Skip to main content

యువజన దినోత్సవం 2022

నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*********************
1.మద్ది పుల్లారావు గారు
2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
3.డా.బల్లూరి ఉమాదేవి గారు
4.ముద్దు వెంకట లక్ష్మి గారు, పిఠాపురం.
5.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
6.అపరాజిత్ గారు
7.తరణికంటి సూర్య లక్ష్మి గారు
8.వేదాంతం సురేష్ బాబు గారు
9.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
10.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
11.మోహన మణికంఠ గారు
12.మేకల రామ స్వామి గారు
13.కవిత వెంకటేశ్వర్లు గారు
14.గొర్రెపాటి శ్రీను గారు
15.సునంద వురిమళ్ళ గారు
16.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
17.పిన్నక నాగేశ్వరరావు గారు
18. ఏడెల్లి రాములు గారు
*************
1.
కవితాగానం సీజన్ 2

భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా  చాటిన వ్యక్తి.....
స్వామి వివేకానంద.

వివేకానందుని ప్రసంగాలు,
రచనలు చాలా మందిలో స్ఫూర్తి నింపాయి.

12.01.2022(బుధవారం )
స్వామి వివేకానందుని 159వజయంతి..

*యువజన దినోత్సవం*

ఈ సందర్భంగా మన సమూహం  *నేడు &రేపు*

ప్రత్యేక కవితలకు ఆహ్వానం పలుకుతున్నది....

ఈరోజు సోమవారం
మన సమూహలకు సెలవు రోజు
అయినప్పటికీ.. సమూహం తెరిచే ఉంటుంది.


ఎప్పటిలాగే ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో
స్పందించగలరు.

ఆ సమయంలో ఎలాంటి
ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.

❇️❇️❇️❇️❇️❇️
1
[10/01, 8:20 pm] Maddi Pullarao Poet: కవితాగానం
12-1-2022
అంశం:యువజన దినోత్సవం
శీర్షిక:వివేకానందుడు
.........
వివేకానందుడన విశ్వమానవుడతడు
మానవోద్దరణయెమహాసంకల్పమని
ఆధ్యాత్మిక శక్తియె అభ్యున్నతి దారని
మానవత్వమనేది. మతానికి ముఖ్యమని
నైతిక విలువలుండుట నవ్యతకు మార్గమని
ఇతిహాసాలు మనకు ఎన్నో నేర్పాయని
ధీనజనోద్దరణె దేవతారాధనని
అమూల్య సంపదలను అందరికీ పంచమని
సోమరితనం వలన శూన్యులమవుతామని
సత్యభాషణముతో సకలం సిద్దించునని
దరిద్రనారాయణుల తరింపజేయాలని
మంచి చెప్పనిదేది మతమే కాదనియూ
పిరికితనాన్ని మనం విడనాడాలనియూ
విద్యాబివృద్దితో వివేకం పెరుగునని
ధైర్యసాహసాలను దరిజేర్చుకోమని
త్యాగనిరతిని గలిగి దర్మముగ నడువమని
ఉరుములను విన్ననూ ఉలికిపడవలదనీ
నాయకత్వం కంటె సాయపడుట ఘనమని
అభాగ్యులందరికీ అన్నం కావాలనీ
పవిత్రత అనునదీ పరమోత్కృష్టమనీ
కార్యధీక్ష కోసం కండపుష్టి బలమని
వేదాంతమనేదీ విశ్వజనీనమనీ
బడుగుజీవులలోనె భగవంతుడుండునని
వర్ణవివక్షతనూ వదిలి వేయాలనీ
భారతజాతీయత పరమోన్నతమనియూ
పాశ్చాత్యులు మనకు పగవారు కాదనియూ
కర్మసిద్దాంతమే కావాలి మనకనీ
పునీతము మన భూమి పూజనీయమనియూ
విశదీకరించెనుగ వివేకానందుడు
చికాగో సభతో విశ్వయోగి యాయెను
భారతదేశ కీర్తి విశ్వవేదికపై ఘనపరిచె
.......
మద్ది. పుల్లారావు
నందిగామ.
....
ఇది నా స్వీయరచన
2
 శీర్షిక...*వివేకానంద.*...10.01.2022..1
గానం
**********
విశ్వ విప్రుడు
వసుధ మిత్రుడు
విప్రనారాయణ
ఆధ్యాత్మిక విప్లవాన్ని
పల్లవించిన
ప్రభాసము

రామకృష్ణ పరమహంస
పరమ ప్రియ శిష్యుడు
ఇహ పరాల ఆత్మ జ్ఞాన 
సంచిత సంచికట్టు
అద్వైతాన్ని అద్భుతంగా
ఆచరించి బోధించిన
అపర ఆది శంకరుడు

