నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
********************
కవితాగానం సీజన్ 3
సమూహ సభ్యులకు శుభోదయం
రమణమహర్షి జయంతి సందర్భంగా
అరుణాచలం,
నేను ఎవరు?
రమణ మహర్షి
రమణతత్త్వం
పై అంశాలనుండి ఏదైనా ఒక అంశం ఎంచుకుని కవితలను పంపవలసినదిగా
ఆహ్వానం పలుకుతున్నది మన సమూహం.
ప్రతీ రోజు రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిదిన్నర వరకు సభ్యులు కవితలతో
స్పందించగలరు
చివరి తేదీ 25/12/2022
**************
కవి వరుల జాబితా
1.శ్రీ కోరాడ నరసింహారావు గారు
2.తరణికంటి సూర్య లక్ష్మి గారు
3.DVR గారు
4.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
5.అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు
6.అపరాజిత్ రెడ్డి గారు
7.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
8.తరణికంటి సూర్య లక్ష్మి గారు
9. గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
10.మేకల రామ స్వామి గారు
11.కేశరాజు వేంకట ప్రభాకర రావు గారు
12.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
13.తరణికంటి సూర్య లక్ష్మి గారు
14. గంటి మీనా కుమారి గారు
15.తరణికంటి సూర్య లక్ష్మి గారు
16. డా.తంగిరాల నాగ లక్ష్మి గారు
17.కవిత వెంకటేశ్వర్లు గారు
18.బొడ్డు హారిక గారు
19.ముడుంబ తిరు వెంకటాచార్యులు గారు
20.వేదాంతం సురేష్ బాబు గారు
21.డా.వేమూరి సత్యవతి గారు
❇️❇️❇️❇️❇️
1
@నేను ఎవరు... !?@
కోరాడ నరసింహా రావు
* అన్నీ నేనే - అంతా నేనే *
****************
అహం... నేను... !
సో హం.... అదేనెను !
త్వమేవాహం...నీవుకూడా నేనే
అహం బ్రహ్మ... అహం విష్ణు
అహమేవ మహేశ్వరః... !
వేదోపనిషద్వాక్యములివి... !!
ఇంకా సునిశితంగా ఆలోచించు
అహంవినా కించిత్ నాష్టివిశ్వం
అనే కాదు.,కేవలమహం జగత్
సర్వం...అని కూడాఅనగలుగు తావ్.....!
ఈ సృష్ఠి సమస్తమూ... నేనై...
నిండియున్నది... !
ఆత్మవత్ సర్వభూతాని... !
నేను...నేను అంటున్నది..అది
అదే * ఆత్మ *.. !!
నీ వెవరు.... ?
పంచ జ్ఞానేంద్రియాలా....
నాకన్ను, నాముక్కు, నాచెవి, నాచర్మం, చివరికి నాదేహం
అంటున్నావు కదా... అంటే...
అవేవీ నువ్వుకావన్నమాటేగా
నామనసు, నాబుద్ధి,నాప్రాణం
అంటున్నావంటే...ఇవేవీ కూడా
నీవు కావు కదా.... !!
వీటన్నిటికీ అతీతమై...
ఈ కార్య కలాపాలన్నిటికీ...
సాక్షీ భూతమై....
ప్రవర్తిస్తున్నదొకటి మిగిలి ఉందిగా.... అదే నోయ్ నీవు !
ఇంకా బోధపడలేదా...
అదేనోయ్ ఆత్మ.... !
అది నీలో ... నాలో... సకల ప్రాణికోటిలోనూ కొలువై వుంది!
అందుకేరమణమహర్షిఅంటారు
ఏదో...తెలిసుకోవాలనితపించకు...నిన్ను నువ్వు తెలుసుకో...
అంటారు !
సృష్ఠి సమస్తమూ నీలోనే ఉంది
నీలో ఏదైనా లేదుఅనినువ్వను
కుంటే ఈ ప్రపంచంలో ఎక్కడ వెదకినా అది ఉండదు !
ఇది సత్యము ! అన్నీ నీవే...
అంతా నీవే అయినప్పుడు...
ఇంక భేదాలకు, వాదాలకూ
ఖేదాలకు తావెక్కడుంటుంది !!
ఇదే సత్యము - శివము -సుంద రము...!
అంతా ఆనందమయం !!
