Skip to main content

తొలకరి 6/2022

నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
 వీరా గుడిపల్లి
***************
కవి వరుల జాబితా
1.అపరాజిత్ గారు 
2.కోరాడ నరసింహారావు గారు 
3.కె.వి.రమణాచారి గారు 
4.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 
5.జోషి పద్మావతి గారు 
6.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 
7.తరణికంటి సూర్య లక్ష్మి గారు 
8.గజవెళ్ళి శ్రీ నివాసచారి గారు 
9.తోట సులోచన గారు 
10.దుద్యాల రామచంద్రం గారు 
11.వనపర్తి గంగాధర్ గారు 
12.సింహాద్రి వాణి గారు 
13.ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 
14.తిప్పావఝల నరసింహ మూర్తి గారు 
15.కందూరి సుజాతా రాణి గారు 
16.గొర్రెపాటి శ్రీ ను గారు 
17.వేదాంతం సురేష్ బాబు గారు 
18కవిత వెంకటేశ్వర్లు గారు 
19.వేదవాణి గారు 
20.పిన్నక నాగేశ్వరరావు గారు 
21.ఏడెల్లి రాములు గారు 
22.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు 
23.డా.తఃగిరాల నాగ లక్ష్మి గారు 
****************
1
రైతన్నా !!

చిట పట చినుకుల సవ్వడి తో 
తొలి కోడి కొక్కొరొకో అని కూసింది 
గుండెల్లో గుబులు గుబులు గా రైతన్న మేల్కన్నాడు !!
మండే ఎండల నుండి వానాకాలం వచ్చింది 
వాన చినుకుల్లో కొప్పెర పెట్టుకొని 
పొలం చెలకంతా కలియతిరిగాడు !!
ఎడ్ల మెడలపై అరకతో సాలిర్వాలు దున్నుతూ 
రైతు కళ్ళలో దోరగా పండిన జొన్న కంకులు, వరి కంకులు !!
అప్పటికి పొద్దు బారెడెక్కింది 
తన ఇల్లాలు ఏమయ్యో !సద్ది బువ్వ తిందువు రా !!
ఒడి నిండా విత్తనాలు 
భర్త దున్నుతున్న సాలువెంట చల్లు తోంది 
ఈ ఏడన్నా పంట చేతి కొస్తుందా? !!
అరక ఆగింది !వానజల్లు ఆగింది !
తూర్పు దిక్కున ఇంద్రధనుస్సు తళుకు లీనుతోంది !!
ఇద్దరి కళ్ళల్లో ఏదో అనిర్వచనీయ ఆనందం 
బాయి కింది పొలం లో నీళ్లు పెట్టి 
నారు మడి దున్ని !దున్నేకొద్దీ పంట !
తనకు తోడుగా పక్క పొలాల రైతన్నలతో 
కరిగట్టు దున్ని రైతు కూలీల తో నాట్లు వేసాడు !!
రైతు స్వేద బిందువులే అస్త్రా లయ్యాయ్ 
తెల్లారి చూస్తే పొలమంతా ఆకు పచ్చ చీర కట్టుకుంది !!
అయ్యా !అయ్యా !అంటూ చిన్నోడు ఒడి చేరాడు 
అరేయ్ !బడికి పోయి సదువు కోవురా !!? 
పక్షం తిరక్కుండానే ఏపుగా ఎదిగిన వరి పైరు, జొన్న చేను 
వరి పైరు దోమకాటుకు పంపుతో మందు కొట్టి, కలుపు తీసి 
ఓ సారి నా వైపు సూడు !!
పాల కంకులతో దోబూచులాడుతున్న వైనం 
రైతు కళ్ళలో మురిపెం మూడింతలు !!
ఇలాగే కాలమైతే గుమ్ముల నిండా వడ్లు, జొన్నలు 
ఏమైందో ఏమో వాన దేవుడికి? !!
ఎండల మంటలతో పైర్లు ఎరుపెక్కాయి 
ఎటు చూసినా వాన మబ్బు కానరాదాయె !!
దిక్కు తోచక దిగాలుగా ఇంటి దారి పట్టాడు 
దొంగోడు ఉరికొచ్చి మీద పడ్డట్టు 
ఓ అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో జోరు వాన కురిసింది !!
ఊరు ఊరంతా ఉలిక్కి పడి లేచింది 
ఈ ఏడు మన పంటలు గట్టెక్కాయి రో !!
లెగండి !లెగండి !మన పొలాల కాడి కెళ్దాం !
పొంగి పొర్లే వాగులు, వంకలు 
అలుగులు దుంకుతున్న చెరువులు !!
మోటారు బావుల నిండా నీళ్లు !!
కొన ఊపిరి తో ఉన్న చేలన్నీ దూప తీర్చుకుంటున్నాయ్ !!
రైతన్నల కళ్ళలో ఆనందం అర్ణవమాయే !!
చిరిగిన అంగీ అయినా తొడుక్కో 
పుడితే రైతన్న గా పుట్టు !!

అపరాజిత్
2.
[24/06, 8:31 pm] Korada: అంశం :- @ తొలకరి @

    కోరాడ నరసింహా రావు 
        * ఆశలు చిగురించగా ! *
          .  *************
కర్షకుని ఆశలు దీరగ... 
  కారుమబ్బులుకమ్మి.... 
 ఉరుములతో,మెరుపులతో 
 నేలతాపము దీరు నటుల...
   కురిసెను  తొలకరి జల్లు... 
      రైతు కలల హరివిల్లు...!
       
