నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*************
1.కోరాడ నరసింహారావు గారు
2.అపరాజిత రెడ్డి గారు
3.కె.దేవికారాణి రత్నాకర్ గారు
4.అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు
5.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
6.బాలు కత్తుల గారు
7.సింహాద్రి వాణి గారు
8.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
9.జోషి పద్మావతి గారు
10.విజయవిజయలలిత.టేకుమళ్ళగారు
11.వనపర్తి గంగాధర్ గారు
12.డా.వేమూరి సత్యవతి గారు
13.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
14.మద్ది పుల్లారావు గారు
15.డా.దారల విజయ కుమారి గారు
16.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
17.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు
18.సింగీతం సంతోష్ కుమార్ గారు
19.వేద వాణి గారు
20.మధుమోహన్ గారు
21.కొమురవెల్లి అంజయ్య గారు
22.కవిత వెంకటేశ్వర్లు గారు
23.తరణికంటి సూర్య లక్ష్మి గారు
24.తోట సులోచన గారు
25.పొర్ల వేణు గోపాల్ రావు గారు
26.మేకల రామస్వామి గారు
27.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
28.ఏడెల్లి రాములు గారు
29.గజవెల్లి శ్రీనివాసచారి గారు
30.గొర్రెపాటి శ్రీ ను గారు
31.వేదాంతం సురేష్ బాబు గారు
32.గంగపురం శ్రీ నివాస్ గారు
33.వురిమల్ల సునంద గారు
34.ఆర్. వి. వి. రాజా, శృంగారయునిపాలెం గారు
*********
సమీక్షలు
ఆర్ బి వి రాజా గారు*
ఇప్పుడతడు అనే శీర్షికతో వ్రాసిన కవిత
మీకు గుర్తు ఉన్నానో లేదో అంటూ ఎత్తుకోవడం
హృదయాన్ని తాకింది.
మట్టికి చెమట గంధం పూసి ఆకుపచ్చ సంద్రాలు పొంగించి నోడు
ఎడారుల ను పూదోటలను చేసి
నవ్వించి నోడు అంటూ
ఆకుపచ్చ చందమామ గురించి కవిత్వీకరించిన తీరు ....
అల లాగా ఎగిసిపడింది
జీవులకు ప్రాణాధారమైన అన్నం పెట్టే రైతు అంతరించి పోతున్నాడనే వ్యధ
కాళ్ళ కింద భూమిని కదిలించినట్టయింది . రాబోయే ఆపత్కాలానికి అతడే ఆపద్బాంధవుడు అన్న సింధువు అంటూ
*ముగింపు ముత్యమై మెరిసింది*
పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న మీకు అభినందనలు
*వనపర్తి గంగాధర్ గారు *
పరహిత మే తన మతం అనే శీర్షికతో వ్రాసిన కవిత
అమృత బిందువులై వర్షించింది
ప్రాణ రక్షకుడై తోడు నిలిచింది
శత్రువైనా మిత్రుడైనా
మానవతా బీజాలను అవనిపై చల్లిన వాడు ఎవరైనా
*ఆపద్బాంధవుడు*
అని మీ ఆశావహ దృక్పథం పదాల కూర్పు ,చక్కని ,చిక్కని భావం తో
మీ కవిత ,కిరణ పుంజ మై వెలిగింది. సుధలు కురిపించింది. మానవతా బీజాలు మొలిచి మొక్కలై వృక్షాలు కావాలని ఆశిద్దాం.
పోటీలో ద్వితీయ బహుమతి పొందిన మీకు అభినందనలు.
*పురి మళ్ల సునంద గారు*
ఆపద్బాంధవుడు అనే శీర్షికతో వ్రాసిన కవిత
అతడికి ఎలా తెలుస్తుందో ఏమో అనే ఎత్తుగడ
మేధో వలయంలో విస్తరించింది ఆపద్బాంధవులు గా
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తో పాటు సరిహద్దులలో సైనికుడు
సున్నిత మనస్కుడైన స్నేహితుడి రూపమెత్తిన తీరు
హృద్యంగా గంగా ప్రవాహంలా సాగుతూ....
అంతర్వాహిని దర్శనమిచ్చింది.
మానవతా విలువలతో మూర్తిభవించిన వాడు *ఆపద్బాంధవుడు* అని
ముగింపు మువ్వల సవ్వడైంది.
పోటీలో తృతీయ బహుమతి పొందిన మీకు అభినందనలు
*సయ్యద్ జహీర్ అహ్మద్ గారు*
యుగానికి ఒక్కడు అనే శీర్షికతో రాసిన కవిత
విపత్తు గడియలలో విశ్వరూపం ఎత్తి ఆదుకునేవాడు
*ఆపద్బాంధవుడు* అంటూ
అలనాడు గజరాజును రక్షించిన శ్రీహరిని
కరోనా కష్టకాలంలో ఆదుకున్న వారిని
దేశాన్ని రక్షించే వీర జవాన్
వీరందరినీ స్మరిస్తూ కవన ప్రవాహాన్ని పరిగెత్తించారు.
ఆపద సమయంలో ఆదుకోవడానికి యుగానికి ఒక్క యుగపురుషుడు ఉదయించి ఆదుకుంటాడని పదాల పొందికతో
ముగింపు ముగ్ధ మనోహరంగా ఉంది
పోటీలో తృతీయ బహుమతి పొందిన మీకు అభినందనలు
*దారల విజయ కుమారి గారు*
ఆ ఒక్కడు శీర్షికతో రాసిన కవిత
తన మనస్సు ఆకాశం ఒక్కటే అంటూ మొదలైన ఎత్తుగడకే మనస్సు గాల్లో తేలియాడింది.
నిరాశ నిద్రను నటించని వారిని
నిందలు మోపని వారి మనసును కొలవాలంటే జీవితం సరిపోదు.
కొలత ముగియదు మీరు వ్యక్తీకరించిన భావ విస్తృతిని కొలవాలంటే
ఆకాశమంత దృష్టి ఉంటే గానీ సరిపోదు
మోదము ప్రమాదము గల రెండంచుల కత్తి లాంటి వాడు అంటూ
ఉత్తేజంగా సాగిన మీ కవిత విజయ శంఖం పూరించింది .
కవిత లోని ప్రతి పదము స్వాతి కార్తె లోని చినుకులై అందరి గుండె ఖాతాలో జమ అయింది .
పోటీలో తృతీయ బహుమతి పొందిన మీకు అభినందనలు
1.
పౌర్ణమి నగదు బహుమతుల పోటీకి :-
అంశం :- ఆపద్బాంధవుడు
కోరాడ నరసింహా రావు
శీర్షిక :-@ నిజ బంధువితడే.!@
***************
అమ్మ తరపు వారిందరు.... !
అయ్య తరఫువా రందరు... !!ఆ బంధువు లందరూ..... ఎందరున్నా....,
కలిమిలో... వదలక, లేమిలో
ముఖం చాటేసుకు తిరిగే వారే ... ఎందరో !
మనకు కష్టాల్లోఆదుకునేవారే
మన నిజమైన బంధువులు ! వారికి మనతో యే రక్తసంబంధ మూ...లేకపోయినా...మానవతా దృష్టితో సహాయం చేస్తారు
మన ఆపదలో... బంధువై...
మనకు ఆపద్బాంధవులు గా.... జన్మాoతం వరకూ గుండెల్లో ఉండిపోతారు.... !
ఆపదలో ఆదుకోటానికీ... చేయూతనిచ్చి సహాయాన్ని అందించటానికి... రక్త సంబం ధీకులో, చుట్టాలో, పక్కాలో....
కానక్కర్లేదు... !
ఎదుటి మనిషి కష్టానికి కరిగి పోయే మనసుంటే చాలు... !
ఆపద్బాంధవుడంటే... మనిషి రూపంలోవచ్చినభగవా నుడు...! అందరూ కాలేరుగా !!
దేవుడంటే... ఎక్కడో లేడు.,
ఇలా...మనిషిరూపంలో,ఇక్కడే
సాటిమనుషుల్నిఆపదల్లో ఆదు కుంటూ ఈ మనిషిలోనే...... ఉన్నాడు !! ఆపద్బాంధవునిగా
పిలువబడుతూ.... !
********************
2.
అంశం: ఆపద్బాంధవుడు
శీర్షిక: సమాజం--దైవం ఉనికి,,,,,!!
పేరు: యం అపరాజిత్ రెడ్డి
ఊరు:సూర్యాపేట
ఫోన్ నంబర్: 9848532031
ఈ కారుచీకట్ల కాళరాత్రి లాంటి సమాజంలో
మనిషికి మనిషికి మధ్య దట్టమైన గోడలు
పక్కవాడు మరణావస్థలో వున్నా పట్టించుకోని నైజం
దగ్గరి స్నేహితుడంటూ ఈ వైకళ్య సమాజంలో ఉన్నాడా!?
ఇది దగాకోరు డబ్బు సమాజం
మనస్సు గాజులా ముక్కలై మొనదేలిన మనుష్యులు
మానవత్వం మంటగలిసి ఎన్నాళ్ళయిందో!
