Skip to main content

అందని ద్రాక్ష 102021

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ 
వీరా గుడిపల్లి
************************
నేటి అంశం
అందని ద్రాక్ష 
27.10.2021
ఎనిమిది నుండి
తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో
స్పందించగలరు.
ఆ సమయంలో ఎలాంటి
ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.
❇️❇️❇️❇️❇️❇️
కవి వరుల జాబితా

1. శివునూరి లలితా కృష్ణ గారు
2.వీరా గుడి పల్లి 
3. కోరాడ గారు
4.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు
5. సునంద వురిమళ్ళ గారు
6. మొహమ్మద్ అఫ్సర వలీషా గారు
7.డా.ఆంజనేయులు గారు ఖమ్మం
8.కేశరాజు వెంకట ప్రభాకర రావు గారు
9.కవిత వెంకటేశ్వర్లు గారు
10. అపరాజిత రెడ్డి గారు
11. ఆళ్ళ నాగేశ్వరరావు గారు
12.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
13.డా.నాయకంటి నరసింహ శర్మ గారు
14.గొర్రెపాటి శ్రీను గారు
15.ఏడెల్లి రాములు గారు
16.డా. తంగిరాల నాగలక్ష్మి గారు
*********************
1.
అంశం :అందని ద్రాక్ష 

ప్రణాళికల పందిరి పై
పరిశ్రమల రెమ్మల్ని
పల్లవింపజేస్తూ
ఆశల వల్లరీ నై
నిన్నందుకోవాలని
ఎంతగా తపిస్తానో!!

కూడా వెంటబెట్టుకున్న
బడలికను నీ ఒడిలో వొదిలి
బద్ధకపు దుప్పట్లో
బుద్దిగా ముడుచుకొని మురిసి పోవాలని 
ఎన్ని కలలు కంటానో!!

అలారం మోత లేకున్నా 
ఫలారాలు తప్పనిసరి అంటూ 
పదినిమిషాలకో మారు మది గంటను మ్రోగిస్తూ మొదలెడతావు 

పనివారాల భారాన్ని తగ్గిస్తానని  ఊరకే ఊరిస్తావ్ కానీ 
వాయిదాల వడ్డింపులను
ఒక్కసారిగా ఎన్ని గుమ్మరిస్తావో!!!
బోనస్లనంటకట్టి బాబోయ్ అనిపిస్తూ...

ఆశాజీవినని నీకూ ముందే తెలుసు కాబోలు..

మళ్ళీ మళ్ళీ
నీ వైపు మళ్లేలా చేస్తావు

ఓ..ఆదివారమా!
విరామపు ఆరామమువని
ఆటవిడుపనీ నే ననుకుంటా గానీ
అంతా తూచ్
ఆస్వాదన లో అందని ద్రాక్షవే సుమా!!!

**********లలితాకృష్ణ
2.

అందని ద్రాక్ష
ఇది వీరా గుడిపల్లి కవిత
27102021
***************
ఒకరిచేతినొకరమలా
సుతారంగా నొక్కడం
ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం
కనీసం ఒకరినొకరం
ముసుకేసుకోకుండా మొఖమైనా చూసుకోవడం
(మనసు ముసుగంటే ఎలాగూ తీయము )

ఫేస్ మాస్క్ లేకుండా
తరగతి గదిలో తిరుగాడడం
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కే
మొదటి ప్రాధాన్యత నివ్వడం

అలలా ఎగరడం
అందరితో కలవడం
అమాంతంగా చేతులు కలపడం

తీరని ఆశేనా
అందని ద్రాక్షేనా

కరోనా...మనం పెట్టిన పేరు
మనకై మనం తెచ్చుకున్న .... ఉపద్రవం
..... వీరా గుడిపల్లి

3.

