Skip to main content

Mahatma 30 2022

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
 వీరా గుడిపల్లి
**********************
కవివరుల జాబితా
1.మేకల రామస్వామి గారు
2.అపరాజిత రెడ్డి గారు
3.సింహాద్రి వాణి గారు
4.తోట సులోచన గారు
5.వనపర్తి గంగాధర్ గారు
6.ఏడెల్లి రాములు గారు
7.టేకుమళ్ళ విజయ లలిత గారు
8.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
9.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
10.దార స్నేహ లత గారు
11.కవిత వెంకటేశ్వర్లు గారు
12.తరణికంటి సూర్య లక్ష్మి గారు
13.మద్ది పుల్లారావు గారు
14. పిన్నక నాగేశ్వరరావు గారు
15.కోరాడ నరసింహారావు గారు
16.డా.బల్లూరి ఉమాదేవి గారు
17.జోషి పద్మావతి గారు
18.గొర్రెపాటి శ్రీ ను గారు
19.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
20.తంగిరాల నాగ లక్ష్మి గారు
21.డా. కమలాదేవి గారు
22.వేదాంతం సురేష్ బాబు గారు

****************
[30/01, 7:33 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️

కవితాగానం సీజన్ 2

నేటి అంశం
30.01.2022

గాంధీ వర్ధంతి సందర్భంగా
ప్రత్యేక కవితలకు
ఆహ్వానం పలుకుతున్నది
మన కవితాగానం

ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో
స్పందించగలరు.

ఆ సమయంలో ఎలాంటి
ఇతర స్పందనలు తెల్పకుండా
సహకరించగలరు.

❇️❇️❇️❇️❇️❇️
1
[30/01, 8:03 pm] Mekala Ramaswamy Poet: గాంధీగిరి చేద్దాం
****************
రోజుకొక్క తీరుతో
రాజీలేని పోరుతో
తెల్లదొరల కుట్రలను
ఎల్లరకు తెలిపి
చేతికర్రఊతముగా
చేతనత్వ తేజముగా
"గీత" ప్రబోధములతో
రాతమార్చు కృతితో
అడుగేసిన ధీశాలి
నడచిన మనోధైర్యశాలి
భరత జనులనుభవించే
బానిసత్వమెందుకని
మనదేశం మనదేననే
భావ జాలమును  పెంచి
స్వపరిపాలననే
స్వశక్తి సందీప్తమని
భరతజాతి కష్టాలకు
బాధ్యతను చేకొని
భరతమాత కన్నీళ్ళకు
పరిష్కారమును గొని
మాటమాట పదునుపెట్టి
సాటి ప్రజల గుంపుకట్టి
ఉద్యమాల జోరుతో
ఊరుమ్మడి హోరుతో
వందే మాతరమంటూ
మనదే భారతమంటూ
ప్రతి ఎదలో పౌరుషం
ప్రతి మదిలో  చైతన్యం
నింపినట్టి బాపూజీ
నిను మరువము గాంధీజీ
సత్యాగ్రహ ఆయుధాన్ని
నిత్యం ప్రయోగించి
అహింసా వ్రతధీక్షను
అనునిత్యం ఆచరించి
బ్రిటిషు వారి గుండెల్లో
బెదురును కలిగించి
ఆంగ్లేయుల పాలనను
అంతమొందించి
స్వేచ్ఛను మాకై పంచిన
కర్మయోగి మహాత్మా
స్వాతంత్ర్య మందించిన
సకల జనుల పరమాత్మా
నీ మాటలు మరువలేము
నీ బోధలు విడువలేము
నీవు చూపిన బాటలో
నిరతము పయనించెదం
నీ కళల భారతాన్ని
నిజం చేయ కదులుతాం
************************
 మేకల రామస్వామి-చెన్నూర్
              
**************************
2
[30/01, 8:18 pm] Aparajith: మన మహాత్ముడు గాంధీజీ!

మహాత్ముడా ఓ గాంధీజీ 
నీవు నడయాడిన ఈ దేశం పునీత 
అహింసే పరమావధిగా 
సత్యాగ్రహం నిరాహారదీక్షలను 
ఆయుధాలుగా చేసుకుని 
ఆ కఠిన పాశాన హృదయుడు 
తెల్లవాడి ముహం తేలగిల పడగా 
నిరుపేదల అంధకార భారతంలో 
అతి సాధారణ వేష భాషల జీవనంతో 
అతిసామాన్యుని చేరువ కెళ్ళి 
పాదయాత్రలు సలుపుతూ 
దేశంలో స్వతంత్ర జ్వాలలు రేపుతూ 
ఉప్పుసత్యాగ్రహం క్విట్ ఇండియా 
ఉద్యమాలు తెల్లవాడిని పారద్రోలెందుకు భూమికలు 
వ్యూహాత్మకంగా తెల్లవాడిని చావుదెబ్బతీసి 
వాని అంతట వాడినే 
ఒక్కడంటే ఒక్కడు ఈ దేశంలో మిగలకుండా 
దేశం విడిచి వెళ్ళేట్లు చేసిన ఘనత నీది 
ఆతరుణంలో నాయకులందరిని ఒక్కత్రాటిపై నడిపావు!
 నీ జీవన శైలి కడు రమణీయం 
కేవలం కూరగాయల భోజనం మేక పాలు తీసుకుంటూ 
సబర్మతీ ఆశ్రమంలో సమయపాలన పాటిస్తూ 
ఉదయం సాయంత్రం ఎన్ని పనులున్నా ధ్యానంలో గడిపే సాదువులా జనంలో మమేకమయ్యావు 
ఇంతటి గొప్ప మానవ మూర్తిని అన్ని మతాలను ఏకం చేస్తున్నాడని 
ఓ మతమౌడ్య దురహంకారి అందరి మధ్య పాదాలపై మోకరిల్లి తుపాకితో కాల్చి చంపాడు!
స్వాతంత్ర్యం వచ్చి స్వేచ్ఛా గాలులు పీల్చుకుంటున్న దేశం శోకసంద్రంలో మునిగింది 
రఘుపతి రాఘవ రాజారాం,,,,,,,,అంటూ భారతమాత నుదిటిమీద వీర తిలకం దిద్దావు!