ఏరీ వీళ్ళా ఆపద్బాంధవులు!?
ఈశ్వరుడంటూ ఉంటే,,,,,,
మనస్సు కప్పుకున్న లౌకిక తెరలు తొలగి పోవా!?
ఒకింత ధ్యానంలో,,,,,,,,,
తెరలమాటు నుండి దర్శనమిస్తే
నిస్తేజమైన బికారి మనస్సుకు కొంత ఊరట!
ఇంకా పశుపక్షాదులు ఈ అవనిపై చరిస్తూ,,,,,,,,
రాత్రి ఆదమరిచి నిద్రిస్తున్నాయంటే
ఉన్నాడు ఆ ఆపద్బాంధవుడు ఉన్నాడు!
సూర్య చంద్రులు గతులు మారక
కాల ఋతు చక్రం క్రమం తప్పక తిరుగుతుందంటే దైవికం!
నేను ఉద్యోగానికై ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయి
ఊహల్లో కూడానాకు ఉద్యోగం వస్తుందని అనుకోలేదు!
పోస్ట్ అంటూ ఉద్యోగంలో చేరిపొమ్మని వచ్చిన పత్రం
నేను ఉక్కిరిబిక్కిరి అవుతూవుంటే,,,,
నీమీద ఆ పరమాత్ముడు ఉన్నాడయ్యా
నా అర్ధాంగి అన్న మాటలు చెవుల్లో గింగురుమంటుంటే,,,,,,
ఈ దరిద్రుణ్ణి ఆదుకున్నది ఆ ఆపద్బాంధవుడే కదా,,,,,,,,!!
అపరాజిత్
హామీపత్రం: ఈ కవిత నా కలం నుండి జాలువారిందేనని హామీ
3.
[08/06, 9:20 pm] Lalita Sister: కవితా గానం సీజన్-3
పౌర్ణమి నగదు బహుమతులు పోటీ కొరకు.
అంశం,, ఆపద్బాంధవుడు.
శీర్షిక,, చల్లని మిస్సైల్....
రచన,,, కే.దేవికారాణి రత్నాకర్ తెనాలి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కార్పణ్యం అంటించిన విషపు చురకకు... కారుణ్య పు నవనీతమే ఆపద్బాంధవుడు.
ఏకాంతం రగిల్చిన చిచ్చు కు
మల్లెల సుగంధమే ఆపద్బాంధవుడు
నిత్య చాకిరీ ఎండకు బీటలు వారిన నారీ హృదయ క్షేత్రంలో గుర్తింపు చినుకే ఆపద్బాంధవుడు
వాడి వత్తలై ఆకుల వలువలు రాల్చుకున్న శిశిర కన్యకు చిగురాకుల పట్టు పుట్టముల వసంతుడే ఆపద్బాంధవుడు
జీవిత పాఠశాలలో నిత్య విద్యార్థికి కష్టాల పరీక్ష సమయం ఆత్మస్థైర్యం దిక్సూచి యే ఆపద్బాంధవుడు
అంతరిక్షంలోకి అక్క జంగా దూసుకు వెళ్తున్నా మృగ రాయళ్ళ మగా రణ్యంలో బలవుతున్న ఆడబ్రతుకు కి చట్టాల చక్రమే ఆపద్బాంధవుడు
సహస్ర కోటి పనులు పారావార మంత విజ్ఞానంతో నిక్షిప్తమైన ప్రపంచ వాల్మీకంలో టెక్నాలజీ జిలుగే ఆపద్బాంధవుడు
పంచభూతాల పై ఆధిపత్యం వహించి నశించిపోతున్న విశ్వ మానవునికి పర్యావరణ పరిరక్షణా బాధ్యతయే ఆపద్బాంధవుడు
అంధకారపు అహం కృతికి వెలుగుల సూర్యోదయ మే ఆపద్బాంధవుడు.
4
[08/06, 9:21 pm] Lalita Sister: కవితగానం( సీజన్-3) పౌర్ణమి పోటీలకు
08-05-22
అంశం:-
ఆపద్భాంధవుడు
శీర్షిక:-
పరమాత్మ స్వరూపులే
పేరు:-
అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:- విశాఖపట్నం
చరవాణి:-9963265762
................................
జీవితం అగమ్యగోచరంగా
కష్టాల కడలిలో ఉన్నపుడు
నేనున్నానని నీ హితంకోరి
సహాయం చేసిన స్నేహితుడు
సాక్షాత్తు కుచేలునికి సంపదలొసిగిన కృష్ణపరమాత్మ స్వరూపమే..!!
బాల్యంలో అనురాగ ఆప్యాయతలు పంచి
నీకేమి భయంలేదు కన్నా
మేముమున్నామని నైతికవిలువలు నేర్పి జీవిత ఉన్నతి కి తోడ్పడిన తల్లితండ్రులు పరదేవతా స్వరూపాలే....!!
మూడుముళ్ళ బంధంతో
కన్నవారిని, తోడబుట్టిన వారిని వదలి గోత్రం మార్చుకుని ,నిన్ను నీ పిల్లలని కంటికి రెప్పలా చూసి మీకేమి భయంలేదు
నేను జీవితాంతం తోడు నీడ గా ఉంటానన్న సహధర్మచారిణి నీ పాలిట దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతయే...!!
జీవితచరమాంకాన ఆప్యాయత అనురాగ పలకరింపులతో సపర్యలు చేసిన నీ పిల్లలు పరమాత్ముని ప్రతిరూపాలే...!!
మరణం తప్పదని తెలిసినా చిరునవ్వుతో పలకరిస్తు " వైద్యో నారాయణో హరి" అన్న సనాతన సూక్తికి ప్రతీకగా
మీకేమి భయం లేదు అన్న వైద్యుడు ఎందరో మరెందరో నీ హితంకోరే ఆపద్భాంధవులందరు పరమాత్మ స్వరూపులే...!!
.............................
హమీ పత్రం:-
ఇది పౌర్ణమి పోటీలకు వ్రాసిన నా స్వీయకవిత
అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762
.............................
5
[09/06, 6:41 am] Lalita Sister: కవితా గానం శుభకృత్తు నామ సంవత్సర జ్యేష్ఠ మాసం పౌర్ణమి నగదు బహుమతుల కవితా పోటీకి వ్రాసిన కవిత... 08/06/2022
అంశం... ఆపద్బాంధవుడు
శీర్షిక...... తరువు
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
***************************************
అజ్ఞాన మనే చీకటిలో కూరుకుపోయిన మేధస్సును చిలికి జ్ఞానం అనే వెన్నను అందించి
మనిషిగ మలచు వాడే ఆపద్బాంధవుడు
చెట్లను నాటి పచ్చని ప్రకృతి ఆకృతిని రక్షించి
జీవకోటి సురక్షితంగా జీవించడానికి అనువైన
పర్యావరణాన్ని అందిస్తే ఆపద్బాంధవుడే
పట్టెడన్నం లేక పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి
పని కల్పించి జీవితం నిలిపిన ఆపద్బాంధవుడే
కామాంధుల కబంధ హస్తాలను తుత్తునియలు చేసి
ప్రాణాలు ఫణంగా పెట్టి, మాన ప్రాణాలు రక్షించి
మహిళలకు అండగా నిలిచిన, ఆపద్బాంధవుడే
నూలు పోగు లేక న్యూనతతో నారీ నెగుడు బాపి నెగ్గించు వాడు ఆపద్బాంధవుడే
వరదొచ్చి ఊరంతా ముంచి బురద మిగుల మిగలంగ
తరవులా నీడనిచ్చి పండ్లు చేతికిచ్చి ప్రాణాలు కాపాడిన ఆపద్బాంధవుడే...
అగ్గి రాజుకుని బుగ్గి పాల్జేసిన పూరి గుడిసెలోని
పేదల వ్యధల నెడబాపు బాపు ఆపద్బాంధవుడే
సహకార మందించి తనవారితో పాటు ప్రజల
ఉన్నతి పెంచు ఔదార్యమున్న ఆపద్బాంధవుడే
రహదారులపైన రక్తమోడుతున్న క్షతగాత్రులను
తరలించి వైద్యము చేయించు జాలి గుండె వాడే
ఆపద్బాంధవుడు
కొన ఊపిరితో వున్న మనిషికి ఊపిరి పోయ...
రక్త దానము చేసెడి మానవత్వం కలిగిన వాడే
ఆపద్బాంధవుడు
ఆపదల అనకొండ అలుముకొనిన వేళ ...
ఆసరాగా నిలిచి చురుకత్తిగా తోలు వలిచి
దీపావళి పండుగ జరిపించిన ఆపద్బాంధవుడే
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
6.