నవయువతను తట్టి లేపి
ఉత్తేజం నింపినట్టి
నవయుగ వైతాళికుడు

ప్రాక్ పశ్చిమాల
పద్ధతులను
నిబద్ధత లను
పట్టి చూపిన
ప్రధ్యోతనుడు

భారతీయ
సాంప్రదాయ
సౌరభాలు వెదజల్లిన
వెలుగు రేడు

విశ్వ జనీన విషయ
వాసనా వాహిని
విపుల మనోజ్ఞ
విశ్వ రుషి
మన వివేకానందుడు

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
3
[10/01, 8:51 pm] Balloori Umadevi Poetess: 10/1/22
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి



అంశం:స్వామీ వివేకానందులు గారు

.ఆ.వె:భరత దేశమందు ప్రభవించె నీతడు
         భరత మాత కొసగె భవ్య కీర్తి
         వాదమాడి తాను పరులను మెప్పించె
           నితర దేశమందు నిబ్బరముగ.

ఆ.వె:పరుల దేశమందు వాగ్ధాటి చూపగా
         శిష్యులైరి జనులు శీఘ్రముగను
          ఆంగ్ల దేశమందు నడుగు పెట్టి ప్రజకు
         హితము గరిపి నట్టి హిందువితడు

ఆ.వె: పరమ శిష్యుడయ్యె పరమహంస కితడు
         గురువు కోర్కె దీర్చె కూర్మి తోడ
         రామకృష్ణ మఠము రమ్యముగా కూర్చి
       గురువు పేరు నిలిపె కువలయాన.

ఆ.వె:తత్త్వ శాస్త్ర మందు తన్మయతను జూపి
         సందియములు కలుగ సతము తనకు
          బదులు దెలుపు వారు వసుధలో నెవరంచు
         వెదికి చూచు చుండె విస్తృతముగ.

ఆ.వె:గురువు శిష్యులచట గూఢార్థముల నెల్ల
       పరవశమ్ము తోడ పంచుకొనగ
       దైవరూపుడంచు ధరణిలో గురువుచే
       మెప్పు నందినట్టి మేటి యితడు.

ఆ.వె:అంత్యకాలమందు నాధ్యాత్మ శక్తులన్
          ధారవోసె గురువు ధరణి యందు
          భరత దేశమితని భవ్యవాసమవగ
          నన్న దమ్ము లైరి నవని జనులు.

ఆ.వె: పుడమి యందు గాంచె పుణ్య ప్రదేశముల్
        సాధు సంతు జనుల సఖ్యమంది
          సర్వమతపు సభకు సాధువుగా నేగ 
        భరత జాతి కీర్తి పరిఢవిల్లె.

ఆ.వె:జాను హెన్రి రైటు జగతిలో హితుడయ్యె
        కొత్త విషయములను కూర్మితోడ
         తెలుప శిష్యులైరి దేశీయులే గాక
         నాంగ్ల దేశ వాసు లాదరాన.

ఆ.వె:మార్గదర్శి యయ్యె మహిలోన జనులకు
         రామకృష్ణ మఠము రక్తి తోడ
         కట్టి గురువు గారి ఖ్యాతి నలుదెసల
          ప్రజ్జ్వలింప జేసె వాసి గాను.
4
[10/01, 9:30 pm] Muddu Venkata Laxmi పిఠాపురం కవయిత్రి: కవితాగానం సీజన్ 2
యువజన దినోత్సవం సందర్భంగా కవితల పోటీకి

ఆనాడు నూట ఇరవైఎనిమిదేండ్ల క్రితం  షికాగో సర్వమత సమ్మేళన సభలో దశదిశల ప్రపంచ  పౌరులను
' సోదర సోదరీమణు' లని
సంబోధించి  అందరినీ అబ్బురపరుస్తూ,
సర్వమతసత్యాన్ని నమ్మే
భారతదేశం విశ్వశ్రేయస్సును
కాంక్షించే శాంతికాముకదేశమని
చాటిచెప్పిన వివేకానందుని
మేధోపూరిత, స్ఫూర్తిదాయక,
సద్భావనాభరిత ప్రసంగం 
నేటి భారత యువత సత్వర సహాయతాగుణంలో ,
సేవా కార్యక్రమాల్లో ;

దేశవిదేశాల
వైద్య , సాంకేతిక రంగాలలో
ముందంజ వేస్తున్న
భారత యువత
ప్రతిభాసంపన్నతలో

ప్రతిధ్వనిస్తోంది.