అపరాజిత్ 
సూర్యాపేట
3
[30/01, 8:42 pm] Siimhadri Vani Poetess: కవితా గానం ( సీజన్--2 )
రచన:--సింహాద్రి వాణి
ఊరు:--విజయవాడ
శీర్షిక:-- మార్గదర్శి
చరవాణి:--7569820872

ఓ మహాత్మా,
స్వార్థం యెరుగని నిస్వార్థ జీవీ
తరతరాలకూ నీ‌కీర్తి కాయాన్ని
సజీవంగా నిలుపుకున్న అమరజీవీ,
అందుకో మా కృతజ్ఞతాభి వందనాలు
అలదుకో మా అభినందన చందనాలు
కకావికలై, దిక్కుతెలియక బానిసత్వపుటంధకారంలో
కొట్టుమిట్టాడుతున్న మాతృదేశ ప్రజానీకాన్ని యేకతాటితో బంధించి
ముందుకు నడిపించిన మార్గదర్శివి
భరతావనిపై వ్రేళ్ళూనుకున్న
బ్రిటిష్ వటవృక్షాన్ని కూకటి వ్రేళ్ళతో పెకలించిన దృఢ సంకల్పుడివి
సత్యాహింసలే ఆయుధాలుగా
స్వాతంత్ర్య రణరంగాన పోరాడిన సమరయోధుడివి
కండబలం లేకున్నా గుండెబలంతో, ప్రజాబలంతో
విజయాన్ని సాధించిన ధైర్యశాలివి
కనిపించిన దైవానివై భారతీయులు హృదయాలలో
పూజ్య స్థానాన్ని అలంకరించిన
పవిత్ర మూర్తిని
ఓ బాపూ,
నీ పదం ఆచరణీయం
ఓ జాతిపితా,
నీ పథం అనుసరణీయం
నీ శాంతిసహనాలు ప్రజలకు శిరోధార్యాలు
నీ మమతామానవత్వాలు జాతికి మార్గదర్శకాలు
అవి ఆచరించిన నాడు, నిన్ను అనుసరించిన నాడు
భరతజాతి పురోభివృద్ధికి తెరచిన ద్వారాలు
విస్మరించిన నాడు అభివృద్ధికి మూసిన సింహద్వారాలు.
4
[30/01, 9:00 pm] +91 94901 73053: కవితా గానం సీజన్ -2
తేది 30-1-2022
అంశం    గాంధీజీ
శీర్షిక     మహాత్ముడు

భరత భూమిలో    జన్మించిన  మహాత్ముడు
విశ్వానికే   వెలుగైన   మహానుభావుడు
సత్య, ధర్మముల  నీడలో  నడచిన పుణ్యమూర్తి
అహింసా వ్రత  దీక్షతో  నింగి కెగసిన అద్భుత కీర్తి
మానవత్వ పూలబాటలో సాగిన  ధన్యజీవి
చేతికర్ర వూతతో  స్వాతంత్య్రం  సాధించిన
అమరజీవి
భరతమాత  సంకెళ్ళను  త్రుంచిన   ముద్దుబిడ్డ
రామరాజ్యాన్ని  స్థాపించడమే ఆయన ఆశయం 
బ్రిటిషువారిని  వెళ్లగొట్టడమే అతని ధ్యేయం
కళ్ళజోడులోంచి    సమాజరుగ్మతలను  వీక్షించే
సామాజిక స్పృహను  గుండె నిండుగా శ్వాసించే
పొట్టివాడైనా  గట్టివాడనిపించుకున్న  ధీశాలి
ఉప్పు సత్యాగ్రహాన్ని  చేపట్టిన  దీక్షామూర్తి
దేశ భక్తినే  శ్వాసగా జీవించిన బాపూజీ
విశ్వానికే మార్గదర్శియైన ప్రతిభామూర్తి
మన హృదయాల్లో  ప్రకాశించే  అఖండజ్యోతి
మనదేశచరిత్రలో   సువర్ణాక్షరాలుగా  జాతిపిత
భారతమాత  పవిత్రమూర్తికి   అక్షర నీరాజనం

తోట సులోచన
నెల్లూరు
చరవాణి  9490173053

హామీ పత్రం
ఈ కవిత నా సొంతమని హామీ
5
[30/01, 9:16 pm] Vanaparthy Gangadhar Poet: *కవితా గానం సీజన్ 2*
*****************************
*తేదీ:30.01.2022*
*అంశం:గాంధీజీ*
*శీర్షిక:సత్యశీలి*

తరతరాలు భారతావని మరువని
అచంచల శాంతి మంత్రం అతను
విజయాలకు దారి ఆవేశం కాదని
శాంతి మంత్రమే సర్వవిజయాలకు
సరైన దారని చూపిన శాంతి కపోతం

పట్టుదల,కృషి,సహనం
శాంతి,అహింస,సత్యం
అసాధారణమైన ఆయుధాలని
విజయానికి కావాల్సిన అసలైన అస్త్రాలని
ఆయుధాలని చాటిన సత్యస్వరూపం

నిర్బంధాలు,చిత్రహింసలు
నీ నిశ్చలమైన ఆశయం ముందు
నిస్సత్తువై లొంగిపోవాల్సిందేనని
ఆచరించి చూపిన సత్యాగ్రహి
సామాన్యుడు,సత్యశీలి గాంధీజీ