కవితాగానం :- "అందని ద్రాక్ష "
  కోరాడ నరసింహా రావు... !
    @ పరనిందాపరితృప్తి @
        @@@@@@@@
"అందని ద్రాక్షపండ్లు పుల్లన "
అనుకుంటే ఎలా.... !?
అందుకోగలిగి... అనుభవించినపుడే కదా... 
అవి పుల్లనో... తియ్యనో తెలిసేది.... !
అవి పుల్లనే ఐనా.... ఆరోగ్యానికి దివ్యౌషధం... !
అండనివి... మనం పొంద లేనివి... మనకు చెందనివన్నీ...
పనికిమాలినవని ఓ నింద వేసే సి.... మన లోపాలను అలా నెట్టేస్తూ... తృప్తిని నటించటమే 
మనిషి నైజమైపోయింది... !
కళ్ళు మూసుకున్న మనకే... 
చీకటి గానీ... ఈ జగానికి కాదు కదా.... !!
వివేకవంతులెప్పుడూ ఇలా... 
ఆత్మవంచనతో  నటించరు!
అవతలి గొప్పతనాన్ని గ్రహించి 
చివరివరకూ ప్రయత్నించి... 
సాధించి... అనుభవించి... ఆ 
అనుభూతిని  ఈ ప్రపంచానికి 
పంచుతారు !!
అసమర్దులే... తమకు చేత గాక... పరనిందలతో   పరి 
తృప్తి చెందుతారు... !
        *****************
       ..... కోరాడ.
4.
కావ్యగానం
తేది27102021,బుధవారం.
అంశం:అందని ద్రాక్ష.
శీర్షిక:వ్యర్ధప్రయత్నమే...కాని!
అందని ద్రాక్ష పుల్లనే...
కాని ప్రయత్నము సాగాల్సిందేగా....
అందదని అందుకోలేమని ద్రాక్షని నిందించడమా...
అందుకోవాలని ఆశగా ఆబగా ఎదురుచూస్తాముగా...
ఎగిరెగిరి అందుకోవాలని తాపత్రయం పడతాముగా...
అలసిసొలసినా ఆపకుండా ప్రయత్నిస్తామే....
వ్యర్ధప్రయత్నమే....గాని....గాని....
ఆగదు ప్రయత్నం. ...
చిక్కినా చిక్కకపోయినా...
ఆశచావదుకదా....
మరల మరల ప్రయత్నించాల్సిందేకదా ...



బ్రతుకంటే ఇంతేనేమో....
బ్రతకాలంటే పరుగులు పెట్టాల్సిందే....
ఎగరాలి ఎగరాలి అందనిద్రాక్ష అందుకోవాలే....!

ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995.
5.
[27/10, 8:54 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:27-10-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: అందని ద్రాక్ష
******************
నీ చుట్టూ అల్లుకున్న ఆశల పందిరి
ఆనందాల సుమాలతో నా దోసిలి నింపుతుందని 
రోజులను నిరీక్షణా తోరణాలు చేసి
ఎద గుమ్మానికి కడతాను..

నిత్యం కిటికీలోంచి తొంగి చూసే నులివెచ్చని సూర్యకిరణాలతో విన్నవించుకుంటా
గిలిగింతల మాధుర్యాన్ని
నా కోసం దాయమని...

రెప్పలపై వాలిన నిదుర పిట్టను
కలవరింతలు లేకుండా 
హాయిగా బజ్జోమని చెబుతా...

రోజూ ఆఫీసర్ సింహంలా గర్జించే కాలం వంక
ఉపాయంతో గట్టెక్కిన కుందేలులా చూస్తా..

భళ్ళున తలుపులు తోసుకుని వచ్చిన ఉషోదయంలో
కొండవీటి చాంతాడంత
పనుల చిట్టా
నా కోరికల పాలపొంగుపై
కసిగా నీళ్ళు చల్లుతుంటే..

అందని ద్రాక్షలా మురిపించిన ఆదివారం
నా వంక జాలిగా చూస్తుంటే
ఆశ వీడని మనసు 
వచ్చే రవి వారం కోసం
మనసంతా కళ్ళు చేసుకొని చూస్తుంది...

 *వురిమళ్ల సునంద, ఖమ్మం*
6
అంశం....అందని ద్రాక్ష 
శీర్షిక....రెప్ప దాటని కన్నీళ్ళు 

పగలూ రాత్రి తేడా
 తెలియని కష్ట జీవులు...

అనురాగం ఆప్యాయత లకు
ఆమడ దూరాలు....

 మయూఖ కౌముదులను
 ఆస్వాదించ లేని ఆస్వాదన
 కరువైన నిస్సహాయులు.... 

కుహు కుహు   కోయిల
 రాగాలాపనలు లేని
 నిస్సత్తువ జీవితాలు....

