము వీనుల విందు చేసె 
చల్లని వెన్నెలలో  సరాగాల సరసాలు సందడించె

 ఆట లాడుచు  పాట పాడుచు చందమామ దోబూచులాడే మేఘాల  సమూహం తో
 చంద్ర వీచికారవళుల సరిగమల సానంద నీహారముల  విహారము  ఆహ్లాదమయ్యె

భక్తి భావ భరితమై  ప్రసన్న సంపూర్ణ చంద్ర  కాంతా మణిని ఉత్ప లముల వేడుకొనగ 
చంపకములు వెల్లివిరియ జాజి పూల
మాలలింపయి యుప్పొంగగ
మానసమ్ము

 పున్నమి వెలుగు విరియగా
 పుడమి యందు
పులకింత పవనాలు వీచె హాయిగా
 వెన్నెలలు  కురిసె  వన్నెల చిన్నెల ఝరులతో
సముద్ర  తీరాన యిసుక తిన్నెలమీద ఉదయించె ఇంద్ర రాగమణుల కిరణాలు 
నామదిని మరులు కొల్పె మధుర భావ వీచికలు

శరదృతువులోన పూర్ణిమ చంద్ర కాంతి
 నీల మణి శోభలతో అలరారంగా
విను  వీధి లో మెరిసె మెరుపులు మేఘమాలలై మురిపించె
రాస క్రీడ లో నిమగ్నమౌ రాధా కృష్ణ గోపికల బృందావన రమ్య లహరి
కనుల ముందు మెదలాడె
డా. తంగిరాల నాగ లక్ష్మి
ఇది నా స్వీయ కవితయే అని హామీ
6
[21/10, 7:27 am] Lalita Sister: కవితా గానం సీజన్--2
ప్లవ నామ సంవత్సరం
ఆశ్వయుజ మాసం
పౌర్ణమి నగదు బహుమతుల పోటీకై
అంశం:--సబర్మతీ ఆశ్రమం
శీర్షిక:-- సబర్మతీ ఆశ్రమం
ప్రక్రియ:--వచన కవిత్వం
రచన:--సింహాద్రి వాణి
ఊరు:--విజయవాడ 
తేదీ:--21--10--2021
వారం:--గురువారం

బానిస సంకెళ్ళు తెంచి భరతమాతకు స్వేచ్ఛ నిచ్చిన
జాతిపిత పాద ముద్రలతో పరవశించి, పులకించిన పవిత్రమైన ఆశ్రమం సబర్మతి

36 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నెలకొల్పబడి
సతీసమేతంగా బహుకాలం మహాత్ముడు నివాసమున్న గాంధీ ఆశ్రమం

శాసనోల్లంఘనంలో భాగమై అహింసా విధానంలో సాగిన ఉప్పు సత్యాగ్రహం, దండియాత్ర   ప్రారంభమైన సత్యాగ్రహాశ్రమం,హరిజనాశ్రమం అదే సబర్మతీ ఆశ్రమం

స్వాతంత్ర్యోద్యమ యజ్ఞంలో‌ ఆ ఉప్పు పలుకే నిప్పు కణికై జ్వలించి
దేశమంతా విస్తరించి వణికించింది ఆంగ్లేయులను
అసందర్భంగా పేర్కొంది టైమ్స్ పత్రిక " మేటి పురుషుడు గాంధీజీ" అని

నెహ్రూజీ చేతులు మీదుగా మారెనా యాశ్రమం " గాంధీజీ స్మారక కేంద్రం" గా
సందర్శకుల కోసం ప్రతి నిత్యం‌ తెరువబడుతుందీ సబర్మతీ‌ఆశ్రమం.

హామీ:---ఇది నా స్వీయ రచన
సింహాద్రి వాణి.
7
[21/10, 8:59 am] Lalita Sister: అంశం: సబర్మతీ ఆశ్రమం

కవితా శీర్షిక: స్వాతంత్ర్య సంగమ క్షేత్రం


గాంధీ ఆశ్రమం సబర్మతీ ఆశ్రమం సత్యాగ్రహ ఆశ్రమం హరిజన ఆశ్రమం
పేరేదైనా.. ప్రపంచానికంతా సుపరిచితమే..

అహింసా మార్గాన బహుదూరపు బాటసారిని బాహువుల్లో అలుముకున్న శాంతి స్థావరం
దండి యాత్ర కు దారి చూపిన తీరం
శాంతిదూత నెలవైన కోవెల
ఉప్పు సత్యాగ్రహానికి ఊపిరిపోసిన ఆలయం
మహాత్ముడి మహాశయానికి ప్రాణం పోసిన పుణ్యధామం
అస్తిత్వ పోరాటానికి ఆద్యం పోసిన అమర క్షేత్రం
స్వరాజ్య రాట్నంలో ఆత్మగౌరవ నూలు ఒడికిన స్వదేశీ వస్త్రాల కర్మాగారం
కుటీర పరిశ్రమ మహిళా విద్య ఉద్యమాల ఊట సబర్మతీ వేదిక

చరిత్రపుటల ఆనవాళ్లకు అది సజీవ సాక్ష్యం
సబర్మతీ నదీ తీరాన.. 
ఎటు చూసినా.. సంయమనం పులుముకున్న అలలు శాంతికపోతంలా ఎగురుతూ దర్శనమిస్తాయి
ఆశ్రమంలో ఏ గోడను తడిమినా తన్మయత్వపు చరిత్ర కదులుతూ కదిలిస్తుంది
ఏ చెట్టును తాకినా చల్లదనపు శాంతిమత్వం రాలుతూనే ఉంటుంది
విజ్ఞాన వీచికల తాకిడి వెలుతురు పంచుతూనే ఉంటుంది
అహింస సత్యం అడుగుల చప్పుళ్లు ఇచట ఇంకా స్పురిస్తూనే ఉంటాయి