భరతమాత దాస్య శృంఖలాలని
తెంచి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించాలని
తన జీవితాన్ని పణంగా పెట్టి
భారతమాత పాద సేవ చేసిన
చరిత్ర మరువని మహోన్నతుడు మహాత్ముడు


*పేరు:వనపర్తి గంగాధర్*
ఊరు:హన్మకొండ

హామీపత్రం:ఈ కవిత నా స్వీయ రచన
6
[30/01, 9:18 pm] +91 94948 00454: కవితా గానం
ఏడెల్లి రాములు
అంశం*గాంధీజీ
శీర్షిక*సత్యాగ్రహం*

చేతిలో కర్రతో నడిచి
కాలానికి ప్రాణం పోసే సత్యార్థి
స్వాతంత్ర్య ఉద్యమాలకు
ఊపిరి పోసే నిత్య విద్యార్థి

సప్తపాపములను దరిచేరనివ్వని
మనసా వాచా కర్మణా ఆచర్యార్థి
అహింసను కండువా కప్పుకుని
దండిగా సత్యాగ్రహం చేపట్టిన ధీశాలీ

బాపూజీ
ఏవీ నీవెలిగించిన విలువల దీపాలేవీ
సహనశీలత కవచకుండలాలు లేనిదై
అనునిత్యం అపనిందల పాలు

శ్రమలేని సంపదలకు
అవినీతి అరాజకీయం జతకలిసి
మలిన మనసులు కబ్జాల దారుల్లో
ఊరేగుతున్నారు
మీ చిరునవ్వుల పచ్చనోట్లతో
కాగితాల తారుమారు యంత్రాంగం

ఆచరణకు అమలుకు పొంతనలేని
భ్రష్టుపట్టిన నాలుక మడత మాటలు

మహాత్మా
ఏవీ నీ ఏకాదశ వ్రత నియమాలు
నీ ఆశయాల కలలు కనడం
నీ అహింసా మార్గంలో నడవడం
దేశానికీ జగతికీ గర్వకారణం

ఓ ప్రేమ మూర్తి
నీ బాటను నడిచే బలమివ్వూ
అవినీతిపై గెలిచే వరమివ్వూ
7

ఏడెల్లి రాములు ✍️
ది*30*01*2022(20*14)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
[30/01, 9:22 pm] +91 85000 99051: మహాత్మా మరల రావా
=============
ఓ మహాత్మా!
మరలా రావా మాకోసం, మనదేశ శ్రేయస్సుకోసం,
నీ మౌనంతో వేనవేల గొంతులు పలికించావ్...
చంపారన్,దండి లతో  నీ ఆశయం సాధించావ్..
ఆనాడు నీ సత్యాగ్రహ జ్వాలలలో మాడిమసైనది పరాయి పాలన...
ఈనాడు యావత్ విశ్వం చేస్తోంది నీ మార్గాన్వేషణ..

ఓ జాతిపితా!!!
మరోమారు జనియించలేవా ??
మృగాళ్లను అంతమొందించ లేవా ??
అరక్షణానికో నిర్భయ ఘటన,
అరనిమిషానికో కాశ్మీర్ సంఘటన..

నేడు ఏదీ నీ స్ఫూర్తి??
ఇది కాదా మా దుస్థితి??
చూస్తున్నావా మనదేశ అధోగతి??
కదిలించలేదా మా పరిస్థితి??


ఓ గాంధీజీ ??!!??
నీ వారసులం కాలేమా ఏనాటికీ ???
రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్య పునాదులను కూకటివేళ్లతో పెకిలించిన మీకు ఎవరు పోటీ???
భారతరత్న, నోబుల్ కాలేవు నీ సంకల్పానికి సాటి...
అజరామర మనోనిబ్బరంతో,
అచంచలమైన ఆత్మస్థైర్యంతో,
మేము ముందుకు పోజాలమా???
నీ దీవెనల జడివానలో పునీతులం కాజాలమా ???
ఓ మహాత్మా..!!!
మరోమారు వస్తావు కదూ..!!! 
================
టేకుమళ్ళ. విజయ లలిత
8.
అంశం:-మహాత్మా గాంధీ
శీర్షిక:- శాంతి అహింసలే విజయానికి సోపానాలు
పేరు:-
అయ్యలసోమయాజుల ప్రసాద్ 
ఊరు:- విశాఖపట్నం
చరవాణి:-9963265762
...............................
శాంతి అహింసలనే ఆయుధాలుగా చేసి  పరదేశీయుల పాలననుంచి
భరతమాత దాస్యశృంఖలాలను తొలగించి స్వేచ్చాస్వాతంత్య్రములను ప్రసాదించిన మహాత్మా 
మీకివే శతకోటి వందనములు.....!!

గ్రామసీమలే దేశానికి పట్టుగొమ్మలని, అక్షరాస్యత తో దేశప్రగతి సాధించవచ్చునని గెలవక పోవటం కాదు మరల ప్రయత్నించక పోవటం అసలు ఓటమని
దరిద్రనారాయణులులే తన పాలిట దేవుళ్ళని 
అంటరానితనం అంటురోగం  వంటిదని
అన్ని మతాల సారము ప్రేమతత్వమని
మానవత్వమే మాధవత్వమని
చెప్పిన గాంధీ మహాత్ముని అడుగుజాడల్లో పయనించిన 
ఓ మనిషి నీవు అవుతావు ఆదర్శమనీషివి.....!!
................................
హమీపత్రం:-
ఇది నా స్వీయకవిత దేనికి అనువాదం కాదు.
అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
................................
9.
[01/02, 8:00 pm] +91 6281 697 982: ఇజాల పోరు....01022022
******
ఇదొక విచిత్రమయిన అనుభూతి
విచిత్రం కానివి వింతై కూచుంటాయి
విశిష్టం కానివి పరమ విశిష్టమౌతుంటాయి
ఎక్కడో ఉంది లెక్క.... గోల్ మాల్ తిక్క
అదే  గోబెల్ గారడీలో ఉన్న మాయల మట్కా

*అబద్ధం *అరవై ఊళ్ళు తిరిగొచ్చేసరికి...
పాపం....* నిజం* గడప కూడా దాటక.... నిస్సహాయంగా తేజోహీనమై అనాథ ప్రేతంలా
అందరినీ భయపెడుతోంది పలకలేనంతగా...!

