Skip to main content

శైలపుత్రి 2021


నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
**********
కవివరుల జాబితా

మొదటి రోజు పద్యం
1.తరణికంటి సూర్య లక్ష్మి గారు
2.నాగలక్ష్మి గారు
3.డా. బల్లూరి ఉమాదేవి గారు
4.సింహాద్రి వాణి గారు
4/54.నాయకంటి నరసింహ శర్మ గారు
5.లలితా కృష్ణ గారు
*****************
రెండవ రోజు గేయం
****************
6.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
7.కోరాడ గారు
8.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
9.శివునూరి లలితా కృష్ణ గారు
10.వురిమళ్ళ సునంద గారు
11.మన్నె లలిత గారు
12.డా.నాయకంటి నరసింహ శర్మ గారు వనపర్తి
13.కవిత వెంకటేశ్వర్లు గారు
14.నాగలక్ష్మి గారు
15.నాశబోయిన నరసింహగారు 
16.తరణికంటి సూర్య లక్ష్మి గారు
*****************
మూడవ రోజు
వచన కవిత
*****************
17.శివునూరి లలితా కృష్ణ గారు
18. నాశబోయీన నరసింహా గారు
19.KV ప్రభాకర్ రావు గారు
20.తరణికంటి సూర్య లక్ష్మి గారు 
21.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
22.సునంద వురిమళ్ళ గారు
23.కోరాడ గారు
24.ఆళ్ళ నాగేశ్వర్ రావు గారు
25. నాగలక్ష్మి గారు 

*********************
నాల్గవ రోజు
****************
26.డా.కమలా దేవి గారు
27.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
28.కోరాడ గారు 
29.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
30.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
31.మద్ది పుల్లారావు గారు
32. సునంద వురిమళ్ళ గారు
33. కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 
****************************
ఐదవ రోజు స్వేచ్ఛా ప్రక్రియ

34.కోరాడ గారు
35.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
36.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
37.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
38.నాశబోయిన నరసింహ గారు
39.శివునూరి లలితా కృష్ణ గారు
40.కవిత వెంకటేశ్వర్లు గారు
41.మన్నె పిన్నక లలిత గారు
42.పిన్నక నాగేశ్వరరావు గారు
43.సింహాద్రి వాణి గారు
****************************
ఆరవ రోజు
44.మద్ది పుల్లారావు గారు
45.కోరాడ గారు
46.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
47.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
48.తరణికంటి సూర్య లక్ష్మి గారు
49.నాగ లక్ష్మి గారు
50.తాతపూడి సోమశేఖర శర్మ గారు
51.మన్నె పిన్నక లలిత గారు
52.వురిమళ్ళ సునంద గారు
53.శివునూరి లలితా కృష్ణ గారు
54.పిన్నక  నాగేశ్వరరావు గారు
55.నాశబోయిన నరసింహా గారు
56.కవిత వెంకటేశ్వర్లు గారు
57.వురిమళ్ళ సునంద గారు
58.గొర్రెపాటి శ్రీను గారు
59.సింహాద్రి వాణి గారు
60.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
**********
ఏడవ రోజు
61.తరణికంటి సూర్య లక్ష్మి గారు
62.ఆపరాజిత్ గారు
63.కోరాడ గారు 
64.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
65.డా.బల్లూరి ఉమాదేవి గారు
66.దోసపాటి వేంకట రాంచంద్రారావు గారు
67.మద్ది పుల్లారావు గారు
68. మన్నె పిన్నక లలిత గారు
69.పిన్నక నాగేశ్వరరావు గారు
70.కవిత వెంకటేశ్వర్లు గారు
71. ఆళ్ళ నాగేశ్వరరావు గారు
72. నాశబోయిన నరసింహ గారు
73.
74.కోరాడ గారు
75.మన్నె పిన్నక లలిత గారు
76.డా.ఆంజనేయులు గారు
77.వురిమళ్ళ సునంద గారు
78.సింహాద్రి వాణి గారు
79.ఏడెల్లి రాములు గారు
80.గొర్రెపాటి శ్రీ ను
81.నాన
**************

1.
నవరాత్రుల్లో
నాలుగో.అవతారం
గాయ త్రి మాత
దివ్యదర్శనం!


2.
మూడు పూటలా
గాయత్రి స్మరణం
పుణ్య ప్రాప్తం
మానవజన్మకు వరం


3.
విశ్వామిత్రునిచే 
పూజింపబడిన
ఆదిదేవత
గాయత్రీమాత!


4.
గాయత్రి మననం
మనుగడకు.మార్గం
గాయత్రి జ్ఞానంతో
జన్మధన్యం!


5.
త్రిలోక.పాలిని
గాయత్రిదేవి
త్రిలోక పూజిత
గాయత్రీమాత!

..
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు....జిల్లా
ఆంధ్రప్రదేశ్.....రాష్ట్రం
చరవాని సంఖ్య; 7416638823
...........................................
పై నానీలు నా స్వీయారచనేనని.హామీ ఇస్తున్నాను.
[10/10, 8:32 pm] Korada: కవితాగానం శరన్నవరాత్రులు 
అంశం :- (గాయత్రి)వచనకవిత
కోరాడ నరసింహా రావు !
*అన్నిమంత్రముల.....
         ....... కాది మంత్రము !*
     *******************
శరన్నవరాత్ర  మహోత్సవ
ములలో... మూడవరోజున ఆరాదింతుము... అమ్మను 
మాత గాయత్రీ గా.... !

పంచభూతములే....ఐదు
ముఖములుగా...సకల చరాచర జగత్తు నంతా అమ్మ 
వ్యాపించి ఉన్న అనంత శక్తి !

అన్ని పూజలకు, వ్రతములకూ 
సకల మంత్రజపానుష్టానము లకును,తొట్ట తొలుత గా... పఠించ వలసిన ఆదిమంత్ర మీ గాయత్రి...!

యోగులు...ఋషులు,తాపసు లకంతా... నిత్యానుష్టాన మహా మంత్రమిది... !

ఆర్త త్రాణ పరాయని అమ్మ !
ఆశ్రయించిన వారిననువ్రహించే 
తీరు !అన్నదాత,ఆరోగ్యదాత 
జ్ఞానదాత, ఐశ్వర్య ప్రదాత !
సకల పాప హరిణి గాయత్రి!!

ఆత్మ శుద్దితో ఆరాధించి.... 
అమితానందము నందుదము !
అష్టైశ్వర్యభోగభాగ్యములసుఖజీవనమే బొందుదము...!!
       ***************
       ...... కోరాడ.
[10/10, 8:42 pm] +91 99373 80136: కావ్యగానం(సీజన్2)
తేది:10102021,ఆదివారం
అంశం:లలితాదేవి.
శీర్షిక:శ్రీచక్రవాసిని.
శ్రీచక్రవాసిని  శ్రీలలితాదేవియే నమః
అమ్మా లలితాంబికాదేవి
చల్లనితల్లివి చల్లగ కాపాడగరావమ్మా!
దీనులము హీనులము మమ్మాదరింపగరావమ్మా!
జగన్మాతవు
జగ్ధాత్రివి
జగన్మోహినివి
జగదాంబికవు
ఏమని పొగడదు నీ లీలలు
ఏమని కొలచుదు నిన్ను
శ్రీచక్రవాసినివి !శ్రీలలితాదదేవివి!
కరుణించగరావా!
కటాక్షవీక్షణములతో కావవే!
కళ్యాణి!కామక్షి!కమలాక్షి!
దుష్టసంహారిణివి
దుర్మాంధులను  దునుమాడగరావవే!
దయాశీలివి దాక్షాయణివి
మమ్ము దయతో బ్రోవగరావే
తల్లి శ్రీలలితాదేవి!నమోనమః!

ఇది నా స్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995.
[07/10, 7:41 pm] Lalita Sister: 🌹🌹🌹🌹🌹🌹

*కవితాగానం సమూహం* *లోని* *ఆత్మీయులకు*
*నమస్సులు*
🙏🙏🙏🙏🙏🙏

మనమంతా....
*శరన్నవరాత్రులలో అమ్మను ప్రక్రియల ప్రసూనాలతో అర్చిద్దాం...*

అమ్మవారి దివ్య అలంకారాలలో 

*తొలిరోజు అనగా నేడు *శైలపుత్రి ని* *పద్యపారిజాతాలతో సేవిద్దాం.......*

*(నేడు  పద్యాలు మాత్రమే*)*


సమయం
ఎప్పటిలాగే.....
*8pm to 9:30pm*

ఎనిమిది నుండి తొమ్మిదిన్నర లోపు పంపగలరు.

🌹🌹🌹🌹🌹🌹
1
[07/10, 8:24 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్2 ) 7/10/2021 గురువారము
శీర్షిక:-  శైలపుత్రి

సీ!  నవరాత్రు లొచ్చెను  నవవిధ రూపుల
మనతల్లియరుదెంచె  మనకు జూప

శైలపుత్రిగవచ్చె  సంతోషాలనుదెచ్చె
హిమవంతునికుమార్తె  యిలను వెలసె

నందివాహనముపై  నందాలభరిణిగ
దర్శనమిచ్చెను  దయనుచూపి

అమ్మను పూజించ  ఆనంద మొందగ
భక్తితొగొలచిన  ముక్తి దొరకు

ఆ!  తల్లికిపులగమును  తగురీతి నందించి
హారతులనుబట్ట  అనువుగాను
కోరి వరములన్ని  కొరతలేకిచ్చును
తల్లికెపుడు మొక్కు  తలను వంచి!
           తరణికంటి సూర్యలక్ష్మి.
                   ------------
2
[07/10, 9:11 pm] Lalita Sister: పాడ్యమిన శైలపుత్రిగ  పార్వతమ్మ
నిచ్చు శుభములు భక్తికి మెచ్చు నమ్మ
కొలువు తీరిన దమ్మరో కోర్కె తీర్చ
అమ్మ అక్షరాలహారము నాద రింపు 

శరదృతువునఆహ్వానించశారదాంబ 
 బాల గావచ్చె నుజనని  ప్రభలు నింప
భక్తి యుక్తుల సేవింప శక్తి నొసగు
బ్రహ్మమౌ నీవు శివకరీ పరమునిమ్ము
3
[07/10, 9:30 pm] Balloori Umadevi Poetess: కవుల వేదిక
డా బల్లూరి ఉమాదేవి
అంశము: శైలపుత్రి

ఆ.వె: దక్ష సుతవు నీవు దాక్షాయణీ దేవి
       దగ్ధమైతి వపుడు దక్షునింట
         హైమవతిగ పుట్టి హరుని సేవించుచు
        శంకరు సతి వైతి శైల పుత్రి.

కం:అమ్మా పార్వతి మాతా
గొమ్మాసేవలుజవమున కూరిమి తోడన్
రమ్మా వరములు మాకిట
నిమ్మావేడెదమునిన్నునెప్పుడు మదిలో
4
[07/10, 9:34 pm] Siimhadri Vani Poetess: కవితా గానం
సీజన్ 2
7-10-2021
గురువారం

సీ.నవరాత్రులందునా నవ్య శోభల వెల్గు
పాడ్యమి తిథియైన ప్రధమ దినము
శైల పుత్రిగ తల్లి సకల జగము గావ
నంది వాహనముపై సుందరాంగి
చేత త్రిశూలము చేకొని వచ్చెను
భక్తుల బ్రోవగ బాధ తీర్చి
అమ్మను కొలువగా నన్నిటా విజయమ్ము
నలవోక గకలుగు నవని ప్రజకు

ఆ.వె.అమ్మ ప్రజల వినతి నాలకించి యెపుడు
మాకు తోడు నిలచు మాత నీవు
వేడుకొనగ నిన్ను వేగమే రక్షించి
శక్తి యుక్తులిచ్చు శక్తి నీవు

రచన:--సింహాద్రి వాణి

విజయవాడ
5
నవరాత్రుల వేడుకలో 
నవవిధరూపముల నాది నందీశ్వరు పై
స్తవముల గొను శైలతనయ 
*కవితాగానమున* పద్య కవితల గొనుమా!!


శ్రీనగజాతవే ధరణి చిన్మయరూపిణి శంభు రాణి హృ
న్మానసమందు నిల్పితిని మంగళదాయిని మంజువాణి నా 
గానపుస్తోత్రముల్ సతముగైకొని కావుము శాoకరీ ధరన్ 
నీనగు మోమునన్ దయను   నీరజ నేత్రి ఘటింపుమా యుమా !


అమ్మా!యభయమ్మునిడవె 
యిమ్మహిలో నసుర మూకలింకించగ నీ 
విమ్మా శక్తిని ముదితకు 
క్రమ్మెడు కష్టపు మొయిళ్ళు క్రమ్మరు నటులన్


**********లలితాకృష్ణ
***********08*10*2021****----

రెండవ రోజు పాటలు 

6
[08/10, 8:01 pm] +91 6281 697 982: బాలా త్రిపురసుందరి 08102021
****************************
బాలా త్రిపురసుందరి 
అభయ హస్త ధారిణి ||బాలా||

మనో క్లేష నివారిణీం
కామ క్రోధ లోభ మోహ హరణం ||బాలా||

బాలా త్రిపురసుందరి
భవ బంధాల శోషిత
త్రిపురాల పోషిత
త్రి గుణాత్మక రాజితా  ||బాలా||

బాలా త్రిపురసుందరి
భవ్య మైన రూపసి ||బాలా||

భండాసురుని పుత్రులు
ముప్పది మంది కూలిరి
వేసినావు ఒకే ఒక్క బాణం 
అర్ధ చంద్రాకారం ||బాలా||

బాలా త్రిపురసుందరి
హంసల రథం ఎక్కినావు
ప్రాణ శక్తి ఇచ్చినావు  ||బాలా||

బాలా త్రిపురసుందరి
నిను భక్తి తోడ పిలువ
ఆయుష్షును ఇచ్చినావు  ||బాలా||

బాలా త్రిపురసుందరి
అష్టైశ్వర్యాల నిచ్చి
అజాతశత్రువునే చేసినావు  ||బాలా||

తన్నో బాలా ప్రచోదయాత్
పాహిమాం పాహిమాం పాహిమాం

స్వీయ రచన ::::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.08102021
7
[08/10, 8:10 pm] Korada: కవితాగానం :దసరాఉత్సవాలు 
నేటి అంశం :-  గీతరచన 
      ( బాలా త్రిపుర సుందరి )
    కోరాడ  నరసింహా రావు... !
       *****************
పల్లవి :-
దేవీ నవరాత్రోత్సవాలలో..... 
పాడ్యమి మొదలుగా దశమి వరకూ... ఆచరించు అతి ముఖ్యమైన పూజ... బాలా త్రిపుర సుందరీ పూజ... !!
         "దేవీ నవరాత్రులలో "
చరణం :-
భండాసురుడను రాక్షసుని సంహరింపగా అమ్మవచ్చెను 
ఆతని ముప్పది మంది కుమా రులు అడ్డుతగిలినారు... !
బాలురను జంప ఆ అమ్మమన సు అంగీకరించలేదు... !
దనుజులజంపక తప్పనిస్థితిలో 
అమ్మ మదినుండి అవతరిం చెను...తొమ్మిదేండ్లబాలికరూపు న బాలాత్రిపురసుందరీ ... !
బాలా త్రిపుర సుందరీ... !!
         " దేవీ నవరాత్రోత్స.... "
చరణం :-
మొదటిరోజు రెండేండ్ల బాలిక తో మొదలుపెట్టి.... 3 4 5 6
రోజుకొ కేడు పెద్ద పిల్లలను తీసుకువచ్చి...పాదపూజల తో ప్రారంభిస్తూ...షడ్రసోపేతభోజనములును,పాటలే పాడి... 
ఆటబొమ్మలతో ఆడించి... 
ఆ బాలాకుమారీలను ఆనదింపజేయుటే ఈ పూజ !
ఈ రీతిన పూజించు అతివలకు 
భోగ, భాగ్య, సౌభాగ్యము లొసగి చల్లగచూచును ఆ తల్లి!
       "దేవీ నవరాత్రోత్స.... "
    ********************
       ........  కోరాడ.