[09/06, 1:54 pm] Lalita Sister: ఆపద్బాంధవుడు
అందరి బంధువు ఆపద్బాంధవుడు
కష్టాల్లో కన్నీళ్లు తుడిచి కనికరం చూపేవాడు
బాధల్లో బాసటగా నిల్చి భరోసా ఇచ్చేవాడు
ఆపదలో అండగా
నిలిచి అదుకునేవాడు
సమస్యలు పరిష్కారం చూపి సేద తీర్చేవాడు
నిరుపేద కుటుంబంలో
వెలుగులు విరజిమ్మేవాడు
అభాగ్యుల బతుకుల్లో
ఆశలు చిగురింపజేసేవాడు
అభయ హస్తమై
ఆపన్న హాస్తమై
చేదోడు వాదోడుగా ఉంటూ
చెలిమిని పంచే అపరిచితుడు
పుష్కలంగా సేవగుణం ఉన్నవాడు
దండిగా మనసు నిండుగా మానవత్వం ఉన్నవాడు
బాలు కత్తుల
7
[09/06, 1:59 pm] Lalita Sister: కవితా గానం సీజన్ --3
శుభకృత్ నామ సంవత్సరం జ్యేష్టమాసం పౌర్ణమి కవితల పోటీకి
అంశం:-- ఆపద్బాంధవుడు
శీర్షిక:-- అనురాగ సంకెళ్ళు
రచన:-- సింహాద్రి వాణి
ఊరు:--విజయవాడ
చరవాణి:--7569820872
ఈనాడు సమాజంలో మానవతా విలువలన్నీ మాయమై విషపుగాలులు విజృంభించి తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి
వేడి తగిలిన ప్లాస్టిక్ లా హద్దు మీరిన స్వార్థపు సెగలు సోకి
మమతా మానవతలు ముడుచుకు పోయాయి
ఆప్యాయతానురాగాలు ప్రవహించ వలసిన దారులన్నీ
పరోపకార భావనలు లేని ముళ్ళ కంపలతో నిండిపోయాయి
నేను, నాకు అనే వంటరి పదాలు తప్ప
సంఘ సంఘటిత మనము అనే ఐక్యతా పదాలు లేవు
మనిషీ మనిషికి మధ్య బంధాలు అనుబంధాలు దారాలుగా పల్చబడితే పుటుక్కున తెగిపోతాయి
అనురాగ సంకెళ్ళుగా పెన వేసుకుంటే నిరంతరం కొనసాగుతాయి
శ్రీరామచంద్రునిలా, కృష్ణపరమాత్మలా, మహమ్మద్ ప్రవక్తలా, జీసస్ క్రీస్తులా,గౌతమ బుద్ధునిలా, గాంధీ మహాత్మునిలా, బాబాసాహెబ్ అంబేద్కర్ లా కాకపోయినా
సమస్యల వలయంలో చిక్కుకుని దిక్కు తోచక కొట్టుమిట్టాడుతున్న వారికి నేనున్నాను అనే భరోసానిచ్చి,
చేతనైన సహకారమందించి ఆప్యాయంగా పలకరించే వాడు మానవతా పరిమళాలను చిలకరించే వాడు
అతడే నిజమైన ఆపద్బాంధవుడు.
హామీ:-- ఇది నా స్వీయ రచన
8.
8.
అంశం..ఆపద్భాంధవుడు
శీర్షిక.. అన్నదాత
అన్నదాత అన్నదాత మన అన్నదాత
మనకడుపు నింపే సుఖపెట్టే అన్నదాత
మన జీవన ఆపద్భాంధవుడు రైతన్న
రైతులేనిదే మనతిండికేవస్తుంది కరువు
పట్టెడన్నం సుఖంగా తింటున్నామంటే
మనఅన్నదాత పండించే ధాన్యమేకదా
ఆ రైతుకు జీవితాంతం కష్టాలమయమే
ఏనాటికి ఎప్పటికి తీరడంలేదు కష్టాలు
ప్రభుత్వం రైతుభరోసా ఇస్తామంటుం
మేలిరకపువిత్తనాలనందిస్తామంటుంది
కోఆపరేటివ్ ఋణాలు ఇస్తామంటుంది
రైతు మన ఆకలితీర్చే బంధు అంటుంది
మట్టిలోనే పుట్టాడు రైతన్న
మట్టినే నమ్ముకు బ్రతుకుతున్నాడు
ఆమట్టిలోనే పసిడి పండిస్తున్నాడు
అందరి ఆకలి బాధలు తీరుస్తున్నాడు
చెమటూర్చి చేలలో పంటపండించి
ఆపంటంత చేతికొచ్చే సమయానికి
ధాన్యం ధర పడిపోయిందని రైతన్నకు
అంగడిలో దళారుల చేతిలోకి వెళ్లి
పెట్టుబడి కూడా రాకుండా రైతన్నకు
మిగులుతున్నాయి అప్పులే పాపం
అతని అప్పులన్నీ తీరేదెప్పుడో...
రైతు ఆనందంగా బ్రతికేడెప్పుడో....
మన కష్టాలన్నీ తీర్చి తిండిపెట్టే
రైతన్న మనకు ఎల్లప్పుడూ
ఆపద్భాంధవుడే... ఆపద్భాంధవుడే
ఆయనకు చేతులెత్తి ప్రణామం చేద్దాం.....
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.
తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
9.
అంశం:ఆపద్బాంధవుడు
*********************
Joshi padmavathi
శీర్షిక: భువిపైభగవానుడు
**********************
భానుడి భగభగలతో వేసవి తాపం
జీవుడి పరిస్థితౌను అగమ్యగోచరం
గొంతుతడుపుకోను నీటిబిందువైనా
చాలంటూవెతికివేసారేనుపక్షులప్రాణం
పనికిరానిపాతపాత్రలో నీరుంచినచాలు!
కాపాడగలిగినవారౌతాముపక్షులప్రాణం
అదే...అదే కాదా జీవకారుణ్యభావనం!
మహిలో మనగలిగే మానవత్వలక్షణం!!
జీవితాన అశక్తతాతరుణం వార్ధక్యం
శైశవబాల్యాలతో సమానమాతరుణం
సమయానుకూలతతో స్పందిస్తూ
చెలిమి తో చేయూతనందిస్తూ
ఆత్మీయతపంచే సాటి మనిషి
తన,పరభేదం చూపక తోడ్పాటునందిస్తే.....
అదే....అదేకాదా జీవకారుణ్యభావనం!
మహిలో మనగలిగే మానవత్వలక్షణం!!
సర్దుబాటులోనే ఉంటుంది సంతోషం.
పచ్చదనంతోనే సాధ్యం చక్కని ఆరోగ్యం
అడుగడుగునా చెట్లను నరకటమనాగరికం.
మొక్కలనునాటిచెట్లనుపెంచుతూ ప్రకృతిని కాపాడటం శ్రేయోదాయకం
అనాగరికచర్యలకడ్డుకట్టలువేస్తూ
పరిస్థితులకనుగుణంగా నడుచుకుంటూ నిస్వార్థజీవనాన్ని కొనసాగిస్తూ మంచిని పెంచి పంచటమే......
అదే.....అదేకాదా జీవకారుణ్యభావనం!
అడుగడుగునా ఆదుకునే ఆపద్బాంధవ లక్షణం!!
10.
10.
ఆపద్బాంధవుడు
----------------------------
ఆలస్యంగా ఆఫీసుకు బయలుదేరిన నాకు,
ఆదిలోనే హంసపాదులా తెగి వెక్కిరిస్తున్న జోళ్ళు..
అసహనంగా..
అంగడిలో ప్రవేశించా...
నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా సేల్స్ బాయ్స్..
హమ్మయ్య!!!!
పర్సు బరువు తగ్గించుకుని కొత్త పాదరక్షలతో బయటపడ్డా .....
పట్టుమని పదిరోజులు కాలేదు...
ఒకనాటి మధ్యాహ్నం!!
పాపకు బాగులేదని పాఠశాల నుండి కబురు..,
ఆదుర్దాగా బయలుదేరా..
ఖరీదైన నా పాదరక్షలు నాకు పని చెప్పాయి..
ఉసూరుమంటూ నలుదిక్కులా పరికించా.....
దూరంగా వేపచెట్టు నీడలో చెప్పులు కుట్టే సాంబయ్య..
ఆపద్భాంధవుడిలా..!!!!!
ఇప్పుడు చిల్లర కోసం జేబు తో యుద్ధం..
హటాత్తుగా నా అంతరాత్మ ఉధ్భోధ....
అవును...
ఇప్పుడు కావాల్సింది నోటు..
అది కల్పించాలి అతని మోముపై చిరునవ్వు కు చోటు..
నాకు ఆ క్షణం అర్థమైంది.. కొన్ని సేవలకు వెలకట్టలేమని..
ఆ సేవలు అమూల్యమని..
-------------------------------
విజయలలిత.టేకుమళ్ళ
11.
