Skip to main content

ఆషాఢ పూర్ణిమ 2022

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
 వీరా గుడిపల్లి 
*****†********
కవి వరుల జాబితా
1.మేకల రామ స్వామి గారు 
2.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 
3.కవిత వెంకటేశ్వర్లు గారు 
4.గజవెళ్ళి శ్రీ నివాసా చారి గారు 
5.దారల విజయ కుమారి గారు 
6.డా.సి.హెచ్ . ఆంజనేయులు గారు 
7.అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు 
8.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 
9.వేమూరి సత్యవతి గారు 
10.డా.బల్లూరి ఉమాదేవి గారు 
11.జోషి పద్మావతి గారు 
12.మహ్మద్ షరీఫ్ గారు 
13.గొర్రెపాటి శ్రీను గారు 
14.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు 
15.ముత్యం వెంకటేశ్వర్ రావు గారు 
16.దీపక్ న్యాతి గారు 
17.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 
18.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు 
19.దార స్నేహలత గారు 
20.ఏడెల్లి రాములు గారు 
21.వనపర్తి గంగాధర్ గారు 
22.పొర్ల వేణుగోపాల్ రావు గారు 
23.కోరాడ నరసింహారావు గారు 
24.సింహాద్రి వాణి గారు 
*************
🌹నామాట🌷

వచన కవితలు నిర్విఘ్నంగా ప్రతి పౌర్ణమికి నిండువెన్నెలను అందిస్తున్నవేళ .. అప్రతిహత కవితా యజ్ఞం సాగిస్తున్న  వీరా గుడిపల్లి గారు, లలితాకృష్ణలకు అభినందనలు.

 చెల్లెమ్మ మాటను కాదనలేక ...

నావంతు ప్రయత్నంలో...
 
రాళ్ళలో రత్నాలు ఏరుకోవచ్చుకానీ 
అన్నీ రత్నాల కుప్ప వోస్తే ఏరుకోవడం కష్టసాధ్యమైన పని.
ఇటువంటి మహామహులైన కవుల కవితలను పరిశీలించే భాగ్యం కలిగిందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెల్పుతూ..
  కవితలను సూటిగా చెప్పేవారు ,పరోక్షంగా చెప్పేవారు ,ప్రతీకలతో చెప్పేవారు,పదబంధాలను కుప్పవోసేవారు 
 ఇలా ప్రతిఒక్కరూ కవితా నైపుణ్యం కలవారే.
 అందరికీ వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ....

  ఆణిముత్యాలను వెదికే ప్రయత్నం లో తప్పులు నావిగా భావించి మీ కవితాస్ర్తాలను ఇదేవిధంగా సంధించాలని ఆశిస్తూ....
        భవదీయుడు
  మదునూరి సూర్యనారాయణ శర్మ
***********
సమీక్షలు
________________
నిశ్శబ్ద గీతమై 

ప్రతి మనిషి లో అనంతమైన భావాలు నిక్షిప్తమౌతుంటాయి.
జయాపజయాలునిశ్శబ్ద నిశీథిలో విహరిస్తుంటాయి.
  అమృతహృదయమనే భావన కవి భావుకతను వ్యక్తంచేస్తుంది.

 సాత్వికత లేని సమాజంలో 
సమసమాజాన్ని ఆశిస్తూ ..
సంయమనంతో తన భావాన్ని కవిత్వీకరించడం చాలా బాగుంది.
 ఇటువంటి కవితలు
 సమాజంలో మార్పును తేగలవని ఆకాంక్షిస్తూ...

కవిమిత్రులు
*మేకల రామస్వామి*  గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.

💐💐💐💐

సృష్టి ఆలాపన 

ప్రకృతి ని వర్ణించిన తీరు అద్భుతం గా ఉంది.
నిశ్శబ్దమయమైన ప్రకృతి ఒక మహాశక్తి.

  సృష్టికి... కన్నతల్లికి పోలికను మనోహరంగా ప్రతీకలుగా చూపినారు. 
ప్రకృతిని ప్రేమిస్తే ,గౌరవిస్తే ఎన్నో...

ప్రకృతి నిశ్శబ్ద మును వింటే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని... *కవయిత్రి *దారల విజయ గారు* వర్ణించిన తీరు కు హృదయ పూర్వక అభినందనలు.

💐💐💐💐💐
 నాపాట
మీ వేదన నిశ్శబ్ద గీతం కాదు,నిష్ఠుర సత్యం.
అడుగడుగునా వివక్ష 
కాదనలేని సత్యం.
  ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపి 
దోషులుగా చిత్రించే సమాజంలో 
ధైర్యంగా నిలబడమని ప్రభోధించే 
మీ కవిత ,ఆడపిల్లలకు భవిత,
  భగవద్గీత.
*కవయిత్రి వేమూరి సత్యవతి గారికి*

అభినందనలు

💐💐💐💐💐
ఒంటరి కనులు

ప్రతి మనిషిలోను ఆవేదనలు సహజం.ఎవరికీ కనపడకుండా
ప్రతి ఒక్కరినీ ముందు కు నడిపించేది మనసే.
 నిశ్శబ్దంలో మనిషికి నేస్తం ,
 ఈ మనసే.
  ప్రపంచాన్ని నడిపేవి కూడా ఈ మనసులే.
 కొడిగట్టిన ఆశాదీపాలకు మనసు ఆలంబన కావాలని కోరడం కవయిత్రి సహృదయతను తెలియజేస్తోంది.

*మొహమ్మద్ అఫ్సర వలీషా గారికి* 
 అభినందనలు .

💐💐💐💐💐
నిశ్శబ్ద గీతం 


అడుగడుగునా సమాజంలో కోరలు చాస్తున్న దుర్మార్గాన్ని ఎండగట్టిన విధం బాగుంది.

పలుకుతున్నది కానీ ఎవరికీ వినపడడంలేదు అందుకే నిశ్శబ్ద గీతం అయింది.
 మాటలు రాని మౌనమిది.
చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిని తెల్పిన కవిత చాలా బాగుంది.
*వేదాంతం సురేశ్ బాబు గారికి*
అభినందనలు

💐💐💐💐💐

1.
[04/07, 8:47 am] Lalita Sister: నిశ్శబ్ద గీతమై
*************
గమ్యంలేని భవిష్యత్తుకి "నవ్వేగాయం"
తోడైంది..
నగుబాటు చేసే "నా"అనే బంధాలు,
నవ్వుల,నగిషీలెన్నో చిత్రిస్తున్నాయి.....

