Skip to main content

ఎవరన్నారు 10/2021

నిర్వహణ
 శివునూరి లలితా కృష్ణ
వీరా గుడిపల్లి 
*********
నేటి అంశం :::ఎవరన్నారు
23102021
************************
1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
2.కోరాడ గారు
3.జోషి పద్మావతి గారు
4.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
5.నాశబోయిన నరసింహా గారు
6.తిప్పావఝల నరసింహా మూర్తి గారు
7.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
8.సునంద వురిమళ్ళ గారు
9.కవిత వెంకటేశ్వర్లు గారు
10.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.గారు
11.అపరాజిత్ గారు
12.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
13.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
14.వాణి సరోజిని లక్కరాజు గారు
15.సునంద వురిమళ్ళ గారు
16.ఏడెల్లి రాములు గారు
17.తరణికంటి సూర్య లక్ష్మి గారు
18.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
19.జక్కిడి వెంకట రెడ్డి గారు
20.గొర్రెపాటి శ్రీ ను గారు
21.వీరా గుడిపల్లి
22.శివునూరి లలితా కృష్ణ గారు
**************
1
కపటం
కన్నేసిందని
కాల్చుకతింటుందని
ఎవరన్నారు

మోసం
మాయచేస్తుందని
ముంచేస్తుందని
ఎవరన్నారు

అన్యాయం
అణచుతుందని
అంతం చేస్తుందని
ఎవరన్నారు

ద్రోహం
దడ పుట్టిస్తుందని
ద్రోహి పోటు వేస్తాడని
ఎవరన్నారు

నిజమే
ఎవరన్నారు ???

అనుభవించిన వారు
అగచాట్లు పడిన వారు
అభాసు పాలైన వారు
అంతమైన ఆత్మల వారు

అనంత కాలాల నుంచి
అనూచానంగా వస్తున్న 
విహ్వల భయానక ఘాతం

కాలం నేర్పిన పాఠం  తోడై
ఉంటే విజయం  వెన్నంటే ఉంటుంది

సమయం పైన స్వారీ చేసే
సామర్థ్యం  స్వంతమైతే
సమయం కలవర పడి
సాగిలపడి పోదా

ఆశయం వెన్నంటే ఉంటే
విజయం స్వంతం కాదని
ఎవరనగలరు???

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు. 23102021
2
[23/10, 8:01 pm] Korada: కవితా గానం :-
అంశం :-  ఎవరన్నారు... ???
   కోరాడ నరసింహా రావు !
శీర్షిక :- తేల్చి చెప్పగల సత్తా... 
         ... ఎవరికుంది.. !?
     ********************
"అహింసా పరమోధర్మః "అని 
ఎవరన్నారు ???
ఎన్నో ప్రాణాలను హరిస్తున్న వాడ్ని... నడిరోడ్డుమీద నిలువు నా నరకటాన్ని... అందరూ మెచ్చు కుంటున్నారే... !

ఆ నలుగుర్నీ ఎన్ కౌన్టర్ చేసి... 
కాల్చి చంపేస్తే... మానవ హక్కులకు భంగం వాటిల్లిందని ఎవరన్నారు... ???
వాళ్ళు ఒక అబలను అతి పైశాచికంగా చెరిచి చంపేసారే !

రోడ్డు ప్రమాదంలో..." కత్తి "
ప్రాణాలు పొతే... అయ్యో పాపం... అని ఎవరన్నారు ???
దైవ దూషణకు తగిన శాస్తి జరి గిందన్నారుగా... !!

అన్నొస్తే... మనకి ఎన్నో లాభాలు...అని ఎవరన్నారు??
మరిన్ని కొత్త కష్టాల్లో కూరుకు పోతుంటే ... !!