విషాద మేఘాలు నీ జీవితాన్ని కమ్మేసినపుడు
కష్టాల కడలులు నిని ముంచేస్తున్నపుడు
నీ విషాదానికి వెలుగు దివిటి అయ్యేవాడు
నీ కష్టాలలో ఓదార్పు ఉషస్సు అయ్యేవాడు
నిరాశ,నిస్పృహలతో దారి తెలియక
తిమిర కిరణ పుంజాలు అలుముకున్నపుడు
నీలో ఆశల జండాలను ఎగరేసేవాడు
నీలో వేకువ సుధలను కురిపించేవాడు
నీ అసహాయతను,నీ దురదృష్టాన్ని
తన కౌగిలిలో బంధించి నిను
ఒడ్డున చేర్చి దారి చూపి నడిపించే
చల్లని వెన్నెల అపురూప కిరణమతడు
వేసవి భాను తాపానికి నెర్రెలిచ్చిన
ధరణి తల్లి ఎండిన గుక్కకు
నల్లని మేఘం వర్షించిన అమృత బిందువులా
ప్రాణ రక్షకుడై నీతోనే నీ తోడై నిలిచేవాడు
శత్రువైతేనేం,మిత్రుడైతేనేం,ఎవరైతేనేం
మానవతా బీజాలను అవనిపై చల్లి
పరహితమే తన మతమని తలచి
నిష్కలంక మనస్కుడు ఆపద్బాంధవుడు
*శీర్షిక:పర హితమే తన మతము
పేరు:వనపర్తి గంగాధర్
12.
12.
శీర్షిక --నేనున్నాననీ...!
చెల్లి చెప్పిన చాడీలకు కోమలిని కడలి దాటించి దాచినా..
పది తలలూ తెగేలా ఆపద్బాంధవ రామబాణం రాణించలేదా??
అంధుడని ఆదరించి సింహాసనమిస్తే..
తమ్ముని బిడ్డల్ని మట్టుబెట్ట చూచినా..
అడుగడుగునా ఆపద్బాంధవుని-అండ"సు" దర్శనమైందికదా!!
అసూయో,అంతులేని కక్షో, కోమలి బట్టలు విప్పాలని చూస్తే..
అక్షయమైన చీరగా ఆపద్బాంధవత్వమగుపించలేదా??!
నిస్సహాయమైన సామజపు శరణాగతికి
ఆపదలో బంధువై రక్షా-చక్రం నిలవలేదా?
నోరులేని జీవాలని నిలువునా నరకటం నివారించిన బుధ్ధజ్యోతి వెలుగులు కనలేదా?
వర్తకం పేరుతో వంచించిన దురాక్రమణల్ని
ఆపద్బాంధవుడై బోసినోటి బాపూజీ
అహింసాకిరీటిలా సత్యాగ్రహ సమరంతో
స్వేఛ్ఛాభారతం తేలేదా?
ఐనా..ఒకగురూపదేశంలా.. పండితప్రవచనంలా..
ఎండే మొక్కకి చల్లని నీరులా..
దిక్కులేనిచోట అండగా.. ఆకలిపొట్టకి అన్నంలా,.
తెలియరాని రోగానికి మందులా..
మాటతో.చేతితో,చూపుతో,చెలిమితో,
మనసుతో మనమే ఆపద్బాంధవులం కాలేమా??!!
++++++++
ఈ రచన నా స్వంత రచన!
డా.వేమూరి.సత్యవతి.
విజయవాడ 9885136308.
13.
ఆళ్ల నాగేశ్వరరావు
అంశం : " ఆపద్బెందవుడు ""
శీర్షిక : "" కలియుగ దానకర్ణులు ""
నాటి మహాభారతంలో
జూదపు పందెంలో ఓడిన పాండవులు
నిండుసభలో పంచ పాండవుల సమక్షంలో
పాంచాలికి జరిగిన వస్త్రాపహరణంలో
వస్త్రాన్ని అందించి ఆపదబంధవుడై ఆదుకున్నాడు శ్రీకృష్ణుడు!
హరినామ స్మరణని మాన్పించాలని
హిరణ్యకశిపుడు అగ్ని పరీక్షలు నిర్వహించి
ప్రహ్లాదుడిని హింసిస్తున్న తరుణంలో
నరసింహావతారుడై ప్రహ్లాదుడిని ఆపదబందావు డై
ఆడుకున్నాడు శ్రీహరి!
కనిపించని కరోనా విషక్రిమి కబంధహస్తాలలో చిక్కి
చేసేందుకు పనుల్లేక
వెళ్లినచోట ఉపాదుల్లేక
స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులక
నేనున్నానంటూ ముందుకు వచ్చి
అభయహస్తాన్నందించి వారికి ఆపదబాందవుడై
నేటి కలియుగ భారతంలో నిలిచాడు వెండితెర వెలుగు సోమ్ సుద్!
ఈ కరోనా కష్టకాలంలో
తమ కోచ్చే కొద్దిపాటి వృద్ధాప్య, వికలాంగ పెన్షనలను
ఉడుతాభక్తిగా సాయమందించి
ఎందరో అపదబంధవులై నిలిచారు!
అన్న, వస్త్ర దానాలు చేసి అభినవ దానకర్ణులై నిలిచారు!
మాస్క్ మూతికే గాని మనసుకు కాదని తెలిపి
మానవతా పరిమళాలను మహిలో వ్యాపింప చేశారు
మానవత్వం ఇంకా బ్రతికేవుందని మరోసారి నిరూపించారు
అడక్కుండానే సాయమందించి ఆపదలను నివారించారు!
14.
కరుణే కలియుగదైవమనుచు
ప్రేమయే సర్వ ప్రకృతనుచు
త్యాగమే స్వర్గమని భావించి
నివసించెదరు కొందరు జగతిలో
ఆపద్బాంధవులగుదురు జన హృదయాలలో
విడిచిపెట్టరు హితులను విపత్తులలో
మాన,ప్రాణములను కాపాడు మహితాత్ములు
భారతమందున కృష్ణ పరమాత్మ
పంచపాండవులకు ఆపద్బాంధవుడాయె
దిక్కు లోని వారికి దేవుడే దిక్కను నానుడిని
నిజం జేయు వారె ఆపద్భాందవులు
ఉపకారులగుదురు ఉత్కృష్ట పరిస్థితి లోన
నిస్స హాయుల పాలిటి ఉర్వి దీపాలు వారు
నిర్బాగ్యుల ఆశలు దీర్చు ఉదది కెరటాలు వారు
దుఃఖబాగుల జీవితాలలో ఉదయరాగాలు పాడువారు
సారధులై,సచివులై నిలబెట్టుదురెన్నియో జీవితాలు
నిత్యదీపితమనుకును జీవితం
లిప్తలో ఆరిపోతుందను సత్యం తెలుసుకొని
పరోపకారార్ధమిదం శరీరమని
సర్వులకు సాయమొనర్చు వారు
ఆపద్బాంధవులుగారె ఈ పృధ్విలోనెపుడు
అవసరానికి ధన సాయము
విద్యాబివృద్ధిగోరువారికి విద్యాదానము
అన్నార్తులగువారికి అన్నదానము
కష్టాలను కడతేర్చువారెవరైనా ఆపద్బాంధవులె
15.
శుభకృత్ నామ సంవత్సర జ్యేష్ట మాసము పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ కోసం
కవితా గానం సీసన్ 3
అంశం : ఆపద్బాంధవుడు
శీర్షిక : ఆ ఒక్కడు
*****************
తన మనసు..ఆకాశమూ ఒకటే
కొలవాలన్న ప్రయాసలో..జీవితం సరిపోదు..కొలత ముగిసిపోదు
ఆ ఎద వైశాల్యాన్ని..దాతృత్వంతోనో
మనిషితనంతోనో..కొలవగలవు
నిరాశా దుప్పటి ముసుగులో దాచుకుని
నిద్రను నటించడము
ఏ సాకులో చెప్పి..నిందలను మోపడము తనకు కానిపనులే
పవనాలు సానుకూలంగా వీయకున్నా
అడుగులు చతికిల పడుతున్నా
తాను ఉద్బోధిస్తే..ధైర్యం గుండె లోంచీ
ఎగతన్నుకుని వస్తుంది..గొంతు శంఖం పూరిస్తుంది
విజయం కోసం..ఊపిరి ఉత్తేజగీతాన్ని సాధన చేస్తుంది..సొమ్మసిల్లిన ఆశలను తట్టిలేపుతుంది
తనను వెంబడిస్తే..ఏ వైపు నుంచైనా ఎలాగైనా..
కొన్ని పాదాలకోసం..కాసింత కాంతిని మోసుకు రావాలనే ఆశ మొలుస్తుంది
ఏదో ఒక బాటకు రాళ్ళెత్తిన వైనం..
దేదీప్యమానంగా వెలుగొందిన అనుభవం
ఈ గుండె ఖాతాలో జమౌతుంది
తల్లి పక్కలోని పసి దేహానికి దొరికినట్టు
నా కోసం ఒక భరోసా..సాన్నిహిత్యం
వెచ్చదనం తెస్తాడు
మోదము ప్రమాదమూ గల రెండంచుల కత్తిలాంటి వాడు
ఈ హృదిని ఘనీభవించనీడు
విమర్శ రాయి విసిరినా సరే బద్దలవడు
నన్నూ.. పెలుసుబారనీడు
క్రుంగితే..జారిపడితే..విరిగిపడితే
కట్టుకుని..చీలికలను మెత్తుకుని
భంగపాటు లో నిలదొక్కుకోవడం నేర్పాడు
ఏమున్నా లేకున్నా..తొడుగుల్లేని ఆనాచ్చాద
ఆపద్బాంధవుడు ఆ ఒకడు..!