ఏమని దాచను,ఎన్నని మోయను 
చిరునవ్వుల పరదాల వెనక ఒదిగిన
విషాదాలెన్నో............
విశాలనయనాల వెనుక కాపురమున్న 
కన్నీళ్ళు ఎన్నో.........
గుండెను ఛిద్రంచేసే గుప్తమైన ,
వేదనలెన్నో.............
ఆనందాలను గిరాటేసే ,
విరాట పర్వాలెన్నో.........
ఆత్మీయతను కొల్లగొట్టే అకృత్యాలెన్నో.

అరాచకం రాజ్యమేలుతున్న ,
సమాజంలో అమృతహృదయపు
ఆనవాలే కన్పించటం లేదు..........
నిస్వార్ధం నిర్దయగా స్వార్దానికి ,
సలాం చేస్తుంది......
మమకారం మాయమై సంపదకు 
గులామైపోయింది.......

సాత్వికతతో సహచర్యం లేని ,
ప్రపంచం,సవాలు విసిరింది......
సాధించగలవా సమ ,సమాజ ,
నిర్మాణాన్ని అని........
సంయమనం పాటించిన మనసు ,
అంబరాన నిలిచి అమృతంకురిసింది.
అవని హరివిల్లై విరిసింది......
హృది వీణలోనుండి కర్తవ్యం
నిశ్శబ్ద గీతమై బోధపడింది
******************
మేకల రామస్వామి
చెన్నూర్-9912747214
[2
*అంశం: నిశ్శబ్దగీతం*
శీర్షిక..... *నిశ్శబ్ధం*
తేదీ 04/07/2022
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.

****************************************

కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి
కాళ్ళల్లో సత్తువ లేదు
కడుపు లో ఎలుకలు కొరుకుతున్నాయి
పొయ్యి లో పిల్లి 🐱 లేవక
మూడు రోజులు...

అంతా నిశ్శబ్ధం 
గోడ మీది బల్లిలా 
అడవి లోని 🐯 పులి లా!!
నిశ్శబ్ధం పురుడు పోసుకుంది 
ప్రపంచాన్ని జయించాలనే
కాంక్షను!!


గాలి స్తంభించింది
సాగరం ఊపిరి బిగించింది
ఆకాశం నిశ్చలంగా ఉంది
ఎగిరే పక్షులు రెక్కల చప్పుడు ఆగి పోయింది!!

అంతా నిశ్శబ్ధం
రానున్న పెను మార్పుల తుఫానుకు
ముందస్తు మెయిలు 

పడక గదిలో
పంఖా చప్పుడు లేదు
జీరో బల్బు సవ్వడి లేదు 
పట్టె మంచం పరుపు కూడా
ఉడుపులు విడిచి శ్వాసనాపింది

మల్లెల మాల సువాసనలాపి
నిశ్శబ్ధ విప్లవ గీతాలాపన చేస్తోంది
ప్రళయ సఖుడి ప్రసన్నం కొరకు

నిశ్శబ్ధం వెనుక దుఃఖం
నిశ్శబ్ధం తరువాత పరివర్తనమనివార్యం

స్వీయ రచన ::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
4/7/22
3.
[05/07, 8:05 pm] Lalita Sister: కవితా గానం -( సీజన్ 3)
కవితల పోటీ కోసం
అంశం:: నిశ్శబ్ద గీతం
తేదీ:: 5.7.22...మంగళవారం
రచన:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
సెల్:: 8309920625

మనసులో దావాగ్ని రగులుతుంటే
వేదన గుండెలపై కుంపటై కూ ర్చుంటే
యాతన గునపమై గుచ్చుతుంటే
బాధ బాణమై పొడుస్తుంటే
నిశ్శబ్ద గీతము గళములో
మౌన సంగీతము మనసులో
కష్టాల కడగండ్లు వడగండ్లలా
పడుతుంటే
ఇడుములు ఇనుపముక్కలై
దేహములో గుచ్చుకుంటుంటే
ఇక్కట్లు ఈటలై వెంటపడుతుంటే
దళారులు దానవులై పీక్కుతింటుంటే
నిశ్శబ్ద గీతము గళములో
మౌన సంగీతము మనసులో
వ్యాపారస్తులు నకిలీ విత్తనాలతో 
నట్టేట ముంచుతుంటే
వర్తకులు కల్తీ ఎరువులతో
నష్టాల ఊహాబీలోకి నెట్టుతుంటే
కల్తీ మందులతో కర్షకులను
అప్పుల అడుసులోకి దింపుతుంటే
నిశ్శబ్ద గీతము గళములో
మౌన సంగీతము మనసులో
ఎక్కడ బడితే అక్కడ
ఎవరికి ఎంత వీలైతే అంత
పేదలను జలగల్లా పీడిస్తున్నారు
హాలికులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు
అమాయకులను మోసాలతో
ముంచుతున్నారు
దేశాన్ని దోచుకుంటున్నారు
ఉన్నోడిదే రాజ్యము
లేనోడికి  పూజ్యము
ఇదేనా స్వరాజ్యము
అందుకే.........
ఈ సమయంలో నిశ్శబ్దమే గీతము
మౌనమే సంగీతము!!
           ఈ కవిత నా స్వీయ రచన అని హామీ
4
[05/07, 9:19 pm] Lalita Sister: కవితా గానం 3
కవితా పోటీ కోసం 
ఆషాఢ మాసం పౌర్ణమి సందర్భంగా 
...
అంశం: నిశ్శబ్ద గీతం 
శీర్షిక: సృష్టి రహస్యం 
...
ఈ సృష్టిలో 
ఎన్ని నిశ్శబ్ద గీతాలో 
ఎన్ని విచిత్రాలో 

అమ్మ గర్భగుడిలో 
శిశువు నిశ్శబ్దంగానే ఊపిరిపోసుకుంటుంది;
శిశువు కదలికలను 
నిశ్శబ్దంగానే వింటుంది అమ్మ

చినుకు తడి తగలగానే
ధరణీ గర్భంలో విత్తిన విత్తు
చడీ చప్పుడు కాకుండా మొలకెత్తుతుంది 

ఇదేమిటో
పూల చెట్టు మొగ్గలు 
సవ్వడి చేయక కుసుమాలుగా పూస్తాయి
పరిమళాలు పంచుతాయి

గ్రీష్మ ఋతువులో 
దినకరుడి కిరణాలు 
నిశ్శబ్దంగా జలాన్ని పీలుస్తాయి 
మేఘాలుగా మారతాయి

కవి మస్తిష్కంలో 
ఎన్ని ఆలోచనా తరంగాలో 
అక్షరాలు నిశ్శబ్దంగా 
కవితలుగా వెలువడుతాయి 