పల్లె ప్రకృతి దృశ్యాల
 కెప్పుడూ పరగడుపులు ...

పండుగలకు పబ్బాలకు
పరుగున రాలేని నిరాశా పరులు...

కొదవ లేని జీతాలు 
గంతకు తగ్గ బొంత 
జమా ఖర్చులు....

మాతృమూర్తుల లాలింపులు 
లేని ఖాళీ ఉయ్యాలలు...

అన్నిటికీ ముఖ
పుస్తకాలే వారధులు...

అందని ద్రాక్ష పళ్ళు  
రెప్ప దాటని కన్నీళ్ళు ...
 
విధిరాత చేతిలో ఉలి పోట్లు 
ప్రవాసాంధ్రుల పాట్లు.....

మొహమ్మద్.అఫ్సర వలీషా.
ద్వారపూడి (తూ గో జి ).
7.
కష్టజీవులు కార్మికులు

రాత్రింబగళ్ళు శ్రమతో నవోదయ పద్ధతులను సృష్టించే దీరులు

ప్రజాశక్తి ప్రజాశక్తి
రైతులు కూలీలు కార్ఖానా లో పనిచేసే కార్మికులు

బొగ్గు గనుల్లో చీకటి సూర్యులు
ఓడ కళాసీ లు

నదుల్లో సముద్రాల్లో
తుఫానులో సునామీలో
పొద్దంతా గంగ తల్లికి
దండాలు పెడుతూ

జల పుష్పాలను పట్టే
జాలర్లు అన్నలు మీరు
అడవి గుండెల్లో పుట్టినిల్లుగా చేసుకొని జీవనం గడిపే 

పోడు బతుకుల ఆదివాసీలు
నాగరికతకు దూరంగా బ్రతికే కొండరెడ్లు గోండు గదబ కొల మీ లు అడవి తల్లి ఒడిలో సంపదల సృష్టికర్తలు

మిత్రమా వీరి గురించి ఆలోచించు వీరిని ఉన్నతి 
కరించే మార్గాన్ని అన్వేషించు
శతాబ్దాల తరబడి సాగిపోతున్న కష్టజీవులు కార్మికులు కర్షకులు రైతు కూలీలు సన్నకారు రైతులు

అందరూ అసలైన ఈ దేశపు ఉత్పత్తిదారులు

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 770

8.

కవితా గానం...27102021
నేటి అంశం...అందని ద్రాక్ష
శీర్షిక............. పుల్లన
***********************
మానవ జాతి మనుగడ మహత్తర మహోన్నత
మైన, సంక్లిష్ట సంభావనా పూరిత సంవేదనా శీలి
దాని సాధన , సాధ్యా సాధ్యాలను సమీక్షించి
సమస్యలు సంఘర్షణలకు ఉచిత సమాధానం...

సముచిత సమోన్నత అధ్యయనం అభ్యాసము
సమాజ పరిణామాన్ని సమతుల్యం చేసే ప్రక్రియ
ప్రభావాల ప్రభావం ప్రభోదించే ప్రభోదాలు
ఫలాల రసాస్వాదనలో తలమునకలేస్తే


నిస్వార్థ నిరాపేక్ష నిష్కామ కర్మయోగం పల్లవించ
ప్రమాణ పూరిత పురోభివృద్ధిలో ప్రయోజనాలే
ప్రభవిస్తే ప్రమోదాలతో ప్రజ్వరిల్లే ప్రమిదలు
ప్రసరించే ప్రకాశం  మాపును పార ద్రోలితే 

ఆశలు ఆకాంక్షలు అద్భుతమైన ఆవిష్కరణలకు
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల
మూలపుటమ్మలే ములాధార మావి అయితే
కోరికలు కొరివినే కౌగలించుకొని కల్మషం కడిగేస్తే

అందని ద్రాక్ష అర్థం మారి అందరి ఆత్మగౌరవం
అందలాలలో ఆనందడోలికల్లో పరమానందం తో, పరమాత్మ సంవిధానంతో సంధాన మైతే
పారలోకిక పారమార్థిక అలౌకిక ఆనందమే కదా

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
27102021
9.
[28/10, 9:26 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం సీజన్ - 2
28.10.21..గురువారం
అంశం:: అందని ద్రాక్ష
శీర్షిక:: అందితే తియ్యన

