Skip to main content

ధరిత్రీ దినోత్సవం 2021/4



నిర్వహణ_

శివునూరి లలితా కృష్ణ

*****"

1.రవి కుమార్ కంచి

2.అపరాజిత్ గారు

3. డాక్టర్ ఆంజనేయులు గారు

4. డాక్టర్ కందూరి సుజాత గారు

5. మన్నె లలిత గారు

6.కోరాడ నరసింహారావు గారు

7.ఇంద్రవత్ రాహుల్ గారు

8. విజయ లక్ష్మి గారు

9.నీలా రంగనాధం గారు

10.మర్రి జయశ్రీ గారు

11. సునంద వురిమళ్ళ గారు

12.విజయ దుర్గ గారు

*******


_'ధరిత్రి దినోత్సవం సందర్భంగా'._

1

    _*"అమ్మ కోరిక"*_

         -రవికుమార్ కంచి,   

           9494345594.


  🌏-🐨-🌴-🕊️-💦


       నువ్వు నాపై బాకుతున్నప్పుడు,

 గొరగొర నీ శరీరాన్ని ఈడ్చుతున్నప్పుడు,

  నియంత్రించుకోలేని పసితనం,

 దెబ్బలు తగిలితే ఆగలేవు,

  అయినా కదలకుండా ఉండలేక చిరు కోపంతో 

 నువ్వు నన్ను 

 కొట్టినప్పుడు,

తన్నినప్పుడు 

నాకు నవ్వొస్తుంది...

నేనేం చేశాన్రా..!!


సరేగాని

 నువ్వైనా పెద్దోడివై    

నా హరితహారాన్ని 

పచ్చని ఆకులతో 

రంగుల పూలతో నింపరా...


జల జల పారే

జల పాతాలను, అమాయకంగా నిలిచిన సరస్సులను 

 చల్లగా తెల్లగా నిలపరా...


నీలాగా బుడిబుడి అడుగులు వేసే వన్యప్రాణుల ప్రాణాలు స్వేచ్ఛా వాయువై నడపరా...


నువ్వు..

 నీ తర్వాతి వారు కడుపునిండా పీల్చే ఉల్లాస గాలులు,

 సంతోషంగా బుక్కెడు తిని బతికే వాతావరణం నిలబెట్టరా...


అమ్మనురా...!

నీకే కాదు 

మీ అమ్మకు నాన్నకు కూడా...!


వారికీ.. 

వారు నీ అంతున్నప్పుడు ముద్దుముద్దుగా ఇలాగే చెప్పాను..

 నా మొర ఆలకించే తీరిక వారికి ఎక్కడిది,

 నా బాధ మనసుకెక్కే సమయం వారికి ఎక్కడిది..!?


దినదినం మసిబారి పోతూనే ఉన్నాను,

క్షణక్షణం గుల్లబారి పోతూనే ఉన్నాను,


ఈ బాధ నా గురించి 

కాదురా నాన్నా...

మీ ఊపిరి గురించి 

నా బాధ

మీ మనుగడ గురించే 

నా తాపత్రయం..


నువ్వైనా వినరా...!

మాతను.. భూమాతనురా..


మరో ప్రత్యామ్నాయం కూడా నేనేరా 

చిట్టి కన్నా...

నువ్వైనా ఈ అమ్మ కోరిక తీర్చరా...


-రవికుమార్ కంచి,  

  ఉపాధ్యాయులు,

  9494345594.


    ___🌴🌏🙏___

2

22/04, 8:13 PM] Aparajith: హిమగిరి సొగసులు!


సొయగాల హిమగిరులు 

అందాల ప్రకృతి కాంత

ఆకుపచ్చ రంగు చీర సింగారించుకున్నట్లు 

రంగు రంగుల పూదోటలు 

మత్తిలు గుభాలింపులు!

హిమవన్నగాల పైనుండి 

వెండి వెన్నెల కాచినట్లు ఎండపొడ!