8.
కవితా గానం సీజన్ 2
అంశం.. బాలత్రిపుర సుందరి
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

బాలా త్రిపుర సుందరీ..
భారము మోపక దయగనుమా..
భవితను నొసగే బాలా.. త్రిపురా..
భక్తితో సదా నిను కొలచెదనమ్మా..

బాలగా అవతారమెత్తిన నువ్వు
తొమ్మిదివత్సరముల బాలవమ్మా
భండాసురిని సంహరించిన నిన్ను
అడ్డుతగిలిన రాక్షసపుత్రులుముప్పది
జాలి మనసుతో వారందరిని రక్షింప
బాలత్రిపురసుందరిగఅవతరించితివ మ్మా 

దసరాదుర్గా నవరాత్రులలో
దర్శనమే సర్వజన పాపహరం
దుర్గామాతా.. శరణంటిమిమాత
దివ్య మంగళ స్వరూపమే బాలా..

బాలనుఇంటికి పిలుచుకువచ్చి   చక్కనైన పట్టు బట్టలు తొడిగి      పారాణిని పెట్టి కుంకుమ దిద్ది
జడకుచ్చులు పువ్వులుతలలోపెట్టి
అలంకరణగా మెడలో నగలు వేసి
కాళ్లకుపాదపూజలు నామాలుచదివి
పిండివంటలతో భోజనమును ఇస్తే
అమ్మవారి ఆశీసులు ప్రతి ఇంటా
ఎల్లప్పుడూ చల్లగా చూసే బాలా...

హామీపత్రం
ఈ కవితాగానం నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.
తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
9.
[08/10, 9:15 pm] Lalita Sister: బాలాత్రిపురసుందరి
గేయం 

శ్రీచక్ర సంచారిణీ!శిఖరిణి!లోకాలనేలు జనని!
శక్తిస్వరూపిణిషట్కోణపురవాసి
సౌభాగ్యములనిచ్చుసర్వార్థదాయిని
   //శ్రీచక్రసంచారిణి //

 త్రిపురాత్రయములోన ఆదిదేవతవీవు 
పదహారు విద్యలకు అధిదేవతవు నీవు
త్రిపురాంతకుని సతివి! త్రిపుర సుందరివి!
లీలావినోదినీ!బాలాంబికవు నీవు 
       //శ్రీచక్రసంచారిణి //


హంసవాహన!కన్యకారథారూఢవై 
హింసించు అసురసంహారివైనావు 
భండాసురాదిరిపుబలదర్పమణచితివి
సర్వశుభములనొసగు శాంకరీ!!శ్రీకరి!

//శ్రీచక్రసంచారిణి //


పద్మాసనాసీన పద్మరాగిణివై
శ్రితదీనజనులకు సిరులనిచ్చెదవీవు  
సకలాస్త్ర ధారిణిసంతోషదాయిని
సౌగంధిని శరచ్చంద్రాభహాసినీ 
  //శ్రీచక్ర సంచారిణి //

********శివునూరి లలితాకృష్ణ
10
[08/10, 9:20 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:08-10-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: గీత రచన
( బాలా త్రిపుర సుందరి)
******************
పల్లవి:
అమ్మా  దుర్గా భవానీ 
బాల త్రిపుర సుందరీ మాత
ముజ్జగాలనూ ఏలే తల్లీ
మురిపాల ముత్యాల జగన్మాతా దేవీ
*చరణ 1*
నవరాత్రులలో దివ్య శోభతో
మము కాపాడ వచ్చిన దేవీ
మాలో అహమును తొలగించి
మోక్షము నివ్వుమా ఓ మాత

*చరణం 2*
బాలిక రూపం ధరించిన దేవీ
భండాసురుడను రాక్షసునీ
భగవత్ రూపంలో సంహరించి
భక్తుల కోర్కెలు తీర్చితివమ్మా

*చరణం 3*
బాలా త్రిపుర సుందరి మాతా
భక్తితో  ఎప్పుడూ కొలిచెదమమ్మా
భాగ్యములివ్వగ రావా తల్లీ
దివ్య మంగళ దుర్గా దేవీ

*చరణం 4*
కామ క్రోధం మోహాలను బాపి
కరుణతో మమ్ము రక్షించమ్మా
హంస వాహనంపై ఠీవిగా వచ్చి
ఆపదలను కాయుము ఓ తల్లీ!

 *!! అమ్మా !!*
11
[08/10, 9:24 pm] మన్నె లలిత గారు కవయిత్రి: కవితాగానం (సీజన్ -2)
 అంశం: బాలాత్రిపురసుందరి
 పేరు  :మన్నెలలిత 
హైదరాబాద్ 
 చరవాణి సంఖ్య:741 6 8632 89
******************************
 బాలా త్రిపుర సుందరీ!
 త్రిలోకాలకు అథినాయకీ!
 వయస్సు పెరిగే బాలా!
  ఇచ్చావు భగవద్దర్శనం!
 బాలావతారంఎత్తిన
 బాలా త్రిపుర సుందరీ!
 తొమ్మిది ఏండ్ల బాలవమ్మా!
  భండా సురుని సంహరించినావమ్మా!!
 నీ ధైర్యసాహసాలు నేటి బాలికలకివ్వమ్మా!!!

 పాపం పుణ్యం తెలియని బాలావతారం
 దసరా దుర్గ నవరాత్రుల  రెండవఅవతారం
 శుభకర సర్వమంగళ అవతారం
 నవ వర్ష దివ్యమంగళ స్వరూపం!

  నవ్వు మెాముతో,పట్టుబట్టలతో
 నిడుపాటి జడకు జడ కుచ్చుల తో
 తలనిండా పువ్వులతో, అలంకరించిన నగలతో
 ముక్కెరతో,పారాణి అద్దిన పాదాలతో
  పాద మంజీరాలతో, పరుగుల నడకలతో
 నా కంటి ముందు కనపడే నువ్వు
 నన్ను ఆశీర్వదించ  వచ్చిన" బాల" త్రిపుర సుందరివే!!

 హామీ పత్రం :ఇది నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను.
12.
పల్లవి.
అమ్మా జగదంబా నిన్నే నమ్మితి మదిలో
తల్లీ  జగన్మాతా నీవే సర్వం హృదిలో

1చరణం.

కొలిచేను నిన్ను కొండంత ఆర్తితో
నిలిచేను నీముందు నిండైన భక్తితో 
ఇహమూ పరమూ నీవేనమ్మా 
సుఖమూ శుభమూ నీవే నమ్మా
 !! అమ్మా!!

2చరణం.

పలుకులమ్మ పదాలుగా చూచేను నిన్ను
తేటతేట మాటలలతో పొగిడేను నిన్ను
నా కనుల వెలుగై కానరావా దేవీ
నా హృదయపు కోవెలలో వెలసిన మాతా !!అమ్మా !!

3 చరణం .
ఏడేడు జన్మాల ఏడేడు లోకాల 
ఆనంద సాగరం నీవేనమ్మా
నాలోని భావాల కెరటాల దొంతరల 
సౌందర్య రూపం నీవేనమ్మా
నీ పదాలపై మోవినుంచనా
నీ సుందర వదనం కాంక్షించనా 
!!అమ్మా !౹
డా.నాయకంటి నరసింహ శర్మ
వనపర్తి

13.
బాలా త్రిపుర సుందరి (గేయం)
8.10.21

అమ్మా బాలవమ్మ
త్రిపుర సుందరి మహోజ్వల 
శక్తివమ్మా
నవరాత్రులలో రెండవ దినం
త్రిపుర సుందరిగా నీ రూపం
తోమ్మిది వత్సరాల బాలికగా
అపురూప0
భండాసురుని వధించిన తల్లి
వాని కుమారులను ముప్పది
మందిని 
చంపక అమ్మ మనసుతో వది లేసిన చల్లని తల్లివమ్మా

పట్టు వస్త్రాలతో
పలు ఆయుధాలతో
కరుణారస చూపులతో
భక్తులను కాచే అభయహస్థ0తో
అమ్మాయిలకు ధైర్యం ఇచ్చి
ఆదుకోమ్మ
జరిగే అఘాయిత్యాలను
అణిచివేయమ్మ
అత్యాచారాలను చేసే
దుర్మార్గులని దునుమాడవమ్మా
దసరాలోనే కాదు అన్ని వేళలలో ఆసరా వుండవమ్మా
జయ జయ దుర్గా విజయదుర్గా
                  కవిత వెంకటేశ్వర్లు
14.
అమ్మా శంకరి  రావమ్మా 
భక్తి తో కొలిచెదమమ్మా     II అమ్మా  II
బాలగా వచ్చి  బలమియ్యవమ్మా 
ఆట లాడుతు రావమ్మా
అమ్మ నిను నమ్మితి  తల్లీ   IIఅమ్మా II

 అమ్మా తల్లీ  బాలా రావమ్మా 
గాయత్రి వై సద్గుణముల నీయమ్మా 
 నినుగానము చేసే వరమీయమ్మా IIఅమ్మII

మహలక్ష్మి వై మహిమ చూపగ  రావమ్మ
శైల పుత్రీ  రావమ్మా  శీలవతివి నీవమ్మా
భారతి వై  బ్రోవగ రావమ్మా II అమ్మా II

బ్రహ్మ  చారిణి  రావమ్మాబ్రహ్మమునీవమ్మా
నవదుర్గలుగా తొమ్మిది దినములు రావమ్మా  
అన్న పూర్ణగా రావమ్మా
అండ దండలుగా ఉండమ్మా IIఅమ్మా II

నవ రస భరితం నీ నామం 
నవనిధి దాయిని  నటరాజ మోహిని
నవవిధ భక్తుల నవ్యముగ
నడిపించమ్మా దుర్గమ్మా II అమ్మా II

 రాజ రాజేశ్వరీ శ్రీచక్ర వాసిని రావమ్మా
శ్రీ విద్యేశ్వరి శ్రీ కామేశ్వరి రావమ్మా
విజయ   దుర్గా రావమ్మా
మరలి మరలి  జయ మంగళమమ్మా  
IIఅమ్మా II
15



16.

కవితాగానం ( సీజన్‌ 2 ) 8/10/2021/ శుక్రవారము
శీర్షిక:- " త్రిపుర సుందరిపై పాట "

పల్లవి:-  శుద్దతదియ శుక్రవారము  బాలత్రిపురసుందరి భాగ్యము లొసగు

1, చరణం:- అందాల సుందరి ఆనంద స్వరూపిణి
చక్కనిదేవత చంద్రవదన
షోఢసవిద్యల శోపానదేవత
అక్షరమాలచేతబట్టి అభయ మొసగుతల్లి // పల్లవి//

2,  చరణం:- కల్లకపటమెరుగనిమనసులు
పదివసంతాలు నిండని బాలికలు
అమ్మవారిరూపులనుచు
సుహాసినులుజేసిరి కుమారి పూజలు // పల్లవి//

3,  చరణం:-  త్రిశతీపారాయణ జేసిరి
సుఖసంతోషాలు గోరిరి
పులిహారతీపి బూంది ఆరగింప జేసిరి
హారతులిచ్చిరి బాలత్రిపురసుందరి కపుడు// పల్లవి//
          తరణికంటి సూర్యలక్ష్మి.
                 -------------
17.
శరన్నవరాత్రులలో
మూడవ రోజు 

*గాయత్రీ దేవి* 

మందమను అంధకారాన్ని తొలగించి 
జ్ఞాన కాంతులను పంచు గురువు 
త్రికరణశుద్ధి తో జపించు వారిపాలిట కల్పతరువు

ధీశక్తిని పెంపొందింప జేయు
దివ్య తేజస్సు
పరమాత్మ తత్వాన్ని నింపుకున్న ఛందస్సు


పాపసంచయాన్ని నశింపజేయు దివ్యాస్త్రశరథి
పంచముఖియై 
ప్రపంచరథాన్ని సన్మార్గంలో నడిపించు సారథి

అమరత్వాన్ని సిద్ధింపజేయు ఆధ్యాత్మిక తత్వం
ప్రణవాకృతిలో నిండిన
పవిత్ర శబ్దబ్రహ్మం..