కాలంతో పోటీపడి
ఇష్టంతో కష్టపడి
చదువే లక్ష్యంగా
ఉన్నత స్థితే గురిగా
డిగ్రీలు చేత బట్టుకొని
ఉద్యోగము వస్తుందని
హాయిగా జీవించ వచ్చని
తల్లిదండ్రులను బాగా చూసుకోవచ్చని
అనుకుంటే ఉద్యోగం
అయింది అందని ద్రాక్షే
దేవుడు పెడతాడా పరీక్షే

కడుపు చేత పట్టుకొని
కాయ కష్టం నమ్ముకొని
భార్యాపిల్లలతో వలసదారిపట్టి
కూలీ పనులు చేపట్టి
అంతో ఇంతో దాచిపెట్టి
పిల్లల భవిషత్తుకై
పాడుబడుతుంటే
ప్రకృతి వైపరీత్యాలు
అవిరైపోయే ఆశలు
కలలన్ని అందని ద్రాక్షయ్యె
పిల్లల భవిత చీకటయ్యే
అనుకున్నవి జరగవు
అదే అందని ద్రాక్ష
మన న్యాయ ధర్మాలే మనకు రక్ష!!
                  కవిత వెంకటేశ్వర్లు
పై కవిత నా స్వీయ రచన అని
హామీ
10
[28/10, 9:26 pm] Aparajith: అందని ద్రాక్ష!

అందని అందళాల కోసం పెంపర్లాడకు 
లక్ష్యం ఏదైనా ఆలోచించి అడుగేయ్ 
నీ బలాలు బలహీనతలు బేరీజు వేసుకో 
నీ అతి సన్నిహితుల సలహా తీసుకో 
గెలుపు ఓటముల దోబూచులాటలో 
విజయం వరించెందుకు తహ తహ అంటే 
నిన్ను నీవు మార్కెట్లో అమ్ముడు పోవాలి 
అంటే మార్కెట్లో నీ విలువ ఎంతో తెలుస్తుంది!
సామాజిక విలువలు డబ్బుతో ముడిపడ్డాయి 
నీకు ఏ రంగంలో అభిరుచి ఉన్నదో 
అందులో నీ ప్రతిభకు ఎంత విలువ ఉందో అంచనాకు రావాలి 
గాలి మేడలు అలవోకగా తేలిపోతాయ్ 
అందలేని అందలాలకై పాకులాడితే 
తల వేలాడెసుకుని ఇంటి దారి పట్టాల్సిందే!

అపరాజిత్ 
సూర్యాపేట
11.
[29/10, 7:45 pm] Aalla Nageshwar Rao Poet: అంశం:  ఆన్లైన్ పాఠాలు
శీర్షిక;"" అందని ద్రాక్ష ""

అనుకోని అతిథిగా వచ్చిన
కల్లోల కరోనా రాకతో
అన్ని వ్యవస్థలతో పాటు విద్యావ్యవస్థ కుంటు పడింది
విద్యాసంస్థలు మూతపడేలా చేసింది!
విద్యా సంవత్సరం అర్ధభాగం ముగిశాక
 ఆన్లైన్ తరగతులంటూ ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా తిరిగి ఆరంబించింది విద్యాలయాలను
భయబ్రాంతులకు గురి చేసింది
విద్యార్థుల తల్లిదండ్రులను!
మొన్నటి దాకా సెల్ఫోన్ వాడకం
నివారణకు కృషి చెసిన పెద్దలకు
నేడు పిల్లలకు దానిని కొనివ్వక 
తప్పని పరిస్థితులు!
నల్లబల్లకు స్వస్తి చెప్తూ
శుద్ధముక్కకు వీడ్కోలు.చెప్తూ
ప్రత్యక్ష గురుబోధనకు.తిలోదకలిస్తూ
పరోక్ష బోధనల కు.శ్రీకారం చుడుతూ
నేర్పే విజ్ఞాన తరగతులు
బీదవారికి అందని ద్రాక్షే!
కాలంతో.పాటు మారాలంటూ
సంకేతికను అందిపుచ్చుకోవాలంటూ
మాటలు చెప్పడం తెలికే
ఆచాటించడమే.అసాధ్యం
దానిని సుసాధ్యం చేసేందుకు
కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ జరిపించి
ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు సౌకర్యాలు కల్పించి
ఆర్ధికంగా వెనుకబడిన  విద్యార్థులకు ఉచితంగా లాప్ టాప్ లు అందించి
ఆన్లైన్ తరగతుల నిర్వహణకు
తగిన వనరులు  సమకూర్చి
విద్యావ్యవస్థను పునర్నిర్మాణం గావించాలి
విద్యావ్యవస్థ బలోపేతానికి 
ప్రభుత్వం కృషి చేయాలి!
...........................................
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
సెల్ నెంబర్.7416638823
......................................
ఫై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
12
[29/10, 8:25 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం సీజన్ 2 నిర్వహించు కవితల మాలిక