ఈ ప్రపంచంలో 
శబ్దం కంటే నిశ్శబ్దానికే విలువెక్కువ 
ఇదే కదా సృష్టి రహస్యం 
...
హామీ పత్రం 
...
ఈ కవిత నా స్వంత రచన 
..
గజవెళ్ళి శ్రీనివాసాచారి
5.
[కవితా గానం సీసన్ 3 
శుభకృత్ నామ సంవత్సర ఆషాఢమాసం పౌర్ణమి కవితల పోటీ కోసం
అంశం : నిశ్శబ్ద గీతం
శీర్షిక : సృష్టి ఆలాపన
5-7-2022
*******************
దారులు ఆగిపోయిన చోట
అయోమయం తాండవిస్తున్నపుడు
సూర్యుని అడుగులు కనబడతాయి 

ఆకాశం పడమటి గదిలో
మెరుపు దీపం వెలుగుతూ ఆరిపోతున్నపుడు
కొన్ని వ్యూహాలు గీయబడుతుంటాయి

కొండ అంచున గొంతుక్కూర్చొని
పగటిని చేత్తో పట్టుకుని
కండ్లను మైదానం లోకి తోలుకున్నపుడు
ఆ కళ్ళు దృశ్యాలను మేస్తుంటే
ఆవైశాల్యం లో సంతోషానివో..దుఃఖానివో 
పాద ముద్రలు కనిపిస్తాయి
 
వెన్నెల లేని సమయంలోనే..నింగి నినదించడం
వినబడుతుంది

చప్పుడు చేయకుండానే
ఈ నేలపై..మనిషితనాలను మోసుకుంటూ
అనంతంగా నడచిన అడుగులున్నాయి

నిన్ను ఎత్తులకు అల్లించి..అలసి..అరవలేక
ఆగిపోతున్న కన్న పేగులున్నాయి

ఊపిరితీగలపై ప్రాణ గీతాన్నాలపించే గాలి
రాతిరి కలలను తట్టిలేపిన ఆశల వేకువ..
నిర్లిప్త నిశీధిని పారద్రోలే వెలుగు కిరణం
ఆదరించే ఆకాశం..అభయమిచ్చే హరివిల్లు 

ప్రకృతి చెట్టుపై దాచబడిన మహా శక్తిగల అస్త్రం..నిశ్శబ్దం

మినహాయించే మట్టి..మోడుపైన మొలిచిన చిగుళ్ళను వినగలిగితే..!
సృష్టి నిర్విరామంగా ఆలపించే ఓ నిశ్శబ్ద గీతముంది..!

డా.దారల విజయ కుమారి

హామీ పత్రం
************
నమస్తె సర్/ మేడం 
ఈ కవిత నా స్వంత రచన.ఎక్కడా ప్రచురితం కాదు.అనువాదం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
డా.దారల విజయ కుమారి
6.
డాక్టర్ సి హెచ్ ఆంజనేయులు గారు 
Khammam 
కవిత
*
నిశ్శబ్దం నిరామయ సంగీతం

నేనిప్పుడు నిశ్శబ్ద వాతావరణంలో
నాలోని మనసును పరీక్షించుకుంటున్నా
నేడు నా చుట్టూరా నిశ్శబ్దమైన కొండలు అడవులు సెలయేటి గానాలు వినిపిస్తున్నాయి దూరం నుంచి


ఆకాశ మైదానంలో నక్షత్రాల మినుకు మినుకు మని 

నిశ్శబ్దపు పూలు పూస్తున్నాయి

గగనతలంపై చంద్రుడు నిశ్శబ్దపు నవ్వులు నవ్వుతూనే ఉన్నారు

నీలిమబ్బుల నింగిలోపల సయ్యాటను చూస్తున్నాను
మబ్బుల దేహంలో అనంతమైన నీటి కుండలు

గాలి మెల్లగా నిశ్శబ్దంగా సన్నగా ప్రసరిస్తూ ఉన్నది

చల్లని మెల్లని గాలి నా దేహం పై నుండి పాముల పాకుతూ ఉన్నాయి గాలి సంగీతం ఏదో గుసగుసల శబ్దాన్ని నా చెవుల్లో వినిపిస్తున్నది

ఎంతో దూరం నుంచి మా ఇంటిలో నుండి

మా అమ్మ మాటలు వినిపించి వినిపించినట్టుగా గాలి గుండెల పైనుంచి మోసుకొని వస్తువు ఉన్నది

అవన్నీ జ్ఞాపకాల సుడులు సుడులుగా
నా చెవుల్లో సన్నని పాటల సవ్వడి వినిపిస్తుంది
అవన్నీ నిశ్శబ్ద వలయంలోని నిశ్శబ్దం గీతికలు
7.
అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
శీర్షిక:-విజయానికి సోపానం
.....................................
శాంతి అహింసలే సాధనలుగా
భరతమాత దాస్య శృంఖలాలను విడిపించి
స్వాతంత్ర్య సముపార్జన చేసిన మహాత్మా గాంధీ
స్త్రీ ఒంటరిగా అర్ధరాత్రి నడివీధిన నడచినపుడే
అసలయిన స్వాతంత్ర్య మన్నది నిరూపిద్దాం
మౌనంగా మహాత్ముని అడుగుజాడల్లో నడచి
ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆంధ్రరాష్ట్ర అవతరణకోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు మనకాదర్శం. 
దేశం మాకెమిచ్చిందని గాక దేశానికి మేమేమి చేస్తున్నామన్న స్వామి వివేకానంద అడుగుజాడల్లో
వందేమాతరం అంటు తెల్లదొరల తూటాలకు
నేలకొరిగిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు
ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి అని
ఉరికంభం ఎక్కి ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్
అన్నదమ్ముల వలె దేశస్థులంతా మెలగవలెనోయ్ అన్న మహాకవి గురజాడ జై జవాన్, జైకిసాన్ అన్న
శాస్త్రీజీ, మానవత్వమే మాధవత్వమని చాటిన
వినోభాభావే వంటి ఎందరో మరెందరో మహనీయుల
అడుగుజాడల్లో నడచి సమసమాజ స్థాపన చేద్దాం
వసుదైక కుటుంబానికే ఆదర్శమవుదా
8.
ఆళ్ళ నాగేశ్వరరావు గారు
8
శీర్షిక :    ""  శ్రీకారం  ""