******************
2
రమణమహర్షి జయంతి సందర్బంగా
" అరుణాచల శివుడు "
సీ ! అరుణాచలశివుని నానందమునుగాంచు
కనులార జూసిన కనులవిందు
చేతులారంగను చేసెడిపూజలు
చేతులభాగ్యము చెప్పలేము
సోమునినామాలు గోముగబలికిన
భావించనోటిదె భాగ్యమనగ
కొండప్రదక్షణము కోరిచేయంగాను
కోరికలేతీరు కోరకుండ
ఆ ! అరుణశివునినామ మంతరంగమునందు
నాపకుండపలుకు ననుదినమున
భక్తికలిగినంత భగవంతుడైనను
నిన్నువదలడెపుడు నిజమునెరుగు !
తరణికంటి సూర్యలక్ష్మి.
*****
3.
కవితాగానం సీజన్3
కవితాంశం:నేనెవరు?
శీర్షిక::నిన్ను నువ్వు తెలుసుకో!
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం
జననంతో జీవనగమనం
ప్రతిదశలో ఎన్నెన్నో మలుపులు
ధనకనకవస్తువాహనాలతో సంతృప్తి చెందలేవు
పదవులు పరువుప్రతిష్టలు చాలవు
ఇంకా ఇంకా ఏదో కావలనే తృష్ణ
ప్రతి అణువులో కనిపించేది కానలేవు
అన్నీ దశలలో ఆశాపాశాలను అనుభవించావు
చిట్టచివరివరకు చితిచేరేవరకు
నిన్ను నీవు తెలుసకోలేవు
నిన్ను నీవు తెలుసుకో
నేనెవరోనని పశ్నించుకో?!
ఇది నాస్వీయరచన.
4.
[20/12, 8:03 pm] Aalla Nageshwar Rao Poet: కవితా గానం (సీజన్ 3)
అంశం : నేను ఎవరు!?
శీర్షిక : బ్రహ్మ్మ చెక్కిన బొమ్మను
మంచిచెడుల విచక్షణా జ్ఞానాన్ని అమర్చి
అద్భుత మేధాసంపదను సమకూర్చి
సకల జీవరాసుల కన్నా మిన్నగా
మహోన్నతమైన మానవునిగ రూపుదిద్దిన
బ్రహ్మ చెక్కిన బొమ్మను నేను!
కర్మానుసారం చేసిన పాప పుణ్యాల ఫలం
భూమిపై జీవరాసుల జనన మరణ ప్రక్రియలకు కారకం!.
పిండికొద్ది రొట్టె అన్నట్లు
పుణ్యం కొద్దీ జన్మలు
పాపం కొద్దీ పునర్జన్మలు!
స్త్రీలకు పుణ్యం కొద్దీ పురుషులు
జననీ జనకులకు దానం కొద్దీ బిడ్డలు!
మంచి కార్యాలతో మోక్షలు
చెడు కార్యాలతో మరుజన్మలు!
ఏ జన్మలో ఎంతో పుణ్యం చేస్తేనే
ఈ జన్మలో మానవజన్మ లభ్యం
అపూర్వ వరంగా లభించిన మానవజన్మను
మానవసేవే మాధవసేవగా తలంచి
దానధర్మాలు చేసి తరింప చేసుకోవాలి
ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని గాంచుతూ
దయామయుడవై దీన జనులను కాపుకాయాలి!
మానవజన్మను ఎత్తిన నేను
పరహితంకై పరితపిస్తూ
దైవ చింతన లో కాలం గడుపుతూ
కన్నవారిని కనికరిస్తూ
పెద్దలను గౌరవిస్తూ
మానవతామూర్తినై భువిపై కీర్తిశేషుడనై మిగలాలి
దివిలో ధ్రువతారలా మెరవాలి!
*********-*****************
రచన :
ఆళ్ల నాగేశ్వరరావు
నాజారుపేట
తెనాలి...522201
గుంటూరు... జిల్లా
ఆంధ్రప్రదేశ్... రాష్ట్రము
చరవాణి :7416638823
&&&&&&&&&&&&&&&&&
పై వచన కవిత నా స్వీయరచనేనని హామీ ఇస్తున్నాను.
5
[20/12, 8:05 pm] అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: కవితా గానం (సీజన్- 3)
ఆధ్వర్యంలో
20-12-22
అంశం:-
రమణతత్వం
శీర్షిక:-
జీవన్ముక్తి కి సోపానం
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762
...............................
