నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*********************
కవివరుల జాబితా
1.టేకుమళ్ళ.విజయలలిత గారు
2.కోరాడ గారు
3.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
4.అపరాజిత్ గారు
5.గొర్రెపాటి శ్రీను గారు
6.ఓరువాల సరిత గారు
7.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
8.కవిత వెంకటేశ్వర్లు గారు
9.అపరాజిత్ గారు
10.వింజమూరి సూర్య లక్ష్మి గారు
11.తిప్పా వఝల నరసింహ మూర్తి గారు
12.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు
13.మొహమ్మద్ అఫ్సర వలీషా గారు
14. పిన్నక నాగేశ్వరరావు గారు
15.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
16.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
17.కేశరాజు వెంకట ప్రభాకరరావు గారు
18.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
19.శివునూరి లలితా కృష్ణ గారు
******************************
1
ఔను కొందరంతే
********************
కొందరు ప్రకృతి ప్రకోపానికి బలై అల్లాడుతుంటే,
మరికొందరు ఫోటో ఫోజుల మోజులో సాయం అందిస్తుంటే,
ఏమనుకోవాలి మనం?
రోడ్డుప్రక్క ప్రాణభయంతో వారి హాహాకారాలు
వారి ప్రక్క సెల్ఫీల పిచ్చిలో వీరి వికారాలు
ఏమవుతోంది మానవత్వం?
ఎటు పోతోంది మన సమాజం?
ఆడామగా తేడాలేదు,
జాతి మతం బేధంలేదు,
చిన్నాపెద్ద ఊసేలేదు
ఇదేం మాయ దారి దారి?
ఆమోదయోగ్యం కాదు అది.
అయినా కొందరంతే
ఎవరేమనుకుంటే మాకేమీ?
నవ్వి పోతారు కదా నాకేమీ?
....... ఔను కొందరంతే.
*********************
టేకుమళ్ళ.విజయలలిత
8 5 0 0 0 9 9 0 5 1
2
కొందరంతే..!
కోరాడ నరసింహా రావు
శీర్షిక :- * అలా ఉండబట్టే.....
... ఇలా ఉన్నాం.... ! *
*******************
ఔను... కొందరంతే.... !
కాలమెంత మారుతున్నా...
మారటానికి ఇచ్చగించరు !
వాళ్ళతీరు ఎన్నటికీ....
మార్చుకోరు... !!
కొందరంతే..... !
ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా
ఎన్నెన్నిఅనుభవాలుగుణపాఠాలై బోధించినా...., అర్ధం చేసుకోరు.... !
ఔను కొందరంతే మరి.... !
పాపమని తెలిసినా మానుకోరు
కూడదని ఎంతమంది ఎన్నెన్ని విధాల చెప్పినా.... ఈ చెవిన విని, ఆ చెవిన వదిలేస్తారు !!
కొందరంతే..... !
ఎన్ని కష్టాలనుభవించినా....
దైవాన్ని దూరరు... !
ధర్మాన్ని వీడరు... !!
వీళ్ళు.... వీళ్లుకదా మనుషులు
ఆ కొందరైనా... అలా ఉండబట్టే
మనమింకా... ఇలా ఉన్నాం !!
****************
..... కోరాడ.
3.
[05/01, 8:05 pm] Aalla Nageshwar Rao Poet: కవితా గానం సీజన్...2
తేదీ; 5/01/2021
అంశం: కొందరంతే...
శీర్షిక:
"" శ్రీకారం చూడదాం ""
కష్టాల్లోనే దేవుని కొలుస్తారు
సుఖాల్లో దేవుని మరుస్తారు....
సమాజ సేవ అంటూ తక్కువ ఖర్చుతో
రెట్టింపు ప్రచారాన్ని కోరతారు...
మానవసేవే మాధవ సేవగా తలచి
మూడోకంటికి తెలియకుండా గుప్తదానాలు చేస్తారు...
వాపును చూసి బలమనుకొని
విజయగర్వంతో విర్రవీగుతారు.....