పేరు : బొప్పెన వెంకటేష్ 
జిల్లా: సిద్దిపేట్ 
చరవాణి : 9866584062


హామీ పత్రం: నేను రాసిన నా కవిత దేనికి అనువాదము అనుకరణ కాదు, నా సొంతం అని హామీ ఇస్తున్నాను.
8
[21/10, 4:30 pm] Lalita Sister: కవన జ్యోతి.
ఆశ్వయుజపౌర్ణమి కవితలపోటి.
అంశం. సబర్మతి ఆశ్రమం
శీర్షిక    సత్యాగ్రహ ఆశ్రమం
21-10-21 .
రచన. 
వాణి సరోజిని లక్కరాజు.
విజయవాడ.
గుజరాత్ రాష్ట్ర శిరో భూషనం
అహ్మదాబాద్ నగరి అదృష్ట నిలయం
సబర్మతీ తీర ప్రకృతి శోభాసదనం
సబర్మతీ ఆశ్రమం అదే సత్యాగ్రహ ఆశ్రమం.
స్వాతంత్ర్య వజ్ర సంకల్ప దీక్ష కు సారధ్య నిలయం
ఎందరో పోరాట వీరుల సమావేశ మందిరం
దేశ సమైక్యతా సాధనకు పునాది గడ్డ
బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేక పోరాటానికి అడ్డ.
స్వాతంత్ర్య భావనలు పురుడోసుకున్న పుణ్య భూమి
బాపూజీ స్థితప్రజ్ఞత కు చిరునామా సబర్మతి
కార్యాచరణ కు తగిన ప్రణాళిక ల కాటపట్టు.
బానిసత్వ నిర్మూలనకు పెద్దల పిడికిలి పట్టు
కు చిహ్నమయిన ఆవాసం
అస్త్ర శస్త్రాలు పట్టక ప్రజల రక్తం చిందకుండా
శాంతి సౌహార్దలతో చేయాలి స్వాతంత్ర్య
సమరమనిసంకల్పించెను గాంధీ సబర్మతి ఆశ్రమం లొ.
 కులమత భేదాలు విడిచి కదలి రండని ప్రజలకు  ప్రబోధించిన పవిత్ర ప్రదేశం
పూజ్య బాపూజీ వాడిన వస్తు సముదాయాన్ని
నేటికీ భద్రపరిచిన పుణ్య భూమి సబర్మతి.
నాటి నుండి నేటి వరకు ఎందరో మహానుభావులు ఆశ్రమానికి వచ్చి
అంజలించి మహాత్మునకు ఆనందం పొందుతారు.

పైవచనకవిత నాస్వీయరచన
ప్రత్యేకించి కవితా జ్యోతి పౌర్ణమి పోటీకి
వ్రాయబడినది
వాణి సరోజిని లక్కరాజు
విజయవాడ
9
[21/10, 4:30 pm] Lalita Sister: కవితా గానం (సీజన్ 2).      21--10--2021.
పిన్నక నాగేశ్వరరావు. 
శీర్షిక :-- సబర్మతీ ఆశ్రమం.

1. తే.గీ.
హరిజనాశ్రమమున్ గాంధి యాశ్రమంబు
మరియు సత్యాగ్రహాశ్రమ మనెడు నామ
ములు సబర్మతీ యాశ్రమమునకు గలవి
దియె సబర్మతి యనెడు నదీ తటమ్ము
నందు గుజరాతు రాష్ట్రమ్ము నందు కలదు. 

2. తే.గీ.
భరతదేశ స్వాతంత్ర్య సమరము నందు
ప్రముఖముగ నిల్చె గాంధి యాశ్రమము; దండి
యాత్ర లుప్పు సత్యాగ్రహాలాది ఘట్ట
ములవి యిచ్చోట నుండియే మొదలుబెట్ట
ప్రభుత స్మారక స్థలముగా ప్రకటనిడెను.

3. తే.గీ.
మున్ను సత్యాగ్రహా శ్రమముగను గాంధి
హితుని స్థలమందు నిర్మించె; హెచ్చు స్థలము
వలసి రెండు సంవత్సరములకు ముప్ప
దారెకరముల స్థలమున కాశ్రమంబు
తరలెను సబర్మతీ నది తటమునకును.

4. తే.గీ.
అక్షరాస్యత, వ్యవసాయ శిక్షణలకు
పాఠశాలల నాశ్రమ వాసులకును
వెలయ జేసెను దేశాభివృద్ధియె తమ
లక్ష్య సాధనముగ నెంచిరపుడు గాంధి.

5. తే.గీ.
ఉప్పుపై పన్ను వేయగ నుద్యమంబు
నిచట నుండియే సాగ నహింస పగిది
దండి యాత్రను నుప్పు సత్యాగ్రహముగ
ననుచరులతో మొదలిడ మహాత్ము; డదియె
విస్తరిల్ల దేశమ్మునన్ బ్రిటిషు వారు
భారతీయుల ధాటికి ‌వణకినారు.

6. తే.గీ.
గాంధి వాడిన వస్తువుల్, గ్రంథములను
జీవితమును తెలుపు ఛాయ చిత్రములను
చేర్చి మ్యూజియమేర్పాటు చేయ నేడు
బాపు స్మృతి చిహ్నమయ్యె సబర్మతియును
నమిత సందర్శకులతోడ నలరుచుండె.
**************************************
10
[21/10, 4:31 pm] Lalita Sister: కవన జ్యోతి
ఆశ్వయుజ మాస పౌర్ణమి నగదు పురస్కారాలు పోటీకి
అంశం: సబర్మతి ఆశ్రమం
శీర్షిక:గాంధీ ఆశ్రమం

*ఏ ఆశ్రమం పేరు చెపితే మేను పులకిస్తుందో*
*ఏ ఆశ్రమం పేరు చెపితే అహింసాయుత పోరాటంకళ్శముందు మెదిలాడుతుందో*
*ఏది బ్రిటిష్ వారిపై పోరాటానికి వ్యూహాత్మక కేంద్రంగా భాసిల్లిందో*
*ఏది గాంధీగారి పాదస్పర్శతో పావన మైందో*
*ఏది జాతీయ స్మారక చిహ్నం గాగుర్తించబడిందో*
*ఎచటనుండి భారత జాతిని ఏక తాటిపై నిల్పిన దండియాత్ర ప్రారంభమైందో*
*ఎచట భగవద్గీత పఠన ఘోషలు నిత్యం ప్రతిధ్వనించాయో*
*ఏది  సత్యాగ్రహయుతపోరాటాలకు పురుడు పోసిందో*
*అదే పవిత్ర సబర్మతి తీరాన వెలసిన గాంధీ ఆశ్రమం-సబర్మతీ ఆశ్రమం*
*దధీచి మహర్షి నడయాడిన పవిత్ర స్థలం*
*సర్వసంగ పరిత్యాగులకే ఇచట ఆశ్రయం*
*అందుకే ప్రశాంతత పరిఢవిల్లిందిచట నిత్యం*
*ఇచట మొదటిగా నిర్మించిన గుడిసె ఆదినివాస్ దర్శనీయం*
*మధురానుభూతులు కలిగిస్తుంది బాపూ కుటీరం*
*సందర్శనీయంవారి పరిపాలనా కేంద్రం*
*నా జీవితమే నా సందేశం అన్నారు గాంధీ*
*గాంధీ జీవన విధానప్రతీక గాంధీ ఆశ్రమం*
*తప్పక సందర్శిద్దాం సబర్మతీ ఆశ్రమం*
*మన జన్మలను చేసికొందాం సార్ధకం*
[21/10, 4:31 pm] Lalita Sister: తిప్పావఝల నరసింహమూర్తి
బుచ్చి రెడ్డి పాలెం
11
[21/10, 6:48 pm] Lalita Sister: కవితా సీజన్ - 2
అంశం::సబర్మతి ఆశ్రమం
తేదీ::21.10.21..గురువారం
శీర్షిక:: గాంధీజీ ఆశ్రమం