కాడెద్దులతో నాగలి పట్టి.....
      కదిలె నతడు విడి-వడి.... 
 అదను  యిదేనని దుక్కిదున్ని
       ఆశల ఆకును బోయగా !

ఉడుపులు... ఉడిచి..... 
  పండబోవు పంటను దలచి... 
 ఎన్నెన్నో ఊహలతలపులు ..
మదిని పరవశింపజేయగా...  
ఉరకలువేసే ఉత్సాహముతో... 
ఆహరహమూ పరిశ్రమించుచు 
అందరి ఆకలి దీర్చును రైతన్న 
   ఎదురుదెబ్బలెన్ని తగిలినా 
నిరాశచెందడు నేలను వీడడు 
 చావైనా బ్రతుకైనా నేలతల్లి ఒడిని వీడడు !!
   ఈరైతే...రాజు...ఒకనాడు !...చేసిన  అప్పులు బరువై....
   కూటికి, గుడ్డకు కరువై...  
దిక్కుతోచక, దారితెలియక.... 
ఆత్మహత్యలకు తెగబడిన.... 
సాటి రైతులు మదిని మెదలగా  అట్టి తప్పును తాను చేయ రాదని దలచి, చెదరని ఆత్మస్తైర్యముతో పొలమువైపు పయన మయ్యెను !
     ********************
3
[24/06, 8:32 pm] +91 94904 14273
: *సల్లవడ్డది*
పానం చల్లబడ్డది నీకొరకై
ఎదురు చూస్తు కన్నీటి ధార లో తడిసిపోతున్నా తడిబారిన  రైతు గుండె  బాధను చూసి కరిగిపోయిన  మేఘం వచ్చి
*సల్ల పడ్డది*
చేసే పనిలో చెమటతానం చేస్తు జానెడు పొట్టకై సగటు జీవి కూలీలను చూసి  ముచ్చటపడి వాన వచ్చి
*సల్ల పడ్డది*
తడి ఆరుతున్న  జీవజంతువులు గొంతుకలు దప్పిక తీర్చే ఒక దండుగ దోస్తుల మేఘాల వాన చుక్క వచ్చి
*సల్ల పడ్డది*
ఏసీ ఫ్యాన్ కూలర్ తో వేడి ప్రతాపాన్ని చల్లార్చ కొనే సగటు జీవికి మబ్బు కరుణించి కురిసిన జల్లుకు
*సల్ల పడ్డది*
రచన: కే వి రమణ చారి
తెలుగు పండితులు
నిజామాబాద్
4.
కవితా గానం సీజన్ 2
అంశం :  తొలకరి 
పేరు :  ఆళ్ల నాగేశ్వరరావు
కలం పేరు : కమలశ్రీ
ఊరు : తెనాలి, గుంటూరు జిల్లా
తేది :24/06/2022
ఫోన్  నెంబర్ :7416638823
శీర్షిక : ""  జీవ ప్రదాతలు  ""

వరుణదేవుని కరుణతో
తొలకరి తరలి  వచ్చింది
తొలకరిజల్లుల రాకతో
పులకించెను పుడమి
హాలీకులకది చెలిమి!
పచ్చని సామ్రాజ్యాన్ని విస్తరించి
ప్రకృతిమాతకు హరితవర్ణపు చీరను బహుకరించేందుకు
బంగారు పంటలు పండించి
కర్షకుని కంట  పన్నీరును చిలకరించేందుకు
కరువు కాటకాదులను నివారించి
సుభిక్షతను ప్రసాదించేందుకు
వ్యయంగా మారిన వ్యవసాయానికి
చేతనైన సాయమందించేందుకు
జలాశయాల్లో జలకళను నింపేందుకు
పశుపక్ష్యాదుల్లో జీవత్వాన్ని చేకూర్చేందుకు
ఆకుపచ్చదనమును నలుదిశలా పంచేందుకు
ప్రకృతి పరవశంతో పులకించి
నెమలి. పురివిప్పి నాట్యమాడేందుకు
చిరుజల్లులను చిలకరించి
నింగిలో సప్తవర్ణముల ఇంద్రధనుస్సును ఆవిష్కరించేందుకు
రైతులకు వర ప్రదాయినిగా
కదలి వచ్చింది మేఘం
కష్టాల కడగండ్లను కడతేర్చనుంది సత్వరం!
...........................................
హామీపత్రం
ఈ వచన కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.
5.
[25/06, 7:48 pm] +91 95420 10502: కవితాగానం సీజన్ 3
తేది:25/06/2022
అంశం:తొలకరి