విజయాన్ని సాధిస్తే అది తమ ప్రతిభేనని
అపజయమొస్తే అది దైవ లోపమని దైవాన్ని నిందిస్తారు...
గురివిందలా తనలోని లోపాలను గుర్తెరగక
పరులలోని లోపాలను వేలెత్తి
చూపుతారు....
నాస్తికవాదంతో దైవాన్ని ద్వేషిస్తూ
వ్యక్తిగతముగా దైవాన్ని పూజిస్తారు....
స్నేహాన్ని స్వార్ధానికి వాడుకుని
మంచితనానికి పాతరేస్తారు....
వావివరుసలు మరచి
కామంతో మృగాళ్లుగా ప్రవర్తిస్తారు....
ఆ కొందరి నుంచి మనందరం
జాగరుకులమై మెలగాలి
దుష్టులకు దూరంగా ఉంటూ
సజ్జనులకు సన్నిహితులమై మెలగాలి!
ఆ కొందరిలోమార్పును కోరుదాం
స్వచ్ఛ సమాజ నిర్మాణానికి శ్రీకారం చూడదాం !
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు....జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
చరవాని. 7416638823
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
పై వచనకవిత నా స్వీయరచన
అని హామీఇస్తున్నాను.
4
[05/01, 8:21 pm] Aparajith: కొందరంతే!
కొందరంతే!
పట్టువదలని విక్రమార్కుడిలా
ఉరుకులు పరుగుల పనులతో
రోజంతా తలామునకలవుతారు!
కొందరంతే!
చదువే పరమాధిలా
టి విలు సెల్ ఫోన్లు రొద పెడుతున్నా
చెవిని పెట్టక పుస్తకంలో కళ్ళు కలలలో తేలిపోతుంటాయి!
కొందరంతే!
వనికించే చలిగాలులు వీస్తున్నా
డ్యూటీయే పరమావధిగా
అబ్బుర పరిచే విధంగా
పనుల ఒత్తిడిలో గడుపుతారు!
కొందరంతే!
కాలచక్రంతో పాటు పయనిస్తూ
చవకబారు పనులకు దూరంగా ఉండి
చేవగలిగిన ఊపిరులతో ప్రపంచ గతినే మారుస్తారు!
కొందరంతే!
అదృష్ట దురదృష్టాలకు దూరంగా వుండి
చిత్రంగా జీవితంలో చిత్తయినా
జీరో నుంచి మొదలిడి అపూర్వ విజయాలు సాధిస్తారు!
కొందరంతే!
ఓపిక నశించి పడరాని పాట్లు పడినా
అగ్ని కణికల ధుఖాల్లో మునిగి తేలుతున్నా
యువతరానికి దిశానిర్దేశం చేస్తారు!
కొందరంతే!
స్నేహితులను అందలాలెక్కించి
జీవిత పోరాటంలో ఏకాకియైనా
సహనం కోల్పోక బహుదూరపు బాటసారి యవుతారు!
కొందరంతే!
జీవితాంతం ఎదురీతేయైనా
మంచితనం మాటల కలివిడితో
విరితేనియల పూవుల గుభాలింపుల్లో ఆదమరుస్తారు!
అపరాజిత్
సూర్యాపేట
5
[05/01, 8:24 pm] Gorrepati Srinu Garu Poet: కవితా గానం (సీజన్ -2)
అంశం :" కొందరంతే !"
శీర్షిక :
రచన : గొర్రెపాటి శ్రీను
కొందరంతే..
ఈర్షాద్వేషాలతో బ్రతుకుతుంటారు
ప్రక్కవాళ్ళ ఎదుగుదలని చూసి ఓర్వలేక జీవిస్తూ
తమ కష్టాలను తామే కొని తెచ్చుకుని తిప్పలు పడుతుంటారు !
కొందరంతే..
పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడుతూ
అడ్డదిడ్డంగా మాట్లాడుతూ
పెద్దవాళ్ళని విమర్శిస్తూ
అదేదో ఘన కార్యమైనట్లుగా బిల్డప్ ఇస్తూ జనుల మధ్య జోకర్స్ గా మిగిలిపోతుంటారు !
