Skip to main content

శ్రావణ మాసం 2022

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
 వీరా గుడిపల్లి
***********
కవి వరుల జాబితా
1.అపరాజిత రెడ్డి గారు
2.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 
3.డా.బల్లూరి ఉమాదేవి గారు
4.కోరాడ నరసింహారావు గారు 
5.మద్ది పుల్లారావు గారు 
6.గజవెళ్ళి శ్రీ నివాసాచారి గారు 
7.దారల విజయ కుమారి గారు 
8.డా.సి.హెచ్.ఆంజనేయులు గారు 
9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 
10.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 
11.వేమూరి సత్యవతి గారు 
12.గొర్రెపాటి శ్రీ ను గారు 
13.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 
14.పొర్ల వేణు గోపాల్ రావు గారు 
15.డా.కమలా దేవి గారు 
16.ముత్యం వెంకటేశ్వర్ రావు గారు 
17.కవిత వెంకటేశ్వర్లు గారు 
18.అనుపటి రామ చంద్రయ్య గారు 
19.తంగిరాల నాగ లక్ష్మి గారు 

********
1
అంశం: శ్రావణ మాసం విశిష్టత 
శీర్షిక: అనుబంధాల శ్రావణమాసం 
పేరు ఎం ఆపరాజిత్ రెడ్డి 
ఊరు జిల్లా సూర్యాపేట 
చరవాణి 9848532031

రైతులు నాట్లుపెట్టిన వరిచేలు 
పొట్టకొచ్చి పచ్చగా కాంతులీనే మాసమిది!
భగవంతుడు కరుణిస్తే వర్షాలు మెండుగా 
కురిసే మాసం శ్రావణ మాసం!
పల్లెటూల్లలో అంటువ్యాదులు ప్రభలే మాసమిది 
కష్టజీవి రైతు మహిళలు బోనమెత్తి 
గ్రామ దేవతలను తమ ఇంటిల్లిపాదిని రక్షింపుమని వేడుకుంటారు!
వరాలొసగే వరలక్ష్మి దేవిని కొలుస్తూ 
సకల సౌభాగ్యాలతో తమ మాంగళ్య  బంధాలు పెనవేసుకుపోవాలని 
వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు!
సోదర సోదరీ బంధం పవిత్రమైనది 
తమ సోదరుడు విజయాలతో సంవత్సరమంతా 
వెలిగిపోవాలని రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు!
శ్రీ కృష్ణ జననం ఈ మాసంలోనే 
పల్లెల్లో ఉట్టిగొట్టే వేడుకలు పోటీలు పడి జరుపుకుంటారు!
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పాఠశాలల్లో కార్యాలయాల్లో 
బహు వేడుకగా జండా వందనం జరుపుకుంటారు!
గ్రామాలు దేశం సకల సంపదలతో ఆరోగ్యాలతో విలసిల్లాలని 
చేసుకునే పండుగల మాసం శ్రావణ మాసం!

ఆపరాజిత్ 

హామీ పత్రం: ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
2
అంశం :  శ్రావణమాసం 
శీర్షిక :   శుభాల నొసంగు మాసం
శుభాలనిచ్చు శుభమాసం
మగువులకు ప్రీతిపాత్రమైనది
సంస్కృతి సంప్రదాయాల పరిరక్షిణి
అచ్చ తెలుగు సంస్కృతికి ప్రతీకయైనది
శోభాయమానమై వెలిగే శ్రావణమాసం!
నవదంపతులతో కళకళ్లాడుతూ
నిత్య పూజలతో
అను నిత్య వ్రతాలతో
పతుల సౌఖ్యానికై సతులు  పాటించే వ్రతాలు తో
లోక కళ్యాణం కై జరిపే యజ్ఞయాగాదులతో
వరుణుడి ఆగమానంతో
పుడమి పులకరింతలతో
చిగుర్చిన లేతకొమ్మలతో
ప్రకృతి శోభాయమానమై విలసిల్లే పసిడి శోభిత మాసం
పండుగులు, పర్వదినాలతో
ప్రజ్వలించే మాసమే ఈ శ్రావణమాసం!
######
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
చరవాణి :7416638823.
.........................................
పై వచన కవిత నా స్వీయరచనే నని హామీ ఇస్తున్నాను.
3.
కవితా గానం (సీజన్3)
అంశము: శ్రావణమాసం 
శీర్షిక:పండుగల మాసం
డా బల్లూరి ఉమాదేవి
కామవరం/ ఆదోని
కర్నూలు జిల్లా
ప్రక్రియ:ఆట వెలది పద్యములు

ఆ.వె:శ్రావణమ్ము వచ్చె సందడి తాతెచ్చె
         చిటపట చినుకులకె చెట్లు మొలచె
         అంబరమ్ము నంటు సంబరమ్మొదవంగ
         నాడపడుచుల కిల హర్ష మయ్యె.