ఎర్రని పూలు పూచినట్లు 

ఆపిల్ పళ్ల తోటలు 

కుంకుమ పూదోటల అందాలు!

తేయాకు తోటళ్లో భామినులు 

మబ్బులు నిండిన ఆకాశం 

మంచు తెరల కొండలు 

మనుషుల అలికిడికే 

ఉలిక్కిపడే సొగసులు!

విరిసిన కమలాలతో సరస్సులు 

ఆ హిమంలో ఎగిరే విహంగాలు 

అందం ఆరబోసినట్లు 

సొగసైన పర్వత శ్రేణులు!

నదీ నదాల సెలయేళ్ళ పరవళ్లు 

పూవై విరిసిన చందనాల చల్లదనం 

కోటి పూల తివాచీ పరచినట్లు 

మంచు పర్వతాలు!

కాశ్మీరం కన్యకయై నర్తించినట్లు 

మానవుల పాలిట కల్పతరువు 

ఉన్ని దుస్తులు దుప్పట్లతో 

మనుషులపై మమకారంతో 

దివినుండి భువికి దిగినట్లు 

హిమగిరి సొగసులు!

అవన్నీ నేడు రక్తసిక్తమాయె 

మానవుని కుటిల మనస్సుకు 

గాయపడ్డ హిమవన్నగం 

దశాబ్దాలు గడిచినా 

రక్తపుటేరుల హిమగిరులాయె!

రుధిర శిఖరాల సాక్షిగా 

ముష్కర మూకల సంచారం!

రక్తఖచిత శిఖరాలు 

భారతమాత కళ్ల నుండి 

ఎర్రని హిమపాతం!!

దరిత్రికి సేదదీర్చు హిమవన్నగం 

మునుపటి దినాలతో 

ముద్దులొలుకు మువ్వన్నెల పతాకం 

హిమాలయాల నిండా ఎగరాలనీ!!

దుర్మార్గపు చొరబాట్లను 

ఆక్రమణల అగచాట్లను 

తరిమి తరిమి కొడదాం!

మన వీర సైన్యం సాక్షిగా!!


ఆపరాజిత్్

3


[22/04, 8:22 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఇప్పుడు మనిషి అస్తిత్వం గొప్పదే

మనిషి సర్వ శక్తులతో పోరాడుతున్నాడు ప్రకృతి ముందు అలసిపోయాడు


చేతులెత్తేశాడు ఏ ప్రకృతి లో నుంచి రక్షణ పొందాడో ఇప్పటికీ ఆ ప్రకృతి ఇంత విధ్వంసం చేసిన అతని రక్షణ కోరుతూ 


సకల జనులకు ఈనాడు కరోనా నుండి తప్పించుకోవడమే ముఖ్య అస్తిత్వం అయ్యింది


విపత్తు కాలంలో లో ఈ ఆస్తులు ఈ భౌతిక సుఖాలు కోల్పోతున్నామని చింతన మరొకవైపు

విశాల దృక్పథంతో మనం మనోవిజ్ఞాన ఆధ్యాత్మికత మనకు జీవన శిక్షకులు



మృత్యువు ఎప్పుడో ఒకసారి అనివార్యత గా అడుగు పెడుతూనే ఉంటుంది అది జీవన లయలో భాగం



వ్యాక్సిన్లు మన రక్షకుడు అన్నారు

రామబాణం అని ప్రకటన


శాస్త్రవేత్తలు పరిశోధకుల నిత్య శోధనలు వ్యాక్సిన్ కృషి మనకు అందుతూనే ఉంటుంది

సామాన్యుల అందరికీ అందిన రోజు వారి కృషి ధన్యమవుతుంది


ఇప్పుడు జీవిస్తున్న ఈ సమయం శాశ్వతం అనుకోవాలి రేపటి గురించి విచార పడకూడదు ఏమవుతుందో ఎవరూ చెప్పలేని jadalu