ఇది మంచి  అనిగాని... ఇది చెడు అనిగాని మనమెలా తేల్చి చెప్పగలం !?
ఈనాటి మంచి రేపటికి చెడుగా 
పరిగణింపబడుతోంది !
నిన్నటి చెడు... నేడు మంచిగా స్వీకరింప బడుతోంది !!
 దేన్నీ గురించైనా... ఇదే రైటు 
అనిగానీ... ఇది రాంగే అనిగానీ 
తేల్చి చెప్పగల సత్తా.... 
ఎవరికుంది.... !?!?
     ******************
       ..... కోరాడ.
3
[23/10, 8:05 pm] +91 95420 10502: కవితాగానం
************
23-10-2021 శనివారం
నేటి అంశం:ఎవరన్నారు?
ప్రక్రియ:వచనకవిత
రచన:జోషిపద్మావతి 
మహబూబ్ నగర్ 
*************************
ఎవరన్నారు?
కౄర జంతువులకు ఇంగితముండదని?
ఆవుపులి కథ తెలియజేయలేదా!
పులికికూడా జాలిగలదని.  
ఎవరన్నారు?
పాము పగబడుతుందని?
భక్తితో మ్రొక్కితే....
పామే పరమాత్ముడై కాపాడడా!  
ఎవరన్నారు?
కాలం మారిందని?
మారుతున్నది కాలం కాదు.
మార్పును సృష్టించేది మనిషి ప్రవర్తనకాదా! 
దయాదాక్షిణ్యాలతో ద్రవించే హృదయంగలది ఈ
సకలచరాచర సృష్టి 
కఠినమైనశిలలను సైతం ద్రవింపజేయగలడు ఆ పరమేష్ఠి.
అతి తెలివిని ప్రదర్శిస్తూ,
ఆపదలను ఆహ్వానిస్తూ
ఉపద్రవాలకు ఊతమిస్తూ
ఉన్మాదులుగా మెలుగుతూ
మానవులే దానవులైతే
మంచిని సమాధిచేస్తూవుంటే
అంతంకాదా కలియుగం!
ఆగడాలుసృష్టించే ఈ నవయుగం!
4
[23/10, 8:19 pm] +91 99373 80136: కవితాగానం(సీజన్2)
తేది23102021,శనివారం.
అంశం:ఎవరన్నారు?
ప్రక్రియ:వచన కవిత
నువ్వు బుద్దుడి వారసుడివే
నువ్వు గాంధీ వాదివే
నువ్వు శాంతిదూతవే
నువ్వు అన్నదాతవు
నువ్వు శ్రమజీవివి
నువ్వు శ్రామికుడవు
నువ్వు సైనికుడవు
నువ్వు వైద్యుడవు
నువ్వు ఇంజనీరువు
నువ్వు పారిశ్రామికవేత్తవు
నువ్వు పెట్టుబడిదారువు
నువ్వు ప్రజానాయకుడవు
నువ్వు న్యాయవాదివి
నువ్వు ముస్లీమువు
నువ్వు కిరస్తానివి
నువ్వు దళితుడవు
నువ్వు దరిద్రుడవు
అందరికన్నా నువ్వు గురువువి
నిజానికి మానవుడవు
కాదని ఎవరన్నారు?!

ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు.
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా.
చరవాణి7780594995.
5

కవితాగానం

నేటి అంశం

ఎవరన్నారు..???
23.10.2021

ఎనిమిది నుండి
తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో
స్పందించగలరు.

ఆ సమయంలో ఎలాంటి
ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు
5
 *కవితా గానం సీజన్ 2*
అంశం:ఎవరన్నారు..?
తేది:23.10.2021
రచన: నాశబోయిన నరసింహ (నాన)
ప్రక్రియ: వచన కవిత
*అనుబంధ సుగంధం*
  """"""""""""""""""""""""""""""
మన మధుర స్మృతులు 
జన్మ జన్మలో నెమరేస్తూ 
ఆనంద జీవన తరంగాలలో
అణువణువు ఐక్యమైనపుడు
మన అనుబంధ సుగంధాన్ని
విడదీసే దెవరు?

నా గుండెలో నీ గుండె 
పెనవేసుకు పోయి 
మనిద్దరిదీ ఒకే స్పందనైనపుడు
మన హృదయ శృతిలయల సరాగం
ఆగి పోతుందన్న దెవరు? 

నీ అంతరాత్మ నా ఆత్మలో
అంతర్లీనమై మనిద్దరిదీ 
ఓకే ఉచ్ఛ్వాస నిశ్వాసైనపుడు  
మన ప్రాణం అనంత వాయువులో 
విలీన మవుతుందన్న దెవరు? 

కష్ట సుఖాల కలయికలో 
కలకాలం తోడు నీడగా నిలిచావు
పారిపోవటం విడిపోవటం 
ప్రేమ స్వరూపం స్వభావం కాదన్నావు 
మన అనురాగ మహాసంద్రానికి 
అడ్డుకట్ట వేసేదెవరు?

నీ జతలేని కాపురం అగమ్య గోచరం
నా మదిలో నీ ఆవాసం సుస్థిరం 
మన సహవాసం ఆజన్మ తారార్కం
ఇష్ట దైవారాధనలో సదా నిమగ్నమైన
మన అంతరాత్మ నదృశ్యం చేసే దెవరు?

✍️ *(నాన)*
6
[23/10, 9:28 pm] Thippavajjala నరసింహ మూర్తి Poet Nellore: కవితా గానం
అంశం: ఎవరున్నారు?
శీర్షిక:హంసలా

ఎవరున్నారు మంచికి రోజులు కావని?
మంచివిలువ దానికదే.
ఎవరన్నారు స్త్రీలను గౌరవించడం లేదని?
ఆదినుంచి మహిళకు పెద్దపేటే.
ఎవరున్నారు విదేశీ సంస్కృతి గొప్పదని?
ప్రపంచానికి ఓనమాలు నేర్పిన ప్రాచీన సంస్కృతి మనది.