సబర్మతి ఆశ్రమం
సర్వజనాశ్రయం
సర్వ కార్యచరణ స్థానం
అదే విజయాల ప్రస్థానం

దక్షిణాఫ్రికాలో జరిగిన
పరాభవం - అవమానం
చేసిన నల్ల జాతి వైనం
గాంధీ తిరిగివచ్చే భారతదేశం

అహమ్మాదాబాదులో
సబర్మతి నది దగ్గర నిర్మితమైన
భవనం
ఎన్నో నివాస గృహాలకు ఆలవాలం
ఈ ఆశ్రమానికి గాంధీ ఆశ్రమమని
హరిజన ఆశ్రమమని
సత్యాగ్రహ ఆశ్రమమని పేర్లు
ఇవి గాంధీ ఇష్టపడి పెట్టుకున్న పేర్లు
ఇక్కడి నుంచే వ్యవసాయము
పశువుల వైద్యసహాయము
చేసేవాడు గాంధీ
స్వాతంత్య్ర పోరాట ఆలోచనలు
అందరితో సమాలోచనలు
జరపడం
వాటిని ఆచరణలో పెట్టడం
దండి మార్చును ఇక్కడి నుండే
నడిపినాడు
వేల జనాలు నడిచారు తోడు
ఒక్క తాటిపై నడిపినాడు
ఒక్క మాటపై నిలిపినాడు
భరతమాత సంకెళ్లు తెంచినాడు
స్వేచ్ఛ స్వాతంత్ర్యములు
భారత ప్రజలకు అందించాడు
ఆశ్రమములోనే ఒక దుష్టుని
తూటాలకు బలయినాడు
హే రామ్ అంటూ నేలకొరిగినాడు!!
                  కవిత వెంకటేశ్వర్లు
                  కర్నూలు
                  8309920625
పైకవిత నా స్వీయ రచన అని హామీ
12
[21/10, 8:01 pm] Lalita Sister: కవితా గానం (సీజన్ 2)
పౌర్ణమి నగదు బహుమతి పోటీ 
అంశం....సబర్మతీ ఆశ్రమం 
శీర్షిక....పుణ్య భూమి 

దేశ స్వయం సంవృధ్ధి కోసం
కంకణం కట్టుకుని రూపుదిద్దుకున్న 
సుందర స్వప్న నీడది....

పాడి పంటలకు నెలవై
పైర గాలితో జత కట్టి
పసిడి పండే పుణ్యభూమది....

అక్షరాలను అలవోకగా దిద్దించి
అందరిని అక్షరాస్యులుగా
తీర్చి దిద్దాలనే  చల్లని అమ్మలాంటి  కుటీరమది....

ఆంగ్లేయులను ఉక్కు పాదాలతో 
ఉప్పు పై పన్ను తుక్కు తుక్కు చేసేందుకు
దండిగా జనంతో దండి సత్యాగ్రహానికి 
నాంది పలికిన కేంద్ర బిందువది.... 

సత్యాగ్రాహులు , సహన
శీలులకు ఆశ్రయమిచ్చిన
సబర్మతీ నదీ తీరాన
నిర్మితమైన హరివిల్లు శోభిత
జాతీయ స్మారక స్థలమిది....!!

హామీ....నమస్తే ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను 🙏

మొహమ్మద్ .అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ. గో. జి)
13
[21/10, 9:38 pm] Lalita Sister: అంశం: సబర్మతీఆశ్రమం 
శీర్షిక: మహాత్ముని పోరాట ఆశ్రమం!

మహాత్మా నీ జీవన విధానమే ఒక సందేశం!
పోరాటం ఎంత క్లిష్టమైన అతి సులువైన మార్గదర్శనం చేస్తావు 
దక్షిణాఫ్రికా నుండి వచ్చాక భరతావని బానిస సంకెళ్ళు తెంచడానికి 
గుజరాత్ లోని సబర్మతీ నది చెంత ఆశ్రమం నెలకొల్పావు 
ఆ సబర్మతీ ఆశ్రమంలోనే ఎందరెందరో దేశభక్తులు 
అహింసాయుత మార్గంలో స్వాతంత్ర్యపోరాటానికి శిక్షణ పొందారు!
సబర్మతీ ఆశ్రమంలో రోజు ఉదయం సాయంత్రం ప్రార్ధనలు జరిగేవి 
రోజు భగవద్గీత పఠనంతో దేశానికికావలసిన  చైతన్యోన్ముఖులు తయారయ్యే వాళ్ళు!
దరిదాపు పన్నెండు సంవత్సరాలు ఆశ్రమంలో గడుపుతూనే 
దేశపర్యటనలు,సత్యాగ్రహాలు చేస్తూ ప్రజలను కార్యోన్ముఖులను చేసేవాడు 
తెల్లవాడు నిన్ను జైలులో పెట్టిన దాష్టికుడు!
ఈ ఆశ్రమ స్థానంలో ఒకప్పుడు దదీచి మహర్షి తన వెన్నెముకను సృష్టికి అనర్థం జరగకుండా రక్షణగాఅర్పించాడట!
ఓ మహాత్ముడ సత్పురుషుడా నీ మార్గంలోఎందరెందరో నడిచారు 
వినోబాబావే నీ ఆశ్రమంలో శిక్షణ పొందాడు 
అత్యద్బుత జీవన విలువలు నీకు కొట్టిన పిండి!
ఉప్పుసత్యాగ్రహం ఈ ఆశ్రమంలోనే మొదలిడి 
తోటి సహచరులతో రెండువందల నలబై మైళ్ళు నడిచి 
దండి దగ్గర తెల్లవాడి వెన్నులో వణుకు పుట్టేలా ఉప్పు తయారు చేశావు!
బ్రిటిష్ దమనకాండకు నిదర్శనంగా దెశంలో అరవై వేలమంది అరెస్ట్ అయ్యారు 
సబర్మతీ ఆశ్రమం మూసేశారు!
సహనంతో స్వాతంత్ర్యం వచ్చాకే ఆశ్రమంలోఅడుగుపెడతానని ప్రతినబూనావు 
స్వాతంత్ర్యం వచ్చాక ఆశ్రమంలోనే ఎన్నెన్నో భారత రాజ్య కార్యకలాపాలు సాగించావు!
ఓ మతిబ్రమించిన కిరాతకుడు నీ పాదాలపై మోకరిల్లి 
తుపాకీతో కాల్చి నిన్ను హత్యచేసిన తీరు 
దేశంతో సహా యావత్ ప్రపంచం శోకంతో గగ్గోలు పెట్టింది!
అహింసకు,త్యాగానికి,దేశభక్తికీ మరోరూపం నీవు మహాత్మా గాంధీ!!