అనేకత్వం లో ఏకత్వాన్ని
రూపించే దివ్యత్వంగా.....
వేదమాతయై వెలసిన పరబ్రహ్మతత్వం..
అమ్మ తత్వం

*******పార్నందిలలితాకృష్ణ

18.
[09/10, 8:10 pm] +91 85550 10108: *కవితా గానం సీజన్ 2 శరన్నవ రాత్రులు*:
అంశం: గాయత్రీదేవి వైభవం
ప్రక్రియ: వచన కవిత
తేదీ:9-10-2021
రచన: *నాశబోయిన నరసింహ(నాన)*
ఊరు: చిట్యాల,నల్గొండ
🌸🌺🌼🌸🏵️🌺🌼🌸🌺🌼
          *కమలవాసిని*
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''""""'                            
శ్రీగాయత్రీ మాత ...
వేదమాత సర్వ ధర్మసారం 
దైవశక్తుల మహోజ్వల బీజాక్షర శక్తి 

శ్రీగాయత్రీ దేవి....
పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం 
భారతీయుల అపర అమృత వాహిని 

శ్రీగాయత్రీ మంత్రోచ్ఛారణ....
పరమ శ్రేష్ఠదాయకం
దేహం అణువణువు సహస్రాది నాడుల చైతన్యం 

నిత్య గాయత్రీ మంత్ర జపం.... 
దుష్ట శక్తులు దూరమై తొలగు భయం
షట్ చక్రాలు ప్రభావితమై జాగృత పరిచే కుండలిని శక్తి 

షోడశాదశ మంత్ర అధిష్ఠాన మూలశక్తి....
పరాశక్తి ప్రాణశక్తి కళాశక్తి విశ్వశక్తి విజయశక్తి 
విద్యాశక్తితో కూడిన దైవ శక్తుల దర్శనం 

మన సంస్కృతి సాంప్రదాయాలు గ్రంథాలలో నిక్షిప్తం  
విదేశీయులు కావ్యాలను సైతం తస్కరించిన వైనం
పరిశోధించి పాటించగ మన ఆచారాలనేకం 

నీల ధవళ కాంతులతో ప్రకాశించు దేవి.... 
పంచముఖ వరదాభయ హస్తాల కమల వాసిని 
కాపాడ లేవా !మము కరుణించగ రావా!!                                                                                                                                             🌸~~~~~~~🌼~~~~~~~🏵️
✍️ *నాన*
19
[09/10, 8:20 pm] +91 6281 697 982: అంశం... గాయత్రి దేవి...09102021
వచన కవిత
శీర్షిక...... జగన్మాత
********************************
దసరా నవరాత్రులు పార్వతీ మాత
అవతార అలంకారాల అద్వితీయమైన
అద్భుతమైన రూప లావణ్యాల దర్శనం
భక్తుల భక్తి తాదాత్మ్యాలమహావైభవం

మూడవ దినమున మహా గాయత్రీ
ముల్లోకాలను మురిపించే అలంకారం
ముక్తి నొసంగు ముజ్జగాల జననీ
ప్రార్థించగ ప్రాణాలను రక్షించే కరుణామయి

రుగ్వేదం అందించిన అమరత్వంనందించే
గాయత్రీ మంత్రం
రామాయణంలో రమించిన రాజర్షి రచించిన
రమ్య మైనది గాయత్రీ మంత్రం
జరామరణ జన్మ క్లేషాల విముక్తి ప్రదాత
గాయత్రీ మాతా మంత్రం
పరబ్రహ్మ స్వరూపమైన ఆత్మను పరమాత్మలో
సాక్షాత్కారింప చేసేది గాయత్రీ మంత్రం

విఘ్నేశ్వరుడు మొదలుకొని ఇరవైనాలుగు
మంది దేవతలు కొలువై ఉన్న మంత్రం గాయత్రీ మంత్రం

వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు ఒక
బీజాక్షరం వేస్తు ఇరవై నాలుగు అక్షరాలను
ఇరవైనాలుగు వేల శ్లోకాల తో రామాయణం
రచించిన గాయత్రీ మంత్రం.

వందే గాయత్రీ మాతా వందే జగద్గురుం

ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్
20
[09/10, 8:43 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం( సీజన్‌2 ) 9/10/2021/ శనివారము
అవతారము చంద్రఘంట

  సుమంగళి పార్వతమ్మ
మూడవనాటి యవతార మనగ
చంద్రఘంట చిహ్నాలతో చంద్రవదన
పరమశివునిపత్నిగ మన ముందు కొచ్చె
హారతులనుపట్టరండి అతివలందరు
అభయ హస్తాలదీవించు నాదంపతులు

ఫాలములో చంద్రవంక పాలించవచ్చె
చంద్ర వంక యిచ్చు చల్లదనము
సింహ వాహనముపై వచ్చె సింగారించు కొని
చంద్రఘంటకట్టె పట్టుచీరను
నవరత్న కనకాభరణములు ధరియించె
తల్లినిచూడగ రెండుకళ్ళుచాలవు

చంద్రవంక మధ్య నుండె తల్లి మూడవ కన్ను
చంద్రఘంటము తెలుపు
కన్ను తెరచినంత కాలి బుగ్గిగ మారు దుష్టులందరు
దుర్గమ్మ శక్తి ని గాంచగ దుర్జనులు భయపడు
సజ్జనులు సంతోషపడు

పదిహస్తములు మాతల్లి చంద్రఘంటకు
ఎడమ హస్తముల త్రిశూల, గద, ఖడ్గ, కమలదళము, వరదముద్రలు
కుందనవదన కుడి హస్తాల తామర పూవు, బాణాలు, ధనువు, జపమాల  మరియు అభయముద్రల సంతోషాలు కురిపించగ జగదాంబ జగమునేల వచ్చె//
         తరణికంటి సూర్యలక్ష్మి.
                   ------------
21.
అంశం. గాయత్రీ దేవి
శీర్షిక.. జగజ్జనని
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

చంద్రవదని శక్తిమాత
చంద్రఘంట శైలజాత
శంభునికే ప్రియరాణివమ్మా
శివునిశరీరములో అర్ధభాగానివమ్మా

దుర్గానవరాత్రులలో నీవమ్మా
మూడవరోజు గాయత్రీదేవివమ్మా
అభయమొసగే అభయప్రదాతవమ్మా
అలంకరణలో నీవు అద్వితీయవమ్మా

పురుషులకు ప్రాణమిచ్చు ముక్తినిచ్చు
గాయత్రీనీమంత్రంమించిన వేరేమంత్రం
ఇంకొకటి వేరుగలదా!అమ్మా!గాయత్రీ!
రాజర్షినోటివాక్కు రమ్యమైననీమంత్రం

హామీ పత్రం
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079346
22.
*కవితా గానం సీజన్ 2*
తేదీ:09-10-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: గాయత్రీ మాత వైభవం
***************
వాల్మీకి రామాయణ మూలాధారం గాయత్రీ మాత
ఆ మాత అనుగ్రహానికై
ఓం నమో గాయత్రీ మాత్రే ఆని జపిస్తే చాలు
ఆత్మ శక్తిని ప్రసాదించి ప్రాణాన్ని రక్షించే సర్వ స్వతంత్ర దేవి
పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగమే గాయత్రి
 
 అరుణుడనే రాక్షసుని దురహంకారాన్ని
కోట్లాది భ్రమర రూపమై వధించిన జగన్మాత
 ఆదిశక్తి స్వరూపమైన గాయత్రీ మాతకు వందనం!
23.
[10/10, 7:59 pm] +91 98710 96566: కవితాగానం
పేరు : డా.కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
చరవాణి : 9871096566
అంశం : లలితాదేవి స్తుతి
శీర్షిక : శరన్నవరాత్రులు
కాలచక్రం లో 
మహిమాన్వితాలు 
నవరాత్రులు 
వసంత నవరాత్రులు 
చైత్రంలో వస్తే 
ఆశ్వయుజంలో
శరన్నవరాత్రులు 
ఆదిశక్తి పరాశక్తి
అమ్మలగన్నయమ్మ
ముగురమ్మలమూలపుటమ్మ
కొలువై ఉంటుంది  అంతటా
ఉపవాసాలు,పూజాపునస్కారాలు 
బొమ్మల కొలువులు 
లలితాపారాయణలు
దుర్గాస్తవాలు దేవీమాహాత్మ్యపారాయణలు
సందడులే సందడులు
తేజరిల్లును దేవి
నవవిధరూపములలో
తొమ్మిది దినములు
బాల,కుమారి,గౌరి
త్రిపురసుందరి శాంభవి
శైలపుత్రి చంద్రఘంటి
కూష్మాండి
ఇలా పలురూపాలలో
అందుకుంటుంది మన 
పూజలను
నవవిధ రూపాలు, నవవిధ భక్తులు,నవవిధ అలంకారాలు
నవవిధ నైవేద్యాలు
లలితాంబ అందుకుంటుంది నేటి పూజను
చిరునవ్వులుచిందించే మోము
ఫాలభాగమున ఎర్రని కుంకుమ
శిరమున చంద్రవంక
చేతచతుర్విధ ఆయుధాలు
ఇక్షుకోదండపాణియై
విశాలనేత్రాలతో, రాగరంజిత
చరణాలతో
అభయహస్తముద్రతో కానవస్తోంది 
లలితాత్రిపురసుందరి
పూజింపబడుతోంది
లలితాదేవి అష్టోత్తర. శతసహస్రనామాలతో
జరుగుతాయి
సువాసినీ పూజలు
కన్యకా పూజలు నేడుకూడా
కోరినవరములనిచ్చే దేవి
అభీష్టములను తీర్చేదేవి
ఇచ్చాశక్తి,జ్ఞానశక్తి, క్రియాశక్తి. స్వరూపిణి
శ్రీచక్ర వాసిని, సర్వలోక వశంకరి
పాయసాన్న, దధ్యాన్న, హరిద్రాన్న ప్రీతిపాత్ర
లలితాంబ
ఆరాధించండి లలితా త్రిపుర సుందరిన
పొందండి ఆఅమ్మదీవెనలను
23.
[10/10, 8:03 pm] +91 6281 697 982: అంశం...లలితా దేవి... 10102021
శీర్షిక...... లలితా త్రిపుర సుందరీ
******************************
లలితా త్రిపుర సుందరీ
అమ్మా ! శాంభవి శంకరీ
త్రిపురా పురాధీశిణీం 
భగవతీ నమో నమః 

సౌభాగ్య ప్రదాయిని
సామ్రాజ్య లక్ష్మీ దేవి
జయ శుభ  కారిణీ
శివ కామిని నమోనమః

మహాకాళీ దుష్ట సంహారిణి
మహాలక్ష్మీ సిరి సంపదల కారిణి
మహా సారస్వతీ చదువుల తల్లి
జగన్మాత భగవతి నమో నమః

చంద్ర వంక కిరీట ధారణీ
ప్రచండ పాశాంకుశ ధారిణీ
చరక బిందు ధారిణీ
లలితాంబ నమో నమః

కామ్యార్ధ కారిణి లలితాంబ
మోక్షార్ధ కారిణి లలితాంబ
ఖడ్గ శక్తి కారిణి లలితాంబ
జగజ్జనని నమో నమః

శ్రీచక్ర స్థిరనివాసి లలితాంబ
శ్రీ శైలగిరినివాసి భ్రమరాంబ
శ్రీ కాళహస్తి నివాసిని జ్ఞానప్రసూనాంబ
అమ్మలగన్నయమ్మ నమో భగవతే నమః

స్వీయ రచన:::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
24
10102021
24
[10/10, 8:21 pm] Aalla Nageshwar Rao Poet: నేటి.అంశం; నాలుగోరోజు....నాలుగో.అవతారం...గాయత్రి మాత
ప్రక్రియ:  నానీలు
శీర్షిక;
    ""త్రిలోక పూజిత ""

1.
నవరాత్రుల్లో
నాలుగో.అవతారం
గాయ త్రి మాత
దివ్యదర్శనం!


2.
మూడు పూటలా
గాయత్రి స్మరణం
పుణ్య ప్రాప్తం
మానవజన్మకు వరం


3.
విశ్వామిత్రునిచే 
పూజింపబడిన
ఆదిదేవత
గాయత్రీమాత!


4.
గాయత్రి మననం
మనుగడకు.మార్గం
గాయత్రి జ్ఞానంతో
జన్మధన్యం!


5.
త్రిలోక.పాలిని
గాయత్రిదేవి
త్రిలోక పూజిత
గాయత్రీమాత!

..
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు....జిల్లా
ఆంధ్రప్రదేశ్.....రాష్ట్రం
చరవాని సంఖ్య; 7416638823
...........................................
పై నానీలు నా స్వీయారచనేనని.హామీ ఇస్తున్నాను.
25
[10/10, 8:32 pm] Korada: కవితాగానం శరన్నవరాత్రులు 
అంశం :- (గాయత్రి)వచనకవిత
కోరాడ నరసింహా రావు !
*అన్నిమంత్రముల.....
         ....... కాది మంత్రము !*
     *******************
శరన్నవరాత్ర  మహోత్సవ
ములలో... మూడవరోజున ఆరాదింతుము... అమ్మను 
మాత గాయత్రీ గా.... !

పంచభూతములే....ఐదు
ముఖములుగా...సకల చరాచర జగత్తు నంతా అమ్మ 
వ్యాపించి ఉన్న అనంత శక్తి !

అన్ని పూజలకు, వ్రతములకూ 
సకల మంత్రజపానుష్టానము లకును,తొట్ట తొలుత గా... పఠించ వలసిన ఆదిమంత్ర మీ గాయత్రి...!

యోగులు...ఋషులు,తాపసు లకంతా... నిత్యానుష్టాన మహా మంత్రమిది... !

ఆర్త త్రాణ పరాయని అమ్మ !
ఆశ్రయించిన వారిననువ్రహించే 
తీరు !అన్నదాత,ఆరోగ్యదాత 
జ్ఞానదాత, ఐశ్వర్య ప్రదాత !
సకల పాప హరిణి గాయత్రి!!

ఆత్మ శుద్దితో ఆరాధించి.... 
అమితానందము నందుదము !
అష్టైశ్వర్యభోగభాగ్యములసుఖజీవనమే బొందుదము...!!
       ***************
       ...... కోరాడ.
26
[10/10, 8:42 pm] +91 99373 80136: కావ్యగానం(సీజన్2)
తేది:10102021,ఆదివారం
అంశం:లలితాదేవి.
శీర్షిక:శ్రీచక్రవాసిని.
శ్రీచక్రవాసిని  శ్రీలలితాదేవియే నమః
అమ్మా లలితాంబికాదేవి
చల్లనితల్లివి చల్లగ కాపాడగరావమ్మా!
దీనులము హీనులము మమ్మాదరింపగరావమ్మా!
జగన్మాతవు
జగ్ధాత్రివి
జగన్మోహినివి
జగదాంబికవు
ఏమని పొగడదు నీ లీలలు
ఏమని కొలచుదు నిన్ను
శ్రీచక్రవాసినివి !శ్రీలలితాదదేవివి!
కరుణించగరావా!
కటాక్షవీక్షణములతో కావవే!
కళ్యాణి!కామక్షి!కమలాక్షి!
దుష్టసంహారిణివి
దుర్మాంధులను  దునుమాడగరావవే!
దయాశీలివి దాక్షాయణివి
మమ్ము దయతో బ్రోవగరావే
తల్లి శ్రీలలితాదేవి!నమోనమః!