అంశం: అందని ద్రాక్ష

       *తియ్యన*

ఎప్పటికప్పుడు  అప్డేట్ అయ్యే 
నవీన కాల జ్ఞానం
పాత వెర్షన్లోని పద భావాలన్ని
కొత్త రుచులను పరిచయం చేసుకొంటున్నట్లు
జిహ్వా చాపల్యం చంచలమైంది!

అందలాలు అందరూ అధిష్టించనంత మాత్రం
ఆశ అడియాశయై పోయిందనీ కూడదు!

ఇది లభ్యం కాకుంటే మరోకటి
అవకాశాల వెల్లువ ఎగసిపడుతుంటే 
మధురమైన భావనలో 
మైమరచిపోయి
కొత్తదనం పుంతలు తొక్కి 
మధురాతి మధురంగా చవి చూడగలం!

మరో పార్వంలో...
ఆశలు చేదెక్కినప్పుడు కలతపడి 
విసిగిపోయి బరువెక్కిన హృదయంతో నిట్టూర్చి ఇక ఇంతే కదాని ఈసురోమనుట
పులుపెక్కిన నైజం!
       ***
         హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
13
[29/10, 8:34 pm] +91 94413 57400: కవితాగానం నిర్వహించు కవితల కదంబం 
డా.నాయకంటి నరసింహ శర్మ

అంశం.అందని ద్రాక్ష.

కొలిక్కి రాని సమస్యలు అందని ద్రాక్ష లే కదా
ఉట్టికెగరలేక స్వర్గానికి నిచ్చెన లు వేయడం ,
నేటి విద్యాధికులైన యువకులకు సర్కారు నౌకరీ 
అందనిద్రాక్షేకదా
సమాజసేవకులకు చేతిలో దమ్మిడీ లేని వారికి 
ఎన్నికల్లో గెలవడం సర్పంచ్ గిరీ వెలగబెట్టడమూ అందనిద్రాక్షేకదా
కనీసం సైకిల్ లేని వారికి 
హెలికాప్టర్ లో కలలు గనే యువతి భార్య రావాలనుకోవడం అందనిద్రాక్షేకదా.
పూరిగుడిసె లేనివారికి ఆకాశ హర్మ్యాలు అందనిద్రాక్షేకదా.


హామీపత్రం
ఈకవిత స్వీయరచన 

డా.నాయకంటి నరసింహ శర్మ
14
[29/10, 8:47 pm] Gorrepati Srinu Garu Poet: కవితా గానం (సీజన్ -2)
అంశం : అందని ద్రాక్ష !
శీర్షిక :   "అందని ద్రాక్ష !"
రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)

రైతన్న ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే..
తీరా పంట మొత్తం ఇంటికి చేరాక..
అమ్మబోతే మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోతే..
దళారీలు పన్నిన మార్కెట్ మాయాజాలంలో 
రైతన్నకి గిట్టుబాటు ధర ..అందని ద్రాక్షానే!!
విద్యార్థన కోసం తమ పిల్లలను తల్లిదండ్రులు
ప్రైవేట్ పాఠశాలకు పంపితే ..
కాసుల సంపాదన కోసం విద్యా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న
పాఠశాలల యాజమాన్యాలు పన్నిన ఉచ్చులో విద్యావ్యవస్థ చిక్కుకోగా ..
నాణ్యమైన విద్య ను ఆశించే విద్యార్థులకు విద్య ..అందని ద్రాక్షానే !!
సామాన్యుడు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కితే ..
అక్కడంతా న్యాయానికి చోటు లేక డబ్బున్న వాడి మాటే చెల్లుబాటవుతుంటే..
సామాన్యుడు ఆశించిన న్యాయం..అందని ద్రాక్షానే !!