కొందరంతే..
మార్కెట్ మాయాజాలం సృష్టించిన మత్తులో పడి
ట్విట్టర్లలో ఇష్టమొచ్చినట్లుగా కామెంట్స్ చేస్తూ
అదంతా గొప్ప అనే భ్రమలో పడి ..
వ్యక్తిత్వాలని కోల్పోతూ నలుగురిలో నిందల పాలవుతుంటారు !
కాని సత్యమేంటంటే ..
సమాజమంటే ..అసంఖ్యాక జన సమూహాల సంఘటితం !
ఆ కొందర్ని పట్టించుకోకుండా..
చెడుకు దూరంగా జరుగుతూ..
మంచిని ఆదరిస్తూ ముందుకు సాగుతుంటే ..
లోకం ఎప్పుడూ నీ వెంటే నేస్తం !
- గొర్రెపాటి శ్రీను ( హైదరాబాద్)
6
[05/01, 8:24 pm] ఓరువాల సరిత kjyk 28: కవితాగానం
*కొందరంతే*
కొందరంతే మందలిస్తే చాలు మహా షాలు
సూది మొనలో దారం గుచ్చలేకున్నా
ఢాంబికాల కు ఏం కొదువుండదు
సూర్యుడు అలసిపోయి సాయంత్రం అస్తమిస్తాడుగానీ
గొప్పలు చెప్పుటలో వీరికి మాత్రం అలుపూసొలుపూ అస్సలుండదబ్బా...
నోరుతీపి మాటలతోనే కోటల మీద కోటలు కట్టేస్తారు
అదేమిటబ్బా అనేలోపే అద్భుతమైన అబద్ధాలతో ఆకాశానికి ఎత్తేస్తారు
ఔరా! ఎంతటి ఘనులో వీరు
అంతరిక్షం అంచుల దాకా
తమ జైత్రయాత్ర సాగిందంటూ
వారిదైన మొగ్గులోకి తాపీగా దించేస్తారు
కాస్త ఏమరుపాటుగా ఉన్నామా?
పగటిపూటే చుక్కలు చూపిస్తారు
కొందరంతే మందలిస్తే చాలు మహా షాలు
సరితనరేష్✍️
7
[05/01, 8:31 pm] +91 99373 80136: కావ్యగానం(సీజన్2)
తేది05012022,బుధవారం
అంశం:కొందరంతే.
కొందరంతే...
కొండమీదకోతినైనా కావాలని పట్టుబడతారు
అందనిద్రాక్షలకోసం అర్రులు చాస్తారు
తాముకావాలనుకున్నది పొందడానికి ఎంతకైనా తెగిస్తారు
కుట్రలు కుతంత్రాలు పన్నుతారు
వినోదాలతో కాలక్షేపంచేస్తారు
విహారలకై పరగులు పెడతారు
వెర్రివేషాలు వేస్తారు
వేదికలెక్కి ఉపన్యాసాలు దంచుతారు
కష్టాలుపడుతూ గడుపుతారు
సుఖాలతో తూలుతూ వుంటారు
డబ్బుసంపాదనే ధ్యేయంగా బ్రతుకుతారు
నగలు ఆభరణాలకోసం వెంపర్లాడుతుంటారు
కొత్తకొత్త అవిష్కరణలు చేస్తారు
ఆకాశహార్మ్యాలను కడతారు
గాలిమేడలు కూడా కడతారు
అవినీతిపనులు చేస్తూ దొరికిపోతారు
నిజాయితీగా బ్రతకాలని కోరుకుంటారు
నేరమయజీవితం గడుపుతారు
కొందరంతే కొందరంతే కొందరంతే....
ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం ,శ్రీకాకుళం జిల్లా
చరవాణి7780594995.
8.