ఎవరన్నారు మానవీయత మంటగలిసిందని?
కరోనాకాలంలో పరిమళించిన మానవతకంటేనా?
ఎవరున్నారు?రాజకీయ అరాచకమని?
తానిబన్లకంటేనా
ఎవరున్నారు సమాజం భ్రష్టు పట్టిందని.
ప్రతిదానికీ సమాజం ప్రతిస్పందిస్తూ నే ఉంది.
ఎవరున్నారు తల్లిదండ్రులను ఆదరించడం లేదని.
పువ్వుల్లో పెట్టి చూసుకొనే బిడ్డలూ ఉన్నారు.
ఎవరున్నారు లోకమంతా చెడ్డేనని
పసిఫిక్ కళ్ళకు లోకమంతా పచ్చని
ఎవరున్నారు వద్యావ్యవస్థ భ్రష్టు పట్టిందని.
మెలికలు మెరుస్తూనే ఉన్నాయిగా..
ధర్మరాజు లా మంచిని చూద్దాం ఇంకా మంచిని వేరుచేసుకొందాం

తిప్పా వఝల నరసింహమూర్తి
7
[23/10, 9:29 pm] Thathapudi Somashekara Sharma: కవితాగానం సీజన్ 2
అంశం.. ఎవరన్నారు..?
శీర్షిక.. సరిపోరు
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

నీ మనసు మంచిది 
నీ నడిచే బాట సరియైనది
నీ మాట్లాడే మాట నిజమైనది
నీవు చేసే పనులు ఉపయోగకరమైనవి
నిన్నుఇకఎవరేమంటారు ఏమనగలరు?
నిన్నుఅనడానికిఎప్పుడూఎవరుసరిపోరు

నీ మంచితనం నిన్నే కాపాడుతుంది
నీతెలివితేటలునలుగురకు ఉపయోగం 
నీ మేధాశక్తితో పదిమందిక మేలు చేయి
నీకు తెలుసు నీవు చేసే మంచి చెడులు 
నిన్నేమనగలరు?నిన్నుఅనడానికిసరి పోరు

నీ అంతరాత్మకు తెలుసు
నీ మంచిమనసుకు తెలుసు
నీ హృదయానికి తెలుసు
నీ మనుగడకు తెలుసు
నువ్వంటే తెలిసిన నిన్నేమనగలరు?
నిన్ను అనడానికి ఏఒక్కరు సరిపోరు

అనుకుంటూమంచిపనులుచేస్తూవుండు
ఎట్టిపరిస్థితులలోనూ నీవు చలించకు
దైవారాధనతో నీవుఅన్నింటినిసాధించు
నీ మనో ధైర్యమే నీకు సదా శ్రీరామరక్ష
నన్ను ఎవరు ఏమనలేరు అనుకుంటూ
నీవుముందుకుసాగుమంచిబాటలోనడు 
నీవుచేసేమంచిపనిలో విజయంతథ్యం

హామీ పత్రం
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
8
[23/10, 9:30 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
*తేదీ:23-10-2021*
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
*అంశం:ఎవరన్నారు..???*
******************
ఎవరెన్నారు  నీవు ఒంటరివనీ?
ఆలోచనల నేస్తాలతో క్షణమైనా రికాము లేక గడుపుతావు!

ఎవరన్నారు నీవు ఏకాకివనీ? 
పంచేంద్రియాలతో సహజీవనం చేస్తూ
ప్రపంచాన్ని చదివే నీవు!

ఎవరన్నారు? నీవు అజ్ఞానివనీ!
 మేథస్సుతో సమస్త విశ్వము లోతులు వెతికే నీవు..
 ఎవరన్నారు నీవు! అమాయకుడివనీ?
 అతి తెలివి తేటలతో
సర్వ జీవుల పై పెత్తనం చెలాయిస్తున్న వాడివి..

 ఎవరన్నారు నీవు
పాపపుణ్యాలు తెలియని వాడవనీ..
భగవంతుని అహింస పరమో ధర్మః అని ప్రార్థిస్తూనే సాటి జీవులకు హాని చేసే నీవు...

 నీవు  నీవే.. అపరిమిత మేథో సంపత్తి కలిగిన వాడివి

9.
కవితా గానం సీజన్ 2
అంశం:: ఎవరన్నారు?
తేదీ::23.10.21..శనివారం
రచన:: కవిత వెంకటేశ్వర్లు
శీర్షిక:: నిజంగా అన్నారా!....

భారత దేశం బాగుపడలేదని
భారతీయులకు ఐక్యమత్యం లేదని
కుల మతాల కుమ్ములాటలో
కొట్టుకుంటున్నారని
జనగణమన జాతీయ గీతానికి
విలువివ్వరని
ఎవరన్నారు?
ఎవరైనా అన్నారా?

రాజకీయ రగడలతో రాష్ట్రలు
రావణకాష్టం అయ్యిందని
మాటల తూటాలతో 
మరఫిరంగులా పేలుస్తున్నారని
ఓట్లను నోట్లతో కొంటున్నారని
ప్రజల పేరు చెప్పి పైకం వెనకేసు
కుంటూన్నారని 
ఎవరన్నారు?
అన్నారా ఎవరైనా?