శీర్షిక:*ఆశలపంట*
****************
కృషీవలుర కలవరింత
పుడమితల్లికి కావాలి పులకరింత
ఇన్నాళ్ళూ మండుటెండల్లో 
వెలవెలబోయాయి పంటలంత
రోళ్ళు పగిలే ఎండలతో
అల్లల్లాడించింది రోహిణి
వర్షించేమేఘాలనే మోసుకొచ్చి
చల్లబరచింది మృగశిర
మిలమిల మెరుపులతో
దడదడలాడింఛే ఉరుములతో 
వానమ్మ వచ్చింది 
భూమాత మురిసింది.
తొలకరితో తడిసింది 
పచ్చదనంతో పరవశించింది 
కాడెద్దులతో కర్షకుడు 
నాగలిపట్టి తలపాగాజుట్టి
ఉత్సాహం ఉరకలు వేయంగా
ఉల్లాసం తొణికిసలాడంగ 
దుక్కి,దున్ని విత్తనాలు జల్లి
ఆనందబాష్పాలు రాల్చె 
అవనిపై అన్నదాత
ఆనందమానందమాయె!
అన్నదాత ఆశ నెరవేరె!!
              __________
జోషిపద్మావతి మహబూబ్ నగర్
6
[25/06, 8:00 pm] కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు Poet: అంశం... తొలకరి... కవితా గానం
శీర్షిక...... చినుకులు... 25/6/22
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
***************************************

 తొలకరి చినుకులు మొదలయ్యాయి
ఉరుకులు పరుగులు పెట్టించాయి
పలుగు పార కొడవలి గొడ్డలి పట్టించాయి
మడులు ఒరలు వేయించాయి

విత్తనాలకై విత్తం కొరకు పుత్తడి పెట్టె తాకట్టు
ఎరువులు వేసి ఏపుగ భూమిని తోపును చేసి
మట్టిని రంజుగ నంజుకు తినే రొట్టెగ మార్చే
ఇంద్రజాలమో... కరములలోని కనికట్టో

నాగలి పట్టి భూమిని దున్ని విత్తులు
నాటే పాటే చేసి, పోటుగ విత్తు విత్తిన వెంటనే 
మొలకలు మొలిచి చిగుళ్ళు తొడిగి 
పొంకం తోటి పొంగే పొలాల పిటపిటలు

చంకలలోన కంకులు పోసి బంగరు రంగుల
నీరే పోసి, 
వెన్నెల దారం పోగులు పోసి కలవరపడని కాన్పు చేసి 
కడుపు నిండుగా పాలను పోసిన పంటను పొదుపుగా ఇంటికి చేర్చి అన్నం పెట్టే అమ్మ
తొలకరి జల్లుల వానమ్మా... మాయమ్మ.

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
7
[25/06, 8:04 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్‌ 3 )    25/6/2022/ శనివారము
అంశం : - " తొలకరి చినుకులు "
                   (1)
సీ ! భూమంతకూడను భుగభుగమండుచు
బీటలువారెను బిగువుసడలి

ఎండవేడిమితోడ యెండెనుభూమియు
మోడుగచెట్లన్ని మొద్దుబారె

వెతలబారెధరణి వేడంతచేరగ
తడియారె భూమియు తపనపడగ

కరుణతో జూసెను వరుణదేవుడపుడు
నీరునిండినగుండె నీరుగారె

ఆ ! చిటపటమనిచినుకు చినుకురాలిపడెను
బిరబిరమనివాన ధరణిగురిసె
ధరణిభాగ్యమనగ తొలకరి వానలు
హాలికులదిగాంచి హర్ష మొందె !
                    ( 2 )
సీ ! తొలకరి జల్లులు తొంగిచూడధరణి
పడినవానలకును పరవసించె

చెరువులు బావుల చేరెనునీరంత
కరువుకాటకములు కానరాక

ఆకుపచ్చదనము నంతట వ్యాపించె
ఏరువాకనడుప యేగెరైతు

బంగరుపంటలు పండించురైతన్న
తిండికొరతలేదు తినగ జనులు

ఆ ! కడుపునింపమనకు కర్షకుడొకడుండె
సాగుచేయయెడ్లు సహకరించ
కర్షకునికిమొక్కు కడతేరుకష్టాలు
అన్నమింత బెట్టి ఆదరించు !
          తరణికంటి సూర్యలక్ష్మి.
                        ----------
8.
[25/06, 8:16 pm] +91 90594 38068: గజవెళ్ళి శ్రీనివాసాచారి కాజీపేట
అంశం: తొలకరి
శీర్షిక: వలపుల తొలకరి
...
ఇన్నాళ్ళుగా..ఎన్నేళ్ళుగా
నా హృదయంలో 
చండ ప్రచండ భానుడి కిరణాలు 
భుగభుగ మండిస్తుంటే..
సహారా ఎడారిలో పయనిస్తూ
ఒక్క ఆసరా చినుకు కోసం 
ఎదురు చూశాను చకోరంలా

అందరి చూపులు నా వైపే
నా అందమైన దేహం వైపే
వెకిలి మాటలతో, చేష్టలతో 
ఆనందించే పురుష ప్రపంచం 

నా మనోక్షేత్రంలో 
ఒక్కరైనా కురిపించరా 
వలపుల తొలకరి;
తొలకరి చినుకు కురిస్తే
భూదేవిలా పరవశించాలని వుంది 
వలపుల ధారలలో 
తడిసి ముద్దైపోవాలని వుంది 

ఎండిపోయిన మనసు చెట్టు 
మళ్ళీ చిగురించునా 
వసంతం వచ్చునా..
కాలమే నిర్ణయించాలి
9
[25/06, 8:16 pm] Sulochana Thota Poetess: కవితా గానం  సీజన్  -3