ఆ.వె:శ్రావణమరుదెంచ సతులకెల్లరకును
       సంతసంబు కలుగు జగతి యందు
     పాడ్యమి తిథి మొదలు పండుగలనుచును
     జరుపు కొనుచునుంద్రు సంబరాన.

ఆ.వె:సింధు రాజతనయ శ్రీలక్ష్మి రావమ్మ
       చంద్రసోదరీవు చంద్రవదన
     వరము లొసగునట్టి వరలక్ష్మి వేనీవు
    కొలువు దీరుమింట కూర్మి తోడ.

ఆ.వె:చారుమతియు నాడు చక్కగా నీవ్రతం
          బాచరించి బడసె భాగ్య రాశి
          నాటి నుండి నిదియు నవలా  మణులకెల్ల
           గొప్ప పండుగయ్యె కువలయమున.

ఆ.వె: సంతసమ్ము తోడ శ్రావణ మాసాన
           పౌర్ణమీ దినమున పడతు లెల్ల
          తోడ బుట్టువులకు తోరము లను గట్టి
        బహుమతందు చుంద్రు వసుధ యందు.
డా బల్లూరి ఉమాదేవి
కామవరం/ ఆదోని 
కర్నూలు జిల్లా.
4.
శ్రావణ మా... మావందనములు అందుకొనుమా... !
   కోరాడ నరసింహా రావు. 
      ****************
ఎడబాసిన ఆనందమును తిరిగి తెచ్చి ఇచ్చు శ్రావణివి !
సంపదలొసఁగఁగ, పడతులతో 
శ్రీలక్ష్మికి పూజలనే చేయింతువు 

కోరిన వరముల నొసఁగఁగ, వర లక్ష్మీ వ్రతమునూ జరిపింతువు!
పౌర్ణమీ పుణ్యతిధిలో వేద విధు లచే శాస్త్రబద్ధముగా యజ్ఞోప వీతమును ధరింపజేతువు !
  ప్రియమారగ తోబుట్టువులచే 
సోదరులకు వేడుకగా రక్షాబం ధన...అన్నదమ్ములచేఆడపడు చులకు కట్నకానుకలు ఎంత కనువిందౌ సందడి... !!
   శ్రీలక్ష్మీ మనోహరుడు శ్రీ కృష్ణు నిజన్మాష్టమి,ఉల్లాసముగాఅందరు ఉట్టె కొట్టు పండుగ.... 
 ఎన్నెన్ని వేడుకలు...ఎంతటి కోలా హలము !
భక్తి, శ్రద్ధలొకవైపు... కేరింతలు, 
తుళ్ళింతల ఆనందం ఒకవైపు!
జడపదార్థములవలేచలనరహి తులమైన మాలో... ఇంతటి 
చతన్యము నిచ్చిన శ్రావణ మా 
మా అందరి కృతజ్ఞతా వందన ములు అందుకొనుమా !
5.
[29/07, 4:59 pm] aparajith: చిత్రకవిత 