ఇంక్విలాబ్ జిందాబాద్
అని ఉరికొయ్యలు కన్నీళ్లు కారుస్తుంటె
ఉరిత్రాళ్ళు సైతం  
బిగుసుకోమని మొరాయించినా.... 
కరగని గుండెలెన్నో కరుణించని మనసు లెన్నో

అప్నా ఖూన్ దో మై ఆజాదీ దూంగా అంటూ
చితాభస్మాన్ని మింగిన కలశం కూడా నినదించినా...‌.!!
కుటిల రాజకీయం కింమ్మనలేదు!!!!  
స్వకుచ మర్దనం కీర్తి ఖండూతే తప్ప ....

మాతృ భూమి రక్షణ నేరమైతే మళ్ళీ మళ్ళీ
ఇదే నేరం చేస్తాను.... 
ఎన్ని జన్మలెత్తైనా
నా మాతృ భూమి రుణం తీర్చుకుంటూనే ఉంటాను అంటూ ఉరి కంబాలకెక్కిన 
వీర యోధులు
బుల్లెట్ల తో ఒళ్ళంతా జల్లడై...
నేలకొరిగిన ఆజాద్ (దీలు) ల శ్వాసిందాలు
శ్వాసించిన ఈ గాలి.... శ్వాసిస్తున్న
అశేష భారతావని..... ఆలస్యంగా నైనా అర్థం చేసుకొంటుందేమో..... చూద్దాం
నిజం నిలకడ మీద తెలుస్తుందని 
అంటుంటే వింటుంటాం కదా

అమ్మ నిజం.... నవమాసాలు మోస్తుంది కదా
అందుకే ధారాపాతంగా కన్నీళ్లు
తన రుధిరం ఏరులై పారుతుంటె చూడలేక !!!
నా అనుకున్న వాడు పక్షపాతియై ప్రవర్తిస్తుంటే
నివ్వెరపోక ఏం చేస్తుంది !!!

ఇజాల పోరులో నిజాల సమాధులు
లేచి రావడానికి ఏ వారమో....!!!??

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
01/02/2022.
10
[01/02, 8:08 pm] +91 98499 29226: కవితా గానం సీజన్ @2
పేరు : దార. స్నేహలత
 ఊరు: గోదావరిఖని
తేది :01.02.2022
 అంశం : గాంధీజీ వర్ధంతి 
 శీర్షిక : నాదేశం మహోన్నత దేశం

సువిశాల అఖండభారతావని దేశభక్తిని
మాతృదేశ బానిస సంకెళ్ళ విముక్తికై 
అహింసాయుధం చేబట్టిన నిరాయుధుడు

సత్యమేవ జయతే ను సంస్థాపనం చేస్తూ 
శాంతిపథ మానవరూపం నేలకొరుగుతూ 
విశ్వజగతికి శాంతిసందేశం అందించిన 
భారతీయ మహాత్ముడు బాపూజీ 
మోహనదాస్ కరంచంద్ గాంధీ..

భారతికి సహనమను ఆభరణం 
సత్యమను సహజ సౌభ్రాతృత్వం 
ధర్మత్యాగనిరతినిసగర్వముగా చాటిన 
కొల్లాయి గట్టిన మహనీయుడు గాంధీజీ

పుణ్యజనుడు సబర్మతీ ఆశ్రమ స్థాపకుడు 
 తండ్రి కరంచంద్  తల్లి పుతిలీభాయిలకు 
జన్మించిన కారణజన్ముడు దేశభక్తుడు
నిరాడంబరుడు సత్యశోధకుడు
గుజరాత్ రాష్టంలో పోరు బందర్ లో
జన్మించిన నాదేశం పుణ్యధాత్రి 

సహాయనిరాకరణ ఉప్పుసత్యాగ్రహములు
క్విట్ ఇండియా తో యావత్ దేశాన్ని
జాగృతం చేసి జనసైన్యంతో
విదేశీ వస్త్ర బహిష్కరణతో 
బ్రిటిష్ పాలకులను తరిమికొట్టుటకు
గాంధీతత్వమను కార్యాచరణగా
ఆచరించి దిశానిర్దేశం చేసిన నాయకుడు 
 బోసినవ్వుల బాపూజీ మహాత్మాగాంధీజీ 
నడయాడిన నాదేశం మహోన్నత దేశం
11
[01/02, 8:09 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం 2
అంశం:: గాంధీ వర్ధంతి
తేదీ::1.2.22..మంగళవారం
శీర్షిక:: బహుముఖ ప్రజ్ఞాశాలి

పుట్టింది పొరుబందరులో
పెరిగింది అమ్మ ఆలనపాలనలో
చదివింది దక్షణాఫ్రికాలో

అవమానాలు పడినాడిక్కడ
స్వేచ్ఛ స్వాతంత్ర్యములకు పడే
పునాదక్కడే

భారత్కు వచ్చినప్పటి నుంచి
స్వరాజ్యముపైనే ధ్యాస
ఆ ధ్యాసపైనే శ్వాస

అహింసనే ఆయుధముగా
సత్యాగ్రహమునే సాయుధముగా
చేబూని 
కదలినాడు కార్యర్తియై
వదలినాడు తెల్లదొరలపై
పాశుపతాస్త్రమై

