Skip to main content

శ్రీ శ్రీ 2021


 

నిర్వహణ :వీరాగుడిపల్లి గారు 

            శివునూరి లలితాకృష్ణ

*******************-

1.యామిని తేజశ్రీ గారు

2.మన్నె పిన్నక లలిత గారు

3.ధనాశి ఉషారాణి గారు

4.చేబియ్యం శ్రీనివాసరావు గారు

5.మద్ది పుల్లారావు గారు

6.ఇంద్రవత్ రాహుల్ గారు

7.జంపని శ్రీ నివాస మూర్తి గారు

8.మర్రి జయశ్రీ గారు

9.వురిమళ్ళ సునంద గారు

10.మొహమ్మద్. అఫ్సర వలీషా గారు 

11.డా.నాయకంటి నరసింహ శర్మ గారు

12.కోరాడ నరసింహారావు గారు

13.సర్ఫరాజ్ అన్వర్ గారు

14.వల్లాల విజయ లక్ష్మి గారు

15.అపరాజిత్ గారు

16.రాజ శేఖరుని శివ లక్ష్మి గారు

17.డా.సీహెచ్ ఆంజనేయులు గారు

19.రాపోలు అరుణా స్వామి గారు

20.పరాంకుశం రఘు నారాయణ గారు

21.కృష్ణ కలం నుండి

22.తాతాపూడి సోమశేఖర శర్మ

23.లలితా కృష్ణ గారు

****************

కవితాగానం సమూహం 

శ్రీ శ్రీ జయంతి సందర్భంగా

ప్రత్యేక కవితలు 


శీర్షిక:మహాకవి శ్రీ శ్రీ ...!

1

_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం

అతడు...!

అంగరంగ వైభోగంగా రాజ వీదుల్లో రాజసంగా

పండిత చర్చా గోష్టుల్లో రసరమ్య రాగంగా

రాజ దర్భారుల్లో రాజ పూజ్య వర్ణమాలలుగా

వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్నీ 

సామాన్యుడి మట్టి వీధుల్లో కి మోసుకొచ్చిన మహర్షి...?

అతడు...!

సాంప్రదాయ ఛందోబద్ధ బందో బస్తుల కవిత్వాన్ని దిక్కరించి

ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం

సమ్మె కట్టిన కూలీల భార్యల బిడ్డల హాహాకారాలు

నవ్య కవితా వస్తువులుగా వదిలిన అస్త్రాలు

మొద్దు నిద్దుర మత్తు ముసుగును పటాపంచలు చేసే

తెలుగు కవిత్వాకాశంలో వేగు చుక్కై 

నవ శకానికి చుక్కానై మహాప్రస్థానానికి రథ చక్రాలతో దారులు వేసిన ప్రజాకవి...!

అతడు...!

అభ్యుదయం విప్లవం నవ్యమైన రూపంగా మార్చి

కష్ట జీవికి అటు ఇటు నిలిచేవాడే కవి అంటూ

పతితుల కోసం బాధా సర్పద్రష్టుల కోసం

విప్లవ శంఖం పూరించి పదండి ముందుకు పదండని 

ఉవ్వెత్తున లేచి గర్జించిన సింహం...!

అతడు...!

లావాలా ఎగసి పడే చైతన్య కవిత్వం

యుద్ధ సంగీతమై నిప్పులు కక్కిన కలం

నెత్తురు మండే పీడిత జన నూతనోత్తేజ  గళం

విశ్వమానవ సంఘర్షణల సముద్ర ఘోషల శబ్ధం ...!

అతడు...!

ఎముకలు కుళ్ళిన యువతను కదిలించే అగ్ని పర్వతం

కంచు కాగడలా కాంతిని విరజిమ్మే క్రాంతి పథం

అతడే... వెంకట రమణయ్య అప్పల కొండల ముద్దు బిడ్డ

తెలుగు కవితా రథసారథి మహాకవి శ్రీ శ్రీ

అతనికివే ..నా అక్షర నీరాజనాలు....!


(శ్రీ శ్రీ జయంతి సందర్భంగా)

2 .

తేదీ :30/4 /21 -శుక్రవారం.

 అంశము: శ్రీ శ్రీ జయంతి సందర్భంగా ప్రత్యేక కవిత.

    శీర్షిక:   20వ శతాబ్దపు యుగకవి.

 పేరు  :మన్నె పిన్నక లలిత .

హైదరాబాద్ .

చరవాణి సంఖ్య: 741 686 32 89.