ఈ వర్షాకాలపు సాయం సంధ్య 
కారుమబ్బులు కమ్మి చీకటి పడే వేళ 
పొద్దస్తమానం వరి నాట్ల కూలీగా 
వళ్ళంతా హూనం హూనం అయి 
నెత్తి మీద నీళ్ళ కుండ చేతిలో నూనె డబ్బా 
కాయాకష్టం చేయనిదే బ్రతుకు గడవదు 
వానల్లో నాని ఎండల్లో ఎండుతూ !
గుక్కెడు మంచినీళ్ళు సుదూర తీరాల నుంచి మోసుకు రావాలి 
ఆకలి కుక్షులతో పిల్లలు అమ్మ కోసం ఎదురు చూపులు 
చాలీచాలని కూలీ పైసలు వంట నూనె ఇంటి సరుకులు 
మనిషిని పీల్చి పిప్పి చేసే జీవన పోరాటం 
చెట్ల ఆకులు రాలినా మళ్ళీ చిగురిస్తాయి 
మా కూలీల బ్రతుకులు ఎండిపోయిన గడ్డి పోసలు !
దిన దిన గండం నూరేళ్ల ఆయిస్సు 
కట్టుకున్నోడు కండలు పిండిచేసినా పొట్ట పోసుకోవడానికే కన్న తిప్పలు!
కష్ట జీవులు లేనిదే భూగోళం తన చుట్టూ తాను తిరగదు 
ఏ దైవమూ కరుణించడు సరిగదా 
కర్మ సిద్దాంతం నమ్మే దేశంలోకష్టజీవుల కన్నీళ్లకు 
ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎంత సేపు దేవుళ్ళ పురాణాలు వల్లె వేయడమే 
ఈ పూజలు పునస్కారాలు బువ్వ పెట్టావు గదా సారు!
ప్రకృతి ఒడిలో బిడ్డలం పంట పొలాలే మా దేవతలు 
ఈ భూమిపై పుట్టినందుకు మీకు మీ పిల్లలకు చాకిరీ చేసేవాళ్ళం 
ఈ అనగదొక్కబడ్డ జీవితాలు తిరగబడే రోజులు వస్తాయి 
మేము మనుషులం బానిసలం కాదు 
మీ నున్నని నాజూకు శరీరం మా భిక్ష 
ఆకాశంలో వెలిగే పొద్దు సాక్షిగా మీకు మీ వ్యవస్థకు రోజులు దగ్గర పడ్డాయి!
తస్మాత్ జాగ్రత్త!

అపరాజిత్ 
సూర్యాపే
5
maddi pullarao poet: కవితా గానం సీజన్ 3
తేదీ:29-7-2022
పేరు:మద్ది. పుల్లారావు
ఊరు:నందిగామ
చరవాణి:9951287113
శీర్షిక:శ్రావణకాంతులు
ప్రక్రియ:తేటగీతి పద్యాలు
.........
1)
ప్రకృతి శోభతో రైతులు పరవశించు
జలము నిండును మడులందు శ్రావణమున
 పనులు సాగును రైతుకు పల్లెలందు
పడుచు వారికందమునిచ్చు పరికిణీలు

2)

అమ్మ వారి పూజల తోటి యాలయాలు
మహిళలందరు రాత్రి సమయములందు
భక్తి తోడ గుడులకెళ్ళి భజన జేయు
కోర్కె లీడేర్చ మనుచును కోరుచుండు

3)
పట్టు చీరలు గట్టుచు పరిమళాలు
జల్లు పూలతో సుందర జడలు గట్టి
మెడలు జూడగ నగలతో మెరిసిపోవు
చూడ కళ్ళుజాలవుగద జూచుటకును

4)
శుక్రవారము రోజున శుద్దిజేసి
బూరెలరిసెలు పులిహోర,గారెలనుచు
వివిధ నైవేధ్యములతోడి ప్రేమమీర
అమ్మను కొలిచెదరతివలంత గూడి
 
5)

పూర్ణిమ దినము తోబుట్టువుల కు చాల
 సంతసించు రోజుగనుండు శ్రావణాన
సోదరుల చేతి రాఖీలు శోభనిచ్చు
గుర్తు చేయును సోదరి కోరికలను

.....
ఇది నా .స్వీయరచన

.......6
 గజవెళ్ళి శ్రీనివాసాచారి 
కాజీపేట
శీర్షిక: శ్రావణమాసం 
శీర్షిక: శుభాల మాసం 
...
శ్రావణమాసం 
శుభాలనొసగు 
మంగళకరమైన మాసం 

శ్రావణ సోమవారం 
శివుడికి అభిషేకాలైతే
పార్వతికి కుంకుమార్చనలు 

శ్రావణ మంగళవారం రోజు 
మంగళగౌరీ వ్రతం ఆచరిస్తే 
ముత్తైదువులకు కలుగు సౌభాగ్యాలు 

శ్రావణ శుక్రవారం 
వరలక్ష్మీ దేవికి పూజలు 
అష్టైశ్వర్యాలు 
ఆయురారోగ్యాలు 
అయిదవతనం ప్రసాదించు 

శ్రావణ శనివారం రోజున 
ఇలవేల్పు ఆరాధనలు 
సర్వ శుభాలనొసగు

శ్రావణ పౌర్ణమి రోజున 
హయగ్రీవుని పూజలు 
ఏకాగ్రత, జ్ఞానం, 
బుద్ధి కుశలత సిద్ధించు 

ఏ పూజలైనా 
ఏ వ్రతాలైనా 
కుటుంబ క్షేమంతో పాటు 
దేశ సంక్షేమము ముఖ్యమే
7
[29/07, 8:32 pm] దారల విజయ కుమారి poetess: కవితా గానం సీసన్ 3
అంశం : శ్రావణ మాసం
********************
శ్రీమహా విష్ణువుకు విశిష్ట పూజలు
లక్ష్మి దేవికి నచ్చిన నోములతో
ఆధ్యాత్మికత తొణికిసలాడే
శ్రావణ మాసం