ముద్దు వెంకటలక్ష్మి,పిఠాపురం.
9886824003

హామీ పత్రం
ఈ కవిత నా సొంతమే.
5.
కావ్యగానం(సీజన్2)
తేది10012022,సోమవారం
అంశం:యువజనదినోత్సవం.
వివేకానందుని జన్మదినం
యువజనదినోత్సవం పర్వదినం
వంగదేశపు ముద్దుబిడ్డ
పూర్వనామధేయం నరేంద్రనాద్ దత్తా
చిన్ననాటినుండే చురుకైనవాడు
ఏకసంథాగ్రాహిగా పేరొందినాడు
తత్వశాస్త్రమనిన అతనికెంతో ప్రీతి
తల్లిమాటపైన కూడా ఎంతోభక్తి
గురువురామకృష్ణులపైన మిక్కిలి గౌరవం
ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగినాడు
తత్వశాస్త్రమందు నిష్ణాతుడు
సత్యజ్ఞానమును బోధించినాడు
సోదరభావమును ప్రవచించినాడు
విదేశములలో ఎంతో ఖ్యాతి గణించినాడు
చికాగో సర్వమతసదస్సులో సంభోదించినాడు
భారతీయ సంస్క్రతిని చాటినాడు
యువతకు స్ఫూర్తిగా నిలిచినాడు
దేశవిదేశములందు రామకృష్ణమఠములను స్థాపించినాడు
భారతదేశమునకతడోక ధృవతార
ఆధ్యాత్మికప్రపంచానికి అతడు ఆణిముత్యం
అతడు అమూల్యమైన భారతరత్నము.

ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా
చరవాణి 7780594995.
6.
[11/01, 8:05 pm] Aparajith: యువజన దినోత్సవం!

వివేకానంద మానవతావాది 
సర్వమతాల సారమే హిందూమతమని నమ్మాడు!
రామకృష్ణుల వారి శిష్యరికంలో 
ఆధ్యాత్మికంగా మహోన్నత శిఖరాల కెదిగాడు 
దేశానికి కావలసింది ఇనుప నరాలు ఉక్కు కండరాలు గల యువత !
నీ లక్ష్యం శిఖరమే ఆయితే 
ఎన్ని శ్రమలకోర్చి యైన సిద్దింప చేసుకొమ్మన్నాడు!
అమెరికా సర్వమత సమ్మేళనంలో 
సోదర సోదరీ మణులార అని సంబోదించి ప్రసంగం మొదలిడితే 
ప్రాశ్చాత్యులకు చిత్రంగా తోచి నిలబడి చప్పట్లు కొట్టారు!
దేశంలో కరువు కాటకాలు ఆకలి చావులను చూసి చలించిపోయాడు 
రామకృష్ణ మిషన్ ద్వార సామాజిక సేవలందించాడు!
చిన్నప్పటి నుంచే హిందూమత గ్రంధాలు ఆంగ్ల గ్రంధాలను అధ్యయనం చేశాడు 
భగవత్ గీత చదవాలా? ఫుట్ బాల్ ఆట నేర్వాలా? అని సంశయం వద్దు 
ఫుట్ బాల్ ఆటే ముందు నేర్చుకో 
అప్పుడే అనుభవ పూర్వకంగా భగవత్ గీత నేర్చుకుంటావు!
యువత చమటలు చిందించనిదే నవభారత నిర్మాణం జరగదు 
నలబై ఏళ్ళ వయసులోపే ప్రపంచంలో 
పెద్ద పెద్ద దేశాల్లో ఉపన్యసించాడు!
నరాలను ఉద్రేక పరిచే ఆయన ప్రవచనాలు 
యువతరానికి పెను సవాల్లు విసిరేవి!
నిరుపేదలు అభాగ్యులు మనుషులేనని మరువకు 
వాళ్ళను చీదరించుకుంటే నీలోని మనిషి చచ్చినట్లే!
వివేకానంద హిందూమతంలో ఉన్న గొప్ప ఔన్నత్యం
మానవత్వాన్ని అధికంగా ప్రేమించాడు!!

అపరాజిత్ 
సూర్యాపేట
7
[11/01, 8:06 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్‌ 2)11/1/2022/ మంగళవారము
అంశం:- " యువదినోత్సవసందర్భం"
   " వివేకానందఘనత "
                (1)
సీ!  శ్రీరామకృష్ణుని  శిష్యుడుఘనుడువి
వేకవంతుడనగ  వెలిగెభువిని

యువశక్తిమేల్కొన  యుత్సాహమందించె
నవ్యభవితనంత  నడిపిచూపె

భారతీయఘనత  బాహాటముగచాటె
అమెరికాదేశీయు  లందరెరుగ

సంస్కృతి నిలుపంగ  సాంప్రదాయాలను
జాలువారగజేసె  చక్కగాను

ఆ!  అన్నిదేశములకు  ఆదర్శవంతుడై
జ్ఞానబోధజేసె  జ్ఞానిగాను
అతనినడుగుజాడ  నందరునడచిన
దేశఘనతయంత  తేజరిల్లు!
               (2)
సీ!  కాషాయవస్త్రాల  కమలనేత్రుడనగ
సకలమెరిగినట్టి  సద్గురువుగ