*********************************

 20వ శతాబ్దపు  యుగకవిగా 

తనని తాను ప్రకటించుకుని

 అప్పటికీ ,ఇప్పటికీ తిరుగులేని కవియై

 కవితా ప్రపంచాన తనకో 

స్థానాన్ని కల్పించుకున్న  యుగ కవి శ్రీ శ్రీ

' గుర'జాడ అడుగుజాడలే "గురు"జాడ లై

 ఆధునిక తెలుగు కవిత్వానికి 

మరో మార్గదర్శి  శ్రీ శ్రీ గారు

 "సిరి సిరి మువ్వల" పాదాలతో  నర్తించి 

తిమిరంలో నున్న సాహితీ ప్రపంచాన్ని

 విప్లవ  సూర్యుడై వెలుగు నిచ్చి

 "నేను సైతం ".......అంటూ

  అ.ర.సం సంఘం అధ్యక్షుడిగా 

వి.ర.సం స్థాపక అధ్యక్షుడిగా

 మడమ తిప్పని మహారచయితయై

 సినీ పాటలతో ఉర్రూతలూగించి

  విప్లవాగ్నులు కురిపించినా

 "పాడవోయి భారతీయుడా !"అంటూ 

దేశ భక్తిని ప్రబోధించినా

 "పువ్వుల్లారా !పాపల్లారా !!"అంటూ 

పిల్లలపై ప్రేమ కురిపించినా

 సిప్రాలి, మహాప్రస్థానం, కథలు ,

వ్యాసాలు ,విమర్శలు, సమీక్షలు

 మొదలైన లెక్కకు మిక్కిలి 

కవిత్వాలతో అలరించినా

 శ్రీశ్రీ  యుగంగా గుర్తింపు తెచ్చుకున్నా

 యుగం మారినా

 మారని శ్రీశ్రీ ..

 శ్రీరంగం  శ్రీనివాసరావు గారు!  యుగ కవీ!!

 వందనం! అభివందనం!!

3

అంశం.శ్రీ శ్రీ జయంతి సందర్భంగా కవిత

......

తన కవిత్వంతో విప్లవ భావాలను కూర్చి

సామాజిక స్పృహ కలిగినట్టి

కవిత్వంతో చైతన్యం తెచ్చిన మహామనిషి

అభ్యుదయ భావాలతో సినీగేయాలను రాసిన నేర్పరి

కవిత్వాన్నికి ఏమి అనర్హo కాదని వెలిగెత్తి  చాటిన కవిపురుషుడు

కలముతో శాసించి ప్రజల గుండెల్లో నిలిచిన నేత

శ్రామికుల కష్టాలను కళ్లకుకట్టినట్టు కవిత్వంలో ప్రతిద్వనిoచే నైజము

న్యాయం సమాతవ్వము కోసము అక్షరాలను జులిపించిన మహాకవి

మనసున్న మహా మనిషి

పేదల కష్టాలకు చలించిన మనిషి

కార్మికుల శ్రమను కవిత్వం కళ్లకు కట్టి మహామనిషి

దేశ ప్రగతి కి ఊపిరి ఇచ్చిన రచనా శైలి


ధనాశి ఉషారాణి

చిత్తూరు జిల్లా

భాకరాపేట

4

 వీరాస్ కవి సమయం సీజన్ -- 2 కొరకు 

------------------------------------------------------

మాకొరకు మరలా రావా 

*********************

కష్టాల ఎత్తు పల్లాలు చూపాడు 

ప్రాసలు , వ్యాకరణాలు వ్యతిరేకించాడు 

బాధను బహిర్గత పరచటం కవిత్వమన్నాడు 

శ్రమదోపిడిని బట్టబయలు చేశాడు 

రక్తపు ముద్దలు కరించుకొన్న శ్రామికుడి కన్నీరు చూపాడు 

ఎముకల బుట్టలు ప్రాణమున్న శ్రామికులన్నాడు 

అట్టడుగు బ్రతుకులను తెరమీదకు తెచ్చాడు 

కర్షకుల కష్టాల కడగండ్లను తెలిపాడు 

శ్రీ శ్రీ ఒక దార్శినికుడు 

నిజాన్ని మాత్రమే కవితగా మలచాడు 

అసత్య పదజాలాన్ని వాడనివాడు 

కూలీలకు పోరాటాన్ని నేర్పాడు 

బానిసత్వపు సంకెళ్లు త్రెంచు కొను బలాన్ని అలవరిచాడు 

మరలా పుట్టవా ! ఓ ! మహనీయుడా !

దారితప్పిన కూలిబ్రతుకులకు అండగా నిలవవా !

బడాబాబులు పేదోడి రక్తాన్ని డబ్బులుగా మార్చడం ఆపగా రావా !

అన్యాయాన్ని న్యాయమని అమ్ముకుంటున్న పెత్తందార్లను ఎండకట్టగా రావా !

రక్తం ఆవిరిగా మార్చేస్తున్న కాంట్రాకు విధానాలను ఎత్తించగా రావా !

మమ్ములను ఆదుకోవ మరలా రావా !

రచన : చేబియ్యం శ్రీనివాసరావు 

ఊరు  : గుజరాతిపేట , శ్రీకాకుళం 

చరవాణి : 7674055482 


        (శ్రీ శ్రీ జయంతి సందర్భముగా )


🙏🙏🙏

5

కవితాగానం

అంశం:శ్రీ శ్రీ జయంతి సందర్భంగా ప్రత్యేక కవిత

శీర్షిక:మహాకవి శ్రీశ్రీ

30-1-2021

పేరు:మద్ది. పుల్లారావు

ఊరు:నందిగామ

9951287113


1)


