నిర్వహణ శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
******************
కవి వరుల జాబితా
1.జక్కిడి వెంకట్ రెడ్డి గారు
2.భరద్వాజ గారు
3.మన్నె లలిత గారు
4.సునంద వురి మళ్ళ గారు
5.సుగుణ మద్ది రెడ్డి గారు
6.మర్రి జయశ్రీ గారు
7.డా.ఆంజనేయులు గారు
8.సుధారాణి కృష్ణం రాజు గారు
9.ధనాశి ఉషారాణి గారు
10.తిరు వేంకటాచార్యులు గారు
11.చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్.
*************
Lalita Sister
నేటి అంశం
03.04.3021
నిరుద్యోగం
ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో
స్పందించగలరు.
ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.
✴️✴️✴️✴️✴️✴️
1
: ** కవితా గానం **........ .........
అంశం :నిరుద్యోగం .
పేరు :జక్కిడి వెంకటరెడ్డి .
..... ....... ....... ......
ముప్పై నిండినయి బతుకుకి
అయినా ....
అడుగుముందుకు పడ్తలేదు
బతుకుదెరువుకి .....
ఆశల అలలపై తేలుతూ
పెద్దచదువులు చదివినా
ఆవిరైన ఆశలతో
రేపన్నది శూన్యమనిపిస్తుంటే ....
పెద్దల శ్రమకు సాక్ష్యం .....
చేతిలోని
పెద్ద డిగ్రీ పట్టా కాగితం ....
అకుంఠిత దీక్షతో
చేసిన యజ్ఞం
అభాసుపాలవుతుంది
పాలకుల నిర్లక్ష్యంతో ....
ఉద్యోగం అనేది బతుకుబాటలొ
తోడుండే ఒక రక్షక మజిలీ....
రక్షణ లేకుండనే
జనారణ్యంలో కిక్కిరిసిన రోడ్డుపై
నిలబడినట్టుంటది ....
పట్టాలు పట్టుకుని తిరిగిన
పొట్టనింపే కొలువుదోరకక
కోలుకోలేని దెబ్బతీస్తుంది
నిరుద్యోగం .....
అప్పుడు ....
నిరుద్యోగి పేలాల్లా
వేగడమెందుకు ....
నిప్పుకణికలై పేలాలిగాని ...
ప్రాణాలు తీసుకునే
పిరికితనం దరిచేరనియ్యకు ...
ఉప్పెనయ్యె ఉడుకునెత్తురును
ఊరకనే ఊరడిస్తే ఎట్లా ?
దిక్కులు పిక్కటిల్లేలా
ఉప్పెనలా లేపాలి ....
నీలోని ఉత్సాహాన్ని
ఉరుకులు పెట్టించాలి ....
అప్పుడే ....
బతుకు యుద్ధంలో
గెలవగలవు ...
రేపటి పొద్దు నీవే
సమాజ నిర్మాతగా నిలవగలవు .
-‐-- జక్కిడి వెంకటరెడ్డి .
టీచర్ ...
భువనగిరి ..
2
పేరు-భరద్వాజరావినూతల
ఊరు -కొత్తపట్నం
9866203795
🏹అంశం -నిరుద్యోగం 🏹
శీర్షిక - ది ఎవర్ గ్రీన్ ప్రాబులం --!
ప్రపంచాభ్యుదయానా రాగాలాలపించలేని వీణలు -
శ్రామికాకాసాన స్థి ర నివాసమందలేని ఉల్కలు -
ప్రగతిరధ చక్రాల తోలుటకు పనికిరాని ఆశ్వాలు -
భారతాన మిగిలి ఉన్న ఈ నిరుద్యోగులు -
అధికసంథాన రాక్షసి కడుపున బుట్టిన దరిద్రులు -
పట్టాలపైనే బ్రతకాలనుకుని పొట్టచేత పట్టుకుతిరిగే మేధావులు -
ఏళ్లతరబడి ఎంప్లొయీమెంట్ ఎక్స్చేంజి లో బ్రతికే మూగజీవాలు
లంచపునెరజాణలను కౌగలించుకోలేని బలహీనులు-
రికమండేషన్ వేశ్యలకు దాస్యాలు చేయలేని ఆసక్తులు
పురుగుమందులకు రైల్ పట్టాలకు బలై పోతున్న సగటుజీవులు
పరిస్కారం కానరాక ఎవర్ గ్రీన్ ప్రోబులం గా మారుతున్న
ఈదేశపు సమస్యలు ఈనిరుద్యోగులు
3
తేదీ :3/4/ 21 --శనివారం.