కవితాగానం సీజన్ - 2
అంశం:: కొందరంతే
తేదీ:: 5.1.22
శీర్షిక:: మారరంతే
కొందర0తే
చెప్పిన వినరు
మారమన్న మారారు
పెద్దల మాట వినరు
మంచి దారిన
నడవమన్న నడువరు
కొందరంతే
డబ్బుకు దాసోహమంటారు
మోసాలతో గద్దె నెక్కుతారు
మానవత్వం మరచిపోతారు
దానవత్వంతో పెట్రేగుతారు
కొందరంతే
మ0దుకు బానిసలౌవుతారు
దురాశతో మునిగిపోతారు
కొంచం పిండితో ఎక్కువ రోటీ
కావాలంటారు
మాటలతో మభ్యపెట్టి
మనసులో కుళ్లు ఆలోచన
ముంచే యోచన
కొందరంతే
ఉన్నద0తా దాన ధర్మాలు చేస్తారు
తినడానికి తిండి లేకున్నా
కట్టడానికి బట్టలేకున్నా
ఉండేందుకు ఇల్లులేకున్నా
దయ గుణం కలిగి ఉంటారు
కరుణతో కాలం వెళ్లదీస్తారు
ప్రేమతో అందరిని దగ్గరికి
తీసుకుంటారు
నిత్య కళ్యాణం పచ్చతోరణంగా
ఈ ప్రపంచము కళకళాడాలంటారు
సర్వేజన సుఖినోభవంతు
అని కోరుకుంటారు
కొందరు మహానుబావులుంటారు
మంచి చెడు ఉండాలి
పాపం పుణ్యం ఉండాలి
అన్ని ఉంటేనే భోజనమంటారు
అన్ని ఉంటేనే లోకమంటారు!!
కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు. 8309920625
9.
[06/01, 6:40 pm] Aparajith: విడిపోతున్న గతం చేదు జ్ఞాపకాలు!
గతం తాలూకు జాడలు
విడిపోమంటే విడిపోయేవా!?
కాసేపు అలా వాలుకుర్చీలో కూర్చుంటే
ఆలోచనలు తరంగాలు తరంగాలుగా
ఒక్కొక్కటి పక్షుల్లా ఎగిరొచ్చి వాలుతాయి!
పోగొట్టుకున్న చోటే అప్పుడే వెతుక్కోక
బాధల గాధాలన్నీ తోడుకుంటే ఏం లాభం!
విజయాలను ముద్దాడిన క్షణాలు మాత్రమే
మనస్సుకు ఊరట ఆనందాలు వెల్లువెత్తుతాయి
ఆ ఒరవడి మనిషికి ఎక్కబోయే శిఖరాలను చూపుతాయి !
పళ్లు ఇకిలించే అడ్డగాడిదలను పట్టించుకోకు
మనస్సు గాయాలను గెలుక్కోక నెమ్మది పరిచే లేపనమవ్వు
పుడమిలో పూచిన ఎర్ర గులాబీవై ఆత్మీయతలు పంచు
నీడలను నమ్ముకోకు ఎవరి నీడనా చేరకు బానిసవైతావ్!
రాలిపోయిన ఆకులెన్ని అని లెక్కించకు
లేత చిగుళ్లు వేస్తున్న చెట్టు అవేమీ పట్టించుకోదు
తను ఇంకా బలంగా ఎదుగుతూ ఫలాలనిస్తూ
ఎంతటి త్యాగానికైనా సిద్దంగా ఉంటుంది!
నీ గుండెల్లో రగులుతున్న మంటలకు వెన్నుచూపకు
నీకంటే కోటిరెట్ల మంటలు విరజిమ్మే సూరీడు
పుడమి తల్లికి కాలచక్రం తిప్పే తండ్రి అని మరువకు!!