శ్రీశ్రీ అగ్ని కణం..శ్రీ శ్రీ చైతన్యం

బావ కవితల నుండి...బాధ కవితల వైపు


పండిత బాష నుండి.. పామర బాష వైపు

యతి,ప్రాసల నుండీ..యదార్ధత వైపుకూ


పదాలు పరుగులతో..పరవళ్ళు తొక్కాయి

కడుపు మంటల నుండి..కవితలు పుట్టాలని


పతితులకు ,భ్రష్ఠులకు..బాధలు పోవాలని

రాయుదును ఇష్టపది ..రామచంద్రుని తలచి


2)


రథచక్రాలొచ్చును...రక్షణనిచ్చుననెను

శ్రమైక  జీవనంలొ..సౌందర్యమున్నదనె


కార్మిక లోకానికి.. కళ్యాణమస్తనెను

విప్లవ పంధాలో..విజృంభణ గావించె


మరోప్రపంచమంత...మనదేనని పలికెను

వేధనలు లేనట్టి..వాదాలు చేసాడు


మహాప్రస్థానం తో...మహాకవిగా మారె

రాయుదును ఇష్టపది ..రామచంద్రుని తలచి


3)


విశ్వకళ్యాణాన్ని..వీక్షించగోరేను

సామాన్యుని మేలుకు..సత్కవిగ కృషి జేసె


ఖండికలెన్నో రాసె..ఖడ్గసృష్టిని తెచ్చె

చిక్కటి పదాలతో..సినీపాటలు రాసె


అభ్యుదయ బావాల..కారాధ్యునిగ నిలిచె

ఎర్రని ప్రపంచాన్ని.. ఎంతగానో యిష్టపడె


సాహితీ లోకాన..సామ్రాట్టుగా నిలిచె

రాయుదును ఇష్టపది ..రామచంద్రుని తలచి


-----------------

ఈ రచన నా స్వంతం

.........

మద్ది. పుల్లారావు

నందిగామ

5==

6

ఇంద్రవత్ రాహుల్: *🌸కవిత గానం🌸*

∴ ════ ∴ ❈ ∴ ════ ∴

*శీర్షిక :*  శ్రీ శ్రీ 


🌿🌿🌿🌿🌿🌿


   

*✳️💥శ్రీ శ్రీ💥 ✳️*


విశ్వ కవి గాంచే శ్రీ శ్రీ 

అక్షర యోధుడే శ్రీ శ్రీ 

మహా ప్రస్థానమే కదిలించే 

సాహిత్యంను ఇష్ట పడే 

పీడిత ప్రజలను మాయం చేసే 

దేశ భక్తిని గుండెలో పెట్టె 

అక్షర కిరణమే ఆయుధంగా 

భాష, వ్యాకరణంమే నానుగా 

పొత్తంను విడనట్టి శ్రీ శ్రీ నే 

కవిత వైతాళికుడిగా 

నవ యుగ అభ్యుదయ కవినై 

బడుగు వర్గాల కొరకు శ్రమించే 

అంధకారంను తొలగించే 

జ్ఞాన కాంతి జ్యోతినీ నింపే 

నవ కవి చైతన్య జయ బేరి 

విప్లవ కవన కుసుమాలను 

పండించేను ప్రజా కవి శ్రీ శ్రీ 

ఇవే వందనా నీరాజనాలు...

*ఇంద్రావత్ రాహుల్*

       కొత్తపేట్ 

    నిజామాబాద్ 

   9848054079

7

: *శ్రీశ్రీ* గారి జయంతి సందర్భంగా..


శీర్షిక: *వేగుచుక్క*


*శ్రీ* వాగ్దేవాక్షరాలలో గణ బద్ధ ఛ0దస్సులకు స్వస్తి చెప్పి,

మాత్రా బద్ధ ఛందస్సుకు 

*రం* గ వళ్ళులు అద్దిన తొలికవియై,

*గం* గా ప్రవాహ ఝరిలతో

మహా ప్రస్తాన గీతాలతో కదం త్రొక్కి,

అరాచక సంఘంపై, భారత దేశ వ్యవష్టపై

చరణాకోల ఝుళిపించిన విప్లవకవియై,

సాంఘిక అవసరాలను గుర్తించే

పద సంపదల గళ ప్రవాహాలతో

ముందుకు నడిచిన సిరిసిరి మువ్వ... *శ్రీశ్రీ*.

తెలుగు సాహిత్యలోక ముంగిట్లో ఓ సంక్రాంతి ముగ్గు-- *శ్రీశ్రీ*.