తేది   25 -6-2022
అంశం  తొలకరి జల్లులు 
శీర్షిక    పుడమి పులకించె 
తోట సులోచన
నెల్లూరు
   
భానుడి కిరణతేజం  అగ్నిగోళమై
పుడమి తల్లి హృదయం
వడలిన   పుష్పమాయె
నీటి చుక్కకై  జనులు
వెన్నెల కోసమెదురుచూసే
చకోరము  వలే   నింగి వైపు
చూపులు సారించగా
తుదకు పవనుడు  కరుణించి
అమృతం లాంటి చినుకులను
కురిపించగా సంతోషం చిందులేసే

తొలకరి జల్లులు ముత్యపు రాసులై
భువిని ముద్దాడి మురిపించే
అన్నదాత ఆనంద సాగరంలో
మునిగి కేరింతలతో పొంగి పోయే
భూమాత  సంతోషం  మకరందమై
పులకించి  పరవశించగా
పొలంతల్లి  నిండుగా నవ్వే

రైతు  ముఖం  వికసించిన పద్మమై
హలం పట్టి పొలందారి మళ్ళే
కాళీయమర్దనం  చేస్తున్న
శ్రీ కృష్ణుని  వలే చిన్నారులు
జల్లులలో ఎగిరి గంతులేసే
తరువులు  పుష్పములను  రాల్చి
మేఘడికి   వందనమర్పించే

హామీ పత్రం
ఈ కవిత  నా సొంతమని  హామీ
ఇచ్చు చున్నాను.
10
[25/06, 8:18 pm] +91 99669 70459: ఎదురు చూస్తున్నాను నేను
నిరీక్షిస్తున్నాను నేను !
 
పుడమి పడుచు కన్య నై 
నా మట్టి కొంగును పరిచి తొలకరి జల్లుల పూలు జల్లుతావని 
ఎదురు చూస్తున్నాను నేను
నిరీక్షిస్తున్నాను నేను..!
 
ఎదురు చూస్తున్నాను నేను ప్రకృతి సేద్య చకోర విహంగమై .
నెర్రెలు బారిన నా బీడు నోటిలో అమృత బిందువులు  రాలుస్తావని .!
ఎదురు చూస్తున్నాను నేను నిరీక్షిస్తున్నాను నేను..!

 ఊరికి ఆదేరువైన చెరువు నై నా అక్షయ దోసిళ్ళ లో ..
రైతు కన్నీరు తుడిచే తొలకరి పన్నీరు కురిపిస్తావనీ ..!ఎదురు చూస్తున్నాను నేను

 అడవి అభిసారిక నై 
నీ తొలకరి జల్లులలో మెరిసి విరిసిన హరివిల్లును 
నా సిగలో తురుముకుందామని 
ఎదురు చూస్తున్నాను నేను..!

 ఎదురు చూస్తున్నాను నేను 
ఒంపుల వయ్యారి గోదారినై పరుగు పరుగున అరుదేచు తొలకరి ప్రియుడివై 
నన్ను తనువెల్ల తడిమి కౌగిలిస్తావని ..

ఎదురు చూస్తున్నాను నేను, నిరీక్షిస్తున్నానను నేను..!
 
           దుద్యాల రామచంద్రం
                        భువనగిరి
11.
[25/06, 8:20 pm] Vanaparthy Gangadhar Poet: *కవితా గానం(సీజన్ 3)*
******************************
*అంశం:తొలకరి*
*శీర్షిక:ప్రకృతి పరవశం*
*తేదీ:25.06.2022*

గ్రీష్మ తాపంతో తల్లడిల్లిన
ధరణి తల్లికి కాసింత స్వాతన
దాహంతో నెర్రెలిచ్చిన నేలమ్మకు
నల్లని మేఘం చల్లని స్పర్శ

వరుణుని కారుణామృత వర్ష బిందువులు
తొలకరి జల్లై అవనిపై కురియగా
పృథివంతా తడిసి ముద్దై పులకించగా
లోకమంతా ఆనందంతో నాట్యం చేసింది

మోడువారిన తరు లతాదులు
కొత్త చిగుళ్ళతో జీవం పోసుకొని ముస్తాబై
పచ్చని ఆకుల వయ్యారాలతో
ప్రకృతి కనువిందు చేయగా మనసు తేలిపోయింది

రైతన్న మోములో ఆనందము
మాగాణాల్లో విత్తనాలు చల్లి ఆశగా
ఎదిరి చూస్తున్నారు నీ తొలకరి జల్లుకై
నీ ఆగమనంతో వికసించెను వదనము

పల్లె,పట్నం పిల్ల తెమ్మెరల
పలకరింపులతో మాది పులకరించెను
మానసాలు మయూరమై నాట్యమాడెను
తొలకరి...నీ జల్లు మా ఒళ్ళు ఆనందపరవళ్ళు


*పేరు:వనపర్తి గంగాధర్*
*ఊరు:హన్మకొండ*
చరవాని:9440146435

హామీపత్రం:ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
12
[25/06, 8:24 pm] Siimhadri Vani Poetess: కవితా గానం (సీజన్--3)
అంశం:-- తొలకరి జల్లులు
పేరు:-- సింహాద్రి వాణి
ఊరు:--విజయవాడ
తేదీ:--24--6--2022
చరవాణి:--7569820872
శీర్షిక:-- తొలకరి జల్లులు