అపరాజిత్ 
(ఎం అపరాజిత్ రెడ్డి)
సూర్యాపేట
9848532031

హామీ పత్రం: ఇది నా స్వీయరచన అని హామీ.
14
[22/10, 6:23 am] Lalita Sister: కవనజ్యోతి పౌర్ణమి కవితల పోటీ..కవనజ్యోతి ఆధ్వర్యంలో కవితా గానం సీసన్ 2 నిర్వహిస్తున్న..
ఆశ్వయుజ మాసం పౌర్ణమి కవితల పోటీ కోసం
******************
అంశం : సబర్మతి ఆశ్రమం
శీర్షిక : పోరాట బీజం
********************
సబర్మతి నది మేల్కొంది..
ఒక సత్యశోధకుని ఆరాటాన్ని ఆలకించింది
అమ్మగా..
సత్యాగ్రహ ఆశ్రమాన్ని ఆశీర్వాదించింది

ఆత్మవిశ్వాసం తో అడుగులేసిన
ఆ లోగిలిలో..
ఎన్ని ఉపవాస దీక్షలో..మరెన్ని ప్రణాళికలో

స్వేచ్ఛకు బానిసత్వానికి మధ్య ఓ సంధికాలంలో
పసిపాపలాంటి దేశం 
నడక నేర్చుకుంది ఆ ప్రాంగణంలోనే

ఆ వసారాలోనే ఆత్మాభిమానపు లేపనాలద్దుకున్న
లేలేత స్వేచ్చా రెక్కల పిట్ట ఎగిరేందుకు వేగిరపడింది

నిత్య శిశిరమై విలవిల లాడిన హృదయ భారతి..
ఆమని ఆగమనం చూసిందక్కడే..

ఈశ్వర్ అల్లా..సమ భావనలకోసం 
ఆప్రార్థనా భూమిలో 
వేన వేల సార్లు మార్మోగిన ఆ మహాత్ముని మొర  

ప్రతి అంగుళం..ఉత్తేజాలనే పెంచి పోషించింది
ప్రతి పూట..
బంతుల వారిగా..ఉద్బోధాలనే..వడ్డించింది

కొల్లాయి కట్టి చేతి కర్ర పట్టి
మురికివాడలు శుభ్రం చేసిన ఒక గుండె
హృదయ కుంజ్ కుటీరంలో నిదురించేదక్కడ

తాకితే 
భారత్ చోడో..కరో యా మరో.. అంటూ ప్రకంపించే ఆ గోడలు

రవి అస్తమించని సామ్రాజ్యం
ఓ అర్ధరాత్రి నేల కూలడమూ చూసిందా ఆశ్రమమం 

ఆఅహింసా గుండె
రెపరెపలాడుతూ.. నేలకొరిగినపుడు
గిలగిల కొట్టుకునే ఉంటుందా సబర్మతీ పిట్ట

దారల విజయ కుమారి

నమస్తే మేడం/సర్
ఈ కవిత నా స్వంత రచన.అనువాదం కాదు ఎక్కడా ప్రచురితం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
దారల విజయ కుమారి
15
[22/10, 6:23 am] Lalita Sister: కవన జ్యోతి ఆధ్వర్యంలో కవితా గానం సీజన్ 2 నిర్వహిస్తున్న  *ప్లవనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితా పోటీ కోసం*:
అంశం: సబర్మతి ఆశ్రమం
ప్రక్రియ: వచన కవిత
కవి పేరు: నాశబోయిన నరసింహ (నాన)
ఊరు:చిట్యాల, నల్గొండ జిల్లా
చర వాణి:9542236864
⚜️⚜️⚜️⚜️⚜️💘⚜️⚜️⚜️⚜️⚜️
*అహింసాయుత బృందావనం*
""""""""""""""""""""''''""""""""""""""""""""""'
అది ఓ జాతీయ స్మారక నిలయం 
గాంధీ జీవిత మిషన్ చిరకాల చిహ్నం 
వ్యవసాయం స్వయం సమృద్ధి సాధనకై  
అక్షరాస్యత శిక్షణాశిబిరం స్థాపించిన వైనం! 

ధర్మబద్ధమైన స్వేచ్ఛా యుద్ధం కోసం 
తన దేహం అణువణువు ధారపోసింది 
సహకార సమన్వయ కేంద్రమై నిలిచింది 
అహింసా వనంలో విరబూసిన శాంతి సుమం!

దేశభక్తి పరిమళాలు దశ దిశలా వెదజల్లిన దివ్య క్షేత్రం 
మరెందరో నిరాశ్రయుల దరిచేర్చిన ఆదరణాలయం 
గాంధీజీ కలల గ్రామ స్వరాజ్య ప్రతిరూపం 
శతవసంతాల చరిత్ర కాలగర్భం కల్సినా చెదరని జ్ఞాపకం!

జైలు గదుల స్మశాన వాటికల మార్గమధ్యన 
అనుబంధాల గోడలతో నిర్మితమైన ఆశ్రమం
అనేకానేక ఉద్యమ గొంతుకల నేకం చేసి 
అక్కున చేర్చుకున్న అహింసాయుత బృందావనం! 

గుజరాత్ సబర్మతీ తీరాన శ్రమైక జీవన సౌందర్యం 
ఉప్పు సత్యాగ్రహానికి ఊపిరి పోసిన చైతన్య కెరటం 
వేలాది అనుచరులతో దండి యాత్ర ఆరంభ శిలాఫలకం 
అచంచల దేశభక్తి భావ స్ఫూర్తికి సజీవ సాక్ష్యం! 

నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన ఉద్యమ కార్యశాల 
నేడు గాంధీ జీవిత సత్యాలు ఛాయా చిత్రాలతో 
అనునిత్యం సందర్శకులతో కళకళలాడుతోంది
గాంధీజీ ఉత్తరాలు సందేశాల మ్యూజియమై వర్ధిల్లుతోంది! 

🌀🌀🌀🌀🌀♦️🌀🌀🌀🌀🌀
హామీ పత్రం: ఈ కవిత నా స్వీయ రచన. దేనికి అనువాదం,అనుసరణ కాదనీ హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు.
✍️నాన
16.
కవనజ్యోతి ఆధ్వర్యంలో కవితాగానం సీౙన్ 2 నిర్వహిస్తున్న 
 *ఆశ్వయుజ మాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీకి 

కవితా గానం
అంశం: సబర్మతీ ఆశ్రమం
 21/10/2021

నూలు పూలు వడికే రాట్నం
శాంతి సుమాల అహింసా సిద్ధాంతం
స్వాతంత్ర్య సమరానికి ఆయుధాలు

మిత శాఖాహార నియమం
స్వచ్ఛతా పరిశుభ్రతా ఆభరణం
హేరామ్ అంటూ పరమత సహనంతో
పరిఢవిల్లిన సబర్మతి ఆశ్రమం