*జంపని శ్రీనివాసమూర్తి* ( *జలజ* )🦜

గుంటూర

8

 కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..శ్రీ శ్రీ జయంతి

శీర్షిక...అక్షరయోధుడు


వయసొచ్చినా పసివాడే

ఆవేశమున్నా ఆలోచనా శూరుడే

పసిప్రాయంలోనే

పద్యంతో సాహిత్యానికి శ్రీకారం

యువప్రాయంలో 

అభ్యుదయ కవిత్వరంగ ప్రవేశం

పీడిత ప్రజల పక్షాన నిలిచి

పాలక వర్గాలపై తిరగబడిన అక్షరయోధుడు

ప్రభవతో ఆరంభించి

మరో ప్రపంచానికి మార్గం వేసిన మహానుభావుడు

ఛ0దస్సులకు నూతన యవ్వనం ప్రసాదించిన మహాకవి

నవ్య కవిత్వానికి బాటలు వేసిన మార్గదర్శి

తెలుగు కవిత్వాకాశంలో శ్రీ శ్రీ వేగుచుక్క

మహాప్రస్థానంతో ఎర్రజెండా ఎగురవేసి

సాహితీ సామ్రాజ్యాన్ని అర్దశకం ఏలిన విప్లవకవి

శ్రమజీవికి బాసటగా నిలిచి

సమ సమాజ నిర్మాణమే ద్యేయంగా

జయభేరి మ్రోగించిన ఘనుడు

ఇరవయ్యో శతాబ్దపు సాహిత్యాన్ని శాసించిన యుగకవి

తెలుగు చిత్ర సీమలో

పాటలనెన్నో విరబూయించి

ప్రపంచస్థాయికి ఎదిగిన స్ఫూర్తిప్రధాత

 శ్రీ శ్రీ కవిత్వం ఉప్పొంగే తరంగం

యువతకు ప్రేరణ మంత్రం

9

 *కవితా గానం*

తేదీ:30-04-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

శీర్షిక: అతడే శ్రీ శ్రీ

****************†**

ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చి

విశ్వ సృష్టికి అశ్రువును ధారపోసి

భువన ఘోషకు వెర్రిగొంతుక నిచ్చానని 

తనవంతు బాధ్యతగా

ప్రపంచం బాధను తన బాధగా చేసుకున్న మహా కవి శ్రీశ్రీ!

నడిచే దారిలో వచ్చే అవాంతరాలకు సమాధానమిస్తూ పోతే

గమ్యాన్ని చేరలేవంటూ హెచ్చరించిన ప్రజా కవి!

గతం గాయాలను మర్చిపోయి

సాగిపోవడమే జీవితమనీ

జీవితం అంటేనే ఒక యుద్ధమన్నది మరవొద్దన్న కవీశ్వరుడు శ్రీ శ్రీ!

మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు ఒక్కరైనా ఉంటే బాగని

విప్లవాక్షరాలను హృదయాక్షరాలుగా మలచగలిగిన మనసు కవి శ్రీశ్రీ!


 వాడని సుమం...


వయసొచ్చిన పసివాడు

వ్యక్తికి బహువచనం శక్తంటాడు....


అభ్యుదయ భావాల

సాహితీ సారధతడు...


ఆధునిక భావాల

అక్షర మాల అతడు...


అల్పాక్షరాలతో

అనల్పార్ధాన్ని చెక్కే 

శిల్పి అతడు....


కాదేదీ కవిత

కనర్హమంటూనే

కుక్క పిల్ల సబ్బు బిళ్లను

అగ్గి పిల్లను వాడిన ఘను డతడు....


విప్లవ గీతాలకు ఆజ్యం

పోసిన అధునాత 

కవి అతడు.....


మాటలను శబ్దాలంకారాలతో

అల్లిబిల్లి ఆడి ప్రాసలకు పట్టం

కట్టిన వీరుడతడు.....


సాహితీ వనంలో విరబూసి

పరిమళాలను వెదజల్లు

 ఎన్నడూ వాడని సుమ మతడు....


(శ్రీశ్రీ గారి జయంతి సందర్భంగా) 

10

మొహమ్మద్. అఫ్సర వలీషా

ద్వారపూడి (తూ గో జి)


 జనావళికి కవితాహారావళి 

నందించిన ఝంఝామారుతం శ్రీ శ్రీ

కవితాకాహళి ఝుళిపించిన వాడు శ్రీ శ్రీ

విలయం ప్రళయం విలాసం విషాదం అనిలం అనలం 

మోదం ఖేదం ఏదైనా 

అతని భావం భాష్యం 

అనితర సాధ్యం 

దుర్భేద్యమైన ఆలోచనా దుర్గాన్ని బ్రద్దలు కొట్టిన వాడు శ్రీ శ్రీ

11

డా.నాయకంటి నరసింహ శర్మ

వనపర్తి


 శ్రీ శ్రీ జయంతి ప్రత్యేక కవిత

    * అణు విష్పోటన0 లా.....*

      🔥🔥🔥🔥🔥🔥🔥

భావ కవిత్వ సంకేళ్ళను ద్రేంచి

అభ్యుదయాన్ని అధిరోహించి

విప్లవ సంఖాన్ని పూరించి....

పేట్టుబడి దారుల దోపిడీ

వ్యవస్త పై సాహితీ సమరం సాగించి... కార్మిక, కర్షక, శ్రామిక

వర్గ బతుకుల్లో వేలుగులు ప్రసరి0ప జేసిన ఓ సాహితీ ఖడ్గ యోధా.... నీకిదే మా

స్పూర్తి వందనం....!!

కండలు కరిగించి.... రుధిరాన్నే

చేమటగా చిందించి... పండించే

సుఖాలను తేరగా అనుభవిస్తూ

స్రామికులకు అన్యాయం చేసే

పేట్టుబడి దారులఅన్యాయాన్ని

నీ వేడి, వాడి గేయ... కవితల

చక్రాల క్రింద నలిపి, నాశనం చేసిన... దీనజనుల వీర సైనికా

జయము-జయము....!!