ఆడపిల్లలు అబలలని
అర్ధరాత్రి అపరాత్రి తిరుగుతున్నారని
ఏ డ్రస్సయిన వేసుకోవచ్చని
ఎక్కడంటే అక్కడ నిర్భయంగా
పోయిరావచ్చని
ఎవరన్నారు?
అలా ఎవరైనా అన్నారా?

టమోటా పండ్లు రోడ్లపై
పారబోస్తున్న
గిట్టుబాటు ధర లేదని గిలాగిలా
కొట్టుకుంటున్నా
లక్షల్లో అప్పులెక్కువై ఆత్మహత్యలు చేసుకుంటున్నా
ఎవరైనా ఏమైనా అంటున్నారని అనుకుంటున్నారని
ఎవరన్నారు?

దారి దోపిడీలు దొంగతనాలు
జరుగుతున్నాయని
మోసం ద్రోహం భూకబ్జాలు
ఎక్కువైనాయని
అడపిల్లని తెలిస్తే కడుపులోనే
కాలం చేయిస్తున్నారని
దగుల్బాజీ పనులు చేస్తూ కోట్లు కూడబెట్టుకుంటూన్నారని
ఎవరన్నారు?
ఎవరు అనలేదే
ఎవరు నోరువిప్పలేదే
ఎవరున్నా..ఎవరేమన్నా
అది వారికే తగులునన్నా
నీతిని న్యాయాన్ని కాపాడుట
మన ధర్మమన్నా
జాతిని జాగృతి చేయుట మన
కర్తవ్యమన్నా!!
               
                కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.    8309920625
పై కవిత నా స్వంతం అని హామీ
10.
[24/10, 7:15 pm] +91 6281 697 982: పొలాలు.....24102021
*********
పచ్చని పంట పొలాల మధ్య
పారుతున్న చల్లని కాలువలు 
పైరు నోట నీరు నిండుగ పోసి
 పరువాల పైడి బొమ్మను పెంచగ

హేమము సుసిహానియై హంస
హొయల నడకలతో నట్టింట
హిందోళ రాగము వినిపిస్తుంటె
హృదయం శశివనంలొ విహరించె
హిరణ్మయి హరిణి నయనాలై మెరియవా

ఆకుపచ్చని కోక కట్టి నీలి రంగు రవికె
తొడిగి ఎర్ర పైటను జారు వాల్చగ
పచ్చలన్ని తెల్లబోయి పెచ్చులూడి
పిచ్చివై జాతి రాళ్ళమనే మాట మరిచె

సాయంకాలపు సమీర వీచికలు
సుతారంగా నిమురుతూ 
మన్ను సువాసనలు ఎగబోస్తుంటె

సుందరమైన సీతాకోక చిలుకల
విహారాలు
చిమ్మటల చిరు సవ్వడుల ఆది తాళం
అద్భుతం
పూల రేకుల పరిష్వంగములో
మత్తుగా విశ్వ మనోహరంగా 
ఝాంకారనాదం చేస్తున్న భ్రమరాల
పుష్ప విలాసం
ప్రకృతి ప్రసాదించిన ప్రణయ దృశ్యమాలిక
ప్రగతి ప్రసరించిన ప్రవాళ హేల ఇదే

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
24102021.
11
[24/10, 8:12 pm] Aparajith: ఎవరన్నారు?

ఎవరన్నారు?
నేను నేనేనని 
నేనున్నానా అసలు?
నేను లేనని 
నన్ను కాదని 
నా ప్రమేయం లేక 
ఎన్నెన్నో జరుగుతున్నయి!

ఎవరన్నారు?
నేనున్నానని?
నన్ను నన్నుగా చూడవు 
నేను నిన్న వున్నాను 
రేపు నేను వుంటాను 
ఇప్పుడు నన్ను చూడలేవు 
చూసి తట్టుకోలేవు కూడా!

ఎవరన్నారు?
నేను కన్న కలలు కల్లలైనయని 
నేను ఉన్నానా అసలు?
నా లోపలి చిత్రం సాక్షిగా 
నేను కనిపించట్లేదు!
అయినా పట్టించుకోరు 
ఈ దరిద్రగొట్టు శరీరమా నేను 
ఎక్కడా నేను లేను 
కన్నూగానని చీకట్లో నేనున్నానా?
ఎవరన్నారు?ఎందుకన్నారు?

అపరాజిత్ 
సూర్యాపేట
12
కవితా గానం సీజన్ 2
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
అంశం: ఎవరన్నారు 
శీర్షిక: మన దేశం
...
ఎవరన్నారు 
మన దేశంలో 
ఆహార కొరత ఉందని 
ఆకలి మరణాలున్నాయని 
ఏ పెళ్లి భోజనశాలకు వెళ్లినా 
ఏ ఫైవ్ స్టార్ హోటల్ సందర్శించినా 
విలువైన ఆహార పదార్థాలు 
చెత్తకుండీలో పారబోస్తున్న వైనం 

ఎవరన్నారు 
మన దేశంలో నిరుపేదలున్నారని 
ఒక్కసారి నగరాలలో తిరిగి చూడు 
విశాలమైన భవనాలలో నివసిస్తూ
విదేశీ ఇంపాలా కార్లలో తిరుగుతూ 
లక్షల రూపాయల డైమండ్ నగలు ధరించే 
మనుషులన్న దేశం మనది 

అనవసరమైన అభాండాలతో 
దేశం పరువు తీయకండి 
...
హామీ పత్రం 
ఈ కవిత నా స్వంత రచన
13
కవితాగానం
తేదీ;24/10/2021
నేటి అంశం; ఎవరన్నారు...???