అంశము :నిరుద్యోగం.
శీర్షిక :చిరకాల సమస్య.
పేరు :మన్నె పిన్నక లలిత .
హైదరాబాద్ .
చరవాణి సంఖ్య:741 686 32 89.
చెదలు పట్టిన విద్యా విధానం
పునాదులు లేని భవిత
నిరుద్యోగంతో యువత
ఆత్మహత్యల పాలవుతున్న రేపటి తరం
ఈ సమాజం మారేది ఎన్నటికి?
మూటల మూతులు చూస్తున్న నేతలు
చేతిలో విద్య ఉన్నా
దారీ తెన్నూ లేని పథకాలతో
నిరుద్యోగులైన యువత
స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా
దేశ భవితను నిర్వహించలేని నేతలు
తల్లిదండ్రులు ఉన్న కుంట నమ్మి , కుందనం అమ్మి
చెప్పించిన చదువు ,ఒక పూట గంజి కయినా
ఆకలి తీర్చకుంటే
ఆ నిరుపేద యువకుడికి
ప్రభుత్వం నిరుద్యోగం రైలు పట్టాలులా
ఎప్పటికీ కలవవు అనుకుని
రైలు పట్టాలనే మార్గ నిర్దేశకం చేసుకుని
ఊపిరి తీసుకుంటున్నాడు
నిరుద్యోగ యువతా!
ఒక్క నిమిషం ఆలోచించండి
ప్రభుత్వ సహాయంతో, బ్యాంకు పెట్టుబడులతో
చిన్న వ్యాపారం పెట్టుకుని
పెద్ద వ్యాపారియై ,పదుగురికి జీవనం కల్పించండి.
4
[03/04, 9:09 PM]
సునంద వురిమళ్ళ గారు:
తేదీ:03-04-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: నిరుద్యోగం
శీర్షిక:
********************
అమ్మా నాన్నల ఆశలు తీర చదివిన చదువులు
వాగ్దేవి అనుగ్రహంతో పొందిన పట్టాలు
ఉద్యోగార్హతకు పనికి రాని చిత్తుకాగితాలైనప్పుడు..
పాతికేళ్ళు వచ్చినా
పాణీగ్రహణం చేయని ఉద్యోగం!
అయిన వారి ముందు చులకనై
కాని వారి ముందు పనికిరాకుండా పోయి..
ఆవిరైపోయిన ఆశలతో
నిరుద్యోగంతో చేసే సహవాసం
భవిష్యత్తును అవమానాల అగాధంలోకి నెడుతుంది..
కన్నవారికి ఏమీ చేయలేకపోయాననే బాధ
మనసును కృంగదీసి వేదనల పాల్జేస్తుంది..
ఇవ్వాల్సిన ఉద్యోగ ప్రకటనలు
చెయ్యాల్సిన తక్షణ భర్తీలు
అదేపనిగా ఆగిపోతే
పెరిగే నిరుద్యోగ సమస్య పెనుభారంగా మారుస్తుంది!
పేదవారి జీవితాల్లో కమ్ముకున్న
చీకట్లు
చేసిన అప్పులను కొండల్లా పెంచుతుంటే
యువతలో ఆత్మ స్థైర్యం లోపించేలా చేస్తుంది!