ఇది నా స్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995.
27.
కవితా గానం (సీజన్ 2)
అంశం..లలితా త్రిపుర సుందరి 
తేదీ..10.10.2021
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336
శీర్షిక.. జయ జయ లలితే 

జయ జననీ... జగజననీ...
త్రిభువనిపాలిని.. జయలలితే 
జయజననీ.. జయహో జననీ

విశ్వేశ్వరి ఓ విశ్వకారిణి
విశాలాక్షి వేగమే రావే
విశ్వమాతనిను వేడితినమ్మా
విజయదుర్గాలలితే వేగమే రామ్మా

వందనమమ్మా అరవిందలోచని
విజయంబు నొసగే శ్రీ లలితాంబికా
విజయాలకురాణి.. విజయవేణి
విశ్వానికి లలితవు .. విజయలలితే 

పరమేశ్వరి ఓ దుర్గాఅంబికా
ప్రణామమిదిగో ప్రత్యూషాంబికా
పార్వతిఅంశవు కనకదుర్గవు
పసుపుకుంకుమల అలంకృతలలితా!

హామీ పత్రం
ఈ కవితాగానం నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
28.

కవితాగానం సీజన్ 2
అంశం:లలితా త్రిపుర సుందరి
తేదీ:10-10-2021
మద్ది. పుల్లారావు
నందిగామ
శీర్షిక:శరణు  లలితా మాత
.........

లలితా త్రిపుర సుందరి
దశ మహా విద్యలలో ఒక రూపమై
శ్రీ చక్రము పై పాదము మోపి
చెరకువిల్లు,పుష్ప బాణాలను దరించి
హేమ సింహాసనంపై ఆశీనురాలైన
జగన్మాత అవతారము
జ్ఞానానందములను కలిగించు
అమృత ప్రవాహరూపిణి
ఉదయించు సూర్యుని వలె ప్రకాశవంతమై
చతుర్భుజాలతోను
త్రినేత్రాలతోను
పాశ,అంకుశ,బాణాలను
అష్ట భుజాలు గలిగిన
తేజోమయరూపి లలితా త్రిపుర సుందరి
ప్రశాంతతనిచ్చు దేవత
ఆరోగ్యాన్నిచ్చే తల్లి
కొలిచిన వారికి కొంగుబంగారం
యోగుల హృదయ కుహరాలలో
వసించు నిత్యానందమయి
సర్వులకూ శుభాలిచ్చు గాక
.....
ఇది నా స్వీయరచన8328079336
29.
*కవితా గానం సీజన్ 2*
*తేదీ:10-10-2021 ఆదివారం*
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
*అంశం: లలితా దేవి*
*******************
ముగురమ్మల మూలపుటమ్మ
మహామాన్విత దుర్గా మాత
శరన్నవరాత్రులలో 
చక్కని అవతారాలతో అలరించే తల్లీ

లలితా దేవి రూపంలో
దర్శనమిచ్చే సుందర రూపిణి నీవే  దేవీ!

ఆదిశక్తి పరంజ్యోతి
దుష్ట సంహారం చేసి
నీ కరుణా కటాక్ష వీక్షణాలు
మాపై ప్రసరింప జేయుము జననీ!
శ్రీ లలితా మాతా!
దద్దోజనం క్షీరాన్నం ఇష్ట నైవేద్యంగా స్వీకరించి
శుభములు ఈయగ రావా మాతా! 
నమో దేవీ స్వరూపిణి
నమో నమో దేవ దేవీ.!

*వురిమళ్ల సునంద ఖమ్మం*
33.
కవితాగానం :-శరన్నవరాత్రులు 
అంశం :- * అన్నపూర్ణా దేవి *
 కోరాడ  నరసింహా  రావు... !
  * బిక్షాoదేహి  మాతా... ! *
     ****************
జ్ఞాన, వైరాగ్య సిద్ది నిమ్మని భిక్షా పాత్రను పట్టి అడిగిన పరమ శివుని కోరిక దీర్చగ...వారణాసి నందు విశ్వనాధుని ఇంట.... 
ఒకచేత స్వర్ణ పాత్రతో... వేరొకచేత బంగారు గరిటె తో... 
వెలసి.... ప్రాణికోటి ఆకలి దీర్చు చుంటివే అన్నపూర్ణమ్మ 
నీకెవరు సాటి మాయమ్మ... !

 నీచేతి యన్నమున పుష్టి, తుష్టులు గలిగి.... ఆరోగ్య, ఐశ్వర్య... జ్ఞానములతోడ... 
జనులకు మోక్షమే గల్గు... మా 
అన్నపూర్ణమ్మ తల్లి....!!

 ఈ నవరాత్రులలో... మేము 
భక్తి, శ్రద్ధలతోడ... ప్రత్యేక పూజల తో... అర్చింతు మమ్మ 
ఆ దివ్యాన్నమును నీవు దయ తోడ మాకొసగి జ్ఞాన -  వైరాగ్య 
 సిద్ధిని కలిగించుమమ్మా... !!
ఈ భవ, బంధ ములనుండి... 
మమ్ము ముక్తులను గావించి 
మోక్ష పదమును జేర్చు.... 
మాయమ్మ కృప జూపి... !!
    ***************
     ..... కోరాడ.
34

[11/10, 8:09 pm] +91 99373 80136: కవితాగానం(సీజన్2)
తేది11102021,సోమవారం
అంశం:అన్నపూర్ణాదేవి
ఆకలిని బాపేతల్లి అన్నపూర్ణాదేవి
నిఖిలజగతికి నీవే రక్ష
ఈతిబాధలను తీర్చగరావమ్మా
భక్తిశ్రద్ధలతోను కొలిచేమమ్మా
కాశీలోను కొలువుదీరేవు
నవరాత్రులందు నీకు పూజలు చేసేము
కరుణించగరావమ్మ కాపాడరావమ్మ
నీ కటాక్షవీక్షణములే మాకు రక్షాకవచములమ్మ
విశ్వేశ్వరునికితోడుగా నిలిచేవు
విశ్వశాంతిని చేకూర్చేవు
దయగలతల్లీవి దాక్షాయణివి
దయతొమమ్ము దయచూపవేమమ్మ
దరిద్రులను దీవింప రావమ్మ
దుష్టులను శిక్షించవమ్మ
దేశమంతటా నిన్నుకొలెచెదమమ్మ.

ఇది నా స్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా.
చరవాణి7780594995.
[11/10, 8:10 pm] +91 99373 80136: కావ్యగానం(సీజన్2)
తేది11102021,సోమవారం
అంశం:మహాలక్ష్మి
అష్టకష్టాలను తీర్చేతల్లి
అష్టైశ్వర్యములనొసెగేతల్లి
మహాలక్ష్మీదేవి మమ్ము కరుణించరావే
నవరాత్రులలోను నిన్ను కొలిచేమమ్మ
నిత్యదీవెనలందించగరావమ్మా
విష్ణువుకు ప్రియభర్తవీవు
విశ్వమంతటా నీకై ఎదురుచూసేరు
దరిద్రనారాయణులపై దయచూపగరావే
దశదిశలందు నెలకొనేవు
దారిద్ర్యదేవతను కరుణించగరావమ్మ
ధనదాన్యాలతో తులతూగేలచేయవమ్మ
మహిమలుచూపేతల్లి మముబ్రోవరావే
చంచలమని నిన్ను తెగెడేరు
చలించకమమ్ము చెంతకుచేరేవు
దీవెనంలందించవమ్మ ధన్యులమయ్యేము.

ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995.
35
[11/10, 8:23 pm] Aalla Nageshwar Rao Poet: కవితా గానం.( సీజన్.2)
తేదీ: 11/10/2021...సోమవారం
అంశం; అన్నపూర్ణాదేవి &మహాలక్ష్మి.అవతారములు

ప్రక్రియ;, నానీలు

1. 
అన్నం పరబ్రహ్మ
స్వరూపం
ఆ రూపమే
అన్నపూర్ణాదేవి  అవతారం!


2.
కూటి కోసమే
కోటి విద్యలు
ఆ విద్యల సాధనకై
అన్నపూర్ణాదేవి స్మరణం!

3.
అన్నపూర్ణాదేవి
అనుగ్రహం
పుష్కలంగా
అన్న ప్రసాదం లభ్యం!


4.
ధనం మూలం
ఇ ధమ్ జగత్
ఆ ధనం ప్రాప్తికై
మహాలక్ష్మి అనుగ్రహం!


5.
మహాలక్ష్మి 
నామ స్మరణం
ధనలక్ష్మి కటాక్షంకై
ఆవశ్యకం!
.........................................
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
చరవాని సంఖ్య;7416638823
..........................................
పై నానీలు నా స్వీయారచనేలేనని హామీఇస్తున్నాను.
36
[11/10, 8:30 pm] Thathapudi Somashekara Sharma: కవితా గానం (సీజన్ 2)
తేదీ 11.10.2021
అంశం... అన్నపూర్ణదేవి
శీర్షిక... అన్నపూర్ణభవాని
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

అఖిలాండేశ్వరి మాతా...
అన్నపూర్ణ మాతాభవానీ...

అక్షయంబుగ కాశీపురమున
అన్నపూర్ణ భవానివే..
అభయమునొసగే అపర్ణాదేవీ
ఆనందభైరవి మహేశ్వరీ..

విశ్వనాధుని అర్ధాంగివిమాత
విజయాలనొసంగే విశ్వమాత
వివిధరకములతో నిత్యాన్నదానం
విధిగాజరుగు అన్నపూర్ణేశ్వరిమాత!

అరవిందలోచని అన్నపూర్ణమాత 
ఆదరించుమా అంబా భవానీ..
అమృతాన్ని పంచే అభయమూర్తీ     ఆదరించే అమృతవల్లీ...

హామీపత్రం
ఈ కవితా గానం నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
38.
*కవితా గానం సీజన్ 2*:
అంశం: అన్నపూర్ణాదేవి వైభవం
ప్రక్రియ:వచన కవిత
తేదీ:11-10-2021
రచన: *నాశబోయిన నరసింహ(నాన)*
ఊరు: చిట్యాల,నల్గొండ
🌸🌺🌼🏵️🔯🔯🌸🌺🌼🏵️
         *కాశీ పురాధీశ్వరీ*
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''                            అన్నోదక దానగుణమే అన్నపూర్ణేశ్వరి ఆరాధన                
సర్వవ్యాధి నివారణం కాశీ విశ్వేశ్వరీ నామ పారాయణం!    

ఆకలి బాధ తీర్చి ఆదరించమనే సందేశం 
కుటుంబంలో తల్లి ప్రాధాన్యత చాటే అవతారం! 

ఈతి బాధలనుంచి కాపాడే కరుణామయి 
భిక్ష నొసగి సద్బుద్ధి నిచ్చు విద్యారూపిణి! 

సకల ప్రాణి చైతన్య స్వరూపిణి 
కాశీపురాధీశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరి! 

సమస్త ప్రాణి కోటి అన్నరస మయము 
భూమ్యాకాశాలు అన్నమన్నాదములన్న తల్లీ!

అన్నపూర్ణేశ్వరీ సర్వ మంగళ కారిణి భజామి
విశ్వమానవ కళ్యాణం వీక్షించే విశ్వాంబరీదేవి నమామి!                                                                                                                                       🌀🌀🌀🌀🌀♦️🌀🌀🌀🌀🌀🌀
✍️ *నాన*
39
[11/10, 8:52 pm] Lalita Sister: శరన్నవరాత్రుల వేడుకలో
నిన్నటి అంశం 

అంశం :లలితాదేవి
ప్రక్రియ :గేయం 

సిరులెన్నొ కురిపించు శ్రీ్తపారిజాతవే!!
కరుణించి కాపాడు మాత కంజాతవే 

లలిత!భువనైకపాలివీవే!
కలిత భవమోహనాశనీవే!

హరిరాణి వాగ్వాణి చిరునగవు తోడ వింజామరలు వీచ
కెంజాయమోములో....
మంజీరస్వనములను
మదిమదినినింపి
రంజింపజేసెడి రాజీవలోచనీ!

లలిత భువనైకపాలివీవే 
కలిత భవమోహనాశనీవే 

బ్రహ్మాది దేవతలు భక్తితోభజియించ
శర్వాణి గీర్వాణి సర్వ దేవతల
నవ్య స్వరూపివై నవదుర్గవై వెలసి 
భవ్య శోభలనింపు 
భాస్వత్సుహాసిని!

లలిత భువనైకపాలివీవే 
కలిత భవ మోహనాశవీవే

******పార్నంది లలితా కృష్ణ
40
[11/10, 8:59 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం సీజన్ 2
అంశం : అన్నపూర్ణ దేవీ
శీర్షిక:: అన్నపూర్ణ

అన్నం పరబ్రహ్మ స్వరూపం
అన్నానికి అధిపతి అన్నపూర్ణదేవీ
మనిషి ఆకలికి అన్న0 పరమోషదం
భోజనం చేస్తే ఎంతో తృప్తి
మనసుకు సంతృప్తి
లక్షలు కోట్లు సంపాదించిన
తినవలసింది అన్నమే
తిన్న ఆహారం నాలుగు భాగాలుగా విభజింపబడును
స్తూల సూక్ష్మ శరీరాలకు అందించబడును
రక్త0గా మారును
పిప్పి మలమూత్రంలో వెళ్లిపోవును
దీనికంతటికీ అమ్మే అజమాయిషీ చేయును
కాశీ అన్నపూర్ణగా ప్రసిద్ధి
ప్రతి ప్రాణికి ఆ అమ్మవారే
చేస్తుంది శుద్ధి!!
              కవిత వెంకటేశ్వర్లు
పై కవిత నా స్వంత రచన అని
హామీ
41
[11/10, 9:00 pm] మన్నె లలిత గారు కవయిత్రి: కవితాగానం (.సీజన్ -2)
 తేదీ :11/ 10/ 21- సోమవారం
 అంశం: అన్నపూర్ణా దేవి &మహాలక్ష్మి.
 శీర్షిక:  లక్ష్మీ ,అన్నపూర్ణ.
*********************************
  అవనియందు ఆకలి తీర్చే అన్నపూర్ణవై
 దేహీ !అన్నవారికి దేవతవై
 నిత్యాన్నదాతవై, కాశీ అన్నపూర్ణవై
 కన్నతల్లిలా కడుపు చూచి అన్నం
 పెట్టే దానివైన అన్నపూర్ణ మాతా!
 ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనమ్మా!!
 అమ్మలగన్నయమ్మ మాయమ్మ 
ఒక్క నమస్కారం ఇస్తానమ్మ!