అరుదైన మానవజన్మనెత్తి
అరిషడ్వర్గాలకు లోనై
అయోమయ జీవితం గడుపుతున్న మనకి
అరుణాచలేశ్వరుని సన్నిధిలో
ఆజన్మ బ్రహ్మచారి గా
జీవన పర్యంతం గడిపి
పరమాత్ముని తెలుసునే ముందు
నీవెవరో తెలుసుకో అని
మానవత్వమే మాధవత్వమని
సర్వజీవులు పరమేశ్వర ప్రతిరూపాలేనని
జీవుని యందే దేముడున్నాడని
సర్వవేద సారమే రమణ గీత అని
ప్రేమతత్వమే ముముక్షత్వమని
అసూయ,అహంకారంతో చేసే పరమాత్మ పూజకన్న
జీవహింస చేయక ప్రతిజీవి పరిరక్షణయే ముఖ్యమని
బాహ్య సౌందర్యం కన్నా
అంతర్ సౌందర్యమే ముఖ్యమని
తాను కౌపీనము ధరించి
మూగ జీవుల సంరక్షణ చేసిన రమణ మహర్షి
సాక్షాత్తు అరుణాచలేశ్వర ప్రతిరూపమే
సమకాలీన వాశిష్ఠగణపతి ముని చెప్పినట్లు
రమణతత్వం వసుదైకానికే
ఆదర్శం
జీవన్ముక్తి కి సోపానం...!!
..............................
ఇది నా స్వీయరచన
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం.
9963265762.
..............................
6.
నేనెవరు??
అవును నేనెవరు?
నా శరీరమా నేను?
నా హృదయమా నేను?
నా మనస్సా నేను?
మరి నేనెవరు?
రివ్వున ఎగిసే ఆలోచనలు
మనిషిని మనిషి గా
బ్రతకకుండా చేస్తున్నాయి!
మనిషివన్న జ్ఞానం ఉందా అసలు?
ముప్పూటలా మేయటమేనా జీవితం?
అడవి పూచిన పూచిన పూవులావిరిసి రాలిపోతే
నీవన్నవాడు ఒకడున్నాడని ఎలా తెలుస్తుంది?
నేనైనా నీవైనా ఆకాశంలొ ఎగిరే పక్షుల్లా
జీవితంలో అలవిగాని ఆనందం అనుభవించాలి
నేనెవరు? అంటే
నన్ను నేను ఆవిష్కరించు కోవడమా?
లోకులు చెప్పే కాకి కబుర్లా నేను?
గతం తాలూకు పరుచుకున్న చీకట్లా
నేను?
నన్ను నన్నుగా చూడని లోకాన్ని
ఏమంటే ఏముందిలే?అని సరిపెట్టుకోవాలా
ఇంతకు నేనెవరు?
ఈదులాడే కష్టాల బ్రతుకుకు
చదువుకున్న అక్షరాలు నేర్పించవాయె
నేనెవరని
జీవితానుభవాలేవీ నన్ను నేనుగా బ్రతకనీయవాయె
స్నేహితులు,కుటుంబ సభ్యులు నన్ను వాడుకోవడమే గాని
నేనెవరో తెలియకుండా నిలువెళ్లా
తమ పేర్లు లిఖించుకున్నారు
నేను అనబడే వాడి ఆనవాళ్ళు కూడా లేవు
ఒకవేళ నీకు తెలుసా నేనెవరో???
అపరాజిత్
సూర్యాపేట
7.
21.12.2022
అంశం: అరుణాచలం
గజవెళ్ళి శ్రీనివాసాచారి
కాజీపేట హన్మకొండ జిల్లా
...
అరుణాచలం
ప్రసిద్ధ శైవ క్షేత్రమే
పరమేశ్వరుడు
బ్రహ్మ విష్ణువులకు
ఆదిదేవుడిగా సాక్షాత్కరించిన
పరమ పవిత్రమైన స్థలమే
సృష్టిలోని పంచభూతాలకు ప్రతీకగా
పృథ్వీ లింగంగా ఏకాంబరేశ్వరుడు
ఆకాశలింగంగా నటరాజస్వామి
వాయులింగంగా శ్రీకాళహస్తిలో
జలలింగంగా జంబుకేశ్వరంలో
అగ్నిలింగంగా అరుణాచలంలో
కొలువైన సదాశివుడు
ఆనందస్వరూపుడు
అరుణాచలాన్ని
ఆణ్ణామలైగా పిలిచే ఆచారం
అణ్ణాల్ అనగా అగ్ని
మలై అనగా పర్వతం
రెండు పదాల కలయికేగ
తిరువన్నామలైగా మారిందిగా
దేవశిల్పి మయుడు
నిర్మించిన ఆలయం
అపూర్వ శిల్పసంపదతో
అతి విశాలంగా
అలరారే దేవాలయం
కార్తీక మాసంలో
గర్భగుడిలో భరణీదీపం
వెలిగించే సంప్రదాయం
మహాదేవుడు
మహాజ్యోతి రూపంలో
సాక్షాత్కరించిన సుదినమే
అరుణగిరిపై మహాదీపం వెలిగించేది
8.