అందుకే
తన కాళ్ళ తాను నిలబడేలా
ధైర్యాన్ని నూరి పోసి
స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తే జీవితాలకు అవుతుంది కొండంత
5
పనిచేసే సామర్థ్యం ఉన్నా
ఉపాధి లభించని స్థితి.
నిరాధారమైన పరిస్థితి
రుతువులకే పరిమితమైన వ్యవసాయం
నీరు లేని మెట్ట భూములు
జనాలు ఎక్కువగా మొగ్గుచూపే సేవా రంగం
తగిన వేతనాలు పొందని స్థితి
కోటి విద్యలు కూటి కొరకే అయినా
కడుపు నింపనిదుస్థితి
నిరు పేద గుండెలో ఆరని మంటలు
ఉన్నత చదువులు చదివి నిరాశతో గడిపే మేధావులు
ఎందరో........
చాలీ.... చాలని జీతాలతో బతికే యువతా....
నీ ఉన్నతమైన ఆలోచనలతో...
నీదైన మేధాసంపత్తితో....
బ్యాంకు ల సహాయంతో...
స్వయం ఉపాధి కల్పించుకో....
నీతోబాటు...... మరికొందరు
...... ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకోనీ....
సుగుణ మద్దిరెడ్డి
ఐలవారిపల్లె
ఐరాల.
6
మర్రి జయశ్రీ
అంశం..నిరుద్యోగం
శీర్షిక...భరోసా
ఎన్నో ఆశలతో
సంతానాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో
తగిన ఆస్తిపాస్తులు లేకున్నా
తాము పస్తులుండి
లోటేమి తెలియనివ్వకుండా
చదివించిన తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది నేడు
డిగ్రీ పట్టాలెన్నో పుచ్చుకొని
బంగారు పథకాలు సాధించినా
అవన్నీ చిత్తుకాగితాలైపోయి
నిరుద్యోగం పేరుకుపోయిన వేళ
యువతలో నిరుత్సాహం
కన్న వాళ్ళలో కలవరం
ఎందుకు పనికి రామనే
ఆత్మన్యూనత ఆవరించి
అవమానాలు ఎదుర్కొంటూ
వయసు పెరుగుతున్నా సరైన సమయంలో పాణి గ్రహనానికి నోచుకోని దుస్థితి
భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతూ
ఆత్మహత్యల పాలవుతున్న యువతరాన్ని కాపాడుకోవాల్సిందే
ఉద్యోగ ప్రకటనతో ఊరించక
భర్తీకోసం సాగించాలి కసరత్తు
స్వయం ఉపాధి అవకాశాలు అందిస్తూ
భవితకు భరోసా కల్పిస్తే
అభివృద్ధిలో దేశం ముందుంటుంది
7
[04/04, 8:48 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: తరతరాలుగా ఎన్ని చదువులు చదివిన చేసేందుకు ఉద్యోగం లేక కుమిలిపోతున్న నిరుద్యోగులు
యావదాస్తిని అమ్ముకొని జీతాలు దొరకని నిరుద్యోగుల చూస్తే జాలేస్తుంది
గుండె తరుక్కుపోతోంది
ఎంత మంది నిరుద్యోగ అక్కకి బలైపోయారు లెక్కలు వేస్తే హృదయం ద్రవించింది
సమాజం ఉద్యోగ కల్పన కోసం నిరంతరం పాటుపడితే ఏ ప్రభుత్వాలు నిరుద్యోగులకు కష్టాలు లేకుండా ఉంటాయి
అందుకే నిరుద్యోగ రక్కసి గొలుసులను తెగ కొట్టండి
సమాజం ప్రభుత్వం సామాన్యుని సంక్షేమం ఉద్యోగ కల్పన వారి ప్రథమ కర్తవ్యం ఆనాడే తల్లిదండ్రుల ఆశలను నెరవేరుతాయి
ఇంత కాళ్ళపై నిలబడిన అప్పుడే అమ్మానాన్నల ఆశలు పండించిన వారవుతారు
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453
[04/04, 8:54 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు
సంగీత మై సాహిత్య మై నిలిచే సరస్వతీ పుత్రుడు
ప్రతి అక్షరం సంగీతమే ప్రతి అక్షరం సాహిత్యం ఘనతని
రస భావ అలంకారాలు సుమధుర మై సాగెను
ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు పద్మశ్రీ అందుకొని పాఠక లోకంలో గేయ mypat అయ్యాయి
చారిత్రిక విషయమై ఎన్నోది దుర్గాల కథలను వెలువరించారు
పుట్టపర్తి కవి వేరే నాయుడు శారద అతని వరించింది
చిరకాలం కవితా లోకంలో సరస్వతీ పుత్రుడు వెలుగొందు ను జగతి ఉన్నంతవరకు
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
రసరమ్య మై సుధా అమృతాన్ని కురిపించింది అతని ఎన్నో గ్రంథాలను రచించారు
[04/04, 9:14 PM] +91 70755 17538: శీర్షిక.నిరుద్యోగము
8
పేరు. ధనాశి ఉషారాణి
జిల్లా. చిత్తూరు
......