బాధలు భరించినాడు
జైలు శిక్షలు అనుభవించినాడు
కష్టాలు పడినాడు 
బ్రిటిష్ వారిని ఎదిరించినాడు

దండి దండయాత్రతో జనాన్ని
కదిలించినాడు
ఉప్పు సత్యాగ్రహముతో ఊపిరి
పోసినాడు
విదేశీ వస్త్ర బహిష్కరణతో జనాలలో ఉత్తేజం నింపాడు
స్వదేశీ వస్త్రాలు ధరించమన్నాడు
రాట్నం వడికాడు
ఖాధిని వాడి వాడమన్నాడు
చేనేతకు ఊతమిచ్చాడు

శాంతి మార్గం నడచినాడు
భక్తి త్రోవలో పయనించాడు
భగవద్గీతను నమ్మినాడు సమస్య సమయంలో దానినే పఠించినాడు
సమాధానము తెలుసుకున్నాడు
విశాల భారతదేశానికి విజయము చేకూర్చిపెట్టాడు
గాడ్ లాంటి నిన్ను
గాడ్సేరాక్షసుడు కాల్చి చంపాడు
బోసి నవ్వుల తాత
సరి లేరు సరి రారు నీకెవ్వరు
నీవే మాకు త్రాత
మీరే మా నేత
అందుకో మా జోత!!
                  కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.      8309920625
పై కవిత నా స్వంత రచన అని
హామీ
12
[01/02, 8:10 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం( సీజన్‌2) 1/2/2022/ మంగళవారము
అంశం:- గాంధీజీ
శీర్షిక:- గాంధీబాట
                   (1)
సీ!  సకలజీవులయందు  సమతనుజూపుచు
మానవతనుపెంచె  మనకుగాంధి

పేదసాధయనక  బేధముచూపక
కులమతబేధము  కుండదనియె

సంతసముండిన  సమకూరుబలమంత
సహనముచూపగ  శాంతివెలయు

సత్సమహింసయు  శాంతిమార్గమనుచు
జనులకు బోధించె  చక్కగాను

ఆ!  ప్రకృతివనరులన్ని  పక్కన పెట్టకు
వనరులెన్నిగలవు  వనములందు
మూగజీవులన్ని    ముచ్చట విహరించ
మానవులకునేర్పె  మనుగడంత!
                   (2)
సీ!  రాజసమొప్పగ  రాచబాటయనగ
గాంధిబాటయనగ  శాంతిబాట

ఎదురునిలచిపోరె  యేయాయుధములేక
శాంతియు ధ్యమములు  సహకరించ

శాంతిబాటనడచె  సంకల్పబలముతో
సాధించె రాజ్యము  శాంతితోనె

శాంతితోగెలుపొందె   సామ్రాజ్యమంతయు
జాతిపితయనగ  జనులు బిలువ

ఆ!  రామరాజ్యమొకటి  రంజిల్లజేయుచు
భరత రాజ్యమొకటి  బాపుగోరె
గాంధి కోరి నదియె  ఘనమైన రాజ్యము
పౌరబాధ్యతదియె  పౌరులార!
     తరణికంటి సూర్యలక్ష్మి.
                ------------
13
[01/02, 8:14 pm] Maddi Pullarao Poet: కవితా గానం
అంశం:జాతిపిత గాంధీ
మద్ది. పుల్లారావు
నందిగామ
9851287113
తేదీ: 1-2-2022
----- 

గుజరాతీ వైశ్యకుటుంబములో  
మద్యతరగతిలోజన్మించిన
విశాలభావ సంపన్నుడే మన మహాత్మా గాంధీజీ
చిన్న నాడె స్ఫూర్తి పొందె  
శ్రవణ కుమారుని చరితము విని
విదేశాల్లో చదివియూ
మధ్యం‌,మాంసం,మగువ ముట్టని ఆదర్శవాది
సత్యం,అహింస యే ఆయుధాలుగా
స్వరాజ్య పోరాటం జరిపిన పుణ్యమూర్తి
ఉప్పు సత్యాగ్రహమునకు 
ఉద్యమించిన మునివరుండు
గ్రామ స్వరాజ్యమునకు
 కలలుగన్న జగత్కుటుంబి
నిమ్నజాతుల కంటి నీరంబు తుడిచిన
నిరుపేద భాంధవుండు
మానవత్వమును భూమండలంబుననెల్ల
చాటిన ఆచార్య చక్రవర్తి
భరతఖండము గర్వించు వజ్రాల ధనరాశి
గోచిపాత కట్టు కొని జాతి మానంబు
కాపాడిన ఖద్దరు నేతగాడు
గాంధి తాత ఆశయములు కరుణ, మైత్రి
కుల,మతాలను అడ్డుగోడలు తుంచిన
మహాపురుషమౌళి
జాతిపిత గా భారత చరితలోన
సుస్థిర స్థానమొందిన పవిత్ర స్వరూపి
........
ఇది నా స్వీయరచన
14
[01/02, 8:48 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం(సీజన్2).        1--2--2022.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- గాంధీజీ వర్ధంతి.