మండు వేసవిలోన మలమల మాడిన
భూమాత మెండుగా బాధనొందె
చెట్లు చేమలన్ని చిగురాకు తొడగంగ
వానచినుకు‌‌ కొరకు వేచియుండె
చల్లగాలులు లేక ఎండ వేడిమి పెరిగి
అలమటించెను ప్రజలు, ప్రాణులన్నీ

జ్యేష్ఠ మాసము రాగ చెలగి‌ విజృంభించి
వానమబ్బులన్ని వరుస కట్టె
మృగశిర కార్తెలో‌ ముసిముసి నవ్వుల
తొలకరి చినుకులు టపటప రాలుచు
వానధారలయ్యి వసుధ మురిసె
కురిసిన వానలో తడిసిన ప్రకృతి పచ్చ కోక కట్టె పరవశించి

ధాన్యరాశులింట దండిగా నిండుటకు
జ్యేష్ఠ పౌర్ణమి‌కడు శ్రేష్ఠ మనుచు
చినుకు నేలను రాలి చిత్తడిగా మార
ఏరువాక సాగె వేడుకగా పల్లెలలో
కాడి మేడికి తోడు కడిగి ఎడ్లను కూడా
పసుపు కుంకుమలతో పూజ చేసి
పూలదండలు వేసి, బసవన్న లను కొల్చెదరు
ఆనందముప్పొంగ అన్నదాతలందరూ.

హామీ:-- ఇది నా స్వీయ రచన
సింహాద్రి వాణి
13.
కవితాగానం...సీజన్3
తేదీ..24.6.22
అంశం..తొలకరి
శీర్షిక:-
రైతు మోమున ఆనందం
...............................
తొలకరి చినుకు పడినవెంటనే
పులకరింతతో పుడమితల్లి
పులకరించె
ప్రకృతి కన్య పరవశించె
రైతన్న మోమున ఆనందం వెల్లివిరసె
సనాతన సంప్రదాయం ననుసరించి
పౌర్ణమి చంద్రుని ప్రకాశవంతమైన
జ్యేష్ఠ మాసమున 
జీవితాంతం అన్నింట సహాయముగా ఉండే
నాగలి, ఎద్దులకు హారతులిచ్చి ,కుంకుమ పూలతో పూజించి
పుడమి తల్లిని ప్రార్ధించి
పంటలు బాగుగా పండాలని ,పొంగలి నైవేద్యం గా పెట్టి 
పొరుగు వారితో కలసి
పరమేశ్వరుని భక్తితో కలసి
ఆడుతు పాడుతు జరిపే
తొలకరి చినుకులు కురిసే
రైతన్నల రమణీయ పండుగ 'ఏరువాక'
సనాతన సంప్రదాయ భారతీయ   పండుగ
దేశానికి వెన్నెముక
రైతన్నల మోమున ఆనందమే తొలకరి చినుకు.....!!
........................
పేరు... ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్
14
కవితా గానం సీజన్3
అంశం:తొలకరి
నానీలు

1)తొలకరితో
ఆనందపు మొలకలు
రైతుల
హృదయాలలో.

2)తొలకరితో
ప్రత్యక్షం
నాసిరకం విత్తనాలు
రైతులను ముంచడానికి
3)తొలకరి చినుకుల
చిలకరింపు
పుడమి తల్లికి
పులకరింపు
4)ఏరువాకకు
స్వాగతం
తొలకరి జల్లుల
పలకరింపు
5)పుడమితల్లి
వెదజల్లింది
మట్టిసుగంధం
తొలకరిజల్లులతో.

6) కునుకు తీస్తున్న
రైతన్నకు
కునుకుండదు
తొలకరివానల్తో.
7)గ్రీష్మతాప
ఉపశమనం
మృగశిర లో
తొలకరి జల్లులతో.
8)తొలకరితో
కొలిమి వద్ద సందడి
వ్యవసాయ పనిముట్ల
రిపేర్లకు.
9)తొలకరివానలొస్తే
బయటికొస్తుంది
నాగలి
కొంతవిరామంతర్వాత.
10)తొలకరి జల్లులు
రైతులహృదయాలపై
పన్నీటి
జల్లులు.

తిప్పావఝల నరసింహమూర్తి
బుచ్చిరెడ్డి పాలెం.నెల్లూరుజిల్లా
15.
అంశం.. తొలకరి
శీర్షిక.. 🌷తొలకరి వేదిక🌷
*********************
ధరణి పరుగున ధరిచేెరె తొలకరి ....
ధాత్రి కడుపున చినుకు దాచగ మేల్కొనీ.
హాయి రవముల చినుకు తిరునాళ్లు ...
మృగశిర తలుపుతీసి... 
తొలకరి వేదికకూ తోరణం కట్టాయి.

వేసవి తోవలో సూరీడు చేరువలో 
నేల పరుగు తీయగా.
శిశీరం పూర్తిచేసి  వసంతం వడి నింపుకున్న  ప్రాణికోట్ల ప్రకృతి ...
భానుడి భగభగలకు దాహంతో 
సొమ్మసిల్లి పోగా.. 
వరుణుడి వర్ణశాల నుంచి ఝరి జారి దాహార్తి తీరుస్తూ ...
తొలకరి వేదికకు తిలకమద్దింది .