ధైర్యం కాకుండా ధైర్యంతో జీవించడం మనం నేర్చుకోవాల్సిన మనోవిజ్ఞాన


ఈ వేళ పక్షుల కిలకిలారావాలు వినగలవు తున్నాను సంతోషం ఉదయ సూర్య కిరణాల స్పర్శ ఆప్యాయతను కలిగించవచ్చు గిలిగింతలు వెలిగించవచ్చు


అహంకారం వీడి స్వేచ్ఛ సీతాకోకచిలుకలు గా

మారుదాం మనుషుల మందరము ప్రేమ లోగిలిలో సాగిపోదాం


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

[22/04, 8:23 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: పుడమితల్లికి పురిటినొప్పులు కొత్త సృష్టిని పూరించాయి


ఈ ప్రకృతికి ఆగ్రహం కలగదు కలిగితే విశ్వ వినాశనం


మానవుడు తొలినాళ్ళలో దాచుకున్నది ఈ చెట్ల మాటున


ఈ ప్రకృతి అనేక పాఠశాలలకు నిలయం

ఎందరో ఋషులు ఈ పచ్చని చెట్ల మాటున జ్ఞాన ప్రబోధం గావించారు

ప్రకృతి నిత్య ఆరాధించడం


ఔషధాలకు సర్వస్వం


ప్రకృతి మనిషికి మనిషికి మధ్య ఆరాధనా భావాన్ని పెంచుకోమని చెప్పింది


విశ్వమంతా పర్వతాలు కొండలు నదులు వృక్షాల సమూహమే కదా


దండం పెడతాను దరిత్రి కి


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453

4

[22/04, 8:26 PM] కందూరి సుజాత Poetess: అంశం.. ధరిత్రి

శీర్షిక... 🌷ధాత్రి 🌷

...........  ..........   ........

ధాత్రి నీకు దండమే గుండెల్లో స్థానమే అడుగడుగున అందమే అగాధాలు 

నీ సొంతమే .

ధన ధాన్య సిరివే నిధి నిక్షేపాల రాశివే.


సూర్య చంద్ర రాజుల చెలిమితో 

పాలపుంత గ్రహాల గమనంలో 

నక్షత్ర తలకులలో అనుక్షణం ఆగకసాగే యాత్రలో అనంత కోటి ప్రాణులను 

నీ కొంగున నిలిపావు.

జెనని ధాత్రి  జేజేలు నీ జేత్రయాత్రకూ. 


యుగయుగాలు సమాప్తం  పరిభ్రమణం సమస్తం.

గతిమాలిన లోకము స్థితి నీది మార్చిన 

ఓపిక నీ వ్యవస్థ .

కక్ష్యనీవు దాటిన 

శిక్షలు ఎవరు సొంతము .

అవనిమాత నీచరణము ప్రణవనాదమూ


శూన్యంలో పయనిస్తూ ఆకర్షణ 

నీ అణువుల్లో దాచావు .

సప్తసముద్రా సప్తఖండాల సవ్వడులతో 

నిలిచావు. 

సంఘర్షణలెన్నున్నా సాగుతూనే ఉన్నావు  

అగ్ని శిఖలు నీ గుండెను కోస్తున్న 

ప్రళయాలు ప్రవాహాలు  

నీ ఉనికిని కదుపుతున్న తూకంవేసి కొలిచినట్లు చీకటి వెలుగులు  అందిస్తూ మనుగడను ప్రసాదింస్తావు.

పునీత భూమాతా ఘనపీఠం నీ సొంతం. 


పాలపుంతలో కొంతనే నీవైనా 

ఎన్నెన్నో వర్ణాలు మరెన్నో చిత్రాలు .

తరతరాలను తరలిరస్తూ చరిత్రలు 

లిఖిస్తావూ. 

నీ చేయిఅందుకొనెడీ అగ్రగణ్యుడు ఎవరు.?