సోమవారం శివార్పణం
రుద్రాభిషేకం.. బిల్వార్చనలతో
సమస్త పాప హరణం

ఏకాదశి ఉపవాసాలు..నాగుల పంచమి 
స్త్రీలకు సౌభాగ్యం ప్రసాదించే
మంగళగౌరీ.. వరలక్ష్మీ వ్రతాల మాసం

ఎడబాసిన కొత్తజంటలను
చేరువ చెసి
రైతన్నకు వర్ష ఋతువును కానుకిచ్చే
దక్షిణాయనపు పవిత్ర మాసం 

ఊరికో చిన్న కృష్ణుడు ఉట్టి కొడుతూ
వేడుకగా శ్రీ కృష్ణుని జన్మదినం 
అన్నా చెల్లెళ్ళ అనుబంధాలకు 
రాకీ బంధనం 

బానిస సంకెళ్లు తెంచుకున్న
మువ్వన్నెల జెండా..
రెపరెపలు నిండిన మాసం

ప్రతి కుటుంబ లోగిలీ 
బంధువులతో..భక్తి ప్రపత్తులతో కళకళలాడుతూ
ఆధ్యాత్మికత వెళ్ళి విరిసే
ఆత్మీయ మాసం..శ్రావణం

డా.దారల విజయ కుమారి 
8.
అతని కవిత

లయాత్మకం అతని పద చిత్రాలు శబ్ద సౌందర్యాలు

అతని కవిత నిత్యవసంతం
తెలుగు నాట అక్షరాల గవాక్షాలతో ఆరంభించిన కవి అతను

మార్పు నా తీర్పు తో చైతన్య గీతాలను పలికించిన గలం అది...

హనుమాజీపేటలో జన్మించిన రైతు బిడ్డ అతడు

తెలుగు మాట తెలుగు పలుకు తెలుగు కట్టుబొట్టు తన కవిత యాత్రలో

మానవతా కవితా వసంతం చైతన్య శీలం సినారే

ప్రతి పీఠికలో విశిష్టతను ఒక్క వాక్యంలో నైనా కొనియాడే భళారే

సినారె తెలుగు నాట మంటలు మానవుడు అన్న
నాగార్జునసాగర్ కర్పూర వసంత రాయలు

విశ్వనాథ నాయకుడు తన కవిత నిరంతర యాత్ర 
తాను కవిత్వం రాయని రోజు ఏసీలో కూర్చున్నావుకపోయిన రోజు అని పలికిన చలోకి నిజం

జ్ఞానపీఠాన్ని అధిరోహించిన తెలంగాణ సినీ కవి మావూరు మాట్లాడిందని మాండలికంలో ధ్వనించిన కవి రవి


డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ నాలుగు వాక్యాలు

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట

7702537453
9.
[30/07, 8:10 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్‌3 ) 30/7/2022/  శనివారము
నేటి : - అంశము "శ్రావణమాసము "
సీ ! శ్రావణమరుదెంచె సంతోషమలరించ
శ్రావణఘనతను చాటగాను

పాడ్యమినుండియు పండుగ లెన్ని యో
మాసమంతజరుపు  మహిళలంత

మంగళవారాలు మహిళలనోములు
శౌభాగ్యశోభలు సంతరించు

పౌర్ణమిముందటి  వర్లక్ష్మి వారము
శుక్రవారమనగ  శుభము లొసగు

ఆ ! సంప్రదాయములను సంస్మృతినిలిపెడి
మనకుదెలుపుమాస  మనగనెరుగు
మాసఘనతనెరిగి  మగువలుపాటించు
హారతులనుబట్టు  నతివలంత !
        తరణికంటి సూర్యలక్ష్మి.
                    ---------
106
[30/07, 8:21 pm] Thathapudi Somashekara Sharma: కవితా గానం (సీజన్ 3)
అంశం.. శ్రావణ శోభ
శీర్షిక.. శుభమంగళప్రదం
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

శ్రావణ మాసం శ్రావణ మాసం
సకలశోభలనిచ్చే ఈమధుమాసం
స్త్రీలుసౌభాగ్యంకోరే ఈమంగళమాసం
శ్రావణలక్ష్మీ కొలువైన ఈవరలక్ష్మీమాసం