నెలరాజుకు వెన్నెల్లా
సహనానికి భూదేవిలా
జీవులకు ఉషాకిరణముల్లా
శాంతి స్థాపనకు నిశ్శబ్దం అలా!
మౌనం నిశ్శబ్దానికి ఆభరణం
ఆ ఆభరణ దారణయే
నేటి మనిషి మనుగడకు శరణ్యం!
జఠిల  సమస్యలకు
పరిష్కారం చూపు సాధనం  నిశ్శబ్దం
యోగి పుంగవుల నిత్యకృత్యం
నిశ్శబ్దాన్ని సాధన చేయడం!
మనసు భాష మౌనం
మౌనంతోనే నిశ్శబ్దం సుసాధ్యం!
మానవ జీవన సంగీతంలో
సమరసతా భావాన్ని ప్రజ్వలింప చేసేది నిశ్శబ్దగీతం!
మౌనం అర్ధ అంగీకారమే గానే స్వీకరిస్తూ
సమయానుకూలంగా స్పందిస్తూ
మౌనాన్నవీడి చైతన్యగీతికను ఆలపిస్తూ
ఎదురయ్యే సమస్యలను ధీరోధాత్తంగా  ఎదుర్కోవాలి
నిశ్శబ్దాన్ని ఎల్లవేళలా వహించక
శబ్దమును చేస్తూ సమస్యలను వెలుగులోకి తేవాలి
నలుగురిలో పెట్టి పరిష్కరించుకోవాలి
నిశ్శబ్దగీతాన్ని ఆలపిస్తూ శాంతియుత సహాజీవనానికి శ్రీకారం చుట్టాలి!

9️⃣
శీర్షిక--"నా పాట".
వేమూరి సత్యవతి గారు 


అసలెవరికీ వినిపించని వేదనా గీతాన్ని
ఎన్ని సార్లు, ఎన్నెన్ని సార్లు పాడుకున్నానో..?
పక్షి లా అరుస్తూ, ఎగురుతూ,..
లేడి పిల్లలా  గంతులేస్తుంటే..
ఇవాళ నుంచీ  నువ్వలాావుండకూడదని కూచోబెట్టిన అమ్మ గొంతు,
ఇల్లూడవటం, అంట్లు తోమటం
వాడు చెయ్యకూడదు దరిద్రం,! నువ్వే చేయాలనే బామ్మ ,
జన సమ్మర్దంలో వాళ్ళతో పాటు తొంగి చూడాలనుకుంటె....
ముందున్న గుండెల్ని,వెనుకనున్న నడుమును
తాకాలకునే  మురికి..!
ఆట లాడటంలో నైపుణ్య శిక్షణకై ఉబలాటపడితే..
శిక్షకుని చూపులసలు నచ్చక వెనక్కి వచ్చేసిన రోజు..
ఆకర్షణ,అవసరం, ఆధిపత్యం తప్ప "ఆలి" విలువ తెలియనిచోట కాపురం,!
"నీకెం తెలియదు, నోర్ముయ్యమనే" ఈసడింపు,
ఎ.టి.యం."కార్డుపైన పేరే తప్ప, డబ్బు  తీసే  చేతులు నావి కానపుడు..
అసమానతల కొలిమిలో కాలుతూ  ఎన్నాళ్ళు??
నా ప్రత్యేకత నాకు తెలిసొచ్చింది!!
అమ్మని  కాగలటం, ఓర్పూ,నేర్పులవిజయాలు
నాబలహీనత కాదు!!మేధస్సులో నాకేం తక్కువ?
ఆసరాగా నిలిచేదే ఆడపిల్ల!!
మమతల మల్లెతీగ,నై అనురాగాల-పల్లవినిపుడే ఆలపిస్తా!!
నా పాట  నిష్ఠుర,నిశ్శబ్ద గీతం కాదు!!
1️⃣0️⃣
డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు

నిశ్శబ్ద సంగీతం

ఎవ్వరు లేని ఏకాంతంలో 
ప్రకృతి వినిపించే సంగీతం 
నిశ్శబ్ద ప్రతిధ్వనిలా వినిపిస్తూ
 ప్రకృతిలో మమేకమయ్యేలా చేస్తూ
తీసుకెళుతుంది మనసు నెక్కడికో మరి

ఆదమరిచి పసిపాప నోట వేలు పెట్టి 
తదేకంగా చూస్తుంటే  ఎదలోతుల్లో
వినిపించే  సంగీతం మధురాతిమధురం
పంచ లేము పరులకు మనో గోచరమై అంతులేని పులకింత నిందించు సంగీతం 

కవుల కలం వడివడిగా కదలాలన్నా 
మెదడు ఉత్తేజితం కావాలన్నా
 హృదయానికి వినిపించే గీతం
 ప్రేరణగా నిలిచి తరుముతుంటే
నిశ్శబ్ద సంగీతమే నేర్పుతోందెన్నో పాఠాలు

 అంతులేని ఆవేదనల నైనా ఆనందాన్నైనా
 మరిపించి మురిపించే  హాయి నొసగే శక్తి
కంటి కగుపించని నిశ్శబ్ద సంగీతానిదే సుమా
ఆ గాన లహరిలో తేలి పోదామా- -
1️⃣1️⃣
జోషి పద్మావతి గారు
మూగ భావన
*************
ఆనందమైనా ఆక్రందనైనా
మదిలోనిండిన భావాలు
పదుగురితో పంచలేని వేళ ......
పరవశమైనా పరాభవమైనా 
హృదిలోనే పదిలమై
ప్రదర్శితం కాని వేళ......
మనసు పాడేను మౌనగీతం.
ఊహలు వేసేను తాళం
సంద్రాన తరంగాలవోలె
చల్లని సమీరమోలె
పునరావృతమయ్యేవే సుఖదుఃఖాలు 
పంచుకునేవారే లేనినాడు 
పరమాత్మునికి ప్రణతులతో 
సమర్పించు మౌన భావన 
అన్యులెరుగలేని ఆలాపన
పూర్ణ ఫలాలను మోయు తరువులైనా, 
దాహముతీర్చు నదీనదాలైనా
వర్షించే మేఘాలైనా 
ప్రకృతిలో ప్రతీదీ పాడేను మౌనగీతం  
ఊహలు వేసేను తాళం
కణకణమండే నిప్పులలోనూ,
మిలమిల మెరిసే మెరుపులలోనూ,
కమ్ముకు వచ్చే మబ్బులలోనూ,
హోరునకురిసే వానలొనూ
దాగివుందిలే నిశ్శబ్దగీతం
ఫోన్ నెంబర్
12