దేశసంచారిగ  దేశఘనతచాటె
మహనీయుడనగ  మహిని వెలిగె

పరమహంసయుమెచ్చి  పరమార్ధ మంతయు
నతనినోటపలుక  యానతిచ్చె

రామకృష్ణుని బోధ  రాజిల్లెదేశాల
మనవివేకానంద  వినగజనులు

ఆ!  ఆచికాగనగర  మందున్నవారంత
జ్ఞానబోధనలను  చక్కగవిని
సంతరించుకొనియె  చక్కని జ్ఞానము
జ్ఞానబోధ వెలిగె  జగతియంత!
     తరణికంటి సూర్యలక్ష్మి.
                ------------
8
[11/01, 8:07 pm] +91 94236 90615: కవితా గానం (సీజన్ 2)
అంశం:- స్వామి వివేకానంద
*****************************
ఉత్తిష్ఠ జాగ్రత్తంటూ
నినదించిన ఆ కంఠం
పర్జన్య సమ గర్జితమౌ
విప్లవ శంఖారావం
చేవ చచ్చి బలం మరచి
చేతకాని వారమంటు
తమను తాము మరచినట్టి
మనుషుల జాగృత పరచి
తస్మాత్ జాగ్రత్త అనుచు
మత్తును చిత్తును జేసి
కుంభకర్ణ నిద్ర లేపి
గుండె బలం కండ బలం
బుద్ధి బలం ‌సానబట్టి
కర్తవ్యపు బాట నడువ
ధర్మ కంకణం కట్టి
మట్టికాదు భరతమాత
మన అందరి మాతృమూర్తి
మన లక్ష్యం మన గమ్యం
దేశమాత సేవయనుచు
హిందూమత ఔన్నత్యం
విశ్వానికి యెరుక పరచి
ఇనుప కండరాలు కలిగి
ఉక్కు నరాలతో దృఢమై
వజ్ర తుల్యమైన మేధ
యువతకు కావాలంటూ
వ్యక్తి చేతనమ్మైతే
జాతి చేతనమ్మగునని
గత వైభవ ఖ్యాతి నిలిప
సనాతము ప్రాణమనుచు
బలమే మనిషికి జీవము
బలహీనత మరణమ్మని
ఆధ్యాత్మము జోడించి
కర్తవ్యము బోధించి
పరిశీలన పరిశోధన
ప్రతి వ్యక్తికి అవసరమని
పరమాత్మను దర్శింపగ
పరితప్తము తానొంది
పరమహంస దరిజేరి
గురు బోధకు శిరసొగ్గి
కాషాయం ధరియించీ
పరివ్రాజక వేషుండై
ప్రభంజనము సృష్టించి
విశ్వ ధర్మ వేదికపై
వివేక బోధన జేసి
భారత కీర్తి పతాకము
విశ్వమందు ఎగురవేసి
గ్రామ సేవ చేసినంత
రామ సేవ అవుతుందని
హిందువుగా జీవిస్తా
హిందువునని గర్విస్తా
హిందుత్వం నా ధర్మం
దీన సేవ నా కార్యం
ప్రతి మహిళ జగన్మాత
ప్రతి పురుషుడు పరమపిత
నా దేశపు కణకణమున 
ధర్మ సుగంధం కలదని
భయమెరుగని యోధునిగా
సర్వ కార్య శూరునిగా
యువతకు స్ఫూర్తి ప్రదాతగ
భారత భాగ్య విధాతగ
నిలిచిన యుగ పురుషుడతడు
వివేక జ్ఞాన భాస్కరుడు
దిక్సూచి నరేంద్రుడు
అతడే వివేకానందుడు

🖋️ వేదాంతం సురేశ్ బాబు
       చంద్రపూర్
      మహారాష్ట్ర
9
[11/01, 8:08 pm] అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: కవితాగానం సీజన్..2
ఆధ్వర్యంలో
యువజన దినోత్సవం సందర్భంగా
తేదీ...10.1.22
శీర్షిక...కర్మయోగి...వివేకానంద
..................................
మానవ మనుగడకు ఆదర్శం' భగవద్గీత' అని 
ఏ సమస్య ఆయిన గీతను అర్ధం చేసుకుని పరిష్కరించబడునని, వసుదైక కుటుంబానికే 
చాటిచెప్పిన మహర్షి వివేకానందుడు.......!!

రామకృష్ణ పరమహంస సాంగత్యంలో అతీత అవ్యక్తానుభూతిని పొంది
మానవత్వమే మతమని,
ప్రేమతత్వమే ముముక్షత్వమని చాటిచెప్పిన స్థితప్రజ్ఞతకు దర్పణమే వివేకానందుడు..!!

వసుదైక కుటుంబంలోని వారంతా సోదర సోదరీమణులని చికాగో అంతర్జాతీయ ఆధ్యాత్మిక సభలో  సంభోధించి భారతదేశ ఖ్యాతిని  ప్రపంచానికి చాటిన దేశభక్తుడు వివేకానందుడు...!!