 అష్టైశ్వర్యములనిచ్చే మహాలక్ష్మి!
 అష్ట కష్టాలు తీర్చుటకు కరుణించి రావమ్మా
 కనకమహాలక్ష్మీ!!
 భారత ప్రజల ఇడుములు పోగొట్టుటకు
ఇనుప గజ్జల తల్లిని పారద్రోలి
సువర్ణ మంజీరాలతో నడయాడుతూ రావమ్మ!
 'అన్నపూర్ణ'కు తోడుగా అక్కవై, మహాలక్ష్మివై
 స్థిరంగా అన్నదాతను ఆదరించవమ్మా!
  సమస్యలతో సతమతమవుతున్న 
ఈ తరానికి మనశ్శాంతి  నిచ్చి
 దీవెనలిచ్చి, ధైర్యపుబతుకు నివ్వండమ్మా!
***************************************
 హామీ పత్రం :
 ఇది నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను
 పేరు  :మన్నె లలిత 
ఊరు :హైదరాబాద్ 
చరవాణి సంఖ్య: 741 686 32 89
42
[11/10, 9:08 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం (సీజన్ 2).      11--10--2021.
పిన్నక నాగేశ్వరరావు.

శీర్షిక :-- అన్నపూర్ణాదేవి.

1. తే.గీ.
అన్నపూర్ణ దేవిగను నేడవతరించి
యన్నమున్ బెట్టు ప్రాణుల కన్నిటికిని
యట్టి తల్లిని పూజించ నందరికిని
కలుగు ధనధాన్య మైశ్వర్య మిలను మిగుల.

శీర్షిక :-- శ్రీ మహాలక్ష్మి.

1. తే.గీ.
ఐదవ దినము నవరాత్రి యమ్మ రూపు
శ్రీ మహాలక్ష్మిఁ నేడు దర్శించినంత
సకల శుభములు కలిగెడు సరణి మమ్ము
దయను చూపగ రావమ్మ తల్లి దుర్గ.
**************************************
43
[11/10, 9:17 pm] Siimhadri Vani Poetess: కవితా గానం ( సీజన్--2)
తేది:-- 11-10-2021
సోమవారం
అంశం:--అన్నపూర్ణాదేవి
వచన కవిత

అష్ట భుజాలతో అవతరించిన తల్లి
భక్తి శ్రద్ధలతోడ ఆనందముప్పొంగ
నిను‌కొల్చెదము మేము
సకల జగతికి నీవు అన్న ప్రసాదము పెట్టి ఆకలి తీర్చమ్మ

కుడివైపు చేతులలో
పద్మము, బాణము, ధనుస్సు, కమండలము
ఎడమవైపు చేతులలో
చక్రం, గద, జపమాల, అమృతకలశం ధరించి
సింహవాహన మెక్కి భక్తులకు దర్శన మిచ్చెదవు తల్లి

మనసారా నిను కొల్వ మహిమలు చూపించి
మధుర భాషణము మేధాశక్తిని
బుద్ధి జ్ఞానములను సిద్ధింప జేసెదవు

ఆది భిక్షువైన అయ్య శివయ్యకు భిక్ష నిడిన అమ్మ అన్నపూర్ణా దేవి
సకల శుభముల నొసగు‌ చల్లని తల్లివి
భక్తులను కాపాడు బంగారు తల్లివి.

రచన:--సింహాద్రి వాణి
ఊరు:--విజయవాడ
చరవాణి:--7569820872
*********
44
[12/10, 8:01 pm] Korada: కవితాగానం :-శరన్నవరాత్రులు
అంశం :- * సరస్వతీ దేవి *
 కోరాడ నరసింహా రావు !
 @ సకల కళలను గన్న తల్లి @
    🙏💐🙏🌹🙏🌷🙏
సాకీ :-
సకల కళ ల తల్లికీ... సాష్టాంగ వందనం... ! జ్ఞానమొసగు... 
జ్యోతికి... అక్షర నీరాజనం !
పల్లవి :-
      విద్యల నొసగెదవు విధాత 
సతి నీకు... వందనమమ్మా... 
సరస్వతి...నీకు వందనమమ్మా
మమ్మా  సరస్వతి... నీకు... 
వందనమమ్మా సరస్వతీ..... 
నీకు వందనమమ్మా సరస్వతీ!
       "విద్యల నొసగెదవు... "
చరణం :-
       అజ్ఞాన తిమిరమును తొల 
గించు తల్లీ... సుజ్ఞాన జ్యోతి 
భారతి... 2
విచక్షణ కలుగు వివేకము నొసగు అక్షర రూపిణి వాగ్దేవి !
    'అజ్ఞాన తిమిరమును... '
           "విద్యల నొసగెదవు.."
చరణం :-
           సంగీత, సాహిత్య సకల 
కళ లకూ సాకార రూపము నీవే 
గదా... 2
,మాలో వసియించి నిరతము 
సోభిచు... 2
వరము నొసంగుము వీణా పాని... !
   'సంగీత, సాహిత్య సకల... '
       "విద్యల నొసగెదవు... "
     ******************
       ...... కోరాడ.
45
[12/10, 8:07 pm] Maddi Pullarao Poet: కవితాగానం:శరన్నవరాత్రులు
అంశం:సరస్వతీదేవి
మద్ది. పుల్లారావు
నందిగామ
12-10-2021
తేటగీతి పద్యాలు
------
1)


వాణి గిర్వాణి పుస్తక పావననుచు
శారదాంబను గొలిచెద సద్గుణముల
సప్తమ దినము దసరా దశ  దినములలొ
చదువులందు జక్కగ పైకి సాగి పోవ

2)


దర్శనమగు మూలా నక్షత్రమున మనకు
స్వర్ణ శోభితయై దేవి సంతసముగ
వేద గాయత్రి మన పైన ప్రేమజూపు
భక్తులననుగ్రహించును భవ్యముగను
---
ఇది నా స్వీయరచన
46
[12/10, 8:08 pm] Thippavajjala నరసింహ మూర్తి Poet Nellore: కవితా గానం
12-10-2021
సరస్వతీ దేవి
తిప్పా వఝల నరసింహమూర్తి

అమ్మా!శారద, సకల విద్యా స్వరూపిణి
పుస్తక,మాలా ధారిణీ సాత్విక రూపిణీ
ధవళ వస్త్ర ధారిణీ,ఆద్యంతం శక్తి స్వరూపిణి 
సకలకళాధి దేవతా!
నీ దయతో అవుతాయి అసాధ్యాలన్నీ సుసాధ్యాలు.
పరమమూర్ఖుడు కాగలడు మహా పండితుడు
నిన్ను ఆరాధిస్తే ప్రసాదిస్తావు కోరిన విద్యలు
బ్రహ్మ జిహ్వపై ఉండే నీవుతలచుకొంటే కలుగుతుంది తప్పక వాక్సుధ్ధి
ఓం విద్యాలయాధి దేవతా!
సద్భుద్ధిని ప్రసాదించు తల్లీ! విద్యార్థి లోకానికి
నీదయతోనేగదా బంగారు భవితకు గట్టి పునాది.
47
[12/10, 8:09 pm] Aalla Nageshwar Rao Poet: కవితా గానం ....season..2

నేటి అంశం=సరస్వతీ మాత

శీర్షిక....  జ్ఞాన ప్రదాయిని

చదువుతో అబ్భును సంస్కారం
సంస్కరంతో అబ్బును.విజ్ఞానం
విజ్ఞానంతో అబ్బును  వినయం
వినయంతో అబ్బును వివేకం
వివేకంతో.అబ్బును సౌశీల్యం
సౌశీల్యంతో అబ్భును సౌభాగ్యం
వీటన్నింటికి.మూలం జ్ఞానం
ఆ జ్ఞాన ప్రదాయినే సరస్వతిమాత
బాసరలో.కొలువైయున్న మహిమాన్విత
చక్కని  చదువుల నొసగే
చల్లని దేవత 
నేటి అవతార మూర్తి సరస్వతి#

......................................
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు..జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
చరవాని సంఖ్య.7416638823

పై వచనకవిత నా స్వీయారచనేనని.హామీఇస్తున్నాను.
48
[12/10, 8:22 pm] Lalita Sister: సరస్వతీ దేవి కి పద్య  కుసుమాంజలి

సప్తమదినంబునవెలుగుసారసాక్షి
శబ్ద రూపమై లలితాంబ శారద గను
వాక్కు నిచ్చు దేవి కొలుచు వారలకును
భక్తి భావమై యుండ  భాష పొరలు

అన్నపూర్ణ దేవి కి అక్షర మాల సమర్పణ

ఆది శక్తవ తరించె నమ్మఅన్న
పూర్ణ  మనసున ధ్యానించు వర్ణ మాల
అన్న పానములకులోటు సున్న యమ్మ
భిక్ష నింపెదవార్తులక క్షయముగ

*******నాగలక్ష్మి గారు
49
[12/10, 8:24 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్ 2 )12/10/2021/ మంగళవారము
సప్తమి రోజున,
      " సరస్వతిమాత "
చదువులతల్లి సరస్వతియేతెంచె
శ్వేతపద్మముపైకొలువు తీరె
సంగీతసాహిత్యాలకు అధిష్టానదేవత
ముగురమ్మలలోన మూడవతల్లి సరస్వతమ్మ
భారతమ్మ ఆరాధన భారతీయవిద్యను వృద్ది చేయు
హంసవాహనమెక్కి తిరుగుచుండు తల్లి
వేద ఘోషలు వినపడగ పరవసిం చునమ్మ
బాలలవిద్యకు బాసటగ నిలచు భారతీదేవి
ఓనమాలుదిద్దమొదలిడగానె బాలురమేధను పెంచగ
అక్షరమాలనుచేతబట్టి ఆశీర్వదించు
మేథావులుగానువారిని తీర్చిదిద్దు
ఏవిద్యనేర్చినగాని ఆవిద్యల ప్రావీణ్యత బొందగాను
జ్తానము పెంచును జ్ఞానేశ్వరి
వింద్యవాసినివి విద్యాధరివి వినయ విధేయతలు గలుగ
విద్యను బోధించు తల్లి సరస్వతమ్ము!
         తరణికంటి సూర్యలక్ష్మి.
                  -------------
50
[12/10, 8:24 pm] Thathapudi Somashekara Sharma: కవితా గానం (సీజన్ 2)
అంశం.. సరస్వతీ దేవి
శీర్షిక.. వేదవతి
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

కళావతీ అంబ సరస్వతీ
నాదబ్రహ్మమయి వేదావతి

అఖిలాండేశ్వరి.. విద్యావతీ
వేదబ్రహ్మమయి.. సాయిభగవతి
బాసరభారతి.. అంబాసరస్వతి
నాదబ్రహ్మమయి..విద్యాసాహితీ

జ్ఞానముద్రాణి.. కళ్యాణీ
మహావిద్యాయిని.. వాణీ 
హంసవాహిని.. శుభప్రదాయిని
శాస్త్రరూపిణి.. సరస్వతీ 

వీణాపాణి.. విమలరంజని
విద్యాభగవతి...శ్రీకృతీ
సురమునిపూజిత..సుధాంజలి
శ్వేతకళాoజలి.. వాగ్దేవీ

హామీ పత్రం
                 ఈ కవితా గానం నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
51
[12/10, 8:31 pm] మన్నె లలిత గారు కవయిత్రి: కవితాగానం( సీజన్ -2)
 శరన్నవరాత్రులు
 అంశం :సరస్వతీదేవి
 శీర్షిక: అక్షర వరమాల
******************************

 "శారద నీరదేందు ఘనసార  పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల.......".....పోతన గారు.
 మూలా నక్షత్ర ప్రత్యేక విశిష్టత
 దుర్గాదేవి సరస్వతీదేవి రూపంలో 
దర్శనమిచ్చే పవిత్రమైన రోజు
  కచ్చపి వీణ ధరించి , పద్మాసినియై
  హంసవాహినియై
వీణ,దండ, కమలం ,అక్షమాల ,అభయ ముద్రతో
 భక్తుల అఙ్ఞాన తిమిరాన్ని దూరం చేసి
 మూడవ శక్తి రూపంతో ,సంగీత సాహిత్యాలకు 
అధిష్టాన దేవతయై 
బుద్ధి వికసింపజేసి విద్యనిచ్చే బ్రహ్మ దేవేరి
 పురాణాలలో ప్రస్తావించిన సరస్వతీ నదియై 
చరిత్రను అనుసంధానించి
 నవరాత్రి , వసంత పంచమి ఉత్సవాలలో 
ప్రముఖంగా ఆరాధించబడే సరస్వతీ మాత
 వాక్కు, వివేకం, విద్య ,కళలు ,విజ్ఞానాలకు
  అధి దేవత సరస్వతి
 ఓం శ్రీ సరస్వత్యై నమః
 ఓం శ్రీ మాత్రేయ నమః
****************************
 పేరు   మన్నె లలిత
 ఊరు హైదరాబాద్ 
చరవాణిసంఖ్య: 741 686 32 89 
 హామీ పత్రం:
 ఈ రచన నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను
52
[12/10, 8:58 pm] Lalita Sister: *కవితా గానం సీజన్ 2*
తేదీ:11-10-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: అన్నపూర్ణా దేవి
********************
కాశీ విశ్వనాథుని ధర్మపత్నీ!
కరుణాంతరంగ హృదయినీ!
ప్రాణి కోటికి జీవనాధారం 
పరబ్రహ్మ స్వరూపం అన్నమని తెలిసిన కాశీ పురాధీశ్వరీ!
ఆకలిగొన్న వారికి నిత్యాన్న దాతవై
ఆకలి తీర్చే అన్నపూర్ణేశ్వరీ 
పరమేశ్వరుడి మనసును గెలిచిన దేవీ!
సాక్షాత్తు శివయ్యకే భిక్ష పెట్టిన తల్లివి!
చేతిలో రస పాత్ర ధరించిన మాతా కృపా సాగరీ!