1. ఉ.
పుట్టెను పోరుబందరను నుత్తర దేశపు పట్ట
                                                ణంబునన్
కట్టెను కంకణంబు చిరకాలపు దాస్య విముక్తి
                                                   కే కదా
తట్టెను జాతినంత నొక దారికి తెచ్చెను లిప్త
                                                   మాత్రలో 
నెట్టెను నాంగ్లరాజుల ననేకపు టేండ్లుగ నున్న
                                                   వారలన్.
2. తే.గీ.
సత్యము నహింస లనెడు ధీశక్తి తోడ
పార ద్రోలెను నాంగ్లేయ పాలకులను 
చిన్న రక్తపు బొట్టైన చిందకనె; య
హింసయే మహి సతతము హితము గూర్చు
ననుచు ఋజువు చేసిన "బాపు" నమరు 
                                                    డయ్యె.
3. ఉ.
శాంతి యహింసలే మనకు చక్కని మార్గమ
                                        టంచు గాంధిజీ 
పంతము పూని యాంగ్ల పరిపాలన నంతము 
                                             చేసె దీక్షతో 
నంత మహానుభావుని తలంచుచు నాబ్దిక 
                                          మాచరించి, నీ
వంతు కృతజ్ఞతలు తెలుప భారత పౌరుడ!
                                           ధర్మమౌ గదా!
**************************************
15
[01/02, 8:50 pm] Korada: గాంధీ వర్ధంతి ప్రత్యేక కవిత 
   కోరాడ నరసింహా రావు !
      *  స్ఫూర్తి ప్రదాత  *
             (ఆదర్శం )
         ************
నిరాడంబరతకు... నిజరూపం !
హరిశ్చంద్రుని సత్యసంధత... 
శ్రవణకుమారుని సేవానిరతి 
ఆదర్శం... !
బుద్ధుని అహింసా తత్వమే... 
పరమధర్మం... !
అకుంఠిత వివ్వాస పోరాటం... 
వెంట నడిచెను అశేష... 
భారత ప్రజానీకం !
హడలెత్తెను  నిరంకుశ ఆంగ్ల శాసనం... !
రూపొందెను విజయకేతనం !
హోరెత్తేను వందేమాతర నినాదం... !
ఎందరో దేశభక్తుల అనన్య ప్యాణత్యాగం... !
 ఫలించి వచ్చెను స్వాతంత్య్రం 
.పదవుల నాశించని మహౌన్నత్యం... !
దేశ విభజనలో న్యాయముకన్న 
ధర్మమునకే ఇచ్చెను ప్రాధాన్యం 
సహించలేని భారతీయ హైంద వ ఆగ్రహం... బలిగొన్న ది... మహాత్ముని ప్రాణం !
హే రామంటూ... చేసెను ప్రాణత్యాగం... !
జాతి పిత,మహాత్మా యని... 
కొనియాడెను ప్రపంచం !!
చేకూరెను ఆతని జన్మకు సార్ధక్యం... !
మన భారతీయులకే కాదు... 
ఈ ప్రపంచానికే ఆతని జీవితం 
ఆదర్శం.... !!
16
[01/02, 8:53 pm] Balloori Umadevi Poetess: కవితా గానం
పేరు:డా.బల్లూరి ఉమాదేవి
అంశము: జాతిపిత
శీర్షిక: బాపూజీ

కన్నవారి కలల పంటగా
పోరుబందరున పుట్టెను బాపు
సత్యాహింసల ప్రతిరూపమై
వేగుచుక్క గా వెలిగెను తాను
బోసి నవ్వుల బాపూజీ
దేశమాత శృంఖలాలను త్రెంచ 
నడుం బిగించిన ధీశాలి
సత్యాగ్రహమే ఆయుధముగా 
శాంతి మంత్రమే ఆలంబనగా 
సాగించెను సమరం తెల్లవారిపై
 సాధించెను అవనిలో  ఘనవిజయం
రాట్నం వడకుట  స్వయముగా నేర్చి
ఇద్దరు వస్త్రము ధరించి తాను 
జగతికి ఆదర్శప్రాయుడై వెలుగొందె
స్వదేశి వస్తువే ముద్దు అని పలికి
విదేశీ వస్తువుల బహిష్కరమును
చేపట్టి చేయించెను దిగ్విజయంగా
భారత జాతియే నీరాజన మిడుచు
జాతిపిత అని ప్రస్తుతించగా
 కత్తి పట్టక కార్యసాధకుడై
 భరతమాత చెర విడిపించి 
జాతికి వెలుగులు తా పంచె


డా బల్లూరి ఉమాదేవి
అంశం
17.

[కవితాగానం సీజన్ 2
తేది:01/02/2022 మంగళవారం 
అంశం: గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కవిత

******************************
శీర్షిక: *గాంధేయవాదమే మనకువేదం*
******************************
శాంతి పథాన పయనించినా
బడుగువర్గాలకుబలమైనిలచినా
జాతికి నీతీనిజాయితీ విలువలునేర్పినా
మద్యపాన నిషేధంతో మహోన్నతి సాధించినా
నవభారత భాగ్య విధాతగా పేరొందినా
అంతా ఆమహోన్నతునికే చెల్లు. 
అతడే.......
అతడే మన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ 
కరమ్ చంద్ పుతిలీబాయిల పుత్రరత్నశ్రేష్ఠుడు
పోరుబందరులోపుట్టినాపోరుసహించనివాడు
విస్తుపోయేవయసందేకస్తూరీబాకు పతియైనవాడు.
చెడును కన,విన,అనవద్దని బోధించీనవాడు
భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన సాహసమూర్తి 
వివక్షత,అణచివేతలనణచేనిరంతరస్ఫూర్తి
భారతదేశఆత్మగ్రామాలందేవుందన్న ఆదర్శప్రాయుడు
విద్యావైద్యసదుపాయాలతో,రక్షితనీటిసరఫరాతో
విలసిల్లేపల్లెలేస్వచ్ఛతకుప్రతిరూపాలు కావాలని,
కమ్మరికొలిమి, కుమ్మరిచక్రం, సాలెలమగ్గం 
పలుగూపార పనిచేస్తూనే వుండాలని
కుటీరపరిశ్రమలపరిరక్షణేదేశాభివృద్ధికి 
మూలమన్నజాతిపితమన బాపూజీ
రాజకీయాలవినీతికిదూరమౌతే మనరాజ్యం 
రామరాజ్యంగా రాణించగలదన్న రామభక్తుడు.
ఇదే........
ఇదే మన బాపూజీ కలలుగన్న స్వరాజ్యం
రఘుపతిరాఘవరాజారాం పతితపావనాసీతారాం 