కందూరి సుజాత రాణి 

రాజేంద్రనగర్, హైదరాబాద్ 

9392162822🌷

[22/04, 8:34 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: అమ్మ దరిత్రి

నీకు ఎంత ఓపిక ఎన్ని

బరిస్తా వు పర్వతాల గుండెలను లోయల వలయాలను


నదుల కెరటాలను


ఉప్పొంగే సముద్ర నోరును

తుఫాను బీభత్స వాన్ని


వాల్కనో యొక్క రాశులను


నీ గుండెలో ఎంత ఓపిక తల్లి దరిత్రి అమ్మ సహనశీలి వమ్మ

సౌభాగ్య కల్పవల్లి దరిత్రి 

దరిత్రి మాత నీ దేహం పై వర్ణాలు జనాలు వర్షాలు


అరణ్యాలు సమూహాలు వృక్షాల యొక్క గోడలు jadalu ఎన్ని భరిస్తా వమ్మ ఎంత ఎంత ఓపిక తల్లి నీకు


నీకు రెండు చేతులతో మీ పాదాల పై వాలి నమస్కరిస్తాను


సాష్టాంగ దండ ప్రణామములు తల్లి అమ్మ ధరణి ధరిత్రి


సదా నీకు పచ్చని స్వాగతం పలుకుతున్నాను


పంచ భూతాత్మకం నీలో ఉంది తల్లి సదా చిరంజీవిగా వర్ధిల్లు తల్లి ధరణి అమ్మ నీ ప్రేమ ఈ జనావళికి సదా అవసరం అమ్మ ఎన్ని విధ్వంసాలు చేసిన భరించి సౌఖ్యాలు కలిగించే మా తా ధరణి



ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ కవనం


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

5

[22/04, 8:34 PM] మన్నె లలిత గారు కవయిత్రి: కవితాగానం .

తేదీ :20/ 4/ 21 --గురువారం 

అంశము: ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా...

  శీర్షిక:  పాపం, శాపమై....!??

పేరు :మన్నె పిన్నక లలిత

 హైదరాబాద్.

*********************************************


 మన పాపాలే మన శాపాలై

 శాపాలు తాపాలై

 కనుపాపను కాటేస్తే 

పోగొట్టుకున్న కనుపాపకి చూపేదీ?

 ప్రాణవాయువును ఇచ్చే చెట్లు కొట్టి

 ప్రాణవాయువు కోసం

 పరుగులు పెడుతున్న ప్రజలు

 ఉండటానికి నీడ లేక 

 తాగటానికి నీరులేక

 ఓజోన్ పొర చిరిగి

 భూతాపం పెరిగి

 స్వీయ రక్షణ లేక

 అగ్నికి  శలభాల్లా 

మాడుతున్న మానవులు

 ప్రపంచీకరణ నేపథ్యంలో

 నవీన నాగరికతలకు పోయి

 ఉండటానికి బహుళ అంతస్తులున్నా

 నడవటానికి రహదారులు ఉన్నా

 పంట భూములను ,బీడు భూములు చేసుకుని

  కల్తీ ఆహారం,  కృత్రిమ గాలి,నీరు

 శిక్షించటానికి వస్తున్న భూగోళం!

  మనం బ్రతకటం కాదు 

భావితరాలని బ్రతికించు కోవాలి

 అందుకు కులమతాలు అక్కర్లేదు

 రంగు ,రూపు వద్దేవద్దు 

ఆడామగా తేడా లేదు

 చేయి చేయి కలపాలి

 కలిసికట్టుగా నడవాలి

 వేడికి గిలగిలా కొట్టుకుంటున్న 

భరతమాతను అన్ని చేతులు  

కలిసి సేద తీర్చాలి

 ధరిత్రీ దినోత్సవం సందర్భంగా

 ఆ ఒక్క రోజు ఉత్సవాలు 

చేసుకోవటం కాదు

 భరతమాత వద్ద ప్రతిజ్ఞ చేయాలి

 చేతికి ఒక మొక్క నాటుతాం

 వాన నీరు  బొట్టు బొట్టుా 

ఒడిసి పడతాం

 చేయి చేయి కలిపి ముందుకు సాగుతాం

 ఐకమత్యమే బలమని నిరూపిస్తాం

 భూగోళాన్నే రక్షిస్తాం

 ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని

 ఆనందోత్సవాలతో జరుపుకుంటాం.