పెరుగుతున్న జనాభాతో
తరుగుతున్న చదువు ప్రామాణిక విలువులతో
క్షీణిస్తున్న క్రమశిక్షణతో
పెరుగుతున్న పారిశ్రామిక పరికరాల విలువులతో
తరిగిపోతున్న నిరుద్యోగము
ఊహల్లో ఊరేగుతూ అలా బ్రతుకుతూ వున్నట్టి
తల్లిదండ్రుల ఆశలపై
నీళ్లు చల్లుతూ విలాసాల మత్తులో తెలుతున్నట్టి నేటి యువతకి
కాదేమి జ్ఞానోదయము రాదేమి చదువుపై ఆసక్తి
నిరుద్యోగ భద్రత కోసము ఎన్ని పథకాలు చేపట్టినా
నీరు కారుతున్న యువత అశలు
ప్రవేటీకరణ పేరుతో తక్కువ జీతాలతో
అరాకోరగా సాగుతున్న బ్రతుకులకు
ప్రభుత్వం భరోసా ఇవ్వాలి
ప్రవేటీకరణ తగ్గి యువత భవిత ముందుకు సాగాలి
9
: ఉద్యోగము అంటే పని. పని దేనికోసం?
కూడు, గుడ్డ, గూడు కోసం. ఇంతేనా!
ఇప్పుడు పరిసరాల ప్రభావం వల్లనో, సహవాసదోషం వల్లనో, తమ కోరికల చిట్టాను ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవడ0 కోసం కూడా,...
అంతేనా!? అలవర్చుకున్న విలాసాల మాయాప్రపంచంలో విహారం కోసం, ...
సోదరా! నేనిలా రాస్తున్నందుకు తప్పుపట్టక0డి, ఏ ఒక్క అంశమూ అందరికీ వర్తించదు, కానీ,...
ఎంత చదువుకున్నా ,
... ఎంత చదువుకునీ, కొందరు సోదరులు స్వయం ఉపాధి వైపు కనీస మాత్రమైనా దృష్టి పెట్టక, ప్రభుత్వ ఉపాధికై, చకోరాల్లా నిరీక్షిస్తూనే, ఆ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తూనే, ...
తీరా బుద్ధి చెప్పే సమయం వచ్చేసరికి అన్నీ మరచి, తమ రాజకీయ స్వార్థపు చదరంగంలో పావులుగా మారి, వారిచ్చిన తాయిలాలందుకుని, తాత్కాలికంగా ఆనందించి, మాయమాటలు నమ్మి , ఏదో ఆశించి, అసలైన సామాజిక పౌర హక్కులను వినియోగించుకునే దారి మరచి, మళ్లీ వారినే పీఠాలెక్కించి, ఒకటికి పదిసార్లు మోసపోవడం అలవాటు చేసుకున్న నిరుద్యోగ యువతా! మీకేమి కావాలో, మీరేమి కోరుకుంటున్నారో ఎపుడైనా ఆలోచించారా?