సినీ వీనీలాకాస0లో..... నీదైన

గీతకాంతులప్రకాశించి...సంగీత

సాహిత్యాలకు...వన్నేతేచ్చిన

తేజో  నక్షత్రమా.... నీ కివే మా

అభినందన చందన సుమ గంధ వందనములు🙏🌷🙏


సాహితీ లోకానికి శ్రీ కరమోన

రించ బుట్టిన శ్రీనివాసా....

నీ చరిత అజరామర0!

 ఈ యుగం నాదని.... బోర విరుచుకు.... తలఎత్తిగర్జించిన

సాహితీ సింహమా.... నీకు మరణం లేదు... ఓక్కో కవిలో

ఓక్కో విప్లవాభ్యుదయకవితై

నీ ఉనికిని తేలుపుతూనే...

ఉన్నావు......!!... కోరాడ.

12

 *అక్షరనిప్పు కణిక..*🌸


అనవరత అక్షర పోరాటం

సాహితీవనంలో విరబూసిన 

అక్షర విప్లవకెరటం

సాహితీ యజ్ఞంలో ఎగిసిపడ్డ

నిప్పుకణిక 

క్లుప్తంగా తను తెలుగు 

సాహిత్య కథానిక..


శ్రామికుని ప్రతిరూపం తన అక్షరం

అది శ్రమజీవుల హక్కులకై సంధించిన శరం

కష్టజీవి కలల స్వప్నం తన కవనం

ఈ వనం అతడి అడుగులతోనే పావనం

శ్రమతత్వాన్ని జీవనతత్వంగా మార్చి

ప్రబోధించిన మేధోసాగరం

అది విప్లవజ్యోతుల ప్రజ్వలిత నగరం..


శ్రమదోపిడి వ్యవస్థపైన

కణకణమండే నిప్పుకణికయై

భగభగమండే అగ్నిజ్వాలయై

మిలమిల మెరిసే మెరుపుయై

ఫెళఫెళమని విరుచుకొనిపడే

అగ్గిపిడుగుయై,

అక్షరాగ్నిజ్వాలలై వ్యవస్థ గుండెల్లో

మండిన నిరంతర బడబాగ్ని..


తన కలం కలకాలం అగ్గిరవ్వల్ని

వెదజల్లిన శతాఘ్ని

అక్షరాల్ని ఫిరంగిలా పేల్చే అక్షర సేనాని

మూసధోరణిపై మండి పడి 

అక్షర బుల్లెట్లు కురిపించిన తుపాకి

అక్షరాల తనో విలక్షణ అక్షర సిపాయి..

( *మహాకవి శ్రీ శ్రీ.. జయంతి సందర్భంగా..* 

*సర్ఫరాజ్ అన్వర్..*✍🏻

14

 *మహాకవి* 

**********

*ఆ రవి' వెలిగించిన అక్షరజ్యోతులన్నీ*

*అఖండజ్యోతులై దారి చూపుతుంటవి*

*ఆతని కవిత్వాన్ని వర్ణించగా*

*తెలుగు భాషాపదాలు పోటీపడుతుoటవి* 


*కమ్యు'నిజాన్ని అభిమానించి*

*అక్షరాలను పదునైన ఖడ్గాలుగా మలచి*

*మహాప్రస్థానం సాగించిన సాహితీ ప్రచండుడు*

*ఆతని కవితాపంక్తులు నిత్య పారాయణాలు*


*ఆ విప్లవకవి పాటలతో అలౌకికానందమే*

*మహాకవి విరచిత గీతాలెన్నో ఎగిరే భావుటాలే*

*కొన్ని ఆ ముద్రకు భిన్న భావ పరిమళభరితాలు*

*ఆతని ప్రణయగీతాలు అబ్బుర కారకాలే*

*వ్యావహారిక పదాల ప్రతిధ్వనే జయధ్వానాలు*


*నిన్ను నిన్నుగా ప్రేమించుటకు*

*నీ కోసమే కన్నీరునించుటకు*

*నేనున్నా'నని పలికే తోడొకరుండిన*

*అదే భాగ్యము అదే స్వర్గము"*

*ప్రతి ఎద ఆలపించే హృదయoగమ గీతం*


*నా హృదయంలో నిదురించే చెలీ!*

*కలలలోనే కవ్వించే సఖీ! వంటి ఆరాధనలు* 

*ఆతని ప్రేమైక హృదయావిష్కరణలు*

*మనసుమొక్కపై ప్రసరించే కిరణాలు*


*పాడవోయి భారతీయుడా!* అని

*దేశభక్తిని చాటుతూనే*

*అనర్థకారక స్వార్థాన్ని తెంచుకొనుట*క్షేమదాయకం'అన్న సామ్యవాది*

*అక్షరసేనలను సన్మార్గాన నడిపిన మహారధి*


*తెలుగువారు నవజీవన నిర్మాతలు* 

*కలసి పాడుదాం తెలుగు పాట' అంటూ*

*స్వభాషాభిమానాన్ని చాటుతూ*

*తెలుగుపాటకు జాతీయ 'అవార్డు జాబిలి'ని*

*అందించిన ఆధునిక వచన కవితా చక్రవర్తి*


*బ్రతుకును కన్నీటిధారలలో బలి చేయకు'* 

*అని చైతన్యపరిచే కవితావెన్నెలల రేడు*

*సాహితీ చైతన్యకిరణం శ్రీ శ్రీ*

*లోతైన భావసంద్రం శ్రీ శ్రీ*

*ఉత్తేజభరిత కవిత్వం శ్రీ శ్రీ*

*ఉరికిoచే వచన సాహిత్యం శ్రీ శ్రీ*

*వల్లాల విజయలక్ష్మి*

*ఆలేరు*

15

 శ్రీ శ్రీ 


పీడిత తాడిత 

అణగారిన వర్గాల కోసం 

పతితులు బ్రష్టులు 

నిరుపేదలు నిర్భాగ్యులు 

ఆకలి తో అలమటించే 

అన్నార్తుల కోసం !!