శీర్షిక:  "" వాసి పెరగాలి  ""

మనుష్యుల్లో మానవత్వం తరిగి
దానవత్వం పెరిగిందని ఎవరన్నారు?
కల్లోల కరోనా విజృంబణ తరుణంలో
మానవత్వంతో ఆదుకున్న మానవతావాదులు ఎందరో!
దాతృత్వంతో ఉడుతాభక్తిగా 
దానం చేసి
అన్నార్తులను ఆదుకున్న దానకర్ణులు ఎందరో!
వాసి కన్నా రాసి.పెరగాలి
మానవతామూర్తులు,
దాతృత్వపు దాతలు పెరగాలి
బాధితుల సంఖ్యతో సరిసమానంగా
విశాల హృదయులు,
సహృదయులు ,
ప్రగతిశీల భావకులు పెరగాలి
దారిద్య్రరేఖకు దిగువనున్న.వారి సంఖ్య తరగాలి
బీదరికం నిర్ములనకై
చేయి.చేయి కలిపి.ముందడుగు వేయాలి!
.....................   .......     ........
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
చరవాని సంఖ్య;7416638823
............................................పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.

14.
కవితా గానం సీజన్ 2
రచన వాణి సరోజిని లక్కరాజు
విజయవాడ.
అంశం ఎవరన్నారని?.
అవును అది నిజమని ఎవరన్నారు?
అన్నవన్నీ నిజాలు కావు
చెప్పేవన్నీ సూక్తులు కావు
అతిశయాలు  అవకాశ వాదాలు 
సమాజాన్ని చిదిమేశే రోజులివి
స్వార్ధం బరితెగించి ఆ బగా
నోరు తెరిచి కనపడ్డవాటి నన్నిటిని కబళిస్తున్నది
నీకు తప్పని తోచిన విషయం
ఎదుటివారికి సైతం వర్తిస్తుంది కదా
న్యాయాన్ని ధర్మాన్ని నిలువునా పాతేస్తున్నారు.
కళ్ళకు గంతలే కాకచెవుల్లో దూదులున్నాయా?
రామరాజ్యమంటూ రంకెలేసేమనం
రావణాకాష్టంగా దేశంరగిలి పోతుంటే
భావితరాలకు భవితవ్యమేది
ఆలోచించి నిజాలు వడగట్టాలి.
సమాజానికి సరైన మార్గం చూపాలి.
అంతవరకు అన్నీనిజాలని అంచనా కురాకండి
15.

16
కవితా గానం
ఏడెల్లి రాములు
*ఎవరన్నారు*...

నా దేశం సదా స్మరణం
సత్యమేవ జయతే
ధర్మమేవ జయతే
కాదని ఎవరన్నారు

అరిషడ్వర్గాల తెగులు పట్టాక
మనిషి మాట పలికే తీరు చెదలు పుట్టలు
కాదని ఎవరంటారు

లోకం లోభ మోహితం
పాపం ధరిత్రి నిండా పరివ్యాప్తం 
నిత్యం నిజాల వెలుగుల సూర్యులు
అవినీతి నిరోధానికి గజ్జెకట్టిన సింహాలు

ఓటమి ఏనాడైనా వరించిందా
వారించకూ పోరాడూ విజేత నీవే
అపనిందలు తాత్కాలికమే కదా

స్వార్థానికి స్వాగతం పలుకుతూ
అభివృద్ధి కి నిచ్చెనలు ఎలా వేసేది
మోసాల మోహాల కుబుసం విడిచేయ్
బతుకంతా విరిసిన కలువల కొలువు

ఆత్మీయత లతల పిలుపులే కదా
మది తడిగా ప్రేమ మొలకయ్యేది

న్యాయదేవత ఇపుడు రమణీయ దృశ్యకావ్యం
ధర్మం ప్రపంచానికి పరిచయం చేస్తున్నది నా దేశం

సరిహద్దుల్లో దురాక్రమణల దాయాదీ
మరోవైపు బుసలు కొట్టే ఆక్రమణల
విషనాగు
భస్మాసుర హస్తం తో
తుత్తునియలుగా స్వయం స్వీయ
పరాభవ ప్రాభవం ప్రారంభం
కాదని అశోక చక్రం సాక్షిగా
ఎవరుంటారు
శాంతి దీపోత్సవంలో
నా తల్లి భారతి విజయోత్సవం