       జైహింద్!
జోషిపద్మావతి 
మహబూబ్ నగర్
18.
కవితా గానం
అంశం : మహాత్మాగాంధీ వర్ధంతి

శీర్షిక : జాతిపిత

రచన : గొర్రెపాటి శ్రీను 

"అహింస"ను ఆయుధంగా చేసుకుని
బ్రిటిష్ వారిపై పోరుసల్పిన ధీరుడు గాంధీజీ !
పరదేశీయుల నిరంకుశ పాలనకు
వ్యతిరేకంగా సత్యాగ్రహ లెన్నో చేసిన ఉద్యమకారుడు గాంధీజీ ! 
ఉప్పుపై పన్నులు వేసి
ప్రజలను పీడిస్తున్న ఆంగ్లేయుల దురాగతాలను ఖండిస్తూ
దండియాత్రను చేసి
భారతావని ముద్దుబిడ్డలను ఏకతాటి పై చేర్చి
"స్వదేశీ"ఉత్పత్తులనే వాడాలని..విదేశీ ఉత్పత్తులను వీడాలని సూచిస్తూ ..
ప్రతి భారతీయుడి హృదయంలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించి..దేశభక్తిని నింపిన సత్ స్ఫూర్తి ప్రదాత గాంధీజీ!
 "క్విట్ ఇండియా" అంటూ నినదిస్తూ ..
ఆంగ్లేయులని భారతావని నుండి పారద్రోలి
భరతమాత బానిస సంకెళ్ళను త్రుంచేసిన
మాతృభూమి భక్తుడు గాంధీజీ !
స్వాతంత్ర్యానంతరం ఎటువంటి పదవులు ఆశించక ..
తన పూర్తి జీవితాన్ని భరతమాత సేవకే వినియోగించి
"జాతిపిత"గా ప్రజల మనసుల్లో గౌరవాన్ని అందుకున్న అసమాన్యుడు గాంధీజీ ! 
                         - గొర్రెపాటి శ్రీను
19.
కవితా గానం సీజన్ 2
అంశం.. గాంధీజీ
శీర్షిక..జాతిపిత 
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336
 
భలే తాత మన బాపూజీ
బాలల తాత మన బాపూజీ
భావనాస్ఫూర్తి మన బాపూజీ
భవితను మనకొసగె బాపూజీ

అహింసామూర్తి మన బాపూజీ
అసమాన ధీశక్తిగల మనబాపూజీ
అంటరానితనాన్ని బాపిన బాపూజీ
అవినీతిని అరికట్టిన మన బాపూజీ

సత్యాగ్రహముతో సాధించే బాపూజీ
స్వాతంత్య్రం సంపాదించే బాపూజీ
సిద్ధాంతంలో తనదైనపాత్ర బాపూజీ
సమరసరంజనుడితడు మనబాపూజీ

శాంతి సహనం మన బాపూజీ
నీతి నిజాయితీ మన బాపూజీ
సౌభాతృత్వమే మన బాపూజీ
స్వరాజ్యాన్ని మనకిచ్చే బాపూజీ

హామీపత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
20.
[02/02, 9:13 am] Lalita Sister: అంశం: మహాత్ముడు బాపూజీ
డా. తంగిరాల నాగ లక్ష్మి