అపరాజిత్
సూర్యాపేట
10
[06/01, 8:10 pm] Thippavajjala నరసింహ మూర్తి Poet Nellore: క వితాగానం
అంశం:కొందరంతే
తిప్ఫావఝల నరసింహమూర్తి
మార్పు సహజం
మారేలోకంతో పాటూ మారాలి మనం
సైన్స్ తెస్తుంది జీవనం విధానంలో మార్పు
మన సంస్కృతీ సాంప్రదాయాలకనుగుణంగా వచ్చే మార్పులో లేదు తప్పు
ఈ మార్పు వెర్రితలలు వేస్తేనే అసలు ముప్పు
నేటి యువత విదేశీ సంస్కృతి మోజులో పడుతుంది పెడదారి
మత్తుకు బానిసలై చేసుకొంటున్నారు జీవితాలు నరకం
పబ్బులు, క్లబ్బు లంటూ వేస్తున్నారు వెర్రి గంతులు
అవును,కొందరంతే,కనరు,వినరు,మూర్కొనరు అన్నట్లుతమ నెత్తిన తామే చేతులు పెట్టుకొంటున్నారు
వినాశనాన్ని కొని తెచ్చుకొంటున్నారు
మరి కొందరంతే, గతాన్ని పట్టుక వేలాడ్తూ మార్పనంగీకరించరు సులభంగా
తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళంటూకూర్చుంటారు ముడుచుక
మారుతున్న కాలంతో పాటూ మనమూ మరితేనే సమాజంలో మనుగడ
ఆమార్పు మనజీవితాలను చేయాలి ఆనందమయం
11
[06/01, 8:11 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్ 2 ) 6/1/2022/ గురువారము
అంశము:- " కొందరంతే "
శీర్షిక:- " మానవపోకడలు "
కొందరు చెప్పేదొకటిచేసేదొకటి
వారికి తోచువిధమువారుచేస్తారు వారంతే
కొందరికి పెద్దలదారినచ్చదు పిల్లలబాటనడువరు
వారిదారివారిదేకాని ఏదారోతెలియదు వారంతే
మానవత్వమెరుగక మమతానురాగాలు మరచి
దానవులవోలె మాయతో మభ్యపెడతారు
దయాగుణములన్నిడబ్బుకుదాసోహమై
జీవనంసాగిస్తారు వారినేమనాలి కొందరంతే
అందనివాటినందుకోవాలనుచు కొండమీదకోతిని కోరుతూ
ప్రతి వస్తువు తమకే కావాలనుకుంటారు
గాలిమేడలుకడతారు పునాదులు లేనినేలనుపడతారు
వారిబతుకులంతేవారినిమార్చలేరు కొందరంతే
డాంబికాలకు పోతారు డాబుదర్పాలుచూపుతారు
సత్యాన్ని అడుగుకునెట్టి అసత్యాన్ని అందలమెక్కిస్తారు
సమాజసేవలంటూ ప్రచారాలకు లోటుండదు
చెలిమినిస్వార్థానికి వాడతారు
మంచితనాన్ని మంటనుతోసేవారినేమనాలి
కొందరంతే
యుగాలు మారినా మానవమనుగడలోతేడాలు
కాలంతనమానాన్ని తానుసాగుతూనేవుంది
ఎప్పటిలాగే కాలాలు, రుతువులు, మాసాలు, రోజులు, దొర్లుకుపోతూనేవున్నాయి
సూర్యచంద్రులు, గ్రహాలు తమపనినితాము
కొనసాగిస్తూనేవున్నారు అదేమొ
మనుజులనైజమున మార్పులెన్నో
అందరూనంతేననుకోలేము
" కొందరంతే "
తరణికంటి సూర్యలక్ష్మి.