డాక్టర్ మహ్మద్ షరీఫ్ గారు

           అంశం:"నిశ్శబ్ద గీతం"
           శీర్షిక:"మనోవేదన"
1కం:
మానసమందున బాధలు
మౌనముగా కృంగదీయ మతిగతి దప్పన్!
కానగ మార్గము తెలియక
కూనగ దుఃఖించె మదిన కూర్మియె కరువై!
2కం:
పాటలలో పని యందును
మాటలలో చూపులందు మర్మము నంతన్
తూటాలుగ సంధించుచు
దీటుగ తనబాధ నంత దెల్పుచు నుండున్!
3కం:
దారలు గారెను కన్నుల
నీరంతయు పొంగిపొరలి నిద్దుర కరువై
చేరగ దీయగ నెవ్వరు
లేరని వాపోయె మనసు లీలగ మోమున్!
4కం:
బరువాయెను మనసంతయు
కరువాయెను శాంతి క్రాంతి కన్నుల జూడన్
చిరుహాసము కడు దూరము
దరిజేరక నిలిచె చూడ దయ రాదాయెన్!
5కం:
వన్నెలు తగ్గెను మోమున
కన్నులలో బేల తనము కనబడు చుండెన్
అన్నము రుచిరాదాయెను
మన్నన లేనట్టి బ్రతుకు మధురమ్మగునా?
[05/07, 9:53 pm] Veera Gudipally: 
1️⃣3️⃣
గొర్రెపాటి శ్రీను గారు




రచన : గొర్రెపాటి శ్రీను


నిశ్శబ్ధంగా నేనుప్పుడు..
హృదయం ఓ అద్భుతమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ
అలౌకికమైన ఆనందాన్ని అందిస్తుంటుంది !
నిశ్శబ్ధంగా నేనుంటూ..
ప్రకృతి తో మమేకమైనప్పుడు..
మనస్సు పొందే ఆనందం వర్ణనాతీతం !

మేడపైన ఒంటరిగా పడుకున్నప్పుడు..
నీలాకాశం నిండా పరుచున్న నక్షత్రాలు
మిణుకు మిణుకు మెరుస్తూ ఉంటాయి
చిరు నవ్వులు రువ్వుతూ జాబిలమ్మ సంబరంగా సాగిపోతుంటుంది
ప్రక్కనే వున్న సన్నజాజి పూల మొక్కలు పరిమళాలని వెదజల్లుతుంటే
..ఆ సమయం ప్రకృతి పరవశాల శుభసమయం !
ఆకాశం అంతటా ఆనందానురాగాలసుమసంగమాల ఉత్సవాల నయనానందకరం !
కురుస్తున్న సన్నని తొలి చిరుజల్లుల తాకిడిని ఆస్వాదిస్తూ కదులుతున్నప్పుడు ..
మట్టివాసన ల మాధుర్యాల పరిచయాలు ..
నేలతల్లికి జరుగుతున్న అభిషేకాలతో పాటుగా ..
నీటిజల్లులు అవనిపై చేస్తున్న చిటపట రాగాల చిరు చిరు సవ్వళ్ళ సంబరాలహేళ ..
నింగిలోన నిలిచి..
తన మెరుపుల హంగులతో
మదిని పులకరింప జేసే వాన విల్లు ..
ప్రకృతి తెలియని తన్మయాన్ని కలుగజేస్తూ మనస్సుకు నిశ్శబ్ద గీతాన్ని వినిపిస్తుంటుంది !
ఒంటరిగా నేనుంటూ
ఊసుపోని రాత్రిళ్ళెప్పుడో ..
ఇసుకతిన్నెలపై నడుస్తూ సంద్రం చేస్తున్న సాఘరఘోషను సైతం ఆలకిస్తూ మైమరచివున్నప్పుడు ..
వెన్నెల రాత్రిళ్ళు ..
మనస్సు ప్రకృతిలో మమేకమైనప్పుడు..
మనస్సు నిండా తెలియని మధురమైన పులకరింతల పరవళ్ళ సరాగాల ఆస్వాదనాలు..
అదే అదే.. నిశ్శబ్ద సంగీతం ..నవ్య  చైతన్యాల ఆనందరవం
[14
అంశం: నిశ్శబ్ద గీతం
డా. తంగిరాల నాగలక్ష్మి

 శబ్దానికి ఆది మూలం నిశ్శబ్దం
 నిశ్శబ్దం లోంచి పుట్టు కొచ్చిన  శబ్ద ప్రయాణమే గీతం
చెవులు వింటున్న శబ్దార్ధ గీత మదే
నిశ్శబ్దం లోనే జనియించి 
మౌనంగా మనసు పాడే గీతమూ నిశ్శబ్ద గీతమే
కానీ   యిది వినేది ఒక్కరే
అది వినేది పెక్కురు

నిశ్శబ్దం లేనిదే శబ్దమేది
శబ్దం లేనిదే.  గీతమేది
పాటేది పరవశ మేది 
రోదనతోమొదలయి ఆవేదనతో
సాగి చివరికి స్వాంత నతో అంతమయ్యే
గీతం నిశ్శబ్ద గీతం

గీతానికి జోడింపు సంగీతం
బహిరంగ ప్రవేశం
ఆ గీతాల అలజడి నుండి
బయటపడి తనలో తనే తాదాత్మ్యం చెందే తత్వ రూపం నిశ్శబ్ద గీతం
సౌండ్ బాక్సులు, వైఫైలు, వూఫర్ లు
స్పీకర్లు , కొరియోకులూ  గ్రాఫిక్స్లూ ఏ ఫిక్సులూ లేకుండగా  మానసిక స్పందనల తో హృదయమాలపించే
మధుర భావాల గానాల వెల్లువే నిశ్శబ్ద గీతామృతం
చడీ చప్పుడూ లేకుండా గుండె లోతుల్లో
ఆనకట్టలేని ప్రవాహ ఝరి 
గలగలా పొంగే 
ప్రశాంత స్వర లహరి  నిశ్శబ్ద గీతరసామృత సార  విహరిణి
ఏకాంతం గా అంతరాళంలో 
ఆనంద సందోహం లో అహాన్ని
మరిపించే మహత్వ.ప్రణవ గీతమే 
నిశ్శబ్ద గీతం
[
15.
ముత్యం వెంకటేశ్వరరావు గారు 