మహాత్ముడు నడయాడిన కార్యక్షేత్రం
నేడది పవిత్ర ఆశయాల పూలపల్లవం

శాంతిదూతఉపదేశాలపుణ్యభూమిలో
సత్యం అహింసా దేవత సాక్షాత్కారం

వ్యవసాయం పశుపోషణ కుటీర పరిశ్రమలకు ప్రాణదీపం
అక్షరాస్యతా శిక్షణా కేంద్రానికి నిలయం

గాంధీజీ ఆత్మీయతా దర్శనం
ఖాదీ వస్త్రాల ప్రత్యేకతా ఆలయం
ప్రపంచానికి పరిచయం అక్కరలేని
పర్యాటక ప్రదేశం
నా దేశ స్వాతంత్య్రానికి దిశా నిర్దేశనం చేసిన పవిత్ర మూర్తి ఆశ్రమం

అహింస మార్గ పోరాటాలు
బతికినంత కాలం చిరస్మరణీయం
మన పూజ్య బాపూజీ సబర్మతి ఆశ్రమం

బాపూ నీ బాటలో నడిచే వరమివ్వూ
సత్య ధర్మాలకు ఈ దేశాన బలమివ్వూ

ఏడెల్లి రాములు ✍️
ది*21*10*2021(22*16)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
17.
[22/10, 4:50 pm] Lalita Sister: కవితాగానం సీజన్ 2
ఆశ్వయుజ మాస పౌర్ణమి కవితల పోటీకి 
...

గజవెళ్ళి శ్రీనివాసాచారి 
అంశం: సబర్మతీ ఆశ్రమం 
శీర్షిక: కర్మభూమి 
...
సబర్మతీ ఆశ్రమం 
దేశ స్వాతంత్ర్య సమరంలో 
కీలక పాత్ర పోషించిన ఆశ్రమం 

ఈ ఆశ్రమం 
చెరసాల శ్మశానాలకు చేరువై 
సత్యాగ్రహికి 
జైలు జీవితం తప్పదని, 
మనిషి ఏదో ఒక రోజు 
శ్మశానం చేరుకోవలసినదేనని 
జీవిత సత్యాలు బోధించిన ఆశ్రమం 

జాతిపిత జీవిత ఆశయాలు 
అక్షరాస్యత, వ్యవసాయం 
ఖాదీ, పశుపోషణలకు 
కర్మభూమి ఈ ఆశ్రమం 

దండియాత్ర
శాసనోల్లంఘన నిర్ణయాలు
ఈ ఆశ్రమంలోనే పురుడుపోసుకున్నవే

ఆ ఆశ్రమం నేడు 
ఆనాటి బాపూ జ్ఞాపకాల పరిమళాలతో 
సందర్శకులతో 
కిటకిటలాడుతున్న 
పవిత్ర ఆశ్రమం
...
హామీ పత్రం 

ఈ కవిత నా స్వంత రచన
18
[22/10, 6:18 pm] Lalita Sister: పేరు : హారిక
అంశం : సబర్మతి ఆశ్రమం

సత్యాన్నే శ్వాసగా మలచుకున్న
సత్యాగ్రహి సంకల్పానికి
 నాంది పలికిన ఆశ్రమం

సమరయోధులకు వేదికగా దండియాత్రకు
సమరశంఖం ఊదిన ఆశ్రమం

వలసవాదులపోటుకు
 వ్యతిరేకంగా
మహాత్ముని మాటపై
 లక్ష్యం చేధించడానికి
 ఆశ్రయమైన ఆశ్రమం

బానిస బతుకులకు
 బాసటగా నిలిచి
స్వేచ్ఛా గీతికకోసం
వంత పాడిన ఆశ్రమం

ఆంగ్లేయులపై వేటుకు
 ఆచరణాత్మక బాటకు
 నిలువెత్తు నిదర్శనం
 సబర్మతి ఆశ్రమం
19.
కవనజ్యోతి ఆధ్వర్యంలో పౌర్ణమి నగదు పురస్కారాల
కవితల పోటీకి నా కవిత
అంశం : సబర్మతీ ఆశ్రమం
శీర్షిక : జాతీయస్మారక చిహ్నం
భారతదేశ జాతీయస్మారక చిహ్నం సబర్మతీ ఆశ్రమం
ఉన్నాయి ఎన్నో ఆశ్రమాలు
విశ్వమంతటా
పేరుగాంచిన మహర్షుల ఆశ్రమాలు ఒకనాటివి
ఋషితుల్యుడైన జాతిపిత
ఆశ్రమం సబర్మతీ ఆశ్రమం నేటిది
సబర్మతీ నదీతీరాన నెలకొన్న
పవిత్ర ప్రశాంత ఆశ్రమమిది
గాంధీజీ జీవితానికి అద్దం పట్టే
ఆశ్రమం
పవిత్రదేవాలయమిది గాంధీ
మహాత్మునికి
విప్పి చెప్తుంది గాంధీజీ హృదయాన్ని
స్వాతంత్రోద్యమపోరాట కార్య
కలాపాలకు నెలవు
తన లక్ష్యసాధనకు 'ఆయువుపట్టు
వ్యవసాయం, పశుపోషణ అక్షరాస్యత ,  లతో మొదలై
దండియాత్ర ,ఉప్పుసత్యాగహాదులతోగడగడలాడించింది ఆంగ్లేయులను
స్వాతంత్ర్యపోరాట కీలకఘట్టాలన్నిటికీ ఇదే ప్రముఖ స్థానం
పిలవబడుతోందిది గాంధీఆశ్రమం, హరిజనఆశ్రమం,సత్యాగ్రహాశ్రమం అన్న పేర్లతో కూడా
స్వయంసమృద్ధే  ప్రధానలక్ష్యం
నిరాడంబరుడు, నిష్కల్మషుడు, నిజాయితీపరుడు, మానవతావాది ఐన గాంధీ
స్వభావానికి దర్పణం
జైలుకి,శ్మశానానికి మధ్య
గల ఈఆశ్రమం
తెలియచేస్తోంది గాంధీజీ ముందుచూపుని
సత్యాగ్రాహి చేరే చోటులవేనట
అద్భుతం ఆమహామహుని
ఆలోచనాపటిమ
అయ్యాడు"మేటిపురుషుడు"
గాంధీ దీనివలననే
నడుస్తోంది నేడు గాంధీజీ
స్మారకకేంద్రంగా
గాంధీజీ ఛాయాచిత్రాలు, లేఖలు, సందేశాలతో
ఆకట్టుకుంటోంది పర్యాటకుల
నెందరినో నేడు
గుర్తింపుపొందింది జాతీయస్మారకచిహ్నంగా
అంతటి మహోత్తర గౌరవాన్ని
పొందగలిగిన ఆశ్రమమిది ఒక్కటే.