అగ్ని పర్వతం పేలి 

పెల్లుబికే అగ్ని ధార 

శ్రీ శ్రీ కవిత్వం !!

ఉప్పెన లా సాగె 

అగ్ని కణికలు పదజాలం 

తెలుగు కవిత్వానికి 

దశ దిశ దిక్కు శ్రీ శ్రీ !!

భగ మండే ముండుటెడారిలో 

ఎర్ర మల్లెలు పూయించిన 

బానిస సంకెళ్లు తెంచే 

మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి 

మహా కావ్యాలెన్నో !!

కణ కణ మండే నిప్పుల కొలిమి

శ్రామికుని ఉక్కు కండరాలకు 

ఉష్ణ ఉగ్గుపాలు తాగించి 

విప్లవ శంఖం పూరించిన 

ధీశాలి ప్రజా కవి శ్రీ శ్రీ !!

కార్మికులు, కర్షకుల కోసం 

దావానలంగా సాగేదే కవిత్వం 

దున్నపోతు ప్రభుత్వాల 

గుండెల్లో పిడి బాకు శ్రీ శ్రీ కవిత్వం !!

భూస్వాముల, ధన మదాంధులతో 

ఎర్రటెండల్లో ఎర్ర జండాకు 

తన కవిత్వం తో సలాం కొట్టించిన ధీశాలి !!

సునామిలా వేలకొద్దీ 

కొత్త కొత్త కాలాల కు పదునుపెట్టారు 

ముళ్ల తోవే నడువు 

నిప్పు రవ్వలే ముద్దాడు 

కాలాలతో పొలికేక వెయ్ !!

భూమ్యాకాశాల నిండా 

అరుణారుణ కిరణాలు నింపు 

శ్రీ శ్రీ     శ్రీ శ్రీ        శ్రీ శ్రీ,,,,,,,,,,, 

కవిత్వమంటే శ్రీ శ్రీ దే 

అది అభ్యుదయమైనా విప్లవమైనా !!

అపరాజిత్

16

 ఆంజనేయులు సర్: అతని పేరు వింటేనే

మరో ప్రపంచం కదిలింది వస్తుంది


అతని అక్షరాలు కదిలేది కదిలించేది పాడేది ఆడించేది

పాటించేది పెనునిద్దుర వదిలించేదీ మునుముందుకు సాగించేది


అతని అక్షరాలు జన చైతన్య కేతనాలు అతను అక్షరాలతో చిరంజీవి

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ధారపోశాను కేక పెట్టాడు


నేనొక దుర్గం నాదొక స్వర్గం అని కవిత్వ దాహం తీరదు అని చెప్పాడు


నేను సైతం ప్రపంచాగ్నికి సమిధలను ధారపోశాను అన్నాడు


కవిత ఓ కవిత యువ కాశం అవశేషాల సుమ గీతంగా అల్లాడు


ఎచటికి పోతావీ రాత్రి ఆవలిగట్టు కు అని ప్రకటించాడు


ఎర్రజెండా నిగనిగలు హోమజ్వాలల భుగభుగలు

కాదేదీ కవిత్వం అనర్హం


అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కుక్క పిల్ల నీవైపే చూస్తూ ఉంటాయి


జగన్నాధ రథ చక్రాలను భూమ్మీదికి రప్పించి భూకంపం పుట్టించిన వాడు


1930 నుండి ఇ తెలుగు కవిత్వం నన్ను నడిపిస్తే 1930 నుంచి తెలుగు కవిత్వాన్ని నేను నడిపించాను అని రాయించాడు


పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంపై హేమం

పిండిన రైతుకు అని శ్రమకు ఖరీదు కట్టే షరాబు లేడని 

ఘోషించే గొంతుక శ్రీశ్రీ


అక్షర లక్షాధికారి ఎప్పుడు చిరంజీవి రెండు శ్రీల ధరించి న శబ్ద విరించి


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453

17

 పరాంకుశం. రఘు నారాయణ గారు: సాహితీ చైతన్యకిరణం శ్రీ శ్రీ

________________________


రుధిరాశ్రువులే శ్రీ శ్రీ కవనo సాహితీ కుసుమాలు!


 కార్మిక కర్షక స్వేద బిందువులే

 శ్రీ శ్రీ కవిత్వ పతాక శీర్షికలు!


 శ్రమైక జీవన సౌందర్యంలో


తేలియాడే కవన కుసుమాలు!


దుర్మార్గాన్ని దునుమాడిన సాహిత్యపు అలల కెరటాలు!