కవితాగానం ( సీజన్3) 21/12/2022/ బుధవారము
రమణమహర్షి జయంతి సందర్భంగా
" నేను ఎవరు "
సీ ! నీవెవరివనగ నీప్రశ్నకెవరును
చక్కగ తెలిపెడి జనులులేరు
ఎవరినియడిగిన నేమిచెప్పగలరు
తెలియరాకున్నది తెలిసికొనగ
నేనంటేకాయమా నేనంటే నెవరని
నేరమణమహరుషి నేనడిగితి
మనసునమలినాలు మాసిపోవంగాను
నీవెవరివనగ నీకుదెలియు
ఆ ! ఆత్మలోనగాంచు నాపరమేశుని
మానవత్వమొకటి మహిని నిలుపు
భూతదయయుకలిగి భువిని మెలగమని
దెలిపెరమణరుషియు తేటగాను !
తరణికంటి సూర్యలక్ష్మి.
*****
9
కవితాగానం
21.12.2022
అంశం: అరుణాచలం
గజవెళ్ళి శ్రీనివాసాచారి
కాజీపేట హన్మకొండ జిల్లా
...
అరుణాచలం
ప్రసిద్ధ శైవ క్షేత్రమే
పరమేశ్వరుడు
బ్రహ్మ విష్ణువులకు
ఆదిదేవుడిగా సాక్షాత్కరించిన
పరమ పవిత్రమైన స్థలమే
సృష్టిలోని పంచభూతాలకు ప్రతీకగా
పృథ్వీ లింగంగా ఏకాంబరేశ్వరుడు
ఆకాశలింగంగా నటరాజస్వామి
వాయులింగంగా శ్రీకాళహస్తిలో
జలలింగంగా జంబుకేశ్వరంలో
అగ్నిలింగంగా అరుణాచలంలో
కొలువైన సదాశివుడు
ఆనందస్వరూపుడు
అరుణాచలాన్ని
ఆణ్ణామలైగా పిలిచే ఆచారం
అణ్ణాల్ అనగా అగ్ని
మలై అనగా పర్వతం
రెండు పదాల కలయికేగ
తిరువన్నామలైగా మారిందిగా
దేవశిల్పి మయుడు
నిర్మించిన ఆలయం
అపూర్వ శిల్పసంపదతో
అతి విశాలంగా
అలరారే దేవాలయం
కార్తీక మాసంలో
గర్భగుడిలో భరణీదీపం
వెలిగించే సంప్రదాయం
మహాదేవుడు
మహాజ్యోతి రూపంలో
సాక్షాత్కరించిన సుదినమే
అరుణగిరిపై మహాదీపం వెలిగించేది
10
: రమణానందజీవితం
*****************
తనను తాను తవ్వుకుంటూ
మనసుపొరలు తెరచుకుంటూ
ఙ్ఞానచక్షువులు విప్పుకుంటూ
అఙ్ఞాననిశిని దాటుతుంటే
అదే రమణానందజీవితం
నేను నాదని గొప్పలేల
అహం స్వార్థం నిప్పుయేల
ఏదోఉందని వెతికితేనే
సాధనెంతో సాగితేనే
అదే రమణానందజీవితం
బాగాతెలుసని రోషమేల
బాగుతెలియని శ్వాసయేల
రాగబంధపు రొచ్చునుండి
విరాగితత్వము విశదమైతే
అదే రమణానందజీవితం
బాధలన్ని తోడుగుండవు
సంతసమ్ములు అంటియుండవు
తామరాకున నీటిబొట్టుగా
నిలిచియుండు నెనరు యున్న
అదే రమణానందజీవితం
మౌనసంద్రనీదగలిగితే
మట్టిబుర్రను తొలువగలిగితే
అవ్యక్తానుభూతిని అనుభవిస్తే
ఆత్మనుపరమాత్మ ఒడిలో నిలపగలిగితే
అదే రమణానందజీవితం
**********************
మేకల రామస్వామి
11.
అంశం....అరుణాచలం... కవితా గానం
శీర్షిక.....అగ్నిభూతము
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
22/12/22
*****************************"*****************
అరుణాచలం క్షేత్రము అరుణాచలేశ్వరీయము
అరుణాచలమహాత్మ్యం అవని లోని అద్భుతం!!