పున్నమిచంద్రునివెన్నెలలో శ్రవణతారాప్రవేశం                 ఈప్రవేశకారణమే ఈశ్రావణమాసనామధేయం 
శ్రవణానందభరితమే ఈ అందాల శుభమాసం
సుసంపన్నభరితమే మగువలమాంగళ్యప్రదం 

వరలక్ష్మిశుక్రవారములు శ్రావణపున్నమి 
శ్రీకృష్ణజన్మాష్టమి ప్రతిరోజూపండగలవిరి 
శ్రావణమాసము ప్రతిరోజూ ఆనందఝరి 
శ్రావణశోభతోనిండే మధురానందసవ్వడి 

శ్రావణమంగళవారంనాడు ముత్తయిదువలందరు
అలంకరణలతో బొట్టుభరిణతో ప్రతికాంతామణిని 
పూజకు పిలుచుకు వచ్చే మంగళప్రదమైన వారం
శ్రావణశోభతో కళకళలాడే శ్రవణానందకర మాసం 
వరలక్ష్మీదేవివరాలిచ్చే ఈపసుపుకుంకుమలమాసం
స్త్రీలకు సర్వసౌభాగ్యలిచ్చే ఈశుభప్రదమైనమాసం


హామీపత్రం
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను . తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
11
[30/07, 8:28 pm] +91 98851 36308: శీర్షిక---మన శ్రావణమాసం!!


ముందురోజే పట్టుచీర కట్టి,బురదంటకుండా  కుచ్చెళ్ళుపైకిపట్టి..
వాన చినుకుల్ని తప్పించుకుంటూ  కుంకుమ పెట్టిసాగే పిలుపులు..
మంగళవారపు వాయనాల మూటల్తో ముత్తయిదువలు..
శ్రావణపట్టీలు తెచ్చే అత్తవారి రాకలు..
వరలక్ష్మీవ్రతానికి సిధ్ధమయేమామిడితోరణాల గృహాలు!!
పూలూ,పళ్ళూ,పసుపూ,కుంకుమ,గంధాల సేకరణలు..
పూర్ణంబూర్లూ,పులిహోరల పిండివంటలు..
సోదరీ-సోదరుల అనురాగస్వాంతాలు..
రాఖీపండుగలు-రక్షాబంధనాలు..!!
బుల్లి అడుగుల బాలగోపాలుడు వచ్చే
కృష్ణాష్టమి వేడుకలు-ఉట్టికొట్టడాలు..
ఇవన్నీ ఇపుడు రూపం మార్చుకుంటున్నాయి!!ఫోన్లో పిలుపులు-కొరియర్లో వాయనాలు..
వాట్సాపుల్లో ఆశీస్సులో,శుభాకాంక్షలో..
పేరంటాల్లో..పూజల్లో ఆధ్యాత్మికతేకాదు
పరిచయాలు-మానవసంబంధాలు ..
అక్షతలు,ఆశీర్వచనాల వెనుక
ఎదుటివారికి మంచినికోరే సుహృద్భావం..
శ్రావణం దేశభక్తి నింపే జండా-పండుగ తోడై
మనశ్రావణమాసం మనసులుమురిపిస్తుందికదా!!

డా.వేమూరి సత్యవతి.
12
[30/07, 8:29 pm] Gorrepati Srinu Garu Poet: కవితా గానం

అంశం : శ్రావణమాసం

శీర్షిక :

రచన : గొర్రెపాటి శ్రీను  

తెలుగింటి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే
వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసం లో నే వస్తుంది !
తోబుట్టువుల మధ్య సఖ్యత ని మరింత పెంచేలా
"రాఖీ పౌర్ణమి" కూడా ఇదే మాసం లో వస్తూ ..
శ్రావణమాసం ఎంతో విశిష్టమైన మాసమై నిలుస్తుంది !
లక్ష్మీదేవి ని శ్రావణ శుక్రవారాల్లో పూజిస్తూ
విష్ణు మనోహరి కరుణాకటాక్షాలు పొందుతుంటే
జీవితాలు సుసంపన్నమై
సకల సుఖ సౌభాగ్యాలు లభిస్తాయని
తెలుగులోగిళ్ళని అలంకరిస్తూ
మహిళలు వైభవంగా "వరలక్ష్మీ"వ్రతాన్ని నిర్వహిస్తుంటే
శ్రావణమాసం శుభమాసమై ఆనందాల ప్రసాదమై వర్ధిల్లుతుంది !