నిన్ను ధ్యానిస్తే చాలు
ధన ధాన్య వృద్ధి జరుగు
నిన్ను ఆరాధించినంత ఐశ్వర్య సిద్ధి కలుగు..

నిన్ను మనసారా పూజించినంతనే 
మా సమస్త భారాన్ని స్వయంగా మోసే అమ్మా..
53
[12/10, 8:59 pm] Lalita Sister: శరన్నవరాత్రులసందర్భంగా

నేటి అంశం :
సరస్వతీదేవి


శ్రీవర దాయినీ!జనని !శ్రీమయి !వాగ్మయి! హంస వాహినీ !
పావని బ్రహ్మ రాణి దయ వాక్సుధలన్ ప్రవహింపజేయ నా  
భావము నందు  నిల్పితిని భాసుర విద్యల భాగ్య దాయినీ 
దీవెనలీయవే శరణు ధీమణిమాలను నా కొసంగవే   !


సారపు ధారయున్ గురియ సత్క్రుతులన్  రచియింప జేయగా
భారము నీదె యంటినిల భాగ్యము శీఘ్రమె యందజేయుమా 
నీరజనేత్రి గావుమము   నీదయ నొoదగ వేడుకొంటి నే 
భారతి నామొరన్ వినుము బాసర వాసిని జ్ఞాన దాయినీ!
    *****పార్నంది లలితాకృష్ణ
54
[12/10, 9:00 pm] Lalita Sister: శరన్నవరాత్రుల సందర్భంగా..

నిన్నటి అంశం :
అన్నపూర్ణా దేవి 

క్షామం విలయతాండవం చేస్తున్న తరుణంలో...
కాశీ వాసులక్షేమం కోసం అవతరించిన
తల్లి

నిరంతర వేదఘోషతో
అలరారు 
ఆధ్యాత్మికా పరంపరల
పవిత్ర ధామంలో విరాజిల్లి....

కన్నీరొలుకుతున్న
 అన్నార్తుల కడుపు నింపిన కల్పవల్లి

కాశికాపురాధినేత్రియై
కరుణామృతాన్ని కురిపించి....
విశ్వేశ్వరుడికే భిక్ష పెట్టిన విశాలాక్షి

అక్షయ శుభాలనందించు
సకల సౌభాగ్యదాయిని 
అన్నపూర్ణాదేవి 
********లలితాకృష్ణ
55.

*కవితా గానం సీజన్ 2*:
అంశం: శ్రీ సరస్వతీదేవి వైభవం
ప్రక్రియ:వచన కవిత
తేదీ:12-10-2021
రచన: *నాశబోయిన నరసింహ(నాన)*
ఊరు: చిట్యాల,నల్గొండ
🕉️🕉️🕉️🕉️🕉️🔯🕉️🕉️🕉️🕉️🕉️
            *దేవీ వీణాపాణి!*
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''                             జ్ఞాన జ్ఞాపక సకల కళల అధి దేవత శ్రీవాణి
జీవుల నాలుకపై నర్తించే బుద్ది ప్రదాయిని! 

యుక్తాయుక్త విచక్షణ వివేచనశక్తి నిచ్చు తల్లి 
పలుకుల తల్లిగా అవతరించిన బ్రహ్మదేవేరి! 

హంస వాహనంపై ధవళ వర్ణ వస్త్రాలంకరణగా
అక్షరమాల అభయ ముద్రల పుస్తకధారిణి!

చందన చర్చిత దేహంతో దర్శనమిచ్చు భారతి 
కల్పనా నైపుణ్య కవితాస్ఫూర్తి నిచ్చు వీణాపాణి!

సత్య స్వరూపిణి శారదా సరస్వతీ మాతా
శుంభని శుంభులనే రాక్షసుల వధించిన దేవీ!                 

నమ్మిన వారినెపుడు పతనం కానివ్వని బ్రహ్మీ 
వాల్మీకీ వేదవ్యాస మహర్షుల వాగ్వైభవం నీవే! 

ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి
సకల విద్యల సమిష్టి మూర్తి వాగ్దేవి!

కాళిదాస కవీశ్వర కలం పదును నీవే
పాహిమాం!రక్షమాం! భాషా జ్యోతిర్మయి దేవీ!
                                                                                                                     🌀🌀🌀🌀🌀🌸♦️🌺🌀🌀🌀🌀🌀
✍️ *నాన*
56.
కవితా సీజన్ - 2
అంశం:: సరస్వతి దేవి
తేదీ::12.10.21.. మంగళవారం
శీర్షిక:: విద్యామాత

మూల నక్షత్రానికి మూలమై
ముగ్గురు మూర్తుల రూపమై
పర పస్య మధ్యమ వాక్కై
సర్వ కళలకు నీవే దిక్కై

బాసరలో బంధమై
చదువులకు ప్రారంభమై
పసిపిల్లలకు ఆరంభమై
విద్యార్థులకు విజ్ఞానమై

పద్మ0లో ఉపవిష్టయై
కచ్ఛపి వీణ పాణియై
విద్యకు రాణియై
సంగీత సాహిత్యాల స్వరూపమై

విద్వత్ ఉన్న వాళ్ళకు ఎదురుండదు
సర్వత్రా వారికి విజయం చేకూరు
జై దుర్గాదేవి జై సరస్వతి మాత!!
                 కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.      8309920625
పై కవిత నా స్వ0త రచన అని
హామీ
57.
[12/10, 9:30 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:11-10-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: శ్రీ సరస్వతీ దేవి వైభవం
*****************
చదువుల తల్లీ! సరస్వతీ మాతా!
అజ్ఞానాంధకారాన్ని తొలగించే
విద్యా విజ్ఞాన ప్రదాయినీ!

ధవళ వర్ణ వస్త్ర ధారిణీ!
హంస వాహినీ! శారదా దేవి! నమో వాగ్ధేవీ!

బ్రహ్మ దేవుని దేవేరీ!
సకల శాస్త్రాలకు మూల రూపిణీ!
సమస్త విద్యా వైభవ దీప్తీ!

వ్యాసునితో బాసరలో ప్రతిష్టించబడిన సైకత వీణా పాణీ!
నీ కరుణతో వెలుగొందు మా జీవన జ్యోతి!

 *వురిమళ్ల సునంద ఖమ్మం*
58
[12/10, 9:30 pm] +91 96528 32290: కవితా గానం ( సీజన్ 2 )
రచన :   గొర్రెపాటి శ్రీను 
అంశం:   సరస్వతీ దేవి
శీర్షిక :    "  విద్యా సిద్ధి దాయిని "


వివేకం,విజ్ఞానం..
సత్ ప్రవర్తన ..వంటి సుగుణాలెన్నో ప్రసాదించే చల్లని చూపులతల్లి..సరస్వతి దేవి!
బ్రహ్మ దేవేరి..సరస్వతీదేవి!
"కచ్ఛపి" అను వీణను ధరించి..
హంస వాహినియై ..వర్ధిల్లుతూ..
సకల కళలకు ఆరాధ్యదేవియై ..పూజలందుకునే విద్యా సిద్ధి దాయిని ..సరస్వతి దేవి !
అనంతుడు..
వాల్మీకి..
వ్యాస మహర్షి..
వంటి ప్రముఖులెందరో "శారదాదేవి" ని స్తుతించి సత్కవీంద్రులయ్యారు !
గురువు ఆగ్రహానికి గురైన యజ్ఞవల్క్యుడు కోల్పోయిన జ్ఞాపక శక్తినంతా తిరిగి ప్రసాదించిన కరుణామయి ..సరస్వతి దేవి !
వీణాపాణిగా.. పుస్తకం మాలాధారిణిగా ..
జ్ఞాన సరస్వతిగా తెలంగాణ రాష్ట్రం బాసర క్షేత్రం లో కొలువై ఉండి
జగతికి అక్షరాల సిరుల వరాల ను గుప్పించే మహిమాన్విత దేవి ..సరస్వతీ దేవి !

రచన : గొర్రెపాటి శ్రీను ( హైదరాబాద్)
59
కవితా గానం సీజన్--2
అంశం:--సరస్వతీ దేవి
శీర్షిక:-- సరస్వతీ దేవి

సీ. విలువైన విద్యలన్ విరివిగా నిందించు
నగుమోము‌ మన తల్లి నిలువ రాణి
సప్తమ దినమున సరసిజాక్షిని వేడ
నవరాత్రులందున నమ్రతొలుక
కోరినా దినమున కూర్మి యుప్పొంగగా
అక్షరాభ్యాసాన యమ్మ మిగులు
ఆశీసులందించి యభివృద్ధి కలిగించు
పిల్ల పాపలకును కొల్లగాను

తే.గీ. మనసు తీర వేడ ముదము మందిని నిండ
సకల శుభములు కలిగించు శారదాంబ
వెలుగు నింపును జగతిని విద్యలిచ్చి
అజ్ఞతను గూల్చి ప్రజలకు విజ్ఞతిచ్చు

సింహాద్రి వాణి
విజయవాడ
60.
కావ్యగానం(సీజన్2)
తేది12102021,మంగళవారం
అంశం:సరస్వతి దేవి.
శీర్షిక:వాగ్ధేవికి వందనము.
చదువులతల్లివీవు
వాగ్ధేవీవు
వీణపాణివి
శ్వేతవస్త్రధారిణివి
హంసవాహినివి
అక్షరమాలికవు
అనుగ్రహించవమ్మ మమ్ము!
సప్తమీతిధినాడు
మూలానక్షత్రమందు నీకు పూజలు చేసెదమమ్మ!
కటాక్షించవమ్మ!
శరన్నవరాత్రులందు నీ పూజ ప్రత్యేకము
ఆదిశక్తికినీవు తోడైనావు
ఆదరించవమ్మ మమ్ము
విధాతకు సహచరివినీవు
వరప్రదాయినివై దీవెనందివ్వవమ్మ!

ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు.
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా.
చరవాణి7780594995.





61.
[13/10, 8:03 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్‌ 2) 13/10/2021/ బుధవారము
         " దుర్గాదేవి "

అష్టమి తిథినాడు అవనిగాపాడగ
అరుదెంచె దుర్గాదేవి రూపమున

సింహగర్జనచేయుచు సింహవాహినిగ
శత్రుభయంకరి శత్రువులదురుమంగ

దుర్గముడనేరాక్షసుని హతమార్చినట్లు
పురాణగాధలు చెబుతున్నాయి

పంచప్రకృతులలో మొదటిది దుర్గా మాతరూపము
వేదస్వరూపిణి వేదమాత

ఆదిపరాశక్తి ఆదుర్గమ్మనిదలచిన
ఆందోళనలన్ని అణగి పోవు

దుర్గాదేవిదర్శనమున దు:ఖమన్నది యుండదు
ఈతిబాధలేవి యిలనుచేరవు

కష్టసమయాన దలచిన కనకదుర్గమ్మ
కష్టాలనన్ని కడతేర్చు

భవబంధాలను బాపగవచ్చెతల్లి
మోక్షప్రదాయిని మన దుర్గమ్మ

విరాటనగర దుర్గాలయమున
పాండవ పత్ని ద్రౌపదిగొలచినది
మనదుర్గమ్మ తల్లినే!
       తరణికంటి సూర్యలక్ష్మి.
                 ------------
62
[13/10, 8:05 pm] Aparajith: బతుకమ్మ తల్లి దుర్గామాత!

బతుకమ్మ తల్లిగా దుర్గామాత 
తెలంగాణ నారీమణుల పూలపరిమళాలు 
అవణిన మేము తెలుగువారమని 
రంగు రంగుల పూలను సేకరించి 
తంగెడు గునుగు గుమ్మడి బంతి చామంతి 
అలా రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి 
దుర్గామ తల్లికి తీరొక్క విధాల పూజలు సల్పి 
ఆడపడుచులందరు తాము పేర్చిన బతుకమ్మలను ఏటిగట్టునో చెరువు పక్కనో ఒకదగ్గర చేర్చి 
ఆటపాటలతో దేవిని కొలుచు పాటలే పాడుతూ 
కోలాటాలతో తమ శ్రమజీవన సౌందర్యముట్టిపడంగ 
గ్రామీణ ఆడపడుచులందరు రంగురంగుల చీరల్లో 
నేలతల్లి సొగసులారబోసినట్లు కనువిందు 
పల్లెటూరు యువతులు పాడే పాటలు ఆడే ఆటలతో 
గౌరీమాత ప్రసన్నమయి దీవెనలందిస్తున్నట్లు 
తెలంగాణ సౌందర్యం తాము పేర్చిన బతుకమ్మల్లో జీవనశైలి వన్నెలలో ఉట్టిపడగా 
పూలనే తలంబ్రాలుగా వేయు ఆటలు కమనీయం కనువిందు 
పూవు పూవులో తల్లి దుర్గమ్మ వెలసిన ట్లు ఆటపాటలు 
ఆకాశం మబ్బులు కమ్మి చల్లదనంతో సన్నసన్నని జల్లులు 
బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడపడుచులు తల్లిగారింటికి తరలివచ్చి 
బతుకమ్మ సంబురాల్లో తమ కాయకష్టం శ్రమజీవితం మరచి 
ఆనందం అలరారగా దుర్గామాతను కొలచి 
చివరకు చెరువులోనో పారుతున్న ఏటిలోనో 
పోయిరా గౌరమ్మ పోయిరా అంటూ పాడుతూ బతుకమ్మలను వదలే తీరు,,,,,,,,,!
పల్లెటూరి జనం కళాపిపాస అనిర్వచనీయం!
భక్తి ప్రపత్తులు ఆహ్లాదకరం కడురమణీయం!!

అపరాజిత్ 
సూర్యాపేట

63.
[13/10, 8:05 pm] Korada: కవితాగానం :- 8. వరోజు... 
.......దుర్గాదేవి అవతారం !
    కోరాడ నరసింహా రావు 
 తల్లి... విజయదుర్గవే నీవమ్మా 
     🔥🔥🔥🔥🔥🔥🔥
లెక్కకు మిక్కిలిగా రాక్షసులే... 
లోక  కంటకులై చరించగా... 
ఏకైక ఆ ఆదిశక్తియే... అనేక రూపుల అవతరించె నిల... !
చండీ... చాముండీ.. భైరవీ... 
కాళీ, దుర్గా... భవానీలుగా !!