బోధనలు బోధించి మానవీయ విలువలు
సాధించే అరుణగిరికి శరణు వేడి వచ్చిన
భక్తుల పాలిట కొంగు బంగారమై వెలసిన
వేద విహిత ప్రాంగణం మోక్ష ప్రాప్తి మార్గం
శివ స్మరణ గావిస్తు ముక్తి మార్గ సాధకులై
గిరి ప్రదక్షిణ చేయు భక్తకోటి కోరిక ఈడేర్చే
ఈశ్వరుడు ఈ తేజోలింగ మహాదేవుడు
జ్యోతిర్లింగ స్వరూపుడు శివుడు ప్రత్యక్ష దైవం
ఔషధీయవనాలు ఆహ్లాదపవనాలు సుందర దృశ్యాలు
అమృత వాక్కులు వెరసి మనోల్లాసమై మైమరిపించి స్వాస్థ్యము చేకూర్చు సంజీవని ఆ అరుణా చలం!!
అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం అందుకే దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికే ప్రదక్షిణము అని భక్తుల నమ్మిక...
రమణుల ఉధ్ఘోష మహాపుణ్యం సిద్ధిస్తుందని ఆ గిరి ప్రదక్షిణ వలన కైవల్యం ప్రాప్తి యని మహాత్ముల వచనం. అందుకే... నిత్యమూ, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూనే ఉంటారు
అరుణాచలం పంచభూతలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక...
అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని . అ-రుణ అంటే పాపములను పరిహరించు
గొప్ప పుణ్యక్షేత్రము...
స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము...
కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తుల విశ్వాసం ....
అదే అదే అదే అరుణాచలం భక్తుల మనోవాక్కాయ ఫలం!!
స్వీయ రచన::; కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
పాతర్లపాడు...ఖమ్మం .
12.
కవితా గానం సీజన్3
అంశం: అరుణాచలం
శీర్షిక: సర్వదోషహరం
శివతత్త్వం అర్ధంచేసుకోవడం కష్టం
భోళా శంకరుని ప్రసన్నం సులభం
అందుకేనేమో ఆయన కొలువైనాడు
స్మరణ చేతనే ముక్తి నొసగే అరుణాచలంలో.
అగ్నిలింగంగా వెలిశాడచట హిమవంతుని అల్లుడు.
సర్వపాపాలు హరించేదే ఈ ఎర్రని కొండ
ఈ పుణ్య క్షేత్రంలో వేసే తొలిఅడుగుతో తొలిగిపోతాయి మానసిక దోషాలు.
రెండవ అడుగు హరిస్తుంది వాక్కు ద్వారాసంక్రమించిన దోషాలను
శారీరక దోషాలు పటాపంచలౌతాయిమూడోఅడుగుతో.
అరుణ గిరి ప్రదక్షిణ మారుస్తుంది జీవితగమ్యం.
విముక్తి నిస్తుంది జన్మదొంతరలనుండి.
పరిపూర్ణం చేస్తుంది జీవితాన్ని
అరుణ గిరి ప్రదక్షిణ సాక్షాత్ పరమేశ్వరుని ప్రదక్షిణ.
అందుకే అచల ప్రదక్షిణతో సిద్ధిస్తుందిమహాపుణ్యం
అరుణాచలం దర్శనానికుండాలి యోగం
ఆయోగం ప్రసాదించమని వేడుకుందాం అరుణాచలేశ్వరుణ్ణి
రమణుల ఆశ్రమాన్ని కూడా సందర్శించి చేసుకుందాం మానవజన్మ సార్ధకం.
తిప్పావఝల నరసింహమూర్తి
13.కవితాగానం( సీజన్3) 22/12/2022/ గురువారము
" రమణమహర్షి జయంతిసందర్భంగా "
" రమణుల జ్ఞానబోధ "
సీ ! మహనీయుడనగాను మహరుషిరమణులు
జ్ఞానతత్వమునకు జాడదెలిపె
మనసెరిగినముని మాటాడకున్నను
జనులమనసుభావ జాడలెరుగు
నీలోనిభావాలు నీకుదెలియుగాని
అందరిభావాల నతనికెరుక
అవతారపురుషుడు నవనినవతరించె
జనులకందించెను జ్ఞానమంత
ఆ ! శివునిసేవచేయ చిత్తశాంతిదొరకు
శాంతిసౌక్యములును సంతరించు
ఆత్మ జ్ఞానమెరుగ నాత్మచింతనచేయ
నిర్మలముగనుంచు నీదుమనసు !