MTV ACHARYA, మహబూబాబాద్.
10
🙏 సుధారాణి కృష్ణంరాజు🙏
*నేటి అంశం*నిరుద్యోగం*
04-04_2021(ఆదివారం)
*నిరుద్యోగం తో యువత దారి తెలియని అయోమయ స్థితిలో
ఉన్నారు పట్టాలు ఎన్ని సాధించినా పట్టెడన్నం పెట్టలేని
డిగ్రీలతో చదువులు చదివి వేరే
పనులు చేయలేక ఉద్యోగం పొందలేక జీవితం అంతా బాధలమయమే అనే మనోవేదన ఆస్తులు అమ్ముకుని మరీ ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రుల కు ఉద్యోగం లేని నిరుద్యోగులుగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న యువత చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు
పోటీ ప్రపంచంలో చదువుకున్న మేధావులు తమ ప్రతిభా పాటవాలతో సాధించిన ర్యాంకులు ఉద్యోగం లో మాత్రం
సాధించలేక
చదువు కొన్న వారు అన్ని రంగాలలో విజయం పొందుతుంటే ప్రతిభ మరుగున పడి అవినీతి ఉద్యోగం యేలుతుంటే చూసి
బాధపడటం తప్ప ఏమి చేయాలో తెలియని స్థితి
నిరుద్యోగులు ఉద్యోగులు గా మారి ప్రతిభకు పట్టం కడితే
నిరుద్యోగం లేకుండా అన్ని రంగాల్లో యువత సాధించిన
కృషికి ఫలితం లభిస్తే నిరుద్యోగం కనుమరుగై నవ సమాజ స్థాపన జరగాలి🙏🙏👍
11
చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్.
అంశం :నిరుద్యోగం
శీర్షిక :ఆశతో వేయాలి ముందడుగు
ఎన్నో ఆశలతో
ఎన్నెన్నో ప్రయాసలకోర్చి
రాత్రనకా పగలనకా
కష్టనష్టాలకోర్చి
తల్లిదండ్రుల ఆశా కిరణంగా
భవిశ్యత్తుపై కోటిఆశలతో
ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా
చదివిన చదువులకు
సరియైన ఉపాధి దొరకక
ఉద్యోగాలు సంపాదించలేక
దొరుకుతుందనే ఆశలు సన్నగిల్లి
నిరాశా పాశాలకు చిక్కి
తల్లిదండ్రులకు భారమై
జీవితంపై విరక్తి పెంచుకొని
ప్రాణాలు తీసుకొంటోంది నేటి యువత
దీనికి కారణం........
నైపుణ్యాల లేమా...
ప్రభుత్వ వైఖరా.....
మనల్ని మనమే....
ప్రశ్నించుకోవాలి....
ఓ యువతా....
ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కానక్కరలేదు గా...
ఆదాయాన్నిచ్చే ఏ ఉపాధినైనా ఎంచుకోవచ్చుగా....
ప్రభుత్వ స్వయం ఉపాధి పధకాలను సద్వినియోగం చేసుకో...
నైపుణ్యం పెంచుకో...
కొత్తగా నీ ఆలోచనలకు పదును పెట్టు...
మార్గం... తప్పక దొరుకుతుంది....
పరిష్కారం చిక్కుతుంది.....
సమస్యలకు చావు కాదు ముగింపు...
జీవితం... ఓ వరం....
చావుతో... నీవారిని క్షోభ పెట్టకు...
ధైర్యం నింపుకో... ముందుకు అడుగేయ్..
విశాల ప్రపంచంలో.. జీవించడానికి చాలా మంచి మార్గాలున్నాయి..
మంచి బాట.. ఎంచుకో...
ఆశా జ్యోతి వెలిగించి... నిరాశా చీకటి తొలగించు
నీవు జీవిస్తూ... నీ వారికీ వెలుగులు పంచు
Comments
Post a Comment