12
---------
[06/01, 8:12 pm] Lalita Sister: కొందరంతే
చెప్పింది వినరు
చెయ్యబోయేది చెప్పరు
కొందరంతే
తమలోని దోషాలు తెలుసుకోరు
ఎదుటివారిని విమర్శిస్తుంటారు
కొందరంతే
మంచి మాటలు బాగున్నాయి అను సలహా పడేసారు
మంచిని ఆచరిస్తున్నమా అని ప్రశ్నించుకోరు
కొందరంతే
గొప్పలు చెప్పుకుంటారు
తప్పులు తెలుసుకోరు
కొందరంతే
ఇతరులకు సాయపడతారు
అందులో ఆనందం అనుభవిస్తారు
కొందరన్తే
జీవిత పాఠాలు నేర్పుతారు
జీవితం అంటే తెలియదు మరి కొందరికి
కొందరంతే
రేయింబవళ్లు కష్ట పడతారు
ఏమిచెయ్యలా అని ఆలోచిస్తూ గడిపేస్తారు మరికొందరు
కొందరంతే
లైఫ్ ఎంజాయ్ చెయ్యాలంటారు
లైఫ్ లో సాధించాలని అంటారు మరికొందరు
కొందరంతే
టీవీ లు ఠీవిగా చూస్తూ ఉంటారు
ప్రగతి కై పాటు పడతారు మరికొందరు
కొందరంతే
ఆటలాడుతారు
చదువు కుంటారు మరికొందరు
కొందరన్తే
కాలేజ్ యూనివర్సిటీఫస్టువస్తారు
ఉద్యోగంలో ఉన్నత స్థాయి లో ఉంటారు
మరి కొందరు
కొందరన్తే
సేవా దృక్పథం తో ఉంటారు
నాకేమిటి లాభం అని
స్వార్థంతో ఉంటారు మరికొందరు
కొందరంతే
కష్ట పడి సంపాయిస్తారు
కూర్చుని తింటారు మరి కొందరు
కొందరన్తే
దేశ సేవ అంటారు
దేశాన్ని. దోచేస్తారు మరికొందరు
కొందరన్తే
దొంగతనం చేస్తారు
దానం చేస్తారు మరికొందరు
ఇలా ఎన్నో
కొందరు మరి కొందరు అందరూ కలసి
మనమెవరం?
ఎలవచ్చాం?
ఏమిచెయ్యాలి?
గతం వర్తమానం భవిష్యత్తులు
ఏమిటి ఆలోచించి
మనమంతా ఒకటే అనే ప్రేమ భావం రావాలి అప్పుడే మనుగడ శాంతి
సౌఖ్యలతో గడుస్తుంది
డా.తంగిరాల నాగలక్ష్మి
13
[06/01, 8:13 pm] Lalita Sister: కవితా గానం (సీజన్ 2)
అంశం....కొందరంతే
శీర్షిక....లోకాయుక్తం
కొన్ని విశ్రాంతి దేహాలు
మస్తిష్కంలో కొసరి కొసరి
వడ్డించుకుంటాయి.....
అవసరమున్నా లేకపోయినా
అందరి ముందు
అందిపుచ్చుకున్న లోకాభిరామాయణ
చిట్టా పద్దును విప్పటానికి....
అది చెవిగూటిన బడ్డ కొన్ని
మూగ మనసులు
బాధల ముసుగులు కప్పుకుంటాయి....
మరికొన్ని మనసులు
ఆ పర గాధల పొట్లం
మరో చోట విప్పటానికి
సంతోషాల హృది నద్దుకుంటాయి....
వంటింట్లో చెమటోడ్చుతూ
వార్తలు చదవటానికైనా
వెసులుబాటు లేని ఇళ్ళల్లో
లోకాభిరామాయణం
చదివే వార్తాహరులు కొందరంతే....
ఉన్నదానికి లేనిదానికి
రంగవల్లులద్ది మెరుగులుదిద్ది
సాన బడతారు....
సాటివారికి ఆత్మీయంగా
అవసరపడే ,స్ఫూర్తి
నింపే ,లోకాభిరామాయణం
అందరికీ లోకాయుక్తంగా
ఉంటుంది కదా....!!
మొహమ్మద్ అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ .గో .జి )
14
[06/01, 8:29 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం(సీజన్2). 6--1--2022.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- కొందరంతే.
ఎవరేది చెప్పినా వినరు
తాము చెప్పిందే వేదం అంటారు
తమ మాటే నెగ్గాలంటారు
కొందరంతే...