ఏకమనేకం... అనేకమేకం... 
ఆ ఆదిశక్తికే  సాధ్యం... !
జన్మదాతలని మరచి... కామంతో...కోరివచ్చినఅసురుల జంపి... దుష్ట శిక్షణ - శిష్ట 
రక్షణ తో... ఈ భువిలో శాంతి 
సౌఖ్యముల స్థాపింప... !
నవదుర్గలుగా ఇలనువెలసినది
అష్టాదశ శక్తులై...పవిత్రభారతా
వని నలుమూలలా నిలిచినది!!

అబలని దలచి చులకన జేసి 
అనుభవించగా కోరిన... దనుజులభ్రమలుతొలగించి...
నీ అమ్మను నేను...ఆదిశక్తినని చాటుతూ... 
నవరాత్రులలోఅష్టమిదినమున
భీకర రూపున  దర్శనమిచ్చి... 
మహిషాసురునిసర్వశక్తులను 
హరించియాతని నిర్వీర్యునిగా
నిలిపెను తల్లి... !  
జయహే... జయహే.... జయ దుర్గా.... జయమునీకు మా 
విజయ దుర్గా... !!
      *****************
      ..... కోరాడ.
64
[13/10, 8:14 pm] Thathapudi Somashekara Sharma: కవితా గానం (సీజన్ 2)
అంశం..దుర్గాదేవి 
తేదీ..13.10.2021
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336
శీర్షిక.. జయ జయ దుర్గా! 

జయ జననీ... జగజననీ...
త్రిభువనిపాలిని.. జయదుర్గే
జయజననీ.. జయహో జననీ      
      జయ జయ దుర్గా జయహో జననీ 

విశ్వేశ్వరి ఓ విశ్వకారిణి
విశాలాక్షి నువు వేగమే రావే
విశ్వమాత నిను వేడితినమ్మా
విజయ దుర్గా వేగమే రామ్మా
     జయ జయ దుర్గా జయహో జననీ 

వందనమమ్మా అరవిందలోచని
విజయంబు నొసగే శ్రీ లలితాంబికా
విజయాలకురాణి.. విజయవేణి
విశ్వానికి దుర్గవు.. విజయదుర్గవు
     జయ జయ దుర్గా జయహో జననీ 

పరమేశ్వరి ఓ దుర్గాఅంబికా
ప్రణామమిదిగో ప్రత్యూషాంబికా
పార్వతిఅంశవు కనకదుర్గవు
పసుపుకుంకమల అలంకృతలలితా
     జయ జయ దుర్గా జయహో జననీ 

హామీ పత్రం
ఈ కవితాగానం నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
65.
13/10/21
కవితా గానం
పేరు: డా. బల్లూరి ఉమాదేవి
శీర్షిక: మహిషాసుర మర్ధిని.

1ఆ.వె:జనుల కావ నెంచి చాముండి దేవిగా 
      క్రౌంచ పట్టణమున ఘనముగాను
     నవతరించె దుర్గ నమరవరులు కోర
    నదియు శక్తి‌ పీఠ మయ్యె నవని.యందు.

2ఆ.వె: నరులు సురల చేత మరణము వలదని
    తపము చేసి వరము ధరను పొంద
     నవతరించి దుర్గ నసురుడౌ మహిషుని  
     సంహరించి జగతి జనుల కాచె.
     
3ఆ.వె:మహిష మెక్కి వచ్చె మహిషాసురు నణచ
     నష్టమి దినమందు నాది శక్తి
     నవతరించి తాను నాశ్వీజ మాసాన
     నసుర వరుని  జంపె నవని యందు.

4.ఆ.వె: మహిషుని దునుమంగ మైసూరు నగరాన
        వెలసె నంబ సురలు వేడుకొనగ
    సర్వ శోభితముగ చాముండి మాతగ
    ఆయుధములు దాల్చి అవతరించె.

5.సీ: పరమశివుని సతి పార్వతి దేవియు
        దక్షయజ్ఞమునందు దగ్ధమవగ
  చక్రము తోడను శవమును శ్రీహరి
      ముక్కలుగా చేయ పుడమి యందు
నవి శక్తి పీఠము లన నన్ని తావుల
   యందున పూజల నందు కొనుచు
కురులు పడినయట్టి కొండ ప్రాంతమనగ
    నాల్గవ పీఠమై నయము గాను

ఆ.వె: పూజ లందు కొనుచు భువనైక మాతగ
    వరము లొసగు చుండ వాసి గాను
     జనులు భక్తి తోడ చాముండి మాతను
    విజయమొసగు మనుచు వేడు చుంద్రు.
66.
కావ్యగానం(సీజన్2)
తేది:13102021,బుధవారం
అంశం:దుర్గాదేవి
శీర్షిక:దుష్టసంహారిణి
దుష్టసంహారిణి !
దురితనివారిణి!
దుష్టశిక్షణ చేసేతల్లి!
దుర్గాదేవివి నీవే!
దుర్గామాతవు నీవే!
దయగలతల్లివి నీవే!
దానవసంహారిణివి నీవే!
దారిద్ర్యనాశినివి నీవే!
నమ్మినవారికి న్యాయంచేసేవు!
నమ్మనివారికి నమ్మకము కలిగించేవు!
అందరినీ కాపాడే కల్పవల్లివి!
అందరిని రక్షించే రక్షణకవచానివి!
నీకు పూజలు చేసెదమమ్మా!
నీకు నివేదనలు పెట్టదమ్మా!
మము కాపాడగరావమ్మా!

ఇది నా స్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995.
67

కవితాగానం
తేది:13-10-2021
కవి పేరు:మద్ది. పుల్లారావు
ఊరు-జిల్లా:నందిగామ, కృష్ణా
శీర్షిక :అమ్మదుర్గమ్మ
ప్రక్రియ:మత్తకోకిల
ఈవారం కవితాసంఖ్య:3
---
1)

వర్గ భేదములెంచరాదని
 వైదికుల్ వివరించగా

దుర్గమంబగు భక్తి భావము
 తోడ యమ్మకు మ్రొక్కెదన్

దుర్గ మాతకు పూజ సల్పిన 
ధోషముల్ తొలగేనిలన్

దుర్గతుల్ తొలగంగ పచ్చని 
తోరణాలను గట్టగన్
...
ఇది నా స్వీయరచన

68.
కవితా గానం( సీజన్ -2)
 తేదీ :13/ 10/ 21- బుధవారం
అంశం :ఎనిమిదవ రోజు -దుర్గాదేవి
 శీర్షిక: దుర్గ ,విజయ దుర్గ.
************************************
 "సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే 
శరణ్యే త్ర్యంబకే  గౌరి నారాయణి నమోస్తుతే!"
 అంటూ  నుతింపబడి...
 దుర్గాసురుని దునుమాడి
 దుర్గతుల నివారించిన పరాశక్తీ!

 పంచ ప్రకృతి మహా స్వరూపాల్లో 
ప్రధమ రూపానివై
 మానవులకు మోక్షాన్ని ప్రసాదించే మాతా!
 కోటి సూర్య ప్రభల ప్రబల రూపీ!
శత్రుపీడనా సంహారీ!!
 నేటి  దుష్టులను దునుమాడుటకు,
 అక్రమంగా దండెత్తి వచ్చే 
శత్రువులను  సంహరించుటకు
 దుర్గాదేవివై దండించుటకురా!

అరుణ వర్ణ వస్త్రం ,అరుణ వర్ణ అక్షతలు ,
అరుణ వర్ణ పుష్పాలు  సమర్పించి  
శాకాన్నం ,గారెలు నైవేద్యంతో అర్చిస్తాము
 నమో నారాయణీ!నమో నమః!!
*************************************
 హామీ పత్రం :
ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.
 పేరు :మన్నె లలిత
 ఊరు: హైదరాబాద్ 
చరవాణి సంఖ్య :741 686 32 89.
**************************************
69.
కవితా గానం (సీజన్ 2).      13--10--2021.
పిన్నక నాగేశ్వరరావు.  
శీర్షిక :-- దుర్గా దేవి.

1. తే.గీ.
ఎనిమిదవ రోజు దర్శనమిచ్చు దుర్గ
దుర్గతులను నివారించు దుర్గ తల్లి
సింహ వాహన దుర్గ - విశేష పూజ
లష్టమి దినమందున నవరాత్రులందు
నందుకొనుచును సర్వ కార్యమ్ములందు
జయము కలుగ దీవించుమా సర్వ వ్యాపి.

2. తే.గీ.
దుర్గమాసురు డనువాని దునిమినావు
మనుజులందున తొలగించి మాయలన్ని
రుజలు తగ్గించుచున్ బాధలుపశమింప
జేసి, దుఃఖ,భయములను చిక్కులన్ని
తొలగజేసి ధైర్యము నిచ్చు దుర్గ మాత
శరణు శరణంచు వేడెద శక్తి నిన్ను!
**************************************
70.

కవితా గానం సీజన్ - 2
13.10.21..బుధవారం
"దుర్గామాత"

దుర్గముడిని దునుమాడ
సింహరూడియై అరుదెంచి
రాక్షస సంహరము గావించ
భక్తుల బాధలు తీర్చ

అమ్మవారి దర్శనం
సర్వ పాప హరణం
సర్వాభిష్ట కారణం
సర్వరోగ నివారణ0

నమ్మినవారికి అభయమిచ్చు మాత
మూలరామ్ ఇచ్చిన ముక్తి
నోసగు మాత
అన్యదా శరణం నాస్థి త్వమేవ
శరణం మమ అంటే
అఘములన్నీ తొలగించు ఆదిపరా శక్తి

కష్ట కాలమున కనకదుర్గమ్మ
కాపాడవమ్మా అంటే
కదలి వచ్చు మన వెంటే
నడుచు నీడలా మన తోటే
అలా అమ్మను అమ్మ దగ్గరలా
వుండాలంటే
శ్రీ రామకృష్ణ భక్తి ఎంతో
అంత భక్తి కలిగివుండాలి
ఉన్నప్పుడే అమ్మ దయ
సంపూర్ణ0గా మనపై ఉంటుంది
అప్పుడు విజయం మనకే
అందుకే అర్పించాలి మనసును  
భక్తికే!!
                 కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.     8309920625
71.
కవితాగానం ....సీజన్...2
తేదీ* 13...10....2021
అంశం* కనకదుర్గ
శీర్షిక=
     ఆది పరాశక్తి

అమ్మలకు అమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మ
ఇంద్రకీలాద్రిపై.కొలువై ఉన్న అమ్మ కనక దుర్గమ్మ/
ఆదుకునేందుకు వేగిరమే తరలి రావమ్మా....దుర్గమ్మ/
ఆగ్రహిస్తే కాళికవు 
అనుగ్రహిస్తే అవుతావు అమ్మవు/
ముల్లోక పూజితవు
ముక్కోటి దేవతలకు ప్రతీకవు నీవు
మమ్ము ఆదరించే అమ్మవు
ఆపదలను రూపుమాపే అపద్భందవి నీవు/
నీవె శక్తిని
దుష్టులను సంహరించే ఆది పరాశక్తివి నీవు/
.........................................
రచన 
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
చరవాని సంఖ్య.7416638823
పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
72.

     *దుష్ట శక్తుల సంహారిణి*
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''                             అస్త్ర శస్త్ర భూషణా లంకృత శోభిత శ్రీదేవీ                                                             
మందహాసిని మధురభాసిని ముకుంద రమణీ
నీ నామం జపించిన దుష్టశక్తుల భయం తొలగు
సమస్త దైవ శక్తులు మూర్తీభవించిన తేజోరూపం!

అఖిలాండ కోటి ఆరాధ్య దైవం ఆది పరాశక్తి 
ఇంద్రకీలాద్రి వాసిని  విమల మనోహరి వాగ్దేవి
అఖండ విజయ బలపరాక్రమ శక్తి స్వరూపిణి
పులి వాహన మెక్కి పుడమి నేలే పురంధరేశ్వరి!

మహిషాసుర మర్ధిని మహా శక్తి జగజ్జననీ
దుష్ట శక్తుల సంహారిణి విజయ దుర్గా భవాని
ఆకలి కడుపులు నింపే అన్నపూర్ణేశ్వరీ మహాకాళీ
కార్యసిద్ధికై అవతరించిన మోక్ష దాయిని జగన్మాత!

అలవోకగ కనికరించే అశేష జన మోహినీ
దుర్గాదేవి ఆరాధన శత కోటి పుణ్య ఫలం                  
శత్రు పీడనం తొలగిపోయి చేకూరు విజయం
ఆపద మొక్కులు తీర్చే అంబిక అమ్మోరు తల్లీ!