6

[22/04, 8:41 PM] Korada: * ముమ్మాటికిది సత్యము *

      *******************

చంద్రుని నీ చుట్టూ తిప్పు కోనుచూ...సూర్యునిచుట్టూ...

నీవు తిరుగుతూ...,

కాల చక్రమును నిర్మించుకుని...

రేయింబవళ్ళు... తిదులు, రుతువులతో...జగతి జీవజాల

సృష్టి, స్తితి,లయముల ఉనికిని

కాపాడుతూ... నీ అస్తిత్వాన్ని

నిలుపు కుంటున్న ఓ ధరణీ..!

నీకివే...సవినయనమస్సుమాం జలులు...సాష్టాంగ పాదాభి వందనములు....!!

ప్రాణి కోటి పుట్టుక కు ఆధార భూతమైన నీవే మాకు తల్లివి!

మము పేంచి,పోషించిన తన్డ్రివి నీవే....!!

మము లాలించి, పాలించినీలోనే లయముజేసికోను సాక్షాత్తూ

సర్వేస్వరుడవు నీవే...!!!

నీవు లేని మేము లేము...!

మేము లేక... ఈ సృష్టి కి

అర్ధమై లేదు...!!

ముమ్మాటికినిది సత్యము...!

ఇదే... సత్యము....!!

  *********************

కోరాడ నరసింహా రావు...!

[22/04, 8:42 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: చీకటి విరబూసింది

తన నల్లని పువ్వులను ఈ వేళ నిండారా విరిసింది


ఆకాశం అంచుల దాకా అవన్నీ తలం లోగిలిలో

మర్రి చెట్టు దయ్యం లాగా విరబూసింది


వీధిలైట్ల ఆకాశంలోకి వెలుగులు విరజిమ్మిన చీకటి దట్టంగా భయంకరంగా చుట్టుముడుతూనే ఉంది వెలుగు సాహసి కదా

దాన్ని ఎదుర్కోవడానికి నిరంతర సాహసాన్ని ప్రదర్శించే చైతన్య దీపిక


అందుకే చీకటి జాడలను ఖండిస్తాం వెలుగు దివిటీ లను ఈ విశ్వమంతా వెలిగిస్తాము



రాబోయే కాలంలో చీకటి ముసుగులను చించి వేస్తాను అన్ని చోట్ల వెలుగు పతంగులను ఎగురవేస్తారు


అందుకే నేనంటాను కాగడాల వెలుగులో సాగిపోదాం అన్ని చోట్లకు వెలుగు చీకటి గొంతుపై విసిరి వేద్దాం


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

7

[22/04, 9:02 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం (సీజన్ -1)*

➖➖➖➖➖➖➖➖


*అంశం :*  ప్రపంచ ధరిత్రి దినోత్సవం 

*తేది :* 22/04/2021

*శీర్షిక :* పుడమి తల్లి 



  *🌍-పుడమి తల్లి-🌍*



నేలనే  జీవనం

నేలనే ఆధారం 

నేల విలువ మనిషికి తెలియదు!!..

మనిషి విలువ నేలకు తెలుసు

తన్నిన, అమ్మిన!!..

నా వాళ్ళు అనే భావన నేలమ్మది...!!

దీనిని సర్వనాశనం చేసే లక్ష్యం మానవుడిది...!!

నేలతో అవసరం

ఇంత అంతా కాదు సుమ!!..

బంగారు పంటలను పండిస్తూ! 

రైతుకు భరోసా నేనంటూ! 