మానవాళికి మమతను పంచిన మహాత్ము డైనాడు
మానవతా వాది గా నిలచి మాధవ సేవ చేసి మహా దేవుడైనాడు
నాదేశమే నా ఆస్తి అని ఆదర్శంగా నిలిచాడు
జాతిని సంసృతిని గౌరవించి జాతి పితా గా  గెలిచాడు
సన్మార్గములో నడచి నడిపించి
సమత ను ప్రభోదిచాడు
 శాంతి యుత పోరాటం సాగించి 
అహింస అనే పరమ ధర్మాన్ని ఆచరించి చూపాడు
సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకుని
స్వతంత్రాన్ని సాధించాడు
స్వాతంత్ర్య సమరయోధుల శ్రేణిలో
ఉన్నత మైన రీతిలో 
స్వతంత్రాన్ని సాధించి పెట్టారు
చిన్ని పిలక తాత గా
బాలల తాత బాపూజీ గా బాల బాలికలకు
చనువుగా చేరువయ్యాడు
పరదేశ వ్యామోహంలో పడక 
ధనార్జనకై  ధర్మము వీడక
దేశభక్తి పరాయణుడై స్వదేశానికి 
వచ్చాడు 
మాతృ భూమిని
బంధ విముక్తురాలిని చేసిన
 భారతీయ మణి రత్నం  మోహన్ దాస్
నిరాడంబర, నిస్వార్థ,నిరుపమ
నిత్య నిరవధిక  సేవలనందించారు
భారత భూమి ఉన్నంతవరకు 
గాంధి అంటే తెలియని వాడు ఉండడు జగతిలో
చరిత్ర లో పవిత్రంగా నిలచాడు
హే రామ్ అంటూ భౌతిక కాయాన్ని వదిలాడు
కొల్లా యి గుడ్డతో చేతి కర్ర తో
జీవన యానాం లో  ప్రగతి సోపానాలు
అధిరోహించిన  మహితాత్ముడు
మహాత్ముడు మోహన్ దాస్ కరం చంద్ గాంధి
నా స్వీయ రచన
21
[02/02, 9:13 am] Lalita Sister: 
కవితాగానం (సీజన్ 2)
అంశం : మహాత్మాగాంధీ
శీర్షిక: మహాత్ముడు
మహాత్ముడు గాంధీ
మనజాతి పిత మహాత్మా గాంధీ  
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 
జననం పోరుబందరున 
పుతలీబాయి కరంచంద్ ల 
పుణ్యఫలం
మానవతావాది,కర్మయోగి
సబర్మతీ ఆశ్రమవాసి
సహనశీలి, సదాచార సంపన్నుడు 
సత్యవాక్యపరిపాలకుడు 
స్వాతంత్ర్యసమరయోధుడు
స్ఫూర్తిప్రదాత,
నిరాడంబరుడు నిష్కల్మషుడు 
నిజాయితీపరుడు 
నిరుపమానుడు 
రైతే వెన్నెముక, పల్లెలే దేశ
సంపదగ గుర్తెరిగినవాడు 
భరతమాత ముద్దుబిడ్డ
మేరునగరధీరుడు
విశ్వశాంతి  సౌభాతృత్వాలె
ధ్యేయాలు 
సత్యాహింసలె ఆయుధాలు 
ఆత్మాభిమానంఆత్మవిశ్వాసాలె కవచాలు
బానిసత్వపు సంకెళ్లను సడలించిన ఘనుడు 
శాసనోల్లంఘన
స్వదేశీ ఉద్యమం,
ఉప్పుసత్యాగ్రహం
విదేశీవస్తు బహిష్కరణ 
దండి మార్చ్ ,సైమన్ గోబాక్
లాంటి మహోద్యమాలు
నడిపిన ధీరుడు 
కులమత వివక్షలేనివాడు
దైవభక్తి, క్రమశిక్షణ 
నియమపాలన
పరిశీలనాత్మకత 
ప్రతిజ్ఞాపాలన పట్టుదల
ధృఢ సంకల్పము
స్వభావాలు 
విద్యా సంపన్నుడు 
కొల్లాయిగట్టి  చేతకర్రబట్టి 
నూలువడికి మురికి వాడల శుభ్రంచేసిన అతి సామాన్యుడు 
మద్యము,మాంసము,
మగువ జోలికి పోనని
మాటనిచ్చి నిలుపుకొనిన
మహాత్ముడు 
తన ఆశయాలతో ధ్యేయాలతో ఉద్యమాలతో
ఆంగ్లేయులను గడగడలాడించిన మహావీరుడుమేరునగధీరుడు
చెడుచూడకు చెడువినకు
చెడు మాట్లాడకు అన్నవే
సిద్దాంతాలు
గాడ్సే చేతిలో అసువులు
బాసిన
అమరుడు  అజరామరుడు
ప్రజల గుండెల్లో నిలిచి పోయిన ప్రజానాయకుడు
మన జాతిపిత  
ఫాదర్ ఆఫ్ ది నేషన్ గ 
పేరుగాంచిన మహోన్నతుడు 
మహాత్మాగాంధీ.

పేరు : డా.కమలాదేవి
చరవాణి : 9871096566

హామీ : పైకవిత నాస్వంతం.
22
[02/02, 4:27 pm] Lalita Sister: కవితా గానం ( సీజన్ 2)
***********************
గాంధీజీ
"""""""'''''''''''
పరపాలన నరికట్టగ
భారతావని రక్షింపగ
సత్యాహింస ఆయుధముగ
సత్యాగ్రహమే దీక్షగ
సత్య ధర్మముల నిలుపగ
రక్తపాత రహితముగా
స్వాతంత్ర్యం సాధింపగ
ఉన్నత విలువలు పెంచగ
నడుం కట్టి ముందు నడిచి
తెల్లవారి నెదిరించి
సత్యాగ్రహ గాండీవము
వారిపైన సంధించీ
దేశ ప్రజలనందరినీ
ఒక్క తాటి పైకి తెచ్చి
స్వాతంత్ర్యపు కాంక్ష జ్వాల
అందరిలో రగిలించీ
భరతమాత సంకెళ్ళను
తొలగించగ తపియించీ
వందేమాతరమంటూ
జనులను జాగృత పరచీ
ఆంగ్లేయుల గుండెల్లో
అదురు బెదురు కలిగించీ
జాతికి స్వేచ్ఛను పంచీ
శృంఖలాలు తొలగించీ
అమరుడుగా నిలిచినట్టి
గాంధీజీ జగజెట్టి
""""""'"''''"""""""""""'''''''''''''""""""""""""
నీవు తలుచు కుంటే 
భగత్ సింగు బ్రతికి పోవుకదా
నీవు ఒక్క మాట చెబితే
ఆజాదు మిగులు కదా
నీవు చంప వద్దంటే
రాజగురు బతుకు కదా
నీవు చెప్పినంత ఖుదీరాము
బతుకు నిలుచు కదా
నీవు కోరినంత సుఖదేవు
ప్రాణం ఉండుకదా
ఒక వర్గం కొమ్ము కాచి
ఒరిగిపోతి వీవు కదా
నీవు కోరుకుంటే దేశం
ముక్కలు కాక పోవు కదా
ఓం బాపూ ఓ మహాత్మ
ఘోరం జరిగి పోయెకదా.

🖋️ వేదాంతం సురేశ్ బాబు
      చంద్రపూర్ 
      మహారాష్ట్ర

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...