ఏడెల్లి రాములు ✍️
ది*24*10*2021(21*28)
ఎల్కలపెల్లి
 జిల్లా*పెద్దపల్లి
17
[26/10, 8:06 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్‌2 ) 25/10/2021/ సోమవారము
అంశం:- " ఎవరున్నారు "

రేయి గడవగానే పగలు రాదని ఎవరన్నారు
కాలము ముందుకు పోవునుగాని వెనుక దిరుగదని తెలిసియు వెనుక దిరుగు ననిచెప్పగలవారెవరు
మంచిచెడులు నిర్లయించేది కాలమేనని ఎరుగనివారెవరు
జననమరణములు జగతికి సహజ మని కాదనిచెప్పేవారున్నారా
ధర్మమేధరణికి కవచము కాదనగలరా
మూగజీవాలను అర్ధంచేసుకునేమహాను భావులు లేరని చెప్పగలవారెవరున్నారు
మోని ఒంటరివాడని ఎవరన్నారు
అహింసాపరమోధర్మ: కాదనిఎవరన్నారు
అన్నమింతపెట్టి ఆదరించేవారులేరని ఎవరుచెప్పగలరు
పున్నమినాటి చంద్రుని వెన్నెల ఆనందదాయకము కాదనిఎవరన్నారు
శశిరానమోడైనచెట్టుకు వసంతాన ఆకులుచిగురించవని చెప్పగలవారెవరు
దారిదోపిడీలుదొంగతనాలు లేవని ఎవరన్నారు
మనుషుల్లో మానవత్వంలేదని రూఢిగచెప్పగలవారు ఎవరు
వనితలు అవనినేలగలరని అన్ని రంగాలలో ప్రతిభను చూపగలరని కాదని ఎవరుచెప్పగలరు
నీతినిజాయితీనిలిపిన మానవుని నిండు మనసు లేదని ఎవరన్నారు
సత్యమేవజయతి కాదనగలవారెవరున్నారు

భావితరాలకు భవితనుచూపాలికాని 
ఎవరున్నారు ఎవరున్నారనివాపోయేకంటే
మేమున్నాము మేమున్నాము అని చెప్పేనాధులెవరున్నారు
ఉంటే ముందుకు వచ్చిభావితరాలకు బాటలు వేయండి
సత్యమేవజయతి ధర్మమేవజయతి
అంటూవిజయానికి సోపానాలువేయండి
మానవత్వం మోనముద్ర వేయకుండా
బావిపౌరులు ముందుకునడవండి!
           తరణికంటి సూర్యలక్ష్మి.
                        --------------
18
[26/10, 8:24 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం సీజన్ 2 నిర్వహించు కవితల మాలిక
తేది: 26-10-2021

అంశం: ఎవరన్నారు..??

పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి:9505152560
*********************** 

     శషభిషలు

అపోహల వారధి మీద
వాయువు వీచిన ఈలలు
ఆకాశ రామన్నలు
అలవోకగా సృజనాత్మక
ఆకతాయి చేష్టలూ...

మంచిని ప్రచారం చేసే కబుర్లకు
కాలం చెల్లిందేమి?
వంచన చేసే యుక్తులతో
దుష్ప్రచారాన్ని
అందంగా అలంకరించి
చక్కగా చంకలు గుద్ది
అవాకులు చవాకులు
విసిరేసుకొంటూ
అల్లరి వల్లరి చేసి 
చిల్లర మల్లర చేసేసి.......

నిట్ట నిలువుగా నిలదీసి అడిగితే
పెదవి కదపని మీ నైజాలు
ఎందుకీ ఆకృత్యాలు
అలా అగౌరవపరచమని
ఎవరన్నారు..??
     ***
      హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.
Veera Gudipally: ఎవరన్నారు
24102021
19.
* కవితాగానం సీజన్ 2 *
  అంశం :ఎవరన్నారు ?
   పేరు   :జక్కిడి వెంకటరెడ్డి .
         భువనగిరి .
   ***    ****   ***
 ఎవరన్నారు ?....నీలో నీవున్నావని !...
ఉంటే నిన్ను నువ్వు కనుగొనేటోడివి 
  కాలం కదిలిపోతున్న 
 మనసు మూగబోతున్న 
 నీ  నోరు పెగలట్లేదని అందరంటున్నారు 
ఇంకా నీవు బతికేవున్నావని గుర్తుచేస్తూ 
కాళ్ళు కదులుతున్నాయి ... 
కండ్లు చూస్తున్నాయి ...
అంతటా అచేతనం ...పీనుగా లాగ !
 నీవైనా అనుకున్నావా ?
ముసుగేసుకున్నావని నీ మనసుకి 
దానికేంతెల్సు అది  మనసుకదా !
దానికి పరుగెక్కువా 
 అన్నీ గొప్పలే ...
తప్పులను ఒప్పుకోదుకదా ?
అన్నీ ఊహలే ...అన్నీ గప్పాలే ...
డబ్బాలకు దబ్బున మురిసిపోతుంది 
నిక్కచ్చి మాటలకు నొచ్చుకుంటుంది ...
గిరిగీసుకొని గోరంతని కొండంతలు చేసుకుని 
మురిసిపోతుంది ...
 ఎవరన్నారు అసలు మనసుందని? 
ఆంతా అభూతకల్పనే ...
కేవలం అది అమూర్తమే .
  --- ఇది నా స్వంత రచన .
    జక్కిడి వెంకటరెడ్డి .
20.
కవితా గానం (సీజన్ -2)
అంశం : "ఎవరన్నారు?"
శీర్షిక :  "మంచి మానవత్వం.."
రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)