తమలో ఉన్న లోపాలను తెలుసుకోరు
ఎదుటి వారిలో లోపాలు వెదుకుతారు
గురివిందగింజ సామెతను గుర్తుచేస్తారు
కొందరంతే...
కుట్రలు, కుతంత్రాలే వారి నైజం
డబ్బు సంపాదనే వారి ధ్యేయం
అన్యాయాలు, అక్రమాలే వారి మార్గం
కొందరంతే...
విధులకు వారి జీవితం అంకితం
బాధ్యతలతో వారి బంధాలు మమేకం
నీతి, నిజాయితీలే వారి నైజగుణం
కొందరంతే...
కష్టాలెన్నున్నా దేవుడినే నమ్మటం
పూజలూ,పునస్కారాలు నిత్యకృత్యం
వారిదెప్పుడూ ఆధ్యాత్మిక ప్రపంచం
కొందరంతే...
వివిధ మనుషుల సమాగమం
విభిన్న మనస్తత్వాల సమ్మేళనం
వైవిధ్య ఆలోచనల అనుసంధానం
ఈ సమాజం...
15
**************************************
[06/01, 8:33 pm] Thathapudi Somashekara Sharma: కవితా గానం
అంశం.. కొందరంతే
శీర్షిక..మంచి చూడలేరు
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336
అందాలు కావాలంటారు
ఎదుటివారి అందం చూడలేరు
కొందరంతే...
మంచిగా ఉండలేరు
ఎదుటివారి మంచిని చూడలేరు
కొందరంతే...
గొప్పలు చెప్పుకుంటారు
ఎదుటివాని గొప్పను మెచ్చుకోరు
కొందరంతే...
తను సుఖంగా వుండలేడు
ఎదుటివాని సుఖాన్ని చూడలేడు
కొందరంతే...
ఇతరులకు సహాయం చేయరు
ఎదుటివాడు చేస్తే చూడలేరు
కొందరంతే...
తను దైవచింతనే చేయడు
ఎదుటివాడు చేస్తే విమర్శిస్తాడు
కొందరంతే..
మంచిని చేయి
మానవతను పెంచు
మధురిమను పొందు
మనిషిగా సంచరించు
మమతానురాగాలతో మెలుగు
మనసును నిలకడగా ఉంచుకో
మానవత్వంతో మనుగడ చేయి
మంచిగా వుండు కొందరిలా ఉండకు
మృదువైన బాటలో నీవు నడుస్తూ
నీ జీవితాన్ని ధన్యమయం చేసుకో..
హామీపత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
16
[06/01, 8:40 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం సీజన్ 2 నిర్వహించు కవితల మాలిక
అంశం: కొందరంతే
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి :9505152560
తీరే వేరు
మసిపూసిన మారేడు కాయలా
మాటలలో కోటలు కట్టేస్తారు
గొప్పలు చెప్పుకుంటూ
గప్పాలు కొడుతుంటారు
అనవసరమైన దర్పంతో నాయకత్వం వహించడానికి
ముందు వరుసలో
విషయంలో మాత్రం శూన్యం
తన మాట నెగ్గాలన్న ఎంతటి వాదనకైనా
సిద్ధమవుతారు
వితండవాదంతో సంతృప్తి పొందుతారు
కోట్లకు అధిపతి అయిన
కుక్షి కోస్తే మాత్రం
అక్షరం ముక్క వుండదు.
మాటలతో నమ్మబలికి మోసం చేస్తుంటారు...
పొగిడే వారికి పట్టం కడుతుంటారు
తెగిడే వారికి పక్కన పెట్టేస్తుంటారు
ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు...