-13
[30/07, 8:37 pm] కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు Poet: అంశం....శ్రావణ మాసం.... 29/7/22
శీర్షిక... శ్రావణలక్ష్మి 
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు 
***************************************

పచ్చని మొలకల చిక్కని చేనులొ చక్కని చుక్క
సుస్వర జతుల మోహపు గతుల శోభన శోభతో
అడుగిడిన శ్రావణ మాసం

శ్రావణ లక్ష్మి సిరులొలికించి, జీవనమధురిమ చవి చూపించి బతుకును బతికే మరులను గొల్పు మహాలక్ష్మీ నమోస్తుతే

వ్రతములు చేసెడి వధువుల భావం ఇట్టేపట్టి
వరముల నిచ్చెడి వరప్రదాయిని వరలక్ష్మీ

శ్రావణ మాసం శుక్రవారములు చిత్తం నీపై నిలిపి
పాయసాన్నము పులిహోర ఎన్నో కమ్మని రుచులు ... 
వంటలు చేసి మహిళలు నిన్నే నమ్మి, నెమ్మిని
కొలిచి దండిగ మహా నైవేద్యం సమర్పించుకొను వేళ...

మనమున తలచి మనిషిగ బ్రతికే గుణముల
నొసగమని, మంచి తనానికి మారుపేరుగా,...... కోడలు అంటే కొరివి కాదని, ఇంటిలో వెలసిన
దేవతని, మెప్పును పొందే భాగ్యమొసగమని, కోరిన వెంటనే కోర్కెలు తీర్చే భాగ్యలక్ష్మి .

మగువల మనోరథం మనోజ్ఞంగా మంజుల భాషిణియై మేధిని నిండుగ ఉండాలని ,
మంగళవారం మంగళ గౌరీ వ్రతములు చేసెడి వనితల వడవని కాంక్షల నీడేర్చు సౌభాగ్యలక్ష్మి 

సాయంకాలం చల్లని సమయాన సుదతులు, పేరంటానికి ముదితలను పిలిచి వాయనము
ఇచ్చిపుచ్చుకుని ,ఆహ్లాదంతో ఆనందంతో అలరారె అదృష్టం..., అతివలకు అతిథులకు అందించిన ఆనందలక్ష్మి భగవతీ నమో నమః

స్వీయ రచన:::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
14
[30/07, 8:51 pm] Porla Venu Gopala Rao Poet: *కవితాగానం (సీజన్-3)*
తేదీ: *30-07-2022-శనివారం*
అంశము: *శ్రావణ మాసం*
*************************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *పావన మాసం*
ప్రక్రియ: *పద్యము*
*********************
*(1)*
*శ్రావణ మాసము వచ్చెను*
*పావనమగు పర్వములకు పలికెను శుభముల్!*
*కావలసిన కోర్కెలకై*
*దీవెనలను పొందగోరి దేవుని వేడన్!*

*(2)*
*కరుణను కురిపించగ ఘన*
*వరలక్ష్మీ వ్రతము వచ్చె పౌర్ణమి ముందే!*
*విరివిగ ముత్తైదువులే*
*తరలిరి దేవిని భజించి తాంబూలముతో!*

*(3)*
*సోదర సోదరి ప్రేమను*
*సాదరముగతెలియజేయు సమయము వచ్చెన్!*
*సోదరి రక్షా బంధన*
*మాదరమగు పండుగేగ! మరువకుమెపుడున్!*

*(4)*
*మంగళ గౌరీ వ్రతమది!*
*మంగళవారములయందు మహిళలు జేయన్!*
*అంగనలకు మాంగళ్యము!*
*బంగారపు కన్యలకిక భర్తలు దొరకున్!*