 అంశం: నిశబ్ద గీతం      
శీర్షిక : నడిరేయి నిద్దురలో

కాళ రాత్రిలో కఠోర సత్యాలెన్నో...
విశ్వజగతి నిశబ్దం తాండవిస్తోంది
సముద్ర హోరు జూరుగా సాగిపోతుంది..
ప్రతిజ్ఞలు ప్రతి ధ్వనిస్తున్నాయ్
అబలల వేదనలు అరణ్య రోదనలే
నడిబొడ్డు నగరంలో నడిరేయి పారా హుషార్
క్షణం క్షణం అనుక్షణంలో ఎన్నెన్ని బలవన్మరణాలు
మరెన్నో జీవన పోరాటాలు
పిడికెడు మెతుకులు పేదల బ్రతుకులు
క్రమ్ము చీకటిలో కొరివి దెయ్యాలు
శిలల చాటున పొదల మాటున
"క్రీ"నీడలు కదులుతూన్నాయ్..
పరుగులు తీసే పోకిరిగాళ్ళు
పగ్గాలు వేసే పోలీస్ వేన్ లు
క్లబ్ లలో అర్ధనగ్నా లు అది మందు బాబులకు వినోదాలు 
దౌర్జన్యంగా దారి దోపిడీలు
దారుణ, మారణ ఆయుధాలతో విస్పోటాలు
క్రూర ఘోర కర్కోటకుల ఆరాచకాలు
చీటింగ్ లు రేపింగ్ లు
స్మగ్లింగ్ లు రాజకీయ బ్యాటింగ్ లు
డప్పుళ్ళ చప్పుళ్ళ మధ్య గుట్టు చప్పుళ్ల రాజకీయాలు
కారు చీకటిలో ఖర్మ భూమిని చూసి,
దివిలోన తారలు దిగులు పడె నడిరేయి నిద్దురలో
ఇవి మర్మోగుతున్న కఠోర వాస్తవాలు!
************************************
హామీపత్రం: ఈ రచన ణా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
 16
దీపక్ న్యాతి గారు.
అంశం: నిశ్శబ్దగీతం
శీర్షిక : ఊహల వీచిక

గీతమంటే స్వరం
స్వరం అంటే శబ్దం
నిశ్శబ్దగీతం హృదయ భావన
మది రాగాల ఆలాపన
మూగబోయిన గొంతుకల ఇల
సరిగమ రాగాల చిహ్నాలెరిగిన
హృదయ పరవశ ఊయల
మది భావాల వెలిబుచ్చు శృతి
భావాలను కొనియాడు పదాలంకరణ
కవి కనగల మౌనముద్ర రచన
దివ్యజ్ఞ మునీశ్వరుడి భోధన
అన్వేషి ఆలోచనల శోధన 
ఏకాంతాన వేచియున్న వేధన
ఉహకందని పదకేళి నటన
భ్రమింపజేయు పదాలంకరణ
ఇమడని పదప్రయోగం వాస్తవాన
17.
[06/07, 6:08 am] Lalita Sister: కవితా గానం సీజన్ 3 నిర్వహించు కవితల పోటీకి....

అంశం: నిశ్శబ్ద గీతం

పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి:9505152560
**********************

    *మహా స్మశానం* 

ఆకు రాలిన కారణం
గాలి స్తంభించిన వరణం
తీతువు కూతపెట్టిన తరుణం
మౌనం ఆవహిస్తుంది
మనిషి ఏకాంతపురంలోకి వెళతాడు
వారసత్వం చెమ్మగిల్లిన కళ్ళతో వెనుకంజ వేస్తారు
వాళ్ళని పిలిచినా గొంతుకేదో అడ్డుపడ్డ శ్రమ ప్రయాసే!

శివార్లలో పరుచుకున్న నిశ్శబ్ద
నిర్జన ప్రదేశము
నివాసం వుంది గాని మాటలాడుకొనే నోరు  లేదు
ఆరడుగుల నేల సాక్షిగా
అక్కడ ఎందరు కూరుకుపోయారో మట్టిలో
మంచోళ్ళు చెడ్డోళ్ళు ఒకే గదిలో ఒరుసుకుంటూ ఓర్చుకుంటూ 
దుఃఖ సముద్రాన్ని ఒంపుకుని ఏడ్వాల్సిందే! కుళ్ళిపోవాల్సిందే
బాధలు చెప్పుకుని ఓదార్చుకునే చేతులు లేవు కదా!

కరోనా కాటేసిన కాలం 
యముని మహిషం లోహపు ఘంటల గణగణలు 
108 అంబులెన్స్ మోతలు 
అపనమ్మకం బతుకు ఊపిరితిత్తుల కలవరం!
ఎగిరిపోయే చిలుకకు పంజరంతో పనేమి?
ఆక్రందనల ఋతువు ఆగిపోదు ఎందుకో!
       ***
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.

         హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు. పోటీ కోసం వ్రాసినదని హామీ ఇస్తున్నాను.
18
 (సీజన్...3)
అంశం...నిశ్శబ్ద గీతం
శీర్షిక...ఒంటరి కనులు

కలలతో కదలని ఒంటరి మౌనమేదో
ఊహకందని  ఉదాసీనతతో
బరువు కాని బరువేదో
కంటి రెప్పలపై
దైన్యచిత్రాలను గీస్తోంది....

గుండె గడులను పెనవేసుకున్న 
దిగులు నరాల తంత్రులను లాగేసి 
సంతోష ముడులు వేద్దామని విఫల ప్రయత్నం చేస్తోంది ....

నా భావం అర్థం కాగానే ప్రియ భావనగా
నా దేహం కృంగిన ప్రతిసారీ
నా వెన్ను తట్టి ధైర్యం చెప్తోంది  ....

నీకు నేనున్నానని కొండంత భరోసా ఇస్తుంది 
తప్పులు చేసే అంతరంగాన్ని మందలించి
సరైన నిర్ణయాన్ని  చెబుతోంది  ...

నాకు బాధ కలిగినప్పుడు నా కంట్లో కన్నీరు రాకుండా
నాకు గుండె దిటవు నిస్తోంది ......

నిన్నెవరో కష్టపెడితే
నన్నొదిలి వెళ్ళటం న్యాయమా నీకు 
నీవు లేని నేను లేనని  నీకు తెలుస్తోందా ....

ఒంటరి కనులలో
నిశ్శబ్ద గీతాలు ఆలపించనీకు
కొడిగట్టిన నిరాశా దీపాలలో
ఆశల చమురు పోసి
చిరునవ్వుల పూలు పూయించు ఓ మనసా....!!

హామీ....నమస్తే  ఈ కవిత నా స్వీయ రచన అని మనస్ఫూర్తిగా  హామీ ఇస్తున్నాను 🙏🙏

మొహమ్మద్ .అఫ్సర వలీషా 
ద్వారపూడి (తూ. గో .జి)
19.