ఎవరన్నారు..!
మనుష్యుల మధ్య మంచి మానవత్వం దూరమయ్యాయని !? 
ఎవరన్నారు..?
మనుష్యుల మధ్య ప్రేమాభిమానాలు తగ్గి 
నేను,నాదే నన్న స్వార్థం పూర్తిగా హెచ్చిమీరిపోయిందని !?    
మొన్న కరోనా పరిస్థితుల్లో..
ఉన్నవాడు,
లేనివాడన్న బేధం లేక  
..లెక్కలేనంతమంది తోటివారికి సాయం చేయ లేదా?
ఉన్నంతలో .. 
తమకు చేతనైనంత లో ..
తోటివారికి సహాయం చేసి మంచిమానవత్వానికి ప్రతిరూపమై నిలిచిన వారెందరో !!
అభాగ్యులకు ,అన్నార్తులకు ..అన్న తేడా లేకుండా..
కరోనా బారిన పడి ఇక బ్రతకలేమేమోనన్న నిరాశతో నిలిచిన వారికి సైతం..
మేమున్నామంటూ సహాయం చేసిన స్వచ్ఛంద సంస్థలు ఎన్నో !? 
దైవానికి మారురూపాలై..
స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు..
వైద్య సిబ్బంది, పోలీసన్నలు , పారిశుధ్య కార్మికులు,
కష్టించి పని చేస్తూ..
తమ ప్రాణాలకు ,తమ కుటుంబ సభ్యుల ప్రాణాలకి ఇబ్బందులొస్తాయని తెలిసి కూడా ..
కరోనా రక్కసి తో అవిశ్రాంతంగా పోరుసల్పుతూ ..ప్రజల ప్రాణాలను కాపాడలేదా !?
వారంతా నేలపై నడయాడే మంచి మానవత్వానికి కనిపించే రూపాలే కదా !? 
ఇకనైనా సంపూర్ణంగా విశ్వసిద్దాం..
ఈ విశ్వం వున్నంతవరకు ..
మానవాళి శ్రేయస్సు కొరకు పాటుపడే దైవ స్వరూపాలు మనమధ్య వుంటాయని..
మంచిమానవత్వాలు మనందరి మనసుల్ని వీడని సుమగంధమై
ప్రకృతితో అనుబంధమై  
...అనునిత్యం ఈ సృష్టిని కాపాడే అద్భుతాలని !  

"మంచి మానవత్వం.."  అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.                   _ గొర్రెపాటి శ్రీను
21
వీరా గుడిపల్లి
***************
ఆరోహణ క్రమంలోనే అన్నీ జరగవు

నూటైదు సంవత్సరాల వయస్సు లో యువరాజయ్యాడు
ఓర్పు విజయం సాధించిందో
ఆ తీరే అలా ఉండిందో

కోరికలను జయించాడనుకోలేం
రాజర్షి కాదనలేం
యక్ష ప్రశ్నలెన్ని పరిష్కారించినా
వెంటెవడినీ తీసుకెళ్లలేక పోయాడు
అశక్తుడనలేం...ఆ శక్తి అతనికుంది

ధర్మానికి అంబాసిడరవ్వచ్చేమో గానీ
గీత నేరుగా వినడానికవకాశం దక్కలే
జూదానికే గాదు, వ్యూహాలు తెలియకున్నా
ఆఖరికి మిగిలిందతడే......

ఐదూళ్ళైనా చాలన గలిగాడు
హతః కుంజరా అని సత్యమే పలికాడు
వేరుపడని చోట
పెద్దోడిమాటే మాటన్నాడు

ధర్మం తప్పాడంటారా
అలా అనిపించిందంటారా
యెవరన్నారు ...ధర్మజుడతడు
ఆరోహణ క్రమంలోనే అన్నీ జరగవు
స్వర్గారోహణ సాక్షిగా  సత్యమది. 

అనుకుంటాం గానీ
అన్నీ అంతే
కాదని ఎవరన్నారు ???
యెవరంటారు....
..... *వీరా గుడిపల్లి*
22.
కవితా శీర్షిక :ఎవరన్నారు 

ఎవరన్నారు? 
మానవత్వం మౌనముద్ర వేసిందనీ.... 
సేవాభావం సేద తీరిందనీ... 