***
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
17
[06/01, 8:41 pm] +91 6281 697 982: అంశం...కొందరంతే...06012022
శీర్షిక...కళ్ళ ముందే
****************************
చిన్న నాటి చెలిమి
కలో గంజో తాగి
కల్లా కపటం తెలియని
కాలం కన్నుల ముందే
వరి గట్టు మీద వయ్యారం
జొన్న చేల తోవ జగడాలే
కంది చేను కింది వేరుశనగ
వీపు విరిచేస్తానన్న కాపు
విసిరిన కర్ర కళ్ళ ముందే
మోట బావి గిలక పైనుంచి
మోటుగా దునికి ఈత ఈదిన
సాహసానికి గోడ కుర్చీ శిక్ష
అది ప్రేమ పాశం...కళ్ళ ముందు
రోజులు నెలలు సంవత్సరాలు
కాలగర్భంలో కలిసిపోయాయి
కాలం కఠినం.... విడదీసింది *స్నేహాన్ని*
అంతులేని సిర సంపదలతో
అపర కుబేరులై అలకాపురిలో
ఆనందోత్సాహాల మధ్య హర్షాతిరేకాలు
అయినా
కుచేల సామ్రాజ్యం లో కునారిల్లుతున్నా
కటిక దరిద్ర దేవతతో కాపురం చేస్తున్నా
ఎదురెళ్లి కౌగలించుకొని ఆప్యాయంగా
ఆదరించే.. మైత్రిని మరువని మిత్రులు ...
పసివాడని మనసు మిస మిస లాడుతూ
లేత తాటి ముంజలో... నీరులా... స్వచ్ఛంగా
మృదువైన మెత్తని గుజ్జులా హృదయం.....
కొందరంతే.... మారరు.
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
18
[06/01, 9:14 pm] +91 90594 38068: కవితా గానం
అంశం: కొందరంతే
శీర్షిక: వాళ్లంతే
గజవెళ్ళి శ్రీనివాసాచారి
కాజీపేట
...
కొందరంతే..
కళ్ళముందే ప్రమాదాలు జరుగుతున్నా
గాలిలో ప్రాణాలు కలిసిపోతున్నా
వేగంలో మార్పు ఉండదన్నా
కారైతే సీటు బెల్టు ధరించరుగా
ద్విచక్ర వాహనమైతే
శిరస్త్రాణం పెట్టుకోరుగా
ఒకరిని దాటేయాలని
పోటీపడే మనస్తత్వం
ఏ గమ్యం చేరతారో
యమపురికి చేరుకుంటారో
ఎవరికి తెలుసు
కుటుంబ సభ్యులను
నట్టేంట్లో ముంచేసి
అర్థాంతరంగా తనువు చాలిస్తారుగా
వాళ్లంతే..
ఎవరి మాట వినరుగా..
తాను చేసేదే కరెక్ట్ అనుకుంటారుగా
19.
కవితాగానం
అంశం :కొందరంతే
కొందరంతే
అవసరాల డేరాలు కడుతూ......
అక్కడక్కడా మజిలీలు చేస్తుంటారు
అవకాశాలకు కరువు రాకుండా
అరువు తెచ్చుకున్న అభిమానపు పదాలనలదుతూ
మనతో నడిచినంతకాలం
మహానుభావులను చేస్తూ
ఎదుగుతున్న మనతో
మనలేక
బాట మార్చి..
భావాలను సులువుగా బదలాయింపు చేసుకుంటుంటారు
అనుభవం నేర్పిన పాఠమంటూ ....
అంటుకడతూ
విలువలను ...
వలువలుగా మార్చి చిలక్కొయ్యకు వేలాడదీస్తూ...
కాస్త విరామమిస్తూంటారు
అక్కరకు రాని అరిషడ్వర్గాల తో చెలిమి చేస్తూ కలుషాల కలిమితో
కాపురం చేస్తుంటారు
ఆరోపణల ఇళ్ళు....
కట్టు కథల విల్లాలు కడుతూ..
మాటల్ని యూ టర్న్ తీసుకుంటూ
మనచుట్టూనే పయనం సాగిస్తూ ఉంటారు
కొందరంతే...
మార్చాలన్న మహా ప్రయత్నాలతో మింగిలవడం కన్నా
మౌనం మింగిన ముంగిలవడమే మిన్న
********శివునూరి లలితాకృష్ణ
Comments
Post a Comment