అభ్యుదయ ప్రస్థానమే ఆయన తొలి అడుగు!


అచేతనత్వానికి నవ్యతను తొడిగిన ఆయన మలి అడుగు!


 శ్రీ శ్రీ కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఓ.. ఆయుధం!


 హృదయాంతరాలలో గుచ్చుకునే సుతిమెత్తని శూలం!


సామాజిక చైతన్య బావుటా నెగరేసిన విప్లవోద్యమ కెరటం!


 ఆయన సాహితీ సేద్యం ఫలాలు,

 

సమతా మమతలు పంచే పరిమళాలు!


మహాప్రస్థానం వచన కవిత్వo!


ఆయన భావుకతకు సంపూర్ణ దర్పణం!


 తెలుగు భాషా సౌందర్యాన్ని అలవోకగా వెదజల్లుతూనే,


అలలను పోలిన అలజడినే సృష్టించాడు!


దోపిడీ మూకలపై వాగ్బాణాలే కురిపించాడు!


 అరుణోదయానికి 

నిచ్చెనలెన్నో వేశాడు!

పరాoకుశo రఘు నారాయణ

జిల్లా:మహబూబాబాద్

18

 రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి

అంశం :శ్రీ శ్రీ

శీర్షిక :మళ్ళీ పుట్టవూ!!!!


 గత వైభవాలు చెప్పుకు మీసాలు మెలేసే 

 చరిత్రల ఇసురుల కింద

 పేదవాడి కడుపు కరువు

 నువ్వు చెప్పిన జగన్నాథ రథ చక్రాల కోసం

 ఇంకా ఎదురు చూస్తూనే ఉంది

 నిజాన్ని విప్పి చెప్పడానికైనా

 మహాకవి మళ్ళీ పుట్టవూ!!!


నడుస్తున్న దేశచరిత్ర సమస్తం

అవినీతి పీడనా పరాయణత్వం

నీతిమరచిన గుండెగుండెల్లో

కొత్త నెత్తురు పోయాలి

మహాకవీ మళ్ళీ పుట్టవూ!!! 


 నరనరాల్లో నీవు నింపిన

 విప్లవ సిరా 

 రంగు మారిపోతోంది

 మహాకవీ మళ్ళీ పుట్టవూ!!!


 కదిలేదీ, కదిలించేదీ,

 పెనునిద్దుర వదిలించేదీ

 వ్యవస్థను ఉతికారేసే 

 మరో మహాప్రస్థానం రాయాలి

 మహాకవీ మళ్లీ పుట్టవూ!!!


 అరుణాస్వామి గారు: వచనకవిత


కళ్ళంటూ వుంటే చూసీ

వాక్కుంటే వ్రాసీ

ప్రపంచమొకపద్మవ్యూహం

కవిత్వమొక తీరని దాహం


తల్లిలేని కుక్కపిల్లా,

పుచ్చి పోయిన అగ్గిపుల్లా,

కరిగిపోయే సబ్బుబిళ్ళ

కాదేదీ కవిత కనర్హమని

కొత్త ఒరవడి నేర్పించాడు

మహాకవి శ్రీ శ్రీ


వెయ్యేళ్లు అవ్యాహతంగా సాగిన

సాంప్రదాయ కవిత్వానికి

చరమ గీతను పాడిన గురజాడ

అడుగుజాడల్లో

రథాలు, గుర్రపుబళ్ళు,పల్లకీలు వెళ్ళేదారిని తప్పించి

మోటార్లు, రైలుబళ్ళు తిరిగే

ఆధునిక కవిత్వానికి రహదారులు పరిచాడు


అలంకారాలు, ఉపమానాలతో పనిలేని

ఛందో రహిత కవిత్వానికి తెరతీసిన మహనీయుడు

సంకెళ్లను తెంచి స్వేచ్చా భావాలకు కొత్త ఉపిరులూదిన ధన్వన్తరి శ్రీ శ్రీ


నేను, నాదేశం అనే భావన ఉండాలే కానీ

పక్కదేశాల్ని కొల్లగొట్టి ఆక్రమించడమో, 

పొరుగు దేశాల్ని దోచుకోవడమూ కాదని

అంతర్జాతీయ దృష్టితో

మహత్తర కర్తవ్యాన్ని గుర్తు చేసేదే మంచి కవిత్వమని

నిరూపించిన నిరుపమానగిరి


అందమైన అబద్ధం కన్నా

నిష్ఠుర నిజాలే సమాజ హితానికి హేతువులని

గాఢంగా నమ్మిన ఆధునిక కవి శ్రీ శ్రీ


కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికబాధ

ప్రపంచ బాధ అంతా శ్రీ శ్రీ బాధ

అని అన్నారో మహానుభావుడు

 

దురాగతాలను ఖండించేది

వర్ధిష్ణులను దీవించేది

యువతను ఉర్రూతలుగించేది

పాలకులను శాసించేది

దేశాన్ని రక్షించేది

 ఆ సిరాచుక్కలు మాత్రమే

  ✍రాపోలు అరుణాస్వామి,

            సిరిపురం

19

: అంశం : " శ్రీ శ్రీ "


రకతాన్ని సిరాగా జేసి

సిరా రంగు ఎరుపు జేసి

ఎరుపులో మెరుపు జూపి

మెరుపులో గెలుపు జూపి


పేదరికం కన్నీటికి

నెత్తురు తోడుగ జేసి 

కొత్త టానిక్ పుట్టించి 

కవితా కలంలో ఎక్కించి 


కండ బలం కరువైనా

గుండె బలం చెరువైనా

బేజారైన గుండెల్లోని

ఏదో తాజా శక్తి సృష్టించి


అంతా నీ ఆలోచన 

వింతా ఈ సాలోచన ... !