ముఖపుస్తకం నిండా   వికసిస్తున్న మానవత్వం
పత్రికలనిండా పరచుకున్న
మానవత్వం 
సమూహాలనిండా సందడి చేస్తున్నమానవత్వం
సంసారo లోముకుళిస్తూ 
సమాజంలోవికసిస్తున్న
మానవత్వం
 
 సంతోషంసంతాపం
సందర్బంఏదైనా శరవేగంగా... స్పందించే ఎమోజీలు సెల్ఫీల
సాక్ష్యంగా..... 
మానవత్వం 
పరిమళిస్తున్న మంచి రోజులివి

పెరుగుతున్నవృద్దాశ్రమాలు 
కరుగుతున్నబాoధవ్యాలు 
తరుగుతున్న 
పేగుబంధపు ప్రేమలు ..

ప్రేమ పంచే తీరికేలేకున్నా
పెడదారినపడుతున్నా....
మందలించేతీరికేలేకున్నా 
సంసారాన్ని సరిదిద్దే సమయమేలేకున్నా... 
సమాజాన్ని ఉధ్ధరించే
సమున్నతభావాలతో.. 
మానవత్వం పరిమళిస్తున్న మంచి రోజులివి 

పక్కనే పట్టెడన్నo పెట్టoడన్నా పట్టించు కోకుండా 
అక్కడెక్కడోఆకలి కేకలు వినిపిస్తున్నాయంటూ పరుగులు తీస్తూ.....  
అక్కడైతేనే మందమైన అక్షరాల్లో... ప్రతిబింబిస్తుందనీ ... 
అందoగాపెరుగుతున్న
సామాజిక సేవలు

పేరు కోసమైతేనేo 
ప్రేరణ కోసమైతేనేo 

మానవత్వం పరిమళిస్తున్న మంచి రోజులివి...

సేవాభావం పరిఢవిల్లుతున్న
మంచి రోజులివి
********శివునూరి లలితాకృష్ణ

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

పౌర్ణమి 052022 జాతీయ పతాకం

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ********************** కవివరుల జాబితా 1.కోరాడ నరసింహారావు గారు 2.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 3.జోషి పద్మావతి గారు 4.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 5.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 6.శివ చరణ్ నాయుడు తరాల 7.గొర్రెపాటి శ్రీ ను గారు 8.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు 9.డా.కమలా దేవి గారు 10.అపరాజిత్ గారు 11.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 12.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు 13.కవిత వెంకటేశ్వర్లు గారు 14.డా.బల్లూరి ఉమాదేవి గారు 15.డా.వేమూరి సత్యవతి గారు 16.బొప్పెన వెంకటేశ్ గారు 17.తిప్పా వఝల నరసింహ మూర్తి గారు 18.మద్ది పుల్లారావు గారు 19.టేకుమళ్ళ విజయ లలిత గారు 20.పిన్నక నాగేశ్వరరావు గారు 21.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 22.దారల విజయ కుమారి గారు 23.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు 24.పొర్ల వేణు గోపాల్ రావు గారు 25.సింహాద్రి వాణి గారు 26.వురిమళ్ళ సునంద గారు 27.తరణికంటి సూర్య లక్ష్మి గారు 28.తోట సులోచన గారు 29. వేదాంతం సురేష్ బాబు గారు 30.మన్నె లలిత గారు 31.గజవెళ్ళి శ్రీనివాసా చారి గారు ************************ 1 వైశాఖమాసం పౌర్ణమి కవితల పోటీకి :-  అంశం :- భ...

పర్ణశాల 27052022

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ***************** కవితా గానం సీజన్ 3 నేటి అంశం 27.05.2022 *పర్ణశాల* రాత్రి ఎనిమిది నుండి  తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆసమయంలో ఎలాంటి ఇతర స్పందనలు  తెల్పకుండా సహకరించగలరు. కవి వరుల జాబితా 1.ఆపరాజిత్ గారు 2.కవిత వెంకటేశ్వర్లు గారు 3.కోరాడ నరసింహారావు గారు 4.ఏడెల్లి రాములు గారు 5.వురిమళ్ళ సునంద గారు 6.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 7. కందూరి సుజాతా రాణి గారు 8.వేమూరి సత్యవతి గారు 9.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 10.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 11.తంగిరాల నాగ లక్ష్మి గారు 12.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 13.వీరా గుడిపల్లి 14..శివునూరి లలితా కృష్ణ గారు ************** 1 పర్ణశాల కఠోర దీక్షా సంపన్నులు రామ లక్ష్మణ సీతా తపోదనులు సత్పురుషులతో సీతామాత సాంగత్యం కడు రమణీయం రామలక్ష్మణులు అరణ్యవాసంలో తగు జాగరూకతతో నిర్మించుకొనిరి పర్ణశాల దుష్ట దుర్మార్గ పన్నాగంలో భాగంగా బంగారు మాయలేడితో రామలక్ష్మణులను దారిమళ్లించి రావణాసురుడను రాక్షసుడు సీతమ్మపై కన్ను మిన్ను కానని కండకావారంతో కామం ఎంత బలీయమైనదో అంతటి విధ్వంసానికి దారితీస్తుంది ఆ ద...