తరణికంటి సూర్యలక్ష్మి.
*****
బుచ్చిరెడ్డి పాలెం.
14.
కవితాగానం సీజన్ _3
అంశం : అరుణాచలం
పేరు: గంటి మీనాకుమారి
ఊరు: శ్రీకాకుళం
శీర్షిక: "మహా మహిమాన్విత క్షేత్రం "
ప్రక్రియ: పద్యము
_________________________
సీ|| అరుణాచలము కట్టె నా విశ్వ కర్మయు
శివునాజ్ఞ మేరకు ,స్థిరమాయె
పూజతంతుశివునిబోధవలన ,చేసె
గౌతమమాహర్షి ఘనముగాను
జ్యోతిరులింగతేజోలింగమీ యగ్ని
క్షేత్రమ్ము,దర్శించ కడుఫలమ్ము
అరుణాచలగిరిప్రదక్షణమారో గ్య
కరమని జగమందు గాంచె పేరు
తేగీ|| రమణులనుగ్రహబోధయు రమ్య మయ్యి
మోక్ష మార్గంబు జూపు ,ముముక్షువులకు
అభయమిచ్చునపీతకుచాంబికంద
రకును,యరుణాచలేశుడేరక్షమనకు
"శివోనస్సుమనోభవా"
_________________________
ఈపద్యం నా స్వంత రచనే .
_________________________
15.
కవితాగానం( సీజన్ 3) 23/12/2022/ శుక్రవారము
" రమణమహర్షి జయంతి సందర్భంగా "
" అరుణాచలము "
సీ ! అరుణాచలమునందు నడుగిడునంతనె
ఆనందమంతయు నందగలదు
అరుణాచలములోని అగ్నిలింగము చూడు
యిలలోనిదేవుడు ఈశుడతడె
అచటికిబోయిన ఆధ్యాత్మచింతన
అందించుదైవము ననువుగాను
ఆధ్యాత్మచింతన నలవడినంతనె
అహమసూయలుకూడ నణగిపోవు
ఆ ! ఆత్మచింతలోనె నలవడుజ్ఞానము
ప్రేమదయయుపెరుగు పెద్దగాను
శాంతిసాధనలను సంతరించుకొనగ
చిత్తమందు తొలగు చింతలన్ని !
తరణికంటి సూర్యలక్ష్మి.
*****
16.
అంశం:
అరుణాచలుని మహత్యం
డా. తంగిరాల నాగలక్ష్మి
మహాదేవుడే అవతరించె
రమణులుగా
ఆత్మలో తనకు తానే పరమాత్మ యని
ఎరిగించు వారు రమణులు
అందుకే భగవాన్ రమణ మహర్షి యని
కొనియాడితిమి
రమణుల తత్త్వమే శివ త్త్వం
నీవు శివుడయితేనే శివ తత్త్వం తెలుస్తుంది
శివోహం శివోహం శివో హం
గిరి శాయ గి రీశాయ నమోనమో
జ్యేష్టాయ శ్రేష్ఠాయ నమో. నమో
మహేశ్వరా య మహినాధా య నమోనమో
ఆఅర్చన లేల ఆలయ దర్శనంబు లేల
అభిషేకప్రియుడవు గదా నీ పాదాల
నా కన్నీటి భాష్పాలు చాలవా
నమక చమకాల ఘోష ఏల
అష్టమూర్తి తత్వాన్నది గమించి
అమృత త్త్వాన్ని అధిరోహించతివి అరుణాచల శివా
ఎంద రెందరినోక్షమించి తివి
నా పైనను దయజువుమయా తండ్రీ
పరమేశ్వర తత్త్వరహస్యము. తెలుపుమయా
అజ్ఞానము తొలగించి సుజ్ఞానము నొసఁగుమయా
అరుణాచల శివా
అష్ట దిక్కులకు దిక్కై తివిదిగంబరా
అగ్ని గోళమై ప్రజ్వరిల్లు శివా
అర్ధ నారీశ్వర తత్త్వవిభూతు డవు అమృత శివా
అరుణాచల అగ్నిలింగము నీవే
అమరనాథ్ లోని మంచు లింగము నీవే
చిదంబరములోని ఆకాశ లింగము నీవే
శ్రీ కాళ హస్తి లోని వాయు లింగము నీవే కంచి లోని పృధివీ లింగము నీవే
జంబుకేస్ ర. ములోని జల లింగము నీవే
ద్వాదశాక్షర మంత్రమై.
ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపమై
దశదిశలా పలుదశల ఆవిర్భావ
భూతడవై అలరారు అక్షయ లింగా
అరుణాచల శివా
అరుణాచల శివ నామ మంత్రము జూపు
మోక్ష మార్గము
మానసంబున నిలకడగా నిలువుమయా
ఓ అరుణాచల శివా
పంచ తత్వములు
పంచకోశ ములు
పంచారా మములు
పంచ భూతములు నీలో నింపుకున్న నిర్గుణ నిరాకార నిరంజన నిర్వికల్ప
పరబ్రహ్మ తత్వమయా నీవు
అరుణాచల శివా
ఆధార కమలం నుండి
సహస్రారముకు జేర్చి
అమృత సింధువులు
కురిపించవయా
అద్వైతంబు అనుభవంలోకి
రప్పింపు. మయా
శంకరా భయంకర రాఅభయం.కరా హర హరా
సాంబశివా సాంబ శివా శివ శివ అరునా చల శివా
కార్తీకాన అరుణ జ్యోత్గిసందర్శనం
అఘనాశ నంబు
జ్వాలా తోరణమున శివపరివారంతో
ఊరేగింపు
జన్మ జన్మల సుకృతంబు
పరమ దుర్లభమైన
కైలాసములో స్థానం.
జన్మకోశి వారాత్రి వ్రతం
జన్మకుసార్ధకతకు సోపానం
సాంబ సదా శివ సాంబసదా శివ సాంబశివా
కాశీ విశ్వనాథ కైలాసనాధ జగన్నాధ
మన్నాధ రమణా
అరుణాచల శివా అరుణాచల
శివ ఆరుణాచలా
17.
తేదీ:: 25.12.22..ఆదివారం
అంశం:: నేను ఏవరు
చదువుపై శ్రద్ధ లేదు
పెద్దలు చెప్పిన వినలేదు
అన్న మొత్తుకున్న చెవికెక్కలేదు
అన్నామలై పైనే దృష్టి
భక్తిపైనే తదేక దృష్టి
ఎప్పుడెప్పుడు పోవాలి
అరుణాచలము
ఎప్పుడు చేసుకోవాలి
ఆ దేవదేవుని దర్శనము
అని మనసులో ఆరాటము
మనసుతో బుద్ధితో పోరాటము
ఎలాగైనా పోవాలనే దృఢనిశ్చయము
బయటకు కాలు పెట్టిన రోజే
శుభదినము
కాలినడకన కొంత దూరము
కొంత రైలు ప్రయాణము
చేరే అనుకున్న స్థలము
అదే అరుణాచలము
కలలు కనిన కమనీయ ప్రదేశము
పుష్కర కాలము తపమాచరించే
మౌనమునే ఆశ్రయించే
నేను ఎవరు
నీవు ఎవరు
దేవుడు ఎక్కడ వున్నాడు
అని అడిగే వారికి
నీలో "నేను' అనేది ఎక్కడ నుంచి వస్తుంది
అది గుర్తించి నప్పుడే
నిన్ను నీవు తెలుసుకుంటావు
ఆ అంత్యార్యామిని కలుకుంటావు!!
కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు. 8309920625
ఈ కవిత నా స్వీయ రచన అని
హామీ
18
[*రమణ మహర్షి గారి జయంతి సందర్భంగా రాసిన కవిత (కవితా గానం సమూహం)*
పేరు:- *బొడ్డు హారిక*
కలం పేరు:- *కోమలి*
ఊరు :- *రాజమహేంద్రవరం*
జిల్లా:- *తూర్పు గోదావరి జిల్లా*
రాష్ట్రం:- *ఆంధ్రప్రదేశ్*
అంశం:- *నేను ఎవరు ?*
నీటిలో నిండని దానిని
వాయువులో ఉండని దానిని
అగ్నికి అందని దానిని
మిన్నులో మిండైన దానిని
మన్నులో మిగిలే దానిని
బంధాలకు బందీ కానీ దానిని
మరణం లేని దానిని
పరమాత్మకై పరితపించే దానిని
జ్యోతిగా జగన్నాథుడిలో జతకలిసే దానిని
హామీ పత్రం:- *ఈ కవిత నా సొంత కవిత అని హామీ ఇస్తున్నాను*
19
అంశం: అరుణాచలం.
అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ యని
స్మరియించరో జనులార! మీరు.
ఆత్మయే దైవము, దేహమే దేవలమ్మని
మౌనబోధజేసిన గురుని తలచరో జనులార! మీరు.