సామాన్యుడు సాయకుడై ఎండిన నేలలో వెయిపుట్లు పండించగా ..
దాచిన విత్తనాలకు విముక్తి కలిగిస్తూ ..
హలము తిప్పి నేలపై చల్లగా ..
ఏరుపాకి ఏరువాక కంకణం కట్టింది .

సప్త సంద్రాలు నింగికడుగు వేయగా .
నదీనదాలు ప్రవాహ పరవల్లీడగా..
కొండ కోన  వాగు వంక కొలను సెలఏరు జల తరంగాణీల ఓలలాడగా. 
జలసిరితో నేల తడిసి ముద్దుగా మురిసింది. 
తొలకరి వేదికలో 
జలనిధుల పతాకం ఎగిసింది. 

ఆపొద్దు మరి సాలుకు.. అందాకా జలకళతో ఊరేగగా జగతి సిద్ధమయ్యింది .
పసిడి కన్నా పదిలమూ ప్రాణము నిలుపు నీరు. 
వృధా చేయుట కాదు ఉచితము.
సదా నీటి పొదుపు సద్గునోచితము. 

కందూరి సుజాతారాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్ 
9392162822🌷
16.
కవితా గానం
అంశం : తొలకరి

శీర్షిక : తొలకరి జల్లుల సందళ్ళు  

తొలకరి చినుకుల స్పర్శతో
అవని తల్లి మురిసే సమయం
హలాలు పట్టిన రైతన్నలు
పసిడి పంటలు పండించడానికి
సమాయత్తమయ్యే శుభముహూర్తం !
ఆకాశ దేశాన హాయిగా విహరించే నల్లని మబ్బులు
గుంపులు గుంపులుగా కదులుతూ
తొలకరి జల్లుల సందళ్ళు తో నేలతల్లిని ఇష్టంగా అభిషేకుస్తుంటే
ఆవిష్కరించే అపురూప దృశ్యం నయనానందకరం !
నేలతల్లి కి నమస్కరిస్తూ దుక్కి దున్నుతూ
నాట్లు వేస్తూ
రేపటి రోజున ధాన్యరాశుల సిరి లు ఇంట నిలవాలని కాంక్షిస్తూ
పచ్చని కలలుగంటూ రైతన్నలు వ్యవసాయాన్ని ప్రారంభిస్తుంటే..
రైతును రాజుగా గౌరవించే చక్కని సంస్కృతి సంప్రదాయాలు కలిగిన పుణ్య నేల మనది !  
వరుణదేవుడి కరుణతో సకాలంలో వర్షాలు ఆరంభమవుతుంటే
అన్నదాతలు ఆరుగాలం శ్రమిస్తూ 
పండించిన పంటలు..
లోకానికి ఆహార అవసరాలు తీరుస్తుంటే ..
రైతన్నల కృషి అభినందనీయం !
వెలకట్టలేని వారి సేవలు సదా ప్రశంసనీయం !
   రచన : గొర్రెపాటి శ్రీను
17.
[26/06, 8:25 pm] +91 94236 90615: కవితాగానం   (సీజన్ 3)
************************
అంశం:- తొలకరి
************************
తొలకరి జల్లులు కురిసి
పులకరించింది పుడమితల్లి
ఒడలు మరచి మురిసిపోయి
బడలిక వల్ల కలిగిన అలసటకు
సాంత్వన కోసం సేద తీరింది
గ్రీష్మ తాపానికి వేడెక్కి
పగుళ్లు బాసిన‌ నేల తల్లి
పడిపోయింది సొమ్మసిల్లి
మోడువారిన మొక్కలు
బీడులైన పొలాలు
అటకెక్కిన నాగళ్ళు
తడియారిన వరిమళ్ళు
తరుగుతున్న వనాలు
అడుగంటిన భూగర్భ జలాలు
పెరుగుతున్న కాలుష్యం కోరలు
రోదిస్తున్న మూగ జీవాలు
ఊరి బాట పట్టిన వన్య మృగాలు
రక్షణ కరువైన జనావాసాలు
చేతికి అందని పంటలు
ఆవిరి అయిపోయిన రైతన్నల ఆశలు
వీటన్నిటికీ చెక్ పెడుతూ
నేనున్నాను అంటూ వచ్చింది
తొలకరి జల్లు
విరిసింది ఆనందాల హరివిల్లు
పొంగింది భూమాత ఒళ్ళు
పట్టారు రైతన్నలు నాగళ్ళు
మ్రోగాయి బసవన్న మెళ్ళో గంటలు
దుక్కి దున్నారు హాలికులు
కాలే కడుపులకు ఆకలి దీర్చే
కరుణామూర్తులగు అన్నదాతలు
*******************************
🖋️ వేదాంతం సురేశ్ బాబు
      చంద్రపూర్
18
[26/06, 8:25 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానము 3
అంశం:: తొలకరి
తేదీ:: 25.6.22 .. శనివారం
శీర్షిక:: కర్షకుని హర్షము