డా.దారల విజయ కుమారి
హామీ పత్రం
************
నమస్తె సర్/ మేడం
ఈ కవిత నా స్వంత రచన.అనువాదం కాదు.ఎక్కడా ప్రచురితం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
డా.దారల విజయ కుమారి
9177192275
16.
కవితా గానం
జ్యేష్ట మాసము పౌర్ణమి నగదు బహుమతుల పోటీకి
అంశం: ఆపద్భాందవుడు
శీర్షిక:దేవుళ్ళేకాదు మనుషులూ ఆపద్భాందవులే
మన సంస్కృతిలో వేస్తాము బంధుత్వానికి పెద్దపీట/
బంధువులే కదా ఆపద్భాంధవులని/ఆపద్భాంధవులు నిజమైన స్నేహితులు/
నమ్మకంతో భారం మోపితే అందరు దేవుళ్ళూ ఆపద్భాంధవులే/
పాండవులపాలిటి ఆపద్భాందవుడు కృష్ణపరమాత్మ/
ద్రౌపది మానాన్ని కాపాడిన మహనీయుడు/
గజేంద్రుని రక్షించిన అనాధరక్షకుడు/
గంట మ్రోగిస్తే అండగా నిలువలేదా శ్రీరాముడు/
గరళాన్ని మింగి ముల్లోకాలకయ్యాడుగా గరళకంఠుడు ఆపద్భాందవుడు/
ఆపద్భాంధవా,అనాధ రక్షకా అంటే ఆదుకోడా ఆ వేంకటేశుడు,/
మానవత్వం మూర్తీభవించిన కొందరవుతారు ఆపద్భాందవులు/
ప్రతిఫలాపేక్ష లేకుండా ఆదుకొన్న వారే మహనీయులు/
కరోనాకాలంలో వలస కార్మికులనాదుకొన్న అందరూ ఆపద్భాంధవులే,/
అనుకోని ప్రమాదం జరిగి దీపశిఖలా ప్రాణం కొట్టుమిట్టాడుతుంటే/
రక్తమనే చమురును పోసి ప్రాణదీపం నిలబెట్టుతున్న రక్తదాతలందరూఆపద్భాంధవులే/
కొన ఊపిరితో ఉన్న రోగులకు వైద్య సహాయాన్ని దించే నారాయణులకంటే ఆపద్భాంధవులెవరు?
ఫోన్ చేస్తే క్షణాల్లో ముందునిలిచే నూట ఎనిమిది సిబ్బంది కారా ఆపద్భాందవులు?/
అందరం మొక్కుకుంటాం ఆపదలనుండి గట్టెక్కించమని ఆ దైవానికి/
మనమెందుకు కాగూడదు ఆపద్భాందవులం?/
మనం ఆపద్భాందవులమైతే
మనకూ అవుతాడు ఆపద్భాందవుడు ఆ ఆపద్భాంధవుడు/
తిప్పావఝల నరసింహమూర్తి
బుచ్చిరెడ్డి పాళెం
17.
అంశం:
ఆపద్భాంధవుడు:
డా.తంగిరాల నాగలక్ష్మి
ఎవడు ఆపద్భాంధవుడు
ఏ బంధం లేకపోయినా
ఎవరు ఏ ఆపదలో ఉన్నా
ఆదుకొనేవాడు
ఒంటరిగా పోరాడుతుంటే జీవన సమరంలో
నేనున్నానని అండగా నిలచేవాడు
ఆపద్భాంధవుడు
బంధాల కతీతంగా తోడుగా నిలచి
కష్టాలను లెక్క జేయక
సాయం చేసేవాడే వాడు.
ఎక్కడినుండో రాడు జనంలో నే ఉంటూ
అవసరమైనపుడు కనబడతాడు
దేవుడిలా
కృష్ణ పరమాత్మ ఆపద్భాందవుడే
పాండవులకు గోప బాలురకు గోపికలకు
కలియుగంలో భక్తులకు
త్రేతా యుగం లో రాముడు
ఆపద్బాంధవుడు
పాలకడలిలోని లక్ష్మీ నారాయణుడు
బ్రహ్మాది దేవతలకు ఆపద్బాంధవుడు
ప్రహ్లాదుని ఆపదలనుండి రక్షించిన
ఆపద్భాంధవుడు నారసింహుడు
క్షీరసాగర మధనంలో గరళం మింగిన
నీల కంఠుడు అపద్బాంధవుడు
సురాసురులకు
భస్మాసురుని బారి నుండి రక్షించిన
మోహిని రూపుడు విష్ణువు అపద్బాంధవుడు శివునికి
కలియుగంలో మనిషి రూపం లోనే దర్శనమిస్తాడు
ఆదుకుంటాడు అవసరమైనప్పుడు
అన్నివేళలా అంతర్యామి ఆపద్బాంధవుడై
అసుర సంహారం చేస్తాడు
సురలను ఆదరిస్తాడు
ధర్మాన్ని రక్షిస్తాడు
త్యాగమే వాడి లక్ష్యం
నిస్వార్ధమే వాడి ధ్యేయం
అహం కారం లేక మమకారం తో సహజీవనం సాగిస్తాడు
ప్రతిఫలం ఆశించనివాడు
బంధానికి కట్టుబడడు
అపద్బాంధవుడు
అందరి బంధువు అదే విచిత్రం
17.
అంశం:
ఆపద్భాంధవుడు:
డా.తంగిరాల నాగలక్ష్మి
ఎవడు ఆపద్భాంధవుడు
ఏ బంధం లేకపోయినా
ఎవరు ఏ ఆపదలో ఉన్నా
ఆదుకొనేవాడు
ఒంటరిగా పోరాడుతుంటే జీవన సమరంలో
నేనున్నానని అండగా నిలచేవాడు
ఆపద్భాంధవుడు
బంధాల కతీతంగా తోడుగా నిలచి
కష్టాలను లెక్క జేయక
సాయం చేసేవాడే వాడు.
ఎక్కడినుండో రాడు జనంలో నే ఉంటూ
అవసరమైనపుడు కనబడతాడు
దేవుడిలా
కృష్ణ పరమాత్మ ఆపద్భాందవుడే
పాండవులకు గోప బాలురకు గోపికలకు
కలియుగంలో భక్తులకు
త్రేతా యుగం లో రాముడు
ఆపద్బాంధవుడు
పాలకడలిలోని లక్ష్మీ నారాయణుడు
బ్రహ్మాది దేవతలకు ఆపద్బాంధవుడు
ప్రహ్లాదుని ఆపదలనుండి రక్షించిన
ఆపద్భాంధవుడు నారసింహుడు
క్షీరసాగర మధనంలో గరళం మింగిన
నీల కంఠుడు అపద్బాంధవుడు
సురాసురులకు
భస్మాసురుని బారి నుండి రక్షించిన
మోహిని రూపుడు విష్ణువు అపద్బాంధవుడు శివునికి
కలియుగంలో మనిషి రూపం లోనే దర్శనమిస్తాడు
ఆదుకుంటాడు అవసరమైనప్పుడు
అన్నివేళలా అంతర్యామి ఆపద్బాంధవుడై
అసుర సంహారం చేస్తాడు
సురలను ఆదరిస్తాడు
ధర్మాన్ని రక్షిస్తాడు
త్యాగమే వాడి లక్ష్యం
నిస్వార్ధమే వాడి ధ్యేయం
అహం కారం లేక మమకారం తో సహజీవనం సాగిస్తాడు
ప్రతిఫలం ఆశించనివాడు
బంధానికి కట్టుబడడు
అపద్బాంధవుడు
అందరి బంధువు అదే విచిత్రం
18.
సింగీతం సంతోష్ కుమార్
శీర్షిక:- ఆపద్భాందవుడు - గొప్ప వ్యక్తి
కష్టాలలోఆదుకొనెవాడు
సాటివారికిదేవుడు
కుచేలునికిఆదుకున్నకృష్ణుడు ఆపద్భాందవుడు
అర్జునికిసలహాలిచ్చినశ్రీకృష్ఞపరమాత్మడుఆపద్భాందవుడు
పరీక్షఫీజులేకుంటేకట్టెస్నేహితుడుఆపద్భాందవుడు
పేదరీకంలోపెన్నిదైనిలిచేవాడు
అన్నంపెట్టిఆదుకొనెవాడు
అందరిమేలుకోరెవాడు
అసరాఅయినిలిచేవాడు
స్వార్థంలేనివాడు
స్వంతభావాలుకలవాడు
ఎన్నిబాధలువచ్చిననిలిచికాపాడేవాడు
నిజమైనపలుకులుపలికి
నిండుగుండెకలవాడు
ఊరందరి మదిలో నిలిచేవాడు
ఉత్కృష్టమైనవాడు
అతడే అతడే ఆపద్భాందవుడు....
19.
కవిత శీర్షిక: ఆపద్బాంధవుడు. "నా మనసు పలుకుతుంది!
మంచి చేయడం గుణం కాదు, అది ఒక అలవాటు అని.
నా మనసు పలుకుతుంది!
మారనీ లోకానికి తెలియదు, గొప్పమనసు చాలుసహాయపడుటకని.
నా మనసు పలుకుతుంది!