ధృఢ సంకల్పం, ఏకాగ్రత చిత్తము, ఉక్కు నరాలు కలిగిన యువతను"లెండి మేల్కొనండి, మీ ఆశయం నెరవేర్చుకునేందుకు  నిరంతర సాధన చేయండి"
విజయం తప్పక మీ వశమవుతుంది అన్న వివేకానంద శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కర్మయోగి.......!!
......................
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:-హైదరాబాద్
చరవాణి:-9963265762
..............................
హమీపత్రం:-
ఇది నా స్వీయకవిత.
...............................
10.
[11/01, 8:20 pm] Thathapudi Somashekara Sharma: కవితా గానం సీజన్ 2 కవితల పోటీ 
అంశం..యువజన దినోత్సవం సందర్భoగా 
శీర్షిక..నాటివారిమాట నేటియువతబాట 
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

భరత జాతి గర్వించదగ్గ వివేకవంతుడు
భరతమాత ఋణం తీర్చుకున్న విజ్ఞాని
భారతీయులుగర్వించదగ్గ మహామేధావి
భారతదేశం కీర్తిప్రతిష్టలు పెంచిన నిగర్వి

వంగదేశంలో జన్మించిన బాలుడు
నరేంద్రుని నామధేయంతో పుట్టుక
వివేకానందునిగా ప్రపంచానికిప్రసిద్ధి
జాతిసంస్కృతికి ఖ్యాతిపెంచినధీటి

రామకృష్ణ పరమహంస ప్రియశిష్యుడు
ఆధ్యాత్మిక విలువలు పెంచిన కీర్తికిరిటి
చికాగోమహాసభలలో చేసినఉపన్యాసం
విశ్వవ్యాపితమైనదిఆయన విశ్వఘనత

తాత్విక శాస్త్రంలో ఆరితేరిననిష్ఠాతుడు
స్వదేశకీర్తినలుదిశల ప్రపంచానికి చాటినఅభిమాని
తల్లిభువనేశ్వరిదేవిపెంపకంలోపెరిగినబాలవిధూషి 
యువతకుస్ఫూర్తిప్రదాత ఆధ్యాత్మికప్రపంచధ్రువతార
నాటివివేకానందునిమాట నేటియువతకుఅందాలబాట 


హామీపత్రం
ఈ చిత్ర కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
11
[11/01, 8:21 pm] +91 70320 44151: జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకాందుని జయంతి సందర్భంగా స్వామి వివేకానంద పై నా కవిత.
============================
పేరు:  *మోహన మణికంఠ ఉరిటి (మణి)*
ఊరు: పెదమంత్రిపేట, విజయనగరం జిల్లా.
ప్రస్తుత నివాసం : మాడ్రిడ్, స్పెయిన్.
చరవాణి: 7032044151

భువనేశ్వరీ పుత్రా నరేంద్రనాథ్ దత్తా!
జగమెరిగిన విజ్ఞాని
స్వామి వివేకానందా!!

బెంగాల్ లో జన్మించిన
ఓ మహానుభావుడా!
భూగోళానికే దొరికిన
ఓ మహనీయుడా !!

రామకృష్ణ పరమహంస
ప్రియ శిష్యుడా
భారతదేశం కన్న
ఓ మహా కవివర్యుడా..

విశ్వ మత మహాసభలో
 ఆరంభం నుండి ఆధ్యం వరకు
నీవు చేసిన ఉపన్యాసం అత్యద్భుతం.
చికాగో నగరం నీ వాగ్ధాటి
ముందు చిన్నబోయింది.
ప్రపంచదేశాల ప్రతినిధులు 
నీ ప్రతిభకు మంత్రముగ్ధులాయను..

దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడివుంది అని గుర్తించి, వెలుగెత్తి చాటి చెప్పిన ప్రప్రధముడా..

జీవుడే దేవుడు అని బోధించిన అద్వైత వేదాంతి
దరిద్ర నారాయణ సేవను ప్రతిపాదించిన తాత్వికుడా
జీవితం అన్నది కదులుతున్న మరణమని
చెప్పిన ఓ ఆజన్మ బ్రహ్మచారి..

యువశక్తిని మేల్కొలిపి,
అధైర్యాని వీడి,
విజయం సాధించేవరకు 
పోరాడాలని తెలియజెప్పిన
ఓ విశ్వవిజేత..