మహా ప్రకృతి స్వరూపిణి శంకరి అభయంకరి
కోటి సూర్య ప్రభలతో వెలిగే మహా గౌరీ కరుణాకరి
దుర్గముడనే అసురుడిని సంహరించిన చాముండి
సర్వ దుర్గతుల నివారించే కనక దుర్గా నమోస్తుతే!                                                                
🏹🏹🏹🏹🏹🔯🏹🏹🏹🏹🏹
✒️ *నాన*
73.
[14/10, 8:47 pm] Korada: * జయము... జయము *
      కోరాడ నరసింహా రావు 
         **************-
జయము... జయము దుర్గమ్మ 
జయమునీకు మాయమ్మ  !
ఆదిశక్తివేనీవు...అవతరించినావు ఇలను..., !!
దుష్టులను శిక్షించగ, శిష్టులను రక్షించగ...నవదుర్గలుగా నీవు 
వెలసినావు మాతల్లి... !
     " జయము... జయము "
భారతావనిన నీవు అష్టాదశ శక్తులుగా...కొలువై ఉన్నావు తల్లి....కామితములనీడేర్చగ!
 పైడిమాంబ, నూకమాంబ పోలమాంబ....దాడితల్లి... 
మరిడమ్మ, బతుకమ్మ... 
శతకోటి నామాలతొ... పలికెదవే మాయమ్మ !
   " జయము... జయము "
నిన్ను కామించిన వారి పీచ 
మణగించగ మాయమ్మా... 
కాళికవై, చండికవై...ఛాముండి
వి నీవేయై...భీకరాకృతుల దాల్చి... నీవు ఆ దుష్టులనే జంపినావు ! 
        " జయము... జయము "
  నీ విజయమే మాకు అనందమె మాయమ్మ !
భక్తి - శ్రద్ధలతోడ... నిన్ను
గొ లుతుమే అమ్మ !
ఉల్లాసోత్సాహములతొ మేము 
సంబరాలె జేసెదము... !
 సుఖసౌఖ్యములతోడ మము 
చల్లగ చూడుము తల్లీ.. !!
       " జయము... జయము "
     ********************
       ........ కోరాడ.
74
[14/10, 8:49 pm] మన్నె లలిత గారు కవయిత్రి: కవితాగానం (సీజన్-) 2 
తేదీ :14 /10/ 21 -గురువారం
 అంశం :మహిషాసురమర్ధిని
**************************

" మహిష మస్తక నృత్త వినోదిని......"  
అనే మహోగ్ర  రూపవర్ణన
 చెప్తుంది అసురుల దునుమాడుటకని

 ఆశ్వయుజ శుద్ధ నవమి మహర్నవమి
 మహిషాసుర యుద్ధం
 అఖిల దేవతల అంశలతో తల్లి 
మహాశక్తిగా ప్రభవించిన రూపం
 సింహ వాహనా రూఢియై 
సకలఆయుధాలు ధరించిన చండీదేవి
 సకల దేవతల అంశలతో
   కదలి వచ్చెను కదన రంగమునకు
 సంహరించెను మహిషాసురుని

 శత్రువుల పీడ తొలగి 
సకల శుభములు కలిగి
 సర్వ విజయాలు ప్రాప్తించి 
సర్వ శుభాలతో భాసించే అమ్మ 
మహిషాసురమర్ధినీి దేవి!
 అలసిన అమ్మకు హారతులిచ్చి 
చక్ర పొంగలి ,పులిహోర ,బూరెలు 
సమర్పించి
 విశ్రాంతినివ్వండి ఉదితలారా!
 రేపటి కొంగుబంగారం కనక దుర్గాదేవిని
 కొలవండి కొమ్మలార! భక్తిశ్రద్ధలతో.
*************************************
 హామీ పత్రం :
ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
 పేరు  :మన్నె లలిత 
ఊరు :హైదరాబాదు
 చరవాణి  సంఖ్య :741 686 32 89
*********************************
75
[14/10, 8:56 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం (సీజన్ 2).      14--10--2021.
పిన్నక నాగేశ్వరరావు.

శీర్షిక :-- మహిషాసుర మర్దని.

1.తే.గీ.
మూడు లోకాలను జయించి మూర్ఖ మహిషు
డు సురలను కూడ బాధ పెట్టుచును దిరుగ
వారలంత త్రిమూర్తుల వద్దకేగి
యసురు జంపెడు మార్గమ్ము నరయ మనిరి.

2. తే.గీ.
మూడు మూర్తుల తేజస్సు తోడ వారు
శక్తి యుక్తులతో మహా శక్తి యున్న
యష్ట భుజముల దేవిని సృష్టి జేసి
యస్త్ర శస్త్రములన్నియు నమరజేయ
దేవతలు నెల్లరును ప్రస్తుతించి రపుడు.

3. తే.గీ.
శక్తి రూపిణి యపుడు సమరమునకు
సింహవాహన మెక్కియు సిద్ధపడెను
యసుర ముఖ్యుల మఱివారి యనుచరులను
నష్ట దినములు పోరి యంతమ్ము జేసె.

4. తే.గీ.
తొమ్మిదవ రోజు నసురుడు దుర్గ కెదురు
నిలువ లేకను మాయల నెన్నొ జేసె
నెత్తులన్నింటి నంబిక చిత్తు జేయ
నతడు తాళలేక మహిషాకృతి ధరించె.

5. తే.గీ.
అంబ యతని తలను త్రిశూలంబు తోడ
తూట్లు పొడిచిన గాని యెదుర్కొనంగ
తలను నరకుచు చక్రాయుధంబు తోడ
మట్టుబెట్టగ దుర్గమ్మ మహిషు నపుడు
నవమి రోజున యందరానంద మందె.
**************************************
76
[14/10, 9:07 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: మహిషాసుర మర్దిని
సకల జనులకు విజయ లబ్ధిని

పాపాత్ముల దునుమాడి అవతారమూర్తిగా అమ్మ భవాని అందరినీ కాపాడ రావమ్మా

రాక్షసులను సంహరించిన
మహాకాళి శక్తి స్వరూపిణి
నవ దుర్గా నీవేనమ్మా

రాక్షసత్వాన్ని దునుమాడి తత్వము చేత
శూలము చేత సింహవాహిని వై విజయాలను చేకూర్చే రావమ్మా కాళీమాత వు నీవేనమ్మా

చల్లంగా చూడమ్మా నవదుర్గ వన దుర్గ జన దుర్గవు నీవేనమ్మా ప్రజా వల్లి క్షేమము కోరి దుర్గాదేవి నీవేనమ్మా

నిరంతరం నిన్ను కొలుతు మా యమ్మ అమ్మా నవదుర్గ నీవేనమ్మా కాళీమాత నీవేనమ్మా అమ్మ భవాని వి నీవేనమ్మా కరుణించి 
కాపాడ రావమ్మా ఈశ్వరి
అది పర శక్తి మహా విక్రమ దుర్గమ్మ అమ్మ భవాని నవదుర్గ నీవేనమ్మా

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453

77

[14/10, 9:13 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:14-10-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: మహిషాసుర మర్దిని
******************
సింహ వాహినీ!
అమ్మల గన్న అమ్మ దుర్గమ్మా!
మహిళలు అబలలు కాదు సబలలని నిరూపించిన మాతా!
జనన రక్షణ మోక్ష విధాయినీ!
త్రిమూర్తుల శక్తి స్వరూపిణివై
దుర్గా దేవి రూపంలో అవతరించిన దేవీ!
వరుణినిచే శంఖం
అగ్నిచే బల్లెం వాయువుచే అంబుల పొది
ఇంద్రునిచే వజ్రాయుధం
బ్రహ్మచే అక్షమాల
సూర్యునిచే కిరణాలనూ
శివుని చేత సింహ వాహనం పొందిన దుర్గా మాతా!
లోక కంటకుడైన మహిషాసురుని
అష్టమి రోజున సంహరించిన
మహోగ్ర రూపిణీ!

దుష్ట శక్తులను వధించి
శిష్టులను రక్షించే ఆదిపరాశక్తి!

ఇంద్రకీలాద్రిపై కొలువైన దేవీ
జగములను పాలించే జగన్మాత
రాక్షసుల బారినుండి కాపాడిన సాధు సజ్జనుల కాపాడి
భక్తుల పాలిట కొంగు బంగారమైన తల్లీ దుర్గా మాతా!
నిను కొలిచినంతనే సకల పీడలు తొలిగి
సంతసాలు దరిచేరును తల్లీ!

హారతులిచ్చెదను అందుకొనుము దేవీ! పాటలు పాడుదుము పవళించుము తల్లీ!

 *వురిమళ్ల సునంద,ఖమ్మం*
78
[14/10, 9:18 pm] Siimhadri Vani Poetess: కవితా గానం (సీజన్--2)
14-10-2021
గురువారం
శీర్షిక:--మహిషాసుర మర్థిని

1)సీ. విజయవాడ నగర విజయాల రాణిగా
వెలుగుచుండెను దుర్గ విభవమొంది
కోరుకున్న జనుల కొంగు బంగారమై
కాచి రక్షించెడి కన్న తల్లి
చెడు పైన మిక్కిలి చెలరేగి పోవుచు
చీల్చి చెండును తల్లి కూల్చివేయు
చేయెత్తి మ్రొక్కంగ చేయూత నందించి
కష్టాలు రాకుండ కాపు కాయు

ఆ.వె. వేడుకొనగ తల్లి వేగమే రక్షించి
ధైర్యమిచ్చి మనకు దారి చూపు
ఆమె పదములెపుడు నవనిలో వదలక
సేవ చేసుకున్న చేయు మేలు

2)సీ. ఆశ్వయుజము లోన నమ్మ దుర్గమ్మకు
శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి
వరకు జరిపెదరు వరుసగా నివదిన
వేడుకల్ భక్తులు వేడ్కమీర
ఒక్కొక్క దినమున నొక్కొక్క దనుజుని
సంహరించెను తల్లి శాంతి నిలుప
నవదినమ్ములలోన నవతల్లులను నిల్పి
దసరాన పూజించు దండి గాను

తే.గీ నవ దినమ్మైన శుద్ధమౌ నవమి నాడు
శక్తులెన్నియొ నామెకు సహకరించ
సింహమెక్కితాన్ చేపట్టి శూలము
మహిష సంహార మొనరించె‌ మాత దుర్గ

3)తే.గీ. దుష్ట సంహార మొనరించి దుర్గ మాత
ఇంద్ర కీలాద్రి పైచేరె నింపు మీర
కొలువు దీరెను చక్కగా వెలుగు లిడుచు
భక్తులందరు మిక్కిలి ప్రస్తుతించ

4) తే.గీ. అండగా మనకుండగా నమ్మ దుర్గ
భయము వీడండి బాగుగా పడతులార
దుష్ట తనమును దునుముమా దుర్గ వోలె
మీదు పిల్లల పెంచుడీ మేలు నడత

సింహాద్రి వాణి
విజయవాడ
చరవాణి:--7569820872
79
[14/10, 9:30 pm] +91 94948 00454: కవితా గానం
అంశం*మహిషాసుర మర్దిని
శీర్షిక*జగజ్జనని

అరాచకాల ఆకృత్యాలపై
అమ్మ అంకుశం
రక్కసుల కోరలు పీక
జగన్మాత దుర్గావతారం

దేవతల ప్రార్థనలను మన్నించి
బ్రహ్మ వరాలచే విర్రవీగే
మహిషాసురుడిని మర్దింపగా
ఏతెంచెను తల్లీ జగజ్జనని

నవరాత్రులు పోరాడి
అనేకానేక రాక్షసమూకలను చీల్చి
చెండాడిన మాత దుర్గాదేవీ
పాహిమాం పాహిమాం
రక్షమాం రక్షమాం

యుగాలు మారినా
అవగుణాలు మారలేదు
మనిషి విషపు వక్రచూపులు మారలే
వావి వరసలు మరిచిన
మృగాళ్ళ మదముననచ
అమ్మ దుర్గానుగ్రహంతో
శివానీ రూపమై 
రుద్రకాళీయై వీరవనితలు కొంగు నడుముకు చుట్టాలి
దుర్మార్గుల దుర్బుద్ధులపై ఉక్కు పాదం మోపాలి

ఓ మహిళా మణీ
ప్రజ్వల దీపాంకరీ భయంకరీ
లోక శుభంకరీ
లోక శాంతికి నీ కళ్ళు రుద్రరూపం దాల్చి
నీవే ఆదిశక్తివై నిలబడి గెలవాలి
అమ్మవై అవతరించాలి
ఓం శాంతి శాంతి శాంతి శాంతి శాంతిః

ఏడెల్లి రాములు ✍️
ది*14*10*2021(21*28)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
80
[14/10, 9:31 pm] +91 96528 32290: కవితాగానం (సీజన్ -2)
అంశం : మహిషాసురమర్థిని

శీర్షిక : "ఆనందాల వేడుక దసరా!"

రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)


మహిషాసురమర్ధిని అయిన దుర్గా మాత ను అనేక రూపాలలో పూజించే పండుగ దసరా !
లోకకంఠకుడైన మహిషాసురుడనే రాక్షసుడ్ని సంహరించి దుర్గామాత లోకానికి
శాంతిని,సౌఖ్యాన్ని
ప్రసాదించిన గుర్తుగా మనమంతా జరుపుకునే పండుగ దసరా !
తెలంగాణ రాష్ట్రం లో బతుకమ్మ పేరుతో 
మహిళలంతా ఎంతో ఉత్సాహంగా ,సంబురంగా
శ్రావ్యమైన పాటలతో 
అందమైన నృత్యాలతో గౌరమ్మలను పూజిస్తూ నవరాత్రులు జరుపుకునే ఆనందాల వేడుక దసరా ! 
దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి ధర్మాన్ని గెలిపించే అత్యంత ఉగ్రమైన రూపం మహిషాసురమర్ధిని అవతారము !
తొమ్మిదవ రోజైన నవమిని మహర్నవమి గా జరుపుకుంటూ 
భక్తులు ఆమ్మవారిని తమ శక్తికొలది పూజిస్తూ "దుర్గాదేవి" అనుగ్రహాన్ని వేడుకుంటారు !


  _ గొర్రెపాటి శ్రీను
81
[14/10, 9:33 pm] +91 85550 10108: *కవితా గానం సీజన్ 2*
అంశం: మహిషాసుర మర్ధిని వైభవం
తేది:14/10/2021
పేరు: నాశబోయిన నరసింహ (నాన)
🏹🏹🏹🏹🏹♦️🔱🔱🔱🔱🔱
పూజలు పండుగలు ఓ సామాజిక ప్రయోజనం కోసం
సామూహిక పూజా విధానం తరతరాల సంప్రదాయం

దేవీ నవరాత్రులలో విశేషమైన దినం మహర్నవమి
అమ్మవారిని అపరాజితగా ఆరాధించే దినం

భగీరథుడు తన పూర్వీకుల పునీతం చేయుటకై
గంగను దివి నుంచి భువికి రప్పించిన దినం

సకల దైవ శక్తుల అంశతో అవతరించిన మహాశక్తి స్వరూపం
మహిషాసుర మర్ధిని పూజతో  తొలగిపోవు శత్రుభయం
సర్వకార్యాల్లో  సిద్దించు విజయం

సింహ వాహనాన్ని అధిష్టించి
ఆయుధాలెన్నో ధరించిన చండీదేవి
మహిషాసురుని మట్టు పెట్టిన మహామాయ మహోగ్ర రూపం

లోకాలన్నిటికీ వెలుగునిచ్చేది సూరీడు
భానునికి కూడా ప్రకాశాన్నిచ్చే శక్తి స్వరూపిణి

ఎదుటి వ్యక్తి శక్తికి భయపడితే
విజయం సిద్దించదనే నగ్నసత్యం
ఆచరణాత్మకంగా చూపిన అమ్మవారి అపరాజిత రూపం

జయ జయహే మహిషాసురమర్దిని!
జన రక్షణ మోక్ష విధాయినీ
జయతి శుంభ నిశుంభ నిషూదినీ!
🌀🌀🌀🌀🌀🔯🌀🌀🌀🌀🌀
✍️ *నాన*


Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...