జీవితం చాలా విశాలంగా ఉంటుంది,
సహాయం చేస్తే సంతృప్తిని పొందుతావని.
నా మనసు పలుకుతుంది!
సాకులు వెతుకకు తోడుండటానికి,
సహాయం అందించు నీ చేయి ముందుంటుందని. నా మనసు పలుకుతుంది!
మనమంతా కలిసి కట్టుగా చేయి చేయి కలిపి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని. నా మనసు పలుకుతుంది!
కష్టాన్ని తీర్చడానికి శ్రీరాముడివి కాకపోయినా, మమేకమయ్యి మానవత్వం చాటుదామని.
నా మనసు పలుకుతుంది!
దేవుడై మనిషిరూపంలో ఉన్న సోనూసూద్ లా, సహాయం అందిస్తే చాలు అని.
నా మనసు పలుకుతుంది!
సలహాలిచ్చే పెదవులను అదుపునపెట్టి, సహాయం చేసే చేతులకు శ్రీకారం చుట్టమని. నా మనసు పలుకుతుంది!
అన్నం పెట్టిన అమ్మ ,చదువు చెప్పిన గురువుతో పాటు, కష్టాల్లో ఆదుకున్న వారిని మరువకని.
మనసు పలుకుతుంది!
ఎవరు మొదలని చూడకు నీతోనే ప్రారంభించు, ప్రజల గుండెల్లోకొలువవుతావు ఆపద్బాంధవుడని. నా మనసు పలుకుతుంది ! కష్టాల్లో చేతు లొగ్గు వాడు కాదు స్నేహితుడు, ఆపదలో ఆడుకునే వాడే ఆపద్భాందవుడు అని. కవిత రచన #వేదవాణి✍️
21.
ఆదుకునేదెవరైనా
...............................
బావిలో పడిన బతుకు బొక్కెనను
పైకి లాగడానికి పాతాళగరిగె సాయం
ఒడ్డున పడిన చేప తనువు చాలించక ముందే
నీటిలోకి తోసే దయాగుణం కావాలి
కోడిపిల్లల్ని గద్ద నుంచి కాపాడేందుకు
తల్లి కోడి సరిహద్దులో సైనికునిలా అప్రమత్తం
చీకటి అడవిలో చిక్కుకున్నప్పుడు
మిణుగురులు దీప దూతలు
ఈత రాక ప్రవాహంలో కొట్టుకుపోయే శరీరానికి
ప్రాణం లేని దుంగ ప్రాణమిస్తుంది
దారి తప్పి దగడు తింటుంటే
తొవ్వ చూపేవాడు కనిపిస్తడు ఆప్తుడిలా
అప్పిచ్చే వారు కనిపిస్తారు ఆపద్బాంధవుల్లా
తిరిగి చెల్లించకపోతే యమదూతల్లా
అగ్గి చుట్టుముట్టిన ఇంటిని
ఆర్పే వారెవరైనా కనిపిస్తారు కంటికి రెప్పలా
వేటగాన్ని కుట్టి గురి తప్పేలా చేసే చీమైనా
అడవి జంతువులకు ఆపదమొక్కుల దేవత
ఆపదల బురదలో చిక్కుకున్నప్పుడు
అమ్మానాన్నల కంటే ముందు యాదికొస్తాడు దేవుడు
గట్టెక్కించాలని మొక్కుకుంటాం మొక్కులు
ఆపద్బాంధవులు ఎక్కడో లేరు
ప్రేమ,దయాగుణం దండిగా పండితే
ప్రాణమున్నా లేకున్నా ప్రతి వస్తువు, ప్రతి జీవి
మన మధ్యలోనే ఆదుకునే దైవదూతలే
.........................................................
కొమురవెల్లి అంజయ్య
సిద్దిపేట
తేది..09-06-2022
సెల్..9848005676
22.
కవితా గానం 3
అంశం:: ఆపద్బాంధవుడు
శీర్షిక:: దయామయుడు
రచన:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
తేదీ:: 9.6.22...గురువారం
సెల్:: 8309920625
కష్టాలలో ఉన్న వారిని చూసి కరిగిపోవాలి
ఆపదలో వున్న వారిని అరసి
జాలి కలగాలి
ఇబ్బందిలో ఉన్న వారికి చేయూత నివ్వాలి
ఇడుములలో ఇరుక్కున్నవారికి
ఇష్టంగా సాయమందివ్వాలి
అన్నార్తులకు అన్నంపెట్టి
కడుపు నింపాలి
చదువు కోసం డబ్బు లేక
ఇబ్బంది పడే విద్యార్థులకు
ఫీజులుకట్టాలి - చదువించాలి
ఆరోగ్యము బాగా లేని రోగులకు మాట సాయమో
మందులు కొనివ్వడమో చేయాలి
చలిలో వానలో వణికే నిర్భాగ్యులకు దుప్పటి కప్పి
కాపాడాలి
రోడ్డు ప్రమాదమూ సంభవించి
నప్పుడు వారిని ఆసుపత్రికి
చేర్చాలి-ప్రాణము కాపాడాలి
అత్యవసరమున్న వారికి
వైద్యమందివ్వాలి
కన్నీళ్లు తుడిచి కాంతి రేఖలు
నింపాలి
కులం మతం చూడక సహాయము అందివ్వాలి
ఆవేశము చెందక ఆలోచించి
అడుగు వేయాలి
స్వార్థము కోరి సాయము అందివ్వకు
ప్రతిఫలమాశించి సేవ చేయబూనకు
వలస జీవులకు సోనూసూద్
నిస్వార్థ సేవలందించే
కోట్లు ఖర్చు పెట్టి ఎవరి ఇండ్లకు
వారిని పంపించే
దయ జాలి కరుణ గుణాలను
అన్ని ఒక చోట పోత పోసినట్టుగా కనిపించే
నిజంగా ఆపదలో ఆపద్బాంధవుడిగా నిలిచే
పేద జనమంతా దేవునిలా కొలిచే!!
ఈ కవిత నా స్వీయ
రచన అని హామీ.
23.
కవితాగానం ( సీజన్3) 9/6/2022/ గురువారము
కవనజ్యోతి సమూహం నిర్వహిస్తున్న జేష్ట పౌర్ణమి నగదు పోటీకి,
అంశం:- " ఆపద్బాంధవుడు "
ఆపదలోనున్నప్పుడు ఆదుకొనువాడు ఆపద్బాంధవుడు
మనకు అండ నిలచు వాడ ఆపద్బాంధవుడు
అట్టి ఆపద్భాంధవుడు ఆపరమాత్మయే
బంధువైన స్నేహితుడైన స్త్రీపురుషులైన బాలవృద్దులైన గొప్పవారు పేదవారైనను గావచ్చు
ఆపద్బాంధవుడు మనముందుకాని వెనుక కాని ప్రక్కలందు కానినుండవచ్చు ఎక్కడున్నగానిఆపదలో నాదుకొన్నవాడె ఆపరమాత్తరూపుడు
వేదనలోనున్నంత వెతలు తొలగించువాడు ఆపద్బాంధవుడు కలిమిలేములనుచూడక కష్టసమయాన ఆదుకొన్నవాడె ఆపద్బాంధవుడు జీవనసమరాన ఏదోఆపదరాకమానదు అట్టిసమయమందు ఆదుకొన్నవాడె ఆపద్బాంధవుడు
ఏఆపదలుగలిగినను ఆదరించువారె ఆపద్బాంధవులు
శత్రువైననుకూడ ఆపదలో నాదుకొన్నవాడు ఆపద్భాంధవుడే ఆపదలోనున్నప్పుడు ఇతడు నావాడా పైవాడా అన్నఆలోచన లేకుండా ఆపదలో అందరిని ఆదుకొన్నవాడె ఆపద్బాంధవుడు
అతడే పరమాత్మ రూపులో మనలను ఆదుకొనగవచ్చిన ఆపద్బాంధవుడు!
తరణికంటి సూర్యలక్ష్మీ.
_________
24.
కవనజ్యోతి సమూహం పక్షాన
కవితాగానం సీజన్ -3
పౌర్ణమి కవితల పోటీ
తోట సులోచన
నెల్లూరు
చరవాణి 9490173053
అంశం ఆపద్భాంధవుడు
శీర్షిక ఆపన్న హస్తం
జీవితం చీకటి వెలుగుల సమ్మేళనమే
ఎంతటి కొమ్ములు తిరిగిన వారికైనా
ఏనాడైనా సాటి మనిషితో యవసరం
ఉండక తప్పదుగా
జీవితం వడ్డించిన విస్తరైనా మానవత్వ
పుష్పాలమై పరిమళిస్తూ పదిమందికి
ఆపన్న హాస్తమైతే జన్మ ధన్యమే
వృక్షం నిస్వార్ధతేజంతో తన్నాశ్రయించిన
వారికి చిరునవ్వులను ప్రసాదిస్తూ
పరోపకారార్ధం మిదం శరీరంను
సత్యం చేస్తూ ఆపద్భాంధవుడిగా
చిరకాలం సేవలతో పులకించు
తన సుఖాన్ని చూసుకుంటూనే
ఇరుగుపొరుగు సాయం కోరకున్నా
ఆపదలో నేనున్నాని వీచే గాలిలా
ఆహ్లాదం పంచితే మానవత్వం
తలెత్తి సుగంధాన్ని సమాజమంతా
వ్యాపింపజేసి పొంగి పోదా మరి
జీవనయానంలో నెటు చూసినా
కన్నీటి జలపాతాలెన్నో దర్శనమే
అందరి దుఃఖభాష్పాల నోదార్చుట
అసాధ్యమైనను చేతివేళ్ళకు పని
చెప్పడం మనిషిగా కర్తవ్యమేగా
ఆపన్న హస్తమందించుటలో నున్న
తృప్తి,సంతోషం మెందులో లేదుగా
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతమని హామీ ఇచ్చుచున్నాను
25.