తొక్కిన భరిస్తుంది!

తిట్టినా భరిస్తుంది!

నాశనం చేసిన భరిస్తుంది!.

అందుకే భూదేవి అంత సహనం ఎవరికీ లేదు!!..

ఉన్నా అన్ని రోజులు 

ఇది నా నేల ఇది నీ నేల 

అంటూ గొడవలు పడుతూ!!. 

మానవులు  కొట్లాడుకోవడం

నేలమ్మ అనుకునేది నువ్వు ఎంత కొన్నా ఎంత నాశనం చేసినా చివరికి మిగిలేది చివరికి నేను ఇచ్చేది ఆరు అడుగులే అంటుంది!!...



*హామీ పత్రం :* ఇది నా స్వీయరచన 



*పేరు :* ఇంద్రావత్ రాహుల్

*ఊరు :* కొత్తపేట్ 

*జిల్లా :* నిజామాబాద్

*మండలం :* నిజామాబాద్

*రాష్ట్రము :* తెలంగాణ

*చరవాణి :* 9848054079


      ధన్యవాదములు.. 🙏🌷

8

[22/04, 9:21 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *అమ్మ చెప్పింది*

******* *******

మట్టిని ప్రేమగా సేవించటం

భూమాతను పూజించడమే"నని

తప్పక చేయాలని *అమ్మ చెప్పింది* 

ఆ మట్టి పరిమళం ఎంత నచ్చేదో!

నేటికీ ప్రియమైన ఆ ఘుమఘుమల కోసం

మా చిన్ని ఇంటిస్థలంలో కాస్త మట్టితోనే నింపేసా!


ఇక్కడ పెరిగే మొక్కల నవ్వులను చూస్తూ

ఈ మట్టి మీద అపుడపుడు నడుస్తుంటే

చిన్నపిల్లలా మనసు గెంతులేస్తుంటది


మట్టితల్లికీ మన మీద పిచ్చి ప్రేమే

తన కడుపులో దాచిన అన్నిటినీ

అత్యాశతో మనం దోచుకుంటున్న

చిరుతిండ్లు కు ఆశపడే చిన్నొడిని చూసి

తల్లి నవ్వినటుల మన్నిస్తునే ఉంటది

కడుపును చల్లగుంచే చెట్లను చంపి

ధరణి కడుపును కాలిస్తే మాత్రం ఊరుకోదు

దుష్ట తనయులoటి మానవుల భరిస్తది గానీ

దొడ్డ వృక్షతరువుల కూల్చేస్తే సహించదు

మనం పోయాక గర్భాన దాచే ధరణీ మాత

మనను కడుపులోకి లాక్కుంటది భూకంపాలతో


గొడుగై రక్షించే చెట్లు లేకుంటే

పిడుగై పైన పడుతది ప్రకృతి

ధరణీ మాతకు అందిద్దాం స్నేహహస్తాన్ని

భూతల్లితో కొనసాగిద్దాం తరాల బంధాన్ని


: వల్లాల విజయలక్ష్మి

ఆలేరు

9


[22/04, 9:22 PM] Komandoori Neela Poet: కవితా గానం (సీజన్1)

పేరు:కె.ఇ.నిలమంగై

కలం పేరు:నీలా రంగనాధం

ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.

శీర్షిక: *పృథివి*

తేది:22/04/2021

చరవాణి సంఖ్య:8897155600.

*ధరిత్రీ దినోత్సవం సందర్భంగా రాసినది*


ఆ.వె1:ప్రాణవాయు విచ్చి ప్రాణాలు కాపాడు 

పచ్చనైన పృథివి నిచ్చ దీర

పాడు చేయు వారి భరతము పట్టిన

నీడ దొరక దింక నేడ నైన!


ఆ.వె2:అమ్మ వలెను గాచు యవని యందు నిలిచి

ధనపు మదము తోడ ధరకు యమ్మ

పచ్చ దనము గున్న పరువాల తల్లికి

స్వేచ్ఛ నొసగ వలయు నిచ్ఛ తోడ!