కర్షకుని కళ్ళలో కాంతి
తొలకరితో మనశ్శాంతి
చిరుజల్లులతో వాన
చేనంత తడవాలి ముసురులోన
కారు మబ్బులతో ఆకాశము
కళకళ లాడగా
వర్షుకాభ్రములతో వర్షము కురియగా
జీమూతములతో జీవము పోయగా
నకిలీ విత్తనాలతో మోసపోకుండా
కల్తీ ఎరువులతో దగా పడకుండా
సకాలంలో అన్ని సమకూరగా
అనుకున్న దాని కన్న ఎక్కువ
దిగుబడి రాగ
అప్పులు తీరి రాబడి మిగలగా
సంతోషం మనసుల నిండా ఇంటిల్లిపాదికి నిండగా
ఆనందముతో రైతులు
హాయిగా ఉండగా
చూడాలి మనమంతా
దీవించాలి సస్యకాంత
అదే కోరుకుందాము 
అదే దేవుణ్ణి వేడుకుందాము!!
                 కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.     8309920625
ఈ కవిత నా స్వీయ రచన అని
హామీ
19
[26/06, 9:11 pm] +91 93981 23083: 26-06-2022 (ఆదివారం)
అంశం: తొలకరి
చిటపట చినుకుల తొలకరి జల్లు                           మెరిసెనంట హరివిల్లు          ధరణి ఆకలి తీర్చే ను        పుడమి తల్లి పులకించెను ప్రకృతమ్మ పరవశించెను రైతుకన్నుల్లో ఆనందము        ఆ చినుకు కురిసిన క్షణము  ఆరుద్ర లో దాగిన అందాలు అలుపులేని సెలయేటి ప్రవాహాలు                           శిశి రాన్ని మురిపించే వర్ణాలు మేఘంతో ప్రసవించే ఉరుములు                               ప్రకృతిని చిత్రికరిస్తున్న మెరుపులు                                పక్షుల కిలకిలలు పైరగాలుల సవ్వడులు                     తొలకరిలో నయనానందకార దృశ్యాలు               తన్మయపరిచే అనుభూతులు పలకరించేటి వానలు    పులకరించే వనాలు
అందని సొగసులు విహరిస్తున్న ఈ నేలలో                       ఊపిరి ఊయలై సాగుతున్న ఈ తొలకరి వానలో                                ప్రలయాలు ప్రవాహాలు చెప్పుకుంటే పోతే కోకొల్లలు    ఈ కవిత రాసినందుకు వస్తున్నాయి వానచినుకులలో
తడుస్తున్న ఆనందపు ఉత్సాహాలు.                                                                                                                ✍️కవిత రచన#వేదవాణి
19
[26/06, 9:16 pm] +91 93981 23083: 26-06-2022 (ఆదివారం)
అంశం: తొలకరి                         
చిటపట చినుకుల తొలకరి జల్లు                           మెరిసెనంట హరివిల్లు      ధరణి ఆకలి తీర్చే ను    పుడమి తల్లి పులకించెను ప్రకృతమ్మ పరవశించెను రైతుకన్నుల్లో ఆనందము       ఆ చినుకు కురిసిన క్షణము        ఆరుద్ర  లో దాగిన అందాలు అలుపులేని సెలయేటి ప్రవాహాలు                          శిశి రాన్ని మురిపించే వర్ణాలు  మేఘంతో ప్రసవించే ఉరుములు                  ప్రకృతిని చిత్రికరిస్తున్న మెరుపులు                     పక్షుల కిలకిలలు పైరగాలుల సవ్వడులు               తొలకరిలో నయనానందకార దృశ్యాలు            తన్మయపరిచే అనుభూతులు పలకరించేటి వానలు పులకరించే వనాలు       అందని సొగసులు విహరిస్తున్న ఈ నేలలో                      ఊపిరి ఊయలై సాగుతున్న ఈ తొలకరి వానలో      ప్రలయాలు ప్రవాహాలు చెప్పుకుంటే పోతే కోకొల్లలు    ఈ కవిత రాసినందుకు వస్తున్నాయి వానచినుకులలోతడుస్తున్న ఆనందపు ఉత్సాహాలు.                                                                                                                ✍️కవిత రచన#వేదవాణి
20
[26/06, 9:16 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం(సీజన్3).       26--6--2022.
పిన్నక నాగేశ్వరరావు. 
శీర్షిక :-- తొలకరి.

1. తే.గీ.
గ్రీష్మ తాపముద్ధృతిని తగ్గించగాను 
నైరుతి ఋతుపవనములు నడచిరాగ
వర్షముల్ మొదలవ్వగ  వసుధయందు
నదియె తొలకరి జల్లని యనుచునుంద్రు.

2. తే.గీ.
ఎండలకు బీటవారిన నిద్ధరణిని 
తొలకరి చినుకు రాలగ తుష్టినొంది 
పులకరించుచు భూమాత మొదటిసారి
వెలువడెడు మట్టి వాసన వింతగొలుపు.

3. తే.గీ.
జ్యేష్ఠమాసాన తొలకరి చినుకు గనిన
రైతులందరు సంతస మందుచుండి 
యేరువాకకు సిద్ధమై జ్యేష్ఠ పున్న
మి దినమందు దుక్కులను దున్నెదరుమున్ను.