*కవితాగానం సీజన్-3*
*జ్యేష్ఠ మాస పౌర్ణమి కవితల పోటీలు*
*అంశము: ఆపద్బాంధవుడు*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *సమయానికి తగు సాయమిచ్చెడి..*
ప్రక్రియ: *వచనకవిత*
*********************
*ఎవరు నీవు? ఎక్కడి వాడవు?*
*అన్నవా! తమ్ముడివా! తండ్రివా! తనయుడివా!*
*అన్ని సమస్యలూ నీవేనంటావ్! అన్నింటిలోనూ వేలుపెడుతుంటావ్!*
*కష్టాలలోను, కన్నీళ్లలోను, కడగండ్లలోనూ, కరువులోనూ*
*ఎవరు పిలిచారని వస్తున్నావ్! ఎందుకు సాయం చేస్తున్నావ్!*
*దిశ కనిపిస్తే దశ మారుస్తావ్! నిర్భయలందరికీ అభయం ఇస్తావ్!*
*కుచేలురందరినీ కుబేరులుగా చేస్తావ్!*కుటీరాలన్నీ కోటలుగా మారుస్తావ్!*
*రావణుజంపిన రామునివా! చీరలు పంచిన కృష్ణునివా!*
*పేదసాదలే ప్రియమంటావ్! అష్టకష్టాలే ఇష్టమంటావ్!*
*యుద్ధభూమిలో గాయాలకు కట్లు కట్టగా ఫ్లోరెన్స్ వా!*
*మురికివాడల్లో అక్షరాలు దిద్దించగా థెరెసావా!*
*బాధల్లోనూ వేదనలోనూ శోకంలోనూ దుఃఖంలోనూ.. ఉన్నానంటావ్! అన్నీ అంటావ్!*
*ఎందుకు మాపై నీకీ ప్రేమ? ఎక్కడ ఉందోయ్ నీ చిరునామా?*
*కులమూ వద్దు! మతమూ వద్దు! ప్రాంతమూ వద్దు! భాషా వద్దు!*
*అందరినీ నువు నీవారంటావ్! అవసరాలలో అండగా ఉంటావ్!*
*ఆశలు లేవు ఆశయాలు తప్ప! కోరికలు లేవు లక్ష్యం తప్ప*
*నీకంటూ ఏమీ అడగవు! అయినా అందరి నోళ్ళల్లో నానుతావు!*
*నీవారెవరో.. పైవారెవరో.. ఎవరూ ఎరుగరు.. పైవాడు కూడా!*
*ఎందుకు మాపై ఇంత అభిమానం! ఎక్కడుంది నీ సేవకు కొలమానం!*
*ఏమని పిలవాలి నిన్ను? హితుడా! స్నేహితుడా! దేవుడా!*
*అపద్బాంధవుడు అంటే నువ్వే కదా! ఏ కారణం లేకుండా రక్షించే రక్షకుడివి!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*
26.
*ఆపద్బాంధవుడు
******************
సంబంధమేది లేకున్నా
అనుబంధమేది లేకున్నా
ఊతమిచ్చుటకు ఉబలాటపడి
చేయూతనిచ్చుటకు చైతన్యమై
ఇతోధికంగా ముందుకువచ్చి
ఏది ఆశించకుండా
ఆదుకునేవాడే ఆపద్బాంధవుడు
కష్టాలలోనున్న సుగ్రీవుడికి
స్పష్టతనిచ్చిన సన్మిత్రుడగు
శ్రీరాముడు ఆపద్బాంధవుడు
దాయాదులపోరులో
కురుక్షేత్ర సమరంలో
అస్త్రసన్యాసము చేసిన పార్థుడికి
ప్రాపంచిక జ్ఞానబోధచేసి
గీతాసారమునుదెలిపి
చేతనత్వమును నింపి
విజయబాటను జూపిన
శ్రీకృష్ణుడు ఆపద్బాంధవుడు
కోరికలే దుఃఖానికి కారణమని
తీరైన రీతిలో మనుగడ సాధించడం దెల్పిన
తథాగత బుద్ధుడే ఆపద్బాంధవుడు
పసితనము నుండి నడకలు నేర్పి
సదాశయ నడతను గొనుమని
ఆధరించే నాన్ననే ఆపద్బాంధవుడు
నిస్వార్థముతో నిజంగా తోడ్పడే
సశ్ఛీల స్నేహితుడే
అసలైన ఆపద్బాంధవుడు
కరోనా విలయతాండవమునకు
కకావికలయిన సగటు జీవులు
స్వంతగ్రామాలకు తరలే వలసవాదులకు
స్వంతమనిషిలానిలబడి
ఆసాంతంతోడ్పడిన సద్గుణ ఘనుడౌ
సోనుసూద్ ఓ ఆపద్బాందవుడు
కష్టకాలంలో ఇష్టంగా నిలిచేవాడే
ఆపద్బాంధవుడు.
******************
మేకల రామస్వామి
చెన్నూర్
9912747214
27
[10/06, 7:00 am] Lalita Sister: కవితా గానం సీజన్ 3
జ్యేష్ఠ మాసం పౌర్ణమి కవితల పోటీకి
అంశం: ఆపద్బాంధవుడు
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి:9505152560
**********************
*యుగానికి* *ఒక్కడు*
విపద్ఘడియల్లో విశ్వరూపమెత్తి
విపరీత శక్తి యుక్తులుగలిగి
ఆదుకునే వ్యక్తి బిరుదాంకితుడు
ఆపద్బాంధవుడు!
కోటి ఆశలపై నీళ్లు జల్లి
నిస్వార్థపరాయణతకు శిరసు వంచి
సహాయ సహకారాలు
అందజేయు ఆపన్నహస్తం!
గజకరిని సంహరించు పట్టుకు
హరిని శరణు వేడుకొనగా
మరి మొర వినగ..
అత్తరి ప్రాణం రక్షణకు పాహిమాం
మకరిని మట్టుపెట్టి కరిని ముక్తినిచ్చే శ్రీహరి!
జీవితం దుర్భరమై బతుకు బుద్బుదమై
గడ్డు పరిస్థితిలో గట్టుకు చేర్చు దైవము
కరోనా కాటేసిన కాలంలో
కరడు గట్టిన కౄరుడు వెండి తెరపై
కారణజన్ముడై అవతరించే సోనూసూద్
కష్ట యాత్రికులకు గరుడ వాహనుడై
ఆకొన్న శుష్క జీవులకు అన్న విధాతయై
శ్వాస ఆడని చోట ప్రాణవాయువైనాడు దేవుడు!
సరిహద్దు ప్రాంతంలో పహారా కాస్తూ వీరజవాన్ కూడా
ఆపద్బాంధవుడు!
యుగానికొక్క యుగపురుషుడు
కారణ సహితుడై ఉదయిస్తుంటాడు
ఆపద సమయంలో
ఆత్మజుడై ఆదుకుంటాడు!
***
-సయ్యద్ జహీర్ అహ్మద్
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.
ఇట్లు మీ
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
28
[10/06, 7:01 am] Lalita Sister: కవితా గానం
ఏడెల్లి రాములు
ఆపద్బాంధవుడు
శీర్షిక*ఆత్మబంధు
బ్రహ్మ హరిహరాదుల ప్రసాదం
నరజన్మం
సత్వగుణ ప్రకాశం
సర్వోన్నత విలువల వారధి జీవితం
తన్ను తాను గెలిచి
తమో రజో గుణాలను విసర్జించాక
దయార్ద్ర హృదయ స్పందనలే
ఆత్మ బంధం పరిమళభరితమై సాక్షాత్కారం
పారే సెలయేరే చెలిమకు చోటు
కారుణ్యమే చెలిమికి పూదోట
ఆపదలో ఆసరాయై
కష్టాల్లో భరోసానివ్వడమే మంచికి
మల్లెల హారం
స్వార్థ ప్రయోజనాలకు జల్లెడ పట్టి
నిస్వార్థంగా పయనించడమే
సేవాభావానికి అంకురార్పణం
అరుణారుణ కమలాలయం మనసైతే
అహం కుబుసం విడుస్తుంది
బేధభావములెరుగక ఎరుక ఒకటే
మిగిలేను
తోటి వారికి లాభం చేయకున్నా
ముదనష్టపు ఆలోచనలకు కళ్ళెం వేస్తే
సర్వే జనా సుఖినోభవంతు
మనిషి పుట్టువడికి గుర్తింపు
ప్రతీ మనిషిలో దైవాన్ని దర్శించావా
తోటి వారి కన్నీళ్ళను తుడిచే చేయి నీదే
ఆత్మ బంధువై వెలిగే జీవితం నీదే
ఏడెల్లి రాములు ✍️
ది*09*06*2022(21*25)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
29.