ఆ.వె3:ఒక్క మొక్కనైన నిక్కమై నాటిన

యిడుము లెన్ని వున్న యెగిరి పోవు

కన్న వారి వలెను కాపాడు నెప్పుడు

నేల తల్లి ప్రేమ నెరుగ లేము!


ఆ.వె4:ఎల్ల లేని ప్రేమ కొల్లలు గల తల్లి

కపటమన్న మాట కనగ లేము

స్వార్థ పరులు పెరిగి స్వప్రయోజనముకై

కాలదన్నినాను కాచు ధరణి!


ఆ.వె5:పంచ భూతములను పాడు పెట్టుచు నుండ

పృథివి బాధ పడుచు బొబ్బ లిడెను

పాడు లోకమందు పాపము హెచ్చగా

శాప మొసగె నిపుడు శాంత మూర్తి!


*ఈ పద్యాలు ఈ సమూహం కొరకే రాసానని హామీ ఇస్తున్నాను*


*నీలా రంగనాధం*

10.

[22/04, 9:28 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం...ధరిత్రి దినోత్సవం 

శీర్షిక...కల్పవల్లి




సమస్త జీవకోటిని 

భారమని భావించక మోసే అవని తల్లి

పచ్చదనంతో పరిఢవిల్లే కల్పవల్లి

మనిషి స్వార్థంతో

నాగరికత పేరుతో

కాసుల వేటలో

పుడమితల్లి దేహానికి ఎన్ని గాయాలు చేసినా

తన బిడ్డలమైన మనల్ని

అక్కున చేర్చుకొని ఆదరిస్తుంది

కులం మతం అంటూ

భేదాలు చూపని అవనమ్మ

ఆరంభం నుండి ఆయువు తిరేదాకా

అడుగడుగునా తోడుంటుంది

నేలతల్లి బాగుంటేనే కదా

జీవుల మనుగడ

కాలుష్యంతో ముంచేస్తే

ధరణి పై మనుగడ అసాధ్యం

జల సిరులతో కళకళ లాడుతూ

పంటపొలాలతో

పచ్చనికోకను చుట్టుకొని

జీవకోటి సమస్తానికి ప్రాణాధారమయ్యే భూతల్లి

నేడు  నెర్రలు వారి

నింగివైపే చూస్తుంది

కనుమరుగవుతున్న హరిత వనాలు

మానవుడు తను కూర్చున్న కొమ్మను తానే నరికివేసే దుస్థితికి కారణమై నిలిచే

భూతల్లి బాగుంటేనే కదా

మనం బాగుండేది

కంటికి కనిపించని కరోన లు

ఊపిరి పోసుకోకుండా

ప్రాణ వాయువు కోసం వెంపర్లాడకుండా

భావితరాలకు భరోసా నిస్తూ

వసుధ ఆయుష్షును పెంచే మొక్కల్ని నాటుదాం

ఆ  తల్లి  ఋణం తీర్చుకుందాం

10

*కవితా గానం* 

తేదీ:23-04-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: ప్రపంచ ధరిత్రి దినోత్సవం

 శీర్షిక: ఆమె భిక్షేనని మరవొద్దు

*********************

 ఆమె ఆగ్రహిస్తే

అనుక్షణం పట్టదు

కంపించిన కోపాగ్నికి కనబడకుండా పోవడానికి..

 ఎంతైనా తల్లి మనసు కదా

ఇంత కాలం క్షమిస్తూ వస్తోంది.

 ఎంత కాలమైందో..


ఆమె మోములో ఆకుపచ్చని చిరునవ్వులు మాయమై

అనాధలుగా మారిన అడవి బిడ్డల చూసి

ఆమె మనసు ఎంతగా క్షోభిస్తుందో..