గిరిప్రదక్షిణమె శివదర్శనమని యెరిగి
అరుణాచలమును దర్శించరో జనులార! మీరు.
మౌనధ్యానమే ఆత్మదర్శనమార్గమని,
ఆత్మదర్శనమే శివదర్శనమని మౌనముగానే బోధించిన రమణుని అనుసరించరో జనులార! మీరు.
"నేనెవరిని" యని శోధించు వారలకు మౌనచింతనయే మార్గదర్శనమని,
శివతత్త్వమే రమణ తత్వమని, దేహముపైని మోహము విడిచి, రమణుని మార్గము సాగరో జనులార! మీరు.
అరుణాచలమది అగ్నితత్వమని, పంచభూతాత్మకుడు
ఆ శివుడే గిరియని తలచి మ్రొక్కరో జనులార! మీరు.
***** ****** ******* ******
ఇది నా స్వీయరచన. ఏ ఇతర రచనకు అనువాదము గానీ, అనుకరణగానీ, అనుసరణ గానీ కాదు.
@ముడుంబ తిరువేంకటాచార్యులు, మానుకోట.
20
""""'''''''''''''''''''''''''""""""""""""""""""""""""""
నేనెవరు ?
"""""""""”''''"""''''""""""'
సంకుచిత భావజాలంతో
నేను నేనని ప్రేమించడం
ఈ దేహమే నేనని తలచడం
నేనొక జీవుడనని నమ్మడం
జీవునికీ దేవునికీ సంబంధం లేదని
జీవుడు దేవుడు వేరని భావించడం
దుఃఖ హేతువులని గ్రహించక పోవడం
అనేక విచారాలతో అనేక చింతనలతో
మనిషి బలహీన పడడం
దానినుండి బయట పడేందుకు
తగిన జ్ఞానాన్ని పొందడానికి
మనిషి ప్రయత్నించక పోవడం
అజ్ఞానం నుండి బయట పడడానికి
తనను తాను తెలుసుకోలేక పోవడం
నేనెవరు ? నేనెవరు ? అని
ప్రశ్నించుకుంటూ పోతే
జీవ దేవ భావం కలుగుతుంది
అహం బ్రహ్మాస్మి -అయమాత్మా బ్రహ్మ
జీవుడే దేవుడు - దేవుడే జీవుడు
తత్వమసి అనే ఉపనిషసద్వాక్యం
అజ్ఞానాన్ని పారద్రోలి
సుజ్ఞాన పథంలో నడిపించీ
సమస్త విచారాలు - ఆశలూ
రోగములూ - రాగములకు
మూల స్థానమైన మనస్సును
అదుపుచేసి అనంత లోకాలకు
నడిపిస్తుంది ఆత్మతత్వం
అదే రమణతత్వం
అదే రమణీయ తత్వం
******************************
🖋️ వేదాంతం సురేశ్ బాబు
21.
గిరిజాశంకరగిరి!
ప్రకృతి-పురుషులే గౌరీ శంకర వాసంగా అరుణగిరి!!
భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణంటే కొండకి ప్రణామం!!!
గోపాలుని గోవర్ధన పూజ వంటిదే!!
లోక రక్షణా నినాదం ఎన్ని పనులు చేయించింది??
మంటగావున్న నిప్పుని కంట దాచింది!!
గరళం వ్యాపించకుండా గొంతున దాచింది!!
విషపుకాటు బాధ లేకుండా భుజఘభూషణుడిగా చేసింది!!
భూతపిశాచగణాల పీడ లేకుండాసమక్షంలో నే తొక్కిపెట్టింది!!
తాపంతగ్గుతుందనేమోచంద్రశేఖరునిగా గంగాధరునిచేసింది!
సృష్టిస్థితి లయల నిర్దేశించే ఆట నటరాజుని చేసింది!!
అమ్మ లీలగా మూసిన మూడుకనులు అపరాధభావంతో పార్వతిని తాపసిగా చేసింది!
తపోసాధనమెచ్చి న రుద్రుడే దిగిఅరుణాచలమైనాడు!
అందుకే ఆధ్యాత్మికానుభూతులెన్నో!!
సిధ్ధులో,సాధ్యులో,నందీశ్వరుడో, వీరభద్రుడో,భైరవుడో..
పరోక్షంగా తిరుగాడేబంగారుకొండ!!
బీజారాధనమే లింగరూపం!!
అపీతకుచాంబ ఆంతరంగం!!
భక్తి-ముక్తికిదే కదా దారి!!
Comments
Post a Comment