పేరు : డా.భమిడిమఱ్ఱి కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
చరవాణి : 9871096566

హామీ : పైకవిత నాస్వంతం
అనుకరణ, అనువాదం కాదు.
20.
మద్ది. పుల్లారావు
జిల్లా పేరు *
కృష్ణా
ఫోన్ నెంబర్ 
9951287113
కవిత *
సబర్మతీ ఆశ్రమం
తేటగీతి పద్యాలు

1)
గాంధి తాతయాశయములు కరుణ,మైత్రి
వాని సాధనకు సబర్మతాశ్రమమును
తీర్చి దిద్దెను గొప్పగా ధీయుతుండు
అహ్మదాబాదు దగ్గర యద్బుతముగ

2)
భాపు నివసించె పన్నెండు వత్సరాలు
ఉధ్యమాలన్నిచటనుండె యురుకుపెట్టె
ధండి యాత్ర గొప్పగ సాగె ధరణిలోనె
కీలకోధ్యమాలకిదియె గీటురాయి

3)

వ్యవసాయం, విజ్ఞానం, పశులసంత
ఆశ్రమంలోన సాగించిరధ్బుతముగ
కలదిచట వినోబామీరా గడిపినట్టి
చిన్నదైన కుటీరము చిత్రముగను

4)

ప్రార్థనా భూమి చక్కటి ప్రాంగణమున
మ్యూజియమొకటి జూడ ముద్దుగుండు
చార్లెసుకొరియా నిర్మించె సంబరముగ
అక్షరాస్యతకై పాఠశాలగలదు


5)

గాంధి జీవిత పయనపు ఘనచరితకు
గుర్తులిచటగలవుమన గుండె పొంగ
ఉత్తర,సందేశములుజూడ యుత్సుకతయె
జాతిపిత ఛాయచిత్రాలు స్మరణములవి
21
సయ్యద్ జహీర్ అహ్మద్
జిల్లా పేరు *
కర్నూలు
ఫోన్ నెంబర్ *
9505152560
కవిత *
సబర్మతీ ఆశ్రమము :

గాంధీజీ ఆశయాల సన్నిధి సబర్మతీ ఆశ్రమం
గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ చేరువ
సబర్మతీ తీరాన వెలసిన ఆశ్రమ లోగిలి!
సత్యాగ్రహీ నిర్వచించిన చావో రేవో నిర్ణయం
చెరసాలకి శ్మశానానికి మధ్యస్థ కేంద్రం...
గాంధీజీ ఆశయాలకు అనువైన స్థావరం
సేద్యం, అక్షరాస్యత అంశాలపై శిక్షణాలయం
దేశ స్వయంసంవృద్ధి సాధనే దీని లక్ష్యం!
దండీ యాత్రకు జెండా ఊపింది ఇక్కడి నుంచే
స్వదేశీ ఉప్పు మీద విదేశీ విధించిన పన్నుకు
ఈ ఉద్యమ కెరటం ఎగసింది నిరసనగా
ఆశ్రమవాసులతో ఆరంభం ఉప్పు సత్యాగ్రహం
అహింసా విధానంలో ఆంగ్లేయులు వణికింది!!
నేడు అది గాంధీజీ స్మారక కేంద్రం
గాంధీ నివసించిన హృదయ్ కుంజ్ లో
చార్లెస్ కొరియా ఆర్కిటెక్చర్ రూపకల్పనలో
వస్తువు ప్రదర్శనశాల.......
జవహర్ లాల్ నెహ్రూతో  ప్రారంభం!
గాంధీజీ జీవితానికి సంబంధించిన 
ఛాయా చిత్రాలు, ఉత్తరాలు, సందేశాలు,
సాహిత్య సంబరాల ప్రదర్శనం!!
ఆశ్రమ ప్రాంగణంలో వినోబా మీరా కుటీరం
ప్రార్థన భూమి, కుటీర పరిశ్రమకు శిక్షణ కేంద్రం ఏడాది పొడవునా సందర్శకుల సందడి
నిర్ణీత కాల వ్యవధిలోనే విధులు నిర్వహణ!
22.
వనపర్తి గంగాధర్
జిల్లా పేరు *
హన్మకొండ
ఫోన్ నెంబర్ *
9440146435
కవిత *
శీర్షిక:విశ్వశోధనా జ్ఞానాశ్రమం

సబర్మతీ నదీ తీరాన ఉద్భవించెను
ప్రపంచ శాంతికై ఉదయించెను
సత్యాగ్రహాశ్రమమై వెలిసెను
మహాత్మా గాంధీ దానిని స్థాపించెను

ఆ సుందర నిర్మల నదీ తీరాన
రూపుదిద్దుకున్న జ్ఞాన కుటీరం
ఇక్కడే ప్రాణం పోసుకున్నది సత్యాగ్రహం
పురుడోసుకున్నది ఓ పాఠశాల జ్ఞాన సుమం

స్వాతంత్రోద్యమానికి ఇదో కార్యశాల
ఎందరో వీరుల తయారీ కార్ఖానా
సత్యాహింసల భోధనల సుక్షేత్రం
ఎందరో త్యాగధనులకు పూజనీయం

శాంతి తరువు ప్రాణం పోసుకున్న ప్రదేశం
సహన పుష్పం వికసించిన పుణ్యస్థలం
అదో ఉద్యమ కార్యాచరణ శిక్షణాలయం
దేశానికి వన్నె తెచ్చిన జ్ఞానాలయం

ఆ సాగర కెరటాలలో ఏ మహత్తు ఉందొ...!
ఆ చల్లని పవనాలతో ఏ శక్తి దాగుందో...!
ఆ నేలలో ఏ త్యాగ నిధులున్నాయో...!
చరితలు స్థానం దక్కించుకుని నిలిచిన
విశ్వశోధనా జ్ఞానాశ్రమం సబర్మతీ ఆశ్రమం


హామిపత్రం:ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
23.
.




తాతపూడి సోమశేఖర శర్మ 
జిల్లా పేరు *
యానాం, పాండిచేరీ స్టేట్ 
ఫోన్ నెంబర్ *
8328079336
కవిత *
శాంతిఆశ్రమం

ఆశ్రమం ఆశ్రమం
సబర్మతీ ఆశ్రమం
నిర్మలతకు స్వచ్ఛతకు
నిరూపమాన నిర్మాణం

ప్రశాంతత కలిగేది ఇచ్చటే
మనోవుల్లాసం ఉండేది ఇక్కడే
మనసులు మమతలు పంచేదిక్కడే
అనురాగం ఆప్యాతలు నిలచేవిక్కడే

గాంధీ మహాత్ముని శాంతం ఈ ఆశ్రమమే
గాంధీ సూక్తులు పాటించేది ఈ ఆశ్రమమే
జ్ఞానబోధ గురుపరంపరలు నిలిచేవిక్కడే 
అజ్ఞానాంధకారము రూపుమాపేదీఆశ్రమమే