కవితా గానం సీజన్ 3
కవితా పోటీ కోసం
జ్యేష్ట మాసం పౌర్ణమి సందర్భంగా
...
అంశం: ఆపధ్బాంధవుడు
శీర్షిక: అభయహస్తం
...
మనిషి జీవనయానంలో
ఎన్నో దశలు, ఎన్నో మజిలీలు
ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు
మనకు తెలియకుండానే
ఆపదల ఊబిలో కూరుకుపోతాము
ఆనాడు మహాభారతంలో
పాండవులను ఆపదల నుంచి
అడుగడుగునా రక్షించె
పార్థసారథి ఆపద్భాంధవుడై
నేటి సమాజంలో
స్నేహితుడే ఆపద్భాంధవుడు
హితుడు, సన్నిహితుడు
స్నేహానికి విలువనిచ్చేది
స్నేహితుడు పిలువక ముందే
అతని ముంగిట వాలేది
మండుటెండలో మలయ సమీరంలా
తన ప్రాణం అడ్డుపెట్టి
స్నేహితుడిని కాపాడే ప్రాణదాత
ఆపదలో అభయహస్తమై
ధైర్య వచనాలతో
మిత్రుడికి అండగా నిలిచేది
స్నేహితుడు చల్లగా ఉండాలని
కోరుకునే మంచి మనిషి
కన్నీరు తుడిచే మిత్రుడు
నిస్వార్థపరత్వానికి నిలువెత్తు రూపం
...
హామీ పత్రం
...
ఈ కవిత నా స్వంత రచన
గజవెళ్ళి శ్రీనివాసాచారి
30.
[10/06, 9:38 pm] Lalita Sister: కవితా గానం
అంశం : ఆపద్బాంధవుడు
శీర్షిక : నిజమైన నేస్తం
'ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు '
వెనుకటి నుండి పెద్దవాళ్ళు చెప్పిన నానుడి !
అతడే..ఆపద్బాంధవుడు!
అవసరం ఎలాంటిదైనా..
కష్టం నుండి గట్టెక్కడం ఎంతటి కఠినమైన సవాలైనా..
నీకు నేనున్నాను నేస్తం ..
అంటూ ఆత్మీయంగా పలుకుతూ..
హితవచనాలతో మనోబలాన్ని చేకూర్చుతూ..
ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకుని కష్టంపై కలిసికట్టుగా పోరాటం చేద్దామంటూ చేయి కలుపుతూ ..
ఎదురైన బాధల్ని మటుమాయం చేస్తూ..
విజయవంతంగా ముందుకు నడిపే నేస్తం..అతడే ఆపద్బాంధవుడు!
అలాంటి ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన మహోన్నత మనస్సుగల స్నేహితులు తోడుగా సాగే జీవితం చైతన్య భరితం !
రచన : గొర్రెపాటి శ్రీను
31
[10/06, 9:38 pm] Lalita Sister: కవితాగానం సీజన్ 3
************************
అంశం:- ఆపద్బాంధవుడు
"""""""""""""''''""""'"'''''""""""""""""""""""
అలనాడు సభలోన
పలుగాకు లందరు
పలుకుబడి కలదనుచు
పలుగూత లాడుచూ
పలుపలు విధమ్ముల
పలుచ బరుచుచు నెలత
వలువ లొలువగ దలచ
కలత చెందిన పొలతి
విలపించి తలరుచూ
తలడిల్లి తలపోసి
జలధిశాయిని దలచి
పలురీతి స్తుతి చేయ
పిలుపులకు పులకించి
పులుగు రేనిని యెక్కి
కలతలను తొలగించ
తులకించుచు హరి
వలువ లొసగియు వనిత
విలువలను నిలుపెను
జలజ నాభుడు హరి
తలిరుబోడి పాలి
తను ఆపద్బాంధవుడు.
************************
🖋️ వేదాంతం సురేశ్ బాబు
చంద్రపూర్.
32
[10/06, 9:39 pm] Lalita Sister: కవితా గానం
జేష్ట మాసం పోటీల కొరకు
తేది. 09.06.2022
ఆంశం: ఆపద్బాంధవులు
సాయం పొట్లం
°°°°°°°°°°°°°°°
ఆపదలో ఆపన్న
హస్తమందించినోళ్ళే ఆప్తులు
అవసరంలో ఆదుకున్నోళ్ళే
అసలైన మిత్రులు
కష్టాల చెరువులో
మునిగిపోతుంటే
సాయం చేతాడు
అందించినోళ్ళే మనోళ్ళు
ఆకలి అడవిలో
తచ్చాడుతుంటే
పట్టెడు పెట్టినోళ్ళే మనోళ్ళు
పడమటి గట్టుమీన
సాయం పొద్దును చూసెటోళ్ళకు
వరస కలిపి వసారాలో
చోటిచ్చినోళ్ళే తోబుట్టువులు!
రాబందులు రక్కుతుంటే
కాపాడినోళ్ళే బంధువులు
చదువుకు దూరమై
బడిని దీనంగా చూసెటోళ్ళకు
పుస్తకమందించినోళ్ళే గొప్పోళ్ళు
లక్షలు, కోట్లు హుండీలేసి
దేవుడికి దణ్ణం పెట్టేకన్నా
మెట్లమీన చెయి చాచినోళ్ళకు
సాయం పొట్లమిచ్చి చూడు
వాళ్ళు పెట్టే దండమే తృప్తినిస్తది!
గంగాపురం శ్రీనివాస్
9676305949
33
[10/06, 10:16 pm] Lalita Sister: *అంశం: ఆపద్బాంధవుడు*
***************
అతడికి ఎలా తెలుస్తుందో ఏమో
గజేంద్రుని రక్షించిన శ్రీమహావిష్ణులా
అన్యాయం జరిగే చోటుకు
ఆగమేఘాల మీద పరుగెత్తుకొని వచ్చి కాపాడుతాడు
అతడికి ఎలా అర్థం అవుతుందో ఏమో
భక్తులను కరుణించే భోళా శంకరునిలా
అనాధ హృదయాన్ని ఆర్తిగా గుండెలకు హత్తుకుని
తాను ఉన్నానని భరోసా ఇస్తాడు...
అతనికి ఎంత దూర దృష్టో
విధాత రాతను మార్చేందుకు
అపర బ్రహ్మగా రూపమెత్తుతాడు,..
అదేమిటని ఆశ్చర్యంగా చూస్తే
వటపత్రశాయిలా స్వచ్ఛమైన చిరునవ్వులు చిందిస్తాడు..
సరిహద్దు సైనికుడిలా తన ప్రాణాలనైనా త్యాగం చేసేందుకు సిద్ధపడతాడు...
ఇంతగానా అనేవారి
అమాయకత్వానికి
బాధపడే సున్నిత మనస్కుడు
నిలువెత్తు చెలిమి రూపంలో ఉన్న స్నేహితుడు
అతడే మానవీయ విలువలతో మూర్తీభవించిన ఆపద్భాందవుడు..
34
[10/06, 10:33 pm] Lalita Sister: తేదీ :10-6-22
అంశం : ఆపద్భావుడు
శీర్షిక :ఇప్పుడతడు
*******-*****************
మీకు గుర్తున్నాడో లేదో
నాకు అతను గుర్తున్నాడు..
ఇప్పుడతడు ఓ వినకూడని మాట మోసగింపబడుతున్న ఓ దీనగాథ...
అతనిప్పడు అందరికీ పురాతనుడు
వేగంగా అంతరించి పోతున్న అరుదైన అవతారమతడు కదిలేకాలం వెనక నిస్సహాయపు దిగులు మేఘపు మట్టి జాడై
కదులుతున్నాడు...
అతని కాళ్లకింద భూమిలేదిపుడు తలవెనక
దీపం తప్ప అతని దుఃఖపు ఋతువును మోసే తోడేదీలేదిక్కడ కొమ్మకు వేలాడుతున్న తువాలు తప్ప... గుప్పెడు మట్టికి చమట గంధం పూసి
ఆకుపచ్చ సంద్రాలు పొంగించినోడు కొండల్ని సుప్త ఏడారుల్ని పూదోటల్ని చేసి నవ్వించినోడు
అరుదైపోతుంటే అగుపించక పోతుంటే ఈనేలిప్పుడు శప్తభూమే... ఆ ఆప్తుణ్ణి లోకం ఆకలి పేగుకి ముదివేస్తేనే రాబోయే ఆపత్కాకాలాన్నిటికీ అతడే ఆపద్భావుడు... అన్న సింధువు...
**************************************
ఆర్. వి. వి. రాజా, శృంగారయునిపాలెం
కాకినాడ జిల్లా.,9059492795.
హామీ పత్రం
ఈనా కవిత దేనికిని అనుసరణ అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను. ధన్యవాదములు
Comments
Post a Comment