"అందని ద్రాక్ష !"  అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను   _ గొర్రెపాటి శ్రీను
15
[29/10, 9:41 pm] Lalita Sister: కవితా గానం
ఏడెల్లి రాములు
అంశం*అందని ద్రాక్ష
శీర్షిక*రోజా పూలు

నా దేశం సామాజిక దేవాలయం
రాజ్యాంగం ప్రజలకు జీవన వరం

చట్టం అందరికీ సమానం
పీఠిక లో నుడివిన అక్షరం

ఉన్నోళ్ళకు వరమై
లేనోళ్ళకు శ్రమజీవులకు దూరమైన
పాలనా వ్యవస్థ
ఏనాడు అందేనో పౌర రక్షగా

ఉన్నత చదువులూ ఉట్టిమీద రేట్లు
ఫీజుల చెల్లింపు లో సామాన్యులకు
అందని పాట్లు
రోగాలకూ అంత్రాల లెక్క ఖరీదు చిట్ట
వైద్యమూప్రాణాలతో చెలగాటంనట్టింట
గరీబోళ్ళకు దుఃఖమే ఆత్మీయ చుట్టం

దోచుకునేటోళ్ళకు దొరల దారులు
కొల్లగొట్టేవారికి బహు మర్యాదలు

ఏమి కాలం దాపురించెను
మంచి కొంచెమైనా బతుకదాయెను

కబ్జా కోరల్లో బలహీనుల భూములు
ఆగేదెపుడో  దూర్తుల పన్నాగాలు

మతం గుప్పిట అమానవీయ అరాచకం
నిజాలు నిర్భయంగా నిలబడలేని
దౌర్భాగ్యం

మంచికి మాలలేసే రోజెపుడో 
నిజం రోజాలై పూసెదెన్నడో
అరాచక శక్తుల అవినీతి ఆగినప్పుడు
సామాన్యుడి అంతరాత్మకు
ప్రశాంతత
నా దేశం ఆనాడే శాంతి నివాసం
పూలగుచ్చమై పూయనీ సకల మతాల సారం

ఏడెల్లి రాములు ✍️
ది*29*10*2021(21*28)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
16.
అంశం   అందని ద్రాక్ష
శీర్షిక: అందుకుందాం
అందుకుందాం ద్రాక్ష గుత్తి లాంటి విజయ సమూహాన్ని
సులభమైన బాట వేసి
 విజయ లక్ష్మిని సేవించి 
అందుకుందాం
అందనిది అందుకోవటానికి కావాలి అభ్యాసం
అందనిది అందుకోవటానికి చెయ్యాలి ప్రయత్నం
చిన్న పిల్లవాడు  అనుకున్నది పొందడానికి పడే శ్రమ చూస్తే అర్ధమవుతుంది ప్రయత్నం అంటే 
అసాధ్యం లో అ తీస్తే సాధ్యం
ఇష్టమైన దాన్ని కష్టపడి అందుకుందాం
అందని ద్రాక్ష పండు పుల్లన అనే
సామెత లా మన లక్ష్యాన్ని వదిలెయ్యద్దు
సాధన  సాగించాలి సాధించాలి 
స్ఫూర్తి కలగాలి మహానుభావుల చరిత్రలతో
దైవ కృపతో పొందలేనిది ఏమీలేదని 
నమ్మాలి
ఆనందాన్ని అందుకుందాం
మానసోల్లాసం పొందుదాం
పరమానందం లో పరవశిద్దాం
కవి కి లేదు హద్దు
మానస వీధిలో విహరించేందుకు
అన్నీ అందించేందుకు అమ్మ ఉండగా
మనుజులకేల మనోవేదన
నిరాశను  నిర్మూలిద్దాం
పుణ్య మూర్తుల జీవితాలను
 ఆదర్శంగా  నిలుపుకుందాం
జీవన సోపానాలు అధిరోహిద్దాం
పరమ పథాన్ని చేరుదాం
నా స్వీయ రచన
డా. తంగిరాల నాగలక్ష్మి

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...