*(5)*
*కృష్ణుని పుట్టిన రోజుగ*
*కృష్ణాష్టమి వచ్చునపుడు! క్రీడలు జరుగున్!*
*విష్ణుని యవతారముగా*
*కృష్ణుని పూజింతురపుడు గృహములనందున్!*
*************************
హామీపత్రము: *స్వీయరచన*
15
[30/07, 8:52 pm] +91 98710 96566: కవితాగానం (సీజన్ 3)
పేరు : డా.కమలాదేవి
తేది : 30-7-22
శీర్షిక : స్వాగతం
శ్రావణలక్ష్మికి స్వాగతం 
సుస్వాగతం
ఆషాడ అమావాస్యను సాగనంపి
వస్తోంది శ్రావణలక్ష్మి
గ్రీష్మానికి వీడ్కోలు 
వర్షానికి  ఆహ్లాదం
ముత్తైదువుల సౌభాగ్యం
రైతన్నల సంబరం
పసుపు నలందిన గడపలతో
కుంకుమ దిద్దిన గడపలతో
మామిడాకు తోరణాలతో
ముంగిట ముత్యాల ముగ్గులతో
శ్రావణ శోభలతో అలరారు
శ్రావణలక్ష్మికి స్వాగతం
సుస్వాగతం
శ్రావణమాస విశిష్టత లెన్నో
పర్వాల మయం
సౌభాగ్యాన్నిచ్చే
మంగళగౌరీ వ్రతాలు
వరాలనొసగే
వరలక్ష్మీపూజ
గాయత్రీ జప మాహాత్మ్యాన్ని తెలిపే
జంధ్యాల పౌర్ణమి 
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని
తెలిపే రక్షాబంధన్
అదే రాఖీ పౌర్ణమి 
శ్రావణ బహుళాష్టమి 
మన చిన్నికృష్ణుని జన్మదినం
కృష్ణాష్టమి జన్మాష్టమి పర్వం
బక్రీద్ ముస్లింల పండుగ
ఎన్నోవేడుకల లక్ష్మి 
శ్రావణలక్ష్మీ 
స్వాగతమమ్మా నీకు సుస్వాగతం
పట్టుచీరల గరగరలు
ఆభరణాల తళతళలు
పేరంటాల గలగలలు
వాయినాల సందడులు
అదే శ్రావణం 
పండుగల పర్వాల మాసం
అదే అదే శ్రావణం
అనుదినము పండగే
ఆనందాల పండగే
సంతోషాల సంబరమే
సౌభాగ్యాల పర్వమే
అదే అదే శ్రావణం
శ్రావణలక్ష్మికి స్వాగతం
సుస్వాగతం.
16
[30/07, 8:57 pm] +91 79978 40591: కవితా గానం (సీజన్ -3)
తేదీ: 30-07-2022
ప్రక్రియ: కవిత 
శీర్షిక: శ్రావణ మాసం విశిష్టత 

హిందువుల పవిత్ర మాసం శ్రావణ మాసం
ఏన్నెన్నో జన్మల పుణ్యఫలం
మరెన్నో జన్మలకు శుభప్రదం ఈ శ్రావణ మాసం
సోమవారములు రుద్రాభిషేకములు,
బిల్వర్చన చేస్తే అత్యంత శుభప్రదము
కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ మాసములు
మంగళ గౌరి వ్రతము చేసుకుంటారు
మాంగల్యానికి అధి దేవత మంగళ గౌరి
ఆ దేవతను తాము ఎప్పటికీ సుమంగళిగా
ఉండాలని కోరుకుంటారు భక్తి శ్రద్దలతో
ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు
ఈ సిరుల తల్లిని తమకు అన్ని విధాలా
మేలు జరగాలని పిల్ల పాపలతో
కలకాలం చల్లగా ఉండేలా వేడుకుంటూ 
భక్తిభావంతో హరినామ స్మరణ చేస్తూ
దివ్య మంగళ హారుతులతో శోభనిచ్చే 
నదీతీరాన మట్టి ప్రమిదలలో 
మహా జ్యోతులు వెలిగించి గంగమ్మ తల్లిని ఆరాధించి 
అధ్యాత్మిక ప్రవచనాలతో దేవాలయాలను దర్శించి
ఓం నమః శివాయ అను పంచాక్షరీ
మంత్రాన్ని జపిస్తూ ఆకాశమంత 
 భక్తి పారవశ్యంతో భజనలతో
జగతిని కాపాడే ఆ హరిహరులకు ప్రణమిల్లి 
శ్రావణ మాసం గొప్పదనాన్ని చాటుతారు భక్తులు! 
******************************
ముత్యం వెంకటేశ్వరరావు
గామాలపాడు పోస్ట్
దాచేపల్లి మండలం
పల్నాడు జిల్లా
చరవాణి: 7997840591
హామీపత్రం: ఈ రచన నా స్వీయ రచన
ఎటువంటి అనువాదం కానీ అనుకరణ కాదని
హామీఇస్తున్నాను
17
[30/07, 9:01 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం
అంశం:: శ్రావణమాసం
శీర్షిక:: పడతుల పండుగ
తేదీ:: 30.7.22...శనివారం

శశాంకుని నక్షత్రమే శ్రావణమాసము
శ్రావణమంటే శ్రవణము
నిత్య దైవనామ స్మరణము
శ్రావణము శుభపరిణామము

ఇంటి ముంగిట రంగవల్లులు
గడపలకు పసుపుకుంకుమలు
కొత్త బట్టలతో గృహమంతా శుభాలు
దేవీ దేవతలకు నైవేద్యాలు