జోహారులు శ్రీ శ్రీ 

నీకు

జోహారులు మా మేస్త్రీ ...


ఇంకి పోయిన ఏరు

పైరు పంటలు బావురు 

ఇసుక దిబ్బల గొల్లు 

ఏది రాసిన నీకె చెల్లు ...


దిగుడు బావి దిగులు 

ఇనుప గంటల నవ్వులు 

అక్షరాల అరుపులు

నీ కలం పిలుపులు


ఉగ్ర కవితలు సృష్టించి

ఉగ్గు పాల అగ్గి కవితల శ్రీ శ్రీ 

అక్షరం నీ ఆయుధం 

అతి ఖచ్చితం నీ మనో రథం ...


నాకు నచ్చిన శ్రీ శ్రీ 

జనం మెచ్చిన శ్రీ శ్రీ 

నమో నమో శ్రీ శ్రీ 

నవ నవ కవీ శ్రీ శ్రీ ...


      ... ✍ "కృష్ణ"  కలం

20

అంశం.. మహాకవి శ్రీశ్రీ 

తాతపూడి సోమశేఖర శర్మ 

యానాం, 8328079336

శీర్షిక.. ఆధునిక సాహిత్య యుగకర్త 

🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹


మానవీయత గల మహనీయుడు 

మరో ప్రపంచానికి మాననీయుడు 

మహాప్రస్థానానికి మహానుభావుడు 

మూఢవిశ్వాసాలు అరికట్టిన మగధీరుడు 


మైలురాయి అతడు ఆంధ్ర సాహిత్య 

చరిత్రలో 

మానవత్వాన్ని మేలుకొలిపిన తారా 

పథమతడు 


తెలుగు సాహిత్యాన్ని శాసించిన 

మహోన్నతుడు 

తెలుగు సాహిత్య సౌరభంలో వెలుగు 

ఇచ్చే దివ్వె అతడు 

తెలుగు కవిత్వ మధురిమలో తిరుగు 

లేని చుక్క ఆతడు 

తెలుగు కవిత్వాకాశంలో నిండు పున్నమి చంద్రుడు ఇతడు 


భావకవులందరికి మార్గం చూపిన 

మార్గదర్శకుడు ఇతడు 

భావయుక్తమైన రచనలతో పాత్రలకు 

ప్రాణంపోసే బ్రహ్మ ఇతడు 

బాటసారి జయభేరి ఆకాశదీపం 

ఆశాదూతలు వంటి రచనలతో 

భావనతరంగాలు వెదజల్లే 

కవిపుంగవులు వీరు 


ఆధునిక సాహిత్య కర్తగా 

అభ్యుదయ కవితాకుసుమంగా 

అక్షరవికాసానికి సాహిత్యజ్యోతిగా 

అక్ష్రమాలను సాహితీవనంనుండి 

అపురూపంగా తెచ్చి ప్రజలకందించిన 

మహాకవిపుంగవులు  మహోన్నతులు 

తన ఇంటిపేరు తనపేరులో శ్రీశ్రీ లు 

ఇముడ్చుకుని ఆపేరునే సార్ధకం చేసుకున్న  ఓ కవిశేఖరా !

శ్రీరంగం శ్రీనివాసరావు నామధేయా !

మీకు మా నమస్సుమాంజలులు !

 🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹


ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతాపూడి సోమశేఖర 

శర్మ, యానాం, 8328079336

21

అంశం :శ్రీ శ్రీ 


శీర్షిక :విప్లవ ప్లవం 


సాంప్రదాయశైలిలో *ప్రభవ* మైనా 

వాడుక భాషకు గొడుగు పట్టి 

ఛందస్సు లో బందీ కాకూడదన్న

నవ్య రీతుల హేతువాదతడు


శ్రామిక సేద్యం కార్మికస్వేదపు

రుధిరాక్షరాలప్రస్తావనలో

దోపిడీ సమాజాన్ని

ప్రశ్నించిన

మహా ప్రస్థానమతడు


వాస్తవికత వస్తువు గా

అభ్యుదయవాదమే వేదంగా 

సిద్ధాంతాల రాద్ధాంతాల తో సమ్మిళితమైన విప్లవ ప్లవమతడు


ప్రపంచబాధను సిరాలో ఒలికించి

మరో ప్రపంచం పిలిచిందంటూ

మార్పు కోసం మాటలతూటాలనెక్కుపెట్టిన

అక్షరఫిరంగియతడు


పీడితతాడితగుండెలను

కదిలించ

నేను సైతమన్న ఉత్తుంగతరంగమతడు

శ్రీ శ్రీ గా స్థిరమై నిలిచిన శ్రీరంగశ్రీనివాసుడతడు


*******లలితాకృష్ణ

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...