లేవండి! మేల్కొనండి!
 గమ్యం చేరే వరకు విశ్రమించకండని చెప్పి ఇప్పటికీ
యువతని చైతన్యపథం వైపు నడిపిస్తున్న యుగపురుషుడా,
ఓ అమరజీవి
నీ కవిత్వాలతో,
నీ సూక్తులతో,
నీ తత్వభోధనలతో
మా హృదయాల్లో 
నీవు ఎల్లప్పుడూ చిరంజీవివే..
12
[11/01, 8:24 pm] Mekala Ramaswamy Poet: నగసమాన వ్యక్తిత్వ ఘనుడు_
_విశ్వ విఙ్ఞాన ధురీణుడు
************************
సనాతన ధర్మ జీవనశైలిని
మహోన్నత తత్వ వివేచనమును
విశ్వ వేదిక పై ఎలుగెత్తి చాటిన
వినీల ఆకాశమంత నినదించిన
భారతీయతలోని
మమత మధురిమలు
,బంధ సంబంధాలు
అనురాగ,మమకారాలు 
కర్మల మర్మాలను దెల్పిన
వేద వేదాంగోపనిషత్తుల
విఙ్ఞాన సారమును విశధీకరించిన
ఆత్మ, పరమాత్మ అంతఃసూత్రాన్ని తెల్పిన
ఆధ్యాత్మికా సుగందాలను వెదజల్లిన
కాళికా మాతానుగ్రహ ప్రాప్తినొందిన
గురువర్యులు రామకృష్ణ పరమహంస
ద్వారా భగవత్ తత్వ వివేకమును పొందిన
సర్వ మత సార సంగ్రహమును
సార్వ జనీన విధానమని వ్రాక్కుచ్చిన
"అన్ని నదీ గమనాలన్ని సాగరము  వైపే నని
అన్ని మతాల గమ్యం పరమాత్మ వైపేనని"
అతి స్వల్ప వాక్యములో
అనంత జీవన చిత్రాన్ని మేళవించి చూపిన
అతి పిన్న వయసులో ఉన్నత శిఖరాల నదిరోహించిన
గంగా ప్రవాహ వాక్ఝరీలతో
సమ్మోహన పరిచే వాక్పటిమను జూపిన
దేశీయులనేకాదు ,విదేశీయులను కూడా
వీరవిధేయులుగా మార్చుకొనిన
ఒకరోజు మహారాజుతో పంచభక్ష్య 
పరమాన్నాలు ఆరగించిన
మరొక రోజు ధర్మ సత్రాలలో భిక్ష గాల్లతో
కలిసి చందాకబళాన్ని భుజించిన
భరత మాత ముద్దు బిడ్డవు
భరత జాతి భాగ్యోదయ రేఖవు
"ఇనుప కండలు ఉక్కు నరాలు "ఉన్న
వంద మంది యువకులను నాకిస్తే
భారత దేశ చరిత్ర గతిని మార్చి
సుభిక్షమైన నవ భారతాన్ని నిర్మిస్తానని చెప్పిన
"లెమ్ము,మేల్కొనుము,
గమ్యం చేరే దాక విశ్రమించకుము"
అని ప్రభావ వంతంగా ప్రభోదించిన
ఆధునిక యుగ సంఘ సంస్కర్తవు
ఆధునికాలోచనా పథగాముడవు
అభ్యుదయ మార్గ దర్శకుడవు
జయహో!!! నరేందరుడా!!!!
జయజయహో!!స్వామి వివేకానందుడా!!!
 నీ సదాశయ పథగామి,
మేకల రామస్వామి.....
*********************************
సభాసార్వ భౌమ _మేకల రామస్వామి
మం జి ర సంఘ ప్రధాన కార్యదర్శి
********************************
13.
కవితా గానం - 2
అంశం:: యువజన దినోత్సవం
శీర్షిక:: వివేకానందుడు
తేదీ::11.1.21..మంగళవారం


దృఢత్వం నిర్భయత్వం ఆత్మవిశ్వాసము నిండు మెండుగా వున్నవాడు
చూస్తూనే ఆకర్షించే విగ్రహము
కలవాడు
భువిపై నడయాడే శక్తి యతడు
హైందవ సంస్కృతిని కాపాడే
తేజోమయ కాంతి యతడు
భారతీయ సంప్రదాయానికి
నిలువెత్తు దర్పణమతడు
అతడే వివేకానందుడు
కలకత్తాలో జననము
నరేంద్రనాధ్ దత్తగా నామము
ఏకసంతాగ్రాహిగా పేరు
ఉన్నత చదువులు చదివారు
కానీ తత్వ అన్వేషణ చేసేవాడు
కళ్ళార చూడనిదే నమ్మనివాడు
అదే విషయం శ్రీరామకృష్ణ పరమ హంసను అడిగాడు
ఆ ప్రశ్నకు సమాధానం లభించే
ఆయనను గురువుగా స్వీకరించే
చికాగో నగరంలో ప్రవచించిన
పలుకులు
ఆ దేశప్రజలు కుప్పించిరి
ఆనంద కరతాళధ్వనులు
ఆ ప్రసంగముతో ఎందరో
విదేశీయులు ఆయనకు శిష్యులయిరి
భారతదేశ కీర్తి నలుదిశలా
వ్యాపించే
వివేకానందుని వాగ్దాటిని
ప్రపంచమంతా గుర్తించే
యువతకు నిత్యస్పూర్తి
వివేకానందుడు
జనతకు సత్య భక్తి పరమహంస శిష్యుడు
ఆయన మేధాశక్తికి తలవంచాలి ప్రతి ఒక్కరు
బ్రహ్మచర్యం పాటించమన్నాడు
మానమన్నాడు లిక్కరు
యువతకిచ్చే సందేశం
సందేశము కాదది ఆదేశం
ఉక్కునరాలు ఇనుపకండరాలు
సంతరించుకోవాలి యువతరాలు
బలహీనతే మరణం
బలమే జీవితం
అటువంటి యువత కావాలి
నేటి భారతావనికి
అదే నిలబెడుతుంది భారతదేశ
ఉనికి... మారే
వివేకానందుని జన్మదినము
యువజన దినోత్సవముగా!!
               కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.    8309920625
పై కవిత నా స్వంత రచన అని
హామీ
14.
కవితా గానం (సీజన్ -2)
అంశం :   వివేకానందుడు