గలగల పారే నదీ నదాలు

ఒట్టి పోయిన దేహాలతో

ఒళ్ళంతా రోగాలతో యాతన పడుతుంటే

ఎంతగా తల్లడిల్లి పోతోందో..


ప్రతిక్షణం  గొడుగై రక్షిస్తున్న ఓజోన్ పొరను

నిర్దాక్షిణ్యంగా చింపి వేస్తుంటే...

ఆమె ఎంతగా కుమిలిపోతుందో...


ఆమె భిక్షే మన జీవితమని మరవొద్దు..

 ఆమె చల్లని చూపులే మనకు శ్రీరామరక్ష

 ఆమె ఎదలో పొంగే పాల ధారలే

మనల్ని బతికించే జీవ జలాలు.

ఆమె తనువుకు మొలిచిన

తరవుల రెక్కలే

తన మీద బతికేందుకు ఇచ్చిన 

ప్రాణ దాతలు..

 ఆమె పుట్టిన రోజున 

మనమంతా కానుకగా ఏమివవ్వాలో తెలిసిందే..

 మొక్కలు నాటే మోములో

ఆనందాల్ని పల్లవింప చేయడమే.. 

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు

నడుం బిగించడమే..

12.

అంశం:" *ధరిత్రి దినోత్సవం

 సర్వ కోటి జీవరాశుల బరువును మూసేధరణి..

 సహనం, ఓర్పులో భూదేవీ.

. మంచిచెడులు

, జననమరణాలు నీలోనే

 సౌర కుటుంబంలో 

ప్రాణులున్న ఒకే ఒక గ్రహం

 ప్రకృతి అందాలు..... 

 కొమ్మలు రెమ్మలు కాయలు పూలు పండ్లు అందించే  చెట్లతో కళకళలాడుతూ

 సముద్రాలు, నదులు సరస్సులు, పుట్టిన ఏకైక ధరణీ

 పర్వతాలుకొండలు. కోనలు. మైదానాలతో మెరసి న భువి... 

 మానవజాతి మనుగడకు,  పండించేరైతు ఆహార పంటలకు మూలం నేల

జంతు జీవాలు క్రిమికీటకాలతో తళతళలాడే జగత్తు...

   పుడమీని, ప్రకృతిని, కాపాడుకుంటూ  పర్యావరణ పరిరక్షణ గూర్చి ప్రజలలోఅవగాహన కలిగిస్తూ  మన వంతు   కృషి తో

  *భూమాతను* *కాపాడుకొందాం.*..... *భావితరాలకు చల్లని*

 *దీవెనలను* *మన పుడమి* *అందించనీ.*...

*ధాత్రి నీకు వందనం*

*చల్లగా వర్ధిల్లాలి* 🙏🌷

సుగుణ మద్దిరెడ్డి

12

కవితాగానం

పేరు: విజయదుర్గ

కవితా శీర్షిక : ధరిత్రి

కవితా సంఖ్య: 45

తేదీ: 22/04/21

పచ్చని కోకతో అందంగా

అలరి

పుష్పాల జూకాలతో వయ్యారంగా

హరివిల్లు వర్ణాలతో

స్వచ్చమైన పవన ఒడిన తూగేను....!!

మానవుని అహంకార మూర్ఖపు

యోచనలో

కల్మష పాదులను తవ్వి

ఓజోన్ పొరలకు గాలాలు వేసి

చిల్లుల దొంతరలలో 

అధిక వేడితో మాడేను సర్వం.....!!


స్వ ధర్మం నాశనమయ్యి

ఎండిన భూమాత

కన్నీటిలో మునిగి ఉపద్రవాల వేటుతో

అతలాకుతలమే ప్రజానీకానికి....!!


ధరిత్రి రోజులే ఏటా

కొంతయినా లేదే వికృతి చేతలే తప్ప

తరువులను నాటి కాపాడుదాం

భావితరాలకు నందనవనం చేసి

అప్పుడే ధరిత్రి దినోత్సవానికర్ధం....!!

                              వినీల

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...