4. తే.గీ.
ముందుగా భూమి తల్లికి పూజచేసి 
దుక్కి దున్నిన పిదప విత్తులను నాటి
మొలకలు పెరుగుచుండగా కలుపు తీసి
యదనుకు నెరువులను వేయ నధికముగను
పూర్తి దిగుబడి నిడ రైతు పొందు ముదము.
**************************************
21
[26/06, 9:48 pm] Lalita Sister: కవితా గానం
తొలకరి
శీర్షిక*చిట పట చినుకుల పాట

కృత్తికలకు తోడూ
రోహిణి సూర్య ప్రచండ వేడికి
మృగశిర మృదువుగా నైఋతి చూపు
వాయుదేవుని చల్లగాలి మేఘాలతో దోస్తీ

కరుణించిన కారుమబ్బులు
ఆరుద్రల కోసం ఎదురు చూపులు
నెర్రిలిడిసిన నేలమ్మ తొలకరి జల్లుతో
మట్టి దేహానికి ఆకాశగంగ అభిషేకం

చిట పట చినుకుల పాట
మది ఊయలలూగే ఆట

పొడి దుక్కులతో కుంకుమ రేఖలు
వసుధ పాపిట కురులు నాగేటిచాళ్ళు
రైతు బడి ఒడి విత్తనాల సంచులు
నేల పొత్తిళ్ళలో చిరుచిరు మొలకలు

అడవీ కొండగాలితో కమ్మని కబుర్లు
నీటి చుక్కలు రాలుస్తూ పూల మొక్కలు

తొలకరి చినుకులు
నీలి మేఘాలు రాల్చిన శిల్పాలు
ప్రకృతి కాంత పులకింతల కావ్యం
కవుల భాషకందని కమనీయ దృశ్యం

ఏడెల్లి రాములు ✍️
ది*25*06*2022(21*25)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
22
[26/06, 9:49 pm] Lalita Sister: కవితా గానం (సీజన్ 3)
శీర్షిక...ఎదురు చూపు
 
మొదటి చినుకు చిటపట
మంటూ ఒళ్లంతా 
తుళ్లింత పడుతుంటే....

గ్రీష్మ తాపానికి
అలసి సొలసిన 
దేహాలను శాంత 
పర్చుకుంటూ...

పుడమి తల్లి ఆర్తిగా పెదవి 
తడుపుకోవాలనుకుంటుంటే...

రైతన్న కోటి ఆశలతో 
ఆకాశం వంక ఎదురు  చూస్తూ 
నాగళ్లు సిధ్ధం చేసుకుంటుంటే ....

ఆడపడుచులు పుట్టినింట
అడుగెట్టి పండుగ 
వాతావరణం చుట్టేస్తూ ఏరువాక సాగారో రన్నో చిన్నాన్నా అంటూ పాడుతుంటే ...

యువరత్నాలు ఎద్దులను అంద చందాల అలంకరణలతో
పందాలకు పరుగులు తీయిస్తుంటే....

రోగ నిరోధక శక్తికి
పుష్టి నిచ్చే బెల్లం 
ఇంగువలను సిధ్ధం 
చేసుకుంటూ...

ఉబ్బసం నిబ్బరంగా
ఉండేందుకు చేపమందు కై
ఉత్సాహాలు పంచుకుంటూ....

 అందరూ ఆత్మీయంగా 
ఎదురు చూసే తొలకరికు
ఎనలేని ఆనందాలతో
స్వాగతం పలకాలని ఉంది....!!


హామీ  ..నమస్తే  ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను 🙏

మొహమ్మద్. అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి )
23
[26/06, 9:49 pm] Lalita Sister: అంశం: తొలకరి
డా.నాగలక్ష్మి తంగిరాల

పుడమి తల్లి పులకరిస్తుంది భూమి మీద పడగానే తొలకరి జల్లు
ఎండ వేడిమిని మటు మాయం చేసిందని
ఎదలో జల్లని మ్రోగు కోటి వీణా నాదం
 చెలి మృదు మధుర తొలకరిప్రేమఅందగా
మావి చిగురికి కూసే కోయిలలా
తొలిపంట పండు తొలకరి జల్లులు ప్రాణం పోస్తే చేనుకు
పసిపాపల బోసి నవ్వులలో తొలకరి ఆనందం
తొలి ఝాము తొలకరి ఆత్మస్వరూపతాదాత్మ్యా నికి

బాల భానుని ఉదయం లో
తొలి ప్రొద్దు పొడుపులో  తొలకరి ఆహ్లాదం
ప్రకృతి పరవశం తొలకరి జల్లులతో
చల్లని తీయని సేద తీర్చే తొలకరి
గ్రీష్మ తాపాన్ని మరిపిస్తుంది
మురిపిస్తుంది మానవాళిని
కవికి మొట్ట మొదటి కవిత ఇస్తుంది
తొలకరి సంతోషం
చిరునవ్వులు విరియు పిల్లల తొలకరి ముద్దు మాటలలో  
 జలజల జారే జలపాతాలలో పోరాటం
జగమే జలదరించు తొలకరి లో ఆరాటం
అనుభూతులఆ స్వాదం ప్రాణమున్న ప్రతిజీవికీ తొలకరి
తొలుత మదిలోని భాషణాలు చిలకరిస్తే
బయటికి వెలువడే భావమే తొలకరి
అంతర్గతంగా ఎప్పటికీ మనతో ఉండే  లలిత మిళిత  హృదయస్పందన  ఎన్నటికీ తొలకరి యై చిగురిస్తూ ప్రేమానురాగాలు ఆర్ద్రతను ప్రతి   ఫలించాలి

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...