మంచితో మనుగడతో జీవిస్తారు
మానవత్వముతో మసలుకుంటారు
మానవసేవే మాధవ సేవయని భావిస్తారు
సబర్మతీ ఆశ్రమాన్ని శాంతి ఆశ్రమముగా పూజిస్తారు

హామీపత్రం.. ఈకవితా నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. 
తాతపూడి సోమశేఖర శర్మ, యానాం 
24.
జోషిపద్మావతి 
జిల్లా పేరు *
మహబూబ్ నగర్ 
ఫోన్ నెంబర్ *
9542010502
కవిత *
స్వచ్ఛ భారత సబర్మతి
*********************
 
సమతా మమతల నిలయం
గుజరాతీ ప్రసిద్ధ  గాంధీ ఆశ్రమం.
సబర్మతీనదీతీర సత్యాగ్రహాశ్రమం
హరిజనులకు సేద తీర్చినది  సేవలందించి హరిజనాశ్రమమైనది
కస్తూర్బాగాంధీజీలు కాపురమున్న కుటీరం
దండి ఉప్పుసత్యాగ్రహాలను ఆరంభించిన స్థలం
స్వాతంత్ర్యపోరాటానికి కీలకపాత్రయైన స్థలం 
భారతప్రభుత్వం గుర్తించిన నేటి స్మారక స్థలం
గాంధీ మొదటి నివాసం, హృదయ కుంజ్ కుటీరం
గాంధీ జీవన చిత్రణలనందించేను,
నేడక్కడి మ్యూజియం. 
గాంధీజీ అభిమానుల సందర్శనార్థం,
నిరంతరాయంగా దరిశనమిచ్చేను
ఈ స్వచ్ఛ సబర్మతీ ఆశ్రమం. 
చెడు అనవద్దు,చెడు వినవద్దు,
చెడు కనవద్దంటూ సందేశమిచ్చేను
అక్కడి మర్కట చిహ్నం.

25.
జోషిపద్మావతి 
జిల్లా పేరు *
మహబూబ్ నగర్ 
ఫోన్ నెంబర్ *
9542010502
కవిత *
స్వచ్ఛ భారత సబర్మతి
*********************
 
సమతా మమతల నిలయం
గుజరాతీ ప్రసిద్ధ  గాంధీ ఆశ్రమం.
సబర్మతీనదీతీర సత్యాగ్రహాశ్రమం
హరిజనులకు సేద తీర్చినది  సేవలందించి హరిజనాశ్రమమైనది
కస్తూర్బాగాంధీజీలు కాపురమున్న కుటీరం
దండి ఉప్పుసత్యాగ్రహాలను ఆరంభించిన స్థలం
స్వాతంత్ర్యపోరాటానికి కీలకపాత్రయైన స్థలం 
భారతప్రభుత్వం గుర్తించిన నేటి స్మారక స్థలం
గాంధీ మొదటి నివాసం, హృదయ కుంజ్ కుటీరం
గాంధీ జీవన చిత్రణలనందించేను,
నేడక్కడి మ్యూజియం. 
గాంధీజీ అభిమానుల సందర్శనార్థం,
నిరంతరాయంగా దరిశనమిచ్చేను
ఈ స్వచ్ఛ సబర్మతీ ఆశ్రమం. 
చెడు అనవద్దు,చెడు వినవద్దు,
చెడు కనవద్దంటూ సందేశమిచ్చేను
అక్కడి మర్కట చిహ్నం.
26.
బొడ్డు హారిక
*****"
కవిత *
స్వాతంత్ర్యోద్యము యందు 
ఉప్పు సత్యాగ్రహమును
దండి యాత్రను 
ప్రారంభించిన స్థలం
మహాత్మునిచే స్థాపితమైనది
గాంధీ ఆశ్రమంబని
హరిజన ఆశ్రమంబని
సత్యాగ్రహ ఆశ్రమంబని
జాతీయ స్మారక స్థలంబుగా
నామధేయంబు గలదే కదా
సబర్మతి నదీ తీరమందలి
మన సబర్మతి ఆశ్రమం
గాంధీజీ తన ధర్మపత్నితో
పన్నెండేళ్ళు నివసించిన స్థలం
కర్మాగారానికి, కాటికి నడుమ
సత్యాగ్రహి  జీవితాన్ని తెలుపునది
27.
అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
****""""
కవిత *
కవితా శీర్షిక :-శాంతి, అహింసల నిలయం
శాంతి అహింసలే ఆయుధాలుగా
భరతమాత దాస్యశృంఖలాలను
తెల్లదొరలనుంచి విముక్తి చేసి
స్వాతంత్ర్య సముపార్జన చేసిన 
జాతిపిత మహాత్మాగాంధీ అహ్మదాబాద్ దరి
సబర్మతీ నదీ తీరాన ముప్పది ఆరు ఎకరాల సువిశాల ప్రదేశంలో నిర్మించిన పవిత్రఆశ్రమం
ధర్మపత్ని కస్తూరిభాయి తో కలసి పుష్కర కాలం
నివసించిన పుణ్యభూమి.
స్వాతంత్య్ర సంగ్రామంలోని ముఖ్యమైన
దండి సత్యాగ్రహం, సహాయనిరాకరణోద్యమం
విదేశీవస్తు బహిష్కరణలకు నాంది సబర్మతీఆశ్రమం
ఆచార్య వినోభావే భూదానోద్యమానికి పిలుపు నిచ్చిన ప్రదేశం .ఎందరో మహానుభావుల,
దేశభక్తుల, స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణ
భగవద్గీత నిత్యం పఠింపచేసి జీవిత సాఫల్యానికి
గీతయే మార్గమని వసుదైవ కుటుంబానికి భగవద్గీత
ప్రామాణికమని మహాత్ముడు ప్రభోదించిన దేవాలయం. జాతిపిత నడచిన మార్గంలో ఇప్పటికి ఆశ్రమ నిర్వాహణ జరగడం .మహాత్ముని వస్తువులను మ్యూజియం లో అతి పవిత్రంగా ప్రదర్శించడం మహాత్మునికి దేశప్రజలిచ్చే గౌరవం.
28.
గొర్రెపాటి శ్రీను
జిల్లా పేరు *
మేడ్చల్_ మల్కాజ్ గిరి
ఫోన్ నెంబర్ *
9652832290
కవిత *

కవితా గానం (సీజన్ -2)
అంశం : సబర్మతీ ఆశ్రమం

శీర్షిక :  " మహిమాన్విత స్థలి !"

రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)

గాంధీజీ..
మనమంతా"మహాత్మా" అని ప్రేమగా పిలుచుకునే..
మోహన్ దాస్ కరం చంద్ గాంధీ !
దేశానికి
సత్యాగ్రహం విలువ..
అహింస గొప్పతనాన్ని..
తెలియ జేసి 
తనదైన శైలిలో దేశాన్ని ఏకతాటిపై చేర్చి ..
నిరంకుశులైన బ్రిటిష్ వాళ్ళు తినే ఉప్పు పై పన్నులు వేసి
అడుగడుగునా భారతీయులని బానిసలుగా భావిస్తూ ..దేశ సంపదనంతా కొల్లగొడుతుంటే ..
నాడు గాందీజీ తెల్ల వాళ్ళ పై "ఉప్పు సత్యాగ్రం" అనే తిరుగుబాటు బావుటా ఎగరేసిన స్థలం "సబర్మతీ ఆశ్రమం" !
శాంతిసామరస్యాలకు నిలయం సబర్మతీ ఆశ్రమం !
కులమతాలకు అతీతమై ..
ఉద్యమలు చిగురులు తొడిగిన పవిత్ర స్థలం ..!
గాందీజీ కస్తూర్బా తో కలిసి జీవించిన పుణ్యస్థలి సబర్మతీ ఆశ్రమం !

జాతిపిత గా భారతీయులందరూ గౌరవించుకునే గాంధీజీ నూలు వడికి భారత జాతి ఐకమత్యానికి ప్రేరణై ..
"స్వదేశీ " నినాదానికి ఊపిరిపోసిన.. మహిమాన్విత స్థలి ..సబర్మతీ !
     
ఆధ్యాత్మిక సౌరభాలతో వర్ధిల్లే భారతావని లో వెలసిన సుక్షేత్రం..
గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యానికి ప్రతీకై
నేడు ఎందరో విదేశీయులను సైతం ఆకట్టుకుంటున్న సువిశాల సుందర ఆశ్రమం ..సబర్మతీ ఆశ్రమం ! 

 " మహిమాన్విత స్థలి !"అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.  _ గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్
29.
ఆళ్ళ నాగేశ్వరరావు గారు
కవిత *
కవితా శీర్షిక; ""ఉద్యమాల పురిటి గడ్డ""
అందమైన సబర్మతి నదీ తీరాన
సబర్మతి ఆశ్రమంగా ప్రసిద్ధిగాంచి
ప్రకృతికాంత హరితవర్ణపు చీర ధరించి
ప్రకృతిశోభలతో పరిడవిల్లుతూ
పశుపక్ష్యాదులతో శోభిల్లుతూ
పర్యాటకుల మనసు దోచిన 
పర్యాటకుల విహార కేంద్రం సబర్మతి ఆశ్రమం!
గాంధీజీ ఉద్యమాలకు పురిటి గడ్డయై
ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి కేంద్రమై నిలిచిన
ఉద్యమాల పురిటి గడ్డ ఈ సబర్మతి ఆశ్రమం!
భార్య కస్తూరిభాయ్ తో కలసి
సహజీవనం సాగించి
రాట్నాన్ని వాడికి
చేనేతను ధరిస్తూ
విదేశీ వస్త్రాలను బహిష్కరించి
స్వదేశీ వస్త్రాలను ధరింప చేసిన
పుణ్య తీర్థం సబర్మతి ఆశ్రమం!
గాంధీజీ జీవిత చరిత్రను తెలిపే  ఛాయా చిత్రాలతో
చెడువినవద్దు, కనవద్దు,మాట్లాడవద్దు 
అని బోధించే మూడు కోతుల బొమ్మల ప్రదర్శనతో
చూపరులను ఆలోచింపచేస్తూ
ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమానికి 
దిశ నిర్దేశాన్ని చూసిస్తూ
మార్గదర్శియై నిలిచినది.ఈ.సబర్మతి ఆశ్రమం!
బాపూజీ పాదధూళితో.పవిత్రమై నిలిచిన పవిత్ర క్షేత్రం ఈ సబర్మతి ఆశ్రమం!
30.
సింగీతం సంతోష్ కుమార్ గారు
*******
కవిత *
హరిజన ​ఆశ్రమం - మహాత్ముని జ్ఞాపకాల నేల

గుజరాత్ రాష్ట్రంలోని 
అహ్మదాబాదుకి 5 కిలోమీటర్ల దూరన నది ఒడ్డున గల ఆశ్రమం 
మహాత్మున్ని
కొనియడిన నేల
నులు వస్త్రాలు వదిలిన నేల
సమయాన సూర్తి నింపిన నేల
పశు పోషణ,వ్యవసాయం పాఠశాలను అభివృద్ధి చేసిన నేల
స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీ నిర్మించుకున్న ఆశ్రమం గాంధీ తన భార్య అయిన కస్తూర్భా తో పాటు ఇక్కడ పన్నెండేళ్ళు నివాసమున్నా ఆశ్రమం
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఆశ్రమం
ఉద్యమ ఉప్పు సత్యాగ్రహం
దండి యాత్ర మొదలుపెట్టిన 
ప్రాంతం 
భారత ప్రభుత్వం జాతీయ స్మారక స్థలంగా గుర్తించిన ఆశ్రమం
కండ్లకు కట్టిన్నటు కనిపించే మహాత్మున్ని జ్ఞాపకాల ఆశ్రమం.....
31.
కవిత *
కావ్యగానం
ఆశ్వయుజపౌర్ణమి నగదుపురస్కారాల కవితలపోటికి
అంశం:సబర్మతీ ఆశ్రమం
శీర్షిక:శాంతినిలయం
సబర్మతీ తీరప్రాంతములో శాంతినిలయం
సబర్మతీ ఆశ్రమం మానవతావాదికి మరోలోకం
సత్యాన్వేషికి ప్రశాంతస్థావరం
సత్యశోధకునికి కర్మస్థలం
సత్యబోధకునికి యజ్ఞపీఠం
నిత్యప్రార్ధనలకు నిర్మలప్రాంగణము
న్యాయపోరాటానికి మరో ధర్మవేదిక
సరళజీవనానికి ప్రతీక
సత్యసంభాషణలకు సభాస్థలి
సేవాతత్పరులకు సేవాశ్రమము
సర్వమతసమభావనలకు సరైన స్థలము
చరఖాతిప్పడానికి చక్కని చోటు
నూలువడకడానికి నాణ్యమైన నడవా
శాంతిసందేశాలకు సరసప్రదేశము
రఘపతిరాఘవరాజారాం నినదించినదిచటే
స్వీయకార్యాచరణకు స్వీకారమిచటే
భగవధ్యానం నిరంతరం సాగినదిచటే
ఉత్తమరచనలకు ప్రేరణిచటనేకదా
ఉదారతచూపినప్రాంతమిదేకదా
ఆదర్శజీవనమార్గానికి రాచబాటకాద ఇది
స్వాతంత్ర్యసమరానికి మార్గనిర్ధేశము ఇదేకదా
సేవ సౌబ్రత్రృత్వమును పెపొందించనప్రాంతమేగా
కపటాలోచనతో ప్రాణాలు తీసినదిచటనే
హేరామ్ అంటూ శాంతిదూత నేలకొరిగినదిచటనేకదా!
*******
దోసపాటి వేంకట రాంచంద్రా రావు గారు

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...