శీర్షిక :   "సన్మార్గదర్శి" 

రచన : గొర్రెపాటి శ్రీను 


"ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు!"

"కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు..!" 

వంటి ఎన్నో స్ఫూర్తివంతమైన బోధనలను యువతకు చెబుతూ ..దేశ యువత కే కాకుండా..
ప్రపంచాని కే ఆదర్శంగా నిలిచిన భారతీయ యోగి !

"మతం అనేది సిద్ధాంత రాద్దాంతాలలో లేదు. 
అది ఆచరణలో, ఆధ్యాత్మికులు గా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది!" అంటూ
ప్రపంచాన వున్న సకల మతాల సారాల్ని గ్రహించి ..
రేపటి తరాలకు మనిషి గా ఎలా బ్రతకాలో సూచించిన భారతీయ తాత్వికుడు ! 

హిందూమత ఔన్నత్యాన్ని "షికాగో" మహాసభల్లో
ప్రపంచదేశాలకు తెలియజేసిన భారతీయ వేదాంతి !

ఉత్తమ మార్గదర్శకత్వం కోరుకున్న శిష్యులకి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని 
బోధించిన సత్ గురువు వివేకానందుడు !

రామకృష్ణ పరమహంస ను తన గురువుగా భావించి ..
భారతావనిలో నలువైపులా "రామకృష్ణ మఠాలు" ప్రారంభించి ..
హైందవం వైభవమయ్యేలా చేసిన భరతమాత ముద్దుబిడ్డ డు వివేకానందుడు !

భారతదేశపు ఘనతను,
భారతీయుల హృదయ నిర్మలత్వాన్ని ..మనో సంకల్పం దీక్షాదక్షతలను..
భారతీయుల ఆధ్యాత్మిక శక్తి గొప్పతనాన్ని ..
విశ్వవ్యాప్తం చేసిన మహోన్నతుడు వివేకానందుడు ! 

                                                                                           - గొర్రెపాటి శ్రీను
15.
*కవితా గానం సీజన్ 2*
*తేదీ:11-01-2022*
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: యువజన దినోత్సవం సందర్భంగా
శీర్షిక:యువతకు మార్గదర్శి
****************
పువ్వులా పుట్టగానే  ఆధ్యాత్మిక విజ్ఞాన సుమమై
పరిమళించిన మహా మేధావి!

అమోఘమైన జ్ఞాపకశక్తితో
అబ్బుర పరిచిన ఏకసంథాగ్రాహి వివేకానంద!

చరిత్ర సైన్స్ లతో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని ఔపాసన పట్టిన ప్రతిభా శాలి!

షికాగో నగరంలో
భారత దేశ ఔన్నత్యాన్ని ఎల్లలు దాటేలా ప్రసంగించి
దశ దిశల దాటిన కీర్తితో
ప్రపంచ ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకున్న కర్మ యోగి!

 జీవుడే దేవుడని
విశ్వమంతా నిండిన బ్రహ్మం ముందు 
ఎవరూ ఎక్కువ తక్కువ కాదని
సమతా మమతా భావనలు
సమాజంలో పెంచేందుకు ప్రయత్నించిన మానవతా వాది!

"ఓ యువతా మేలుకో
గమ్యం చేరేంతవరకు విశ్రమించకండి"
లక్ష్యం పై ఉన్నంత శ్రద్ధ ఆసక్తి
లక్ష్య సాధనలో సైతం చూపించడమే విజయ రహస్యమని 
యువతలోని శక్తి సామర్థ్యాలు జాగృతం అయ్యేలా
ప్రేరణాత్మకంగా బోధించి
అతి చిన్న వయసులోనే భారత దేశ చరిత్రలో 
తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న వివేకానందుడు 
రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు
నాడు నేడు రేపు ఎల్లప్పుడూ యువతకు మార్గదర్శకుడు!