అంశం : నిశ్శబ్ద గీతం
శీర్షిక :మాయమైన మానవత్వం

విలువలు
నాటి సంస్కృతిసంప్రదాయం వారసత్వమై ముందుతరాలకు అందిన జీవన సౌందర్యం 
అవసరాలకై నేడు విలువచేయని విలువలు 

ఉమ్మడి కుటుంబం
నైతికవిలువల సుగంధాన్ని
వ్యక్తిత్వ సౌరభంగా అద్దుకున్న పెద్దరికం
నేడు మూలకు పెట్టిన ట్రంకుపెట్టెలు 

ఆధునిక జీవనం
కూడబెట్టుటకే బతుకుల తెరుతెన్నులు 
రేపగలు తేడాలేని యాంత్రికత్వం
వృద్ధాశ్రమాల పుట్టగొడుగులు 

కొలువులు
ఉన్నోళ్లు సరికాని జీతంతోనెగ్గుకొస్తారు 
లేనోళ్లు కూలీ గా బతుకీడుస్తాడు 
యువతరం గంజాయి వ్యసనం 

ప్రపంచీకరణ
పట్నం నుండి పల్లె దారి పట్టింది
పచ్చగడపల్లోని చేతివృత్తులను కనుమరుగు
కొరవడిన ఉపాధి సుపారీలకు నెలవు 

 సాంకేతిక విప్లవం 
 కరోనా ఆపత్కాలాన అందిన విశ్వవిజ్ఞానం
వ్యసనమైన బాధితుల భావితరం 
 మయాజాలా అంతర్జాల మోసాలతో 
 నిస్సహాయతతో కుదేలవుతున్న నేటితరం

పాత కొత్త తరాలకు విలువలవారధిగా 
మానవత్వం కొట్టుమిట్టాడుతుంది 
పాశ్చ్చాత్య ధోరణిలో కమ్ముకున్న 
విశ్రుంఖల స్వేచ్ఛ ఆహార్యం
అమానవీయ ఘటనలతో విషం చిమ్ముతున్నవి
అసహాయతలో చేయూత మనకందని వేళ
ఇతరులకు మనమందించలేని వేళ 
మన మనుసులలో పాడుతుంది
 నిట్టూర్పుగా మాయమైన మానవత్వం ఓ నిశ్శబ్దగీతం 

పేరు :దార. స్నేహలత
ఊరు : గోదావరిఖని
చరవాణి :9849929226
20.
కవితా గానం
నిశ్శబ్ద గీతం
శీర్షిక*మౌనంగానే...

ఓ ఆరుద్ర మౌనంగానే వస్తుంది
ఓ పిలుపు ప్రేమతో పారవశ్యమాలిక

అన్యోన్య జీవితాలను అతలాకుతలం
చేసే యుద్ధం పై
మౌనం ఒక్కోసారి కోటి మెరుపుల
కాంతి ప్రకాశం
ఆ నిశ్శబ్ద మనో ప్రకంపనలు
సడి లేని లావాలా ప్రజ్వలనాలు
నియంతల పాలిటి సింహస్వప్నాలు

ధరలు ధరపై లేవు నింగిలో తారలు
ప్రభుత పన్నులు జేబులకు చిల్లులు

పాలూ పన్నుపోటుతో పొలమారుతున్నై
ఓటరు బతుకులో ఓపిక ఎక్కడో
దారి తప్పుతుంది

ఎన్నాళ్ళు కాసులు పోగేసినా
కాటికెల్లే యాల్ల ఒట్టి చేతులతో ఎల్లాలి
పాపభారమూ బతుకంతా ఆడుకునే
శాపమే
మంచీ మానవతా కష్టాల్లో ఆదుకునే
సాయమే

నరుడి ఆయువు ఆవగింజంత
సౌజన్యమైన కీర్తే మహావృక్షమంతా

ఓ ఆల్చిప్పలో చినుకు స్వాతి ముత్యమౌతుంది
ఓ పూలతోట మనసు విపంచి
నృత్యమౌతుంది

ఏడెల్లి రాములు ✍️
ది*05*07*2022(20*22)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
21.
వనపర్తి గంగాధర్
శీర్షిక:మానవతా గీతం

గడచిన కాలం అమృతబాండం
ఎన్నడూ మరచిపోని మధురస్వప్నం
సప్త స్వరాల సంగీత రస భరితం
తీపి జ్ఞాపకాల మానస సరోవరం

ఉమ్మడి కుటుంబాల బంధాలు
ఆప్యాయతానురాగాల అనుబంధాలు
కనుమరుగయిన అద్భుత దృశ్యాలు
నేడు లయ తప్పిన విషాదగీతాలు

స్త్రీని దేవతగా పూజించే దేశం మనది
గంగా,గోదావరి,కృష్ణమ్మల పవిత్రత మనది
ఆడది నేటి సమాజంలో ఆట బొమ్మయింది
ఆడపిల్ల గర్భంలోనే మరణ గీతమాలపిస్తుంది

తరుగుతున్న మానవతా విలువలు
పెరుగుతున్న అమానవీయ కృత్యాలు
బంధాలు నేడిక్కడ ఆర్థిక సంబంధాలు
భరతమాత ఆలపిస్తోంది వేదనాగీతాలు

ఆధునిక,అభివృద్ధి చెందిన సమాజమని
ఎంతో సాధించామని జబ్బలు చరచుకొని
మనల్ని మనమే పొగుడుకోవడం కాదని
అపస్వరాల విభేదాల, విలాపగీతాలకు
సప్తస్వరాల మానవతా గీతాలకు స్వరాలద్దుదాం
నిశ్శబ్ద గీతాలకు చరమగీతం పాడుదాం
22
[06/07, 10:48 am] Lalita Sister: *కవితాగానం సీజన్-3*
*ఆషాఢ మాస పౌర్ణమి కవితల పోటీలు*
అంశము: *నిశ్శబ్దగీతం*
తేదీ: *05-07-2022-మంగళవారం*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *మౌనగీతం!*
ప్రక్రియ: *వచనకవిత!*
*********************