మంగళవారాలలో గౌరీ నోములు
చేతులకు తోరములు
భర్తకు ఏ కష్టము రాకూడదని
ఉపవాసాలు
సిరి సందలతో కళకళ లాడాలని
వరలక్ష్మి వ్రతములు
మంగళ సూత్రాలు బలంగా
సౌభాగ్యముగా ఉండాలని
నోచిన నోములు నోచుకుంటు
వాయనాలు ఇచ్చుకుంటు
ముత్తైదువుల దీవెనలు తీసుకుంటు
వచ్చిన పండుగలను చేసుకుంటూ
అందరిని ఆదరిస్తూ
తల్లో నాలుకలా ప్రవర్తిస్తూ
సంసారము పిల్లా పాపలు
చల్లగుండాలని
అణునిత్యము దేవుళ్లను కొలుస్తూ తలుస్తూ
కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ
నాగుల చవితికి పాలుపోస్తూ
రాఖీ పండుగకు రాఖీ కడుతూ
కృష్టాష్టమికి కృష్ణుని పూజిస్తూ
స్వాతంత్ర్యమునాడు జెండా 
పండుగకు మురుస్తూ
ఇంటికి అంకితమవుతుంది
ప్రాణములో త్రాణమున్నంత
వరకు పాటు పడుతుంది
సుశీలగా భర్త మెప్పుకు
పొంగిపోతుంది ఇల్లాలు
అదే నిలుపుతుంది నిండు నూరేళ్లు!!
                 కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.     8309920625
ఈ కవిత నా స్వీయ రచన అని 
హామీ
18
[30/07, 9:21 pm] +91 99487 63053: ఆషాడమా నీకు వీడ్కోలు
తేటగీతిలో...

సాగనంప నాషాడాన్ని శ్రావణమ్మ
పావనంబగు పండుగల్ పానుపేయ
పూజసేయగాపడతులుపృథివియందు
శుభములెన్నియోగల్గించు  సాదరముగ.

అనుపటి రాంచంద్రయ్య

19.
అంశం; శ్రావణ మాసం
 ముందుగా అమ్మకు అన్నలకు శ్రద్ధాంజలి

శ్రావణమ్మున మాయమ్మ   సద్గ తులను
పొందె మరువ లేనుజనని పుణ్య మూర్తి
వమ్మ సౌభాగ్య  రాలివి  నమ్మ లేని
నిజము  ననువీడి వెళితివి  నీవు భువికి


నల్గు రన్నల పంపితి నమ్మ నీద
రికిని  తోడ బుట్టంగవారికినివాళి
నంద జేతునో తల్లి మన్నింప నాదు
తప్పులను కరుణన్ జూపు ముప్పు లేక

*************
1 శ్రావణంబున శుక్రవా రంబు నాడు
పడతులందరు గుమిగూడి పట్టు చీర
కట్టి  ఆభరణములలం కరణ చేయ
చందురునిసోదరివెలిగె చంద్ర కళల

2 పడతు లందరికిని ప్రముఖ మాసంబిది
శ్రావణమున పలుక  స్వాగ తంబు
శుభము లొసగు జనని సౌభగ్య వతులకు
శుక్ర వార లక్ష్మి  సుఖము లిడగ

3 మంగ ళముల నొసగు మంగళ వారము
నాడు లక్షణముగ వేడు కొనగ
గౌరి లోక మునకు గొంపోవు యాదేవి
వేద మాత మనల పేర్మి తోను
 4 శ్రావణంబున శుక్రవా రమరు దెంచె
సుదతు లందరు సేవింప శోభ లలర
వరమహాలక్ష్మి  వేడ్కతో వరము లొసగె
చారు మతిభాగ్యమేమని సన్ను తింతు
  

5 వర్ష ఋతువు లోను ప్రధమ మాసంబిది
చిన్ని  బాల కృష్ణ  వెన్న దొంగ
అష్టమి శుభ ఘడియ లందుద యించె గా
దివ్య లీల జూపె భవ్యముగను

6 అధిక ఫలము మీయు అచ్యుతుని కొలువ
శ్రావణ శని వార వరదు డైన
 వాసు దేవ పూజ భక్తితో జేయుడీ
 పరమ పథము నొసగు పావ నుండు

7 సోమవార నాథ సోమేశ్వరుడుగాచు
శ్రావ ణంబు నొసగు  సంపదలను
సర్వు లకును శుభము సర్వేశ్వరు భజన
చేయ సమయ మిదియె చేరి కొలుతు

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...