 *వురిమళ్ల సునంద,ఖమ్మం*
16.
కవితాగానం సీజన్ 2
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
కాజీపేట 
అంశం: యువజన దినోత్సవం సందర్భంగా 
శీర్షిక: వివేకానందుడు
...
ప్రతి మానవుడు 
దివ్యాత్మ స్వరూపమని 
దివ్యత్వాన్ని సాక్షాత్కరింపచేసుకోవడమే.
మానవుల జీవిత ధ్యేయమని 
సనాతన ధర్మాన్ని 
పరిరక్షించిన జ్ఞాన భాస్కరుడు 
వివేకానందుడు
రామకృష్ణ పరమహంస శిష్యుడు

భారతదేశ మహోన్నతిని 
సంస్కృతి సంప్రదాయాలను 
ప్రపంచానికి చాటిన ధీరుడు 
భారత యువతను జాగృతం చేసిన మార్గదర్శి 

కఠోర ధ్యానం, సాధన చేయాలని 
మానవులంతా మాధవులుగా మారాలని 
ఆరోగ్యంగా జీవించాలని 
బోధించిన మహనీయుడు
గొప్ప తాత్వికుడు 

జీవుడే దేవుడని 
దరిద్ర నారాయణుని సేవే 
మాధవ సేవని నమ్మిన వ్యక్తి
17.
కవితా గానం(సీజన్2).        11--1--2022.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- స్వామి వివేకానంద. 

1. తే.గీ.
బాల్యమున నరేంద్రునకు నిస్వార్ధ గుణము
చురుకుదనము లలవడెను; విరివి గాను
చదువ పుస్తకము లతడు జ్ఞానతృష్ణ
యధికమయ్యె, నాధ్యాత్మిక యంశములను
తెలుసుకొన గోరి తనదు సందేహములను
పండితుల ముందు వెలిబుచ్చ ఫలము లేదు.

2. తే.గీ.
ఇట్టులుండ నొక దినము హితులతోడ 
నరుగ రామకృష్ణ పరమహంస కడకు
నతని పలుకులకు నరేంద్రుడయ్యె ముదము
కొన్ని రోజులు గడువగ నొకరి నొకరు
విడిచి యుండలేని స్థితిని బడసినారు 
పిదప నాతని శిష్యుడై వెలిగినాడు.

3.తే.గీ.
వివిధ మత గ్రంథముల నెల్ల విరివిగాను
చదివి యాధ్యాత్మికంబగు చర్చలందు
గడుపుచున్ దేశమంతయు నడచి తిరిగి
స్ఫూర్తి కలిగించ యువతకు బోధ చేసె.
**************************************
18.

కవితా గానం
అంశం*స్వామీ వివేకానంద
శీర్షిక*లైట్ హౌస్

 మారింది ఎవరు
కాలం మారిందా
మనిషి నడవడి మారిందా

యువత బాగుపడుతున్నదా
శీల రహితమై నడుస్తున్నాడా
విద్య ఆభరణమై సుగుణ శోభితమా
వ్యాపారమై అవగుణాల అందలమా

నేటి యువత పయనమెటు
ఉపాధి హామీ ఏమౌతుంది
చదువుల పట్టాలు అన్నం పెడుతున్నవా

మెకాలే విద్యా వ్యవస్థలో
నిలబడి గెలిచినదెంత
ఓడి పోగొట్టుకున్న చరిత్రలో 
కొడిగట్టిన దీపాలెన్నీ

వ్యవస్థీకృత అపసవ్యాలు సరిజేసేదెన్నడూ
సుశోభితమైన వసంతం వచ్చేదెపుడో

ఎందరో మహానుభావులు
జీవితాలను ధారవోసారు
వివేకం వికాసం విజ్ఞానం
శాస్త్రీయత ఆత్మీయత మానవత
సామాజిక దురాచారాల చీకట్లపై
జ్ఞాన నేత్రం తో వెలుగులు నింపారు

ఇంకా యువత వెర్రి వ్యామోహాల
విషవలయంలో చిక్కి
విలవిలలాడుతుంది
లైట్ హౌస్ అనే మనో విజ్ఞాన ప్రపంచం లో
వ్యసనాలకు దూరంగా నిలబడి
వీరుడై విజేతై విలువల వటవృక్షమై
చక్కని దారిలో నడవడమే
నా దేశానికి యువత ఇచ్చే కానుక
మార్పు కోరే ఉక్కు సంకల్పాలకు
ఇదే ఇదే వేదిక

ఏడెల్లి రాములు ✍️
ది*11*01*2022(22*09)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...