*కనులు కనులతో కలసినవేళ కంటిభాషలో నిశ్శబ్దం!*

*మనసు మనసుతో ముడిపడు వేళ మౌనరాగమే సంగీతం!*

*మాటలకందని భావాలన్నీ చూపుల దారులు వెతికినవేళ!*

*రాతలకందని కావ్యాలన్నీ కంటి భాషలో రాసిన వేళ!*

*ప్రతి హృదయం పాడుతుందొక మధురమైన గీతం!*

*మదిలో మెదిలే నవగీతం! అదే అదే నిశ్శబ్దగీతం!*

*తుపాను ముందర ప్రశాంతతైనా.. వాన వెలిశాక ప్రభాతమైనా*

*ఘర్షణలో..ఆకర్షణలో..సుమవర్షములో.. మది హర్షముతో..*

*స్పర్శల కర్షణ..తనువుల ఘర్షణ..శీర్షస్థానము చేరినప్పుడు*

*హద్దులు దాటిన ముద్దుల సద్దున.. నిద్దురనెరుగని పొద్దులరద్దున...*

*అన్నిటా పలికే గీతం..ఇది అంతరంగాల సంగీతం*

*అదే అదే మన నవగీతం! అదే నిశ్శబ్దగీతం!*

*ఒక్కచూపు చాలు.. కోటిభావాల సంగమం!*

*ఒక్క దృశ్యం చాలు! కోటి సంఘటనల కదంబం...!*

*మానవ జీవన భావనలన్నీ మాటలు మరచి పలికినవేళ*

*కోమల హృదయపు కోరికలన్నీ రెక్కలు విప్పుకు ఎగిరినవేళ..*

*భాషలకందని  భావాలెన్నో మౌనంగా వినిపించిన వేళ*

*హృదయపు లోతులనెఱిఁగిన గీతం..జగతికి వినపడు సుందర గీతం*

*అదే అదే శుభ మౌనగీతం! నవ్యత నిండిన నిశ్శబ్దగీతం!*

*చెవులను మూసి మనసును తెరువు!వినపడు నీకు ప్రతి ఎద పిలుపు!*
*స్పందించే మనసుండాలే గాని..మౌనపు వేణువు పలుకును గానం!*

*తలపులతలుపులు తెరుచుకుచూడు!తడబడుఅడుగులు వినబడు నేడు!*

*భువియంతా ఒక బృందావనమై నీమది పలుకును మురళీ రవమే!*

*అదేఅదే గోపాలుని గీతం! నీకై పాడిన నిశ్శబ్దగీతం!*
*********************
హామీపత్రము: *స్వీయరచన* *పౌర్ణమి పోటీలకై ప్రత్యేకంగా వ్రాసినది*
23
[06/07, 11:08 am] Lalita Sister: పౌర్ణమి కవితల పోటీకి... 
విషయం :- నిశ్శబ్ద గీతం 
శీర్షిక :- ఆ జీవితమే ఓప్రబోధo.
(మౌన గీతమై సాగి పోవాలి )
   కోరాడ నరసింహా రావు !
       ****************
అతడో ప్రబోధాత్మక  నిశ్శబ్ద గీతం !
అతనిలో సేవాతత్వంపల్లవించి
త్యాగం, చరణాలై నడిచి..., 
ఆ జీవితమే ఓ మధురగానమై 
ప్రపంచమంతా వినిపించింది !
    తిరునల్వేలిలో పుట్టి... తన త్యాగ మౌనగీతంతో అఖండ ఖ్యాతిని ఆర్జించిన ఆ మహనీ  యుడే... కళ్యాణ సుందరం !
స్వార్ధంతో.. అడ్డ దారుల్లో.... కోట్లు కూడబెట్టు కుంటున్న  ఈ
మనుషులు సిగ్గుపడేలా..... 
  .తన జీవిత సర్వస్వాన్నీ అనా
ధాశ్రమాలకే ధారపోసి తానూ ... 
అనాధలతో కలిసి, అనాథలానే  ఒక జతబట్టలు హవాయిచెప్పు లతో అతి నిరాడంబరంగాబ్రతి కిన త్యాగధనుడు మనకళ్యాణ సుందరం !
   ప్రతినెలా వచ్చిన జీతమంతా
ఆ అనాధాశ్రమాలకే ఇచ్చేసి...
ఉద్యోగవిరమణానంతరంవచ్చి న  పెన్షన్ మొత్తం మూడుఅనా ధారమాలకు పంచిపెట్టి... చివ రికి......, 
  అమెరికా ప్రభుత్వంవారు తన
ను గుర్తించిగౌరవంగాసత్కరించి
తన ముప్పైసంవత్సరాలనిస్వా ర్ధ సేవకు గాను బహుమతిగా ఇచ్చిన ముప్పై కోట్ల రూపాయ లనూ...ముప్పై అనాధాశ్రమా లకుపంచియిచ్చి...సాగిపోతున్న ఓ ప్రబోధ మౌనగీతమే ఆ జీవితం !
        ఆ మౌన గీతంలో... ఎన్ని అనాధ బ్రతుకులుహాయినొందా యో...! ఆ జీవన గానానికి ఎన్ని సహృదయాలు ప్రేరణ పొందాయో.... !!
కాబట్టే విఖ్యాత నటుడు రజనీ కాంత్...మన కళ్యాణ సుందరా న్ని గాడ్ ఫాదర్ గా భావించి... 
అక్కడి అనాధలకు తనకు తోచిన రీతిలో సేవలనందిస్తు న్నారు... !
  మనిషి ఆర్భాటముతో, అట్ట హాసముగా బ్రతకటం గొప్ప కాదు... !
ప్రభోదాత్మకంగా ఓ మౌన గీతమై సాగి పోవాలి !
.   *********************
24.
[కవితా గానం సీజన్--3
శుభకృత్ నామ సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి కవితల పోటీకి
అంశం:-- నిశ్శబ్ద గీతం
శీర్షిక:-- నిశ్శబ్ద గీతం
రచన:--సింహాద్రి వాణి
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872

అలవికాని అవరోధాలు
సాఫీగా సాగుతోన్న బ్రతుకు ప్రయాణాన్ని అడ్డగించి అతలాకుతలం చేస్తుంటే
సమస్యలు బరువై మనఃశాంతి కరువై అఘోరిస్తోన్న మానవ జీవితం ఒకవైపు

గజిబిజి గందరగోళం నడుమన
జనసంద్రంలో ఉవ్వెత్తుగా ఎగసిపడే శబ్దతరంగాలు
అక్షరాల‌ పుణ్యమా అని మస్తిష్కంలో ఆలోచనలు ఆవిష్కృతమై
మంచీ చెడూ కవలపిల్లలై పుట్టుకొచ్చే అనేక సాధనాల
రణగొణ ధ్వనులతో ప్రశాంతత కరువై, శబ్ద కాలుష్యం బరువై,
విజ్ఞానం సృష్టించిన భూతల నరకం ఒకవైపు
ఎన్ని సమస్యలు వేధిస్తున్నా తన ఒడిలో మనసుకు సేదదీర్చి ప్రశాంతత చేకూర్చే
నిద్ర పాడే ఆనిశ్శబ్ద గీతం ఎంతో మధురం!

కురిసే వెన్నెల్లో
ఆప్యాయత ఒలికే కన్నుల్లో
ఆర విరిసిన పువ్వుల్లో
పసిపాపల బోసి నవ్వుల్లో
ప్రశాంతత ఉరుకుతూ వెల్లువై
ప్రపంచాన్ని ముంచెత్తి మరో లోకంలో
విహరింపజేసే ఆ నిశ్శబ్ద గీతం
మధురాతి మధురం
25.

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...